kodanda ram
-
జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు టాప్ మార్కులు వచ్చినా జనరల్‌గా కాకుండా, రిజర్వేషన్‌గా పరిగణించడం వల్ల మరో రిజర్వ్డ్ అభ్యర్థికి అవకాశం లేకుండా పోతోందని స్పష్టం చేశారు. యూపీఎస్సీ అమలు చేస్తున్నా.. ఆ విధానాన్ని టీజీపీఎస్సీ ఎందుకు అమ లు చేయడం లేదని నిలదీశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జీవో 55 ప్రకారం అన్నివర్గాల నిరుద్యోగులు, విద్యార్థులకు న్యాయం చేశారని పేర్కొన్నా రు. శనివారం సిద్దిపేటలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని సదస్సులు నిర్వహిస్తుంటే.. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి రా జ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ వర్గానికి ప్రతినిధిగా ఉండి మౌనం వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాన్ని అడిగితే భట్టి విక్రమార్క పరిశీలిస్తామన్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డిని నిలదీసి బలహీన వర్గాల హక్కులను కాపాడాలి.విద్యార్థులు, నిరుద్యోగుల ఆర్తనాదాలతో అశోక్‌నగర్ ప్రాంతం మార్మోగుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని, రిజర్వేషన్లు అమలు చేయాలని విద్యార్థులు రోడ్డెక్కితే వారిని కొడుతున్నారు. ఆడపిల్లల్ని కూడా అర్ధరాత్రి పోలీసు స్టేషన్లలో పెడుతున్నారు. వారేమైనా టెర్రరిస్టులు, హంతకులు, గూండాలా? లాఠీలు, ఇనుప కంచెలను రేవంత్‌రెడ్డి నమ్ముకున్నారు. అవి అణచేయవు. ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా అశోక్‌నగర్‌కు వెళ్లాలి. కోదండరాం స్పందించడం లేదేం? కాంగ్రెస్ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌లో ప్రకటించినవి ఒక్కటైనా అమలు చేశారా? అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పది నెలలు గడిచినా ఒక్క నోటిఫికేషన్ లేదు. కేసీఆర్ ప్రభుత్వమే ప్రక్రియ అంతా పూర్తిచేసిన ఉద్యోగాలకు కాగితాలు పంచి.. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. కోదండరాం ఎందుకు మౌనంగా ఉంటున్నారు? నిరుద్యోగుల ఎజెండా.. నా ఎజెండా అన్నారు. ఎమ్మెల్సీ అయ్యాక గొంతు మూగబోయింది. కోదండరాం, రియాజ్, నవీన్, ఆకునూరి మురళిలకు ఉద్యోగాలు వచ్చాయి. నిరుద్యోగులకు రాలేదు. కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం బట్టబయలు గ్రూప్–1 అభ్యర్థుల నిరసన సాక్షిగా కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం మరోమారు బట్టబయలైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నిరసన తెలుపుతుంటే అడ్డుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గం. జీవో 29 రద్దు చేసి గ్రూప్స్ అభ్యర్థులకు న్యాయం చేయాలని జూలై 29న నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడే ప్రభుత్వం మొండిపట్టు వీడి ఉంటే ఇప్పుడు విద్యార్థులు, అభ్యర్థుల మీద లాఠీలు విరిగేవి కాదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు. రాజకీయాలు పక్కనబెట్టి విద్యార్థుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలి..’’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అమీర్ అలీఖాన్ ప్రమాణం
-
కోదండరామ్‌కు ఎమ్మెల్సీ వద్దు: గవర్నర్‌కు దాసోజు శ్రవణ్ లేఖ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణకు గవర్నర్లు మారుతున్నా గవర్నర్‌కోటా ఎమ్మెల్సీల నియమాక వివాదం కొనసాగుతూనే ఉంది. టీజేఎస్ నేత కోదండరామ్, మీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించవద్దని కొత్త గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు కోరారు. ఈ మేరకు జిష్ణుదేవ్‌శర్మకు శుక్రవారం(ఆగస్టు2) వారు ఒక లేఖ రాశారు. ఎమ్మెల్సీల నియమాకం విషయమై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున తుది నిర్ణయం తీసుకోవద్దని లేఖలో కోరారు. కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపిన కోదండరామ్, అలీఖాన్ పేర్లపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.గతంలో బీఆర్ఎస్ హాయంలో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్‌కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయగా అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీంతో క్యాబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్‌కు ఉందా లేదా అన్న అంశంపై దాసోజు,కుర్ర కోర్టుకు వెళ్లారు. అప్పటిదాకా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎవరినీ నియమించవద్దని కోరారు. -
‘ఓయూ’లో ఉద్రిక్తం
ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్): రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (టీఎస్పీ) చేపట్టిన చలో ప్రొఫెసర్ కోదండరాం ఇంటి ముట్టడి కార్యక్రమంతో బుధవారం ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలికొంది. ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్‌కుమార్ యాదవ్‌తో మరో ఇద్దరు విద్యార్థి నేతలను ఉదయం 7.30 నిమిషాలకు హాస్టల్ అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్ తరలించి సాయంత్రం 6 గంటలకు విడిచి పెట్టారు. అనంతరం అశోక్‌కుమార్ మాట్లాడుతూ వర్సిటీలకు తక్షణం వీసీలను నియమించేలా టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం సీఎం రేవంత్‌రెడ్డిపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి ఏడు నెలలు గడుస్తున్నా, ఇంత వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. సీఎం రేవంత్ విద్యరంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా, కోదండరాం మౌనం వహించడం దారుణమని చెప్పారు.ఈ నెల 20వ తేదీలోగా వీసీలను నియమించకుంటే 10 విశ్వవిద్యాలయాల బంద్ చేపడుతామని హెచ్చరించారు. శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న విద్యార్థులను ఓయూ అధికారుల అనుమతి లేకుండా హాస్టళ్లలోకి చొరబడి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. మూడో రోజుకు చేరిన డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట మూడో రోజు అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు డీఎస్సీ అభ్యర్థుల నడుమ వాగ్వాదం చోటు చేసుంది. అభ్యర్థులు ఆందోళనను విరమించకపోవడంతో పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులపై పోలీసులు చేయి చేసుకున్నారు. డీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ విద్యార్థి నేతలపై పోలీసులు పిడిగుద్దుల వర్షం కురిపించారు. పలువురు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న 13 మంది విద్యార్థులను అరెస్ట్ చేసిన్నట్టు సీఐ రాజేందర్ తెలిపారు. మీడియా వర్గాలపై దాడి డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనను కవర్ చేస్తున్న ఓ చానల్ రిపోర్టర్ శ్రీ చరణ్, కెమెరామెన్ సాగర్ పై పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. గాయపడిన రిపోర్టర్ శ్రీ చరణ్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను నిరసిస్తూ రాత్రి ఓయూ పోలీస్‌స్టేషన్ ఎదుట జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. జరిగిన సంఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఓయూ ఏసీపీ జగన్ హామీ ఇవ్వడంతో జర్నలిస్టులు ధర్నా విరమించారు. జర్నలిస్టులపై దాడిని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ, ఎస్ఎఫ్ఐ నేత రవినాయక్, పీడీఎస్‌యూ జాతీయ నాయకుడు ఎస్.నాగేశ్వర్రావు ఇతర విద్యార్థి సంఘాల నాయకులు ఖండిచారు. -
భద్రాద్రి పవర్ ప్లాంట్ కాపాడుకోవడం కష్టమే: కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పవర్ భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేసిందన్నారు తెలంగాణ జన సమతి చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్. విద్యుత్ కొనుగోళ్లలో చాలా తప్పులు జరిగాయన్నారు. కేంద్రం చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు.కాగా, విద్యుత్ కొనుగోళ్లపై నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డితో కోదండరాం, విద్యుత్ శాఖ అధికారి రఘు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ కొనుగోలుపై తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు అందజేశారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.అనంతరం, కోదండరాం మీడియాతో మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం ప్రజల నెత్తిన నష్టాల భారాన్ని మోపింది. విద్యుత్ శాఖను రూ.80వేల కోట్ల అప్పుల్లోకి నెట్టేశారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను ఎలా కాపాడుకోవడం అనేది అనుమానమే. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పవర్ భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. పోలవరం పూర్తి అయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కేసీఆర్ తొందర పాటు నిర్ణయం వల్ల ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందాలు చేసుకున్నారు.వెయ్యి మెగావాట్ల అదనపు విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్‌గఢ్‌తో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తర్వాత ఈ ఒప్పందం రద్దు చేసుకుంది. ఒప్పందం రద్దు కారణంగా ప్రభుత్వంపై రూ.250కోట్ల అదనపు భారం పడింది. విద్యుత్ కొనుగోలుకు ఈఆర్సీ అనుమతి ఉందనేది అబద్ధం. విద్యుత్ కొనుగోళ్లలో చాలా తప్పులు జరిగాయి. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ అనుసరిస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరోవైపు విద్యుత్ శాఖ అధికారి రఘు మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి అంశాలపై మా వద్ద ఉన్న సమాచారాన్ని ఇచ్చాం. కమిషన్ ముందు పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒప్పందం ఎంఓయూ రూట్ కాకుండా కాంపిటేటివ్ రూట్‌కు ఎందుకు వెళ్లారనే సమాచారం ఇచ్చాం. ఛత్తీస్‌గఢ్ ఒప్పందం ప్రకారం విద్యుత్ సరఫరా చేయలేదు. ఈ ఒప్పందం వల్ల రూ.2600 కోట్ల నష్టం జరిగింది. వెయ్యి మెగావాట్ల ఒప్పందం జరిగితే సప్లై చేయలేదు. అదనంగా మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కోసం ఒప్పందం చేసుకున్నారు. తర్వాత తప్పు తెలుసుకుని రద్దు చేసుకోవాలనుకుంటే కుదరలేదు.ఇరు రాష్ట్రాల డిస్కంల ఒప్పందాల ద్వారా ఎంఓయూ చేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్ ఒప్పందం రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందలేదు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఛాయిస్ కాదు. బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వంపై సబ్జెక్టుకల్ టెక్నాలజీని రుద్దారు. 2010లో తయారు చేసుకున్న పలు యంత్రాలను టెక్నాలజీని బీహెచ్ఈఎల్.. ప్రభుత్వంపై ఆరేళ్ల తర్వాత బలవంతంగా రుద్దారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ కోసం వాడిన యంత్రాలు సరైనవి కావు అని మా అభిప్రాయం. గోదావరిలో ఫ్లడ్ ఎక్కువైతే భద్రాద్రిపై ప్రభావం పడే అవకాశం ఉంది. సాంకేతికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా భద్రాద్రి నిర్మాణం చేయడమే కాదు.. సరైన లొకేషన్ కూడా కాదు.యాద్రాద్రీ పవర్ ప్లాంట్ లోకేషన్ వల్ల రవాణా చార్జీల భారం ఎక్కువగా పడుతుంది. పర్యావరణ అంశాలను లెక్క చెయ్యకుండా భద్రాద్రి నిర్మాణం మొదలు పెట్టారు. కాంపిటేటివ్ బిడ్డింగ్‌లో రేటు తక్కువ అయ్యే అవకాశం ఉండేది. కానీ అప్పటి ప్రభుత్వం అలా చెయ్యలేదు. 2016లోనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. మా అభ్యంతరాలను రెగ్యులేటరీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం అప్పుడే కమిషన్ పీపీఏ చేయమంటే ఏడేళ్లుగా చెయ్యలేదు. ఈ ఒప్పందం వల్ల మూడు రకాల నష్టాలు జరిగాయి. రూ.635 కోట్ల నష్టం వచ్చింది. విద్యుత్ సరిగ్గా సరఫరా చేయనందుకు భద్రాద్రి ప్లాంట్ 25 ఏళ్లలో తొమ్మిది వేలు, యాదాద్రి రవాణా వల్ల రూ.1600 కోట్లకు పైగా నష్టం జరుగుతోంది. పర్యావరణ అనుమతులు లేకుండా భద్రాద్రి ప్లాంట్ మొదలు పెట్టారు’ అని చెప్పుకొచ్చారు. -
బీఆర్ఎస్ పాలన దోచుకోవడం.. దాచుకోవడమే.. : కోదండరామ్
ఆదిలాబాద్: దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా పదేళ్ల బీఆర్ఎస్ పాలన సాగిందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. పట్ట ణంలోని జేకే ఫంక్షన్హాల్లో జిల్లా అధ్యక్షుడు తిలక్‌రావు అధ్యక్షతన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పార్లమెంట్ సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతికి నిలు వెత్తు నిదర్శనంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచాయన్నారు. కేంద్రప్రభుత్వ గుర్తింపు పొందిన జాతీయస్థాయిలోని స్వతంత్ర సంస్థ ఆడిటింగ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక, అమలు సరిగాలేదని, నిధుల వినియోగం సక్రమంగా లేదని చెప్పిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కంపెనీ నుంచి కేసీఆర్ అందినకాడికి దండుకున్నారని విమర్శించారు. అవసరానికంటే అదనంగా ఖర్చు చేసి పనులు చేపట్టారన్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు దశాబ్దాల క్రితం కట్టారని అవన్నీ నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయని కేసీఆర్ కట్టిన కాళేశ్వరం పనులు మాత్రం ఆదిలోనే పునాదులు కదులుతున్నాయన్నారు. కోట్లాడి తెచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనతో అవినీతి పెరిగిపోయిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా టీజేఎస్ శ్రేణులు పనిచేయాలని కోదండరామ్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలతోపాటు గిరిజన వర్సిటీ ఏర్పాటు చేసి పోడు భూములు, డీ 27, డీ28 కాలువల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంతకముందు నాయకులు కోదండరామ్‌ను సన్మానించారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నాయకులు సర్దార్ వినోద్, దుర్ము, గోనె శ్రీనివాస్, బెనహర్ సిరాజ్, రాజేశ్వర్‌రెడ్డి, లింగన్న పాల్గొన్నారు. నిర్వహణ లేకనే ‘కడెం’కు ప్రమాదం.. కడెం ప్రాజెక్ట్ నిర్వహణను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ప్రమాదం నెలకొందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. కడెం ప్రాజెక్టును ఆదివారం ఆయన సందర్శించారు. వరద గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు. రాష్ట్రంలో హైదరాబాద్ ఇంజినీర్లు మొదట కట్టిన ప్రాజెక్టుల్లో కడెం ఒకటన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత కడెంను పట్టించుకోకపోవడంతో డేంజర్ జోన్లోకి వెళ్లిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, మరమ్మతు చేయిస్తోందని తెలిపారు. కడెం ప్రాజెక్ట్‌కు బ్యాలెన్సింగ్ రిజర్వార్గా ఎగువన కుప్టి ప్రాజెక్టు నిర్మిస్తే ఆయకట్టును స్థిరీకరించవచ్చని పేర్కొన్నారు. ప్రాజెక్టు ఆధునికీకరణ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆయన వెంట టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు తిలక్‌రావు ఉన్నారు. ఇవి చదవండి: సార్.. గిరాకీల్లేవ్! -
కోదండరాంకు కీలక పదవి.. కాంగ్రెస్‌లో చర్చ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి(టీజేఎస్) కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత కోదండరాం ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చి గెలుపులో భాగమయ్యారు. తాజాగా ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ సముచితమైన పదవిని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా.. కోదండరాంను రాజ్యసభకు పంపేందకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు ఈ అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ రెండో తేదీతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తి కానుంది. పదవీకాలం పూర్తి చేసుకుంటున్న వారిలో వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ దండరాంకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తారని కాంగ్రెస్ పార్టీలో చర్చ జోరందుకుంది. ఇది కూడా చదవండి: పొన్నాల వాట్సాప్ స్టేటస్‌పై ఎర్రబెల్లి ఫైర్ -
అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు కోదండరామ్ మద్దతు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోదండరాం మద్దతు తెలిపారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి తెలంగాణ జనసమితి పార్టీ సిద్ధమైంది. అంతేకాకుండా... విశాల ప్రయోజనాల దృష్టా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసమితి పోటీకి దూరంగా ఉండనుంది. కాగా నాంపల్లిలోని తెలంగాణ జన సమితి కార్యాలయానికి సోమవారం కాంగ్రెస్ నేతలు వెళ్లారు. ఆ పార్టీ అధినేత కోదండరాంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, కర్ణాటక మంత్రి జోసురాజు, తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాల్సిందిగా కోదండరాంను కోరారు. ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్ధుబాటు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీజేఎస్‌కు సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఇప్పటికి కలిసి పనిచేద్దామని ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కోదండరాం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. చదవండి: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కోదండరాం పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూచనల మేరకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాల్సిందిగా కోదండరామ్‌ను కోరేందుకు వచ్చినట్లు తెలిపారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరమని అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకెళతామని చెప్పారు. భవిష్యత్‌లో సమన్వయ కమిటీని నియమించుకుని ముందుకెళతామని, ప్రభుత్వంలో భాగస్వామి అయ్యేలా టీజేఎస్ కమిటీ ఉంటుందని తెలిపారు. ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తుందన్న రేవంత్ రెడ్డి.. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్‌కు కీలక స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. లక్ష్యం గొప్పది దాని కోసం కలిసి పని చేస్తామని, నియంతను గద్దె దించాలనేది ప్రధాన అజెండాగా తెలిపారు. లక్ష్యాన్ని ముద్దాడే వరకు అండగా ఉంటామని కోదండరాం హామీ ఇచ్చారని చెప్పారు. -
మీకోసం ఢిల్లీలో సైనికుడిలా ఉంటా: రాహుల్ గాంధీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ మూడూ ఒక్కటే. వీరంతా కలిసి పనిచేస్తారు. ఢిల్లీలో, లోక్‌సభలో బీజేపీకి బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతుంది. తెలంగాణలో బీజేపీ, ఎంఐఎంలు బీఆర్ఎస్కు మద్దతు ఇస్తాయి. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచి్చనా ఎంఐఎం పోటీ చేసి బీజేపీకి సాయపడుతోంది. ఈ ముగ్గురి లక్ష్యం కేవలం ప్రజాధనం దోచుకోవడం మాత్రమే. నేను బీజేపీతో పోరాటం చేస్తున్నందుకు నాపై కేసులు పెడుతున్నారు. నా లోక్‌సభ సభ్యత్వం రద్దు చేసి నా ఇంటిని లాక్కున్నారు. నేను సంతోషంగా ఇంటిని అప్పగించాను. అసలు నాకు ఇల్లే అక్కర్లేదు. మొత్తం ఇండియానే నా ఇల్లు. తెలంగాణలో ప్రతి పల్లె, పట్టణం నా ఇల్లే. కోట్లాది ప్రజల హృదయాల నుంచి నన్ను దూరం చేయలేరు. ఢిల్లీలో, కేంద్రంలో ఇందిర, రాజీవ్, సోనియాల తరహాలోనే రాహుల్ గాంధీ అనే మీ సైనికుడు అక్కడ ఉంటాడు. మీకు ఎప్పుడు అవసరమైనా వెంటనే వచ్చేస్తాడు..’ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలకు హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే కులగణన చేపడతామన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు కులగణన తొలి అడుగు అని పేర్కొన్నారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, పసుపు మద్దతు ధర రూ.15 వేలకు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆరోపించారు. తెలంగాణలో ఇసుక, భూ, లిక్కర్ మాఫియాలను కేసీఆర్ కుటుంబమే నడుపుతోందన్నారు. కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర మూడోరోజు శుక్రవారం.. కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో రాహుల్ పర్యటించారు. జగిత్యాల, మోర్తాడ్, ఆర్మూర్ పట్టణాల్లో జరిగిన కార్నర్ మీటింగుల్లో ప్రసంగించారు. మోదీ రహస్య ఒప్పందం.. ‘ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఒక కుటుంబమే రాజ్యమేలుతోంది. ఒకే కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణను విడిపించుకుందాం. సోనియాగాంధీ ప్రజా తెలంగాణను ఆకాంక్షించి రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచి్చన కేసీఆర్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వనరులను, ప్రజలను విచ్చలవిడిగా దోచుకుంటోంది. దేశంలో ప్రతిపక్ష సీఎంలను వెంటాడుతున్న మోదీ.. కేసీఆర్ విషయంలో మాత్రం రహస్య ఒప్పందంతో వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ తనకు తెలియకుండానే దెబ్బతింది. ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు వరుస కడుతున్నారు. బీఆర్ఎస్ కారు టైరు వారికి తెలియకుండానే పగిలింది. కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజా తెలంగాణ సాధ్యం. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల తలుపులు ప్రజల కోసం నిరంతరం తెరిచి ఉంటాయి. రైతాంగానికి అండగా నిలబడతాం. నిజాం షుగర్స్ తెరిపిస్తాం. వరి తరహాలోనే అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు అదనంగా రూ.500 చెల్లింపు విషయాన్ని ఆలోచిస్తున్నాం. కేసీఆర్ కుటుంబం దోచుకున్న డబ్బును సంక్షేమం రూపంలో ప్రజలకు పంచుతాం..’అని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ బెబ్బులి పులుల సర్కారు ఏర్పడబోతోంది.. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణన ఆధారంగానే బడ్జెట్ కేటాయింపులు చేస్తాం. హక్కులు కల్పిస్తాం. నేను పార్లమెంటులో కులగణన ప్రస్తావన తెస్తే.. ప్రధాని సమాధానం ఇవ్వలేకపోయారు. ఇక్కడ సీఎం కూడా కులగణనపై ఆసక్తి చూపడం లేదు. దేశంలో శ్రామిక శక్తి ఓబీసీలే. దామాషా ప్రకారం ఓబీసీలకు ఇవ్వాల్సిన హక్కులు ఇచ్చేందుకు వారు సిద్ధంగా లేరు. దేశ జనాభాలో 50% ఓబీసీలే. కానీ కేవలం 5% బడ్జెట్ మాత్రమే ఓబీసీల చేతుల్లో ఉంది. ఈ నిజాన్ని దాచి మీ జేబుల్లోనుంచి డబ్బులు కొట్టేసి అదాని లాంటి వ్యక్తులకు వెళ్లేలా చేస్తున్నారు. కులగణన ఎక్స్‌రే లాంటిది. గాయం ఎక్కడ తగిలిందో ఎక్స్‌రే చెబుతుంది..’అని రాహుల్ అన్నారు. తెలంగాణలో ప్రజల సర్కారు, కాంగ్రెస్ బెబ్బులి పులుల (కార్యకర్తలు) సర్కారు ఏర్పడబోతోందని చెప్పారు. జీవన్‌రెడ్డి అనువాదం బాగుందంటూ..జగిత్యాల నుంచి జీవన్‌రెడ్డిని, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను అసెంబ్లీకి పంపాలని కోరారు. రాహుల్ వెంట పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి తదితరులున్నారు. టీ తాగి..దోశెలు వేసి..తిని మల్యాలలోని వేల్పూర్ మండలం పడిగెల్ క్రాస్‌రోడ్డులోని ఓ హోటల్ వద్ద టీ తాగుతూ రాహుల్ స్థానికులతో మాట్లాడారు. టీ అమ్ముకుంటున్న వృద్ధురాలి సమస్యలను తెలుసుకున్నారు. సోనియమ్మ కొడుకు, ఇందిరమ్మ మనుమడు నువ్వేనా అంటూ రాహుల్‌ను వృద్ధ దంపతులు ఆప్యాయంగా పలకరించారు. అక్కడి చిన్నారులతో సరదాగా సంభాషించిన రాహుల్ వారికి చాక్లెట్లు ఇచ్చారు. కాగా పర్యటన షెడ్యూలులో మార్పుల కారణంగా రాహుల్ గంగాధర, కొండగట్టు పర్యటన రద్దయ్యింది. దీంతో నేరుగా జగిత్యాల వెళుతూ మధ్యలో రాజారంలోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద ఆగారు. దోశెలు ఎలా వేయాలో యజమానిని అడిగి తెలుసుకున్నారు. దోశెలు వేసి కస్టమర్లకు ఇచ్చారు. తాను కూడా రుచి చూసి అద్భుతంగా ఉంది తమ్ముడూ అని అభినందించారు. అక్కడి పిల్లలకు కూడా చాక్లెట్లు ఇచ్చారు. టిఫిన్ తినేందుకు వచి్చన వారితో ముచ్చటించారు. రాహుల్ రాకతో రోడ్డుపై వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. మరిచిపోలేని అనుభూతి వెనుక నుండి వచ్చి, భుజంపై చేయి వేసి, తమ్ముడూ ఎలా ఉన్నావు? అంటూ రాహుల్ గాంధీ పలుకరించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగిలిచిందని పోతారం గ్రామానికి చెందిన టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు వావిలాల శివగౌడ్ చెప్పాడు. తాను దోశెలు వేసి తినడంతో పాటు తనకు తినిపించారని అన్నాడు. రాహుల్ గాందీని టీవీలో తప్ప నేరుగా ఎప్పుడూ చూడలేదంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఎంతో పెద్ద రాజకీయ నాయకుడు అయినా చాలా సాదాసీదాగా ఉన్నారని వ్యాఖ్యానించాడు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేఖానాయక్ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజాస్వామిక తెలంగాణపై చర్చించాం: కోదండరాం ఓ హోటల్లో బస చేసిన రాహుల్ గాందీని శుక్రవారం ఉదయం టీజేఎస్ అధినేత కోదండరాం కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితిపై తమకు ఉన్న సమాచారాన్ని రాహుల్‌తో పంచుకున్నామని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి హైదరాబాద్‌లో ప్రకటన విడుదల చేస్తామని, సీట్లు, పొత్తుల విషయం రాహుల్‌తో మాట్లాడలేదని తెలిపారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన పోయి, ప్రజాస్వామిక తెలంగాణ రావాలి అన్న విషయంపై చర్చించామని, ఈ క్రమంలో తమ మద్దతు అడిగారని వివరించారు. రాజకీయాల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల భాగస్వామ్యం పెంచాలని, అందుకోసం కలిసి రావాలని అన్నారని చెప్పారు. -
చలో ఢిల్లీకి తెలంగాణ జనసమితి పిలుపు: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనసమితి అధినేత ప్రోఫెసర్ కోదండరాం రేపు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. తాము విభజన హామీలు, కృష్ణ జలాల సమస్యపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మౌన దీక్ష చేయనున్నట్లు తెలిపారు. సుమారు 150 మందితో గంటపాటు మౌనదీక్ష చేపడతామని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న జలవనరుల దోపిడీ కోసమే తాను ఈ మౌన దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జనసమితి అధినేత కోదండరాం జనవరి 30న ఢిల్లీలో మౌన దీక్ష చేయనున్నారు. జనవరి 31వ తేదిన కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలన అభివృద్ధి వాస్తవాలు అనే అంశంపై కానిస్టిట్యూషన్ క్లబ్లో సెమినార్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. (చదవండి: మోదీ సర్కారే టార్గెట్.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలన్న కేసీఆర్) -
వీరికి సడన్‌గా ఏపీపై ఎందుకంత ప్రేమ?
కొద్ది రోజుల క్రితం విజయవాడలో రాజధాని అమరావతిపై ఒక సమావేశం జరిగింది. రాజధాని ఉద్యమం 900 రోజుకు చేరిందంటూ ఆ సమావేశం పెట్టారు. అందులో మాట్లాడిన కొందరు వక్తలు చాలా ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. అందులోను రిటైర్డ్ న్యాయమూర్తి గోపాలగౌడ, తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్, పౌరహక్కుల నేత ఫ్రొఫెసర్ హరగోపాల్ ప్రభృతులు ఉన్నారు. సీపీఐ నారాయణ వంటివారు ఈ సమావేశంలో పాల్గొన్నా, వారు ఎప్పుడూ చెప్పే విషయాలు చెబుతుంటారు కాబట్టి, వారు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారన్న అబిప్రాయం ఉంది కాబట్టి వారి గురించి ప్రత్యేకంగా ఏమీ అననవసరం లేదు. కాకపోతే గోపాలగౌడ గతంలో రాజధాని భూముల సమీకరణకు వ్యతిరేకంగా కూడా వచ్చి మాట్లాడి వెళ్లినట్లు గుర్తు. అప్పట్లో ఆ రకమైన సమీకరణ రైతులకుఅన్యాయం చేసినట్లు అవుతుందని చెప్పారు. కాని ఇప్పుడే అదే గౌడ వచ్చి రాజధానిలో మార్పులు ఉండరాదని, మొత్తం లక్షన్నర కోట్లు అయినా అక్కడే వ్యయం చేయాలని చెప్పి అందరిని విస్తుపరిచారు. వీరు సామాజిక బాధ్యతతోనే మాట్లాడారా?లేక అమరావతి రైతుల ముసుగులో ఉన్న కొందరు వ్యాపారులు తీసుకు వచ్చారు కనుక వారికి లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో మాట్లాడారో అర్ధం కాదు. రాజధాని పై హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా తీర్పు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి, మంత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన అన్నారు. ఒక న్యాయ కోవిదుడు ఇలా మాట్లాడడమా? అసలు శాసనసభకు చట్టం చేసే హక్కే లేదని గౌరవ హైకోర్టు తీర్పు ఇస్తే దానిని ఇలాంటి మాజీ న్యాయమూర్తులు సమర్దించడమా? పైగా అమలు చేయకపోతే కేసులు పెట్టాలని అనడమా? ఎంత దారుణం. హైకోర్టు తీర్పుపై ఏపీ శాసనసభలో క్షుణ్ణంగా చర్చించి, హైకోర్టు కాని, శాసన వ్యవస్థ కాని ఎవరి పరిధులలో వారు ఉండాలని పేర్కొనడం గురించి గౌడ మాట్లాడరా? కాకపోతే జడ్జిలకు బంగ్లాలు నిర్మించలేదని బాదపడ్డారు. మరి ఇదే సమయంలో రాజధాని భూ స్కామ్ కేసులు, వాటిని న్యాయ వ్యవస్థ హాండిల్ చేసిన తీరు గురించి కూడా గౌరవ న్యాయమూర్తి చర్చించి తన అబిప్రాయాలు చెబితే బాగుండేది కదా? గౌరవ న్యాయమూర్తులు కొందరికి అమరావతిలో భూ ప్రయోజనాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబితే ,దానిని న్యాయ వ్యవస్థ ఎలా స్వీకరించాలో కూడా ఈయన వివరించి ఉండాల్సికదా. రాజధానిలో ఇప్పటివరకు చేసిన నిర్మాణాల గురించి, వాటిని అబివృద్ది చేయండని చెప్పడం తప్పుకాదు. కానీ ఇప్పటికే ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల అప్పు చేసింది కనుక మరో లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి అమరావతి ప్రాంతంలోనే వ్యయం చేయాలని అనడం మాత్రం గౌడ ది పూర్తిగా బాద్యతారాహిత్యం. కేవలం కొందరికి మేలు చేసేందుకే ఆయన అలా మాట్లాడారేమోనన్న అభిప్రాయం కలుగుతుంది. వేరే రాష్ట్రానికి చెందిన ఈయనకు శ్రీ బాగ్ ఒడంబడిక, వికేంద్రీకరణ,తదితర అంశాల గురించి తెలిసి ఉండకపోవచ్చు. అలాగే శివరామకృష్ణన్ కమిటీ మూడు పంటలు పండే భూములలో రాజధాని పెట్టవద్దని చెప్పిన సంగతిని ఆయనకు ఎవరూ చెప్పకపోయి ఉండవచ్చు. ఆయన మేధావి కావచ్చు. న్యాయ కోవిదుడు కావచ్చు.కాని ప్రజల మనిషి కాదని మాత్రం తనకు తాను రుజువు చేసుకున్నారేమో అని పిస్తుంది. ఇక మరో ప్రముఖుడు హరగోపాల్ చేసిన వ్యాఖ్యలు కూడా అనుచితంగా ఉన్నాయనిపిస్తుంది. రాజధాని మార్చరాదని అభిప్రాయం ఉంటే ఆక్షేపణీయం కాదు. కానీ ఆయన విజయవాడ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారుల సరసన కూర్చుని ఇలా మాట్లాడతారని ఎవరూ ఊహించలేం. ఆయనను ఎవరు మాయ చేసి తీసుకు వచ్చారో తెలియదు కానీ, ఎవరి ట్రాప్ లో పడి వచ్చారో తెలియదు కానీ ,పూర్తిగా పేదల ప్రయోజనాలను ఆయన విస్మరించడం విస్తుపరుస్తుంది. రాజధాని ప్రాంతంలో పేదలైన ఎస్.సి,ఎస్టి, బిసి వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని డిమాండ్ చేసేవారికి ఆయన మద్దతు ఇవ్వడమా? ఇలాగేనా పౌరహక్కులు కాపాడడం అంటే?ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదట. మరి తెలంగాణ ఉద్యమం సమయంలో ఏమి ప్రచారం చేశారు. ఆంద్ర పెట్టుబడిదారులు దోచుకుపోతున్నారని కదా? అలాంటి ఉద్యమానికి హరగోపాల్ కూడా మద్దతు ఇచ్చారు కదా? అంటే తెలంగాణలో ఆంధ్ర పెట్టుబడిదారులు దోపిడీ చేయకూడదు. ఏపీలో మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ ఇష్టారీతిన భూముల రేట్లు పెంచి దోపిడీ చేయవచ్చని హరగోపాల్ వంటివారు చెబుతున్నారా? రాజధానిని కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చితే దానికి ఆయన మద్దతు ఇవ్వడమా? హవ్వ! ఇదేనేమో కాలమహిమ! హరగోపాల్ వంటివారిని కూడా అప్రతిష్టపాలు చేయగల తెలివైన రాజకీయనేతలు ఎపిలో ఉండడం విశేషమే. హైకోర్టు తీర్పు ఇచ్చింది కనుక దానిని అమలు చేయకపోతే వ్యవస్థపై నమ్మకం పోతుందట. మరి ఇదే హరగోపాల్ ఎన్ని కోర్టు తీర్పులను విమర్శించలేదూ. అంతదాక ఎందుకు విప్లవకవి వరవరరావుకు బెయిల్ ఇవ్వరాదని ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సమర్ధిస్తారా? కోర్టులను విమర్శించకూడదు. న్యాయమూర్తులకు ఆపాదించకూడదు అన్నది వాస్తవమే అయినా, తీర్పులపై విశ్లేషించుకోవచ్చు.. విమర్శించవచ్చన్న సంగతి మేధావి అయిన హరగోపాల్ కు తెలియకుండా ఉంటుందా? న్యాయ వ్యవస్థ లో ఏమి జరుగుతోందో తెలియనంత అమాయకంగా హరగోపాల్ ఉన్నారా? తెలంగాణ ఉద్యమంలో హైకోర్టు జడ్జిలనే నేరుగా కోర్టులలోనే దూషించిన ఘట్టాలు జరిగినప్పుడు , వారిపై దాడి చేసినంత పని చేసినప్పుడు హరగోపాల్ ఖండించారో ,లేదో గుర్తు లేదో కానీ, ఇప్పుడు ఆయనకు సడన్ గా న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం కలగడం మంచిదే అనుకోవాలా? మరో మేధావి తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రవారిని ఉద్యమకారులు కొందరు దూషిస్తున్న సమయంలో ఎన్నడైనా వారించారా? ఆంధ్రులపై కొన్ని చోట్ల దాడులు జరిగినప్పుడు ఖండించారా? ఇప్పుడు సడన్ గా ఏపీపై అంత ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చింది. దానికి కారణం టిడిపి అదినేత చంద్రబాబుతో ఏర్పడిన సన్నిహిత సంబంధాలేనేనా? గత ఎన్నికల సమయంలో టిడిపి,కాంగ్రెస్, సిపిఐలతో కలిసి పోటీచేసిన కోదండరామ్ పార్టీకి మెజార్టీ చోట్ల డిపాజిట్ లు దక్కకపోయి ఉండవచ్చు. అయినా ఆనాడు కోదండరామ్ పార్టీకి అవసరమైన వనరులు అన్నీ టీడీపీ నాయకత్వం సమకూర్చిందన్న కృతజ్ఞతతోనే వారు విజయవాడ వరకు వెళ్లి ,అమరావతికి మద్దతు ఇచ్చి వచ్చారా? ఒక టెంట్ కింద కూర్చుని, టీడీపీ మీడియాతో మాట్లాడి వెళ్లిపోయేవారు మహోద్యమం చేసినట్లుగా వీరంతా గుర్తించారన్నమాట. వీరంతా అమరావతి రాజధాని ఒకే చోట ఉండాలని కోరదలిస్తే ,దానికి నిలదీయాల్సింది కేంద్రాన్ని కదా? లక్ష కోట్లా.?ఇంకా ఎక్కువ కోట్లా అన్నదానితో నిమిత్తం లేకుండా కేంద్రం నిధులు ఇవ్వాలని వీరు ఎందుకు డిమాండ్ చేయలేదో తెలియదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారరాదట. అలాగైతే 1956లొ సమైక్య రాష్ట్రానికి నాటి హైదరాబాద్ అసెంబ్లీ కూడా మద్దతు ఇచ్చింది కదా? మరి ఆ నిర్ణయం మారే వరకు ఎందుకు తెలంగాణవాదులు ఆందోళనలు చేశారు. పలు ప్రభుత్వాలు తెలంగాణ ఇవ్వడం కుదరదని, హైదరాబాద్ చుట్టూరానే అనేక సంస్థలు ఏర్పాటు చేసినా, ఎందుకు ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారు? ఇప్పుడు కూడా ఏపీలో అయినా, మరెక్కడైనా ప్రభుత్వ అబిప్రాయాలను అంతా ఆమోదించనవసరం లేదు. నచ్చకపోతే నిరసనలకు దిగవచ్చు. తప్పు లేదు. కాకపోతే అవి హేతుబద్దమా?కాదా? ప్రజలంతా ఆమోదిస్తారా?లేదా అన్నది ఎన్నికలలో తేలుతుంది. అంతవరకు ఎందుకు ఆగడం లేదు? ఏది ఏమైనా అసలు ఆంధ్రకు ఈ దుస్థితి ఏర్పడడానికి కారణమైనవారితో సుద్దులు చెప్పించడం వారికే చెల్లిందని అనుకోవాలి. తెలంగాణ వాదులుగా పచ్చి ఆంద్ర వ్యతిరేకులుగా ముద్ర పడ్డ నేతలను విజయవాడ తీసుకు వచ్చి అమరావతి గురించి మాట్లాడించడమే ఆశ్చర్యంగా ఉంటుంది. నిర్వాహకుల చిత్తశుద్ది ఏమిటో తెలుస్తుంది. ఆంద్రా బాగుపడాలని కోరుకునేవారిని పిలవాలి కాని, ఆంద్ర అంటే గిట్టనివారిని తీసుకు రావడం ద్వారా వారు ఏమి చెప్పదలిచారు? రాజదాని రైతుల భూములు పోయాయట .మరి వారు తీసుకుంటున్న పరిహారం మాటేమిటి. వారు భూములు అమ్ముకోవడం ద్వారా కోట్లు సంపాదించిన మాటేమిటి. రైతులు ఎవరికైనా అన్యాయం జరిగితే దాని గురించి ఎవరైనా అడగవచ్చు.కాని ఆ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారుల లక్ష్యాల కోసం పనిచేయడం సరికాదు .నిజాయితీ ఉంటే రియల్ ఎస్టేట్ వారికి నష్టం కలుగుతుంటే ఆ విషయాన్ని ధైర్యంగా చప్పి ప్రభుత్వాన్ని పరిష్కారం కోరవచ్చు.కాని వారు అలా చేయడం లేదు. రైతుల పేరుతో డ్రామాలు నడుపుతున్నారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ గురించి అందరికి తెలిసినా, అసలు ఏమి జరగనట్లు నటిస్తున్నారు.వేల ఎకరాల భూములు ఎలా చేతులు మారాయో తెలియదా? ఇలాంటి వాటికి హరగోపాల్, కోదండరామ్, గోపాలగౌడ వంటివారు మద్దతు ఇవ్వడమా?, ఇది ఒక విషాదం. ఇదే సమయంలో వీరు మరో మాట చెప్పారు. తీర్పు తర్వాత రాజధాని మారదన్న నమ్మకం రైతులలో వచ్చిందని, హైకోర్టు అన్ని కోణాలలో పరిశీలించి తీర్పు ఇచ్చిందని వీరు అభిప్రాయపడుతున్నారు. ఇది మారదన్న భావన ఉన్నప్పుడు ఇక ఉద్యమం అవసరం ఏమి ఉంటుంది? తెలంగాణ నేతలను పిలుచుకు రావల్సిన అవసరం ఏమి ఉంటుంది?అయినా ఏపీ ప్రభుత్వం అమరావతి గ్రామాలలో అభివృద్ది చేయబోమని ఎక్కడా చెప్పలేదు. కాకపోతే మొత్తం ఏపీ ప్రజల డబ్బు అంతా తెచ్చి కేవలం కొన్ని గ్రామాలలో వ్యయం చేయలేమని చెబుతోంది.అ ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోకుండా పెట్టుబడిదారుల కోసమే తెలంగాణ నేతలు వచ్చి ప్రసంగాలు చేస్తే ఆంధ్ర ప్రజలు సమ్మతిస్తారా? -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన టీజేఎస్ నాయకులు
-
తెలంగాణ జనసమితిని ఏ పార్టీలోనూ విలీనం చేయట్లేదు: ప్రొ.కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనసమితిని ఏ పార్టీలోనూ విలీనం చేయట్లేదని ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూముల సమస్యలను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. -
Etela: మరి ఆయనను సస్పెండ్ చేయొచ్చు కదా?
-
Etela: మరి ఆయనను సస్పెండ్ చేయొచ్చు కదా?: కొండా
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్‌పై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈటలతో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు సరికాదన్నారు. రాజకీయ విభేదాలు ఉంటే చర్చించుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య పద్ధతులను కేసీఆర్ పాటించడం లేదని మండిపడ్డారు. అదే విధంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈటలను ఇంకా ఎందుకు పార్టీలో ఉంచుకున్నారని ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చినప్పుడు సస్పెండ్ చేయొచ్చు కదా అని నిలదీశారు. చదవండి: కమలం గూటి వైపు సంకేతాలు -
పట్టభద్రుల పోటీ... రసవత్తరం!
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల పోటీ రసవత్తరంగా మారనుంది. హేమాహేమీలు అమీతుమీకి సిద్ధమవుతున్నారు. ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’తో పాటు ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’లో గురువారం నుంచి ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో ఈ ఆరు ఉమ్మడి జిల్లాల్లో పొలిటికల్ జోష్ మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఓ వైపు ఓటరు నమోదుపై దృష్టి పెడుతూనే, అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు చేస్తున్నాయి. మండలి ‘నల్లగొండ–ఖమ్మం–వరంగల్’స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మళ్లీ టీఆర్ఎస్ పక్షాన అవకాశం దక్కుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కు చెందిన జర్నలిస్టు పీవీ శ్రీనివాస్ వంటి వారు టికెట్‌ను ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్‌నగర్’స్థానం నుంచి హైదరాబాద్ మేయర్ రామ్మోహన్, గత ఎన్నికల్లో కొద్దిఓట్ల తేడాతో ఓడిన పీఎల్ శ్రీనివాస్, వికారాబాద్‌కు చెందిన విద్యార్థి నేత శుభప్రద్ పటేల్ కూడా టీఆర్ఎస్ టికెటు ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌లోనూ పోటాపోటీ..! ‘రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్ నగర్’ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. ఏఐసీసీ కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యేలు చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎస్.సంపత్‌కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్జీ వినోద్‌రెడ్డి కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలల సంఘం నేత, విద్యావేత్త గౌరీసతీశ్ కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను కలిశారు. విద్యాసంస్థల అధిపతి ఏవీఎన్ రెడ్డి, , టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ పోశాల వంటి వారు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’స్థానం నుంచి టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఓయూ విద్యార్థి నేత కోటూరి మానవతారాయ్ పోటీ చేసే యోచనలో ఉన్నారు. మరోమారు బరిలోకి రాంచందర్‌రావు? ‘రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్‌నగర్’పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రస్తుతం బీజేపీ నేత ఎన్.రాంచందర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్.రాంచందర్‌రావుతోపాటు బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎస్.మల్లారెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’స్థానం నుంచి బీజేపీ నేతలు రావు పద్మ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, పేరాల శేఖర్‌రావు తదతరులు బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. వరంగల్ బరిలో కోదండరాం ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం బరిలోకి దిగనున్నారు. ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేసే ఉద్దేశంతో జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. ‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్’ నుంచి గతంలో రెండు పర్యాయాలు గెలుపొందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ మరోమారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరితోపాటు యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమరెడ్డి, సూదగాని ట్రస్టు చైర్మన్ సూదగాని హరిశంకర్ గౌడ్ కూడా పట్టభద్రుల కోటా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. -
సీఎం స్పందించకపోతే ఉమ్మడి కార్యాచరణ ఉధృతం
సాక్షి, హైదరాబాద్: కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న ప్రజల్ని ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు అఖిలపక్ష నేతలు ప్రకటించారు. కరోనా కట్టడి, చికిత్సతోపాటు విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని, కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని వారు కోరారు. అలాగే, నవంబర్ దాకా పేదలకు నెలకు రూ.7,500 చొప్పున ఆర్థిక సాయం, పట్టణ పేదలకు ఉపాధి హామీ పథకం అమలు, తొలగించిన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, సీఎం సహాయనిధికి చేరిన నిధుల లెక్కలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై సీఎం కేసీఆర్ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో హామీలివ్వకపోతే ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం ప్రొ.కోదండరాం, శ్రీశైల్‌రెడ్డి (టీజేఎస్), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), జూలకంటి రంగారెడ్డి, డీజీ నరసింహారావు (సీపీఎం), ఎల్.రమణ (టీటీడీపీ), కె.గోవర్ధన్, వెంకట్రాములు (న్యూ డెమోక్రసీ), సీహెచ్.మురారి (ఎస్‌యూసీఐ–సీ) మీడియాతో మాట్లాడారు. కరోనాతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివిధ రూపాల్లో ఉమ్మడి కార్యాచరణ చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోగా, ఆగస్ట్ 7న అఖిలపక్ష నేతలను అరెస్ట్ చేసి దుర్మార్గంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో సీఎం ఇచ్చే హామీలను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. -
ప్రజలు అల్లాడుతుంటే పట్టదా?
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: అటు దేశం లో, ఇటు రాష్ట్రంలో కరోనా కోరల్లో చిక్కి ప్రజలు అల్లాడుతుంటే పాలకులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అఖిల పక్ష నేతలు మండిపడ్డారు. కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా చేతులెత్తేశాయని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్.కృష్ణయ్య, తెలంగా ణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. సోమవారం సుందరయ్య వి జ్ఞాన కేంద్రంలో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబు ల్ సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణలో తీవ్రస్థాయిలో కోవిడ్ మరణాలు పెరి గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహా ర భద్రత, వైద్య సేవలు ప్రజలకు అందడం లేదన్నారు. 30న కలెక్టరేట్ల వద్ద నిరసన ఇక ఈనెల 30న అన్ని జిల్లా కేంద్రాల్లో వామపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల వేదిక (టీఎల్పీఎంఎఫ్) ద్వారా జిల్లాల కలెక్టరేట్లకు నల్ల జెండాలతో నిరసనగా వెళ్లి వినతి పత్రం అందజేస్తామని అఖిల పక్ష నేతలు తెలిపారు. కోవిడ్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఆగస్టు 2న వర్చురల్ రచ్చబండ బహిరంగ సభ నిర్వహిస్తామన్నా రు. జూలై 28 నుంచి ఆగస్టు 4 వరకు (ఆగస్టు 2 మినహా) ప్రతిరోజూ ఒక అంశంపై వెబినార్/సెమినార్లు ఉంటాయన్నారు. రోజూ సాయంత్రం 5 నుంచి 7 గంటల దాకా ఈ కార్యక్రమాలుంటాయని వెల్లడించారు. జూలై 28న కోవిడ్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యం–న్యాయపోరాటం, 29న అసంఘటిత రంగం, వలస కూలీలపై కోవిడ్ ప్రభావం, 30న కొరవడుతున్న ప్రజారోగ్యం, 31న విద్యారంగంపై కోవిడ్ ప్రభావం, ఆగస్టు 1న కోవిడ్ బాధితులు–సహాయక చర్య లు, 3న ఉద్ధీపన పథకాల డొల్లతనం, 4న కోవిడ్ ప్రజాందోళనపై ప్రభుత్వ నిర్బంధం, ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు, నల్ల జెండాలతో, నల్ల బెలూన్లు ఎగరేసి మహానిరసన తెలుపుతామని వివరించారు. -
రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న రూ.1,500 సరిపోవట్లేదని, వారికి రూ.5 వేలు ఇవ్వాలని కోరారు. ఉత్తమ్ నేతృ త్వంలోని అఖిలపక్ష బృందం గురువారం స చివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలసి రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించింది. కోదండరాం (టీజేఎస్), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), ఎల్.రమణ (టీడీపీ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ)లు సీఎస్‌ను కలసి పలు సూచనలతో కూడిన వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో మా ట్లాడారు. 40 రోజుల లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, అనివార్యమైన ఇబ్బందులను స్ఫూర్తితో ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. అఖిలపక్ష నేతలు ఎవరేమన్నారంటే రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పని చేయట్లేదు. గాంధీ, ఉస్మానియాలో మిగతా ఆరోగ్య సేవలు పునరుద్ధరించాలి.’ –చెరుకు సుధాకర్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసిన వారికి కూడా రేషన్ బియ్యం ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేలు ఇవ్వాలి. సంగారెడ్డిలో నిరసన తెలిపిన కార్మికులకు జీతం ఇప్పించాలి. చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ‘రేషన్‌లో బియ్యంతో పాటు, పప్పు, నూనె ఇవ్వాలి. వాహనాల పన్నును 3 నెలల పాటు రద్దు చేయాలి. కోదండరామ్, టీజేఎస్ ‘రైతు రుణమాఫీ చేయాలి. సూరత్, భివండి, ముంబైలలో ఉన్న వలస కార్మికులను సొంత రాష్ట్రానికి తీసుకురావాలి. – ఎల్.రమణ, టీటీడీపీ అధ్యక్షుడు -
డబ్బు ప్రభావాన్ని తట్టుకోలేకపోయారు: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, ఇతర పార్టీల అభ్యర్థుల డబ్బు ప్రభావాన్ని తమ అభ్యర్థులు తట్టుకోలేకపోయారని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండ రాం పేర్కొన్నారు. తమ పార్టీ అభ్యర్థులు బాగా పనిచేశారని, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగారన్నారు.ఎన్నికల్లో వివిధ కారణాలతో వారు గెలుపొందలేకపోయారని చెప్పారు. తమ అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టలేదన్నారు. ఎన్నికల్లో కష్టపడ్డ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. -
ఉమ్మడిగా ఉద్యమిస్తాం
లక్డీకాపూల్: తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటి పార్టీలు ఐక్యతా రాగాన్ని ఆలపించాయి. రాష్ట్ర ప్రజల సమస్యలపై ఉమ్మడి పోరాటాన్ని కొనసాగించేందుకు ఉమ్మడిగా పోరాడతామని ఆయా పార్టీ అధినేతలు ప్రొఫెసర్ కోదండరాం, డాక్టర్ చెరుకు సుధాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఉమ్మడి కార్యాచరణను ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన, ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి లక్ష్యాల కోసం తాము కలిసి పోరాడనున్నట్లు వెల్లడించారు. ఉద్యమకారులు, అట్టడుగు వర్గాలకు పాలన, నిర్ణయాధికారం ద్వారా అసమానతలు లేని తెలంగాణ దిశగా ఉద్యమించనున్నట్లు పేర్కొ న్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం కలుషితమైపోయిందని, ఎన్నికల్లో డబ్బే ప్రధానాంశంగా మారిందని కోదండరాం అన్నారు. ఈ తరుణంలో ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ ఇంటి పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. తమకు భేషజాలు లేవని, ఎవరితోనైనా కలిసి పనిచేస్తామ న్నారు. ప్రజాపక్షంగా సమస్యల పరిష్కారా నికి నిర్మాణాత్మక పాత్రను పోషించనున్నట్లు తెలిపారు. ఇందుకు టీజేఎస్, ఇంటి పార్టీ కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. -
లేఅవుట్ల అనుమతులకు సింగిల్ విండో వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: అవినీతి నియంత్రణలో భాగంగా పారదర్శక పాలనకు ఇళ్లు, లేఅవుట్ల అనుమతుల కోసం పటిష్ట సింగిల్ విండో వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలంగాణ జనసమితి (టీజేఎస్) తన మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీనిచ్చింది. ఈ ఎన్నికల ప్రణాళికలో అవినీతిరహిత ఆదర్శ మున్సిపాలిటీల కోసం పౌరసంఘాలతో నిఘా వ్యవస్థ (అంబుడ్స్‌మన్) ఏర్పాటు, రాజకీయ, అధికార యంత్రాంగం పనితీరుపై అన్ని కార్యాలయాల్లో పనితీరు పట్టిక, వారానికోసారి ‘ఇంటింటికీ కౌన్సిలర్’కార్యక్రమం, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణల తొలగింపు, ఉల్లం ఘనులపై చర్యలు, టీజేఎస్ కౌన్సిలర్లు ఆక్రమణలు, అవినీతికి పాల్పడిన పక్షంలో పార్టీ నుంచి సస్పెన్షన్ తదితర అంశాలను పొందుపరిచింది. శనివారం పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కోదండరాం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు గెలిస్తే సంపాదనే లక్ష్యంగా ఉంటారని, రాష్ట్ర ఖజానా ఖాళీ అయినందున ప్రభుత్వం నిధులివ్వదని, మున్సిపాలిటీలను పనిచేయనివ్వరని, అక్రమార్జనకు మున్సిపాలిటీలను వాడుకుంటారని ఆరోపించారు. మేనిఫెస్టోలోని ఇతర ముఖ్యాంశాలు... కాలుష్యరహిత పట్టణాల కోసం పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం రక్షిత మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు మురుగునీటి నిర్వహణ అమలు ద్వారా ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారణ పట్టణాల్లో సులభ్ తరహాలో మరుగుదొడ్లు, మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు మున్సిపల్ స్కూళ్ల సమర్థ నిర్వహణ నిధులు, విధులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో పౌర సంఘాలకు పాత్ర నాణ్యమైన సత్వరమైన వైద్య సదుపాయాలతో బస్తీ క్లినిక్‌ల ఏర్పాటు పట్టణ పేదలకు గృహ వసతి, మురికి వాడలకు కనీస వసతులు -
రాష్ట్రంలో మావోలు ఉన్నారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్ట్‌లే లేరని శాసనసభలో ప్రభుత్వం చెప్పిందని, ఈ మేరకు కేంద్రానికి నివేదిక కూడా పంపిందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. ఇప్పుడేమో ఆర్టీసీ సమ్మెలో మావోయిస్ట్‌లు ఉన్నారని పోలీసు అధికారులు చెబుతున్నారని ఇందులో ఏది నిజం.. ఏది అబద్ధం.. అని ప్రశ్నించారు. పోలీసులు ప్రతి అంశాన్ని శాంతి భద్రతల కోణంలోనే చూడటం సబబుకాదని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే నగరాభివృద్ధిపై దృష్టి పెట్టాల్సి ఉండగా అది జరగడం లేదని ఆరోపించారు. నగర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని కమిషనర్ అంజనీ కుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల కోదండరాం అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు హైదరాబాద్‌లో స్వేచ్ఛగా నిరసన తెలిపే అవకాశాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. సోమవారం పార్టీ నేతలు పీఎల్ విశ్వేశ్వరరావు, వెంకట్‌రెడ్డి, శ్రీశైల్‌రెడ్డి తదితరులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘చలో ట్యాంక్‌బండ్’ సందర్భంగా ప్రభుత్వమే ఎక్కడికక్కడ కంచెలు వేసి ప్రజలకు ఇబ్బందులు, అసౌకర్యం కలిగేలా చేసిం దని విమర్శించారు. ఆర్టీసీని నడిపించడం ప్రభుత్వ బా« ధ్యత కాగా, ఇంకెన్ని రోజులు ఆర్టీసీకి సహాయం చేయాలనడం ప్రభుత్వానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. -
మిలియన్ మార్చ్‌కు మద్దతు ఇవ్వండి: అశ్వత్థామరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9న తలపెట్టిన మిలియన్ మార్చ్‌కు మద్దతు కోరడంతోపాటు సమ్మె భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు బుధవారం బీజేపీ, టీజేఎస్ నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగతో జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే మిలియన్ మార్చ్‌కు మద్దతు ఇవ్వాలని బీజేపీ, టీజేఎస్ నేతలను కోరామన్నారు. ఉద్యోగులను కూడా కలుస్తున్నామని, పెన్‌డౌన్ చేయాలని కోరుతామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత ఒత్తిడి తెచ్చినా ఒక్క శాతం మంది కూడా జాయిన్ కాలేదన్నారు. జాయిన్ అయిన వారు 300 మంది కూడా లేరని, చేరిన వారిలో డ్రైవర్లు, కండక్టర్లు 20 మంది కూడా లేరన్నారు. కార్మికులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకుంటే కేంద్రం ఆమోదం అవసరమన్నారు. తమ డిమాండ్లలో విలీనం ఒక్కటే కాదని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలనే తదితర 26 రకాల డి మాండ్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా డిమాండ్లపై చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని రకాలుగా బెదిరించినా కార్మికులు వెనక్కి తగ్గలేదన్నారు. కోకన్వీనర్లు వీఎస్‌రావు, సుధ మాట్లాడుతూ.. సీఎం గడువు పెట్టి డకౌట్ అయ్యారన్నారు. భయాందోళనకు గురికావద్దు మేడ్చల్ రూరల్: కార్మికులెవ్వరూ భయాందోళనకు గురికావద్దని, గట్టిగా నిలబడాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి సూ చించారు. బుధవారం మేడ్చల్‌లో ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయ డం ఎవరి తరం కాదన్నారు. సీఎం కేసీఆర్ వాస్తవా లు గ్రహించి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోదండరాం కోరారు. కాగా, మాజీ మంత్రి గీతా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్ తదితరులు మేడ్చల్ డిపోలో ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. -
‘బొటనవేలు దెబ్బకు ప్రతికారం తీర్చుకుంటాం’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపే క్రమంలో తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, అరెస్టు సందర్భంగా దాడిని ఖండిస్తున్నామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ జేఏసీ సమావేశం నిర్వహించారు. అఖిల పక్ష నాయకులుంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దుర్మార్గానికి నిన్నటి ప్రెస్‌మీట్ పరాకాష్ట అని దుయ్యబట్టారు. ప్రశ్నలు అడిగే వారిపై ముఖ్యమంత్రి దబాయించారు కానీ సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. నిన్నటి సమావేశంలో అన్ని అసత్యాలు, అర్ధ సత్యాలే మాట్లాడారని, వీధి నాయకుడి తరహాలో కేసీఆర్ మాట్లాడారని ఆరోపించారు. ఆర్టీసీకి చట్ట ప్రకారం ఇచ్చే దాని కంటే చాలా తక్కువ ఇచ్చారని, సంస్థ నష్టాలకు కారణం కార్మికులే కారణం అనడం దురదృష్టకరమన్నారు. పేదవారి రవాణాకు ఆర్టీసీ తప్ప వేరే మార్గం లేదని, ప్రజల పట్ల ప్రభుత్వ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రజా సంక్షేమం వదిలి కేసీఆర్ ప్రైవేటు సంస్థ యజమానిలా మాట్లాడారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలతో అందరినీ ఏకం చేసేలా మాట్లాడారని, అన్ని పక్షాలు ఏకతాటిపైకి రావాలని కోదండరాం పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు అండగా ఉన్నది పోటు రంగారావే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బోటన వేలు గురుదక్షిణ తీసుకున్నట్టు..కుట్రపూరితంగా దొర కేసీఆర్... దక్షిణగా రంగారావు వేలు తీసుకున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీపీఐ ఎంఎల్(న్యూ డెమోక్రసీ) కేసీఆర్‌తో కలిసి పోరాటం చేసిన పార్టీ అని, ఉద్యమ సమయంలో ఖమ్మం ఆస్పత్రిలో కేసీఆర్‌కు అండగా ఉన్నది పోటు రంగారావేనని గుర్తు చేశారు. బొటనవేలు దెబ్బకు ప్రతీకారం తీర్చుకుంటామని, సమ్మెను ముందుకు తీసుకెళ్తామన్న కార్మికులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్దం చేస్తామన్నారు. అలాగే ‘ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా, కోర్టు మాటలు పట్టించుకునే అవసరం లేనట్టు మాట్లాడారు. యూనియన్లను సహించం..దరఖాస్తులు చేసుకుంటే ఉద్యోగులను చేర్చుకోవడంపై ఆలోచిస్తా అని అంటున్నారు. మోటారు వాహన చట్టం అమలు చేస్తామనడం విజ్ఞత గల ముఖ్యమంత్రికి తగదు. హుజూర్నగర్ ఉప ఎన్నిక విజయంతోనే ఇలా గర్వంతో మాట్లాడుతున్నారు. ఆర్టీసీనే కాదు టీఎన్జీవో, టీజీవోలు భ్రమలో ఉన్నారు. యూనియన్లు నన్నేమీ చేయడం లేదన్నట్టుగా మాట్లాడారు’ అని కేసీఆర్ మాట్లాడిన తీరుపై తమ్మినేని మండిపడ్డారు. పోలీసులు చర్యను చరిత్ర క్షమించదు పోటు రంగారావు వేలు పోయేలా చేసిన కేసీఆర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధమై ఆర్టీసీ పోరాటంలోకి దిగామని, కార్మికుల పట్ల పోలీసుల చర్యలను చరిత్ర క్షమించబోదని పేర్కొన్నారు. ఉద్యమకారుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని, రేపటి నుంచి నిరవదిక దిక్ష చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉడుత బెదిరింపులకు కార్మికులు భయపడరు తెలంగాణ వచ్చాక హిట్లర్, నిజాం వాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని సీపీఐ ఎంఎల్ సహాయ కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. హుజూర్నగర్ గెలుపు ధీమాతో మాట్లాడిన మాటలు రాజ్యాంగ వ్యతిరేకమని కొట్టిపారేశారు. కార్మికుల ఉధ్యమాన్ని చెడగొట్టేందుకే ఈ వ్యాఖ్యలు చేసారని, ధన.. అధికార బలంతో హుజూర్నగర్ ఎన్నికలు జరిగాయని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ వచ్చే ప్రమాదం ఉందని, ప్రజలను బానిసలుగా మర్చే ప్రమాదం ఉందని ఆరోపించారు. ప్రశ్నించే సమాజాన్ని కేసీఆర్ భరించలేక పోతున్నారని, ఆదే ఆయన పరిపాలించేందుకు అర్హుడు కాదన్నది తేలిందన్నారు. ఉడుత బెదిరింపులకు కార్మికులు భయపడరని ఎద్దేవా చేశారు. పశువులను తీసుకెళ్లే వ్యాన్‌లో ఉధ్యమకారులను తరలిస్తున్నారని మండిపడ్డారు. నరహంతక విధానాలను ఎదిరించి పోరాటం కొనసాగిస్తామని, యూనియన్ లకు వ్యతిరేకంగా మాడుతున్న కేసీఆర్ తీరును ప్రతిగటించాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆర్టీసీ సమ్మె : అలా చెప్పడం సిగ్గుచేటు
సాక్షి, నిజామాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆర్టీసీ కార్మికుల డబ్బులను వాడుకొన్న ప్రభుత్వం, ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వం కన్ను పడిందని, అందుకే ఆర్టీసీని ప్రైవేటు పరం చెయ్యాలని చూస్తోందని విమర్శించారు. జిల్లాలో బుధవారం జరిగిన ఆర్టీసీ కార్మికుల సభలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆర్టీసీ గుండె కాయ వంటిదని కోదండరాం అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లను పెట్టి బస్సులను నడపడం బాధాకరమని, ప్రగతి భవన్లో కూర్చున్న సీఎం కేసీఆర్‌కు కార్మికుల బాధలు పట్టవని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రజల మద్దతు ఉందని, న్యాయం జరిగే వరకు కార్మికులకు అండగా ఉంటామని ఆయన హామి ఇచ్చారు. -
నియంతలా వ్యవహరిస్తే పతనమే..!
సాక్షి, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రవర్తన నిజాంను తలపిస్తోందని మాజీ మంత్రి మోత్కుపల్లి అన్నారు. సుందరయ్య విజ్ఞాన భవన్లో ఆర్టీసీ కార్మికుల ఐకాస, విపక్షనేతల సమావేశం జరిగింది. కార్యక్రమం అనంతరం మాజీ మంత్రి మోత్కుపల్లి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఇప్పటికే మోసం చేశాడని చెప్పారు. ఆర్టీసీ కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అనడానికి కేసీఆర్‌కు అర్హత లేదన్నారు. ఆర్టీసీ కార్మికులపట్ల కేసీఆర్ వ్యవహరిస్తున తీరు దుర్మార్గమరైనదన్నారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మి సొంత ఆస్తులు పెంచుకొనే పనిలో కేసీఆర్ పడ్డాడని ఆరోపించారు. కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయనను ఎదుర్కొనేందుకు రాజకీయపార్టీలనీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెపై స్పందించినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. టీజేఎస్ చీఫ్ కోదండరామ్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును సీఎం కేసీఆర్ గౌరవించి ఆర్టీసీ కార్మికులను వెంటనే చర్చలకు పిలవాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా విపక్షాలు చేపట్టే నిరసన కార్యక్రమాల్లో అందరూ క్రియాశీలకంగా పాల్గొని, ఆర్టీసీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రేపటి నుంచి సమ్మెను మరింత ఉదృతం చేస్తామని తెలిపారు. బీజేపీ నేత జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు, జేఏసీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతుంటుందని తెలిపారు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ.. 65 నెలల కేసీఆర్ పాలనలో లక్షల కోట్లు అప్పులు తెచ్చుకున్నా.. ఆర్టీసీ అప్పులు మాత్రం చెల్లించలేక పోయారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని రమణ ఆరోపించారు. 65 నెలల కేసీఆర్ పాలనలో అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ అధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌నేత వీహెచ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే చివరి క్షణం వరకు కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
సమైక్యాంధ్రలోనే మొదలు
హన్మకొండ: ‘సమైక్యాంధ్రప్రదేశ్‌లోనే ఆర్టీసీ విభజన ప్రక్రియ మొదలైంది. జీఓలు జారీ చేసే సమయానికి రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ నిలిచింది’ అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం చెప్పారు. హన్మకొండలో ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ కమిటీ ఆధ్వర్యం లో ఆదివారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ నాటి ఆంధ్రప్రదేశ్‌లోనే మొదలైందని, ఆ సమయంలో అప్పటి ఉద్యమ నేత గా ఉన్న కేసీఆర్‌తో పాటు నేతలంతా చెప్పినట్లుగానే స్వరాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారన్నారు. ఈ డిమాండ్ కొత్తగా వచ్చిందేమి కాదన్నారు. ఎట్లాగూ ఓట్లు వేసి గెలిపించారు.. ఇక తాను చెప్పినట్లే వినాలన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర సంపదంతా తనకు, మెగా కృష్ణారెడ్డికి అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తూ తన సొంత ఆస్తిగా పరిగణిస్తున్నారని కోదండరాం ధ్వజమెత్తారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే సీతక్క, సీపీఐ నేత టి.వెంకట్రాములు, సీపీఎం నేత జి.ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మెకు పార్టీల మద్దతు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ జనసమితితో సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ జేఏసీ నేతలు ఆదివారం తెలంగాణ జనసమితి కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాంతో భేటీ అయ్యారు. ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితులు, కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు తాము చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించాలని కోరారు. కార్మికులకు తాము అండగా ఉంటామని, సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా కోదండరాం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి ఆర్టీసీ కార్మికులు ఎంతగానో తోడ్పడ్డారని, వారు సమ్మె చేయకపోతే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఆర్టీసీని బలహీనపరుస్తోందని ఆరోపించారు. కార్మికులకోసం సంఘీభావ ఉద్యమాన్ని చేపట్టడంలో కీలక పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి మాట్లాడుతూ తాము చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించాలని అన్ని పార్టీల నేతలను కలుస్తున్నట్లు వివరించారు. అనంతరం సీపీఎం, సీపీఐ నేతలతోనూ ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమై మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. కార్మికుల డిమాండ్ల సాధనకు సహకరిస్తామని స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా, ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన హక్కులను గౌరవించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని, కార్మికులపై కక్షపూరిత వైఖరిని విడనాడాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరింది. -
అమరుల స్మృతివనమేది?: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యే క తెలంగాణ రాష్టం ఏర్పడి ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు అమర వీరులకు స్మృతివనాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించలేకపోయిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. అమరుల స్మృతివనాన్ని నిర్మించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అన్ని సంఘాలను కలుపుకొని పోరాడతామని అన్నారు. శనివారం అసెంబ్లీ సమీపంలోని తెలంగాణ అమరుల స్తూపం వద్ద ఉద్యమంలో అమరులైన వారికి టీజేఎస్ నేతలతో కలిసి కోదండరాం నివాళులర్పించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్లను దాఖలు చేసేందుకు వెళుతున్న సర్పంచ్‌లను ప్రభుత్వం అరెస్ట్ చేయడం సరికాదని, ఈ విషయంలో సీఈవో రజత్‌కుమార్ జోక్యం చేసుకోవాలని కోరారు. -
పోరాటాలకు సిద్ధం కావాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తితో రాజ్యాంగ, ప్రజాస్వా మ్య పరిరక్షణకు వామపక్ష, ప్రజాస్వామ్యశక్తులు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. సాయుధ పోరాటాలు, రాష్ట్ర చరిత్ర వక్రీకరణకు మతోన్మాదశక్తులు చేస్తున్న యత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరముందన్నారు. బుధవారం బంజారాహిల్స్‌లోని రావి నారాయణరెడ్డి హాల్లో తెలంగాణ అమరవీరుల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బూర్గుల నర్సింగరావు అధ్యక్షతన సాయుధపోరాట వార్షికో త్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా గార్లపాటి రఘుపతిరెడ్డి రచించిన ‘ఉరికంబం ఎక్కుతూ తిరిగొచి్చన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ ఆర్థికవేత్త చెన్నమనేని హనుమంతరావు మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్ ఉద్యమాలు చేపట్టాలన్నారు. నాటి ఉద్యమస్ఫూర్తితో పెరుగుతున్న ధరలు, ఇతర సమస్యలపై నేడు ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నిజాం నవాబు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు లు సాయుధ పోరాటం నిర్వహించిన ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైందే తప్ప సర్దార్‌పటేల్ వల్ల కాదని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి చెప్పారు. సాయుధపోరులో నాలుగున్నర వేల మంది అమరులైన చరిత్ర నేటి తరానికి తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాటి నుంచి సామాజిక, ఆర్థిక రంగాల్లో సమానత్వం కోసం తెలంగాణ సమాజం పోరాడుతూనే ఉందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఈ కార్యక్రమంలో జైని మల్లయ్యగుప్తా, కందిమళ్ల ప్రతాపరెడ్డి, పువ్వాడ నాగేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాసరెడ్డి, పల్లా వెంకటరెడ్డి్డ తదితరులు పాల్గొన్నారు. -
'మా నీళ్లు మాకే' : కోదండరాం
సాక్షి, మంచిర్యాల: మా నీళ్లు మాకే అనే నినాదంతో జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్టు భవన్లో జలసాదన సమితి నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హాజరై మాట్లాడారు. తూర్పు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న ప్రాణహిత నదిపై బ్యారెజీ నిర్మాణం చేయకుండా కాళేశ్వరం వద్ద నిర్మాణం చేసి మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. కుమురం భీం జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసి మంచిర్యాల, కుమురం భీం జిల్లాలకు తాగు, సాగు నీరందించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ‘మా నీళ్లు మాకే’ అనే నినాదంతో జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్టు భవన్లో జలసాధన సమితి నాయకులు, అన్ని రాజకీయ పార్టల నాయకులు, యువలకుతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ప్రజా సంఘాల నాయకులతో కోదండరాం నాయకులు మాట్లాడుతూ.. తూర్పు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న ప్రాణహితనదిపై బ్యారెజీ నిర్మాణం చేయకుండా కాళేశ్వరం వద్ద బ్యారెజీ నిర్మాణం చేసి మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రెండు జిల్లాలకు నీరు రాకుండా పోయిందని వారు వాపోయారు. జిల్లాలకు సాగు, తాగునీరు అందించడానికి ప్రాణహిత వద్ద ప్రాజెక్టు నిర్మాణం కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కుమురం భీం, మంచిర్యాల జిల్లాలోని ప్రజలకు సాగునీరు లేక కేవలం వర్షాధార పంటలు సాగుచేసుకుంటున్నారని, ప్రాజెక్టు నిర్మాణం చేపడితే వారి పంటలకు నీరందుతుందన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే ప్రత్యేక తెలంగాణ కావాలని పోరాటం చేశామని కానీ ఇప్పుడు రెండు జిల్లాలకు నీళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వంలో పోరాటాలు చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని కేవలం హైదరాబాద్, సిద్దిపేట జిల్లాలకు నీటిని తరలించడానికే నిర్మించారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తుమ్మిడి హెట్టి వద్ద 25 వేల కోట్లతో 70 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులు ప్రారంభించారని, మరో 30 కిలోమీటర్ల పనులు పనులు చేస్తే పూర్తయ్యే కాలువ పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని వివర్శించారు. కేవలం కమీషన్ల కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు కట్టిందని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చే సిందనే సాకుతో తెలంగాణకు వరప్రదాయినిగా ఉన్న ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించకుండా ఇక్కడి రైతులను మోసం చేసిందన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు వద్ద బ్యారెజీ నిర్మాణం చేసి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెకులో కలుపవచ్చన్నారు. తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా అన్ని రాజకీయ పార్టీలు కలిసి కట్టుగా ముందుకు రావాలని రెండు జిల్లాలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని తీర్మానించారు. కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘నల్లమల సందర్శనకు అనుమతించండి’
సాక్షి, హైదరాబాద్: యురేనియం మైనింగ్ ప్రతిపాదిత మండలాల్లో పర్యటనకు అనుమతించాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్).. డీజీపీ మహేందర్‌రెడ్డికి విన్నవించింది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డిలు మంగళవారం డీజీపీని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈనెల 3వ తేదీన మావోయిస్టు అమరుల వారోత్సవాల పేరిట, 14వ తేదీన అడవి జంతువుల నుంచి రక్షణ కల్పించలేమన్న సాకుతో తమను, తమపార్టీ సభ్యుల్ని అడ్డుకుని సెక్షన్ 151 సీఆర్పీసీ కింద అరెస్టు చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. యురేనియం మైనింగ్ నిక్షేపాలు గుర్తించిన అమ్రాబాద్, పడర మండలాల్లో పర్యటించి, ప్రజలను కలుసుకునేందుకు అనుమతించాలని కోరారు. -
కోదండరాం అరెస్టు నిరసిస్తూ హైవేపై నిరసన
సాక్షి, కల్వకుర్తి: పోరాటాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన కొనసాగనివ్వడం లేదని, ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి వెళ్తున్న వారిపై ఇంతటి నిర్బంధాలు ఎందుకని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై అధ్యయనం చేయడానికి వెళ్తున్న బృందం సభ్యులను వెల్దండలో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. కోదండరాంతోపాటు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడానికి పోలీసులు రావడంతో వారు వాహనాలను అక్కడే ఆపి నిరసన తెలిపారు. దీంతో హైదరాబాద్– శ్రీశైలం ప్రధాన రహదారిపై దాదాపు 2 గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. యురేనియం తవ్వకాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు నిరసనకారులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ గతంలో నల్లమలకు వెళ్లే వారిని మావోయిస్టుల పేరుతో అడ్డుకునేవారని, ఇప్పుడు అడవిలో పులులు, జీవరాసులకు ప్రమాదం ఉందని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి నిర్బంధాలకు సంబంధించి ఏమైనా లిఖిత పూర్వకంగా రాసివ్వగలరా అని పోలీసులను అడిగారు. పోలీసుల సేవలు ప్రజల రక్షణకు వినియోగించాలన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఎలాంటి నిరసన చేయనివ్వడం లేదన్నారు. అప్పట్లో మీరే వద్దన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న గువ్వల బాలరాజు, మాజీ ఎంపీ కవిత యురేనియం తవ్వకాలపై తవ్వకాలపై అనుమతులు రాగానే వద్దన్నారని పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ అన్నారు. అధికారంలో లేనప్పుడు వద్దన్న వారు.. అధికారంలోకి రాగానే తవ్వకాలకు అనుకూలంగా మారడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అనంతరం వెల్దండకు కల్వకుర్తి, అచ్చంపేట డీఎస్పీలు పుష్ప, నర్సింహులు, సీఐలు సురేందర్‌రెడ్డి, నాగరాజు, రామకృష్ణ, వివిధ పోలీస్స్టేషన్ల ఎస్ఐలు చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. నిరసనల అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. అరెస్టు అయిన వారిలో ఆయా పార్టీల నాయకులు రమేష్, మోహన్, విజయ్‌కుమార్‌రెడ్డి, పర్వత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, ద్రోణాచార్య, శ్యాంప్రసాద్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, ధర్మరాజు, శ్రీధర్, ఖాదర్ పాషా, కృష్ణారెడ్డి, గగన్రాం, రమణ్‌సింగ్, సదానందంగౌడ్ తదితరులున్నారు. -
అంబేడ్కర్ విగ్రహం కోసం ఉద్యమిస్తాం: కోదండరాం
పెద్దపల్లి: దేశ ప్రజల స్వేచ్ఛ, సమానత్వం గురించి ఆలోచించిన గొప్ప నాయకుడు డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ అని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. కోట్లాది మంది ఆరాధిస్తున్న అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి డంపింగ్ యార్డులో పడవేయడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి దానిని ఏర్పాటు చేయకపోగా ఉన్న విగ్రహాలకు రక్షణ కల్పించడంలో విఫలమైం దని ఆరోపించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కోసం దళిత మేధావులతో కలసి ఉద్యమిస్తామని తెలిపారు. విగ్రహాన్ని తరలించిన వ్యక్తుల రిమాండ్ హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి చెత్త లారీలో తరలించిన ఇద్దరు వ్యక్తులపై జవహర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 13న పంజగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. అనంతరం విగ్రహాన్ని ధ్వంసం చేసి చెత్త లారీలో జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిçస్తున్నారన్న సమాచారం అందుకుని దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చెత్త లారీలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్ డప్పు రాజ (35), ఇటాచీ డ్రైవర్ భీంగుప్త(29)ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. యూసఫ్‌గూడ డంపింగ్‌యార్డు సూపర్వైజర్లు బాలరాజు, శ్రీకాంత్‌లతో పాటు జీఎహెచ్ఎంసీ అధికారులపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
విలువల పెంపుకోసమే ఎన్నికల్లో పోటీ
దుగ్గొండి/నల్లబెల్లి: రాజకీయాల్లో విలువలు పెం చడానికి జనసమితి పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అరుణ్‌కుమార్‌ను పోటీలో ని లిపిందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కో దండరాం అన్నారు. మండలంలోని గిర్నిబావి, దుగ్గొండి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరూ మాట్లాడకూడదు.. ఎవరూ ఉండకూడదు..ప్రతిపక్షం పలకవద్దు.. అనే రీతిలో నేటి రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ఆదివాసీల ముద్దుబిడ్డ, ఉన్నత విద్యావంతుడు, విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసిన అరుణ్‌కుమార్ ట్రంకు పెట్టె గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి అంబటి శ్రీనివాస్, జిల్లా కోఆర్డినేటర్ షేక్ జావిద్, మండల నాయకులు నామోజు మురళి, వరికెల బాబురావు పాల్గొన్నారు. చట్టాలను అమలు చేయాలి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చట్టాలను పారదర్శకంగా అమలు చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నల్లబెల్లి మండల కేంద్రం లో సోమవారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
‘రజత్ కుమార్ రాజ్యాంగానికి అతీతులు కాదు’
సాక్షి, హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు కోదండరామ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ..'రాజ్యాంగం రావటం అంటే.. రాజకీయ విప్లవం రావటమే. రాజ్యాంగ సమానతలు వచ్చాయి కానీ, సామాజిక సమానతలు మాత్రం రాలేదు. పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి పనిచేయాలి. భవిష్యత్తు నిర్మాణానికి రాజ్యాంగం ఓ బ్లూ ప్రింట్. పాలకులు అధికారంలోకి వచ్చాము ఏదైనా చేయొచ్చు అనే భావన వదిలేయాలి. రాజ్యాంగంలోని చట్టాలకు లోబడి పాలన సాగించాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ రాజ్యాంగానికి అతీతులు కాదు. ఎవరైనా రాజ్యాంగంకి లోబడి పనిచేయాలి. ఎన్నికల కమిషన్ సలహాలు అవసరం లేదు. ఏం చేయాలో మాకు తెలుసు. కోర్టుకు వెళ్ళండి అని చెప్పాల్సిన అవసరం రజత్ కుమార్‌కి లేదు. అడిగే హక్కు మాకుంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత రజత్ కుమార్ మీద ఉంది. భారత రత్నలో తెలంగాణకు అన్యాయం జరిగింది. బాధ కలిగింది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఆధికార ప్రతినిధి యోగెశ్వర రెడ్డి వెదిరె, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్రుద్దిన్లతో పాటూ కార్యకర్తలు పాల్గొన్నారు. -
చెప్పినా వినిపించుకోలేదు.. అందుకే ఓటమి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఓడిపోవడంపై పొలిటికల్ విశ్లేషణ జరగాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సీట్ల సర్దుబాటు, ప్రచారం ఆలస్యం కావడం, ప్రచారవ్యూహం లేకపోవడం వల్లే కూటమి ఓడిపోయిందని పేర్కొన్నారు. తమ నాలుగేళ్ల శ్రమ వృథాగా పోయిం దన్నారు. ఎన్నికల్లో ఇంటింటికీ ప్రచారం చేయలేదని, మంచి ఎజెండా ఉన్నా ప్రజలకు చెప్పుకోలేక పోయామన్నారు. తాను కేసీఆర్‌తో పదేళ్లపాటు కలసి పని చేశానని, కేసీఆర్ ప్రచారశైలి గురించి ఎన్నిసార్లు కూటమి పార్టీ నేతలకు హెచ్చరించినా ఉత్తమ్, ఎల్.రమణ వినిపించుకోలేదన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం ఉండాలని తాను చెప్పానని, కానీ 15 రోజుల ప్రచా రం చాలని ఉత్తమ్, మూడు వారాలు సరిపోతుందని రమణ పేర్కొన్నారని వెల్లడించారు. టీజేఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. కూటమిలోని కొంతమంది నేతల అతి ఆత్మవిశ్వాసం కారణంగా ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఓటమికి ఈవీఎంల ను బూచిగా చూపడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఈవీఎంలపై తప్పు నెట్టడంలో అర్థం లేదన్నారు. అసలు కారణాలను సమీక్షించకుండా ఉత్తుత్తి కారణాలను విశ్లేషిం చడం వల్ల లాభం లేదన్నారు. కూటమి ఓడిపోవడానికి కారణాలను జన సమితి విశ్లేషణ చేస్తుందన్నారు. సర్దుబాటు ఆలస్యంతోనే నష్టం రాజకీయపరమైన వైఫల్యాలను చర్చించకుండా సమీక్షలు జరపడం సరికాదన్నారు. సీట్ల సర్దుబాటులో ఆలస్యం కావడం నష్టం చేకూర్చిందని కోదండరాం అన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనను, కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లో సరిగా ఎండగట్టలేకపోయామన్నారు. కేసీఆర్ రాజకీయ చతురతను అంచనా వేసి ఎదుర్కోవడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు. మరోవైపు కేసీఆర్ తనపై ఉన్న రాజకీయ వ్యతిరేకతను చల్లబరుచుకోగలిగారన్నారు. కేసీఆర్ చంద్రబాబు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో, ఏం గిఫ్ట్ ఇస్తారో చూడాలన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అర్థం లేని పని అని, అది సక్సెస్ కాదని అభిప్రాయపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ కావాలంటే రెండు కారణాలు ఉంటాయన్నారు. ఒకటి దేశాన్ని ప్రభావితం చేసేలా ఒక రాష్ట్రం సమస్యలను లేవనెత్తాలని, నాలుగైదు రాష్ట్రాలు కలిపి సమస్యలను లేవనెత్తాలని పేర్కొన్నారు. కానీ, కేసీఆర్ దగ్గర నిర్దిష్టమైన సమస్యలు ఏమున్నాయని ప్రశ్నించారు. ఇంతవరకు ప్రధాన సమస్య ఇదంటూ కేసీఆర్ గుర్తించలేదన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వెనక ఎవరు ఉన్నారో చూస్తామన్నారు. లోక్‌సభకు తాను పోటీ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్తున్నానన్న వార్త అవాస్తవమని కొట్టిపారేశారు. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నిలకు మధ్య వ్యత్యాసం ఉంటుందన్నారు. ఓటమి ద్వారా గుణపాఠం నేర్చుకోవడానికి తాము సిగ్గుపడట్లేదని, ఓటమి వల్ల తాము విశ్వాసం కోల్పోలేదన్నారు. గ్రామ, మండల స్థాయి నుంచి తెలంగాణ జనసమితిని బలోపేతం చేయటానికి ప్రణాళికలు రచిస్తున్నామని, రానున్న పార్లమెంటు ఎన్నికలపై త్వరలోనే సమావేశమై చర్చిస్తామని, కూటమి ఆ ఎన్నికల్లో కొనసాగుతుందని నమ్ముతున్నామన్నారు. రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధర, నిరుద్యోగ సమస్య, జీఎస్టీ లాంటి అంశాలు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తాయన్నారు. రాష్ట్రాల నిధుల అంశం కూడా జాతీయస్థాయిలో కీలకం కానుందన్నారు. ఉద్యోగాల్లో బీసీలకు 25 శాతం ఇస్తున్నప్పుడు ఎన్నికల్లో ఎందుకు ఇవ్వలేకపోయారన్నారు. మొత్తం పంచాయతీల్లో బీసీలకు కల్పించింది 18.5 శాతం పంచాయతీలేనన్నారు. బీసీలకు కనీసం 25 శాతం పంచాయతీలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొనుగోలు, అమ్ముడు పోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. సొంతంగానేపంచాయతీ ఎన్నికల్లో పోటీ పంచాయతీ ఎన్నికల్లో తాము సొంతంగానే పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం అన్నారు. పార్టీ పేరుతో కాకుండా అభ్యర్థులవారీగానే పోటీ ఉంటుంది కాబట్టి టీజేఎస్ తమ అభ్యర్థులను పోటీలో నిలుపుతుందని వెల్లడించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో పొత్తు నిర్ణయం ఉండదన్నారు. మంగళవారం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉన్న గ్రామపంచాయతీలను గుర్తించే పనిని ప్రారంభిస్తామన్నారు. పార్టీని ప్రారంభించిన సమయంలోనే అనేకమంది యువత వివిధ మండలాలు, గ్రామాల నుంచి వచ్చి పార్టీలో నేరుగా చేరడమే కాకుండా ఆన్లైన్ ద్వారా పార్టీలో చేరినవారు ఉన్నారన్నారు. ఇప్పుడు వాటినన్నింటిని క్రోడీకరించి, ఎక్కడెక్కడ తమ పార్టీ బలంగా ఉందో గుర్తించి ముందుకు సాగుతామన్నారు. గ్రామం కోసం పని చేసేవారిని, గ్రామాభివృద్ధికి పాటుపడేవారికి ప్రాధాన్యం ఇచ్చి ఎన్నికల్లో నిలబెడతామన్నారు. యువత, రిటైర్డ్ ఉద్యోగులను ప్రోత్సహించి పార్టీ తరఫున పోటీలో నిలిపేందుకు కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లు వివరించారు. క్షేత్ర స్థాయిలో ఎక్కడైనా, ఏదైనా గ్రామంలో పొత్తు అవసరం అనుకుంటే జిల్లా పార్టీ కమిటీలే నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. దీంతో అవసరమైన చోట పొత్తు పెట్టుకునే అంశాన్ని జిల్లా పార్టీ నేతలు చూసుకుంటారన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో పార్టీల కంటే గ్రామాభివృద్ధికి కృషి చేసే అభ్యర్థులనే ప్రజలు చూస్తారని పేర్కొన్నారు. -
పంచాయతీ’ పోరుపై టీజేఎస్ గురి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి త్వరగా కోలుకునేందుకు తెలంగాణ జన సమితి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా పరాభవమే ఎదురవ్వడంతో జవసత్వాలు కూడగట్టుకుని పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచేందుకు యోచిస్తోంది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగాలని టీజేఎస్ భావిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో స్థానిక అంశాలు, అభ్యర్థులే ఫలితాలను నిర్ణయించే అవకాశముండటంతో క్షేత్రస్థాయిలో మంచి పేరున్న వారిని పోటీలో నిలపాలనుకుంటోంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, కూటమితో కలసివెళ్లే ఆలోచన తమకు లేదని టీజేఎస్ నేతలు చెబుతున్నారు. కచ్చితంగా తమ సొంత బలంతోనే పంచాయతీ ఎన్నికల్లో పోరాడతామని, గ్రామాల్లో పార్టీ బలోపేతం అయ్యేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని వారంటున్నారు. అయితే, దీనిపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మూడ్రోజుల్లో కీలక భేటీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునేందుకుగానూ టీజేఎస్ త్వరలోనే సమావేశం కానుంది. రెండు లేదా మూడ్రోజుల్లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీకి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులను కూడా ఆహ్వానించనున్నారు. ఇందులో పార్టీ భవిష్యత్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా ఎన్నికల ఫలితాలతో టీజేఎస్ ఒత్తిడి ఎదుర్కొంటున్న నేపథ్యంలో జరగబోయే సమావేశంలో ఏం నిర్ణయిస్తారన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలే ప్రామాణికం కాదు: కోదండరాం రెండు, మూడ్రోజుల్లో టీజేఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం ఉంటుందని, అందులో చర్చించి పంచాయతీ ఎన్నికలపై అధికారిక నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమిని అంగీకరిస్తున్నామని, అన్ని అంశాలను సమీక్షించుకుని పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు అన్నింటికీ ప్రామాణికం కాదన్నారు. టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని వస్తున్న వాదనలను కొట్టిపారేశారు. ప్రజా సంక్షేమం, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే తాము పార్టీ పెట్టినట్లు చెప్పారు. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన కార్యాచరణపై భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. -
రచనారెడ్డి, ఆదిత్యారెడ్డిపై వేటు..!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు మహాకూటమి ప్రత్యామ్నాయం కాబోదని, మహాకూటమిలో రాజకీయ బ్రోకర్లు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ జనసమితి పార్టీ వైస్ ప్రెసిడెంట్ రచనారెడ్డి, మర్రి ఆదిత్యారెడ్డిలపై ఆ పార్టీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ ఏకగ్రీవ తీర్మానం మేరకు టీజెఎస్ ప్రజాకూటమిలో భాగస్వామ్యం అయిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. రచనా రెడ్డి, ఆదిత్యారెడ్డి ఎన్నికల్లో యెల్లారెడ్డి, తాండూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనుకున్నారని, వారి సీట్ల విషయంలో పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయం వారికి బాగా తెలుసునని తెలిపారు. టీఆర్ఎస్కు ఎవరూ ప్రత్యామ్యాయం లేదని చెప్పడం వెనక వారు ఏ పార్టీతో అవగహన కుదుర్చుకుంటున్నారో స్పష్టమవుతోందని టీజేఎస్ ఆరోపించింది. సీట్లు అమ్ముకున్నట్టు పార్టీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఈ మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని తెలిపింది. పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది రచనా రెడ్డి.. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంపై తీవ్ర విమర్శలు చేశారు. కోదండరాం మహాకూటమితో అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆయన మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. మహాకూటమిలో సామాజిక న్యాయం జరగలేదని, కోదండరాంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆమె అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు ఇచ్చారని, ఈ కుమ్మక్కులో కోదండరాం కూడా భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. కూటమిలో చాలామంది నేతలను బలిపశువులను చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఇంగితజ్ఞానం ఉందని, చంద్రబాబు ప్రచారాన్ని వారు తిరస్కరిస్తారని ఆమె పేర్కొన్నారు. -
కూటమిలో ‘ట్విస్ట్’.. టీడీపీ స్థానంలో టీజేఎస్ బీఫారం
సాక్షి, హైదరాబాద్: కూటమిలో కొత్త ట్విస్ట్ మొదలైంది. సీట్ల సర్దుబాటు ఎంతకూ తెగకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కూటమి పార్టీలు ముందుగా బీ–ఫారాలు ఇచ్చేస్తున్నాయి. నామినేషన్ల దాఖలుకు సోమవారం తుది గడువు కావడంతో ముందు బీ–ఫారం ఇవ్వడం ద్వారా అభ్యర్థికి వెసులుబాటు కల్పించాలని, నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు తుది నిర్ణయం తీసుకోవచ్చనే అంచనాతో టీజేఎస్ ఆదివారం ఏడుగురు అభ్యర్థులకు బీ–ఫారాలు ఇచ్చింది. ఈ జాబితాలో సిద్దిపేట, మెదక్, దుబ్బాక, మల్కాజ్గిరి, మిర్యాలగూడ, వరంగల్ (ఈస్ట్), మహబూబ్‌నగర్ స్థానాలున్నాయి. అయితే, టీజేఎస్ బీ–ఫారాలు ఇచ్చిన స్థానాల్లో నాలుగు చోట్ల ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదు. మహబూబ్‌నగర్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎర్ర శేఖర్‌ను ప్రకటించి బీ–ఫారం కూడా ఇచ్చింది. అలాగే మిర్యాలగూడ విషయం ఎటూ తేలలేదు. ఇక్కడ తన కుమారుడు రఘువీర్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని జానారెడ్డి పట్టుపడుతున్నారు. టీజేఎస్ నుంచి ఆయన బంధువు విజయేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. దీనిపై ఏమీ తేలకుండానే టీజేఎస్ విద్యాధర్‌రెడ్డికి బీ–ఫారం ఇచ్చేసింది. ఇక వరంగల్–ఈస్ట్‌లో కూడా ఇదే పరిస్థితి. ఈ స్థానాన్ని కాంగ్రెస్ ఆశిస్తుండగా అక్కడ గాదె ఇన్నయ్యకు టీజేఎస్ బీ–ఫారం ఇచ్చేసింది. దుబ్బాక స్థానాన్ని చిందం విజయ్‌కుమార్‌కు టీజేఎస్ కేటాయించగా, ఆయన్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన దూతలు ఆదివారం పిలిపించారు. ఆయనతో పాటు దుబ్బాక టికెట్‌ను కాంగ్రెస్ తరఫున ఆశిస్తున్న మద్దుల నాగేశ్వర్‌రెడ్డిని కూడా పిలిపించి మాట్లాడారు. అక్కడ కాంగ్రెస్‌కు పోటీచేసే అవకాశం ఇవ్వాలని విజయ్ను కాంగ్రెస్ దూతలు కోరినట్టు సమాచారం. ఈ నాలుగు స్థానాల్లో ఏమీ తేలకుండానే టీజేఎస్ బీ–ఫారాలు ఇచ్చేయడం గమనార్హం. ప్రకటించారు.. కానీ.. ఇక టీడీపీలో మరో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇబ్రహీంపట్నం స్థానాన్ని సామ రంగారెడ్డికి ఆ పార్టీ ప్రకటించింది. అయితే, ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థులందరికీ బీ–ఫారాలు ఇచ్చారు కానీ, రంగారెడ్డికి ఇవ్వలేదు. అభ్యర్థులందరితో ప్రమాణం చేయించినప్పుడు రంగారెడ్డి కూడా ప్రమాణం చేశారు కానీ, బీ–ఫారం మాత్రం ఇవ్వకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ప్రమాణం చేయించిన వ్యక్తికి బీ–ఫారం ఇవ్వలేదంటే ఆయన్ను అభ్యర్థిగా కొనసాగిస్తారా?.. కొనసాగిస్తే నియోజకవర్గాన్ని మారుస్తారా..? మారిస్తే ఎక్కడ అవకాశం ఇస్తారన్నది ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. టీజేఎస్‌కు 9 స్థానాలు తెలంగాణ జన సమితి 9 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలను ఇచ్చేందుకు ఓకే చెప్పినా 6 స్థానాలకే క్లియరెన్స్ ఇచ్చింది. అయితే టీజేఎస్ తాము 9 స్థానాల్లో పోటీ చేసేలా ఏర్పాట్లు చేసుకుం టోంది. దీంతోపాటు అదనంగా మరో ఎస్టీ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరుతోంది. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకుడు ఆర్సీ కుంతియాతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సమావేశమై చర్చించారు. ఆదివారం స్పష్టత వస్తుందని భావించినా ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో టీజేఎస్ 7 స్థానాల్లో పోటీలో నిలుపనున్న అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేసింది. మెదక్ నుంచి జనార్దన్‌రెడ్డి, సిద్దిపేట నుంచి భవానిరెడ్డి, దుబ్బాక నుంచి రాజ్‌కుమార్, మల్కాజిగిరి నుంచి దిలీప్‌కుమార్, వరం గల్ ఈస్ట్ నుంచి ఇన్నయ్య, మిర్యాల్గూడ నుంచి విద్యాధర్ రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి రాజేందర్ రెడ్డికి బీ–ఫారాలను అందజేశారు. వర్ధన్నపేట, అంబర్పేట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను సోమవారం ఖరారు చేసి, బీ–ఫారాలను అందజేయాలని నిర్ణయించింది. -
‘మహా’ కుదుపు కూటమికి
సాక్షి, వరంగల్: జట్టు కట్టక ముందే కూటమిలో మహా కుదుపు మొదలైంది. సీట్ల పంపకాల్లో పొత్తులు పొసగక పోవడంతో ఎవరికి వారుగా వేరు కుంపటికి సిద్ధమవుతున్నారు. మూడు ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వాళ్లుగా విడిపోయి పోటీకి రెడీ అవుతున్నారు. పెద్ద భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ జిల్లాలో ఐదు సీట్లను త్యాగం చేయాల్సి వస్తుండడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ‘పశ్చిమ’లో తిరుగుబాటు పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తిరుగుబాటు ఎగురవేశారు. కూటమి ఒడంబడికను పక్కనపెట్టి ఆయన తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇక టీజేఎస్ 12 సీట్లలో పోటీ చేస్తామని ఏకపక్షంగా ప్రకటించింది. అందులో నాలుగు సీట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉండడంతో ఇక్కడి మహా కూటమి నేతల్లో ఆందోళన మొదలైంది. టీజేఎస్ ప్రకటించిన వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ తూర్పు, జనగామ నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాయి. కానీ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా సింగపురం ఇందిరను ప్రకటించిన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తామని చెప్పడం గందరగోళానికి దారితీసింది. జనగామ మాదే.. కాదు మాదే.. ఇద్దరు ముఖ్య నాయకులు జనగామ కోసం పోటీ పడుతున్నారు. టీజేఎస్ చీఫ్ కోదండరాం ఇక్కడి నుంచే పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కోదండరాం సమీప బంధువులు నియోజకవర్గంలో మకాం వేశారు. పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఇతర నాయకులను కలుస్తున్నారు. మరోవైపు జనగామ సీటు తనదేనని పొన్నాల లక్ష్మయ్య విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో మకాం వేసి తన సీటును కాపాడుకునేందుకు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పొన్నాలకు మొదటి, రెండో జాబితాల్లో సీటు ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ కొందరు కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఒకటి రెండు రోజుల్లో మరి కొంత మంది నేతలు కూడా రాజీనామాలు చేసే అవకాశం ఉంది. స్టేషన్ ఘన్‌పూర్‌లో గందరగోళం.. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన స్టేషన్‌ఘన్‌పూర్‌లోనూ బరిలోకి దిగుతామని టీజేఎస్ ప్రకటించడంతో మళ్లీ గందరగోళం రేగింది. తొలి జాబితాలోనే కాంగ్రెస్ పార్టీ సింగపురం ఇందిరకు టికెట్ కేటాయించింది. ఈమేరకు ఆమె నామినేషన్‌కు సిద్ధమవుతున్నారు. తాజాగా తాము ఇక్కడి నుంచి కూడా పోటీ చేస్తామని ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. మరో వైపు వర్ధన్నపేట టికెట్ తనకే ఇవ్వాలని కొండేటి శ్రీధర్ గాంధీ భవన్లో ధర్నా చేశారు. కొండేటి నామినేషన్‌కు సిద్ధమవుతున్నట్లు ఆయన అనుచరులు బుధవారం ప్రకటించారు. -
టీజేఎస్‌కు షాక్..!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన తెలంగాణ జన సమితి జిల్లా కార్యదర్శి ఆత్మకూరు నాగేశ్ సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో నాగేశ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సంగారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రవాస భారతీయుడైన నాగేశ్ తెలంగాణ జన సమితి ఆవిర్భావం సందర్భంగా పార్టీలో చేరారు. సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు బీరయ్య యాదవ్‌తో పాటు సంగారెడ్డి టికెట్ ఆశించిన నాగేశ్.. మహాకూటమి ఏర్పాటు నేపథ్యంలో పక్షం రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా టీఆర్ఎస్లో చేరడం టీజేఎస్ వర్గాల్లో సంచలనం కలిగించింది. టీజేఎస్ వర్గాల్లో నిరాశ కోదండరాం నేతృత్వంలోని టీజేఏసీతో పాటు, టీజేఎస్ ఆవిర్భావం నుంచి ఇతర జిల్లాలతో పోలిస్తే సంగారెడ్డి జిల్లా పరి«ధిలో పలు కార్యక్రమాలు జరిగాయి. టీఆర్ఎస్తో పాటు వివిధ సంఘాల్లో చురుగ్గా పనిచేసిన పలువురు నేతలు టీజేఎస్ ఆవిర్భావం సమయంలో పార్టీలో చేరారు. సంగారెడ్డి నుంచి బీరయ్య యాదవ్, ఆత్మకూరు నాగేశ్, జహీరాబాద్ నుంచి మొగుడంపల్లి ఆశప్ప తదితరులు టికెట్ ఆశించారు. మహా కూటమి ఏర్పాటు నేపథ్యంలో టీజేఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మెదక్, దుబ్బాక, సిద్దిపేట స్థానాలను కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీజేఎస్ ఆశిస్తున్న స్థానాల్లో సంగారెడ్డి జిల్లా పరిధిలో ఒక్కటి కూడా లేకపోవడం పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. బీసీ కోటాలో ఏదో ఒక స్థానం నుంచి తనకు పోటీ అవకాశం దక్కుతుందనే ఆశాభావంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు బీరయ్య యాదవ్ ఉన్నారు. టీఆర్ఎస్లో నాగేశ్ చేరిక నేపథ్యంలో పార్టీలోని మిగతా శ్రేణుల ప్రస్థానం ఆసక్తికరంగా మారింది. -
కాంగ్రెస్ జాబితా.. టీజేఎస్, సీపీఐలో లొల్లి
సాక్షి, హైదరాబాద్ : ఇదిగో.. అదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఎట్టకేలకు 65 మందితో కూడిన తొలి జాబితానైతే అర్ధరాత్రి విడుదల చేసింది. కానీ ఈ జాబితానే మహాకూటమి మిత్రపక్షాలైన టీజేఎస్, సీపీఐలో చిచ్చుపెట్టింది. టీజేఎస్, సీపీఐలు ఆశించిన స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఆయా పార్టీల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీల నేతలు ఈ జాబితాతో నిట్టూర్చారు. అసంతృప్తి వ్యక్తం చేస్తూ అసమ్మతి జెండా ఎగురేసేందుకు సిద్దం అవుతున్నారు. ఆలేరు, ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్పూర్, తాండూరు స్థానాలను ఇవ్వాలని తొలి నుంచి టీజేఎస్ పట్టుబడుతుండగా.. కొత్తగూడెం సీటును సీపీఐ ఆశిస్తోంది. అయితే, కొత్తగూడెం స్థానాన్ని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు కేటాయించిన కాంగ్రెస్... టీజేఎస్ అడిగిన స్థానాల్లోను అభ్యర్థులను ప్రకటించింది. స్టేషన్ ఘన్పూర్ నుంచి సింగపూర్ ఇందిరను, ఆలేరు నుంచి బూడిద బిక్షమయ్యగౌడ్, ఆసిఫాబాద్‌లో అత్రం సక్కు, తాండూరు నుంచి పంజుగుల పైలట్ రోహిత్‌రెడ్డిల పేర్లను ఖారారు చేసింది. దీనికితోడు తెలంగాణ ఇంటి పార్టీకి ఇస్తారని భావించిన ఒక్క నకిరేకల్ స్థానంలో కూడా కాంగ్రెస్ చిరుమర్తి లింగయ్యను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో మిత్రపక్షాలు పునరాలోచనలో పడ్డాయి. మహాకూటమి ఒప్పందం ప్రకారం టీజెఎస్ 8, సీపీఐ 3, టీడీపీ 14, తెలంగాణ ఇంటి పార్టీకి ఒక టికెట్ ఇస్తామన్నారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన మిత్రపక్షాలు.. తమకు అడిగిన చోట టికెట్లివ్వాలని విజ్ఞప్తి చేశాయి. కానీ కాంగ్రెస్ అవేవి పట్టించుకోకుండా ఆయా పార్టీలు అడిగిన చోటే అభ్యర్థులను ప్రకటించింది. అంతేకాకుండా టీఆర్ఎస్ బలంగా ఉన్న స్థానాల్లో టీజేఎస్‌కు టికెట్లు ఇచ్చారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీజేఎస్ అధినేత కోదండరాంకు ఇస్తానన్న జనగాం స్థానాన్ని కూడా పెండింగ్‌లో పెట్టడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. దీంతో టీజేఎస్ పార్టీ నేతలు రెబల్స్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఆలేరు టీజేఎస్ నేత కల్లూరి రాంచంద్రారెడ్డి ఈ రోజు మధ్యాహ్నమే ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయనున్నారు. మరికొందరు నేతలు కూడా అదే దారిని ఎంచుకోనున్నారు. స్టేషన్ ఘనపూర్ టీజేఎస్ నేత చింత స్వామి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. కూటమిలో ఒక్క టీడీపీ మినహా మిగతా పార్టీలన్నీ కాంగ్రెస్ జాబితాపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. -
ప్రజల ఆకాంక్షల సాధనకే టీజేఎస్
పోరాడి సాధించుకున్న తెలంగాణలో నాలుగున్నర ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తెలంగాణ జన సమితి(టీజేఎస్) లక్ష్యమని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం గ్రౌండ్లో ఆదివారం రాత్రి టీజేఎస్ నిర్వహించిన ఓరుగల్లు పోరుసభ ధూంధాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేయూ క్యాంపస్: పోరాడి సాధించుకున్న తెలం గాణ రాష్ట్రంలో నాలుగున్నర ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తెలంగాణ జన సమితి (టీజేఎస్) లక్ష్యమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నా రు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం గ్రౌండ్లో ఆదివారం రాత్రి టీజేఎస్ నిర్వహించిన ఓరుగల్లు పోరుసభ ధూంధాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోనే డిగ్రీ చదువుకున్నానని, ఇక్కడ అప్పట్లోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలతో చర్చలు జరిగేవని, పోరా టాలగడ్డ వరంగల్‌లో కాళోజీ స్వాగతం పలికేవారని గుర్తుచేసుకున్నారు. ఆచార్య జయశంకర్, బియ్యాల జనార్దన్‌రావు, భూపతి కృష్ణమూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమానికి నాంది వరంగల్‌లోనే జరిగిందని అన్నారు. కేసీఆర్ ఏం చేశాడు ? ఎంతోమంది యువత ఆత్మబలిదానాల తర్వాత సాధించుకున్న తెలంగాణాలో గద్దెనెక్కిన కేసీఆర్ ఏం చేశాడని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏవి? తెలంగాణ వచ్చాక ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఉన్న ఇళ్లను కూలగొట్టగా ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్‌లో ధర్నా చౌక్‌ను ఎత్తివేశారని తెలిపారు. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు తమ సమస్యలను పరిష్కరించాలని అక్కడ ధర్నాకు ఉపక్రమించితే వారిని బలవంతంగా అరెస్ట్ చేయించారన్నారు. అప్రజాస్వామికంగా నియంతృత్వ పోకడలతో వ్యవహరించారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా కుర్చీలో కూర్చుంటే అడిగే హక్కు వారికి ఉందన్నారు. తెలంగాణకు ఆదాయం ఉందని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేశారని అన్నారు. టీఆర్ఎస్ ముందే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేస్తోందని, మద్యం సీసాలు కూడా పంచుతున్నారంటా.. ఇదేం ప్రచారమని ప్రశ్నించారు. అగ్గిపెట్టె గుర్తుకు ఓటు వేసి టీజేఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీజేఎస్ రాష్ట్ర బాధ్యుడు అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎంగా కేసీఆర్ అప్రజాస్వామిక పాలన చేశారని, కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చలేదని విమర్శించారు. టీజేఎస్ రాష్ట్ర నాయకుడు భద్రోద్రి మాట్లాడుతూ మైనార్టీలకు రూ.2వేల కోట్లు కేటాయించామని చెప్పారు కానీ రూ.200కోట్లు కూడా విడుదల చేయలేదన్నారు. సమావేశంలో టీజేఎస్ నాయకులు గాదె ఇన్నయ్య, రాజేంద్రప్రసాద్, శ్యాం సుందర్‌రెడ్డి, బొట్ల బిక్షపతి, మంద భాస్కర్, డాక్టర్ తిరుణహరిశేషు, పులిసత్యం, జి.రవీందర్, శైలేందర్‌రెడ్డి, డోలి సత్యనారాయణ, పిల్లి సుధాకర్, పులి సత్యం, రాజేందర్, వినయ్‌కుమార్, లక్ష్మి, రమేష్, ఎ.రాజేందర్, శ్రవణ్ పాల్గొన్నారు. అలరించిన ధూంధాం.. ధూంధాం కార్యక్రమంలో కిషోర్, నాగరాజు, దేవేందర్, రవి, రమ కళాకారుల బృందం పాటలతో మాటలతో చైతన్యం కల్పించారు. కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారంటూ.., జైబోలో తెలంగాణ, వందనం వీరులకు వందనం అమరులకు వందనం అంటూ పాటలు పాడి సాంస్కృతిక నృత్యాలతో ప్రజలను ఉర్రూతలూగించారు. -
పాలన చేతగాని అసమర్ధుడు
స్టేషన్‌ఘన్‌పూర్: కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. బడ్జెట్ రూ.40 వేల కోట్ల నుంచి రూ.85 వేల కోట్లకు పెంచారని, కేవలం కమీషన్ల కోసమే అడ్డగోలుగా ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో టీజేఎస్ ఆధ్వర్యంలో మేనిఫెస్టోను ప్రజలకు పరిచయం చేసేందుకు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే మన సమస్యలన్నీ తీరుతాయనే ఆశతో ప్రజలు అధికారం అప్పగిస్తే.. పాలన చేతగాక అసమర్థుడైన కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశాడని ధ్వజమెత్తారు. కేసీఆర్ రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తూ కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. -
సంకీర్ణంపై స్పష్టత రాలేదు
సాక్షి, హైదరాబాద్: సంకీర్ణ భాగస్వామ్యంపై ఇంకా స్పష్టత రాలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం.కోదండరాం చెప్పారు. టీజేఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో అందరూ కలసి ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరముందన్నారు. కూటమిలోని సీట్ల సర్దుబాటు అంశాన్ని పార్టీ సమావేశంలో ఇంకా చర్చించలేదని తెలిపారు. పార్టీ మేనిఫెస్టో, విస్తరణ, అనుసరించాల్సిన వ్యూహం వంటి వాటిపైనే చర్చించినట్టుగా కోదండరాం వెల్లడించారు. అయితే సీట్లు సర్దుబాటుపై చర్చను ఎక్కడోచోట ఆపాల్సిందేనని వ్యాఖ్యానించారు. సీట్ల సర్దుబాటు సమస్యే కాదని.. సంకీర్ణాన్ని నడిపే కాంగ్రెస్‌పైనే సీట్ల సర్దుబాటుకు సంబంధించి పూర్తి బాధ్యత ఉందన్నారు. కూటమి తరఫున నియమావళిని తయారుచేసుకుని ముందుకెళ్ళాలని సూచించారు. కూటమిలో పార్టీలు సమన్వయంతో నడిస్తే సమస్యలు అవే పరిష్కారమవుతాయన్నారు. భాగస్వామ్య పక్షాలతో వ్యవహరించే విధానంపై స్పష్టత రావాల్సిన అవసరముందని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలకు ఇది కీలకమని వెల్లడించారు. ప్రచారం నడుస్తోందని, మరింత వేగాన్ని పెంచాల్సిన అవసరముందన్నారు. నియోజకవర్గాల వారీగా ఇన్చార్జులు, మేనిఫెస్టోపై వివిధ కమిటీల ద్వారా చర్చించినట్లు తెలిపారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను ప్రకటించారు. టీజేఎస్ మేనిఫెస్టో ముఖ్యాంశాలు... ♦ సామాజిక న్యాయ సాధికారత ♦ ఉచిత విద్య, వైద్యం ♦ ఉద్యోగ, ఉపాధి కల్పన చర్యలు ♦ వ్యవసాయం.. నైపుణ్య అభివృద్ధి ♦ జిల్లాకో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ, మండలానికో ప్రభుత్వ ఐటీఐ కాలేజీ, సర్టిఫికెట్ కోర్సులు ♦ వ్యవసాయ బడ్జెట్, మార్కెట్లో దోపిడీకి అడ్డుకట్ట ♦ రూ.2 లక్షల రుణమాఫీ.. సరైన పద్ధతిలో ఎరువుల పంపిణీ ♦ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు కుటీర పరిశ్రమల ఏర్పాటు ♦ వికలాంగులకు ప్రత్యేక శాఖ ♦ ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటు, మైనార్టీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు ♦ సుధీర్ కమిషన్ నివేదిక అమలు ♦ మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ♦ కులాంతర వివాహాలు చేసుకున్న వారి రక్షణకు చట్టం ♦ పట్టణాల అభివృద్ధిలో భాగంగా పబ్లిక్ స్థలాల పరిరక్షణ ♦ హైదరాబాద్‌కే పరిమితం కాకుండా మిగిలిన అన్ని జిల్లాలో కూడా అభివృద్ధి ♦ మద్యం నియంత్రణ.. బెల్ట్‌షాప్‌ల కట్టడి ♦ ఉద్యోగుల సంక్షేమం, పాత పెన్షన్ విధానం అమలు, ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ వారిని వెనక్కి తీసుకురావడం ♦ అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇళ్లు,హెల్త్‌కార్డులు ♦ ఉద్యమకారులందరికీ పెన్షన్లు.. ఉద్యమ కేసుల ఎత్తివేత ♦ ఓపెన్ కాస్ట్ గనుల మూసివేత ♦ ఏడాదిలో లక్ష ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్. కోదండరాం పోటీ చేయాల్సిందే ఈ ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పార్టీ అధ్యక్షుడు కోదండరాం కచ్చితంగా పోటీచేయాలని పలువురు టీజేఎస్ నేతలు సమావేశంలో అభిప్రాయపడ్డారు. పార్టీని అసెంబ్లీలోనూ, బయటా నడపడానికి కోదండరాం ముందుండాలని కోరారు. కాంగ్రెస్ లీకులను సమర్థంగా తిప్పికొట్టాలని కొందరు నేతలు సూచించారు. కూటమికి చైర్మన్‌గా కోదండరాం ఉండాలని, యువకులకు సీట్లివ్వాలని మరికొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం అభ్యర్థిగా కోదండరాంను ప్రకటించాలని కొందరు నేతలు కోరారు. -
సీట్ల కోసం పొత్తులు పెట్టుకోవడం లేదు: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ జనసమితి, కాంగ్రెస్‌కి అల్టిమేటం ఇచ్చింది అనే వార్తలు వస్తున్నాయి..కానీ సీట్ల కోసం మేం పొత్తులు పెట్టుకోవడం లేదని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..‘ ఉమ్మడి కార్యాచరణ, ఆ కార్యాచరణ అమలు , జనసమితికి గౌరవప్రదమైన స్థానంపై మహా కూటమిలో చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి ప్రయోజనాల కోసమే మా పోరాటం. దాని కోసం మేం తొందరపడుతున్నది వాస్తమే. ఒకటి రెండు రోజుల్లో ఒక నిర్ణయం వెలువడుతుందని సమాచారం. అందరం కలిసి ఒక బలమైన ఎజెండాని ముందుకు తీసుకెళ్లగలమ’ ని వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ..‘ సీట్లకు సంబంధించిన గోప్యత ఉంటుంది. మేం ఏ రోజూ సీట్ల గురించి బహిరంగంగా మాట్లాడలేదు. మాకు ఒక స్పష్టత ఏర్పడింది. సీట్లు అడిగేటప్పుడు ఎలాంటి ప్రాతిపదికలు చూస్తారో మాకు తెలుసు. ఇన్ని సీట్లు ఇవ్వాలి అని మేం అధికారికంగా చెప్పలేదు. ఒకటి రెండు రోజుల్లో అన్నీ తేలనున్నాయి. కోదండరాం పోటీ చేయాలా లేదా అనేది పార్టీ నిర్ణయిస్తుంద’ని చెప్పారు. కోదండరాం సమక్షంలో తెలంగాణ జనసమితిలో ప్రముఖ న్యాయవాది ప్రహ్లాద్ చేరారు. గతంలో ప్రహ్లాద్ జేఏసీలో పనిచేశారు. కోదండరాంను విభేదించి బయటకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధినాయకత్వం తనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి ఇస్తామని ఆశ చూయించి కోదండరాంను విమర్శించమని చెప్పిందని వెల్లడించారు. -
సీట్లపై చర్చ జరగలేదు: ఉత్తమ్
హైదరాబాద్: ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో కామన్ పోగ్రాం అజెండాపై చర్చించామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్, తెలంగాణ జన సమతి, టీడీపీ, సీపీఐ పార్టీల అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో కామన్ అజెండా ఫైనల్ చేసి, ఆ తర్వాత విడుదల చేస్తామన్నారు. ఇప్పటి వరకు సీట్ల చర్చ జరగలేదని వివరించారు. కేసీఆర్ ఏం చేసినా ఓటమి ఖాయమన్నారు. నోటిఫికేషన్ వచ్చే నాటికి సీట్ల సర్దుబాటు ఫైనల్ అవుతుందని తెలిపారు. ఎన్నికల షెడ్యూలే ఇంకా ప్రకటించలేదు..సీట్లు, మ్యానిఫెస్టో గురించి తొందరపాటు ఎందుకని అన్నారు. వివిధ పార్టీలకు వివిధ మ్యానిఫెస్టోలు ఉంటాయి కాబట్టి అందరం కలిసి చర్చించి ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. ఉద్యమ ఆకాంక్షలకి అనుగుణంగా కామన్ అజెండా ఉంటుందని వెల్లడించారు. ఈ కూటమి మహాకూటమి కాదని, దీనికి ఇంకా పేరు పెట్టలేదని చెప్పారు. బీజేపీతో వెళతారన్న ప్రశ్నకి కోదండరాం సమాధానం దాటవేశారు. సీట్లపై ఇంకా చర్చ జరగలేదని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..ప్రజల అజెండా అమలు చేస్తామని వివరించారు. కోడ్ అమలులో ఉండగా మంత్రులు ఎలా ప్రారంభోత్సవాలు చేస్తారని ప్రశ్నించారు. ఒక అవగాహనకు రాకుండా ఏ పార్టీ వాళ్లు ప్రచారం చేసుకోవడం మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రజలు నిరాశతో ఉన్నారు..అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా మ్యానిఫెస్టో ఉంటుందన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ... కేసీఆర్ అన్ని వర్గాల వారిని మోసం చేశారని విమర్శించారు. నష్టపోయిన అన్ని వర్గాల వారికి మ్యానిఫెస్టోలో న్యాయం చేస్తామని అన్నారు. తమది గ్రాండ్ అలయన్స్ అన వ్యాఖ్యానంచారు. -
సీట్ల కేటాయింపు పై ఎలంటి చర్చా జరగలేదు
-
పొత్తులు సరే.. ఆకాంక్షల సాధన ఎలా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం పనిచేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలకన్నా టీజేఎస్పైనే ఎక్కువగా ఉంటుం దని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని పార్టీ నేతలకు సూచించారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జిల్లా ఇన్చార్జిలు, రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలతో సమావేశమైన కోదండరాం.. రాబోయే ఎన్నికల్లో పొత్తులు, భవిష్యత్ కార్యాచరణ, ఉద్యమ ఆకాం క్షలపై చర్చించారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలతో పొత్తులకు రంగం సిద్ధమైన నేపథ్యంలో పొత్తుల వల్ల తలెత్తబోయే సమస్యలను ప్రస్తావించారు. ఆకాంక్షలను కాపాడుకోడానికి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. -
టీఆర్ఎస్ అవినీతిపై న్యాయ విచారణ చేయిస్తాం
హైదరాబాద్ : తాము అధికారంలోకి రాగానే ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటివరకు జరిగిన అవినీతిపై న్యాయ విచారణ చేయిస్తామని తెలంగాణ జనసమితి (టీజేఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు మారాలని, అందరికీ విద్య, వైద్యం ఇవ్వాలని ఇవన్నీ చేయడం ఈ ప్రభుత్వంవల్ల కాదని ఆయన స్పష్టంచేశారు. శుక్రవారం ఎర్రమంజిల్‌లోని హోటల్ ఎన్‌కేఎం గ్రాండ్లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరామ్‌తో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు కోదండరామ్ సమాధానం చెప్పారు..వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. తాము 14 ఏళ్లుగా ప్రజలతో కలసి పోరాటం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో కుటుంబ పాలన సాగుతోందనీ, పూర్తిస్థాయిలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఉద్యమ ఆకాంక్ష ఒక్కటీ నెరవేరడంలేదన్నారు. మూడు నెలలనుండీ ఆసరా పింఛన్ ఇవ్వలేదని, ఉపాధి హామీ డబ్బులు కేంద్రం ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలేదని, ప్రశ్నించే వారిని అణగదొక్కుతున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారన్నారు. తమ పార్టీని గ్రామస్థాయి నుంచీ పటిష్టం చేస్తున్నామన్నారు. ఇప్పటికే విద్యార్ధి, యువజన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాలు ఏర్పాటు చేశామని, ఆరోగ్యం, విద్యపై వివిధ సదస్సులు జరిపి చాలా విషయాలపై అవగాహన పెంచుకున్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తామన్నారు. నిరుద్యోగులందరికీ 2,500 నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామన్నారు. మహిళా సంఘాలకు పావలా వడ్డీ, ఆసరా పింఛన్ 1,500, వికలాంగులకు 2వేలు పింఛన్ ఇస్తామన్నారు. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు నెలకు సరిపడా మందులు ఉచితంగా అందిస్తామన్నారు. నాణ్యమైన ప్రభుత్వ విద్యను అందిస్తామని, అన్ని విద్యాసంస్థల్లో ఖాళీలు భర్తీ చేసి, అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. -
ప్రొ. కోదండరాం అరెస్ట్
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాంను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూడెమోక్రసీ నేత ప్రభాకర్‌తో ములాకత్ అయ్యేందుకు వెళుతున్న కొదండరాంను అరెస్ట్ చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాము ఆందోళనలు చేయడానికి వెళ్లడం లేదని రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్తుండగా అరెస్ట్ చేయడం సరికాదని కోదండరాం అన్నారు. పోచంపాడు నుంచి కనీసం లీకేజి అవుతున్న నీటిని వాడుకుంటామన్న 21 గ్రామాలను పోలీస్ స్టేషన్లను తలపించేలా 144 సెక్షన్ విధించడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రైతుల సమస్యలపై అండగా ఉన్న రైతుసంఘం నాయకుడు, న్యూ డెమోక్రసీ నేత ప్రభాకర్ ను అరెస్ట్ చేసి రిమాండుకు పంపించడం తగదన్నారు. కోదండరాంను హైదరాబాద్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆయన ప్రతిఘటించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ జన సమితి నేతలను ఉంచారు. శ్రీరాంసాగర్ నుంచి నీటి విడుదల లేదని ప్రజాప్రతినిధులు తేల్చిన సంగతి తెలిసిందే. నీటి నిల్వ తక్కువగా ఉన్నందున తాగునీటి అవసరాల నిమిత్తం వాడాలని, ప్రాజెక్టుకు వరద నీరు వస్తే విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు వైపు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. సదరు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రేపటినుంచి ఐదు రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. నిజామాబాద్, ఆర్మూరు, బోధన్ డివిజన్ పరిధిలో రేపు సాయంత్రం ఏడు గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఆందోళనలకు అనుమతి లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. -
కాళేశ్వరం ప్రాజెక్టుతో పాలకులకే మేలు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులకంటే పాలకులకే ఎక్కువ మేలు జరుగుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. టీజేఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఒక కుటుంబం కోసమే ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, ఆ కుటుంబం లాభం పొందడం కోసమే ప్రాజెక్టు వ్యయం భారీగా పెంచారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం ఇంజనీరింగ్ పరంగా ఏ మాత్రం మంచిది కాదన్నారు. కొంతమంది ప్రయోజనమే అందులో ప్రాధాన్య అంశంగా మారిందన్నారు. భారీగా పెరిగిన వ్యయంలో కమీషన్లు ఎవరికి పోతున్నాయో ప్రజలు ఆలోచించాలన్నారు. ఇలాంటి వాటిని ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేయవద్దంటూ, దీనిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. అంతర్జాతీయ స్థాయిలో నిపుణులను పిలవాలని, ఎవరి వాదన తప్పో వారే తేల్చుతారన్నారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరిపితే నాయకులంతా జైలుకు వెళ్లడం ఖాయమని ఆరోపించారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు నివేదికను టీజేఏస్ సిద్ధంచేసి, చర్చకు పెట్టిందన్నారు. దానిని నీటిపారుదల శాఖ అధికారులకు పంపించామన్నారు. అయితే తాము లేవనెత్తిన అంశాల్లో ఒక్కదానికీ మంగళవారం మంత్రి హరీశ్‌రావు ప్రెస్ మీట్లో సమాధానం ఇవ్వలేదన్నారు. తుమ్మిడిహెట్టి వద్దకు నీళ్లు తెచ్చుకోవచ్చన్నారు. అక్కడ నీళ్లు లేవనే చర్చను ప్రభుత్వం అసంబద్ధంగా లేవనెత్తుతోందన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర కాకపోతే ఎల్లంపల్లితోపాటు ఇతర ప్రదేశాల్లో కట్టుకునేలా ప్రత్యామ్నాయం ఉందన్నారు. తుమ్మడిహెట్టి వద్ద నీళ్లు లేకపోతే మేడిగడ్డకు ఎలా వస్తాయని ప్రశ్నించారు. వీలైనంత తక్కువ ఖర్చుతో లిఫ్ట్‌ల నిర్మాణం చేపట్టవచ్చన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నుంచి నీళ్లు తెస్తే రూ.40 వేల కోట్లు ఆదా అవుతాయన్నారు. తద్వారా ఫీజు రీయింబర్స్మెంట్, డబుల్ బెడ్ రూమ్ వంటి పథకాలకు ఆర్థికంగా ఇబ్బంది ఉండేది కాదన్నారు. దళితులకు మూడెకరాల భూమి కొనుగోలు చేసేందుకు ఉపయోగపడేవన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయే పరిస్థితి ఉండేది కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు తప్పదని, అది జరిగిన రోజు మాత్రం టీఆర్ఎస్ నాయకులు అంతా చంచల్‌గూడ జైలుకు వెళ్లడం ఖాయమని కోదండరాం అన్నారు. -
‘అది నా దృష్టిలో వికృతమైన చర్య’
సాక్షి, నల్గొండ : సవాళ్లు విసురుకోవటం అనేది తన దృష్టిలో వికృతమైన చర్యని, రాజకీయాల పట్ల వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం అన్నారు. సోమవారం నల్గొండలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వేములకొండ మృతులకు ఇస్తున్న ఎక్స్‌గ్రేషియా కూరగాయల బేరంలాగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న మంత్రిగారు వ్యంగంగా 50 లక్షలు కావాలా అని వ్యాఖ్యానించటం చాలా దురదృష్టకరమన్నారు. ఎక్స్‌గ్రేషియా విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలని, కనీసం 6లక్షలైనా ప్రమాణంగా తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అన్ని పార్టీలు సిద్ధంగా ఉంటాయన్నారు. ఆదివారం ట్రాక్టర్ మూసీ కాలువలో బోల్తాపడిన ఘటనలో వేములకొండకు చెందిన 15మంది మృతిచెందిన విషయం తెలిసిందే. -
పారదర్శకత కోసమే టీజేఎస్
సాక్షి, మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రజలే కేంద్రంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎదిర, టీచర్స్ కాలనీ, పాతపాలమూరు, బండ్లగేరిలో మంగళవారం ఆయన పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఎదిరలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పార్టీలు ఏర్పడాలే తప్ప స్వార్థరాజకీయాల కోసం కాదన్నారు. పారదర్శకతతో రాజకీయాలను అందించడానికే టీజేఎస్ పార్టీని ఏర్పాటుచేశామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల ను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామన్నారు. తెలంగాణ అమర వీరుల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండానే ఎదిరె పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేశారన్నారు. ఇలా విలీనం చేయడం వల్ల వ్యవసాయం చేసుకునే రైతులకు పన్నుల భారం పడుతుందని తెలిపారు. పుస్తకాలు కొత్తవి.. సమస్యలు పాతవి ప్రభుత్వం రైతులకు అందించిన చెక్కుల పంపిణీలో చాలా మంది రైతులకు అన్యాయం జరిగిందని కోదండరాం పేర్కొన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాసు పుస్తకాలు మాత్రమే కొత్తవని, వాటిలో రైతుల పేర్లు సరిగా రాకపోవడం, భూమి పూర్తిస్థాయిలో రికార్డు కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. రైతులు అంటే ఆర్థికంగా వెనుకబాటు ఉండి, తక్కువ భూమిలో సేద్యం చేసుకునే నిజమైన లబ్దిదారులకు చెక్కులు ఇవ్వడం వల్ల న్యాయం జరుగుతుందన్నారు. చెక్కుల పంపిణీలో అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగే విధంగా టీజేఎస్ పార్టీ వెంట ఉంటుందన్నారు. అందుకోసం రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా పర్యటించి చెక్కుల పంపిణీలో ఉన్న లోటు పాట్లు రైతులకు జరిగిన ఇబ్బందిపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఈమేరకు పలువురు కోదండరాం సమక్షాన టీజేఎస్‌లో చేరగా, టీచర్స్ కాలనీలో ముస్లిం మహిళలకు రంజాన్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వసంత నర్సింహులు, నాయకులు మంత్రి నర్సిహ్మయ్య, బాల్కిషన్, దేవరాజ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. పాలమూరుపై కేసీఆర్ సవతి ప్రేమ మక్తల్ : సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాపై అభివృద్ధిలో సవతి ప్రేమ చూపిస్తున్నారని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మక్తల్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గతంలో 90శాతం పనులు చేసి కేవలం 10 శాతం పనులు చేయలేదని అన్నారు. ఎన్నికల హామీలను ఏ మాత్రం అమలు చేయలేదని తెలిపారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ఆవిర్భావ దినోత్సవం రోజున గౌరవించలేదని విమర్శించారు. అంతకు ముందు మక్తల్ పెద్ద చెరువులో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒండ్రు మట్టిని తరలిస్తున్నారని చెప్పగా.. ఈ పనులు రైతుల కోసమా, ఇటుక బట్టీల వ్యాపారస్తుల కోసమా అని ప్రశ్నించారు. టీజేఎస్ కన్వీనర్ రాజేందర్‌రెడ్డితో పాటు నర్సిములు, సూర్యప్రకాష్, దత్తాత్రేయ, మొద్దు రాములు, పోలప్ప, జంసీర్, అశోక్ పాల్గొన్నారు. భూములు లేకుండా చేయడమేనా? మాగనూర్ (మక్తల్) : భూప్రక్షాళనలో జరిగిన అవకతవకల కారణంగా పేదలు తమ భూములపై హక్కులు కోల్పోయే ప్రమాదమున్నందున తక్షణమే రికార్డులు పూర్తిస్థాయిలో సరిచేయాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. భూప్రక్షాళనలో నష్టపోయిన రైతుల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో రైతులతో ఫిర్యాదులు స్వీకరించారు. ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన పేద రైతులకు న్యాయం జరగడమేమో కానీ ఉన్న భూమి కోల్పోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. టీజేఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, నర్సిములు, ముదిరాములు, సూర్యప్రకాష్ ఉన్నారు. -
వారికి మా పార్టీ అండగా ఉంటుంది
నిజామాబాద్ జిల్లా : గ్రామాభివృద్ధిపై మక్కువ ఉన్న యువత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని, అలాంటి వారికి మా పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పార్టీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్‌లో తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు, భూ ప్రక్షాళన పథకాలు గందరగోళంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ 15,700 మంది రైతులకు రూ.లక్షా యాభై వేల చొప్పున సాయం అందగా..85 శాతం రైతులకు ఏడు వేల రూపాయలకు తక్కువగా సాయం అందిందని తెలిపారు. సాయం అవసరం అయిన వారికి తక్కువగా, భూములను పెట్టుబడి కోసం కొన్న వారికి ఎక్కువ సాయం దొరికిందని విమర్శించారు. ఇట్లాంటి వ్యత్యాసం ఉంటే వ్యవసాయంలో ఎలా ముందడుగు పడుతుందని సూటిగా ప్రశ్నించారు. పోలీసు రిక్రూట్మెంట్లో తగ్గించిన వయో పరిమితి పెంచి నిరుద్యోగులను ఆదుకోవాలని కోదండ రాం డిమాండ్ చేశారు. -
టీజేఎస్ టార్గెట్ 2019
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు రాబోతుండడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌లో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పాగా వేసుకొని ఉండగా, వచ్చే ఎన్నికల నాటికి ఆ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఇన్నాళ్లు తెలంగాణ ఉద్యమ సారథిగా ఉన్న టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం తెలంగాణ జన సమితి (టీజేఎస్) పేరుతో రాజకీయ రంగ ప్రవేశం చేయడం రాష్ట్రంలోనే గాక సొంత జిల్లా రాజకీయాలను సైతం ప్రభావితం చేయబోతుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో పార్టీ బలోపేతానికి కోదండరాం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ టీజేఎస్, తెలుగుదేశంతో పొత్తు ఆలోచనలు ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టార్గెట్–2019 పేరుతో నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. టీజేఎస్ ఇంట గెలిచేలా... మంచిర్యాల జిల్లా బెల్లింపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం జోగాపూర్ ప్రొఫెసర్ కోదండరాం స్వగ్రామం. ప్రొఫెసర్‌గా ఉస్మానియా యూనివర్సిటీకి, తెలంగాణ ఉద్యమానికి అంకితమై హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నా సొంత ఊరుతో సంబంధాలు కొనసాగుతున్నాయి. సింగరేణి ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆయన జిల్లాలో గతంలో కూడా ఆందోళనలు సాగించారు. ఆయన టీజేఎస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడి ప్రకారం పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్కు ధీటుగా టీజేఎస్‌ను నిలబెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా జేఏసీకి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో కోదండరాంతో గతంలో సంబంధాలు కొనసాగించిన వారిని పార్టీలోకి తీసుకోబోతున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికీ కోదండరాంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ టిక్కెట్టు చివరి నిమిషంలో దక్కని వారు కూడా టీజేఎస్ ద్వారా రాజకీయ ప్రస్థానం సాగించాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే పార్టీ నిర్మాణ దశలో ఉన్నందున తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దనే ఆలోచనతో ఆశావహులతో పాటు పార్టీ నేతలు కనిపిస్తున్నారు. ఈనెల 13న కోదండరాం బెల్లంపల్లికి వస్తుండడంతో ఆరోజు పార్టీకి సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. మంచిర్యాల నుంచి కోదండరాం? వచ్చే ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం నుంచి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ఆయన ధ్రువీకరించడం లేదు. ఇటీవలే మంచిర్యాల, కుమురం భీం జిల్లాలకు పార్టీ ఇన్చార్జిగా గురిజాల రవీందర్రావును టీజేఎస్ నియమించింది. రవీందర్‌రావుకు మంచిర్యాల నియోజకవర్గంలో మంచి సంబంధాలు ఉండడంతో పాటు ఇక్కడి బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో కోదండరాం పోటీ చేయని పక్షంలో మంచిర్యాల నుంచి రవీందర్‌రావుకే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన కూడా సింగరేణి ఓపెన్‌కాస్ట్ భూముల సమస్యపై పోరాటం సాగిస్తున్నారు. రవీందర్రావు కుమురం భీం జిల్లాకు కూడా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నప్పటికీ, అక్కడ ప్రస్తుతానికి అంతగా ప్రభావం లేదు. చెన్నూరులో టీజెఎస్ తరుపున పొడేటి సంజీవ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బెల్లంపల్లిలో ఎన్నికల ముందు మారే సమీకరణాలను బట్టి బలమైన నాయకుడిని బరిలోకి దింపే ఆలోచనలతో ఉన్నట్లు సమాచారం. సిర్పూరులో పాల్వాయి హరీష్? సిర్పూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు పాల్వాయి హరీష్‌రావు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తన తండ్రి తరహాలోనే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలనేది ఆయన ఆలోచన. ఈ మేరకు నియోజకవర్గంలో పర్యటనలు జరుపుతున్నారు. ఇప్పటికే బెజ్జూరు, పెంచికల్‌పేట మండలాల్లో 20 రోజుల పాటు పాదయాత్రలు జరిపారు. సిర్పూరు నుంచి హరీష్‌రావును టీజేఎస్ తరుపున పోటీ చేయించే ఆలోచనతో కోదండరాం పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే హరీష్‌తో సంప్రదింపులు జరిపినప్పటికీ, ఆయన వేచిచూసే ధోరణితో ఉన్నట్లు తెలిసింది. ఆదిలాబాద్‌లో ఆశావహులు ఎక్కువే... ఆదిలాబాద్ జిల్లాలో టీజేఎస్ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది. టీజేఏసీ ఆదిలాబాద్ చైర్మన్‌గా వ్యవహరించిన దుర్గం రాజేశ్వర్ ప్రస్తుతం పార్టలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేసే ఆలోచనతో ఉన్నారు. బీజేపీలో 20 సంవత్సరాల పాటు పనిచేసిన ఆయన గతంలో పార్టీ నుంచి టిక్కెట్‌ను ఆశించినప్పటికీ భంగపడ్డారు. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి టీజేఏసీలో కీలకంగా వ్యవహరిస్తూ కోదండరాం ఉమ్మడి జిల్లాలో స్ఫూర్తి యాత్ర చేపట్టినప్పుడు ఆయన వెంట నడిచారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచే ఓ ఉపాధ్యాయ సంఘం నేత పార్టీ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. గతంలో ఇంటెలిజెన్స్‌లో పనిచేసి పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ఓ అధికారి బోథ్ నుంచి టీజేఎస్ టిక్కెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రిటైర్డ్ ఎస్పీ మెస్రం నాగోరావు టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. గతంలో ఈయన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆదిలాబాద్ లోకసభ స్థానానికి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం టీజేఎస్ తరపున ఖానాపూర్ లేదా ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి అయినా పోటీ చేయాలని ఆసక్తి కనబర్చుతున్నారు. ఖానాపూర్‌లో ఓ కీలక నేత కూడా టీజేఎస్ నుంచి పోటీకి సిద్ధపడుతున్నట్లు సమాచారం. నిర్మల్‌లో అంతంత మాత్రమే తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో కీలకపాత్ర పోషించిన వివిధ రంగాల వ్యక్తులు, నాయకులే ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరాం ప్రారంభించిన టీ జేఎస్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. నిర్మల్‌కు ఇన్చార్జిగా నియమించిన శ్రీహరి బాధ్యతలు స్వీకరించేందుకు ఇష్టపడడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో కామారెడ్డికి చెందిన గోపాల్‌శర్మకు నిర్మల్« బాధ్యతలు అప్పగించి పార్టీని జనంలోకి తీసుకెళ్లాలనే యోచనలో కోదండరాం ఉన్నట్లు సమాచారం. కాగా గతంలో జేఏసీ జిల్లా కన్వీనర్‌గా ఉన్న విజయ్‌కుమార్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో ప్రస్తుతం నేరుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీకి ప్రస్తుతం జిల్లాలో పెద్ద దిక్కుగా భైంసాకు చెందిన వైద్యుడు రామకృష్ణరెడ్డి కొనసాగుతున్నారు. ముందు నుంచీ ఆయన కోదండరాం వెంట నడుస్తున్నారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే సభ్యత్వాన్ని పెంచుకునే పనిలో పడుతున్నారు. విద్యావంతులు, పలు వర్గాలు పార్టీని ఆసక్తిగా గమనిస్తున్నాయి. పొత్తుల ఎత్తుల్లోనూ కాంగ్రెస్,టీజేఎస్‌లే కీలకం.. అధికార టీఆర్ఎస్ను గద్దె దించేందుకు విపక్షాలు ఏకతాటి పైకి వస్తే ఎన్నికల ముందు సమీకరణలు మారుతాయి. ఇప్పుడే అడుగులు వేస్తున్న టీజేఎస్‌తో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో టీడీపీతో కూడా పొత్తు పెట్టుకునే ఆలోచన కాంగ్రెస్‌కు ఉంది. ఒకవేళ ఈ మూడు పార్టీలతో పాటు కమ్యూనిస్టులు కూడా కలిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రశ్న. టీఆర్ఎస్, బీజేపీ యేతర∙ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పాటైనప్పటికీ... పది అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌లో కాంగ్రెస్, టీజేఎస్‌లే కీలకం కానున్నాయి. పొత్తులు కుదిరితే... సీపీఐ, టీడీపీకి ఒక్కో సీటు దక్కే అవకాశం ఉంది. టీజేఎస్ ఆవిర్భావ సభ దృశ్యం(ఫైల్) -
మాపార్టీ నుంచి పోటీ చేసేవారు సంప్రదించవచ్చు
హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రానున్న నేపథ్యంలో అర్హులైన వారందరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని, అలాగే మా పార్టీ నుంచి పోటీ చేసే వారు సంప్రదించవచ్చునని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. సోమాజీ గూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ..ఇప్పుడు మా ముందున్న లక్ష్యం పార్టీని బలోపేతం చేయడమేనని వ్యాఖ్యానించారు. వికాలాంగుల చట్టాన్ని సరిగ్గా అమలు చేయాలి.. అలాగే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా పార్టీకి సంబంధించి మహిళా విభాగాన్ని కూడా విస్తరిస్తామని చెప్పారు. గ్రామాలను సస్యశ్యామలం చేయడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. కేరళలో గ్రామ పంచాయతీలు బాగా పని చేస్తున్నాయని తెలిపారు. జనసమితికి అప్లికేషన్ పెట్టుకోవచ్చునని, సభ్యత్వ నమోదు చేసుకోవచ్చునని, ఆన్లైన్లో కూడా దీనికి సంబంధించిన అప్లికేషన్ ఉంచుతామని తెలిపారు. తెలంగాణ జన సమితి పార్టీ జిల్లాల ఇంఛార్జుల ఎంపిక జరుగుతోందని, పార్టీ ప్రతీ పల్లెకు చేరాలనే లక్ష్యంగా ఈ ప్రణాళిక ఉంటుందని వివరించారు. -
ప్రధాన వేదికపై వెయ్యిమంది..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభ ఆదివారం సాయంత్రం సరూర్‌నగర్ స్టేడియంలో జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికపై వెయ్యిమంది కూర్చునేవిధంగా ఏర్పాటు చేశారు. తొలివరుసలో అన్ని తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థులు కూర్చోనున్నారు. తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసుకున్న అమరుల కుటుంబసభ్యులు, బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబసభ్యులు కూడా వేదికపై కూర్చోనున్నారు. ఈ సభలో పార్టీ అధినేత కోదండరాంతోపాటు హరగోపాల్, నాగేశ్వర్ ప్రసంగించనున్నారు. -
జనగాం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కోదండరాం పోటీ..?
సాక్షి, జనగామ: తెలంగాణ ఉద్యమంలో ప్రజా సంఘాలను ఏకం చేయడంతోపాటు ఉద్యోగులు, రాజకీయ పార్టీలను సమన్వయం చేసి ముందుకు నడిచిన ప్రొఫెసర్ కోదండరాం ఇటీవల స్థాపించిన తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీ పోరుగడ్డలో జోరందుకుంది. ఉద్యమ సమయంలో కోదండరాం చూపిన పోరాట పటిమ, రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రజా సమస్యలపై ఆయన చేపడుతున్న కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తున్నట్లు తెలు స్తోంది. ఉద్యమ సంస్థగా ప్రారంభమైన జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)ని ఈనెల 2వ తేదీన ఆయన రాజకీయ పార్టీగా మార్చుతున్నట్లు ఆయన లాంఛనంగా ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ జనసమితి పేరును ప్రకటించి 4వ తేదీన పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. అయితే టీజేఏసీ ప్రస్తుతం రాజకీయ పార్టీగా రూపాంతరం చెందడంతోపాటు ప్రజలను ఆకర్షించేందుకు తమదైన శైలిలో ముందుకుసాగుతోంది. టీజేఎస్.. సామాన్య ప్రజలతోపాటు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలను ఆకర్షిస్తోంది. పోరుగడ్డలో పాగా కోసం యత్నాలు.. మార్పునకు ప్రతీకగా నిలిచే జనగామ పోరుగడ్డలో టీజేఎస్ పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఎక్కడా లేనట్లుగా జిల్లా కేంద్రంలో ప్రజలు తమ ఆకాంక్షను బలంగా వినిపించారు. తర్వాత జిల్లా సాధన ఉద్యమంలోనూ నాటి టీజేఏసీ కీలకపాత్ర పోషించింది. ఇప్పటికీ కోదండరాం జనగామలో ప్రత్యేక కేడర్‌ను కలిగి ఉన్నారు. ఇదే ఊపులో జిల్లాలో తమ సత్తాను చాటేందుకు టీజేఎస్ వ్యూహాలు రచిస్తోంది. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తిలో తమ బలాన్ని పెంచుకునేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను టీజేఎస్‌లో చేరే విధంగా స్థానిక నాయకులు సంప్రదింపులు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ముఖ్యనేతలు కోదండరాంతో నేరుగా టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసి గుర్తింపు లేకుండా ఉన్న కొందరు నాయకులు, ద్వితీయ శ్రేణి కేడర్, మండల స్థాయి నాయకులు టీజేఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. కోదండరాం పోటీపై ఒత్తిడి.. టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం రాబోయే ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని స్థానిక నాయకులు ఆయనపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానికి సమీపంలో జనగామ ఉండడంతోపాటు రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉండడం కలిసి వస్తుందని అధినేతకు నచ్చచెబుతున్నట్లు సమాచారం. జనగామను ఎంచుకుంటే రాజకీయ భవిష్యత్‌తోపాటు రాష్ట్ర రాజకీయాలపై పట్టుసాధించవచ్చని భావిస్తున్నారు. చైతన్య వంతమైన ఓటర్లు అండగా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నామని టీజేఎస్ నాయకుడు ఒకరు చెబుతున్నారు. దూకుడు పెంచిన ‘టీజేఎస్’.. ఈనెల 29వ తేదీన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో టీజేఎస్ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. సభను విజయవంతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా టీజేఎస్ శ్రేణులు గ్రామాల్లో పర్యటిస్తున్నాయి. ఈ మేరకు టీజేఎస్ జిల్లా ఇన్చార్జి సతీష్, రైతు విభాగం నాయకుడు పాతూరి మల్లారెడ్డి, విద్యార్థి నాయకులు తీగల సిద్ధూగౌడ్, ఎండీ దస్తగిరి, మహిళ విభాగం నేతలు రజని, మహంకాళి పద్మ నేతృత్వంలో మండలాల వారీగా సన్నాహాక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనగామ, రఘునాథపల్లి, లింగాలఘణపురం, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాల్లో పర్యటించి ప్రజలను సమాయత్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో టీజేఎస్ ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
జన సత్వం ..!
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ తొలిదశ ఉద్యమం జిల్లాలో చరిత్రాత్మకం. ఇదే చైతన్య స్ఫూర్తితో తెలంగాణ మలి దశ ఉద్యమంలో జిల్లాలోని యువత, ఉద్యోగులు, సంఘాలు, రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇప్పుడు ఇదే వర్గాలను ఆకర్షించేందుకు తెలంగాణ జన సమితి రాజకీయ బాట పట్టింది. నాడు ఉద్యమంలో పాల్గొన్న వర్గాలు, ప్రస్తుతం అన్ని పార్టీల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలపై ఆపార్టీ నజర్ పెట్టింది. సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఇప్పటికే జేఏసీ పలుమార్లు ప్రజా సమస్యలపై ఉద్యమించింది. అలాగే ప్రొఫెసర్ కోదండరాం కొత్తగా జిల్లా ఏర్పాటు అయిన తర్వాత పది సార్లు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో ప్రధానంగా మార్కెట్లలో ఇబ్బందులు, పంటలు పండని స్థితి పై ఆయన నేరుగా రైతులతో మాట్లాడారు. ఇలా పలు మార్లు జిల్లాలో ఆయన పర్యటించడం, కొత్తగా పార్టీ పెట్టడడంతో.. ఈ పార్టీ ఎలా ఉండబోతుందని జిల్లాలోని ఈ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే రాజధానిలో నిర్వహించే సభకు భారీ జన సమీకరణ చేసి తమ సత్తా ఏంటో చాటుతాం అంటూ ఆపార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 5 వేలకు పైగా జన సమీకరణే లక్ష్యంగా .. జిల్లాలో ఆపార్టీ నేతలు ఆవిర్భావ సభకు 5 వేలకు పైగా జన సమీకరణ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పోస్టర్లు, కరపత్రాలు, ప్రచార రథాలతో ప్రచారం నిర్వహించారు. నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేసి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తొలి నుంచి ఉద్యమంలో కోదండరాం బాటలో నడిచిన ధర్మార్జున్ హైదరాబాద్ సభకు ఉమ్మడి జిల్లానుంచి జన సమీకరణ బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. ఇక ఈ పార్టీలో సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంగా ప్రభాకర్, తండు నాగరాజు, గట్ల రవిశంకర్, కోదాడలో పందిరి నాగిరెడ్డి, చిన్ని, గంధం బంగారు, పాష, హుజూర్‌నగర్‌లో దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అంబటి నాగయ్య, ధనయ్యగౌడ్లు, తుంగతుర్తిలో పొన్నం మల్లేష్, సానాది వెంకట్‌రెడ్డి, నాగరాజులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరంతా సభను సక్సెస్ చేయాలని ఆయా నియోజకవర్గాల్లో ప్రచార బాట పట్టారు. పార్టీ ఆదేశాలతో ప్రధానంగా యువత, రైతాంగాన్ని ఎక్కువగా సభకు తరలించేందుకు సమాయత్తమవుతున్నారు. అసమ్మతి నేతలపై నజర్ .. జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల్లో అసమ్మతి నేతలపై తెలంగాణ జన సమతి దృష్టి పెట్టినట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టులు, పార్టీ పరంగా పదవులు రాని నేతలు అసమ్మతి రాగం వినిపిస్తుండడంతో వీరితో జన సమితి నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ పార్టీలకు చెందిన కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు, జిల్లా నాయకులు, కోదండరాంతో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావ సభ రోజు ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు జన సమితిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలను జన సమితిలో చేర్చుకొని పల్లెపల్లెకు ‘జన సమితి’ కార్యాచరణను ప్రకటించేలా బహిరంభ సభను వేదికగా చేస్తున్నారు. ఈ సభ ముగియగానే ముందుగా జిల్లాలోని అన్ని మండలాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో పార్టీ జెండాను ఎగుర వేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బహిరంగ సభ చైతన్య స్ఫూర్తి, రానున్న ‘మే’ డే ఉత్సవాలతో పార్టీ కార్యక్రమాలను పల్లెబాట పట్టించాలని ఆపార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే బహిరంగ సభ పైనే అన్ని పార్టీల దృష్టి నెలకొంది. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది జనం వస్తారని ఇతర పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారు. జన సమితి ఒంటరిగా పోటీ చేస్తుందా..? ఇతర పార్టీలతో కలిసి ఉద్యమిస్తుందా.. పోటీ చేస్తుందా..? సభలో పార్టీ కార్యాచరణ ఏం ఉంటుంది.. జిల్లాలో అనంతరం పరిస్థితి ఎలా ఉండబోతుందని అన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ప్రభుత్వ బాధ్యత మరిచింది..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : నాయకులు పదవుల్లోకి వచ్చేటప్పుడు రాజ్యాంగంపై ప్రమాణం చేసి తర్వాత దాని విలువలు మర్చారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కొదండరాం అన్నారు. తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభానికి ఆయన బుధవారం మహబూబ్‌నగర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రిబ్బన్‌కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల హక్కులు, కనీస బాధ్యతలను ప్రభుత్వాలు మరిచి, పూర్తిగా వాటిని కాలరాసే ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. శాంతియుతంగా సభలు ఏర్పాటు చేసుకోవడమనేది రాజ్యాంగ హక్కు, ఇందుకు 29న పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్లగా.. అనుమతి ఇవ్వాలని పేర్కొంది. అయితే జన సమితి సభ నిర్వహిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందన్న భయం పట్టకుందని, అందుకే అనుమతి ఇవ్వడం లేదన్నారు. పార్టీ ఇలా ప్రారంభం నుంచి పోరాటాలతోనే ప్రారంభం అవుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, వాస్తవాలను మాత్రమే మాట్లాడామన్నారు. ఇలా ప్రశ్నిస్తే ఎన్నో త్యాగాలు చేసి కుర్చీ అప్పజెప్పారు.. మా ఇష్టం వచ్చినట్లు పాలిస్తామన్న ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ఊరికే రాలేదు.. ఎంతోమంది తెలంగాణ బిడ్డలు అమరులయితే వచ్చింది.. వారిని స్మరించుకునేందుకు ప్రభుత్వం ఒక స్థూపం కూడా నిర్మించకపోవడం దారుణమన్నారు. అందుకు ఈ నెల 29న హైద్రాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే సభకు వచ్చే ప్రతి ఒక్కరు ఒక ఇనుప ముక్కను వెంట తీసుకురావాలని, తెచ్చిన ముక్కను కరగదీసి అక్కడే అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టులు, పైరవీల కోసమే రాజకీయాలు ఎన్నో ఏళ్ల తర్వాత కనీస న్యాయం జరుగుతుందని కళలుగన్న తెలంగాణ ప్రజలకు నాయకులు కనీస న్యాయం చేసే పరిస్థితి కనిపించడంలేదన్నారు. కాగా, కేవలం కాంట్రాక్టులు, పైరవీల కోసమే కుర్చీలు ఎక్కారని, ఎక్కడ భూ సెటిల్మెంట్లు చేయవచ్చు అనుకునే పరిస్థితి నెలకొందని విమర్శించారు. జమ్ముకాశ్మీర్‌లో బాలికలపై జరిగిన దాడి సభ్యసమాజానికి సిగ్గుచేటు అన్నారు. శ్రీరెడ్డి అనే నటికి అవకాశాలు ఇవ్వకుండా లైంగికంగా వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పంటలు పండక.. బోర్లు ఎండిపోయి.. వడగండ్ల వానపడి వేల ఎకరాళ్లో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందా? లేదా? అని ప్రశ్నించారు. అనంతరం మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రజలు తెలంగాణ ఉద్యమంలో కోదండరాం చూపిన తెగువ ఇక్కడి ప్రజలు మరిచి పోలేదని, అనుకున్న స్థాయిలో ప్రజలకు న్యాయం జరగకపోతే ప్రత్నామ్నాయ పార్టీలు అవసరమని, పార్టీ ఏర్పాటు నిర్ణయం అనేది ముందే తీసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేవలం ఒకేఒక్క కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగి పూర్తిస్థాయిలో ఉద్యోగాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో జిల్లా టీజేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, నాయకులు బాల్కిషన్, మంత్రి నర్సింహయ్య, ప్రభాకర్, ఆంజనేయులు, వెంకటస్వామి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
భైంసారూరల్: రైతు సమస్యలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తామని టీజేఏసీ నిర్మల్ జిల్లా చైర్మన్ ఆరెపల్లి విజయ్‌కుమార్ అన్నారు. గురువారం టీజేఏసీ జిల్లా కన్వీనర్ డా.ముష్కం రామకృష్ణాగౌడ్తో కలిసి తిమ్మాపూర్ గ్రామంలో రైతుల వద్దకు వెళ్లారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, బాధలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించాక కూడా రైతుల సమస్యలు తీరడం లేదన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం చేసేందుకు క్షేత్రస్థాయిలో వెళ్లి వారితో కలిసి సాదక బాధకాలు అడిగి తెలుసుకుంటున్నామన్నారు. ఈనెల 21న రైతు సదస్సు ఏర్పాటు చేస్తున్నామని, సదస్సులో నియోజకవర్గ రైతులంతా పాల్గొని సమస్యలపై చర్చించాలన్నారు. ప్రధాన సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీవీ జిల్లా కార్యదర్శి చాకెటి లస్మన్న, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జే.రాజు, జేఏసీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
‘కోదండ రాం మాకు ప్రత్యర్థి కాదు’
హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మాకు ప్రత్యర్థి కాదని, అలాగే ఆయన కాంగ్రెస్ ఏజెంట్ కాదని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా స్పష్టం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణాలో టీఆర్ఎస్తో పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని..పొత్తులకు చాలా సమయం ఉందని వ్యాఖ్యానించారు. వాటి గురించి పీసీసీ చీఫ్ స్పందిస్తారని తెలిపారు. కోదండరాం గొప్ప వ్యక్తి అని, ఆయన అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం పాత్ర ఎంతో కీలకం అని వ్యాఖ్యానించారు. గుజరాత్ మాదిరి అన్ని వర్గాలను కలుపుకుని వెళతామని, టీఆర్ఎస్ ఓడిపోతుందనే విధంగా కేటీఆర్ కామెంట్స్ ఉన్నాయంటూ పరోక్షంగా చురకలు అంటించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామని, దీనికి కోసం చాలా మందితో ఉత్తమ్ మాట్లాడుతున్నారని తెలిపారు. కేసీఆర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌తో కలిసి రావాలని, త్వరలో నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పాదయాత్రలు చేస్తామని, జూన్2న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, దానికి రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పారు. ఈ వారం టీఆర్ఎస్, టీడీపీ నుంచి పలువురు ముఖ్యులు కాంగ్రెస్‌లో చేరతారని, బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డిని వద్దని పార్టీలో ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. స్థానిక నేతలతో మాట్లాడిన తర్వాతనే ఇతర పార్టీ నేతలను చేర్చుకుంటున్నామని, ప్రవాస గల్ఫ్ ఎన్నారైలకు కాంగ్రెస్ భరోసా కల్పిస్తుందని వివరించారు. ఈ నెల 12 నుంచి కాంగ్రెస్ బృందం కువైట్‌లో పర్యటిస్తుందని, గల్ఫ్‌లో క్షమాబిక్ష (ఆమ్నెస్టీ )పథకంలో..ముప్పై వేల మంది భారతీయ కార్మికులు దేశానికి రావడానికి ఎదురుచూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుని, ఆ కార్మికులకు ఫ్రీ టికెట్ లు అందించాలని కోరారు. గల్ఫ్ ఎన్నారైల భాదలు రాష్ట్ర ప్రభుత్వానికి కనబడటం లేదన్నారు. కువైట్‌కు ప్రత్యేక అధికార బృందాన్ని పంపించి..ఎన్నారై పాలసీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
రైతులను పట్టించుకోని ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పట్టెడన్నం పెట్టే అన్నదాతల విషయంలో ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నదని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. సాగుకోసం చేసిన అప్పులను కూడా తీర్చలేక అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ‘రైతు సమస్యలు– పరిష్కారాల సదస్సు’ పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జేఏసీ నేతలు, రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సంక్షోభాలను వివరించారు. అష్టకష్టాల కోర్చి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలేక సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు నుంచి పంట చేజారిపోగానే అమాంతం రేట్లు పెరిగిపోతున్నాయన్నారు. వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం ప్రకృతి వైఫల్యం వల్ల వచ్చినది కాదని, కేవలం మానవ నిర్మితమైనదన్నారు. విత్తనాలు, ఎరువులు ఇలా ప్రతీది కల్తీమయమవుతుందని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి ఇస్తున్న ప్రోత్సాహాల మాదిరిగా వ్యవసాయరంగానికి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విధిలేని పరిస్థితుల్లో వ్యవసాయం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వ్యవసాయరంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందని వనపర్తి జిల్లా జేఏసీ చైర్మన్ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. సాగుకు పెట్టుబడి లేక ఆవులు, దూడలను పెబ్బేర్ సంతలో అమ్ముకుంటున్నారన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు ఎలాంటి గిట్టుబాటు ఉండటం లేదన్నారు. విధిలేని పరిస్థితిలో వ్యవసాయం చేస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలిందన్నారు. రైతులకు తీరని నష్టం పత్తి విత్తనాల కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్ల మోసాల వల్ల గద్వాల జిల్లా రైతులు తీవ్రంగా మోసపోతున్నారని జిల్లా జేఏసీ చైర్మన్ నాగర్‌దొడ్డి వెంకట్రాములు ఆవేదన వ్యక్తంచేశారు. 20ఏళ్లుగా చేస్తున్న వారి అక్రమాలపై రైతులే స్వయంగా నడుంబిగించి పోరాటం చేయాల్సి వచ్చిందే తప్ప, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. సీడ్పంట ద్వారా ఎకరాకు రూ.5లక్షల దిగుబడి వస్తే కేవలం రైతుకు రూ.2లక్షలు అందజేసి, మిగతా మూడు లక్షలు కంపెనీలు, సీడ్‌ఆర్గనైజర్లు కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు. తుంగభద్రనది నుంచి న్యాయబద్దంగా రావాల్సిన వాటా 15.9టీఎంసీలను ఎందు కు రాబట్టడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, వివిధ మండలాల నుంచి పెద్దసంఖ్య లో రైతులు తరలివచ్చారు. ఆత్మç ßæత్య చేసుకున్న రైతులకు సంతాప సూచకంగా మౌనం పాటించారు. క్రియాశీలకంగా టీజేఏసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవసాయరంగానికి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మహబూబ్‌నగర్ జిల్లా జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచి ఉద్యమాలలో భాగస్వామ్యం చేయడంలో జేఏసీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందన్నారు. అందులో భాగంగానే ప్రభు త్వ వాగ్దానాలు అమలుచేయాలని జేఏసీ ఒక బాధ్యతతో డిమాండ్ చేస్తోం దని అన్నారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై 45రోజుల పాటు జేఏసీ సమగ్రంగా అధ్యయనం చేసిందని, ఆ నివేదికను కేంద్ర నాయకత్వానికి అందజేశామన్నారు. ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సదస్సులో ఒక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. -
'పవన్ గురించి మాట్లాడి నా స్థాయి తగ్గించుకోలేను'
సాక్షి, కరీంనగర్ : జనసేన పార్టీ నేత, హీరో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. పవన్ యాత్రపై ఆయనను స్పందన కోరగా పై విధంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమకారులను పక్కకు నెట్టేసి ద్రోహులను తన దగ్గరకు చేర్చుకున్న ప్రభుత్వం గురించి ప్రజలకు అర్థమైందని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ చెప్పారు. ప్రాంతీయ వనరులను సమకూర్చుకుని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నామని, కానీ కేసీఆర్ ప్రభుత్వ చర్యలు మాత్రం ఆంధ్రా వాళ్లకు లాభం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా టీజేఏసీ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున ఎంపిక చేసి రైతు సమస్యలపై అధ్యయనం చేశామని, జిల్లాల్లో సేకరించిన సమాచారాన్నంతా ఈ నెల (జనవరి) 31 లోగా క్రోడీకరిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి కార్యాచరణను రూపొందిస్తామని కోదండరాం వెల్లడించారు. -
శత్రువులు మిత్రులయ్యారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా నేపథ్యంలో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలవడం, ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తడంపై టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. నిన్నటి వరకు తిట్టుకున్న పవన్ కల్యాణ్, కేసీఆర్‌లను చూస్తుంటే శత్రువులు ఆప్తులైనట్లుగా, ఆప్తులు శత్రువులైనట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే వారిలో నిలకడలేదని విమర్శించారు. మంగళవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ విషయంలో గతంతో పోలిస్తే మార్పులేవీ జరగలేదని కోదండరాం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను ఎక్కువగా కొంటోందని, దీనివల్ల స్థానికంగా ఉత్పత్తి తగ్గిపోతోందన్నారు. బహిరంగ మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు చేపడుతున్నదంటే దాని వెనుక ఏదో మతలబు దాగి ఉందని కోదండరాం ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేస్తుండటం వల్ల కరెంటు అవసరంలేని సమయంలోనూ విద్యుత్ లైన్లకు డబ్బులు కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. దీంతో రానున్న రోజుల్లో రాష్ట్ర విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అంతకుముందు కోదండరాం నేతృత్వంలోని బృందం మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలిసింది. కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్నే పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. అలాగే ఏపీలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన 4వ తరగతి ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని, ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఆర్టీ)లో 50% మార్కుల విధానాన్ని ఎత్తేసి పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని కోరింది. -
కోదండరాంది పదవుల తండ్లాట:బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ కొలువుల కొట్లాట సభ నిర్వహించిన జేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కోదండరాం నిర్వహించింది కొలువుల కొట్లాట సభ కాదు.. తనకు పదవి కోసం జరిపిన తండ్లాట సభ అని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. కోదండరాం కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని, ఆ పార్టీతో ఆయన చీకటి ఒప్పందం చేసుకున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. నిరుద్యోగులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖాళీల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన ‘కొలువులకై కొట్లాట’ సభలో కోదండరాం.. నేరుగా టీఆర్ఎస్ను, ముఖ్యమంత్రిని సంబోధిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘కాంట్రాక్టులు ఇప్పించి కమీషన్లు తీసుకోవడంపై దృష్టిపెడుతున్నారు. భూముల్ని ఎవరికి కట్టబెడదామా.. ఇసుక కాంట్రాక్టులు ఎవరికి ఇప్పించుకుందామా అన్నవే ముఖ్యమంత్రికి ప్రధానమయ్యాయి. కాంట్రాక్లర్ల మేలు కోసమే నిరుద్యోగుల జీవితాలను బలి పెడుతున్నారు. నిరుద్యోగుల సమస్య ఈ ప్రభుత్వానికి అప్రధానమైపోయింది’’ అని కోదండరాం విమర్శించారు. -
‘కొలువుల కొట్లాట’పై రేపు హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: 'కొలువులకై కొట్లాట' సభకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. తెలంగాణ జేఏసీ నేతలు సరూర్‌నగర్ ఎల్బీ స్టేడియంలో ఈ నెల 30 న నిర్వహించ తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గతంలో ఈ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చినా తేదీని మార్చుకోవాలని పోలీసులు అంటున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది రచనారెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల 30 న అంతర్జాతీయ వ్యాపార సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్ వస్తున్న సందర్భంగా కొలువుల కొట్లాట సభకు భద్రత కల్పించ లేమని ప్రభుత్వం తరపు న్యాయవాది శరత్ కోర్టుకు తెలిపారు. 30 వ తేదీన కాకుండా డిసెంబర్ 6 తర్వాత మరో తేదీ కోరితే అనుమతి ఇస్తామన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. -
ప్రభుత్వ నియంతృత్వంతోనే కోర్టుకు: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ, చట్ట వ్యతిరేక విధానాలపై కోర్టుకు వెళ్లకతప్పడం లేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ ఏర్పాటు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజానుకూలంగా, రాజ్యాంగానికి లోబడి పాలన ఉంటే కోర్టులో పోరాడాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకుంటుందన్నారు. అన్ని శాఖల్లోనూ జేఏసీలు ఏర్పాటు కావాల్సిన అవసరముందన్నారు. న్యాయ, చట్ట, రాజ్యాంగపరమైన అంశాలపై అడ్వొకేట్లకు ఉన్న అవగాహన మరెవరికీ ఉండదన్నారు. తెలంగాణలో హైకోర్టును ఏర్పాటు చేయాలి తెలంగాణలో హైకోర్టును ఏర్పాటు చేయాలని అడ్వొకేట్స్ జేఏసీ తీర్మానించింది. దీంతోపాటు సీఆర్పీసీ 41ని రద్దు చేయాలని, న్యాయశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరింది. న్యాయవాదులకు హెల్త్ కార్డులు, ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగానే అడ్వొకేట్స్ జేఏసీ కన్వీనర్లుగా గోపాలశర్మ, కొండారెడ్డి, మల్లేశ్ ఎన్నికయ్యారు. కో కన్వీనర్లుగా మహమూద్, హస్మ రహీమా, బాబురావు, అంబటి శ్రీనివాస్, ధర్మార్జున్, ప్రసాద్ బాబు, ఉదయగిరి, వెంకటేశ్ యాదవ్, భాగ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
నక్సల్స్, కాంగ్రెస్‌తో కోదండరాం కుమ్మక్కు
స్టేషన్ మహబూబ్‌నగర్: టీజేఏసీ చైర్మన్ కోదండరాం నక్సలైట్లు, కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కై ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. జేఏసీ నుంచి అందరూ వెళ్లిపోతున్నారని, అసలు జేఏసీ ఉందా అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ‘తొలి తెలంగాణం’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ‘‘జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారని కోదండరాం నా ఇంటికి వచ్చి చెప్పారు. పోలీసుల అనుమతితోనే యాత్రలు చేయాలని ఆయనకు సూచించా’’అని తెలిపారు. రాష్ట్రంలో అరాచక శక్తులకు స్థానం లేదని, అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని నాయిని దుయ్యబట్టారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమరవీరుల స్ఫూర్తి యాత్ర భగ్నం..
-
అమరవీరుల స్ఫూర్తి యాత్ర భగ్నం.. కోదండరాం అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో అమరవీరుల స్ఫూర్తి యాత్రకు బయలుదేరిన టీజేఏసీ ఛైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరో విడుత అమరుల స్ఫూర్తి యాత్రలో పాల్గొనడానికి జనగామ వెళుతున్న జేఏసీ చైర్మెన్‌ను.. హైదరాబాద్ శివారు ఘట్కేసర్ జోడిమెట్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను కీసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోదండరాం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. హోం మంత్రిని కలిసిన అనంతరం జేఏసీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమరవీరుల స్ఫూర్తి యాత్ర కొనసాగిస్తామని అన్నారు. దీనిపై ప్రభుత్వ స్పందన ఆశాజనకంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరో విడత అమరవీరుల స్ఫూర్తి యాత్రను టీజేఏసీ శనివారం వరంగల్, జనగాం జిల్లాల్లో నిర్వహించతలపెట్టింది. ఇందుకుగాను సర్కారును అనుమతి కూడా కోరింది. అయితే యాత్రకు అనుమతి ఇచ్చే అంశంపై ఎటూ తేల్చని పోలీసులు.. ఆయా జిల్లాల్లో టీజేఏసీ నేతలను అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల తీరుపై మండిపడిన కోదండరామ్ ఉదయం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఆయన స్పందన సరిగా లేదని, అయినా యాత్రను కొనసాగించి తీరుతామని కోదండరామ్ స్పష్టం చేశారు. జనగామలో ఉద్రిక్తత జనగామ: అమరుల స్ఫూర్తి యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆరో విడత అమరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా శనివారం జనగామ జిల్లా కేంద్రంలో జరుగనున్న కోదండరాం పర్యటన నేపథ్యంలో తెల్లవారుజామునే స్థానిక జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీజేఏసీ జిల్లా చైర్మన్ ఆకుల సతీష్ తో పాటు మరో 20మందిని అదుపులోకి తీసుకొని.. బచ్చన్నపేట, జనగామ, లింగాలఘన్పూర్, రఘునాధపల్లి, స్టేషన్ ఘన్ పూర్ పోలీస్టేషన్లకు తరలించారు. టీ జేఏసీ నేతల ముందస్తు అరెస్ట్ ఫై ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ఫూర్తి యాత్రకు నాలుగు రోజుల ముందే అనుమతి కోరినా.. అక్రమ అరెస్ట్‌లు చేయడం ప్రభుత్వ దమన కాండకు నిదర్శనమని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేఏసీ నాయకుల అరెస్ట్ తో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు జిల్లా వ్యాప్తంగా బందోబస్తు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12గంటలకు కోదండరాం జనగామకు చేరుకుంటారని జేఏసీ నాయకులు చెబుతున్నారు. -
ఆ జీవోలను ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల అధికారాలను, రైతులకు భూమిపై హక్కును హరించేవిధంగా ఉన్న 39, 42 జీవోలను ఉపసంహరించుకోవాలని అఖిలపక్షాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ రైతు జేఏసీ హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన సదస్సుకు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(టీపీసీసీ అధ్యక్షుడు), ఎం.కోదండరాం(టీజేఏసీ చైర్మన్), వెంకటరెడ్డి(సీపీఐ), గోలి మధుసూ దన్‌రెడ్డి(బీజేపీ), రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టీడీపీ), కె.గోవర్ధన్ (న్యూ డెమొక్రసీ), రచనారెడ్డి(హైకోర్టు న్యాయవాది), వివిధ రైతు సంఘాల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల హక్కులను కాలరాసేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘రాష్ట్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అబ్బ సొత్తు, జాగీరు కాదు’ అని అన్నారు. భూవివా దాల్లో రైతు సమన్వయ సమితులు ఎలా జోక్యం చేసుకుంటాయని ప్రశ్నించారు. భూ రికార్డుల సవరణకు అధికారం ఇవ్వడం వల్ల రైతుల భూములకు రక్షణ లేకుండా పోతుం దన్నారు. స్థానికసంస్థల అధికారాల కోసం అక్టోబర్ 3న అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్ర మాలు చేపడతామని చెప్పారు. పట్టాదారులతో పాటు కౌలు రైతులందరికీ పెట్టుబడి కోసం రూ.4 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం 1,000 కోట్లు కేటాయిస్తామని హామీ నిచ్చి అమలు చేయలేదని ఉత్తమ్ విమర్శిం చారు. కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామపంచాయతీ వ్యవస్థకు తూట్లు పొడిచే కుట్ర చేస్తున్నదని విమర్శించారు. గ్రామ పెత్తం దార్లకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందని, మళ్లీ పటేల్, పట్వారీ వ్యవస్థలకు జీవంపోసి, వాటి ద్వారా గ్రామాల్లో దొరల పాలన తీసుకురావాలని కుట్రలు చేస్తు న్నారని విమర్శించారు. జీవో 39కి వ్యతిరేకంగా అక్టోబర్ 3న గ్రామ స్థానిక సంస్థల అధికారాల కోసం వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తామన్నారు. భూసమస్యను పరిష్కా రంæచేయాలంటే సమగ్ర భూసర్వే చేపట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు. రావుల చంద్రశే ఖర్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతుసమన్వయ సమితి పేరుతో స్థానిక సంస్థల అధికారాలను హరించే కుట్రకు దిగుతున్నారని విమర్శించారు. ప్రజల సమ స్యల నుంచి దృష్టిని మళ్లించడానికి కొత్త సమస్యలను తెరమీదకు తెస్తున్నారని ఆరోపించారు. భూరికార్డుల సవరణ పేరుతో రెవెన్యూశాఖ ఆధీనంలో ఉండే భూములను టీఆర్ఎస్ కార్యకర్తల చేతుల్లో పెట్టే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ సమస్యలపై గవర్నరుకు ఫిర్యాదు చేసినా పట్టిం చుకోలేదన్నారు. భూరికార్డుల ప్రక్షాళన కార్య క్రమానికి గవర్నర్ వెళ్లడాన్ని ఖండించారు. -
జీవో 39తో మళ్లీ పెత్తందారీ వ్యవస్థ
► ప్రస్తుత వ్యవస్థలనే బలోపేతం చేయాలి: కోదండరాం ► అక్టోబర్ రెండో వారంలో నిరుద్యోగ సభ ► పార్టీ కోసం ఒత్తిడి ఉన్నా నిర్ణయం తీసుకోలేదు సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితుల్లాంటి సమాంతర వ్యవస్థతో మేలుకన్నా హాని ఎక్కువని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. సమన్వయ సమితుల కోసం ఇచ్చిన జీవో 39లో లొసుగులున్నాయని, మళ్లీ పెత్తందారీ వ్యవస్థను తీసుకొచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. రైతు సమన్యయ సమితులతో కౌలు రైతుల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. రైతు సమితులను కేవలం అధికార పార్టీ కార్యకర్తలతో నామినేషన్ పద్ధతిలో నింపే ప్రమాదముందని, వీటి వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ మరింత బలహీనమయ్యే ముప్పుందని హెచ్చరించారు. సమగ్ర రైతాంగ విధానాన్ని ప్రకటించి, ప్రస్తుత వ్యవస్థలనే బలోపేతం చేయాలని కోరారు. నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి.. ఉద్యోగ, ఉపాధి కల్పనలో దాటవేత ధోరణిని కోదండరాం తీవ్రంగా ఖండిం చారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లోని 2 లక్షల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కేలండర్‌ను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో భూమి పుత్రులకు రిజర్వేషన్లు, కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే విషయమై అక్టోబర్ రెండో వారంలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ విలీన దినంగా సెప్టెంబర్ 17 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సెప్టెంబర్ 9 నుంచి 12 వరకు ఐదో దశ స్ఫూర్తి యాత్రను విజయవంతం చేయాలని కోదండరాం కోరారు. జేఏసీ నిర్మాణాన్ని మండల, గ్రామ స్థాయికి విస్తరిస్తామని, ప్రతినెలా జిల్లా కమిటీల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినంగా రాష్ట్రవ్యాప్తంగా పాటిస్తామన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ, చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి పెన్షన్ మం జూరు చేయాలని, దీనిపై ఈ నెలలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. గాయకుడు ఏపూరి సోమన్నపై పోలీసుల నిర్బంధం అప్రజాస్వామికమన్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఒత్తిడి ఉన్న మాట నిజమేనని.. ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరికైనా కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమని కోదండరాం వ్యాఖ్యానించారు. -
తొలుత అనుమతి.. తర్వాత నిరాకరణ
కేయూలో చెట్టు కిందే మాట్లాడిన కోదండరాం కేయూ క్యాంపస్: కాక తీయ యూనివర్సిటీ లో ఇస్లామిక్ స్టూడెంట్ ఆర్గనై జేషన్ (ఐఎస్ వో)మ ఆధ్వర్యంలో శని వారం ‘రిజెక్టింగ్ విక్టిమ్ హుడ్, రిక్లైమింగ్ డిగ్నిటీ ఆఫ్ అగనెస్ట్ హేట్’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశ నిర్వాహణకు అధికారులు తొలుత అనుమతి ఇచ్చి తర్వాత నిరాకరించారు. సమావేశానికి వచ్చిన జేఏసీ చైర్మన్ కోదండరాం తిరిగి వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా పలువురు ఆపి ఇక్కడే మాట్లాడాలని పట్టుబట్టారు. ఆయనను చెట్టు కిందకు తీసుకొచ్చి గొడుగు పట్టారు. అందరికీ సమాన విలువలు అందించేలా రాజ్యాంగాన్ని అమలు పర్చాల్సిన అవసరం ఉందని కోదండరాం అన్నారు. హ్యూమన్ డిగ్నిటీపై చర్చిం చేందుకు అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. -
వాక్ స్వాతంత్ర్య హక్కును అణగదొక్కుతున్నారు
-
స్ఫూర్తి యాత్ర టెన్షన్.. టెన్షన్
-
స్ఫూర్తి యాత్ర టెన్షన్.. టెన్షన్
కోదండరాంను అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ► భిక్కనూరులో అరెస్టు.. సాయంత్రం హైదరాబాద్‌కు తరలింపు ► కామారెడ్డిలో జేఏసీ వేదిక వద్ద రణరంగం ► అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే అడ్డంకులు: కోదండరాం ► నేడు మళ్లీ యాత్ర కొనసాగిస్తానని స్పష్టీకరణ సాక్షి, కామారెడ్డి/భిక్కనూరు: టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చేపట్టిన అమరుల స్ఫూర్తి యాత్రను టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పలుచోట్ల ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి కోదండరాం నాలుగో విడత స్ఫూర్తి యాత్రను ప్రారంభించారు. అక్కడ్నుంచి కామారెడ్డి జిల్లా సరిహద్దు గ్రామమైన బస్వాపూర్ వద్దకు యాత్ర చేరుకోగానే అధికార పార్టీ నేతలు అడ్డు తగిలారు. అక్కడ్నుంచి కోదండరాంను పోలీసులు ముందుకు పంపించగా భిక్కనూరు మండల కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడిన తర్వాత కామారెడ్డి వైపు వెళ్లేందుకు సిద్ధమవగా పోలీసులు కోదండరాంతోపాటు జేఏసీ నేతలను అరెస్టు చేసి భిక్కనూరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. సాయంత్రం 4 గంటల తర్వాత కోదండరాంను బలవంతంగా జీపులో ఎక్కించి హైదరాబాద్ తరలించారు. టెంట్ కూల్చివేత.. కామారెడ్డి మున్సిపాలిటీ ఎదుట జేఏసీ తలపెట్టిన సభావేదిక రణరంగమైంది. వేదిక వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ జేఏసీ నేతలపై దాడికి దిగారు. కొందరు వేదిక టెంట్ కూల్చివేయగా, మరికొందరు విద్యార్థి నాయకులను పట్టుకుని చితకబాదారు. ఇందులో పలువురు నాయకులతోపాటు ఓ టీఆర్ఎస్ కార్యకర్తకు గాయాలయ్యాయి. టీఆర్ఎస్ నేతల తీరును నిరసిస్తూ విద్యార్థి నాయకులు స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఇక్కడ కూడా టీఆర్ఎస్ నేతలు వారిపై దాడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘర్షణకు సంబంధించి పోలీసులు 30 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో జేఏసీ, విద్యార్థి నేతలు 15 మంది, టీఆర్ఎస్ నేతలు 15 మంది ఉన్నారు. సీపీఐ ఖండన టీజేఏసీ స్ఫూర్తి యాత్రను టీఆర్ఎస్ అడ్డుకోవడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ–ఎంఎల్ న్యూ డెమో క్రసీ కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్రావు ఖండించారు. ఇలాంటి నియంతృత్వ పోక డలు మంచివి కావని చాడ హెచ్చరించారు. అడ్డుకుంటే టీఆర్ఎస్కే ముప్పు: కోదండరాం దాడులకు భయపడేది లేదని, శనివారం కామారెడ్డి జిల్లాలో తన యాత్ర కొనసాగుతుందని టీజేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టంచేశారు. యాత్రకు అడ్డంకులు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డిలో టీఆర్ఎస్ నేతలు యాత్రకు అడ్డుపడుతున్న సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందన్నారు. దాడికి గురైన వారినే అరెస్టు చేయడం, హైదరాబాద్ దాకా తీసుకురావడం అన్యాయమన్నారు. ఇలాంటి అప్ర జాస్వామిక వ్యవహార శైలి టీఆర్ఎస్కే ముప్పు అని హెచ్చరించారు. అంతకుముందు ఆయన భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నానన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ నేతలు యాత్రను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బాన్సువాడలో జరిగిన మంజీర ఇసుక అవినీతిని ప్రశ్నిస్తానని మంత్రి పోచారం, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కోట్ల రూపాయల అవినీతిని ప్రశ్నిస్తానని ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి, కామారెడ్డిలో భూ దందాలు, అక్రమాలపై ప్రశ్నిస్తానని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌లు భయపడి టీఆర్ఎస్ గుండాలతో దాడులు చేయించారన్నారు. సీఎం ప్రారంభించిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. రీ ఇంజనీరింగ్ అని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పినదాంట్లో ఈ ప్రాజెక్టు లేదని, ఇది పాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమా లేదా కొత్త ప్రాజెక్టా అని ప్రశ్నించారు. -
అభివృద్ధిలో నంబర్ వన్ అయితే..
► ప్రజా సమస్యలు ఎందుకు పరిష్కారమైతలేవు..? ► ‘అమరుల స్ఫూర్తియాత్ర’ బహిరంగ సభలో కోదండరాం గజ్వేల్: ‘అభివృద్ధిలో రాష్ట్రం నంబర్ వన్ అంటూ గొప్పలు చెప్పుకుంటుండ్రు.. కానీ ప్రజాభివృద్ధి మాత్రం జీరోలో ఉన్న విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అభి వృద్ధిలో నంబర్ వన్ అయితే ప్రజల సమస్యలు ఎందుకు పరిష్కారం కావు’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరగాలనే లక్ష్యంతోనే పోరాటం చేస్తున్నామన్నారు. మూడో విడత అమరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా ఆది వారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం వంటి మామిడి, ములుగు, వర్గల్ మండలం గౌరారం గ్రామాల్లో కోదండరాం రోడ్‌షోలు నిర్వహించారు. గజ్వేల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంద న్నారు. సొంత రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు ప్రజలకు దక్కుతాయని ఆశిస్తే పరిస్థితి భిన్నంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం లేదని, చిన్న పరిశ్రమలను బతికించే విధానం రాలేదని వాపోయారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామంటూ ప్రకటనలు గుప్పించిన ప్రభుత్వం.. పంపిణీ చేసిన భూమి కంటే గుంజుకున్నదే ఎన్నో రెట్లు ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్లోనే ఎన్నో సమస్యలు తిష్ట వేశాయన్నారు. కొండపోచమ్మసాగర్ నిర్మాణంలో పెద్దోళ్ల భూములొదిలేసి పేదోళ్ల భూములనే లాక్కుంటున్నారని ఆరోపించారు. -
ప్రభుత్వానిది ఒంటెద్దు పోకడ
హైదరాబాద్: ప్రభుత్వం జోన్ల వ్యవస్థ రద్దు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఓయూలో ‘స్థానిక రిజర్వేషన్లు-జోనల్ వ్యవస్థ’పై విద్యార్థి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడుతూ.. జోన్ల వ్యవస్థ పై నిపుణుల స్థాయి కమిటీ వేయాలని కోరారు. యువజన, విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు చేయాలన్నారు. ప్రజా సమస్యలు ప్రభుత్వం వినటము లేదని, ఒంటెద్దు పోకడ పోతుందని విమర్శించారు. -
రైతులకు బేడీలు వేసినా ప్రశ్నించొద్దా?
► ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలు– మూడేళ్ల పాలన’పై చర్చాగోష్టి ► ప్రభుత్వాన్ని నిలదీసిన వక్తలు సాక్షి, హైదరాబాద్: రైతులకు బేడీలు వేసినా ఎవరూ ప్రశ్నించకూడదా అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలు–మూడేళ్ల పాలన’ అంశంపై వాయిస్ ఫౌండేషన్ శనివారం చర్చాగోష్టిని నిర్వహించింది. మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ గోష్టిలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు, మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి, టీడీపీనేతలు ఎ.ఉమా మాధవరెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, కత్తి వెంకటస్వామి, విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, దరువు ఎల్లయ్య తదితరులు ప్రసంగించారు. అప్రజాస్వామికంగా పాలన: రామచందర్‌రావు రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుసున్నది. అప్పులతో ప్రజలపై శాశ్వతంగా పెనుభారాన్ని మోపుతున్నారు. సీఎం కేసీఆర్ పాలనావైఫల్యాల గురించి మాట్లాడితే కేంద్రంపై నెడుతున్నారు. ప్రజల గొంతు నొక్కొద్దు: దినేష్‌రెడ్డి ఉద్యమాలతో సాధించిన తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు ఇప్పుడెందుకు అదే ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించడంలేదు? ఇందిరాపార్కువద్ద ధర్నాలు ప్రజల హక్కు. దానిని హైదరాబాద్ బయటకు పం పించాలనే నిర్ణయం ప్రజల గొంతును నొక్కడమే. కేసీఆర్ కుటుంబంకోసమేనా: దిలీప్‌కుమార్ రాష్ట్రం కేవలం కేసీఆర్ కుటుంబంకోసమే అన్నట్టుగా ఉంది. ప్రజాస్వామిక పరిపాలన, మంత్రులకు అధికారం, ప్రజా సమస్యల పరిష్కారం వంటివేమీ లేవు. ధనిక రాష్ట్రంలో అభివృద్ధి ఏమీలేకపోగా మూడేళ్లు కాకముందే అప్పులు రెట్టింపు చేశారు. రాష్ట్రాన్ని పోలీసురాజ్యంగా మార్చారు. ప్రజల గొంత నొక్కలేరు: ఉమామాధవరెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించడం లేదు. ఒక్క ఎర్రవల్లిలో కడితే రాష్ట్రమంతా పూర్తిచేసినట్టా? ధర్నాచౌక్‌ను తీసేసి ప్రజల గొంతును నొక్కాల నుకుంటే సాధ్యంకాదు. రాచరిక పాలన వస్తదనుకోలేదు: అద్దంకి దయాకర్ తెలంగాణ వస్తే ప్రశ్నించే సత్తాను కోల్పోతామను కోలేదు. ఇలాంటి రాచరిక పాలన వస్తుందనుకో లేదు. సీఎం కేసీఆర్ పక్కన దొంగలను పెట్టుకుని రైతులకు బేడీలు వేస్తారా? ఆందోళనతోనే పరిష్కారం: రామయ్య ప్రజల ఆందోళనలు లేకుండా సమస్యలు పరి ష్కారం అవుతాయని నేను అనుకోవడంలేదు. నేను ఏ రాజకీయపార్టీకి చెందినవాడిని కాదు. ధర్నాచౌక్ విషయంలో ప్రభుత్వమే ప్రజాస్వామికంగా వ్యవ హరించాలి. ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలేదు: కోదండరాం వలసాంధ్రంపాలన పోయి తెలంగాణ పాలన వస్తే అభివృద్ధి జరుగుతుందని, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయని అనుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో కుల మత వర్గ రహితంగా జరిగిన ఐక్య పోరాటాల స్ఫూర్తిగా నీళ్లు, నియామకాలు వస్తాయనుకున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ డిమాండ్లను గుర్తించడం లేదు. అధికారంలో ఉన్నవాళ్లు ఏం చేసినా ఇతరులు ప్రశ్నించొద్దు అనే అప్రజాస్వామిక ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఇంకా పదిసార్లు మా ఇంటి తలుపులు బద్దలు కొట్టినా ప్రజాస్వామిక నిర్మాణంలో ముందుంటా. రేవంత్‌ను చూస్తే కేసీఆర్ ప్యాంటు తడిసిపోతోంది: కె.నారాయణ తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనికిమాలినవాడైన కె.చంద్రశేఖర్‌రావు కావడం ప్రజల దురదృష్టం. టీడీపీతో పాటు ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ మంత్రి వర్గంలో చేర్చుకున్న దివాళాకోరు. ముక్కు మూరెడు ఉన్నా, మనిషి బారెడున్నా సీఎం కేసీఆర్‌కు లోపల భయం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని చూస్తే సీఎం కేసీఆర్‌కు ఎందుకో ప్యాంటు తడుస్తున్నది. -
కొత్త రాష్ట్రంలో 2700 మంది రైతుల ఆత్మహత్యలు
-
కొత్త రాష్ట్రంలో 2700 మంది రైతుల ఆత్మహత్యలు: కోదండరాం
తెలంగాణ రైతాంగం సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, కొత్త రాష్ట్రంలో 2700 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలోనే రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ 2స్థానంలో ఉందని వెల్లడించారు. రైతుల సమస్యలపై పోరాడేందుకు 24 మందితో రైతు జేఏసీ తాత్కాలిక కమిటీని నియమించామని, అందులో తాను కూడా ఒక సభ్యుడినని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. ఆయన మంగళవారం నాడు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని జిల్లాల కమిటీలను ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను ప్రభుత్వం లాక్కుంటున్నదని విమర్శించారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏ మార్పూ లేదన్నారు. పంట ధరల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. గొర్రెలను ఇస్తున్నారు కానీ వాటికి వైద్యం అందించేందుకు వెటర్నరీ ఆసుపత్రులను మెరుగుపరుస్తున్పారా అని ఆయన ప్రశ్నించారు. రైతులకు లాభసాటి ధర లభించేలా కర్ణాటక తరహాలో ఒక నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
అనుభవించుదాం ఇగ..
⇒ జేఏసీ నేత పిట్టల సంభాషణ? ⇒ కలకలం సృష్టిస్తున్న ఆడియో రికార్డ్ ⇒ బయటపెట్టిన జేఏసీ నేత బియ్యంకర్ సాక్షి, సిరిసిల్ల: ‘కొట్లాడి తెలంగాణ తెచ్చాం.. అనుభవించుదాం ఇగ.. ఎన్నిరోజులు పని చేసినా గింతే.. గోడకు కొట్టిన పిడకల్లెక్క ఇంతే.. వాడొక్కడే అనుభవించుడా.. మనం అనుభవించొద్దా.. ఇంకా కొట్లాడుడేనా.. మన జీవితాలు మనం చూసుకుందాం.. నీ ఎనుక నేనున్నా.. రేపు మీటింగ్‌కు రా.. రూ.2 లక్షలు ఇస్తా’అంటూ జేఏసీ నేత పిట్టల రవీందర్ మాట్లాడినట్లుగా చెబుతున్న రికార్డులు సంచ లనం సృష్టిస్తున్నాయి. జేఏసీ చైర్మన్ కోదండ రాంతో విభేదించి తిరుగుబాటు చేసిన జేఏసీ నేత పిట్టల రవీందర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ కో కన్వీనర్ బియ్యంకర్ శ్రీనివాస్‌తో జరిపిన సంభాషణలు శుక్రవారం వెలుగు చూశాయి. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రాంకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలంటూ బియ్యంకర్ను రవీందర్ ఆహ్వానించే క్రమం లో ప్రలోభాలకు గురిచేయడం కలకలం సృష్టిస్తోంది. వ్యాపారం చేసుకోవడానికి, జీవితంలో స్థిరపడడానికి రూ.2 లక్షలు వడ్డీ లేకుండా చేబదులుగా ఇస్తానని, మీటింగ్‌కు రావాలంటూ శ్రీనివాస్‌ను మచ్చిక చేసు కునేందుకు యత్నించారు. ఆడియో రికార్డు బయటపెట్టిన బియ్యంకర్ పిట్టల రవీందర్ తనతో మాట్లాడిన సంభాష ణల ఆడియో రికార్డును బియ్యంకర్ బయట పెట్టారు. హైదరాబాద్ సమావేశానికి ముందు తనతో మాట్లాడుతూ రూ.2 లక్షలు ఇస్తానం టూ ప్రలోభపెట్టారనే రికార్డును గురువారం రాత్రి జేఏసీ పెద్దలకు శ్రీనివాస్ పంపించారు. శుక్రవారం మీడియాకు రికార్డు లీక్ కావడం సంచలనం సృష్టించింది. జేఏసీపై కుట్ర జరు గుతోందంటున్న కోదండరాం వ్యాఖ్యలకు ఆడియో రికార్డు బలం చేకూర్చినట్లయింది. పిట్టల తప్పు చేస్తుండు: బియ్యంకర్ జేఏసీలో రవీందర్ కోవర్ట్‌గా మారాడు. ఆయనే తప్పులు చేస్తూ జేఏసీపై నిందలు వేస్తున్నడు. హైదరాబాద్ సమావేశానికి ముం దురోజు ఉదయం నాకు ఫోన్ చేసిండు. వేము లవాడకు చెందిన జేఏసీ నాయకుడు కనుక య్యతో కలసి నన్ను రమ్మన్నడు. రాజకీయ పార్టీలతో కలిసే జేఏసీ ఏర్పడింది. తెలంగాణ వచ్చింది. ఇప్పుడు రాజకీయ పార్టీలతో కలవడమెందుకంటున్నడు. మేం మాత్రం కోదండరాం నాయకత్వంలోనే పనిచేస్తాం. -
కోదండరామ్‌ది ఫ్యూడల్ స్వభావం
⇒ టీజేఏసీ నేతలు రవీందర్, ప్రహ్లాద్, సుల్తానా విమర్శలు ⇒ ఆయన ఒక్కడి వల్లే జేఏసీకి ఇంత పేరు రాలేదు ⇒ టీజేఏసీ నుంచి తప్పుకొన్నాకే పార్టీ గురించి మాట్లాడాలంటూ లేఖ సాక్షి, హైదరాబాద్: కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నపుడు టీజేఏసీ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగాక ఆ విషయా లను ప్రస్తావించాలని కోదండరామ్‌కు టీజేఏసీ నేతలు పిట్టల రవీందర్, నల్లపు ప్రహ్లాద్, తన్వీర్ సుల్తానా సూచించారు. ఆమ్ ఆద్మీ తరహాలో రాష్ట్రంలో ఒక పార్టీ అవసరమని కోదండరామ్ అంటున్నారని.. ఇలా మాట్లా డటం టీజేఏసీ నిర్ణయాలకు విరుద్ధమని అన్నారు. ఈ మేరకు వారు బుధవారం కోదం డరామ్కు ఒక లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని హైదరాబాద్‌లో మీడియాకు విడుదల చేసి, మాట్లాడారు. అంబేడ్కర్ ఆశయాల మేరకు, సామాజిక సమన్యాయ సాధన దిశగా కృషి చేస్తామని టీజేఏసీ విస్తృతస్థాయి సమా వేశంలో ప్రకటించి ఏడాది గడిచినా ఒక్కసారీ ఆ కార్యాచరణపై చర్చించలేదని వారన్నారు. ఆయా అంశాలపై టీజేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీలోచర్చించి తెలంగాణ సమాజానికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. టీజేఏసీ రాజకీయ పార్టీగా మారదు టీజేఏసీ ప్రజా సంఘంగానే ఉంటుందని, రాజకీయ పార్టీగా మారదని.. దీనిపై గతంలో తీర్మానం కూడా చేశారని నేతలు గుర్తు చేశా రు. జేఏసీలో రాజకీయ పార్టీలను చేర్చుకోమని, రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయమని కూడా నిర్ణయించామని పేర్కొ న్నారు. కానీ కోదండ రామ్ చేస్తున్న ప్రకటన లు, ఉపన్యా సాలు, అభిప్రాయాలు అందు కు విరుద్ధంగా ఉంటు న్నాయని వ్యాఖ్యానిం చారు. సమష్టి కృషి, అనేక త్యాగాలు చేసిన ఫలితంగా టీ జేఏసీ పట్ల తెలంగాణ సమా జంలో విశ్వాసం వ్యక్తమవుతోందని, అది కోదండరామ్ ఒక్కరి వల్ల వచ్చింది కాదన్నారు. కోదండరామ్ పొందుతున్న కీర్తి అంతా ఆయనను తాము చైర్మన్‌గా ఆమోదించడం వల్ల వచ్చిందేనన్న వాస్తవాన్ని గుర్తించడం లేదన్నారు. కోదండరామ్ వల్లే అందరికీ గుర్తింపు వస్తోందన్న ధోరణి ఆయనలో దాగిఉన్న ఫ్యూడల్ స్వభావానికి నిదర్శనమని విమర్శించారు. తమలాగా కోదండ రామ్‌కు త్యాగాల చరిత్ర లేదని.. తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన ఒక్క త్యాగ మేదైనా ఉందా అని ప్రశ్నించారు. అనేక మంది ఆత్మబలిదానాల ఫలితాన్ని, అనేక మంది ఆలోచనలు, ఆచరణ నిబద్ధతలను కోదండరామ్ తన ఒక్కడి ఖాతాలో జమ చేసుకుంటున్నారని ఆరోపించారు. టీజేఏసీ నాయకత్వంలో రెండో పేరు ప్రస్తావనలో లేకపోవడమే ఇందుకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. దళిత, బహుజనులంటే బానిసలన్న భావన, మహిళలంటే గౌరవం లేకుండా కోదండరామ్ వ్యవహరిస్తున్నా రని... అందరూ తన కోసమే పనిచేయాలన్న, తన ఆదేశాలనే పాటించాలన్న ‘థాట్ పోలీసింగ్’ విధానాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. -
కోదండరాంను విమర్శించే అర్హత లేదు
హన్మకొండ: తెలంగాణ అభివృద్ధి, నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను విమర్శించే అర్హత ప్రజాసంఘాలకు లేదని తెలంగాణ విద్యార్థి సేనా వ్యవస్థాపక అధ్యక్షుడు తిరునహరి శేషు అన్నా రు. ఈమేరకు శనివారం హన్మకొండ నక్కలగుట్టలో తెలంగాణ విద్యార్థి సేనా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆశించిన లక్ష్యం కోసం కోదండరాం పోరాటం చేస్తుంటే కలిసి రావాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదన్నా రు. సమావేశంలో నాయకులు ఎర్రబొజ్జ రమేశ్, పాలడుగుల సురేందర్, కల్లూరి పవన్, తంగెళ్లపల్లి పూర్ణేందర్, కి రణ్, క్రాంతి, రాకేష్, విజయ్ పాల్గొన్నారు. -
‘ర్యాలీ ఫ్లాప్.. కాదు సూపర్ హిట్’
హైదరాబాద్: నిరుద్యోగ ర్యాలీ విజయవంతం అయిందని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అన్నారు. ర్యాలీ నేపథ్యంలో జరిగిన పరిణామాలు, అరెస్టుల పర్వం తదితర అంశాలపై గురువారం ఉదయం ఆయన నివాసంలో జేఏసీ నేతలు, నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి నాయకుల మధ్య చర్చల అనంతరం కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులు స్వచ్ఛందంగా ర్యాలీకి వచ్చారని చెప్పారు. దాదాపు 5వేలమందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలుసని, దీన్ని బట్టే ర్యాలీ విజయవంతం అయిందని చెప్పవచ్చని అభిప్రాయపడ్డారు. ర్యాలీ కార్యక్రమం అత్యద్భుతంగా జరిగిందని, తాము ఏం చెప్పాలనుకున్నామో అది చాలా విస్తృతంగా చెప్పగలిగామని, ర్యాలీ విజయవంతమైందని చెప్పడానికి ఇదే గీటురాయని అన్నారు. ఆయా విశ్వవిద్యాలయాల్లో నిరుద్యోగులు, యువత నిరసనలు తెలిపేందుకు తరలిన విధానం ప్రతి మీడియా గమనించిందని గుర్తు చేశారు. మరోపక్క అంతకుముందు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కోదండరామ్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కోదండరామ్ కుట్రలు చూస్తున్నారని, నిరుద్యోగులు, యువత ర్యాలీలో పాల్గొనకుండా కేసీఆర్‌పై విశ్వాసం చూపించారని అన్నారు. -
‘ర్యాలీ ప్లాఫ్.. కాదు సూపర్ హిట్’
-
ర్యాలీ వెనుక రాజకీయ అజెండా : బాల్కసుమన్
హైదరాబాద్ : తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజాక్) చైర్మన్ కోదండరామ్‌కు ఎంపీ బాల్కసుమన్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రశాంతంగా ఉండటం కోదండరామ్‌కు ఇష్టం లేదని మండిపడ్డారు. కోదండరామ్ నిరుద్యోగ ర్యాలీ వెనుక రాజకీయ అజెండా ఉందని ధ్వజమెత్తారు. కోదండరామ్ నిరుద్యోగ ర్యాలీ వెనుక తెలంగాణ వ్యతిరేక శక్తులున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఈ నెల 22న తలపెట్టిన చలో హైదరాబాద్‌కు పోలీసులు అనుమతినివ్వకపోవడంతో టీజాక్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
కోదండరామ్ పిటిషన్ రేపటికి వాయిదా
హైదరాబాద్ : తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజాక్) చైర్మన్ కోదండరామ్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి(మంగళవారం) వాయిదా వేసింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఈ నెల 22న తలపెట్టిన చలో హైదరాబాద్‌కు పోలీసులు అనుమతినివ్వకపోవడంతో టీజాక్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. శాంతియుతంగా, ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ చేపడతామని హామీ ఇచ్చినా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని టీజాక్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, అధికార ప్రతినిధి జి.వెంకటరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లో ర్యాలీకి అనుమతి కుదరదని, మరో చోట ర్యాలీ నిర్వహిస్తే అభ్యంతరం లేదని పోలీసులు చెప్పారు. -
ర్యాలీకి అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఈ నెల 22న తలపెట్టిన చలో హైదరాబాద్‌కు పోలీసులు అనుమతినివ్వడం లేదంటూ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజాక్) శనివారం హైకోర్టును ఆశ్రయించింది. శాంతియుతంగా, ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ చేపడతామని హామీ ఇచ్చినా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని టీజాక్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, అధికార ప్రతినిధి జి.వెంకటరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ర్యాలీకి అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, చిక్కడపల్లి ఏసీపీ, చిక్కడపల్లి పీఎస్ ఎస్హెచ్ఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు విచారణ జరపనున్నారు. -
పోలీసులు వేధిస్తున్నారు: కోదండరామ్
-
పోలీసులు వేధిస్తున్నారు: కోదండరామ్
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు జరిగిందే ఉద్యోగాల కోసం.. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదని విమర్శించారు. ఇప్పటివరకు కేవలం 15 వేల ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కోచింగ్ తీసుకున్న యువత ఇంటికి వెళ్ళలేక.. ఇక్కడ ఉండలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి అనేక సార్లు తెలియ చేసినా లాభం లేకుండా పోయిందన్నారు. ఈ నెల 22 న నిరుద్యోగులతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులతో కలిసి సభ నిర్వహిస్తామని చెప్పారు. నిరుద్యోగులు ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో పోలీసుల తీరు సరిగా లేదన్నారు. జేఏసీ నాయకులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇలాంటి చర్యకు పాల్పడడం శోచనీయమన్నారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇలాంటివి ఎన్నో చూశాం.. మేము భయపడేవాళ్లం కాదన్నారు. సమాజంలో ఎవరైనా సంఘాలు పెట్టుకోవచ్చు.. ఇది పోలీసులకు చెప్పాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. రెండున్నర సంవత్సరాలు వేచి చూశాం.. ఉద్యోగాల విషయంలో ఎక్కువ కాలం వెయిట్ చేస్తే వయసు అయిపోతుందన్నారు. ఉద్యోగాలపై చర్చకు జేఏసీ సిద్ధంగా ఉందన్నారు. -
'ప్రజల బతుకులు మారాలి'
తూప్రాన్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడాల్సి ఉందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగే కార్యక్రమానికి వెళుతూ మార్గమధ్యంలో తూప్రాన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి అంటే నాయకులు బాగుపడటం కాదు.. ప్రజల బతుకులు మారాలి అని వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన కోసం ఈనెల 3వ తేదీన హైదరాబాద్‌లో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ ఉంటాయని చెప్పారు. -
ఆ సినిమాలకు రాయితీ ఇవ్వాలి : కోదండరాం
సూర్యాపేట: తెలంగాణ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సినిమాలకు పన్ను రాయితీ కల్పించాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రం గాంధీపార్కులోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రసంగించారు. కవులు, కళాకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలని అన్నారు. అలాగే, రాష్ట్రంలో ఫిలిం ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసి, నటీనటులను వెలుగులోకి తేవాలని సూచించారు. -
దూకుడు పెంచుతున్న టీజేఎసీ
-
బలవంతపు భూసేకరణ బిల్లొద్దు: కోదండరాం
29న ధర్నా.. వాల్ పోస్టర్ ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ బిల్లు–2016 ఆపాల ని, బలవంతపు భూసేకరణ జరపొద్దని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. భూనిర్వాసితుల హక్కు లను హరించేలా వ్యవహరిస్తున్న సర్కార్‌కు నిరసనగా ఈ నెల 29న నిర్వహించనున్న ధర్నా పోస్టరును జేఏసీ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భం గా జేఏసీ అగ్రనేతలు ప్రహ్లాద్, ఇటికాల పురుషోత్తం, బైరి రమే శ్తో కలసి ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన భూసేకరణ చట్టం–2013 అమలు లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వ చట్టం మరోమారు భూసేకరణ చట్టంను తీసుకురావడం సరికాదన్నారు. జేఏసీ కో చైర్మన్ ప్రహ్లాద్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూమిని ఈచట్టం పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీని వల్ల భూనిర్వాసితులు పెద్ద ఎత్తున నష్టపోతారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, కేంద్ర చట్టం ప్రకారమే పునరావాసం, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులను అవమానిస్తున్న ఎంపీ అప్రజాస్వామికంగా, అసభ్య పదజాలంతో దళిత జాతిని అవమానించేలా టీఆర్ఎస్ ఎంపీ సుమన్ మాట్లాడుతున్నారని జేఏసీ కో చైర్మన్ ఇటికాల పురుషోత్తం, కో కన్వీనర్ భైరి రమేశ్ విమర్శించారు. -
కోదండరాంపై బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
-
కోదండరాంపై బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై ఎంపీ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలో కోదండరాం కుట్రలు పన్నారని ఆరోపించారు. ఉద్యమాన్ని హింసవైపు మళ్లించేందుకు కోదండరాం ప్రయత్నించారని పేర్కొన్నారు. వాటన్నింటినీ భరించామని బాల్కసుమన్ అన్నారు. కాంగ్రెస్ చేతిలో కోదండరాం కీలుబొమ్మగా మారారని మండిపడ్డారు. వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్‌ను కోదండరాం బతికించే ప్రయత్నం చేస్తున్నారిన బాల్కసుమన్ ఎద్దేవా చేశారు. -
‘డిసెంబర్ 2ను ఉపాధి దినంగా ప్రకటించాలి’
హైదరాబాద్ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి వర్థంతి రోజును తెలంగాణ ఉపాధి దినంగా గుర్తించాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. శుక్రవారం ఓయూ అతిథిగృహం సెమినార్ హాల్లో నిర్వహించిన శ్రీకాంతాచారి ఏడో వర్థంతి సభలో ఆయన ప్రసంగించారు. శ్రీకాంతాచారి ఆత్మబలిదానంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందని కోదండరాం అన్నారు. విశ్వకర్మ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. -
కోదండరాం ఎటువైపో తేల్చుకోవాలి..
తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ సాక్షి, కరీంనగర్: జేఏసీ చైర్మన్ కోదండరాం ఎటువైపో తేల్చు కోవాలని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. సామాజిక తెలంగాణ కోసం ఉద్య మిస్తారా? అధ్యయనాల పేరిట కాలయాపన చేస్తారో? స్పష్టం చేయాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. కరీంనగర్లో సోమ వారం ఆయన తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. సామాజిక శక్తులను కలుపుకుని ప్రజావ్యతిరేక విధానాలు, హక్కుల కోసం ఉద్యమించాల్సిన జేఏసీ చైర్మన్ కోదండరాం వైఖరి శోచనీయమని అన్నారు. ఈ నెల 24న దీక్షను భగ్నం చేస్తే ప్రజాస్వామ్య విలువలున్న ప్రత్యామ్నాయ గొంతుకలకు ఆయన మద్దతు కూడా ఇవ్వకపోవడం విచారకరమని అన్నారు. ప్రజలు అష్టకష్టాల్లో ఉంటే చినజీయర్ స్వామి, గవర్నర్ నరసింహిన్‌లకు సీఎం కేసీఆర్ ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. -
‘కాంట్రాక్ట్’కు మించిన దోపిడీ లేదు
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం సాక్షి, హైదరాబాద్: ‘‘కాంట్రాక్టర్ల వ్యవస్థ అన్యాయమైనది. ఇది ఓ వ్యక్తిని పోషించే వ్యవస్థ. ఏ పనీ చేయని మధ్య దళారి.. కార్మికుల జీతాల్లో కొంత భాగాన్ని ఎగరేసుకుపోతున్నాడు. అతనెవరో కార్మికులకూ తెలియదు.. పని చేసే వారిని కాదని ఏ పనీ చేయని కాంట్రాక్టర్లకు జీతాలు ఇవ్వడం సరికాదు..ఇంతకు మించిన అన్యాయమైన దోపిడీ వ్యవస్థ మరొకటి ఉండదు.’’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల యాత్ర పోస్టర్‌ను సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆవిష్కరించారు. విద్యుత్ జేఏసీ సమన్వయకర్త, జేఏసీ అధికార ప్రతినిధి కె.రఘు నేతృత్వంలో కాంట్రాక్టు కార్మిక వ్యవస్థపై సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కోదండరాం ప్రకటించారు. ఔట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించమని ప్రభుత్వం చెప్పడంలో అర్థం లేదన్నారు. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాల్లో అవినీతి జరుగుతోందనీ, భవిష్యత్తులో క్రమబద్ధీకరిస్తారన్న ఆశతో నిరుద్యోగులు రూ.5లక్షల వరకు ముడుపులు చెల్లించి ఉద్యోగాల్లో చేరుతున్నారని విద్యుత్ జేఏసీ సమన్వయకర్త కె.రఘు ఆరోపించారు. విద్యుత్ కార్మికుల హక్కుల సాధన కోసం 31వ తేదీ నుంచి 90 రోజుల పాటు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో యాత్రను నిర్వహిస్తామని, అన్ని శాఖల్లోని కాంట్రాక్టు కార్మికులను ఏకం చేస్తామని యూనియన్ అధ్యక్షుడు జి.నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు పిట్టల రవీందర్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
రైతులందరికీ న్యాయం జరగాలి
-
ప్రారంభమైన కోదండరామ్ రైతు దీక్ష
హైదరాబాద్: రైతుల సమస్యలపై తెలంగాణ రైతు జేఏసీ చేపట్టిన రైతు దీక్ష ఆదివారం ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ వద్ద ప్రారంభమైంది. తెలంగాణ ఏర్పాడ్డాక తొలిసారి తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ రైతు దీక్షకు దిగారు. ఆయనతో పాటు రైతు సంఘాల నాయకులు కూడా దీక్షలో పాల్గొన్నారు. రైతు సమస్యలు పరిష్కరించాలంటూ కోదండరామ్ రైతు దీక్ష చేపట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదంటూ కోదండరామ్ రైతు దీక్ష చేపట్టారు. -
రేపు ఇందిరాపార్క్ వద్ద రైతు దీక్ష
హైదరాబాద్: నగరంలోని ఇందిరాపార్క్ వద్ద రేపు (ఆదివారం) ఉదయం 10 గంటలకు రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ రైతు దీక్షలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక తొలిసారి కోదండరామ్ దీక్షకు దిగుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని కోదండరామ్ దీక్షకు దిగుతున్నట్టు సమాచారం. -
రైతులను విస్మరిస్తే సంక్షోభమే
• రైతు గర్జనసభలో టీ జేఏసీ చైర్మన్ కోదండరాం ఖిలా వరంగల్: ప్రజలకు అన్నం పెట్టే రైతాంగాన్ని విస్మరిస్తే తెలంగాణలో సంక్షోభం తప్పదని తెలంగాణ టీ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణ రైతు జేఏసీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై చర్చించడంతో పాటు వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి ఒత్తిడి తెచ్చేలా బుధవారం రైతుగర్జన సభ ఏర్పాటుచేశారు. వరంగల్‌లో జరిగిన ఈ సభకు రైతు జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటనారాయణ అధ్యక్షత వహించగా, కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం రైతులు గౌరవంగా బతికే అవకాశం లేకుండా పోయి0దని ఆవేదన వ్యక్తం చేశారు. పంట సాగు దశ నుంచి రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, విత్తనాలు, పురుగు మందుల కొనుగోలులో దోపిడీ ప్రముఖ పాత్ర పోషిస్తోందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన రుణమాఫీ హామీ అమలుకాకపోగా.. రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సాకులు చెబుతూ వేధిస్తున్నారన్నారు. తద్వారా రైతులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం రైతులను ఆదుకునేలా స్పష్టమైన వ్యవసాయ విధానం ప్రకటించాలని కోదండరాం డిమాండ్ చేశారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ మాట్లాడుతూ రైతులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో రైతు జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్ మోర్తాల చందరావు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులపైకి బ్రహ్మాస్త్రం
పంజగుట్ట: న్యాయపరమైన, చట్టానికి, రాజ్యాంగానికి సంబంధించిన సమాచారం తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయని అలాంటి సమాచారంతో కూడుకున్న పుస్తకం రావడం ఎంతో సంతోషకరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో న్యాయవాది, రచయత నర్సింగరావు రచించిన ‘ప్రభుత్వ అధికారుల, పోలీసుల పైకి బ్రహ్మాస్త్రం’ అనే పుస్తకాన్ని జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ రాజకీయ జెఏసీ చైర్మర్ ప్రొఫెసర్ కోదండరామ్‌లు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ .. సరళమైన భాషలో సామాన్య ప్రజలకు అర్దమయ్యే విధంగా ఎంతో క్లిష్టమైన విషయాలు పుస్తకంలో అందించారని కొనియాడారు. చట్టం, మానవహక్కులు, ప్రాథమిక హక్కులు, కలెక్టర్ విధులు, పోలీస్ ఉన్నతాధికారుల విధులు, పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తే ఏమి చేయాలి, బెయిల్ పొందడం ఎలా, పోలీసులు, ప్రభుత్వ అధికారులు నేరం చేసినా, అవినీతికి పాల్పడినా ఎవరికి ఫిర్యాదు చేయాలి లాంటి విషయాలు కూడా స్పష్టంగా పుస్తకంలో పొందుపర్చారని తెలిపారు. ప్రభుత్వం వారు ఈ పుస్తకాన్ని అన్ని జిల్లాల్లో అన్ని లైబ్రరీల్లో ఉంచాలని, హైకోర్టు వారు కూడా ఈ పుస్తకాన్ని ప్రతి కోర్టుకు పంపితే ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ... చట్టంపై, రాజ్యాంగంపై ప్రజలకు ఎంత తెలిస్తే వారి హక్కుల సాధనకోసం అంతగా ఐక్యమౌతారని అన్నారు. గతంలో బొజ్జాతారకం పోలీసులు అరెస్టు చేస్తే అనే పుస్తకం తెస్తే ప్రజలు ఇష్టంగా కొనుక్కుని చదివి తమ హక్కుల పరిరక్షణ కోసం ప్రయత్నం చేశారని, ఈ పుస్తకం కూడా అలాంటిదేనని అన్నారు. చట్టం కల్పిస్తున్న అనేక హక్కులు ట్రేడ్‌యూనియన్, కనీసవేతన చట్టాలు, మానవహక్కుల చట్టాలు పొందుపర్చి ఉందని ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందిన్నారు. పుస్తక రచయత నర్సింగ్‌రావు మాట్లాడుతూ ..పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా ఈ పుస్తకం వ్యతిరేకం కాదని, చట్ట విరుద్దమైన పనులు చేసిన వారికి బ్రహ్మస్త్రంలా ఉంటుందని పేర్కొన్నారు. -
అధికారికంగా నిర్వహించాలి
విలీన దినోత్సవంపై రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విలీన దినోత్సవాన్ని ఈ నెల 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేసింది. ఉత్సవాల నిర్వహణ ద్వారా భారత్‌లో హైదరాబాద్ స్టేట్ విలీనమైన చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య ఆకాంక్షలను గౌరవించేలా, నాటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకునేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది. విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేలా కేంద్రమే ఆదేశాలివ్వాలని సమావేశంలో కొందరు వక్తలు పేర్కొన్నారు. ‘సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి’ అనే అంశంపై సోమవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ రంగాల ప్రముఖులు ఈ భేటీలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. త్యాగాలు గుర్తు చేసుకోండి: కోదండరాం హైదరాబాద్ స్టేట్ విలీనాన్ని చారిత్రక వాస్తవంగా గుర్తించాలని.. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా జరపాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య తెలంగాణ ఆకాంక్షల కోసం షేక్ బందగీ, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకునేందుకు దీనిని ఒక సందర్భంగా చూడాలన్నారు. విలీన దినాన్ని జరుపుకోలేకపోతే చరిత్ర దూరమవుతుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రితో, ఇతర రాజకీయపార్టీలతో చర్చించడంతో పాటు... ప్రభుత్వం కూడా అఖిలపక్ష సమావేశం నిర్వహించేలా చొరవ తీసుకోవాలని బండారు దత్తాత్రేయను కోరా రు. విలీన దినోత్సవాల నిర్వహణ ఒక వర్గం పై టార్గెట్ చేసినట్లుగా ఉండకూడదని.. ఈ విషయంగా గతంలో కొన్ని తప్పులు జరిగాయని, అందువల్ల చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్ 17 చర్యకు దారితీసిన పరిస్థితులు, నిజాంపై వ్యతిరేకత, భూస్వామ్య వ్యతిరేక ఉద్యమం వంటి వాటిని మతపరమైన దృష్టితో చూడొద్దని సూచించా రు. జేఏసీ తరఫున సెప్టెంబర్ 17న 2 నిమిషాలు మౌనం పాటించి, జాతీయజెండా ను ఎగురవేయాలని నిర్ణయించామని చెప్పారు. ఎంతో ఘనమైన చరిత్ర.. తెలంగాణ పోరాటానిది ఎంతో ఘనమైన చరిత్ర అని, దానిని అధికారికంగా జరపకపోవడం సరికాదని ప్రముఖ శిల్పి ఎక్కా యాదగిరిరావు పేర్కొన్నారు. ప్రభుత్వం విలీన దినోత్సవాన్ని నిర్వహించాలని గాయకుడు గోరటి వెంకన్న కోరారు. చరిత్రాత్మక దినోత్సవంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను నిర్వహించాలని సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ విజ్ఞప్తిచేశారు. భారత చరిత్రను, హైదరాబాద్ చరిత్రను విడదీసి చూడలేమని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి పేర్కొన్నారు. విలీనానికి ముందు ప్రజలు పడిన బాధలు, కన్నీటి గాథలు, మహిళల కష్టాలు, కన్నీళ్లు ఎన్నో ఉన్నాయని... దానికి మతపరమైన రంగు పులమడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజలపై జరిగిన అకృత్యాలకు కారణం నిజామేనని, ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన నిజాం విగ్రహాన్ని తొలగించాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ప్రొఫెసర్ జియా హసన్ డిమాండ్ చేశారు. సమావేశంలో చుక్కా సత్తయ్య, వెల్చాల కొండలరావు, బాబురావు వర్మ, పాశం యాదగిరి, టీజేఏసీ కో కన్వీనర్ వెంకటరెడ్డి, ప్రొఫెసర్లు లక్ష్మి, లక్ష్మణ్, వరలక్ష్మి, మల్లికార్జున్, మురళీధర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా వంతు ప్రయత్నం చేస్తా: దత్తాత్రేయ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే అంశంపై కేంద్ర మంత్రిగా కాకుండా సీనియర్ రాజకీయవేత్తగా, సామాజిక కార్యకర్తగా తన వంతు ప్రయత్నిస్తానని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రభుత్వంతో త్వరగా చర్చించాల్సి ఉందని తెలిపారు. చరిత్రను వక్రీకరించకుండా.. జరిగిన చరిత్ర, ఉద్యమ స్వభావం తరతరాలుగా తెలుసుకుని స్ఫూర్తి పొందాల్సి ఉందని పేర్కొన్నారు. నిజాం స్టేట్‌లో భాగంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నట్లుగా.. తెలంగాణలోనూ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా?
♦ సీఎం ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు: ప్రొఫెసర్ హరగోపాల్ ♦ ప్రజలతో మాట్లాడే ప్రభుత్వం వస్తుందనుకున్నాం ♦ పోరాడింది ఇలాంటి తెలంగాణ కోసం కాదు ♦ టీఆర్ఎస్ పోరాటం వల్లే రాష్ట్రం రాలేదు ♦ కొత్త రాష్ట్ర ప్రగతి దిశ, దశ సరిగాలేదు ♦ ఆర్టీసీ కార్మికులను విస్మరించొద్దు: కోదండరాం సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ వస్తే ప్రజలతో మాట్లాడే ప్రభుత్వం వస్తుందని, మానవీయ పాలన, స్పందించే పాలన ఉంటుందని అంతా ఆశించాం. కానీ ఈ ముఖ్యమంత్రి ఎవరికీ కలవటానికి అవకాశం ఇవ్వటం లేదు. కోదండరాం సార్ అదే అంటున్నారు. నేనూ అదే అంటున్నా.. నిన్న ఎస్సీ,ఎస్టీ హక్కుల సంఘం వాళ్లూ అదే అన్నారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులూ అదే చెప్తున్నారు.. సమస్యలు చెప్పుకుని పరిష్కరించమని అడగాలంటే మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు ఇదేం ప్రజాస్వామ్యం’’ అంటూ పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ప్రజలు పోరాడి తెచ్చుకున్నది ఇలాంటి తెలంగాణ కోసం కాదని విమర్శిం చారు. ఆర్టీసీలోని పలు సంఘాల జేఏసీ బుధవారం హైదరాబాద్‌లో ‘ఆర్టీసీలో నష్టాలు- మేధావుల అభిప్రాయం’ పేరుతో జరిగిన సదస్సులో హరగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరును విమర్శించారు. నిర్ణయాల్లో మార్పు రావాలి సీఎం ఎవరికీ అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారని, ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని హరగోపాల్ పరోక్షంగా విమర్శించారు. ‘‘ఒక్క టీఆర్ఎస్ పోరాటం వల్లనో, ఏ వ్యక్తి వల్లనో తెలంగాణ రాలేదు. ఆ పోరాటం లో అంతా భాగస్వామ్యమయ్యాం. ఆర్టీసీ కార్మికుల పాత్రా ఉంది. అంతా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అడిగే హక్కు, మాట్లాడే హక్కు అందరికీ ఉంది. కానీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రగతి దిశ, దశ సరిగా లేదనే అభిప్రాయం కలుగుతోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష దిశగా పోతున్నట్టు లేదు. ప్రభుత్వ ఆలోచన విధానంలో, విధాన నిర్ణయాల్లో మౌలిక మార్పులు రావాల్సి ఉంది’’ అని అన్నా రు. ‘‘ఇప్పటికే రెండేళ్లు గడిచింది. మరో మూడేళ్లుంది. ప్రజల ఆకాం క్షకు తగ్గట్టుగా పాలన ఉంటే మళ్లీ వాళ్లే గెలుస్తారు, అప్పుడు ట్యాంక్‌బండ్ చుట్టూ వారి విగ్రహాలు పెట్టుకోవచ్చు. లేదంటే.. ఉన్న విగ్రహాలు తీసి పారేయటం కూడా ఈ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోరు. నష్టం జరగకముందే ప్రభుత్వం స్పందిస్తే మంచిది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా రోజూ ఉదయం గంటసేపు అందరినీ కలిసే అవకాశం కల్పించారని గుర్తుచేశారు. ఉద్యమాన్ని సృష్టించినవాళ్లు ఇంకా ఎలా ఉండాలని ప్రశ్నించారు. ఆర్టీసీలో లాభాలను వెతకడం మంచిది కాదని సూచించారు. ఐదేళ్లు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రైవేటు సంస్థలకు సంపద దోచిపెట్టి, ఆ తర్వాత డబ్బులతో ఎన్నికల్లో గెలవచ్చనే ధోరణి మంచిది కాదని వ్యాఖ్యానించారు. లాభాలతో ముడిపెట్టడం సరికాదు ఆర్టీసీని లాభాలతో ముడిపెట్టి చూడడం మంచిది కాదని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. రిటైర్ అయిన వ్యక్తులను ఎండీ, విజిలెన్స్ డైరక్టర్‌గా పెడితే ఆర్టీసీ బలోపేతం కోసం వారేం కృషి చేస్తారని పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం ప్రశ్నించారు. కళ్లలో కారం చల్లి కర్రలతో దాడి చేయించిన నేతను రవాణా మంత్రిగా పెడితే ఆర్టీసీ ఎలా బాగుపడుతుందని పిట్టల రవీందర్ అన్నారు. పరిపాలనకు సిద్ధపడే వారు ముందుగా రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాల్సి ఉందని జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. బకాయిలు వెంటనే ఇవ్వాలి: కోదండరాం తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న ఉద్దేశంతోనే కార్మికులు ఉద్యమంలో చురుగ్గా వ్యవహ రించారన్న విషయాన్ని విస్మరించొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా కార్పొరేట్ పెత్తనం వల్ల ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడ్డాయని, తెలంగాణ వచ్చినందున ఆ పెత్తనం కూల్చే దిశగా ప్రయత్నం జరగాలన్నారు. ప్రజా రవాణా ఆవశ్యకత విషయంలో ప్రభుత్వ కార్యాచరణ ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలన్నారు. తప్పయితే మైక్ ముట్టను: నాగేశ్వర్ ఆంధ్రా ప్రైవేటు రవాణా సంస్థలను నియంత్రిస్తే ఆర్టీసీకి రూ.వేయి కోట్ల ఆదాయం పెరుగుతుందని, నష్టాలొచ్చే రూట్లలో ఆర్టీసీ బస్సులు తిరిగి, లాభాలొచ్చే రూట్లలో అద్దె బస్సులు తిరిగే విధానం మారాలని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ పేర్కొన్నారు. బినామీ పేర్లతో అధికారులు, ఎమ్మెల్యేలే అద్దె బస్సులను ఆర్టీసీకి ఇస్తున్నారని ఆరోపించారు. వస్తువుల కొనుగోళ్లలో అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని, ఆర్టీసీకి సొంత డీజిల్ బంకులు సమకూరిస్తే ఆదాయం వస్తుందన్నారు. తన సూచనల్లో ఒక్కటి తప్పని నిరూపించినా భవిష్యత్తులో మళ్లీ మైక్ ముట్టనని సవాల్ విసిరారు. -
బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి
మెల్బోర్న్లో ఎన్ఆర్ఐలకు ప్రొఫెసర్ కోదండరాం పిలుపు రాయికల్: బంగారు తెలంగాణసాధనలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చని అన్నారు. కార్యక్రమంలో ప్రవీణ్, రఘు, అనిల్, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోదండరాం రాయని డైరీ
యూనివర్సిటీ పిలగాండ్లకు జెప్పిన. అబిడ్స్‌కి బోయేటప్పుడు నేను గూడ వస్తనని. అక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్ముతరు. ముప్పై రోజులల్ల ఇంగ్లిష్, ముప్పై రోజులల్ల హిందీ, ముప్పై రోజులల్ల తమిళం పుస్తకాలు ఉంటయ్ అక్కడ. గట్లనే ముప్పై రోజులల్ల మనకు రావొద్దనుకున్న భాష ముక్కున బడకుండా ఎట్ల దాస్కోవాల్నో నేర్పించే బుక్కు కూడా ఉంటే బాగుంటది. దాన్నెవరైన రాసి బుక్కేసిన్రేమో తెల్వది. గానీ అసొంటి బుక్కు ఉండాలె. తెలంగాణ వచ్చినంక, మినిస్టర్లైనంక నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జగ దీశ్‌రెడ్డి.. ఏదో కొత్త భాష మాట్లాడుతుండ్రు. ఆంధ్రోల్ల భాషే నయంగుంటది. గట్ల మాట్లాడుతుండ్రు! బాల్క సుమన్ ఢిల్లీల విలేకర్ల మీటింగ్ బెట్టి నోటికొచ్చిన భాష మాట్లాడిండు. అమెరికా పోయొచ్చినంక నాకేదో అయ్యిందట. ఏమైతది! నీకు భయమైతది. రాజేంద రైతే ‘పార్టీ బెట్టి మాట్లాడు కోదండ రామ్’ అంటున్నడు! మాట్లాడేటందుకు పార్టీ వెట్టాల్న? నీగ్గావాలె పార్టీ.. మంత్రి అయ్యేటందుకు. నాకెందుకు? నేను ఏమన్న! నీకు కావల్సినట్టు గాదు, జనానికి ఏం గావాల్నో గది చెయ్యిమన్నా. అంతే గదా. గింత పెద్ద ఉద్యమం నడిపి ఆంధ్రా పాలకుల్ని తరిమినం. వాళ్లు ఇక్కడ జేసినయన్నీ వాళ్లతోనే పోవాల్నా లేదా? మల్లా హైద్రాబాదేనా? మల్లా గీ రియల్ ఎస్టేట్ డీలర్లు, కార్పొరేట్ శక్తులేనా? తెలంగాణకు వేరే అభివృద్ధి లేదా? తెలంగాణ సంస్కృతి అభివృద్ధి చెందకూడదా? సీతాఫల్ మనకు ఒక అస్తిత్వం గదా. అది ఒక్క మన దగ్గరే దొరుకుతది గదా. ఒక్క సీతాఫల్ ఫెస్టివల్ చేసినమా? నేను మొన్న అమెరికా పోతే నాకు ఆశ్చర్యమైంది. ఆ ఊళ్లల్ల ఎల్లిపాయలు పండుతయట. ఎల్లిపాయల ఫెస్టివల్ పెట్టుకుంటరు వాళ్లు! నాయకులు ప్రజల వెనకాలె ఉండాలె. ముందు గాదు. ప్రజలు ఎటు పొమ్మంటే అటుపోవాలె. గీ నాయకులు అట్లా జేస్తున్నరా? చేయాలనుకున్నదే చేస్తున్నరు. అమెరికా పోయినప్పుడు అక్కడి ప్రొఫెసర్లు జె ప్పిన్రు నాకు. ప్రపంచంలో ఎక్కడ గూడా గిట్ల ప్రజల తరుఫున నిలబడి ప్రభుత్వానికి ‘మాకిది కావాలె’ అని చెప్తున్న ప్రజాసంఘాలు తెలంగాణలో తప్ప లేవట! ప్రతిపక్షం అధికారం కోసం కొట్లాడుతది. అధికారపక్షమేమో పవర్లో కూర్చోవాలని ప్రయత్నం జేస్తది. జేఏసీకి ఈ రెండు కోరికలూ లేవు. జేఏసీ వీళ్లతో లేదు. వాళ్లతో లేదు. ప్రజలతో ఉంది. ‘ఎవరో ఉన్నరు వెనుక’ అంటున్నడు మినిస్టర్ జోగు రామయ్య. ఎవరుంటరు నా వెనుక. వచ్చి చూడు. హరగోపాల్ ఉంటడు. సచ్చిపోయిన ప్రొఫెసర్ జయశంకర్‌గారు ఉంటరు. మా ముందట ప్రజలుంటరు. విద్యార్థులుంటరు. నిరుద్యోగు లుంటరు. పైసల్లేని రైతులుంటరు. గిప్పుడు మెదక్ జిల్లా ఉంది. మల్లన్నసాగర్ బాధితులున్నరు. గీ ప్రభుత్వం గిట్లనే ఉంటే.. వచ్చే మూడేండ్లల్ల మల్లా తెలంగాణ మొత్తం మా ముందట ఉంటది. ప్రజలు ముందుండి నడిపిస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినంక ప్రజల్ని వెనకొదిలి, ముందటికి పోతమంటే తెలంగాణ ఊకుంటదా? మల్లా జెండా ఎత్తకుంటదా? మల్లా ‘జై తెలంగాణ’ అనకుంటదా? -
‘కోదండరాంను విమర్శించే హక్కు టీఆర్ఎస్ నేతలకు లేదు’
ఆత్మకూరు : జేఏసీ చైర్మన్ కోదండరాంను విమర్శించే స్థాయి టీఆర్ఎస్ నేతలకు లేదని టీడీపీ మండల అధ్యక్షుడు ఇర్సడ్ల సదానందం అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన కోదండరాంను ఉద్యమ సమయంలో హీరోను చేసి ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసంకాదన్నారు. సకల జనుల సమ్మె ద్వారా అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చిన ఘనత కోదండరాందేనన్నారు. ఆయనను చూస్తే టీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతుందన్నారు. -
తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజే ఏసీ) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం బుధవారమిక్కడ ప్రారంభమైంది. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో సమావేశం ఆరంభమైంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కోదండరాం వ్యాఖ్యలు, ఆయనపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎదురు దాడి నేపథ్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. కాగా తెలంగాణ ఏర్పాటై రెండేళ్లవుతున్న నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలు, ఆచరణ, ప్రభుత్వ వైఫల్యాలపై లోతుగా అధ్యయనం చేయాలని టీజేఏసీ భావిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై అనుసరించాల్సిన వ్యూహంతో పాటు కోదండరాంపై టీఆర్ఎస్ నేతల విమర్శలను ఇందులో ప్రధానంగా చర్చించనుంది. ఈ సమావేశం అనంతరం కోదండరామ్ మీడియాతో మాట్లాడనున్నారు. -
కోదండరాంపై విమర్శలా?
ఓయూలో సీఎం, మంత్రుల దిష్టి బొమ్మలు దహనం హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ కోదండరాంను మంత్రులు విమర్శించడంపై ఉస్మానియా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నిరుద్యోగ, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి సీఎంతో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు దిష్టిబొమ్మలను ద హనం చేశారు. అనంతరం నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కల్యాణ్, బీసీ ఉద్యమ వేదిక అధ్యక్షుడు దేశగాని సాంబశివగౌడ్, నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ బాబులాల్ నాయక్ మాట్లాడుతూ కోదండరాంను విమర్శిస్తే సహించేది లేదన్నారు. కోదండరాం తెలంగాణ గాంధీ అని, ఆయన్ను విమర్శించే వారు అవివేకులని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) మండిపడింది. కోదండరాంను విమర్శించిన మంత్రులు, ప్రజాప్రతినిధులను తెలంగాణలో తిరగన్విబోమని నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్‌కుమార్ హెచ్చరించారు. కోదండరాంకు రక్షణ కల్పించండి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు ఓయూ విద్యార్థి జేఏసీ లేఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాంకు రక్షణ కల్పించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ మంగళవారం లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి కోదండరాంకు ప్రాణహాని ఉందని లేఖలో పేర్కొన్నారు. కేబినెట్ మంత్రులు కోదండరాంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని వివరించారు. ప్రజల తరఫున గొంతు వినిపిస్తున్న కోదండరాంను రాష్ట్ర ప్రభుత్వం సహించలేకపోతోందన్నారు. -
ఎక్కడేం జరుగుతోంది?
♦ రెండేళ్ల పాలనపై టీజేఏసీ విస్తృత అధ్యయనం ♦ కాంట్రాక్టుల కేటాయింపు నుంచి పదవుల దాకా.. ♦ విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి.. నిపుణులతో సదస్సులకు యోచన ♦ నేడు జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటై రెండేళ్లవుతున్న నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలు, ఆచరణ, ప్రభుత్వ వైఫల్యాలపై లోతుగా అధ్యయనం చేయాలని టీజేఏసీ భావిస్తోంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజల ఆకాంక్షలు, రాష్ట్రం ఏర్పాటైన రెండేళ్ల తర్వాత వాస్తవ పరిస్థితులపై అంశాల వారీగా అధ్యయనం చేసే బాధ్యతలను ఆయా రంగాల నిపుణులకు అప్పగించింది. రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన ప్రాతిపదికలుగా నిలిచిన నీళ్లు, నియామకాలు, నిధులు అంశాలనే పునాదిగా చేసుకుని జేఏసీ అధ్యయనం చేస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల టెండర్లు, వాటర్‌గ్రిడ్ టెండర్లు, దక్కించుకున్న కంపెనీలు, ఆ కంపెనీల యాజమాన్యాలు వంటి వాటిపైనా ఇప్పటికే స్థూలంగా అధ్యయనం చేసింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనుగోలు చేసిన పోలీసు వాహనాలు, సరఫరా చేసిన కంపెనీలు ఏ ప్రాంతానికి చెందినవనే దానిపైనా అధ్యయనం జరిగింది. పాఠ్యపుస్తకాలను సరఫరా చేసిన కంపెనీల యాజమాన్యాలు, తెలంగాణ ఏర్పాటుకు ముందు, తర్వాత పరిస్థితులపైనా అధ్యయనం జరిగింది. జీహెచ్ఎంసీలో ఇటీవల పంపిణీ చేసిన చెత్త డబ్బాలను తయారు చేసిన కంపెనీ, ధరలు, అవి ఏ ప్రాంతానికి చెందిన కంపెనీలనే అంశాలను పరిశీలించింది. అంచనాల తయారీ, ప్రామాణికాలు, టెండర్ల అర్హతలకు ప్రాతిపదిక, పారదర్శకత, కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీలు, వాటి యాజమాన్యాలు, తెలంగాణ ప్రాంతానికి దక్కిన పనులు వంటివాటిపై లోతుగా చేసిన అధ్యయనంలో నివ్వెరపోయే వాస్తవాలు వెల్లడైనట్టుగా జేఏసీ కీలక నాయకుడొకరు పేర్కొన్నారు. వీటితో పాటు ఇప్పటిదాకా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై అధ్యయనం జరుగుతోంది. దళితులకు మూడెకరాల భూమి, ఇప్పటిదాకా ఎంతమందికి భూమి దక్కింది, ఎన్ని ఎకరాలను పంపిణీ చేసిందనే విషయంపై ఒక దళిత ప్రొఫెసర్‌కు బాధ్యతలను అప్పగించారు. కేజీ టు పీజీ, ఉద్యోగ నియామకాలు, రైతు రుణమాఫీ, వ్యవసాయ అనుబంధ సమస్యలపైనా అధ్యయనం చేసే బాధ్యతలను విద్యా, రైతు సంఘాల నేతలకు అప్పగించారు. ఇలాంటి ప్రధానమైన హామీలు, అమలు, తెలంగాణేతర సంస్థల పెత్తనాన్ని కొనసాగించే రంగాల్లోనూ లోతుగా అధ్యయనం జరుగుతోంది. విద్యుత్ ఒప్పందాలను చర్చకు తెద్దాం.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులపై జేఏసీ ప్రత్యేక అధ్యయనం చేస్తోంది. ఈ ప్రాజెక్టుల వల్ల ప్రజలపై పెను భారం పడే ప్రమాద ం ఉందని, దీనిపై నిపుణులతో ప్రత్యేక సెమినార్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇది వరకే జేఏసీ తరఫున విద్యుత్ ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లోపభూయిష్టంగా ఉన్న ఒప్పందాలను చర్చకు తీసుకురావాలని నిర్ణయించింది. ముఖ్యంగా విద్యుత్ ఒప్పందాల వల్ల కలిగే నష్టాలను ప్రజానీకానికి అర్థమయ్యేలా వివరించాలనుకుంటోంది. అందుకు అనుగుణంగా మణుగూరు పవర్‌ప్లాంట్ వల్ల కలిగే నష్టాలపై ఒక ప్రెజెంటేషన్ తయారు చేస్తోంది. ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన యంత్రాల వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లడంతో పాటు భారీ ఖర్చుతో కూడుకున్నది జేఏసీ భావిస్తోంది. తద్వారా ఒక్క మణుగూరు ద్వారానే ప్రజానీకంపై రానున్న 20 ఏళ్లలో రూ.10 వేల కోట్ల భారం పడే అవకాశం ఉందని అంచనాకు వచ్చింది. అలాగే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంతో ఖజానాపై రూ.900 కోట్ల భారం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దామరచర్ల విద్యుత్ ప్రాజెక్టు వల్ల రూ.6 వేల కోట్ల భారంతో పాటు తీవ్రమైన కాలుష్యం వెదజల్లే ప్రమాదముందని జేఏసీ భావిస్తోంది. ఇలా విద్యుత్ రంగానికి సంబంధించి దాదాపు 32 అంశాలను కూలంకషంగా చర్చించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని జేఏసీ నిర్ణయించింది. నేడు జేఏసీ సమావేశం తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం బుధవారం హైదరాబాద్‌లో జరగనుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కోదండరాం వ్యాఖ్యలు, ఆయనపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎదురు దాడి నేపథ్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశం కానుంది. ప్రభుత్వ వైఫల్యాలపై అనుసరించాల్సిన వ్యూ హంతో పాటు కోదండరాంపై టీఆర్ఎస్ నేతల విమర్శలను ఇందులో ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని జేఏసీ నేతలు వెల్లడించారు. -
100 జేఏసీలు పుట్టుకొస్తాయి
తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ హైదరాబాద్: ఉద్యమకారుల గొంతు నొక్కాలని చూస్తే ఉద్యమంలో మాదిరిగా 100 జేఏసీలు పుట్టుకొస్తాయని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ అన్నారు. రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై సీఎం కేసీఆర్ కుటుంబం, మంత్రివర్గ సభ్యులు తిట్లదండకం ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా తెలంగాణ ప్రజల కోసం గొంతు విప్పడానికి ప్రయత్నిస్తే కేసీఆర్ అనుచరగణం ఒంటికాలిపై లేస్తున్నదని విమర్శించారు. ఉద్యమకారులను సన్నాసులు, దద్దమ్మలు అంటున్నారని, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కొత్త బిచ్చగాడు అని అంటున్నారని, ఇదెక్కడి సంస్కారమని ప్రశ్నించారు. తలసాని కూడా కోదండరాంను విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరం వచ్చిందని, ఇప్పటికైనా కోదండరాం దానిని తయారు చేయాలని సుధాకర్ సూచించారు. తెలంగాణ కోసం పోరాడిన కవులు, క ళాకారులు, ఉద్యమకారులు, మేధావివర్గం అందరూ ఐక్యంకావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ద్రోహులంతా బజారుకెక్కి ఉద్యమకారులపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. -
ప్రజా సమస్యలను ప్రస్తావించడమే తప్పా?
కోదండరాంపై విమర్శలు సరికాదు: రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై మం త్రులు విమర్శల దాడితో ఎగబడ్డారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రస్తావించడమే తప్పా అని నిలదీశారు. మం గళవారం రేవంత్ ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కోదండరాం రెండేళ్లుగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి, వాస్తవ పరిస్థితులు తెలుసుకున్న తర్వాతే స్పందించారన్నారు. రైతు సమస్యలపై ఆయన కోర్టుకు వెళ్లిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. ‘‘ఉద్యమంలో వాడుకుని ఇప్పుడు విమర్శిస్తారా?ఉద్యమకారుడికిచ్చే గౌరవమిదేనా? ఆంధ్రావాళ్లు కూడా ఆయన్ను ఇంతలా అవమానించలేదు. జేఏసీని కనుమరుగు చేయాలన్నదే టీఆర్ఎస్ వ్యూహం’’ అన్నారు. -
ప్రశ్నిస్తే కాంగ్రెస్ ఏజెంటేనా?
కోదండరాం ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి: భట్టి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను ప్రశ్నించిన వారంతా కాంగ్రెస్ ఏజెంట్లేనా అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాభిప్రాయాన్నే కోదండరాం చెప్పారన్నారు. కోదండరాంపై టీఆర్ఎస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే కోదండరాం ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. అర్థంపర్థంలేని ఆరోపణలు, విమర్శలతో మూకుమ్మడి దాడి చేయ డం సరికాదన్నారు. ‘‘ఉద్యమ సమయంలో కోదండరాంను ఉపయోగించుకుని ఇప్పు డు కరివేపాకులా తీసేస్తున్నారు. ప్రశ్నించిన ప్రతివారినీ కాంగ్రెస్ ఏజెంట్ అనడం దారు ణం. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఓ రాజకీయ దళారి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను టీఆర్ఎస్లో చేర్చడానికి కమీషన్‌గా ఆయన మంత్రి పదవి తీసుకున్నారు’’ అన్నారు. పార్టీకి వ్యతి రేకంగా పనిచేస్తే ఎవరికైనా ఒకటే న్యాయమని, కోమటిరెడ్డా.. మరొకరా అనేది ముఖ్యం కాదన్నారు. వాటర్ గ్రిడ్‌లో అవినీతిని బయటపెట్టడానికి అవసరమైతే కోర్టుకు వెళ్తామన్నారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్లు చేస్తున్నారని ఆరోపించారు. రెండేళ్లలో 2 లక్షల కోట్ల దోపిడీ చేసేందుకు సీఎం కేసీఆర్ టెండర్ వేశారన్నారు. కేవలం రూ.475 కోట్లు వెచ్చి స్తే ఖమ్మం జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందని, వీటికి నిధులను ఎందుకు కేటాయించడం లేదన్నారు. కొన్నిచోట్ల పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని, అలాంటివారిపై కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. -
కోదండరాంకు మతి భ్రమించింది
రెండేళ్ల అభివృద్ధి కనిపించడం లేదా: హోంమంత్రి నాయిని సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ కోదండరాం మతిభ్రమించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మండిపడ్డారు. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఆయనకు కనిపించడం లేదా అని దుయ్యబట్టారు. 60 ఏళ్ల అన్యాయాన్ని రెండేళ్లలో పూడ్చగలిగామన్నారు. మంగళవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.35 వేల కోట్లతో సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. ‘‘మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు ప్రపంచస్థాయిలో ప్రశంసలు అందుతుంటే కోదండరాంకు కనిపించ లేదా? అసెంబ్లీలో విపక్షాలు మాట్లాడినట్లుగానే ఆయన మాట్లాడుతున్నారు. మేధావి ముసుగులో ఏం చేసినా చెల్లుతుందని అనుకోవద్దు. భూసేకరణ చేయకపోతే ప్రాజెక్టుల నిర్మాణం ఎలా సాగుతుంది? చెరువులకు కృష్ణా, గోదావరి నదీ జలాలు రావాలంటే ఆకాశం మీద నుంచి పైపులు వేస్తారా? రాష్ట్రంలో పది జిల్లాల్లో లేని సమస్య ఒక్క మల్లన్నసాగర్ వద్దే కోదండరాంకు కనిపించిందా’’ అని ప్రశ్నించారు. రేవంత్ ఒక బచ్చాగాడని, అతని మాటలకు తాను స్పందించనని అన్నారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు కేసీఆర్ ఫాంహౌస్ భూములు కేటాయించాలంటూ జస్టిస్ చంద్రకుమార్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. -
‘వెనుక ఎవరో ఉన్నారు’
పెద్దపల్లి రూరల్: టీ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని, ఆయన వెనుక ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారని మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. దేశ, విదేశాలకు చెందిన వారు సీఎం పాలనను ప్రశంసిస్తుంటే కోదండరాం కళ్లకు కనపడకపోవడం ఆశ్చర్యంగా ఉంది. రైతులకు రుణమాఫీ, ప్రాజెక్టుల నిర్మాణాలు రైతుల కోసం కాదా? షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూమ్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలాంటి ఎన్నో పథకాలు అమలవుతుంటే గత పాలకుల బాటనే ప్రభుత్వం పనిచేస్తోందనడం సరికాదు’’ అని అన్నారు. కోదండరాంను అందరూ గౌరవిస్తారని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. -
సర్కారు పునాదులు కదులుతున్నాయి
కోదండరాం ప్రశ్నలకు టీఆర్ఎస్ సమాధానం చెప్పాలి: మల్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలను ఏకం చేసిన శక్తి కోదండరాం అని, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలపై ఆయన చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వ పునాదులు కదులుతున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోదండరాం చేసిన ఐక్య ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. రెండేళ్లలో టీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలపై ప్రజల పక్షాన కోదండరాం ప్రశ్నిస్తే, వాటికి సమాధానం చెప్పకుండా మంత్రులంతా దాడులు చేయడం అప్రజాస్వామికమన్నారు. టీఆర్ఎస్ నేతలకు తమ పాలనపై విశ్వాసం ఉంటే కోదండరాం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చేతకాకుంటే కోదండరాంకు క్షమాపలను చెప్పాలని డిమాండ్ చేశారు. కోదండరాం మాట్లాడే ప్రతీ మాట తెలంగాణ ప్రజల గొంతుక అని అన్నా రు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు విరుచుకుపడటం టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకానితనానిని, అభద్రతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి తెలంగాణ గాంధీ కోదండరాంపై టీఆర్ఎస్ దొంగలు విరుచుకుపడుతున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ విమర్శించారు. అధికార పార్టీ నేతలు కోదండరాంపై విమర్శలు చేసినందుకు మంగళవారం ఆయన అమరవీరుల స్మారకస్థూపం వద్ద నివాళులు అర్పిం చారు. కేసీఆర్‌కు చెంచాలుగా ఉన్న వారు కోదండరాంపై దాడికి దిగుతుంటే తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. రైతుల పక్షాన మాట్లాడితే తప్పా? రైతుల పక్షాన మాట్లాడటమే కోదండరాం చేసిన తప్పా అని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కోదండరాంపై దాడి అప్రజాస్వామికమన్నారు. కోదండరాం పక్షాన తెలంగాణ ప్రజానీకం ఉంటుందన్నారు. జర్నలిస్టు నేతలతో చర్చలు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మెదక్ జిల్లాలో జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవితో జర్నలిస్టు సంఘాల నేతలు మంగళవారం చర్చించారు. చర్చల అనంతరం మల్లు రవి మాట్లాడుతూ.. జర్నలిస్టులను కాంగ్రెస్ గౌరవిస్తుందన్నారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. -
ప్రజలపై దాడి
సీఎల్పీ ఉపనాయకుడు జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: జేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న దాడిని తెలంగాణ ప్రజల పై దాడిగా సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి అభివర్ణించారు.మంగళవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కోదండరాంను చూసి టీఆర్ఎస్ ఉలిక్కి పడుతోందన్నారు. ఆయనపై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు. ఇవి తెలంగాణవాదులను, ప్రజలను అవమాన పర్చడమేనన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాన్నే కోదండరాం చెప్పారన్నారు. వాటిని సలహా లు, సూచనలుగా తీసుకుని ప్రభుత్వ విధానాలను మార్చుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా కోదండరాంను జేఏసీకి చైర్మన్‌గా ఎన్నిక చేసుకున్నామని, సకల జనుల సమ్మె వంటి పోరాటాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు. టీఆర్ఎస్కు, ప్రభుత్వానికి టీజేఏసీ అనుకూలంగా నడవాలా అని ప్రశ్నించారు. ఆయన ఉన్న మాటంటే ఉలుకెందుకన్నారు. -
సర్కారు ఉక్కిరిబిక్కిరి
♦ కోదండరాం వ్యాఖ్యలతో ఉలికిపాటు ♦ ఏకంగా 12 మంది మంత్రులు విరుచుకుపడటంపై విమర్శలు ♦ కోదండరాంకు దన్నుగా విపక్షాలు, జేఏసీలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైందా..? టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చేసిన వ్యాఖ్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతోందా..? కోదండరాంపై కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముప్పేట దాడి చేయడం చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది! ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో అలర్ట్ అయిన ప్రభుత్వ పెద్దలు ఎదురుదాడి ప్రారంభించారని, ఏకంగా 12 మంది మంత్రులు కోదండరాం విమర్శలను తిప్పికొడుతూ ప్రతి విమర్శలకు దిగారని అంటున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వ విధానాలను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించుకునే ప్రయత్నం చేస్తూనే జేఏసీ ఉనికిని ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. మరోవైపు కోదండరాంకు విపక్షాలు, వివిధ జేఏసీలు మద్దతుగా నిలిచి ప్రభుత్వ తీరును తూర్పారపట్టడంతో అధికార పార్టీ వ్యూహం బూమరాంగ్ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్లుగా అంశాల వారీగా అధ్యయనం.. రెండేళ్లుగా వివిధ రంగాల వారీగా, అంశాల వారీగా అధ్యయనం చేసిన తెలంగాణ జేఏసీ ప్రకటనలకే పరిమితం అయ్యింది. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక, విద్యుత్, సాగునీటి రంగాలతోపాటు సింగరేణిపై జేఏసీ సబ్-కమిటీలు అధ్యయనం చేశాయి. రాష్ట్రంలో నెలకొన్న కరువుపై టీజేఏసీ చైర్మన్ హోదాలో కోదండరాం జిల్లాల్లో పర్యటించారు. అనంతరం జేఏసీ తరపున నివేదికను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి అందజేశారు. రైతు ఆత్మహత్యలపై కోర్టు మెట్లు కూడా ఎక్కారు. రైతుల ఆత్మహత్యల నివారణకు జేఏసీ కొన్ని సూచనలు చేసిందని, వాటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఉద్యమ సమయంలో ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వానికి గుర్తు చేయడంలో భాగంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంతాల్లోనూ జేఏసీ పర్యటించింది. కరువుపై కలెక్టర్ల సదస్సుకు ముందు వివిధ రైతు సంఘాలతో అఖిలపక్ష సమావేశం జరిపి ప్రభుత్వానికి సూచనలు చేసింది. మొత్తంగా ఈ రెండేళ్ల పాటు అధ్యయనానికి, ప్రభుత్వానికి సూచనలు చేయడానికే పరిమితమైన జేఏసీ రెండేళ్ల సంబురాలు జరుగుతున్న సమయంలో విమర్శలకు దిగింది. భూసేకరణ విధానంపై తీవ్రంగా విరుచుకుపడిన కోదండరాం.. ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే రైతు ఆత్మహత్యలు పెరిగాయని కుండ బద్దలు కొట్టారు. గత ప్రభుత్వాల అడుగుజాడల్లోనే ఈ ప్రభుత్వం నడుస్తోందం టూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పుట్టించాయి. జేఏసీ @ ప్రభుత్వం కోదండరాం వ్యాఖ్యలపై మంత్రులంతా విరుచుకుపడటంపై చర్చ సాగుతోంది. వాస్తవానికి గడిచిన ఏడాది కాలంగా తెలంగాణ జేఏసీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు తెరవెనుక పెద్ద పాత్రనే పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో జేఏసీ బయటకు వెళ్లిపోవడం వెనుక సదరు పెద్దల ఆదేశాలు, ఒత్తిడి ఉన్నాయన్న ప్రచారం జరిగింది. గతంలో జేఏసీలో కీలకంగా వ్యవహరించిన వారికి కొన్ని పదవులు దక్కడం వంటి పరిణామాలు ఈ ప్రచారానికి ఊతమిచ్చాయి. ఈ నేపథ్యంలో తన మనుగడను కాపాడుకుంటూనే ప్రజల పక్షాన జేఏసీ ప్రభుత్వాన్ని నిలదీసిందంటున్నారు. విమర్శలను స్వీకరించకుండా.. అమాత్యులంతా కోదండరాంపై ఒంటికాలిపై లేవడంతో పెద్ద దుమారమే చెలరేగింది. గతంలో వివిధ సందర్భాల్లో కాంగ్రెస్, టీడీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలపై మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఎన్ని విమర్శలు చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ జేఏసీ చైర్మన్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగడంతో మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల మంత్రుల దిష్టిబొమ్మలు, ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కోదండరాం లేవనెత్తిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పకుండా.. ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను వివరించడానికే మంత్రులు పరిమితమయ్యారు. -
'ఆయనను కరివేపాకులా తీసేస్తున్నారు'
హైదరాబాద్‌సిటీ: తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంను ఉపయోగించుకుని ఇప్పుడు కరివేపాకులా తీసేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కోదండ రాంపై టీఆర్ఎస్ దాడి ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణపై నిబద్ధత కలిగిన నేత కోదండరాం అనీ, ప్రజాభిప్రాయాన్నే కోదండరాం చెప్పారని భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కోదండరాం ప్రశ్నకు సమాధానం చెప్పాలని అన్నారు. ప్రశ్నించిన ప్రతి వ్యక్తినీ కాంగ్రెస్ ఏజెంట్ అనడం దారుణమన్నారు. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ దళారీ అన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే ప్రాజెక్టులు రీడిజైన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. రెండేళ్ల రెండు లక్షల కోట్ల రూపాయల దోపిడీకి కేసీఆర్ టెండర్ పెట్టారన్నారు. ప్రజాధనాన్ని దోచుకుంటుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదన్నారు. రూ.475 కోట్లు మంజూరు చేస్తే ఖమ్మంలో రూ.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చునని అన్నారు. కొన్ని చోట్ల పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని విమర్శించారు. -
‘మరో రేవంత్, ఉత్తమ్‌లా కోదండరాం కావద్దు’
ఆదిలాబాద్: ప్రొఫెసర్ కోదండరాం మరో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కావద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోదండరామ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన సోమవారం ఆదిలాబాద్‌లో స్పందించారు. పదవీ విరమణ చేసిన తర్వాత కోదండరాంకు మతి భ్రమించిందా లేక ఆలోచనలో మార్పు వచ్చిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోదండరాం మాట్లాడడం వెనుక ఏదో శక్తి ఉందన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే, ప్రజలు ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతుంటే కోదండరామ్‌కు అవి కనిపించడం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. కోదండరామ్ వ్యాఖ్యల వెనుక అభివృద్ధి ఓర్వలేని శక్తులేవో ఉన్నాయని తమకు అనుమానంగా ఉందన్నారు. ప్రజలకు కోదండరామ్‌పై ఉన్న గౌరవాన్ని పలుచున చేసుకోరాదని కడియం శ్రీహరి హితవు పలికారు. -
చేతకానిది కాదు.. చేవ ఉన్న చేతల ప్రభుత్వం'
మహబూబ్ నగర్: తెలంగాణ ప్రభుత్వం చేతకానిది కాదని.. చేవ ఉన్న చేతల ప్రభుత్వం' అని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు తెలంగాణ ప్రభుత్వ పథకాలు కనిపించడం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం పాలన అంటే పాఠాలు చెప్పడం కాదని మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. -
'జేఏసీ పుట్టకముందే తెలంగాణ ప్రకటన'
కరీంనగర్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై తెలంగాణ రాష్ర్ట ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జేఏసీ పుట్టకముందే తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిందని కరీంనగర్ లో సోమవారం మంత్రి ఈటల వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ ఎస్ కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకుందని అన్నారు. కోదండరాం అవాస్తవాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. కోదండరాం విమర్శల వెనక కుట్రలు, కుతంత్రాలు దాది ఉన్నాయా..? అంటూ ఈటల ప్రశ్నించారు. మిషన్ కాకతీయ బాగుందని గతంలో చెప్పిన కోదండరాం.. ఇప్పుడు బాగా లేదనడంలో అర్ధమేమిటో చెప్పాలన్నారు. రాజకీయ పార్టీల కంటే భిన్నంగా కోదండరాం విమర్శలు చేస్తే ప్రజలు క్షమించరని చెప్పారు. మిషన్ కాకతీయ, రైతులకు పంట రుణాల మాఫీ, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్, కులవృత్తులకు మేలు చేసినట్లు కాదా..? అని మంత్రి ఈటల సూటిగా ప్రశ్నించారు. -
చేతకాకుంటే తప్పుకోండి
టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆశించిన ఫలితాలు రాలేదు: కోదండరాం ► ప్రజల బతుకుదెరువు విస్తరించే ప్రయత్నాలు ఒక్కటీ లేవు ► వ్యవసాయం, కుల వృత్తులపై అధ్యయనం లేదు ► హైదరాబాద్ చుట్టూ తిరిగి జిల్లాలను విస్మరిస్తే ప్రజలు ఆమోదించరు ► కాంట్రాక్టు, రియల్ ఎస్టేట్‌కు అనుగుణంగా పనిచేస్తే ప్రయోజనం ఉండదు ► వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే రైతు ఆత్మహత్యలు ► పాలీహౌస్లతో పేద రైతులకు ప్రయోజనం శూన్యం ► ప్రజల కోసమే నిలబడ్డాం..లేకపోతే సంస్థను ఎప్పుడో టీఆర్ఎస్లో కలిపేవాళ్లం సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ అభివృద్ధి చేయడం పాలకులకు చేతకాకపోతే పక్కకు తప్పుకోండి. మేం చేసి చూపిస్తాం. రెండేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రజల బతుకుదెరువు విస్తరించే ప్రయత్నం ఒక్కటీ జరగలేదు. వ్యవసాయం, కుల వృత్తుల విధానాలపై అధ్యయనమే మొదలవలేదు. ప్రజలకు ఫలితాలు ఎప్పుడు అందుతాయి? మాకు దురాశ, పేరాశ లేదు. ప్రజలు బాగుండాలనేది మా అంతిమ లక్ష్యం. ఆ సోయి ఉండబట్టే నిలబడ్డాం. లేకపోతే ఈపాటికి సంస్థను ఎప్పుడో పార్టీలో కలిపేసి వాళ్ల వెనక తిరిగేవాళ్లం..’’ అని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తన అస్తిత్వాన్ని కాపాడుకునే దిశగా పయనించినప్పుడే లక్ష్యం నెరవేరినట్లు అవుతుందని స్పష్టంచేశారు. ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు జి.రవీందర్రావు ఆధ్వర్యంలో ‘రెండేళ్ల తెలంగాణ- ప్రజా ఆకాంక్షలు- ప్రభుత్వ తీరుతెన్నులు’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ‘రెండేళ్ల టీఆర్ఎస్ పాలన-ఒక పరిశీలన’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా కాంట్రాక్టు, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా పనిచేస్తే ప్రయోజనం ఉండదన్నారు. కేవలం హైదరాబాద్ చుట్టూనే తిరుగుతూ మిగతా జిల్లాలను విస్మరిస్తే ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదన్నారు. అత్యధిక మంది ఆధారపడే వ్యవసాయ రంగం, సూక్ష్మ పరిశ్రమల అవకాశాలను పెంచి ఆర్థిక స్థోమత కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే రైతు ఆత్మహత్యలు పెరిగాయని, అందుకే తాము కోర్టులను ఆశ్రయించామన్నారు. పాలీహౌస్ వంటి వాటి వల్ల పేద రైతులకు ఏమాత్రం ప్రయోజనం ఉండదన్నారు. కుల వృత్తుల విషయంలో ప్రభుత్వ యంత్రాంగానికి స్పష్టత లేదని, తాటిచెట్టు ఏ డిపార్టుమెంట్ కిందకు వస్తుందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఇటీవల ఒక గీతకార్మికుడు తాటిచెట్టు పైనుంచి పడి చనిపోతే అది తమ పరిధి కాదంటూ హార్టికల్చర్, ఎక్సైజ్ శాఖలు తప్పించుకున్నాయన్నారు. విద్యను ఉచితంగా అందించి, ప్రజల రోగాలకు సరైన చికిత్సలు అందిస్తే తెలంగాణలో మూడోవంతు ఆత్మహత్యలను నివారించవచ్చన్నారు. పనితీరుకు గెలుపే నిదర్శనం కాదు: ప్రొఫెసర్ హరగోపాల్ రాష్ట్రంలో జరిగే వరుస ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అది పనితీరుకు నిదర్శనం కాదని, కేవలం ప్రభుత్వంపై విశ్వాసంతోనే ప్రజలు ఓట్లు వేస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలు కాకుండా అంతా తమకే తెలుసునని సీఎం, మంత్రులు భావించడం మంచి పద్ధతి కాదని అన్నారు. అలా భావిస్తే అది వారి అవివేకమే అవుతుందని పేర్కొన్నారు. దేశం మొత్తంలో తెలంగాణకు ప్రత్యేకత ఉందని, నక్సల్బరి, భూస్వామ్య, ఆంధ్ర పెట్టుబడిదారి విధానాలపై తిరగబడిన చరిత్ర ఇక్కడి ప్రాంత సొంతమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉస్మానియా యూనివర్సిటీలోనే సభలు పెట్టుకోవద్దని డిక్టేట్ చేయడం సరికాదన్నారు. మల్లన్నసాగర్ కింద భూములు కోల్పోతున్న గ్రామాల ప్రజలు కొంత కాలంగా ఉద్యమిస్తున్నా... ఏ ఒక్క మీడియా బయటి ప్రపంచానికి చూపకపోవడం దురదృష్టకరమని సామాజిక వేత్త ఎన్.వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రజల గొంతు వినిపించకుండా నొక్కేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ప్రాజెక్టులు గుదిబండలే: రఘు ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులు భవిష్యత్తులో ప్రజలకు గుదిబండగా మారుతాయని విద్యుత్ జేఏసీ నేత రఘు స్పష్టంచేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మణుగూరు విద్యుత్ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.10 వేల కోట్ల భారం పడుతుందని, పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా ఉందని, ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలపై రూ.9 వందల కోట్ల భారం పడుతుందన్నారు. దామరచర్ల ప్రాజెక్టు వల్ల రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లనుందన్నారు. ఇలా విద్యుత్ రంగంలోనే 32 సమస్యలను లేవనెత్తితే ప్రభుత్వం ఒక్కదానికి పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు. పైగా రెగ్యులేటరీ కమిషన్‌కు వెళ్లరాదంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదన్నారు. వ్యవసాయానికి 40 శాతం విద్యుత్ తగ్గడం వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో కరెంట్ సమస్య కనిపించడంలేదని చెప్పారు. -
నేడు ఓపెన్ కాస్ట్ గనుల అధ్యయన యాత్ర
ప్రారంభించనున్న ప్రొ. కోదండరాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల అధ్యయన యాత్రను జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మంగళవారం ఉదయం 5 గంటలకు ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌లోని అల్వాల్ జేఏసీ దీక్షా శిబిరం నుంచి ఈ యాత్ర మొదలుకానుంది. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జెండా ఊపి యాత్రను ప్రారంభిస్తారు. జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు, పలు ప్రజాసంఘాల నాయకులు కాన్వాయ్‌గా ఇక్కడి నుంచి బయల్దేరి ఉదయం 9 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌కు చేరుకుంటారు. వివిధ జిల్లాలకు చెందిన బాధ్యులతో కలసి ఆర్కే-ఓసీపీని సందర్శిస్తారు. అనంతరం మందమర్రి సమీపంలోని ఎర్రగుంటపల్లిలో భూ నిర్వాసితులు, సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజలు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల బాధితులు, వారసత్వ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా ఆందోళన చేస్తున్న వారిని కలసి అభిప్రాయాలు సేకరిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు గోదావరిఖనిలో జరిగే సదస్సులో పాల్గొంటారు. -
'కరువు సహాయక చర్యల్లో లోపాలున్నాయి'
హైదాబాద్: తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితుల పై చర్చించడానికి త్వరలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం తెలిపారు. తెలంగాణలో కరువు తీవ్రంగా ఉందన్నారు. కరువు సహాయక చర్యల్లో లోపాలున్నాయని తెలిపారు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పాలేరు ఉప ఎన్నికతో తమకు సంబంధం లేదన్నారు. జూన్ 2న ఉద్యమకారుల ఆత్మగౌరవ దినంగా నిర్వహిస్తామన్నారు. ఉద్యమకారుల త్యాగాలను ఆ రోజు గుర్తు చేసుకుంటామన్నారు. -
‘జేఏసీ నుంచి ఉద్యోగులు ఎందుకు వెళ్లారో? ’
హైదరాబాద్: 'ప్రజలపై జేఏసీకి ప్రేమ ఉంది...ఎవరి పట్లా శత్రుత్వం లేదు.. ఉద్యోగ సంఘాల వారు ఏ ఇబ్బందుల కారణంగా జేఏసీ నుంచి వైదొలిగారో తెలియదు' అని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. శుక్రవారం టీజేఏసీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ జేఏసీలో ఇంకా ఎన్ని సంఘాలు ఉన్నాయో స్టీరింగ్ కమిటీ సమావేశం తర్వాతే తేలుతుందని చెప్పారు. వచ్చే వారం జేఏసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, ప్రజా సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలతో విద్యావంతులు, ప్రజల సమస్యలపై గళమెత్తాలని.. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ఎన్నికలొక్కటే ప్రజాస్వామ్యం కాదు.. ఎన్నికల అనంతరం కూడా ప్రజల తరఫున క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. -
టీజేఏసీ కొనసాగుతుంది
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది: కోదండరాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ భవిష్యత్ డోలాయమానంలో పడిందా? ఒక్కో పార్టీ, సంఘం పక్కకు తప్పుకుంటుం డంతో జేఏసీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందా? తాజాగా ఉద్యోగ సంఘాల జేఏసీ తాము టీజేఏసీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చేసిన ప్రకటనతో తెలంగాణ వాదుల్లో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీజేఏసీ ముక్కలు చెక్కలు అయినట్లేనన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాని చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీజేఏసీ తన కర్తవ్యాన్ని కొనసాగిస్తుంది. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ఎప్పటిలాగే కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ క్రమంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు తన వంతు కృషిని కొనసాగిస్తుంది..’’ అని పేర్కొంటూ బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో కొంత అయోమయంలో ఉన్న జేఏసీ వర్గాల్లో స్పష్టత వచ్చిందని, ఇక ముందు మరింత స్వేచ్ఛగా ప్రజల పక్షాన పోరాడటానికి భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటామని జేఏసీ ముఖ్యుల్లో ఒకరు తెలిపారు. అసలేం జరుగుతోంది? తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత వివిధ సంఘాల్లో పనిచే స్తూ జేఏసీలో భాగస్వాములుగా ఉన్న పలువురు నేతలు తమ రాజకీయ భవిష్యత్‌ను వెతుక్కున్నారు. దీంతో జేఏసీ కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయి. రాజకీయ పార్టీల విషయాన్ని పక్కన బెడితే ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలకు చెందిన వారూ జేఏసీకి దూరమవుతూ వచ్చారు. టీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఏడాదిన్నర పాటు ప్రభుత్వం పట్ల జేఏసీ సానుకూలంగానే ఉంది. కొత్త ప్రభుత్వానికి కొంత గడువివ్వాలని, ఇంకా సంపూర్ణ తెలంగాణ సిద్ధించలేదని, రాష్ట్ర హైకోర్టు విభజన, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై పోరాడాల్సి ఉందని ప్రకటించింది. అయితే ఉద్యమ సమయంలోని జేఏసీకి, ప్రస్తుత జేఏసీకి చాలా తేడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే గడిచిన రెండు నెలలుగా జేఏసీ చైర్మన్ కోదండరాం అడపాదడపా ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ వచ్చారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం తీరును ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగడం లేదన్నారు. ఒకవిధంగా ఇటీవల తరచుగా ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు వెలువడ్డాయి. దీంతో జేఏసీలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీజీవో, టీఎన్జీవో వంటి ఉద్యోగ సంఘాలకు ఇబ్బందిగా మారిందన్న చర్చ జరిగింది. ఈ కారణంగానే ఈ రెండు సంఘాలతోపాటు మరికొన్ని ఉద్యోగ సంఘాలు సమావేశమై టీ జేఏసీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, జేఏసీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంటున్నారు. టీజీవోకు గౌరవాధ్యక్షుడుగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్ ఎమ్మెల్యే అయ్యారు. టీఎన్జీవో గౌరవాధ్యక్షుడిగా ఉన్న దేవీప్రసాద్ కూడా టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వానికి ప్రతికూలంగా వ్యవహరించే జేఏసీలో కొనసాగడం వారికీ ఇబ్బందిగా మారిందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగ సమస్యలపై, చేపట్టాల్సిన పోరాటాలపై దృష్టిపెట్టాల్సి ఉన్నందున టీజేఏసీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఉద్యోగ సంఘాల జేఏసీ.. టీజేఏసీ నుంచి పక్కకు తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో, తెలంగాణ వాదుల్లో చర్చనీయాంశం అయ్యింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జేఏసీ ఎందుకు? ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నందున, తెలంగాణ జేఏసీ (పొలిటికల్) కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించాం. ఇక నుంచి ఉద్యోగుల సమస్యల పరిష్కారంతోపాటు బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముందుగా సాగాలని భావిస్తున్నాం. పైగా తెలంగాణ ఏర్పడిన తర్వాత టీజేఏసీ కొనసాగింపు అవసరం లేదని భాగస్వామ్య సంఘాలు గత సమావేశాల్లో ప్రతిపాదించాయి. అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగుల సమస్యలు, పీఆర్సీ బకాయిలు చెల్లింపు, హెల్త్‌కార్డుల అమలు వంటి అంశాలను త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపట్టాలని కోరుతాం. దశల వారీగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకుంటాం. ఉద్యోగుల విభజన, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, ఆదాయ పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు, కేంద్రం అనుసరిస్తున్న ఉద్యోగ, వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమించాల్సిన అవసరం ఉన్నందున రాజకీయ జేఏసీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించాం. - రవీందర్‌రెడ్డి, హమీద్, టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు - మమత, సత్యనారాయణ, టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు -
టీఆర్ఎస్ గెలుపు.. హైదరాబాద్ కు మలుపు
ఆ పార్టీకి శుభాకాంక్షలు : టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు హైదరాబాద్ వికాసానికి దోహదం చేస్తుందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తొలిసారి హైదరాబాద్ ప్రజలు స్థిరమైన తీర్పునివ్వడంతో టీఆర్ఎస్ పార్టీ సొంతంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటోందని తెలిపారు. భారీ విజయాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీకి అభినందనలతోపాటు శుభాకాంక్షలు తెలిపారు. సెంట్రల్ వర్సిటీలో వివక్షకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వర్సిటీల్లో విద్యా హక్కుల పరిరక్షణకు జేఏసీ ప్రయత్నిస్తుందన్నారు. సర్కారు ప్రవేశపెట్టే బడ్జెట్‌పై జేఏసీ చర్చించి, కేటాయింపులపై ప్రభుత్వానికి సూచనలిస్తుందన్నారు. -
కాంట్రాక్టు వ్యవస్థే పెద్ద దోపిడీ
♦ కార్మికుల జీతాలను వాళ్లు సగం వీళ్లు సగం పంచుకుంటున్నారు ♦ పనిచేసే కార్మికులకే నేరుగా జీతాలు వెళ్లాలి ♦ విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ డైరీ ఆవిష్కరణలో కోదండరాం, హరగోపాల్ ♦ దశలవారీగా డిమాండ్లను పరిష్కరిస్తాం: ట్రాన్స్‌కో సీఎండీ సాక్షి, హైదరాబాద్: ‘‘కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థే పెద్ద దోపిడీ వ్యవస్థ. ప్రాణాలను పణంగా పెట్టి కాంట్రాక్టు కార్మికులు కష్టపడుతుంటేనే గ్రామగ్రామానికి కరెంటు వెళ్తోంది. కార్మికుల జీతాలను మాత్రం వాళ్లు సగం వీళ్లు సగం పంచుకుంటున్నారు. ఇంకెంత కాలం ఈ వ్యవస్థ కొనసాగుతుంది? పనిచేసే కార్మికుల జీతాలు నేరుగా వారికే వెళ్లాలి. దళారుల వ్యవస్థ పోవాలి’’ అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టు కార్మికులు కోరడంలో న్యాయం ఉందన్నారు. బుధవారం మింట్ కాంపౌండ్‌లో జరిగిన తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ డైరీ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల పోరాటాలకు అండగా ఉంటామని, వారికి న్యాయం జరిపిస్తామని హామీ ఇచ్చారు. బంగారు తెలంగాణ కాదు.. మానవీయ తెలంగాణను నిర్మించాలని ప్రొఫెసర్ హరగోపాల్ సూచించారు. ప్రతి మనిషి బతకడానికి సరిపడా జీతం ఉండాలని .. అప్పుడే తెలంగాణ వచ్చినందకు సార్థకత వస్తుందన్నారు. దశల వారీగా కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు హామీ ఇచ్చారు. కష్టపడి పనిచేయడంలో కాంట్రాక్టు కార్మికులు ముందుంటారన్నారు. మా ప్రాణాలు చులకనయ్యాయి! ‘‘కరెంటు తీగల మధ్య కాకుల్లా పనిచేస్తున్నాం. నిత్యం కార్మికులు ప్రమాదాలకు లోనై మరణిస్తున్నారు. శాశ్వత వికలాంగులుగా మిగిలిపోతున్నారు. మా ప్రాణాలు చులకనగా మారాయి. వచ్చే అరకొర జీతాలను దళారులే దోచుకుంటున్నారు. కాంట్రాక్టర్ల కమీషన్లు పోగా వచ్చే డబ్బుతో మా ఇళ్లు గడవడం లేదు. ప్రభుత్వం మా గోసను పట్టించుకోవడం లేదు’’ అని తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్.శ్రీధర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో ముందుండి పోరాడిన విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల జీవితాలు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మరింత దుర్భరంగా మారాయని వాపోయారు. 2015లో రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో 28-30 మంది కార్మికులు విధి నిర్వహణలో మృత్యువాత పడ్డారని, మరో 30 మంది వికలాంగులుగా మారారని చెప్పారు. తక్షణమే విద్యుత్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, దళారులతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే కార్మికులకు జీతాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, వెంకటనారాయణ, యూనియన్ కార్యదర్శి సాయిలు, పవర్ ఇంజనీర్ అసోసియేషన్స్ అధ్యక్షుడు సుధాకర్, 1104 యూనియన్ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, 327 యూనియన్ నేత రామకృష్ణ, సీఐటీయూ నేత కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ఉపాధి కరువైంది
యువత నిరాశలో ఉంది: టీజేఏసీ చైర్మన్ కోదండరాం చెన్నూర్: తెలంగాణలో ఉపాధి అవకాశాలు కరువయ్యాయని, పల్లెలు, పట్టణాల్లో యువత నిరాశతో ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది విద్యార్థుల ఆత్మబలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే వరకు ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి అధ్యక్షతన కోదండరాంకు పౌర సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కరువయ్యాయని అన్నారు. ‘‘జేఏసీ ఏ పార్టీకి సంబంధించింది కాదు. ప్రజా సమస్యలే జేఏసీ అజెండా. తెలంగాణ ఉద్యమాన్ని మొట్టమొదటి సారిగా ఇక్కడ్నుంచే ప్రారంభించాం. అభివృద్ధి కోసం చేసే పోరాటాన్ని సైతం చెన్నూర్ నుంచి ప్రారంభిస్తాం’’ అని అన్నారు. ఈ సన్మానం తనకు కాదని, తెలంగాణ ప్రజలందరికీ అని చెప్పారు. ఓపెన్ కాస్ట్ గనులతో అభివృద్ధికి విఘాతం కలుగుతోందని, భూగర్భ గనులు ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఫారెస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మూల సత్యనారాయణరెడ్డి, తెలంగాణ విద్యావంతుల వేది క రాష్ర్ట అధ్యక్షుడు గురిజాల రవీందర్ మాట్లాడారు. అనంతరం వానమామలై వరదాచార్యుల జయంతి ఉత్సవాల సందర్భంగా రేవెల్లి రామయ్య రాసిన పాటల సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ, ఉద్యోగ, మైనార్టీ, ప్రజాప్రతినిధులు, పలువురు సర్పంచ్‌లు, న్యాయవాదులు,సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు కమ్మల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రత్యక్ష కార్యాచరణలోకి టీజేఏసీ
♦ ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందంపై ఈఆర్సీకి కోదండరాం ♦ పీపీఏపై బహిరంగ విచారణ జరపాలని విజ్ఞప్తి ♦ ఆ ఒప్పందం ప్రజలు, ప్రభుత్వానికి గుదిబండగా మారుతుందని ఆందోళన ♦ ఈఆర్సీ చైర్మన్‌ను కలిసిన టీజేఏసీ బృందం సాక్షి, హైదరాబాద్: సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి పోరాటాలతో తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని టీజేఏసీ.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత స్తబ్దుగా ఉండిపోయింది. ఉద్యమ కాలంలోనే టీఆర్ఎస్, టీజేఏసీ మధ్య అభిప్రాయ భేదాలకు బీజాలు పడగా.. రాష్ట్రం ఏర్పడిన అనంతరం కూడా సఖ్యత కుదరలేదు. కోదండరాం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రత్యక్ష ఆరోపణలు, పోరాటాలకు దిగిన సందర్భాలు లేవు. ఎట్టకేలకు ఆయన మౌనం వీడారు. విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్‌గఢ్‌తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం(పీపీఏ)పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో... దీనిపై బహిరంగ విచారణ జరపాలని కోదండరాం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ)ని కోరారు. కోదండరాం నేతృత్వంలో టీజేఏసీ ప్రతినిధుల బృందం మంగళవారం టీఎస్ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీ ఖాన్‌ను ఆయన కార్యాలయంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. ఈ బృందంలో టీఎన్జీవోల అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, టీజీవోల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ, అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అధ్యక్షుడు ఖాజా మొయినుద్దీన్, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయ కర్త కె.రఘు తదితరులున్నారు. టీజే ఏసీ వినతిపత్రంలో ఏముందంటే.. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం టీజేఏసీ సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం క్రియాశీలకంగా పనిచేస్తోంది. రాష్ట్రంలో వనరులు సద్వినియోగం కావాలనే ఆశయంతో ఈ విజ్ఞాపనను మీ ముందుంచుతున్నాం. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ పంపిణీ సంస్థ(సీఎస్పీడీసీఎల్), తెలంగాణ డిస్కం మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై వస్తున్న వార్తలు, ఈఆర్సీలో దాఖలైన అభ్యంతరాల పట్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ ఒప్పందం యథాతథంగా అమలైతే విద్యుత్ వినియోగదారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర భారం పడనుంది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇలాంటి ఒప్పందాలపై సమీక్ష జరిపే అధికారం ఈఆర్సీకి ఉంది. ప్రజలపై ప్రభావం పడే అంశాలపై బహిరంగ విచారణ జరపాలని హైకోర్టు సైతం గతంలో ఈఆర్సీని ఆదేశించింది. రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో వివాదాస్పద అంశాలపై అర్థవంతమైన పరిష్కారాల కోసం ఛత్తీస్‌గఢ్ పీపీఏపై బహిరంగ విచారణ జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పీపీఏపై కామెంట్ చేయను: కోదండరాం ఛత్తీస్‌గఢ్ పీపీఏను తామేమీ తప్పుపట్టడం లేదని, దీనిపై వస్తున్న అభ్యంతరాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని టీజేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. ఈ ఒప్పందంపై ఇప్పటికే వ్యక్తమైన అభ్యంతరాలు, డిస్కంల వివరణలపై బహిరంగ విచారణ జరపాలని మాత్రమే టీఎస్ఈఆర్సీని కోరామన్నారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ హామీ ఇచ్చారన్నారు. -
పౌర సమాజం మౌనం అణుబాంబు కంటే ప్రమాదకరం
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్: పౌర సమాజం మౌనం అణుబాంబు కంటే ప్రమాదకరమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. నిరంతరం ప్రశ్నించేతత్వం ఉండాలని, ఈ క్రమంలో సంయమనం పాటించాలన్నారు. ప్రొఫెసర్ ఎం.కోదండరాం ఉద్యోగ విరమణ సందర్భంగా శనివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ప్రజా స్వామ్యం- పౌర సమాజం’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాంను ఘనంగా సత్కరించారు. కోదండరాంను అభినందిస్తే పౌర సమాజాన్ని గౌరవించినట్లేనని అభిప్రాయపడ్డారు. రైతుల ఆత్మహత్యలు పెరిగినా నకిలీ విత్తనాలపై నియంత్రణ, పర్యవేక్షణ కరువైంద న్నారు. ఏ దేశంలో కూడా అపరిమితమైన వనరులు ఉండవని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమైన అంశంపైనే దృష్టి సారించాలన్నారు. మన దేశంలో రాజకీయ నాయకులను సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలని, ఆ ఫలితాలు అందరికీ దక్కాలనే భావనతో భవిష్యత్‌లో ప్రజల పక్షాన నిలబడి పని చేస్తానన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు గురజాల రవీందర్రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిప్పర్తి యాదయ్య, నాయకులు మల్లేపల్లి లక్ష్మయ్య, స్వర్ణలత, పి.రమ పాల్గొన్నారు. -
ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రైతు ఆత్మహత్యలు
-త్వరలో జేఏసీ కార్యాచరణ -ఎన్ కౌంటర్ ను వ్యతిరేకిస్తున్నాం హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై టీజేఎసీ చైర్మన్ కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరంలోని నాంపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన జేఏసీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష వైఖరి వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్య సంఖ్య విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరైంది కాదన్నారు. మరో వైపు సీఎం కేసీఆర్ కు, తమకు మధ్య గ్యాప్ ఉందని అనుకోవడం లేదన్నారు. రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ ను వ్యతిరేకిస్తున్నట్టు ఆయన తెలిపారు. మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపినట్టు అనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 30 న రిటైర్ అవుతున్నట్టు కోదండరాం వెల్లడించారు. రిటైర్డ్ అనంతరం కూడా పూర్తిస్థాయిలో జేఏసీకి సమయం కేటాయిస్తానన్నారు. 2,3 రోజుల్లో జేఏసీ కార్యాచరణ ప్రకటిస్తుందని తెలిపారు. -
సమగ్ర అవగాహనతోనే విజయం
* సిలబస్‌పై ఆందోళన అక్కర్లేదు * ప్రణాళికాబద్ధంగా చదివితే చాలు * మార్కెట్లో అనేక పుస్తకాలున్నాయ్ * ఎంపికలో జాగ్రత్త పడితే చాలు * గ్రూప్-1 సిలబస్ సబ్ కమిటీ చైర్మన్ ప్రొ. కోదండరాం * ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ సాక్షి, హైదరాబాద్: ‘‘నూతన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకంగా వ్యవహరించాల్సింది, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని వారికి సేవలందించాల్సింది కొత్తగా ప్రభుత్వోద్యోగాలు చేపట్టేవారే. అందుకే వారికి జాతీయాంశాలతో పాటు స్థానికాంశాలపైనా సమగ్ర అవగాహన తప్పనిసరి. కాబట్టే టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల్లో అంతర్జాతీయ, జాతీయాంశాలతోపాటు తెలంగాణపై ప్రత్యేకంగా ప్రశ్నలు అడిగేలా సిలబస్‌ను రూపొందించాం’’ అని టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు, గ్రూప్-1 సిలబస్ సబ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయన... వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధతపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రధానంగా గ్రూప్-1, 2, 3 తదితర పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, ఉద్యమ చరిత్ర, తెలంగాణ ఆవిర్భావం తదితరాలపై ప్రవేశపెట్టిన ప్రత్యేక పేపర్లకు ఎలా సిద్ధం కావాలన్న అంశాలపై ఇలా వివరించారు... కొత్త రాష్ట్రంలో ఉద్యోగంలోకి వచ్చే వారికి ఇక్కడి చరిత్ర, సామాజికాంశాలపైనా, రాజ్యాంగంపైనా స్థూల అవగాహన ఉండాలి. గ్రూప్-1ను తీసుకుంటే జనరల్ ఎస్సేకు ప్రిపేరయ్యే వారు చరిత్ర, భౌగోళిక శాస్త్రం, సంస్కృతి, భారత సమాజం, రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటివన్నీ చదువుకుంటే ఎస్సేతోపాటు ఇతర సబ్జెక్టులకూ బాగా సిద్ధం కావచ్చు. ఏ పోటీ పరీక్ష తీసుకున్నా దేశ, రాష్ట్ర చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, శాస్త్ర సాంకేతిక పురోభివృద్ధిలో అభ్యర్థి అవగాహనపై ప్రశ్నిస్తున్నారు. అదే గ్రూప్-2లో అయితే భౌగోళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు తక్కువ. 90 శాతం రైతులు రుణభారంలోనే ‘ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి’ పేపర్‌పైనే అభ్యర్థులు కొంత టెన్షన్ పడతారు. కానీ ఎకనామిక్స్ సబ్జెక్టుపై అభ్యర్థుల నుంచి లోతైన అవగాహన కోరుకోవడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ, స్వరూప స్వభావాలే అడుగుతారు. తెలంగాణలో నూటికి 60 మంది రైతులే. భూ సంస్కరణలు అమలై వ్యవసాయ రంగంలో మార్పులు సాధించుకున్న తర్వాతి పరిస్థితులేమిటన్నది అడుగుతారు. ప్రస్తుతం తెలంగాణలో నూటికి 80 శాతం చిన్న రైతులే. వారిలోనూ 90 శాతం మందిపై రుణభారముంది. ఒక్కొక్కరిపై సగటున రూ.95 వేల రుణభారముంది. విదేశాల్లో ఇది గరిష్టంగా రూ.45 వేలే ఉంది. మన వ్యవసాయ పరిస్థితులు, అంటే ఎక్కువగా బోర్లపై ఆధారపడటం వంటివే ఇందుకు కారణం. పట్టణీకరణ పట్టణ జనాభా ఇటీవల పెరుగుతోంది గనుక పట్టణీకరణ లక్షణాలేమిటన్నది తెలుసుకోవాలి. మన దగ్గర హైదరాబాద్ ప్రధాన నగరం. మిగితావి చిన్న నగరాలు. పట్టణీకరణతోపాటు పారిశ్రామిక ప్రగతి, అందులో ఉపాధి వాటా చూడాలి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల కంటే మన దేశంలో సేవా రంగంలో ఎక్కువ మంది పనిచేస్తుండటం విచిత్రం. తెలంగాణలో ఉద్యోగంలో చేరాలనుకునే వారికి ఇలాంటి ప్రధానాంశాలపై అవగాహన ఉండి తీరాలి. మన ఆర్థిక ప్రగతికి ప్రధానమైన వ్యవసాయ పరిస్థితిపై అవగాహన ఉండాలి. స్థూలంగా ఆయా రంగాలపై అవగాహన కావాలి. అలాగని దీనిపై గందరగోళం, టెన్షన్ అక్కర్లేదు. ప్రిపరేషన్ నిజానికి చాలా ఈజీ. ప్రామాణిక గ్రంథాలు దొరక్కపోయినా.. గ్రహించాల్సిందేమిటంటే చదివే ఇతర సబ్జెక్టుల్లో ఇవన్నీ కలిసే ఉంటాయి. ముల్కీ ఉద్యమం ఆలంబనగా తెలంగాణ అస్తిత్వ రూపకల్పన ముల్కీ ఉద్యమం ఆలంబనగా, దానిచుట్టూ అల్లుకొని సాగింది. 1952లో వచ్చిన ఉద్యమం దీనికి పరాకాష్ట. ఈ ముల్కీ ఉద్యమం ద్వారా తెలంగాణ వారు రెండు చెప్పారు. మేం వేరు. బయటి వారు రావచ్చు, బతుకవచ్చు. కానీ పెత్తనం చేయడానికి వీల్లేదు. రెండోది... మా సంస్కృతి ప్రత్యేకమైనది. అది వాణిజ్య సంస్కృతి కాదు. మాది సమష్టి తత్వం. ఇక్కడ భిన్న కులాలు, మతాలు, ప్రాంతాల వారు కలిసి జీవించగలరని చెప్పారు. నిజాం కాలంలో దీన్నే గంగా జమునా తెహజీబ్ అన్నారు. సహజీవనం నుంచి పెంపొందిన ఉమ్మడి సంస్కృతి తెలంగాణ జన జీవనానికి పునాది అని చెప్పుకొచ్చారు. ఇదే తెలంగాణ తెలంగాణ అస్తిత్వ రూపకల్పన. ‘ఇతర ప్రాంతాల వారు రావచ్చు. బతుకవచ్చు. అభ్యంతరం లేదు. కానీ మేం వారితో కలువం. ఎందుకంటే వారొస్తే పెత్తనం చేస్తారు’ అన్న ఆందోళన ఉంది. చారిత్రక నేపథ్యం కారణంగా భయాలున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును తెలంగాణ అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర ప్రాంతంతో కలిసేది లేదన్నరు. మా ప్రత్యేకతలు కాపాడుకుంటం, మా రాష్ట్రం మాకు కావాలని డిమాండ్ పెట్టారు. తెలంగాణ రక్షణలు తెలంగాణ ప్రత్యేకతలు, ఆకాంక్షలను గుర్తించి అప్పటి ప్రభుత్వాలు రక్షణలు కల్పించాయి. తెలంగాణ నిధులు తెలంగాణకే ఖర్చు చేయాలి, ముల్కీ నిబంధనలను అమలు చేసి తెలంగాణ ఉద్యోగాలను అక్కడి అభ్యర్థులకే ఇవ్వాలి, విద్యాలయాల్లో స్థానిక రిజర్వేషన్ల అమలును కొనసాగించాలి వంటివి పెట్టారు. కానీ అవేవీ అమలుకు నోచుకోలేదు. దీంతో 60వ దశకమంతా రక్షణల చరిత్ర, అవి అమలవుతాయా, లేదా అన్నదే. ఇవే ఇందులో ప్రత్యేకాంశాలు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన వైనం ఒక బలమైన ధనిక రైతాంగం ఆంధ్ర ప్రాంతంలో ఎదిగి, ప్రాంతీయ పార్టీల రూపంలో బలం పుంజుకొని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టింది. తెలుగుజాతి నినాదంతో వచ్చిన రాజకీయాలు తెలంగాణ అస్తిత్వానికి స్థానం కల్పించలేకపోయాయి. తెలంగాణ ప్రజల ఆర్థిక అవసరాలను చూడలేక పోయిది. దాంతో 1996లో మళ్లీ తెలంగాణ ఉద్యమం వచ్చింది. కనుక మనం చూడాల్సిందేమిటంటే... 1973 తరువాత జరిగిన పరిణామాల్లో తెలుగుజాతి రూపకల్పనలో తెలంగాణ అస్తిత్వం ఏమైపోయింది? తెలంగాణ ప్రజల ఆర్థిక పరిస్థితి ఏమైంది? మలి దశ ఉద్యమం ఇక తరవాత వచ్చింది మలి దశ ఉద్యమం. 1996 నుంచి 2001 వరకు భావవ్యాప్తి జరిగింది. 2001లో ఒక రాజకీయ వ్యక్తీకరణ దొరికింది. తెలంగాణ ఒక రాజకీయ ఆకాంక్ష సాధన కోసం ఉద్యమించడం ప్రారంభమైంది. తొలి దశలో ఈ ఉద్యమం రాజకీయ ప్రక్రియ చట్టపరిధిలో జరిగింది. యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమంలోనూ తెలంగాణ ఆకాంక్షను పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలోనూ చోటిచ్చారు. తరవాత అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని అందరిని ఒప్పిస్తామన్నారు. దానికి ప్రణబ్, రోశయ్య కమిటీలు వేశారు. కానీ ఏ కమిటీ కూడా సమస్య పరిష్కారానికి పూనుకోలేదు. దాంతో 2009లో మళ్లీ ఉద్యమం వచ్చింది. అప్పుడు భావవ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ మూడు ఏకమై సమ్మిళితంగా ఏకకాలంలో నడిచాయి. ఆఖరి భాగంలో పునర్వ్యవస్థీకరణ చట్టం ఆఖరి భాగంలో చదవాల్సింది... తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి. ఇది చాలా కీలకం. ఏ విభజనచట్టమై నా ఒకేలా ఉంటుంది. అయితే అంగాలుండాలి కదా. కొత్త రాష్ట్రం ఏర్పడితే సరిహద్దులను విభజించి, లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను పేర్కొని, హైకోర్టు, కార్యనిర్వాహక ఏర్పాటుకు చర్యలు చేపడతారు. రాష్ట్ర విభజనకు, ఉద్యోగుల విభజనకు, కార్పొరేషన్ల విభజన కు నిబంధనలు పొందుపరిచారు. మన దగ్గర ప్రత్యేకాంశం ఏమంటే హైదరాబాద్ కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నది, ఇరు రాష్ట్రాలకూ గవర్నర్ ఒక్కరే ఉంటారన్నది. అవసరమైతే హైదరాబాద్‌లో శాంతిభద్రతల్లో ఆయన జోక్యం చేసుకునే వెసలుబాటు ఉంటుంది కూడా. తెలంగాణ చరిత్ర చదివితే ప్రస్తుతమున్న తెలంగాణ ఉద్యమ మూలా లు తెలుస్తాయి. రాష్ట్రావిర్భావం దిశగా ఉద్యమం ప్రయాణించడానికి దారి తీసిన ఆర్థిక పరిస్థితులు మూడోదైన ఆర్థికాభివృద్థి పేపర్లోనూ ఉంటాయి. మితిమీరిన విశ్వాసం వద్దు తెలిసిన విషయాలే కదా అన్న మితిమీరిన విశ్వాసం వద్దు. ఈ అంశాలకు శాస్త్రీయ దృక్పథంతో సమాధానాలు రాయాలి. ఆధారాల్లేకుండా భావోద్వేగాలతో రాస్తే నష్టం జరుగుతుంది. ప్రత్యేక పేపర్ విషయంలో ఇలా.. గ్రూప్-1, 2, ఇతర పోటీ పరీక్షల్లో జనరల్‌స్టడీస్‌లో తెలంగాణ ఉద్యమం గురించి ఉంటుం ది. ఈ పేపర్లో స్థూలంగా తెలంగాణ అస్తిత్వం దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజలు చేసిన ప్రయత్నం, దాన్ని గుర్తించి, గౌరవిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలు తదితరాలు తెలుసుకోవాలి. అమలుకు నోచని ఒప్పందాలు తెలంగాణకు అప్పటి ప్రభుత్వాలు కల్పించిన రక్షణలో ప్రధాన అంశాలేమిటి, అవెలా అమలయ్యాయన్నది ముఖ్యం. రక్షణల అమలు కోసం ఏర్పడిందే ప్రాంతీయ రీజనల్ కమిటీ. అదేం చేసిందన్నది ముఖ్యం. రక్షణలు అమలు కానప్పుడు తెలంగాణ ప్రజలేం చేశారన్నది ప్రధానం. 1968 నుంచి రక్షణల అమలుకు ప్రయత్నం మొదలైంది. కానీ అవి అమలు కాకపోవడంతో ఆందోళన మొదలైంది. 1968లో ఉద్యమం వచ్చింది. 1972 వరకు సాగింది. రక్షణలను పటిష్టంగా అమలు చేయాలని, ముల్కీ నియామాలను గట్టిగా అమలు చేయాలని 1972లో కేంద్రం నిర్ణయించింది. రీజనల్ కమిటీ అధికారాలు పెంచింది. దీన్ని వ్యతిరేకిస్తూ, ‘రక్షణలైనా రద్దు చేయండి, రాష్ట్రాన్నయినా విడదీయండి’ అంటూ ఆంధ్రాలో జై ఆంధ్రా ఉద్యమం మొదలైంది. దాంతో కేంద్రం వెనక్కి తగ్గి రక్షణలను రద్దు చేసింది. చివరకు అన్ని ప్రాంతాల్లోనూ వెనకబడిన ప్రాంతాలు ఎక్కడున్నా అభివృద్ధికి సమాన చర్యలు చేపడతామని పేర్కొంది. ఏ ప్రాంత ఉద్యోగాలను ఆ ప్రాంతం వారే పొందే హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ తెలంగాణలో ఈ హామీ అమలు కాలేదు. ఏ పుస్తకాలు చదవాలంటే.. జనరల్స్టడీస్కు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు, రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాలు. 9, 10 తరగతుల టెక్స్ట్‌బుక్స్. ఇక భారత రాజ్యాం గాన్ని స్థూలంగా అంతా టెన్త్ వరకు చదువుతారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవి ర్భావం పేపర్‌కు శ్రీకృష్ణ కమిటీ నివేదికలో చాలా సమాచారముంది. ఇది తెలుగులోనూ దొరుకుతుంది. వట్టికోట ఆళ్వారు స్వామి తెలంగాణం పుస్తకం, సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ చరిత్ర, ప్రొఫెసర్ జయశంకర్ రాసిన తెలంగాణ రాష్ట్రం-ఒక డిమాండ్, ఆదిరాజు వెంకటేశ్వరరావు రాసిన ఉద్యమ చరిత్ర-తెలంగాణపోరాటం, గౌతమ్ పింగ్లే రాసిన ఫాల్ అండ్ రైజ్ ఆప్ తెలంగాణ, తెలుగు అకాడమీ పుస్తకాలు, తెలంగాణ చరిత్రపై పరిశోధన చేసిన వి.ప్రకాశ్ వంటివారి పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవచ్చు. తెలంగాణ.ఆర్గ్‌లో చాలా సమాచారం ఉంది. తెలంగాణ ఉద్యమం సమీకరణ దశ దాటి ఆవిర్భావం దిశగా సాగిన దశపై ప్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి ఎడిట్ చేసిన ‘ప్రపంచబ్యాంకు పడగ నీడలో’ పుస్తకం బాగుంటుంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన పలు సెమినార్లపై వచ్చిన పుస్తకాలూ ఉపయోగపడతాయి. అయితే ఎంతసేపూ ప్రామాణిక గ్రంథాల కోసమే చూడటం కాకుండా, అవగాహన ఏర్పరచుకోవడం ముఖ్యం. అలాగే గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుతెన్నుల్లో వచ్చిన మార్పులపైనా అవగాహన ఉండాలి. -
'అది హింసను ప్రోత్సహించేలా ఉంది'
వరంగల్: వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ హింసను ప్రోత్సహించే విధంగా ఉందని రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. చట్టపరంగా చర్య తీసుకోకుండా ఎన్కౌంటర్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇటువంటి సంఘటనలు పునఃరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలన్నారు. అంతేకాకుండా నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా ప్రతి పట్టభద్రునికి ఉద్యోగం వచ్చేలా నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు. గ్రూప్స్ రాసే అభ్యర్థులు ఆందోళన చెందకుండా సిలబస్‌పై పూర్తిగా అవగాహన పెంచుకోవాలన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జేఏసీ చైర్మన్, రైతు జేఏసీ స్టీరింగ్ కమిటీ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ మిర్చియార్డు ఆవరణలో శుక్రవారం తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సదస్సులో కూడా ఆయన మాట్లాడారు. బ్యాంకర్లకు రెవెన్యూ అధికారులు స్పష్టమైన ఆదేశాలివ్వకపోవడంతో రుణాలు మాఫీ కాక రైతాంగం అవస్థలు పడుతోందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడకూడదని, ధైర్యంగా ఉండాలని కోరారు. -
'రైతు ఆత్మహత్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు'
ఢిల్లీ: దేశంలో విదర్భా తర్వాత తెలంగాణలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయని టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. రైతు ఆత్మహత్యలు జరగలేదనడం వాస్తవం లేదని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతేడాది 800 మంది రైతులు చనిపోయారని కేంద్రప్రభుత్వం లెక్కలు చెబుతోందని విమర్శించారు. ఈ అత్మహత్యలన్నింటికి గత ప్రభుత్వాల ప్రభావమే కారణమన్నారు. రైతు ఆత్మహత్యల పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని మండిపడ్డారు. తక్షణమే హైకోర్టు విభజన చేయాలని కేంద్రహోం శాఖ మంత్రిని కోదండరామ్ కోరారు. -
'రైతు బకాయిలు బాబు పాపమే'
నిజామాబాద్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీకి గడ్డుకాలం ఎదురైందని, దీంతో చెరుకు రైతులు కష్టాల పాలవుతున్నారని జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. నిజాం కాలంలో వెలుగు వెలిగిన ఫ్యాక్టరీకి చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. చెరుకు పండని మిర్యాలగూడ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీని నెలకొల్పి బోధన్ ఫ్యాక్టరీని కష్టాలకు గురిచేశారన్నారు. దీనిని విక్రయించే యోచనతో టెండర్లు సైతం పిలిచారని అన్నారు. చెరుకు రైతులు బలహీనులు అయినందునే టీడీపీ ప్రభుత్వం వారిని మోసం చేసిందని ఆరోపించారు. ఫ్యాక్టరీని జాతీయం చేసేవరకు జేఏసీ రైతులకు అండగా ఉండి ఉద్యమిస్తుందని హామీ ఇచ్చారు. -
సంపూర్ణ తెలంగాణ లక్ష్యంగా.. పోరాటాలు
జయశంకర్ జయంతి రోజున నిరసన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గజ్వేల్: సంపూర్ణ తెలంగాణ సాధనే లక్ష్యంగా ఈనెల 6న ఫ్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా పోరాటాలను ముమ్మరం చేస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరామ్ వెల్లడించారు. మంగళవారం గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని లింగరాజుపల్లి, ముట్రాజుపల్లిల్లో రైతు జేఏసీ కన్వీనర్ ఫ్రొఫెసర్ జలపతిరావు, బృందంతో కలిసి ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా గజ్వేల్‌లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా వివిధ అంశాలకు సంబంధించి విభజన ప్రక్రియ పూర్తి కాక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల పంపిణీ 60శాతం పూర్తయినా మిగితాది పెండింగ్‌లో ఉన్నదని తెలిపారు. 54 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల విభజన సైతం నత్తనడకన సాగుతున్నదని వెల్లడించారు. ఆంధ్ర అధికారుల పెత్తనం కారణం, ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి నెలకొన్నదని ఆరోపించారు. రైతులను తక్షణమే ఆదుకోవాలి తీవ్ర వర్షాభావంతో కరువు బారిన పడ్డ రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరినట్టు ఫ్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. వానల్లేక రైతులు దుర్భరమైన పరిస్థితులను అనుభవిస్తున్నారని వాపోయారు. ఇన్పుట్ సబ్సిడీ పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా జీవోనెం. 421ను సవరించి రైతు ఆత్మహత్యబాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున సాయం అందే విధంగా చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా రైతుల పరిస్థితి మారలేదు. పంట రుణాలు అందక రైతులు మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. ఈ దుస్థితిని నివారించేందుకు కలిసికట్టుగా కషి చేయాల్సిన అవసరముంది' అని రైతు జేఏసీ కన్వీనర్, వ్యవసాయ విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ట్రార్ జలపతిరావు అన్నారు. -
ప్రజాసంక్షేమమే మా ఎజెండా
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వనపర్తిటౌన్: ‘ప్రజలు బాగుపడితే మేమే బాగు పడుతున్నట్లుగా ఆనందించి బతుకుతున్న వ్యక్తులం.. మాకు ప్రజల బాగోగులు తప్ప ఎలాంటి ఆశలు, ఆకాంక్షలు లేవు’ అని తెలంగాణ విద్యావంతుల వేదిక గౌరవ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఒకరిపై మరొకరు తిట్టిపోసుకునే రాజకీయాల జోలికి వెళ్లబోమని, రాజకీయాలు తనకు అవసరం లేదని స్పష్టంచేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలోని పాలిటెక్నిక్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) నిర్వహించిన ‘ప్రభుత్వ విద్య సంక్షోభం.. పరిష్కార మార్గాలు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక శ్వాస, ధ్యాసంతా అనునిత్యం ప్రజల వైపే ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ విద్యను నిర్వర్యీం చేసేందుకు, తన బంధువులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ రంగాన్ని తీసుకొచ్చారని కోదండరాం మండిపడ్డారు. బాబు నిర్వాహకం వల్లే ప్రైవేట్ పెత్తనం పెరిగి, ప్రభుత్వ విద్య పతనావస్థకు చేరిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రులు చొరవచూపాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పాఠశాలలో ప్రభుత్వం విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించి నైపుణ్యాలు పెంపొందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉద్యమించకపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బంది కలుగుతుందని వివరించారు. ఉపాధిహామీ, మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏమిటో అర్థంకావడం లేదని విస్మయం వ్యక్తంచేశారు. ఉపాధిహామీ కూలీల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తామన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేసి వాటి అమలుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్రావు, ఉపాధ్యక్షుడు ఆర్.విజయ్‌కుమార్, పబ్లికేషన్ కార్యదర్శి సతీష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజు, రవీందర్‌గౌడ్, జిల్లా మహిళా ప్రతినిధులు పుష్పలత, శారద పాల్గొన్నారు. -
మీ ఇంట్లో ముగ్గురు మంత్రులు.. మా ఇంట్లో రెండు పింఛన్లు వద్దా ?
హైదరాబాద్: " సీఎం కేసీఆర్ ఇంట్లో ముగ్గురు మంత్రులు ఉండవచ్చు కానీ మా ఇంట్లో ఇద్దరికి పింఛన్ వస్తే తప్పవుతుందా .." అంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వివరాలు.. అఖిల భారత రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా ఏడో మహాసభలు గురువారం సిరికొండ మండల కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సభలో ప్రొఫెసర్ కోదండరాం ప్రసంగం ప్రారంభించగానే బీడీ కార్మికులు లేచి తమకు జీవనభృతి రావడం లేదంటూ వాపోయారు. ఒక్కొక్కరు మాట్లాడాలని సూచించగా.. గడ్కోల్ గ్రామానికి చెందిన ఓ బీడీ కార్మికురాలు మాట్లాడుతూ.. "కేసీఆర్ ఇంట్లో ముగ్గురికి పదవులు ఉండగా లేనిది.. తమకు ఒక ఇంట్లో ఇద్దరికి పింఛన్లు ఇస్తే ఏంపోతుంది" అని ప్రశ్నించింది. -
'అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు'
సిరికొండ (నిజామాబాద్ జిల్లా): పంటలు సాగు చేసుకోవడానికి బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో అన్నదాతలు ప్రైవేటు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా ఏడో మహాసభలు గురువారం సిరికొండ మండల కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. వ్యవసాయంలో రైతులు నకిలీ విత్తనాలు, పురుగుల మందులతో కుదేలవుతున్నారని వాపోయారు. పంటల సాగుకు అయ్యే ఖర్చుతోపాటు అదనంగా 50 శాతం కలిపి పంటలకు మద్దతు ధర ప్రకటించాల్సి ఉండగా ప్రభుత్వాలు అలా చేయడం లేదన్నారు. ‘మిషన్ కాకతీయ’ రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి, చెరువుల్లో జరుగుతున్న పనులను రైతులు పర్యవేక్షించాలని సూచించారు. జీవనభృతి కోసం బీడీ కార్మికులు ఐక్యంగా ఉద్యమాలు చేస్తున్నారని, అన్నదాతలు మాత్రం తమ పంటలకు మద్దతు ధర కావాలని, సకాలంలో విత్తనాలు అందచేయాలని ఎక్కడా ఉద్యమాలు చేపట్టడం లేదన్నారు. రైతులు కూడా మహిళల లాగానే సహకార సంఘాలను ఏర్పాటు చేసుకొని హక్కుల సాధన కొరకు ఉద్యమించాలన్నారు. -
సినీ పరిశ్రమను రక్షించండి: కోదండరాం
హైదరాబాద్: రెండు, మూడు కుటుంబాల కబంద హస్తాల్లో ఉన్న సినీ పరిశ్రమను రక్షించాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. కోదండరాం నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర చిత్ర పరిశ్రమ సంఘం ప్రతినిధులు గురువారం సచివాలయంలో వాణిజ్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న పన్ను విధానం అశాస్త్రీయంగా ఉందని, అది బలవంతులు, ధనవంతులకే అనుకూలంగా ఉందని, ఈ స్లాబ్ విధానాన్ని తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టికెట్ల ఆధారంగానే పన్నులు వసూలు చేయాలన్నారు. చిత్ర పరిశ్రమలో కార్పొరేట్ గుత్తాధిపత్యం పోవాలన్నారు. ఒక ప్రత్యేక కమిటీని వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిత్రాలకు, తెలంగాణ కళాకారులతో నిర్మించిన చిత్రాలకు పన్ను రాయితీ కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పరిశ్రమకు అనుకూల ప్రకటన చేయాలని కోదండరాం కోరారు. -
కేసీఆర్‌తో స్పర్థలు లేవు
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కూసుమంచి: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, తనకు ఎటువంటి మనస్పర్థలు లేవని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఉద్ఘాటించారు. తెలంగాణ వికాసం కోసం పలు సంఘాలతో కలసి జేఏసీ కృషిచేస్తుందని అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వచ్చాక మీకు అంతగా గుర్తింపులేద ని ప్రచారం ఉందని విలేకరులు కోదండరాంను ప్రశ్నించగా, ఆయన తన సమాధానాన్ని దాటవేస్తూ తెలంగాణ వికాసం కోసం కృషిచేస్తామని అన్నారు. కాకపోతే తెలంగాణ ఉద్యమంలో ఎందరో భౌతికంగా, శారీరకంగా నష్టపోయారని, వారిని తెలంగాణ సమాజంతో పాటు ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. కొందరు ఉద్యమంలో లేకుండానే నేటి ప్రభుత్వంలో గుర్తింపు పొందుతున్నారని విలేకరులు అనడంతో రాజకీయాల్లో ఉన్నందునే వారికి రాజకీయంగా గుర్తింపు వస్తుందని అన్నారు. ఉద్యమంలో ఉన్నవారిని ఎవరూ మరువరని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడిందని, ఈ ప్రభుత్వంలో ప్రజలకు వారధిగా తాము ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. రైతుల ఆత్మహత్యలపై జేఏసీ తరుఫున త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించన్నుట్లు తెలిపారు.