‘సమైక్యాంధ్ర కోసం ప్రాణాలిస్తాం’ | JAC leaders give lifes for samiakhyandhra | Sakshi
Sakshi News home page

‘సమైక్యాంధ్ర కోసం ప్రాణాలిస్తాం’

Published Wed, Aug 14 2013 2:48 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM

JAC leaders give lifes for samiakhyandhra

 కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా ఇస్తామని అసంఘటిత రంగ కార్మిక జేఏసీ నాయకులు కె.శివనాగిరెడ్డి అన్నారు. తెలుగుజాతి ఎప్పటికీ ఒక్కటిగా ఉండాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం అశోక్‌నగర్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. వివిధ కాలనీలకు చెందిన యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా శివనాగిరెడ్డి మాట్లాడుతూ తెలుగు మాట్లాడే వారంతా ఒక్కటిగా ఉండాలని ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రాన్ని నేటి  రాజకీయ నాయకులు స్వార్థంతో ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో విద్యార్థి, లెక్చరర్ల జేఏసీ చైర్మన్ చిన్న వెంకటస్వామి, అసంఘటిత రంగ కార్మిక జేఏసీ నాయకులు జి.మురళీధర్, ఎ.శివ, ఈశ్వర్, గణేష్, శంకర్, సురేష్‌బాబు, రవీంద్ర, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కన్వీనర్ బి.ఎన్.చెట్టి, పుల్లారెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రెడ్‌క్రాస్ తరఫున డాక్టర్ కుమారస్వామి రెడ్డి, ఇతర టెక్నీషియన్లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement