jac
-
మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి
సాక్షి, అమరావతి : మద్యం పాలసీని రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఏమిటని మహిళా సంఘాల ఐక్య వేదిక (జేఏసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వేదిక నేతలు సుంకర పద్మశ్రీ, డి. రమాదేవి, పి.దుర్గాభవాని, పి. పద్మ, ఎన్. విష్ణు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సర్కారుకు 11 సూచనలు చేశారు. ప్రభుత్వం అక్టోబరు నుంచి అమలులోకి తెచ్చే మద్యం పాలసీని కేబినెట్ ఆమోదంతో త్వరలో ప్రకటించనున్నట్లు.. లైసెన్సింగ్ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు షాపులను ఇవ్వనున్నట్లు, లైసెన్స్ ఫీజుల ద్వారా రూ.2 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రానున్నట్లు వార్తలు వస్తున్నాయని వారు తెలిపారు.అయితే, మద్యాన్ని నియంత్రించడం, నేరాలను అరికట్టడం, ప్రజల ఆరోగ్యం మరీ ముఖ్యంగా మహిళలు, పిల్లలపై హింసను అరికట్టడం ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని చెప్పారు. అక్రమ అమ్మకాలు లేకుండా చేయడమా? లేక ఆదాయాన్ని పొందడమా? అనే దానిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు మరీ ముఖ్యంగా టీడీపీ ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నాణ్యమైన మద్యం ప్రజల ప్రాణాలు తీయదా?.. మహిళలపై హింసకు కారణం కాదా?.. నేరాలు పెరగకుండా నిరోధిస్తుందా?.. అని వారు ప్రశ్నించారు. అధ్యయనంలో ఏం తేల్చారు..ఇక వివిధ రాష్ట్రాల్లోని మద్యం విధానాలపై అధ్యయనానికి వెళ్లిన బృందాలు తెలంగాణ విధానం బాగుందని రిపోర్టు ఇచ్చినట్లు మీడియాకు లీకేజీలిచ్చారని,.. కానీ, ఆ బృందాలు ఏం అధ్యయనం చేసి వచ్చాయో ఆ నివేదికను విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో మహిళలు, ప్రముఖుల అభిప్రాయాలు తీసుకోవాలని, సాధారణ జనానికి నష్టంలేని విధానాన్ని రూపొందించాలని జేఏసీ నేతలు కోరారు. ఇక రాష్ట్రంలో వేళలతో నిమిత్తం లేకుండా మద్యం అక్రమ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, వాటిని అరికట్టే బాధ్యత ప్రభుత్వానిదేన్నారు. -
ఉత్తరాంధ్రలో పండుగ వాతావరణం
-
బాబుపై రాయలసీమ యువజన విద్యార్థి JAC నేతల ఆగ్రహం
-
కాంట్రాక్టు లెక్చరర్ల జీవితాల్లో వెలుగులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి ఇబ్బందికరంగా ఉన్న ఐదేళ్ల నిబంధనను తొలగించి 2014 జూన్ 2వ తేదీకి ముందు పనిచేసిన అందరినీ రెగ్యులర్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కాంట్రాక్టు లెక్చరర్లు హర్షం వ్యక్తంచేశారు. తాడేపల్లిలో వీరంతా జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్ నిర్ణయంతో విద్యాశాఖలో జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఎక్కువమందికి లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కాంట్రాక్టు లెక్చరర్లు తాడేపల్లిలోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి భారీ కేక్‌ను కట్‌చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని గజమాలతో సత్కరించారు. తమ తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలియజేయాలని వారు విన్నవించారు. అనంతరం జై సీఎం జగన్ అంటూ నినదించారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. తాత్కాలిక ఉద్యోగుల గుండెల్లో సీఎం జగనన్న చిరస్థాయిగా నిలిచిపోతారని వారందరూ కొనియాడారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ.. సీఎం జగన్ అటు ప్రజలు ఇటు ఉద్యోగుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారన్నారు. రెండు దశాబ్దాలకు పైగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను సీఎం జగన్ ప్రభుత్వం ఆర్థిక భారమైనా పరిష్కరించి రెగ్యులరైజ్ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు పలువురు మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. గత పాలకులు ఎగతాళి చేశారు ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచమంటే మీకిదే ఎక్కువని గత పాలకులు గేలి చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనన్న మా బాధలు చూసి స్వయంగా మా ధర్నా శిబిరాలకు వచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. కలకాలం ఆయనకు రుణపడి ఉంటాం. – కల్లూరి శ్రీనివాస్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ కో–చైర్మన్ 10 వేలకు పైగా కుటుంబాల్లో వెలుగులు రెండు దశాబ్దాలకు పైగా ఆపరిష్కృతంగా ఉన్న సమస్యను సీఎం జగన్ పరిష్కరించారు. చంద్రబాబు మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ, జగన్ పాదయాత్రలో మా సమస్యను విని సీఎం అయ్యాక చిత్తశుద్ధితో పరిష్కరించారు. ఈ నిర్ణయంతో 10,117 కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారు. మా కుటుంబాలు ఆయనకు అండగా ఉంటాయి. – డి. ఉమాదేవి, కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ మహిళా కార్యదర్శి సీఎం మేలు మరువలేం.. సీఎం జగనన్న మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు. పది కాలాలపాటు సీఎం జగనన్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పాలించాలి. మహిళా ఉద్యోగులందరం కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయనకు దైవకృçప, ప్రజల ఆశీçస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.– ఆర్. దీప, కాంట్రాక్ట్ లెక్చరర్ (కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ మహిళా కార్యదర్శి) ఐదేళ్ల నిబంధన తొలగింపు చరిత్రాత్మకం.. సీఎం జగనన్న తీసుకున్న రెగ్యులరైజేషన్ నిర్ణయం 4,500 మంది కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఐదేళ్ల నిబంధన తొలగింపు నిర్ణయం చరిత్రాత్మకం. జీవితాంతం సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయ్యేందుకుకృషిచేస్తాం.– కుమ్మరకుంట సురేష్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ -
తిరుపతి: హిందూ జేఏసీ పేరుతో పరిపాలన భవనం ముందు ఓవరాక్షన్
సాక్షి, తిరుపతి: హిందూ జేఏసీ పేరుతో టీటీడీ పరిపాలన భవనం ముందు నేతలు ఓవరాక్షన్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం టీటీడీ పరిపాలన భవనం ముందు ధర్నా చేపట్టారు. కాగా ఇటీవల చిరుత బారినపడి చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. టీటీడీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. నడక మార్గంలో భక్తులకు రక్షణగా ఊతకర్రలు ఇవ్వాలని నిర్ణయించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్నారులను అనుమతించకపోవడం, భక్తులను గుంపులుగా పంపాలని, 500 కెమెరాల ఏర్పాటు వంటి జాగ్రత్తలు తీసుకుంది. అయితే నడకదారి భక్తులపై టీటీడీ ఆంక్షల పట్ల హిందూ జేఏసీ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. టీటీడీ పరిపాలన భవనం ముందు బుధవారం హిందూ జేఏసీ నేతలు నిరసన చేపట్టారు. భక్తుల కోసం టీటీడీ కష్టపడుతుంటే జేఏసీ నేతలు రాజకీయం చేస్తున్నారు. నడక మార్గంలో ఆంక్షలు వద్దంటూ వాదిస్తున్నారు. హిందూ ధర్మ పేరిట శ్రీనివాసానంద సరస్వతి ఓవరాక్షన్ ప్రదర్శిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి వచ్చి తిరుపతిలో డ్రామాలు చేస్తున్నారు. చదవండి: తిరుమలకు ప్రత్యేక బృందాలు.. కొనసాగుతున్న చిరుతల వేట -
సచివాలయంలో సీఎం కేసీఆర్ తో వీఆర్ఏల జేఏసీ భేటీ
-
సీఎంకు నిరుద్యోగ జేఏసీ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రూప్–1, గ్రూప్–2లో 1,000 పోస్టుల భర్తీకి అనుమతించిన సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ బదిలీలకు అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో సచివాలయాల్లో చేపట్టినట్టే భారీ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఇటీవల పరీక్షలు రాసిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రశ్నాపత్రంలోని దోషాలను అధిగమించేలా గ్రేస్ మార్కులు ఇవ్వాలని అభ్యర్థించారు. (చదవండి: ఎప్పటి నీటి లెక్కలు అప్పటికే...) -
అమరావతి జేఏసీవై ఏపీ రెవిన్యూ ఉద్యోగ సంఘాల ఫైర్
-
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు 7 శాతం ఫిట్మెంట్
-
పీఆర్సీ కోసం ఉద్యమాలు ఉధృతం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ సాధన కోసం ఆందోళనలను తీవ్రం చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. 1004 యూనియన్ కార్యాలయంలో సోమవారం సమావేశమై ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన నోటీసులను యాజమాన్యానికి అందజేసినట్లు జేఏసీ చైర్మన్ జి.సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీ విషయంలో యాజమాన్యం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కార్యాచరణలో భాగంగా ఈనెల 21, 22 తేదీల్లో సర్కిల్ స్థాయిల్లో సమావేశాలు, 24, 25, 28 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన, మార్చి 1, 2న డివిజన్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద భోజన విరామ సమయంలో ప్రదర్శన, మార్చి 3, 4న సర్కిల్ కార్యాలయాలు, కార్పొరేట్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద భోజన విరామ సమయంలో ప్రదర్శన, మార్చి 8 నుంచి 23 వరకు సర్కిల్ కార్యాలయాలు, కార్పొరేట్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద రిలే నిరాహార దీక్షలు, మార్చి 14న కేటీపీఎస్ ప్లాంట్ వద్ద, 17న వరంగల్‌లో, 21న శంషాబాద్‌లో నిరసన సభలు, 24న విద్యుత్ సౌధలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయినా, యాజమాన్యం స్పందించని పక్షంలో 24న అత్యవసర సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో జేఏసీ కో చైర్మన్ శ్రీధర్, కో కన్వీనర్, బీసీ రెడ్డి, వైస్ చైర్మన్ వజీర్ పాల్గొన్నారు. -
అదానీ వ్యవహారంపై జేపీసీ తప్ప మరేదైనా వృథాయే: కాంగ్రెస్
న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యవహారంలో సమగ్ర విచారణ అత్యంత అవసరమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తప్ప మరే కమిటీ వేసినా వృథా ప్రయాసేనని అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుపై సుప్రీం కోర్టు దగ్గర ప్రతిపాదనలు చేస్తే , ఈ అంశంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు అవుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదానీ ఆస్తులకు సంబంధించి హిండెన్‌బర్గ్ నివేదికలో వచ్చిన ఆరోపణలపై నిపుణులతో కమిటీ వేయాలని సుప్రీం కోర్టు ఈ నెల 13న జరిపిన విచారణలో అభిప్రాయపడిందని, దీనిపై కేంద్రం 17లోగా స్పందించాల్సి ఉందని జైరామ్ రమేష్ గుర్తు చేశారు. జేపీసీ మినహాయించి ఎలాంటి చట్టబద్ధ కమిటీలు వేసినా ఈ విషయంలో ఉపయోగం ఉండదని అన్నారు. చదవండి: మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీం తీర్పు రిజర్వ్.. -
కామారెడ్డిలో కొనసాగుతున్న రైతు జేఏసీ నిరసనలు
-
అవసరమైతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం : రైతు జేఏసీ
-
కామారెడ్డిలో నేడు రైతు జేఏసీ అత్యవసర సమావేశం
-
రాయలసీమలో పర్యటించే అర్హత చంద్రబాబుకు లేదు : విద్యార్ధి జేఏసీ
-
ఉత్తరాంధ్ర గర్జన.. నరసన్నపేటలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: నరసన్నపేటలో విశాఖ రాజధాని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్జీవోలు పాల్గొన్నారు. విశాఖ రాజధాని కోసం ప్రతి పల్లె నినదించాలని లజపతిరాయ్ పిలుపునిచ్చారు. ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. వలసల నివారణ, ఉపాధి అవకాశాలు విశాఖ రాజధానితోనే సాధ్యమన్నారు. చదవండి: పాతవారికే ‘కొత్త’ కలరింగ్!.. కళా వారి రాజకీయ మాయా కళ -
బండి సంజయ్ వ్యాఖ్యలపై ఉద్యోగ జేఏసీ ఆగ్రహం
నాంపల్లి: ఉద్యోగ సంఘాలు అమ్ముడుపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉద్యోగ జేఏసీ నేతలు నిరసన తెలిపారు. జేఏసీ చైర్మన్ మామిళ్ళ రాజేందర్ నేతృత్వంలో నాంపల్లిలోని టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యాలయం నుంచి ఏ–వన్ సిగ్నల్ వరకు చేరుకుని, అక్కడి నుంచి తిరిగి టీఎన్జీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సోమవారం జరిగిన ర్యాలీలో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ సెక్రటరీ జనరల్ వి.మమత, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవో నేతలు గండూరి వెంకటేశ్వర్లు, కస్తూరి వెంకటేశ్వర్లు, రామినేని శ్రీనివాసరావు, ఎస్.ఎం.హుస్సేన్, శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు. -
పవన్ కల్యాణ్ తీరుపై ఉత్తరాంధ్ర జేఏసీ ఆందోళన
-
విశాఖ రాజధాని కాకపోతే పాతికేళ్లలో.. మరో విభజన యుద్ధం
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ‘స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయింది. ఇప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో వచ్చిన అవకాశాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీరుగార్చారు. దేవుడిలా.. ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్ల విశాఖ కేంద్రంగా (రాజధానిగా) ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి మళ్లీ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మరో 25 ఏళ్లలో ఇంకో విభజన యుద్ధం తప్పదు..’ అని నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ పేర్కొన్నారు. విశాఖలో శనివారం నిర్వహించనున్న విశాఖ గర్జనకు సంబంధించిన జెండాను శుక్రవారం విశాఖపట్నంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జేఏసీ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కేంద్రీకరణ వల్ల ఇప్పటికే నష్టపోయాం. వికేంద్రీకరణకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష.. ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమతో పాటు మధ్యాంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతాయన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అన్నివర్గాల ప్రజలు సహకరిస్తున్నారు..’ అని చెప్పారు. విశాఖ కేంద్రంగా రాజధాని కోసం శనివారం విశాఖలో నిర్వహించనున్న విశాఖ గర్జనకు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. విశాఖ వాసులు.. ఉత్తరాంధ్ర వాసులు ఈ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ‘విశాఖ గర్జన ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు.. రాష్ట్ర శ్రేయస్సు కోసం జరుగుతున్న ఉద్యమం. ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనంపై ఎన్నో కమిటీలు చెప్పాయి. కేంద్రం కూడా గుర్తించింది. అటువంటి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖ పరిపాలన రాజధానిగా, రాయలసీమ వాసుల కోసం కర్నూలు న్యాయ రాజధానిగా, మధ్యాంధ్రప్రదేశ్లో అమరావతి శాసన రాజధానిగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశం..’ అని చెప్పారు. ఇది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయమన్నారు. విశాఖపట్నం రాజధాని అయితే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి బాటపడతాయని తెలిపారు. 1956 ఏప్రిల్ ఒకటినే.. జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ 1953లో ఆంధ్రరాష్ట్రం మద్రాస్ ప్రెసిడెన్సిలో ఉండేదని, ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశంపంతులు ఉన్నప్పుడు తొలి అసెంబ్లీ సమావేశం విశాఖ ఏయూ టీఎల్ఎన్ సభా హాల్లో జరిగిందని చెప్పారు. కర్నూలు రాజధానిగా అప్పుడే ఒక తీర్మానం చేశారని గుర్తుచేశారు. తర్వాత పరిణామాల్లో 1956 ఏప్రిల్ ఒకటిన విశాఖ రాజధానిగా శాసనసభ్యులందరూ అప్పుడే తీర్మానం చేసినప్పటికీ, ఇక్కడి రాజకీయ నాయకులు చొరవ చూపకపోవడంతో రాజధాని హైదరాబాద్‌కు వెళ్లిపోయిందని చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత వచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం నిలబెట్టుకోకపోతే భావితరాలకు అన్యాయం చేసిన వాళ్లమవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాజకీయాలు, కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి విశాఖ రాజధానికి సహకరించాలని అభ్యర్థించారు. -
విశాఖకు జై!.. దిక్కులు పిక్కటిల్లేలా గర్జన
సాక్షి, విశాఖపట్నం: తరతరాల వెనుకబాటు తనంపై తమ గొంతు వినిపించేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధమయ్యారు. తమ ఆకాంక్షలను బలంగా చాటేందుకు దిక్కులు పిక్కటిల్లేలా గర్జించడానికి వేచి చూస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా శనివారం నిర్వహించనున్న విశాఖ గర్జనలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 1956లోనే రాజధానిగా విశాఖ ఏర్పాటు కావాల్సి ఉన్నప్పటికీ వీలు కాలేదని, ఇన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు తమ చిరకాల కోరిక నెరవేరబోతున్న సమయంలో అడ్డుకునే వారికి బుద్ది చెప్పేలా శాంతియుతంగా గర్జనను నిర్వహిచేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడంటూ నినదిస్తున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న విశాఖ గర్జనకు మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థి లోకం పూర్తి మద్దతు తెలిపింది. విశాఖ గర్జన విజయవంతానికి వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు, భారతీయ జనతా పార్టీలు మాత్రం గర్జనకు దూరంగా ఉంటున్నాయి. గత ఎన్నికల్లో గాజువాకలో ఘోరంగా ఓడించారన్న అక్కసుతో ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా తన వాణిని కాస్త జనవాణిగా వినిపించేందుకు జనసేన నేత పవన్ కల్యాణ్ విశాఖకు శనివారమే వస్తుండడం గమనార్హం. టీడీపీ నేతలు కూడా ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతంపై విషం చిమ్ముతున్నారు. తమ హయాంలో జరిగిన భూకబ్జాలను కప్పిపుచ్చుకుంటూ.. దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్టుగా.. భూకబ్జాలకు పాల్పడిన టీడీపీ నేతలే వాటి గురించి మాట్లాడుతుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పైగా ఇదే రోజు ఉత్తరాంధ్ర నేతలందరూ ఆ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యేందుకు సిద్ధమవ్వడంపై మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. శుక్రవారం ఉత్తరాంధ్ర నాన్‌పొలిటికల్ జేఏసీ చైర్మన్ లజపతిరాయ్, మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు పలువురు జేఏసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మేధావులు ర్యాలీ జరిగే రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ‘విశాఖ గర్జన’ జెండాను, పాటను ఆవిష్కరించారు. నియోజకవర్గాల వారీ రూట్‌మ్యాప్‌ను పోలీసులకు అందజేశారు. ఉత్తరాంధ్ర, ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల వారీగా వెళ్లేలా వలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు. యాత్రలో పాల్గొనే వారందరికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా వలంటీర్లు సహాయ పడతారు. సాగర తీరాన మూడున్నర కిలోమీటర్ల మేర సుమారుగా లక్ష మందితో గర్జన జరగనుంది. ర్యాలీ సాగేదిలా.. ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘విశాఖ గర్జన’ ర్యాలీ శనివారం ఉదయం 9 గంటలకు ఎల్ఐసీ బిల్డింగ్.. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభం కానుంది. జైలు రోడ్డు జంక్షన్, సెవెన్ హిల్స్ హాస్పిటల్ జంక్షన్, వాల్తేర్ క్లబ్, సిరిపురం జంక్షన్, చిన వాల్తేర్ జంక్షన్ మీదుగా ఆర్కే బీచ్ రోడ్డులోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు సుమారు మూడున్నర కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ముందుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, మేధావులు నివాళులర్పించి.. ర్యాలీ ప్రారంభిస్తారు. ర్యాలీ సందర్భంగా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం, ఇక్కడ ప్రజలు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటం, ఇతరత్రా సమస్యలు ఎదుర్కొంటుండటంపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విశాఖ గర్జన నేపథ్యంలో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. -
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే అసలైన నిబద్ధత: సజ్జల
సాక్షి, తాడేపల్లి: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘బీసీలకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం-బీసీలకు అందిస్తున్న పథకాలు’పై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణమూర్తి, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ వైఎస్సార్ బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారన్నారు. చదవండి: ‘మద్రాస్, హైదరాబాద్‌లో తంతే అమరావతిలో పడ్డాం’ ‘‘వైసీపీ బీసీ డిక్లరేషన్ పెట్టినపుడు ఎన్నికల జిమ్మిక్కులంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. ఓట్ల రాజకీయం అని ఆరోపించాయి. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే అసలైన నిబద్ధత. విద్య ద్వారా సాధికారత సాధ్యమని వైఎస్సార్ నమ్మారు. అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. వైద్యం ఖరీదైన రోజుల్లో నేనున్నాంటూ పేదలకు ఆపన్నహస్తం అందించిన నేత వైఎస్సార్. ఎంబీసీలు నేడు తమ ఉనికి నిలబెట్టుకుంటున్నారు. తమకు కావాల్సిన హక్కుల సాధనకు పోరాడగలుగుతున్నారని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీసీల సాధికారతకు ఆనాడు వైఎస్సార్ హయాంలో తొలి అడుగు పడింది. నేడు వైఎస్సార్ బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారు. ఈ రోజు మా పార్టీ సభలు జరిగితే సగానికి పైగా వేదికపై బీసీ నేతలే ఉంటున్నారు. రిజర్వేషన్లు అమలు చేయడం పెద్ద పరీక్ష. అనుకున్న దానికంటే ఎక్కువ శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కిందని’’ సజ్జల అన్నారు. -
పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా 15న విశాఖ గర్జన
మహారాణిపేట (విశాఖ దక్షిణ): పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా 15న నిర్వహించనున్న విశాఖ గర్జనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మూడు రాజధానులను సీఎం జగన్ ప్రకటించారని చెప్పారు. ఉత్తరాంధ్ర జేఏసీ పిలుపు మేరకు గర్జనకు వైఎస్సార్సీపీ మద్దతు పలుకుతోందన్నారు. విశాఖ డాబా గార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్డు వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి మద్దతుగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో ర్యాలీలు జరుగుతాయన్నారు. సోమవారం విశాఖ మద్దిలపాలెంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించాలని చంద్రబాబు, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిచిన టీడీపీ నేత అచ్చెన్నాయుడు సొంత ప్రాంతం అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ‘మీ వ్యాపారాలకు, నివాసానికి, పిల్లల చదువుల కోసం విశాఖ కావాలా? ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందకూడదా?’ అని నిలదీశారు. ► టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతామనే భయం ఆ పార్టీ నాయకుల్లో కనబడుతోంది. ► 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు విశాఖలో చేసిన అభివృద్ధి శూన్యం. వెనకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర, విశాఖను అభివృద్ధి చేసింది దివంగత వైఎస్సార్ ఒక్కరే. విశాఖలో హెల్త్‌సిటీ, ఐటీ పార్క్, ఉత్తరాంధ్ర స్రుజల స్రవంతి, బీఆర్టీఎస్, విమ్స్, బీహెచ్ఈఎల్, ఫార్మా పరిశ్రమలను తెచ్చి ముందుచూపుతో నేటి యువతరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. -
అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకో.. మంత్రి బొత్స హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలనే నినాదంతో జేఏసీ ఏర్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ర్యాలీని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మహానేత వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. కాగా చంద్రబాబు ప్రాంతీయ విభేదాలు తేవాలని చూస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి దోపిడీకి అడ్డుపడుతున్నారనే బాధ చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అచ్చెన్నాయుడు ఎందుకు వైజాగ్‌ను పరిపాలన రాజధానిగా వద్దంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు ఏం చేశారని నిలదీశారు. అచ్చెన్నాయుడు పెద్ద జ్ఞానిలా మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. టీడీపీ వాళ్ళు సహనం కోల్పోతున్నారని.. ఎల్లో మీడియాతో కలిసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో పేదలకు పెట్టిన ఒక మంచి పథకమైన అచ్చెన్నాయుడు చెప్పాలని, కనీసం అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో భోగాపురం ఎయిర్‌పోర్టు అయిన కట్టించారా అని ప్రశ్నించారు. ‘ఉత్తరాంధ్ర అభివృద్ధి స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రారంభించింది వైఎస్సార్. హెల్త్ సిటీని తీసుకువచ్చింది రాజశేఖర రెడ్డి. బ్రాండేక్స్ కంపెనీ తీసుకువచ్చింది మహనేతనే. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు సీఎం జగన్ చేపట్టారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు మన పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఏపీలోని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేకపోతున్నారు. గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు తెలిసిన వారు టీడీపీ నేతలు. మన సీఎంకు అటువంటి మాయలు తెలియవు’ అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. చదవండి: ఎన్టీఆర్ చావుకు కారణమైన వారిని తరిమికొట్టాలి: కొడాలి నాని -
వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు
-
ఉత్తరాంధ్ర అభివృద్ధితోనే వలసలు ఆగిపోతాయి : మేధావులు