తెలంగాణ జిల్లాల్లో అమరవీరుల స్ఫూర్తి యాత్రకు బయలుదేరిన టీజేఏసీ ఛైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరో విడుత అమరుల స్ఫూర్తి యాత్రలో పాల్గొనడానికి జనగామ వెళుతున్న జేఏసీ చైర్మెన్‌ను.. హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్ జోడిమెట్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను కీసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు.