అనకాపల్లి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర లక్ష్యంగా, విభజన కాంక్షపై పోరాటమే ధ్యేయంగా బుధవారం అనకాపల్లిలో ప్రతిధ్వనించిన లక్ష గళ గర్జన పట్టణం నలుమూలలా ప్రభంజన గీతమై వినిపించిం ది. సభకు హాజరైన నాయకుల ప్రసంగాలతో సమైక్య వాదుల్లో ఉత్తేజం ఉప్పొంగింది. లక్ష గళ ఘోషతో అనకాపల్లి పట్టణం జన సంద్రమైంది. సమైక్య నినాదాలతో అట్టుడికింది. ప దవులకు అంటిపెట్టుకొని రాజీ డ్రామాలు ఆడుతున్న వారికి హెచ్చరికలు జారీ చేసింది. చిన్నారులు, యువకులు, విద్యార్థులు, వృద్ధు లు, ఉద్యోగులు అంటూ తారతమ్యం లేకుండా సమైక్య నినాదాలకు వేదికయింది. సభను విజయవంతం చేయాలన్నసమైక్యాంధ్ర కార్యాచరణ కమిటీ సభ్యుల లక్ష్యం నెరవేరింది.
కిక్కిరిసిన మైదానం...
పట్టణంలోని అన్ని రహదారుల నుంచి ముని సిపల్ స్టేడియంకు సమైక్యవాదులు ర్యాలీగా తరలివచ్చారు. ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు లక్ష గళ గర్జనలో పాల్గొన్నారు. ముందుగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమా లు, మైదానంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల వేషధారణలు, ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే తప్పెటగుళ్లతో స్టేడి యం కళకళలాడింది. గుడ్‌షెపర్డ్ పాఠశాల యాజమాన్యం రూపొందించిన వేయి అడుగుల జాతీయ పతాకం రెపరెపలాడింది. సమైక్యాంధ్ర పతాకాన్ని పరకాల ప్రభాకర్ ఆవిష్కరించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆత్మత్యాగానికి పాల్పడిన తుమ్మి సందీప్‌కు మద్దతుగా లక్ష గళ గర్జన సభ నిమిషం పాటు మౌనం పా టించింది. లక్ష గళ గర్జనలో భాగంగా సభ రెం డు తీర్మానాలను ఆమోదించింది. సమైక్యాం ధ్రకు మద్దతుగా రూపొందించిన ప్రతిజ్ఞను నినదించింది.
ఉద్వేగపూరిత ప్రసంగం
ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాలాంధ్ర మహాస భ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ ఉద్వేగపూరిత ప్రసంగం ఉద్యమకారులకు దిశానిర్దేశం చేసింది. ‘విభజనవాదులకు కొమ్ము కాస్తు న్న నాయకులను రాష్ట్రం పొలిమేరల నుంచి పారద్రోలాలి. ఇటలీ దొరసాని సోనియా క్షమాపణ చెప్పి సమైక్య రాష్ట్ర ప్రకటన చేసే వరకు ఉద్యమ సెగ ఉవ్వెత్తున ఎగయాలి.’ అని ఆయ న చెప్పినప్పుడు సభికుల నుంచి వెలువడ్డ కరతాళ ధ్వనుల, సింహనాదాల హోరు కడలి ఘో షలా వెల్లువెత్తింది. ‘మన రాష్ట్రంలో తీవ్రస్థాయిలో ఉద్యమాలు కొనసాగుతున్నా కేంద్రానికి చీమకుట్టినట్టయినాలేదు.
అయితే ఇంతటి కఠిన సమయంలో సైతం సమైక్య ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకువచ్చిన ఆర్టీసీ కార్మికుల, ఎన్జీఓల, రైతుల, మహిళా సంఘాల, విద్యార్థుల, న్యాయవాదుల, డాక్టర్ల, వర్తకుల, వ్యాపారుల, ఇతర మద్దతుదారుల పోరాట పటిమ సాటిలేనిది. వారికి ధన్యవాదాలు.’ అని ఆయన కృతజ్ఞతలు తెలిపినప్పుడు సభ హర్షధ్వానాలతో ప్రతిధ్వనించింది. ‘ఈ రాష్ట్రం సోనియాదా ? కాంగ్రెస్‌దా? చిదంబరానిదా ? దిగ్విజయ్‌సింగ్‌దా ? ఆంటోనీదా ? కేసీఆర్‌దా ? వీరందరికీ బుద్ధి వచ్చేట్టుగా, రాష్ట్రాన్ని విభజించమంటూ ప్రకటన వచ్చే వరకు ఉద్యమం కొనసాగాలి. ప్రజాశక్తి ముందు ఎంతటి నియంతలైనా దిగిరాక తప్పదని రుజువు చేయాలి.’ అని ఆయన ఆవేశపూరితంగా పిలుపునిచ్చినప్పుడు ఉత్సాహం ఉరకలు వేసింది.
తెలుగుజాతికి వెన్నుపోటు
‘మన ప్రజా ప్రతినిధులు తెలుగు జాతికి వెన్నుపోటు పొడిచారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎం పీలు, రాష్ట్ర, కేంద్ర మంత్రులు మన నమ్మకాల ను వమ్ము చేశారు. తెలుగుతల్లికి, తెలుగుజాతి కి నమ్మకద్రోహం చేశారు.’ అని పరకాల ప్రభాకర్ విమర్శించారు. ప్రజాప్రతినిధులు రాజీ డ్రామాలు కట్టిపెట్టి రాజీనామాల ఆమోదంతో వస్తే వారికి మంగళహారతులు పడదామని ఆ యన పిలుపునిచ్చారు. అధికార దర్పం ముం దు తలొగ్గిన ప్రజాప్రతినిధులు సమైక్య ఉద్యమాన్ని చులకనగా చూస్తున్నారని, వారికి గుణపాఠం చెప్పేందుకు ప్రతి ఒక్కరూ ఒక అల్లూరి, ఒక పొట్టి శ్రీరాములు, ఒక టంగుటూరి కావాలన్నారు.
ప్రజల బాట పట్టడానికి ప్రజాప్రతిని దులు ముందుకు రాకుంటే మన మే వారిపై ఒత్తిడి తీసుకువచ్చి శాసనసభ, లోక్‌సభలకు తాళాలు వేయించాలని ఆయన పిలుపునిచ్చా రు. లక్ష గళ గర్జన స్టీరింగ్ కమిటీ కన్వీనర్ దాడి రత్నాకర్, సమైక్యాంధ్ర జేఏసీ సభ్యు డు, జిల్లా ఎన్‌జీఓల అధ్యక్షుడు మాదేటి పరమేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నాయకులు కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు), కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరుచూరి భాస్క ర్, దేశం పార్టీ నియోజకవర్గ కోర్ కమిటీ సభ్యుడు బుద్ధ నాగ జగదీష్ ప్రసంగించారు.
జన జయగర్జన
Published Thu, Sep 12 2013 2:24 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement