
పాతబస్తీలో కార్డన్‌సెర్చ్ : 66 బైక్‌లు సీజ్
హైదరాబాద్ : పాతబస్తీలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. సౌత్ జోన్ డీసీపీ వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో కాలాపత్తర్‌లోని ప్రతి ఇంటిలో సోదాలు నిర్వహించారు.
సరైన పత్రాలు లేని 66 బైక్‌లు, మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. 16 మంది రౌడీషీటర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. వారిలో గ్యాంగ్ స్టర్ ఆయుబ్ ఖాన్ అనుచరులతో పాటు ముగ్గురు అనుమానితులు కూడా ఉన్నారన్నారు. ఈ తనిఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నట్లు డీసీపీ తెలిపారు.