
ఖిలావరంగల్: స్వాతంత్య్ర, నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని అసువులు బాసిన పోరాట యోధులకు కులం, మతం రంగు పులమొద్దని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఓరుగల్లు ఉద్యమ కెరటం బత్తిని మొగిలయ్యగౌడ్ 72వ వర్ధంతి, శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఖిలావరంగల్ తూర్పుకోట హనుమాన్ జంక్షన్‌లో జరిగిన మొగిలయ్య కాంస్య విగ్రహం భూమి పూజకు ఆయన హాజరయ్యారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం సమరయోధులను విస్మరించడం బాధాకరమన్నారు. యోధుల కుటుం బాలను ప్రభుత్వం గుర్తించి వారికి సుముచిత స్థానం కల్పించాలన్నారు. మొగిలయ్య జ్ఞాపకార్థం ప్రభుత్వమే కమ్యూనిటీ హాల్ నిర్మించి దానికి మొగిలయ్య పేరు పెట్టాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ బత్తిని మొగిలయ్య కుటుంబంతో 32 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. ఆయన పేదలు, బడుగుల దాస్య విముక్తి కోసం పోరాటం చేసిన మహనీయుడన్నారు.