carden search
-
కొత్త వ్యక్తులకు ఆశ్రయమివ్వొద్దు
వెల్దండ (కల్వకుర్తి): హైదరాబాద్– శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న కొట్రతండాపై ప్రత్యేక దృష్టి సారించామని, గ్రామస్తులు ఎవరూ కొత్త వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని ఏఎస్పీ జోగుల చెన్నయ్య అన్నారు. మండలంలోని కొట్రతండాలో ఆదివారం అర్ధరాత్రి ఏఎస్పీ జోగుల చెన్నయ్య, కల్వకుర్తి డీఎస్పీ పుష్పారెడ్డి ఆధ్వర్యంలో 30 మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంపై పోలీస్ నిఘా ఉంచుతున్నామన్నారు. ప్రధాన జాతీయ రహదారులపై ఉన్న గ్రామాలు, తండాలు, పట్టణాలకు ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. కొత్త వ్యక్తులకు ఆశ్రమం కల్పించ వద్దన్నారు. రౌడీ షీటర్లుగా పేరున్న వ్యక్తులతో సంబంధాలు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసుల తనిఖీలో అలాంటి వ్యక్తులను గుర్తిస్తే తండావాసులు ఇబ్బందులు పడతారన్నారు. తండాలో అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపించిన వెంటనే సమీపంలో పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాగే అక్రమంగా మద్యం, అధిక మొత్తంలో డబ్బులు నిల్వ ఉంచితే చర్యలు తీసుకుంటామన్నారు. క్షుణ్ణంగా తనిఖీలు.. కార్డెన్ సెర్చ్‌లో భాగంగా బృందాలుగా విడిపోయిన పోలీసులు ప్రతి ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రతిఒక్కరి గుర్తింపు కార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి గుర్తింపు పత్రాలు లేని 19 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని.. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాహనదారులు వీటికి సంబంధించిన పత్రాలను, లైసెన్స్‌లను చూపించితే తీసుకెళ్లాలని సూచించారు. అలాగే గ్రామంలోని పలు కిరాణం షాపుల్లో మద్యం లభించడంతో దుకాణదారులను హెచ్చరించారు. ఇకపై ఇలాంటివి కనిపిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో వెల్దండ, కల్వకుర్తి సీఐలు గిరికుమార్ కల్కోట, సురేందర్‌రెడ్డి, ఆయా మండలాల ఎస్ఐలు వీరబాబు, ప్రదీప్, కృష్ణయ్య, నర్సింహ, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఎల్బీనగర్లో కార్డన్ సెర్చ్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో ఉన్న సాయినగర్‌లో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు తనిఖీలు జరిపారు. 14 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని, అలాగే 25 బైక్‌లు, 70 మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
హయత్‌నగర్‌లో కార్డెన్ సెర్చ్..
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్ పీఎస్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో 11మంది పాత నేరస్థులు, ఐదుగురు మహిళా నేరస్థులను అరెస్ట్ చేశారు. అదేవిధంగా సరైన ధ్రువపత్రాలు లేని 28 బైక్‌లు, 17 ఆటోలు, కారు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం, గుట్కా విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
పాతబస్తీలో అర్ధరాత్రి పోలీసుల కార్డెన్ సెర్చ్
-
సైదాబాద్‌లో కార్డెన్ సర్చ్
-
కర్నూలు జిల్లాలో కార్డన్‌సెర్చ్
-
ఓయూ పరిధిలో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్: ఈస్ట్ జోన్ సికింద్రాబాద్ సీతాఫల్ మండి మనికేశవ నగర్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 200 మంది పోలీసు అధికారులతో గురువారం ఉదయం 5:00 గంటల నుండి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో భాగంగా సరైన పత్రాలు లేని 62 బైక్‌లు సీజ్ చేశారు. గుర్తింపు, లేబుల్స్ లేని హార్బల్స్ ఫ్లేవర్స్ హ్యాండోవర్ చేసుకున్నారు. గుర్తింపు కార్డులు లేని 20 మంది అనుమానితులను , ఇద్దరు సెల్ ఫోన్ దొంగలను పట్టుకున్నామని .. జార్ఖండ్ , బీహార్ వచ్చిన వారిలో కొంత మందికి ఆధార్ కార్డులు లేని వారిని విచారించమని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ , అనుమానితులను గుర్తించడం కోసం ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించామని , మొబైల్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ రావడంతో నిందితులను పట్టుకోగలుతున్నామని డీసీపీ పేర్కొన్నారు. -
పరిగిలో జల్లెడ పట్టిన పోలీసులు
పరిగి : వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసులు శుక్రవారం రాత్రి నిర్బంధ తనిఖీలు చేపట్టారు. బహరంపేట, నాయకోటివాడ, శాంతినగర్, బ్రాహ్మణవాడ, బెస్తవాడలో సోదాలు నిర్వహించారు. పరిగి డీఎస్పీ ఆష్ఫాక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 110 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టిన పోలీసులు ఎలాంటి పత్రాలు లేని 72 బైక్‌లు, 2 కార్లు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. -
పాతబస్తీలో కార్డన్‌సెర్చ్
- అదుపులో 36 మంది హైదరాబాద్: నగరంలోని చాంద్రయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక ఇంద్రానగర్ బండ్లగూడలో సౌత్‌జోన్ డీసీపీ వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో 400 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 36 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్న 13 మంది ల్యాండ్ గ్రాబర్లు, ఆరుగురు పాత నేరస్థులు ఉన్నారు. సరైన ధ్రువ పత్రాలు లేని 42 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
మానకొండూరులో కార్డెన్ సెర్చ్
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని మానకొండూరులో సోమవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తనఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 24 ద్విచక్రవాహనాలు, 13 ఆటోలు, అక్రమంగా నిల్వచేసిన రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యం, పెద్ద ఎత్తున గుట్కాప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికే తనిఖీలు నిర్వహిస్తున్నామని సీపీ తెలిపారు. -
కరీంనగర్లో పోలీసుల తనిఖీలు
-
కరీంనగర్లో పోలీసుల తనిఖీలు
కరీంనగర్: జిల్లా కేంద్రంలోని బుట్టిరాజారాం కాలనీలో శనివారం వేకువజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో ప్రతీ ఇంటిని తనిఖీ చేశారు. 31 బైక్‌లు, 8 ఆటోలు, 9 సిలిండర్లు, 3 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పలువురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. -
కడెంలో 24 ద్విచక్రవాహనాలు సీజ్
కడెం: నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, అక్రమంగా నిల్వ ఉంచిన రూ.20 వేల విలువ గల గుట్కా, మద్యం ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నల్లబెల్లం, దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అజార్, రమేష్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కడెం, దస్తురాబాద్, ఖానాపూర్, పెంబి ఎస్ఐల ఆధ్వర్యంలో వందమంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు ఖానాపూర్ సీఐ నరేష్కుమార్ వెల్లడించారు. -
పెద్దపల్లి జిల్లాలో కార్డెన్ సెర్చ్
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం శాంతినగర్‌లో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాల్లో 1000 లీటర్ల బెల్లం పానకంతో పాటు నాలుగు లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. సారా బట్టీలు పెడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. సరైన పత్రాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. -
ఖానాపూర్‌లో కార్డెన్ సెర్చ్
నిర్మల్: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్‌లో బుధవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 53 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలు, ఓ ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు లక్ష రూపాయల విలువైన కలప, పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లు, 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. -
కరీంనగర్లో కార్డన్ సెర్చ్ : 25 బైక్‌లు స్వాధీనం
కరీంనగర్ : కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కోటి రాంపూర్‌లోని ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా సోదా చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలతోపాటు 20 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. -
పాతబస్తీలో కార్డన్‌సెర్చ్ : 66 బైక్‌లు సీజ్
-
పాతబస్తీలో కార్డన్‌సెర్చ్ : 66 బైక్‌లు సీజ్
హైదరాబాద్ : పాతబస్తీలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. సౌత్ జోన్ డీసీపీ వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో కాలాపత్తర్‌లోని ప్రతి ఇంటిలో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 66 బైక్‌లు, మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. 16 మంది రౌడీషీటర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. వారిలో గ్యాంగ్ స్టర్ ఆయుబ్ ఖాన్ అనుచరులతో పాటు ముగ్గురు అనుమానితులు కూడా ఉన్నారన్నారు. ఈ తనిఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నట్లు డీసీపీ తెలిపారు. -
గోదావరి ఖనిలో కార్డన్‌సెర్చ్
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మండలం ఇందిరానగర్‌లో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 13 బైక్‌లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 60 లీటర్ల కిరోసిన్, క్వింటా బొగ్గును సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో ఒక సీఐ, నలుగురు ఎస్ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
కామారెడ్డిలో కార్డన్ సెర్చ్
కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో మంగళవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్(నిర్బంధ తనిఖీలు) నిర్వహించారు. ఈ తనిఖీలు డీఎస్పీ ప్రసన్నరాణి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సోదాల్లో ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, 100 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఎలాంటి పత్రాలు లేని ఒక ఓమ్ని వాహనాన్ని, 12 ఆటోలను, 100 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
కార్డన్ సెర్చ్.. భారీగా వాహనాలు పట్టివేత
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీసులు శుక్రవారం ఉదయం పట్టణంలో కార్డన్‌సెర్చ్ చేపట్టారు. సుమారు170 మంది పోలీసులు పాల్గొని, ప్రతి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి పత్రాలు లేని 80 బైకులు, 2 ట్రాలీ ఆటోలను, రెండు కార్లతో పాటు ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులతో పాటు అరెస్టు వారెంట్ ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుకున్నారు. ఎస్పీ అనంత్‌శర్మ నేతృత్వంలో ఈ సోదాలు చేపట్టారు. -
జమ్మికుంటలో కార్డన్ సెర్చ్
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మోతుకులగూడెంలో బుధవారం తెల్లవారు జామున కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏసీపీ, ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, 150 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ప్రతి ఇంటిని అణువుణవూ తనిఖీ చేశారు. ఎలాంటి లైసెన్స్ లేని 29 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అనుమానంగా తిరుగుతుంటే సమాచారం అందించాలని ప్రజలను కమిషనర్ కోరారు. -
పాతబస్తీలో కార్డన్‌సెర్చ్
హైదరాబాద్: వెస్ట్ జోన్ పోలీసులు షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి కార్డన్ సెర్చ్ చేపట్టారు. సుమారు 250 మంది పోలీసులు ప్రతి ఇళ్లూ సోదాలు జరిపారు. ఈ సందర్భంగా ఎలాంటి పత్రాలు లేని 48 వాహనాలను స్వాధీనం చేసుకోవటంతో పాటు 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. -
నిరంతరం నిర్బంధ తనిఖీలు
కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి కరీంనగర్ క్రైం : నేరాల నియంత్రణ కోసం నిరంతరం నిర్బంధ తనిఖీలు కొనసాగిస్తున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్ శివారులోని కిసాన్‌నగర్, పసుల నారాయణకాలనీల్లో గురువారం ఉద యం కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. అనంతరం సీపీ కాలనీవాసులతో మాట్లాడారు. అసాంఘిక శక్తుల కదలికల నియంత్రణకు, అక్రమ కార్యకలాపాల అడ్డుకట్ట వేసేందుకు కార్డెన్‌సెర్చ్‌లు చేపడుతున్నట్లు చెప్పారు. శివారు ప్రాంతాల్లోనే కాకుండా ఇక ముందు ప్రతి అనుమానిత పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ తరహా తనిఖీలు చేపడతామన్నారు. నూతనంగా అద్దెకు వస్తున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని గ్రామ పోలీస్ అధికారులు(వీపీవో)లను ఆదేశించారు. వాహనాలు కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నప్పటి నుంచి అనుమానితుల కదలికలు తగ్గాయని, ఇలాంటి తనిఖీలు కొనసాగించాని కాలనీవాసులు సీపీని కోరారు. సాయంత్రం వేళల్లో ముఖ్య కూడళ్ల వద్ద కొందరు ఆకతారుులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీపీ ఇప్పటి నుంచే ఈ ప్రాంతంలో ప్రత్యేక గస్తీతో పాటు షీటీం బృందాలను రంగంలోకి దింపుతున్నట్లు తెలిపారు. ఈ కార్డెన్‌సెర్చ్‌లో సరైన ధ్రువీకరణపత్రాలు లేని 36 ద్విచక్రవాహనాలు, ఒక కారు, ఒక ట్రాక్టర్, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న జంటను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో అటువైపుగా వచ్చిన దొంగ పో లీసులను చూసి తన వాహనం వదిలి పరారయ్యాడు. దొంగను పట్టుకునేందుకు రెండు బృందాలు రంగంలోకి దిగారుు. ఈ తనిఖీల్లో కరీంనగర్ ఏసీపీ రామారావు, ఇన్స్పెక్టర్లు సదానందం, హరిప్రసాద్, కృష్ణగౌడ్, లక్ష్మిబాబు, ఎస్సైలు తిరుమల్, వెంకటేశ్వర్లు, నరేశ్, రవీందర్నారుుడు, నాగన్నతోపాటు మరో ఆరుగురు ఎస్సైలు, ఏఎస్సైలు, హెచ్‌సీలు, పీసీలు, మహిళ పోలీసులు, ఏఆర్ సిబ్బంది, డాగ్‌స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్ మొత్తం 200 మంది పోలీసులు పాల్గొన్నారు. -
హుజూరాబాద్‌లో కార్డన్ సెర్చ్
హుజూరాబాద్: కరీంనగర్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్‌లోని మామిండ్ల వాగులో మంగళవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించి అనుమానితులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ సరైన పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ తనిఖీల్లో హుజూరాబాద్ ఏసీపీ మూల రవీందర్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు, సుమారు 150మంది సిబ్బంది పాల్గొన్నారు. -
12 మంది భూతవైద్యులు అరెస్టు
హైదరాబాద్: పాతబస్తీలో దక్షిణమండలం పోలీసులు మంగళవారం ఉదయం కార్డన్‌సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా భూతవైద్యం పేరుతో జనాన్ని మాయ చేస్తున్న 12 మంది ఇళ్లపై దాడులు చేశారు. అమాయక ప్రజలను మోసగిస్తున్న 12 మంది మంత్రగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మంత్రాలు చేస్తామంటూ ప్రజల నుంచి డబ్బు గుంజుతూ మోసాలకు పాల్పడుతున్నారని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టారు. -
ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్
-
బోరబండ ప్రాంతంలో పోలీసుల కార్డెన్ సర్చ్
హైదరాబాద్ : నగరంలోని బోరబండ ప్రాంతంలో పలు కాలనీల్లో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్డెన్ సర్చ్ నిర్వహించారు. బోరబండ, భరత్‌నగర్, బంజారానగర్, బాబాసాహెబ్నగర్ తదితర ప్రాంతాల్లో 586 ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏడుగురు రౌడీషీటర్లను, ముగ్గురు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 17 మంది విదేశీయులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 51 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 400 మంది పోలీసులు నలుగురు ఏసీపీలు, 14 మంది సీఐలు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. -
బోడుప్పల్లో పోలీసుల కార్డెన్ సర్చ్
బోడుప్పల్లో పోలీసులు కార్డన్ సర్చ్‌ను ఇందిరానగర్, వీరారెడ్డినగర్, కాకతీయ కళానగర్‌లో నిర్వహించి ?ప్రతి ఇంటిని జల్డెడ పట్టారు. ఆదివారం ఉదయం 4 నుంచి 6 గంటల వరకు జరిగిన ఈ కార్డన్ సర్చ్‌లో డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, 10 మంది ఇన్స్పెక్టర్లతోపాటు 200 మంది పోలీసులు పాల్గొన్నారు. తొలుత మూడు కాలనీల రోడ్లన్నీ పోలీసులు చుట్టు ముట్టారు. ఒక్కో ఇంటికి తిరుగుతూ సంబంధిత వ్యక్తుల నుంచి అన్ని రకాల వివరాలు సేకరించారు. మొత్తం 400 వందల ఇళ్లల్లో ప్రతి సమాచారం సేకరించారు. ప్రతి ఇంట్లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ సిలెండర్, ఎంత మంది కుటుంబ సభ్యులు ఉంటున్నారు. వాహనాలు ఎన్ని ఉన్నాయి. వాటికి లెసైన్‌సలు ఉన్నాయా.. కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అనుమానుతులు ఎవరైనా ఉంటున్నారా అనే వివరాలను సేకరించారు. ఈ కార్డన్ సర్చ్‌లో 8 మందిని అనుమానితులను, లెసైన్‌స లేకుండా ఉన్న 36 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను, 7 సిలెండర్లతోపాటు మరో ఇద్దరు బెల్ట్‌షాపు నిర్వాహకులను స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి వెల్లడించారు? ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, భద్రత కోసం ఈ కార్డన్ సర్చ్‌ను నిర్వహించామన్నారు. ఇళ్లు అద్దెకు ఇచ్చేటప్పుడు అన్ని వివరాలు సేకరించిన తరువాత ఇవ్వాలని కోరారు. అపరిచితులు అనుమానితులు, కొత్తవారు ఎవరైనా కాలనీలో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పోలీసులు చేసే ప్రతి పనిలో ప్రజలను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు విలువైన వస్తువులు, నగదు ఉంచరాదని, ఊరికి వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వడంతోపాటు ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అల్వాల్ ఏసీపీ రఫీక్, మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్, మేడిపల్లి ఇన్స్పెక్టర్ బద్దం నవీన్‌రెడ్డితోపాటు మరో 9 మంది ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్లు పాల్గొన్నారు. -
రెంజల్లో కార్డన్ సెర్చ్
రెంజల్(నిజామాబాద్): రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో గురువారం ఉదయం (నిర్బంధ తనిఖీ) కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. బోధన్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కోటగిరి, బోధన్, ఎడపల్లి, రెంజల్ ఎస్సైలతో పాటు పలువురు ప్రత్యేక సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఎలాంటి లెసైన్స్‌లు లేని 12 బైక్‌లను, ఓ ట్రాక్టర్‌ను ఇప్పటి వరకూ సీజ్ చేశారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. -
హైదరాబాద్‌లో అర్ధరాత్రి కార్డెన్‌సెర్చ్
-
పాతబస్తీలో కార్డెన్ సెర్చ్
♦ ద్విచక్ర వాహనాలు,మద్యం బాటిళ్లు, కత్తులు, సర్క్యూట్ ♦ మెటీరియల్ స్వాధీనం బహదూర్‌పురా : దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని హసన్‌నగర్‌లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 9 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో 60 ద్విచక్ర వాహనాలు, మరణాయుధాలు, 280 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి సర్క్యూట్ మెటీరియ ల్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రారంభమైన ఈ తనిఖీల్లో దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 600 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి ఇల్లు, గోడౌన్లను శోధించారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఆరుగురు వ్యక్తు ల్లో ఐదుగురు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అరెస్ట్ చేసి బైండోవర్ తరలించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ బాబురావు, చార్మినార్, సంతోష్‌నగర్ ఏసీపీలు అశోక చక్రవర్తి, వి. శ్రీనివాసులు, దక్షిణ మండలంలోని ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బందరులో కార్డన్ సెర్చ్
మచిలీపట్నం : కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని నవీన్ మిట్టల్ కాలనీలో పోలీసులు శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. సరైన పత్రాలు లేని 12 వాహనాలను పోలీసులు సీజ్ చేసి..పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
హుస్సేనీఆలంలో కార్డన్ సెర్చ్
హైదరాబాద్ : హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం సౌత్‌జోన్ పోలీసులు కార్డన్‌సెర్చ్ (నిర్బంధ తనిఖీలు) నిర్వహించారు. ఈ తనిఖీల్లో 12 మంది రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఓ కత్తి, మూడు డాగర్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే ఐదు మామిడిపళ్ల గోడౌన్లను సీజ్ చేశారు. ఆ క్రమంలో ఐదు బ్యాగుల కార్బైడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు రెండు బెల్ట్ షాపులను సీజ్ చేసి... 700 లిక్కర్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో దాదాపు 300 మంది పోలీసులు పాల్గొన్నారు. సౌత్ జోన్ డీసీపీ కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. -
వీఎన్పురంలో కార్డన్ సెర్చ్
విజయవాడ : కృష్ణాజిల్లా గన్నవరం మండలం వీఎన్‌పురం కాలనీలో శుక్రవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే సరైన పత్రాలు చూపని కారణంగా 22 బైక్‌లతోపాటు రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పాతబస్తీలో కార్డన్ సెర్చ్: రౌడీషీటర్లు అరెస్ట్
హైదరాబాద్ : పాతబస్తీ, ఫలక్‌నుమా ప్రాంతాల్లో పోలీసులు గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 16 మంది రౌడీషీటర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎలాంటి ధృవపత్రాలు లేని 60 ద్విచక్రవాహనాలు, 3 కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. సౌత్‌జోన్ డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 400 మంది పోలీసులు పాల్గొన్నారు. -
చార్మినార్ వద్ద తనిఖీలు:127 మంది అరెస్ట్
హైదరాబాద్ : పాతబస్తీలోని చార్మినార్, ఫలక్‌నుమా, చాంద్రయాణగుట్టలో పోలీసులు బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 127 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాదాపు 300 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించరాఉ. ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
సనత్‌నగర్‌లో కార్డన్ సెర్చ్: 45 మంది అరెస్ట్
హైదరాబాద్ : సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లాపూర్‌లో పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 45 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 64 బైక్‌లు, 20 ఆటోలు, ఓ జీపు స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ ఆడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పోలీసులు ఈ విస్తృత తనిఖీల్లో పాల్గొన్నారు. -
లంగర్‌హౌస్‌లో కార్డన్ సెర్చ్: 63 మంది అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని లంగర్‌హౌస్, గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 63 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే సరైన పత్రాలు లేని 59 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. -
సంతోష్‌నగర్‌లో కార్డన్ సెర్చ్: అనుమానితులు అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని సంతోష్‌నగర్‌లో పోలీసులు బుధవారం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 300 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు జరుపుతున్నారు. సంతోష్‌నగర్ ప్రాంతాన్ని వారు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. అందులోభాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న 56 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 23 వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. -
బొగ్గు దొంగలపై పోలీసుల ఉక్కుపాదం
గోదావరిఖనిలో కార్డెన్ సెర్చ్ కోల్‌సిటీ: కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో బొగ్గు మాఫియా ఆటకట్టించడానికి ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్ వేట ప్రారంభించారు. బొగ్గు దొంగతనాలపై ‘సాక్షి’ వరుసన కథనాలు సంచలనం సృష్టించాయి. ఇంతకాలం మౌనందాల్చిన పోలీసులను ‘సాక్షి’ కథనాలు కదిలించేలా చేశాయి. బొగ్గు మాఫియాను సీరియస్‌గా తీసుకున్న ఏఎస్పీ బుధవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ‘కార్డెన్ సెర్చ్’ నిర్వహించారు. వన్‌టౌన్ సీఐ ఆరె వెంకటేశ్వర్, నలుగురు ఎస్సైలు, 100 మంది కానిస్టేబుళ్లతో ఇంటింటిని సోదా చేశారు. స్థానిక భరత్‌నగర్, విఠల్‌నగర్, 7బీ కాలనీ, 6బీ గుడిసెలు, సంజయ్‌నగర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. స్థానిక సంజయ్‌నగర్‌లో కంటే రామస్వామి, బొగ్గు దేవేందర్‌లు బొగ్గు నిల్వ చేస్తూ పోలీసులను, సింగరేణి సెక్యూరిటీ విభాగం అధికారులను చూసి పారిపోయారు. పొదల్లో రూ.15 వేల విలువ గల సుమారు నాలుగు టన్నుల బొగ్గును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి కుటుంబాలకు ఏఎస్పీ కౌన్సెలింగ్ నిర్వహించారు. సింగరేణి సెక్యూరిటీ విభాగం జూనియర్ ఇన్స్పెక్టర్ అమిరిశెట్టి వైకుంఠం ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే, అనుమానాస్పందంగా కనిపించిన 7బీ కాలనీకి చెందిన బొల్లి శ్యాం, భూక్య ఏసు, నిమ్మల సెల్వరాజ్తోపాటు రాంనగర్‌కు చెందిన నల్ల శ్రీనివాస్, సంజయ్‌నగర్‌కు చెందిన సిరికొండ సదానందంలను బైండోవర్ చేసినట్లు తెలిపారు. -
హకీంపేట,టోలిచౌకీలో పోలీసుల కార్డెన్‌సెర్చ్
-
మలక్‌పేటలో పోలీసుల కార్డన్‌సెర్చ్
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో బుధవారం 150 మంది పోలీసులు మలక్‌పేట పరిధిలోని సలీమ్‌నగర్, మూసారంబాగ్లలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 60 బైకులు, 5 ఆటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బాలానగర్‌లో కార్డన్ సెర్చ్
-
నగరంలోని పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్
హైదరాబాద్: ఈస్ట్ జోన్ పోలీసులు శుక్రవారం రాత్రి పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ డాక్టర్ రవీందర్ పర్యవేక్షణలో అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని పటేల్‌నగర్, ఆహ్మద్‌నగర్, న్యూపటేల్ నగర్, రవీంద్రనాథ్నగర్ తదితర ప్రాంతాల్లో తనీఖీలు చేపట్టారు. ఓ రౌడిషీటర్‌తో పాటు మరో నలుగురు పాత నేరస్తులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సరైన పత్రాలు లేని 50 వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. 250 మంది వరకు పోలీసు అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లోని బాయ్స్ హాస్టళ్లలో కార్డన్‌సెర్చ్
-
భగత్ సింగ్ నగర్ లో కార్డన్ సెర్చ్
హైదరాబాద్: సరూర్ నగర్ లోని భగత్ సింగ్ నగర్ లో ఎల్బీనగర్ డీసీపీ ఇక్బాల్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో డీసీపీ ఇక్బాల్, మరో 250 మంది పోలీసులు పాల్గొన్నారు. సర్చ్ లో భాగంగా పోలీసులు కాలనీ మొత్తం తనిఖీలు నిర్వహించారు. -
పెడనలో పోలీసులు తనిఖీలు
మచిలీపట్నం: కృష్ణాజిల్లా పెడన పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ఈ తనిఖీలు ఉదయం వరకు సాగాయి. పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో పట్టణంలోని ప్రతి ఇంటినీ క్షణ్ణంగా పరిశీలించారు. అందులోభాగంగా 15 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెడనలో ఇటీవల కాలంలో చోరీలు అధికమైనాయి. దాంతో పట్టణ ప్రజలు పోలీసుకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
బోరబండలో పోలీసుల కార్టన్ సెర్చ్
హైదరాబాద్ బోరబండ ప్రాంతంలోని కార్మికనగర్ ,బంజారానగర్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్‌ను నిర్వహించారు. అర్థరాత్రి రెండు గంటలకు ప్రారంభమైన ఈ తనిఖీలు తెల్లవారుజామున 4 గంటలవరకూ సాగింది. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో సుమారు 180 మంది పోలీసులు ఇంటింటినీ క్షణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు నిర్వహించిన ప్రాంతంలో గుడుంబా ఏరులైపారుతోందన్న సమాచారం పోలీసులు అందుకున్నారు. దీనిపై చాలాసార్లు ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా అందాయి. దీనికి తోడు ఇక్కడ రౌడీలు కూడా చాలా మంది పాత నేరస్తులు తలదాచుకున్నట్టు విశ్వసనీయ వరక్గాల ద్వారా పోలీసులు సమాచారం అందుకున్నారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ నివసిస్తున్న పాత నేరస్తులే లక్ష్యంగా ఈ తనిఖీలు సాగాయి. అక్రమంగా పెట్రోల్ నిల్వ చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.