GAJUWAKA
-
గాజువాక మార్కెట్ లో మహిళల కొట్లాట
-
స్టీల్ ప్లాంట్ కోసం మహాధర్నా
-
పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
ఓటు అనే ఆయుధంతో ఢిల్లీ పీఠం కదలాలివీళ్లు ఎన్ని కుట్రలు చేసినా.. దేవుడు అంతా గమనిస్తున్నాడు. మీ బిడ్డకు ప్రజల దీవెనలున్నాయి. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నల చేతుల్లో ఓటు అనే బలమైన ఆయుధం ఉంది. ఆ ఓటు అనే ఆయుధంతో వీళ్లను కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కూడా కదులుతుందని గట్టిగా చెబుతున్నా.విశాఖలోనే ప్రమాణ స్వీకారం..జూన్ 4 తర్వాత మీ బిడ్డ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాడు. అదే రోజు పరిపాలనా రాజధానిగా విశాఖ నుంచే పాలన చేయబోతున్నానని గర్వంగా చెబుతున్నా. మూడు రాజధానుల్లో విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నాం. మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తూ మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా చేసింది మీ బిడ్డ ప్రభుత్వమే. ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు ఎస్పీలతో పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు పాలన చేరువ చేశాం. శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి. ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వస్తోంది. రూ.4,400 కోట్లతో మూలపేట పోర్టు పనులు వాయువేగంతో జరుగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను శరవేగంగా చేస్తున్నాం, విశాఖ–భోగాపురం 6 లేన్ల రహదారిని నిర్మిస్తున్నాం. విశాఖలో అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్ మొదలైంది కూడా మీ బిడ్డ పాలనలోనే.– ఇచ్ఛాపురం సభలో సీఎం జగన్సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, విశాఖపట్నం: ‘దేవుడి దీవెనలు, మీ ఆశీస్సులున్నంత వరకూ మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కరూ ఆపలేరు. జూన్ 4న మనందరి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుంది. మనం నొక్కిన బటన్లు అన్నీ వారం రోజుల్లోనే క్లియర్ చేస్తాం. ఢిల్లీతో కలిసి మీ బిడ్డ ప్రభుత్వాన్ని దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు సీఎంగా చేశానంటాడు. అన్నేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే పేదలకు ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా? జగన్ అంటే పథకాలు.. చంద్రబాబు అంటే మోసాలు, కుట్రలు, కుతంత్రాలే గుర్తుకొస్తాయి’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలు, కుతంత్రాలకు ఓటు అనే వజ్రాయుధంతో మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంతలా దిగజారిపోయారు..కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ జగన్ నొక్కిన బటన్ల సొమ్ము నా అక్కచెల్లెమ్మలకు అందకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. సాక్షాత్తూ మీ జగన్ ఓ ముఖ్యమంత్రిగా కోర్టుకు వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కేసులు వేసే పరిస్థితిలోకి ప్రజాస్వామ్యం దిగజారిపోయిందంటే వీళ్లను ఏమనాలి? మీ జగన్ బటన్ నొక్కిన పథకాలన్నీ ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా తెచ్చినవి కాదు. గత ఐదేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా ఇస్తున్న పథకాలకే మీ జగన్ బటన్ నొక్కాడు. ఈ స్కీములు ఇవాళ ఏదో కొత్తగా తెచ్చినవి కాదు. ఇవన్నీ ఆన్ గోయింగ్ స్కీమ్స్. బడ్జెట్ కేటాయింపులున్నవే. అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినవే. 58 నెలలుగా ఇస్తున్న పథకాలకు అడ్డుపడుతూ జగన్‌ను కట్టడి చేసేందుకు ఢిల్లీతో కలసి కుట్రలు పన్నుతున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కిన సొమ్మును అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అందకుండా అడ్డు తగిలే దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వీళ్లు దిగజారిపోయారు. గత ఐదేళ్లుగా క్యాలండర్లో చెప్పిన విధంగా క్రమం తప్పకుండా ఇస్తూ పోతున్న మీ జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి కుట్రలు పన్నుతున్నారు. చివరిలో అడ్డుపడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా? పెన్షన్ సొమ్ము ఇన్నేళ్ల పాటు మీ బిడ్డ ఇంటికే పంపించిన తర్వాత చివరి రెండు నెలలు ఆ డబ్బులు ఇంటికి రాకపోతే ఏం జరిగిందో ఆ అవ్వాతాతలు గ్రహించలేరనుకున్నారా? ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతున్నా. జూన్ 4న అధికారంలోకి వచ్చిన వెంటనే ఓ వారం రోజుల్లోనే ఈ బటన్లు అన్నీ మీ బిడ్డ క్లియర్ చేస్తాడు. బాబు ఒక్క బటనూ నొక్కలేదు..మనపై ఇన్ని కుట్రలు చేస్తున్న చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మీ జగన్ మాదిరిగా ఎన్నడూ బటన్లు నొక్కలేదు. ఏ రోజూ ఏ ఒక్క అక్కచెల్లెమ్మకూ డబ్బులు, పథకాలు ఇవ్వలేదు. మీ బిడ్డ జగన్ ఈ 59 నెలల కాలంలో 130 సార్లు బటన్లు నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపాడు. చంద్రబాబు దగ్గర ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఆ దోచేసిన సొమ్ముతో లోబర్చుకునేందుకు ఎన్నికల రోజు రూ.2 వేలు, రూ.3 వేలు, కొన్ని చోట్ల రూ.4 వేలు, రూ.5 వేలు కూడా ఇస్తాడు. చంద్రబాబు ఎన్నికల రోజు ఇచ్చే ఆ డబ్బంతా మనదే. మన దగ్గర దోచేసిన డబ్బే అది. కాబట్టి ఆయన ఇస్తే ఏ ఒక్కరూ వద్దు అనొద్దు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీకు, మీ కుటుంబానికి ఎవరి వల్ల మంచి జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ అభివృద్ధి, పథకాలను కొనసాగిద్దాం..మరో ఆరు రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపటమే. రాష్ట్రంలో గతంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ వచ్చాక ఏకంగా మరో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాడు. మేనిఫెస్టో హామీల్లో 99 శాతం అమలు చేసి చిత్తశుద్ధి చాటుకున్నాం. గడప గడపకూ మేనిఫెస్టోతో వెళ్లి మరోసారి ఆశీర్వదించాలని కోరాం. మన పథకాలు.. మచ్చుకు కొన్ని‘నాడు–నేడు’తో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు, ఇంగ్లిష్ మీడియం, 6వ తరగతి నుంచే క్లాస్ రూముల్లో డిజిటల్ బోధన, 8వ తరగతికి రాగానే ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబ్‌లు, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో బైలింగ్యువల్ టెక్టŠస్ బుక్స్ (ద్విభాషా పాఠ్య పుస్తకాలు), బడులు తెరవగానే పిల్లలకు విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి, పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెన, ఖర్చులకు ఇబ్బంది పడకుండా వసతి దీవెన, అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులతో భాగస్వామ్యం, తప్పనిసరి ఇంటర్న్‌షిప్... ఇలాంటి విద్యా విప్లవాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? మహిళా సాధికారత.. వినూత్న వ్యవస్థలుఅక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, 22 లక్షల గృహ నిర్మాణాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అవ్వాతాతలకు ఇంటికే రూ.3 వేలు పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, రేషన్, పథకాలు.. ఇలా నేరుగా డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వాలు గతంలో ఉన్నాయా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకేలు, సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలు గతంలో ఉన్నాయా?స్వయం ఉపాధికి అండగా..వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, చిరువ్యాపారులకు తోడు, చేదోడు, లా నేస్తం లాంటి పథకాలతో స్వయం ఉపాధికి అండగా నిలిచిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? రూ.25 లక్షల వరకూ విస్తరించిన ఉచిత ఆరోగ్యశ్రీ, జీవన భృతి అందిస్తూ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజల ఆరోగ్యంపై ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? ఏ గ్రామానికి వెళ్లినా 600 రకాల సేవలందిస్తున్న సచివాలయం, ఫైబర్‌గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, అక్కచెల్లెమ్మల భద్రత కోసం గ్రామంలోనే మహిళా పోలీసు, దిశా యాప్ లాంటివి ఇంతకు ముందెప్పుడైనా చూశారా? నాడూ నేడూ అదే రాష్ట్రం.. అదే బడ్జెట్. చంద్రబాబు ఏ రోజూ పేదల కోసం బటన్లు నొక్కలేదు. అప్పుల గ్రోత్ రేట్ కూడా గతంలో కంటే ఇప్పుడే తక్కువ. ఇది కాదా అభివృద్ధి..?మీ జగన్ పేరు చెబితే ఎన్నో పథకాలు గుర్తుకొస్తాయి. బాబు పేరు చెబితే ఏ స్కీమూ గుర్తు రాదు కాబట్టి జగన్ హయాంలో అభివృద్ధి లేదంటూ అబద్ధాలు చెబుతున్నాడు. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.32,000 కోట్లు అయితే మీ బిడ్డ జగన్ పాలనలో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయంటే అంటే ఇది అభివృద్ధి పాలన కాదా? మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ మీ బిడ్డ హయాంలోనే వస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీని వరుసగా ఏటా నంబర్ వన్‌గా నిలబెట్టాం. కొత్తగా 4 సీ పోర్టులు నిర్మిస్తున్నాం. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం తీసుకొచ్చాం. 15,000 గ్రామ సచివాలయాలు, 11,000 విలేజ్, వార్డు క్లినిక్‌లు, 11,000 ఆర్బీకేలు నెలకొల్పాం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61% ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 3.95% మాత్రమే ఉంది. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల మందికిపైగా సిబ్బందిని నియమించాం. మీ బిడ్డ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 కాగా కొత్తగా మరో 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది మన ప్రభుత్వమే.మన అభ్యర్థులను దీవించండి..నాకు సొంత తమ్ముడు లేడనే బాధ ఉండేది. రాజాను (రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా) చూశాక ఆ బాధ పోయింది. నా తమ్ముడిని గొప్ప మెజార్టీతో గెలిపించాలి. మీరు రాజాకు ఓటేస్తే గణేష్, అమ్మ (జక్కంపూడి విజయలక్ష్మి), రాజా భార్య అంతా కలిసి మీ మంచి కోసం ఇంకా ఎక్కువగా కృషి చేస్తారు. మంచి వైద్యుడిగా పేరున్న శ్రీను అన్న (రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్)ను గొప్ప మెజార్టీతో ఆశీర్వదించండి. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థి విజయమ్మ, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ను దీవించాలని కోరుతున్నా. గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, నాకు అక్క లాంటి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని భారీ మెజార్టీతో గెలిపించండి.మీ కుటుంబంతో చర్చించండి..ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. అది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపు, పెత్తందార్లు మరోవైపున నిలిచి ఈ యుద్ధం జరుగుతోంది. మీరంతా ఓటేసేముందు మీ కుటుంబంతో కలసి కూర్చొని చర్చించండి. చిన్న పిల్లల అభిప్రాయాన్ని కూడా తీసుకోండి. ఏ ప్రభుత్వం వల్ల, ఎవరి వల్ల మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగిందో ఆలోచించండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందో గమనించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. మంచి చేసే ఫ్యాను ఇంట్లో ఉండాలి. చెడు చేసే సైకిల్ ఎక్కడ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ మారాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి చదువులు, వారి బడులు బాగుపడాలన్నా.. మన వ్యవసాయం, హాస్పిటళ్లు మెరుగ్గా ఉండాలన్నా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించాలి.ఉద్దానం కిడ్నీ కష్టాలకు విముక్తిదశాబ్దాలుగా ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ సమస్యల పరిష్కారం కోసం రూ.780 కోట్లతో హిరమండలం నుంచి తాగునీటిని తరలించింది మీ బిడ్డ ప్రభుత్వమే. రూ.80 కోట్లతో కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్‌ను నిర్మించింది మన ప్రభుత్వమే. ఉత్తరాంధ్రలో కొత్తగా మెడికల్ కళాశాలలు కడుతున్నాం. పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇవి ఏర్పాటవుతున్నాయి. సాలూరులో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నది మన ప్రభుత్వమే. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల కడుతున్నది మన ప్రభుత్వమే. ఐటీడీఏల పరిధిలో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయంటే కారణం మీ బిడ్డే. సెల్‌ఫోన్ కనెక్టివిటీ లేని గిరిజన ప్రాంతాల్లో రూ.400 కోట్ల వ్యయంతో టవర్లను ఏర్పాటు చేశాం. 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3,23,000 ఎకరాల పట్టాలిచ్చి వారికి రైతు భరోసా అందిస్తూ జీవనోపాధి చూపించింది కూడా మీ బిడ్డే.కోరుకొండ భూముల సమస్య పరిష్కరిస్తా..కోరుకొండ భూముల గురించి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గుర్తుచేశాడు. ఫైల్ ప్రాసెస్‌లో ఉన్న సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మళ్లీ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూముల సమస్యను పరిష్కరిస్తామని సవినయంగా తెలియజేస్తున్నా.తుప్పు సైకిల్.. ఢిల్లీ మెకానిక్స్!ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు గుప్పించే చంద్రబాబు వాటిని అమలు చేయకపోవడం వల్ల తమకు కలిగిన నష్టానికి ప్రతీకారంగా రైతన్నలు, నిరుద్యోగులు, అక్కచెల్లెమ్మలు, వివిధ సామాజిక వర్గాలు, పల్లెలు, పట్టణాల వాసులు అంతా కలసి సైకిల్‌ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్‌కు రిపేరు చేయాలని చంద్రబాబు తంటాలు పడుతున్నాడు. ముందుగా ఎర్రచొక్కాల దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఫలితం లేకపోవడంతో దత్తపుత్రుడి దగ్గరకు వెళ్లాడు. తుప్పు పట్టిన సైకిల్ కేరియర్ మీద మాత్రమే కూర్చుంటా! టీ గ్లాస్ పట్టుకుని తాగుతా! మిగిలింది నావల్ల కాదని దత్తపుత్రుడు చెప్పాడు. దీంతో వదినమ్మను ఢిల్లీకి పంపాడు. అక్కడి మెకానిక్స్‌ను ఇక్కడికి దింపి సైకిల్‌ను ఓ షేపులోకి తేవాలని కోరాడు. ఆ ఢిల్లీ మెకానిక్స్ ఇక్కడికి వచ్చి తుప్పు పట్టిన సైకిల్‌ను చూసి... హ్యాండిల్ లేదు! సీటు లేదు! పెడల్స్ లేవు! చక్రాలు, ట్యూబులు లేవు! మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు! ఇంత తుప్పు పట్టిన సైకిల్‌ను ఎలా బాగు చేస్తాం చంద్రబాబూ! అని అడిగితే పిచ్చి చూపులు చూస్తూ.. ఇదొక్కటే మిగిలిందంటూ ట్రింగ్ ట్రింగ్‌మని బెల్లు మోగిస్తున్నాడు. ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో!2014లో బాబు ముఖ్యమైన మోసాలు..⇒ రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ జరిగిందా? ⇒ డ్వాక్రా సంఘాలకు రూ.14,205 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని రూపాయైనా మాఫీ చేశాడా?⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి స్కీమ్ కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నాడు. మరి ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి ఇచ్చాడా?⇒ ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నాడు. ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇల్లు ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా?⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? ⇒ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్‌ను మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? ⇒ రాజానగరంలో ఎవరికైనా కనిపిస్తోందా? ⇒ ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. ⇒ అదే ముగ్గురు మరోసారి కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్ అంటూ నమ్మబలుకుతున్నారు. -
ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
-
పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!
-
మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చాం: సీఎం జగన్
విశాఖపట్నం, సాక్షి: అబద్ధాలకు రెక్కలుకట్టి గతంలో మేనిఫెస్టోలు ఇచ్చేవారని, తాము మాత్రం మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకువచ్చామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత గాజువాకలో మంగళవారం(మే7) జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మీటింగ్‌కు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించారు. ‘మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలివి. గతంలో ఎప్పుడూ ఎవరూ బటన్ నొక్కలేదు. నేరుగా అక్క చెల్లెల్లకు డబ్బులిచ్చిందీ లేదు. 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి స్కీమ్ కూడా పేదలకు గుర్తుకు రాదు. 59 నెలల్లో 2లక్షల31 వేల ఉద్యోగాలిచ్చాం. 59 నెలల్లోనే అనూహ్య మార్పులు తీసుకువచ్చాం. 13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం. ఇది అభివృద్ధి కాదా. 59 నెలల పాలనలో 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా.ఒక్క ఉత్తరాంధ్రకే నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చాయి. వైస్‌ఆర్‌సీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి. దశాబ్దాల నాటి ఉద్దానం సమస్యను పరిష్కరించాం. మూడు వేల గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 400 సెల్‌టవర్లు పెట్టాం. భోగాపురం ఎయిర్‌పోర్టు శరవేగంగా పూర్తవుతుండడానికి కారణం ఎవరు. కుల,మత ప్రాంతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నాం. ఇంటి వద్దకే పెన్షన్, రేషన్ సౌకర్యం కల్పిస్తున్నాం. నాడు-నేడు ద్వారా బడులకు కొత్త రూపం తీసుకువచ్చాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన తీసుకువచ్చాం. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఈజ్ఆఫ్ డూయింగ్‌లో ఏపీని నెంబర్‌వన్‌గా నిలిపాం. బాబు హయాంలో కంటే ఎక్కువగా మీ బిడ్డ హయాంలో లక్ష కోట్లపైబడి పెట్టుబడులు వచ్చాయి’ అని సీఎం జగన్ వివరించారు. సీఎం జగన్ ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలువిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తా.. జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది విశాఖ నుంచే పాలన కొనసాగించేది విశాఖ నుంచేఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండిలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారుప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండివెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళ వారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయాబాబు, దత్తపుత్రుడు, మోదీగారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటిప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదుగాజువాకలో కూటమికి ఓటేస్తే స్టీప్లాంట్ అమ్మేయమన్నట్లేగాజువాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్లు అవుతుందిఇక్కడ టీడీపీ, ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపడం సాధ్యం కాదు ఎందుకంటే దీన్నే వారు ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటారుప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి, తర్వాత జగన్ ఎంత ప్రయత్నించినా నీకెందుకయ్యా వారు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి అనకూలంగా తీర్పు ఇచ్చారంటారుఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి -
జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ
-
గాజువాకలో జనజాతర
-
గాజువాకలో సీఎం జగన్ రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @గాజువాక (విశాఖపట్నం జిల్లా)
-
గాజువాక ఎన్నికల ప్రచారంలో గుడివాడ అమర్నాథ్
-
నాకు సీటు ఇవ్వరు అని ట్రోల్ చేసిన వాళ్ళకి చెప్తున్నా.. గుడివాడ అమర్నాథ్ అదిరిపోయే కౌంటర్
-
YSRCP: గాజువాక సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి వైఎస్సార్సీపీ 12వ జాబితా విడుదల అయ్యింది. రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను ప్రకటిస్తూ మంగళవారం సాయంత్రం అధిష్టానం ఒక ప్రకటన విడుదల చేసింది. చిలకలూరిపేట(అసెంబ్లీ) సమన్వయకర్తగా కావటి మనోహర్‌నాయుడు, గాజువాక(అసెంబ్లీ) సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ను పార్టీ అధిష్టానం నియమించింది. ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరిని ఎంపిక చేశారు. ఇక కర్నూలు మేయర్‌గా సత్యనారాయణమ్మను ఎంపిక చేశారు. బీవీ రామయ్యను కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించడంతో కర్నూలు మేయర్‌గా సత్యనారాయణమ్మను నియమించారు. -
గాజువాకలో టీడీపీ-జనసేన సిగపట్లు!
పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తేనే దిక్కులేదు.. ఇప్పుడు మీరు పోటీ చేసి ఏం గెలుస్తారు? గాజువాకలో జనసేన నేతలపై టీడీపీ నాయకులు సెటైర్లు పేలుస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ పోటీ చేశారు కనుక ఈసారి గాజువాక తమకే ఇవ్వాలని జనసేన నేతలు పట్టుపడుతున్నారు. పవన్ గెలవలేనపుడు మీకు సీటు ఎందుకివ్వాలని టీడీపీ స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య సిగపట్లు మొదలయ్యాయి. ఇంకా రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు మొదలు కాకముందే గాజువాకలో గలాటా మొదలైంది. అసలక్కడ ఏం జరుగుతోందో చూద్దాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయి రికార్డు సృష్టించారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి టీడీపీ తరఫున పల్లా శ్రీనివాస్ పోటీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబుకు కుదిరిన చీకటి ఒప్పందం ప్రకారం గాజువాకలో సొంత పార్టీ అభ్యర్థికే చంద్రబాబు ప్రచారం చేయలేదు. పక్క నియోజకవర్గంలో ప్రచారం చేసి పవన్ పోటీ చేస్తున్న గాజువాకలో టీడీపీకి ప్రచారం చేయకుండా వెనుదిరిగారు. గత ఎన్నికల్లో తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఈసారి గాజువాక తమకే కేటాయించాలని జనసేన నాయకులు కోరుతున్నారు. జనసేన తరఫున పోటీ చేయడానికి కోన తాతారావు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో జనసేన తరఫున ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో తనకే సీటు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కోన తాతారావు. గాజువాకలో జరిగిన బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొదటినుంచి పార్టీని నమ్ముకుని రాజకీయం చేస్తున్నానని అవకాశవాద రాజకీయాల కోసం తానేమి పార్టీలోకి కొత్తగా రాలేదంటున్నారు. నమ్మిన పార్టీని వెన్నుపోటు పొడిచి పదవులు అనుభవించి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లాగా తమ నాయకుడు జనసేనలోకి రాలేదని కోన తాతారావు అనుచరులు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా గాజువాకలో పోటీ చేయాల్సిందే అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పల్లా శ్రీనివాస్ పోటీ చేసినప్పటికీ క్యాడర్ మొత్తం చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్‌కి మద్దతు తెలిపిందని చెబుతున్నారు. అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్వయంగా పోటీ చేసి ఓడిపోయిన గాజువాక సీటును మళ్లీ ఎందుకు జనసేనకి ఇవ్వాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే స్థానం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాస్ మరోసారి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. జనసేనతో పోలిస్తే టీడీపీనే ఇక్కడ బలంగా ఉందంటున్నారు. తమను కాదని జనసేనకి సీటు ఇచ్చినట్లయితే సహకరించేది లేదని టీడీపీ నేతలు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. జనసేనకు సీటు ఇచ్చినట్లయితే తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమనే సంకేతాలను కూడా పంపుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు మొదలు కాకముందే గాజువాకలో రెండు పార్టీల మధ్య అగ్గి రాజుకుంది. జనసేన అధ్యక్షుడికే గాజువాకలో దిక్కులేనపుడు..మామూలు నాయకుడు పటిష్టమైన స్థితిలో ఉన్న వైస్ఆర్ కాంగ్రెస్‌ను ఎదుర్కొనగలడా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడదాకా వెళుతుందో చూడాలి. -
సామాజిక న్యాయానికి ప్రతీక సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: సామాజిక న్యాయానికి ప్రతీక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రాష్ట్రంలో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తలెత్తుకొని గౌరవంగా బతుకుతున్నారంటే సీఎం వైఎస్ జగన్, ఆయన పథకాలే కారణమని తెలిపారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా సోమవారం గాజువాక నియోజకవర్గం పాత గాజువాక కూడలిలో జరిగిన బహిరంగ సభలో మంత్రి ధర్మాన మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట తప్పరని, ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడంతో పాటు, చెప్పని అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేశారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా సుపరిపాలన అందిస్తున్నారన్నారు. గతంలో మనమందించే పథకాలను అవహేళన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువగా పథకాలు ఇస్తా అంటున్నాడని, ఇవి పేదలకు అందించే పథకాలని ఇప్పుడు తెలిసాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు వంటి వారి మాటలు నమ్మకూడదని చెప్పారు. ఓ రోడ్డు వేస్తేనో, బిల్డింగ్ కట్టేస్తేనో అభివృద్ధి కాదని, పేద వాడి జీవన ప్రమాణాలను పెంచి, వారు ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి జరిగినట్లని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల అభివృద్ధికే అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ పాలనలో బడుగుల అభ్యున్నతి రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలు నభూతో నభవిష్యతి అని చెప్పారు. ఈ వర్గాలను అన్ని రంగాల్లోనే అగ్రగణ్యులుగా నిలబెడుతున్న ఘనత సీఎం జగన్‌దేనని తెలిపారు. గతంలో బీసీ, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకే సమావేశం పెట్టుకునే ధైర్యం కూడా ఉండేది కాదని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో తలెత్తుకొని ధైర్యంగా సభలు పెట్టుకోగలుగుతున్నామని అన్నారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గుర్తింపు ఇవ్వకపోయినా ఆయన వద్ద ఈ వర్గాల నాయకులు ఎందుకు బానిసత్వం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అవమానించిన చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముందుగా లేఖ రాసింది సీఎం జగన్ అని గుర్తించుకోవాలన్నారు. పవన్‌కళ్యాణ్ జన సైనికుల ఆత్మగౌరవాన్ని తెలంగాణలో ఓ పార్టీకి, రాష్ట్రంలో మరో పార్టీకి అమ్మేస్తున్నాడని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం జగన్‌ను 2024లోనూ ముఖ్యమంత్రిని చేసుకోవాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్‌ను ప్రజలు నమ్మకుండా ఎలా ఉంటారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. బడుగు, బలహీన వర్గాలను భుజానికెత్తుకున్న జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, పవన్, లోకేశ్, పురందేశ్వరి రాష్ట్రానికి పట్టిన శనిగా అభివర్ణించారు. ఒకప్పడు చంద్రబాబును ఛీకొట్టిన పురందేశ్వరి ఇప్పుడు ఆయన కళ్లల్లో ఆనందం చూడటానికి ప్రయత్నిస్తోందన్నారు. ఆమె బీజీపీ కండువా వేసుకుని టీడీపీ కార్యకర్తలా పని చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖాదర్‌బాషా మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన 600పైగా హామీల్లో ఒకటీ నెరవేర్చలేదని, అయన ముస్లింల ద్రోహి అని విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలోనే ముస్లిం మైనారిటీలకు సువర్ణ పాలన అందించిని ఏకైక సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. విశాఖ మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ బీసీ మహిళకు గ్రేటర్ విశాఖ మేయర్ పదవి కట్టబెట్టారని, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళలకు కూడా కీలక పదవులు ఇచ్చి ముఖ్యమంత్రి జగన్ సామాజిక సాధికారతకు కృషి చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్‌ను 30 ఏళ్ల పాటు సీఎంను చేసుకుందాం గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగి రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో పడిపోయిన గాజువాక హౌస్ కమిటీ సమస్యను సీఎం జగన్ త్వరితగతిన పరిష్కరించారని చెప్పారు. సీఎం జగన్‌ను 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిని చేసుకుంటే మన భవిష్యత్ తరాల భవిత బాగుంటుందని తెలిపారు. ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, సమన్వయకర్త కె.కె రాజు, మాజీ మంత్రి బాలరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు పాల్గొన్నారు. -
బస్సు యాత్ర రెస్పాన్స్ చూసి ప్రతిపక్షాల వెన్నులో వణుకు
-
మార్కాపురం, గాజువాకలో వైఎస్ఆర్ సీపీ బస్సు యాత్ర
-
గాజువాక ఆటోనగర్ లో 112 అడుగుల ఆయుష్ గణపతి
-
గాజువాకలో కళ్లు చెదిరేలా భారీ గణపతి విగ్రహం..
-
గాజువాక మార్గదర్శి ఆఫీసులో సీఐడీ సోదాలు
-
గాజువాకలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
-
ఏపీఐఐసీ స్థలంపై టీడీపీ నేతల కన్ను.. రాత్రికి రాత్రే..
అగనంపూడి (గాజువాక): ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) స్థలాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించేందుకు చేసిన యత్నాలను ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం అగనంపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 228లోని రెండెకరాల స్థలాన్ని గతంలో ఫార్మా సిటీ నిర్వాసితుల కోసం కేటాయించారు. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్వాసితులకు స్థలాలు ఇవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే అదునుగా భావించిన ఆ వార్డుకు చెందిన టీడీపీ నేతలు సదరు స్థలంలో రాత్రికి రాత్రే దేవతామూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. విగ్రహాల పేరుతో సదరు స్థలాన్ని వారి చేతుల్లోకి తీసుకోవాలని కుట్ర పన్నారు. దీంతో స్థానికులు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గాజువాక రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు ఆక్రమిత స్థలాన్ని సందర్శించి సిమెంట్ దిమ్మలను నేలమట్టం చేశారు. అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టారు. ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత హెచ్చరించారు. -
మోసం చేశాడని కేసు పెట్టి జైలుకు పంపి.. పెళ్లి చేసుకుంటుంటే పెట్రోల్‌తో..
సాక్షి, విశాఖపట్నం: ఓ యువతి తనను మోసం చేశాడని ప్రేమికుడిపై కేసు పెట్టి జైలుకు పంపింది. జైలు నుంచి విడుదలైన యువకుడు మరో పెళ్లి చేసుకుంటుంటే అదే యువతి కల్యాణ మండపానికి వచ్చి పెట్రోల్ బాటిల్‌తో రచ్చచేసింది. విషయం గాజువాక పోలీసులకు చేరడంతో వారు వచ్చి యువతి బంధువులకు నచ్చజెప్పారు. కోర్టు వివాదంలో ఉన్న అంశాన్ని కోర్టులో తేల్చుకోవాని సూచించారు. యువతి బంధువులకు నచ్చచెబుతున్న గాజువాక సీఐ భాస్కరరావు జీవీఎంసీ 69వ వార్డు తుంగ్లాం గ్రామానికి చెందిన ఎం. విజయ్ భగత్ ఓ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను పార్వతీపురానికి చెందిన డి. ప్రియాంక అనే యువతిని ప్రేమించి కొంత కాలం తర్వాత వదిలేశాడు. దీంతో ఆమె విజయ్‌భగత్ మోసం చేశాడని మే నెలలో కేసు పెట్టడంతో యువకునికి జైలు శిక్ష పడింది. జైలు నుంచి వచ్చిన విజయ్ భగత్ మరో సంబంధం చూసుకొని శనివారం నాతయ్యపాలెంలోని కల్యాణ మండపంలో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియాంక తన బంధువులు, స్నేహితులతో కల్యాణ మండపానికి చేరుకొని పెట్రోల్ బాటిల్‌తో బెదిరింపులకు దిగింది. సమాచారం అందుకున్న గాజువాక సీఐ ఎల్.భాస్కరరావు, ఎస్ఐ కొల్లి సతీష్ వచ్చి కోర్టు పరిధిలో ఉన్న అంశంలో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని యువతితో పాటు బంధువులకు సూచించారు. చదవండి: (విశాఖ.. ఎగుమతులకు స్వర్గధామం) -
హరితవనంగా ఆటో.. ఎక్కడ ఉందో తెలుసా?
సాక్షి, విశాఖపట్నం: ఇంటి పెరట్లో.. మిద్దెలపైన మొక్కలు పెంచడం సహజం. అందుకు భిన్నంగా తన బతుకు బండి అయిన ఆటోను హరితవనంగా మార్చాడు ఓ ఆటోవాలా. పర్యావరణ పరిరక్షణకు తన ఆటోకు చుట్టూ కుండీలను ఏర్పాటు చేసి వాటిలో పచ్చని మొక్కలను పెంచుతున్నాడు. ఇలా ఐదేళ్లుగా తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాడు. ఆ ఆటో డ్రైవర్ పేరు డేవిడ్. గాజువాక గణపతినగర్ అతని నివాసం. కాకినాడ జిల్లా హెచ్.కొత్తూరు నుంచి ఉపాధి కోసం కొన్నాళ్ల క్రితం గాజువాక వచ్చాడు డేవిడ్. అక్కడ పాసింజర్ ఆటో కొనుక్కుని నడుపుతున్నాడు. మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్న డేవిడ్‌కు తానుంటున్న అద్దె ఇంట్లో వాటిని పెంచడానికి స్థలం లేదు. దీంతో తన ఆటోలోనే వాటిని పెంచాలన్న ఆలోచన కలిగింది. ఆటోకు కుడివైపున, హ్యాండిల్‌కు ఇరువైపులా బోల్టులు బిగించి కుండీలను స్థిరంగా ఏర్పాటు చేసి వాటిలో అందమైన మొక్కల పెంపకం ప్రారంభించాడు. వీటిలో ఆరోగ్యాన్నిచ్చే పసుపు మొక్కలు, సుగంధ పరిమళాన్ని వెదజల్లే మొరవంతో పాటు మనీప్లాంట్, పూలమొక్కలు వెరసి 11 రకాల మొక్కలను పెంచుతున్నాడు. అంతేకాదు ఆటోకు ముందు భాగంలో, అద్దానికి పైన, ఆటో లోపల కాళ్లు ఉంచే చోట్ల పచ్చని మ్యాట్లను కూడా అమర్చాడు. ఇలా ఆటో లోపల, బయట పచ్చదనంతో నింపేశాడు. పసుపు పచ్చని ఆటో చుట్టూ ఆకుపచ్చని మొక్కలతో ఆ ఆటో రోడ్లపై వెళ్తుంటే చూసే వారికి కనువిందు చేస్తోంది. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముచ్చట పడిన వారు ఈ ఆటో ఫొటోలను కూడా తీసుకుంటున్నారు. స్కూలు పిల్లలను ఎక్కువగా తీసుకెళ్లే డేవిడ్.. తన ఆటోలో మొక్కలు, పచ్చదనాన్ని చూసి వారు మురిసిపోతుంటారు. వీటిని ఈ స్కూలు పిల్లలు గాని, డేవిడ్ పరిసర ప్రాంతాల వారు గాని పాడు చేయరు. అన్నట్టు.. డేవిడ్ ఆటోలో మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన ఆవు గత్తాన్ని తన సొంతూరు నుంచి ప్రత్యేకంగా తెస్తుంటాడు. ఒకసారి తెచ్చిన గత్తం ఐదారు నెలలకు సరిపోతుంది. పచ్చదనంపై మమకారంతో.. చిన్నప్పట్నుంచి నాకు పచ్చదనం అంటే ఇష్టం. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు మేలు చేస్తాయని తెలుసు. నేనుంటున్న అద్దె ఇంట్లో మొక్కల పెంపకానికి జాగా లేదు. అందుకే నా ఆటోలో శాశ్వతంగా మొక్కలు ఏర్పాటు చేస్తే పచ్చదనంతో పాటు పర్యావరణాన్ని నా వంతు కాపాడవచ్చని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను. పగలంతా నగరంలో తిరిగి రాత్రి వేళ ఆ మొక్కలకు నీరు పోస్తాను. ఇక నా ఆటోలో ప్రయాణించే వారు పచ్చని పార్కులో కూర్చొని జర్నీ చేస్తున్న అనుభూతి పొందుతున్నామని చెబుతుంటారు. ఆ మాటలు వింటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. – ఎం.డేవిడ్, ఆటోడ్రైవర్, గాజువాక -
అది పాదయాత్ర కాదు.. ఉత్తరాంధ్రపై దండయాత్ర
గాజువాక: పరిపాలన రాజధానిని విశాఖలో ఏర్పాటు చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని.. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలంటూ విద్యార్థులు నినదించారు. పరిపాలన రాజధానికి మద్దతుగా స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో గాజువాకలో బుధవారం ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు.. అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ కాంతారావు మాట్లాడుతూ అమరావతి రైతుల పేరుతో చేపట్టిన పాదయాత్ర పెట్టుబడిదారుల పాదయాత్ర అని, అది చంద్రబాబు బినామీల పాదయాత్ర అని.. అది ఉత్తరాంధ్రపై దండయాత్రగా చెప్పారు. చంద్రబాబు బినామీలు, ఆయన సామాజికవర్గానికి చెందినవారు అమరావతిలో భూములు కొనుగోలు చేశారని, వారి అభివృద్ధి కోసం ఆయన రాష్ట్ర సమగ్రాభివృద్ధిని అడ్డుకొంటున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిని ఓర్వలేక ఈ ప్రాంత ప్రజలపై చంద్రబాబు దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్రను విశాఖలోకి రానిచ్చేదిలేదని, పాయకరావుపేట దగ్గర అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు, ఇక్కడి నేతలు పరిపాలన రాజధానిగా విశాఖకు మద్దతు ప్రకటించాలని, లేకుంటే ఆయా నేతల ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంతారావు స్పష్టం చేశారు. గీతం విద్యా సంస్థల అధిపతి భరత్ అమరావతికి మద్దతు ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని, గీతం ద్వారా ఉత్తరాంధ్రలో కోట్లాది రూపాయలు సంపాదించుకుని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడటం హేయమైన చర్యని చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నవీన్‌దాస్, సోమశేఖర్, బాలాజీ, ఉదయ్, జాని, చందు, రాఘవ, వివేక్, జగదీష్, సన్ని తదితరులు పాల్గొన్నారు.