సాక్షి, తిరుపతి: హిందూ జేఏసీ పేరుతో టీటీడీ పరిపాలన భవనం ముందు నేతలు ఓవరాక్షన్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం టీటీడీ పరిపాలన భవనం ముందు ధర్నా చేపట్టారు. కాగా ఇటీవల చిరుత బారినపడి చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. టీటీడీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. నడక మార్గంలో భక్తులకు రక్షణగా ఊతకర్రలు ఇవ్వాలని నిర్ణయించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్నారులను అనుమతించకపోవడం, భక్తులను గుంపులుగా పంపాలని, 500 కెమెరాల ఏర్పాటు వంటి జాగ్రత్తలు తీసుకుంది.
అయితే నడకదారి భక్తులపై టీటీడీ ఆంక్షల పట్ల హిందూ జేఏసీ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. టీటీడీ పరిపాలన భవనం ముందు బుధవారం హిందూ జేఏసీ నేతలు నిరసన చేపట్టారు. భక్తుల కోసం టీటీడీ కష్టపడుతుంటే జేఏసీ నేతలు రాజకీయం చేస్తున్నారు. నడక మార్గంలో ఆంక్షలు వద్దంటూ వాదిస్తున్నారు. హిందూ ధర్మ పేరిట శ్రీనివాసానంద సరస్వతి ఓవరాక్షన్ ప్రదర్శిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి వచ్చి తిరుపతిలో డ్రామాలు చేస్తున్నారు.
చదవండి: తిరుమలకు ప్రత్యేక బృందాలు.. కొనసాగుతున్న చిరుతల వేట
Comments
Please login to add a commentAdd a comment