నగరంలోని నెక్లెస్ రోడ్డులో బైక్ రేసింగులకు పాల్పడుతున్న యువతపై పోలీసులు ఆదివారం దాడులు చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో యువకులను పోలీసులు అదుపులోకి తీసున్నారు. అనంతరం వారిని గోపాలపురం పోలీసు స్టేషన్కు తరలించారు. అలాగే వారి వద్ద ఉన్న మొత్తం 300 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో యువకులు భారీ సంఖ్యలో నెక్లెస్ రోడ్డుకు చేరుకుని బైక్ రేసింగులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. బైక్ రేసింగులపై నెక్లెస్ రోడ్డులోని పాదచారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.