samiakhyandhra
-
కష్టపడదాం ప్రగతి సాధిద్దాం
ఏడు మిషన్ల ద్వారానే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుంది సమైక్యాంధ్ర ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తేస్తాం పట్టణ, పల్లెప్రాంతాల్లో 24 గంటల విద్యుత్తు సరఫరాకు చర్యలు చేపట్టాం ఎన్ని అడ్డంకులు ఎదురైనా రుణమాఫీ చేసి తీరుతాం తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి 68వ స్వాతంత్య్ర సంబరాల్లో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సాక్షి, చిత్తూరు : ‘‘అభివృద్ధికోసం ప్రభుత్వం ప్రాధాన్య రంగాలను గుర్తించి ఏడు మిషన్లుగా విభజించింది. వీటి అమలుతో ఇటు జిల్లా అభివృద్ధి, అటు రాష్ట్ర అభివృద్ధి సుసాధ్యమవుతుంది. ఆదాయవనరులు పెంచుకుని, జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుని ఐదేళ్లలో ‘ఏడు మిషన్ల’ లక్ష్యాన్ని సాధించాలి. విజన్ 2029లో పొందుపరిచిన లక్ష్యాలను 2022కే చేరుకోవాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిస్థాయిలో పనిచేసి లక్ష్యసాధనకు శ్రమించాలి.’’ అని పర్యావరణ, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. 68వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఆయన శుక్రవారం చిత్తూరు పోలీసుపరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశస్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు శ్రద్ధాంజలి ఘటించారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఆపై జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ లక్ష్యాలను ఆయన సోదాహరణంగా వివరించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.‘‘రాబోయే రోజుల్లో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో రాష్ట్రాభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. అన్నివర్గాల ప్రజలకు సంక్షేమఫలాలను అందించే పాలన వ్యవస్థను సిద్ధం చేస్తున్నాం. లక్ష్యాలను నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తిచేసి ఫలితాలు రాబట్టేందుకు ఏడు ప్రాధాన్య రంగాలను గుర్తించాం. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం,ఉత్పాదకత పెంచడం, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, పర్యాటక రంగం అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ , స్త్రీశిశు సంక్షేమ ఆరోగ్యం, విద్య, తాగునీరు, పారిశుద్ధ్య కల్పన అంశాలతో మిళితమైన ఁసెవెన్మిషన్*ను అనుకున్న కాలపరిమితిలో పూర్తిచేస్తే జిల్లాతో పాటు రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యమకారులపై నమోదైన కేసులన్నీ ఎత్తేస్తాం. అందరికీ అనువైన రాజధాని ఏర్పాటు చేస్తాం. నాయుడుపేట-విజయవాడ, విశాఖపట్నం-విజయవాడ నాన్‌స్టాప్ రైళ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికష్టాలు ఎదురైనా రుణమాఫీ చేస్తాం : ఈ ఏడాది మార్చి 31 వరకూ తీసుకున్న రుణాల్లో ఒక్కో కుటుంబానికి 1.5లక్షల రూపాయల వరకూ మాఫీ చేస్తాం. డ్వాక్రా గ్రూపుల్లో ఒక్కో సంఘానికి లక్ష రూపాయలు మాఫీ చేస్తాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రుణమాఫీ చేసి తీరుతాం. పంటలబీమా గడువును సెప్టెంబర్ 15 వరకూ పెంచాం. రైతులంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. పల్లెలు, పట్టణాల్లో 24 గంటల విద్యుత్ సరఫరాకు ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఈ ఏడాది 14,637 హెక్టార్లలో డ్రిప్, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసేందుకు లక్ష్యం నిర్ధేశించుకున్నాం. వాటర్షెడ్లు, ఫాం పాండ్లు, చెక్‌డ్యాంలు, నీరు-చెట్టు కార్యక్రమాలకు 436కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించాం. ఈ ఏడాది ఎన్.టి.ఆర్ సుజల స్రవంతి ద్వారా 2రూపాయలకు 20 లీటర్ల శుద్ధిజలాన్ని అందిస్తాం. ఇప్పటికే చిత్తూరు, శ్రీకాకాళం మునిసిపాలిటీలో ప్రక్రియ ప్రారంభించాం. ఈ ఏడాది తెలుగుగంగకు 85కోట్లు, హంద్రీ-నీవాకు 205.70కోట్లు, గాలేరు-నగరి ప్రాజెక్టు పనులకు 100కోట్ల అంచనాతో పనులు చేపట్టనున్నాం. రాష్ట్రంలోనే మల్బరీసాగులో జిల్లా ప్రథమస్థానంలో ఉంది. పాడిఉత్పత్తిలో రాష్ట్రంలో అగ్రగామిగా ఉన్నాం. వీటి అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటాం. అంతర్జాతీయ విద్యాకేంద్రంగా తిరుపతి : ప్రసిద్ధపుణ్యక్షేత్రం తిరుపతిని అంతర్జాతీయ విద్యాకేంద్రంగా అభివృద్ధి చేస్తాం.ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌లను తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేస్తున్నాం. రాష్ట్రంలో మూడు మెగాసిటీల అభివృద్ధి ప్రక్రియలో తిరుపతి కూడా ఉండటం జిల్లావాసులందరికీ గర్వకారణం. ఆరోగ్యశ్రీ స్థానంలో త్వరలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకార్డులు జారీ చేస్తాం. జిల్లాలో ఆధార్‌సీడింగ్ 85శాతం పూర్తయింది. వంద శాతం పూర్తిచేస్తాం. విద్యార్థుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 100కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నాం. ఎర్రచందనం అడవుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. జిల్లా అభివృద్ధికి శ్రమిస్తున్న అధికార యంత్రాంగానికి , శాంతిభద్రతల కోసం శ్రమిస్తున్న పోలీసులకు అభినందనలు. మంత్రి ప్రసంగం అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. తర్వాత పలు ప్రభుత్వశాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. అయితే ఉద్యోగుల తరఫున ఆయా శాఖాధిపతులకు మాత్రమే వేడుకల్లో ప్రశంసాపత్రాలు అందించడం ఉద్యోగులను తీవ్రంగా బాధించింది. వేడుకల్లో కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ, మేయర్ కఠారి అనురాధతో పాటు అన్ని ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు. -
సమస్యలతో‘రణం’
నూతన పాలకవర్గాలకు సమస్యల స్వాగతం జిల్లా అంతటా తాగునీటి సమస్య అధ్వానంగా డ్రెయిన్లు, అంతర్గత రోడ్లు మచిలీపట్నం : ఎట్టకేలకు పురపాలక సంఘాల్లో నూతన పాలకవర్గాలు గురువారం నుంచి కొలువుదీరనున్నాయి. జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాలను గత మూడున్నర సంవత్సరాలుగా ప్రత్యేకాధికారులే పాలిం చారు. సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన తదితర అంశాల నేపథ్యంలో పాలన కుంటుపడింది. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నందిగామ, ఉయ్యూరు, తిరువూరు నగర పంచాయతీల్లో తొలిసారిగా పాలకవర్గాలు పాలనా పగ్గాలు చేపట్టనున్నాయి. ప్రతి పురపాలక సఘంలోనూ తాగునీరు, డ్రెయినేజీ, అంతర్గత రహదారులు, డంపింగ్ యార్డులు, దోమల బెడద వంటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. చాలా సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడి తాగునీరు కలుషితమవుతోంది. జగ్గయ్యపేట, తిరువూరు వంటి పురపాలక సంఘాలకు నూతన పైప్‌లైన్ నిర్మాణం కలగానే మిగిలిపోయింది. కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్లు, డ్రెయినేజీలు ఏకమై మురుగునీరు రోడ్లపైనే ప్రవహించటం రివాజుగా మారింది. ఈ నేపథ్యంలో కొలువుదీరుతున్న నూతన పాలకవర్గాలకు ప్రధాన సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఉయ్యూరు నగర పంచాయతీలో తాగునీరు ప్రధాన సమస్యగా మారింది. నివేశనా స్థలాల కోసం వందలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఈ పురపాలక సంఘానికి సొంత భవనం లేదు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ సమస్య పట్టణవాసులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తిరువూరు నగర పంచాయతీలోనూ తాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. రూ.100 కోట్ల అంచనాలతో కృష్ణానది నంచి పైప్‌లైన్ నిర్మాణానికి అంచనాలు రూపొందించి అనుమతి కోసం పంపారు. ఈ ప్రతిపాదనలు కాగితాలను దాటడం లేదు. పురపాలక సంఘానికి కార్యాలయం నిమిత్తం రూ.50 లక్షలతో భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులు పునాదుల దశలోనే నిలిచిపోయాయి. డ్రెయినేజీ సమస్యతోపాటు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు లేరు. నందిగామ నగర పంచాయతీలో మునేరు నుంచి పట్టణంలోకి తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఏర్పాటు చేసిన పైప్‌లైన్ దెబ్బతిన్నది. దీంతో గత నెల రోజులుగా పట్టణవాసులకు తాగునీటి సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. అంతర్గత రహదారులు దారుణంగా ఉన్నాయి. పురపాలక సంఘానికి కార్యాలయ భవనం లేదు. సిబ్బంది కొరత ఉంది. గుడివాడలో పురపాలక సంఘ నూతన భవన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. చాలా సంవత్సరాల క్రితం నిర్మించిన పైపులైన్లు లీకవుతూ తాగునీరు కలుషితమవుతోంది. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. నూతనంగా నిర్మించిన కాలనీల్లో మౌలిక వసతుల కల్పన కలగానే మిగిలింది. పెడన పురపాలక సంఘంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. రూ.2 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మించేందుకు రూపొందిం చిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ ఇబ్బందికరంగా మారింది. డంపింగ్ యార్డు అవసరం. ఎన్టీఆర్ కాలనీ, వైఎస్సార్ కాలనీ, బ్రహ్మపురం తదితర ప్రాంతాల్లో తాగునీరుతోపాటు అనేక సమస్యలు తిష్టవేశాయి. జగ్గయ్యపేటలో తాగునీటి సమస్య పరిష్కారానికి ముక్త్యాల నుంచి 9 కిలో మీటర్ల మేర పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా కార్యరూపం దాల్చలేదు. పట్టణం నడిబొడ్డున ఉన్న చెరువు అభివృద్ధికి నోచుకోవటం లేదు. డంపింగ్‌యార్డు సమస్య ఏళ్ల తరబడి అలాగే ఉంది. నూజివీడులో రూ.66 కోట్లతో నిర్మిస్తున్న పైప్‌లైన్ పనులు పూర్తికావాల్సి ఉంది. విజయవాడ సమీపంలోని గొల్లపూడి నుంచి నూజివీడు వరకు ఈ పైప్‌లైన్‌ను నిర్మిస్తున్నారు. మచిలీపట్నంలో డ్రెయినేజీ సమస్య ప్రధానంగా ఉంది. తరకటూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి మచిలీపట్నం పుట్లమ్మచెరువు వరకు 11.5 కిలోమీటర్ల మేర తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడి నీరు వృథా అవుతోంది. రూ. 80 కోట్లతో ప్రారంభించిన ఓపెన్ డ్రెయినేజీ పనులు కూడా నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. డంపింగ్‌యార్డు సమస్య ఉంది. -
బాబు మనసు విప్పేనా?
=ప్రజాగర్జన పేరిట క్యాడర్ జారిపోకుండా తంటాలు =సమైక్యాంధ్ర ఊసేలేకుండా =టీడీపీ ప్రజాగర్జన =తంబళ్లపల్లె, పలమనేరు, పీలేరుల్లో పార్టీకి దిక్కులేదు సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు తిరుపతి ప్రజాగర్జన సభ ద్వారా తన మనసులోని మాట బయటపెడతారా లేక మళ్లీ పాత పాటే పాడుతూ సమన్యాయం అంటారా అని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. టీడీపీ ప్రజాగర్జన సభ తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో ఆదివారం జరగనుంది. ఈ సభ ఏర్పాట్లలో ఎక్కడా సమైక్యాంధ్ర నినాదాలు, ఆ భావన వచ్చే విధంగా ప్రకటనలు లేకుండా టీడీపీ అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంది. చంద్రబాబు మనసులోని ఆలోచనకు అనుగుణంగానే రాష్ట్ర విభజనపై స్పష్టత ఇవ్వకుండా సభ ఉంటుందని ఎన్టీఆర్ భవన్ నుంచి జిల్లా నాయకులకు సూచనలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే తిరుపతి నగరం, సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీల్లో ఎక్కడా సమైక్యాంధ్ర ప్రస్తావనే లేదు. శ్రేణులను కాపాడుకునేందుకే రాష్ర్ట విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇవ్వడంతో జిల్లా నాయకులు సైతం ప్రజల్లోకి వెళ్లలేక లోలోపల మదనపడుతున్నారు. పార్టీ శ్రేణులు చేజారిపోకుండా ఉండేందుకే ప్రజాగర్జన పేరుతో తంటా లు పడుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసమీకరణకు తంటాలు ప్రజాగర్జన సభ జనసమీకరణకు సంబంధించి 14 నియోజకవర్గాల్లోని జిల్లా నాయకులు, రెండవ శ్రేణి నాయకులకు కోటాలు ఇచ్చారు. ఐదేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నామని, ఇంకా ఖర్చు చేసే పరిస్థితి లేదని కొందరు నేతలు ముఖం చాటేస్తున్నారు. మరికొం దరు అధిష్టానం పోరు పడలేక పరిమిత సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. జనసమీకరణను జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు ముద్దుక్రిష్ణమనాయుడు, బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి పర్యవేక్షిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. పార్టీ జిల్లా ఇన్చార్జ్, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ మూడు రోజుల ముందే జిల్లాకు విచ్చేసి ముఖ్యనాయకులతో సమావేశమైనా తెలుగుతమ్ముళ్లు జనసమీకరణపై పెద్దగా దృష్టి సారించలేదు. తిరుపతిలో మొన్నటి వరకు కీలకంగా ఉన్న ఒక సామాజికవర్గానికి చెం దిన నాయకుడు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చదలవాడ వైఖరి కారణంగా దూరంగా ఉన్నారు. సభా స్థలి వద్ద గాలి ముద్దుక్రిష్ణమనాయుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ జనాన్ని తరలించేందుకు తమ నాయకులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్ప డం గమనార్హం. బాబుకు గాంధీ షాక్ మాజీ ఎమ్మెల్యే, జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గాంధీ ఏకంగా చంద్రబాబు షాక్ ఇచ్చారు. చిత్తూరు ఎంపీ సీటు ఆశించి భంగపడిన ఆయన పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. జిల్లాలో ఇప్పటికే చంద్రగిరి, తంబళ్లపల్లె, పలమనేరు, పీలేరు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లు లేరు. తాజాగా ఈ జాబితాలో జీడీ నెల్లూరు నియోజకవర్గం చేరింది. అంతర్గత మంతనాలకే అధిక సమయం చంద్రబాబు ప్రజాగర్జన సభకు వస్తున్నా అధిక సమయం పార్టీ అంతర్గత సమీక్షలు, చర్చలకే కేటాయించనున్నారు. బాబు ఆదివారం ఉదయం తిరుపతి చేరుకుంటారు. తర్వాత తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుపతిలోని ఒక హోటల్‌కు చేరుకుంటారు. ఉదయం దాదాపు రెండు గంటల సేపు నాయకులతో పార్టీ పరిస్థితిపై సమావేశం కానున్నారు. జిల్లాలో ఇప్పటికే ైవె.ఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం, ఓదార్పు నిర్వహిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. దీనికి జనం నుంచి అనూహ్య స్పందన వస్తుండడంపై సాయంత్రం నాయకులతో వన్ టూ వన్ మీటింగ్‌లో బాబు ఆరా తీయవచ్చునని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాగర్జన అనంతరం ఇదే హోటల్లో బస చేసి పొద్దుపోయే వరకు నియోజకవర్గాల వారి నాయకులను పిలిచి మాట్లాడనున్నారు. నేతల చేరికపై ఆరా కాంగ్రెస్‌కు చెందిన మంత్రి గల్లా అరుణకుమారి, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ, మరికొందరు త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ అంశమూ బాబు వద్ద ప్రస్తావనకు రావొచ్చు. వీరిని చేర్చుకుంటే ఆయా నియోజకవర్గాల్లో తెలుగుతమ్ముళ్లు ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది నాయకులను ఆరా తీసే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద ఎన్నికల్లో పార్టీ గాడి తప్పకుండా, తమ్ముళ్లను అదుపులో ఉంచుకునేందుకే గర్జన పేరుతో బాబు తంటాలు పడుతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. -
లొసుగుల టీ నోట్‌ను రాష్ట్రపతికి పంపుతారా ?
= ప్రథమ పౌరుడిని పక్కదారి పట్టిస్తున్నారా...? = కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు బెంగళూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సాధన కోసం పలు సంఘాలు ఒక్కటవుతున్నా రాజకీయ నాయకులు ఎందుకు ముందుకు రావడం లేదని కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి ప్రశ్నించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతికి ఇచ్చిన టీ నోట్లో లొసుగులు ఉన్నాయని పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారని, వాటిలో నిజంగా లొసుగులు ఉంటే యుపీఏ ప్రభుత్వం రాష్ట్రపతిని పక్కదోవపట్టించడానికి ప్రయత్నించిందా? లొసుగులు ఉన్న నోట్‌ను రాష్ట్రపతికి ఎలా పంపించారు? అని ఆయన ప్రశ్నించారు. దేశ ప్రథమ పౌరుడికి ఇచ్చే నోట్ ఈ విధంగా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి రాష్ర్టపతి తల వంచరాదని విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్ర కోసం శక్తి వంచనలేకుండ కృషి చేసే నాయకులకు ప్రజలు ఓట్లు వేస్తారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు వంద సంఘాలు కలిసి తెలుగు ప్రజా వేదికగా ఏర్పడి సమైక్యాంధ్ర కోసం ఉద్యమానికి సిద్ధం కాగా రాజకీయ నాయకులు జేఏసీగా ఏర్పడటానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోసం ఎవరు పోరాటం చే స్తున్నారు, ఎవరు రెండు కళ్ల సిద్ధాంతం అనుసరిస్తున్నారు అని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కర్ణాటక తెలుగు ప్రజా సమితి కార్యకర్తలు, ప్రవాసాంధ్రులు జనవరి ఒకటిన జై సమైక్యాంధ్ర.... జై జై సమైక్యాంధ్ర నినాదాలతో రాసిన బోర్డులు తమ ఇళ్ల ఎదుట తగిలిస్తామని బొందు రామస్వామి అన్నారు. సమావేశంలో కేటీపీఎస్ నాయకుడు శివకుమార్ పాల్గొన్నారు. ఇదే సందర్భంలో కొత్తచెరువు వద్ద రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు కర్ణాటక తెలుగు ప్రజా సమితి తరుపున బొందు రామస్వామి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. -
సమైక్యమే శరణ్యం
=ఆవిధంగానే అభివృద్ధి సాధ్యం =అందుకే జగన్ మహోన్నత ఉద్యమం =వైఎస్సార్సీపీ కన్వీనర్ చొక్కాకుల స్పష్టీకరణ =పాడేరులో భారీ స్థాయిలో సమైక్య శంఖారావం పాడేరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే నినాదంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహోన్నత ఉద్యమం చేపట్టారని పార్టీ రూరల్ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు చెప్పారు. పాడేరులోని మోదకొండమ్మ ఆలయ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి పార్టీ అధ్యక్షుడు సుదీర్ఘ పోరాటం చేపట్టారని తెలిపారు. సమైక్యాంధ్రకు కట్టుబడిన ఏకైక నేతగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నిరంకుశ విధానాలను గ్రామగ్రామాన తమ పార్టీ ఎండగడుతుందని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ రెండూ రాష్ట్ర విభజనకు ప్రధానంగా కారణమని స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీలను రానున్న ఎన్నికల్లో తరమికొట్టి సమైక్యాంధ్ర ఉద్యమానికి కట్టుబడి ఉన్న వైఎస్సార్సీపీకే పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అరకుపార్లమెంటరీ సమన్వయకర్త కొత్తపల్లి గీత మాట్లాడుతూ మహానేత రాజశేఖరరెడ్డి ఆశయాలే ధ్యేయంగా జగన్ పనిచేస్తున్నారని, ఈ కుటుంబాన్ని కాంగ్రెస్ పెద్దలు అష్టకష్టాలు పెడుతున్న తీరును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని కోరారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం కన్వీనర్ అదీప్‌రాజు మాట్లాడుతూ వైఎస్ కన్నుమూసిన నాటి నుంచి రాష్ట్రం అధోగతి పాలైందని చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్రా న్ని అభివృద్ధి చేయకపోగా విభజనకు పూనుకొని సీమాంధ్రకు అన్యాయం చేస్తున్న విషయాన్ని ప్రజలు గ్రహిం చాలని కోరారు. నియోజకవర్గం సమన్వయకర్తలు వంజంగి కాంతమ్మ, గిడ్డి ఈశ్వరి, సీకరి సత్యవాణి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని చెప్పారు. భారీ ఎత్తున జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు, పార్టీ నేతలు ఎస్.వి.వి.రమణమూర్తి, స్వా ముల సుబ్రమణ్యం, సెర్రెకి గంగయ్యదొర, ఉగ్రంగి కళ్యాణి, మామిడి చంద్రరావు, ఎస్.వెంకయమ్మ తదితరులు పాల్గొన్నారు. శంఖారావం స మావేశం సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీతో పాడేరు హోరెత్తింది. ని యోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులంతా ర్యాలీలో పాల్గొని సమైక్య నినాదాలతో కదం తొక్కారు. నాయకులు ముందుగా అంబేద్కర్, వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
కాంగ్రెస్ ఎంపీల అవిశ్వాసం నోటీస్ ఓ డ్రామా
= వారికి సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి లేదు = చంద్రబాబుతో లగడపాటి, జేసీ కుమ్మక్కు = వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ధ్వజం మడకశిర, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర విషయంలో కాంగ్రెస్ ఎంపీలు డ్రామాలాడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మడకశిరలోని మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి స్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల్లో హీరోలు కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాసం నోటీసు ఇచ్చారని, అయితే వారికి సమైక్యాంధ్రపై ఏమాత్రమూ చిత్తశుద్ధి లేదని విమర్శించారు. చిత్తశుద్ధి ఉండివుంటే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించి, ఎందుకు ఆమోదింప జేసుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్, జేసీ దివాకర్‌రెడ్డి కుమ్మక్కై జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ టికెట్ల కోసమే వారు చంద్రబాబుతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. టీడీపీ సీమాంధ్ర ఎంపీలు, ప్రజాప్రతినిధులు కూడా సమైక్యాంధ్రపై నాటకాలు ఆడుతున్నట్లు దుయ్యబట్టారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జాతీయ స్థాయిలో పాటుపడుతున్నట్లు చెప్పారు. జగన్ ప్రయత్నాన్ని సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు హర్షించకుండా విమర్శలు చేయడం దారుణమన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్న విషయం తెలిసికూడా ముఖ్యమంత్రి, సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు పట్టించుకోలేదని విమర్శించారు. 16న మడకశిరలో సమైక్య శంఖారావం సభ మడకశిరలోని వైఎస్సార్‌సర్కిల్‌లో ఈ నెల 16న ఉదయం పది గంటలకు సమైక్యశంఖారావం సభను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికారప్రతినిధి వైసీ గోవర్దన్‌రెడ్డి తెలిపారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి హాజరవుతారన్నారు. అలాగే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ముఖ్య నేతలు విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి కవిత తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. -
9 నుంచి కీలక ఉద్యమం
విజయవాడ, న్యూస్‌లైన్ : ఈ నెల 9వ తేదీ నుంచి కీలకమైన ఉద్యమం ప్రారంభమవుతుందని ఏపీఎన్జీవో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య యువజన సదస్సు బెంజ్‌సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో గురువారం జరిగింది. హాలు ప్రాంగణం అంతా సమైక్య నినాదాలతో హోరెత్తిపోయింది. అశోక్‌బాబు మాట్లాడుతూ 9న సమైక్యాంధ్ర విద్రోహ దినంగా పరిగణించాలన్నారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే లక్షలాది మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు కృష్ణయాదవ్ మాట్లాడుతూ చదువు, సంస్కారం లేని సోనియా గాంధీ రాష్ట్ర విభజన చేస్తున్నారని విమర్శించారు. పీవీ నరసింహారావు గాంధీ కుటుంబాన్ని పక్కనబెట్టి పాలన సాగించారని, తెలుగువారు కలిసి ఉంటే మరలా వారికి ఎటువంటి ఆపద వస్తుందోనని రాష్ట్రాన్ని విభజిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రాంతవాసులు గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తామని చెప్పి కలిసి, అభివృద్ధి చెందిన తరువాత విడిపోతామని డిమాండ్ చేస్తే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాష్ట్ర సమైక్య యువజన కన్వీనర్ కిశోర్‌కుమార్ మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ 9 నెలల పాటు రాష్ట్రం అంతటా పర్యటించి తెలంగాణా అభివృద్ధి చెందిందని, విభజన జరిగితే అనేక కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని నివేదికలో సమర్పించినట్లు చెప్పారు. సీమాంధ్రకు రూ.10 లక్షల కోట్లు ప్యాకేజి ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు.. ఆ డబ్బు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. నరేంద్రమోడి చిన్న రాష్ట్రాలకు బీజేపీ అనుకూలమని ప్రకటిస్తున్నారు కదా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ర్టంలో కూడా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉంది.. దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కోసం టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని ప్రశ్నించారు. విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి మాట్లాడుతూ రాజకీయాలు తిండి పెట్టవని, ఉద్యమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు తక్కువ పనిగంటలు పెట్టి అందరూ ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. తెలుగు జాతిని ఢిల్లీలో అమ్మేశారని విమర్శించారు. సోనియాగాంధీకి తెలుగు ప్రజలపై ఆసక్తి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంద్ర విద్యార్ది జేఏసీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మదిలో సమైక్యాంధ్ర నినాదం ఉంటూనే ఉందన్నారు. గుంటూరు జిల్లా జేఏసీ ప్రతినిధి శేషు మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఆగేవరకు ఉద్యమం ఆగదన్నారు. భావితరాల భవిష్యత్తు కోసమే ఈ ఉద్యమం చేపడుతున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తోందని తెలిపారు. ప్రకాశం జిల్లా జేఏసీ ప్రతినిధి జగదీష్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎందుకు రాష్ట్ర విభజనను ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా జేఏసి ప్రతినిధి డేవిడ్ మాట్లాడుతూ సమైక్య రాష్ర్టంలోనే విద్యార్థులకు ఉద్యోగాలు రావడం లేదు, రాష్ట్ర విభజన జరిగితే లభిస్తాయా అని అడిగారు. నేడు బంద్‌కు పిలుపు కేంద్ర కేబినెట్ రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవో సంఘం వేరొక ప్రకటనలో శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. -
ముగిసిన ‘మూడో విడత’
సాక్షి, విశాఖపట్నం : ప్రజల నిరసనలు, ఆందోళనల నడుమ మూడో విడత రచ్చబండ ముగిసింది. భీమిలిలో నవంబర్ 11న ప్రారంభమైన ఈ కార్యక్రమం శనివారం వరకు మొక్కుబడిగానే సాగింది. ప్రజలకు ప్రయోజనమివ్వని కార్యక్రమంగా మిగిలి పోయింది. సమైక్యాంధ్ర ఉద్యమంతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్యకు వచ్చేందుకు వేదికయింది. విస్తృత బందోబస్తు, విపరీత ఆంక్షల నడుమ ఈ సభలను అధికారులు, అధికారపార్టీవారు మమ అనిపించారు. సమస్యలపై ప్రశ్నించే వారిని అడ్డుకున్నారు. అన్ని మండల కేంద్రాల్లోనూ ఈ సభలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా రేషన్‌కార్డుల కోసం 62,059 , పింఛన్ల కోసం 28,482, ఇళ్ల కోసం 59,989 దరఖాస్తులొచ్చాయి. రేషన్‌కార్డులలో వయస్సు మార్పు కోసం మరో 1198 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీని నిర్వహణకు మండలానికి రూ.70వేలు చొప్పున ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు పైసా విదల్చలేదు. నవంబర్ 15న చోడవరంలో జరిగిన సభలో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు పసుపులేటి బాలరాజు, గంటా శ్రీనివాసరావులకు సభల్లో నిరసనలు ఎదురయ్యాయి. పాడేరు సభలో పెంచిన పరీక్ష ఫీజులను రద్దు చేయాలని విద్యార్థులు, బకాయి వేతనాలు చెల్లించాలని పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున మంత్రి బాలరాజు ఎదుట నిరసన తెలిపారు. సభలోకి చొచ్చుకెళ్ళేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎస్టీ జాబితాలో చేర్చాలని కొండకుమ్మర్లు మంత్రిని నిలదీశారు. అనకాపల్లి సభలో మంత్రి గంటా శ్రీనివాసరావుకూ నిరసనలు తప్పలేదు. ఇక్కడ సమస్యల్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించిన 54మంది టీడీపీ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు చేదు అనుభవం ఎదురయింది. యలమంచిలి మండలం పీఎన్ఆర్పేట కార్యక్రమంలో ఇందిరమ్మ బిల్లు అందలేదంటూ మొగ్గా అప్పారావు అనే లబ్ధిదారుడు ప్రస్తావించగా ఎమ్మెల్యే కన్నబాబు సహనం కోల్పోయి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరబుపాలెం సభలో వేదికపైకి ఎందుకు తనను ఆహ్వనించలేదని గ్రామ సర్పంచ్ లంబా అప్పారావు ప్రశ్నించగా.. ‘ఇది అధికారుల సభ అని,పిలవాల్సిన అవసరం లేదని, ఇదే నా స్టయిల్ ’ అని దురుసుగా మాట్లాడారు. క్రషర్ డీడీ చార్జీలను విపరీతంగా పెంచడంపై తిమ్మరాజుపేటలో పలువురు రైతులు ఎమ్మెల్యే కన్నబాబును నిలదీశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అరకులోయలో జరిగిన రచ్చబండలో ఎమ్మెల్యే సోమ ప్రసంగాన్ని ఏపీ గిరిజన సంఘం సభ్యులు అడ్డుకున్నారు. గత రచ్చబండలో ఇచ్చిన వినతులను ఇప్పటికీ ఎందుకు పరిష్కరించలేదని నిలదీసిన గిరిజన సంఘం ప్రతినిధులు, విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. కశింకోట సభకు మంత్రి గంటా హాజరు కాకపోవడంతో స్థానికులు అధికారుల్ని నిలదీశారు. -
రహదారుల దిగ్బంధం
సాక్షి, విశాఖపట్నం : సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 6, 7 తేదీల్లో రహదారుల దిగ్బంధానికి పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీస్థాయిలో సమాయత్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి క్షేత్ర స్థాయి ఆందోళనలు చేపడుతున్న పార్టీ శ్రేణులు బుధ, గురువారాల్లో జిల్లా నలుమూలల జాతీయ రహదారులతోపాటు ప్రధాన రహదారులను దిగ్బంధించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు సోమవారం అన్ని నియోజక వర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు, నేతలు, కార్యకర్తలు నియోజక వర్గ స్థాయిలో నిర్వహించిన సమావేశాల్లో ఏ విధంగా చేయాలనే దానిపై చర్చించారు. ఇందులో భాగంగా ఆయా తేదీల్లో ఉదయం నుంచే పాయకరావుపేట నియోజక వర్గ పరిధిలోకి వచ్చే జాతీయ రహదారి మొదలు విజయనగరం జిల్లా వరకు ఉన్న హైవేపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని నేతలు నిర్ణయించారు. అనకాపల్లి, పాయకరావుపేట, ఎలమంచిలి, గాజువాక నియోజక వర్గాల పరిధిలోని జాతీయ రహదారిని ఉదయం నుంచే దిగ్బంధించాలని తీర్మానించారు. ప్రతి నియోజక వర్గంలో పార్టీ నేతలతో పాటు, అభిమానులు, సమైక్యాంధ్రను కాంక్షించే ప్రజా సంఘాలు, ఎన్జీవో సంఘాలతో కలిసి ఆందోళనలను ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని నియోజక వర్గాల్లో ఎన్జీవోలతోపాటు పలు ప్రజాసంఘాలు పార్టీతో కలిసి రహదారుల ముట్టడికి మద్దతు పలికాయి. దీంతో బుధ, గురువారాల్లో సమైక్యాంధ్ర ఉద్యమ హోరు మరింత తీవ్రతరం కానుంది. వైఎస్సార్సీపీ నిర్వహించే ఆందోళనలకు ఎక్కడికక్కడ సమైక్యాంధ్ర పరిరక్షణ పేరుతో స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొననున్నట్టు పార్టీ నేతలు వివరించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కదిలే ప్రతి ఒక్కరు ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కీలక కార్యక్రమం విజయవంతం కావడానికి ఇప్పటికే నియోజక వర్గ సమన్వయకర్తలు ఆయా మండల స్థాయి నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆందోళనల్లో భాగస్వామ్యం కావడానికి సమాయత్తం చేశారు. నగరంలోని నాలుగు నియోజక వర్గాల్లో భారీ స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. భారీ వాహనాలతోపాటు అన్నింటిని ఉదయం నుంచే దిగ్బంధించి సమైక్యాంధ్ర కాంక్షను అందరిలో మరింత రగిలించేలా కార్యాచరణ రూపొందించారు. పార్టీ జెండాలతోపాటు విభజనకు వ్యతిరేకంగా నినాదాలతో ప్రత్యేక బ్యానర్లు సిద్ధం చేశారు. -
వుధ్యాహ్న భోజనం ఇలాగేనా?
భాకరాపేట, న్యూస్‌లైన్: చిన్నగొట్టిగల్లు వుండల కేంద్రంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వుధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంపై మండల ప్రత్యేకాధికారి, జిల్లా హౌసింగ్ పీడీ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగన్నగారిగడ్డ గ్రావు పరిధిలోని కొల్లాపురవ్ము ఆలయుం సమీపంలో ఉన్న ఇస్కాన్ వంటశాలను సోమవారం వెంకటరెడ్డి, తహశీల్దార్ రాజగోపాల్, ఎంపీడీవో హుర్మత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇక్కడ భోజనం తయారీలో నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేపట్టారు. అధికారులు వంటశాల ఇన్చార్జి పీజీ.దాసుతో మాట్లాడడంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కిరణ్‌కువూర్‌రెడ్డి ప్రాతి నిథ్యం వహిస్తున్న పీలేరు, కలికిరి, వుంత్రి గల్లా అరుణకువూరి నియోజకవర్గం పరిధిలోని చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం వుండలాలకు చెందిన 14 వేల వుంది విద్యార్థులకు ఇక్కడి నుంచి వుధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. దాదాపు 50 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలకు భోజనం తీసుకెళుతారు. వుధ్యాహ్నం 12 గంటలకు భోజనం వడ్డించాల్సి ఉండగా, తెల్లవారు జా వుు 3 గంటలకు తయూరు చేసి, ఉదయుం 8 గంటలకు వాహనాల్లో తరలిస్తారు. మధ్యాహ్నం వడ్డిస్తుండడంతో అన్నం మెత్తబడిపోతోంది. కొన్ని సందర్భాల్లో అన్నం ఉడకడం లేదు. ముద్దకడుతోంది. దాన్ని తినలేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. స్టీమ్‌లో వంట చేసేటప్పుడు వంద కేజీల బియ్యుం ఉడకాలంటే 20 నుంచి 30 నిమిషాలు వ్యవధి పడుతుంది. ఇందులో ఒక్క నిముషం ఆ లస్యమైనా అన్నం వుుద్ద కడుతుంది. వుుందుగా అరుుతే బియ్యుం ఉడకవు. చిన్నచిన్న పొరబాట్లు మినహా అన్నం బాగా వస్తోందని పీజీ. దాసు అధికారుల దృష్టికి తెచ్చారు. అధికారులు చిన్నగొట్టిగల్లు హైస్కూల్‌కు చేరుకుని విద్యార్థులను విచారించారు. ఎక్కువ శాతం వుంది విద్యార్థులు తాము భోజనం తినడం లేదని చెప్పారు. హాస్టల్ విద్యార్థులు మాత్రం విధి లేని పరిస్థితుల్లో తినాల్సి వస్తోందని చెప్పారు. నివేదిక తయారు చేసి, కలెక్టర్‌కు పంపుతామని అధికారుల బృందం పేర్కొంది. అన్నం తింటే కడుపునొప్పి వస్తుంది పాఠశాలలో వుధ్యాహ్న భోజనం తింటే కడుపునొప్పి వస్తుంది. వురుగుదొడ్డికి వెంటనే వెళ్లాల్సి వస్తుంది. అందుకని భోజనం తినడం లేదు. -భార్గవ్‌రెడ్డి, 7వ తరగతి అన్నం ఉడకదు, కూరలు బాగుండవు ఉడకని అన్నం, నీళ్ల సాంబారుతో అన్నం తినలేకపోతున్నాం. ఒకవేళ తినాలనిపించినా అన్నం చూస్తే తినలేం. నీళ్లలో కలుపుకుని తిన్నట్లు ఉం టుంది. -అనిల్‌కువూర్, 6వ తరగతి ఇంటి నుంచి క్యారీ తెచ్చుకుంటాను స్కూల్లో పెట్టే భోజనం ఒక రోజు బియ్యుంగా ఉంటుంది. ఒక్క రోజు వుుద్ద కట్టి ఉంటుంది. విధి లేక ఇంటి దగ్గర నుంచి క్యారీ తెచ్చుకుని తింటున్నాను. -మేఘన, 9వ తరగతి వుధ్యాహ్నం కూడా హాస్టల్లో భోజనం పెట్టాలి ఇస్కాన్ భోజనం కంటే వూ హాస్టల్ భోజనం బాగుంటుంది. వుధ్యాహ్నం హాస్టల్లోనే భోజ నం పెట్టాలి. విధిలేక ఇస్కాన్ భోజనం తినాల్సి వస్తుంది. -సారుుశ్రీనివాస్, 9వ తరగతి -
కెరటమై ఎగసి..హామీ లేకుండానే ముగిసి..
=తెరుచుకోనున్న కార్యాలయాలు =రూ.400 కోట్ల లావాదేవీల స్తంభన సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా గత 66 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను ఉద్యోగులు తాత్కాలికంగా విరమించారు. పూర్తిస్థాయి హామీ రాకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో విరమణ నిర్ణయం ప్రకటించారు. దీంతో జిల్లాలో గత రెండు నెలలుగా మూతపడ్డ ప్రభుత్వ, మున్సిపల్ కార్యాలయాలు శుక్రవారం నుంచి తెరుచుకోనున్నాయి. ఇప్పటివరకు జిల్లాలోనే వివిధ విభాగాలకు సంబంధించి రూ.400 కోట్లకు పైగా లావాదేవీలు నిలిచిపోయినట్లు సమాచారం. సమ్మె ప్రభావంతో దుర్గగుడి దసరా ఉత్సవాలకు కూడా భక్తుల సంఖ్య సగానికి తగ్గిపోయింది. సమైక్యంపై స్పష్టమైన హామీ లేకపోయినా సమ్మె విరమించాల్సి రావడంపై ఎన్జీవో సంఘాల నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. సమ్మె ఎంతకాలం కొనసాగించాల్సి వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడటం, ఉపాధ్యాయులు, విద్యుత్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె నుంచి వెనక్కి తగ్గడంతో ఎన్జీవోలు కూడా 2014 వరకు రాష్ట్ర విభజన జరగదని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో సమ్మె నుంచి వైదొలుగుతున్నట్లు, పార్లమెంట్లో బిల్లు వస్తే మళ్లీ మెరుపు సమ్మెకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. సమ్మెలోకి వెళ్లిన తర్వాత ఎన్జీవోలు జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఉద్యమాలు నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ కూడా విజయవంతమైంది. జోరువానలోనూ ఒక్కరు కూడా వెళ్లకుండా మీటింగ్ అయ్యేవరకు సమైక్యస్ఫూర్తి చాటారు. రాజకీయ పార్టీలను కలుపుకోకుండా చేసిన ఒంటరి పోరాటం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయిందని ఎన్జీవో నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. తమ పోరాటం వల్ల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లగలిగామన్న సంతృప్తి వారిలో వ్యక్తమవుతోంది. విరమణ తాత్కాలికమే ఎంతో కీలకమైన విభాగమైన రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు సమ్మెలో ఉన్న కారణంగా ప్రజలు సర్టిఫికెట్లు, నిత్యావసరాల కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తాత్కాతికంగా సమ్మె విరమించటం జరిగింది. - సీహెచ్ అప్పారావు, రెవెన్యూ విభాగం ముందుకెళితే మళ్లీ ఉద్యమం అంగన్వాడీ కేంద్రాలు, ఇతర లబ్ధిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమించటం జరిగింది. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం ముందుకు వెళితే రాష్ట్ర కమిటీ సూచనతో మళ్లీ ఉద్యమబాట పడతాం. - ఎ.రామకోటయ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ ఎప్పుడైనా మెరుపుసమ్మె విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నాం. సీఎంతో జరిగిన చర్చల నేపథ్యంలో ప్రస్తుతం సమ్మెను ఆపాం. కేంద్రం పార్లమెంటులో తెలంగాణ విభజన బిల్లును పాస్‌చేసే అవకాశాలు ఉంటే ఎప్పుడైనా మెరుపు సమ్మెకు దిగుతాం. - సీహెచ్ మధుసూదనరావు, పాలిటెక్నిక్ కాలేజీ (ఏపీ ఎన్జీఓ విజయవాడ సంయుక్త కార్యదర్శి) ప్రజలకు కృతజ్ఞతలు ప్రస్తుత సమ్మె విరమణ తాత్కాలికమే. బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు మళ్లీ సమ్మె చేయడానికి అంతా సిద్ధంగా ఉన్నారు. ప్రజల మద్దతుకు కృతజ్ఞతలు చెబుతున్నాం. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టే పరిస్థితి ఉంటే మెరుపు సమ్మెకు దిగుతాం. - కర్రి నరసింహారావు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగ సంఘ జేఏసీ నేత ప్రజాప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, సమ్మె వల్ల ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఏపీఎన్జీవోలు విరమణకు దిగారు. ఈ ఉద్యమంలో వారు కుటుంబంలోని పెద్దన్న పాత్ర పోషించారు. సీమాంధ్రుల మనోభావాలకు అనుగుణంగా పోరాడారు. వారి పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ఎప్పుడైనా సిద్ధం. - ఎండీ ప్రసాద్, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి ఆలోచన రేకెత్తించగలిగాం.. ఏపీ ఎన్జీవోల సమ్మెతో సీమాంధ్రుల, తెలంగాణ సమస్య బయటపడింది. రాష్ట్ర విభజన అంశంపై ఆలోచన రేకెత్తించగలిగాం. చిత్తశుద్ధిలేని రాజకీయ నాయకులతో కాకుండా ఉద్యోగులతో ఇంతవరకు ఉద్యమం కొనసాగించగలిగాం. ఎంపీలు, ప్రజాప్రతినిధుల ప్రమేయంతోనే ఉద్యమాన్ని విజయవంతం చేయగలం. - రావి సుబ్బారావు, ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజనల్ కార్యదర్శి -
పట్టువదలం..పోరు విడవం
= ఉద్యమ విస్తరణ = రంగంలోకి కొత్త జేఏసీలు = తాజాగా ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఏర్పాటు = ఎక్సైజ్ లో మొదలైన సహాయ నిరాకరణ = విజయవాడ వీధుల్లో నినదించిన విద్యార్థినులు సాక్షి, విజయవాడ : సమైక్య ఉద్యమం రోజురోజుకూ విస్తరిస్తోంది. కొత్త పుంతలు తొక్కుతూ ప్రజల్లో సమైక్య స్ఫూర్తి నింపుతోంది. మొన్నటికిమొన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తమ ఉద్యోగులతో కలుపుకొని జేఏసీ ఏర్పాటుచేశారు. అదేరోజు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు కూడా జేఏసీగా ఏర్పడ్డారు. వారు కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేసి రంగంలోకి దిగారు. తాజాగా శుక్రవారం మరో జేఏసీ రంగంలోకి వచ్చింది. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులతో ఆ జేఏసీ విజయవాడలో పురుడుపోసుకుంది. సుమారు కోటిమంది వరకు విద్యార్థులు వారి నాయకత్వంలో ఉన్నారు. ఈ నెల 19 నుంచి విద్యార్థులు, అధ్యాపకులతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఉద్యమం శుక్రవారం కూడా ఉధృతంగా సాగింది. ప్రొహిబిషన్ ఎక్సైజ్‌శాఖ అధికారులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సహాయ నిరాకర ణ ఉద్యమం ప్రారంభమైంది. ఎక్కడికక్కడ సహాయ నిరాకరణ కార్యక్రమాలు చేపట్టారు. అనేకచోట్ల అధికారులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించారు. కొన్నిచోట్ల ధర్నాలు చేశారు. విజయవాడలో విద్యార్థి జేఏసీ నాయకుడు దేవినేని అవినాష్ నాయకత్వంలో విద్యార్థినులు ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జగ్గయ్యపేటలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలకు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను మద్దతు తెలిపారు. జేఏసీ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సమ్మెలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు జేఏసీ నాయకులు నిత్యావసర సరకులు అందజేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కొండపల్లిలో ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడ రిక్షా కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ రిక్షాలతో వలయం ఏర్పాటుచేశారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 66వ రోజుకు చేరుకున్నాయి. కైకలూరు తాలూకా సెంటర్లో ఎన్జీవో దీక్షలు 59వ రోజుకు చేరాయి. వారికి మద్దతుగా కైకలూరు పట్టణ ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ రిలే దీక్షలు చే పట్టారు. కలిదిండిలో భాస్కరరావుపేట గ్రామస్తులు రిలే దీక్షలు చేశారు. మండవల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో 11 మంది మాజీ సర్పంచ్‌లు రిలే దీక్షలు చేశారు. ముదినేపల్లిలో మండల సమైక్యాంధ్ర పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 26వ రోజుకు చేరుకున్నాయి. గుడివాడలో ఎన్జీవోల జేఏసీ, మున్సిపల్ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి. పామర్రులో విద్యార్థులు మానవహారం నిర్వహించి ర్యాలీ చేశారు. ఎమ్మెల్యే డీవైదాస్ కార్యాలయం వద్దకు వెళ్లి విభజనకు వ్యతిరేకంగా ప్రసంగించాలని ఆయన్ని కోరారు. పెనుగంచిప్రోలులో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 50వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో విశ్రాంత ఉద్యోగులు కూర్చున్నారు. వత్సవాయిలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 45వ రోజుకు చేరాయి. జేఏసీ ఆధ్వర్యంలో దివిసీమలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. చల్లపల్లిలో చేపట్టిన దీక్షలు 63వ రోజుకు చేరాయి. న్యాయవాదుల ఆధ్వర్యంలో చైతన్యయాత్ర... అవనిగడ్డ కోర్టుకు చెందిన న్యాయవాదులు సమైక్యాంధ్ర చైతన్యయాత్రను చల్లపల్లి మండలంలో నిర్వహించారు. అవనిగడ్డలో చేపట్టిన దీక్షలు 51వ రోజుకు చేరాయి. చేనేత కార్మికులు దీక్షా శిబిరం వద్ద నూలు వడుకుతూ నిరసన దీక్షలు చేశారు. మోపిదేవిలో బొబ్బర్లంక దళితవాడకు చెందిన రైతులు దీక్ష చేపట్టారు. ఘంటసాల, నాగాయలంక, కోడూరులో దీక్షలు కొనసాగుతున్నాయి. తిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలు 10వ రోజుకు చేరాయి. నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో బోసుసెంటర్లో ఏర్పాటుచేసిన శిబిరంలో పలువురు నాయకులు రిలేదీక్షలు చేపట్టారు. వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు పిడపర్తి లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో రిలేదీక్షలు నిర్వహించారు. తిరువూరులో జేఏసీ నాయకులు స్థానిక శాసనసభ్యురాలు దిరిశం పద్మజ్యోతి నివాసం వద్ద ధర్నా చేశారు. నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 65వ రోజుకు చేరాయి. చిన్నగాంధీబొమ్మ సెంటరులోని రిలేదీక్ష శిబిరంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జంక్షన్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 46వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్ ప్రారంభించారు. -
విభజన జరిగితే.. నీటియుద్ధాలే..
సాక్షి, విజయవాడ : అన్నదాత ఆగ్రహం పెల్లుబికింది. సమైక్యాంధ్ర కోసం రైతులు దీక్షలు చేపట్టారు. సమైక్యంలోనే హరితాంధ్రప్రదేశ్ సాధ్యమని నినదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గురువారం జిల్లాలోని మండల కేంద్రాల్లో రైతులు నిరాహార దీక్ష చేశారు. ఈ కార్యక్రమాలకు రైతులు దండులా కదలివచ్చారు. ‘విభజన వద్దు... సమైక్యాంధ్రే ముద్దు’ అంటూ గళం విప్పారు. విభజన జరిగితే నీటి యుద్ధాలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే పక్క రాష్ట్రాలతో జల జగడం జరుగుతోందని.. విభజన జరిగితే అది మరింత తీవ్ర రూపం దాల్చనుందని వైఎస్సార్సీపీ నేతలు రైతులకు వివరించారు. జలయుద్ధాలకు తోడు విద్యుత్ సంక్షోభం ఏర్పడనుందని వివరించారు. అవనిగడ్డలో ఆ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఏర్పాటుచేసిన రైతు దీక్షా శిబిరంలో నిరాహార దీక్ష నిర్వహించారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రైతు దీక్షలు జరిగాయి. హనుమాన్‌జంక్షన్‌లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. గుడివాడ, గన్నవరంలలో పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్షలు జరిగాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మూడు మండల కేంద్రాలలో రైతు దీక్షలు నిర్వహించారు. వత్సవాయిలో ట్రాక్టర్లతో మక్కపేట నుంచి వత్సవాయి వరకు ర్యాలీ జరిపారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు సామినేని విశ్వనాథం, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట మండలాల్లో రైతు దీక్షలు నిర్వహించారు. కోడూరు, మోపిదేవి, నాగాయలంక మండలాల్లో రైతులు దీక్షలు చేశారు. వాడవాడలా ఉద్యమాలు... జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు రిలేదీక్షలు, రాస్తారోకోలు, మానవహారాలు ముమ్మరంగా జరిగాయి. తిరువూరులో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల పరిధిలో సమైక్యాంధ్ర కోసం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని మున్సిపల్ కూడలి సమీపంలో ఏర్పాటుచేసిన దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు కూర్చున్నారు. కైకలూరు తాలూకా సెంటర్లో ఎన్జీవో దీక్షలు 58వ రోజుకు చేరాయి. వారికి మద్దతుగా కైకలూరు వివేకానంద యూత్ సభ్యులు రిలే దీక్షలు చేశారు. కలిదిండి జేఏసీ నాయకులు రిలే దీక్షలు చే పట్టారు. కేంద్ర హోంమంత్రి షిండే దిష్టిబొమ్మను దహనం చేశారు. చల్లపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 62వ రోజుకు చేరాయి. మండల పరిధిలోని వక్కలగడ్డకు చెందిన రైతులు గ్రామం నుంచి ఊరేగింపు నిర్వహించి దీక్ష చేశారు. చల్లపల్లి ప్రధాన సెంటర్లో రహదారిపై నాగలితో దున్ని రైతులు నిరసన తెలియజేశారు. నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 64వ రోజుకు చేరాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు గురువారం నాటికి 45వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్ ప్రారంభించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు తొమ్మిదోరోజుకు చేరాయి. నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో బోసు సెంటర్లో ఏర్పాటుచేసిన శిబిరంలో పలువురు నాయకులు రిలేదీక్షలు చేపట్టారు. వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు పిడపర్తి లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో ప్రారంభించిన రిలేదీక్షలు ఆరో రోజుకు చేరాయి. వైఎస్సార్సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో జేఏసీ నాయకులు రిలే దీక్షలు చేశారు. తిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు తొమ్మిదో రోజుకు చేరాయి. నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో బోసు సెంటర్లో ఏర్పాటుచేసిన శిబిరంలో పలువురు నాయకులు రిలేదీక్షలు చేపట్టారు. దిరిశం, కంచి నివాసాల వద్ద ధర్నా... తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి, రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ కంచి రామారావు నివాసాల వద్ద జేఏసీ నేతలు ధర్నా చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో జరిపారు. అవనిగడ్డ న్యాయవాదులు సమైక్యాంధ్ర చైతన్యయాత్రను ఘంటసాల మండలంలో నిర్వహించారు. అవనిగడ్డలో చేపట్టిన దీక్షలు 50వ రోజుకు చేరాయి. పామర్రులో 300 మీటర్ల జాతీయ జెండాతో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రదర్శన చేసి, మానవహారం నిర్మించారు. గుడివాడలో ఎన్జీవోల జేఏసీ, మున్సిపల్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. నందివాడ మండలం టెలిఫోన్ నగర్లో ఉపాధ్యాయులు దీక్షలు కొనసాగిస్తున్నారు. గుడ్లవల్లేరులో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. -
భగ్గుమన్న సీమాంధ్ర
తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై గురువారం సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. సమైక్యాంధ్రులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. -
వైఎస్సార్ సీపీ 72 గంటల బంద్
విశాఖపట్నం, న్యూస్‌లైన్: తెలంగా ణా రాష్ట్ర ఏర్పాటును ఆమోదిస్తూ కేంద్ర మంత్రివర్గం గురువారం తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు బుధవారం ప్రారంభించిన నిరవధిక దీక్షలను గురువారం రాత్రి అర్థంత రంగా విరమించారు. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ శుక్రవారం నుంచి 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ విజ యవంతానికి పార్టీ శ్రేణులను సమన్వయపరి చేందుకు సమన్వయకర్తలు దీక్షలు విరమించాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. జిల్లాలోని సమన్వయకర్తలంతా దీక్షలు విరమించారు. -
శంఖారావం
సాక్షి, విశాఖపట్నం : ‘సమైక్య ఉద్యమం హోరెత్తిపోతోంది. ఉవ్వెత్తున ఎగసి విభజన కారకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇన్నాళ్లూ ప్రజాందోళనలకు నాయకత్వలేమి బాధించేది. జగన్మోహన్రెడ్డి రాకతో ఆ కొరత తీరింది. రెండు మాసాలుగా సాగుతున్నపోరు ఒకెత్తు.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం పూరించాక జోరు మరొకెత్తు’... ఇదీ సామాన్యుడి నుంచి ఉద్యోగ, కార్మిక వర్గాలందరి మనసులో మాట. నీతిమంతమైన రాజకీయాలే లక్ష్యంగా, సమైక్యాంధ్ర నినాదంతో రంగంలోకి దిగిన వైఎస్సార్సీపీకి అన్ని వర్గాల నుంచీ భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. పార్టీ అధినేత పిలుపుమేరకు బుధవారం నుంచి అన్ని నియోజకవర్గాల్లోనూ ఆమరణ, నిరవధిక నిరాహార దీక్ష శిబిరాలు ప్రారంభించారు. సమన్వయకర్తల నేతృత్వంలో నియోజకవర్గాల్లో ఉద్యమం హోరెత్తిపోతోంది. జై జగన్.. జై సమైక్యాంధ్ర అంటూ దీక్ష శిబిరాల వద్ద నినాదాలు మిన్నంటుతున్నాయి. పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు యలమంచిలి, నక్కపల్లి, పాయకరావుపేట, నర్సీపట్నంలలో దీక్షలు చేపట్టినవారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెన క్కి తీసుకునేంత వరకు ఉద్యమాన్ని విరమిం చేది లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికైనా కుటిల రాజకీయాల్ని విడనాడి, తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని, సమైక్యాంధ్రకు మద్దతుగా లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు, ప్రోగ్రాం సమన్వయకర్త బుచ్చి మహేశ్వరరావుతోపాటు పలువురు నేతలు అన్ని శిబిరాల వద్దకు వెళ్లి తమ సంఘీభావం తెలిపారు. అనకాపల్లి : నియోజకవర్గంలోని నెహ్రూ చౌక్ వద్ద పార్టీ నేత కొణతాల లక్ష్మీనారాయణ(పెదబాబు), మందపాటి జానకిరామరాజు, డీవీవీ గోపాలరాజుతో పాటు 26 మంది 48 గంటల నిరాహార దీక్షకు దిగారు. చోడవరం : మెయిన్‌రోడ్డు, పంచాయతీ కార్యాలయం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావుతోపాటు 9 మంది నిరవధిక నిరాహార దీక్షలు చేస్తుండగా, పార్టీ జిల్లా యువజన విభాగం కన్వీనర్ అన్నంరెడ్డి అదీప్‌రాజు, మరో ఐదుగురు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నర్సీపట్నం : సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర గణేష్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పదుల సంఖ్యలో పార్టీ నాయకులు రిలే దీక్షల్లో కూర్చున్నారు. యలమంచిలి : పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రగ డ నాగేశ్వరావు, బొడ్డేడ ప్రసాద్‌లు శిబిరంలో దీక్షలో పాల్గొన్నారు. ఈ శిబిరానికి వెయ్యి మంది వరకు హాజరయ్యారు. వీరితోపాటు 9 మంది ఆమరణ నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. పాయకరావుపేట : సూర్యమహల్ జంక్షన్లో నియోజకవర్గ సమన్వయకర్త చెంగల వెంకటరావు ఆమరణ నిరాహార దీక్షకు దిగగా, 22 మంది రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మాడుగుల: పాతబస్టాండ్ సెంటర్లో నియోజకవర్గ సమన్వయకర్తలు పూడి మంగపతిరావు, బూడి ముత్యాలునాయుడుతోపాటు పలువురు నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. అరకు : నాలుగు రోడ్ల కూడలి, వైఎస్సార్ విగ్రహం సెంటర్లో నియోజకవర్గ సమన్వయకర్తల్లో ఒకరైన కుంభా రవిబాబు 48 గంటలు పాటు, సమీపంలోని మరో శిబిరంలో సమన్వయకర్తలు దొన్ను దొర, కిడారి సర్వేశ్వరరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పాడేరు : ఐటీడీఏ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో సమన్వయకర్తలు వంజంగి కాంతమ్మ, సీకర సత్యవాణితోపాటు పార్టీ నేతలు లకే రత్నబాయి, బి.కెజియారాణి, నిప్పుల సింహాచలం ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. పాత బస్టాండ్ సమీపంలో మరో సమన్వయకర్త గిడ్డి ఈశ్వరితోపాటు నాయకులు మత్స్యరాస బాలరాజు, ఎస్.వి.జి.రమణమూర్తి, సాము సుబ్రహ్మణ్యం, కూడా సింహాచలం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. -
వినూత్న నిరసనలతో సమైక్య పోరు
సమైక్యమే ఆశ.. శ్వాసగా జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర పరిరక్షణే మహా సంకల్పంగా సమైక్యవాదులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తమ వాదన గట్టిగా వినిపిస్తున్నారు. కేంద్రం ఏకపక్ష నిర్ణయంపై అన్ని వర్గాల వారూ తమ నిరసనలను విభిన్న తరహాల్లో తెలియజేస్తున్నారు. బుధవారం జిల్లా అంతటా నిరసనలు హోరెత్తాయి. సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్రకు మద్దతుగా ఉయ్యూరులో బుధవారం నిర్వహించిన మహా రైతు గర్జనకు జనం పోటెత్తారు. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర విభజన జరిగితే కృష్ణాడెల్టా ఎడారిగా మారుతుందని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పామర్రులో జేఏసీ నాయకులు ఆకులను వస్త్రాలుగా చుట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. బీజేపీ జిల్లా యువమోర్చా అధ్యక్షుడు లావేటి వీరశివాజీ సమైక్యాంధ్ర విషయంలో బీజేపీ వైఖరిని నిరసిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. అనిగండ్లపాడు గ్రామంలో ఆటోడ్రైవర్లు బంద్ నిర్వహించి ర్యాలీ చేపట్టారు. నూజివీడులో ‘సమైక్యాంధ్ర-ఆవశ్యకత’ అనే అంశంపై న్యాయవాదులు చర్చా కార్యక్రమం నిర్వహించారు. నాగాయలంకలో 29 మంది మహిళలు దీక్ష చేశారు. చల్లపల్లిలో ఉపాధ్యాయులు దీక్ష చేపట్టారు. సినీనటుడు మురళీమోహన్ మోపిదేవిలో చేపట్టిన సమైక్యాంధ్ర దీక్షకు మద్దతు తెలిపారు. మైలవరం మండలంలో ఉద్యోగ, ఆర్టీసీ, ఉపాధ్యాయ, ఎన్జీఓల జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహిస్తున్న రిలే దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. ప్రైవేట్ వాహనాల బంద్‌ను పురస్కరించుకుని సమైక్యవాదులు మైలవరం యార్డు వద్ద జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు ప్రధాన రహదారిలో రెండోరోజూ ధర్నా చేపట్టారు. కైకలూరు దీక్షలకు 50 రోజులు.. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు బుధవారానికి 50వ రోజుకు చేరాయి. సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షల్లో ప్రజలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కైకలూరు తాలూకా సెంటర్లో ఎన్జీవో దీక్షలు 43వ రోజుకు చేరాయి. వారికి మద్దతుగా స్థానిక డిగ్రీ కళాశాల అధ్యాపకులు రిలేదీక్షలు చేశారు. కలిదిండిలో మూలలంక గ్రామస్తులు రిలే దీక్షలు నిర్వహించారు. ఉపాధ్యాయులు ప్లేట్లలో ఒట్టి గడ్డి ఉంచి నిరశనలు తెలిపారు. కోరుకొల్లులో విద్యార్థులు రాస్తారోకో చేశారు. మండవల్లిలో కొర్లపాడు గ్రామస్తులు రిలే దీక్షలు చేపట్టారు. ముదినేపల్లి జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు 30వ రోజుకు చేరాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ తిరువూరు తాలూకా ఎన్జీవో అసోసియేషన్, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో చిట్టేలలో జలదీక్ష నిర్వహించారు. రెండోరోజుకు ఆమరణదీక్ష.. జగ్గయ్యపేట మున్సిపల్ కూడలిలో బీసీ నాయకులు తూమాటి కృష్ణమాచారి, వడేగర్ విజయకుమార్‌లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్రతినిధులు రోడ్డుపై ప్లాట్‌ఫాం రిక్షాలు తొక్కి వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. గన్నవరం ఎన్టీఆర్ పశువైద్య కళాశాలలో అధ్యాపక, విద్యార్థుల నేతృత్వంలో వంటావార్పు నిర్వహించారు. గుడివాడ నెహ్రూచౌక్‌లో చేస్తున్న రిలేదీక్షలు 51వ రోజుకు చేరుకున్నాయి. ఉపాధ్యాయులు జై సమైక్యాంధ్ర అంటూ చేతులపై గోరింటాకు వేసుకుని నిరసన తెలిపారు. నందివాడ మండల పరిధిలోని టెలిఫోన్‌నగర్ కాలనీలోఎంఎన్కే రహదారిపై ఉపాధ్యాయ జేఏసీ నేతలు మాక్‌డ్రిల్ నిర్వహించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ పరుచూరి అశోక్‌బాబును తెలంగాణవాదులు ‘నాలుక చీరుస్తా’ అని చేసిన వాఖ్యలకు నిరసనగా ఉపాధ్యాయులు తెలంగాణ వాదులకు సద్బుద్ధి కలిగించాలంటూ గుడివాడ పురపాలక కార్యాలయం ఎదుట రోడ్డుపై పొర్లుదండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. నూజివీడులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానిక జంక్షన్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 30వ రోజుకు చేరాయి. ఉద్యోగ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కంచికచర్ల జాతీయ రహదారిపై ర్యాలీలు, రాస్తారోకో కార్యక్రమాలను నిర్వహించారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు జాతీయ రహదారిపైనే శీర్షాసనాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నూజివీడు బస్టాండు సెంటరులో మానవహారం నిర్వహించారు. మచిలీపట్నం ఫ్లవర్ డెకరేషన్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. కోనేరుసెంటర్‌లో కేసీఆర్ దిష్టిబొమ్మను అసోసియేషన్ నాయకులు, వర్కర్లు దహనం చేసి నిరసన తెలియజేశారు. కొంతమంది చిన్నారులు కోరుకొల్లు సీబీ కెనాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా జలదీక్ష చేశారు. కలిదిండి జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు వరిగడ్డి తింటూ నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై వరినాట్లతో నిరసన.. పెదపారుపూడిలో రోడ్డు పై వరినాట్లు వేసి వినూత్న నిరసన తెలిపారు. తిరువూరు మండలంలోని చిట్టేల వద్ద కట్టెలేరులో జలదీక్ష నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో పెడనలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో కృత్తివెన్ను మండలం పాశ్చాపురం గ్రామానికి చెందిన మహిళలు కూర్చున్నారు. తాడంకిలో జరిగిన దీక్షలో లారీఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని రాస్తారోకో చేశారు. వడ్రంగి మేస్త్రీలు రోడ్డు మీద పనిచేస్తూ నిరసన తెలిపారు. కృష్ణానదిలో పడవలపై.. విజయవాడలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కృష్ణానదిలో పడవలపై వినూత్న ప్రదర్శన చేశారు. సమైక్యాంధ్ర జెండాలు పట్టుకుని పడవలపై పున్నమిఘాట్ వద్ద నీటిలో నిరసన తెలిపారు. మూడో రోజు కూడా విద్యాసంస్థల బంద్ విజయవంతంగా జరిగింది. -
బంద్ సక్సెస్
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. అత్యధిక విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాయి. ఎన్జీవో జేఏసీ నేతలు ఉదయం నుంచే ర్యాలీగా తిరిగి పలుచోట్ల తెరిచిన ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను మూయించివేశారు. కొన్నిచోట్ల ఆందోళనకారులు కొన్ని కళాశాలల బస్సులకు గాలి తీసివేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సీతారామపురంలోని పార్టీ కార్యాలయం నుంచి చుట్టుగుంట సెంటర్ వరకు పాదయాత్ర, చుట్టుగుంట సెంటర్లో రాస్తారోకో జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సామినేని ఉదయభాను, ఎంవీఎస్ నాగిరెడ్డి, జలీల్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమం సోమవారం నాటికి 55వ రోజుకు చేరింది. ఇరిగేషన్ ఇంజనీర్లు సోమవారం ఉదయం మచిలీపట్నంలో కలెక్టర్‌ను కలిసి సమ్మె నోటీసు అందచేశారు. చల్లపల్లిలో దీక్షలు 45, అవనిగడ్డలో 33వ రోజుకు చేరుకున్నాయి. ఘంటసాల, మోపిదేవి, కోడూరు, నాగాయలంక మండలాల్లో దీక్షలు కొనసాగాయి. చల్లపల్లి మండలం మాజేరులో రైతులు రాస్తారోకో చేశారు. చల్లపల్లిలో మేకావారిపాలేనికి చెందిన రైతులు దీక్ష చేపట్టారు. అవనిగడ్డలో పవనిజం యూత్ ఆధ్వర్యంలో దీక్ష చేశారు. జగ్గయ్యపేట మున్సిపల్ కూడలి సమీపంలో దీక్ష శిబిరంలో కాకతీయ సేవా సమితి సభ్యులు కూర్చున్నారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, సీనియర్ రాజకీయ నాయకులు సామినేని విశ్వనాథం, కాంగ్రెస్ నాయకులు పాటిబండ్ల వెంకట్రావ్‌లు సంఘీభావం తెలిపారు. రోడ్డుపై వ్యాయామ ఉపాధ్యాయులు ఆటలు ఆడి నిరసన వ్యక్తం చేశారు. గుడివాడ నెహ్రూచౌక్ వద్ద డ్వాక్రా మహిళలు రిలేదీక్షలో పాల్గొన్నారు. మునిసిపల్ సిబ్బంది, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయులు తాడులాగుడు పోటీ నిర్వహించిన తమ నిరసన తెలిపారు. పామర్రులో ఏపీ ఎన్జీవోస్, జేఏసీ నాయకులు జాతీయ రహదారిపై మోకాళ్లపై నిలబడి ఆందోళన చేశారు. నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 48వ రోజుకు చేరాయి. ఈ దీక్షలలో కుమార్ స్కూల్ విద్యార్థులు, చెవిటి, మూగవారు కూర్చున్నారు. మచిలీపట్నం ఎనిమిదో వార్డు ప్రజలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహానికి సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ఓ చిన్నారి వినతిపత్రాన్ని అందించింది. కంభంపాడులో విద్యార్థులు మానవహారం నిర్మించారు. పెడనలో వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలు 36వ రోజుకు చేరాయి. కృత్తివెన్నులోని 216 జాతీయ రహదారిపై మహిళలు కుర్చీలాట, ఒప్పులకుప్ప ఆడారు. కేసీఆర్ చేస్తున్న లొల్లి ఉల్లిఘాటును తలపిస్తోందనిఅర్థం వచ్చేలా సమైక్యవాదులు కృత్తివెన్ను జాతీయ రహదారిపై ఉల్లి విక్రయాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. 216 జాతీయ రహదారిపై సమైక్యవాదులు వంటావార్పు నిర్వహించారు. వ్యవసాయ కార్మికుల వంటావార్పు.. తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు శివారు కళ్లంవారిపాలెంలో వ్యవసాయ కార్మికులు, కూలీల ఆధ్వర్యంలో కృష్ణా కరకట్టపై నిరశన శిబిరం ఏర్పాటు చేసి, వంటావార్పు జరిపారు. తోట్లవల్లూరులో జేఏసీ నాయకులు, గొర్రెల కాపరులు గొర్రెలతో నిరసన తెలిపారు. కంచికచర్ల, వీరులపాడు మండలాల జర్నలిస్టుల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ప్రదర్శన నిర్వహించారు. ఏపీఎన్జీవోలు, ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మికులు, ప్రైవేటు విద్యా సంస్థలు, విద్యార్థి జేఏసీ నాయకులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. నందిగామ జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రైతుపేట వద్ద రాస్తారోకో చేసి, మానవహారం ఏర్పాటు చేశారు. న్యాయవాదుల వినూత్న నిరసన.. న్యాయవాదులు నందిగామలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కొందరు న్యాయవాదులు కేసీఆర్ మాస్కులు ధరించి గాంధీ సెంటర్లో కనక తప్పెట్ల మోతలతో చిందేసి నిరసన తెలిపారు. నందిగామ, పెనుగంచిప్రోలు, చందర్లపాడు మండలాలకు చెందిన విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో. గాంధీ సెంటర్లో పలువురు వడ్రంగి వృత్తిదారులు బాడిసలు పట్టుకుని మొద్దులను చెక్కుతూ నిరసన తెలిపారు. కలిదిండి సెంటరులో ఉపాధ్యాయులు, వీఆర్వోలు రిలే దీక్ష చేశారు. మండవల్లిలో ఐఎన్టీయూసీ మండల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం జరిగింది. కత్తిపూడి-పామర్రు 214 జాతీయ రహదారిపై వంటావార్పు నిర్వహించారు. ఎమ్మెల్యే జయమంగళకు సమైక్య సెగ.. మండవల్లిలో దీక్ష చేస్తున్నవారికి మద్దతు తెలపటానికి వచ్చిన ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను విద్యార్థులు చుట్టుముట్టి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట, వత్సవాయి మండలాలకు చెందిన జిల్లా పరిషత్ పాఠశాలల వ్యాయామోపాధ్యాయులు రహదారిపై షటిల్, బాల్‌బ్యాడ్మింటన్, క్రికెట్, పవర్ లిఫ్టింగ్, వాలీబాల్, టెన్నీకాయిట్, కబడ్డీ వంటి ఆటలు ఆడి నిరసన తెలిపారు. జగ్గయ్యపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద మండల రెవెన్యూ ఉద్యోగ జేఏసీ నాయకులు నేలపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. పామర్రులో జాతీయ రహదారిపై మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. -
ఉద్యమంఉధృతం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. గ్రామాల్లో సైతం నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఉద్యోగులతోపాటు అన్ని వర్గాలు, వ్యాపారులు ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు సోమవారం నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడనున్నాయి. ఇప్పటికే కొన్ని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి. ప్రభుత్వ పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. కొన్ని కార్పొరేట్ స్కూళ్లు మాత్రం తెరిచే అవకాశం ఉన్నప్పటికీ.. ఉద్యోగులు వాటిని కూడా మూయిస్తామని స్పష్టం చేస్తున్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి పేరుతో అన్ని ఉద్యోగ, కార్మిక, విద్యార్థి సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ సంఘాలన్నీ జిల్లాలో ఉన్న అన్ని విద్యా సంస్థలకు బృందాలుగా వెళ్లి తెరిచి ఉన్న వాటిని మూయించాలని నిర్ణయించాయి. 24న జిల్లా బంద్ ఉద్యమంలో భాగంగా ఈ నెల 24న జిల్లా బంద్‌కు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. వ్యాపార సంస్థలన్నీ మూతపడనున్నాయి. భారీ షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న దుకాణాల వరకు తెరుచుకునే అవకాశాలు లేవు. అదే రోజు ఉద్యోగులంతా జాతీయ రహదారిని దిగ్బంధించనున్నారు. జిల్లాను పూర్తిగా స్తంభింపజేయడం ద్వారా సమైక్యాంధ్ర ఉద్యమ సెగ కేంద్రానికి తాకేలా చేయాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. రాజీనామాలు చేయడకుండా ఉద్యమానికి దూరంగా ఉంటున్న ప్రజాప్రతినిధులకు గట్టి హెచ్చరికలు జారీ చేయాలన్నది యోచనగా కనిపిస్తోంది. జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలకు అన్ని వర్గాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఆటోలు బంద్: ఇప్పటికే జిల్లాలో ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. ప్రజలందరూ ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడుతున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి జిల్లా బంద్ నిర్వహిస్తుండగా దీనికి ఆటో కార్మికుల నుంచి మద్దతు లభించింది. ఈ నెల 24న జిల్లాలో ఆటో కార్మికులు కూడా బంద్ పాటించనున్నారు. కానీ ఒక యూనియన్‌కు సంబంధించిన కార్మికులు మాత్రమే బంద్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. హోటళ్లు మూసివేత: ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో జరిగే సీమాంధ్ర బంద్‌కు సంఘీభావంగా అదే రోజు బంద్ పాటిస్తున్నట్టు విశాఖ హోటల్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు టి.సత్యనారాయణ ప్రకటించారు. విశాఖ,గాజువాక, గోపాలపట్నం,మధురవాడ, పెందుర్తి ప్రాంతాలలో హోటళ్లు, పార్లర్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, అతిథి గృహాలు మూసివేస్తామన్నారు. సమైక్య రాష్ట్రం కోసం చేస్తున్న ఈ బంద్‌కు వ్యాపారులంతా సహకరించాలని పిలుపునిచ్చారు. మళ్లీ కేంద్ర ప్రభుత్వ సంస్థల దిగ్బంధం ఈ నెల 25, 26 తేదీలలో మరోసారి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధించనున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో ఉద్యోగ సంఘాలు కేంద్ర కార్యాలయాలను ముట్టడించి కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఆఫీసులకు తాళాలు వేశారు. మళ్లీ ఈ నెల 25, 26 తేదీల్లో కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించాలని నిర్ణయించారు. దీంతో ఈ రెండు రోజుల పాటు మరోసారి బ్యాంకులు కూడా మూతపడనున్నాయి. -
అదే జోరు
సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా ప్రారంభమైన ఉద్యమం 50వ రోజూ అదే జోరు.. హోరుతో కొనసాగుతోంది. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటన వెలువడటంతో మొదలైన నిరసనలు రోజురోజుకూ ఉధృతమయ్యాయి. ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలూ మద్దతు పలుకుతూ రోడ్లపైకి వస్తున్నారు. ఎన్జీవోల సమ్మెకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో కొనసాగుతున్న ఉద్యమం బుధవారం కూడా ఉధృతంగా సాగింది. గురువారం అర్ధరాత్రి నుంచి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జేఏసీ సమ్మెలోకి వెళ్లనుంది. జిల్లాస్థాయి అధికారులంతా మద్దతు ప్రకటిస్తున్నారని జిల్లా అధికారుల అసోసియేషన్ అధ్యక్షుడు, డీఆర్వో ఎల్.విజయచందర్ ప్రకటించారు. జిల్లా అధికారులంతా సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మెలోకి వెళుతున్నట్లు పేర్కొంటూ గురువారం ఉదయం కలెక్టర్‌కు నోటీసు అందజేస్తామన్నారు. ఉద్యమంలో భాగంగా మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి వద్ద వైద్యులు, సిబ్బంది 50 బెలూన్లను గాలిలోకి వదిలి నిరసన తెలిపారు. జిల్లా కోర్టు ప్రధానగేటు ఎదుట న్యాయశాఖ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని న్యాయశాఖ జేఏసీ నాయకులతో కలిసి భోజనం చేసి, వడ్డించి తన మద్దతు తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మచిలీపట్నం కోనేరుసెంటరులో జిల్లా అధికారులు ఒకరోజు దీక్ష చేపట్టారు. దివి ఏరియా జర్నలిస్ట్‌ల సంఘం ఆధ్వర్యంలో తుర్లపాటి రామ్మోహనరావు, అలపర్తి గోపాలకృష్ణ చేపట్టిన ఆమరణదీక్షలు రెండోరోజుకు చేరాయి. మైలవరంలో ‘సమైక్యాంధ్ర ఉద్యమం- ఆవశ్యకత’ అనే అంశంపై జాతీయరహదారిపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. జి.కొండూరులో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 24వ రోజుకు చేరాయి. ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ చేశారు. రెడ్డిగూడెం సెంటర్లో శ్రీనారాయణ టెక్నో స్కూల్ విద్యార్థులు ర్యాలీ జరిపారు. నూజివీడులో వైఎస్సార్సీపీ నాయకుల రిలేదీక్షలు 23వ రోజుకు చేరాయి. ఉంగుటూరులో సమైక్యవాదులు పాఠశాలను మూయించారు. కంచికచర్లలో గౌతమ్ విద్యా సంస్థలకు చెందిన వందలాది మంది విద్యార్థులు కళాశాల ప్రాంగణం నుంచి జాతీయ రహదారి మీదుగా పెట్రోల్ బంక్‌ల సెంటర్ వరకు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై కూర్చుని మౌనంగానే రహదారిని దిగ్బంధించారు. 300 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన.. భవన నిర్మాణశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉద్యోగులందరూ 300 మీటర్ల జాతీయ జెండాతో గుడివాడ పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. గుడ్లవల్లేరులో సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నేత, సర్పంచ్ గోపీగీతాకుమారి, పాలకవర్గ సభ్యులు, పార్టీ నేతలు కలిసి రిలేదీక్షల్లో కూర్చున్నారు. కౌతవరంలో తెలంగాణకు వ్యతిరేకంగా స్వశక్తి సంఘాల మహిళలు వేలాది మంది రాస్తారోకో, ధర్నా, మానవహారం కార్యక్రమాలు చేపట్టారు. పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో విద్యుత్‌శాఖ సిబ్బంది రిలేదీక్షల్లో పాల్గొన్నారు. ప్రతాప్ జూనియర్ కళాశాల విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ట్రాఫిక్ స్తంభింపజేశారు. నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో 42వ రోజు దీక్షలలో ఐకేపీ ఉద్యోగులు పాల్గొన్నారు. న్యాయవాదులు చేస్తున్న రిలేదీక్షలు 31వ రోజుకు చేరాయి. జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ మానవహారం నిర్వహించారు. జగ్గయ్యపేట మున్సిపల్ సెంటర్లో వాసవీక్లబ్ ఆధ్వర్యంలో మాన్యసూక్త హోమం శాస్త్రోక్తంగా జరిపారు. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లో జరుగుతున్న 36వ రోజు రిలే దీక్షలో ముస్తాబాద జెడ్పీ, ఎంపీపీ పాఠశాలలు, గొల్లనపల్లి జెడ్పీ పాఠశాలల ఉపాధ్యాయులు 20 మంది పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, జేఏసీ నాయకులతో కలిసి విద్యార్థులు సైకిళ్లపై జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. పెడనలో మండలంలోని 24 పంచాయతీల గ్రామ సమాఖ్య సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు రిలేదీక్షలో కూర్చున్నారు. బంటుమిల్లి చౌరస్తాలో హేమలత కలంకారీ ఫ్యాబ్రిక్స్ నిర్వాహకులు, కలంకారీ కార్మికులు ప్రింటింగ్ పనులు చేశారు. కోరా వస్త్రాలను బళ్లపై పెట్టి ప్రింటింగ్ పనులు చేపట్టి నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో రిలేదీక్షలు 33వ రోజుకు చేరుకున్నాయి. పెదపారుపూడిలో రేషన్ డీలర్లు, ఉపాధ్యాయులు దీక్షల్లో పాల్గొన్నారు. అనంతరం గుడివాడ-కంకిపాడు రహదారిపై మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. కలిదిండి మండలంలోని గుర్వాయిపాలెం సెంటరులో సరోజిని డ్వాక్రా గ్రూప్ సభ్యులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. విజయవాడలో కార్పొరేషన్ ఉద్యోగ జేఏసీ సభ్యులు మోటార్‌బైక్‌లపై కనకదుర్గ ఆలయగిరి ప్రదర్శన నిర్వహించారు. 13 జిల్లాల సీమాంధ్ర మాదిగ నాయకుల ఆధ్వర్యంలో మంద కృష్ణమాదిగ దిష్టిబొమ్మను నగరంలో ఊరేగించి, దహనం చేశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు. -
ఉక్కు సంకల్పం
ఊరూవాడా ఏకమై జిల్లాలో సమైక్యపోరు ఉధృతంగా జరుపుతున్నారు. సమైక్యాంధ్రను కాపాడుకునేందుకు ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ గొంతెత్తి నినదిస్తున్నారు. సోమవారం సింహగర్జన, జనజాగరణ, ఎడ్ల బళ్లు, ట్రాక్టర్ల ప్రదర్శన, మానవహారాలు, విఘ్నేశ్వర పూజలు నిర్వహించి నిరసనలు తెలిపారు. సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఇప్పటికైనా వెనక్కి తీసుకోండి.. సమైక్యవాదుల ఉద్యమ ఉధృతిని చూసైనా ఓట్లు, సీట్ల రాజకీయాలు మానుకోండి.. సీమాంధ్రుల ఆవేదనను అర్థం చేసుకోండి.. అంటూ జిల్లాలో సమైక్యవాదులు తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల ఎదురయ్యే కష్టనష్టాలను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సోమవారం జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ హోరు కొనసాగింది. న్యాయశాఖ జేఏసీ నాయకులు, ఉద్యోగులు మచిలీపట్నంలో జిల్లా కోర్టు ప్రధానగేటు ఎదుట వినూత్న నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు రోడ్డుపైనే అల్పాహారం తిని గుంజీలు తీశారు. మచిలీపట్నం కోనేరుసెంటర్‌లో కొనసాగుతున్న రిలేనిరాహారదీక్షలో గ్రంథాలయ ఉద్యోగులు, బందరు, గూడూరు మండలాల్లోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సర్వే ఉద్యోగులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. 150 మంది సిబ్బందితో మచిలీపట్నంలోని 50 వేల కుటుంబాల వద్దకు వెళ్లి సమైక్యాంధ్రకు మద్దతుగా వారి అభిప్రాయాలను సేకరించటంతో పాటు సంతకాల సేకరణ చేయాలని మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ నిర్ణయించారు. ‘మీ కాళ్లు మొక్కుతాం.. మీ గడ్డాలు పట్టుకుని బతిమాలుతాం.. దయచేసి సమైక్యాంధ్ర ఉద్యమానికి సహకరించండి’ అంటూ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్‌వీ చంద్రశేఖరరావు జిల్లా అధికారులను కోరారు. గుడివాడలో మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గుడివాడ సింహ గర్జన కార్యక్రమం జరిగింది. ఈ గర్జన సభకు వేలాది మంది మహిళలు, విద్యార్థులు హాజరయ్యారు. పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జనజాగరణ కార్యక్రమం జరిపారు. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము వరకు వివిధ కార్యక్రమాలతో ఈ ఆందోళన కొనసాగనుంది. పామర్రులో జేఏసీ, ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో దీక్షలను నిర్వహించారు. పెదమద్దాలి పంచాయితీ సభ్యులు రిలేదీక్షలలో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోరుతూ విఘ్నేశ్వరునికి ప్రత్యేకపూజలు చేశారు. ఈ నెల 20న జరిగే సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావాలని మహిళా ఉద్యోగులు విజయవాడ దుర్గగుడిలో అమ్మవారికి మెట్ల పూజలు నిర్వహించారు. తేలప్రోలు రాజా హైస్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ప్రదర్శన, స్థానిక నెహ్రూబొమ్మ సెంటర్లో మానవహారాన్ని నిర్వహించారు. జగ్గయ్యపేటలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల బస్సులతో ర్యాలీ జరిపారు. రిలే దీక్షలో స్కూల్ బస్సుల డ్రైవర్లు, క్లీనర్లు కూర్చున్నారు. పెనుగంచిప్రోలులో దీక్షల్లో తిరుపతమ్మ ఆలయ నాయీబ్రాహ్మణ ఉద్యోగులు పాల్గొన్నారు. కైకలూరు దీక్షలు 41వ రోజుకు.. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు సోమవారానికి 41వ రోజుకు చేరాయి. తాలూకా సెంటర్ వద్ద ఎన్జీవోల దీక్షలు 34వ రోజూ కొనసాగాయి. వత్సవాయి, కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి, మైలవరం, హనుమాన్‌జంక్షన్, జి.కొండూరు, పెడనలలో వివిధ జేఏసీల ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. రెడ్డిగూడెం సెంటర్లో రైతుల ఆధ్వర్యంలో వంటావార్పు చేశారు. కోస్తాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తిరువూరు బోసు సెంటర్లో రిలే దీక్ష చేపట్టారు. కూచిపూడి, పెదపూడి, మొవ్వ గ్రామాల్లో భారీగా ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహించారు. నూజివీడులో నిర్వహిస్తున్న రిలేదీక్షల శిబిరాన్ని వైఎస్సార్ సీపీ నూజివీడు సమన్వయకర్త మేకా ప్రతాప్, ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య సందర్శించి మద్దతు తెలిపారు. ఉండమ్మా.. బొట్టు పెడతా.. కంచికచర్లలో ఉద్యోగ సంఘాలకు చెందిన మహిళా అధికారులు, కళాశాల విద్యార్థినులు కలిసి ఉండమ్మా బొట్టుపెడతా అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నందిగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు పట్టణంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ పెద్దలకు బుద్ధి ప్రసాదించమని వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, పట్టణ కన్వీనర్ మరీదు కృష్ణమూర్తి గుడివాడలో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. గన్నవరంలో ఉద్యోగులు జాతీయ రహదారిపై కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు ఇందుపల్లి-ఉంగుటూరు రహదారిపై సహపంక్తి భోజనాలు చేశారు. కైకలూరు పరిధిలోని పోలరాజ్ కాలువలో ఎన్జీవోలు, ఉపాధ్యాయులు జలదీక్ష చేపట్టారు. ఉయ్యూరులో శ్రీవిశ్వశాంతి విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోనియా మనసు, విభజన ద్రోహుల కుట్రలు భగ్నం కావాలని విశేష పూజలు జరిగాయి. -
సమైక్యాంధ్ర కోసం గళమెత్తిన నారీలోకం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమ పథంలో మహిళా లోకం రణభేరి మోగించింది. ఎక్కడికక్కడ భారీ ప్రదర్శనలు, మానవహారాలతో హోరెత్తించారు. గృహిణులతో పాటు, విద్యార్థులు, ఉద్యోగులు, ఐసీడీఎస్ కార్యకర్తలు ఇలా ప్రతి ఒక్కరూ సమైక్య పతాక చేతబూని నిరసన గళమెత్తారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల్లో మహిళలదే ప్రధాన పాత్ర కావడం గమనార్హం. వీరికి తోడుగా న్యాయవాదులు, కార్మికులు, వివిధ ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్ర నినాదంతో ఉద్యమించడంతో 46వ రోజూ జిల్లాలో ఆందోళనలు ఉవ్వెత్తున సాగాయి. నగరంలో భారీ ర్యాలీ: ఒంగోలు నగరంలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ మహిళలు కదం తొక్కారు. దాదాపు 2 వేల మందికి పైనే మహిళలు ప్రకాశం భవన్ నుంచి లాయరుపేట సాయిబాబా గుడి వద్ద ఉన్న ప్రకాశం పంతులు విగ్రహం వరకు భారీ ప్రదర్శన, అనంతరం సభ నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగుల 72 గంటల సమ్మె ముగింపు సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చర్చిసెంటర్లో మానవహారం చేపట్టి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచ కపోతే భవిష్యత్‌లో నిరవధిక సమ్మెకు వెళ్తామంటూ హెచ్చరించారు. సమైక్యాంధ్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు ‘సోనియాగాంధీ గానా-బజానా’ కార్యక్రమంతో హెచ్‌సీఎం కాలేజీ సెంటర్లో నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరాహార దీక్షలు, కోర్టు ఎదుట న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. అద్దంకిలో మహిళలు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించి, మహిళా గర్జన చేపట్టారు. ఈ సందర్భంగా ఖోఖో ఆడి, వ్యాయామాలు చేసి నిరసన తెలిపారు. స్థానిక బంగ్లా రోడ్లో విద్యుత్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇక్కడ ఉద్యోగం చేస్తున్న తెలంగాణా ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఘనంగా సన్మానించారు. బల్లికురవలో ఉపాధ్యాయ జేఏసీ, యూటీఎఫ్‌ల ఆధ్వర్యంలో వేరువేరుగా రిలే నిరాహార దీక్షలు చేశారు. పంగులూరులో ఉపాధ్యాయ జేఏసీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చీరాలలో వైఎస్సార్సీపీ చేపట్టిన దీక్షలు 18వ రోజుకు చేరాయి. బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నక్కల వారి హక్కుల సంఘానికి చెందిన వారు రిలే దీక్షలు చేశారు. మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇక భారతి, శ్రీవాణి కళాశాలల విద్యార్థినీలు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. వేటపాలెంలో మహిళా ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ చేశారు. దర్శిలో ఉపాధ్యాయులు బైక్‌ర్యాలీ, ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్డుపై కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు. కొనసాగుతున్న రిలే దీక్షలు: గిద్దలూరులో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో బలిజ సంఘం నాయకులు దీక్షలకు కూర్చున్నారు. అలాగే పట్టణంలో విద్యుత్ సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, వివిధ రంగాల్లోని మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి దహనం చేశారు. బేస్తవారిపేటలో ఉపాధ్యాయులు, కొమరోలులో ఎయిడెడ్ ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కందుకూరులో భారీ ర్యాలీ నిర్వహించి పోస్టాఫీస్ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. కబడ్డీ, ముగ్గులతో, మ్యూజికల్స్ చైర్స్ ఆడి నిరసన తెలియజేశారు. గుడ్లూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. టంగుటూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మహాధర్నా నిర్వహించారు. కనిగిరిలో మహిళా లోకం గళమెత్తింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మహిళలతో నిరసన ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించగా, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు రిలే దీక్షలో కూర్చున్నారు. అలాగే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆటో కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. కనిగిరి, పామూరు, హనుమంతునిపాడులో టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మార్కాపురంలో కదం తొక్కిన మహిళలు: మార్కాపురం మహిళల నిరసనతో దద్దరిల్లింది. సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో ఐసీడీఎస్ కార్యకర్తలు, ఆయాలు, ఉద్యోగులు, ఐకేపీ మహిళా సంఘాల సభ్యులు, మహిళా ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులు మార్కాపురం నుంచి పెద్దదోర్నాల మీదుగా బైక్ ర్యాలీ చేశారు. ఏపీటీసీఏ సభ్యులు ర్యాలీ, ఉపాధ్యాయ జేఏసీ నేతలు మానవహారం నిర్వహించారు. కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, పురందేశ్వరి, సోనియా మాస్క్‌లు ధరించిన మహిళలను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తర్లుపాడులో సమైక్యాంధ్రకు మద్దతుగా కాగడాల ప్రదర్శన చేపట్టారు. పొదిలిలో సమైక్యాంధ్ర కోరుతూ పెద్ద సంఖ్యలో మహిళలు ర్యాలీ చేసి, రాస్తారోకో నిర్వహించారు. యర్రగొండపాలెంలోనూ మహిళలు ఉద్యమ బాట పట్టారు. పట్టణంలో అంగన్వాడీ సూపర్ వైజర్లు, కార్యకర్తలు, ఆయాలు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. జర్నలిస్టుల ఆధ్వర్యంలో మోటారు బైకుర్యాలీ చేపట్టారు. చైతన్య పాఠశాల విద్యార్థులు రోడ్డుపై వేసిన కోలాటం ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. పుల్లలచెరువులో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రోడ్డుపై వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టి రోడ్డుపైనే భోజనాలు చేసిన నిరసన వ్యక్తం చేశారు. పెద్దదోర్నాలలో జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. -
16 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వంతు?
సాక్షి, మచిలీపట్నం : చారిత్రక ఘట్టంగా నిలుస్తున్న సమైక్య పోరుకు జిల్లాలో నలుగురు కీలక అధికారులు దూరంగా ఉన్నారు. ఎవరెన్ని ఆంక్షలు విధించినా వెన్నుచూపని మిగిలిన ఉద్యోగవర్గాలు పోరాటపథంలో ముందుకెళుతున్నాయి. ఉద్యమాన్ని ఉరకలెత్తించేందుకు జేఏసీ నేతలు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులను ఉద్యమంలో భాగస్వాముల్ని చేయగలిగారు. ఇక ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమ సెగ ఢిల్లీని తాకేలా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల్ని కూడా సమ్మెబాట పట్టించేందుకు చర్చలు జరుపుతున్నారు. దీనికి ఈ నెల 16న ముహూర్తం పెట్టారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సాగుతున్న ఉద్యమంలో ప్రభుత్వోద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. విజయవాడపాటు జిల్లాలోని సుమారు 115 శాఖలకు చెందిన 35 వేల మంది ఇప్పటికే ఆందోళన బాటలో ఉన్నారు. ఐఏఎస్ అధికారులైన కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, విజయవాడ, నూజివీడు సబ్ కలెక్టర్లు హరిచందన, చక్రధర్‌బాబులు మాత్రం సమ్మెకు దూరంగానే ఉన్నారు. ఐఏఎస్‌లు సమ్మెచేసే అవకాశం లేనందునే సమైక్య ఉద్యమానికి దూరంగా ఉన్నట్టు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 12 అర్ధరాత్రి నుంచి ప్రభుత్వ శాఖల దిగువస్థాయి ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు దిగగా.. 17న ఉపాధ్యాయులు, 24న అధికారులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. పలు శాఖల ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాస్థాయి సమావేశం నిర్వహించి మాస్ క్యాజువల్ లీవ్ పెడుతున్నట్టు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. వారు ఈ నెల 7 నుంచి మాస్ క్యాజువల్ లీవ్ పెట్టి ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి, అదనపు జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు, డీఆర్డీఏ పీడీ, సోషల్ వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ అధికారులు, పలు శాఖల ఉన్నతాధికారులు ఎనిమిది రోజులుగా సమైక్య పోరు చేస్తున్నారు. ఢిల్లీకి సెగ తగిలేలా.. సమైక్య ఉద్యమం మొదలై 47 రోజులు దాటినా పాలకులకు చీమకుట్టినట్టు లేదు. అందుకే ఉద్యమాన్ని ఉగ్రరూపం దాల్చేలా జేఏసీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎన్జీవోలు, నాన్ పొలిటికల్ జేఏసీ, స్వచ్ఛంద సంఘాలు పెద్దఎత్తున ఉద్యమం చేస్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోకపోవడంపై ఉద్యమకారుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను స్తంభింపజేసేలా కార్యాచరణ రూపొందించారు. పోస్టల్, ఎల్ఐసీ వంటి సంస్థల్లో ఉద్యోగులను కూడా సమ్మెబాట పట్టేలా జేఏసీ నేతలు చర్చలు జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు కలిసివస్తే 16 నుంచి సమ్మెబాట పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఏదిఏమైనా ఉద్యోగులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. -
హోరెత్తిన మహిళా గర్జనలు
మహిళాలోకం సమైక్యాంధ్రే లక్ష్యంగా నినదించింది. నారీ రణభేరితో జిల్లాలో ఉద్యమానికి మరింత ఊపొచ్చింది. విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరు, తిరువూరు, అవనిగడ్డతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన మహిళా గర్జనకు పెద్ద ఎత్తున మహిళలు పోటెత్తారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. జిల్లా అంతటా నిరసనలు, మానవహారాలు శుక్రవారం కూడా ఉధృతంగా సాగాయి. సాక్షి, విజయవాడ : మహిళా గర్జనలతో జిల్లా మార్మోగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో శుక్రవారం మహిళలు ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. మండుటెండలో సైతం ఉద్యమమే ఊపిరిగా ఆందోళన నిర్వహించారు. విజయవాడ, మచిలీపట్నం, తిరువూరు, ఉయ్యూరు, అవనిగడ్డలతో పాటు పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున మహిళా గర్జనలు జరిగాయి. మహిళా జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ పీడబ్ల్యుడీ గ్రౌండ్స్‌లో జరిగిన సభ వేలాదిగా తరలివచ్చిన మహిళలతో కిక్కిరిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ప్రాణాలు అర్పించడానికైనా తాము సిద్ధమని వారు నినదించారు. మచిలీపట్నం కోనేరు సెంటర్లో నిర్వహించిన భారీ ర్యాలీలో మహిళా న్యాయవాదులు, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, వంట ఏజెన్సీ నిర్వాహకులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉయ్యూరులో సమైక్యాంధ్ర గోడు విజయవంతమైంది. వేలాది మంది మహిళలు గర్జనలో పాల్గొని సమైక్య నినాదాలు చేశారు. వంగపండు ఉష కళాబృందం సమైక్యాంధ్ర ఉద్యమ స్ఫూర్తిని నింపుతూ ఆలపించిన ఆట, పాట, మాటకు మహిళలు జేజేలు పలికారు. సోనియమ్మను విమర్శిస్తారా అంటూ మంత్రి సారథి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయగా సమైక్యవాదులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. అవనిగడ్డలో మహిళాలోకం కదంతొక్కింది. మహిళా ఉద్యోగినులు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఎస్వీఎల్ క్రాంతి విద్యార్థినులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అవనిగడ్డ పంచాయతీ ఈవో శైలజాకుమారి రాజీవ్‌చౌక్‌లో యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మకు సంప్రదాయబద్ధంగా కర్మకాండలు నిర్వహించారు. ముదినేపల్లిలో మహిళ గర్జనలో భాగంగా బస్‌స్టేషన్ ఆవరణలో 500 మంది వివిధ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బాలికలు, 50 మంది ఉపాధ్యాయినులతో ఆంధ్రప్రదేశ్ ఆకారంలో నిలబడి సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మండవల్లి జేఏసీ ఆధ్వర్యంలో మహిళా గర్జనలో పాల్గొన్న మహిళలు రాస్తారోకో నిర్వహించారు. బంటుమిల్లి సమైక్యాంధ్ర పోరాట సమితి నిర్వహించిన మహిళా గర్జనకు బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల నుంచి మహిళలు స్వచ్ఛందంగా హాజరయ్యారు. తిరువూరులో మహిళా గర్జన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రమంత్రులు, ఎంపీలు, సోనియాగాంధీ మాస్కులతో నిరసన ప్రదర్శన జరిపారు. జిల్లాలో సాగుతున్న సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని విజయవాడ చార్టర్డ్ అకౌంటెంట్ల జేఏసీ తీర్మానించింది. రెండోరోజుకు చేరిన 72 గంటల సమ్మె.. సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన 72 గంటల సమ్మె రెండో రోజుకు చేరింది. ఎన్టీటీపీఎస్లో ఇంజనీరింగ్ అసోసియేషన్, ఎంప్లాయీస్ జేఏసీకి మద్య విభేదాలు రావటంతో ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. దాంతో 5వ యూనిట్ మినహా మిగిలిన యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. నూజివీడులో విద్యుత్ ఉద్యోగులు రోడ్లపై వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేటు బస్ ఆపరేటర్లు 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. నూజివీడులో వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న రిలేదీక్షలు 18వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు ప్రారంభించారు. గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేట, గన్నవరం, కైకలూరు, మచిలీపట్నం తదితర పట్టణాల్లో జేఏసీ చేపట్టిన రిలేదీక్షలు కొనసాగాయి. గుడివాడలో టెలికాం, పోస్టల్ తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను సమైక్యవాదులు మూయించారు. కైకలూరులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించగా, మహిళా నేతలు మహిళలకు బొట్టుపెట్టి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్నారు. నందిగామ బార్ అసోసియేషన్ ఆద్వర్యంలో న్యాయవాదులు సమైక్య నినాదాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నాగాయలంకలో పండ్ల వ్యాపారులు ఆపిల్ పండ్లు, కూరగాయల వ్యాపారులు పచ్చిమిర్చి దండలు ధరించి నిరసన తెలిపారు. ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో కొండపల్లిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జగ్గయ్యపేటలో అఖిల పక్ష, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఒంటికాలితో కుంటుతూ నిరసన వ్యక్తం చేశారు. పెడనలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 23వ రోజుకు చేరాయి. చాట్రాయి మండలం చనుబండలో ఐకాస నాయకులు బ్యాంకు మేనేజర్ చెప్పులు శుభ్రపరచి నిరసన తెలిపారు. -
17న ప్రైవేటు వైద్య సేవల బంద్
చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా 17న జిల్లావ్యాప్తంగా ప్రైవేటు వైద్య సేవల్ని ఆపివేస్తున్నట్లు సమైక్యాంధ్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐక్య కార్యాచరణ వేదిక ప్రకటించింది. ఈ మేరకు గురువారం చిత్తూరు నగరంలో సంఘ నాయకులు సమావేశమయ్యారు. జేఏసీ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 44 రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవడం మంచి పద్ధతి కాదన్నారు. కనీస జ్ఞానం కూడా లేని కొందరు వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం వల్లే దేశంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం, విద్య పరంగా హైదరాబాదు చాలా అభివృద్ధి చెందిందని దీని వెనుక సీమాంధ్రుల కష్టం ఉందన్నారు. రాష్ట్రం విడిపోతే ఇక్కడి వైద్య విద్యార్థులకు మెడికల్ సీట్లు, పీజీ సీట్లు, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో సీట్లు సగానికి పైగా తగ్గిపోతాయన్నారు. నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులలో ఉన్న వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం మిగిలిన ఆస్పత్రుల్లో లేకపోవడం వల్ల సీమాంధ్రులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఢిల్లీ పెద్దలకు ఇక్కడి ఉద్యమ తీవ్రతను తెలియచేయడంలో భాగంగా సీమాంధ్ర వైద్యసేవల జేఏసీ పిలుపు మేరకు 17న బంద్ నిరహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ షాపులు, నర్సింగ్, పారామెడికల్ అన్నీ స్వచ్ఛందంగా మూసివేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు సైతం తమకు మద్దతు పలకాలని కోరారు. జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లోని వైద్యులు, సిబ్బంది రాస్తారోకోలు, మానవహారాలు, ధర్నాలు చేసి సమైక్యాంద్ర ఉద్యమ తీవ్రతను తెలియచేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వైద్య జేఏసీ నేతలు డాక్టర్ రాజేంద్రకుమార్, డాక్టర్ వినోద్, డాక్టర్ శ్రీరాములురెడ్డి, డాక్టర్ సురేంద్రరెడ్డి, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ శ్రీహరిరావు, డాక్టర్ రాజారావు పాల్గొన్నారు.