Bikes seized
-
లాక్డౌన్ ఉల్లంఘనులకు ‘తెలంగాణ’ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నిబంధనలకు విరు ద్ధంగా బయటికి వచ్చి.. సీజ్ అయిన వాహనాల విడుదలకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. జరిమానాలు చెల్లించిన వారి వాహనాలను విడుదల చేయాలని అన్ని ఎస్పీ, పోలీస్ కమిషనరేట్లకు డీజీపీ కార్యాలయం నుంచి సోమవారం సర్క్యు లర్లు వెళ్లాయి. దీంతో పోలీసులు సీజ్ చేసిన వాహనాలను తీసుకెళ్లేందుకు వాహనదారులకు వీలు కలిగింది. ఈ–పెట్టీ, ఈ–చలానాల జరిమానాలను చెల్లించి వాహనాలను తీసుకెళ్లవచ్చు. తీవ్రమైన వాటికి మాత్రం న్యాయస్థానం గడప తొక్కాల్సిందే. కరోనా విజృంభణతో మే నెల 12 నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘ నలకు పోలీసులు ఎపిడమిక్ యాక్ట్ సెక్షన్ ఐపీసీ 188 కింద కేసులు నమోదు చేశారు. ఈ ఉల్లంఘనలపై వారి సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపు తున్నారు. అందులో జరిమానాలను ఈ–చలానా, ఈ–పెట్టీ కేసుల కింద పోలీసులే విధిస్తే.. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో చెల్లించి విడిపించుకోవచ్చు. చెల్లింపు ఇలా.. స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి సెల్‌ఫోన్‌కు సందేశం వస్తుంది. అందులో ఉల్లంఘనలకు జరిమానా ఎలా చెల్లించాలో కూడా పొందుపరిచారు. టీ–యాప్, టీ–వ్యాలెట్, ఈ సేవ/మీసేవ/పేటీఎం/టీఎస్ఆన్లైన్ లేదా https://echalan.tspolice.gov.inలో చెల్లించాలి. కోర్టుకు వెళితే ఇలా.. ఈ మొత్తంలో కొన్ని తీవ్రమైన కేసులను పోలీసులు కోర్టుకు పంపుతున్నారు. అలాంటివారు మాత్రం నేరుగా కోర్టుకు వెళ్లి అక్కడ జరిమానా చెల్లించాలి. లేకపోతే కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం.. ఆ వ్యక్తిపై పోలీసులు చార్జీషీట్ దాఖలు చేస్తారు. దాని ఆధారంగా కోర్టు అతనికి జైలుశిక్ష ఖరారు చేస్తుంది. లాక్డౌన్ ఎత్తివేసినా.. ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు ఉంటాయని పోలీసు శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ఎస్పీ, కమిషనరేట్ కార్యాలయాలకు ఆదేశాలు అం దాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన దరిమిలా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా పూర్తిగా తొలగిపోని కారణంగా ఎపిడమిక్ యాక్ట్ కొనసాగు తుందని సోమవారం పోలీసు శాఖ స్పష్టం చేసింది. బహిరంగ, పనిచేసే ప్రాంతాల్లో మాస్కు విధిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని పునరుద్ఘాటించింది. పాటించనివారిపై ఎపిడమిక్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, రూ.1000 జరిమానా విధిస్తామని తెలిపింది. -
లాక్డౌన్ ఉల్లంఘన: 2 వేల బైక్‌లు సీజ్
బరంపురం: నగరంలో లాక్డౌన్, షడ్‌డౌన్‌లతో పాటు నైట్ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. గత పది రోజులుగా సుమారు 2వేలకు పైగా మోటార్ వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. 832 మందిపై కేసులు నోమోదు చేసి నోటీసులు జారీ చేసినట్లు ఎస్డీపీఓ బిష్ణుప్రసాద్ పాత్రో తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావొద్దని, నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.41 వేల జరిమానా.. రాయగడ: కరోనా నియంత్రణలో భాగంగా అమలు చేస్తున్న వారాంతపు షట్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కల్యాణసింగుపూర్ పోలీసులు కొరడా ఝులిపించారు. ఐఐసీ సుకుమా హంసద్ ఆధ్వర్యంలో పోలీసులు కల్యాణసింగుపూర్‌లో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి రూ.41వేలు జరిమానా విధించినట్లు ఐఐసీ అధికారి తెలిపారు. ఏఎస్ఐ డీకే సాహు, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. -
కరీంనగర్లో కార్డన్ సెర్చ్ : 25 బైక్‌లు స్వాధీనం
కరీంనగర్ : కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కోటి రాంపూర్‌లోని ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా సోదా చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలతోపాటు 20 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. -
పాతబస్తీలో కార్డన్‌సెర్చ్ : 66 బైక్‌లు సీజ్
-
పాతబస్తీలో కార్డన్‌సెర్చ్ : 66 బైక్‌లు సీజ్
హైదరాబాద్ : పాతబస్తీలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. సౌత్ జోన్ డీసీపీ వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో కాలాపత్తర్‌లోని ప్రతి ఇంటిలో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 66 బైక్‌లు, మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. 16 మంది రౌడీషీటర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. వారిలో గ్యాంగ్ స్టర్ ఆయుబ్ ఖాన్ అనుచరులతో పాటు ముగ్గురు అనుమానితులు కూడా ఉన్నారన్నారు. ఈ తనిఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నట్లు డీసీపీ తెలిపారు. -
కరీంనగర్లో దొంగల ముఠా అరెస్ట్
కరీంనగర్ : నగరంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న ఓ ముఠాను కరీంనగర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు త్రీ టౌన్ పోలీసులు దాడి చేసి హౌసింగ్ బోర్డు చౌరస్తా వద్ద దొంగలను పట్టుకున్నారు. వీరి నుంచి మూడు బైక్‌లు, 8 సెల్ఫోన్లు, రూ.4 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగరంలో జరిగిన నాలుగు దొంగతనం కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. కరీంనగర్‌కు చెందిన సాయి, వేణు, కార్తీక్, రాజేష్, హరీష్, సాయి చందు, శ్రావణ్ కుమార్, భువనేశ్వర్‌గా గుర్తించారు. నగరంలో చంటిపిల్లలతో దంపతుల మాదిరిగా అంతర్రాష్ట్ర ముఠా తిరుగుతోందని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటి వారు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. -
ముగ్గురు దొంగలు అరెస్ట్: బైక్‌లు స్వాధీనం
చిత్తూరు : చిత్తూరు జిల్లా ఏర్పేడులో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆరు బైకులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగలు అరెస్ట్ : మోటర్ సైకిళ్లు స్వాధీనం
విజయవాడ : విజయవాడలో ఇద్దరు దొంగలను నగర పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15 మోటర్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని పోలీసులు సీజ్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సదరు దొంగలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అందులోభాగంగా వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
పోలీసుల కార్డన్ సెర్చ్ : 60 మంది అరెస్ట్
-
పోలీసుల కార్డన్ సెర్చ్ ఆపరేషన్, 60 మంది అరెస్ట్
హైదరాబాద్: రాజేంద్రనగర్ చింతల్మెట్లో ఆదివారం తెల్లవారుజామునుంచి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 350 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు జరుపుతున్నారు. చింతల్ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. తనిఖీలలోభాగంగా అనుమానాస్పదంగా తిరుగతున్న 60 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 40 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పట్టుబడిన వారిలో 10 మంది రౌడీషీటర్లు, నలుగురు పాత నేరస్థులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. -
నెక్లెస్ రోడ్డులో బైక్ రేసింగ్‌లు: పోలీసుల దాడి
-
నెక్లెస్ రోడ్డులో బైక్ రేసింగ్‌లు: పోలీసుల దాడి
హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డులో బైక్ రేసింగులకు పాల్పడుతున్న యువతపై పోలీసులు ఆదివారం దాడులు చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో యువకులను పోలీసులు అదుపులోకి తీసున్నారు. అనంతరం వారిని గోపాలపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలాగే వారి వద్ద ఉన్న మొత్తం 300 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో యువకులు భారీ సంఖ్యలో నెక్లెస్ రోడ్డుకు చేరుకుని బైక్ రేసింగులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. బైక్ రేసింగులపై నెక్లెస్ రోడ్డులోని పాదచారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.