బాబు పాలనలో ఐటీరంగం రివర్స్‌ గేర్‌లోకి వెళ్లింది | YS Jagan Speech In Gajuwaka Public Meeting | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో ఐటీరంగం రివర్స్‌ గేర్‌లోకి వెళ్లింది

Apr 7 2019 7:06 PM | Updated on Mar 22 2024 11:32 AM

బినామీలకు కారుచౌకగా వేల కోట్ల విలువ చేసే భూమలను కేటాయించారు. బీచ్‌రోడ్డులో వేయ్యికోట్ల విలువ చేసే స్థలాన్ని ఓ ఫైస్టార్‌ హోటల్‌కు దారదత్తం చేశారు. భాగస్వామ్య సదస్సులతో రూ.150 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారు. ఈ సదస్సులతో 40 లక్షల ఉద్యోగాలు.. 20 లక్షల కోట్ల పెట్టుబడులున్నారు. వచ్చాయా ఉద్యోగులు? ఈ ధ్యాస హోదాపై పెట్టుంటే ఇప్పటికి వచ్చేది కదా..! ఉద్యోగాలు వచ్చేవి కావా? ఇదే విశాఖలో ప్రత్యేకహోదాకు అనుకూలంగా జగన్‌ అనే ప్రతిపక్ష నేతను ధర్నాకు రాకుండా అడ్డుకున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోమని కోరుతున్నా. ప్రతిపక్ష నేతపై వీఐపీ లాంజ్‌లోనే దాడి చేయించారు. వైఎస్సార్‌ హయాంలో ఇక్కడ ఐటీ రంగం పరుగులు పెడితే.. ఇదే చంద్రబాబు హయాంలో ఐటీరంగం రివర్స్‌ గేర్‌లోకి వెళ్లింది. గతంలో వైఎస్సార్‌ హయాంలో 16 వేల ఉద్యోగాలు ఉంటే.. ఇప్పుడు 12వేలకు తగ్గిపోయాయి. ప్రయివేట్‌ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు చరిత్ర కలిగిన ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని ఎలా నిర్విర్యం చేస్తున్నారో మీ అందరికి తెలుసు. అక్కడ ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయరు. గీతం యూనివర్సిటీకి వెళ్లేలా ఇలా చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement