నిరుద్యోగ నిరసన.. జేఏసీది కాదు
నిరుద్యోగ నిరసన జేఏసీది కాదు
Published Mon, Feb 6 2017 9:34 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
పంజగుట్ట: నిరుద్యోగ నిరసన ర్యాలీ కేవలం జేఏసీ కార్యక్రమం కాదని, అన్ని సంఘాల వారు తమ జెండాలతో పాల్గొని విజయవంతం చేయాలని టీ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘నిరుద్యోగుల నిరసన ర్యాలీ’ పోస్టర్‌ను ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. ఉపాధికల్పన, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పాలన ఉండాలని సూచించారు. నోటీఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వమే సభా వేదికగా చెప్పి ఇప్పుడు నోటిఫికేషన్లు లేవనడం సబబు కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు పెద్దగా అవకాశంలేని ఐటీఐ, పాలిటెక్నిక్ చదువుకున్న వారి కోసం ప్రైవేట్ సంస్థల్లో, ప్యాక్టరీల్లో సూపర్‌వేజర్ క్యాడర్ పోస్టుల్లో 80 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.
Advertisement