
గాజువాక: జాతీయ స్థాయి బైక్ రేసులో గాజువాక శ్రీనగర్‌కు చెందిన యువకుడు ప్రతిభ ప్రదర్శించాడు. ది వ్యాలీ రన్ పేరుతో ఈనెల 5న పూణేలో నిర్వహించిన నేషనల్ డ్రాగ్ రేసింగ్‌లో పాల్గొన్న వై.అవినాష్ 1000 సీసీ బైక్ రేసులో ద్వితీయ స్థానం సాధించాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది విశాఖ నగరానికి మంగళవారం చేరుకొన్న అవినాష్‌ను పలువురు అభినందించారు.
నాలుగేళ్లుగా పోటీలకు
బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అవినాష్ నాలుగేళ్లుగా రేసుల్లో పాల్గొంటున్నాడు. కోల్‌కతాలో గతంలో నిర్వహించిన ఎలైట్ ఆక్టేన్, నేషనల్ డ్రాగ్ చాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న అవినాష్ తొమ్మిదో ర్యాంకు సాధించాడు. ఆ తరువాత బెంగళూరులో నిర్వహించిన పోటీలకు హాజరై 13వ ర్యాంకు తెచ్చుకున్నాడు. పూణేలోని లోనావాలాలో తాజాగా నిర్వహించిన రేసులో రెండో ర్యాంకు సాధించి పలువురి మన్ననలను పొందాడు.
సేవా భావం
తండ్రితో కలిసి స్టీల్‌ప్లాంట్‌లో ట్రాన్స్‌పోర్టు వ్యాపారం నిర్వహిస్తున్న అవినాష్ సమాజ సేవలోను పాలుపంచుకొంటున్నాడు. ప్రస్తుతం 20 మంది అనాథ పిల్లల చదువుకు సహాయం చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment