
తిమ్మాపూర్‌లో మాట్లాడుతున్న జేఏసీ నాయకులు
భైంసారూరల్: రైతు సమస్యలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తామని టీజేఏసీ నిర్మల్ జిల్లా చైర్మన్ ఆరెపల్లి విజయ్‌కుమార్ అన్నారు. గురువారం టీజేఏసీ జిల్లా కన్వీనర్ డా.ముష్కం రామకృష్ణాగౌడ్‌తో కలిసి తిమ్మాపూర్ గ్రామంలో రైతుల వద్దకు వెళ్లారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, బాధలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించాక కూడా రైతుల సమస్యలు తీరడం లేదన్నారు.
రైతుల సమస్యలు పరిష్కారం చేసేందుకు క్షేత్రస్థాయిలో వెళ్లి వారితో కలిసి సాదక బాధకాలు అడిగి తెలుసుకుంటున్నామన్నారు. ఈనెల 21న రైతు సదస్సు ఏర్పాటు చేస్తున్నామని, సదస్సులో నియోజకవర్గ రైతులంతా పాల్గొని సమస్యలపై చర్చించాలన్నారు. ప్రధాన సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీవీ జిల్లా కార్యదర్శి చాకెటి లస్మన్న, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జే.రాజు, జేఏసీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment