
జాతీయ జెండా ఆవిష్కరించి వందనం చేస్తున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
సాక్షి అమరావతి: న్యాయవ్యవస్థలో ఎప్పటికప్పుడు అమలు చేస్తున్న సంస్కరణల వల్ల న్యాయస్థానాలపై పనిభారం తగ్గుతోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తెలిారు. సంస్కరణల వల్ల కోర్టులు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలగకుండా న్యాయవ్యవస్థ ఓ సంరక్షకుడిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తోందని తెలిపారు. దేశ నిర్మాణం అంటే బలమైన వ్యవస్థలు మాత్రమే కాదని, ప్రజల హక్కులు, విలు] లు, సమగ్రత కూడా అందులో భాగమని చెప్పారు.
శాంతి, సౌభ్రాతృత్వం సాధించేందుకు ప్రజలంతా మమేకం కావాలని జస్టిస్ ఠాకూర్ ఆకాంక్షించారు. ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.ఆదివారం హైకోర్టులో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అంతకుముందు బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడారు. స్వతంత్ర సమరంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, అదనపు అడ్వొకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment