విశాఖ : రాష్ట్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోనివ్వమంటూ సీమాంధ్రలో రగిలిన ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. వరుసగా ఏడో రోజు మంగళవారం సీమాంధ్ర జిల్లాల్లో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖ జిల్లా గాజువాకలో బంద్కు వర్తక, వాణిజ్య సంఘాలు పిలుపునిచ్చాయి. మరోవైపు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు ఆమరణ దీక్షలకు సిద్ధం అయ్యారు.
కాగా విశాఖలో అన్ని ప్రయివేటు, ప్రభుత్వ సంస్థల బంద్ కొనసాగుతోంది. అయితే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణిచివేసేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాఠశాల, ఇంటర్ విద్యార్థులు ఉద్యమంలో పాల్గొంటే జువైనల్ చట్టాన్ని అమలు చేస్తామని డీఈవో, ఆర్ఐఓలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. కాకినాడ పోర్ట్ కార్యకలాపాలను వైఎస్ఆర్ సీపీ స్తంభింప చేసింది. అలాగే జర్నలిస్ట్ సంఘాల జేఏసీ నిరసనలకు దిగారు. కాగా కర్నూలు జిల్లా నంద్యాలలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
సమైకాంధ్రాకు మద్దతుగా గాజువాకలోబంద్
Published Tue, Aug 6 2013 9:48 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement