Kodandaram (TJAC)
-
కోదండరాం తో సాక్షి స్ట్రెయిట్ టాక్
-
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా నామినేట్ అయిన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మండలి చైర్మన్ చాంబర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎం.ఎస్.ప్రభాకర్‌రావు, శాసనసభలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతోపాటు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ గుత్తా అభినందించడంతోపాటు వారికి గుర్తింపు పత్రం, మండలి నియమావళిని అందజేశారు. అనంతరం మండలి చైర్మన్, మంత్రులతో కలసి కోదండరాం, అమీర్ అలీఖాన్ గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తాజాగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. -
ఎమ్మెల్సీలుగా కోదండరాం,ఆమేర్ అలీఖాన్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామారెడ్డి (కోదండరాం), ఆమేర్ అలీఖాన్‌లను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా గతంలో నియమితులైన డి.రాజేశ్వర్‌రావు, ఫారూక్ హుస్సేన్‌ల పదవీకాలం 2023 ఏప్రిల్ 27తో ముగిసిపోగా, అప్పటి నుంచి ఈ రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు స్థానాల్లో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలని ప్రతిపాదించగా, నిబంధనల ప్రకారం వీరికి అర్హతలు లేవని గవర్నర్ తమిళిసై అప్పట్లో తిరస్కరించారు. ఈ అభ్యర్థులిద్దరూ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామారెడ్డి, ఆమేర్ అలీఖాన్‌ల పేర్లను ప్రతిపాదించగా, గవర్నర్ తమిళిసై సత్వరమే ఆమోదించారు. తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీ చైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరాం కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన తెలంగాణ జన సమితి (టీజేఎస్) పేరుతో పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇక ఆమేర్ అలీఖాన్ ఉర్దూ దినపత్రిక సియాసత్‌కి న్యూస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. -
కోదండరాంకు కీలక పదవి!
సాక్షి, హైదరాబాద్: రాజకీయ జేఏసీ చైర్మన్ హోదాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ కోదండరాం సేవలను కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వినియోగించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీజేఎస్ అధ్యక్షుడి హోదాలో ఆయన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సోమవారం సచివాలయంలో భేటీ కావడంతో ఈ చర్చ ఊపందుకుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఆయనకు రాష్ట్ర స్థాయిలో కీలక పదవి ఇస్తారని, లేదంటే ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కూడా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి దానికి వైస్‌చైర్మన్‌గా కోదండరాంను నియమించే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. బేషరతుగా మద్దతు... వాస్తవానికి తెలంగాణ జనసమితి (టీజేఎస్) ఏర్పాటు తర్వాత రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కోదండరాం కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డారు. 2018 ఎన్నికల్లో పార్టీ తరఫున కొన్ని స్థానాల్లో పోటీ చేసినప్పటికీ 2023లో ఒక్క అసెంబ్లీ స్థానం కోసం కూడా డిమాండ్ చేయకుండా బేషరతుగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. ఆ సమయంలోనే కోదండరాంకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన హోదా కలి్పస్తామని, తెలంగాణ అమరవీరుల సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత ఆయనకు అప్పగిస్తామని కాంగ్రెస్ వర్గాలు హామీ ఇచ్చాయి. మర్యాద పూర్వకమేనని చెబుతున్నా... టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం. నర్సయ్య సోమవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సచివాలయంలో కలిశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి భట్టిని కలిసి అభినందనలు తెలిపారు. భేటీలో భాగంగా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు, వాటిపై ప్రజల అభిప్రాయం, వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ప్రాధాన్యాలపై భట్టితో టీజేఎస్ బృందం చర్చించినట్లు సమాచారం. -
ప్రభుత్వ వ్యవహారాల్లో సహాయకులుగా వ్యవహరించేందుకు ..సలహాదారుల మండలి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సజావుగా సాగే క్రమంలో తనకు సహాయకారులుగా ఉండడానికి వీలుగా సలహాదారులతో కూడిన మండలిని ఏర్పాటు చేసుకునే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఏర్పాటయ్యే సలహామండలికి (అడ్వయిజరీ బోర్డు) చైర్మన్‌గా లేదంటే ముఖ్య సలహాదారుడిగా తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం నియమితులయ్యే అవకాశాలున్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తునట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే కీలక శాఖలపై పట్టు సాధించేపనిలో పడ్డారు. రాష్ట్ర మనుగడలో కీలకమైన ఆర్థికశాఖతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీవ్రచర్చకు కారణమైన విద్యుత్, సాగునీటి రంగాలపై ఆయన అధికారులను గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడిగారు. కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం రాష్ట్రంలోని కీలకశాఖల్లో ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు త్వరలోనే ప్రక్షాళన జరిగే అవకాశాలున్నాయి. మలిరోజే విద్యుత్‌శాఖపై సమీక్ష ప్రభుత్వం కొలువుదీరిన రోజే జరిగిన మంత్రివర్గ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వవర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. కేబినెట్ భేటీలో విద్యుత్ రంగంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ మరుసటిరోజే ఆ శాఖపై పూర్తిస్థాయిలో సమీక్ష చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతోందన్న రేవంత్ వ్యాఖ్యలు ఆ శాఖలో తీవ్రచర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కరెంట్ గురించి గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేదని, ఈ నేపథ్యంలోనే కరెంటు ప్రగతికి సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనలతోనే సీఎం ఆ శాఖను టార్గెట్ చేశారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్నటివరకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ నుంచి ఐదేళ్లుగా కరెంట్‌ను తీసుకున్నారని, బహిరంగమార్కెట్లో అధిక రేటుకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని లెక్కలతో సహా వెల్లడించారు. ఒకవేళ కరెంట్ కొనుగోలులో అవినీతి జరిగి ఉంటే దానిని కూడా ప్రజల ముందు ఉంచేందుకే రేవంత్ సిద్ధమవుతున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లుగా చేసిన ఖర్చులు, రాబడులకు సంబంధించిన వివరాలు సిద్ధం చేయాలని ఆర్థికశాఖ అధికారులకు తొలి కేబినెట్ భేటీలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచి్చన రేవంత్ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. తర్వాత ప్రాజెక్టులపై దృష్టి విద్యుత్, ఆర్థిక రంగాలపై సమీక్షలు, యాక్షన్‌ప్లాన్ తర్వాత సీఎం రేవంత్ సాగునీటి రంగంపై దృష్టి సారించే అవకాశముంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పాలమూరు–రంగారెడ్డిపై ఆయన ప్రత్యేక కసరత్తు చేస్తారని సమాచారం. -
మళ్లీ ‘చేయి’ కలిపిన కోదండరాం
సాక్షి, హైదరాబాద్: కోదండరాం మరోమారు కాంగ్రెస్ పార్టీ చేయిపట్టి నడవాలని నిర్ణయించుకున్నారు. 2018 ఎన్నికల సందర్భంగా మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో కలసి పనిచేసిన ఆయన ఈసారి ఎన్నికల్లోనూ ఆ పార్టీ పక్షానే నిలబడ్డారు. తెలంగాణ జనసమితి (టీజేఎస్) ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తుందని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేని నేపథ్యంలో తమ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తాయని, కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకే కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నామని ఆయన ప్రకటించారు. టీజేఎస్ మద్దతిచ్చేందుకు ఆరు డిమాండ్లను కాంగ్రెస్ ముందుంచారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ విధాన రూపకల్పనలో ఈ అంశాలకు తగిన ప్రాధాన్యతనివ్వాలని కోరారు. రేవంత్, ఠాక్రేతో చర్చలు.. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ పెద్దలు, రాష్ట్ర నాయకత్వంతో చర్చించిన కోదండరాం ఎన్నికల వేళ మళ్లీ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. సోమవారం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే తదితరులు నాంపల్లిలోని టీజేఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతోపాటు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు, ధర్మార్జున్ తదితరులతో గంటకుపైగా చర్చించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై గత పదేళ్లుగా టీజేఎస్, కోదండరాం పోరాడుతున్నందున తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే వారి సహకారం అవసరమని రేవంత్ కోరారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తామని, ఎన్నికల క్షేత్రంలో ఇరు పార్టీల శ్రేణులు కలసి పనిచేసేందుకు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ విజ్ఞప్తిపట్ల సానుకూలంగా స్పందించిన కోదండరాం కాంగ్రెస్‌తో కలసి పనిచేసేందుకు అంగీకరించారు. చర్చల్లో భాగంగా టీజేఎస్ ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై కూడా చర్చించారు. సీట్లు కేటాయించాలంటే ఇప్పుడు మళ్లీ అధిష్టానంతో మాట్లాడాల్సి ఉంటుందని, ఈసారికి పోటీ లేకుండానే మద్దతివ్వాలని రేవంత్ తదితరులు కోదండరాం, టీజేఎస్ నేతలను కోరారు. వీలునుబట్టి ఇప్పటికైనా అవకాశం ఉన్న చోట పోటీకి అంగీకరించాలని, లేకపోయినా తమ మద్దతు ఇస్తామని టీజేఎస్ పక్షాన స్పష్టం చేశారు. అండగా ఉంటామన్నారు: రేవంత్ ఇరు పార్టీల చర్చల అనంత రం రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రా ష్ట్రంలో ప్రజాప్రభు త్వం ఏర్పాటు చేసేందుకు టీజేఎస్‌తో కలసి ముందుకెళతామన్నారు. టీజేఎస్ డిమాండ్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని, వాటిని నెరవేర్చడం కోసం సమన్వయ కమిటీని నియమించుకుంటామని చెప్పారు. టీజేఎస్ నుంచి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా కమిటీ ఉంటుందని వెల్లడించారు. ప్రజలకు కోదండరాంపై విశ్వాసం ఉందని, కాంగ్రెస్ అధిష్టానం సూచ న మేరకు ఆయన్ను కలసి మద్దతివ్వాలని కోరినట్లు వివరించారు. లక్ష్యాన్ని ముద్దాడే వరకు అండగా ఉంటా మని కోదండరాం హామీ ఇచ్చారని, సీట్లు ఓట్లు కంటే ఒక గొప్ప లక్ష్యం కోసం కలిసి పనిచేస్తున్నామని రేవంత్ వ్యాఖ్యానించారు. మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు రాష్ట్రంలో కేసీఆర్ ప్రైవేటు సైన్యంపై తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని రేవంత్ చెప్పారు. తమ ఫోన్ల ట్యాపింగ్‌తో పాటు హ్యాక్ చేస్తున్నారని, కాంగ్రెస్‌ను నియంత్రించాలన్న ఆలోచనలతోనే ఇలాంటి చర్యలు చేస్తున్నారన్నారు. తమకు సహకరించాలనుకుంటున్న వారిని బెదిరిస్తున్నారని, తాము ప్రైవేటుగా మాట్లాడిన మాటలను వింటున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సైన్యంలో పనిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఎంఐఎం, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. టీజేఎస్ 6 డిమాండ్లు ఇవే.. అందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించాలి. ఉపాధి, ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఆర్థిక విధానాల రూపకల్పన జరగాలి. ఏ సంవత్సరం ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను ఆ సంవత్సరమే భర్తీ చేయాలి. ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకు అవకాశాలు కల్పించాలి. సంప్రదాయ వృత్తులపై ఆధారపడి బతుకుతున్న వారికి ఆదాయ భద్రత కల్పించాలి. చిన్న, సూక్ష్మ, కుటీర పరిశ్రమల ఎదుగుదలకు చర్యలు తీసుకోవాలి. వాస్తవ వ్యవసాయ సాగుదారులను గుర్తించాలి. చిన్న, సన్న, కౌలు రైతుల ఆదాయ భద్రత సాధించాలి. భూమి హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామిక పాలన నెలకొల్పాలి. కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనారిటీ, పేదలకు పాలనలో, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి. ఉద్యమకారుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేయాలి. అమరుల కుటుంబాలకు సమగ్ర సాయం అందించాలి. -
కేసీఆర్ పాలన అంతమైతేనే తెలంగాణ అభివృద్ధి
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): ధనిక రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పాలన అంతమైతేనే తప్ప తెలంగాణ పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు శనివారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో ‘తెలంగాణ సమాఖ్య – ప్రజా సంఘాల ఉమ్మడి మేనిఫెస్టో’ను జస్టిస్ చంద్రకుమార్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో అప్పులు చేశారని, ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ప్రజా సంఘాల పోరాటాలకు అడ్డంకి కాదని, రాష్ట్రంలోని ప్రజా సంఘాలు ఏకమై కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ...బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని మోదీ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరూప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులు రవళిరెడ్డి, శ్యామల శ్రీను, హర్షవర్షన్ రెడ్డి, తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కరుణాకర్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ పార్టీలు చేతులు కలిపేనా? కాంగ్రెస్‌లో కొరవడిన స్పష్టత
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీలో స్పష్టత రావడం లేదు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు తెలంగాణ జన సమితి (టీజేఎస్), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లతో ఈసారి పొత్తు కుదిరే అవకాశముందనే చర్చ జరుగుతోంది. కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయం సమీపిస్తున్నా రాష్ట్రస్థాయిలో ఇంతవరకూ ఎలాంటి స్పష్టమైన ప్రతిపాదనలు లేకపోవడం, ఈ దిశగా ఎలాంటి తాజా కదలిక లేకపోవడంతో పొత్తు ఉంటుందా? ఉండదా? అనే అంశంపై పార్టీ కేడర్ గందరగోళానికి గురవుతోంది. ముఖ్యంగా సీపీఐ, సీపీఎంలతో పొత్తు విషయంలో అయోమయం నెలకొంది. వాస్తవానికి ఆ పార్టీలతో గతంలో ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగాయి. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌లో సీపీఐ నేత నారాయణతో మంతనాలు జరిపారు. కానీ ఇంతవరకు ఏమీ తేల్లేదు. కామ్రేడ్లు అడిగినట్టుగా భావిస్తున్న సీట్లపై ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును వేగవంతం చేయడంతో వామపక్షాలతో పొత్తు ఉంటుందా? ఉండదా? అన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.దీనిపై అధిష్టానం వీలున్నంత త్వరగా స్పష్టత ఇవ్వాలని, ఏదో ఒకటి త్వరగా తేల్చితేనే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని, లేదంటే గత ఎన్నికల్లో మహాకూటమి పొత్తు లాగానే విఫలమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఆరు స్థానాలపై టీజేఎస్ దృష్టి విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కూడా ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు సంప్రదించాయి. ఢిల్లీ నుంచి ఆయనతో మంతనాలు జరిగాయని, ఈ సందర్భంగా పార్టీ విలీనం ప్రస్తావన వచ్చిందని, ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ప్రొఫెసర్.. పొత్తుకు మాత్రం అభ్యంతరం లేదని చెప్పారని తెలిసింది. అయితే ఈసారి ఆరు స్థానాలపై టీజేఎస్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సూర్యాపేట, జహీరాబాద్, నర్సంపేట, ఎల్లారెడ్డి, గద్వాల, కోరుట్లపై ప్రధానంగా దృష్టి సారించామని, ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే మిగిలిన చోట్లా తమకు అభ్యర్థులు ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో బీఎస్పీతో సంబంధాలు ఎలా ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రతిపాదన ఉందని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. అయితే ఇంతవరకూ ప్రాథమిక స్థాయిలో కూడా చర్చలు ప్రారంభం కాకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఈసారి పొత్తుల విషయమై కాంగ్రెస్ పార్టీలో రెండు అభిప్రాయాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు వీలున్నన్ని తక్కువ స్థానాలు ఇచ్చి పొత్తు కుదుర్చుకుంటే మంచి ఫలితం వస్తుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరికొందరు మాత్రం ఏ పార్టీ తోనూ పొత్తు అవసరం లేదని, ఒంటరిగా ఎన్నికలకు వెళితేనే కచ్చితంగా మేలు జరుగుతుందని అంటున్నారు. అయితే పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకులకు సమాచారం లేకుండానే ఇతర పార్టీలతో చర్చలు జరుపుతుండటంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. -
విద్యలో తెలంగాణ వెనుకబాటు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): విద్య విషయంలో ఇతర అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వెనుకబడి ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక, మదర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యాసామర్థ్యాలు అందించడం ప్రభుత్వ చట్టబద్ధత బాధ్యతగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, విద్యకు తెలంగాణ రాష్ట్రం బడ్జెట్లో అత్యంత తక్కువ ఖర్చు చేస్తోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చును విద్యపై పెడితే తెలంగాణలో ఉన్న స్కూల్స్ అన్నీ బాగుపడేవని చెప్పారు. కాంట్రాక్టర్లు కమీషన్లు ఇస్తారు కాబట్టే విద్యపై కాకుండా ప్రాజెక్టులపై ఖర్చు చేశారని విమర్శించారు. రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని, సరిపడా టీచర్లు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ శాంతాసిన్హా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దిగజారిన విద్యా ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో డ్రాపౌట్లు పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్య అందించకపోవడం రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘనగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వినర్ ఆర్.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక కన్వినర్ జి.వేణుగోపాల్, మదర్స్ అసోసియేషన్ కన్వినర్ జి.భాగ్యలక్ష్మి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరులు ప్రసంగించారు. -
నిరుద్యోగుల జీవితాలతో ఆటలు వద్దు
పంజగుట్ట: ఉద్యోగ, పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఇది సీఎంకు తగదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. కేసీఆర్ అసమర్థత వల్లే దాదాపు 15 పేపర్లు లీక్ అయ్యాయని ధ్వజమెత్తారు. ఇప్పటికీ లీకేజీ అసలు బాధ్యులను గుర్తించలేదన్నారు. ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నారు కాబట్టే విషయాన్ని బయటకు రాకుండా చూస్తున్నారని ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విద్యార్థులు, పలు పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ‘గ్రూప్ 2 వాయుదాకై నిరుద్యోగుల విన్నపం’ పేరుతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరామ్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు విఠల్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ గురుకుల టీచర్ల పరీక్షల నిర్వహణలోనూ లోపాలున్నాయన్నారు. దీనివల్ల నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులు ఆదివారం వరకు వేచి ఉండి అప్పటికీ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయకపోతే అన్ని లైబ్రరీల్లో, యూనివర్సిటీల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమన్నారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలన్నారు. -
ఆధ్యాత్మిక గురువుగానే సింహయాజీని కలిసాను : కోదండరాం
-
పార్టీ విలీనంపై కోదండరాం క్లారిటీ
-
ఎల్లుండి భారత్ బంద్ అందరూ పాటించాలి: ప్రజలకు ప్రతిపక్షాల పిలుపు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 27న జరగబోయే భారత్ బంద్‌కు ప్రతిపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బంద్‌ను జయప్రదం చేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయా పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు శుక్రవారం ఎంబీ భవన్లో మీడియాతో మాట్లాడారు. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, కోవిడ్ సమస్యలను పరిష్కరించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వం సాగుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన అనంతరం కాంగ్రెస్ నేత మల్లు రవి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు అచ్యుత రామారావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు డీజీ నర్సింహారావు, బెల్లయ్యనాయక్, బాలమల్లేశ్, కె.రమ, బక్క నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఫలితాలు: ఏం జరుగుతుందో?
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికలను తలపిస్తూ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈసారి పట్టభద్రుల తీర్పు రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలను దిశానిర్దేశం చేస్తుందన్న అంచనాలు ఉండటంతో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ ప్రధాన రాజకీయ పక్షాల్లో నెలకొంది. కాంగ్రెస్‌కు చావోరేవో... మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్ట భద్రుల స్థానంతోపాటు వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగ్గా ప్రస్తుతం హైదరాబాద్ స్థానం నుంచి బీజేపీ, నల్లగొండ స్థానం నుంచి టీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానాలు నిలబెట్టుకోవడంతోపాటు మరో స్థానంలో పాగా వేయడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పట్టభద్రుల ఎన్నికల్లో తలపడ్డాయి. అయితే ఈసారి అనుకూల ఫలితాలు వస్తే గతంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల వల్ల ప్రజల్లో కలిగిన అభిప్రాయం మారుతుందని, పట్టభద్రుల మెప్పు పొందగలిగితే మళ్లీ అనుకూల పవనాలు వీస్తాయని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇక బీజేపీ మాత్రం టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో అనుకున్న ఫలితం వస్తే తమకు ఎదురు ఉండదని, 2023 ఎన్నికలకు ధీమాగా వెళ్లవచ్చని లెక్కలు వేసుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో మాత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. గతంలో జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ తాజా రాజకీయ పరిస్థితులు తమకు లాభిస్తాయని, కేంద్ర, రాష్ట్రాలపై వ్యతిరేకతతో పట్టభద్రులు తమవైపే మొగ్గు చూపారని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఈ ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలిచినా 2023 ఎన్నికల వరకు ఆందోళన అవసరం ఉండదని భావిస్తోంది. ఒకవేళ ఈ ఎన్నికల్లోనూ ఓడితే పార్టీ పరిస్థితి ఖల్లాసేననే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. ప్రొఫెసర్లు... ఉద్యమకారులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న ఇద్దరు ప్రొఫెసర్లు ఎం. కోదండరాం, డాక్టర్. కె. నాగేశ్వర్‌ల రాజకీయ భవితవ్యాన్ని కూడా పట్టభద్రులు నిర్దేశించనున్నారు. ఈ ఎన్నికల్లో సానుకూల ఫలితం సాధించగలిగితే వారు మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తారని రాజకీయ వర్గాలంటున్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంతో కోదండరాం నల్లగొండ స్థానం నుంచి ప్రధాన పక్షాలకు గట్టిపోటీ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. అలాగే రంగారెడ్డి నుంచి నాగేశ్వర్ ఏ మేరకు పట్టభద్రులను ఆకర్షించగలిగారన్నది ఈ ఫలితాలు తేల్చనున్నాయి. తెలంగాణ ఉద్యమంతో దృఢ అనుబంధం ఉన్న డాక్టర్ చెరుకు సుధాకర్‌తోపాటు మరికొందరు ఈ ఫలితాలతో తమ రాజకీయ భవిష్యత్తుపై ఓ అంచనాకు రానున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. తమకు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌లు విడివిడిగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి ఇదివరకు విన్నవించారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకుగాను ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కమిటీ వేశారు. ఇతరులకు మద్దతు ఇచ్చే దాని కన్నా తామే బరిలో ఉందామని, పార్టీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు న్నాయని ఆయా జిల్లాల మెజారిటీ నేతలు కమిటీకి సూచించినట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌తో జరిగిన టీపీసీసీ ముఖ్యుల జూమ్ కాన్ఫరెన్స్‌లో కూడా అదే అభిప్రాయం వెల్లడైంది. కాగా, ఈ స్థానానికి మొత్తం 26 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ అభ్యర్థిత్వం వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్, మరో గిరిజన నేత బెల్లయ్యనాయక్‌ల పేర్లను కూడా తీవ్రంగానే పరిశీలిస్తున్నారు. మానవతారాయ్, బెల్లయ్య నాయక్‌లు సోమవారం పార్టీ పెద్దలను కలసి టికెట్ విషయమై తమ వాదనలను వినిపించారు. అయితే, టీపీసీసీ ముఖ్యనేతలు కసరత్తు పూర్తి చేసిన తర్వాత ముగ్గురు నేతల పేర్లను ఏఐసీసీకి పంపనున్నారు. రంగారెడ్డి ఆశావహులతో చర్చలు కాగా, రంగారెడ్డి–హైదరాబాద్– మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక పై సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజులు సమావేశమై పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించారు. ఈ స్థానానికి టికెట్ ఆశిస్తున్న ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.జి.వినోద్‌రెడ్డిలతో కూడా సంప్రదింపులు జరిపారు. టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, ఓబీసీ సెల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి, ఉపాధ్యాయ నేత హర్షవర్ధన్‌రెడ్డిలతోసహా 24 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలోంచి మూడు పేర్లను ప్రతిపాదించి మంగళవారం ఏఐసీసీకి పంపనున్నట్టు సమాచారం. పిటిషన్ పునర్విచారించాలని రేవంత్ అభ్యర్థన ఏసీబీ అభిప్రాయం కోరుతూ 18కి విచారణ వాయిదా సాక్షి, హైదరాబాద్: తమపై ఏసీబీ నమోదు చేసిన అభియోగాలను విచారించే పరిధి ఈ కోర్టుకు లేదంటూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం సిద్ధమవుతుండగా, పిటిషన్‌ను తిరిగి విచారించాలంటూ రేవంత్ ఏసీబీ ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. తన తరఫు న్యాయవాది వీడియో కాన్ఫరెన్స్‌లో కొన్ని కీలక అంశాలపై వాదనలు వినిపించలేకపోయారని అందులో పేర్కొన్నారు. మరోసారి విచారణ జరిపితే తమ వాదనలు పూర్తిగా వినిపిస్తామని విన్నవించారు. ఈ మేరకు అనుమతి మంజూరు చేసిన న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు... ఈ పిటిషన్‌పై అభ్యంతరం ఉంటే తెలియజేయాలని ఏసీబీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు. తమపై నమోదు చేసిన అభియోగాలను ఎలక్షన్ ట్రిబ్యునల్ మాత్రమే విచారించాలని, ఏసీబీ ప్రత్యేక కోర్టుకు విచారించే పరిధి లేదని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. కాగా, చంద్రబాబు అక్రమ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నందమూరి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం ఈ నెల 18న వెలువరించనుంది. -
ఆరు నెలల్లో ‘సింగరేణి’ ఖాళీల భర్తీ: ఎన్.శ్రీధర్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ఉన్న ఖాళీలన్నీ మరో ఆరు నెలల్లో భర్తీ చేస్తామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. గత ఐదేళ్లలో ప్రత్యక్ష, కారుణ్య, అంతర్గత నియామకాల పద్ధతుల్లో 16 వేలకు పైగా ఖాళీ పోస్టులను భర్తీ చేశామన్నారు. చాలా గనుల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ స్టాఫ్, సూపర్ వైజర్లు, మెడికల్ సిబ్బంది, స్పెషలిస్టు డాక్టర్లు తదితర పోస్టులను వెంటనే భర్తీ చేసి రక్షణతో కూడిన ఉత్పత్తి పెంచాలని ఉద్యోగ సంఘాలు చేసిన సూచనలపై ఆయన స్పందించారు. సింగరేణి యాజమాన్యం, మైన్స్ సేఫ్టీ డీజీ, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు/అధికారుల సంఘం ప్రతినిధులతో మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన 46వ రక్షణ త్రైపాక్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు కొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల్లో ఇంటర్నల్ కోటా పెంచి అర్హులందరికీ అవకాశం కల్పిస్తామన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా కార్మికుల రక్షణ విషయంలో పరికరాల కొనుగోలుకు సింగరేణి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగంపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి, ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ‘తెలంగాణ ప్రజల బతుకు దెరువు నిలబెట్టాలి, రాష్ట్రాన్ని కాపాడాలి’అన్న నినాదంతో జనవరి 3, 4 తేదీల్లో 48 గంటలపాటు నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2018 నుంచి ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో యువత గ్రామాల్లో ఉంటూ ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారని వాపోయారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు దాని ఊసెత్తలేదని విమర్శించారు. కరోనా అనంతరం అన్ని వ్యాపార సంస్థలను ప్రోత్సహించిన ప్రభుత్వం బడ్జెట్ స్కూళ్ల విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా ముంచేసిందన్నారు. -
తెలంగాణ ఇంటి పార్టీలో చేరిన వెదిరె చల్మారెడ్డి
సాక్షి, నల్గొండ: టీజేఏసీ వ్యవస్థాపకుడు కోదండరాం నాయకులను చేయగలరు కానీ.. ఆయన మాత్రం నాయకుడు కాలేరని వెదిరె చల్మారెడ్డి విమర్శించారు. టీజేఎస్ రైతు విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఆయన తన అనుచరులతో కలిసి తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చెరుకు సుధాకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం వెదిరె మీడియాతో మాట్లాడుతూ... ఏదైనా పార్టీలో సమష్టి నిర్ణయం ఉంటుందని కానీ, జన సమితిలో మాత్రం అభిప్రాయాలు అందరివీ తీసుకుని ఆఖరుకు నిర్ణయం మాత్రం కోదండరాం ఒక్కరిదే ఉంటుందని ఆరోపించారు. ఆయన నియంత పోకడలతో పార్టీని నాశనం చేశారని విమర్శించారు. ప్రస్తుతం పార్టీలో వంద మందితో సమావేశం ఏర్పాటు చేసే శక్తి పార్టీ నేతలలో ఒక్కరు కూడా లేరని, కేవలం భజనపరులే ఉన్నారని ఆయన ఎద్దేవ చేశారు. అలాగే చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. తాను నల్లగొండ జిల్లా వాసిగా వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో కలసి పనిచేద్దామని కూడా చెప్పానని, కానీ కోదండరాం తానే స్వయంగా నిలబడుతున్నానని తనకు మద్దతు ఇవ్వాలని కోరారని వెల్లడించారు. ఓ అభ్యర్థి ఇలా మద్దతు అడగటం చరిత్రలో ఇదే మొదటిసారని సుధాకర్ పేర్కొన్నారు. -
1,48,666 ఉద్యోగాలు ఖాళీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అయినా నిరుద్యోగ సమస్య తీరలేదని, ఆ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. శనివారం టీజేఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ఈ నెల 21న ‘హలో నిరుద్యోగ చలో అసెంబ్లీ’ పేరిట విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించా రు. రాష్ట్రంలో 1,48,666 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కొత్త జిల్లాలు, కొత్త మండలాల్లో దాదాపు 50,000కు పైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లాగా స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ఒక చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రైవేటు ఉద్యోగులకు సాయం చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించాలని, నాగులు లాంటి వాళ్లు ఆత్మహత్యయత్నం చేసుకున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించాలన్నారు. కొత్త చట్టంపై చర్చించాం.. కొత్త రెవెన్యూ చట్టంపై అఖిల పక్షంలో చర్చించామని కోదండరామ్ తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ చట్టంలో పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు. సాదా బైనామా, పోడు భూములు, అసైన్డ్ భూము లు, కౌలు రైతుల సమస్యలపై రెవెన్యూ చట్టంలో స్పష్టత ఇవ్వలేదన్నారు. అసైన్డ్ భూములను రైతుల దగ్గర నుంచి బెదిరించి ప్రభుత్వం తీసుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ అసెంబ్లీలో విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం చర్చించడం లేదని, నిరుద్యోగులకు ఎలాంటి భరోసా కల్పించడం లేదన్నారు. ఇదీ శాఖల వారీగా ఖాళీల లెక్క.. అగ్రికల్చర్–1,740, పశుసంవర్థక శాఖ–2,087, మార్కెటింగ్ శాఖ–583, బీసీ వెల్ఫేర్–1,027, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్–3,367, ఉన్నత విద్య– 12,857, ఎనర్జీ–26, పాఠశాల విద్య– 24,702, సివిల్ సప్లయ్స్–546, ఫైనాన్స్–1,375, జీఏడీ–984, హెల్త్– 23,512, హోం–37,218, హౌసింగ్–9, ఇరిగేషన్– 2,795, ఇన్ఫ్రాస్ట్రక్చర్–7, ఇండస్ట్రీస్–366, ఐటీ–3, లేబర్– 2,893, లా–1,854, లెజిస్లేటివ్– 300, మున్సిపల్–1,533, మైనారిటీ–51, పబ్లిక్అడ్మిన్–6, ప్లానింగ్–178, పంచాయతీరాజ్– 5,929, రెవెన్యూ–8,118, సోషల్ వెల్ఫేర్–5,534, రోడ్లు భవనాలు–962, ట్రైబల్ వెల్పేర్–5,852, మహిళా, శిశు సంక్షేమం–1,812, యూత్ సర్వీసెస్–440. -
రెవెన్యూ చట్టంపై తొందరపాటు వద్దు
హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రెవెన్యూ చట్టంపై తొందరపాటు వద్దని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడం, భూరికార్డులు చక్కదిద్దడం అవసరమేనని చెప్పారు. అయితే, నూతనంగా తీసుకొస్తున్న రెవెన్యూ బిల్లును ముందుగా సెలెక్ట్ కమిటీకి అప్పగించి విస్తృత చర్చ జరిగిన అనంతరం తుది రూపు ఇచ్చి చట్టం చేయాలని సూచించారు. ఉద్యోగులు, రైతుల హక్కులకు భంగం కలగకుండా చూడాలని కోరారు. రెవెన్యూ శాఖలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటానికి ఒక్క వీఆర్ఓలను బాధ్యులను చేయడం సమంజసం కాదని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే మితిమీరిన రాజకీయ జోక్యం పెరిగిందన్నారు. ప్రభుత్వ భూములు, అటవీ భూములు దున్నుకుంటున్న రైతులు, పేద, మధ్య తరగతి రైతులు, కౌలు రైతులకు హక్కులు కల్పించాలన్నారు. కాగా, ఎల్ఆర్ఎస్తో ప్రజలపై భారం పడుతుందని పేర్కొన్న కోదండరాం.. రెగ్యులరైజేషన్‌కు రుసుం విధించడం సమంజసం కాదని తెలిపారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఖాళీ కానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) నిర్ణయించింది. అందులో వరంగల్–ఖమ్మం–నల్లగొండ నియోజకవర్గం నుంచి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను బరిలో నిలపాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇక హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిని పోటీలో నిలపాలని నిర్ణయించింది. సోమవారం పార్టీ కార్యాలయంలో కోదండరామ్ అధ్యక్షతన జరిగిన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే దుబ్బాకలో జరగనున్న ఉప ఎన్నికలో కూడా పోటీ చేయాలని పార్టీ వర్గాలు నిర్ణయానికి వచ్చాయి. అయితే అక్కడ అభ్యర్థిగా ఎవరిని దింపాలి.. పోటీ చేస్తే పరిస్థితి ఏంటి..? గెలుపోటముల అవకాశాలు ఎలా ఉంటాయన్న అంశంపై అధ్యయనం చేసి, నివేదిక అందజేసేందుకు ముగ్గురు సీనియర్ నేతలతో కమిటీ వేయాలని నిర్ణయించారు. కమిటీ నివేదిక ఆధారంగా ముందుకు సాగనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జి.వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఇక హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీలో దిగేందుకు పార్టీ సీనియర్ నేతలు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్నందున ఇప్పటినుంచే పార్టీ సీనియర్లు ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
ఐక్యంగా పోరాడుదాం: సుధాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి, తెలంగాణ ఇంటి పార్టీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. శుక్రవారం టీజేఎస్ కార్యాలయానికి ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ వెళ్లారు. ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై చర్చించి రెండు పార్టీలు కలసి ఐక్య పోరాటాలు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఈ నెల 19న అసెంబ్లీ ముట్టడి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన తెలంగాణలో నియంతృత్వ పాలన నడుస్తోందని తెలంగాణ చెరుకు సుధాకర్ ఆరోపించారు. శుక్రవారం ఆదర్శ్‌నగర్‌లోని తెలంగాణ ఇంటి పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ వైరస్ తెలంగాణను ఏమీ చేయలేకపోయింది కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రజలందరినీ అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని చెరుకు సుధాకర్ ఆరోపించారు. -
మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి(టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం స్పష్టంచేశారు. సోమవారం టీజేఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2 రోజుల్లో విడుదల చేస్తామన్నారు. టీఆర్ఎస్ డబ్బులు పంచి గెలవాలని చూస్తోందని, ఓటర్ల జాబితాలో అవకతవకలున్నాయని ఆరోపించారు. జేఎన్‌యూలో జరిగిన ఘటన అప్రజాస్వామికమని, దీన్ని ఖండిస్తున్నామన్నారు. అలాగే యోగేంద్రయాదవ్‌పై జరిగిన దాడిని ఖండించాలని పిలుపునిచ్చారు. ఈనెల 8న నిర్వహించే గ్రామీణ భారత్ బంద్‌కు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. -
ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడదాం: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: కోర్టు తీర్పుపై గౌరవం ఉంచి, శాంతియుత పరిష్కారం కోసం సమ్మె విరమించి మంగళవారం ఉదయం విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులకు పార్టీ శ్రేణులు, పౌరసమాజం, ప్రజలు మద్దతుగా నిలవాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తిచేశారు. కార్మికుల కుటుంబాలకు ధైర్యం ఇచ్చేలా కార్యాచరణ ఉండాలని ఆయన ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆర్టీసీ జేఏసీ తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇస్తున్నామన్నారు. ప్రజారవాణా వ్యవస్థను నిర్వీర్యం చేసి, కార్మికుల పొట్టలు కొట్టే దుర్మార్గానికి ఒడిగట్టిన ప్రభుత్వం నేడు కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమిస్తామన్నా ఎటూ తేల్చక మొండిగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని టీజేఎస్ నాయకులు ఎక్కడికక్కడ ఎండగట్టాలని కోరారు. -
ఒకరోజు దీక్షకు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఎసి
-
వ్యూహం.. దిశానిర్దేశం
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. బరిలో ఉన్న ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున అధినేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఒక్కరోజే ఆపార్టీ ముఖ్య నేతల రాకతో హుజూర్‌నగర్‌లో రాజకీయ జోష్ కనిపించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నియోజకవర్గ కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. అలాగే తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆపార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కేడర్‌తో సమావే శం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొ ని పార్టీ అభ్యర్థి విజయానికి సమష్టిగా కృషి చే యాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. పార్టీ కేడర్‌తో పెట్టిన సమావేశానికి బీజేపీ జాతీయ నాయకులు హాజరయ్యారు. ఉప ఎన్నికల ప్రచారానికి ఈ రోజుతో కలిపి సరిగ్గా పదిహేను రోజుల సమయం ఉంది. సీపీఎం మినహా ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తున్నారో, బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య తేలడంతో ఇక అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆయా పార్టీల ముఖ్య నేతలంతా ఒకే రోజు హుజూర్నగర్ కేంద్రానికి వచ్చి పార్టీ కేడర్‌కు గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఉదయం నుంచిచి రాత్రి వరకు పార్టీల నేతల రాక, సమావేశాలు, ప్రచారాలతో హుజూర్నగర్ అంతా రాజకీయ కోలాహలానికి వేదికైంది. గులాబీ రోడ్డు షో.. ఈ ఎన్నికల ప్రచారానికి తొలిసారిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హుజూర్‌నగర్‌కు వచ్చారు. పట్టణంలో కేటీఆర్ రోడ్డు షో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర జిల్లాల ఎమ్మెల్సీలు కేటీఆర్ వెంట రోడ్డుషోలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కేడర్‌ను ఈరోడ్డు షోకు తరలించడంతో కేటీఆర్ పర్యటన భారీగా సక్సెస్ అయిందని, విజయం తమదేనని ఆపార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. కేటీఆర్ పర్యటన తర్వాత ఉమ్మడి జిల్లా ముఖ్యులతో కొంతసేపు మాట్లాడారు. ప్రచారాన్ని ఇంకా ఎలా ఉధృతం చేయాలి, కేడర్ ఇచ్చే సూచనలపై వీరితో చర్చించినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు ఇప్పుడు ఎక్కడకూడా జరగకుండా చూడాలని అభ్యర్థితో పాటు ముఖ్య నేతలకు సూచించినట్లు సమాచారం. టీఆర్ఎస్కు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది, ఈ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటర్‌రెడ్డి ఆపార్టీ కార్యకర్తలకు చెప్పారు. అందుకే కాంగ్రెస్‌కు మద్దతు.. ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చ లేదని, టీఆర్ఎస్ గెలిస్తే ప్రజల మద్దతు తమకే ఉందని రెచ్చిపోతోందని అందుకే తెలంగాణ జన సమితి .. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. విద్యా,వైద్య, వ్యవసాయ, ఇతర రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కేడర్‌కు సూచించారు. ఈ నెల 10 నుంచి ప్రచారం మరింత వేగిరం చేయనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఆయన కూడా ప్రచారంలో నేరుగా పొల్గొంటారని తెలిసింది. ఈ సమావేశానికి ముందు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్‌కు జన సమితి మద్దతు తెలపడంతో నియోజకవర్గంలో.. కాంగ్రెస్‌తో పాటు టీజేఎస్‌కు ఉన్న ఓట్లు ఎన్ని అని ఇతర రాజకీయ పార్టీల నేతలు అంచనావేస్తున్నారు. తామేంటో నిరూపించాలని.. ఈ ఎన్నికల్లో తామేంటో నిరూపించుకోవాలని, పార్టీ అభ్యర్థి చావా కిరణ్మయి విజయం కోసం కేడర్ పని చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ కార్యకర్తల సమావేశంలో చెప్పారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి తమ సత్తాచాటామని, ఉద్యమ సమయంలో టీడీపీని కొన్ని పార్టీలు ఇబ్బంది పెట్టినా.. తెలంగాణలో పార్టీ ఇప్పటికి బలంగా ఉందన్నారు. అ లాగే బీజేపీ అభ్యర్థి డాక్టర్ కోటా రామారావు విజయాన్ని కాంక్షిస్తూ జాతీయ కార్యవర్గ సభ్యు లు, పార్టీ ఉప ఎన్నికల ఇన్చార్జి పేరాల చంద్రశేఖర్ నేతృత్వంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఉప ఎన్నికల్లో బీజేపీ బీసీ అభ్యర్థికి టికెట్ కే టాయించడం బడుగు, బలహీన వర్గాలకు దక్కి న గౌరవమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓ ట్లు రాబట్టాలని పార్టీ నేతలకు వివరించారు. -
‘అగ్రిగోల్డ్’ పరిష్కారంలో జాప్యం సరికాదు
హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితుల కేసు కోర్టులో ఉందని సాకు చూపుతూ వారి సమస్యను పరిష్కరించడంలో జాప్యం చేయడం సరికాదని, సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తానంటే ఏ కోర్టూ అభ్యంతరం తెలపదని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నా రూ.1,150 కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు మంజూరు చేసిందని, తెలంగాణలోని బాధితులకు రూ.500 కోట్లు కేటాయిస్తే సరిపోతుందని, దీనిలో ముందుగా రూ.300 కోట్లు మాత్రమే కేటాయించాలని కోరుతున్నారని అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించి బాధితులకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్‌బాబు, అడ్వొకేట్ శ్రవణ్‌కుమార్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జస్టిస్ లక్ష్మణరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, సీపీఐ నగర కార్యదర్శి ఇ.టి.నర్సింహ హాజరయ్యారు. జస్టిస్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ సంస్థ నిర్వాహకులను ప్రభుత్వం అప్పుడే అరెస్టు చేసి ఉంటే బాగుండేదని, కానీ ఉదాసీనంగా వ్యవహరించడంతో వారు తమ ఆస్తులను బినామీల పేరిట బదలాయించారని, ప్రస్తుతం తమ వద్ద ఏమీ లేదని అంటున్నారని, ఇందులో ప్రభుత్వ తప్పు కూడా ఉందన్నారు. బాధితుల్లో 95% మంది పేదవారేనని, ప్రభుత్వం ఎన్నింటికో ఎన్నో ఖర్చు చేస్తున్నదని, రూ.500 కోట్లు బాధితులకు ఇవ్వాలన్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ పశ్చిమబెంగాల్లో శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో మోసపోయిన బాధితులకు అక్కడి ప్రభుత్వం న్యాయం చేసిందని, ఆ సంస్థ ఆస్తులను జప్తు చేసి బాధితులకు ఇచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణలో కూడా అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసి బాధితులకు ఇవ్వాలన్నారు. ధనిక రాష్ట్రంలో రూ.500 కోట్లు ఇవ్వలేరా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని, బాధితులకు రూ.500 కోట్లు ఇవ్వడం పెద్ద సమస్య కాదని అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో ప్రాజెక్టులు, నీళ్లు, పంపకాలపై సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ సమస్యపై కూడా దృష్టి సారించాలన్నారు. నర్సింహ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేసేందుకు ఎందుకు వెనకాడుతున్నదని ప్రశ్నించారు. ఇటీవల 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని, వారి సీటుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదేళ్లలో ఎన్ని పోరాటాలు చేసినా స్పందించలేదని, జగన్ మేనిఫెస్టోలో చేర్చగానే అధికారంలోకి వచ్చారన్నారు. -
ఈ నెల 29న ఇంటర్ బోర్డు ముందు ధర్నా చేస్తాం
-
ప్రజాసమస్యల పరిష్కారమే ఎజెండా
సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారమే తమ ప్రధాన ఎజెండా అని, పార్టీ లక్ష్యం అదేనని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. అందుకోసమే తాము పని చేస్తామని, ఆ దారిలోనే తమ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. డబ్బులు కుమ్మరించి, ప్రజలను మభ్యపెట్టి సాధించే గెలుపు తమకు అక్కర్లేదని, ఆ మార్గాన్ని తాము తిరస్కరిస్తున్నామన్నారు. గెలిచినా, ఓడినా ప్రజాసమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతామని, త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతోందని వివరించారు. లోక్‌సభ ఎన్నికల్లో టీజేఎస్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం సాక్షి ఇంటర్వ్యూలో వెల్లడించిన పలు అంశాలు.. సాక్షి: పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో తెలంగాణ జన సమితి గెలుస్తుందని భావిస్తున్నారా? కోదండరాం: ప్రస్తుతం ప్రచారమే కీలకం. గెలుపు, ఓటముల గురించి చర్చించే సమయం, సందర్భం ఇది కాదు. ఏ లక్ష్యం కోసం పోటీ చేస్తున్నాం.. ఏ మార్గంలో ప్రయాణిస్తున్నాం అనేది మా ప్రధాన కర్తవ్యం. ఈ ఎన్నికల్లో పార్టీ సిద్ధాంతాన్ని పరిచయం చేసుకోవడం, లక్ష్యాలను తెలియజేయడం, వాటి ఆధారంగా ప్రజలను సంఘటితం చేయడం, తద్వారా ప్రజాసమస్యల పరిష్కారానికి దోహద పడటం ప్రధానం. అలా గెలుపు వైపు ప్రయాణిండమే మా ముందున్న కర్తవ్యం. ప్రస్తుతం దాని కోసమే పని చేస్తున్నాం. మరోవైపు పార్టీ నిర్మాణాన్ని విస్తరించడం కీలకమైన అంశంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఈ ఎన్నికల్లో మేము రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాం. మూడు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినా ఒక స్థానంలో నామినేషన్ రిజెక్టు అయింది. ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్‌లో పోటీలో ఉన్నాం. హైదరాబాద్‌లో రిజెక్టు అయింది. అయితే ఈ పోటీని గెలుపోటముల అంశంగా మేము చూడట్లేదు. మేము ప్రయాణిçస్తున్న మార్గమే మాకు ముఖ్యం. ఎన్నికల్లో ప్రచారమే కీలకం. ఈ ప్రచారంతో పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నాం. అందుకోసమే మేము పోటీలో ఉన్నాం. టీజేఎస్ ప్రజలకు న్యాయం చేసేందుకే పోరాడుతుంది. ప్రజాహక్కులకు భంగం వాటిల్లకుండా ఉద్యమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ప్రజలకు వివరించి గెలుపొందాలన్నదే మా భావన. ప్రజాసమస్యలు అన్నపుడు ఆ రెండు స్థానాలనే ఎందుకు ఎంచుకున్నారు? మిగతా స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు కదా? మహబూబాబాద్‌లో అటవీ హక్కుల చట్టం అమలు కావట్లేదు. చట్టానికి విరుద్ధంగా గిరిజన, గిరిజనేతరుల భూములను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రభు త్వం వారిని ఖాళీ చేయించే పని చేస్తోంది. 83 వేల కుటుంబాలు తెలంగాణలో భూములను కోల్పోయే ప్రమాదం నెలకొంది. ఆ 83 వేల మం ది రైతుల సమస్యలను అటవీ హక్కుల చట్టం పరిధికి లోబడి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే మా కీలక లక్ష్యం. దాని కోసమే మహబూబాబాద్‌ను ఎంచుకొని పోటీ చేçస్తున్నాం. సీఎం16 స్థానాలు మేమే గెలుస్తాం.. వేరే పార్టీలకు అవకాశం లేదంటున్నారు కదా? మీరేమంటారు? ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలుస్తామనే చెబుతుంది. అదే లక్ష్యంతో పోటీ చేస్తుంది. మేమూ అదే చేస్తున్నాం. గెలుస్తామనే ఆలోచనతో రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాం. ఎవరూ ఓడిపోతామని ప్రకటించి పోటీ చేయరు. కేసీఆర్ చెబుతున్నదీ అదే. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు అనుసరించే వ్యూహం, ఎత్తుగడ అదే. అసెంబ్లీ ఎన్నికల నుంచి చాలా మంది నేతలు పార్టీకి దూరమయ్యారు. ఉన్న వారు సైలెంట్‌గా ఉన్నారు? ఈ పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? కొంతమంది వ్యక్తులుగా వెళ్లిపోయారు. నిర్మాణానికి నష్టం లేదు. కొంత మంది నాయకులు వెళ్లినంత మాత్రన ఏమీ కాదు. పార్టీ నిర్మాణం యథాతథంగా ఉంది. కార్యకర్తలు అంతా పని చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏ పనీ చెప్పడం లేదన్న అసంతృప్తిగా ఉన్నారు తప్ప మరేమీ కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని కోదండరాం లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు.. భవిష్యత్తులో పోటీ చేస్తారా లేదా? నేను పోటీ చేయాలా వద్దా అని సూత్రరీత్యా నిర్ణయమేమీ తీసుకోలేదు. ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడమే కీలకం అనుకున్నాం. ఆ పరిస్థితులనుబట్టే ముందుకు వెళ్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా పార్టీ నిర్మాణం, కేడర్‌గల నియోజకవర్గాల్లో స్థానిక నేతలకు అవకాశం ఇచ్చి పోటీలో దింపాం. అంతే తప్ప నేను పోటీ చేయకూడదని, పోటీ చేయబోనన్న నిర్ణయమేదీ లేదు. టీజేఎస్ ఏర్పడి 11 నెలలు అవుతున్నా ఇంకా పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేకపోయిందన్న విమర్శలపై ఏమంటారు? అది వాస్తవం కాదు. భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకాల్లో జరిగిన తప్పులు, పొరపాట్లపై విస్తృతంగా తిరిగాం. గ్రామాల్లోకి సమగ్ర సమాచారాన్ని సేకరించాం. గ్రామ సమావేశాలు నిర్వహించాం. పార్టీ బలంగానే ప్రజల్లోకి వెళ్లింది. నిర్మాణం విస్తరిస్తోంది. ఈ 11 నెలల్లో ఎంతగా వెళ్లాలో అంతటా వెళ్లాం. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేశాం. టీజేఎస్ అభ్యర్థులు దాదాపు 25–30 గ్రామాల్లో సర్పంచులుగా గెలిచారు. అంటే పార్టీ గ్రామ స్థాయికి వెళ్లినట్లే కదా. పైగా ఇవి పైసా వెచ్చించండా గెలిచిన స్థానాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాం. ఇప్పటికే జిల్లా పరిషత్తులవారీగా ప్రణాళికలను రూపొందించాం. అన్ని జిల్లాల్లోనూ టీజేఎస్ పోటీలో ఉంటుంది. పోటీ చేస్తున్న ఆయా స్థానాల్లో పార్టీ గెలుపు ఆలోచన లేదా? ప్రజాసమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, ప్రజల ఆదరణ పొంది గెలవాలన్నదే మా ఆలోచన. అలాగని ఎన్నికల్లో గెలుపు ఆలోచన లేదా అంటే ఉంది. మేము ఎంచుకున్న మార్గం ఇది. ఈ మార్గంలో ప్రయాణించి గెలుపు సాధించాలని ప్రయత్నిస్తున్నాం. గెలుపు వేరు, ఈ ప్రచారం వేరు అని కాదు. మేము ఎంచుకున్న మార్గంలో ప్రజల్లోకి వెళ్లాలని, ప్రచారం చేసి గెలువాలన్నదే మా తపన. మామూలుగా డబ్బులు కుమ్మరించి, మందు పోసి, ప్రజలను మభ్యపెట్టి గెలువాలన్న ప్రయత్నాలు బాగా సాగుతున్న సమయంలో మేము ఆ మార్గాన్ని తిరస్కరిస్తున్నాం. ఒక భిన్నమైన మార్గంలో ముందుకు సాగుతున్నాం. సిద్ధాంతాల ప్రాతిపదికన గెలవడానికి ప్రజలను వారి సమస్యల పరిష్కారం కోసం ఐక్యం చేయడం ద్వారా గెలవాలన్నది మా లక్ష్యం. ఇది కొత్తదేమీ కాదు.. రాజకీయాల్లో నిజంగా అనుసరించాల్నిస మార్గం ఇదే. ఆ మార్గాన్ని మేము అనుసరిస్తాం. గెలుపు కోసం కృషి చేస్తాం. -
3 స్థానాల్లో టీజేఎస్ పోటీ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలా.. వద్దా.. అన్న దానిపై తర్జనభర్జన పడిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఎట్టకేలకు మూడు స్థానాల్లో పోటీకి దిగింది. సోమవారం మహబూబాబాద్, హైదరాబాద్, ఖమ్మం స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ అధ్యక్షుడు కోదండరాం అభ్యర్థులకు ఉదయమే బీ–ఫాంలు అందజేశారు. హైదరాబాద్ నుంచి కవి అబ్బాసీ, మహబూబాబాద్ నుంచి అరుణ్‌కుమార్, ఖమ్మం నుంచి గోపగాని శంకర్రావు టీజేఎస్ తరపున నామినేషన్లు దాఖలు చేసినట్లు కోదండరాం వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తాము పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయం డబ్బుమయం.. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు దిగజారి పోతున్నాయని కోదండరాం అన్నారు. నాయకులు ఒకే పార్టీలో చివరివరకు ఉండటం లేదని, 1969 నాటి పరిస్థితులు ఇప్పుడు కనపడుతున్నాయన్నారు. రాజకీయం డబ్బుమయం అయిందని చెప్పారు. 14 ఎంపీ సీట్లున్నా టీఆర్ఎస్ చేసిందేమీ లేదని, బీజేపీ కూడా విభజన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. టీజేఎస్ బలోపేతంపై తాము దృష్టి పెడుతున్నామని తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో గిరిజనులు, మైనారిటీలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.. నిజామాబాద్ రైతులను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం సరికాదని, అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కోదండరాం అన్నారు. నామినేషన్ వేసిన రైతులపై కేస్లు పెడుతున్నారని, ఆ రైతుల వెంట తాము ఉంటామని భరోసానిచ్చారు. తెలంగాణ ప్రజలు, ఆంధ్రా ప్రజలు అంటూ కొంతమంది ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటివి మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ప్రజలు తిరుగుబాటు చేస్తేనే పరిస్థితులు మారుతాయని కోదండరాం పేర్కొన్నారు. -
అత్యంత ప్రమాదంలో ప్రజాస్వామ్యం
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉందని, రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వం అదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తోందని అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ‘పార్టీ ఫిరాయింపులు– రాజ్యాంగ వ్యతిరేక పాలన’అనే అంశంపై శనివారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. కార్యక్రమంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ప్రజాగాయకుడు గద్దర్, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ పాల్గొన్నారు. కోదండరాం మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత సంక్షోభం ఉందని, అందుకే అంతా మనవాళ్లే ఉంటే ఏ సంక్షోభం వచ్చినా ఎదుర్కోవచ్చని ఫిరా యింపులను ప్రొత్సహిస్తున్నారన్నారు. ‘నీకన్నా బలమైన నాయకుడు వస్తే, నీ పార్టీ వారిని కూడా ఇలానే కొనుగోలు చేస్తారు. అప్పుడు నీవు ఒంటరిగా నిలబడతావన్న విషయం గుర్తుంచుకోవాలి’ అని కేసీఆర్‌కు హితవు పలికారు. ఒత్తిడికి గురి చేసి పార్టీలో చేర్చుకుంటున్నారు... భట్టి విక్రమార్క మాట్లాడుతూ అధికారాన్ని ఉపయోగించి, ఒత్తిడికి గురి చేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించాల్సిన డబ్బును ఎమ్మెల్యేలను, ఓటర్లను కొనుగోలు చేసేందుకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ నియంత వైఖరికి వ్యతిరేకంగా, ఫిరాయింపుల చట్టం పటిష్టతకు దేశవ్యాప్త ఉద్యమం తీసుకువస్తామని తెలిపారు. భారత రాజ్యాంగంపై చేయిపెట్టి ప్రమాణస్వీకారం చేసి అదే రాజ్యాంగాన్ని భస్మం చేసేలా వ్యవహరిస్తున్నారని గద్దర్ అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ లోక్‌సత్తా అధ్యక్షుడు మన్నారం నాగరాజు, వివిధ పార్టీల, సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కవితపై పోటీకి... ఏ ‘రామ్’డొస్తాడో!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. లోక్‌సభ అభ్యర్థులపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న స్క్రీనింగ్, ఎన్నికల కమిటీ సమావేశాల్లో కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల దాఖలుకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఖరారు చేయాలనే కోణంలో పనిచేస్తోంది. దీంతో ఇప్పటికే ప్రచారంలో ఉన్న పేర్లలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్, మల్కాజ్గిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్, భువనగిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ దూకుడును ఏ నియోజకవర్గంలో ఎవరు తట్టుకోగలరనే అంచనాలతో జాబితాను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెల 15న జరగనున్న ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం 16, 17 తేదీల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆచి.. తూచి లోక్‌సభకు పోటీచేసే ఆశావహుల జాబితా ఎక్కువగా ఉండటంతో గెలుపు గుర్రాలను ఎంపిక చేసే క్రమంలో కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క సహా పలువురు ముఖ్యనేతలు.. ఆశావహుల జాబితాను ఢిల్లీ పెద్దల సమ క్షంలో వడపోస్తున్నారు. నిజామాబాద్ స్థానాన్ని ఎవరికి కేటాయించాలనే విషయంలో పెద్ద కసరత్తు చేస్తున్నారు. కేసీఆర్ కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే విషయంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ‘రామ్–రామ్’ మంత్రాన్ని ప్రయోగించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్.. నిజామాబాద్ నుంచి పోటీలో దిగితే ఆయనకు మద్దతు ప్రకటించాలని యోచిస్తున్నారు. వీలుంటే కోదండరామ్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దించాలనే ప్రతిపాదన ఉన్నా.. అది సాధ్యం కాదనే అంచనాతో మద్దతు ప్రకటన గురించి సంప్రదింపులు జరుగుతున్నాయి. పోటీకి ఆయన ఆసక్తి చూపని పక్షంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారామ్‌ను బరిలో దింపనున్నారు. దళిత నాయకుడికి జనరల్ సీటు ఇచ్చామనే కోణంలో సామాజిక అస్త్రాన్ని.. కవితపై ప్రయోగించాలని యోచిస్తున్నారు. ఈ రెండింటిలో కోదండరామ్ బరిలో ఉంటే మద్దతు తెలపడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మళ్లీ బరిలో రేవంత్ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లోక్‌సభ బరిలో ఉండే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగినా చివరి నిమిషంలో ఆయన పేరును మల్కాజ్గిరి స్థానానికి కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. ఆయన కూడా పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమనే సంకేతాలను ఇప్పటికే ఇచ్చారు. రేవంత్ కాని పక్షంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, హైదరాబాద్ నగర మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డిల్లో ఒకరికి కేటాయిస్తారని తెలుస్తోంది. ఇక, భువనగిరి స్థానాన్ని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ ఆశిస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువ ఉన్నాయనే కారణంతో ఆయన భువనగిరి వైపు మొగ్గు చూపుతున్నా.. చివరి నిమిషంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన సోదరుడు వెంకటరెడ్డి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే, తొలుత నల్లగొండ స్థానానికి వెంకటరెడ్డి పేరు పరిశీలించినా భువనగిరి వైపే ఆయన మొగ్గు చూపుతున్నారని, నల్లగొండలో పోటీకి జానారెడ్డి కూడా ఆసక్తిగా లేరని, ఈ పరిస్థితుల్లో పటేల్ రమేశ్‌రెడ్డి లేదంటే ఉత్తమ్ పద్మావతిల్లో ఒకరికి అవకాశం రావచ్చని తెలుస్తోంది. నామా పార్టీలోకి వస్తే.. ఖమ్మం నుంచి గాయత్రిరవి, రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డిల పేర్లను ఇప్పటివరకు పరిశీలనలోకి తీసుకున్నా తాజాగా మరో ఇద్దరు పేర్లు తెరపైకి వచ్చాయని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. ఇక్కడ గతంలో టీడీపీ ఎంపీగా పనిచేసిన నామానాగేశ్వరరావు కాంగ్రెస్‌లోకి వస్తే ఆయనకు టికెట్ ఇవ్వాలని, లేదంటే టీఆర్ఎస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ రాని పక్షంలో ఆయన్ను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చే ప్రతిపాదనలను కూడా అధిష్టానం పరిశీలిస్తోంది. మహబూబ్‌నగర్ విషయంలో డీకే అరుణ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. అరుణ కాని పక్షంలో.. టీఆర్ఎస్ టికెట్ రాదని భావిస్తున్న సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డి పార్టీలోకి వస్తే పోటీ చేయించే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది. ఆదిలాబాద్‌లో సోయం బాపూరావు సతీమణి భారతీబాయి తెరపైకి వచ్చింది. గతం నుంచీ పరిశీలనలో ఉన్న నరేశ్ జాధవ్, రమేశ్ రాథోడ్ల పేర్లు కూడా అధిష్టానం పరిశీలిస్తోంది. ఇక, పెద్దపల్లి నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, ఊట్ల వరప్రసాద్‌లతో పాటు మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ పేరును కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఏఐసీసీ కార్యదర్శులకు అవకాశం ఇవ్వాలా వద్దా అనే విషయంలో ఇంకా అధిష్టానం నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ అవకాశం ఇవ్వాలని నిర్ణయిస్తే నాగర్‌కర్నూలు నుంచి సంపత్‌కు అవకాశమివ్వనున్నారు. సిట్టింగ్‌ను కొనసాగించాలనుకుంటే మాత్రం నంది ఎల్లయ్యకే మరోసారి అవకాశం దక్కనుంది. దాదాపు ఖరారు హైదరాబాద్, సికింద్రాబాద్, జహీరాబాద్, మహబూబాబాద్ ,కరీంనగర్, మెదక్, చేవెళ్ల పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల విషయంలో దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఫిరోజ్‌ఖాన్ (హైదరాబాద్), అంజన్‌కుమార్‌యాదవ్ (సికింద్రాబాద్), కలకుంట్ల మదన్మోహన్రావు (జహీరాబాద్), పోరిక బలరాం నాయక్ (మహబూబాబాద్), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), గాలి అనిల్‌కుమార్ (మెదక్), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల)ల పేర్లు ఖరారయ్యాయని, ఈ పేర్లు అధికారికంగా ప్రకటించడమే మిగిలిందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
నాలుగు స్థానాల్లో పోటీ చేస్తాం : కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ నాలుగు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్, మల్కాజిగిరితో పాటు.. మరోక నియోజకవర్గంలో టీజేసీ సొంతంగా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. పోటీ లేని చోట కాంగ్రెస్‌కు బయట నుంచి మద్దతు ఇస్తామని తెలిపారు. పోటీలో ఉంటేనే భవిష్కత్‌లో తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్న ఉద్దేశ్యంతోనే ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ నెల 16,17న రెండు రోజుల పాటు భద్రాచలం నుంచి మేడారం వరకు ఆదివాసీ హక్కుల రక్షణ యాత్ర చేపడతామని చెప్పారు. -
అందుకోసం ఉద్యమం చేస్తాం: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: పంటలకు గిట్టుబాటు ధర కోసం ఉద్యమం చేస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. శనివారం జాతీయ రహదారుల మీద రైతుల వంటావార్పు ఉంటుందని వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. నిజామాబాద్ ఎర్రజొన్న, ఆర్మూర్ పసుపు పంట రైతులు సమస్యల్లో ఉన్నారని తెలిపారు. రైతులు పసుపు పంట అమ్ముకోవటానికి తెలంగాణలో మార్కెట్ కూడా లేదన్నారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. పసుపు బోర్డు వస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుందని అన్నారు. పసుపు పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని, పత్తి, మిర్చి, కందులు, జొన్న రైతులు చాలా దెబ్బ తిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంత్రుల క్యాబినెట్ లేకపోవడంతో సమస్యలు నివేదించే పరిస్థితి లేదని చెప్పారు. వ్యవసాయ శాఖకు మంత్రి కూడా లేడన్నారు. పంటకు గిట్టుబాటు ధర కోరితే ప్రభుత్వం దాడులు చేస్తోందని మండిపడ్డారు. పసుపుకు క్వింటాలుకు 15 వేల రూపాయలు, ఎర్రజొన్నలకు క్వింటాలుకు రూ.3500 మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. -
ఇంతటి తీవ్ర ఆరోపణలు ఎన్నడూ రాలేదు : కోదండరామ్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ఇందిరా పార్కు వద్ద నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ నంది ఎల్లయ్య, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్ పాషా, మాజీ మంత్రులుమర్రి శశిధర్ రెడ్డి, డీకే అరుణ, హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. అసెంబ్లీని రద్దు చేసి సీఎం కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం చూస్తే ఎన్నికల కమిషన్, టీఆర్ఎస్ కుమ్మక్కైన విషయం స్పష్టమైందని అన్నారు. తమతో చేతులు కలపడం వల్లే సీఎం కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరకు వెళ్లి ధన్యవాదాలు తెలిపారని ఆరోపించారు. ‘ఓట్ల గల్లంతుపై ప్రతిపక్షాలు మొత్తుకున్నా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు.. తీరా ఎన్నికలు అయినా తర్వాత రజత్ కుమార్ క్షపణలు చెప్పారు. ఎన్నికల్లో కూడా పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్య ఓట్ల తేడా వచ్చింది. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పేపర్ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలో పేపర్ బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలి. ఫలితాలకు ముందే ఇన్ని సీట్లు గెలుస్తామంటూ ప్రకటించుకున్న టీఆర్ఎస్ అదేవిధంగా అన్ని సీట్లను గెలవడం పట్ల అందరికి అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇంతటి తీవ్ర ఆరోపణలు ఎన్నడూ రాలేదు : కోదండరామ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ సొంత పనులకు వాడుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులే టీఆర్ఎస్కు ఓటు వేయాలని డబ్బులు పంచారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్ల గల్లంతుపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కోర్టుకు వెళ్లారు.. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాను సవరించుకుంటామని ఎన్నికల సంఘం చెప్పింది.. అయినా అసెంబ్లీ ఎన్నికలో 22 లక్షల ఓట్లు ఎందుకు గల్లంతయ్యాయని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వీవీప్యాట్లను తీసుకవచ్చారు. అభ్యర్థులకు అనుమానాలు ఉన్నచోట వాటిని లెక్కించాల్సింది.. ఈ విషయంలో ఈసీ రజత్ కుమార్ వ్యవహార శైలిపై అందరికి అనుమానాలు నెలకొన్నాయన్నారు. రజత్ కుమార్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అవకతవకలను అరికట్టాల్సింది ఎన్నికల సంఘం.. అలాంటిది వారే కంచే చేను మేసినట్లు ప్రవర్తించడం సరికాదని విమర్శించారు. ఎన్నికల సంఘం మీద ఇప్పటి వరకు ఇంతటి తీవ్ర ఆరోపణలు ఎన్నడూ రాలేదని అన్నారు. -
కాంగ్రెస్‌లో విలీనమా.. ముచ్చటే లేదు
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నాయకులు బట్టలు మార్చినంత సులువుగా పార్టీలు మారస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఎద్దేవచేశారు. గతంలో నమ్మిన సిద్దాంత కోసం పార్టీలలో ఉండే వారని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల లేవన్నారు. లోక్‌సభ ఎన్నికలు, పొత్తులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై శనివారం నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో కోదండరాం చర్చించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూటమి ఓటమిపై చర్చజరగలేదని తెలిపారు. కూటమిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై కూడా చర్చ జరగలేదన్నారు. రానున్న ఎన్నికలపై తమ పార్టీకంటూ అంతర్గతంగా ఓ ఆలోచన ఉందన్నారు. తెలంగాణ జనసమితి ఎట్టి పరిస్థితిల్లోనూ కాంగ్రెస్‌లో విలీనం కాదని స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమితో తాము నిరాశచెందలేదని.. రానున్న ఎన్నికలకు సిద్దంగా ఉన్నామన్నారు. పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే ఎన్నికలు రావడం ఓటమి చెందినట్లు భావిస్తున్నామన్నారు. సీబీసీఐడీ విచారణ జరగాలి రాష్ట్రంలో ఎన్నికల అధికారిపై కోదండరాం అనుమానం వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపుపై ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల అధికారిపై రాష్ట్రపతికి, కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తామన్నారు. సీబీసీఐడీతో ఎన్నికల అధికారిపై విచారణకు ఆదేశించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. ఇక ఏపీ ఎన్నికలకు వెళ్లే తీరికలేదన్నారు. ఆంధ్ర ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. -
సమైక్యంగా ఉద్యమిద్దాం
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలతోనే బీసీ రిజర్వేషన్ల తగ్గింపు ఆగిపోదని, భవిష్యత్తులో విద్య, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ల కోత తప్పదని పలువురు నాయకులు హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు, హక్కులకై పార్టీలకతీతంగా జెండాలు పక్కనపెట్టి బీసీలు సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకుని టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని, ఇందుకోసం గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రజలను చైతన్యం చేయా లని బీసీ సంఘాలు, కుల సంఘాలను కోరారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపును నిరసిస్తూ తెలంగాణ జన సమితి బీసీ విభాగం ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద నిరాహా రదీక్షలు నిర్వహించారు. దీక్షలను ప్రారంభించిన జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని చెప్తున్న సీఎం, పంచాయతీ ఎన్ని కల్లో ఇప్పటివరకు అమలు అవుతున్న 34% రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గిస్తూ ఆర్డినెన్స్ తేవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు 50% దాటవద్దనేది రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీసీ సంఘాలు, కుల సంఘాలు ఎవరి సంఘం వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప బీసీలను సంఘటితం చేద్దా మనే చిత్తశుద్ధి కనబడడంలేదని వాపోయారు. టీజే ఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ, రిజర్వేషన్లు తగ్గించడం ద్వారా బీసీలను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఈ తగ్గింపు పంచాయతీ ఎన్నికలకే పరిమితం కాదని, రానున్న అన్ని ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతుందన్నారు. రిజర్వేషన్లు ఆత్మగౌరవ హక్కుగా గుర్తించి దాన్ని కాపాడుకునేందుకు బీసీలు ఉద్యమించాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, మంత్రివర్గం లేకుండానే బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తేవడం శోచనీయమన్నారు. కుట్రపూరితంగా బీసీ రిజర్వేషన్లు తగ్గించారని.. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్య త్వ రద్దుపై రూ. 50 లక్షలు ఖర్చుచేసి, పెద్దపెద్ద అడ్వొకేట్లతో కోర్టులో వాదించిన ప్రభుత్వం రిజర్వేష న్ల తగ్గింపుపై మాత్రం స్థానిక అడ్వొకేట్లతోనే సరిపె ట్టిందన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ బీసీ రిజర్వేషన్లు తగ్గించే ఆర్డినెన్స్‌పైనే తొలి సంతకం చేయడం ద్రోహం చేయడమేనన్నారు. ఆర్డినెన్స్ తేవడం దుర్మార్గం: దాసోజు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ దళితులు సామాజిక అంటరానితనానికి గురవుతుంటే, బీసీలు రాజకీయ అం టరానితనానికి గురవుతున్నారన్నారు. అసెంబ్లీలో, అఖిలపక్షంతో, కుల, బీసీ సంఘాలతో చర్చించకుండా బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తేవడం దుర్మార్గమన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు ఎందుకుండకూడదని అన్న కేసీఆర్ బీసీ రిజర్వేషన్లు 22 శాతంకు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం అన్యాయమన్నారు. సీపీఐ నాయకులు సుధాకర్, కాంగ్రెస్ నాయకులు వినయ్‌కుమార్, సీపీఐ (ఎంఎల్) నాయకురాలు ఝాన్సీ, టీజేఎస్ నాయకులు గాదె ఇన్నయ్య, కె.దిలీప్‌కుమార్, పీఎల్ విశ్వేశ్వర్రావు, బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి అజెండాను ప్రచారం చేయటంలో విఫలమయ్యాం
-
ఆ వార్త అవాస్తవం: కోదండరాం
హైదరాబాద్: లోక్‌సభకు తాను పోటీ చేసే విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారన్న వార్త అవాస్తమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లో కోదండరాం విలేకరులతో మాట్లాడారు. కూటమి అజెండాను డోర్ టు డోర్ ప్రచారం చేయటంలో తాము పూర్తిగా విఫలమయ్యామని తెలిపారు. మంచి అజెండాను రూపొందించుకున్నా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని చెప్పారు. ప్రచారాన్ని సమర్ధవంతంగా అమలు చేయలేకపోవటమే కూటమి ఓటమికి కారణమన్నారు. కేసీఆర్ ప్రచారాన్ని తట్టుకోవాలంటే ప్రచారానికి కనీసం 50 రోజులు కావాలని కూటమి నేతలకు తాను చెప్పినట్లు వెల్లడించారు. ప్రచారానికి మూడు వారాలు చాలని కాంగ్రెస్, టీడీపీ నాయకులు చెప్పారని అన్నారు. మా హామీలు ప్రజలకు చేరవేయటంలో మేము విఫలమయ్యామని కోదండరాం అన్నారు. లోక్‌సభకు జరిగే ఎన్నికలు మరో విధంగా ఉంటాయని చెప్పారు. ఓటమి ద్వారా గుణపాఠం నేర్చుకోవటానికి తాము సిగ్గుపడటం లేదన్నారు. ఓటమితో మాపై మేం విశ్వాసాన్ని కోల్పోలేదన్నారు. గ్రామ , మండలస్థాయి నుంచి తెలంగాణ జన సమితిని బలోపేతం చేయటానికి ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్కు, కూటమికి మధ్య ఓట్ల వ్యతాసం కేవలం 22 లక్షలేనని తెలిపారు. బీసీలకు కనీసం 25 శాతం పంచాయతీలను రిజర్వ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధర, నిరుద్యోగ సమస్య, జీఎస్టీ లాంటి అంశాలు జాతీయ రాజకీయాలను ప్రభావం చూపబోతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల నిధుల అంశం కూడా జాతీయ స్థాయిలో కీలకం కానుందన్నారు. చరిత్రలో రెండు సార్లు మాత్రమే ఫెడరల్ ఫ్రంట్ సాధ్యమైందని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరల్ ఫ్రంట్‌కు అవకాశం లేదని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఎవరి కోసమో కేసీఆర్‌కే తెలియాలని వ్యాఖ్యానించారు. కూటమి ఓటమికి ఈవీఎంలే కారణమనేది సరైంది కాదన్నారు. కూటమి ఏర్పాటులోనే చాలా ఆలస్యం జరిగిందన్నారు. కేసీఆర్ ప్రచార శైలి మీకు తెలవదని కూటమి నేతలతో చెప్పినట్లు తెలియజేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పదిహేను రోజుల ప్రచారం చాలు అన్నారు..కానీ కేసీఆర్ వ్యూహాలు దగ్గరుండి చూశాను కాబట్టే 15 రోజులు చాలవని చెప్పినట్లు తెలిపారు. కేసీఆర్, చంద్రబాబుకు మధ్య ఏం ప్రేమ ఉందో, రిటర్న్ గిఫ్ట్ ఏం ఇస్తారో చూడాలని చమత్కరించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ అవ్వదని, ఫెడరల్ ఫ్రంట్ రెండు కారణాల ద్వారా సక్సెస్ అయ్యే అవకాశముందన్నారు. ఒకటి దేశాన్ని ప్రభావితం చేసేలా ఒక రాష్ట్రం సమస్యలను లేవనెత్తాలి లేదా నాలుగైదు రాష్ట్రాలు కలిపి సమస్యలను లేవనెత్తాలని వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్ ఇంతవరకు ఆ ప్రధాన సమస్యను గుర్తించలేదన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వెనక ఎవరున్నారో భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. -
రేపు గవర్నర్‌ను కలిసే అవకాశముంటుందో లేదోనని..!
సాక్షి, హైదరాబాద్ : రేపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగానే గవర్నర్ నరసింహన్‌ను కలిసినట్లు ప్రజాకూటమి నేతలు తెలిపారు. గవర్నర్‌తో భేటీ ముగిసిన అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీజేఎస్ కన్వీనర్ కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ విలేకరులతో మాట్లాడారు. ప్రజాకూటమికి రాజ్యాంగబద్ధత ఉంది : ఉత్తమ్ ఎన్నికలకు ముందే సమూహంగా ఏర్పడిన ప్రజాకూటమికే రాజ్యాంగబద్ధత ఉంటుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రేపు(మంగళవారం) ఫలితాలు వెలువడగానే అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానం పలకాల్సిన సందర్భం వస్తే కూటమిని ఒకే పార్టీగా పరిగణించాలని గవర్నర్‌కు విఙ్ఞప్తి చేశామని తెలిపారు. రేపటి రోజున గవర్నర్‌ను కలిసే అవకాశం దక్కుతుందో లేదోననే ఉద్దేశంతోనే ముందస్తు జాగ్రత్తగా ఆయనను కలిశామన్నారు. ఒకవేళ ఫలితాలు దగ్గరదగ్గరగా వస్తే మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమివ్వాలని కోరామన్నారు. పొత్తుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కు గవర్నర్ కు అందజేశామని తెలిపారు.గెలిచిన అభ్యర్థులకు భద్రత కల్పించాలని విఙ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. కూటమికే సంపూర్ణ మెజారిటీ : కోదండరాం కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐలతో కూడిన ప్రజాకూటమికే సంపూర్ణ మెజారిటీ వస్తుందని కోదండరాం అన్నారు. హంగ్ ఏర్పడే పరిస్థితే గనుక వస్తే ఇలాంటి విషయాల్లో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, సర్కారియా కమిషన్ నివేదికను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఏర్పాటు చేయాలన్నారు. కీడెంచి మేలు ఎంచాలి కదా : రమణ ప్రజాకూటమిని తెలంగాణ ప్రజలు ఆదరించారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందారని ఆరోపించారు. ఇదే తరహాలో ఇప్పుడు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్నందున కీడెంచి మేలు ఎంచాలనే తీరుగా ముందుగానే గవర్నర్‌ను కలిశామన్నారు. తన రాజకీయ మనుగడ కోసం, అధికార దాహంతో కేసీఆర్ ప్రతిపక్ష నేతలపై దాడులు చేయించిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. -
తార్నాకలో ఓటు వేసిన కొదండరాం
-
ఆశీర్వదించండి... ప్రజాపాలన తెస్తాం
సాక్షి, హైదరాబాద్: ప్రజలు కలలుకన్న తెలంగాణను నిర్మించడంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు విఫలమయ్యారని కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీ, ముస్లింలీగ్‌తో కూడిన ప్రజాకూటమి నేతలు ఆరోపించారు. ఆయన నియంతృత్వ, నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలగాలన్నా, ప్రజాపాలన రావాలన్నా తమను గెలిపించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే పాలనలో అందరినీ భాగస్వాములను చేస్తామని, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకూ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రైతుల పరిరక్షణ, యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. విజయవంతమైన డైనమిక్ తెలంగాణను నిర్మిస్తామన్నారు. ఇందుకు తెలంగాణ ప్రజలు ఈసారి తమను ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో విలేకరుల సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తెలంగాణ అధ్యక్షుడు ఘనీ సాహెబ్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ప్రజాగాయకుడు గద్దర్ మాట్లాడారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, ఏఐసీసీ అధికార ప్రతినిధులు మధుయాష్కీగౌడ్, రణదీప్‌సింగ్ సుర్జేవాలా, కర్ణాటక ఎంపీ నాసిర్ హుస్సేన్, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విలేకరుల ప్రశ్నలకు రాహుల్, చంద్రబాబు, ఉత్తమ్ సమాధానాలిచ్చారు. ఆ సమాధానాలు వారి మాటల్లోనే... కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిందే... రైతు సంక్షోభం అనేది జాతీయ సమస్య. రైతులంటే అప్పులే అనే భావనలో ప్రస్తుత పాలకులున్నారు. కానీ మేం జాతిసంపద అనుకుంటున్నాం. 15 మంది బడాబాబులకు రూ. 3.50 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన ప్రధాని మోదీ కోట్లాది మంది రైతులకు దాన్ని ఎందుకు వర్తింపజేయలేదు? మేం రైతు రుణమాఫీని తెలంగాణలో చేసి చూపిస్తాం. సాంకేతిక పరిజ్ఞా నంతో ఇక్కడి రైతులను జాతీయ, ప్రపంచ స్థాయిలో అనుసంధానిస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. రైతులకు గౌరవం లభించాలి. రైతుల భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నాం. కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం ఎవరు అవుతారనేది అప్రస్తుతం. కేసీఆర్‌ను గద్దెదించడమే మా మొదటి లక్ష్యం. అది జరిగిన తర్వాత సీఎం ఎవరనే చర్చ ప్రారంభమవుతుంది. మేం ఎవరికీ తాయిలాలు ఇవ్వాలనుకోవట్లేదు. ఉపాధి కల్పన, రైతుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తాం. జిల్లాస్థాయిలో స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తాం. విద్య, వైద్య రంగాలకు అదనపు నిధులు కేటాయిస్తాం. ప్రభుత్వ సంస్థల్లోనే నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తాం. నోట్ల రద్దు అనేది యువకులు టార్గెట్‌గా మోదీ చేసిన నేరం. ఆ నిర్ణయాన్ని కేసీఆర్ ఎలా సపోర్ట్ చేశారు? జీఎస్టీ అమలు ఇలా కాదని ఎందుకు చెప్పలేకపోయారు? అందుకు కారణం ఒక్కటే.. అవినీతి. ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి నేనేమీ జ్యోతిష్కుడిని కాదు. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం రావాలి. అందుకే మేం గెలుస్తామన్న విశ్వాసం ఉంది. ఇందుకు కేసీఆర్ వ్యవహారశైలి కూడా అద్దం పడుతోంది. గత కొన్ని రోజులుగా ఆయన ఆహార్యం, చేస్తున్న వ్యాఖ్యలు, తిట్లు ఆయన అభద్రతకు, నైరాశ్యానికి అద్దంపడుతున్నాయి. కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిందే. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి. ఇంకెవరినీ కన్విన్స్ చేయాల్సిన పనిలేదు. దేశంలోని అన్ని వ్యవస్థలపై మోదీ, అమిత్ షా దాడి చేస్తున్నారని చంద్రబాబు నన్ను కలిసినప్పుడు చర్చించుకున్నాం. – రాహుల్ తెలంగాణ నేతలే పాలిస్తారు... కూటమి అధికారంలోకి వస్తే అమరావతి నుంచి పాలన జరుగుతుందనే వ్యాఖ్యలు అర్థరహితం. రాబోయే కూటమి ప్రభుత్వంలో పాలన హైదరాబాద్ నుంచే జరుగుతుంది. తెలంగాణ నేతలే పాలిస్తారు. ఇందులో ఎవరికీ అనుమానం అవసరం లేదు. ఏమీ మాట్లాడటానికి లేకనే అసందర్భంగా కేసీఆర్ ఈ ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా ఇలాంటివి చెప్పి లబ్ధి పొందాలని చూస్తున్నారు. – ఉత్తమ్ కాళేశ్వరం తప్ప అన్నీ నేనే.. తెలంగాణలో కాళేశ్వరం తప్ప మిగిలిన ప్రాజెక్టులన్నీ నేను ప్రారంభించినవే. వాటిని కాంగ్రెస్ కొనసాగించింది. నేను ప్రాజెక్టులు అడ్డుకుంటాననేందుకు ఆధారాలున్నాయా? అదంతా తప్పుడు ప్రచారం. 2,500 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వాటిని 2 రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్ తయారు చేసింది ఎవరు? ఆ విజన్ నేనే ఇచ్చాను. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ఎక్కడ ఖర్చు పెట్టారు? మేమంతా కూర్చొని మాట్లాడుకొని అన్ని విషయాలను పరిష్కరించుకుంటాం. ఇప్పటికే మాట్లాడుకున్నాం. మేమంతా కలసి తెలంగాణను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇక్కడి పాలనలో నేను జోక్యం చేసుకునేది ఏమీ ఉండదు. తెలంగాణ ప్రజలే భాగస్వాములవుతారు. కోదండరాం కమిటీ మా మేనిఫెస్టోను అమలు చేస్తుంది. సమస్యలు, అభివృద్ధిపై మాట్లాడలేక టీఆర్ఎస్ నేతలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. – చంద్రబాబు -
ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థి : రాహుల్
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్దిని నిర్ణయిస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడే నిర్ణయించలేమన్నారు. కేసీఆర్‌ను ఓడించడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం యువత ఆశల్ని నీరుగార్చిందని, ప్రజలు కేసీఆర్‌పై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజల కలలు సాకారమవుతాయని అనుకున్నామని, కానీ కేసీఆర్ పాలన అందుకు విరుద్ధంగా సాగిందని ఆరోపించారు. రైతులకు అందుబాటులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ నాశనమైందని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుండగా బుధవారం సాయంత్రం ప్రజాకూటమి నేతలతో కలిసి మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కూటమికి పట్టం కట్టాలని కోరారు. దేశ రాజకీయాల్లో మలుపు.. దేశ రాజకీయాల్లో మార్పునకు ఇదే ఆరంభమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ధనికరాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారన్నారు. దేశంలో తెలంగాణ నెంబర్ వన్‌గా వెలుగొందాలన్నారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నానని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలి : కోదండరాం తెలంగాణలో నియంత పోకడలను అనుసరిస్తున్న టీఆర్ఎస్ సర్కార్ స్ధానంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పిలుపుఇచ్చారు. టీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో అనుకున్న ఫలితాలు రాలేదని, ప్రజల మద్దతుతో కుటుంబ పాలనను గద్దెదించుతామన్నారు. కూటమిలో సామాజిక న్యాయం : గద్దర్ ప్రజాకూటమిలో సామాజిక న్యాయం ఉందని గద్దర్ అన్నారు. తెలంగాణలో నియంతృత్వ సర్కార్‌ను కూల్చి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని కోరారు. తెలంగాణలో అహంకారపూరిత ప్రభుత్వం ఉందని సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. -
టీజేఎస్‌కు షాకిచ్చిన రచనా రెడ్డి
-
రైతులను దగా చేసిన కేసీఆర్: ఉత్తమ్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : చెరుకు, పసుపు రైతులను కేసీఆర్ మోసం చేశారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆర్మూర్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో పసుపు బోర్డు, నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామనే హామీలను కేసీఆర్, కవిత నెరవేర్చలేదని అన్నారు. తన మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా కేసీఆర్ చోటివ్వలేదని దుయ్యబట్టారు. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చాక చేపట్టనున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఉత్తమ్ వివరించారు. పసుపు బోర్డును ఏర్పాటు చేసి, క్వింటాల్‌కు రూ.10 వేల చొప్పున కొనుగోలు చేస్తామన్నారు. ఎర్రజొన్నకు రూ.3 వేల మద్దతు ధర ఇస్తామన్నారు. నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామన్నారు. జీఎస్టీని సమీక్షించి బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వీఏఓలకు రూ.10 వేల గౌరవ వేతనం అందిస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామన్నారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అరాచకాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మళ్లీ టీఆర్ఎస్ వస్తే.. పోలీస్ రాజ్యమే: కోదండరాం రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు పడిపోకుండా ఆపడం ఆ బ్రహ్మతరం కూడా కాదని తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం అన్నారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే పోలీసురాజ్యం వస్తుందని ఎద్దేవా చేశారు. నీళ్లడిగిన పాపానికి బాల్కొండలో 144 సెక్షన్ విధించారని అన్నారు. నిజాం ప్రభువులు దాశరథిని జైలులో పెడితే కేసీఆర్ రైతులపై కేసులు పెట్టించారన్నారు. ఆర్మూర్ ప్రాంతంలోని అన్ని గ్రామాల రైతులు ఆదర్శవంతులని అన్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో కూడా ఆదర్శవంతమైన సేద్యం చేస్తున్నారని చెప్పారు. ఉపాధి కోసం దుబాయ్ వంటి దేశాలకు వలస వెళుతున్నారని అన్నారు. బీడీ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ఈ వర్గాల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు. ప్రజా కూటమి అధికారంలోకి వచ్చాక బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని వివరించారు. దేశానికి రాహుల్ నాయకత్వం అవసరం: గద్దర్ దేశానికి రాహుల్‌గాంధీ నాయకత్వం అవసరమని ప్రజాగాయకుడు గద్దర్ పేర్కొన్నారు. భారతదేశం భాగ్యసీమరా.. అనే పాటను పాడి వినిపించారు. దేశానికి కొత్త నాయకత్వం అవసరమని ఆకాంక్షించారు. తెలంగాణ దొరల పాలైందని, యాగంలో కాలిపోయిందని తన పాట రూపంలో విమర్శించారు. ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, ఏఐసీసీ నాయకులు వి హనుమంత్‌రావు, మధుయాష్కి గౌడ్, మండలి విపక్ష నేత, కామారెడ్డి అభ్యర్థి షబ్బీర్ అలీ, మాజీ మంత్రి, బోధన్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, నిజామాబాద్‌రూరల్ అభ్యర్థి డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నాలుగేళ్లలో 39 కేసులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని తనపై కత్తికట్టాడని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో బుధవారం నిర్వహించిన ‘కొడంగల్ రణరంగం’సభలో ఆయన ప్రసంగించారు. ‘తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న నాపై ఈ నాలుగేళ్లలో కేసీఆర్ 39 కేసులు పెట్టించిండు. 40 రోజులు జైలులో పెట్టినా కూడా భయపడలేదు. ప్రజలు అండగా ఉన్నంత కాలం చివరి శ్వాస వరకు కేసీఆర్‌ను కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో వేయడానికి పోరాటం చేస్తా. ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదు.. కేసీఆర్ కుటుంబంలోని నలుగురికి, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరుగుతున్న పోరాటం. ఈ కురుక్షేత్రంలో ధర్మమే గెలుస్తుంది. కేసీఆర్ వైపు ధనం ఉంటే.. కాంగ్రెస్ వైపు ధర్మం ఉంది. అంతేకాదు తల్లి సోనియా ఆశీర్వాదం ఉంది. ఆమె ఆశీర్వాదం ఉంటే కొండనైనా పిండి చేసే శక్తి మనకు లభిస్తుంది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయకూడదు. ఒక్కసారి గెలిపిస్తేనే రూ.వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నడు. వందల ఎకరాల ఫాంహౌస్‌లు కట్టుకున్నడు. అలాగే కుటుంబం మొత్తానికి పదవులు ఇచ్చుకున్నడు. 1,200 మంది ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణ నీ కుటుంబం కోసమేనా? గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా నెరవేర్చావా అని కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నా. ఇయాల తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం నిలబడాలన్నా.. స్వయం పాలన జరగాలన్నా సామాజిక న్యాయం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి’అని అన్నారు. తెలంగాణ అంటే ఒక కుటుంబం కాదు: కోదండరాం ఏ ఒక్క హామీని సరిగా అమలు చేయలేని టీఆర్ఎస్కు పరిపాలన చేసే నైతిక అధికారం లేనే లేదని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ‘కేసీఆర్ ఎలాగూ నడమంత్రానే దిగిపోయిండు. మళ్లీ పిలిచి పట్టం కట్టాల్సిన అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చినం. కేవలం ఒకే ఒక ఆలోచనతో ప్రజల బతుకులు మారాలి. తెలంగాణ అంటే కేవలం ఒక కుటుంబం కాదు.. ఇక్కడ నివసించే నాలుగు కోట్ల ప్రజలు. వారి బతుకులు మారాలనే ఆలోచనతో అన్ని పార్టీలు ఏకమయ్యాం. ఈరోజు ఈయన ఎందుకున్నడు? ఆయన ఎందుకున్నడు? అని కొందరు అంటున్నరు. రాష్ట్ర ఏర్పాటు కోసం అందరం కలసి కొట్లాడలేదా? ఇవాళా అంతే... తెలంగాణ అభివృద్ధి కోసం కలసి నడుస్తున్నం. ప్రభుత్వం వచ్చాక హామీల అమలు కోసం ప్రత్యేక డిపార్ట్మెంట్ పెట్టి దానిలో అన్ని పార్టీల వారు భాగస్వామ్యులం అవుతం. చెప్పినవన్నీ అమలు చేయించడానికి ప్రయత్నం చేస్తం. మా గత చరిత్రను చూసి విశ్వసించి పీఫుల్స్ ఫ్రంట్‌ను గెలిపించండి. కేసీఆర్‌ను మళ్లీ ఫాంహౌస్‌కే పంపాలని కోరుతున్నా’అని అన్నారు. పీపుల్స్ ఫ్రంట్‌దే ప్రభుత్వం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిసెంబర్ 12న పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘నాలుగున్నరేళ్ల పాటు తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్న కేసీఆర్, కేటీఆర్ బట్టేబాజ్ మాటలతో మరోసారి తెలంగాణను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నరు. నీళ్లు తీసుకురాలే.. ఉద్యోగాలు ఇయ్యలే.. నిధులన్నీ వారి జేబుల్లోనే నింపుకున్నరు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతుంది. అలాగే పండే ప్రతీ పంటకు మంచి గిట్టుబాటు ధర ఇవ్వబోతున్నం. ప్రభుత్వంలో 1.07 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేసీఆర్ తన హయాంలో కేవలం 11వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిండు. అంటే కేసీఆర్ సన్నాసా.. దద్దమ్మనా? నాలుగున్నరేళ్లలో ఖాళీ ఉద్యోగాలను ఎందుకు నింపలేదు? రాబోయే ప్రజాఫ్రంట్ ప్రభుత్వంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నం. మెగా డీఎస్సీ నిర్వహించి 20వేల ప్రభుత్వ ఉపాధ్యాయులను భర్తీ చేస్తం. పింఛన్లు పెంచుతున్నం’అని వెల్లడించారు. -
‘ప్రజలకు జవాబుదారీ కోసమే కామన్ మేనిఫెస్టో’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో చిన్నాభిన్నమైన అన్ని వ్యవస్థలను పటిష్టం చేసేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపిందించామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. సోమవారం స్థానిక గోల్కొండ హోటల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఐ నేత పళ్లా వెంకట్ రెడ్డిలతో కలిసి మహాకూటమి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్(ఉమ్మడి ప్రణాళిక)ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. పది భాగాలుగా పలు అంశాలతో కామన్ మేనిఫెస్టో విడుదల చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ది విస్తరిస్తామని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు వ్యవసాయరంగం బలోపేతం, సంక్షేమ రంగాన్ని సైతం మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. మాది ‘ప్రజా ఫ్రంట్’: ఉత్తమ్ టీఆర్ఎస్ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన కూటమికి ‘ప్రజా ఫ్రంట్’గా నామకరణం చేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక నుంచి అందరూ అలాగే అభివర్ణించాలని ఆయన కోరారు. అన్ని పార్టీలు ఒప్పుకున్న వాటిని కామన్ మినిమమ్ ప్రోగ్రాంను విడుదల చేస్తున్నామన్నారు. అందరి ఆశీర్వాదంతో తమ కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోదండరాం కన్వీనర్‌గా కేబినెట్ హోదాలో మేనిఫేస్టో అమలుకు కృషి చేస్తారని ఉత్తమ్ తెలిపారు. విధానపరమైన డాక్యుమెంట్ అని ఎన్నికల నాటికి అవసరమైన మరిన్ని జోడించి ప్రజల్లోకి వెళతామని రమణ వివరించారు. కామన్ మేనిఫెస్టోతో ప్రజలకు జవాబుదారీ భరోసా కల్పిస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రస్తుతమున్న సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. -
హక్కుల పోరాటయోధుడు
హక్కుల పోరాటయోధుడు ఆయన మట్టి పరిమళాలు తెలిసిన వారే. స్వాతంత్య్రానంతరం తొలి తరం ప్రతినిధి. కొద్దిపాటి భూమితో గంపెడు సంసారాన్ని ఈదే నిరుపేద రైతు కుటుంబంలో పుట్టారు. ఆర్థిక, సామాజిక వెనుకుబాటుతనాన్ని చవిచూశాడు. కష్టపడి చదువుకున్నాడు. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సామాజికశాస్త్ర ఆచార్యులుగా ఎదిగారు. పాతికేళ్ల క్రితమే దళితుల మీద అగ్రవర్ణాల దాడిని చూసి చలించిపోయి, తన పేరు చివరన ఉన్న కులాధిపత్య చిహ్నాన్ని తొలగించుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షి. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ గా ప్రొఫెసర్ కోదండరాం పేరు తెలియనివారుండరు. తెలంగాణ ఉద్యమ ఎజెండాతో మొదలై ప్రస్తుత రాజకీయ ఉద్యమం వరకు సాగిన యాత్రలో ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం, విరమించుకోవడం రెండూ జరిగిపోయాయి. అయితే, ఆ విరమణకు కారణంగా ఆయన లక్ష్యసాధన ప్రధాన అంశంగా చెబుతారు. పేరు : ముద్దసాని కోదండరాం తల్లిదండ్రులు : జనార్దన్‌రెడ్డి, వెంకటమ్మ పుట్టిన తేదీ : సెప్టెంబర్ 5, 1955 ఊరు : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల సమీపంలోని జోగాపూర్. తండ్రి కరీంనగర్ జిల్లా మానకొండూరు నుంచి వచ్చి స్థిరపడ్డారు. నేపథ్యం : తండ్రి వ్యవసాయదారు. అయిదుగురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడు కుటుంబం : 1983 లో నిజామాబాద్‌కు చెందిన సుశీలతో వివాహం. అమె డిగ్రీ వరకు చదివారు. గృహిణిగా ఉన్నారు. కూతురు మైత్రి, కుమారుడు చేతన్ ఇంజనీరింగ్ పూర్తిచేసి అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరారు. చదువు : ప్రాథమిక విద్య వరంగల్ ► డిగ్రీ వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ► ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ► ఎంఫిల్ (చైనా అధ్యయనం) జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ ► పీహెచ్‌డి (తెలంగాణ మారుతున్న ఆధిపత్య సంబంధాలు) హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ► వృత్తి : రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు ► 1981 నుంచి పదేళ్లు నిజాం కాలేజి ► 1991 నుంచి పదేళ్లు కోఠి ఉమెన్స్ కళాశాల ► 2001 నుంచి మూడేళ్లు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆచార్యుడిగా, సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ఆచార్యుడిగా పనిచేశారు. రచనలు 1) మూడు దశాబ్దాల ‘నక్సల్బరీ ఉద్యమం - గమ్యం గమనం’ సంపుటిలో ఒక వ్యాసం 2) ‘తెలంగాణ ముచ్చట’ వ్యాస సంపుటి 3) ‘స్వేచ్చ’ పత్రికకు 1984 నుంచి 1998 వరకు సంపాదకుడు 4) వివిధ పత్రికలకు 25 పైగా వ్యాసాలు ఉద్యమ నేపథ్యం : పాతికేళ్ల ఉద్యమ జీవితం ► తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనరు. ► తెలంగాణ జన సమితి (టీజేఎస్) పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు, దానికి కన్వీనర్ గా కొనసాగుతున్నారు. ► కమ్యూనిస్టు, హేతువాది, పౌర హక్కుల ఉద్యమకారుడు. నెల జీతంలో సగానికిపైగా పేద విద్యార్థుల ఫీజులకు కేటాయిస్తారు. ► గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం, వారి ఆకలిదప్పులు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం విద్యార్ధి దశలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమం ► 1981 లో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల వేదిక(ఏసీసీఎల్సీ) సభ్యుడు ► 1985 లో కాంచేడులో దళితులపై దమన కాండకు చలించి కులాన్ని సూచించే విధంగా ఉన్న ‘రెడ్డి’ని తన పేరులోంచి తొలగించారు. ►‘1983-99 ఏసీసీఎల్సీ నగర్ కమిటీలో ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ►1999 లో బాలగోపాల్, జీవన్ కుమార్‌లతో కలిసి మానవ హక్కుల పై పోరాటం ►1989 నుంచి తెలంగాణ వెనుకబాటుతనంపై పోరాటం ► 1998-99 లో రాష్ట్రంలో ఆత్మహత్యలు, ఆకలిచావులు, కరువు, ఆదివాసీల ఆహార సమస్యపై ఆధ్యయనం ► 2001-04 మద్య తెలంగాణ ఐక్య వేదిక ద్వారా ఉద్యమం ► 2004 లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటు, అధ్యక్ష బాధ్యతలు ► 2018 లో తెలంగాణ జన సమితి ఏర్పాటు అధికారిక బాధ్యతలు : 2002లో ఆహార హక్కు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన కమిషన్‌కు రాష్ట్ర సలహాదారుగా విధులు -
ముందుస్తు ఎన్నికలు మన అదృష్టం: కోదండరాం
-
ముందుస్తు ఎన్నికలు మన అదృష్టం: కోదండరాం
సాక్షి, మేడ్చల్ : తెలంగాణ రాష్ట్రంలో ముందుస్తు ఎన్నికలు రావటం తెలంగాణ ప్రజల అదృష్టమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ కోదండరామ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 9 నెలల ముందే గద్దె దిగిన కేసీఆర్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. కేసీఆర్‌కు ఓటు వేసినా ఫాంహౌసే, వేయకపోయినా ఫాంహౌసే అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్కు వేసిన ప్రతి ఓటు బురద గుంటలోకి వెళుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి బతుకు దెరువు దొరకాలని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు ఇవ్వలేదన్నారు. ప్రతి వర్గానికి న్యాయం జరగాలని.. తాము సంఘటితంగా బయలు దేరామని, అందరం కలిసి నిలబడతామని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కోట్ల రూపాయలు వెదజల్లుతోందన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్ 25 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ నాలుగు సంవత్సరాలలో మద్దతు ధర అడిగినందుకు రైతుల చేతికి బేడీలు వేశారని, ఇసుక మాఫియాను ఆపినందుకు దళితులను విచ్చలవిడిగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్లలో రేషన్ డీలర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం కూడా పెంచలేదన్నారు. కేసీఆర్‌ది నిరంకుశ, నియంతపాలన.. నిరంకుశ పాలనకు సమాధి కట్టేందుకు అందరూ కూటమికే ఓటేయ్యాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత వార్తలు : ‘కేసీఆర్ కుటుంబం కాళ్లు ఎందుకు అడ్డం పెట్టలేదు’ దానికోసమే సోనియా గాంధీ వచ్చారు : రేవంత్ రెడ్డి -
TJS ,కాంగ్రెస్ మధ్య అయోమయం
-
ఒకేసారి 2 లక్షల రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: అసమానతలు లేని తెలంగాణ సాధన, పరిపాలనలో మార్పు, అమరులు, ఉద్యమ కారుల ఆకాంక్షల సాధన ప్రాతిపదికగా తెలంగాణ జన సమితి (టీజేఎస్) తన ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. పారదర్శక, ప్రజాస్వామిక, బాధ్యతాయుత సుపరిపాలన ధ్యేయంగా తాము పని చేస్తామని.. విధాన నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ముఖ్యమంత్రి ప్రతిరోజు ఉదయం ఒక గంటపాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా పౌర సమాజ సూచనలు, సలహాలు తీసుకునేలా పరిపాలన చేస్తామని పేర్కొంది. సామాజిక న్యా యం, సాధికారత, అందరికీ ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధి కల్పన, వ్యవసాయ అభివృద్ధి ప్రధానాంశాలుగా రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం పార్టీ అధ్యక్షుడు కోదండరాం విడుదల చేశారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివీ.. - రైతులకు ఒకేసారి రూ.2 లక్షల పంటరుణాల మాఫీ - అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో లక్ష ఉద్యోగాలు. ఉపాధి లభించే వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి - ఉద్యమ కాలంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎత్తివేత - వాస్తవ కౌలుదారులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడం - తెలంగాణ మ్యూజియంగా ప్రగతిభవన్ - పేదరైతులను నిరాశ్రయులను చేస్తున్న 2016 భూసేకరణ చట్టం తొలగింపు, 2013 భూసేకరణ చట్టం యథావిధిగా అమలు - ప్రైవేటు యూనివర్సిటీల చట్టం రద్దు - రాష్ట్ర పునర్విభజన చట్టంలోని ఆర్టికల్ 8 రద్దుకు కృషి - అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల ఫిర్యాదుల కోసం వారానికి మూడు గంటల కేటాయింపు - ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆంగ్ల మీడియం బోధన. ప్రతి మండలంలో ఐటీఐ ఏర్పాటు - పేద, మద్య తరగతి ప్రజల ఆరోగ్య వ్యవస్థను మెరుగుపర్చడానికి ఢిల్లీ తరహాలో ‘బస్తీ క్లినిక్’ల ఏర్పాటు - జిల్లా స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు - రిజర్వ్ పంచాయతీలకు రూ.10 లక్షల గ్రాంట్ - గ్రామ పంచాయతీ సిబ్బంది రెగ్యులరైజేషన్ - హైదరాబాద్ నగర ట్రాఫిక్ అధ్యయనం, రోడ్ల మరమ్మతులు - గృహనిర్మాణం కోసం బీపీఎల్ కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లింపు - పేద కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 100–200 యూనిట్ల వరకు సగం ధరకే విద్యుత్తు. గృహ, వ్యాపార, కుటీర పరిశ్రమలు, దోభిఘాట్, హెయిర్సెలూన్లకు విద్యుత్‌చార్జీల తగ్గింపు - సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకం, కొత్త ఓపెన్ కాస్ట్ గనులకు అనుమతి నిరాకరణ - చేనేత కార్మికులకు 8 గంటల పనిదినం. లేబర్ యాక్టు అమలు - గీత కార్మికులకు రూ.2 లక్షల ప్రమాద బీమా, రూ.6లక్షల జీవిత బీమా - గీత కార్మికులకు గృహానిర్మాణ పథకం కింద రూ.5 లక్షలు - పెట్రోల్, డీజీల్, గ్యాస్ రేట్లపై రాష్ట్ర పన్నులు తగ్గింపు - ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు - బీసీ, ముస్లిం మైనార్టీల కోసం సబ్‌ప్లాన్ - అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు 3 నెలల పాటు ఆర్థిక సహాయం - వికలాంగుల పింఛను రూ.2500కు పెంపు - అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోగా అమరులకు స్మృతివనం - సీపీఎస్ విధానం రద్దు. వేతన పెంపు కమిటీ సిఫా ర్సులు అమలు - కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత - బెల్టుషాపుల మూసివేత. పర్మిట్ రూముల రద్దు - 65 సంవత్సరాల పైబడిన జర్నలిస్టులకు పెన్షన్ - బీడీ కార్మికులకు నెలకు రూ.3వేల పెన్షన్. ఎన్నికల అధికారిపై ఫిర్యాదు.. స్టేషన్ ఘన్‌పూర్‌లో తమ పార్టీ అభ్యర్థి చింతా స్వామిని తప్పుదారి పట్టించిన ఎన్నికల అధికారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కోదండరాం తెలిపారు. నామినేషన్ సమయంలో రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థిని ఒక్కరు, రికగ్నైజ్డ్ పార్టీ అభ్యర్థిని పది మంది బలపరచాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే స్టేషన్ ఘన్‌పూర్‌లో తమ పార్టీ అభ్యర్థి పది మందిని తీసుకెళ్లినప్పటికీ.. అక్కడి ఎన్నికల అధికారి ఒక్కరు బలపరిస్తే సరిపోతుందని చెప్పారని తెలిపారు. దీంతో ప్రస్తుతం తమ పార్టీ అభ్యర్థి నామినేషన్ గందరగోళంలో పడిందన్నారు. ముందు మీరు..తర్వాతే మేం! ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమకు ఇస్తామన్న 8 స్థానాలను పూర్తిస్థాయిలో కేటాయించకపోగా.. వరంగల్ ఈస్ట్, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్‌లలో రెండు స్థానాలను ఇస్తామని చెప్పి, వాటిని కూడా తేల్చలేదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. తమకు ఇచ్చిన స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను పోటీలో నిలిపిన నేపథ్యంలో ముందుగా వారు విత్‌డ్రా చేసుకోవాలని, తర్వాతే తాము ఆ పని చేస్తామని స్పష్టంచేశారు. మంగళవారం టీజేఎస్ కార్యాలయంలో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. తాము కూటమి లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని, అయితే అందుకు తమ పార్టీని ఫణంగా పెట్టే పరిస్థితి తెచ్చుకోలేమని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రయోజనం కోసం కాకుండా, ఇవాళ నష్టం జరిగినా.. రేపు కూటమి బతికే విధంగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఎజెండా అమలు విషయంలో కూటమిలోని ఇతర పక్షాలు సహకరించకపోతే ఊరుకోబోమని స్పష్టంచేశారు. కూటమిని సరిగ్గా నడిపిస్తేనే ప్రజలకు లాభం జరుగుతుందని, ఈ విషయాన్ని కూటమిలో పెద్ద పక్షమైన కాంగ్రెస్ గుర్తించనంత కాలం ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డారు. ఆ పాత్రను సరిగ్గా నిర్వహించాలంటే కాంగ్రెస్ కొంత కలుపుకొని పోయే తత్వం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించాలని సూచించారు. వరంగల్ ఈస్ట్ తమకు ఇస్తామన్నందునే ఇన్నయ్యను బరిలో దింపామని కోదండరాం తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ తక్షణ ప్రయోజనాల రీత్యా మరో అభ్యర్థికి సీటు ఇచ్చిందన్నారు. ఇప్పటికీ తమకు ఇచ్చిన స్థానాలను వదిలిపెట్టకుండా వెంట పడితే ఎలా? అన్న అభిప్రాయం ప్రజల్లో వచ్చిందన్నారు. ఇది కూటమికి నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. తమకు ఇస్తామన్న మిర్యాలగూడ సీటును ఆర్.కృష్ణయ్యకు ఇచ్చారని, ఆ విషయం తమకు చెప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ముందుగానే ఈ విషయం చెబితే తమ పార్టీ అభ్యర్థిని నిలిపే విషయంలో ఆలోచించేవారమని పేర్కొన్నారు. -
సీట్ల సర్థుబాటు సరిగా జరగలేదు: కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తెలంగాణ జన సమితి (టీజేఎస్)కి 8 సీట్లు ఇస్తామన్నారని, కానీ 6 సీట్లు మాత్రమే ఇచ్చారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మిర్యాలగూడ, వరంగల్ ఈస్ట్, మహబూబ్ నగర్ కావాలని తాము అడిగామని తెలిపారు. తమ అభ్యర్థులు ఉన్న చోట.. కాంగ్రెస్ అభ్యర్థులను ఉపసంహరించుకుంటుందని భావిస్తున్నామన్నారు. సరైన పద్దతుల్లో సీట్ల సర్థుబాటు జరగలేదని తెలిపారు. ముస్లింలకు ఒక్క సీటు అయినా ఇవ్వాలనుకున్నామని, కానీ గందరగోళం మధ్య ముస్లింలకు సీటు కేటాయించలేకపోయామని కోదండరాం చెప్పారు. తమకిచ్చే సీట్లకు అదనంగా ఒక్క సీటును ఓల్డ్ సిటీలో అదనంగా కోరామన్నారు. అందర్నీ ఒప్పించే పరిస్థితి ఉంటేనే.. జనగామ సీటు ఇవ్వమన్నానని కోదండరాం తెలిపారు. మహాకూటమికి నష్టం లేకపోతేనే తాను జనగామ నుంచి పోటీ చేయాలనుకున్నానని పేర్కొన్నారు. బీసీల కోసం తాము జనగామ స్థానాన్ని వదులుకున్నామన్నారు. కానీ.. తాము కోరుకున్న మిర్యాలగూడలో బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్యను పెట్టారని తెలిపారు. ఆర్. కృష్ణయ్యను పోటీలో పెడ్తారని తమకు తెలియదన్నారు. మహాకూటమీ 'కామన్ మినిమమ్ ప్రోగ్రామ్'ను త్వరలో ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు. కూటమి వల్ల తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయం ఉందని అర్థమైందని, పెద్దన్న పాత్రను కాంగ్రెస్ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. మేడ్చచ్లో జరగనున్న సోనియా గాంధీ సభలో పాల్గొంటామన్నారు. స్నేహపూర్వక పోటీని విరమించుకునే అంశంపై చర్చలు జరుగుతున్నాయని, ఇప్పుడు మాట్లాడలేనన్నారు. తమకు కేటాయించిన స్థానాలపై అసంతృప్తి సహజంగానే ఉంటుందన్నారు. -
తెలంగాణ ప్రజలు నిరంకుశ పాలనలో విసిగిపోయారు
-
ఎక్కడికీ పారిపోం.. రాజకీయాల నుంచి తప్పుకోం!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉంటానని, ఎక్కడికీ పారిపోనని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పబోనని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం అన్నారు. పదవి ఉన్నా, లేకున్నా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమే పనిచేస్తానని, పదవి అనేది ఒక వెసులుబాటు మాత్రమేనన్నారు. సోమవారం ఇక్కడి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూ జే నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. సీఎంగా కేసీఆర్ స్థిరంగా ఉన్నా రాష్ట్రంలో అస్థిరత విపరీతంగా పెరిగిపోయిందని, ప్రభుత్వం పట్ల విశ్వసనీయత సన్నగిల్లిందన్నారు. ఇంతటి అస్థిరత ను ఎప్పుడూ చూడలేదని, సీఎం పదవే ఎక్కువ విమ ర్శలకు గురైందని పేర్కొన్నారు. ప్రజల విశ్వసనీయ తను ఎంతమేరకు చూరగొన్నామన్నదే ముఖ్యమని, సీఎంలు ఎంతమంది మారుతారన్నది ముఖ్యం కాదన్నారు. వ్యక్తుల వల్ల రాజకీయాల్లో స్థిరత్వం రాదన్నా రు. రాష్ట్రంలోనూ సీఎం, మంత్రుల వాహనాల సైరన్ మోతలు ఆగిపోవాలని, బుగ్గలను పీకేయాలని సూచించారు. ఓట్లు వేసిన ప్రజలు తిడితే పడాలని, వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఏం చేశారని కేసీఆర్‌కు ఓటేయాలి? సీఎం తన కుటుంబం కోసం అధికారాన్ని సొంత ఆస్తిగా వాడుకుంటున్నారని కోదండరాం ఆరోపిం చారు. ‘ప్రజలు ఓటు వేసి గెలిపించుకున్న ప్రభుత్వం అందరి కోసం పని చేయాలి. కానీ కొందరి కోసమే పని చేస్తోంది’ అని అన్నారు. సీఎంకు ఒక కార్యాచర ణ అంటూ లేదని, ప్రభుత్వాన్ని వ్యాపారంగా వాడుకుంటున్నారని, కమీషన్లు, సంపాదనకు వాడుకుం టున్నారని ఆరోపించారు. ‘అధికారం అనేది ప్రజల కోసం పని చేయాలి. ఉద్యోగాలు కల్పించాలి. పారి శ్రామిక, వ్యవసాయ, ప్రజల ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలి’ అని అన్నారు. అవకాశం ఇస్తే తమ ఎజెండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఓ వైపు నిరంకుశ పాలన, మరోవైపు ప్రజల ఆకాం క్షలు ఉన్నాయని, ఆ రెండింటిలో ఏ వైపు ప్రజలు ఉంటారో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘కేసీఆర్, నలుగురు కుటుంబ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మేము మాత్రం ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలనుకుంటున్నాం. ఇదీ ఇప్పడున్న ఘర్షణ, ఎన్నికల వేదికగా అటో ఇటో తేలి పోవాలి’ అని అన్నారు. నాలుగున్నరేళ్ల పాలన కేసీ ఆర్ ఏం చేశారని టీఆర్ఎస్కు ప్రజలు ఓటు వేయాలని కోదండరాం ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు చివరి మజిలీ కాదు.. తెలంగాణ ఏర్పాటు అనేది చివరి మజిలీ కాదని.. తాము ఆశిస్తున్నది సామాజిక మార్పు అని కోదండరాం చెప్పారు. ప్రజల కోసం ప్రజల తరఫున పోరాడే కొత్తతరం నాయకత్వం అవసరమన్నారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారనే ధీమా వ్యక్తం చేశారు. తాము గరికె గడ్డి లాంటి వాళ్లమని, పీకేసిన కొద్ది మొలుస్తూ నే ఉంటామన్నారు. ఈ ఎన్నికల్లో తమ ఎజెండా గెలిస్తే, తాము గెలిచినట్టేనన్నారు. ఉమ్మడి కార్యాచరణకు చట్టబద్ధత ప్రజల ఆకాంక్షలతో కూడిన ఉమ్మడి ప్రణాళికకు చట్టబద్ధత కల్పించేందుకు రాహుల్‌గాంధీ ఒప్పుకున్నార ని కోదండరాం అన్నారు. మత ఘర్షణల నిరోధానికి, జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రతి సమస్య పరిష్కారానికి ఢిల్లీకి పోవడం సాధ్యం కాదన్నారు. డిప్యూటీ చీఫ్ మినిçస్టర్ పదవి వస్తదన్న ఆశలో తాను లేనని తెలిపారు. కాంగ్రెస్ ఉంటే రామన్న సీపీఎం కూటమిలోకి రావాలని అడిగితే సీపీఎం నేతృత్వం లోని బీఎల్ఎఫ్ నేతలు కాంగ్రెస్‌తో కలువబోమని చెప్పారని కోదండరాం చెప్పారు. కాంగ్రెస్‌తో కలవకుండా ఇప్పుడు నిలదొక్కుకోవడం సాధ్యం కాదని కూటమిలోని మిగతా పక్షాలు చెప్పాయన్నారు. అందుకే కామన్ ప్రోగ్రాం రాసుకొని దానికోసం పని చేద్దామని చెప్పారని, ఆ మేరకే ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. నిరంకుశంగా పాలించారు కేసీఆర్ నాలుగున్నరేళ్లు నిరంకుశంగా పరి పాలించారని, రాజకీయమంటే డబ్బుతో ఎమ్మెల్యేలను కొనడమని అనుకుంటున్నారని కోదండరాం ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల కమీషన్ల ద్వారా వచ్చిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొనడం రాజకీయం కాదన్నారు. ఒక పార్టీలో టికెట్లు రాని వారు మరోపార్టీ లోకి మారుతున్న తరుణంలో అలాంటివారితో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం అసాధ్యమన్నారు. -
కూటమిలో కోదండరాంకి సరైన గౌరవం లేదా?
-
‘తెలంగాణ ఏర్పాటు చివరి మజిలీ కాదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరంకుశ పాలన అంతమొందించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం ఆయన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. తమ పార్టీ పెట్టిన నాలుగు నెలల్లోనే సంఘాన్ని నిలబెట్టామని గర్తుచేశారు. జేఏసీ నుంచి మరికొంత బలాన్ని సమీకరించకున్నట్టు తెలిపారు. జేఏసీగా ఉన్న రోజుల్లోనే రాజకీయ పార్టీపై సమాలోచనలు జరిపామని అన్నారు. రాజకీయరంగం మారకుండా సమస్యలకు పరిష్కారం లభించదనే భావనతో జనసమితి అవిర్భవించిందని పేర్కొన్నారు. అనేక మంది మేధావులతో తమ పార్టీ పటిష్టంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు చివరి మజిలీ కాదని.. తాము ఆశిస్తున్నది సామాజిక మార్పు అని వెల్లడించారు. ఎన్నికల ద్వారా ఏర్పాటైన ప్రభుత్వం ఆ తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం అనేది భారతదేశంలో నెలకొన్న విచిత్ర పరిస్థితి అని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం కొత్త రాజకీయ విధానాలకు రూపకల్పన చేయగలిగిన మార్పు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. అనేక విమర్శలను దృష్టిలో పెట్టుకుని పీపుల్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రతి ఘర్షణ నుంచి ఒక ఐకత్యను నెల రోజుల చర్చల్లో గమనించినట్టు ఆయన తెలిపారు. ప్రజల తరఫున నిలబడి ప్రజల కోసం పోరాడగలిగే కొత్తతరం నాయకత్వం అవసరమని ఆయన అన్నారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారనే ధీమా వ్యక్తం చేశారు. తాము గరికె గడ్డి లాంటి వాళ్లమని.. పీకేసిన కొద్ది మొలుస్తూనే ఉంటామని తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ ఎజెండా గెలిస్తే.. తాము గెలిచినట్టేనని అన్నారు. -
వర్ధన్నపేట టికెట్ టీజేఎస్ సొంతం
హసన్‌పర్తి: మహాకూటమి వర్ధన్నపేట నియోజకవర్గ టికెట్ ఎట్టకేలకు తెలంగాణ జనసమితికి కేటాయించారు. ఈ మేరకు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం ఆదివారం రాత్రి ప్రకటించారు. ప్రవాస భారతీయుడు డాక్టర్ పగిడిపాటి దేవయ్యకు ఈ టికెట్ కేటాయించింది. టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు నమిండ్ల శ్రీనివాస్, బక్క జడ్సన్, డాక్టర్ విజయ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే మహాకూటమి పొత్తులో భాగంగా స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేటలోని ఏదైనా ఒక స్థానం కేటాయించాలని టీజేఎస్ కోరింది. దీంతో చివరి క్షణం వరకు టిక్కెట్‌పై సందిగ్ధత నెలకొంది. ఎట్టకేలకు ఆదివారం అర్ధరాత్రి పగిడిపాటి దేవయ్యకు టిక్కెట్ కేటాయిస్తూ కోదండరాం ప్రకటన చేయడంతో సస్పెన్స్ వీడింది. కాగా పగిడిపాటి దేవయ్య ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించడం ఇది మూడోసారి. రెండుసార్లు టిక్కెట్ కోసం ప్రయత్నించారు. మూడో సారి టీజేఎస్ తరఫున ఆయనకు టిక్కెట్ దక్కింది. 2015లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో దేవయ్య వరంగల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా శనివారం దేవయ్య బీఎస్పీ తరఫున వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సోమవారం ఆయన టీజేఎస్ తరఫున నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందించనున్నారు. పగిడిపాటి దేవయ్య ప్రొఫైల్ పేరు: డాక్టర్ పగిడి దేవయ్య(పిల్లల వైద్యనిపుణుడు) తల్లిదండ్రులు : రత్నం, కోటమ్మ భార్య : డాక్టర్ పగిడి రుద్రమదేవి స్వస్థలం: ఖిలాషాపురం(గ్రామం), రఘునాథపల్లి(మండలం), జనగాం(జిల్లా) విద్యార్హతలు: ఎంబీబీఎస్(ఉస్మానియా మెడికల్ కళాశాల) పిల్లల వైద్య నిఫుణుడు(అనస్థిషియా), హార్ట్‌వేర్ యూనివర్సిటీ జననం: 21–06–1944 సంతానం: ఇద్దరు కుమారులు, కూతురు చిరునామా: బేటా–409, మాదాపూర్, హైదరాబాద్ -
పొన్నాలకే జనగామ
సాక్షి, జనగామ: కూటమిలోని పొత్తులు..సీట్ల పంపకాల్లో భాగంగా జనగామ స్థానంపై రాజ కీయంగా వారం రోజులుగా నెలకొన్న ఉత్కం ఠకు తెరపడింది. కాంగ్రెస్, తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీల మధ్య కుదిరిన అవగాహనతో పొన్నాల లక్ష్మయ్యకు లైన్‌క్లియర్ అయింది. ఏఐసీసీ శనివారం ప్రకటించిన మూడోజాబితాలో పొన్నాల లక్ష్మయ్యకు చోటు కల్పించింది. దీంతో జనగామ సీటుపై నెలకొన్న సందిగ్దత తొలగిపోయింది. పొన్నాలకు టికెట్ ఖరారుకావడంతో కాంగ్రెస్ శిబిరంలో ఆనందం నెలకొంది. నామినేషన్ దాఖలు చేయడానికి పొన్నాల సిద్ధమవుతున్నారు. ఎట్టకేలకు.. మహాకూటమి పొత్తుల్లో భాగంగా జనగామ స్థానం కోసం టీజేఎస్ పట్టుపట్టింది. తమకే కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టం చేసింది. 12 స్థానాల్లో పోటీచేస్తామని టీజేఎస్ ప్రకటించింది. జనగామ నుంచే కోదండరామ్ పోటీచేస్తారని ప్రకటన చేయడంతోపాటు ఏకంగా ప్రచార రథాలను సిద్ధంచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండు జాబితాల్లో పొన్నాల లక్ష్మయ్యకు చోటుదక్కలేదు. ఢిల్లీకి వెళ్లిన పొన్నాల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశం అయ్యారు. కోదండరాం ఒప్పుకుంటే తమకు అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. దీంతో ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన పొన్నాల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి స్వయంగా కోదండరాంను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. పోటీపై కోదండరాం వెనక్కితగ్గారు. దీంతో పొన్నాల పోటీకి లైన్‌క్లియర్ అయింది. శనివారం ఏఐసీసీ 13 మంది అభ్యర్థులతో ప్రకటించిన జాబితాతో జనగామ స్థానాన్ని పొన్నాలకు కేటాయించారు. పోటీనుంచి తప్పుకున్న కోదండరాం.. జనగామ బరి నుంచి టీజేఎస్ అధినేత కోదండరాం పోటీ నుంచి తప్పుకున్నారు. కూటమిలో సీ ట్ల సర్దుబాటు కారణంగా జనగామ నుంచి సీని యర్ కాంగ్రెస్ నేత పొన్నాలకు అవకాశం కల్పిం చడం కోసం ఆయన పోటీ నుంచి విరమించుకున్నారు. కోదండరాం పోటీ చేయడానికి ఆసక్తి ఉ న్న మంచిర్యాల, మేడ్చల్, జనగామ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో కోదండరాం పోటీ చేయనట్లు తెలుస్తోంది. నేటి నుంచి 64వ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలు పర్వతగిరి: ఆదివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు కల్లెడ గ్రామంలోని ఆర్డీఎఫ్ జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి 64వ ఎస్జీఎఫ్ క్రీడలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె.సతీష్ తెలిపారు. అండర్–19 క్రీడల్లో సాఫ్ట్ టెన్నిస్, వూ– షూ క్రీడలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మామునూర్ ఏసీపీ ప్రతాప్‌కుమార్, ఆర్డీఎఫ్ పాఠశాలల చైర్మెన్ ఎర్రబెల్లి రామ్మోహన్రావు పాల్గొంటారని తెలిపారు. -
నాలుగు స్థానాలకు టీజేఎస్ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనసమితి ఎట్టకేలకు 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిం చింది. టీజేఎస్ అధ్యక్షు డు, ప్రజాకూటమి చైర్మన్ కోదండరాం ఆమోదంతో నలుగురి పేర్లను ఖరా రు చేసినట్లు పార్టీ అధికార ప్రతినిధి యోగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రజాకూటమిలో భాగంగా టీజేఎస్ తరఫున మల్కాజిగిరి నుంచి కపిలవాయి దిలీప్‌కుమార్ పోటీ చేస్తారని తెలిపారు. మెదక్ నియోజకవర్గం నుంచి జనార్దన్‌రెడ్డి, దుబ్బాక నుంచి చిందం రాజ్‌కుమార్, సిద్దిపేట నుంచి భవానీరెడ్డి పోటీలో ఉంటారని వివరించారు. వారు ఈ నెల 18, 19 తేదీల్లో నామినేషన్లు వేస్తారని వివరించారు. మరో 2 స్థానాలకు ఆదివారం అభ్యర్థులను ప్రకటించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. కూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ టీజేఎస్‌కు 8 స్థానాలను ఇస్తామని పేర్కొం దని టీజేఎస్ వర్గాలు తెలిపాయి. వీటిలో ఆరు స్థానాలకు క్లియరెన్స్ ఇచ్చింది. వర్ధన్నపేట, అంబర్పేట్ నియోజకవర్గాలకు కూడా కాంగ్రెస్ గతంలోనే ఓకే చెప్పినా, ఆ స్థానాలను తాము అడగలేదని, స్టేషన్ ఘన్పూర్, జనగామ స్థానాలను తాము అడిగినా ఇవ్వలేదని టీజేఎస్ వర్గా లు పేర్కొన్నాయి. ఇవికాకుండా మరో 2 స్థానాలను కాంగ్రెస్ తమకు ఇచ్చే అవకాశం ఉందని, అందులో మిర్యాలగూడ, వరంగల్ వెస్ట్ స్థానాలపై స్పష్టత వస్తే వాటికి అభ్యర్థులను నేడు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. టీజేఎస్ 12 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో మహబూబ్‌నగర్, స్టేషన్‌ఘన్‌పూర్ వంటి స్థానా ల్లో స్నేహపూర్వక పోటీకి సిద్ధం అవుతోంది. -
కోదండరాం పోటీ లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. ఆయన పోటీ నుంచి తప్పుకున్నారా.. అంటే పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. జనగామను టీజేఎస్‌కు కేటాయించాలని, అక్కడి నుంచి తానే పోటీ చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం భావించారు. అయితే అనేకసార్లు మంతనాలు, సంప్రదింపుల తరువాత జనగామ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య పోటీలో ఉంటారని ప్రకటించారు. దీంతో ఇక కోదండరాం పోటీలో ఉండరని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జనగామతోపాటు మరికొన్ని స్థానాలపై స్పష్టత కోసం శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు చర్చలు జరిపినా టీజేఎస్‌కు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్యను పోటీలో నిలిపేందుకు నిర్ణయించారు. టీజేఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జనగామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య తదితరులు కోదండరాంతో మంతనాలు జరిపిన అనంతరం కుంతియా మీడియాతో మాట్లాడారు. జనగామ నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తుందని, లక్ష్మయ్య బరిలో దిగుతారని వెల్లడించారు. పెద్ద మనసుతో కోదండరాం జనగామ పోటీ నుంచి తప్పుకున్నారన్నారు. ప్రచారం కోసం ఆయన రాష్ట్రమంతా పర్యటించాలని కోరుతున్నామన్నారు. అనేక మంది నాయకులు, విద్యార్థుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. చివరి దశ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాం కీలక పాత్ర పోషించారన్నారు. అయితే పోరా>డి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. టీజేఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ కలసి కేసీఆర్ పాలనను అంతం చేస్తాయన్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకే కూటమి ఏర్పడిందని అన్నారు. కూటమికి కన్వీనర్‌గా కోదండరాం, అధ్యక్షునిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందుకు నడిపిస్తారన్నారు. ప్రచారంలో సోనియా, రాహుల్ పాల్గొంటారని చెప్పారు. కోదండరాం కూడా తమతో సంయుక్త ప్రచారానికి రావాలని కోరుతున్నామన్నారు. తమ ప్రభుత్వ ఏర్పాటులో అందరికీ అవకాశం కలిపిస్తామన్నారు. మేనిఫెస్టోలో చెప్పింది తూచ తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. విభిన్న భావాలు ఉన్నప్పటికీ కామన్ అజెండాతో ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణ ప్రజల నాడి కోదండరాంకు బాగా తెలుసునని, అది తమకు బాగా లాభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎట్టకేలకు టీజేఎస్ తొలి జాబితా
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణ జన సమితి (టీజేఎస్) తెలంగాణా అసెంబ్లీకి పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పీపుల్స్ ఫ్రంట్ కూటమిలో భాగంగా టీజేఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండో జాబితాను ఆదివారం ప్రకటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొపెసర్ కోదండారాం తెలిపారు. అయితే కోదండరాం పోటీ చేసే అంశంపై పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎందరో నేతలతో భేటీల అనంతరం శుక్రవారం అర్ధరాత్రి వరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియాతో కోదండరాం భేటీ అయిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం పార్టీ కోర్ కమిటీతో చర్చించిన అనంతరం నలుగురుతో కూడిని తొలి జాబితాను విడుదల చేశారు. టీజేఎస్ తొలి జాబితా ఇదే.. మల్కాజిగిరి : దిలీప్ కుమార్ కపిలవాయి మెదక్: జనార్ధన్ రెడ్డి దుబ్బాక: చిందం రాజ్ కుమార్ సిద్దిపేట: భవాని రెడ్డి -
కోదండరామ్ ఇంటి వద్ద ఉద్రిక్తత
-
పంతం నెగ్గించుకున్న పొన్నాల..
సాక్షి, హైదరాబాద్ : ఎట్టకేలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పంతం నెగ్గించుకున్నారు. పార్టీ అధిష్టానంతో పోరాడి జనగామ టికెట్‌ను ఆయన సాధించారు. జనగామ నుంచి పొన్నాల బరిలోకి దిగుతారని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా స్పష్టం చేశారు. కోదండరామ్ పెద్ద మనుసు చేసుకుని జనగామ పోటీ నుంచి తప్పుకున్నారన్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12 తర్వాత కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో భేటీ అయ్యారు. జనగామ సీటు విషయంలో ప్రొఫెసర్ కోదండరామ్‌తో చర్చలు జరిపారు. అనంతరం కుంతియా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల నాడి కోదండరాంకు బాగా తెలుసని, అది తమకు బాగా లాభిస్తుందని అన్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా కోదండరామ్‌తో ప్రచారం చేయిస్తామని తెలిపారు. ప్రజాకూటమి కన్వీనర్‌గా ఆయనే వ్యవహరిస్తారని వెల్లడించారు. కేసీఆర్‌కు ఐదేళ్లు పాలించమని అధికారం అప్పగిస్తే చేతకాక ముందే ప్రభుత్వాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనను అంతమొందిచటమే లక్ష్యంగా టీజేఎస్, టీడీపీ, సీపీఐలతో జట్టు కట్టామని పేర్కొన్నారు. మేనిస్టోలోని అంశాలను తూ.చ తప్పుకుండా అమలు చేస్తామని ప్రకటించారు. మహాకూటమిలో భాగంగా టీడీపీ 14, టీజేఎస్ 8, సీపీఐ 3, కాంగెస్ర్ 94 చోట్ల పోటీ చేస్తుందని కుంతియా వెల్లడించారు. -
ఉద్యమ ఆకాంక్షలే కూల్చుతయ్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాజకీయ పార్టీల ప్రచార సరళిలో నూతన రూపం వచ్చిందని, కొత్త రకం రాజకీయం చేస్తే తప్ప టీఆర్ఎస్ను ఎదుర్కోలేమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. శుక్రవారం టీజేఎస్ కార్యాలయంలో ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి నిర్మాణం లేదు.. పాడు లేదు.. ఉద్యమ ఆకాంక్షలే నాడు గెలిపించాయన్నారు. ఆ ఆకాంక్షలను ప్రజల్లోకి తీసుకుపోతేనే కూటమికి భవిష్యత్తు ఉంటుందన్నారు. గెలిచిన తరువాత టీఆర్ఎస్ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చలేదని, అందుకే అవే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చుతాయన్నారు. సంక్షేమ పథకాల ద్వారా డబ్బు సంపాదించి, వాటిని ఎన్నికలకు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఇప్పుడు గెలవాలని చూస్తున్నారన్నారు. డబ్బు, మద్యం ద్వారా అధికార పార్టీ ముందుకు సాగుతుందని, అందులో తాము వెనుకేనన్నారు. వాటితో గెలవడం కష్టమని, తమ ఎజెండానే తమను గెలిపిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అజెండాను వివరిస్తూ ప్రజల వద్దకు వెళ్తామని, అందుకు సమయం కావాలన్నారు. గతంలో టీఆర్ఎస్ ఇంటింటి ప్రచారంతోనే గెలిచిందన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ కూడా స్వీకరించాలన్నారు. పాత విధానంలో పోతే నష్టమేనని, ప్రచార విధానం మార్చాలని అభిప్రాయపడ్డారు. టీజేఎస్ అభ్యర్థుల ప్రచారం విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని, ప్రస్తుతం పరిస్థితులు, పరిణామాలు ఏం బాగా లేవన్నారు. కాంగ్రెస్ జాప్యంతో ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్న వాళ్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతామని, తమ పార్టీ అభ్యర్థులకు శనివారం బీ–ఫారాలు అందజేస్తామన్నారు. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమకు కేటాయించిన 8 సీట్లలో ఇప్పటి వరకు 6 సీట్లకే స్పష్టత వచ్చిందన్నారు. ఒకట్రెండు నియోజకవర్గాల్లో కూటమి పార్టీలతో స్నేహపూర్వక పోటీ ఉండొచ్చన్నారు. జనగామ సీటు విషయం ఇంకా తేలలేదని, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి ప్రచారానికి తాను వెళ్లనున్నట్లు చెప్పారు. తెలంగాణ జన సమితి బలంగా ఉన్న నియోజక వర్గాల్లో ప్రచారం చేస్తామని కోదండరాం వివరించారు. ఇందులో భాగంగా సభలు, సదస్సులు, ధూంధాంలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా ఈ ఆరు సీట్లకు శుక్రవారం రాత్రి వరకు అభ్యర్థు ల్ని ప్రకటిస్తామని టీజేఎస్ అధినేత తెలిపినా.. జాబితా మాత్రం వెల్లడికాలేదు. -
ఇంకెంత లేటు?
సాక్షి, హైదరాబాద్: సీట్ల సర్దుబాటు విషయం లో కాంగ్రెస్ అవలంభిస్తున్న నాన్చుడి ధోరణిపై తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ పక్క ప్రత్యర్థి టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంటే.. కూటమి పార్టీలు పొత్తులంటూ జాప్యం చేయడంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వద్ద తన అసహనాన్ని వెళ్లగక్కారు. సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ తీరు ఏమాత్రం హర్షణీయంగా లేదని, కాంగ్రెస్ చేస్తున్న జాప్యం మొత్తం కూటమి లక్ష్యానికే విఘాతం కల్గిస్తుందని హెచ్చరించారు. శుక్రవారం నాటికి కొలిక్కి వస్తుందనుకున్న సీట్ల సర్దుబాటు అంశం ఎటూ తేలలేదు. ముఖ్యంగా టీజేఎస్‌కు కాంగ్రెస్ ఎన్ని టికెట్లు కేటాయిస్తుంది.. ఏయే స్థానాలకు ఒకే చెప్పనుందన్న దానిపై ప్రతిష్టంభన వీడలేదు. జనగామ, మిర్యాలగూడతోపాటు వరంగల్ తూర్పు నియోజకవర్గంపై శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇద్దరి మధ్య చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు. అర్ధరాత్రి చర్చలు... తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని టీజేఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, టీజేఎస్‌కు 8 స్థానాలే కేటాయిస్తామని చెబుతూ వస్తున్న కాంగ్రెస్.. వీటిలో ఆరింటికి ఓకే చెప్పింది. జనగామ, మిర్యాలగూడపై స్పష్టత ఇవ్వలేదు. వీటితోపాటే స్టేషన్ ఘన్పూర్, ఆసిఫాబాద్ స్థానాల నుంచి కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. అక్కడ పోటీ చేసేందుకు టీజేఎస్ కూడా సై అంటోంది. ఈ నేపథ్యంలో రాత్రి 11 గంటలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీజేఎస్ కార్యాలయానికి వచ్చి కోదండరాంతో చర్చించారు. దుబ్బాక, మెదక్, మల్కాజ్గిరి, అంబర్‌పేట, సిధ్దిపేట, వర్ధన్నపేట స్థానాలు ఇచ్చేందుకు ఉత్తమ్ సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. జనగామ విషయంలో పొన్నాల లక్ష్మయ్య పట్టుదలతో ఉన్నందున, ఆ సీటు వదిలేయాలని కోరినట్టు సమాచారం. దీనిపై శనివారం జరిగే కోర్ కమిటీ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కోదండరామ్ బదులిచ్చినట్టు తెలిసింది. మిర్యాలగూడలో టీజేఎస్ తరఫున విద్యాధర్‌రెడ్డిని పోటీలో నిలుపుతామని చెప్పగా.. ఇదే స్థానంలో జానారెడ్డి తన బంధువు విజయ్‌కుమార్‌రెడ్డిని నిలపాలని పట్టుబడుతున్న విషయాన్ని ఉత్తమ్ వివరించారు. విజయ్‌కు జానారెడ్డి మద్దతు ఉన్నందున ఆయనకే విజయావకాశాలు ఉంటాయన్నారు. అయినప్పటికీ, తమకు ఆ స్థానం ముఖ్యమని కోదండరామ్ స్పష్టం చేసినట్లుగా తెలిసింది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్‌పూర్‌లో టీజేఎస్ పోటీ పెట్టకూడదని ఉత్తమ్ కోరినట్లుగా సమాచారం. అయితే అక్కడ స్నేహపూర్వక పోటీ తప్పకపోవచ్చన్న ధోరణిని కోదండరామ్ వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చర్చల వివరాలను మీడియాకు వెల్లడించేందుకు ఉత్తమ్ నిరాకరించారు. ఢిల్లీ నుంచి అర్ధరాత్రి 12.30కి వచ్చిన కుంతియాను తీసుకుని మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయారు. శనివారం ఉదయం 10 గంటలకు టీజేఎస్ కోర్ కమిటీ సమావేశం తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ] మూడు తీర్మానాలకు ఓకే.. టీజేఎస్ కోర్ కమిటీ తీసుకున్న మూడు తీర్మానాలను ఉత్తమ్‌కు తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తే కామన్ మినిమం ప్రోగ్రాం అమలు కమిటీకి చట్టబద్ధత కల్పించాలని, ఆ కమిటీకి కోదండరామ్‌ను చైర్మన్ చేయాలని తీర్మానించిన విషయాన్ని వివరించారు. అలాగే కోదండరామ్‌ను కేబినెట్లోకి తీసుకొని కామన్ మినిమం ప్రోగ్రాం అమలు బాధ్యతను ఆయన పరిధిలోనే ఉంచాలని తీర్మానించిన విషయాన్ని తెలియజేశారు. ఈ మూడు తీర్మానాలు తమకు సమ్మతమేనని ఉత్తమ్ స్పష్టంచేసినట్లుగా తెలిసింది. -
కోదండరాంకు లైన్‌క్లియర్!
సాక్షి, జనగామ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న జనగామ స్థానం నుంచి పోటీ చేయడానికి తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధినేత ప్రొఫెసర్ కోదండరాంకు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా జనగామ టీజేఎస్‌కు కేటాయించే అవకాశాలు ఖాయమైనట్లుగా తెలుస్తున్నాయి. సిద్ధమైన ప్రచార రథాలు కాంగ్రెస్ ఇప్పటి వరకు మూడు జాబితాలను విడుదల చేసినా జనగామ నుంచి టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే జనగామతోపాటు 11 స్థానాల్లో పోటీ చేస్తా మని టీజేఎస్ ప్రకటించింది. టీజేఎస్ వ్యవహార తీరుపై పొన్నాలతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రెండు పార్టీల్లోనూ జనగామ సీటు పీటముడి వీడటం లేదు. దాదాపుగా జనగామ టీజేఎస్‌కే కేటాయించే అవకాశం ఉండటంతో ప్రచారానికి ఆ పార్టీ సిద్ధం అవుతోంది. ఎనిమిది ప్రచార రథాలను సిద్ధం చేశారు. శుక్రవారం నియోజకవర్గంలో తిప్పడానికి పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ ప్రచార రథాలపై జనగామ అభ్యర్థి కోదండరాం అని రాయడం గమనార్హం. జనగామ జిల్లా కేంద్రంలో టీజేఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఆ పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎన్నికలు అయిపోయే వరకు కోదండరాం ఇక్కడే నివా సం ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కోదండరాం సమీప బంధువులు జనగామలోనే మకాం వేసి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లతోపాటు గుర్తింపు పొందిన ప్రముఖులను కలసి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన ఇద్దరు బలమైన నేతలు కోదండరాం కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19న కోదండరాం నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. ముం దుగా 17న కోదండరాం తరుపున పార్టీ నేతలు మొదటి నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. కార్యకర్తల మూకుమ్మడి రాజీనామా పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు జనగామ అసెంబ్లీ టికెట్ కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న తీరుతో ఆ పార్టీ కార్యకర్తలు, పొన్నాల అనుచరులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 13 మంది కౌన్సిలర్లతోపాటు 28, 500 మంది క్రియాశీలక కార్యకర్తలు మూకు మ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు లేఖ రాశారు. కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. -
టీజేఎస్‌కి నా సీటే కావాలా?
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ రెండో జాబితాలోనూ తన పేరును ప్రకటించకపోవడం పట్ల మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తుల వల్లే సీటు ప్రకటన ఆసల్యం అవుతుందని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులు తేలినా, తేలకపోయినా తాను మాత్రం జనగామ నుంచే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. టీజేఎస్ పార్టీ జనగామ టికెట్‌ను ఎందుకు కోరుతుందో అర్ధం కావడం లేదన్నారు. కోదండరాం పోటీ చేయడానికి జనగామ ఒక్కటే ఉందా అని ప్రశ్నించారు. టీజేఎస్‌కు రాష్ట్రంలో 119 సీట్లు ఖాళీగా ఉండగా తాను పోటీ చేసే నియోజకవర్గం ఒక్కటే కావాల్సి వచ్చిందా అని విమర్శించారు. పొత్తులు త్వరగా తేలిస్తే కాంగ్రెస్ పార్టీకే శ్రేయస్కరం అని పొన్నాల అభిప్రాయ పడ్డారు. కాగా మంగళవారం టీజేఎస్ చీఫ్ కోదండరాం మాట్లాడుతూ.. జనగామ నుంచి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. బీసీ సీటు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయనే భావనతో జనగామ పోటీ నుంచి కోదండరాం తప్పుకుంటున్నాని కోదండరాం తెలిపారు. అయినప్పటికీ బుధవారం కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడం గమనార్హం. -
తుదిదశకు కసరత్తు
-
ఆరింటిపైనే స్పష్టత..
సాక్షి, హైదరాబాద్: పొత్తులో భాగంగా తమ పార్టీకి కేటాయించే సీట్లపై కాంగ్రెస్‌తో ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం తెలిపారు. తాము 11 స్థానాలు కోరు తుండగా.. ప్రస్తుతానికి ఆరు సీట్లపై స్పష్టత వచ్చిం దని వెల్లడించారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. మెదక్, సిద్దిపేట, దుబ్బాక, వర్ధన్నపేట, అంబర్‌పేట, మల్కాజ్గిరి స్థానాలు తమకే దక్కే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన స్థానాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, దీనిపై కాంగ్రెస్‌తో చర్చించేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే ఎవరూ అందుబాటులోకి రాలేదని వివరించారు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ స్థానంతోపాటు ఖమ్మం నుంచి ఒక బీసీ సీటును అడుగుతున్నామని పేర్కొన్నారు. అన్ని స్థానాలపై స్పష్టత వచ్చిన తర్వాతే తమ అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టంచేశారు. కాగా, జనగామలో పోటీచేసే విషయంపై మాట్లాడటానికి కోదండరాం నిరాకరించారు. అయితే, జనగామ బరి నుంచి తాను తప్పుకున్నట్లు వస్తున్న వార్తలను మాత్రం ఖండించారు. ఊహాగానాల ఆధారంగా మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. టీజేఎస్ నిలబడే స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉండదని స్పష్టంచేశారు. -
పోటీ నుంచి తప్పుకుంటున్నా : కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. దీంతో అక్కడ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్న పీసీపీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కోదండరాం జనగామ నుంచి బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ కూడా తన తొలి జాబితాలో జనగామ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో అక్కడ నుంచి కోదండరాం బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా తాను జనగామ పోటీ నుంచి తప్పుకుంటున్నాని కోదండరాం పేర్కొన్నారు. బీసీ సీటు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయనే భావనతో జనగామ పోటీ నుంచి కోదండరాం తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్న పీసీపీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు లైన్‌క్లియర్ అయింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గ సీటును తనకే కేటాయించాలని పొన్నాల మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. కోదండరాం తప్పుకోవడంతో కాంగ్రెస్ జనగామ టికెట్‌ను పొన్నాలకు కేటాయించే అవకాశం ఉంది. కాగా కోదండరాం ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి తరపున ప్రచారం చేస్తారని తెలుస్తోంది. కానీ ఈ విషయంపై కోదండ రాం ఎలాంటి ప్రకటన చేయలేదు. తన పోటీపై ఇప్పుడేమి మాట్లాడని కోదండరాం మంగళవారం మీడియాతో చెప్పారు. ఎక్కడ నుంచి పోటీ చేసేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. టీజేఎస్ కు మొత్తం 11 సీట్లు ఖరారయ్యాయని కోదండరాం పేర్కొన్నారు. మల్కాజ్గిరి, మెదక్, దుబ్బాక, సిద్ధిపేట, వర్ధన్నపేట, అంబర్‌పేట సీట్లను టీజేఎస్‌కు కేటాయించారన్నారు. మరో ఐదు సీట్ల విషయంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. టీజేఎస్ సీట్లను బుధవారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. -
ఎన్నికల బరి నుండి తప్పుకోనున్న కోదండరామ్
-
ఐదారు సీట్ల కోసం పడిగాపులా?
సాక్షి, హైదరాబాద్: కోదండరాంను కేసీఆర్ పిలిచి పీట వేసి జేఏసీ చైర్మన్‌ను చేస్తే ఆయనేమో పంగనామాలు పెట్టారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ స్వీయ అస్థిత్వం, స్వరాష్ట్ర సాధన కోసం జేఏసీ ఏర్పాటు చేసి.. దానికి కోదండరాంను చైర్మన్ చేసింది కేసీఆరేనని గుర్తు చేశారు. ఇప్పుడు అదే కోదండరాం ఐదారు సీట్ల కోసం గాంధీభవన్ మెట్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు. కాం గ్రెస్ గెలవలేని సీట్లను టీజేఎస్‌కు ఇస్తోందన్నారు. తెలంగాణ జనసమితి సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఆత్మకూరు నగేశ్, ప్రైవేటు ఉద్యోగుల సంఘం నేత రాంబాబులతో పాటు వారి అనుచరులు తెలంగాణభవన్‌లో సోమవారం టీఆర్ఎస్లో చేరారు. హరీశ్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ‘టీజేఎస్ అధినేత కోదండరాంకు తెలంగాణ పౌరుషం పోయింది. ఇప్పుడు అమరావతి, ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నారు. వచ్చినట్లే వచ్చి పోయిన తెలంగాణను సాధించుకోవడానికి ఎమ్మెల్యేలు రాజీ నామాలు చేయాలని కోదండరాం ప్రతిపాదించగానే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఒక్క నిమిషం ఆలోచిం చకుండా పదవులు వదులుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామాలు చేయకుండా జేఏసీ నుంచే వెళ్లిపోయారు. టీడీపీ తెలంగాణ ద్రోహుల పార్టీ అని చెప్పిన కోదండరాం ఆ పార్టీని జేఏసీ నుంచి సస్పెండ్ చేశారు. ఉద్యమకారులపై కాంగ్రెస్ నేతలు దాడులు చేయించారు’ అని చెప్పారు. ఆ చరిత్ర కాంగ్రెస్‌దే.. సకల జనుల సమ్మె చేస్తున్న ఉద్యోగులకు 40 రోజు లకు పైగా వేతనాలు ఇవ్వకుండా రాచిరంపాన పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దేనని హరీశ్ అన్నారు. ‘జేఏసీ చైర్మన్‌ను చేసి గౌరవించిన టీఆర్ఎస్సే ఏమీ కాకుండా పోయింది. కోదండరాం జేఏసీ రోజులను గుర్తుకు తెచ్చుకోవాలి. 2014లో, ఇప్పుడూ కోదండరాం కాంగ్రెస్‌కే దగ్గరగా ఉన్నారు. గత ఎన్నికలప్పుడు కోదండరాం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఇద్దరు ముగ్గురికి టికెట్లు ఇప్పించుకున్నారు’ అని విమర్శించారు. కూటమి లక్ష్యమేంటి? ప్రజాకూటమి లక్ష్యం ఏమిటో కోదండరాం చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. ‘తెలంగాణ ద్రోహుల పార్టీలతో ఇప్పుడు కోదండరామే అంటకాగుతుండు. ఆయనను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తెలంగాణ ఇంటి పార్టీ నేత చెరుకు సుధాకర్‌పై ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పీడీ యాక్టు కింద కేసు పెట్టి జైలుకు పంపింది. ఆయనకే ఇప్పుడు టికెట్ వచ్చే పరిస్థితి లేదు. ఉద్యమకారులకు సముచిత గౌరవం ఇచ్చేది టీఆర్ఎస్ మాత్రమే. మనకు పరాయిపాలన వద్దు. వంద సీట్లను గెలిచి కేంద్రంలోనూ చక్రం తిప్పుతం. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ భారీ మెజా రిటీతో గెలవడం ఖాయం’ అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. -
‘కోదండరాం.. ఓ సారి పాత పేపర్లు ముంగటేసుకో’
సాక్షి, హైదరాబాద్ : కేవలం నాలుగు సీట్లకోసం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం గాంధీభవన్ మెట్ల మీద పొర్లుదండాలు పెడుతున్నారని అపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సీట్లకోసం కోదండరాం అమరావతికి, ఢిల్లీకి గులామయ్యారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వ్యూహం ప్రకారమే కోదండరాంను మహాకూటమి కమిటీ చైర్మన్‌గా నియమించారని ఆరోపించారు. టీడీపీని తెలంగాణ ద్రోహి అన్న కోదండరాం ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్ కోదండరాంను టార్గెట్ చేస్తే.. టీఆర్ఎస్ ఆయనను కంటికి రెప్పలా కాపాడిందన్నారు. పాత రోజులను ఆయన ఓసారి గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. కోదండరాం పాత పేపర్లు ముంగటేసుని ఒక్క సారి చూసుకోవాలన్నారు. సంగారెడ్డికి చెందిన టీజేఎస్ నేత నగేశ్, ఆయన అనుచరులు, ప్రైవేట్ ఉద్యోగ సంఘ నేతలు సోమవారం హరీశ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ..జేఏసీని విచ్ఛిన్నం చేయాలని చూసిన కాంగ్రెస్, టీడీపీలకు కోదండరాం దగ్గరయ్యారని విమర్శించారు. నాడు తిట్టిన వారు ఇప్పుడు కోదండరాంకు మంచివారయ్యారని, రక్షణ కవచంలా నిలిచిన టీఆర్ఎస్ చెడ్డదైందన్నారు. కోదండరాం రంగులు మార్చిన వైఖరిని ఎండగడుతామన్నారు. కాంగ్రెస్ గెలవలేని సీట్లను కోదండరాంకి ఇస్తుందని ఆరోపించారు. కోదండరాం నిజస్వరూపాన్ని త్వరలోనే బయటపెడతామన్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా టీఆర్ఎస్ వంద సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
తుదిదశకు చేరిన కూటమి చర్చలు
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమిలో ఏ పార్టీ ఏ స్ధానంలో పోటీ చేస్తుందన్న వివరాలు సోమవారం వెల్లడిస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. టీజేఎస్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ప్రొఫెసర్ కోదండరాం, టీటీడీపీ నేత ఎల్ రమణతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్చలు జరిపారు. తాజా సంప్రదింపులతో కూటమి చర్చలు తుదిదశకు చేరుకున్నాయని నేతలు తెలిపారు. డిసెంబర్ 12న తెలంగాణలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టడమే తమ కూటమి ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు, మైనారిటీలను మోసం చేసేందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసేందుకు కేసీఆర్ యోచిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ హయాంలో ఒక్క విద్యుత్, ఇరిగేషన్ ప్రాజెక్టు రాలేదని, ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలుచేశారని ఆరోపించారు. సానుకూల వాతావరణంలో కూటమి చర్చలు సాగుతున్నాయన్నారు. ఆశావహులు నిరాశ చెందకుండా పార్టీ విజయానికి కృషి చేస్తే నామినేటెడ్ పోస్టులు, మండలిలో అవకాశం కల్పిస్తామని చెప్పారు. -
కూటమిపై సోషల్ మీడియాలో జోకులు
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఆలస్యం కావడం వల్ల సోషల్ మీడియాలో వ్యంగ్యంగా జోకులు వేస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. టీజేఎస్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో శనివారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల కీలక సందర్భంలో సీట్లపై తేల్చకుండా జాప్యం చేయడం సరికాదన్నారు. ఇప్పటికే మహాకూటమి ఉమ్మడిగా ప్రచారం మొదలు పెట్టాల్సి ఉందని, కూటమిలోని అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్సే ఈ జాప్యానికి కారణమని తెలిపారు. సీట్ల సర్దుబాట్లపై రోడ్ మ్యాప్ లేనందునే అనిశ్చితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీట్లు సర్దుబాటు, ఎజెండా అంశాలపై ఇప్పటికీ సరైన స్పష్టత లేద న్నారు. సీట్ల సర్దుబాటుపై రెండు మూడురోజు ల్లో పూర్తవుతుందన్నారు. పార్టీ కార్యాలయం శనివారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో సీట్ల సర్దుబాటు, పొత్తుల ప్రక్రియ, భవిష్యత్తు కార్యచరణపై చర్చ జరిగినట్లు కోదండరాం తెలిపారు. సీట్లను గౌరవంగా ఇవ్వకుంటే టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీకి సూచించినట్టు చెప్పా రు. ఉమ్మడి సింబల్ గురించి ఈసీ నుంచి అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలిపారు. అడిగింది 39 స్థానాలు...దక్కింది 8 స్థానాలు గత 35 ఏళ్లుగా వరంగల్ పశ్చిమ, నిజామాబాద్, తాండూర్ వంటి చాలా స్థానాల్లో కాంగ్రెస్‌పార్టీ అసలు గెలవలేదని, కాంగ్రెస్‌పార్టీ బలహీనంగా ఉన్న ఆ నియోజకవర్గాల్లోనే టీజేఎస్ స్థానాలకు కోరిందని తెలిపారు. అలాంటి 21 నియోజకవర్గాల్లో టీజేఎస్‌కు నిలదొక్కుకునే శక్తి ఉందని వివరించారు. కూటమిలో మొత్తంగా తాము ముందుగా 39 అసెంబ్లీ స్థానాలను కోరామని ఆ తర్వాత పార్లమెంటు నియోజకవర్గానికి ఒక సీటు చొప్పున 17 నియోజకవర్గాలు ఇవ్వాలని అడిగినట్టుగా ఆయన వెల్లడించారు. ఆ తరువాత 12 స్థానాలకు అంగీకరించామని, చివరకు 10 స్థానాలను కూడా ఒప్పుకున్నట్టుగా కోదండరాం చెప్పారు. కాం గ్రెస్ పార్టీ 8 స్థానాలతో జాబితాను ఇచ్చిందన్నారు. కూటమి స్ఫూర్తిని దెబ్బతీయకూడదనే... బెల్లంపల్లి, అశ్వారావుపేట వంటి పేర్లను కూడా వాటిలో చేర్చారని కోదండరాం చెప్పారు. సామాజిక న్యాయం కోసం ఎస్సీ, ఎస్టీ సీట్లు అడిగామని, మెద క్, దుబ్బాక స్థానాలను ఇచ్చారని చెప్పారు. చివరికి టీజేఎస్‌కు ఇచ్చిన 8 స్థానాల్లో స్పష్టతను ఇవ్వాలని కోరామన్నారు. సిద్దిపేటతో పాటు అనేక స్థానాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉందన్నారు. కూటమి స్ఫూర్తి్తని దెబ్బతీయకూడదనే ఓపిగ్గా ఉన్నామన్నారు. -
నాలుగు సీట్లిస్తేనే ఆయన హోటల్‌కు..
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల పంపకాల వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. తమకు కేటాయించిన సీట్ల విషయమై మహాకూటమిలో భాగస్వామ్య పార్టీలు ఇంకా తీవ్ర అసంతృప్తితోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని పార్క్ హయత్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన దూత కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉతమ్‌కుమార్‌రెడ్డితో తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం భేటీ అయ్యారు. సీట్ల పంపకాల విషయమై కాంగ్రెస్‌కు, ఇతర భాగస్వామ్య పార్టీలకు కోదండరాం మధ్యవర్తిత్వం నెరుపుతున్నారు. తమకు నాలుగు సీట్లు కేటాయిస్తేనే మహాకూటమిలో కొనసాగుతామని సీపీఐ పట్టుబడుతున్న విషయాన్ని ఆయన ఈ భేటీలో కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లినట్టు తెలుస్తోంది. సీపీఐకు నాలుగు సీట్లు కేటాయిస్తామని హామీ ఇస్తేనే.. ఆ పార్టీ కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి పార్క్ హయత్ హోటల్‌కు వస్తారని కాంగ్రెస్ నేతలకు కోదండరాం స్పష్టం చేసినట్టు సమాచారం. అంతకుముందు కోదండరాం.. నగరంలోని ఓ హోటల్లో చాడా, టీడీపీ నేత ఎల్ రమణతో భేటీ అయి.. కూటమి సీట్ల పంపకాలపై చర్చించారు. -
కూటమిలో కుమ్ములాట.. మెదక్ టికెట్ దక్కించుకునేదెవరు..?
సాక్షి,మెదక్ : మహా కూటమి టికెట్ల పంపిణీ విషయం ఇంకా రెండు రోజుల్లో తేలనుంది. నియోజకవర్గంలో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా.. ఇదే చర్చ. మెదక్ టికెట్ కాంగ్రెస్‌కు దక్కుతుందా? లేక టీజేఎస్‌కా? ఒక వేళ కాంగ్రెస్‌కే పోటీ చేసే అవకాశం వస్తే.. శశిధర్‌రెడ్డికి వస్తుందా? బట్టి జగపతికా? సుప్రభాతరావుకా? తిరుపతిరెడ్డికా? ఇలాంటి ప్రశ్నలతో.. ఆశావహులే కాకుండా నియోజకవర్గ ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆశావహులు వాళ్ల గాడ్ ఫాదర్స్‌తో టికెట్ కోసం ఢిల్లీలో గట్టిగానే ప్రయాత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనకు ఇంకా రెండు రోజులే మిగలి ఉంది. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ప్రశ్న కాంగ్రెస్ ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు మెదక్ నుంచి టీజేఎస్ పోటీ చేస్తుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో కాంగ్రెస్ ఆశావహులు, నేతల్లో మహాకూటమిలో భాగంగా ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వరిస్తుందోనన్న ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. మెదక్ నుంచి కాంగ్రెస్ పార్టీనే బరిలో దింపాలని మొదటి నుంచి పట్టుబడుతున్న స్టార్ క్యాంపెయినర్, మాజీ ఎంపీ విజయశాంతి ఢిల్లీలో మకాం వేశారు. మెదక్ టికెట్ కోసమే విజయశాంతి ఢిల్లీ వెళ్లిందని ఆమె అనుచరులు చెబుతున్నారు. విజయశాంతి మంగళవారం ఏఐసీసీ పెద్దలను కలిసి మెదక్ టికెట్మహాకూటమిలో టీజేఎస్‌కు ఇవ్వొద్దని గట్టిగా కోరినట్లు తెలుస్తోంది. దీనిపై అధిష్టానం సానుకూలంగా స్పందించిందని, దీంతో మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బరిలో దిగడం ఖాయమని కాంగ్రెస్ ఆశావహులు ధీమాగా చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహులంతా ఎమ్మెల్యే టికెట్ కోసం ఎవరికివారే చివరి ప్రయత్నాల్లో మునిగిపోయారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఢిల్లీలోనే మకాం వేసి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ద్వారా టికెట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ రేసులో ఉన్న బట్టి జగపతి, సుప్రభాతరావు, తిరుపతిరెడ్డిలు కూడా పట్టు విడువకుండా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీతోపాటు ఏఐసీసీలోని తమ గాడ్ఫాదర్ల ద్వారా టికెట్‌ను దక్కించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. మహాకూటమిలో టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు సీట్లు సర్దుబాటుపై చర్చలు జరుపుతూనే మరోవైపు కాంగ్రెస్ పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈనెల 9వ తేదీన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించటం ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. టీజేఎస్‌కు దక్కుతుందని.. మెదక్ ఎమ్మెల్యే టికెట్ మహాకూటమిలో భాగంగా టీజేఎస్‌కే దక్కుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. టీజేఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న జనార్దన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మహాకూటమిలో భాగంగా టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మెదక్ టికెట్ కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ గెలుపొందే స్థా నాలను మాకు ఇవ్వాలని, మెదక్‌లో గెలిచే అవకాశం ఉందన్న టీజేఎస్‌కు టికెట్ ఇవ్వాలని ఆయ న కాంగ్రెస్ అధిష్టానంపై వత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ మెదక్ టికెట్ వదులుకునేందుకు సిద్ధంగా ఉంద ని, మెదక్ నుంచి తామే పోటీ చేస్తామని టీజేఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. దీంతో మెదక్ టికెట్ కాంగ్రెస్ దక్కుతుందా? లేక టీజేఎస్‌కు దక్కుతుందా? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. -
సీట్ల లొల్లి : కోదండరాం, సురవరం భేటీ..!
సాక్షి, హైదరాబాద్ : టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో బుధవారం భేటీ అయ్యారు. అధికార టీఆర్ఎస్ని ఓడించడమే లక్ష్యంగా రూపుదిద్దుకుంటున్న ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీలకు అసంతృప్తి ఉన్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో రాజకీయ అంశాలు ఏమి చర్చించలేదు. కేవలం స్నేహపూర్వకంగానే కలవడానికి వచ్చానని తెలిపారు. సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదని వెల్లడించారు. భేటీకి సంబంధించి కొన్ని విషయాలను ఇప్పుడే చెప్పలేనని తెలిపారు. -
సీపీఐ నేతలతో కోదండరామ్ భేటీ
-
నాలుగైదు సీట్లలో స్నేహపూర్వక పోటీ!
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో భాగంగా 10 సీట్లలో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్టు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. టీజేఎస్ కోర్ కమిటీ సమావేశం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగింది. పొత్తుల వివరాలు, కేటాయించిన సీట్లు, భవిష్యత్ కార్యాచరణను కోదండరాం వెల్లడిం చారు. ప్రతిపాదించిన సీట్లలో ఇప్పటిదాకా 7 సీట్లకు కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో ఆమోదం తెలిపిందని చెప్పారు. మిగిలిన సీట్ల విషయంలో ఢిల్లీలో జరుగుతున్న స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చల తర్వాత స్పష్టత వస్తుందన్నారు. కాంగ్రెస్, టీజేఎస్ పార్టీల్లో ఆశావహుల మధ్య పోటీ ఉన్న నాలుగైదు సీట్ల విషయంలో స్నేహపూర్వక పోటీ చేసుకుందామని కాం గ్రెస్ ప్రతిపాదించిందనే విషయాన్ని కోదండరాం కోర్ కమిటీలో వెల్లడించినట్టు తెలిసింది. అయితే, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాల్సిన సీట్ల విషయంలో కాంగ్రెస్ వైఖరిపై కోర్ కమిటీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎస్టీలకు ఆసిఫాబాద్‌ను కేటాయించాలని కోర్ కమిటీ డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఎస్సీ అభ్యర్థి కోసం స్టేషన్ ఘన్పూర్ లేదా వర్ధన్నపేటలో ఒక సీటు కోసం పట్టుబట్టాలని కమి టీ సూచించింది. వీటితోపాటు చెన్నూరును కూడా టీజేఎస్ కోరుతున్నట్టు తెలిసింది. ఏయే సీట్లు.. అభ్యర్థులెవరు? మల్కాజిగిరి, రామగుండం, మెదక్, దుబ్బాక, వరంగల్ తూర్పు, చాంద్రాయణగుట్ట, సిద్దిపేట నియోజకవర్గాల్లో టీజేఎస్ పోటీ చేయాలని కాంగ్రెస్ ప్రతిపాదించింది. మల్కాజిగిరి నుంచి దిలీప్‌కుమార్, రామగుండంలో కోదండరాం పేర్లను అనుకుంటున్నారు. కోదండరాం పోటీ చేయకుంటే కోరం కనకయ్య, బీరయ్య యాదవ్ పేర్లను పరిశీలిం చే అవకాశముంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి గాదె ఇన్నయ్య పేరును దాదాపుగా ఖరారు చేశారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి చింద రాజ్‌కుమార్, మెదక్ నుంచి జనార్దన్‌రెడ్డి(అడ్వొకేట్), సిద్ది పేట నుంచి భవానీరెడ్డి పేర్లను నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే, కొన్ని చోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మిర్యాలగూడ, నిజామాబాద్ అర్బన్, మహబూబ్‌నగర్, మహబూ బాబాద్, ఎల్లారెడ్డి, మేడ్చల్ వంటి నియోజకవర్గాలపై చర్చ జరుగుతోంది. పాత జిల్లాకు ఒక్కస్థానం చొప్పునైనా నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కనీసం ఒక్కొక్క స్థానం ఇవ్వాలని టీజేఎస్ పట్టుబడుతోంది. వీటిని బట్టి ఎక్కడెక్కడ స్నేహపూర్వక పోటీ అనే విషయం తేలనుంది. -
10 సీట్లలో పోటీ.. మరో 4 అడుగుతున్నాం!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పొత్తుల్లో భాగంగా 10 సీట్లలో టీజేఎస్ పోటీ చేయాలని పరస్పరం అనుకున్నామని, ఇంకో నాలుగు సీట్ల కోసం కాంగ్రెస్‌ను అడుగుతున్నామని ఆ పార్టీ అధినేత కోదండరాం చెప్పారు. మహాకూటమి రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టిస్తుందని అన్నారు. ఆ పార్టీ ఎన్నికల గుర్తు అగ్గిపెట్టె లోగోను కోదండరాం సోమవారం ఇక్కడ విడుదల చేశారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను కూడా వెల్లడించారు. పూర్తిస్థాయి మేనిఫెస్టోను ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన తరువాత విడుదల చేస్తామన్నారు. దీపావళి రోజున పొత్తులు ఖరారు చేస్తామన్నారు. మహాకూటమి ఏర్పాటు ఇప్పటికే పూర్తయితే బాగుండేదని, ప్రచారం బాగా జరిగేదని అభిప్రాయపడ్డారు. కూటమి ఏర్పాటు ప్రజలకు భరోసా కల్పించిందన్నారు. రాజకీయ అవసరాల కోసం కూటమి ఏర్పా టు చేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో సీపీఐ పాల్గొన్నదని, ఆ పార్టీని కూటమిలో కలుపుకోవాలని అన్నారు. రాష్ట్రంలో నిరంకుశపాలన అంతం కావాలంటే ప్రజలంతా కూటమిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తులు కేంద్రంగా పరిపాలన ఉండొద్దని అభిప్రాయపడ్డారు. అందుకే తను పోటీ చేసే విషయం కూటమి సీట్లను బట్టి ఆధారపడి ఉంటు ందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అణిచివేతకు పుల్లలు పెడుతామని, ప్రజలకు మంచి చేసే వాళ్లకు అగ్గిపుల్లతో మంగళహారతి ముట్టించి, స్వాగతం చెబుతామన్నారు. ప్రజలకు చెడు చేసేవాళ్ళ చెత్తను కాలబెడతామని కోదండరాం స్పష్టం చేశారు. ప్రగతికి పది సూత్రాలు... మేనిఫెస్టో ముఖ్యాంశాలు - పారదర్శక, ప్రజాస్వామిక, బాధ్యతాయుత, సుపరిపాలన, పౌర సమాజ సలహాలు, సూచనలు తీసుకోవడానికి అన్ని మార్గాలను ఉపయోగించుకుని, విధాన నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా చర్యలు, ముఖ్యమంత్రి రోజూ ఉదయం ఒక గంట ప్రజలకు అందుబాటులో ఉంటారు. - సామాజిక న్యాయం, సాధికారత - అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం - ఉద్యోగ, ఉపాధికల్పన, ఉపాధి అవకాశాలను విస్తృతపర్చడానికి నైపుణ్యాభివృద్ధి - వ్యవసాయ అభివృద్ధి - అన్ని జిల్లాల్లో ఐటీ, పారిశ్రామికాభివృద్ధి, చిన్న, సూక్ష్మ, గృహ పరిశ్రమలకు ప్రాధాన్యం - గ్రామీణాభివృద్ధి - బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమం, స్వావలంబన - మహిళా సాధికారత - పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు: తక్షణ చర్యలు - రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణాల మాఫీ - అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో లక్ష ఉద్యోగాలు. ప్రతి ఏటా క్యాలెండర్ ప్రకటన, ఉపాధి అభించే వరకు అర్హతను బట్టి రూ.3 వేల వరకు నిరుద్యోగభృతి - ఉద్యమకాలంలో ఉద్యమకారులపై పెట్టిన అన్ని కేసులు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఎత్తివేత. ఏడాదిలోగా హైదరాబాద్‌లో అమరుల స్మృతిచిహ్నం నిర్మాణం - కౌలు రైతులుసహా వాస్తవ సాగుదారులందరినీ గుర్తించి, వారందరినీ అన్ని ప్రభుత్వ వ్యవసాయ పథకాలకు లబ్ధిదారులుగా గుర్తించడం - ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు కౌలు రైతులతో సహా నష్టపరిహారం - ధర్నాచౌక్ పునరుద్ధరణ.. తెలంగాణ మ్యూజియంగా ప్రగతిభవన్ - ఈపీసీ వ్యవస్థను రద్దు చేసి, నిర్మాణ పనులను కట్టగట్టి బడా కాంట్రాక్టర్లకు ఇచ్చే పద్ధతికి స్వస్తి - పేద రైతులను నిరాశ్రయులను చేస్తున్న, భూమి లేని గ్రామీణుల ఉసురు తీస్తున్న రైతు వ్యతిరేక భూసేకరణ చట్టం–2016 చట్టం తొలగింపు. భూసేకరణ చట్టం–2013 యథావిధిగా అమలు. - ఉన్నతవిద్యను ప్రజలకు దూరం చేయడానికి తెచ్చిన ప్రైవేటు యూనివర్సిటీల చట్టం రద్దు - పౌరసేవా చట్టం ద్వారా అన్ని పథకాల ప్రయోజనాలు ప్రజలకు హక్కుగా పొందే అవకాశం. స్థానాల జాబితా కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణ జన సమితి(టీజేఎస్)కి ఇవ్వాల్సిన స్థానాల జాబితాను కాంగ్రెస్ ఇచ్చిందని కోదండరాం తెలిపారు. ఈ జాబితాపై పార్టీలో చర్చించిన తర్వాత తమ స్పందన తెలియజేస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
కనీసం పది సీట్లలోనైనా పోటీ చేస్తాం
-
పార్టీ గుర్తును ప్రకటించిన కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీ గుర్తు అగ్గిపెట్టెను ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీసం పది సీట్లలోనైనా పోటీ చేయాలని టీజేఎస్ భావిస్తుందన్నారు. నేడు మహాకూటమి పొత్తులపై చర్చించడానికి కాంగ్రెస్ నేతలను కలుస్తున్నట్టు తెలిపారు. ఈ రోజు సాయంత్రం వరకు కూటమికి తుది రూపం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీపావళి వరకు మహాకూటమి నెలకొంటుందని అన్నారు. మహాకూటమి ఏర్పాటు ప్రజలకు భరోసా నింపిందని పేర్కొన్నారు. పొత్తుల్లో జాప్యం వల్ల ప్రజా సంఘాల్లో నిరుత్సాహం ఏర్పడుతోందని వ్యాఖ్యానించారు. కూటమి ఏర్పాటులో జాప్యం వల్ల ప్రచారం దెబ్బతిందని అభిప్రాయపడ్డారు. అయిన ఇప్పటికి మించిపోయింది లేదన్నారు. పొత్తుల అంశంపై తొందరగా ముందుకు వెళ్తే.. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పెను మార్పు వచ్చే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమ అకాంక్షలను నిలబెట్టాలనుకునే వారు, ప్రతి ప్రజా సంఘం మహాకూటమికి మద్దతుగా నిలవాలని కోరారు. కూటమి కూర్పులో జాప్యం వల్ల తప్పుడు వార్తలు ప్రజల్లోకి వెళ్తున్నాయనే అసంతృప్తి నాయకుల్లో ఉందన్నారు. సీట్ల సర్దుబాటు త్వరగా జరగకపోతే ప్రజల్లో నమ్మకం కోల్పోతామని తెలిపారు. తమకు గెలిచే సామర్ధ్యం గల అభ్యర్థులు ఉన్నట్టు స్పష్టం చేశారు. దసరాకి స్పష్టత రావాల్సిన పొత్తుల వ్యవహరం దీపావళి వరకు కూడా కొలిక్కి రాకపోవడం మంచి పరిణామం కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సీపీఐని కూటమిలో కలుపుకుపోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వారికి కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కూటమిపై ఉందన్నారు. సాయంత్రం వరకు సీసీఐ సీట్ల సర్దుబాటు సమస్య ముగుస్తుందని తెలిపారు. సీపీఐ కూటమిలో తప్పకుండా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. -
ఆశావహులకు టీపీసీసీ అల్టిమేటం
-
ఢిల్లీకి వెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు వ్యవహారం ఢిల్లీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పొత్తుల వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడం, నాన్చివేత ధోరణిపై కోదండరాం నేరుగా రాహుల్‌కే ఫిర్యాదు చేయడంపై ఏఐసీసీ పెద్దలు టీపీసీసీపై గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. అయితే టికెట్ల ఆశావహులు పదేపదే ఢిల్లీ వెళ్లడం, అక్కడి ఏఐసీసీలోని పెద్దలను కలవడం రాష్ట్ర కాంగ్రెస్ నేతలను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఆశావహులెవరూ ఢిల్లీ వెళ్లొద్దని, అక్కడ ఏఐసీసీ పెద్దలను కలిసి సమయం వృథా చేయవద్దని టీపీసీసీ నేతలు ఆశావహులకు అల్టిమేటం ఇచ్చినట్టు తెలిసింది. స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన జాబితా కోర్‌కమిటీకి చేరిన తర్వాత కూడా ఆశావహులు ఢిల్లీలోనే ఉంటూ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పదేపదే కోర్ కమిటీ సభ్యులను కలవడం, వినతులివ్వడం చేస్తుండటంతో కోర్ కమిటీ సభ్యులు టీపీసీసీ పెద్దలను మందలించినట్టుగా తెలుస్తోంది. ఈనెల 9న అభ్యర్థుల జాబితా విడుదలవుతుండటంతో చివరి ప్రయత్నంగా అభ్యర్థులు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది అభ్యర్థులు మూడు రోజుల కిందటే ఢిల్లీవెళ్లి అక్కడే మకాం వేశారు. దీంతో అభ్యర్థులెవరూ ఢిల్లీ రావద్దని, అనవసరంగా సమయం వృథా చేసుకోవద్దని కాంగ్రెస్ హైకమాండ్ అల్టిమేటం ఇచ్చినట్టు తెలిసింది. కొంతమంది అభ్యర్థులు ఏకంగా కులసంఘాల పెద్దలను, సామాజిక వర్గ నేతలను తీసుకెళ్లి యూపీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఇతర పార్టీల పెద్దలతో ఏఐసీసీ నేతలకు ఫోన్లు కొట్టించడం హైకమాండ్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేసిందని హస్తినలో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా అభ్యర్థుల వినతులను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదుపై టీపీసీసీ నేతలకు ఏఐసీసీ నేతలు ఘాటుగానే హెచ్చరికలు జారీచేసినట్టు తెలుస్తోంది. -
కూటమిపై త్వరగా తేల్చండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాకూటమి పొత్తుల అం శాన్ని త్వరగా తేల్చాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కోరారు. అప్పుడే తెలంగాణలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు ప్రజాకూటమి ప్రత్యామ్నాయ శక్తిగా కనబడుతుందని వివరించారు. శుక్రవారం ఢిల్లీలో రాహుల్ కార్యాలయ కార్యదర్శి కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ ఆధ్వర్యంలో కోదండరాం, టీజేఎస్ నేత దిలీప్‌కుమార్ తదితరులు రాహుల్‌గాంధీని ఆయన నివాసంలో కలిశారు. సుమారు 40 నిమిషాలు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా కూటమి ఏర్పాట్లపైనే చర్చ జరిగిందని, సీట్ల పంపకాలపై చర్చించలేదని సమావేశం అనంతరం కోదండరాం తెలిపారు. ‘రాజకీయాల ద్వారా అట్టడుగు వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, అందుకు కలసి వచ్చేవారితో పనిచేస్తామని రాహుల్ చెప్పారు. అదే ప్రాతిపదికన కలలు కన్న తెలంగాణ నిర్మాణం కోసం కలసి పనిచేసేందుకు టీజేఎస్ సిద్ధంగా ఉందని చెప్పాం. తెలంగాణలో నిరంకుశ పాలన అంతానికి కూటమి ఏర్పాటు సాధ్యపడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే కూటమి ఏర్పాట్లను త్వరగా తేల్చాలని కోరాం. దీనికి రాహుల్ కూడా సమ్మతించారు’అని కోదండరాం అన్నారు. కూటమి ప్రక్రియ నడవట్లేదు.. ‘ప్రస్తుతానికి ప్రజాకూటమి ఏర్పాట్ల ప్రక్రియ నడవట్లేదు. భాగస్వామ్య పక్షాల సీట్ల పంపకాలపై చర్చ జరగట్లేదు. కాలయాపన చేయడం ద్వారా ఎవరికీ ఉపయోగం ఉండదు. మేం బలంగా ఉన్న స్థానాలనే ఆశిస్తున్నాం. 15 సీట్లు అడుగుతున్నాం. వాటిని సాధించుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ అది జరగకపోతే తర్వాతేంటన్నది అప్రస్తుతం. ఇది కూటమి నిర్మాణానికి సంబంధించిన విషయం. కూటమి అన్నది ఆధికారం కోసమే ఏర్పడితే నిష్ప్రయోజనం’అని కోదండరాం పేర్కొన్నారు. కాంగ్రెస్ నిర్ణయంపై మాట్లాడను.. కాంగ్రెస్ 95 స్థానాల్లో, టీడీపీ 14 స్థానాల్లో పోటీకి నిర్ణయం జరిగిందని కుంతియా, ఉత్తమ్ స్పష్టం చేయడంపై కోదండరాంను మీడియా ప్రశ్నించగా.. ఆ ప్రకటన నేను చూడలేదని, దానిపై మాట్లాడనంటూ బదులిచ్చారు. ప్రజలు ఆశగా చూస్తున్న ప్రజాకూటమిని ఇంతదూరం తీసుకొచ్చాం కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తాను ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్నది అప్రస్తుతమని ర్కొన్నారు. పొత్తులపై తేలాక ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. టీడీపీతో ఘర్షణలు మర్చిపోలేదు.. ‘తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీతో సైద్ధాంతికంగా పడ్డ గొడవలు మర్చిపోలేదు. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి కార్యాచరణ ప్రాతిపదికనే కలవగలుగుతున్నాం’ కోదండరాం పేర్కొన్నారు. ‘తెలంగాణ ఉద్యమాన్ని భుజాలపై మోసిన వ్యక్తి కోదండరాం. అమరుల త్యాగాలను అవమానపరిచేలా కేసీఆర్ పాలన సాగించారు. దీనికి వ్యతిరేకంగా పోరాడటంలో కలసి పనిచేసేందుకే రాహుల్‌ను కోదండరాం కలిశారు’ అని మధుయాష్కీగౌడ్ అన్నారు. -
రాహుల్‌తో ముగిసిన కోదండరామ్ భేటీ
-
కేసీఆర్ దుష్ట పాలన అంతానికే కూటమి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ దుష్ట పాలనను అంతం చేయడానికే కూటమి ఏర్పా టైందని టీజేఎస్ అధ్యక్షుడు ఎం.కోదండరాం స్పష్టం చేశారు. బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నివాసంలో కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొత్తులు, కాంగ్రెస్ పార్టీ వైఖరి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కోదండరాం మాట్లాడుతూ.. పొత్తు చర్చలపై మీడియాలో గందరగోళంగా ఉందని, ఈ అంశంపై తాము కూడా చర్చించినట్టు తెలిపారు. -
రామగుండం నుంచి కోదండరాం?
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో భాగస్వామ్యపక్షమైన తెలంగాణ జన సమితి (టీజేఎస్)కి ఇప్పటిదాకా 8 సీట్లు ఖరారు అయినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రామగుండం, వరంగల్ తూర్పు, మల్కాజిగిరి, మిర్యాలగూడ, అశ్వారావుపేట, సిద్దిపేట, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట నియోజకవర్గాలకు కాంగ్రెస్ నుంచి అంగీకారం వచ్చినట్లు తెలుస్తోంది. రామగుండం నుంచి టీజేఎస్ అధ్యక్షుడు ఎం. కోదండరాం పోటీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. మరోవైపు తమకు కనీసం 12 స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని కోదండరాం పట్టుబడుతున్నారని తెలుస్తోంది. తమకు చెన్నూరు, ఆసిఫాబాద్, దుబ్బాక, షాద్‌నగర్ లేదా మెదక్ నియోజకవర్గాలను ఇవ్వాలని కోదండరాం గట్టిగా కోరుతున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను పోటీలో దించడానికి తమకు తగిన సీట్లు కేటాయించాలని ఆయన కోరుతున్నారని తెలియవచ్చింది. మరోవైపు చాంద్రాయణగుట్ట, మలక్‌పేట వంటి నియోజకవర్గాలు తాము కోరుకోవడం లేదని, ఆ సీట్లను కూడా మార్చాలని టీజేఎస్ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఏదైనా నియోజకవర్గాన్ని మార్చి మహబూబ్‌నగర్‌ను ఇవ్వాలని వారు అడుగుతున్నట్లు సమాచారం. మరో రెండు సీట్లను పెంచడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగానే ఉందని, అదే సమయంలో సీట్లను కూడా మార్చాలని తాము కోరుతున్నట్లు టీజేఎస్ నేతలు చెబుతున్నారు. టీజేఎస్ స్టీరింగ్ కమిటీ సమావేశం... సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు ఇంకా పూర్తికాకపోవడం, కోరిన సీట్లు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించని నేపథ్యంలో టీజేఎస్ స్టీరింగ్ కమిటీ మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు ఎం. కోదండరాం అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీపీసీసీపై కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి తేవాలని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. కోరిన సీట్ల సంఖ్య, కోరిన నియోజకవర్గాలను సాధించుకోవడానికి అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేయాలని, అప్పటికీ సంతృప్తికరంగా సీట్ల సర్దుబాటు పూర్తికాకుంటే భవిష్యత్ కార్యాచరణ గురించి నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. -
ఎంతకాలం ఈ సాగదీత?
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయమై జరుగుతున్న సాగదీత వైఖరిపై తెలంగాణ జనసమితి అసహనం వ్యక్తం చేసింది. టీజేఎస్ అధ్యక్షుడు ఎం. కోదండరాం నేతృత్వంలో పార్టీ కోర్ కమిటీ సోమవారం సమావేశమైంది. సీట్ల సర్దుబాటు, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. పార్టీ కార్యాలయంలోనే జరిగిన అంతర్గత సమావేశంలో సీట్ల సర్దుబాటును పూర్తి చేయకుండా కాంగ్రెస్ సాగదీయడంపై పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక ఆలస్యం చేయకుండా సీట్ల పంపకాలను తేల్చేవిధంగా ఒత్తిడి చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. సీట్ల సర్దుబాటు వ్యవహారం సత్వరమే పూర్తయ్యేలా మిత్రపక్షాలైన టీటీడీపీ, సీపీఐతో కలసి కాంగ్రెస్‌పై ఒత్తిడి తేవాలని పలువురు ముఖ్యులు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఇదే వైఖరితో ఉంటే రాష్ట్రంలో పట్టున్న ముఖ్యమైన 15 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించి ముందుకు వెళ్దామని కొందరు టీజేఎస్ ముఖ్య నేతలు ప్రతిపాదించినట్లు తెలిసింది. టీజేఎస్‌కు కేటాయించే సీట్ల విషయంలో కాంగ్రెస్ ఎక్కడా స్పష్టత ఇవ్వకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో పొత్తుల విషయమై తాడోపేడో తేల్చాలని కోదండరాంపై పలువురు నేతలు ఒత్తిడి తెచ్చినట్లు తెలియవచ్చింది. కోదండరాంతో రమణ, చాడ భేటీ... తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం. కోదండరాంతో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆదివారం రాత్రి, సోమవారం సమావేశమయ్యారు. టీజేఎస్‌కు 12 సీట్లు ఇవ్వాలని కోదండరాం కోరుతుండగా సీపీఐ కనీసం 6 స్థానాలకు తగ్గకుండా ఇవ్వాలని పట్టుబడుతోంది. ఇప్పటిదాకా టీజేఎస్‌కు 8 సీట్లను ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. సీపీఐ కూడా సీట్ల సర్దుబాటుపై అసహనం వ్యక్తం చేస్తోంది. బెల్లంపల్లి, కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, దేవరకొండ, మునుగోడు స్థానాల కోసం సీపీఐ పట్టుబడుతోంది. -
‘ఉద్యమ ఆకాంక్షలను వమ్ముచేసిన కేసీఆర్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోరా టాలకు ఎన్నోసార్లు అం డగా ఉన్నానని, రాష్ట్రం వస్తే ఎంతో సంతోషపడ్డానని కేంద్ర మాజీమం త్రి, రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా అజిత్‌సింగ్‌ను టీజేఎస్ అధ్యక్షుడు ఎం.కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ నేతలు కె.దిలీప్‌కుమార్, విద్యాధర్‌రెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అజిత్‌సింగ్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు బలిదానాలు చేశారని, సబ్బండ వర్గాలు ఉద్యమించాయన్నారు. తెలంగాణలో జరిగిన ఎన్నో సభల్లోనూ, పోరాటాల్లోనూ పాల్గొన్నట్టుగా గుర్తుచేశారు. తెలంగాణ బిల్లును ఆమోదించాలని కేంద్రమంత్రిగా ఒత్తిడి చేశానని, పార్లమెంటులోనూ మద్దతును ఇచ్చానని చెప్పారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో సుదీర్ఘకాలంపాటు పోరాడి సాధించుకున్నారని, రాష్ట్రం ఏర్పాటైతే ఎంతో సంతోషపడ్డానని అన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను నీరుగార్చారని విమర్శించారు. ప్రజల ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటుకావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో మహాకూటమిని అధికారంలో తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రాష్ట్రంలో పర్యటిస్తానని, సభల్లో పాల్గొంటానని ఆయన వెల్లడించారు. -
యువతకు అవకాశాలు ఇవ్వండి: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో శాసనసభకు పోటీచేయడానికి యువకులకు అవకాశం ఇవ్వాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంకు ఆ పార్టీ యువజన విభాగం నేతలు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం టీజేఎస్ యువజన విభాగం రాష్ట్ర కో ఆర్డినేటర్ల భేటీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగాలు, ఉపాధి ప్రధాన నినాదంగా రాష్ట్రం కోసం పోరాటం జరిగిందని గుర్తుచేశారు. ఎందరో యువకులు, విద్యార్థుల ఆత్మబలిదానం జరిగిందని, కానీ ఆ అమరుల ఆకాంక్షలు ఈ ఐదేళ్లలో నెరవేరలేదని విమర్శించారు. టీఆర్ఎస్ను ఓడించకుంటే ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని హెచ్చరించారు. నవంబర్ 1న టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో యువజన సమితి రాష్ట్ర విస్తృతస్థాయి భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి 31 జిల్లాల యువజన సమితి కమిటీల ముఖ్యులు హాజరుకావాలన్నారు. ఈ సందర్భంగా యువజన సమితి నేతలు తమ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలను పరిశీలించాలని కోదండరాంను కోరారు. సమావేశంలో యువజన విభాగం రాష్ట్ర ఇన్చార్జి పి.ఎల్.విశ్వేశ్వర్రావు, టీజేఎస్ రాష్ట్ర నాయకులు ధర్మార్జున్, రౌతు కనకయ్య, చింతా స్వామి, వెంకట్‌రెడ్డి, యువజన నాయకులు ఆశప్ప, సలీంపాషా, ఆంజనేయులు, లింగస్వామి, పూసల రమేశ్, రమణ్ సింగ్, వినయ్, కొత్త రవి, అజయ్, జీవన్‌రెడ్డి, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. -
ఎన్ని సీట్లు... ఎక్కడెక్కడ..?
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు తేలకపోవడంతో తెలంగాణ జన సమితి (టీజేఎస్)లోని ఆశావహుల్లో అయోమయం నెలకొంది. కాంగ్రెస్, టీటీడీపీ, సీపీఐ, తెలంగాణ ఇంటిపార్టీతో కలిసి ఏర్పాటవుతున్న మహాకూటమిలో టీజేఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయి, అవి ఎక్కడెక్కడ వస్తాయనే అంశంలో స్పష్టత రాకపోవడంతో టీజేఎస్ ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటిదాకా 8 సీట్లలో టీజేఎస్ అభ్యర్థులు పోటీచేయడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. టీజేఎస్ కోరుతున్న స్థానాల్లో నాలుగు మాత్రమే ఇచ్చి, మిగిలిన నాలుగు సీట్లు మహాకూటమి బలహీనంగా ఉన్న స్థానాల్లో ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాత్రం తమకు 12 సీట్లు కేటాయించడంతో పాటు టీజేఎస్‌కు బలం ఉన్న నియోజకవర్గాల్లోనే అవకాశం ఇవ్వాలని పట్టు బడుతున్నారు. ఇప్పటిదాకా తెలిసిన అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వరంగల్ తూర్పు, మిర్యాలగూడ, మల్కాజిగిరి, రామగుండం నియోజకవర్గాలను ఇవ్వడానికి కాంగ్రెస్‌పార్టీ అంగీకరించింది. వీటితోపాటు చాంద్రాయణగుట్ట, సిద్దిపేట, మలక్‌పేట, అశ్వారావుపేట నియోజకవర్గాలను టీజేఎస్‌కు ఇవ్వడా నికి అంగీకరించినట్టుగా తెలిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రెండేసి చొప్పున టీజేఎస్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కోదండరాం కోరుతున్నారు. 12 స్థానాలను కోదండరాం కోరుతున్నారు. బుధవారం రాత్రి లేదా గురువారానికి సీట్ల సంఖ్య, పోటీ చేసే స్థానాలు పూర్తిగా ఓ కొలిక్కి వస్తాయని టీజేఎస్ వర్గాలు వెల్లడించాయి. నేడు టీజేఎస్ రాష్ట్ర కమిటీ మహాకూటమితో జరుగుతున్న చర్చల వివరాలు, ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం వంటి వాటిపై చర్చించడానికి టీజేఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం జరుగనుంది. ఇప్పటిదాకా జరిగిన చర్చల వివరాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీట్ల సంఖ్య, పోటీ చేసే స్థానాలపై ఈ సమావేశంలో చర్చించి, భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ప్రకటించనున్నారు. -
అలా పోటీ చేయటం కుదరదు : కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : ఒక పార్టీ క్యాండిడేట్ మరో పార్టీ గుర్తుపై పోటీ చేయటం కదరదని, అది సాధ్యమయ్యే విషయం కాదన్నారు తెలంగాణ జన సమితి అధ్యక్షడు ప్రొ కోదండరాం. శుక్రవారం సీట్ల సర్దుబాటుపై టీజేఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య చర్చలు జరిగాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, కోదండరాంలు సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఎలాంటి నిర్ణయం లేకుండానే ఈ చర్చలు ముగిశాయి. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. ఓ నిర్ణయం తీసుకున్నాక అందరికీ చెబుతామని అన్నారు. తెలంగాణ జన సమితీ అభ్యర్థులు ఆ పార్టీ తరపునే పోటీ చేస్తారని తెలిపారు. తమ పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తై నెంబర్ కూడా వచ్చిందని, రేపో మాపో గుర్తుకూడా వస్తుందని చెప్పారు. తమ పార్టీ అభ్యర్థులు సొంత గుర్తుపైనే పోటీ చేస్తారని అన్నారు. టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోపై తాను మాట్లాడదలుచుకోలేదని, అందులో అంత గొప్ప విషయం కూడా ఏం లేదని ఎద్దేవా చేశారు. రెండు మూడు రోజుల్లో కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తుందని తెలిపారు. -
మహాకూటమిపై కోదండరామ్ వివరణ ఇవ్వాలి
-
‘టీఆర్ఎస్ వంచనను ప్రజలు గుర్తించారు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలను టీఆర్ఎస్ ఎన్ని రకాలుగా వంచించిందో, అన్ని వర్గాల ప్రజలు గుర్తించారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. వివిధ వర్గాల కు చెందిన పలువురు నేతలు మంగళవారం టీజేఎస్‌లో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీజేఎస్ కండువాలను కప్పి కోదండరాం వారిని పార్టీలోకి ఆహ్వానిం చారు. ఎన్నికల్లో ఎన్నో హామీలను ఇచ్చి, అధి కారంలోకి వచ్చాక నమ్మిన ప్రజలను కేసీఆర్ వంచించారని మండిపడ్డారు. యువకులను, రైతులను, విద్యార్థులను, ఉద్యోగులను కేసీఆర్ వంచించారన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు పతనం తప్పదని జోస్యం చెప్పారు. టీజేఎస్‌లో చేరిన వారిలో తెలంగాణ పరిరక్షణ సమితి అధ్య క్షుడు కల్లూరి రామచంద్రారెడ్డి, మైనారిటీ నేతలు మహ్మద్ అబ్దుల్ తదితరులు ఉన్నారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా లక్ష్మి టీజేఎస్ మహిళా విభాగం కన్వీనర్‌గా రేగులపల్లి లక్ష్మిని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు కోదండరాం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా విభాగం సమన్వయకర్తగా వీణా మమత, కో కన్వీనర్లుగా ఎన్.సక్కుబాయి, బి.అనంతలక్ష్మి, అరికెల్ల స్రవంతి, టి.విజయరాణి, మేకల రజని, స్వర్ణలత, జయశ్రీని నియమించారు. -
సీట్ల కోసం పొత్తు పెట్టుకోవడం లేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు తెలంగాణ జనసమితి అల్టిమేటం ఇచ్చిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశా రు. సీట్ల కోసం తాము పొత్తు పెట్టుకోవడం లేదని వెల్లడించారు. ఉమ్మడి కార్యాచరణ ఏర్పాటు, ఆ కార్యాచరణ అమలు, జనసమితికి గౌరవప్రద స్థానం కోసం మహాకూటమితో చర్చలు జరుగుతున్నాయని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రయోజనాల కోసమే తమ పోరాటమని, దాని కోసం మేం తొందరపడుతున్నది వాస్తవమేనన్నారు. ఒకట్రెండు రోజుల్లో ఒక నిర్ణయం వస్తుందని తమకు సమాచా రం ఉందన్నారు. తెలంగాణ ప్రజాప్రయోజనాల దృష్ట్యా మహాకూటమి నిర్ణయాలు త్వరగా తీసుకోవాలని, అప్పుడే అందరం కలసి ఒక బలమైన ఎజెండా ను ముందుకు తీసుకెళ్లగలమన్నారు. దురదృష్టవశాత్తు చర్చలు ముందుకు సాగట్లేదని, ఇంకా కలిస్తే బాగుంటుంది అనే దశలోనే ఉందని వివరించారు. టీజేఎస్‌కు 3 నుంచి 5 సీట్లు అన్నది ప్రచారం మాత్రమే అని కోదండరాం పేర్కొన్నారు. తన పోటీపై పార్టీయే నిర్ణయిస్తుందన్నారు. బీజేపీతో వెళ్లే ఆలోచన ఇప్పటివరకు లేదని, కూటమిలో తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆలోచిస్తామన్నారు. కార్యకర్తలు, ప్రజలు ప్రశ్నిస్తుంటే తామేం సమాధానం చెప్పాలని.. అం దుకే తొందరపడుతున్నామన్నారు. ఏ రోజూ సీట్ల గురించి బహిరంగంగా మాట్లాడలేదన్నారు. ఈ విష యంలో తమకు స్పష్టత ఉందని, ఇన్ని సీట్లు ఇవ్వాలి అని తాము అధికారికంగా చెప్పలేదని తెలిపారు. టీజేఎస్‌లో చేరిన న్యాయవాది ప్రహ్లాద్.. గతంలో కోదండరాంతో విభేదించి జేఏసీ నుంచి బయటకి వెళ్లిన న్యాయవాది ప్రహ్లాద్ గురువారం కోదందరాం సమక్షంలో టీజేఎస్‌లో చేరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి ఇస్తామని ఆశ పెట్టడంతోనే కోదండరాంపై తాను విమర్శలు చేసినట్లు ప్రహ్లాద్ తెలిపారు. -
‘ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన టీఆర్ఎస్’
సాక్షి, హైదరాబాద్: ఈ నాలుగేళ్లు టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని పరి హాసం చేస్తూ పాలన సాగించిందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. కేంద్ర, ప్రభుత్వరంగ ఉద్యోగుల సంఘం నాయకుడు డి.ఎ.ప్రసాద్, జర్నలిస్టు సాయిరోషన్ తది తరులు మంగళవారం టీజేఎస్‌లో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి కోదండరాం పార్టీలో ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ తెలం గాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యో గులు, జర్నలిస్టులు అదే స్ఫూర్తితో పునర్ని ర్మాణం కోసం పనిచేయాలని సూచించారు. -
నియంతను కూల్చేందుకే మహాకూటమి
సాక్షి, హైదరాబాద్: మహాకూటమి అధికారంలోకి వస్తే.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు కనీస ఉమ్మడి ప్రణాళికలో చోటు కల్పిస్తామని, అన్ని డిమాండ్లను నెరవేరుస్తామని మహాకూటమి నేతలు హామీ ఇచ్చా రు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ‘ఆర్టీసీ పరిరక్షణ– కార్మికుల హక్కుల పరిరక్షణ’ సదస్సు జరిగింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ నియం త సీఎం కేసీఆర్‌ను కూల్చేందుకే తాము మహాకూటమిగా జతకట్టామన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు వారిని పట్టిం చుకోకపోవడం ఆయన నియంతృత్వానికి నిదర్శమ ని మండిపడ్డారు. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలను బూతులు తిడుతున్నాడని దుయ్యబట్టారు. కొత్త బస్సుల కొనుగోళ్లు, అద్దె బస్సుల రద్దు, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ తదితర సమస్యలను ఉమ్మ డి కనీస ప్రణాళికలో పెట్టి, మేనిఫెస్టోలో చోటు కల్పి స్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌కో హఠావో.. తెలం గాణ బచావో అన్న నినాదంతో టీఆర్ఎస్ను ఎన్నికల్లో మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఏర్పడిన రాజకీయ విపత్తును ఎదుర్కొనేందుకే మహా కూటమి ఆవిర్భవించిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. సీఎం ఫిట్నెస్ లేని డ్రైవర్.. తెలంగాణ రాష్ట్రమనే బస్సును సీఎం కేసీఆర్ డ్రైవర్‌కు అప్పగిస్తే.. పరిపాలన చేతగాక స్టీరింగ్ వదిలేశాడని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. కేసీఆర్ పరిపాలన ఫిట్నెస్ కోల్పోయిందని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ, సింగరేణి కార్మికుల వేతన త్యాగం, పోరాటాలతో సీఎం అయిన కేసీఆర్ వారిని విస్మరించడం దారుణమని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నేతలు రాజిరెడ్డి, నరసింహన్, బాబు తదితరులు పాల్గొన్నారు. -
48 గంటల్లోగా తేల్చండి; కోదండరాం అల్టిమేటం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పరిరక్షణ వేదిక (మహాకూటమి)లో తమకు కేటాయించే స్థానాలపై 48 గంటల్లోగా స్పష్టతను ఇవ్వాలంటూ తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధినేత ఎం.కోదండరాం అల్టిమేటం జారీ చేశారు. పొత్తుల్లో పార్టీలకు కేటాయించే సీట్లు తేల్చకుండా కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేయడంపై కోదండరాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీజేఎస్‌తోపాటు టీటీడీపీ, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీలకు సీట్లను కేటాయించకుండా కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారాన్ని ఎలా ప్రారంభిస్తుందని కోదండరాం ప్రశ్నించారు. తమకు కేటాయించే సీట్లపై 48 గంటల్లోగా (గురువారం సాయంత్రం) స్పష్టతను ఇవ్వాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అల్టిమేటం ఇచ్చారు. పొత్తుల్లో భాగంగా టీజేఎస్ 19 సీట్లలో పోటీచేయాలని నిర్ణయించిందని చెప్పారు. తాము కోరుకుంటున్న 19 స్థానాలపై ఎల్లుండిలోగా స్పష్టత ఇవ్వకుంటే 21 మందితో టీజేఎస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిస్తామని కోదండరాం మంగళవారం హెచ్చరించారు. కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్ పొత్తుల విషయంలో నాన్చివేత ధోరణిని అవలంభిస్తూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం సాగించడం వల్ల ఇబ్బందులు వస్తాయని కోదండరాం అభిప్రాయపడ్డారు. వెంటనే పొత్తుల అంశాన్ని పూర్తిచేయాలని కోరారు. తాము చెప్పినట్టుగా 48 గంటల్లో 21 మందితో టీజేఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. ఆ తరువాత మరో 25 మందితో రెండో జాబితాను ప్రకటిస్తామని కోదండరాం స్పష్టం చేశారు. కోదండరాంతో రమణ భేటీ.. కోదండరాంతో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మంగళవారం భేటీ అయ్యారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలోనే వీరు సమావేశమయ్యారు. పొత్తుల్లో కోరుతున్న స్థానాలు, కాంగ్రెస్ వైఖరి, లాభనష్టాలు, అనుసరించాల్సిన వ్యూహం వంటి వాటిపై వీరిద్దరూ చర్చించారు. పొత్తుల్లో సీట్ల సంఖ్య, అభ్యర్థులను వీలైనంత త్వరలో పూర్తిచేయడానికి కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. పొత్తుల్లో సీట్లు, అభ్యర్థులను తేల్చకపోతే జరిగే నష్టాన్ని నివారించాలని నిర్ణయించారు. -
తెలంగాణ వ్యతిరేకితో పొత్తా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా అడ్డుకుంటున్న టీడీపీతో పొత్తుపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని సాగునీటి మంత్రి తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు కాంగ్రెస్ ముసుగులో మళ్లీ ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీకి దూరమైన పార్టీలతో కోదండరాం ఎలా కలసి పని చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పాతూరి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, చింతా ప్రభాకర్లతో కలసి హరీశ్‌రావు మంగళవారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబునాయుడుతో మీది షరతులతో కూడిన పొత్తా.. బేషరతు పొత్తా.. అధికారం కోసమే పెట్టుకునే పొత్తా? స్పష్టం చేయాలి. చంద్రబాబు సమైక్య నినాదాన్ని పక్కనపెట్టి తెలంగాణ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్న తర్వాతే టీఆర్ఎస్ 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తున్నట్లు ఏఐసీసీ చెప్పిన తర్వాతే 2004లో కాంగ్రెస్‌తో కలసి పోటీ చేశాం. అప్పటి మా పొత్తులు వందకు వంద శాతం షరతులతో కూడినవే. ఈ షరతులు ఉల్లంఘించగానే ఆ పార్టీలతో తెగతెంపులు చేసుకున్నాం. తెలంగాణ కోసం మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచల్లాగా వదులుకున్నాం. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల విషయంలో మీరు టీడీపీతో ఇలాగే షరతులు పెట్టారా? మీ పొత్తులు రాష్ట్ర ప్రయోజనాల కోసమా, మీ రాజకీయ ప్రయోజనాల కోసమా స్పష్టం చేయాలి. సీఎం కేసీఆర్ తెలంగాణను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పడగొట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు తెలంగాణలో నేరుగా వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ పోటీ చేసినా టీడీపీకి డిపాజిట్లు దక్కవని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రుజువైంది. అందుకే చంద్రబాబు కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి అడుగుపెడుతున్నారు. మహాకూటమి నేతల వ్యక్తిగత స్వార్థం కోసమే తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం కాదు. తెలంగాణ సామాన్య జనం మహాకూటమి ఏర్పాటును చీదరించుకుంటున్నారు. కేసీఆర్ పదకొండు రోజుల దీక్షతో చావు నోటి దాకా వెళ్లి తెలంగాణ తెచ్చారు. తెలంగాణపై కేసీఆర్ చిత్తశుద్ది ఇది. మహాకూటమి నేతలు మాత్రం పరాయి పాలనకు మొగ్గు చూపుతున్నారు’అని హరీశ్ విమర్శించారు. తెలంగాణ వ్యతిరేకులతో కోదండరాం జట్టు... తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం లక్ష్యమేమిటో అర్థం కావడంలేదని హరీశ్‌రావు అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం కోసం మాతో కలసి ఉద్యమించిన కోదండరాం ఇప్పుడు సీట్ల కోసం తెలంగాణ వ్యతిరేకులతో కలవడం అమరవీరుల ఆత్మలకు ద్రోహం చేయడం కాదా? తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జేఏసీ నిర్ణయించింది. అనంతరం జరిగిన పరిణామాలతో టీడీపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని మీరే జేఏసీ నుంచి సస్పెండ్ చేశారు. జేఏసీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు మీ మొహం మీదే ప్రకటించి కాంగ్రెస్ వెళ్లిపోయింది. అలాంటి పార్టీలతో కలసి పని చేస్తారా? కోదండరాం ఎమ్మెల్యేగా గెలవడం కోసం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడతారా? మీ నిర్ణయంలో ఏ ఉద్యమ స్ఫూర్తి ఉందో చెప్పాలి’అని ప్రశ్నించారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తులపై తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాసిన బహిరంగ లేఖను మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా విడుదల చేశారు. లేఖలో పేర్కొన్న 12 అంశాలను మహాకూటమి కనీస ఉమ్మడి ప్రణాళికలో చేర్చే విషయంలో స్పష్టత ఇస్తారా అని ప్రశ్నించారు. ఈ అంశాలపై పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్, టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు సంతకాలు చేస్తారా?’అని హరీశ్ ప్రశ్నించారు. ఉత్తమ్‌కు మంత్రి హరీశ్ రాసిన బహిరంగ లేఖలోని 12 అంశాలు... 1 తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా చివరి వరకు అన్ని రకాలుగా ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు... ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. చంద్రబాబు తెలంగాణ వ్యతిరేక వైఖరిని మార్చుకున్నారా? టీడీపీ పొలిట్‌బ్యూరోలో చర్చించి తెలంగాణ అంశాలపై స్పష్టత ఇచ్చారా? 2 సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల విభజన, విద్యుత్, పోలవరం, ప్రభుత్వ సంస్థల విభజన, హైకోర్టు విభజన వంటి విషయాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్పక్షాన నిలబడి తెలంగాణకు వ్యతిరేక వాదనలు వినిపిస్తున్నారు. ఇకపై తెలంగాణకు వ్యతిరేకంగా వాదించనని, పైన చెప్పిన అంశాల్లో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తానని చంద్రబాబు నుంచి ఏమైనా హామీ తీసుకున్నారా? ఈ విషయాల్లో చంద్రబాబు బహిరంగంగా వైఖరి చెప్పగలరా? కోర్టుల్లో వేసిన కేసులను ఉపసంహరించుకుంటరా? 3 విభజన చట్టంలో లేకున్నా... కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసి పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ఏడు మండలాలను గుంజుకున్నారు. తెలంగాణ ప్రజలు దీన్ని వ్యతిరేకించి రాష్ట్ర బంద్ చేపట్టారు. ఏడు మండలాలను తిరిగి ఇచ్చేయాలని కోరుతున్నారు. చంద్రబాబు దీనికి సిద్ధమా? చంద్రబాబును ఒప్పించి ఏడు మండలాలను మళ్లీ తెలంగాణలో కలకపడానికి కాంగ్రెస్ ఏమైనా అంగీకారం కుదుర్చుకుందా? 4 150 మీటర్ల ఎత్తులో పోలవరం నిర్మించి 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో డ్యామ్ నిర్వహించాలని ప్రతిపాదించారు. దీనివల్ల భద్రాచలంలోని రామాలయం సహా తెలంగాణలోని లక్ష ఎకరాలు మునిగిపోతోంది. దీని ప్రభావం ఎంతో ఇంకా అంచనా వేయలేదు. నష్టం జరగకుండా డిజైన్ మార్చాలని అందరూ కోరుతున్నారు. మీ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేశారు. పోలవరం డిజైన్ మార్చడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? పోలవరంపై మీ పార్టీ వైఖరి, చంద్రబాబు వైఖరి ఏమిటి? తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాలి. 5 మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు మేలు చేసే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించవద్దని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి, వివిధ సంస్థలకు 30 లేఖలు రాశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పిస్తారా? ఆయన వైఖరి చెప్పకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కాదా? 6 కాళేశ్వరం, తుమ్మిడిహట్టి, సీతారామ, తుపాకులగూడెం, దేవాదుల, పెన్‌గంగ, రామప్ప–పాఖాల ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. వాటిని ఉపసంహరించుకునేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారా? ఈ ప్రాజెక్టులు నిర్మిస్తే అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పగలరా? 7 పోలవరం నిర్మించి గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నందున నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు కృష్ణా నీటిలో 80 టీఎంసీల వాటా ఇవ్వాలని గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. దీనిప్రకారం తెలంగాణకు 45 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు రావాలి. తెలంగాణకు వచ్చే నీటి కేటాయింపులపై చంద్రబాబు అభ్యంతరం చెప్పారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు నష్టపోతున్నాయి. ఈ కేటాయింపులపై అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పించగలరా? 8 తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు మంచినీళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రాజెక్టు చేపట్టింది. గోదావరి, కృష్ణా నీళ్లను వినియోగించడం తప్పని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ప్రజలకు తాగునీరు ఇవ్వడానికి ఇబ్బందులు సృష్టించే చంద్రబాబుతో ఎలా పొత్తు పెట్టుకుంటారు. భగీరథపై ఫిర్యాదు విషయంలో చంద్రబాబు పశ్చాత్తాపం వ్యక్తం చేశారా? 9 విభజన చట్టంలో లేకున్నా... కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని రూ. 5 వేల కోట్ల విలువైన 460 మెగావాట్ల సీలేరు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్కున్నది. దీనివల్ల మొదట్లో తెలంగాణ రాష్ట్రం కరెంటు కోతలు అనుభవించింది. ఏడాది అంతా కరెంటు ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్టును కోల్పోవడం వల్ల తెలంగాణ ప్రభుత్వం ప్రతిరోజూ కోటి రూపాయలు నష్టపోతున్నది. సీలేరు ప్రాజెక్టును తిరిగి ఇచ్చేస్తారని చంద్రబాబు హామీ ఇచ్చారా? ప్లాంట్ తీసుకున్నందుకు నష్టపరిహారం ఇచ్చేందుకు చంద్రబాబుతో ఒప్పందం చేసుకున్నారా? 10 విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆంధ్రకు చెందిన 1,200 మందిని రిలీవ్ చేస్తే ఏపీ ప్రభుత్వం వారిని జాయిన్ చేసుకోవడంలేదు. కోర్టులో కేసులు వేశారు. ఆంధ్ర ఉద్యోగులను విధుల్లో చేర్చుకుంటామని, తెలంగాణపై ఆర్థిక భారం తొలగిస్తామని చంద్రబాబుతో చెప్పిస్తారా? కోర్టు కేసులు ఉపసంహరించుకుంటారా? 11 నిజాం కాలం నుంచి తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్లో వాటా కోసం ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. కోర్టుల్లో కేసులు వేసింది. ఆ ఆస్తులపై ఆంధ్రప్రదేశ్‌కు వాటా ఉండదని చంద్రబాబు అంగీకరించారా? కేసులను ఉపసంహరించుకుంటామని ఒప్పందం చేసుకున్నారా? 12 హైకోర్టు విభజన, ఇతర ప్రభుత్వరంగ సంస్థల విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోంది. వాటి విభజన విషయంలో చంద్రబాబు నుంచి హామీ తీసుకున్నారా? -
‘వేదిక’ చీఫ్‌గా కోదండరాం?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, టీజేఎస్‌ల కూటమికి ‘తెలంగాణ పరిరక్షణ వేదిక’అని పేరు పెట్టుకున్నారు. అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పేందుకు కనీస ఉమ్మడి కార్యక్రమం(సీఎంపీ)లో భాగంగా ఈ వేదిక ఏర్పాటు చేయాలని కూటమి నిర్ణయం తీసుకుంది. ఈ కూటమికి చైర్మన్‌గా టీజేఎస్ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేరును భాగస్వామ్య పక్షాలన్నీ ఏకగ్రీవంగా ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా వేదిక పేరుతో రాష్ట్రమంతటా ప్రచారం చేయాలని కూటమి పార్టీలు కోదండరాంను కోరుతున్నాయి. కూటమి అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల అమలును పర్యవేక్షించేందు కు వేదిక పనిచేస్తుంది. ఈ వేదిక చైర్మన్‌గా ఉండేందుకు కోదండరాం ఒప్పుకున్నారా? లేదా? అన్నది ఇంకా తేలలేదు. నాలుగైదు రోజుల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన చేసేలా.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మిగిలిన భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. ఒకసారి ప్రకటన జరిగితే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కార్యక్రమాన్ని కోదండరాంకే అప్పగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. టీడీపీకి 14, టీజేఎస్‌కు 5, సీపీఐకి 3 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ 20, సీపీఐ 8 స్థానాలకోసం పట్టుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోదండరాంకు సీట్లసర్దుబాటు వ్యవహారాన్ని అప్పగించాలనేది ఉత్తమ్ కుమార్ వ్యూహంగా కనబడుతోంది. -
ఓటమి భయంతోనే పరుష పదజాలం’
సాక్షి,హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌లో అధికారం కోల్పోతున్నానన్న అసహనం పెరిగిందని, ఆయన్ని ఓటమి భయం వెంటాడుతోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. అందువల్లే కేసీఆర్ తన స్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్నారన్నారు. ఇటీవల సభల్లో ఆయన వాడిన పరుష పదజాలం తీవ్ర ఆక్షేపణీయమని, పెద్ద మనిషి తరహాలో మాట్లాడటం లేద న్నారు. టీజేఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారం వ్యసనంగా మారిన వారికే ఇలాంటి పదజాలం వస్తుందన్నారు. ఉమ్మడిగానే ప్రచారం ఉద్యమ ఆకాంక్షలకు గౌరవం ఇచ్చే పార్టీలతోనే పొత్తు ఉంటుందని, ఆ భాగస్వామ్య పార్టీలతోనే ఉమ్మడిగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తామని కోదండరామ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం సీట్ల పంపిణీ పై నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రచారంలో భాగంగా ఈ నెల 14న మంచిర్యాల చెన్నూరులో, 15న నిర్మల్ జిల్లా మ«థోల్‌లో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఓరుగల్లు పోరుసభ పేరుతో 23న వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. అనంతరం వరంగల్ సభ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణకు ఏం చేశారు?: తెలంగాణపై ప్రేమ ఉందని చెబుతున్న కేసీఆర్ అధి కారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఏంచేశారని కోదండరామ్ ప్రశ్నించారు. కాంట్రాక్టులన్నీ ఆంధ్రా వారికే ఇచ్చారని, ఉద్యోగాలు సరిగ్గా భర్తీ చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ఉన్నాయన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఎన్నికల కమిషన్ తొందరపడిం దన్నారు. సమావేశం అనంతరం నిజాం పాలనలో ప్రధానిగా పని చేసిన మహారాజ కిషన్ ప్రసాద్ మనవడు రాజా సంజయ్ గోపాల్ టీజేఎస్‌లో చేరారు. -
మంచిర్యాల నుంచి పోటీ మంచిది!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం పోటీ చేయాల్సిన నియోజకవర్గంపై తర్జనభర్జన జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీల ఐక్యకూటమి అభ్యర్థిగా ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో కోదండరాం తేల్చుకోలేకపోతున్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఐక్యంగా పోటీచేయాలని ప్రాథమికంగా నిర్ణయం జరిగింది. ఈ కూటమిలో ఏయే పార్టీ, ఎన్ని స్థానాలకు పోటీ చేయాలనే దానిపై ఇంకా చర్చలు సాగుతున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో అమలు కమిటీకి కోదండరాం చైర్మన్‌గా ఉండాలని అన్నిపార్టీలు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి. కూటమి అభ్యర్థిగా కోదండరాం పోటీపై సందిగ్థత కొనసాగుతోంది. పోటీచేయాలా, పోటీకి దూరంగా ఉండాలా అనే దానిపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనగామ లేదావరంగల్ పశ్చిమ కోదండరాం స్వగ్రామం మంచిర్యాల పరిధిలో ఉంది. దీనితోపాటు తెలంగాణ ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉండటం, కోదండరాంకు ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పరిచయాలు, సంబంధాలుండటం వంటి కారణాలతో మంచిర్యాలలో పోటీ చేయ డం మంచిదని అంటున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు పరిసరాల్లో ఉండే నియోజకవర్గం అయితే సౌకర్యంగా ఉంటుందని మరికొందరు వాదిస్తున్నా రు. వరంగల్ పశ్చిమ, జనగామ నియోజకవర్గంలో పోటీ చేయాలని కొందరు కోరుతున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం కూడా అనుకూలంగానే ఉంటుందని కొందరు ప్రతిపాదిస్తున్నారు. అయితే, మంచిర్యాల లేదా జనగామ నియోజకవర్గాల్లో ఏదో ఒకదానిలో పోటీ చేసే అంశంపైనే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. శాసనసభకు పోటీ చేయకుండా కనీస ఉమ్మడి కార్యక్రమాల అమలు కమిటీకి చైర్మన్‌గా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తే మంచిదని మిత్రపక్షాల నేతలు అంటున్నారు. ఉద్యమసమయంలో తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా ఉన్న కోదండరాంకు యువత, ఉద్యోగులు, విద్యా ర్థులు, తెలంగాణవాదుల్లో క్రేజ్ ఉందని, సీఎం కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా కోదండరాంను ఉద్యమశక్తులు ఆమోదిస్తాయని, దీనిని ఓట్లుగా మార్చుకునే వ్యూహంతో పనిచేయాలని వాదిస్తున్నారు. -
నేనూ బాధితుడినే...!
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2010లో రూపొందించిన నిబంధనలు అమలవుతున్న దాని కంటే ఉల్లంఘించడమే ఎక్కువగా ఉంది. వీటిని అమలు చేయాల్సిన అధికార యంత్రాంగానికి ఎంత మాత్రం బాధ్యత కనిపించడం లేదు. ప్రజలు మౌనంగా ఈ దారుణమైన శబ్ద కాలుష్యాన్ని భరిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏరియాలో దీనికి నేనూ ఓ బాధితుడినే. ఉదయం 4 గంటల నుంచే మైకుల నుంచి భక్తి పాటలు, అయ్యప్ప భజనలు, మసీదుల నుంచి ఉదయ ప్రార్థనలు మొదలవుతాయి. మా ఏరియాలో పెద్ద సంఖ్యలో మసీదులున్నాయి. ఈ శబ్ద కాలుష్యం హైకోర్టు మాత్రమే తగిన చర్యలు తీసుకోగలదు.అధికారులను, ఉల్లంఘనులను బాధ్యులను చేసి, ప్రశాంతత నెలకొనేలా చూడగలరు. – న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ శబ్ద కాలుష్య బాధను భరించలేని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ సరైన సందర్భం దొరకడంతో తన గోడును హైకోర్టుకే వెళ్లబోసుకున్నారు. ఇదే అంశంపై గుంటూరు, ఎల్ఐసీ కాలనీకి చెందిన వి.వి.సుబ్బారావు అనే వ్యక్తి రాసిన లేఖను పిల్‌గా పరిగణించాలని ఆయన సిఫారసు చేశారు. జస్టిస్ కోదండరామ్ అభిప్రాయంతో న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్ కుమార్ కెయిత్, పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ ఎస్.వి.భట్లు సైతం ఏకీభవించారు. ఇలా ఏదైనా అంశంపై హైకోర్టుకు లేఖలు రాస్తే, ఆ లేఖలను పిల్‌గా పరిగణించాలా?వద్దా? అన్న అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తుల పిల్ కమిటీ తేలుస్తుంది.దీంట్లో జస్టిస్ కెయిత్, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కోదండరామ్, జస్టిస్ భట్, జస్టిస్ సీతారామమూర్తిలున్నారు. శబ్ద కాలుష్య నియంత్రణకు సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిని పాటించడం లేదంటూ వి.వి.సుబ్బారావు ఈ ఏడాది ఆగస్టులో హైకోర్టుకు లేఖ రాశారు. దేవాలయాలు, చర్చిలు, మసీదుల నుంచి లౌడ్ స్పీకర్ల ద్వారా ఒక రోజులో దాదాపు 18 గంటల పాటు భక్తిగీతాలు, ప్రార్థనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు వస్తున్నాయని, ఈ శబ్ద కాలుష్యాన్ని భరించలేకపోతున్నామని ఆ లేఖలో వివరించారు. ఈ కాలుష్యం దెబ్బకు ఇళ్లల్లో ఫోన్లు మాట్లాడలేకపోతున్నామన్నారు. ఇళ్లలో ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకోలేకపోతున్నామని వివరించారు. పిల్లలు చదవలేక, పరీక్షలకు సిద్ధం కాలేకపోతున్నారని తెలిపారు. వృద్ధులు, రోగులు నిద్ర కూడా పోలేకపోతున్నారన్నారు. ఈ లేఖను అందుకున్న హైకోర్టు రిజిస్ట్రీ దీనిని పిల్ కమిటీకి నివేదించింది. ఆవేదనకు అక్షరరూపమిచ్చిన కోదండరామ్... ఈ లేఖను పరిశీలించిన కమిటీలో ఐదుగురు న్యాయమూర్తులు కూడా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇందులో జస్టిస్ సీతారామమూర్తి ఈ లేఖను పిల్‌గా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. శబ్ద కాలుష్యానికి తానూ ఓ బాధితుడినేనంటూ జస్టిస్ కోదండరామ్ తన ఆవేదనకు అక్షరరూపం ఇచ్చారు. తన వేదనను ఆయన అందులో ప్రస్తావించారు. సుబ్బారావు రాసిన లేఖను పిల్‌గా పరిగణించాలని కోరారు.దీంతో మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులు ఏకీభవించారు. హైకోర్టు రిజిస్ట్రీ, పిల్ కమిటీ అభిప్రాయాలను ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచింది. నోటీసులిచ్చిన ధర్మాసనం... వాటిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయం మేరకు సుబ్బారావు లేఖను పిల్‌గా పరిగణించాలని రిజిస్ట్రీకి పాలనాపరమైన ఆదేశాలిచ్చారు. రిజిస్ట్రీ ఆమేరకు చర్యలు తీసుకోవడంతో దీనిపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రతివాదులుగా ఉన్న ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. కౌంటర్లు వేయాలని విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
‘మెదక్’ పై టీజేఎస్ కన్ను
సాక్షి, మెదక్: టీజేఎస్(తెలంగాణ జన సమితి) అధ్యక్షుడు కోదండరాం ఎన్నికల ప్రచార యాత్రను మెదక్ నుంచి ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో మహాకూటమిలో కేటాయించే అసెంబ్లీ స్థానాల్లో మెదక్ టికెట్‌ను ఎలాగైనా దక్కించుకోవాలిని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణపై చర్చలు జరుపుతూనే మరోవైపు సీట్ల సర్ధుబాటుపైనా మహాకూటమి చర్చలు జరుపుతోంది. పొత్తులో భాగంగా 25 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని టీజేఎస్ కోరుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయటం లేదని సమాచారం. మహాకూటమిలో భాగంగా 10 నుంచి 15లోపు అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అంశంపై కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు స్థానాలు కావాలని టీజేఏసీ కోరుతోంది. మూడు స్థానాల్లో ప్రధానంగా మెదక్ అసెంబ్లీ టికెట్ విషయమై కోదండరాం పట్టుదలగా ఉన్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు, ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని టీజేఎస్ భావిస్తోంది. కాంగ్రెస్‌లో మెదక్ టికెట్ కోసం 13 మంది నాయకులు పోటీ పడుతున్నారు. దీనికితోడు వారి మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో మెదక్ ఎమ్మెల్యే టికెట్ కేటాయింపు కాంగ్రెస్ అధిష్టానానికి కత్తిమీద సాములా తయారైంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా మెదక్ స్థానాన్ని తమకు వదిలివేయాలని టీజేఎస్ వత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. కోదండరాం సైతం ఇటీవల నాలుగు పర్యాయాలు మెదక్ నియోజకవర్గంలో పర్యటించారు. మెదక్ నుంచి పార్టీ బరిలో ఉంటుందని, కష్టపడి గెలవాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే సూచించారు. అయితే మెదక్ స్థానాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా కనిపించడం లేదు. దీంతో పొత్తులో టీజేఎస్‌కు టికెట్ దక్కుతుందా? లేదా? అన్న విషయం వేచి చూడాల్సి ఉంది. స్వల్ప మార్పులు ఉండే అవకాశం పొత్తులో మెదక్ టికెట్ టీజెఎస్ వచ్చిన పక్షంలో పోటీ చేసేందుకు పార్టీ జిల్లా అధ్యక్షులు జనార్ధన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారు. దీనికితోడు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం మెదక్ నుంచి ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ నుంచి ప్రచారం ప్రారంభిచటం ద్వారా నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు ఉత్సాహం నింపడంతోపాటు ఎన్నికల్లో పార్టీకి కలివస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా 4వ తేదీన మెదక్ మండలం పాపన్నపేటలోని ఏడుపాయల నుంచి ఎన్నికల ప్రచార యాత్ర చేపట్టాలని కోదండరాం నిర్ణయం తీసుకున్నారు. అయితే రాబోయే రెండు రోజులు ఆయన కూటమి చర్చల్లో పాల్గొంటారని సమాచారం. దీంతో ప్రచార యాత్ర తేదీల్లో స్వల్పమార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. 6 లేదా 7 తేదీల్లో ఈ ప్రచారం ప్రారంభించవచ్చని సమాచారం. ఇదిలా ఉంటే మెదక్ నుంచి పోటీ చేయాలనుకుంటున్న జనార్ధన్‌రెడ్డి నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఇటీవల చిన్నశంకరంపేట మండలంలో రైతు సమస్యలపై సదస్సు నిర్వహించారు. మెదక్‌లో యువజన ర్యాలీ, సభ చేపట్టారు. ఈ కార్యక్రమానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై పార్టీశ్రేణుల్లో ఉత్సాహాంనింపే ప్రయత్నం చేశారు. మెదక్ బరిలో నిలవాలనుకుంటున్న టీజేఎస్ జనార్ధన్‌రెడ్డి పార్టీ నాయకులను ఏకతాటి మీదికి తీసుకురావటంతోపాటు జేఏసీలోని అన్నివర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. -
నియంత పాలనకు చరమగీతం పాడాలి
కరీంనగర్: కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అవినీతి ఏరులై పారుతోందని, అమరవీరుల ఆశయాలకు భిన్నంగా పాలన సాగుతోందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. అవినీతి, నియంత పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో సర్కస్‌గ్రౌండ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన అమరుల ఉద్యమ ఆకాంక్షల ధూంధాం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ సమాజాన్ని దగా చేసిన పాలకులకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలను జాగృతం చేయడమే లక్ష్యంగా ధూంధాం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇది ఆరంభమేనని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ప్రజాస్వామ్య పదాలను ప్రజలకు అందకుండా చేసిందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదని విమర్శించారు. టీఆర్ఎస్ పతనానికి నాంది కావాలి ‘గల్ఫ్ బాధితులు గోసలు పోలె, నీళ్ల కోసం పోరాటాలు, ఆరాటాలు నడుస్తూనే ఉన్నాయి. ఉద్యోగాల ఊసేలేదు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల హామీ బుట్టదాఖలైంది. అమరవీరు ల స్మృతి వనం అందని ద్రాక్షగా మారింది’ అని కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన సర్కస్‌గ్రౌండ్ నుంచే ధూంధాం ప్రారంభమైందని.. టీఆర్ఎస్ పతనానికి నాంది కావాలని పిలుపునిచ్చారు. ధూంధాం కార్యక్ర మానికి ముందు కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ, ఉద్యమ ఎజెండాపైనే ఇప్పటిదాకా కూటమిలోని పార్టీలు చర్చించాయని.. సీట్లపై ఇంకా చర్చ జరగలేదని, కేవలం ఉమ్మడి ఎజెండా మాత్రమే ఖరారైందని వెల్లడించారు. -
కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏమైంది?
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తానన్న థర్డ్ ఫ్రంట్ ఏమైందని రాష్ట్రీయ లోక్‌దళ్ పార్జీ (ఆర్ఎల్డీ) జాతీయ అధ్యక్షుడు అజిత్‌సింగ్ ప్రశ్నించారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ఏర్పాటు చేస్తామని, 2 నెలల పాటు దేశం లోని పలు రాష్ట్రాలు తిరిగి నేతలను కలసి చివరకు దాని ఊసేలేకుండా పోయిందని ఎద్దేశా చేశారు. పార్లమెంటులో మోదీ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించి తర్వాత ఫ్రంట్ ప్రస్తావనే లేకుండా పోయిందని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) నిర్వహించిన ‘పాలమూరు ప్రజాగర్జన’సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ కోసం 1,200 మంది యువత బలిదానం చేసుకున్నారని, ఇక్కడి ప్రజల న్యాయమైన ఆకాంక్ష కోసమే పార్లమెంటులో బిల్లు సందర్భంగా మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు. తెలంగాణ లాంటి ఉద్యమం దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలుకాలేదని, తెలంగాణ బిడ్డలు దోపిడీకి గురయ్యార న్నారు. దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణలో నిధులు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండో దశ పోరాటం కోదండరాం నేతృత్వంలో పాలమూరు నుంచే ప్రారంభం కావాలన్నారు. ‘పాలమూరును దగా చేశారు’ పాలమూరు ప్రాంతాన్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దగా చేశారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. తెలంగాణ ఉద్య మాన్ని ముందుకు తీసుకెళ్లాడని ఇక్కడి ప్రజలు కేసీఆర్‌కు పూర్తి మద్దతిచ్చి ఎంపీగా గెలిపించారని, తర్వాత సీఎంగా అవకాశం కల్పిస్తే వారిని దగా చేశారని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్‌లో మార్పుల వల్ల రూ.5 వేల కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడిందన్నారు. ఇక్కడి ప్రజలకు నీళ్లు రాలేదని, ఉపాధి లేక ముంబైకి వలస వెళ్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం పాజెక్టు నిర్వాసితులకు ఏపీలో ఉద్యోగాలిచ్చారని, జీవో నం.68, 90 ప్రకారం ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిం చారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ప్రశ్నిస్తే నిర్బంధాలు కొనసాగిస్తున్నారని, ధర్నాచౌక్‌లు బంద్ చేశార న్నారు. ఈ ఎన్నికల్లో పాలమూరు ప్రజల పూర్తి మద్దతు టీజేఎస్‌కు ఇవ్వాలని సామాజిక తెలంగా ణ రూపకల్పనకు కృషిచేస్తామని హామీనిచ్చారు. మహబూబ్‌నగర్ టీజేఎస్ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, కపిలవాయి దిలీప్‌కుమార్‌లు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్లతో కలసి ఎన్నికలను హైజాక్ చేసే కుట్ర
హైదరాబాద్: కాంట్రాక్టర్లతో కలసి కొందరు ఎన్నికలను హైజాక్ చేసే కుట్ర చేస్తున్నారని, ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఎవరో పంతులు చెప్పారని 9 నెలల ముందు అసెంబ్లీ రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కాన్స్టిట్యూషనల్ కన్క్లేవ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ సాధన ప్రజా సంఘాల కర్తవ్యం’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. కోదండరాం మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో పైసలతో మాయ చేయాలనే ప్రయత్నాన్ని దెబ్బకొట్టి స్పష్టమైన ఎజేండాతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికోట్లు పోసినా వారి ఆటలు సాగనివ్వవద్దని, ప్రజా సంఘాలే ఆ పని చేయగలుగుతాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నడిపించింది ప్రజా సంఘాలేనని అన్నారు. తెలంగాణ వచ్చాక మంచి పాలన సాగుతుందని అనుకున్నామని, అయితే నియంతృత్వ ప్రభుత్వంతో ఘర్షణ పడాల్సి వచ్చిందన్నారు. నియంతృత్వ అధికారాన్ని తిరుగుబాటు చేసింది ప్రజలు, ప్రజా సంఘాలేనని లేకుంటే ఇంకా నియంతృత్వం కొనసాగేదన్నారు. అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తూ ఉద్యమ ఆకాంక్షను దెబ్బతీసినప్పుడు ఒక పార్టీగా ముందుకు రావాల్సి వచ్చిందని చెప్పారు. పైసలు ఇచ్చేవారు కాదు పనిచేసే వారు రావాలని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో ప్రజాస్వామిక హక్కులు కాలరాయబడ్డాయన్నారు. కాన్స్టిట్యూషనల్ కన్క్లేవ్ హైదరాబాద్ అ«ధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బుద్ధా ప్రియ సిద్ధార్థ్, సామాజిక వేత్త సాంబశివరావు, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. -
కూటమి కోదండం!
సాక్షి, హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా రూపుదిద్దుకుంటున్న కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో తెలంగాణ జనసమితి (టీజేఎస్) ఇముడుతుందా? సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్, టీజేఎస్‌ల మధ్య పడిన పీటముడి విడిపోతుందా? ఇప్పుడు మహాకూటమి వర్గాల్లో ఈ ప్రశ్నలు హాట్‌టాపిక్ అవుతున్నాయి. తమకు 30కి పైగా స్థానాల్లో పోటీ చేసే అవకాశమివ్వాలని ప్రొఫెసర్ కోదండరాం కోరుతుండగా నాలుగైదు స్థానాలకు మించి ఇవ్వలేమని కాంగ్రెస్ అంటుండటంతో ఇరు పార్టీల మధ్య మడతపేచీ పడినట్లయింది. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఉమ్మడి ఎజెండాతో కలసి పనిచేసేందుకు ఇరు పార్టీల మధ్య అవగాహన ఉన్నా సీట్ల సర్దుబాటే సమస్యగా మారుతుండటం కూటమి రాజకీయాలను వేడెక్కిస్తోంది. శనివారం రాత్రి సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ వ్యవహారంపై తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. టీజేఎస్ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు అవకాశం లేదని కోర్ కమిటీలో కాంగ్రెస్ ముఖ్యులు తేల్చేసిన నేపథ్యంలో కూటమిలో టీజేఎస్ సర్దుబాటు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. టీడీపీ, సీపీఐ ఓకే... కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ, సీపీఐలతో పెద్దగా ఇబ్బందులు లేవని తెలుస్తోంది. 25 స్థానాలు కావాలని టీడీపీ, 12 సీట్లు కావాలని సీపీఐ కోరుతున్నా ఆ రెండు పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కాంగ్రెస్ నేతలు సఫలీకృతులయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీడీపీకి 10–14 స్థానాలు, సీపీఐకి 3 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ వర్గాలు కూడా సిద్ధమయ్యాయి. అయితే టీడీపీ, సీపీఐలకు ఎక్కడెక్కడ సీట్లు కేటాయించాలన్న దానిపై కొంత సమస్య ఉన్నా సీట్ల సంఖ్య తేలినందున అది కూడా సమసిపోతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలోనూ ఇదే అంశంపై చర్చ జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోపాటు కోర్ కమిటీ సభ్యులు జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, మధు యాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ, సీపీఐలతో సమస్య లేనప్పటికీ టీజేఎస్ అడుగుతున్నన్ని స్థానాలు సర్దుబాటు చేయలేమనే అంచనాకు కాంగ్రెస్ ముఖ్య నేతలు వచ్చినట్లు తెలిసింది. టీజేఎస్ అధినేత కోదండరాం 33 స్థానాలు అడుగుతున్నారని, ఇరు వర్గాల మధ్య సయోధ్య రావాలన్నా కనీసం 20 స్థానాల వరకు టీజేఎస్‌కు ఇవ్వాల్సి ఉంటుందని, అలా సర్దుబాటు చేసుకోవడం సాధ్యం కాదనే అంచనాకు నేతలు వచ్చారు. నాలుగైదు స్థానాలు ఇవ్వడానికి అభ్యంతరం ఉండకపోవచ్చని, కానీ ఈ ప్రతిపాదనకు టీజేఎస్ అంగీకరిస్తుందా అన్నది అనుమామేననే అభిప్రాయం కూడా భేటీలో వ్యక్తమైంది. దీనిపై టీజేఎస్ ముఖ్యులతో మరోసారి మాట్లాడంతోపాటు పార్టీ క్షేత్రస్థాయి నాయకులతోనూ చర్చించి సోమవారం తుది నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయానికి కాంగ్రెస్ కోర్ కమిటీ వచ్చినట్లు సమాచారం. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 8–10 స్థానాలు టీజేఎస్‌కు ఇచ్చేందుకు ముందుకొచ్చినా కోదండరాం అందుకు సమ్మతిస్తారా లేదా అన్నది కూడా ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ఆ ప్రతిపాదన కూడా... సీట్ల సర్దుబాటు మడత పేచీ అలా ఉంటే కాంగ్రెస్, టీజేఎస్‌ల మధ్య మరో ప్రతిపాదన విషయంలోనూ ఏకాభిప్రాయం కుదిరే అవకాశం కనిపించడం లేదు. కూటమి అధికారంలోకి వస్తే ఉద్యమ ఆకాంక్షలు, అమరుల ఎజెండాతో రూపొందించే కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) అమలు కమిటీ చైర్మన్‌గా కోదండరాంను నియమించాలని టీజేఎస్ ప్రతిపాదిస్తోంది. ఈ కమిటీ ప్రభుత్వ పనితీరును సమీక్షించే రీతిలో పనిచేయాలనే ప్రతిపాదనల నేపథ్యంలో కూటమిలో పెద్ద పార్టీగా ఉంటూ మరో పార్టీకి ఆ బాధ్యతలు అప్పగించడం సరైనది కాదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సమస్యలను అధిగమించి కాంగ్రెస్, టీజేఎస్‌లు ఏకతాటిపైకి వస్తాయా లేక టీడీపీ, సీపీఐలే కాంగ్రెస్‌తో కలసి వెళ్తాయా అన్నది రెండు, మూడు రోజుల్లో అధికారికంగా తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోదండ కోసం బీజేపీ యత్నం ఎట్టిపరిస్థితుల్లోనూ టీజేఎస్‌ను తమ వైపు తిప్పుకోవాలని భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. కోదండరాంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలనే ఆలోచనతో ఉన్న బీజేపీ నేతలు తమతో కలసి రావాలని టీజేఎస్‌ను ఇప్పటికే కోరారు. అయితే బీజేపీతో జట్టు కట్టేందుకు ప్రొఫెసర్ ఇష్టపడటం లేదని, రాజకీయంగా ఆ మైత్రి మంచిది కాదనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌తో కలిసే ప్రక్రియలో కూడా తమ గౌరవానికి ఎక్కడా భంగం వాటిల్ల కూడదనే ప్రాథమిక సూత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటామని, అవసరమైతే స్వతంత్రంగా ఎన్నికల బరిలో దిగేందుకు కూడా సిద్ధమవుతున్నామని టీజేఎస్ నేతలు చెబుతుండటం గమనార్హం. -
‘ఆ హామీలు నెరవేరాలంటే దక్షిణాది బడ్జెట్ సరిపోదు’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ హామీలు నెరవేరాలంటే దక్షిణ భారత దేశ రాష్ట్రాల బడ్జెట్లు సరిపోవని అపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుంచి ఆర్యవైశ్య సంఘం నేతలు తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్యవైశ్య సంఘం నేతలకు కండువా కప్పి మంత్రి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..టీడీపీ కాంగ్రెస్ తోక పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. 2014నుంచి కోదండరామ్ కాంగ్రెస్ వాదిగా మారాడన్నారు. తెలంగాణ ప్రజల చావులకు కారణమైన పార్టీలతో కోదండరామ్ పొత్తుపెట్టుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే ఢిల్లీకి పోతుందని కేటీఆర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కచ్చితంగా 100 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
కేసీఆర్ ఇంట్లోనూ సోదా చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇంట్లోనూ కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేయాలని తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు ఎం.కోదండరాం డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో నేతలు కె.దిలీప్‌కుమార్ తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దర్యాప్తు సంస్థలు, పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చాలా మందిపై ఆదాయపు పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ దాడులు చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను అమలు చేయగలిగిన చిత్తశుద్ధి, సత్తా టీజేఎస్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అమరుల ఆకాంక్షలతో ముసాయిదా తయారు చేశామని, అమలుతీరుపై చర్చిస్తామన్నారు. అమరుల ఆశయాలు, తెలంగాణవాదుల ఆకాంక్షలు నెరవేరే విధంగా మేని ఫెస్టో తయారు చేస్తామని చెప్పా రు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం టీజేఎస్ బహిరంగసభ నిర్వహిస్తున్నామని, ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీమంత్రి అజిత్‌సింగ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని వెల్లడించారు. ఉద్య మఆకాంక్షల సాధన ధూంధాంను సోమవారం కరీంనగర్లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పొత్తుల ప్రక్రియ కొనసాగుతోంది... మహాకూటమి పొత్తుల ప్రక్రియ కొనసాగుతోందని కోదండరాం వెల్లడించారు. మొదటిదశలో మేనిఫెస్టో, కనీస ఉమ్మడి కార్యక్రమం, రెండోదశలో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతాయన్నారు. మరోకూటమి ఏర్పాటుపై చర్చ లు జరగలేదన్నారు. ప్రజాసంఘాల కోరిక మేరకు, చాలాముందుగానే ఎన్నికలు వచ్చినం దుకే పొత్తుల ప్రక్రియ చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు. బీజేపీతో పొత్తు అని, సీట్ల పంప కంలో విబేధాలని ప్రచారం చేయడం వెనుక టీఆర్ఎస్ కుట్ర, సీఎం కార్యాలయం ఉన్నదనే అనుమానం కలుగుతోందన్నారు. -
కోదండరామ్‌తో చర్చలు నిజమే
సాక్షి, హైదరాబాద్: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌ను కలసిన మాట వాస్తవమేనని, చర్చలు కొనసాగుతున్నాయని బీజేపీ నేత కిషన్‌రెడ్డి చెప్పారు. చర్చ ల్లో ఏమైనా పురోగతి ఉంటే మీడియాకు చెబుతామని స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ తరఫున సీఎం అభ్యర్థి ఎవరనేది కేంద్ర అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారు. రేవంత్‌రెడ్డిపై ఐటీ దాడులు చేయించాల్సిన అవసరం కేంద్రానికి లేదన్నారు. ఆయనపై దాడులు చేస్తే బీజేపీకి వచ్చేదేమీ లేదన్నారు. ఈ దాడుల విషయంలో బీజేపీపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి చేసే ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. ఇటీవల ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయని, ఇదీ బీజేపీనే చేయించిందా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు క్విడ్‌ప్రోకోలా ఉందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో ఒవైసీ ఆస్పత్రికి 500 గజాల స్థలం ఇస్తున్నట్లు గతంలో టీఆర్ఎస్ ప్రకటించిందన్నారు. ఆ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసిందని, కోర్టు నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. -
టీఆర్ఎస్లో కొనసాగుతున్న చేరికలు
-
చేతకాక మధ్యలోనే అధికారాన్ని వదిలేశారు
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లు పాలించాలని ప్రజలు అధికారమిస్తే, ప్రజాసమస్యలను పరిష్కరించడం చేతకాక కె.చంద్రశేఖర్‌రావు మధ్యలోనే దిగిపోయారని తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్‌తో కలసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ పెద్ద అవివేకి అని విమర్శించారు. ఇంత చెత్త ఆలోచనను కేసీఆర్ ఎందుకు చేశారోనని కోదండరాం అన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజల గోడు వినేవారు కరువయ్యారన్నారు. ప్రత్యేక రాష్ట్రం వల్ల బాగుపడింది కేవ లం కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు. పైసలిచ్చేవాడుకాదు, పనిచేసేవాడు కావాలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. అప్పట్లో తెలంగాణవాదు లు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు టీఆర్ఎస్ అంటే తమపార్టీ అనుకునేవారని, ఇప్పుడేమో కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల పార్టీ అని భావిస్తు న్నారని చెప్పారు. కేసీఆర్ తన ఒక్కరికే సొంతరాష్ట్రం వచ్చిం దని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగానే పొత్తులు తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని ప్రజలు కలలు కన్నారని, అవి కల్లలు అయ్యాయని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబపాలన చేసి తెలంగాణను ఆగమాగం చేశారన్నారు. కేసీఆర్ కుటుంబం సంతోషంగా ఉంటే బం గారు తెలంగాణ తయారైనట్టేనా.. అని ప్రశ్నించారు. విశ్వనగరం చేస్తామన్న హైదరాబాద్‌ను విధ్వంసం చేశారని ఆరోపించారు. ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనన్న కేసీఆర్, ఇప్పటిదాకా ఎన్ని ఊళ్లకు నీళ్లు ఇచ్చారో, ఎన్ని ఇళ్లకు నీళ్లు వస్తున్నాయో చూపిస్తారా అని సవాల్ చేశారు. యావత్తు తెలంగాణ సమాజం కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు.టీజేఎస్ లక్ష్యాలు దెబ్బతినేవిధంగా పొత్తులుండవని, ఉద్యమ ఆకాంక్షల సాధనే ఎజెండాగా పొత్తుల వైపు అడుగులు వేస్తామని చెప్పారు. టీజేఎస్‌లో చేరిన అడ్వకేట్ రచనారెడ్డి ప్రభుత్వం తీసుకున్న పలు చట్టవిరుద్ధమైన నిర్ణయాలపై కోర్టుల్లో పోరాడిన అడ్వకేట్ రచనారెడ్డి శుక్రవా రం టీజేఎస్‌లో చేరారు. ‘పార్టీలో చేరిన. ఇక నుంచి కథ వేరేవిధంగా ఉంటుంద’ని టీఆర్ఎస్ను హెచ్చరించారు. అనంతరం రచనారెడ్డి, ప్రొ.విశ్వేశ్వర్రావు, బకృద్దీన్‌లను టీజేఎస్ ఉపాధ్యక్షులుగా నియ మిస్తున్నట్టుగా కోదండరాం ప్రకటించారు. -
కేసీఆర్ నీడలోనే కోదండరాం ఎదిగారు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఏకం చేసిన సీఎం కేసీఆర్.. కోదండరాంను దగ్గరకు తీశారని, కేసీఆర్ నీడలోనే కోదండరాంకు బలం వచ్చిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అయితే దీనిని గుర్తించకుండా తనకే సొంత బలం ఉందని కోదండరాం అనుకోవడం శోచనీయమని అన్నారు. నిజంగా ఆయనకే అంత బలం ఉంటే కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు. అదీ ఒకటి, రెండు సీట్ల కోసం గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. సత్తా ఉంటే ఒంటరిగానే పోటీ చేయాలన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే.. దానిని అడ్డుకునేందుకు కోదండరాం కూడా ప్రయత్నం చేశారని ఆరోపించారు. రైతులకు మేలు జరిగే పనిని అడ్డుకున్న కోదండరాంకు వారి ఉసురు తగులుతుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హరీశ్‌రావు సిద్దిపేట జిల్లా, సిద్దిపేట రూరల్ మండలం గుర్రాలగొంది, చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాలకు హాజరై మాట్లాడారు. దీవిస్తున్నాం.. లక్ష మెజారిటీతో గెలిచి రండి.. ‘మీరు మా గ్రామానికి అన్నీ చేశారు.. మా కుటుంబ సభ్యునిలా ఉండి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నారు. ఎన్నికల ప్రచారం మా గ్రామం నుంచి ప్రారంభించినందుకు మా గ్రామస్తులం దీవిస్తున్నాం. మీకే ఓటు వేస్తామని తీర్మానం చేస్తున్నాం. మా గ్రామంలోని మహిళా సంఘాలు, కుల సం ఘాలు.. అందరం రూపాయి, రూపాయి పోగుచేసిన డబ్బులు రూ.30,218 ఇస్తున్నాం. ఈ డబ్బులతోనే నామినేషన్ వేయండి. లక్ష మెజారిటీతో గెలిచి రండి’ అంటూ గుర్రాలగొంది గ్రామస్తులు మంత్రి హరీశ్‌కు తాము విరాళంగా సేకరించిన డబ్బులను అందజేశారు. దీనికి స్పందించిన మంత్రి ‘నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా మీ రుణం తీర్చుకోలేను’ అం టూ ఉద్వేగంగా అన్నారు. తనపై నమ్మకంతో ఆరోసారి కూడా సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు.. తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటు వెయ్యరని హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల్లో బలం లేదని గ్రహించిన కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీలతో పొత్తుకు పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. 2009 లో ప్రకటించిన విధంగా తెలంగాణను ఇచ్చి ఉంటే వందలాది మంది విద్యార్థులు చనిపోయేవారు కాద న్నారు. వందలాది మంది తెలంగాణ బిడ్డల చావుకు బాధ్యత కాంగ్రెస్‌దే అని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేసీ, సీపీఐ.. ఇలా ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లుగా కనిపించని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. అసత్యపు, ఆచరణకు సాధ్యం కాని హామీలిస్తూ కాం గ్రెస్ ప్రజల వద్దకు వస్తోందని, ఎన్ని ఎత్తులు వేసినా కనీసం ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్‌కు దక్కదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పడం శోచనీయమని అన్నారు. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, అటువంటి కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపెట్టుకోవడాన్ని చూసిన ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ పొత్తుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ.. తెలంగాణకు బీజేపీ కూడా అన్యాయం చేసిందని మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధికి నిధులు కావాలని కోరినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అదే మన పక్కన ఉన్న మహారాష్ట్రకు నిధులు వరదలా మంజూరు చేసిందన్నారు. నాలుగేళ్లుగా హైకోర్టు విభజన గురించి పట్టించుకోలేదన్నారు. ఇటువంటి బీజేపీకి కూడా తెలంగాణలో స్థానం ఉండదన్నారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణశర్మ, మాణిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వరవరరావుపై కేసు ఉపసంహరించుకోవాలి
హైదరాబాద్: విరసం నేత వరవరరావుపై కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. గృహ నిర్బంధంలో ఉన్న వరవరరావు(వీవీ)ని కలవడానికి బుధవారం కోదండరాం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. దీంతో కోదండరాం వీవీ సతీమణి హేమలతతో మాట్లాడారు. వీవీ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. రచయితగా, టీచర్‌గా వీవీతో తనకు అనుబంధం ఉందన్నారు. ఆయన ఆరోగ్యం బాగాలేదని తెలిసిందని, అందుకే ఆయనను పరామర్శించేందుకు వచ్చానని చెప్పారు. జైలులో ఉన్న వారిని కలవనిస్తారని, గృహనిర్బంధంలో ఉన్న వారిని కలిసే అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వీవీ నివసించే అపార్ట్మెంట్లో ఉండే తోటివారికి ఇబ్బందులు కలగకుండా పోలీసులు సహకరించాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య, సీనియర్ జర్నలిస్ట్ సజయ, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు నలమాస కృష్ణ తదితరులు కోదండరాంను కలవడానికి వచ్చారు. వీవీ ఇంటి వద్ద భారీ బందోబస్తు.. వరవరరావు నివాసం ఉండే హిమసాయి గార్డెన్స్ అపార్ట్మెంట్ ప్రధాన గేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ భీంరెడ్డి, ఎస్ఐలు సహా దాదాపు 50 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హేమలత కోదండరాంతో మాట్లాడుతూ.. అపార్ట్మెంట్లో నివసించే తోటివారికి ఇబ్బంది కలుగుతోందని ఇంత పోలీస్ఫోర్స్ ఎందుకని అడిగితే వారి నుంచి సమాధానం రావడం లేదని చెప్పారు. తమ పిల్లలకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని పోలీసులు సోదాలు చేయడం ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నించారు. -
రాజకీయ ప్రచార అస్త్రాలుగా సర్వేలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో సర్వేలు రాజకీయ ప్రచార అస్త్రాలుగా మారాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ సర్వే అనేది స్టిల్ పిక్చర్ (ఫొటో) వంటిదన్నారు. సర్వే చేసినప్పటి పరిస్థితిని, సర్వే చేసినవారి అవసరాలు, సామర్థ్యం, పరిమితులకు లోబడి ఫలితం ఉంటుందన్నారు. గతంలో పంచాంగాలు, ముహూర్తాలు, గ్రహచారం అంటూ ఓటర్లను ప్రభావితం చేసుకోవడానికి రాజకీయ పార్టీల నేతలు యత్నించేవారని గుర్తుచేశారు. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో సర్వేలతో ప్రజలను, ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సర్వేలకోసం విపరీతంగా డబ్బులు కురిపించి, తమకు అనుకూలంగా చెప్పిం చుకుంటున్నారని అన్నారు. సర్వేలను టీఆర్ఎస్ రాజకీయ అస్త్రంగా మార్చుకుంటున్నదని ఆరోపించా రు. ఇలాంటి సర్వేలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రం నిర్బంధంలో ఉందన్నారు. ఇప్పుడు అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఓట్లకోసం ప్రచారానికి వెళ్తే‡ ఐదేళ్లలో ఏం చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత బాగా ఉందన్నారు. పొత్తులపై చర్చలు, సంప్రదింపులు పొత్తుల విషయంలో అనేక చర్చలు, సంప్రదింపులు ఉంటాయని కోదండ రాం అన్నారు. టీఆర్ఎస్ను ఓడించాలని, ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పా టు లక్ష్యంగా పొత్తుల్లో ఉమ్మడి ఎజెండా, అభ్యర్థుల గెలుపు, సమష్టి ప్రయోజనాలు వంటి అనేక అంశాలు ఉంటాయన్నారు. ఇలా లేకపోతే కలయికకు అర్థం ఉండదన్నారు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ఉంటుందన్నారు. మిర్యాలగూడలో ప్రణయ్ హత్య దారుణమన్నారు. దానిలో అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతోందన్నారు. ప్రణయ్ హత్యకేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. హత్యకు కారకులను, సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రతి పక్ష నేతలను చిన్న కేసుకు కూడా అరెస్ట్ చేస్తున్నారని కోదండరాం విమర్శించారు. అధికారపార్టీ నేతలపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. మం త్రుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని, ఇంకా ప్రతి పక్షనేతల ఫోన్లు కాకుండా ఉంటాయా అని ప్రశ్నించారు. కలిసొచ్చే అన్ని పార్టీలతో నడవాలని చూస్తున్నామన్నారు. మహాకూటమిలో చేరడానికి సిద్ధంగా ఉన్నవారిలో ఏకాభిప్రాయం, ఒక నిర్ణయం వచ్చిన తర్వాత పొత్తులకు దూరంగా ఉన్న సీపీఎం వంటి పార్టీతోనూ చర్చలు జరుగుతాయని చెప్పారు. -
కుటుంబ పాలనకు చరమగీతం పాడుదాం
హవేళిఘణాపూర్(మెదక్): రాష్ట్రంలో కొనసాగుతున్న కుటుంబ పాలనకు చరమ గీతం పాడుదామని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మండల కేంద్రంలోని హవేళిఘణాపూర్‌లో సోమవారం ఆయన తెలంగాణ జన సమితి జెండాను ఆవిష్కరించారు. అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమన్నారు. అమరవీరుల ప్రాణత్యాగాలపై ఏర్పడిన తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోందన్నారు. నిజాంను తలదన్నే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఎదిరించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన సూచించారు. అనంతరం భారీ బైక్ ర్యాలీతో మెదక్ పట్టణానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జన సమితి నాయకులు శ్రీకాంత్, రాజశేఖర్ రెడ్డి, దయాసాగర్ తదితరులున్నారు. కుల వివక్ష బాధాకరం రామాయంపేట(మెదక్): రాష్ట్రంలో కులం పేరుతో వివక్ష కొనసాగుతుండటం బాధాకరమని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం రామాయంపేట వచ్చిన సందర్భంగా జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామిక విలువలు విస్తృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడు ఇతర కులం యువతిని పెళ్లి చేసుకున్నాడనే కక్షతో పాశవికంగా హతమార్చాడం అనాగరికమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి వివక్షను విడనాడాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒక బాలుడు అందజేసిన నాగలిని ఆయన అందుకుని ఆ బాలుడిని అభినందించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, బాల్‌రాజ్‌గౌడ్, మండలశాఖ అధ్యక్షుడు పోచమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు టీజేఎస్ నివాళి చిన్నశంకరంపేట(మెదక్): అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రమని టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కోల్కూరి జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనతో ప్రజలకు తీరని నష్టం జరుగుతోందన్నారు. టీఆర్ఎస్ను పారదోలే సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తెలంగాణ జన సమితి వెంట నిలవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీని టీజేఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి కనకయ్య జెండా ఊపి ప్రారంభించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ గవ్వలపల్లి చౌరస్తా, మడూర్, శాలిపేట, ఖాజాపూర్, సంకాపూర్, జప్తిశివనూర్ల మీదుగా రామాయంపేటకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు సత్యనారాయణరెడ్డి, సిద్దిరాములు, శ్రీనివాస్, రాజిరెడ్డి, ఎడ్ల కిష్టయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేసేదాకా ప్రజలు పోరాడాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ, సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన అంతమై భారత్‌లో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన రోజని చెప్పారు. ఆనాడు మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమం జరిగిందన్నారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న నేటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక, రాజ్యాంగబద్ధమైన పాలన కోసం చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్నారు. పోరాటాల తెలంగాణలో కుటుంబం పాలన సాగుతోందన్నారు. ఈ కుటుంబ నియంతృత్వ, ఫ్యూడల్ పాలన ముగింపు కోసం అందరూ ఒక్కటై ఉద్యమించాల్సిన అవసరముందని చెప్పారు. రాజకీయాల్లో మార్పు కోసమే ప్రయత్నిస్తున్నామన్నారు. తెలం గాణ జనసమితికి ఉద్యమ ఆకాంక్షలు ప్రధానమని తెలిపారు. అట్టడుగు వర్గాల వారందరికీ అభివృద్ధి ఫలాలు అందే దాకా పోరాటం సాగుతుందని కోదండరాం అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి శ్రీనివాస్, వెంకటరెడ్డి, యోగీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మహాకూటమికి కామన్ మినిమం ప్రోగ్రాం
సాక్షి, హైదరాబాద్: మహా కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేసేందుకు కామన్ మినిమం ప్రోగ్రాం(సీఎంపీ)ని రూపొందించుకోవాలని, దీనికి మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ అంగీకరించాలని టీజేఎస్ షరతు విధించింది. మహాకూటమి ప్రభుత్వం ఏర్పడితే సీఎంపీని అసెంబ్లీలో ప్రత్యేక కౌన్సిల్‌గా మార్చి చట్టబద్ధత కల్పించి దానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను చైర్మన్‌గా చేయా లని టీజేఎస్ కోరింది. మహాకూటమిలో చేరితే అమలుచేయాల్సిన అంశాలపై కోదండరాం అధ్యక్షతన సమావేశమై నిర్ణయించిన షరతులను శుక్రవారం ఆ పార్టీ మీడియాకు విడుదల చేసింది. ప్రభుత్వ పాలన తెలంగాణ అవసరాల కోసమే సాగాలని, ఉద్యమ ఆకాంక్షలకు పెద్దపీట వేయాలని కోరారు. ఆంధ్రా పెట్టుబడిదారులకు తెలంగాణలో మళ్లీ స్థానం కల్పించొద్దని నిర్ణయించారు. ఎన్నికల్లో ఓట్లు, సీట్ల కంటే ఉద్యమ ఆకాంక్షల సాధనే టీజేఎస్‌కు ముఖ్యమ న్నారు. తెలంగాణలో నియంతృత్వ పాలకుడు కేసీఆర్‌ను గద్దెదించడానికి అంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాడాలన్నారు. సీఎంపీ కోసం కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు సిద్ధమన్నారు. -
పోదుపుపై ఉన్న శ్రద్ధ ప్రయాణికుల భద్రతపై లేదు
-
అధికారమత్తులో అమరులను యాది మరిచారా?
సాక్షి, హైదరాబాద్: త్యాగాల పునాదుల మీద సాధించుకున్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. అధికారం మత్తులో అమరులను యాది మరిచారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబాలను అధికారం వచ్చాక కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఒక్కసారైనా కలవలేదని దుయ్యబట్టారు. ఇలాంటి కేసీఆర్‌కు ఇప్పుడే కాదు, ఈ జన్మలో మళ్లీ అధికారం రాదన్నారు. తెలంగాణ అమరవీరులకు స్తూపం నిర్మించాలంటూ టీజేఎస్ కార్యాలయంలో బుధవారం అమరుల స్మృతి దీక్ష నిర్వహించారు. దీక్ష ముగింపు సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే ఉద్యోగాలు, బీడు భూములకు నీళ్లు వస్తాయని, సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఎంతో మంది యువకులు, విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారని చెప్పా రు. కానీ కేసీఆర్‌కు అధికారం, కాంట్రాక్టర్లు, కమీషన్లు ఇచ్చేవాళ్లు, ఉద్యమకారులపై తెగబడి దాడులు చేసిన వాళ్లే దగ్గరి వాళ్లయ్యారని ఆరోపించారు. ధర్నా చౌక్ ఎత్తేశారని, పోలీసుల రాజ్యంగా తెలంగాణను చేశారని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా, మానవహక్కులను హరించేలా నియంతలాగా రాష్ట్రాన్ని కేసీఆర్ పాలిస్తున్నారని విమర్శించారు. పదవుల్లో తెలంగాణ ద్రోహులు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, తెలంగాణ ద్రోహులను పదవుల్లో కూర్చోబెడుతున్నారని కేసీఆర్‌పై కోదం డరాం నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అశాంతి, టీఆర్ఎస్పై అసంతృప్తి, ఆగ్రహం పెరుగుతోందన్న భయంతో కేసీఆర్ ముందే దిగిపోయారన్నారు. ప్రజలకు దూరంగా గడీల్లో ఉంటూ, పోలీసు రాజ్యంగా మారిన పాలన కూలాలన్నారు. గడీల పాలనను కూల్చడానికి ఎవరితోనైనా కలసి పనిచేస్తామని స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో ఎవరూ తమను పట్టించుకోవడం లేదని అమరుల కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారు. ద్రోహులు మంత్రులయ్యారు: చాడ బుధవారం తెలంగాణ అమరుల స్మృతి దీక్ష ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరుల స్మారక స్తూపం వద్ద టీజేఎస్, టీడీపీ, సీపీఐ పార్టీల నేతలు నివాళులర్పించారు. రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులు మంత్రుల య్యారని, తెలంగాణ ఉద్యమ కారులు ద్రోహులయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఫిరాయింపులతో రాజకీయాలను టీఆర్ ఎస్ కలుషితం చేస్తోందని విమర్శించారు. సామాజిక తెలంగాణ సాధన కోసం కృషి చేద్దామని టీజేఎస్ నేత దిలీప్‌కుమార్ అన్నారు. -
‘కోదండరాం పార్టీలో టిక్కెట్లు అమ్ముతున్నారు’
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జనసమితి (టీజేఎస్)పై ఆ పార్టీ మహిళా నేత జోత్స్న సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో టిక్కెట్లు అమ్ముతున్నారని, పార్టీలోని సీనియర్ నేత కపిల్వాయి దిలీప్ కుమార్ ఈ వ్యవహారం నడుపుతున్నారని ఆరోపించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. టీజేఎస్ బిజినెస్ సెంటర్‌గా మారిపోయిందని, ఇది కోదండరాంకు తెలుసో.. తెలియదో అన్నారు. పార్టీలో వసూల్ రాజాలు ఎక్కువ మందే ఉన్నారని, దిలీప్ కుమార్ మాత్రం డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. చులకన భావంతో తనపై దాడిచేస్తున్నారని, సత్యం అనే వ్యక్తిని తనపై దాడికి దింపుతున్నారని బాధపడ్డారు. విశాల్ అనే వ్యక్తి తనకు, తన భర్తకు ఫోన్ చేసి చంపుతామని బెదిరిస్తున్నారని చెప్పారు.(చదవండి: టీఆర్ఎస్ కారులో ‘పొగలు’) ఏదైనా అడిగితే ఏమిస్తారని, కారు, బంగ్లా ఇస్తారా? అని ఎదరు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అంబర్పేట్ టికెట్ ఇవ్వనందుకు పార్టీకి రాజీనామా చేస్తున్నానని తనపై అసత్య ప్రచారం చేస్తూ పేపర్లలో రాయించారన్నారు. దిలీప్‌కుమార్‌కు పార్టీలో ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం కావడం లేదని, ఆడవాళ్లను మాత్రం అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోదండరాం లక్ష్యాల దిశగా పార్టీ నడవట్లేదని, మనీ మిషన్‌గా నడుస్తుందన్నారు. దిలీప్ కుమార్‌కు తన రూ.2 లక్షలు ఇచ్చానని, అడిగితే పార్టీ ఫండ్ కింద తీసుకున్నామని దబాయిస్తున్నారని తెలిపారు. చదవండి: ముందస్తు ఎన్నికల ముచ్చట్లు -
కత్తి వదిలేసినోడు యుద్ధం ఎలా చేస్తాడు?
మెదక్ జోన్: కత్తి వదిలేసినోడికి యుద్ధం ఎలా చేతనవుతుందని, మళ్లీ ఓట్లు ఎలా అడుగుతాడని ఆపద్ధర్మ ముఖ్యంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. జనసమితి ఆధ్వర్యంలో ఆదివారం మెదక్ పట్టణంఓని టీఎన్జీఓ భవన్లో జనసమితి జిల్లా చైర్మన్ చడిమెల యాదగిరి అధ్యక్షతన రచ్చబండ రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రూ. 1.39 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అందులో 70శాతం నిధులను దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అడ్డు తగులుతుందని లేనిపోని బురద చల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. భూనిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినందుకు మాయలమరాఠి కేసీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. అనంతరం టీజేఎస్ జిల్లా చైర్మన్ చడిమెల యాదగిరి మాట్లాడుతూ నియంత ్చ్ఛ వ్యవహారించిన టీఆర్ఎస్ పార్టీని ఇంటికీ పంపేందుకు అన్ని శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులు, నిరుద్యోగులు, కార్మికులను, ఉద్యోగులు, విద్యార్థులతో పాటు కులసంఘాలను సైతం మోసం చేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్యం బతికించేందుకు నోట్లు ముఖ్యం కాదని గ్రామగ్రామాన ప్రజలను చైతన్యం చేసి టీఆర్ఎస్ను ఓడిచేందుకు అందరం ఏకం కావాలన్నారు. అనంతరం టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కొలుకురి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ... మెదక్ నియోజకవర్గంపై పూర్తి వివక్ష కొనసాగిందన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి ఆస్తులు పెంచుకునే పనిలో ఎమ్మెల్యే, అమె భర్త అక్రమ సంపాదనకే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. 22 కిలోమీటర్ల మెదక్ – చేగుంట, 2 కిలోమీటర్ల మెదక్ రోడ్డును నాలుగు సంవత్సరాలుగా నిర్మాణాలు చేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లను డబ్బుల కోసం వేధించడంతో వారు పనులు వదిలి వెళ్లిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం 10 మందికి కూడా ఉపాధి చూపించని పద్మాదేవేందర్ రెడ్డికి ఓట్లు ఎందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. సిద్దిపేట, సంగారెడ్డితో పొల్చుకుంటే ఒక్కశాతం కూడా మెదక్ అభివృద్ధి చెందలేదన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులతో పాటు కులసంఘాలు, విద్యాసంఘాలు, విద్యార్థిసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు వివిధ పార్టీలకు చెందిన సుప్రబాతరావు, మామిండ్ల ఆంజనేయులు, బాల్‌రాజ్, కాముని రమేష్, దయాసాగర్, శ్రీకాంత్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేడీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి శివ్వంపేట(నర్సాపూర్): రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని డీసీసీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధి నవాబుపేట గ్రామంలో జెండావిష్కరణ చేశారు. గ్రామానికి చెందిన టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమే మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు కాంగ్రెస్‌పార్టీ ప్రత్యేక తెలంగాణను ఇవ్వడం జరిగిందని దాన్ని ఆసరాగా తీసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్ని రంగాల్లో ప్రజలను మోసం చేసిందన్నారు. నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగాలు కల్పించకుండా ఇచ్చిన వాగ్ధానాలన్నింటిని తుంగలో తొక్కిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దళితులకు మూడెకరాలభూమి, డబుల్బెడ్రూమ్ ఇండ్ల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయిందన్నారు. అధికార దాహంతో సీఎం కేసీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయనను గద్దె దింపే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు సైనికుడి వలే పార్టీ విజయానికి కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు యాదాగౌడ్, నాయకులు పాల్గొన్నారు. -
పొత్తులు.. ఎత్తులు!
సాక్షి, హైదరాబాద్: ‘‘మేం ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదు. మా పార్టీ తరఫునే 119 స్థానాల్లో పోటీ చేస్తాం’’అని చెబుతూ వస్తున్న బీజేపీ, టీజేఎస్ లోలోపల మాత్రం పొత్తులపై కసరత్తు వేగవంతం చేశాయి. అమిత్ షా డైరెక్షన్లో రాష్ట్రంలో బీజేపీకి ఉన్న స్థానాలను పదిలపరుచుకోవడంతోపాటు మరిన్ని స్థానాలను దక్కించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమిత్ షాతో జరిగిన భేటీలోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ మినహా కలిసివచ్చే పార్టీలతోనూ మాట్లాడాలని సూచించిన నేపథ్యంలో టీజేఎస్‌తో చర్చలు జరిపినట్లు తెలిసింది. టీజేఎస్‌కు చెందిన ఓ ముఖ్య నాయకుని ఇంట్లో ఇటీవల టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సమావేశమై చర్చించినట్లు తెలిసింది. అయితే బయటకు తాము భేటీ కాలేదని చెబుతున్నా.. కోదండరాంతో కిషన్‌రెడ్డి సమావేశమై పొత్తుల అంశంపై మాట్లాడినట్లు తెలిసింది. కానీ రెండు పార్టీలు బయటకు మాత్రం తాము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతున్నాయి. మరోవైపు పొత్తు కోసం టీజేఎస్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పరస్పరం చర్చలు జరుపుతుండగా టీడీపీ నేతలు టీజేఎస్‌తో పొత్తు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. -
కత్తి వదిలేసినోడు యుద్ధం ఎలా చేస్తాడు?
మెదక్ జోన్: అసమర్థుడు కావడం వల్లే అర్ధంతరంగా పాలన ముగించారని, కత్తి వదిలేసినోడికి యుద్ధం ఎలా చేతనవుతుందని, మళ్లీ ఓట్లు ఎలా అడుగుతారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ జనసమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఆదివారం మెదక్ పట్టణంలోని టీఎన్జీవో భవన్లో జనసమితి జిల్లా చైర్మన్ చడిమెల యాదగిరి అధ్యక్షతన జరిగిన రచ్చబండ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి, అణచివేత ధోరణితో రాష్ట్రంలో ఈ నాలుగున్నరేళ్లు దుర్మార్గమైన పాలనను కొనసాగించారని మండిపడ్డారు. రాష్ట్ర సాధన కోసం 1,200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే వారి ఆత్మలు ఘోషించే విధంగా కేసీఆర్ తన సొంత ప్రయోజనాల కోసమే పాలన సాగించారని విమర్శిం చారు. ధర్నాలుండని రాష్ట్రంగా తెలంగాణను చేస్తాన ని ధర్నాచౌక్‌ను ఎత్తేసిన నియంత కేసీఆర్ అని అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రీడిజైన్ పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు. తెలంగాణ తల్లిని విమర్శించిన ఘనుడు.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశాలతో రాష్ట్రం ఏర్పడితే ఆ మూడింటిని ఈ ప్రభుత్వం ప్రజలకు దూరం చేసిందని ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని సైతం కేసీఆర్ విమర్శించారని గుర్తుచేశారు. ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీని తెరిపించే చేతగానీ ప్రభుత్వం మళ్లీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. గద్దె దిగడమంటే చేతగానితనమే హైదరాబాద్: ప్రజలు ఐదేళ్లు పాలించమని కేసీఆర్‌కు అధికారమిస్తే నాలుగేళ్లకే గద్దెదిగిపోవటం చేతగానితనానికి నిదర్శనమని కోదండ రాం ఆరోపించారు. తెలంగాణ జన సమితి ముషీరాబాద్ ఇన్చార్జి నర్సయ్య ఆధ్వర్యంలో రాంనగర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగేళ్లలో నిరంకుశ, అవినీతి పాలనను చూశామ న్నారు. టీఆర్ఎస్ పాలనలో రూ.వేల కోట్లు పక్కదారి పట్టాయని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ప్రజలు కేంద్రంగా రాజకీయాలు ఉండాలని, ప్రతి పైసా రాష్ట్ర ఖజానాకు దక్కాలని, ఈ మార్పుకోసమే జన సమితి ప్రయత్నిస్తుందన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపుని చ్చారు. రాజకీయాల్లో మార్పు కోసం జన సమితికి మద్దతివ్వాలని కోరారు. కార్యక్రమంలో నగర నాయకులు మాదు సత్యంగౌడ్, బలరాం, ముషీరాబాద్ కన్వీనర్ మెరుగు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏం చేశారని అధికారం ఇవ్వాలి
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: ‘ఐదేళ్లు పాలించాలని ప్రజలు అధికారం అప్పగిస్తే నాలుగేళ్లకే దిగిపోయావు.. ఏం చేశారని మళ్లీ అధికారం ఇవ్వాలి.. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని గూర్ఖాలతో నెట్టించారు. తెలంగాణ వద్దని దాడులు చేయించిన వారిని పక్కన పెట్టుకున్నావు’అని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అపధర్మ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ఆ పార్టీ సూర్యాపేట జిల్లా ఇన్చార్జి కుంట్ల ధర్మార్జున్ సూర్యాపేట నియోజకవర్గంలో చేపట్టిన మహాపాదయాత్ర శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉద్యోగాలు కావాలని అడిగిన వారిపై దాడి చేయించారని, నీళ్లు అడిగినా ఇవ్వలేదని, ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ ఓటుకు రూ.వెయ్యి ఇచ్చి అధికారంలోకి వస్తే ఒక్కొక్కరూ రు.వెయ్యి కోట్లు దోచుకోవాలని చూస్తున్నారని, ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ప్రగతి నివేదన సభ సందర్భంగా ఎక్కడ చూసినా మందు బాటిళ్లు, తాగుతున్న వాళ్లే కన్పించారని, అలాంటి సభను తానెప్పుడూ చూడలేదన్నారు. -
ఆపద్ధర్మ ప్రభుత్వంతో సమస్యలు: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీని రద్దు చేసి తన చేతకానితనాన్ని కేసీఆర్ బయటపెట్టుకున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగితే అవాంతరాలు ఉంటాయని, గవర్నర్‌ను కలసి కేసీఆర్‌ను ఆపద్ధర్మ సీఎంగా కొనసాగించొద్దని కోరతామన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. గురువారం కోదండరాం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్‌ను కూడా శాసించే పద్ధతిలో కేసీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. మంచి పాలన చేసే ముఖ్యమంత్రి అసెంబ్లీని రద్దు చేయరని.. కేసీఆర్ అనేక సార్లు అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. శాసనసభ రద్దు లేఖను ఆ పార్టీకి రాజకీయ మరణశిక్షగా చూస్తామన్నారు. -
కూల్చడానికి ముహూర్తాలు ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: ఏదైనా నిర్మాణం చేపట్టడానికి ముహూర్తం కావాలి తప్ప, ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏవరైనా ముహూర్తం చూస్తారా? అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ పేర్కొన్నారు. కోదండరామ్ జన్మదినం సందర్భంగా టీజేఎస్ కార్యాలయంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమేనని, 25 నియోజకవర్గాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారన్నారన్నారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీ ఎన్నికల ప్రచార కమిటీలు పని చేస్తున్నాయని, ఇంటింటికి జన సమితి కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఇతర కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత మరో 25 నియోజకవర్గాల్లో కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. అన్ని జిల్లాల్లో నిరుద్యోగ సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వారిని, యోగేందర్ యాదవ్ లాంటి వారిని వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకుంటామన్నారు. ప్రగతికి పది సూత్రాల పేరుతో జయశంకర్ మానవ వనరుల కేంద్రం టీజేఎస్ ఎన్నికల మేనిఫెస్టో తయారు చేస్తోందన్నారు. త్వరలోనే దానిని ప్రజల్లోకి తీసుకొస్తామన్నారు. జనం రాజకీయ మార్పును కోరుకుంటున్నారని, అది టీజేఎస్‌తోనే సాధ్యం అవుతుందని నమ్ముతున్నారన్నారు. గిట్టుబాటు ధరకు ప్రాధాన్యం.. మాదక ద్రవ్యాలను ఆపడం, నిరుద్యోగ భృతి, మహిళా సంఘాలకు రుణాలు తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తామని అన్నారు. రుణమాఫీతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. నిరుద్యోగులకు భృతి అవసరమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీజేఎస్ పాత్ర ప్రముఖంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం టీజేఏస్‌ను రాజకీయ పార్టీగా గుర్తించిందని, జాతీయ ఎన్నికల సంఘం గర్తించాల్సి ఉందని కోదండరామ్ వివరించారు. మరో పది రోజుల్లో ఆ గుర్తింపు వస్తుందని, ముందస్తు ఎన్నికలకు టీజేఎస్‌కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఎన్నికల గుర్తుకోసం ఇప్పటికే ఈసీకి దరఖాస్తు చేశామని ఆయన అన్నారు. అయితే గుర్తు ఏదనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. పిల్లలకు ఒక పూట అన్నం పెట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులున్న రాష్ట్రంలో మనం ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో మంచి పాలన జరిగిందని ఏ ఒక్కరితోనైనా పాలకులు అనిపించగలరా అని ప్రశ్నించారు. కేసీఆర్ మళ్లీ గజ్వేల్ నుంచి పోటీ చేస్తారో.. చేయరో.. కూడా చూడాలన్నారు. కేసీఆర్ సభల పేరుతో జనాన్ని తరలిస్తే.. తాము జనం వద్దకే పోయి పలకరిస్తున్నామన్నారు. నియోజకవర్గాల్లో బలపడ్డాకే పొత్తుల విషయం మాట్లాడుతామని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో 10 వేల మందితో సమావేశం పెట్టాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పైసలున్నోళ్లంతా ఓ పక్కన ఉంటే.. పైసలు లేనోళ్లంత ఓ పక్కన ఉంటారని టీజేఎస్ అధ్యక్షుడు వివరించారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నేతలు వెంకట్‌రెడ్డి, యోగేశ్వర్‌రెడ్డి, జోత్స్న తదితరులు పాల్గొన్నారు. -
సభపై నివేదన!
-
పదవీ విరమణ సభలా ఉంది
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ.. పదవీవిరమణ సభలా సాగిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆర్భాటంగా ప్రకటించినా సభ వెలవెలబోయిందన్నారు. సభలో ప్రగతి నివేదన, భవిష్యత్ దర్శనం లేదని, కేసీఆర్ ప్రసంగం పేలవంగా సాగిందని వ్యాఖ్యానించారు. మైక్ టైసన్లా గెలుస్తారని అనుకుంటే మొదటి రౌండ్లో ఎలిమినేట్ అయినట్లుగా కేసీఆర్ పరిస్థితి ఉందన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో కోదండరాం మాట్లాడుతూ.. ‘సభకు 25 లక్షల మంది వస్తారని, ముఖ్య ప్రకటనలు చేస్తారని, ఏదో జరిగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ప్రకటించిన దాంట్లో 4వ వంతు జనం కూడా రాలేదు’అన్నారు. సభ పూర్తిగా విఫలమైందని, అన్ని శక్తులు ఉపయోగించినా జనాన్ని సభకు తీసుకురాలేకపోయారన్నారు. సీఎం ప్రసంగంలో మాటల తడబాటు ఉందని, మాటలు వెతుక్కోవాల్సి వచ్చిందని.. ప్రజలతో సంబంధాలు లేకపోవడం వల్లే మాటలు రాలేదని విమర్శించారు. సభతో పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వలేకపోయారని చెప్పారు. అది బలప్రదర్శన, కేసీఆర్ గర్జన కాదని, ఆయన స్వీయ వేద నలా ఉందని ఎద్దేవా చేశారు. దీపం ఆరిపోయేముందు ఆఖరి తేజంలా కేసీఆర్ తీరు ఉందన్నారు. రాజకీయంగా, ప్రభుత్వపరంగా తన విధానం చెప్పుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. త్వరలో ఇంటింటికీ జన సమితి తెలంగాణ జనసమితిని బూత్ స్థాయికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని కోదండరాం వెల్లడించారు. త్వరలోనే ఇంటింటికీ జన సమితి ప్రచారం మొదలెడతామన్నారు. హైదరాబాద్, జిల్లాల్లో అమరుల స్మృతి చిహ్నం కోసం ఈ నెల 12న ఒకరోజు దీక్ష చేస్తామని చెప్పారు. చేరికలతో కాకుండా సొంతగా పార్టీ శక్తి సామర్థ్యాలు పెంచుకుంటామన్నారు. పార్టీ ప్రచారం కోసం రెండు విడతులుగా బస్సుయాత్రలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు మహిళలు టీజేఎస్‌లో చేరారు. -
రాష్ట్రంలో ప్రగతి ఆవేదన: కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలకు ప్రగతిపై ఆవేదనే మిగిలిందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. టీజేఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేసినా అనేక జిల్లాల్లో అభివృద్ధి జాడేలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆ కుటుంబానికే పరిమితమైందన్నారు. ప్రభుత్వం ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒకరిద్దరు కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తోందని ఆరోపించారు. దళితుడు సీఎం అవుతారనుకున్నా జరగలేదన్నారు. వ్యవసాయ అప్పుల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని, రైతుల ఆత్మహత్యల్లో మూడోస్థానంలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ప్రభుత్వం 1.07 లక్షల ఉద్యోగాలే ఖాళీగా ఉన్నాయని చెప్పిందన్నారు. మిషన్ కాకతీయలో 18,656 చెరువులు తీసుకుంటే 25 శాతమే పూర్తి అయ్యాయని చెప్పారు. ఆగస్టు 15 నాటికి గ్రామాలకు తాగునీరు ఇస్తామని చెప్పిన మిషన్ భగీరథ పూర్తి కాలేదన్నారు. సభకు వచ్చే వారు వీటిపై నిలదీయాలని పిలుపునిచ్చారు. టీజేఎస్ అభ్యర్థులు సిద్ధం ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీకి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని కోదండరాం అన్నారు. దశలవారీగా పార్టీని పటిష్టం చేస్తున్నామన్నారు. ప్రతి 25 నియోజకవర్గాలను ఎంచుకొని గ్రామస్థాయి, బూత్ స్థాయి వరకు పటిష్టతకు చర్యలు చేపడుతున్నామన్నారు. 15 రోజుల్లో ఈ పని చేస్తామన్నారు. -
నందమూరి హరికృష్ణను గౌరవించినట్లే...
సాక్షి, హైదరాబాద్ : నటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణను గౌరవించినట్లుగానే తెలంగాణ ఉద్యమకారులను కూడా గౌరవించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో నంబర్ వన్‌గా, అవినీతిలో నెంబర్ 2గా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో తమకు ఒక కుటుంబం ప్రగతి మాత్రమే కనబడుతోందని, ప్రగతి ఇంకా ప్రగతి భవన్ దాటి బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. అమరుల త్యాగాలను గుర్తుకు చేస్తూ సెప్టెంబర్ 12న దీక్ష చేస్తామని తెలిపారు. రాజకీయ అవసరాలను బేరీజు వేసుకుంటూ ప్రభుత్వం నడుస్తోందన్నారు. దేశంలో సెక్రటేరియట్‌కు రాని నెంబర్ వన్ సీఎంగా కేసీఆర్‌ను గిన్నిస్ రికార్డ్‌లో ఎక్కించాలని ఎద్దేవా చేశారు. సమయానుకూలంగా తాము కూడా అభ్యర్ధులను ప్రకటిస్తామని తెలిపారు. పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. ‘‘25,000 మంది వీఆర్ఏలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని వస్తుంటే వారిని అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలి. రింగ్ రోడ్డును మార్చుతున్నారు. ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు అక్కడ రైతుల భూములు ఇవ్వమని అభ్యంతరం తెలిపినా వినటం లేదు. అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. వారిది ప్రగతి నివేదన మాది ప్రజల ఆవేదన. ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం లేదు. మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 13,000 టీఎస్పీఎస్సీ భర్తీ చేసింది. మరో 10 వేల ఉద్యోగాలు పోలీస్ శాఖలో భర్తీ అయ్యాయి. మన తెలంగాణలో అక్షరాస్యత 36 శాతం ఉంది. స్కూల్‌కు వెళ్లని వారు 30 శాతంపైగా ఉన్నారు. 57 శాతం విద్యార్థులు ప్రైవేట్ విద్యాలయాల్లో చదువుతున్నారు. రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5,000 పాఠశాలలు మూసివేశారు. రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. రైతు అప్పులలో 2 స్థానంలో ఉండగా దాదాపు 35000 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు సగానికిపైగా ఇప్పటికీ ఖర్చు కాలేదు. పెన్షన్లు అందరికి ఇవ్వడం లేదు. ఉపాధి హామీ, పెన్షన్లపై ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. ఒక కుటుంబం కోసం, ఒక కాంట్రక్టర్ కోసం పాలన సాగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతి పథకం అవినీతి మయం అయ్యాయి. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రగతి నివేదన సభకు రమ్మని అడిగితే ప్రజల సమస్యలను గురించి అడగండి. ధర్నాచౌక్ ఎందుకు ఎత్తి వేసారో అడగండి, పండిన పంటకు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదని అడగండి. నేరేళ్ళలో దళితుల మీద దాడులు ఎందుకు చేశారో అడగండి. అధికార పక్షం వాళ్లు మన దగ్గరకి వస్తున్నారు మన సమస్యలు ఎప్పుడు పరిష్కారం చేస్తారో అడగండి. కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవ్ రావు జాధవ్, గూడ అంజన్నలను కూడా మనం గౌరవించుకోవాల’’ని కోదంరామ్ అన్నారు. (చదవండి: హరికృష్ణ కారు ప్రమాదం.. మరి మా పరిస్థితి ఏంటి!?) -
బీసీల వాటాపై పోరాటం
హైదరాబాద్: విద్యా, ఉపాధి అవకాశాల్లో బీసీలకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ జనసమతి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ బడుగు, బలహీన వర్గాలను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘బీసీల వాటా’పై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఆ పథకానికి తూట్లు పొడిచిందని మండిపడ్డారు. ముందుచూపుతో వై.ఎస్.ఆర్. ఆనాడు రాష్ట్రంలో ప్రాజెక్టులను ప్రారంభిస్తే కేసీఆర్ ప్రభుత్వం పేర్లు మార్చేసి తామే చేశామని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తుందన్నారు. గొర్రెలకు, మేకలకు రూ.8 వేల కోట్లు ఇచ్చిన సీఎం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,200 కోట్లే ఇచ్చి విద్యార్థులను అవమానించారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవీంద్ర, టీడీపీ అధికార ప్రతినిధి కాశీ విశ్వనాథ్, గుజ్జ కృష్ణ, రామకృష్ణ, నీల వెంకటేశ్ పాల్గొన్నారు. -
‘స్కూలు బస్సులకు అనుమతిస్తే కేసులేస్తాం’
సాక్షి, హైదరాబాద్: ‘మా పార్టీ కార్యక్రమం కోసం అడిగితే నిబంధనల ప్రకారం స్కూలు బస్సులు ఇవ్వడం కుదరదన్నారు. అందుకే ఇపుడు లోతుగా పరిశీలించి చూస్తాం. టీఆర్ఎస్ సభ కోసం స్కూలు బస్సులకు అనుమతి ఇస్తే ఊరుకునేది లేదు. ఏ అధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడినా కోర్టులో కేసులేస్తాం’అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం హెచ్చరించారు. వచ్చే నెల 2న టీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు నిబంధనల మేరకే అనుమతులివ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మనవడు, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు, పీసీసీ కార్యదర్శి ఆదిత్యరెడ్డి.. పారి శ్రామికవేత్త బాలలింగం ఆదివారం టీజేఎస్‌లో చేరారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో పార్టీ అధ్యక్షుడు కోదండరాం వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సభలు, సమావేశాలు నిర్వహించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అధికార దుర్వినియోగం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవ ర్నర్‌దేనన్నారు. ఉచితంగా ఆర్టీసీ బస్సులు పంపుతాం.. డయాస్ వేస్తాం.. ఫుడ్ సప్లై చేస్తాం అనేవి ఉండొద్దని, అలాంటివి జరిగితే ఊరుకోమన్నారు. గతంలో తమ సభకు ఆటంకాలు సృష్టించారని, టీఆర్ఎస్ సభకు అలాంటి ఇబ్బందు లు సృష్టించొద్దన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో యువ కుల అవసరం ఉందని.. సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి రావాలని కోదండరాం పిలుపునిచ్చారు. -
ఎత్తిపోతల కాదు.. తిప్పిపోతల
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చరిత్రలోనే అతి పెద్ద ఇంజనీరింగ్ తప్పిదమని, తప్పు డు పునాదులపై దీన్ని నిర్మిస్తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ కె.రఘు ఆరోపించారు. ఇది ఎత్తిపోతల కాదు.. తిప్పిపోతల పథకమని విమర్శించారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పేర్కొన్న నీటి లభ్యత గణాంకాలను తప్పుగా అన్వయించుకుని ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారన్నారు. మేడిగడ్డ వద్ద 415 టీఎంసీల లభ్యత ఉందని డీపీఆర్‌లో పేర్కొనడం తప్పని, నీటి లభ్యతను లెక్కించడంలో ప్రాణహిత, మధ్య గోదావరి, మానేరు నదుల నుంచి వచ్చే నీటిని పరిగణనలోకి తీసుకోవడం భారీ తప్పిదమన్నారు. మధ్య గోదావరి నుంచి వచ్చే నీరంతా ఎల్లంపల్లిని దాటి వచ్చే నీరేనని, ఆ నీటిని ఎల్లంపల్లి బ్యారేజీ వద్ద నుంచే పంపింగ్ చేసుకోవచ్చని చెప్పారు. మానేరు నుంచి గోదావరిలోకి చేరే నీటిని మధ్య మానేరు రిజర్వాయర్ వద్దనే ఎత్తిపోసుకోవచ్చన్నారు. ప్రాణహిత నది గోదావరిలో కలసే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత కేవలం 182 టీఎంసీలు మాత్రమేనన్నారు. ‘కాళేశ్వరం రీ ఇంజనీరింగ్–ఇంజనీరింగ్ భారీ తప్పిదం’అనే అంశంపై ఆదివారం ఆయన అఖిలపక్షాల నేతలు, రిటైర్డు ఇంజనీర్ల సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రీ ఇంజనీరింగ్ పేరిట ఎక్కువ ఎత్తు నుంచి కిందికి ప్రవహించే నీటిని తిరిగి అదే ప్రాంతానికి ఎత్తిపోసే తప్పుడు అవగాహనతో ఈ ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన చేశారన్నారు. మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడంతో ప్రయోజనాలేవీ ఉండవని, వేల కోట్ల అదనపు పెట్టుబడి వ్యయం, విద్యుత్, ఇతర నిర్వహణ వ్యయాన్ని వృథా చేయాల్సి ఉంటుందన్నారు. చిన్న మార్పులతో ఎల్లంపల్లికి తరలించొచ్చు తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని, 152 మీటర్ల ఎత్తులో అక్కడ బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపు సమస్య ఉంటుందని, మేడిగడ్డ వద్ద ఏకంగా 415 టీఎంసీల లభ్యత ఉందనే తప్పుడు కారణాలు చూపి ప్రభుత్వం ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చిందని రఘు ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీలను ఎత్తిపోయలేమని సీడబ్ల్యూసీ ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం మేరకు 148 మీటర్ల బ్యారేజీ నుంచి పూర్తి స్థాయిలో నీటిని ఎల్లంపల్లికి తరలించవచ్చని చెప్పారు. కాలువ వెడల్పు, లోతు, పంపుల సామర్థ్యం లాంటి చిన్న చిన్న మార్పులతో మొత్తం 160 టీఎంసీలను తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి తరలించడం సాధ్యమేనని రఘు తెలిపారు. మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్లే: శ్యాంప్రసాద్‌రెడ్డి తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్లే ప్రాజెక్టును మేడిగడ్డకు ప్రభుత్వం తరలించిందని రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి సమర్థించారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని పునరుద్ఘాటించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కాంగ్రెస్ నేతలు జీవన్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్, నాగం జనార్దన్‌రెడ్డి, అద్దంకి దయాకర్, టీడీపీ నేత ఎల్.రమణ, సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. -
కేసీఆర్.. తీస్మార్ ఖానా?
సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యలను పక్కదారి పట్టించడానికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాయమాటలు చెబుతున్నారని తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ప్రజా సమస్యలు మీడియా దృష్టికి రాకుండా ఉండేందుకే ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ టీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలు కేసీఆర్ చేతిలో లేనేలేవని, ఆయన ఇష్టమొచ్చినప్పుడు ఎన్నికలు పెట్టడానికి ఆయనేమైనా తీస్మార్ ఖానా.. అని ఘాటుగా విమర్శించారు. టీజేఎస్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా చిట్‌చాట్‌లో తన అభిప్రాయాలను, ఆలోచనలను, పార్టీ కార్యాచరణను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు వంద సీట్లు వస్తాయని కేసీఆర్ అబద్ధం ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్కు వందసీట్లు వస్తాయనడంలో నిజముంటే కేసీఆర్ చేయించిన సర్వేల్లో ఒక దానినైనా బయటపెట్టాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా సర్వే చేయలేదని, సర్వేల పేరుతో అన్నిపార్టీలు మాయ చేస్తున్నాయన్నారు. సొంత పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా, ఇతర పార్టీలను భయపెట్టాలనే ఉద్దేశంతోనే వంద సీట్లంటూ కేసీఆర్ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో టీజేఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడమంటే పురిటి బిడ్డను చంపుకోవడమేనని కోదండరాం వ్యాఖ్యానించారు. కొత్తవారికి ఆహ్వానం... టీజేఎస్ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వారిని తమ పార్టీ ఆహ్వానిస్తోందని కోదండరాం అన్నారు. ముందస్తు ఎన్నికలు డిసెంబర్లో వస్తే రావచ్చన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ ఎన్నికలు అనొచ్చుగా అని ప్రశ్నించారు. కేంద్రం ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తుందా లేదా రాష్ట్రపతి పాలన విధిస్తుందా? అన్నది తెలియదన్నారు. డిసెంబర్ 2 తరువాత అయితే ఎన్నికల నిర్వహణ అంశం ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుందని, అంతకంటే ముందు అయితే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందన్నారు. ఎన్నికల విషయంలో కేంద్రం తనకు సహకరిస్తుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు. తనకున్న సమాచారం ప్రకారం ముందస్తు ఎన్నికలకు బీజేపీ సహకరించదన్నారు. అక్టోబర్, నవంబర్‌లో ముందస్తు ఎన్నికలని అనుకోవడానికి గ్యారెంటీ లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ముందస్తుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో తనకే స్పష్టత లేదని, అందుకే బయటకి కారణం చెప్పలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. అప్పట్లో చంద్రబాబు ముందస్తుకు వెళ్లి నష్టపోయారని గుర్తు చేశారు. ముందస్తుకు వెళ్లి ఇతర పార్టీలను దెబ్బతీయాలని కేసీఆర్ భావిస్తున్నారని, కానీ టీఆర్ఎస్ పార్టీలోని సమస్యలు పరిష్కరించడం కేసీఆర్‌కు అంత తేలిక కాదని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే టీజేఎస్ పార్టీకి లాభం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు, టికెట్ రాని ఇతర పార్టీలవారు తమ పార్టీలోకి వస్తారన్నారు. పొత్తుల కంటే తాము సొంతంగా బలపడటంపైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఎన్నికలకు తెలంగాణ అంశమే ముఖ్యమైనదని, కేసీఆర్ ప్రజలను మోసం చేసారని ప్రజలకు అర్థమైందన్నారు. ప్రజల ఆకాంక్షను తీర్చే పార్టీ కేవలం టీజేఎస్ మాత్రమేనన్నారు. రాజకీయాల్లో కొత్త పార్టీలకు అవకాశం ఉంటుందని, గతంలో పీఆర్పీ, లోక్‌సత్తా, నవ తెలంగాణ ప్రజాపార్టీలను ప్రజలు ఆదరించినా, నేతలే నిలబడలేదన్నారు. కోదండరాం వెంట టీజేఎస్ అధికార ప్రతినిధి యోగేశ్వర్‌రెడ్డి ఉన్నారు. -
పోరాట యోధుడు మొగిలయ్య
ఖిలా వరంగల్ : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి వీరమరణం పొందిన పోరాట యోధుడు బత్తిని మొగిలయ్య గౌడ్ జీవిత చరిత్రను భావితరాలకు అందించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాసన సభ మండలి నాయకుడు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. బత్తిని మొగిలయ్య 72వ వర్ధంతి, శత జయంతి సందర్భంగా ఆదివారం ఖిలా వరంగల్ తూర్పుకోట హనుమాన్ జంక్షన్లో బత్తిని మొగిలయ్య ఫౌండేషన్ కన్వీనర్ గోపగాని శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో కాంస్య విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా షబ్బీర్ అలీ, టీజేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం, మేయర్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. మొగిలయ్య కాంస్య విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అనంతరం తీగల జీవన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడారు. మొగిలయ్య గౌడ్ నడియాడిన నేలపై కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అమరులను ప్రభుత్వం గుర్తించాలి.. వీరమరణం పొందిన అమరవీరులను ప్రభుత్వం గుర్తించి వారి జీవిత చరిత్రను పుస్తక రూపంలో భావితరాలకు అందించాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మొగిలయ్య రక్తం చిందిన నేలపై ఎంతో మంది ఉద్యమకారులు పుట్టుకొచ్చారన్నారు. మొగిలయ్య పేరు మీద కోటి నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని మేయర్ నన్నపునేని నరేందర్ తెలిపారు. అనంతరం ఇంటిపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరువు సుధాకర్, ఓయూ జేఏసీ అధ్యక్షురాలు బాల లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ మొగిలయ్య త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క, కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పీసీసీ నాయకులు నాగయ్య, బండి సుధాకర్, మహేష్‌గౌడ్, ఇందిరాశోభ, పుల్లా భాస్కర్, టీజేఏసీ నాయకుడు గాదే ఇన్నయ్య, గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొనగాని యాదగిరిగౌడ్, గట్టగాని రవీందర్, కార్పొరేటర్లు బిల్ల కవిత, బైరబోయిన దామోదర్, సోమిశెట్టి శ్రీలత, బిల్లా శ్రీకాంత్, సోమిశెట్టి ప్రవీణ్, కాంగ్రెస్ గ్రేటర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, కొత్తపెల్లి శ్రీనివాస్, మహిళా విభాగం ఆధ్యక్షురాలు పోశాల పద్మ, వేణుగౌడ్, అచ్చవిద్యాసాగర్, రవీందర్ పాల్గొన్నారు. -
సమరయోధులకు కుల, మతాల రంగు పులమొద్దు
ఖిలావరంగల్: స్వాతంత్య్ర, నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని అసువులు బాసిన పోరాట యోధులకు కులం, మతం రంగు పులమొద్దని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఓరుగల్లు ఉద్యమ కెరటం బత్తిని మొగిలయ్యగౌడ్ 72వ వర్ధంతి, శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఖిలావరంగల్ తూర్పుకోట హనుమాన్ జంక్షన్లో జరిగిన మొగిలయ్య కాంస్య విగ్రహం భూమి పూజకు ఆయన హాజరయ్యారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం సమరయోధులను విస్మరించడం బాధాకరమన్నారు. యోధుల కుటుం బాలను ప్రభుత్వం గుర్తించి వారికి సుముచిత స్థానం కల్పించాలన్నారు. మొగిలయ్య జ్ఞాపకార్థం ప్రభుత్వమే కమ్యూనిటీ హాల్ నిర్మించి దానికి మొగిలయ్య పేరు పెట్టాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ బత్తిని మొగిలయ్య కుటుంబంతో 32 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. ఆయన పేదలు, బడుగుల దాస్య విముక్తి కోసం పోరాటం చేసిన మహనీయుడన్నారు. -
రాష్ట్రంలో నిరంకుశ పాలన
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని తెలంగాణ టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం అన్నారు. అధికారాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు దండుకుంటున్నారని తెలిపారు. సోమవారం కరీంనగర్ ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు కపిల్వాయి దిలీప్‌కుమార్, గాదె ఇన్నయ్య తదితరులతో కలిసి మాట్లాడారు. కరీంనగర్ నగరంలో సీఎం కేసీఆర్ మొక్క నాటితే దాన్ని కాపాడేందుకు ఇద్దరు పోలీసులు, ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులను పెట్టి, నీళ్లు పోసేందుకు వాటర్ ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారని, మొక్కకు అంత రక్షణ తీసుకున్నప్పుడు రైతులు కూడా తమ చేనుచెలుకను కాపాడుకోవడానికి అంతే తాపత్రయ పడుతారనే విషయం తెలియకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. పంటలు వేసుకునే సమయంలో నీళ్లివ్వమంటే ఇవ్వని దుస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం వానలు పడుతున్నయ్, వరదలు వస్తున్నయ్, ప్రభుత్వం కొద్దిగా ఆలోచించి అప్పుడే అర టీఎంసీ నీటిని వదిలి ఉంటే ఇంత ఘర్షణకు అవకాశం ఉండేది కాదని వివరించారు. కరీంనగర్ నగరంలోని ఆర్ట్స్ కళాశాల స్థలంలో ఒక భాగం పురాతన కట్టడంగా ఉన్న దాన్ని కాపాడుకోగలిగాం కానీ, ఇంకా ఆర్ట్స్ కళాశాలకు సంబంధించిన జాగలో ఇక్కడున్న నాయకులు సినిమా థియేటర్ల కోసం, మల్టిఫ్లెక్స్‌ల కోసమో దాన్ని తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇది నిజంగా విచిత్రమైన పరిస్థితేనన్నారు. ఎవరో దాత విద్యాసంస్థలు నడపమని ఇస్తే, రాజకీయ నాయకులు విద్యాసంస్థలను పెంపు చేయకుండా ఉన్నజాగను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, వినోద్‌రావు, శ్రీనివాస్‌రావు కోసం ఈ కుట్ర జరుగుతోందని, నిరంకుశులు అనుకునేటోళ్లు అట్ల వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది నీచ రాజకీయాలకు అద్దంపట్టి చూపుతోందన్నారు. ప్రజలకోసం ఉపయోగపడాల్సిన అధికారం, నగరం, నీళ్లు మాకోసమనే పద్ధతుల్లో అధికారాన్ని చలాయిస్తున్నారని విమర్శించారు. రేపు ఆర్ట్స్ కళాశాల జాగాతో ఆగుతరనే నమ్మకం లేదని, పక్కన బస్ డిపో కూడా ఇక్కడ ఎందుకండి మానేరు కాడా జాగలో పెట్టుకోండని పంపించినా పంపించవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాలేజీలు ఊరవతల ఉండాలి, మీ థియేటర్లయితే నడుమ కట్టుకోవాలా..? అని ప్రశ్నించారు. ఇవాళ్ల ఇలాంటి పరిస్థితులు కరీంనగర్ నడిబొడ్డున సాక్షాత్కరిస్తున్నదన్నారు. ఇదే జిల్లాలో నీళ్ల కోసం ఆరాటపడుతున్న రైతుల విషయంలో ప్రభుత్వ అనుసరించిన వైఖరి కూడా సాక్ష్యంగానే కనబడుతోందన్నారు. దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. కొత్త తరహా రాజకీయాలు కావాలని అన్నారు. 1990కంటే ముందుకు ఇదే జిల్లాలో రాజకీయాలు చేసిన ఎంతోమంది సోషలిస్టులు పోరాటం చేసి ఉన్న ఆస్తులన్నీ ప్రజల కోసం కరగదీసిన దాఖలాలూ ఉన్నాయన్నారు. కానీ ఇవాళ్లి రాజకీయాల్లో గుప్పెడు మంది తెలంగాణ తమ సొంత ఆస్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సమాజం కోసం ఎలా పనిచేయాలో చెప్పేదే రాజకీయమని, రాజకీయాలు అవి సరిగా నడవకపోతే కొట్లాడి తెచ్చిన తెలంగాణకు అర్థం లేదన్నారు. వాటిని మార్చడానికి జనసమితి సమస్యల ప్రాతిపదికన ప్రజలను సమీకరిస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలకు పునాది వేయాలనేది తమ తాపత్రయమన్నారు. చాలా అనుభవాలను సమీక్షించుకున్నామని తెలి పారు. గన్‌పార్కులో ఉన్న అమరుల స్తూపం మా దిరిగా మరో స్థూపానికి రూపకల్పన చేస్తున్నామ ని తెలిపారు. మనం కొట్టాడిన తెలంగాణ మన ఆ కాంక్షల పునాదిగా నిర్మించుకుందామని పిలుపుని చ్చారు. సమావేశంలో తెలంగాణ జన సమితి జి ల్లా కన్వీనర్ ముక్కెర రాజు, నరహరి జగ్గారెడ్డి, రొ ంటాల కేశవరెడ్డి, బి.వెంకటమల్లయ్య, మహిపాల్‌రెడ్డి, గడ్డం రవీందర్‌రెడ్డి, వరాల శ్రీనివాస్, మొ గురం రమేశ్, మాధవి తదితరులు పాల్గొన్నారు. ప్రెస్మీట్లో మాట్లాడుతున్న టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం -
పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలి
హైదరాబాద్: గ్రామాభివృద్ధికి, గ్రామపారిశుధ్యానికి నిత్యం శ్రమించే పంచాయతీ పారిశుధ్య ఉద్యోగులు, కార్మికులను పర్మనెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, అర్హులను గ్రామకార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎల్బీనగర్లోని మినీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో శనివారం జరిగిన ఆత్మగౌరవ పోరాట సభలో ఆయన మాట్లాడారు. గ్రామాలను మల్లెపూవులాగా తీర్చిదిద్దేది పంచాయతీ కార్మికులు, ఉద్యోగులేనని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రాష్ట్ర ఖజానా నుంచి పంచాయతీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని కోరారు. పంచాయతీ ఉద్యోగులు ఓటర్లను ప్రభావితం చేసే శక్తివంతులని, వారి పొట్ట కొట్టినవాడు గాలిలో కలుస్తాడన్నారు. పంచాయతీ ఉద్యోగులు, కార్మికులను పర్మనెంట్ చేయకపోతే ఉద్య మాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేటీఆర్ మోసం చేశారు: సున్నం రాజయ్య 2015లో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె సమయంలో పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న కేటీఆర్ అన్ని రాజకీయపక్షాలు, ప్రజాసంఘాల సమక్షంలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఎమ్మెల్యే సున్నం రాజయ్య దుయ్యబట్టారు. కార్మికుల పక్షాన కలసి వచ్చే పార్టీలతో అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చి పోరాటం చేస్తామన్నారు. నెలల తరబడి జీతాల్లేక కార్మికులు వెట్టి చాకిరీ చేస్తున్నారని, తెలంగాణలో పంచాయతీ కార్మికుల ఆత్మగౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. 44 రోజులుగా పంచాయతీ కార్మికులు దీక్షలు చేస్తుంటే సీఎం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం వెట్టి ఉండటానికి వీల్లేదని, పంచాయతీ కార్మికులు మాత్రం వెట్టిబతుకు బతకాల్సి వస్తోందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా వేతనాలు ఇచ్చుకోండని ప్రభుత్వం పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. వర్షం కురుస్తున్నా పంచాయతీ కార్మికులు లెక్కచేయకుండా సభకు హాజరై వక్తల ప్రసంగాలకు జేజేలు పలికారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు సాయిబాబు, పాలడుగు భాస్కర్, బీసీ సంక్షేమ సంఘం నేత గుజ్జ రమేష్, టీజీపీయూఎస్ రాష్ట్ర సలహాదారు నల్లా రాధాకృష్ణ, చిక్కుడు ప్రభాకర్, స్కైలాబ్‌బాబు, సౌదాని భూమన్నయాదవ్ పాల్గొన్నారు. -
ప్రభుత్వాన్ని కూలుస్తాం: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ పాలన సరిగా లేదని, ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ కోదండరాం ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు కేంద్రం నుంచి లక్షల కోట్లు వచ్చాయన్న కోదండరాం.. ఆ లక్షల కోట్లు ఎక్కడిపోతున్నాయో సీఎం కేసీఆరే చెప్పాలన్నారు. ప్రస్తుతం ఉపాధి హామీకి సైతం డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ రాజకీయాలను సమాధి చేస్తామంటూ హెచ్చరించారు. సీఎం నాటిన మొక్కకు పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారని ఎద్దేవా చేసిన కోదండరామ్.. మరి అంత ప్రేమ రైతుల పంటలపై లేదా? అని నిలదీశారు. తెలంగాణలో బలమైన రాజకీయ ఏకీకరణ చేస్తామన్నారు. వచ్చే నెల రెండో వారంలో పార్టీ కార్యాచరణను ఉధృతం చేస్తామన్నారు. ప్రస్తుత రాజకీయాలను తట్టుకునే శక్తి టీజేఎస్‌కు ఉందని కోదండరాం స్పష్టం చేశారు. -
కేజ్రీవాల్‌తో కోదండరామ్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రోఫెసర్ కోదండరామ్ ఢిల్లీలో వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. టీజేఎస్ పార్టీ స్థాపించిన అనంతరం తొలి సారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కోదండరామ్ జాతీయ నేతలతో భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి రచించిన ‘టెన్ ఐడియాలజీస్: ది గ్రేట్ అసిమ్మెట్రీ బిట్వీన్ అగ్రేరియనిజం అండ్ ఇండస్ట్రియలిజమ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన కోదండరామ్ గురువారం సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను కోదండరామ్ వివరించారు. టీజేఎస్ భవిష్యత్ కార్యచరణ, రానున్న ఎన్నికలో తమ పార్టీ అనుసరించనున్న వ్యూహాల గురించి కేజ్రీవాల్‌తో చర్చించారు. ఈ సమావేశంలో కోదండరామ్‌తో పాటు సౌత్ ఇండియా ఇంచార్జ్ సోమనాథ్ భారతి, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరాం సాగర్ ఆయకట్టు గ్రామాల్లో భారీ బందోబస్తు
-
అర టీఎంసీ ఇస్తే ఇబ్బంది లేదు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాకతీయ కాలువ ఆధారంగా పంటలు వేసుకుంటున్నాము. గతేడాది మాదిరిగానే ఈ ఏడాదీ నీళ్లిస్తే ఎండిపోతున్న మా పంటలు గట్టెక్కుతాయి. మేము రోజుకు 200 క్యూసెక్కులే నీటిని వదలమంటున్నాము. నెలంతా ఇచ్చినా అర టీఎంసీకి మించదు. ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చాక సెప్టెంబర్‌లో నీళ్లిస్తామని సర్కారు అంటోంది. అప్పటి వరకు మా పంటలు బతుకుతయా? ఒక్క తడి ఇచ్చినా పంటలు గట్టెక్కుతాయి. – ఇది ఎస్సారెస్పీ కాకతీయ కాలువ రైతుల ఆవేదన. ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులో ప్రస్తుతం 16 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. తాగునీటి అవసరాలు, డెడ్‌స్టోరేజీ, ఆవిరి నష్టాలకు పోను ఉన్న నీరు బొటాబొటిన సరిపోతాయి. రాబోయే రోజుల్లో ఎగువన వర్షాలు కురిసి.. ప్రాజెక్టులోకి నీరు వస్తే కాకతీయ కాలువతో పాటు, సరస్వతి, లక్ష్మి కాలువలకు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – ఇది ప్రభుత్వ వాదన. ఇదీ ఎస్సారెస్పీ ప్రాజెక్టు పరిస్థితి.. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 16 టీఎంసీల నిల్వ ఉంది. రైతులు అడుగుతున్న మేరకు రోజుకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తే ఇబ్బందేమీ లేదని నిపుణు లు పేర్కొంటున్నారు. ఇలా నెలంతా ఇచ్చినా అర టీఎంసీకి మించదని అంటున్నారు. ప్రస్తుతమున్న 16 టీఎంసీల్లో.. మిషన్ భగీరథకు 6.5 టీఎంసీలు, డెడ్‌స్టోరేజీ 5.0 టీఎంసీలు, ఆవిరి నష్టాలు 3 టీఎంసీలు (4 నెలలకు) పోగా సుమారు 1.5 టీఎంసీలు మిగులుతాయి. ఇందులో నుంచి 0.5 టీఎంసీలు ఇవ్వడానికి ఇబ్బందేమీ ఉండదు. సెప్టెంబర్‌లోనే వరద..: గత దశాబ్ద కాలంగా ఎస్సారెస్పీకి వచ్చిన ఇన్‌ఫ్లోలను పరిశీలిస్తే.. సెప్టెంబర్ నెలలోనే భారీ ఇన్‌ప్లో వచ్చి చేరుతుంది. దీనికి తోడు జలాశయం ఎగువన ఉన్న మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి. అయినా ప్రభుత్వం అర టీఎంసీ ఇచ్చేందుకు ససేమిరా అనడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. రెండు జిల్లాల రైతుల ఆందోళన..: ఎస్సారెస్పీ జలవివాదం రోజురోజుకూ ముదురుతోంది. కాకతీయ కాలువకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతులు ఉద్యమబాట పట్టారు. రైతులకు మద్దతు తెలిపేందుకు నిజామాబాద్‌కు వస్తున్న తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాంను సోమవారం భిక్కనూర్ వద్ద అదుపులోకి తీసుకుని తిరిగి హైదరాబాద్ తరలించారు. -
ప్రభుత్వంతో యుద్ధం చేస్తాం
సాక్షి, మహబూబాబాద్: భూరికార్డుల ప్రక్షాళనలో జరిగిన తప్పులను సరిదిద్ది, వాస్తవ సాగుదారులకు పాస్‌పుస్తకాలు వచ్చేదాకా పోరాటం చేస్తామని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మానుకోట, జనగామలో సోమవారం నిర్వహించిన రైతు దీక్షల్లో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలు పరిష్కరించకుంటే సెప్టెంబర్‌లో ప్రభుత్వంతో యుద్ధం చేస్తామని స్పష్టం చేశారు. భూప్రక్షాళనలో భూమి ఎక్కువ వస్తే.. సరిచేయాల్సింది పోయి రైతుల నుంచి లాక్కోవడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కౌలు రైతులపై సీఎం చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని పేర్కొన్నారు. నిరుద్యోగులు, రైతులు ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో తప్పులు దొర్లాయని, నిజమైన రైతులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ జనసమితి ప్రత్యక్షంగా రైతుల అభిప్రాయాలను సేకరించిందన్నారు. పేరు, విస్తీర్ణం, కులం, సర్వే నంబర్లలో 9,11,241 తప్పులు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. జూన్ 20 వరకు తప్పులు సరిదిద్దుతామని సీఎం చెప్పారని, జూలై 30 వరకైనా రైతులకు పాస్‌పుస్తకాలు ఇస్తారా అని అడిగారు. ఆగస్టులో ప్రభుత్వ పెద్దలను కలసి సమస్యలను వివరిస్తామన్నారు. ప్రజా ఉద్యమాల్లో ఉన్నవారికే టికెట్లు సాక్షి, కొత్తగూడెం: అన్ని అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగుతామని, ప్రజా ఉద్యమాల్లో ఉన్న వారికే టికెట్లు ఇస్తామని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. కొత్తగూడెంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాలు ప్రజా సమస్యలకు కేంద్ర బిందువుగా ఉండాలని సూచించారు. -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
నర్సంపేట రూరల్: ప్రజా సమస్యలపై తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీ నిరంతరం పోరాడుతోందని ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నా రు. భూముల క్రమబద్ధీకరణ, సాదాబైనామా తదితర కార్యక్రమాలతో భూములపై హక్కులను కల్పించి, నేడు కాలరాసేందుకు ప్రభుత్వం యత్ని స్తోందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాస్‌పుస్తకాల్లో 90శాతం ఏదో ఒక తప్పులు ఉన్నాయని, వాటిని సరిచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించ డం లేదన్నారు. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట చేపడుతున్న ధర్నాలను విజయవంతం చేయాలని కోరారు. టీజేఎస్ గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి అన్ని స్థాయిల్లో కమిటీలను వేయనున్నట్లు తెలిపారు. టీజేఎస్ రాష్ట్ర నాయకులు అంబటి శ్రీనివాస్, చాపబాబు, బొనగాని రవీందర్, షేక్‌జావీద్, బొట్ల పవన్, భూక్యగోపాల్నాయక్, అంగోతు వినోద్, మామిండ్ల ఐలయ్య, బుల్లెట్ వెంకన్న, నందగిరి రజనీకాంత్, బందెల సదానందం, గుంటి సంజీవ, రాజశేఖర్, జాఫర్, యాకుబ్, హనుమంత్, లక్ష్మయ్య, శివ, అనిల్ పాల్గొన్నారు. పెద్దకోర్పోలు గ్రామంలో... నెక్కొండ(నర్సంపేట): టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై తెలంగాణ జన సమితి పార్టీ పోరా డుతోందని ఆ పార్టీ అధినేత ప్రోఫెసర్ కోదండరాం అన్నారు. చైతన్యయాత్రలో భాగంగా నెక్కొం డ మండలం పెద్దకోర్పోలు గ్రామంలో ఆదివారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయని, నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, ఉపాధి మార్గాలను మరిచిన ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు. 60 ఏళ్లలో రూ.63వేల కోట్ల అప్పు ఉంటే.. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో అప్పులను రెట్టింపు చేశారని అన్నారు. భూ ప్రక్షాళనతో సమస్యలు పరిష్కారం కాకపోగా రైతులకు కొత్త చిక్కులు తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు. టీజేఎస్ సోమవారం చేపట్టే రైతు దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అంబటి శ్రీనివాస్, వరంగల్ కన్వీనర్ బోనగాల రవీందర్, వెంకన్న, వినోద్‌నాయక్ పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ కోదండరాం -
అగ్నివేష్‌పై దాడిచేసిన వారిని శిక్షించాలి
వనపర్తి అర్బన్: సామాజిక కార్యకర్త, ఆర్య సమాజ్ ప్రముఖ్, కుర వృద్ధుడైన అగ్నివేష్‌పై దాడి చేయడం అత్యంత అమానుషమని, దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని టిజేఏసీ, ఎమ్మార్పీఎస్, పాలమూరు అధ్యాయన వేదిక, పీడీఎస్‌ఊయూస్‌యు, డీటీఎఫ్ ప్రజా సంఘాల నాయకులు ఖండించారు. ఆదివారం పట్టణంలోని యాదవ సంఘం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జార్ఖండ్ గవర్నన్‌ను కలిసి గిరిజనుల సమస్యలను విన్నవించి తిరిగి వెళ్తున్న సమయంలో మతోన్మాద గుండాలు ఆయనపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను, లౌకికవాదాన్ని, వాక్స్వాతంత్య్రాన్ని ప్రభుత్వాలు అణగదొక్కేస్తున్నాయని, దేశవ్యాప్తంగా ఎందరో సామాజిక కార్యకర్తలపై దాడులు నిరంతరం చేయడం మతోన్మాద చర్యలను ప్రేరేపించడమేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రభుత్వాలకు ప్రజలకు తగిన రీతిగా బుద్ధి చెప్పే సమయం ఎంతో దూరం లేదని చెప్పారు. అగ్నివేష్‌పై జరిగిన దాడుల్లో పాల్గొన్న వారికి గుర్తించి శిక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. భవిషత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజారాంప్రకాష్, వేణుగోపాల్, బుచ్చన్న, యేసేపు, శ్రీనివాసులుగౌడ్, అగ్గిరాముడు, నారాయణ, శ్రీనివాసులు, పవన్, గోపి, బుచ్చన్న, శాంతన్న, స్వామి, సత్యనారాయణ పాల్గొన్నారు. -
నేడు కలెక్టరేట్ల ఎదుట టీజేఎస్ దీక్షలు
కాజీపేట అర్బన్/భూపాలపల్లి రూరల్: భూములపై రైతుల హక్కు కోసం రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ఎదుట సోమవారం రైతు దీక్షలు చేపట్టనున్నట్లు తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫె సర్ కోదండరాం తెలిపారు. హన్మకొండలో ఆదివారం ఆయన టీజేఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనతో అనేకమంది రైతులు భూమిపై హక్కులను కోల్పోయారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,11,241 రెవెన్యూ రికార్డుల్లో తప్పులు దొర్లాయని, ఫలితంగా జరిగిన ఐదుగురు రైతుల మరణానికి ప్రభుత్వం జవాబు చెప్పాలని ఆయన నిలదీశారు. వెంటనే ప్రభుత్వం రెవెన్యూ రికార్డులను సరిచేసి రైతులకు భూమిపై హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు. ఎల్కతుర్తి మండలంలో రెవెన్యూ అధికారులు చేసిన తప్పులను ప్రశ్నించినందుకు రైతుపై దాడి చేసి కేసులు బనాయించడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46 శాతం మంది రైతులకు పట్టాదారు పాసు బుక్కులు రాలేదని, వారికి పాస్‌బుక్కులు అందని పక్షంలో సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వస్తామని ఆయన హెచ్చరించారు. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయిందని కోదండరాం విమర్శించారు. భూపాలపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ భూపాలపల్లి జిల్లా సమావేశంలో మాట్లాడుతూ రైతుబంధు పథకం వల్ల భూస్వాములకే ప్రయోజనం చేకూరిందని, చిన్న, సన్నకారు రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు.