bike racing
-
రేసులో అజిత్.. ఉదయనిధి స్టాలిన్ అభినందన
కోలీవుడ్ సినీ నటుడు అజిత్ కుమార్‌కు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అభినందనలు తెలియజేశారు. తమిళనాడు ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై చాటుతుండటాన్ని గుర్తు చేస్తూ కొనియాడారు. సినీ నటుడు అజిత్ కొత్త అవతారం ఎత్తారు. అజిత్‌కుమార్ రేసింగ్ టీం పేరిట టీమ్ లోగోను తాజాగా ఆవిష్కరించారు. సరికొత్త పాత్రలో రేసర్‌గా వస్తున్నట్టు అజిత్ ఆనందంగా ప్రకటించారు. రేసర్‌గా తన ప్రయాణంలో గెలవాలనే సంకల్పంతో ముందుకు సాగనున్నట్టు పేర్కొన్నారు. దుబాయ్‌లో త్వరలో జరగనున్న దుబాయ్ 24 హెచ్ 2025 పోటీలలో తొలిసారిగా అజిత్‌కుమార్ రేసింగ్ టీం పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. ఈ పోటీల ట్రయల్ రన్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ఇందులో తమిళనాడు స్పోర్ట్స్ విభాగం లోగోను ధరించి ఈ ట్రయల్ రన్లో దూసుకెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. తమిళనాడు స్పోర్ట్స్ అండ్ డెవలప్మెంట్ విభాగం నేతృత్వంలో క్రీడాభ్యున్నతికి జరుగుతున్న తోడ్పాటుకు మరింత బలం చేకూర్చే విధంగా అజిత్ ఆ లోగో ధరించడాన్ని ఉదయనిధి స్టాలిన్ ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికగా తమిళనాడు స్పోర్ట్స్‌ను చాటడం గర్వించ దగ్గ విషయం అని, ఇందుకు అభినందనలు తెలియజేశారు. -
రయ్.. రయ్.. గూబ గుయ్!
బంజారాహిల్స్: రాత్రీ పగలూ తేడా లేకుండా మోడిఫైడ్ సైలెన్సర్‌తో భీకర శబ్దాలతో దూసుకెళ్తున్న స్పోర్ట్స్ బైక్‌లు, కార్లపై అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు దృష్టిపెట్టారు. గడిచిన నెల రోజుల కాలంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు మితిమీరిన వేగంతో చెవులు దద్దరిల్లే శబ్దంతో దూసుకెళ్తున్న వాహనాలను సీజ్ చేయడంతో పాటు సదరు వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఇంత చేస్తున్నా ఇంకా కొంతమంది యువకులు స్పోర్ట్స్ బైక్‌లు, కార్లలో రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తూనే ఉన్నారు. రాత్రి 10 గంటల తర్వాతనే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, నెక్లెస్‌రోడ్డు, మాసబ్‌ట్యాంక్, మాదాపూర్, దుర్గం చెరువు ప్రాంతాల వైపు యువకులు రేసింగ్‌లకు పాల్పడుతూ బైక్‌లపై దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉదయం 11 నుంచి గంట పాటు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు రెండు గంటలు మాత్రమే వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. తమ దృష్టికి వస్తే మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు. రాత్రి 7 తర్వాత తెల్లవారుజామున 6 గంటల వరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులపై బైక్‌లు, కార్లు మోత మోగిస్తూ దూసుకెళ్తుండగా వాహనదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. చెవులు దద్దరిల్లే సౌండ్లతో నివాసితులు సైతం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కనీసం వారానికి రెండు సార్లైనా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు వేర్వేరుగా వాహన తనిఖీలు చేపడితే పెద్ద ఎత్తున మోడిఫైడ్ సైలెన్సర్ల వాహనాలను పట్టుకోవచ్చని స్థానికులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
మహిళా ఎస్ఐ కొడుకు అఘాయిత్యం
కర్ణాటక: మహిళా ఎస్ఐ కుమారుడు ద్విచక్రవాహనంతో అతి వేగంగా వీలింగ్ చేస్తూ ఢీకొట్టడంతో ఒక వృద్ధుడు చనిపోగా, మరొక యువకుడు గాయపడ్డాడు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని నంజనగూడు గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హిమ్మావు వద్ద ఆదివారం జరిగింది. నిందితుడు సయ్యద్ ఐమాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నంబర్ ప్లేట్ లేని బైక్‌తో.. సయ్యద్ ఐమాన్ నంబర్ ప్లేటు లేని ప్లాటినా బైక్‌పై వీలింగ్ చేస్తూ వచ్చి హిమ్మావు గ్రామంలో పశువులను మేపుతూ కూర్చుని ఉన్న సిద్దప్ప(68), గోవిందరాజు (25)లను ఢీకొన్నాడు. సిద్ధప్ప తీవ్ర గాయాలతో చనిపోగా గోవిందరాజును స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. నిందితున్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. తాను నంజనగూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ యాస్మిన్ తాజ్ కొడుకునని చెప్పాడు. చిన్నపాటి గాయాలైన అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుని కుమారుడు మహాదేవస్వామి నంజనగూడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. గతంలోనూ అరెస్టయి ఇంతకు ముందు కూడా సయ్యద్ ఐమాన్ చోరీ చేసిన స్కూటర్ మీద ప్రమాదకరంగా వీలింగ్ చేస్తూ ఉంటే ప్రజలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి వదిలిపెట్టారు. ఇంతలోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు నంజనగూడు ఆస్పత్రి మార్చురి వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. శవాన్ని ఊరికి తీసుకెళ్లబోమని, పోలీసు అధికారి కొడుకునంటూ దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటే ఏం చేయాలని ప్రశ్నించారు. అతనితో పాటు తల్లిని కూడా అరెస్టు చేయాలని ధర్నా చేశారు. ఈ విషయం రచ్చ కావడంతో జిల్లా ఎస్పీ సీమా లాట్కర్ సదరు ఎస్ఐని ఏ పోస్టింగ్ లేకుండా బదిలీ చేసినట్లు తెలిసింది. -
భారత్‌లో అడుగుపెట్టనున్న మోటో జీపీ.. మెగా ఈవెంట్ ఎప్పుడంటే?
ఫార్ములా రేసింగ్‌ను ఇష్టపడే భారత అభిమానులకు శుభవార్త. ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించే మోటో జీపీ బైక్ రేసింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్ తొలిసారి ఇండియాకు రాబోతుంది. వచ్చే ఏడాది ఈ మెగా ఈవెంట్‌ను ''గ్రాండ్ పిక్స్ ఆఫ్ భారత్'' పేరుతో మన దేశంలో నిర్వహించనున్నారు. అందుకోసం గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఫెయిర్స్ట్రీట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, డోర్నా స్పోర్ట్స్ మధ్య ఎంఓయూ కుదిరింది. మోటార్‌సైకిల్ రేసును ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని భారత ప్రేక్షకులకు అందించేందుకు డోర్నా స్పోర్ట్స్ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. దీనికోసం దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోంది. అంతేకాదు ఇంటర్నేషనల్ లెవల్ మోటో జీపీ రైడర్లను ఇండియాలో తయారు చేసే దిశగా కృషి చేస్తోంది. మోటో జీపీనే కాదు.. మోటో ఈని కూడా ఇండియాకు పరిచయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకముందు భారత్‌లో తొలిసారి జరిగిన ఫార్ములా వన్ ఇండియన్ గ్రాండ్ ప్రికి కూడా నోయిడాలో ఉన్న ఈ బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూటే ఆతిథ్యమిచ్చింది. అయితే ఒక సీజన్‌తోనే ఎఫ్1 ఇండియన్ గ్రాండ్ ప్రిని ముగించింది. ఇప్పుడు మోటో జీపీ రాక రేసింగ్ ప్రియులకు ఆనందాన్నిస్తోంది. చదవండి: తీవ్రంగా గాయపడిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ -
పట్టుబడితే.. పది లక్షల బాండు ఇవ్వాల్సిందే..
బనశంకరి (కర్ణాటక): బెంగళూరులో యువత, పోకిరీలు బైక్ వీలింగ్, డ్రాగ్ రేస్, డ్రంక్ అండ్ డ్రైవ్‌లకు పాల్పడుతూ ప్రమాదాలను సృష్టిస్తుండడంతో వాటి నివారణకు పోలీసులు కొత్త చర్యలు తీసుకోనున్నారు. ఇలా పట్టుబడినవారి నుంచి రూ.5-10 లక్షల పూచీకత్తు తీసుకోవాలని, ఈ భయంతోనైనా వీలింగ్‌కు దూరంగా ఉంటారని భావిస్తున్నారు. వీలింగ్‌లో ఎక్కువగా మైనర్ బాలలు ఉంటున్నారు. బైక్‌లను వాయువేగంతో నడుపుతూ ఇతరులను ఢీకొనడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. వారిపై సీఆర్పీసీ సెక్షన్ 110, 107 కింద కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. కానీ ఫలితం ఉండడం లేదు. మళ్లీ బైక్‌లపై దూసుకెళ్తూ అందరికీ తలనొప్పిగా మారుతున్నారు. ఇప్పటినుంచి బైకర్లు, తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి రూ.5 – 10 లక్షల షూరిటి బాండ్ తీసుకుంటామని నగర ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీస్ కమిషనర్ రవికాంతేగౌడ తెలిపారు. వారు రెండోసారి దొరికిపోతే ష్యూరిటీ మొత్తాన్ని జరిమానాగా రాసేస్తారు. గస్తీ పెంపు నగరంలో రాత్రివేళ మాదకద్రవ్యాలు, మద్యం సేవించి లగ్జరీ కార్లు, బైకుల్లో జాలీరైడ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీనిని అడ్డుకునేందుకు 44 ప్రముఖ స్థలాల్లో గస్తీ పెంచనున్నారు. చదవండి: (ఇంటర్ విద్యార్థినితో పరిచయం పెంచుకొని.. పలుమార్లు అత్యాచారం) -
Gajuwaka: బైక్ రేసింగ్‌లో దూసుకుపోతున్న అవినాష్
గాజువాక: జాతీయ స్థాయి బైక్ రేసులో గాజువాక శ్రీనగర్‌కు చెందిన యువకుడు ప్రతిభ ప్రదర్శించాడు. ది వ్యాలీ రన్ పేరుతో ఈనెల 5న పూణేలో నిర్వహించిన నేషనల్ డ్రాగ్ రేసింగ్‌లో పాల్గొన్న వై.అవినాష్ 1000 సీసీ బైక్ రేసులో ద్వితీయ స్థానం సాధించాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది విశాఖ నగరానికి మంగళవారం చేరుకొన్న అవినాష్‌ను పలువురు అభినందించారు. నాలుగేళ్లుగా పోటీలకు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అవినాష్ నాలుగేళ్లుగా రేసుల్లో పాల్గొంటున్నాడు. కోల్‌కతాలో గతంలో నిర్వహించిన ఎలైట్ ఆక్టేన్, నేషనల్ డ్రాగ్ చాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న అవినాష్ తొమ్మిదో ర్యాంకు సాధించాడు. ఆ తరువాత బెంగళూరులో నిర్వహించిన పోటీలకు హాజరై 13వ ర్యాంకు తెచ్చుకున్నాడు. పూణేలోని లోనావాలాలో తాజాగా నిర్వహించిన రేసులో రెండో ర్యాంకు సాధించి పలువురి మన్ననలను పొందాడు. సేవా భావం తండ్రితో కలిసి స్టీల్‌ప్లాంట్‌లో ట్రాన్స్‌పోర్టు వ్యాపారం నిర్వహిస్తున్న అవినాష్ సమాజ సేవలోను పాలుపంచుకొంటున్నాడు. ప్రస్తుతం 20 మంది అనాథ పిల్లల చదువుకు సహాయం చేస్తున్నాడు. -
అర్ధరాత్రి రేసింగ్.. వంద మంది అరెస్టు
సాక్షి, చెన్నై: బైక్ రేసింగ్ పేరిట రోడ్డెక్కే యువతపై కొరడా ఝుళిపించే విధంగా నగర పోలీసు యంత్రాంగం మంగళవారం రాత్రి కొరడా ఝుళిపించింది. మెరీనా తీరం, అన్నాసాలై, రాయపేట, రాయపురంలలో రేసింగ్ జోరుతో దూసుకొచ్చిన వంద మంది కుర్రకారును అరెస్టు చేశారు. యాభైకు పైగా బైక్‌లను సీజ్ చేశారు. నగరంలో కుర్ర కారు సాయంత్రం వేళ బైక్‌లలో చక్కెర్లు కొడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎనిమిది, పదో తరగతి విద్యార్థులు సైతం తమ వాళ్ల బైక్‌లను రోడ్డెక్కిస్తూ హుషారుగా చక్కర్లు కొడుతూ ప్రమాదం బారిన పడుతున్నారు. ఇక, కళాశాలల విద్యార్థుల ఆకతాయి తనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యార్థులు బైక్ జోరుతో రేసింగ్‌లకు పాల్పడుతూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అతి వేగంగా వీరు దూసుకెళ్లడమే కాదు, ఇతర వాహన దారుల్ని సైతం ప్రమాదాల బారిన పడే రీతిలో వ్యవహరిస్తున్నారు. నగరంలో ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటుండడంతో సర్వత్రా బెంబేళెత్తక తప్పడం లేదు. ఈ ప్రమాదాల్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు స్కూళ్లకు మోటార్ సైకిళ్లపై వస్తే అన్ముతించొద్దంటూ విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, కళాశాల విద్యార్థులు లైసెన్స్‌లు లేకుండా వస్తే అనుమతించొద్దన్న హెచ్చరికను ఉన్నారు. బైక్ రేసింగ్ : హెచ్చరికలు చేసినా, కఠిన నిర్ణయాలు తీసుకున్నా, జరిమానా మోత మోగించినా కొన్ని చోట్ల కుర్రకారు బైక్ రేసింగ్‌ల పేరిట పందేలు కాసుకుంటూ రోడ్డుపై రయ్యూమంటూ దూసుకెళ్తూనే ఉన్నారు. రోడ్డు మీద ఇతర వాహనాలు సైతం ప్రమాదం గురయ్యే విధంగా వీరి వీరంగాలు సాగుతున్నాయి. ప్రధానంగా ఉదయం, రాత్రుల్లో మెరీనా తీరం, కామరాజర్ సాలై, శాంతోమ్ రోడ్డు, అడయార్, తిరువాన్మీయూర్, ఓఎంఆర్, ఈసీఆర్ రోడ్డు, తాంబరం, వండలూరు – కేలంబాక్కం మార్గాల్లో జోరుగా ఈ రేసింగ్ సాగుతున్నట్టు చెప్పవచ్చు. ప్రమాదం జరిగినప్పుడు రేసింగ్ వ్యవహారం బయటకు వస్తుండగా, మిగిలిన సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా పందేలు కాసుకుంటూ దూసుకెళ్తోన్నారు. అలాగే, ఏదేని అతి పెద్ద ప్రమాదం అన్నది జరిగినప్పుడు మాత్రం నగర పోలీసు యంత్రాంగం మేల్కొని బైక్ రేసింగ్‌పై కొరడా ఝుళిపించడం పరిపాటే. వంద మంది అరెస్టు .... బైక్ రేసింగ్‌లకు కల్లెం వేయడం, విద్యార్థులు, యువత బైక్ జోరుకు బ్రేక్‌లు వేయడం లక్ష్యంగా తమకు చిక్కే వారిని నాన్ బెయిల్ సెక్షన్ల కింద అరెస్టు చేయాలని పోలీసులు నిర్ణయించినా, అది అమల్లో విఫలం కాక తప్పడం లేదు. ఎవరైనా పట్టుబడితే చాలు సిఫారసులు ఎక్కువే. చివరకు వారిని వదలి పెట్టాల్సిన పరిస్థితి అనేక పోలీసుల స్టేషన్ల పరిధిలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి అన్నా సాలైం, రాయపురం, రాయపేట, మెరీనా తీరం పరిసరాల్లో బైక్ రేసింగ్‌కు పెద్ద ఎత్తున యువత సన్నాహాలు చేసి ఉన్నట్టుగా మైలాపూర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆయా మార్గాల్లో పోలీసులు మాటేశారు. అక్కడక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఆయా మార్గాల్లో జట్టులు జట్టులుగా దూసుకొచ్చిన కుర్ర కారు మీద కొరడా ఝుళిపించారు. కొందురు అయితే, తప్పించుకు వెళ్లారు. మరి కొందరు పోలీసులకు చిక్కారు. సుమారు వంద మందిని అరెస్టు చేసిన పోలీసులు, యాభైకు పైగా బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కొందరు తప్పించుకు వెళ్లడంతో సీసీ కెమెరాల దృశ్యాల మేరకు ఆయా వాహనాల నంబర్ల ఆధారంగా పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. పట్టుబడ్డ వారిని బుధవారం ఉదయం పోలీసులు బెయిల్‌పై విడుదల చేశారు. అయితే, వారి బైక్‌లను మాత్రం ఇవ్వలేదు.అందరి మీద కేసులు నమోదు చేసి, కోర్టు విచారణను ఎదుర్కొని, అక్కడ బైక్‌లను తీసుకోండన్నట్టుగా సూచించి పంపించారు. దీంతో ఆ విద్యార్థులు బైక్‌లను పోలీసు స్టేషన్ల వద్దే వదలి పెట్టి కోర్టు విచారణల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సిన పరిస్థితి. ఈ బైక్‌లలో అత్యధికం విలువైనవి కావడంతో వాటికి సంబంధించిన యువతలో ఆందోళన తప్పడం లేదు. తమ బైక్‌ల కోసం పోలీసుస్టేషన్ల వద్దే వారు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. -
ప్రాణాలను పణంగా పెట్టి బైక్ రేసింగ్
తమ ప్రాణాలను పణంగా పెట్టి అతివేగంతో వారు ఆడిన ఆట తమలో ఒకడిని మృత్యుఒడికి చేర్చింది.. పుట్టిన రోజు సంబరాలు వారిలో ఒకరి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. అతివేగం ప్రమాదకరం, నిదానమే ముద్దు.. వేగం వద్దు అంటూ ప్రభుత్వం, అధికారులు ఎంత ప్రచారం చేస్తున్నా.. యువత వినడం లేదు. వేగంలోనే మజా ఉందంటూ, స్పీడ్ బైక్‌లపై రయ్యని దూసుకుపోతూ మృత్యు ఒడికి చేరుతున్నారు. రామవరప్పాడు సమీపంలో బుధవారం జరిగిన బైక్ రేసింగ్ ఒకరి కుటుంబంలో విషాదం నింపింది.. సాక్షి, ఆటోనగర్(విజయవాడతూర్పు), రామవరప్పాడు: అతివేగం ఒకరిపాలిట యమపాశం అయింది. రామవరప్పాడు సమీపంలో బుధవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తవంతెన దుర్గా అగ్రహారానికి చెందిన బుర్ర అజయ్(19), దోమల యశ్వంత్(22), వాంబేకాలనీకి చెందిన గుత్తికొండ నాగరాజు(23), కుందావారి కండ్రికకకు చెందిన వందల దుర్గాప్రసాద్(23) నలుగురు స్నేహితులు. వీరిలో దుర్గాప్రసాద్ పుట్టినరోజు కావడంతో మిత్రులంతా కలిసి ద్విచక్ర వాహనంపై ఎనికేపాడు వరకూ వెళ్లి వేడుక జరుపుకొన్నారు. తిరిగి విజయవాడకు బయల్దేరుతూ ఎవరు ముందు వెళ్తారోనని పందెం వేసుకొని ఒకరినొకరు అతివేగంతో రెండు వాహనాలపై వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో రామవరప్పాడు సమీపంలోకి వస్తుండగా ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్న పిచ్చయ్య హోటల్ వద్ద డివైడర్‌ను బలంగా ఢీకొట్టారు. ఘటనలో నలుగురు కింద పడ్డారు. అజయ్ డివైడర్ ఇనుపచువ్వలు బలంగా గుచ్చుకుని, అక్కడికక్కడే మృతిచెందాడు. మిగిలిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు ఫోన్‌చేసి సమాచారం అందించగా వారు వచ్చి క్షతగాత్రులందరికి చికిత్సనిమిత్తం ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. అజయ్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెరీనా తీరంలో బైక్ రేసింగ్.. ఇద్దరు మృతి
చెన్నై : తమిళనాడులోని చెన్నై మెరీనా తీరంలో బైక్ రేసర్ల హల్చల్ చేశారు. బీచ్ రోడ్డులో అర్ధరాత్ని దాటక పలువురు యువకులు బైక్ రేసులు నిర్వహించారు. ఈ క్రమంలో బైక్‌పై నుంచి జారిపడ్డ ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. అయితే బైక్ రేస్‌లకు అనుమతి లేకపోయినప్పటికీ.. నిబంధనలను అతిక్రమిస్తూ మెరీనా తీరంలో దొంగచాటుగా బైక్ రేసుల నిర్వహించటం పరిపాటిగా మారింది. వీటిపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి బైక్ రేస్‌లు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ముగ్గురు ప్రాణాలు తీసిన బైక్ రేస్
సాక్షి, శ్రీకాకుళం: పుట్టిన రోజునాడు బైక్ రేస్‌లో పాల్గొనాలన్న యువకుల సరదా.. వారి ప్రాణాలు తీయడంతో పాటు ఎదురుగా వస్తున్న మరో వ్యక్తిని పొట్టనపెట్టుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాలు.. శ్రీకాకుళం నగరంలో కస్పావీధికి చెందిన దువ్వు హిమశేఖర్ (19) పుట్టినరోజు సందర్భంగా బుధవారం రాత్రి స్నేహితులంతా కలిసి పార్టీ చేసుకున్నారు. గురువారం వేకువజామున కళింగపట్నం బీచ్‌కు వెళ్తామంటూ స్నేహితులంతా బయల్దేరారు. హిమశేఖర్ బైక్‌పై అతని మిత్రుడు బెహరా తేజేశ్వరరావు (19) ఉన్నాడు. మార్కెట్లో సరుకులు కొనేందుకు గార మండలం తూలుగు గ్రామానికి చెందిన వ్యాపారి దామోదర శ్రీనివాసరావు (35), కలాసీ లింగబరి బోడయ్య ద్విచక్రవాహనంపై ఎదురుగా వస్తున్నారు. చల్లపేట జంక్షన్ వద్ద రెండు వాహనాలు ఢీకొనడంతో దామోదర్ శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొనఊపిరితో ఉన్న హిమశేఖర్, తేజేశ్వరరావు, బోడయ్యలను హిమశేఖర్ స్నేహితులు రిమ్స్‌కు తరలించారు. మార్గమధ్యంలోనే హిమశేఖర్ మృతి చెందాడు. పరిస్థితి విషమంగా ఉన్న తేజేశ్వరరావును కుటుంబ సభ్యులు జెమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. హిమశేఖర్, అతడి స్నేహితులు రాత్రి వేళల్లో పెట్రోలు దొంగతనం చేసి జల్సా చేయడానికి అలవాటు పడ్డారని పోలీసులు గుర్తించారు. వాంబే కాలనీలో ఓ ఇంటి నుంచి దొంగిలించిన కోడిని ఎవరికి దక్కాలనే దానిపై వీరంతా పందెం పెట్టుకున్నారు. ముందుగా కళింగపట్నం బీచ్‌కు చేరుకున్న వారికే కోడి దక్కేలా బైక్ రేసు పెట్టుకున్నారు. అతివేగంగా వెళుతూ చల్లపేట జంక్షన్ వద్ద ప్రమాదం బారిన పడ్డారు. బైక్ రేస్‌లో పాల్గొన్న హిమశేఖర్, తేజేశ్వరరావుతో పాటు వ్యాపారి శ్రీనివాసరావు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. విచారణలో భాగంగా 13 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. -
మెరుపు వేగం.. గెలుపు దాహం!
ఆ కుర్రాడు బైక్ ఎక్కాడంటే వాయువేగంతో దూసుకుపోవాల్సిందే. ప్రత్యర్థులు చిత్తు కావాల్సిందే. చాంపియన్‌షిప్ కొట్టాల్సిందే. చిన్నవయసులోనే జాతీయ, అంతర్జాయతీ స్థాయిలో పోటీల్లో జయకేతనం ఎగరవేస్తూ తెలంగాణకే వన్నె తెస్తున్నాడు నగరానికి చెందిన కార్తీక్ మాతేటి. గల్లీలో ప్రారంభమైన అతని ప్రస్థానం అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకునే స్థాయికి చేరింది. 19 ఏళ్ల వయసులో మూడు నేషనల్ చాంపియన్‌షిప్‌లు, ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుని వారెవ్వా అనిపించుకున్నాడు కార్తీక్. హిమాయత్‌నగర్ :చింతల్‌కు చెందిన సతీష్‌కుమార్, విజయలక్ష్మి దంపతుల కుమారుడు కార్తీక్. ప్రస్తుతం సోమాజిగూడలోని రూట్స్ కాలేజీలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బైక్ రేసింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండటంతో రేసర్ కావాలనే కలలు కన్నాడు. అతను ఉండే గల్లీలో నిదానంగా హోండా యూనికార్న్‌తో బైక్ నడపడం నేర్చుకున్నాడు. ప్రొఫెషనల్‌గా తయ్యారయ్యేందుకు మూడేళ్ల సమయం పట్టింది. గల్లీలో ప్రారంభమైన తన ప్రస్థానం ఇటీవల ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ బైక్ రేసింగ్‌లో భారత్ తరఫున పాల్గొని చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. అంతర్జాతీయ రేసింగ్‌లో సత్తా.. గత ఏడాది నవంబర్‌లో ఢిల్లీలో జరిగిన ‘ఏషియన్ కప్ ఆఫ్ రోడ్స్ రేజింగ్’ చాంపియన్‌షిప్ పోటీల్లో జపాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఫిలిప్పీన్, థాయ్‌లాండ్‌ల నుంచి ఇద్దరేసి చొప్పున పాల్గొన్నారు. మన దేశం నుంచి అదీ తెలుగు రాష్ట్రాల నుంచి కార్తీక్, మిజోరం నుంచి కుల్స్వామిలుపాల్గొన్నారు. 5.5 కి.మీ రేసింగ్ ట్రాక్‌పై పోటీలు నిర్వహించగా.. కార్తీక్ విజయం సాధించాడు. దీంతో ‘ఏషియన్ కప్ ఆఫ్ రోడ్స్ రేసింగ్’ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుని తెలుగోడి సత్తాను చాటాడు. మూడు నేషనల్స్‌లోనూ టాప్.. దేశవ్యాప్తంగా నిర్వహించిన మూడు చాంపియషిప్లలో కార్తీక్ విజయ కేతనం ఎగరవేశాడు. గత ఏడాది ఫిబ్రవరిలో చెన్నైలో ‘ఎండ్యురెన్స్’ చాంపియన్‌షిప్‌లో 3.7 కి.మీ ట్రాక్‌పై 19 నిమిషాల పాటు ఏకధాటిగా రేసింగ్ చేసి టైటిల్ సాధించాడు. టీవీఎస్ వన్ మేక్ 150–సీసీ చాంపియన్షిప్ని, యమహా– ఆర్15 చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన పల్సర్ కప్‌లో వరసగా రెండేళ్లు రుయ్మంటూ మనోడే టాప్‌లో నిలిచాడు. స్ఫూర్తి వలంటీనో.. నాకు ఇటాలియన్ బైకర్ వలంటీనో అంటే చాలా ఇష్టం. అతని వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. అతి పిన్న వయసులో మూడు నేషనల్ చాంపియన్‌షిప్‌లతో పాటు ఒక ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నా. భవిష్యత్‌లో జరిగే ప్రతి ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని తెలంగాణ సత్తా చాటుతా. – కార్తీక్ -
రేసర్.. సాయిధర్..
పశ్చిమగోదావరి,జంగారెడ్డిగూడెం: జిల్లాకు చెందిన సాయిధర్ను రేసర్ కావాలనే అతని ఆసక్తి టాలెంట్ హంట్ టెస్ట్‌లో ఫైనల్ వరకు తీసుకువెళ్లింది. చిన్నతనం నుంచి రేసింగ్‌పై మక్కువ ఉన్న అతను హోండా–టెన్10 రేసింగ్ అకాడమీ నిర్వహిస్తున్న 2018 హోండా టాలెంట్ హంట్ టెస్ట్‌కు వెళ్లి సత్తాచాటాడు. ఫైనల్ పోరులోనూ పాల్గొన్నాడు. వివిధ దశలో ఫైనల్ జరిగింది. ప్రస్తుతం అతను ఫైనల్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఫైనల్లో విజేతగా నిలిస్తే రేసింగ్ అకాడమీకి ఎంపికవుతాడు. దీంతో జాతీయ స్థాయిలో రేసింగ్ పోటీలకు పాల్గొనేందుకు మార్గం సుగమం అవుతుంది. ఏలూరుకు చెందిన 18 ఏళ్ళ దాసరి సాయిధర్ ఆల్ ఇండియా లెవల్ హోండా ఇండియా టాలెంట్ హంట్ టెస్ట్‌లో ఫైనల్ క్వాలిఫయింగ్ పూర్తిచేశాడు. గత నెల 27 నుంచి చెన్నై ఇరున్గటుకొట్టాయ్లోని మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ రేస్ ట్రాక్‌లో జరిగిన ఫైనల్ పోటీల్లో ప్రతిభ చాటాడు. వివిధ దశల్లో హోండా టాలెంట్ హంట్ టెస్ట్ మూడు దశలలో జరుగుతుంది. మొదటి దశలో రాష్ట్రస్థాయిలో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. రెండో దశలో డ్రైవింగ్ స్కిల్స్, ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. మూడో స్టేజ్‌లో రేస్ ట్రాక్‌పై పోటీ నిర్వహిస్తారు. తొలి క్వాలిఫయింగ్ ఎగ్జామ్‌లో భాగంగా సాయిధర్ ఆన్లైన్ పరీక్షను పూర్తిచేసి రెండో క్వాలిఫయింగ్ ఎంపికయ్యాడు. ఈనెల 18న తెలంగాణ రాష్ట్రం షామీర్పేట్లో జరిగిన రెండో క్వాలిఫయింగ్‌లో 16 మందితో పోటీ పడి విజేతగా నిలిచాడు. మొత్తం ఐదు రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొనగా రాష్ట్రానికి ఒకరు చొప్పున ఎంపిక చేశారు. వీరిలో 4వ వాడిగా సాయిధర్ రాష్ట్రం నుంచి ఎంపికయ్యాడు. 27వ తేదీ నుంచి చెన్నై ఇరున్గటుకొట్టాయ్లోని మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ రేస్ ట్రాక్‌లో జరుగుతున్న పోటీల్లో పాల్గొన్నాడు. ఈ పోటీలో మొత్తం 9 మంది పాల్గొనగా, ప్రస్తుతం సాయిధర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాలు అనంతరం హోండా టెన్10 రేసింగ్ అకాడమీకి ఐదుగురిని ఎంపిక చేస్తారు. ఇదీ నేపథ్యం ఏలూరులో పుట్టి పెరిగిన సాయిధర్ ఆదిత్య డిగ్రీ కళాశాలలో బీబీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి గిరిధర్ పోలీస్‌శాఖలో పనిచేస్తున్నారు. సాయిధర్ చిన్నతనం నుంచి బైక్ రేస్‌లపై ఎక్కువగా ఆసక్తి చూపించేవాడు. ఖాళీ సమయాల్లో టీవీలో ఎక్కువగా బైక్ రేస్‌లను చూస్తుండేవాడు. క్రమేపీ ఆ ఆసక్తి అతను బైక్ సంబంధిత గేమ్స్ వైపు మళ్ళింది. ఇదే సమయంలో మోటార్ బైక్‌ను నేర్చుకోవడం, బైక్ నడపటంలో నైపుణ్యతను సాధించాడు. ఇది గమనించిన సాయిధర్ సోదరుడు శశిధర్ తమ్ముడిని మరింత ప్రోత్సహించాడు. ఎప్పటికైనా జాతీయా స్థాయిలో మంచి రేసర్‌ని కావాలనే తన ఉద్దేశాన్ని సోదరుడికి తెలపడంతో తమ్ముడిని ప్రోత్సహించాడు. గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన సమ్మర్ కోచింగ్ క్యాంప్‌కి పంపించాడు. అక్కడ సాయిధర్ ఫిజికల్ ట్రైనింగ్, టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నాడు. అయితే జాతీయ స్థాయి రేసర్ కావాలంటే అతనికి రేసింగ్ లైసెన్స్ ఉండాల్సి రావడంతో అకాడమీకి పంపాలని యోచన చేశాడు. ఇదే సమయంలో హోండా టెన్10 రేసింగ్ అకాడమీ రేసింగ్‌పై ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇచ్చే నిమిత్తం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆన్లైన్ ప్రకటన ఇచ్చింది. దీంతో సాయిధర్ దరఖాస్తు చేసుకుని పోటీల్లో పాల్గొన్నాడు. మంచి రేసర్నికావాలనేదే లక్ష్యం నాకు బైక్ రేసులంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి బైక్ రేసులను ఎక్కువగా చూసేవాడిని. గేమ్స్ కూడా ఆడేవాడిని. వాటిలో ఉన్న కొద్ది మెలకువలతో నేను బైక్‌ను నేర్చుకున్నాను. నాకున్న ఆసక్తికి నా తండ్రి గిరిధర్, సోదరుడు శశిధర్లు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ప్రస్తుతం అకాడమీలో చేరేందుకు పోటీకి హాజరయ్యాను. ఎప్పటికైనా జాతీయ స్థాయిలో మంచి రేసర్‌గా గుర్తింపు పొందాలనేది నా లక్ష్యం. –సాయిధర్, రేసర్ -
రేసింగ్‌తో రెచ్చిపోయిన విద్యార్థులు
హైదరాబాద్: మలక్‌పేట-దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై యువకులు బైక్ రేస్‌తో రెచ్చిపోయారు. ఓ బుల్లెట్ వాహనం, మరో ద్విచక్రవాహనంపై కొందరు విద్యార్థులు ట్రిపుల్ రైడింగ్‌తో రేస్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో మరో ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొనడంతో ఆ వాహనంపై ఉన్న వ్యక్తి కిందపడి స్పృహ కోల్పోయాడు. విద్యార్థులు సంఘటన స్థలం నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న మలక్‌పేట పోలీసులు స్పృహ కోల్పోయిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించచారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. -
బైక్ రేసింగ్: అదుపులో 14 మంది
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బైక్ రేసింగ్‌లతో కుర్రాళ్లు రెచ్చిపోయారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ తోటి ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేశారు. రేసింగ్‌లకు పాల్పడుతున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారి బైక్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో కొందరు మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం. -
హైదరాబాద్‌లో బైక్ రేస్‌లు:9 బైక్‌లు సీజ్
-
బైక్ రేసింగ్.. ఇద్దరి మృతి
రాజంపేట(వైఎస్సార్‌జిల్లా): కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి బైక్ రేసింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా రాజంపేటలో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగింది. బైక్ రేసింగ్ లో పాల్గొన్న మూడు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొనడంతో.. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రాజంపేటలో బైక్‌లు ఢీ, ఇద్దరు మృతి
-
కిల్లింగ్..రేస్!
తిరుపతిలో విచ్చలవిడిగా బైక్ రేసింగ్ వీకెండ్లో రెచ్చిపోతున్న యువత సంపన్నవర్గాల వారే అధికం తిరుపతి క్రైం: తిరుపతిలో బైక్ రేసింగ్ లు విచ్చలవిడిగా సాగుతున్నారుు. నగరానికి చుట్టుపక్కల ఉన్న బైపాస్ రోడ్లపై యథేచ్ఛగా చక్కర్లు కొడుతున్నారు. సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు వారాంతపు రోజుల్లో నగర సరిహద్దులు, శివార్లలో రేస్‌లు ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రోడ్డుపై వెళుతున్న సామాన్య జనాలనూ ప్రమాదాలబారిన పడేస్తున్నారు. పట్టణంలో వరుసగా జరుగుతున్న వివిధ రోడ్డు ప్రమాదాలకు ఈ రేసింగులూ కారణమేనన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నారుు. వీకెండ్లో జోరు శుక్ర, శని, ఆదివారాల్లో ఎక్కువగా బైక్‌రేసింగ్‌లు జరుగుతున్నారుు. ఎరుుర్ బైపాస్‌రోడ్డు, మంగళం రోడ్డు, జూపార్క్ రోడ్డు, శ్రీనివాస కల్యాణ మండపం రోడ్డు నుంచి తిరుచానూరు వరకు, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారుల్లో ఈ పోటీలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాత్రి పూటే ఎక్కువ కొందరు యువకులు బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా బయలుదేరుతారు. పందెంలో పాల్గొనే వారు గేమ్ పగలా.. రాత్రా అనేది ముందే డిసైడ్ చేసుకుంటారు. రాత్రి వేళ అరుుతే ఎవరూ పట్టించుకోరన్న నెపంతో రేస్‌లు ఆడుతున్నారు. పందెంలో పాల్గొనే వారు ఒక్కొక్కరు రూ.10 వేలు చెల్లించాలి. ఈ గేమ్‌లో గెలిస్తే కట్టిన దానికంటే రెట్టింపు డబ్బు వస్తుంది. ఖరీదైన బైకులు ఈ రేసుల్లో పాల్గొనే వారు ఖరీదైన స్పోర్ట్స్ బైక్‌లే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొందరు యువకులైతే హెల్మెట్, గ్లౌజులు ధరించి రేజింగ్కు హాజరవుతున్నారు. పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అందరూ బడా బాబులేనా? ఈ రేసింగ్‌లో పాల్గొంటున్న వారందరూ సంపన్నులు, పారిశ్రామిక కుమారులే కావడం గమనార్హం. వీరందరూ కేవలం రేసింగ్‌పై మోజుతోనే పాల్గొంటున్నారు. ఈ బైక్ రేస్ గెలుపొందిన డబ్బులతో వీకెండ్ పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం రేసింగ్‌లో పాల్గొంటున్న వారేకాక రోడ్డుపై వెళ్లే సామాన్య ప్రజల ప్రాణాలతో వీరు చెలగాటమాడుతున్నారు. రేసింగ్ జరగడం లేదు నగరంలో బైక్ రేస్‌లు జరగడంలేదు. కొందరు యువకులు 200 సీసీ వాహనాలతో అధిక స్పీడ్‌తో వెళుతున్నారు. ఆ సమయంలో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినా సదరు యువకులు ప్రమాదానికి గురికావడం, ఎదుటవారిని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. వారిని నియంత్రించేందుకు పోలీసులు సామరస్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. - డాక్టర్ ఓ.దిలీప్‌కిరణ్, ట్రాఫిక్ డీఎస్పీ -
కిడ్నీని మింగిన బైక్ రేసింగ్!
- కింద పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకుడు - ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాటం హైదరాబాద్: భాగ్యనగరంలో మైనర్ల డ్రంకన్ డ్రైవ్‌కు, బైక్ రేసింగ్‌లకు చెక్ పడడం లేదు. రమ్య, సంజన ఉదంతాలు మరవక ముందే తాజాగా జరిగిన మరో ఘటనలో ఓ యువకుడు కిడ్నీ పోగొట్టుకొని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పుట్టిన రోజు పార్టీలో మద్యం తాగి, ఆ తర్వాత బైక్ రేసింగ్ చేస్తూ ఈ యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. వివరాలివీ.. ఆర్కే పురంలో నివసించే వంశీ(18) తన జన్మదినం సందర్భంగా ఈ నెల 10న అర్ధరాత్రి తన మిత్రులతో కలసి విందు చేసుకున్నాడు. కొత్తపేటకు చెందిన రేవంత్(16), నవాజ్ సహా మరో పది మంది మిత్రులతో నెక్లెస్ రోడ్లో కేక్ కట్ చేసి అనంతరం మద్యం సేవించారు. తర్వాత అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్దకు చేరుకున్నారు. వాహనాలపై వేగంగా దూసుకుపోతున్న క్రమంలో నవాజ్ వాహనం అదుపు తప్పి పడిపోయింది. దీంతో వెనుక సీట్లో కూర్చున్న రేవంత్ కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతడిని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తు తం రేవంత్ పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు అతడి కిడ్నీని తొలగించారు. మైనర్లకు మద్యం సరఫరా చేసిన షాపు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలం టూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన రేవంత్ తండ్రి సుభాష్ చంద్రబోస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనర్లు బైక్ రేసింగ్‌కు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
రాచకొండ గుట్టల్లో బైక్ రేసింగ్
36 వాహనాలు స్వాధీనం మంచాల: రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన రాచకొండ గుట్టల్లో బైక్ రేసింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. 36 బైక్‌లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎంఆర్ఎఫ్ మో గ్రీప్‌ర్యాలీ ఆఫ్ హైదరాబాద్ 2016 పేరుతో నేషనల్ ర్యాలీ చాంపియన్ షిప్ (బైక్ రేసింగ్) నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిందని మంచాల సీఐ గంగాధర్ తెలిపారు. తిప్పారుుగూడ-తాళ్లపల్లిగూడ, ముక్కునూర్ గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా రేసింగ్ నిర్వహిస్తున్నారని చెప్పారు. అడవి ప్రాంతంలో రాత్రిపగలు పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. సీఐ గంగాధర్ ఎస్ఐ రాంబాబు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బైక్ రేసింగ్‌ను అడ్డుకున్నారు. బైక్ రేసింగ్‌కు నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాల్సి ఉండగా, ఎలాంటి అనుమతులు తీసుకోలేదని గంగాధర్ తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 53 మంది ఈ రేసింగ్‌లో పాల్గొన్నారని చెప్పారు. ఇప్పటికే నాలుగు రౌండ్ల పోటీలు పూర్తయ్యాయని, ఒక రౌండ్ మాత్రమే మిగిలి ఉందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. బైక్ రేసింగ్‌లో ఐదుగురు యువతులు కూడా ఉన్నారు. రేసింగ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
బైక్ రేసింగ్ వల్లే ఆ ప్రమాదం?
రెండు మోటారు సైకిళ్ల ఢీ ఘటనలో కొత్త కోణం ప్రమాదంలో మరో వ్యక్తి ఉన్నట్టు గుర్తింపు రావులపాలెం: రావులపాలెం కెనాల్ రోడ్డులో గురువారం ఇద్దరి మృతికి కారణమైన రెండు మోటారు సైకిళ్ళ ఢీ ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన పడాల సత్యవెంకటసాయిబాబారెడ్డి(34) తన ఇద్దరు కుమార్తెలతో మోటారు సైకిల్‌పై స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన గొలుగూరి కోమల సాయి తేజ వినయ్‌కాంత రెడ్డి(18) మోటారు సైకిల్‌పై వస్తూ ఢీకొనడంతో ఇద్దరూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో వినయ్ కాంత రెడ్డి ఒక్కడే మోటాటరు సైకిల్‌పై ఉన్నట్టు తొలుత పోలీసులు భావించారు. అయితే బైక్ రేసింగ్ చేస్తూ అతి వేగంతో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఊబలంక రోడ్డులో ఉన్న ఒక సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా వినయ్‌కాంత రెడ్డి మోటార్‌సైకిల్‌పై మరో వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. ఆ వ్యక్తి గ్రామానికి చెందిన కర్రి అజయ్‌కుమార్‌రెడ్డి అని, అతనే మోటారుసైకిల్ నడపగా వినయ్కాంతరెడ్డి వెనుక కూర్చున్నట్టు ఆ వీడియోలో తేలింది. వారు ఊబలంక వైపు నుంచి రావులపాలెం వైపు వస్తున్నట్టు ఆ వీడియోలో పోలీసులు గుర్తించారు. దీనిపై ఎస్సై పీవీ త్రినాథ్‌ను వివరణ కోరగా కర్రి అజయ్‌కుమార్‌రెడ్డి మోటారు సైకిల్ నడుపుతున్నట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు. అతనికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయయని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. బైక్ రేసింగే కారణమా? బైక్ రేసింగే ఈ ప్రమాదానికి కారణమనే ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా రెండు మోటారు సైకిళ్లు ఢీకొంటే ఈ స్థాయిలో ప్రాణ నష్టం ఉండదని, మితి మీరిన వేగంతో వాహనాలు ఢీకొంటేనే ఈ స్థాయిలో ప్రమాదం జరుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వినయ్‌కాంత రెడ్డి మోటారు సైకిల్ అధిక సీసీ కలిగిన స్పోర్ట్స్ బైక్ వంటిది కావడంతో రేసింగ్ జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామంలో బైక్ రేసింగ్ జరుగుతున్నట్టు ఆరోపణ లు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆయా ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి దీనికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
అమ్మో... అమ్మాయిలు!
ప్రమాదకరంగా బైక్ రేసులు అదుపు తప్పుతున్న వినోదం బీచ్ రోడ్డులో విహారం విశాఖలో కొత్త సంస్కృతికి తెరలేస్తోంది. స్మార్ట్ సిటీగా మారుతున్న తరుణంలో యువతుల ధోరణిలో మార్పు వస్తోంది. ఇన్నాళ్లూ యువకులు, విద్యార్థులకే పరిమితమైన బైక్ రేసింగ్ తాజాగా విద్యార్థినులు, యువతులకు ఫ్యాషన్‌గా మారింది. ఇది ఒకింత ఆశ్చర్యానికి గురి చేసినా ఇప్పుడిప్పుడే మన మహానగరంలో ఈ నూతన విష సంస్కృతి ప్రబలుతోంది. విశాఖపట్నం : బైక్, కారు రేసింగ్‌తో కొంతమంది యువతరం ఆనందం పొందుతుంది. సంపన్న వర్గాల పిల్లలకు ఇలాంటి వాటిపై మోజు అధికంగా ఉంటుంది. పేద, మధ్య తరగతి వారి పిల్లలకు అలాంటి సరదా ఉన్నా తీరే పరిస్థితి ఉండదు. అందువల్ల అలాంటి కోరికలను ఆదిలోనే తుంచేసుకుంటారు. అయితే విశాఖ నగరంలో స్థితిమంతులకు కొదవ లేదు. అలాంటి వారిలో కొంతమంది పిల్లలు, కొన్ని పేరున్న కళాశాలల్లో చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులు బైక్, కారు రేసుల్లో పాల్గొంటున్నారు. భీమిలి, ఐఎన్ఎస్ కళింగ, రుషికొండ, రామానాయుడు స్టూడియో, మధురవాడ-బావికొండ రోడ్డు, మారికవలస-తిమ్మాపురం బీచ్‌రోడ్డు, ఐటీ సెజ్, సాగర్‌నగర్, తొట్లకొండ తదితర ప్రాంతాలతో పాటు బీచ్‌రోడ్డులోనూ రేసింగ్‌లకు అనువైనవిగా ఎంచుకుంటున్నారు. గతంలో శని, ఆదివారాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించే వారు. కొన్నాళ్ల నుంచి వీకెండ్ వరకు ఆగకుండా వీలు చిక్కినప్పుడల్లా రయ్‌మంటూ రేసుగుర్రాల్లా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా పున్నమి వెన్నెల వేళల్లో మరింతగా చెలరేగిపోతున్నారు. ‘అదుపు’ తప్పుతున్న యువతులు.. ప్రస్తుతం యువకుల మాదిరిగానే కొంతమంది యువతులు, విద్యార్థినులు కూడా బైక్, కారు రేసులకు నడుం బిగించి ‘అదుపు’ తప్పుతున్నారు. మగపిల్లలతో సమానంగా బైకులతో ఫీట్లు కూడా చేస్తున్నారు. ఖరీదైన కార్లు, ఎక్కువ పికప్ ఉన్న బైకులతో చిత్ర, విచిత్రమైన రీతిలో విన్యాసాలు చేస్తున్నారు. ఆయా కాలేజీల నుంచి ఇళ్లకు బయల్దేరాక చీకటి పడేదాకా అక్కడా, ఇక్కడా షికార్లు కొడుతున్నారు. ఆ తర్వాత ట్రాఫిక్ రద్దీ తగ్గాక రోడ్లపైకి వస్తున్నారు. ఐదారుగురు ఏకమై గ్రూపుగా రేస్‌లకు దిగుతున్నారు. వీరిని ప్రోత్సహించడానికి కొందరు వారిపై బెట్టింగ్‌లు కూడా కాస్తున్నారు. ఇలా రేస్‌లో గెలిచిన సొమ్ముతో అంతా కలిసి జల్సా చేస్తున్నారు. కొందరు అమ్మాయిలూ, అబ్బాయిలూ కలిసి పాల్గొంటున్న వారూ ఉన్నారు. ఒకరికొకరు కేరింతలు కొడుతూ బైక్‌లపై ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. అంతేకాక ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న యువతులు కూడా ఉంటున్నారన్న వాస్తవం పోలీసులను విస్మయ పరుస్తోంది .ఇలా రేసింగ్ చేస్తూ ప్రమాదాల పాలవుతున్న సంఘటనలూ జరుగుతున్నాయి. ప్రమాదాల్లో గాయపడడం, ప్రాణాలు పోగొట్టుకోవడం వంటివి ఇటీవల సంభవిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వీరి ఆగడాలకు ఇతర వాహన చోద కులూ ప్రమాదాలకు గురవుతున్నారు. పోలీసులకూ తెలుసు.. యువకులు, విద్యార్థులే బైక్, కారు రేసుల్లో పాల్గొంటున్నారని పోలీసులకు తెలుసు. అప్పుడప్పుడు సెట్ల ద్వారా వీరెక్కడ రేసుల్లో పాల్గొంటున్నారో తెలుసుకుని అప్రమత్తమవుతున్నారు. అయితే వీరిలో రాజకీయ కుటుంబాల వారో, సంపన్న వర్గాల పిల్లలో ఉండడం వల్ల కేసులు నమోదయ్యే పరిస్థితి ఉండడం లేదు. దాదాపు రెండేళ్ల క్రితం పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో రేసు కారులో దూసుకెళ్తూ ఒకరి మృతికి కారణమైన ఘటనలో నిందితుడిని తప్పించారన్న ఆరోపణతో అప్పటి ట్రాఫిక్ ఎస్ఐని పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కొన్నాళ్ల క్రితం ఇలా రేసింగ్‌లకు పాల్పడుతున్న సుమారు 30 మంది కాలేజీ విద్యార్థులు పోలీసులకు పట్టుబడ్డారు. చాలా సందర్భాల్లో ఇలాంటి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెడుతున్నారు. అరికట్టడానికి సీసీ కెమెరాలు.. రోజురోజుకూ విశాఖలో బైక్, కారు రేసుల సంస్కృతి పెరగడం, దానికిప్పుడు యువతులు, కాలేజీ విద్యార్థినులు కూడా తోడు కావడంతో పోలీసులు ఏం చేయాలన్న ఆలోచనలో పడ్డారు. రేసులకు అనువుగా ఉన్న సుమారు 10 ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా కొంతవరకు రేస్‌లు జరగకుండా అరికట్టవచ్చని పోలీసుల వాదన. -
విద్యార్థిని బలిగొన్న బైక్ రేసింగ్
హైదరాబాద్: బైక్ రేసింగ్ ఓ బీటెక్ విద్యార్థిని బలిగొంది. వేగంగా వెళుతున్న బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. నగరంలో ఈదీబజార్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ పురాఖాన్ (22), మొగల్పురాకు చెందిన మహ్మద్ ఇర్షాద్ అహ్మద్ (22) స్నేహితులు. నిజాం ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. బుధవారం తెల్లవారుజామున నమాజ్ అనంతరం ఇర్షాద్ అహ్మద్ స్పోర్ట్స్ బైక్‌పై పురాఖాన్తో కలసి ఇంటికి వచ్చాడు. అనంతరం ఇద్దరూ నల్లగొండ క్రాస్‌రోడ్ ఫ్లై ఓవర్‌పై బైక్ రేసింగ్ చేస్తూ డివైడర్‌ను ఢీకొట్టారు. తీవ్రగాయాలు కావడంతో బైక్ వెనుక కూర్చున్న పురాఖాన్ అక్కడికక్కడే చనిపోయాడు. బైక్ నడుపుతున్న ఇర్షాద్ అహ్మద్కూ తీవ్ర గాయాలయ్యాయి. ఇతడు మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లు... పోలీసుల దాడులు
హైదరాబాద్ : అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువకులకు బంజారాహిల్స్ పోలీసులు చెక్ పెట్టారు. శనివారం అర్ధరాత్రి పలువురు యువకులు జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ ప్రాంతంలో రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులకు దిగారు. 25 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 25 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఆ తర్వాత వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సదరు యువకులు తల్లిదండ్రులను స్టేషన్‌కి పిలిపించి... వారి... సమక్షంలో యువకులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. -
బైక్ రేసింగ్ : పోలీసుల అదుపులో యువకులు
హైదరాబాద్ : మేడ్చల్‌లో బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న14 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సదరు యువకుల తల్లిదండ్రులకు పోలీసులకు సమాచారం అందజేశారు. ఆ క్రమంలో యువకులకు.... వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆర్థరాత్రుళ్లు ఔటర్ రింగ్ రోడ్డుపై యువకులు బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. -
పోలీసుల అదుపులో 250 మంది బైక్ రేసర్లు
నెక్లెస్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున బైక్ రేసింగ్‌లకు పాల్పడిన 250 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 250 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కావడంతో పోటాపోటీగా విపరీతమైన వేగంతో బైక్‌లు నడుపుతుండడంతో రామ్‌గోపాల్‌పేట, లేక్ పోలీసులు సంయుక్తంగా డ్రైవ్ నిర్వహించారు. సైఫాబాద్ ఏసీపీ సురేందర్, అడిషినల్ ఇన్స్పెక్టర్ జానయ్య, లేక్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, 50 మంది సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి... నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్, లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకూ ఈ కార్యక్రమం జరిగింది. అదుపులో తీసుకున్న 250 మందిలో 100 మంది మైనర్లు ఉన్నారు. వీరికి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. -
అర్ధరాత్రి బైక్ రేసింగ్
-
అర్ధరాత్రి బైక్ రేసింగ్
హైదరాబాద్ : నగరంలో అర్ధరాత్రి వేళల్లో బైక్ రేసింగ్‌లతో కుర్రకారు రోడ్లపై హడలెత్తిస్తున్నారు. జూబ్లీ హిల్స్, కేబీఆర్ పార్కు, మాదాపూర్‌లలో పదుల సంఖ్యలో బైక్ రైడర్స్ రేస్‌లో పాల్గొన్నారు. ఖరీదైన స్పోర్ట్స్ బైకులతో రోడ్లపై నానా బీభత్సం సృష్టించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ యువకులు తప్పించుకున్నారు. -
వేట మొదలైంది...
గొలుసు దొంగల ఆటకట్టించేందుకు.. రంగంలోకి యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్ నిపుణుల ఆధ్వర్యంలో బైక్ రేసింగ్, ‘షార్ట్ వెపన్’ శిక్షణ పలు ప్రాంతాల్లో నిఘా... తక్షణమే స్పందించేందుకు సిద్ధం సిటీబ్యూరో: నగరంలో చైన్ స్నాచర్ల భరతం పట్టేందుకు సైబరాబాద్ యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. జంట పోలీసు కమిషనరేట్లలో వరుస గొలుసు దొంగతనాలతో సవాల్ విసురుతున్న అంతర్రాష్ట్ర ముఠాలతో పాటు స్థానిక గ్యాంగ్‌ల పనిపట్టేందుకు మూడంచెల్లో కఠోర శిక్షణ పొందిన ఈ బృందాలు ఆదివారం నుంచి వేట మొదలెట్టాయి. 55 బృందాలతో పాటు 30 మంది సభ్యులతో కూడిన ఐదు నేర విభాగ బృందాలు సివిల్ డ్రెస్సులో బహిరంగ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గంటల తరబడి తిరుగుతూ అనుమానంగా కనిపిస్తే చాలు వారి ఫొటోలను క్లిక్‌మనిపిస్తున్నారు. మహిళలను వెంబడిస్తున్నట్టుగా అనిపిస్తే వారిని అనుకరించి పట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వారం రోజుల శిక్షణ... ‘పిల్లర్ రైడర్ ముఖానికి రుమాలు...బైకర్ మొహానికి కర్చీఫ్‌తో పాటు హెల్మెట్...బ్రేక్ వేస్తే బైక్ ఎగిరిపడుతుందా అన్నట్లుగా అతి వేగంగా ఇద్దరు వ్యక్తులు దూసుకెళ్తున్నారు. సేమ్ టూ సేమ్ వీరి వెనకాలే అంతే వేగంతో ఇద్దరు మరో బైక్‌పై దూసుకెళ్లి ముందు వెళ్తున్న వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ముందు బైక్ వ్యక్తులు తమ వద్దనున్న ఆయుధాలతో దాడి చేయబోతే పిడుగుద్దులతో వారిని నిలువరించారు.’ ఈ దృశ్యాలు ఉస్మాన్‌సాగర్ గండిపేట చెరువు ప్రాంతంలో గత వారం రోజులుగా కన్పిస్తున్నాయి. విషయమేంటంటే...యాంటీ చైన్‌స్నాచింగ్ టీంకు ఇక్కడ ఈ తరహాలో శిక్షణ ఇస్తున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్వీయ పర్యవేక్షణలో ఏఆర్ ఏసీపీ కిష్టయ్య నేతృత్వంలో 110 మందితో కూడిన బృందాలతో పాటు నేర విభాగం నుంచి మరో 30 మంది ఈ రకమైన తర్ఫీదు పొందారు. గొలుసు దొంగలు ఎలా ఉంటారు...వారి వ్యవహారశైలి ఎలా ఉంటుంది..వారిని గుర్తించడం ఎలా వంటి అంశాల్లో నిపుణులతో శిక్షణ ఇప్పించారు. మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేశారు. వ్యక్తిత్వ వికాస నిపుణులతో మోటివేషన్ క్లాసులు, రివాల్వర్, తుపాకులు ఉపయోగించే విధానం, బైక్ రేసింగ్ చేయడంలో మెళకువలను ప్రాక్టికల్‌గా నేర్పించారు. వారం రోజుల పాటు ఉదయం ఆరు నుంచి 11.30 గంటల వరకు బైక్ రేసింగ్, ఆ తర్వాత షార్ట్వెపన్స్ వినియోగం, మోటివేషనల్ తరగతులు నిర్వహించారు. ఆత్మరక్షణ కోసమైతే కాల్పులే... చైన్ స్నాచింగ్స్ జరిగినప్పుడు బాధితులు ఆలస్యంగా ఫిర్యాదుచేస్తున్నారు. దాంతో దొంగల్ని పట్టుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్‌కు అంకురార్పణ జరిగింది. ఈ బృందాలు క్షేత్రస్థాయిలోనే ఉండటం వల్ల ఒకవేళ చోరీ జరిగినా వీలైనంత త్వరగా ఘటనాస్థలికి చేరుకునేందుకు అస్కారముంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ముఠాలు తారసపడితే వెంబడించేందుకు హైస్పీడ్ బైక్‌లు ఇచ్చారు. దుండగులు ఎదురుతిరిగితే ఎలాంటి చర్యకైనా సిద్ధంగా ఉండేందు కోసం...అంటే ఆత్మరక్షణార్ధం ఎదురుతిరిగేందుకు చట్టంలో వెసులుబాటు ఉండటంతో అవసరమైతే కాల్పులు జరిపేందుకు వెనుకాడకుండా సిబ్బందిని తీర్చిదిద్దారు. స్నాచర్లు..క్యాచర్లుగా... స్నాచర్లు, క్యాచర్లుగా పోలీసులు ద్విపాత్రాభినయం చేస్తూ ప్రాక్టీసు చేశారు. స్నాచర్లు...ఎంత వేగంగా బైక్‌లను నడుపుతూ తప్పించుకుంటారో అంతే వేగాన్ని ప్రయోగించి దొంగలను పట్టుకోవడంపై శిక్షణ ఇచ్చాం. మామూలు రోడ్లపై సాధారణ జనానికి ఇబ్బంది కలగకుండా స్నాచర్లను పట్టుకోవడం...చైన్ స్నాచర్లు ఆయుధాలతో ఎదురుతిరిగితే ఎలాంటి ఎత్తులు వేయాలో నేర్పాం. ఆత్మవిశ్వాసం, ప్రజలకు రక్షణ కల్పించాలనే లక్ష్యంతో కష్టమైనా పోలీసులు ఇష్టంగా అన్ని అంశాల్లో ఆరితేరారు. - కిష్టయ్య, ఏఆర్ ఏసీపీ -
రెండోసారి పట్టుబడితే జైలుకే..
- ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి - బైక్రేసర్లకు కౌన్సెలింగ్ బంజారాహిల్స్ : బైక్ రేసింగ్‌లో రెండోసారి పట్టుబడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. బైక్ రేసర్లు, వారి తల్లిదండ్రులకు శనివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి 16 మంది బైక్‌రేసర్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా వారికి ఏసీసీ కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలు రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు, ఇంటికి ఎప్పుడు వస్తున్నారు తెలుసుకోకుండా ఏం చేస్తున్నారంటూ తల్లిదండ్రులను ప్రశ్నించారు. ఇక నుంచి ప్రతి రెండు వారాలకు ఒకసారి బైక్‌రేసర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, ఇందుకోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టుబడ్డ వారంతా టోలిచౌకి, కూకట్పల్లి, ముషీరాబాద్ ప్రాంతాలకు చెందిన వారని చెప్పారు. కార్యక్రమంలో సీఐ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
బైక్ రేసింగ్ లో పాల్గొన్న 30 మంది అరెస్ట్
హైదరాబాద్: నగరంలో బైక్ రేసింగ్ లో పాల్గొన్న 30 మంది యువకులను హైదరాబాద్ పోలీసులు అరెస్టుచేశారు. ఈ ఘటన శివారు ప్రాంతం గండిపేట వద్ద జరిగింది. బైక్ రేసింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఇందులో పాల్గొన్న 30 మంది యువకులను అరెస్టు చేశారు. వారి నుంచి 13 బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బైక్ రేసింగ్ లో పాల్గొన్న వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు. -
నెక్లెస్ రోడ్డులో బైక్ రేసింగ్‌లు: పోలీసుల దాడి
-
నెక్లెస్ రోడ్డులో బైక్ రేసింగ్‌లు: పోలీసుల దాడి
హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డులో బైక్ రేసింగులకు పాల్పడుతున్న యువతపై పోలీసులు ఆదివారం దాడులు చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో యువకులను పోలీసులు అదుపులోకి తీసున్నారు. అనంతరం వారిని గోపాలపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలాగే వారి వద్ద ఉన్న మొత్తం 300 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో యువకులు భారీ సంఖ్యలో నెక్లెస్ రోడ్డుకు చేరుకుని బైక్ రేసింగులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. బైక్ రేసింగులపై నెక్లెస్ రోడ్డులోని పాదచారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. -
ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు
-
బైకిల్ రేసింగ్..!
►హైదరాబాద్- బెంగళూరు రోడ్డుపై బైక్ రేసింగ్ ►ఖరీదైన ద్విచక్ర వాహనాల వినియోగం ►లక్షల రూపాయల్లో బెట్టింగ్ ►బెట్టింగ్‌రాయుళ్లంతా బడా బాబుల కుమారులే! ►చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు ►తాజా రోడ్డు ప్రమాదమూ ఇందులో భాగమేనా? సాక్షి ప్రతినిధి, కర్నూలు : హైదరాబాద్-బెంగళూరు వయా కర్నూలు జాతీయ రహదారిపై బైక్ రేసింగులు జరుగుతున్నాయా? లక్షల రూపాయల బెట్టింగులు నడుస్తున్నాయా? ఖరీదైన మోటార్ సైకిళ్లపై ప్రతీ వారాంతంలో ఈ రేసులు జరుగుతున్నాయా? వరుసగా జరుగుతున్న వివిధ రోడ్డు ప్రమాదాలకూ ఇది కూడా కారణమా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఈ బైక్ రేసుల్లో ప్రధానంగా బడాబాబుల పిల్లలే పాల్గొంటున్నట్టు సమాచారం. తాజాగా జరుగుతున్న బైక్ యాక్సిడెంట్లలోనూ బైక్ రేసింగులే కారణమని తెలుస్తోంది. ఇందులో అధికార పార్టీ రాజకీయ నేతల కుమారుడు కూడా ఉన్నారని తెలుస్తోంది. అందుకే, ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద కర్నూలును కేంద్రంగా చేసుకుని సాగుతున్న ఈ బైకు రేసులపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. వీకెండ్లో జోరు...! ప్రధానంగా ఈ బైకు రేసులన్నీ శుక్ర, శని, ఆదివారాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఈ రేసులు జరుగుతున్నాయి. మరోవైపు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కూ ఈ రేసులు నడుస్తున్నాయి. ఒక బ్యాచ్‌లో హైదరాబాద్‌లో బయలుదేరితే...మరో బ్యాచ్ బెంగళూరు నుంచి బయలుదేరుతోంది. పందెంలో పాల్గొనేవారు పగలు పాల్గొంటారా? రాత్రి సమయాల్లోనా అనే విషయాన్ని నిర్వాహకులకు ముందుగానే తెలపాల్సి ఉంటుంది. పందెంలో పాల్గొనేందుకు ఒక్కొక్కరు రూ.10 వేల మేరకు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. పగటి పూట పందెంలో గెలిచిన వారికి పది రెట్లు అంటే... లక్ష రూపాయల బహుమానం ఇస్తారు. అదే రాత్రి సమయాల్లో అయితే రెండు లక్షల రూపాయల బహుమానాన్ని నిర్వాహకులు ఇస్తున్నట్టు సమాచారం. అయితే, ఇందులో పాల్గొనే వారందరూ ప్రత్యేకమైన జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. ఖరీదైన వాహనాలు....! ఈ రేసింగులో పాల్గొంటున్న వారు ఖరీదైన వాహనాలను వినియోగిస్తున్నారు. ప్రధానంగా హార్లిడేవిడ్ సన్ వంటి స్పోర్ట్స్ బైకులను వీరు వాడుతున్నారు. అంతేకాకుండా బైక్ రేసింగు కోసం ప్రత్యేకమైన దుస్తులతో పాటు హెల్మెట్....కాళ్లకు స్పోర్ట్స్ షూస్, ప్రయాణంలో అవసరమయ్యే సామగ్రిని కూడా తమతో ఉంచుకుంటున్నారు. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వాడిన బైకు ఖరీదు రూ.18 లక్షల ఖరీదు అని....హెల్మెట్ ఖరీదు 50 వేల రూపాయలని సమాచారం. అయితే, ఈ రేసులల్లో పాల్గొంటున్నవారందరూ బడా బాబుల కుమారులే కావడం గమనార్హం. అందుకే ఇంతగా రేసింగ్‌లు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లా పరిధిలో తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ బైకుతో పాటు రేసింగులో పాల్గొన్న ఇతర అధికార పార్టీ నేతల కుమారులను పోలీసులు పకడ్బందీగా తప్పించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ బడా బాబులే...! ఈ రేసింగులో పాల్గొంటున్న వారందరూ రాజకీయ పార్టీ నేతలు, పారిశ్రామికవేత్తల కుమారులే అధికంగా ఉంటున్నారు. వీరందరూ కేవలం రేసింగుపై మోజుతోనే ఇందులో పాల్గొంటున్నారు. బెట్టింగ్‌లో వచ్చే లక్ష, రెండు లక్షల రూపాయలను ఇటు హైదరాబాద్ గమ్యస్థానం చేరితే అక్కడ... లేదా బెంగళూరులో వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బైకు రేసింగులపై దృష్టి సారించకపోతే మరిన్ని ప్రాణాలు గాలిలో కలిసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం రేసింగులో పాల్గొంటున్న వారే కాకుండా.. రోడ్డుపై వెళుతున్న సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడటమే. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ బైకు రేసింగులను కట్టడి చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
తండ్రికి బ్రేక్ పడుద్ది!
-
బైక్ రేసర్లపై కొరడా
ఖైరతాబాద్/ రాంగోపాల్‌పేట్: బైక్ రేసింగ్‌లను అరికట్టేందుకు ఆదివారం నెక్లెస్ రోడ్డులో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 72 బైక్‌లను సీజ్ చేశారు. సైఫాబాద్, రాంగోపాల్‌పేట్, లేక్ పోలీసులు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. యువకులను అదుపులోకి తీసుకొని, రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల విలువ చేసే వివిధ రకాల బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అడిషినల్ డీసీపీ రాంమోహన్‌రావు మాట్లాడుతూ ఇంటర్, డిగ్రీ చదివే పిల్లలు రేసింగ్ మోజుతో ఉదయం లేవగానే బైక్‌లపై ఇక్కడికి వస్తున్నారు. అతివేగంతో, ఫీట్లు చేస్తూ ప్రమాదాల బారిన పడటమే కాకుండా నెక్లెస్ రోడ్డులో వాకింగ్‌కు వచ్చే వారిని ఇబ్బందులకు గురిచేయడంతో పాటు ప్రాణాలపై తెస్తున్నారు. ఇలాంటి రేసింగ్‌లు ఇక్కడ పూర్తిగా నిషేధించాలనే లక్ష్యంతో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టామని చెప్పారు. స్పెషల్ డ్రైవ్‌లో 72 ద్విచక్రవాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇప్పుడు సీజ్ చేసిన వాహనాలు మరోసారి గనుక పట్టుపడితే వారి లెసైన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇంటర్ చదివే విద్యార్థికి రూ. 2 లక్షల విలువ చేసే బైక్ అవసరమా అనే విషయాన్ని తల్లిదండ్రులు ఆలోచించాలని ఆయన సూచించారు. మరో మారు ఇలాగే వచ్చి రేసింగ్‌లకు పాల్పడి పోలీసులకు చిక్కితే తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్‌లో సైఫాబాద్ ఏసీపీ సురేందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు గంగారెడ్డి, జానకమ్మ పాల్గొన్నారు. -
బైక్ రేసర్ల దూకుడుకు పోలీసుల బ్రేక్!
-
‘ఔటర్’పై బైక్ రేసింగ్
కీసర: ఔటర్ రింగ్ రోడ్డుపై పలువురు విద్యార్థులు బుధవారం బైక్ రేసింగ్‌కు పాల్పడ్డారు. సీఐ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కీసర ఔటర్‌రింగ్ రోడ్డుపై మధ్యాహ్నం సమయంలో 13 మంది విద్యార్థులు స్పోర్ట్స్ బైక్‌లతో రేసింగ్ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే పసిగట్టిన విద్యార్థులు పరారయ్యారు. కాగా సంఘటనా స్థలంలో ఉన్న మూడు యాక్టివా వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని ఠాణాకు తరలించారు. కాగా రేసింగ్‌కు పాల్పడిన విద్యార్థులు కీసర మండలంలో ఉన్న పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుతున్న వారని పోలీసులు తెలిపారు. వీరంతా నగరంలోని ఈసీఐఎల్ ప్రాంతంలో ఉంటున్నవారు. స్వాధీనం చేసుకున్న వాహనాల నంబర్ల ఆధారంగా విద్యార్థులను పట్టుకొని కౌన్సెలింగ్ చేస్తామని సీఐ తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
32 మంది బైకు రేసర్ల అరెస్టు
-
32 మంది బైకు రేసర్ల అరెస్టు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని నార్సింగి పరిధిలో గల గండిపేట వద్ద బైకు రేసు చేసేందుకు వచ్చిన 32 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద మొత్తం 21 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా వారిలో మార్పు రావట్లేదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. గండిపేట వద్ద బైకు రేసింగుకు పాల్పడుతున్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు చెప్పారు. దాంతో వారు వచ్చి అక్కడికక్కడే మొత్తం 32 మందిని అరెస్టు చేశారు. వాళ్లలో కొంతమంది విద్యార్థులు, కొంతమంది యువతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారి తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి, కౌన్సెలింగ్ చేసిన తర్వాత వారిని విడుదల చేస్తారు. -
యువకుల బైక్ రేసింగ్
హైదరాబాద్: పెద్దఅంబర్‌పేట్ ఔటర్‌రింగ్ రోడ్డు సమీపంలో బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న 12 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ రేసింగ్ వల్ల అనే ప్రమాదాలు జరుగుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా కొందరు యువకులు రేసింగ్ చేస్తూనే ఉన్నారు. కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు బైక్ రేసింగ్‌లో పాల్గొనడాన్ని చూసిన పోలీసులు దాదాపు 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 12 మందిని అరెస్ట్ చేశారు. ఆ విద్యార్థుల నుంచి పోలీసులు 5 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విద్యార్థులు రామాంత్పూర్, హయత్‌నగర్‌కు చెందినవారిగా గుర్తించారు. -
రేసులకు పాల్పడ్డ బైకర్స్ అరెస్ట్
-
బైక్ రేసింగ్‌పై కొరడా
సాక్షి, చెన్నై:నగరంలో కుర్రకారు సాయంకాల వేళ బైక్‌లపై చెక్కర్లు కొడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎనిమిది, పదో తరగతి విద్యార్థులు సైతం తమ వాళ్ల బైక్ లను రోడ్డెక్కిస్తూ హుషారుగా చక్కర్లు కొడుతూ ప్రమాదం బారిన పడుతున్నారు. కళాశాలల విద్యార్థుల ఆకతాయితనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యార్థులు బైక్ జోరుతో రేసింగ్‌లకు పాల్పడుతూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నగరంలో వరుస ఘటనలు పోలీసుల్ని, అటు విద్యార్థుల తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, విద్యార్థులు స్కూళ్లకు మోటార్ సైకిళ్ల మీద వస్తే అనుమతించొద్దంటూ విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కళాశాల విద్యార్థులు లెసైన్సులు కలిగి ఉంటే సరి, లేకుంటే అనుమతించొద్దన్న హెచ్చరికను జారీ చేసింది. విద్యార్థులు ప్రమాదం బారిన పడ్డ పక్షంలో అందుకు ఆయా విద్యాసంస్థలే బాధ్యులవుతాయం టూ హెచ్చరికలు జారీ చేసింది. అయినా, ఈ హెచ్చరికలను పట్టించుకునే వాళ్లుంటే కదా! విద్యా సంస్థలు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థులు బైక్ జోరులో హుషారుగా ముందుకు సాగుతున్నారు. యువత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది.బైక్ రేసింగ్ : కొన్ని చోట్ల కుర్రకారు బైక్ రేసింగ్‌ల పేరిట పందాలు కాసుకుంటూ రోడ్డు మీద దూసుకెళ్తున్నారు. రోడ్డు మీద ఇతర వాహనాలు సైతం ప్రమాదానికి గురయ్యే విధంగా వీరి వీరంగాలు సాగుతున్నాయి. ప్రధానంగా ఉదయం, రాత్రుల్లో మెరీనా తీరం, కామరాజర్ సాలై, శాంతోమ్ రోడ్డు, అడయార్, తిరువాన్మీయూర్, ఓఎంఆర్, ఈసీఆర్ రోడ్డు, తాంబరం, వండలూరు - కేలంబాక్కం మార్గాల్లో జోరుగా ఈ రేసింగ్ సాగుతోంది. ప్రమాదం జరిగినప్పుడు రేసింగ్ వ్యవహారం బయటకు వస్తుండగా, మిగిలిన సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా పందాలు కాసుకుంటూ దూసుకెళుతున్నారు. రెండు రోజుల క్రితం బైక్ రైసింగ్ ఓ విద్యార్థిని బలిగొన్న ఘటనతో నగర పోలీసు యంత్రాంగం మేల్కొంది. ఇక బైక్ రేసింగ్‌పై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. నాన్ బెయిలబుల్ కేసులు: బైక్ రేసింగ్‌లకు క ళ్లెం వేయ డం, విద్యార్థులు, యువత బైక్ జోరుకు బ్రేక్‌లు వేయడం లక్ష్యంగా చర్యలకు నగర పోలీసు యంత్రాం గం నిర్ణయించింది. కమిషనర్ జార్జ్ ఇందుకు సంబంధించి అధికారులతో సోమవారం చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట బైక్ రేసింగ్‌లో చిక్కేవారిని నాన్ బెయిలబుల్ కేసుల కింద అరెస్టు చేయాలన్నారు. ఆదేశాలను నగరంలోని అన్ని పోలీసుస్టేషన్లు, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లకు జారీ అయ్యాయి. బైక్ రేసింగ్ల్లో చిక్కే వాళ్లపై ఎలాంటి జరిమానాలు విధించొద్దని, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద తొలుత కేసులు నమోదు చేసి, బైక్‌లను స్వాధీనం చేసుకోవాలని, విద్యార్థి అయినా సరే ముందు అరెస్టు చేయాలన్న ఆదేశాలు ఇస్తూ బైక్ రేసింగ్‌పై కొరడా ఝుళి పించేందుకు రెడీ అయ్యారు. విద్యార్థులు, 18 ఏళ్లలోపు వారు మోటార్ సైకిళ్లను గానీ, కార్లనుగానీ నడుపుతూ పట్టుబడిన పక్షంలో తొలిసారిగా జరిమానాలు భారీగానే మోగించేందుకు సిద్ధం అయ్యారు. మళ్లీ పట్టుబడితే మాత్రం ఆ వాహనం రిజిస్ట్రేషన్ రద్దు దిశగా హెచ్చరికలు జారీ కావడం గమనార్హం. -
ఇక జైలుకే...
మణికొండ: గండిపేట్‌లో ఆదివారం బైక్‌రేసింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన పాతబస్తీకి చెందిన 80 మంది యువకులు, వారి తల్లిదండ్రులకు నార్సింగ్‌లోని కేవీఎంఆర్ ఫంక్షన్హాల్లో కమిషనర్ ఆనంద్ ఆధ్వర్యంలో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మరోసారి రేసింగ్‌కు పాల్పడి పోలీసులకు దొరికితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అతివేగంగా వాహనాలను నడపటం, రేసింగ్‌లకు పాల్పడటం వల్ల ప్రమాదాలు జరిగి మీ ప్రాణం పోగొట్టుకోవడమే కాకుండా కుటుంబసభ్యులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తారన్నారు. నగరం, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేయటం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని, తొమ్మిదిసార్లు తప్పించుకున్నా.. పదోసారి పోలీసులకు చిక్కక తప్పదన్నారు. అప్పుడు పడే బాధ గతంలో తప్పించుకున్నప్పటి సరదాకన్నా తీవ్రంగా ఉంటుందన్నారు. నగరశివార్లలో ఇంజినీరింగ్ కళాశాలలు ఎక్కువగా ఉండటంతో పాటు పోలీసుల నిఘా తక్కువగా ఉం టుందని శివార్లలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని, ఇకముం దు అలాంటి వాటిపై పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేస్తామని కమిషనర్ అన్నారు. ఇకపై పోలీసులకు చిక్కిన వారికి మో టారు వాహన చట్టం, బెట్టింగ్‌లకు పాల్పడుతున్నందున గ్యా బ్లింగ్ చట్టం, అతివేగంగా వాహనాలు నడిపి ఇతరులకు ఇ బ్బంది కలిగిస్తున్నందున ట్రాఫిక్ చట్టాన్ని అమలు చేసి జైలుకు పంపిస్తామని ెహ చ్చరించారు. మైనర్లకు వాహనాలిచ్చే తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేస్తామన్నారు. రేసర్లను పట్టుకున్నందుకు నార్సింగ్ సీఐ ఆనంద్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డిలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గతేడాది 1100 మంది మృతి: అవినాష్ మహంతి,ట్రాఫిక్ డీసీపీ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 1100 మంది చనిపోయారని కౌన్సెలింగ్‌లో పాల్గొన్న ట్రాఫిక్ డీసీపీ అవినాష్‌మహంతి తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం 1.50 లక్షల మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తేనే ప్రమాదాలను అరికట్టడం సాధ్యమన్నారు. ఎవరైనా రేసింగ్లలో పాల్గొని జైలుకెళ్తే వారి జీవితం వృథా అవుతుందన్నారు. కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ రమేశ్‌నాయుడు, రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డి, నార్సింగి సీఐ ఆనంద్రెడ్డిలతో పాటు నార్సింగ్ పోలీసులు పాల్గొన్నారు. జాగ్రత్త పడతాం: తల్లిదండ్రులు మాపిల్లలు బయట ఏం చేస్తున్నారనే విషయం ఇప్పటి వరకు తమకు తెలియదని, రాబోయే రోజుల్లో ఇలాంటి రేసింగ్‌లు, సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా చూసుకుంటామని యువకుల తల్లిదండ్రులు తెలిపారు. మొదటిసారి తప్పు చేశారు...రంజాన్ పండగ ఉన్నందున వారందరినీ వదలివేయాలని వేడుకున్నారు. యువకులు సైతం ఇకముందు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనమని హామీ ఇచ్చారు. దీంతో మరోసారి తప్పు చేయమని వారితో ప్రమాణం చేయించి వాహనాలతో పాటు వారిని పోలీసులు వదిలేశారు. వాట్స్ఆప్తో వర్తమానం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుకున్న రేసర్లు రాజేంద్రనగర్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని బైక్రేసర్లు గత రెండు నెలలుగా తమ కార్యకలాపాలు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగించారు. ఎట్టకేలకు నార్సింగ్ పోలీసులకు చిక్కిన ఈ రేసర్లు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం చూసి పోలీసులే అవాక్కయ్యారు. వాట్స్ఆప్, ఫేస్బుక్, యూట్యూబ్‌ల ద్వారా రేసింగ్‌లకు పాల్పడటంతో పాటు బెట్టింగ్స్ కూడా నిర్వహిస్తూ ఆశ్చర్యానికి గురి చేశారు. 12 ఏళ్ల బాలుడు సైతం ఈ రేసింగ్స్‌లో పాల్గొని తన సత్తా చాటడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. సైకిల్‌ను సైతం లేపలేని వయస్సులో బైక్‌ను సునాయాసంగా గాల్లోకి లేపుతూ విన్యాసాలు చేయడం ఔరా అనిపించింది. పోలీసులకు పట్టుబడ్డ 80 మందిలో 15 ఏళ్ల వయస్సులోపు వారే పదుల సంఖ్యలో ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా రేసర్లను ‘న్యూస్‌లైన్’ ఆరా తీయగా వారు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్స్ఆప్లలో... బైక్రేసర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగిస్తున్నారు. ఫేస్‌బుక్‌లలో చాటింగ్‌లు, యూట్యూబ్‌లలో తాము చేసిన విన్యాసాలను అప్లోడ్ చేస్తున్నారు. అలాగే ప్రతి ఆదివారం ఎక్కడ? ఎన్ని గంటలకు కలవాలి తదితర విషయాలను ఒక్క రోజు ముందు వాట్స్ఆప్లో షేర్ చేసుకుంటున్నారు. ఈ విధంగా రేసింగ్ విషయం తమ వారికి తప్ప మరెవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. మొదట ఇద్దరు యువకులు.... ప్రతి ఆదివారం యువకులంతా బైక్రేసింగ్కు నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. ఇద్దరు యువకులు ముందుగా ఆ ప్రాంతానికి వెళ్తారు. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి వెంటనే వాట్స్ఆప్ ద్వారా తమ గ్రూపు సభ్యులకు వచ్చేయమని మెసేజ్ పంపుతారు. నిమిషాల వ్యవధిలో గ్రూప్ సభ్యులంతా చేరుకొని బైక్‌రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. -
రేసర్ల ఆటకట్టు
గండిపేట కట్టపై బైక్ రేసింగ్ నార్సింగి పోలీసుల అదుపులో 80 మంది యువకులు విడిపించుకెళ్లిన ఎమ్మెల్యే మణికొండ: నగరశివార్ల రోడ్లు యువతకు రేసింగ్ పాయింట్లుగా మారాయి. పలుమార్లు జరిమానాలు, కౌన్సెలింగ్‌లు నిర్వహించినా ఫలితం కనిపించడంలేదు. ఆదివారం ఏకంగా 80 మంది బైక్ రేసింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గండిపేట చెరువు కట్టపై ప్రతి ఆదివారం నగరంనుంచి యువకులు వచ్చి బైక్ పోటీలు పెట్టుకుంటున్నారు. వీటిని నివారించేందుకు మూడు వారాలుగా నార్సింగ్ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. రెండు వారాల క్రితం 34 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించి రూ.1000 చొప్పున జరిమానా విధించి విడిచిపెట్టారు. అయినా తిరిగి ఆదివారం గండిపేట కట్టపై రేసింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం రావటంతో పోలీసులు వెళ్లారు. ఒకవైపు కట్టపై ఉన్న గేటు మూసి మరోవైపునుంచి వారిని వెంబడించడంతో వెళ్లేందుకు మరో దారిలేక 80 మంది యువకులు పోలీసులకు చిక్కారు. వీరిలో ఏకంగా 75 మంది 15 ఏళ్లలోపు వారే ఉన్నారు. వీరిలో చాలా మందికి వాహన లెసైన్స్ కూడా లేదు. వీరంతా పాతబస్తీకి చెందిన వారని తేలింది. వారితో పాటు 31 బైక్‌లను నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సందడిగా మారిన స్టేషన్.... ఏకంగా 80 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ముందుగా వారంతా రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డి, నార్సింగి సీఐ ఆనంద్‌రెడ్డిని కలిశారు. తమ పిల్లలు రేసింగ్‌లకు వస్తున్న విషయం తమకు తెలియదని, అలాంటివి చేస్తే తాము సహించమని చెప్పారు. హామీ తీసుకుని విడిచి పెట్టిన పోలీసులు... పట్టుబడిన యువకులను రంజాన్ పండగను దృష్టిలో పెట్టుకొని విడిచిపెట్టాలని చార్మినార్ ఎమ్మెల్యే పాషాఖాద్రి పోలీసులను కోరారు. దాంతో వారందరినీ సోమవారం ఉదయం సైబరాబాద్ సీపీ కార్యా లయానికి తీసుకొస్తామని హామీ తీసుకొని వదలిపెట్టారు. సోమవారం పట్టుబడ్డ యువకులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు సమాచారం. -
కుర్రకారు జోష్ కు బ్రేక్!
టీనేజీ కుర్రాళ్లు దారి తప్పుతున్నారు. సాహసాల పేరుతో చెడుదారిలో పయనిస్తున్నారు. అడ్వెంచర్ ను ఆస్వాదించేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సరదాల కోసం తమ ప్రాణాలతో వాటు సాటివారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. బైక్ రేసింగ్ లతో జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కుర్రకారు జోష్ తో రోడ్డుపై జనం నడవాలంటే జంకాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. హైదరాబాద్ లో బైక్ రేసింగ్ సంస్కృతి వేగంగా పెరుగుతోంది. అర్థరాత్రి, ఉదయం వేళల్లో ఇది ఎక్కువగా ఉంటోంది. సంపన్న వర్గాలకు నిలయమైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తో పాటు నెక్లెస్ రోడ్, గండిపేట చెరువు వంటి పర్యాటక పాంత్రాలు కుర్రకారు రేసింగ్ లకు అడ్డాలు మారాయి. బైకులపై మితిమీరిన వేగంతో వెళుతూ టీనేజర్లు ప్రదర్శించే విచిత్ర విన్యాసాలు ప్రజల ప్రాణాలమీదకు తెస్తున్నాయి. కారు బాబులు కూడా పందాలు వేసుకుంటూ జనాన్ని భయపెడుతున్నారు. పోలీసులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా బైక్ రేసింగ్ లకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా గండిపేట వద్ద బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న దాదాపు 80 మంది టీనేజర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 30 బైకులను సీజ్ చేశారు. వీరిలో చాలా మంది 15 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. తల్లిదండ్రులు నిద్రలేవకముందే వారికి తెలియకుండా బైకులు తీసుకొచ్చి వీరు రేసింగ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరికి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. వారి తల్లిదండ్రులు పిలిచి మాట్లాడతామని చెప్పారు. బైక్ రేసింగ్ పాల్పడేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
బైక్ రేసింగ్‌లు.. 80మంది అరెస్ట్
-
బైక్ రేసింగ్‌లు... 80 మంది విద్యార్థులు అరెస్ట్
హైదరాబాద్: నగర శివారులోని గండిపేట వద్ద బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న దాదాపు 80 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 30 బైకులను సీజ్ చేసి, అందరిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆదివారం ఉదయమే బైక్ రేసింగ్‌లు చేస్తూ రహదారిపై వెళ్తున్న వాహనదారులతోపాటు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాంతో బైక్ రేసింగ్‌లపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన గండిపేట చేరుకుని బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారంతా విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. -
రాయల్ సందేశం...
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. బైక్ రేసింగ్‌లూ, స్పీడ్‌పై బెట్టింగ్‌లూ తగ్గాలంటే బైకర్లే చె ప్పాలి. అదీ క్రేజీ బైక్‌తోనే. అదే పని చేస్తున్నారు డేవిడ్. హైదరాబాద్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ క్రేజ్ అంతా ఇంతా కాదు. వాండరర్స్ క్లబ్, బుల్లెట్ క్లబ్‌లే దీనికి సాక్షి. ఈ క్లాసీ అండ్ క్రేజీ బైక్‌ను ప్రాణ సమానంగా ప్రేమించేవాళ్లలో టీనేజర్స్ నుంచి ఓల్డేజ్దాకా ఉన్నారు. అమ్మాయిలు సైతం ‘బుల్లెట్స్’లా దూసుకుపోతుండటం చూస్తూనే ఉన్నాం. మ్యూజిక్ ట్రైనర్‌గా ఉన్న డేవిడ్.. సిటీలోని చాలా మందిలాగే రాయల్ ఎన్ఫీల్డ్ చేసే మ్యాజిక్కు అభిమాని కూడా. ‘బైక్ మీద ఇష్టం ఉండడం సహజం. అయితే అది మన ప్రాణాలు తీసేంతో, అంగవైకల్యం పాలు చేసేంతో కాకూడదు’ అంటారు డేవిడ్. తన సొంత అన్నయ్య ఒకరు రోడ్డు ప్రమాదం కారణంగా వైకల్యం బారిన పడటాన్ని గుర్తుంచుకున్న డేవిడ్... తన ఇష్టమైన బైక్ ద్వారా బైక్ ప్రియులకు ఓ చక్కని చిరు సందేశం ఇస్తున్నారు. ఎంజాయ్ది రైడ్... బీ ఆన్ రోడ్... అనేది డేవిడ్ ఫిలాసఫీ. తెలుగు సామెతల్లా చెప్పాలంటే... గాల్లో తేలినట్టు ఆనందించు కాని రోడ్డు మీదే ఉన్నానని గుర్తించు. ఈ సందేశాన్ని చెప్పడానికి ఆయన తన బైక్‌కు హెడ్‌లైట్ స్థానంలో ఒక పుర్రె బొమ్మని సిల్వర్ మెటల్‌తో ఏర్పాటు చేశారు. విండ్‌షీల్డ్ మీద ‘స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్’ అంటూ మెరిసే అక్షరాలను ముద్రించారు. ‘దీని కోసం ఓ 3 వేలు అదనంగా ఖర్చయిందంతే. కాని నా ఆలోచనను ఒక్క బైక్లవర్ అర్థం చేసుకున్నా... దాని వల్ల కలిగే మంచి ప్రయోజనం ముందు ఇదేపాటి?’ అంటూ..‘ నేను సొంతంగా కూర్చే పాటల్లో కూడా రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తాను’ అంటూ చెప్పారాయన. - సాక్షి, సిటీప్లస్ -
జెట్స్పీడ్తో దూసుకుపోతున్న కుర్రకారు
-
హైదరాబాద్‌లో అర్ధరాత్రి బైక్ రేసుకు పోలీసుల బ్రేక్