Telangana Jana Samithi
-
ఎమ్మెల్సీగా కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా నియమితులయ్యారు. ఆయనతో పాటు సియాసత్ ఉర్దూ దిన పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ మీర్ ఆమేర్ అలీఖాన్‌ను కూడా సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. గవర్నర్ కార్యాలయం గురువారం ఈ మేరకు ప్రకటన చేసింది. ప్రొఫెసర్ కోదండరాంను విద్యావేత్తల కోటాలో, ఆమేర్ అలీఖాన్‌ను జర్నలిస్టుల కోటాలో మండలి సభ్యులుగా ప్రభుత్వం సిఫారసు చేసింది. గత ప్రభుత్వం దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయగా..వారి రాజకీయ నేపథ్యం కారణంగా ఆ ప్రతిపాదనను తమిళిసై తిరస్కరించిన విషయం విదితమే. ప్రస్తుతం వీరి స్థానంలోనే కోదండరాం, మీర్ ఆమేర్ అలీ ఖాన్‌ను నియమించారు. పెద్దల సభకు ఉద్యమ సారథి కోదండరాం సార్‌గా సుపరిచితుడైన ముద్దసాని కోదండరాం స్వగ్రామం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నెన్నెల మండలం జోగాపూర్. 1955 సెప్టెంబర్ 5న ముద్దసాని వెంకటమ్మ, ఎం.జనార్దన్ రెడ్డి దంపతులకు జన్మించారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ , ఓయూలో పీజీ (పొలిటికల్ సైన్స్), జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ కోసం చేరగా.. 1981లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఉద్యోగం రావడంతో పీహెచ్డీ మధ్యలో ఆపేశారు. ఆదివాసీల సమస్యలపై దివంగత హక్కుల నేత బాలగోపాల్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావుతో కలిసి పని చేశారు. ఓయూలో ప్రొఫెసర్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన కోదండరాం..దివంగత ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సహా అనేక మంది ప్రముఖ తెలంగాణవాదులతోనూ కలిసి పనిచేశారు. ఉద్యమ సమయంలో రాజకీయ జేఏసీ చైర్మన్‌గా అన్ని పార్టీలను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏకం చేయడంలో క్రియాశీలంగా పని చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి బీఆర్ఎస్ విధానాలతో విభేదించారు. ప్రజాస్వామిక తెలంగాణ పేరిట 2018 మార్చి 31వ తేదీన తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేశారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ కాంగ్రెస్‌తో కలిసి పని చేసింది. అదే క్రమంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో జత కట్టారు. దీనితో పాటు ఉద్యమ నేపథ్యం, ప్రొఫెసర్‌గా ఆయన అందించిన సేవలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. జర్నలిజంలో విశేష కృషి జర్నలిజంలో విశేష సేవలందించిన ఆమేర్ అలీఖాన్ (సియాసత్ ఉర్దూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్ కుమారుడు) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీసీఏ, తరువాత సుల్తాన్–ఉల్–ఉలూమ్ కాలేజీ ఆఫ్ బిజినెస్ అడ్మిని్రస్టేషన్ నుంచి ఎంబీఏ చేశారు. ప్రస్తుతం సియాసత్‌లో న్యూస్ ఎడిటర్‌గా ఉన్న ఆయన..ప్రతిక కర్ణాటక రాష్ట్రానికి విస్తరించేందుకు విశేష కృషి చేశారు. పలు అంతర్జాతీయ ఈవెంట్లను కవర్ చేయడానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతిల వెంట విదేశీ పర్యటనలకు వెళ్లారు. మైనారిటీల్లో విద్య, నైపుణ్యాన్ని వృద్ధి చేయడానికి, నిరుద్యోగుల కోసం కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇప్పించేవారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సియాసత్ ప్రస్తుతం ఖతర్ దేశానికి కూడా విస్తరించింది. 1973 అక్టోబర్ 18న హైదరాబాద్‌లో జన్మించిన అమేర్ అలీ ఖాన్‌కు ఉర్దూతో పాటు ఇంగ్లి‹Ù, హిందీ, అరబిక్, తెలుగు భాషలు తెలుసు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. -
కోదండరాంకు కీలక పదవి.. కాంగ్రెస్‌లో చర్చ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి(టీజేఎస్) కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత కోదండరాం ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చి గెలుపులో భాగమయ్యారు. తాజాగా ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ సముచితమైన పదవిని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా.. కోదండరాంను రాజ్యసభకు పంపేందకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు ఈ అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ రెండో తేదీతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తి కానుంది. పదవీకాలం పూర్తి చేసుకుంటున్న వారిలో వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ దండరాంకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తారని కాంగ్రెస్ పార్టీలో చర్చ జోరందుకుంది. ఇది కూడా చదవండి: పొన్నాల వాట్సాప్ స్టేటస్‌పై ఎర్రబెల్లి ఫైర్ -
అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు కోదండరామ్ మద్దతు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోదండరాం మద్దతు తెలిపారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి తెలంగాణ జనసమితి పార్టీ సిద్ధమైంది. అంతేకాకుండా... విశాల ప్రయోజనాల దృష్టా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసమితి పోటీకి దూరంగా ఉండనుంది. కాగా నాంపల్లిలోని తెలంగాణ జన సమితి కార్యాలయానికి సోమవారం కాంగ్రెస్ నేతలు వెళ్లారు. ఆ పార్టీ అధినేత కోదండరాంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, కర్ణాటక మంత్రి జోసురాజు, తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాల్సిందిగా కోదండరాంను కోరారు. ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్ధుబాటు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీజేఎస్‌కు సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఇప్పటికి కలిసి పనిచేద్దామని ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కోదండరాం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. చదవండి: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కోదండరాం పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూచనల మేరకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాల్సిందిగా కోదండరామ్‌ను కోరేందుకు వచ్చినట్లు తెలిపారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరమని అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకెళతామని చెప్పారు. భవిష్యత్‌లో సమన్వయ కమిటీని నియమించుకుని ముందుకెళతామని, ప్రభుత్వంలో భాగస్వామి అయ్యేలా టీజేఎస్ కమిటీ ఉంటుందని తెలిపారు. ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తుందన్న రేవంత్ రెడ్డి.. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్‌కు కీలక స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. లక్ష్యం గొప్పది దాని కోసం కలిసి పని చేస్తామని, నియంతను గద్దె దించాలనేది ప్రధాన అజెండాగా తెలిపారు. లక్ష్యాన్ని ముద్దాడే వరకు అండగా ఉంటామని కోదండరాం హామీ ఇచ్చారని చెప్పారు. -
కేసీఆర్ ఒక్కరు పోరాడితేనే తెలంగాణ రాలేదు
హుజూరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరు పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, సకల జనులు కలసికట్టుగా పోరాడితేనే తెలంగాణ స్వప్నం సాకారమైందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ఎం.కోదండరాం అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో తెలంగాణ బచావో సభకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. మిలియన్ మార్చ్ స్ఫూర్తితోనే హైదరాబాద్‌లో æమార్చి 10న తెలంగాణ బచావో సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో వచ్చే సూచనల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న వారు, తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వారు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందో ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం తేటతెల్లం చేస్తోందని తెలిపారు. కుంభకోణంలో తమ వాటా కోసం ఓ కుటుంబం ప్రయత్నించిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడేందుకు ధరణి పోర్టల్ రూపొందించారని విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పింది ఏంటి? ఇప్పుడు చేసేదేంటి? అని కోదండరాం ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చినప్పుడే ఆ పార్టీ తెలంగాణలో ఉనికి కోల్పోయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముక్కర రాజు, పెద్దపల్లి జిల్లా కన్వీనర్ నర్సింగ్, ప్రధాన కార్యదర్శి స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
Munugode Politics: కోదండరాంను కలిసిన కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంని కలిసి మునుగోడులో మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని కోదండరాం అన్నారు. పార్టీలో నేతలకు ట్రైనింగ్ క్లాసులు కూడా ఉన్నాయని తెలిపారు. మేము కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం. కాబట్టి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోదండరాం చెప్పారు. కాగా, అంతకుముందు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మల్లు రవి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కోదండరాంను కలిశారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికపై చర్చిస్తూ.. ఎప్పుడు ఎన్నిక వచ్చినా టీజేఎస్ మద్దతు ఇవ్వాలని కోరారు. చదవండి: (Munugode Politics: ఆ పార్టీ సరేనంటే.. కమ్యూనిస్టులు అటువైపే..!) -
కోదండరామ్‌కు అరవింద్ కేజ్రీవాల్ ఆఫర్! ఆ పార్టీ విలీనం తప్పదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనసమితి పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తారని వస్తున్న వార్తలకు బలం చేకూర్చేలా శనివారం ఓ రహస్య సమావేశం జరిగింది. ఇబ్రహీంపట్నం పరిధిలోని రావిరాల ఫామ్‌హౌస్‌లో టీజేఎస్ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి కోదండరామ్‌తో పాటు, పార్టీ ముఖ్యనేతలంతా హాజరవడం జరిగింది. గతంలోనే రెండు ప్రముఖ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో.. టీజేఎస్‌ను విలీనం చేయాలని చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేయాలని ప్రతిపాదనలు రావడంతో ఈ విషయంపై పార్టీ నేతలతో కోదండరాం చర్చిస్తున్నారు. ఈ భేటీలో ఎక్కువ మంది నేతలు ఆమ్ ఆద్మీలో విలీనానికే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.. అయితే టీజేఎస్ అధినేత కోదండరాం మాత్రం ఎన్నికలు సమీపిస్తున్నందున అప్పటి దాకా వేచి చూసే ధోరణిలో ఉండాలని నాయకులకు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలంగాణపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమ్ ఆద్మీకి చెందిన కీలక నేత టీజేఎస్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒకటి రెండు రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా హైదరాబాద్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. చదవండి: (కేసీఆర్ 3 గంటలే నిద్రపోతున్నారు) -
Huzurabad Bypoll 2021: వామపక్షాల దారెటు?
సాక్షి, హైదరాబాద్: మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పారీ్టల వైఖరి ఇంకా స్పష్టం కావడం లేదు. నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ముగిసి బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిన నేపథ్యంలో మిగిలిన రాజకీయ పక్షాలు ఎవరికి మద్దతుగా నిలుస్తాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రధాన వామపక్షాలుగా గుర్తింపు పొందిన సీపీఎం, సీపీఐతో పాటు తెలంగాణ జనసమితి (టీజేఎస్) సహకారం ఏ అభ్యర్థికి లభిస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆయా పార్టీలకు నియోజకవర్గంలో ఎంత బలం ఉంది.. ఎన్ని ఓట్లు ఉన్నాయన్న దాంతో సంబంధం లేకున్నా ఇతర పారీ్టల మద్దతు పోటీలో ఉన్న అభ్యర్థికి నైతికంగా బలం చేకూర్చనుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు పారీ్టలు ఎవరికి మద్దతు ప్రకటిస్తాయో అని రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కుల సంఘాల మద్దతు కోసం.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే సీపీఐ, టీజేఎస్.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పక్షాన వచ్చిన అభ్యర్థనను ఆయా పార్టీలు పరిశీలిస్తున్నాయి. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలా.. లేదా.. అన్న దానిపై పారీ్టలో చర్చించి వెల్లడిస్తామని సీపీఐ, టీజేఎస్ నేతలు చాడా వెంకట్‌రెడ్డి, కోదండరాం గతంలో వెల్లడించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు, రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరవుతున్న ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించవచ్చనే చర్చ సాగుతోంది. అయితే, సీపీఎం కూడా ప్రతిపక్ష ఆందోళనలు, సమావేశాలకు వస్తున్నా బహిరంగంగా కాంగ్రెస్‌కు మద్దతిస్తుందా.. లేదా.. అన్న సందేహం వ్యక్తమవుతోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన సీపీఎం ఇప్పుడు మాత్రం బీజేపీని ఓడించాలని చెబుతోంది. ఇటీవల జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాల్లో కూడా ఇదే తీర్మానం చేశారు. కానీ, అధికారికంగా ఏ పార్టీకీ మద్దతు ప్రకటించలేదు. బీజేపీని ఓడించాలని ఇచ్చే పిలుపును ఆ పార్టీ శ్రేణులు ఎలా అర్థం చేసుకుంటాయి.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఏ అభ్యర్థి పక్షాన నిలుస్తారన్నది కామ్రేడ్లకే తెలియాలని రాజకీయ వర్గాలంటున్నాయి. మరోవైపు ప్రధాన కుల సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల మద్దతు కూడగట్టేందుకు కూడా ప్రధాన రాజకీయ పక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వీలున్నంత ఎక్కువ సంఘాల మద్దతు తీసుకోవడం ద్వారా ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు శతవిధాలా ప్రయతి్నస్తుండడం గమనార్హం. -
ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన టీజేఎస్ నాయకులు
-
ప్రజాస్వామిక తెలంగాణ కోసం మరో ఉద్యమం
నాంపల్లి: ప్రజాస్వామిక తెలంగాణ కోసం మళ్లీ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన 42 రోజుల సకల జనుల సమ్మె జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివా రం అమరవీరుల స్థూపం గన్‌పార్కు వద్ద మలిదశ తెలంగాణ ఉద్యమకారులు నివాళులర్పించారు. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో జరిగిన ఈ సభకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ నేతలు అశోక్, స్వామిగౌడ్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌తో పాటు పలు సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. సకల జనుల సమ్మె జరిగిన రోజు సందర్భంగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా రాకపోవడం బాధాకరం అన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికి అందాలంటే ఏ తెలంగాణ కోసమైతే కొట్లాడామో ఆ తెలంగాణ కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయం అసన్నమైందని, అం దుకు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. -
టీజేఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు : కోదండరామ్
-
హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తాం: కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆగస్టు నెల చివరిలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ను నమ్మే ప్రసక్తే లేదన్నారు. లక్ష ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో చెప్పాలని కోదండరామ్ ప్రశ్నించారు. -
TJS ను ఏ పార్టీలోనూ విలీనం చెయ్యట్లేదు : ప్రొ : కోదండరాం
-
తెలంగాణ జనసమితిని ఏ పార్టీలోనూ విలీనం చేయట్లేదు: ప్రొ.కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనసమితిని ఏ పార్టీలోనూ విలీనం చేయట్లేదని ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూముల సమస్యలను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. -
దుబ్బాక: కనుమరుగైన టీడీపీ
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గంలో గతంలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ నేడు కనుమరుగైంది. మాజీ మంత్రి ముత్యంరెడ్డి ఆ పార్టీని వీడిన తర్వాత దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేసేవారు సైతం కరువయ్యారు. గతంలో పొత్తుల కారణంగా ఇతర పార్టీలకు టికెట్ కేటాయించినా ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలో పోటీలో దింపేందుకు టీడీపీకి అభ్యర్థి కూడా లేకుండా పోయారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఎం, టీజేఎస్ కూడా ఈ ఎన్నికల్లో పోటీలో లేకపోవడం గమనార్హం. జిల్లాలో తెలుగు దేశం పార్టీ కనీస ఉనికి కూడా లేకుండా పోయింది. పార్టీ ఆవిర్భావం తర్వాత 1985లో డి.రామచంద్రారెడ్డి అప్పటి దొమ్మాట నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తర్వాత 1989, 1994, 1999 వరకు వరుసగా మూడు సార్లు మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి గెలిచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో ఎమ్మెల్యేలు రాజీనామాతో జరిగిన 2008 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ముత్యంరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. వరుసగా రెండు సార్లు ఓటమి చవిచూసిన ముత్యంరెడ్డి 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభంజనంలో దుబ్బాక నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. ఇంతటి చరిత్ర ఉన్న టీడీపీకి ప్రస్తుతం జరుగుతున్న ఉపఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేని దుస్థితికి చేరుకుంది. టీజేఎస్, సీపీఎం కూడా దూరమే గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు, ఎత్తులతో దుబ్బాక టికెట్ కైవసం చేసుకున్న తెలంగాణ జన సమితి, అప్పుడు పోటీలో ఉన్న సీపీఎం ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ పొత్తులో భాగంగా దుబ్బాక అసెంబ్లీ టికెట్ టీజేఎస్‌కు దక్కింది. దీంతో మనస్తాపానికి గురైన ముత్యంరెడ్డి ఎన్నికల ముందు తమ అనుచరులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా పొత్తుల్లో భాగంగా టీజేఎస్ నుంచి చిన్నం రాజ్‌కుమార్ పోటీలో నిలిచినా.. అనూహ్య పరిణామాల నేపథ్యంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ బీ ఫాంతో మద్దుల నాగేశ్వర్‌రెడ్డి పోటీలో నిలిచారు. దీంతో పొత్తుల్లో టికెట్ తెచ్చుకున్న టీజేఎస్ అభ్యర్థి కన్నా.. బీజేపీ అభ్యర్థి కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న నాగేశ్వర్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. అయితే కాంగ్రెస్ నుంచి పోటీచేసిన నాగేశ్వర్‌రెడ్డి, టీజేఎస్ నుంచి పోటీ చేసిన చిన్నం రాజ్‌కుమార్‌లు టీఆర్ఎస్లో చేరగా.. అప్పుడు టీఆర్ఎస్ తరుఫున ప్రచారం చేసిన ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. -
కోదండరాం పోటీపై టీజేఎస్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ప్రొఫెసర్ కోదండరాం పోటీపై క్లారిటీ వచ్చింది. నల్లగొండ - వరంగల్ -ఖమ్మం అభ్యర్థిగా ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేస్తున్నారని తెలంగాణ జనసమితి (టీజేఎస్) వెల్లడించింది. ఈమేరకు పార్టీ ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇక సార్ పోటీపై స్పష్టత వచ్చినప్పటికీ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. పట్టభద్రుల ఎన్నికలను నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందనే వార్తలు వెలువడ్డాయి. (చదవండి: దుబ్బాక ఎన్నిక : టీఆర్ఎస్కు ఝలక్) అయితే, జిల్లా స్థాయి నేతలు మాత్రం పార్టీ కోసం పనిచేసినవారిలో నుంచి బలమైన వ్యక్తిని ఎన్నికల్లో పోటీకి దింపాలను టీపీసీసీ అగ్రనేతలకు సూచించారు. మరోవైపు ‘వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కోదండరామ్‌కి మద్దతుపై కోర్ కమిటిలో చర్చించాం. దాని సూచన మేరకు తుది నిర్ణయం ఉంటుంది’ అని తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి వరంగల్ నుంచి ఆరుగురు పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు వారంతా టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. (చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓరుగల్లులో పోటాపోటీ ప్రయత్నం) -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరుగునున్న పట్టభద్రల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు, ప్రోఫెసర్ కోదండరాం పోటీచేయనున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొ.కోదండ రామ్‌కు నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా మద్దతునివ్వాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) ప్రతిపక్ష పార్టీలను కోరింది. ఈ మేరకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలకు టీజేఎస్ లేఖలు పంపింది. కోదండరామ్ గెలుపు అవసరమని నిరుద్యోగులు, యువత ఆశిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితులపై మండలిలో గొంతెత్తే నాయకుడిని గెలిపించాలని టీజేఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ బాధ్యులు జి.వెంకట్‌రెడ్డి, ధర్మార్జున్, బైరి రమేశ్, శ్రీశైల్‌రెడ్డి కోరారు. మరోవైపు రెండు స్థానాలకు జరిగే ఈ ఎన్నికలను ప్రతిపక్షాలతో పాటు అధికార టీఆర్ఎస్ సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. -
తెలంగాణ: అటు కేబినెట్ భేటీ, ఇటు దీక్షలు
సాక్షి, హైదరాబాద్ : పంటల సేకరణ, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా రైతు సంక్షేమ దీక్ష చేపట్టనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేపడతామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అన్ని జిల్లాల డీసీసీ కార్యాలయాల్లో దీక్షలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. దీక్ష సమయంలో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. కాగా, కరోనా వైరస్ కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దృష్టికి తీసుకెళ్లింది. నేడు టీజేఎస్ మౌన దీక్ష రాష్ట్రంలో కరోనా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆకలి, రైతు, వలస కూలీల అవస్థల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా మంగళవారం టీజేఎస్ ఆధ్వర్యంలో మౌన నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జి.వెంకట్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ కార్యాలయంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఈ దీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి, రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టేలా చూడాలని అఖిలపక్ష నాయకులు సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. (కరోనా పరీక్షలు.. మరణాల లెక్కలు తేల్చండి) కేబినెట్ భేటీపై ఆసక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో సమావేశం కానుంది. మద్యం దుకాణాల పునరుద్ధరణ, లాక్డౌన్ సడలింపులపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. (తెలంగాణలో మద్యానికి ఓకే!) -
సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కట్టడికి, రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టేలా చూడాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అఖిలపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర నాయకురాలు పశ్య పద్మ రాజ్‌భవన్‌లో సోమవారం గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు లాక్‌డౌన్‌తో పాటు వైద్య వ్యవస్థను బలోపేతం చేయడానికి లాక్డౌన్ కాలాన్ని ఉపయోగించేలా చూడాలని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేదలకు ఇచ్చే సహాయాన్ని పెంచాలని కోరారు. ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంచేందుకు మరింత పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా ఉందని, గోనె సంచులు లేక, ట్రాన్స్‌పోర్టు అందక, హమాలీలు దొరక్క కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని, దాని నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. అఖిలపక్ష నాయకులు లేవనెత్తిన ఈ సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలని ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ పేర్కొన్నారు. నేడు టీజేఎస్ మౌన దీక్ష రాష్ట్రంలో కరోనా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆకలి, రైతు, వలస కూలీల అవస్థల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈనెల 5న టీజేఎస్ ఆ«ధ్వర్యంలో మౌన నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జి.వెంకట్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ కార్యాలయంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఈ దీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
ఒక్క వార్డుకే టీజే‘ఎస్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ఏర్పాటైన తెలంగాణ జన సమితి (టీజేఎస్) మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటివరకు జరిగిన జిల్లా పరిషత్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించని ఆ పార్టీ తాజాగా జరిగిన మున్సి‘పోల్స్’లోనూ పెద్దగా సీట్లు గెలుచుకోలేకపోయింది. తాండూరు మున్సిపాలిటీలో ఒకే ఒక్క వార్డును టీజేఎస్ గెలుచుకుంది. అక్కడి 34వ వార్డు నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి సోమశేఖర్ గెలుపొందారు. -
లేఅవుట్ల అనుమతులకు సింగిల్ విండో వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: అవినీతి నియంత్రణలో భాగంగా పారదర్శక పాలనకు ఇళ్లు, లేఅవుట్ల అనుమతుల కోసం పటిష్ట సింగిల్ విండో వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలంగాణ జనసమితి (టీజేఎస్) తన మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీనిచ్చింది. ఈ ఎన్నికల ప్రణాళికలో అవినీతిరహిత ఆదర్శ మున్సిపాలిటీల కోసం పౌరసంఘాలతో నిఘా వ్యవస్థ (అంబుడ్స్‌మన్) ఏర్పాటు, రాజకీయ, అధికార యంత్రాంగం పనితీరుపై అన్ని కార్యాలయాల్లో పనితీరు పట్టిక, వారానికోసారి ‘ఇంటింటికీ కౌన్సిలర్’కార్యక్రమం, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణల తొలగింపు, ఉల్లం ఘనులపై చర్యలు, టీజేఎస్ కౌన్సిలర్లు ఆక్రమణలు, అవినీతికి పాల్పడిన పక్షంలో పార్టీ నుంచి సస్పెన్షన్ తదితర అంశాలను పొందుపరిచింది. శనివారం పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కోదండరాం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు గెలిస్తే సంపాదనే లక్ష్యంగా ఉంటారని, రాష్ట్ర ఖజానా ఖాళీ అయినందున ప్రభుత్వం నిధులివ్వదని, మున్సిపాలిటీలను పనిచేయనివ్వరని, అక్రమార్జనకు మున్సిపాలిటీలను వాడుకుంటారని ఆరోపించారు. మేనిఫెస్టోలోని ఇతర ముఖ్యాంశాలు... కాలుష్యరహిత పట్టణాల కోసం పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం రక్షిత మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు మురుగునీటి నిర్వహణ అమలు ద్వారా ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారణ పట్టణాల్లో సులభ్ తరహాలో మరుగుదొడ్లు, మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు మున్సిపల్ స్కూళ్ల సమర్థ నిర్వహణ నిధులు, విధులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో పౌర సంఘాలకు పాత్ర నాణ్యమైన సత్వరమైన వైద్య సదుపాయాలతో బస్తీ క్లినిక్‌ల ఏర్పాటు పట్టణ పేదలకు గృహ వసతి, మురికి వాడలకు కనీస వసతులు -
ఆర్థిక అంశాలపైనే రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆర్థిక అంశాలపైనే భవిష్యత్తు రాజకీయాలు కొనసాగుతాయని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో వర్తమాన ఆర్థిక పరిస్థితి – మూల్యాంకనంపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. కోదండరాం మాట్లాడుతూ.. ఆర్థిక పరిణామాలు ఎటుపోతాయనేది రాజకీయ పార్టీలు చర్చించాలన్నారు. రాజకీయ రంగమే ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపుతుందని, అంతిమంగా ఆర్థిక వనరులను సరిగ్గా వినియోగించగలిగేది రాజకీయాలేనన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆర్థిక అంశాలపై అవగాహన పెం పొందించుకోవాలన్నారు. జీఎస్టీ ప్రవేశపెట్టడం, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం కూడా కారణమేనని ప్రొఫెసర్ నరసింహారెడ్డి అన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలు ప్రోత్స హించేందుకు కేంద్రం చర్యలు చేపట్టడంతో వాహ నాలు కొనుగోలు చేయాలనుకునే వారు ఎలక్ట్రికల్ వాహనాలు వస్తాయని వాటిని కొనడం మానేశారని ఎకనామిక్స్ ప్రొఫెసర్ అంజిరెడ్డి అన్నారు. -
‘విధ్వంసపు పునాదులపైనే విశ్వాసాన్ని కూడగట్టాలి’
సాక్షి, హైదరాబాద్ : దేశంలో అన్ని వ్యవస్థల విధ్వంసం జరుగుతోంది.. ఆ పునాదులపైనే విశ్వాసాన్ని కూడగట్టాలని స్వరాజ్ అభియాన్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ వేదికగా శనివారం జరిగిన తెలంగాణ జనసమితి పార్టీ తొలి ప్లీనరీకి యోగేంద్ర యాదవ్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కేశవరావు జాదవ్ గుర్తుకొస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గూర్చి ప్రొఫెసర్ జయశంకర్ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సమస్యలపై మాట్లాడటానికి తనను హరియాణా నుంచి పిలిచారన్నారు. ఇది రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఇదే నిజమైన జాతీయవాదమని.. కోదండరాం కంటే పెద్ద జాతీయవాది తనకు కపడలేదన్నారు యోగేంద్ర యాదవ్. ప్రస్తుతం దేశ ప్రజలంతా నిరాశలో ఉన్నారని.. ప్రజాస్వామ్యంలో అంధకారం నెలకొందని యోగేంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నరేంద్ర మోదీ.. తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు నియంతల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా బీజేపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రతి ఒక్కరు తమ కల్చర్‌ను నిలబెట్టుకుంటూ.. బీజేపీ మోనో కల్చర్‌కు వ్యతిరేకంగా పోరాడలని పిలుపునిచ్చారు. అన్ని సిద్థాంతాల్లో ఉన్న మంచిని గ్రహించి ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే సిద్ధాంతాన్ని తయారు చేయాలని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్ర పొరాటంలో పాల్గొనని ఆర్ఎస్ఎస్ ఈ రోజు దేశభక్తి గల సంఘంగా మభ్యపెడుతోందని మండి పడ్డారు. -
నిరంకుశ పాలనపై ప్రజా తీర్పు
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: ఇష్టానుసారంగా.. తాము ఏం చేసినా.. ప్రజలు ఆమోదిస్తారన్న పాలకుల నిరంకుశ వైఖరిపై ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటుతో తీర్పునిచ్చారని, ప్రజా ఉద్యమాలను అణచాలని చూస్తే ఎంతటి వారికైనా పతనం తప్పదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ, ఈ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మూల స్తంభాలైన కరీంనగర్, నిజామాబాద్ నేతలు ఓడిపోయారన్నారు. ఈ ప్రభుత్వం గెలిచాక నిరుద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయని, ప్రజా ఉద్యమాలను అణచాలని ప్రభుత్వం చూడడంతో నాలుగు నెలలకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు. మంత్రివర్గ ఏర్పాటులో ఆలస్యం, పాలన లేకపోవడం, ఏ విషయాన్ని అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ప్రజలపై నిర్లక్ష్య ధోరణితో టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో రైతులు సంఘటిత శక్తిగా నిలబడి జాతీయస్థాయికి రైతాంగ సమస్యలను తీసుకెళ్లారని తెలిపారు. త్వరలోనే తెలంగాణ జనసమితి అటవీ భూముల హక్కుపై పోరాటాన్ని ఉధృతం చేస్తుందన్నారు. ప్రజలు మాత్రం గట్టిగా నిలబడి ప్రభుత్వానికి బుద్ధి చెప్పారన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు వెంకట్‌రెడ్డి, కుంట్ల ధర్మార్జున్, గట్ల రమాశంకర్ తదితరులు ఉన్నారు. -
కోదండరాం అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని సోమ వారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన కొద్దిసేపటికే అధ్యక్షుడు ప్రొ.కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేసి రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇంటర్ ఫలితాల గందరగోళానికి బాధ్యులపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకో వాలని, బాధిత విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇంటర్‌బోర్డు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ, టీడీపీ పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల ముఖ్య నేతల గృహనిర్బంధం, విద్యార్థి, ప్రజాసంఘాల వారిని ఎక్కడికక్కడే అరెస్ట్‌లు, ఇంటర్ బోర్డు వద్ద నిరసనలకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు పోలీసు స్టేష న్లకు తరలించారు. తార్నాకలోని నివాసంలో కోదండరాంను ఉదయం నుంచి గృహ నిర్బంధంలోనే ఉంచడంతో టీజేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంటి ఆవరణలోనే పార్టీ జెండాను ఆయన ఎగురవేశారు. పోరాటాలతోనే జన సమితి ఆవిర్భవించిందని, పార్టీ తొలి ఆవిర్భావ దినోత్సవం కూడా నిర్బంధాల మధ్య జరుపుకోవాల్సి వచ్చిందని కోదండరాం పేర్కొన్నారు. భూరికార్డుల ప్రక్షాళన కోసం టీజేఎస్ పోరాటాలు చేసిందని, ప్రజల భావవ్యక్తీకరణకు అనుగుణంగా పార్టీ ప్రయాణం సాగుతోందన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరే వరకు పోరాటాలు చేస్తామన్నారు. టీజేఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లిలోని కార్యాల యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం గురించి తెలియజేయడంతో అక్కడకు వెళ్లేందుకు కోదండరాంను పోలీసులు అనుమతించారు. అక్కడ ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన్ను, ఇతర నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం సాయంత్రం కోదండరాంను, ఇతర పార్టీల నేతలను రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్ నుంచి విడుదల చేశారు. బాధితులకు న్యాయమేదీ... ఇంటర్ ఫలితాల విషయంలో తప్పు జరిగిందని అం గీకరించాక, సమస్య పరిష్కారానికి చర్యలతోపాటు బాధితులకు న్యాయం చేసేందుకు కార్యాచరణను ప్రకటించాల్సిన ప్రభుత్వం అటువంటిదేమీ చేయలేదని కోదండరాం విమర్శించారు. విడుదలయ్యాక ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఫలితాల గందరగోళానికి కారణమైన కంపెనీకి సామర్థ్యం లేకపో యినా బాధ్యతలు అప్పగించిన కార్యదర్శిపై చర్యలు తీసుకోకపోవడం, విద్యార్థుల పరీక్షాపత్రాల మూ ల్యాంకనంపై సమీక్ష నిర్వహించపోవడం, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు నష్టపరిహారంపై కార్యాచరణను ప్రకటించకపోవడం ప్రభుత్వ తప్పిదమన్నారు. దీనిపై శాంతియుతంగా, చట్టబద్ధంగా నిరసనలు తెలిపేందుకు ప్రయత్నించిన రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులను ఆదివారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు చేయడం అక్రమమన్నారు. అక్రమ నిర్బంధాన్ని ప్రయోగించి ఇదే తమ నిర్ణయం అని పోలీసుల ద్వారా ప్రభుత్వం ప్రకటించినట్లు అయిందని ఆయన పేర్కొన్నారు. -
రాజకీయాల్లో కొత్త పంథా.. ఆవిష్కరించాం
సాక్షి, హైదరాబాద్: ‘రాజకీయాల్లో కొత్త పంథాను ఆవిష్కరించాలనే మా ప్రయత్నం విజయవంతం అయిందనే భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా పింఛన్లు, రైతుబంధు పెంపు, నిరుద్యోగ భృతి లాంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చేలా అధికార పార్టీపై ఒత్తిడి తేవడంలో సఫలీకృతమయ్యాం. ఉద్యమ ఆకాంక్షలు, వెలుగుల ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం. ఏడాది కాలంలో రాజకీయంగా ఎంతో నేర్చుకున్నాం. గుణపాఠాల నుంచి వచ్చిన అనుభవాలు మమ్మల్ని మరింత రాటుదేలుస్తున్నాయి. ప్రజలపక్షాన నిలబడేందుకు బలంగా ముందుకెళ్లే తోవ చూపెడుతున్నాయి’అని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆ పార్టీ అధినేత ఎం. కోదండరాం తెలిపారు. టీజేఎస్ ఏర్పాటైన నాలుగు నెలలకే వచ్చిన అసెంబ్లీ ఎన్నికలను దీటుగా ఎదుర్కోలేకపోయామన్నారు. అయితే ఓ రాజకీయ పార్టీగా ఎన్నికల్లో ఎలా పాల్గొనాలో నేర్చుకున్నామని, జూన్‌లో జరిగే ప్లీనరీలో గత కార్యక్రమాలను సమీక్షించుకొని కొత్త ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్తామని చెప్పారు. టీజేఎస్ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కోదండరాం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. పార్టీ ప్రస్థానంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవహార శైలి, అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి వైఫల్యం, రాజకీయాల్లోకి మధ్యతరగతి, యువత రావాల్సిన ఆవశ్యకత లాంటి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... కొత్తవారు రాజకీయాల్లో చేరాలి... రాజకీయాలు అనగానే భయపడాల్సిన అవసరం లేదు. మధ్యతరగతికి చెందిన వారు, డిగ్రీలు, పీజీలు లేకుండానే సమాజంలో తమ పద్ధతిలో కార్యక్రమాలు చేపడుతున్న వారు రాజకీయాల్లోకి రావాలి. తమకు జరుగుతున్న అన్యాయంపై 125 మంది నిజామాబాద్ జిల్లా రైతులు లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్లు వేయడం, మహబూబాబాద్ జిల్లాలో ఆదివాసీలు అటవీ హక్కుల చట్టంపై కదలడం దేశ చరిత్రలోనే అపూర్వమైన ఘటనలు. సమస్య ప్రాతిపదికగా కదిలితే ఎన్నికల్లో, రాజకీయాల్లో పైసలు కీలకం కాదని, ప్రత్యామ్నాయ రాజకీయం సాధ్యమని నిరూపించారు. అన్యాయాలను ఎలుగెత్తి చూపాం... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష చాలా బలీయమైనది. సామాజిక, ఆర్థిక దోపిడీలకు వ్యతిరేకంగా నిలబడ్డ తెలంగాణ సమాజం సాధించుకున్న రాష్ట్రంలో రాజకీయంగా మా వంతు పాలుపంచుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీని ఏర్పాటు చేశాం. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా కుంగిపోలేదు. తెలంగాణ సమాజం కోరుకున్న రాష్ట్రాన్ని సాధించాలనే తపనతోనే పార్టీని ఏర్పాటు చేశాం. అందులో భాగంగా చాలా ప్రజాసమస్యలను ఎజెండాపైకి తీసుకువచ్చాం. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఓ మార్గాన్ని నిర్మించగలిగాం. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చూపగలిగాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి వైఫల్యం మాకో గుణపాఠం లాంటిది. భవిష్యత్తులో కూడా ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలపైనే దృష్టి సారించి ముందుకెళ్తాం. ఆ పార్టీల స్ఫూర్తితో ముందుకు... ప్రజల ఆకాంక్షలకు రాజకీయ దృక్పథం ఇవ్వడం మా బాధ్యత. దాన్ని రాజకీయ పార్టీగా నిర్వర్తించడం పెద్ద సవాలే. రాజకీయమంటే డబ్బు వెదజల్లి మళ్లీ డబ్బు దండుకోవడమే అనే స్వభావంలో కూడా మార్పు రావాలి. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా నైతిక ఆచరణను ఎంచుకొని నిలబడే వాళ్లు తక్కువగానే కనిపిస్తున్నారు. అయినా టీజేఎస్ నైతికత, విలువలతో కూడిన రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ఎలాంటి అండదండలు లేకుండానే పెద్ద రాజకీయ శక్తిగా అవతరించిన ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీల స్ఫూర్తితో ముందుకెళ్తాం. ఆయన మాట ఎప్పటికీ గుర్తుంటుంది... రాష్ట్రం ఏర్పడ్డాక దాని నిర్మాణం ప్రజాస్వామ్య స్వరూపం సంతరించుకునేలా చేయడం చాలా కష్టం. దాని కోసం సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉంటుందని ఆచార్య జయశంకర్ చెప్పిన మాట ఎప్పటికీ గుర్తుంటుంది. ఆయన ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో గెలిచాక కూడా బలాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో అధికార పార్టీ ముందుకెళ్తోంది. రాష్ట్రంలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి ప్రభుత్వంలో కనిపిస్తోంది. అయితే సంక్షేమ పథకాల అమలే కాకుండా ప్రజాస్వామికంగా వ్యవహరించడం ప్రభుత్వ బాధ్యత. దీన్ని మర్చిపోయి వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరు. ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ప్రజలకుండాలి. ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా వ్యవహరించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. నేడు టీజేఎస్ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆవిర్భావ దినోత్సవం సం దర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు అధ్యక్షుడు కోదండరాం పార్టీ జెండాను ఎగురవేస్తారు. కార్యక్రమాల్లో ఆయనతోపాటు ఇతర నేతలు హాజరవుతారని టీజేఎస్ అధికార ప్రతినిధి, మీడియా కోఆర్డినేటర్ వి.యోగేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్య సంక్షోభం, విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యార్థుల పోరాటాలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ ఉత్సవాలను భారీగా నిర్వహించకుండా స్థానికంగా ఎక్కడికక్కడ పార్టీ జెండాలు ఎగురవేయాలని పార్టీకేడర్‌కు ఇదివరకే కోదండరాం విజ్ఞప్తిచేసిన విషయం తెలిసిందే. -
ఆవిర్భావ ఉత్సవాలు భారీగా వద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనసమితి (టీజేఎస్) ఆవిర్భావ ఉత్సవాలను భారీగా నిర్వహించకుండా స్థానికంగా ఎక్కడికక్కడ పార్టీ జెండాలు ఎగురవేయాలని నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం విజ్ఞప్తి చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌లో రాష్ట్రస్థాయిలో భారీ ప్లీనరీ నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ ఆవిర్భవించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 29న ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించినా.. రాష్ట్రంలో ఇంటర్ విద్య సంక్షోభం, విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యార్థుల పోరాటాలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాటిని భారీగా నిర్వహించవద్దని కోరారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోగా రాష్ట్రాన్ని ఒక కుటుంబం గుత్తసొత్తుగా మార్చుకున్న నేపథ్యంలో ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చేందుకు టీజేఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఈ ఏడాది కాలంలో ప్రజా సమస్యలపై, ప్రధానంగా రైతాంగ సమస్యలపై టీజేఎస్ నిర్వహించిన పోరాటాలతో ప్రజలకు పార్టీ పట్ల నమ్మకం, విశ్వాసం పెరిగాయని కోదండరాం పేర్కొన్నారు. ఈ నెల 29న అఖిలపక్షం పిలుపు మేరకు ఇంటర్ బోర్డు ఎదుట నిర్వహించనున్న ధర్నాలో సంఘీభావం తెలియజేయాలని టీజేఎస్ అధికార ప్రతినిధి, మీడియా రాష్ట్ర కో ఆర్డినేటర్ వెదిరె యోగేశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. కిషన్‌రెడ్డికి టీజేఎస్ నేతల పరామర్శ... బీజేపీ నేత కిషన్‌రెడ్డిని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఇతర నాయకులు పరామర్శించారు. శనివారం రంగారెడ్డి జిల్లాలోని కిషన్‌రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్‌లో ఆయనను కలిసి తమ సంతాపాన్ని తెలియచేశారు. -
చదువుకుంటే చనిపోవాల్సి వస్తోంది..
హైదరాబాద్(పంజగుట్ట): ఈ నెల 29న ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాలని తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజమే ఈ ధర్నాకు పిలుపునిచ్చిందని భావించి విద్యార్థి సంఘాలు, అన్ని పార్టీల నాయకులు హాజరు కావాలని కోరారు. ఇంటర్ పరీక్షాఫలితాల్లో 61 వేల తప్పిదాలు వచ్చాయని, దీనికి అనుభవంలేని గ్లోబరీనా సంస్థే కారణమని అన్నారు. ‘చదువుకుంటే బాగుపడతారని అనుకుంటాం, కానీ చదువుకుంటే చనిపోతాం’అని ఇప్పుడే తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి జనసమితి అధ్యక్షుడు నిజ్జన రమేశ్ ముదిరాజ్ అధ్యక్షతన శుక్రవారం ఇక్కడి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘ఇంటర్ ఫలితాలు... దోషులు ఎవరు? పరిష్కారం ఏది?’అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్, టీజేఎస్ నేత ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్రావుతోపాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హాజరయ్యారు. అన్ని సంఘాలను, పార్టీలను ఏకం చేసి ఉద్యమించే బాధ్యతను కోదండరాంకు అప్పగించాలని, ఇంటర్ ఫలితాల అంశంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని సమావేశం తీర్మానించింది. కోదండరాం మాట్లాడుతూ గతంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎంతో బాధ్యతగా పనిచేసిందని, దాన్ని కాదని గ్లోబరీనా అనే ప్రైవేట్ సంస్థకు ఇంటర్ పరీక్షల బాధ్యత అప్పగించినప్పటి నుండీ ఎన్నో సమస్యలు వచ్చాయన్నారు. పరీక్ష ఫీజు చెల్లించే సమయంలోనూ తీవ్ర గందరగోళం జరిగిందని, అప్పుడే ఇంటర్ బోర్డు మేల్కొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. సంస్థ వెనక ఎవరో ఉన్నారని, వారి స్వార్థ ప్రయోజనాల కోసం పిల్లల జీవితాలతో ఆడుకున్నారని, లక్షలాదిమంది పిల్లల ప్రాణాలను పణంగా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థ చేస్తున్న తప్పుల గురించి ముందే తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాళ్లు ఏదైనా తప్పులు జరిగితే తమకు సంబంధంలేదని, వారి సంఘం తరపున తీర్మానం చేసి బోర్డు సెక్రటరీకి ఇచ్చారని, అయినా ప్రభుత్వంలో ఉలుకూపలుకూ లేదని దుయ్యబట్టారు. సమాజానికి పిల్లర్ల వంటి పిల్లలకు అన్యాయం జరుగుతుంటే ఆవేదనగా ఉందన్నారు. గ్లోబరీనాకు పర్చేస్ ఆర్డరే ఉంది.. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ ‘గ్లోబరీనా, రాష్ట్ర ప్రభుత్వం ఐక్యంగా పనిచేస్తున్నాయి. కానీ మనమే సంఘాలుగా విడిపోయి నిరసనలు చేస్తున్నాం, ఇప్పటికైనా అందరం ఐక్యమై ఉద్యమించాలి’అని అన్నారు. ‘ఇంత జరుగుతున్నా ఏం జరగలేదు, అన్ని అపోహలు, రాజకీయం చేస్తున్నారని అంటున్నారు, ఏం జరగకపోతే ఇన్ని ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి?, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి’అని ప్రశ్నించారు. గ్లోబరీనా సంస్థకు కేవలం పర్చేస్ ఆర్డర్ మాత్రమే ఉందని, అగ్రిమెంట్ లేదని, అగ్రిమెంట్ లేకుండా ఎంతో గోప్యంగా ఉంచాల్సిన విద్యార్థుల మార్కుల జాబితా వ్యవహారాన్ని ఒక ప్రైవేట్ సంస్థకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. ఎంసెట్ లీకేజీ, నయీం కేసు మాదిరిగా ఈ కేసు కూడా నీరుగారిపోకుండా ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. రమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, గ్లోబరీనా సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, టీడీఎఫ్ అధ్యక్షుడు డీపీ రెడ్డి, ప్రొఫెసర్ రమేశ్‌రెడ్డి, నాయకులు బైరి రమేశ్, వెంకట్, భవాని, మమత, సత్యనారాయణ, అరుణ్ కుమార్, వెంకట్ స్వామి, గోపాల్ శర్మ, తదితరులు పాల్గొన్నారు. నియంత పాలన నడుస్తోంది... మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ తెలంగాణలో నియంత పాలన నడుస్తోంది. క్యాబినెట్ లేదు, ఎవ్వరూలేరు. అన్ని నేనే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణం ముఖ్యమంత్రే అని, ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గ్లోబరీనా సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో నిషేధానికి గురైందని, అలాంటి దానికి కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీని వెనక ఎవరు ఉన్నారనే విషయంపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని అందరూ అంటున్నారు, కాని నిర్ణయాలన్నీ ప్రగతిభవన్ నుండి ముఖ్యమంత్రే చేస్తున్నారు. తెలంగాణలో వ్యవస్థ నడవడంలేదు, కేవలం నేను, నా కుటుంబం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’అని అన్నారు. -
స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న టీజేఎస్
సాక్షి, హైదరాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వీలై నన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు తెలంగాణ జనసమితి (టీజేఎస్) కసరత్తు ప్రారంభించింది. పోటీ చేయాల్సిన స్థానాలపై పార్టీ అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. పార్టీ బలంగా ఉన్న జిల్లాలను ఎంపిక చేసి, మండలాల వారీగా పార్టీ శ్రేణుల బలాబలాలను బట్టి పోటీకి సిద్ధం చేయాలని భావిస్తోంది. జిల్లాల సన్నాహకాల సమావేశాలకు శ్రీకారం చుట్టింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆదివారం జరిగిన పరిషత్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కోదండరాం పలు అంశాల పై చర్చించారు. పార్టీ తరఫున ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా విశ్వేశ్వర్రావు వ్యవహరించనుండగా, ఆ పార్టీ నేతలు రమేష్‌రెడ్డి, పాండురంగారావు, గోపాల్‌శర్మ, జగ్గారెడ్డి, అంబటి శ్రీనివాస్, శ్రీశైల్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వెదిరె యోగేశ్వర్‌రెడ్డి, అవినాశ్ మాలవ్యలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సోమవారం సమావేశం కానున్నట్లు తెలిసింది. -
ప్రజాసమస్యల పరిష్కారమే ఎజెండా
సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారమే తమ ప్రధాన ఎజెండా అని, పార్టీ లక్ష్యం అదేనని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. అందుకోసమే తాము పని చేస్తామని, ఆ దారిలోనే తమ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. డబ్బులు కుమ్మరించి, ప్రజలను మభ్యపెట్టి సాధించే గెలుపు తమకు అక్కర్లేదని, ఆ మార్గాన్ని తాము తిరస్కరిస్తున్నామన్నారు. గెలిచినా, ఓడినా ప్రజాసమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతామని, త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతోందని వివరించారు. లోక్‌సభ ఎన్నికల్లో టీజేఎస్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం సాక్షి ఇంటర్వ్యూలో వెల్లడించిన పలు అంశాలు.. సాక్షి: పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో తెలంగాణ జన సమితి గెలుస్తుందని భావిస్తున్నారా? కోదండరాం: ప్రస్తుతం ప్రచారమే కీలకం. గెలుపు, ఓటముల గురించి చర్చించే సమయం, సందర్భం ఇది కాదు. ఏ లక్ష్యం కోసం పోటీ చేస్తున్నాం.. ఏ మార్గంలో ప్రయాణిస్తున్నాం అనేది మా ప్రధాన కర్తవ్యం. ఈ ఎన్నికల్లో పార్టీ సిద్ధాంతాన్ని పరిచయం చేసుకోవడం, లక్ష్యాలను తెలియజేయడం, వాటి ఆధారంగా ప్రజలను సంఘటితం చేయడం, తద్వారా ప్రజాసమస్యల పరిష్కారానికి దోహద పడటం ప్రధానం. అలా గెలుపు వైపు ప్రయాణిండమే మా ముందున్న కర్తవ్యం. ప్రస్తుతం దాని కోసమే పని చేస్తున్నాం. మరోవైపు పార్టీ నిర్మాణాన్ని విస్తరించడం కీలకమైన అంశంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఈ ఎన్నికల్లో మేము రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాం. మూడు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినా ఒక స్థానంలో నామినేషన్ రిజెక్టు అయింది. ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్‌లో పోటీలో ఉన్నాం. హైదరాబాద్‌లో రిజెక్టు అయింది. అయితే ఈ పోటీని గెలుపోటముల అంశంగా మేము చూడట్లేదు. మేము ప్రయాణిçస్తున్న మార్గమే మాకు ముఖ్యం. ఎన్నికల్లో ప్రచారమే కీలకం. ఈ ప్రచారంతో పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నాం. అందుకోసమే మేము పోటీలో ఉన్నాం. టీజేఎస్ ప్రజలకు న్యాయం చేసేందుకే పోరాడుతుంది. ప్రజాహక్కులకు భంగం వాటిల్లకుండా ఉద్యమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ప్రజలకు వివరించి గెలుపొందాలన్నదే మా భావన. ప్రజాసమస్యలు అన్నపుడు ఆ రెండు స్థానాలనే ఎందుకు ఎంచుకున్నారు? మిగతా స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు కదా? మహబూబాబాద్‌లో అటవీ హక్కుల చట్టం అమలు కావట్లేదు. చట్టానికి విరుద్ధంగా గిరిజన, గిరిజనేతరుల భూములను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రభు త్వం వారిని ఖాళీ చేయించే పని చేస్తోంది. 83 వేల కుటుంబాలు తెలంగాణలో భూములను కోల్పోయే ప్రమాదం నెలకొంది. ఆ 83 వేల మం ది రైతుల సమస్యలను అటవీ హక్కుల చట్టం పరిధికి లోబడి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే మా కీలక లక్ష్యం. దాని కోసమే మహబూబాబాద్‌ను ఎంచుకొని పోటీ చేçస్తున్నాం. సీఎం16 స్థానాలు మేమే గెలుస్తాం.. వేరే పార్టీలకు అవకాశం లేదంటున్నారు కదా? మీరేమంటారు? ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలుస్తామనే చెబుతుంది. అదే లక్ష్యంతో పోటీ చేస్తుంది. మేమూ అదే చేస్తున్నాం. గెలుస్తామనే ఆలోచనతో రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాం. ఎవరూ ఓడిపోతామని ప్రకటించి పోటీ చేయరు. కేసీఆర్ చెబుతున్నదీ అదే. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు అనుసరించే వ్యూహం, ఎత్తుగడ అదే. అసెంబ్లీ ఎన్నికల నుంచి చాలా మంది నేతలు పార్టీకి దూరమయ్యారు. ఉన్న వారు సైలెంట్‌గా ఉన్నారు? ఈ పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? కొంతమంది వ్యక్తులుగా వెళ్లిపోయారు. నిర్మాణానికి నష్టం లేదు. కొంత మంది నాయకులు వెళ్లినంత మాత్రన ఏమీ కాదు. పార్టీ నిర్మాణం యథాతథంగా ఉంది. కార్యకర్తలు అంతా పని చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏ పనీ చెప్పడం లేదన్న అసంతృప్తిగా ఉన్నారు తప్ప మరేమీ కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని కోదండరాం లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు.. భవిష్యత్తులో పోటీ చేస్తారా లేదా? నేను పోటీ చేయాలా వద్దా అని సూత్రరీత్యా నిర్ణయమేమీ తీసుకోలేదు. ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడమే కీలకం అనుకున్నాం. ఆ పరిస్థితులనుబట్టే ముందుకు వెళ్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా పార్టీ నిర్మాణం, కేడర్‌గల నియోజకవర్గాల్లో స్థానిక నేతలకు అవకాశం ఇచ్చి పోటీలో దింపాం. అంతే తప్ప నేను పోటీ చేయకూడదని, పోటీ చేయబోనన్న నిర్ణయమేదీ లేదు. టీజేఎస్ ఏర్పడి 11 నెలలు అవుతున్నా ఇంకా పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేకపోయిందన్న విమర్శలపై ఏమంటారు? అది వాస్తవం కాదు. భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకాల్లో జరిగిన తప్పులు, పొరపాట్లపై విస్తృతంగా తిరిగాం. గ్రామాల్లోకి సమగ్ర సమాచారాన్ని సేకరించాం. గ్రామ సమావేశాలు నిర్వహించాం. పార్టీ బలంగానే ప్రజల్లోకి వెళ్లింది. నిర్మాణం విస్తరిస్తోంది. ఈ 11 నెలల్లో ఎంతగా వెళ్లాలో అంతటా వెళ్లాం. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేశాం. టీజేఎస్ అభ్యర్థులు దాదాపు 25–30 గ్రామాల్లో సర్పంచులుగా గెలిచారు. అంటే పార్టీ గ్రామ స్థాయికి వెళ్లినట్లే కదా. పైగా ఇవి పైసా వెచ్చించండా గెలిచిన స్థానాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాం. ఇప్పటికే జిల్లా పరిషత్తులవారీగా ప్రణాళికలను రూపొందించాం. అన్ని జిల్లాల్లోనూ టీజేఎస్ పోటీలో ఉంటుంది. పోటీ చేస్తున్న ఆయా స్థానాల్లో పార్టీ గెలుపు ఆలోచన లేదా? ప్రజాసమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, ప్రజల ఆదరణ పొంది గెలవాలన్నదే మా ఆలోచన. అలాగని ఎన్నికల్లో గెలుపు ఆలోచన లేదా అంటే ఉంది. మేము ఎంచుకున్న మార్గం ఇది. ఈ మార్గంలో ప్రయాణించి గెలుపు సాధించాలని ప్రయత్నిస్తున్నాం. గెలుపు వేరు, ఈ ప్రచారం వేరు అని కాదు. మేము ఎంచుకున్న మార్గంలో ప్రజల్లోకి వెళ్లాలని, ప్రచారం చేసి గెలువాలన్నదే మా తపన. మామూలుగా డబ్బులు కుమ్మరించి, మందు పోసి, ప్రజలను మభ్యపెట్టి గెలువాలన్న ప్రయత్నాలు బాగా సాగుతున్న సమయంలో మేము ఆ మార్గాన్ని తిరస్కరిస్తున్నాం. ఒక భిన్నమైన మార్గంలో ముందుకు సాగుతున్నాం. సిద్ధాంతాల ప్రాతిపదికన గెలవడానికి ప్రజలను వారి సమస్యల పరిష్కారం కోసం ఐక్యం చేయడం ద్వారా గెలవాలన్నది మా లక్ష్యం. ఇది కొత్తదేమీ కాదు.. రాజకీయాల్లో నిజంగా అనుసరించాల్నిస మార్గం ఇదే. ఆ మార్గాన్ని మేము అనుసరిస్తాం. గెలుపు కోసం కృషి చేస్తాం. -
పోటీ చేయాలా? వద్దా?
సాక్షి, హైదరాబాద్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై టీజేఎస్ పార్టీ తర్జనభర్జన పడుతోంది. మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తమకు సహకరించాలంటూ పార్టీ అధ్యక్షుడు కోదండరాంను సంప్రదిస్తుండటంతో ఆలోచనల్లో పడింది. తొలుత 4 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన టీజేఎస్.. ఆ స్థానాలు మిన హా మిగతా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతివ్వాలని నిర్ణయించింది. అయితే తాము పోటీ చేయా లనుకున్న మల్కాజిగిరి, కరీంనగర్, నిజామాబాద్ వంటి స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగుతున్న రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికల్లో తనకు సహకరించాలని కోదండరాంను కోరారు. ఇక బుధవారం మరో నేత మధుయాష్కీ కూడా కోదండరాంను కలి సి మద్దతు కోరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టడం అవసరమా? అని పార్టీ వర్గాలు యోచిస్తున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించి, తుది నిర్ణయం తీసుకోవాలని టీజేఎస్ భావి స్తోంది. పోటీలో ఉంటే ఏయే స్థానాల్లో పోటీ చేయాలి? పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం ప్రకటించాలని భావిస్తున్నట్లు టీజేఎస్ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. -
నాలుగు స్థానాల్లో టీజేఎస్ పోటీ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి (టీజేఎస్) నాలుగు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. అందులో మూడు స్థానాలను టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఖరారు చేశారు. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజిగిరి స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించామని, మరొక స్థానాన్ని ఖరారు చేయాల్సి ఉందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఆసిఫాబాద్ లేదా భువనగిరిలో పోటీ చేసే అంశాలను టీజేఎస్ పరిశీలిస్తోంది. ఒకటీ రెండు రోజుల్లో ఆ రెండింటిలో ఏదో ఒక స్థానంలో పోటీ చేసే విషయాన్ని పార్టీ ప్రకటించనుంది. మరోవైపు తాము పోటీలో లేని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బయటినుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటివరకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ శ్రేణులు ఒత్తిడితో పోటీలో ఉండాల్సి వస్తే కరీంనగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఆ స్థానం నుంచి జగ్గారెడ్డిని పోటీలో నిలిపేందుకు పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. నిజామాబాద్ నుంచి గోపాలశర్మ, మల్కాజిగిరి నుంచి కపిలవాయి దిలీప్‌కుమార్‌ను పోటీలో నిలిపే అంశాలను పార్టీ పరిశీలిస్తోంది. ఒకటీ రెండు రోజుల్లో అధికారికంగా అభ్యర్థులను ప్రకటించనుంది. ఎన్నికల ప్రచారం కోసం మూడు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో మానిటరింగ్, ఎలక్షన్ అండ్ పొలిటికల్ ఎఫైర్స్, క్రమశిక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీల నేతృ త్వంలో ప్రచారం వేగవంతం చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని నిర్ణయించింది. భవిష్యత్ లక్ష్యాల సాధన కోసమే పోటీ ఈ ఎన్నికల్లో టీజేఎస్ సొంతంగా నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందని, పోటీలో ఉంటేనే భవిష్యత్తులో తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్న ఉద్దేశంలో పోటీలో ఉంటామని కోదండరాం తెలిపారు. ఈ ఎన్నికల కోసం కొత్తగా మేనిఫెస్టోను రూపొందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టో కలిపి రీక్లెయిమింగ్ రిపబ్లిక్ పేరుతో కొత్త మేనిఫెస్టోను ఒకటీ రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. పార్టీ నిర్మాణానికి దోహదపడే చోటనే తమ అభ్యర్థులను పోటీలో నిలపాలని నిర్ణయించామన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం యాత్ర నిర్వహిస్తామని, ఈనెల 16,17 తేదీల్లో భద్రాచలం నుంచి మేడారం వరకు ఆదివాసీ హక్కుల రక్షణ యాత్ర చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయని, ప్రజల హక్కులకు రక్షణలేకుండా పోయిందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పొత్తులపై చర్చలు జరగలేదన్నారు. జాతీయ స్థాయిలో ఎవరితో వెళ్లాలన్న దానిపై తమ ప్రణాళికలు తమకు ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో టీజేఎస్ నేతలు దిలీప్‌కుమార్, యోగేశ్వర్‌రెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు స్థానాల్లో పోటీ చేస్తాం : కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ నాలుగు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్, మల్కాజిగిరితో పాటు.. మరోక నియోజకవర్గంలో టీజేసీ సొంతంగా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. పోటీ లేని చోట కాంగ్రెస్‌కు బయట నుంచి మద్దతు ఇస్తామని తెలిపారు. పోటీలో ఉంటేనే భవిష్కత్‌లో తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్న ఉద్దేశ్యంతోనే ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ నెల 16,17న రెండు రోజుల పాటు భద్రాచలం నుంచి మేడారం వరకు ఆదివాసీ హక్కుల రక్షణ యాత్ర చేపడతామని చెప్పారు. -
అందుకోసం ఉద్యమం చేస్తాం: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: పంటలకు గిట్టుబాటు ధర కోసం ఉద్యమం చేస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. శనివారం జాతీయ రహదారుల మీద రైతుల వంటావార్పు ఉంటుందని వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. నిజామాబాద్ ఎర్రజొన్న, ఆర్మూర్ పసుపు పంట రైతులు సమస్యల్లో ఉన్నారని తెలిపారు. రైతులు పసుపు పంట అమ్ముకోవటానికి తెలంగాణలో మార్కెట్ కూడా లేదన్నారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. పసుపు బోర్డు వస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుందని అన్నారు. పసుపు పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని, పత్తి, మిర్చి, కందులు, జొన్న రైతులు చాలా దెబ్బ తిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంత్రుల క్యాబినెట్ లేకపోవడంతో సమస్యలు నివేదించే పరిస్థితి లేదని చెప్పారు. వ్యవసాయ శాఖకు మంత్రి కూడా లేడన్నారు. పంటకు గిట్టుబాటు ధర కోరితే ప్రభుత్వం దాడులు చేస్తోందని మండిపడ్డారు. పసుపుకు క్వింటాలుకు 15 వేల రూపాయలు, ఎర్రజొన్నలకు క్వింటాలుకు రూ.3500 మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. -
మతాల మధ్య పోటీగా ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: కొంత మంది వ్యక్తులు వచ్చే లోక్‌సభ ఎన్నికలను హిందూ, ముస్లింల మధ్య జరిగే పోటీగా చిత్రీకరిస్తున్నారని స్వరాజ్ ఇండియా పార్టీ జాతీయ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ ఆరోపించారు. తెలంగాణ జన సమితి, స్వరాజ్ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ‘2019 లోక్‌సభ ఎన్నికల ఎజెండా, కార్యాచరణ, పౌరుల ప్రతిపాదన’ వంటి అంశాలపై సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టం పేరుతో ముస్లింలను ఇబ్బందులకు గురిచేస్తోందని యోగేంద్ర విమర్శించా రు. మతం పేరుతో పౌరసత్వాన్ని ముడి పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోందని, ప్రపంచంలో ఎక్కడ పుట్టిన సరే ముస్లింలు కాకుంటే భారత పౌరులుగా వారికి గుర్తింపు ఇస్తామనే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజా ప్రతిని ధుల ఎన్నిక విషయంలో మతం, డబ్బు, మద్యం ప్రధానాంశాలుగా కాకుండా నిస్వార్థం గా పని చేసే వారికి అవకాశం కల్పించే విధంగా మారాలని అభిప్రాయపడ్డారు. జాతీయ రాజకీయాల్లో కొత్త మార్పులను తీసుకురావడానికి మేధావులు, ప్రజా ఉద్యమకారుల ఆధ్వర్యంలో ‘రీక్లెయిమింగ్ ద రిపబ్లిక్’ పేరుతో ఒక ఎజెండా ను రూపొందించామని చెప్పారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ’ఇండియన్ సిటిజన్ యాక్షన్ ఫర్ నేషన్ (ఐ కేన్)’ అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. దీనిలో భాగంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ.. నిస్వార్థంగా పని చేసే వారిని లోక్‌సభ ఎన్నికల బరి లో నిలుపుతామని, దీని కోసం స్వతంత్ర ఎన్నికల ప్యానెల్ అభ్యర్థులను నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ ఎన్నికలో బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రచారం కోసం ఐ కేన్ ప్రత్యేక వాలంటరీ వ్యవస్థ పని చేస్తుందన్నారు. తెలంగాణలోని ప్రజలందరూ ఐ కేన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల తరఫున పోరాడే వారికి మద్దతు.. దేశవ్యాప్తంగా పర్యటించి మేధావులు, ప్రజల పక్షాన పోరాడే వారిని సంప్రదించి ఈ ఎజెండా రూపొందించామని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. ప్రజల ముందుకు ఈ ఎజెండాను తీసుకుపోవడానికి ఐ కేన్ పని చేస్తుందన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ, రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రజల తరఫున గళం వినిపించే వ్యక్తులు కావాలని, అటువంటి వారికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మద్దతుగా నిలిచేందుకు ఈ ఐ కేన్ పని చేస్తోందన్నారు. యోగేంద్ర యాదవ్ ప్రతిపాదించిన ఎజెండాను తెలంగాణ జన సమితి ముందుకు తీసుకువెళ్తుందని స్పష్టం చేశారు. -
కాంగ్రెస్‌లో విలీనమా.. ముచ్చటే లేదు
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నాయకులు బట్టలు మార్చినంత సులువుగా పార్టీలు మారస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఎద్దేవచేశారు. గతంలో నమ్మిన సిద్దాంత కోసం పార్టీలలో ఉండే వారని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల లేవన్నారు. లోక్‌సభ ఎన్నికలు, పొత్తులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై శనివారం నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో కోదండరాం చర్చించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూటమి ఓటమిపై చర్చజరగలేదని తెలిపారు. కూటమిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై కూడా చర్చ జరగలేదన్నారు. రానున్న ఎన్నికలపై తమ పార్టీకంటూ అంతర్గతంగా ఓ ఆలోచన ఉందన్నారు. తెలంగాణ జనసమితి ఎట్టి పరిస్థితిల్లోనూ కాంగ్రెస్‌లో విలీనం కాదని స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమితో తాము నిరాశచెందలేదని.. రానున్న ఎన్నికలకు సిద్దంగా ఉన్నామన్నారు. పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే ఎన్నికలు రావడం ఓటమి చెందినట్లు భావిస్తున్నామన్నారు. సీబీసీఐడీ విచారణ జరగాలి రాష్ట్రంలో ఎన్నికల అధికారిపై కోదండరాం అనుమానం వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపుపై ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల అధికారిపై రాష్ట్రపతికి, కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తామన్నారు. సీబీసీఐడీతో ఎన్నికల అధికారిపై విచారణకు ఆదేశించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. ఇక ఏపీ ఎన్నికలకు వెళ్లే తీరికలేదన్నారు. ఆంధ్ర ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. -
బీసీ నాయకులు ఎదగకుండా చేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్ : బీసీ నాయకులను ఎదగకుండా చేసే కుట్రలో భాగంగానే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించారని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గింపునకు నిరసనగా తెలంగాణ జనసమితి ధర్మాచౌక వద్ద ఒక రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో పాటు బీసీ నేత మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ప్రస్తుత రిజర్వేషన్లే.. ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కొనసాగుతాయన్నారు. రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగితేనే రాజకీయ వ్యవస్థ బలపడుతుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రిజర్వేషన్లు ఉండాలని, బీసీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలపై ఉన్న కసితోనే కేసీఆర్.. రిజర్వేషన్లు తగ్గించారని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం నుంచి 22 శాతం తగ్గించడం అన్యాయమన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలు జరిపించిందని గుర్తు చేశారు. జాతిని అమ్ముకుని టీఆర్ఎస్ బీసీ నేతలు రిజర్వేషన్లపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేయాలన్నారు. ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం కాదని, బడి పిల్లలకు బడిలు కట్టివ్వాలని సూచించారు. రిజర్వేషన్లు తగ్గించడం వలన 1500 మంది బీసీలు సర్పంచ్ అయ్యే అవకాశం కోల్పోయారన్నారు. అన్ని పార్టీలు బీసీల రిజర్వేషన్ల ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్ని కుల సంఘాల నాయకులు ఉద్యమించాలని, ప్రపంచంలో చాలా మంది నేతలను చూసామని, కేసీఆర్ అంత కన్నా గొప్పవాడేమి కాదన్నారు. -
కూటమి అజెండాను ప్రచారం చేయటంలో విఫలమయ్యాం
-
ఆ వార్త అవాస్తవం: కోదండరాం
హైదరాబాద్: లోక్‌సభకు తాను పోటీ చేసే విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారన్న వార్త అవాస్తమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లో కోదండరాం విలేకరులతో మాట్లాడారు. కూటమి అజెండాను డోర్ టు డోర్ ప్రచారం చేయటంలో తాము పూర్తిగా విఫలమయ్యామని తెలిపారు. మంచి అజెండాను రూపొందించుకున్నా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని చెప్పారు. ప్రచారాన్ని సమర్ధవంతంగా అమలు చేయలేకపోవటమే కూటమి ఓటమికి కారణమన్నారు. కేసీఆర్ ప్రచారాన్ని తట్టుకోవాలంటే ప్రచారానికి కనీసం 50 రోజులు కావాలని కూటమి నేతలకు తాను చెప్పినట్లు వెల్లడించారు. ప్రచారానికి మూడు వారాలు చాలని కాంగ్రెస్, టీడీపీ నాయకులు చెప్పారని అన్నారు. మా హామీలు ప్రజలకు చేరవేయటంలో మేము విఫలమయ్యామని కోదండరాం అన్నారు. లోక్‌సభకు జరిగే ఎన్నికలు మరో విధంగా ఉంటాయని చెప్పారు. ఓటమి ద్వారా గుణపాఠం నేర్చుకోవటానికి తాము సిగ్గుపడటం లేదన్నారు. ఓటమితో మాపై మేం విశ్వాసాన్ని కోల్పోలేదన్నారు. గ్రామ , మండలస్థాయి నుంచి తెలంగాణ జన సమితిని బలోపేతం చేయటానికి ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్కు, కూటమికి మధ్య ఓట్ల వ్యతాసం కేవలం 22 లక్షలేనని తెలిపారు. బీసీలకు కనీసం 25 శాతం పంచాయతీలను రిజర్వ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధర, నిరుద్యోగ సమస్య, జీఎస్టీ లాంటి అంశాలు జాతీయ రాజకీయాలను ప్రభావం చూపబోతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల నిధుల అంశం కూడా జాతీయ స్థాయిలో కీలకం కానుందన్నారు. చరిత్రలో రెండు సార్లు మాత్రమే ఫెడరల్ ఫ్రంట్ సాధ్యమైందని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరల్ ఫ్రంట్‌కు అవకాశం లేదని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఎవరి కోసమో కేసీఆర్‌కే తెలియాలని వ్యాఖ్యానించారు. కూటమి ఓటమికి ఈవీఎంలే కారణమనేది సరైంది కాదన్నారు. కూటమి ఏర్పాటులోనే చాలా ఆలస్యం జరిగిందన్నారు. కేసీఆర్ ప్రచార శైలి మీకు తెలవదని కూటమి నేతలతో చెప్పినట్లు తెలియజేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పదిహేను రోజుల ప్రచారం చాలు అన్నారు..కానీ కేసీఆర్ వ్యూహాలు దగ్గరుండి చూశాను కాబట్టే 15 రోజులు చాలవని చెప్పినట్లు తెలిపారు. కేసీఆర్, చంద్రబాబుకు మధ్య ఏం ప్రేమ ఉందో, రిటర్న్ గిఫ్ట్ ఏం ఇస్తారో చూడాలని చమత్కరించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ అవ్వదని, ఫెడరల్ ఫ్రంట్ రెండు కారణాల ద్వారా సక్సెస్ అయ్యే అవకాశముందన్నారు. ఒకటి దేశాన్ని ప్రభావితం చేసేలా ఒక రాష్ట్రం సమస్యలను లేవనెత్తాలి లేదా నాలుగైదు రాష్ట్రాలు కలిపి సమస్యలను లేవనెత్తాలని వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్ ఇంతవరకు ఆ ప్రధాన సమస్యను గుర్తించలేదన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వెనక ఎవరున్నారో భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. -
పంచాయతీ’ పోరుపై టీజేఎస్ గురి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి త్వరగా కోలుకునేందుకు తెలంగాణ జన సమితి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా పరాభవమే ఎదురవ్వడంతో జవసత్వాలు కూడగట్టుకుని పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచేందుకు యోచిస్తోంది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగాలని టీజేఎస్ భావిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో స్థానిక అంశాలు, అభ్యర్థులే ఫలితాలను నిర్ణయించే అవకాశముండటంతో క్షేత్రస్థాయిలో మంచి పేరున్న వారిని పోటీలో నిలపాలనుకుంటోంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, కూటమితో కలసివెళ్లే ఆలోచన తమకు లేదని టీజేఎస్ నేతలు చెబుతున్నారు. కచ్చితంగా తమ సొంత బలంతోనే పంచాయతీ ఎన్నికల్లో పోరాడతామని, గ్రామాల్లో పార్టీ బలోపేతం అయ్యేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని వారంటున్నారు. అయితే, దీనిపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మూడ్రోజుల్లో కీలక భేటీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునేందుకుగానూ టీజేఎస్ త్వరలోనే సమావేశం కానుంది. రెండు లేదా మూడ్రోజుల్లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీకి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులను కూడా ఆహ్వానించనున్నారు. ఇందులో పార్టీ భవిష్యత్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా ఎన్నికల ఫలితాలతో టీజేఎస్ ఒత్తిడి ఎదుర్కొంటున్న నేపథ్యంలో జరగబోయే సమావేశంలో ఏం నిర్ణయిస్తారన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలే ప్రామాణికం కాదు: కోదండరాం రెండు, మూడ్రోజుల్లో టీజేఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం ఉంటుందని, అందులో చర్చించి పంచాయతీ ఎన్నికలపై అధికారిక నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమిని అంగీకరిస్తున్నామని, అన్ని అంశాలను సమీక్షించుకుని పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు అన్నింటికీ ప్రామాణికం కాదన్నారు. టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని వస్తున్న వాదనలను కొట్టిపారేశారు. ప్రజా సంక్షేమం, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే తాము పార్టీ పెట్టినట్లు చెప్పారు. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన కార్యాచరణపై భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. -
టీజేఎస్‌లో ‘పంచాయతీ’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆలోచనల్లో పడింది. కొత్తగా ఏర్పాటు చేసుకున్న పార్టీని సొంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ప్రజాకూటమి పేరుతో వెళ్లడం, పార్టీకి ఒక్కసీటు రాకపోగా, పోటీ చేసిన 8 స్థానాల్లోనూ డిపాజిట్ దక్కని పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న పంచాయతీ ఎన్నికల విషయంలో పార్టీ ఎలా ముందుకు సాగాలన్న ఆలోచనల్లో పడింది. పంచాయతీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలా? వద్దా? అన్న గందరగోళం నెలకొంది. సొంతంగా పోటీ చేస్తే ఎంతమేరకు నెగ్గుకురాగలుగుతాం, సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలోపేతం లేని పార్టీని ఎలా ప్రజల వద్దకు చేర్చాలన్న దానిపైనే ప్రధాన దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో పార్టీని నడపడం కంటే కాంగ్రెస్‌లో విలీనం చేస్తే సరిపోతుందన్న వాదనలను కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. రేపు పంచాయతీ ఎన్నికల్లోనూ బోర్లా పడితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొంటున్నారు. అయితే పార్టీ ముఖ్య నేతలు కొందరు మాత్రం పంచాయతీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయడం ద్వారానే పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లవచ్చన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. ప్రజాకూటమి పేరుతో కాంగ్రెస్‌తో కలిసినా సరిపోయేదని, అందులోకి టీడీపీ రావడం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితుల కారణంగా ఎన్నికల్లో దారుణమైన దెబ్బ తినాల్సి వచ్చిందన్న భావనను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి మరోలా ఉండేదని పేర్కొంటున్నారు. పార్టీ పోటీ చేసిన 8 స్థానాల్లో కనీసం ఒక్క స్థానంలో అయినా తమకు ప్రజలు అనుకూలంగా తీర్పునిచ్చే అవకాశం ఉండేదన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. కనీసం అసెంబ్లీలో ఒక్క సీటు అయినా ఉంటే అది టీజేఎస్‌కు ఎంతో బలంగా ఉండేదని, దాంతో పంచాయతీ ఎన్నికలకు వెళితే పార్టీ బలోపేతం అయ్యేదన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా టీజేఎస్ ఎలా ముందుకు సాగాలన్న భవిష్యత్తు కార్యాచరణపై మరో వారంలో స్పష్టత వస్తుందని ఆ వర్గాలు అంటున్నాయి. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే పార్టీ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని కోదండరాం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
ఖాతా తెరవని టీజేఎస్!
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ ఆకాంక్షల సాధన లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఈ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలువలేకపోయింది. ఉద్యమ ఆకాంక్షల నినాదం పెద్దగా పని చేయలేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణపై ఒక కుటుంబం పెత్తనం చేస్తూ, ఇష్టానుసారం వనరులను దోచుకుంటూ, హక్కులను హరిస్తూ, నిరంకుశంగా పాలిస్తూ, ప్రజలధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే మౌనంగా ఉండకూడదన్న సంకల్పంతోనే పార్టీ పెడుతున్నాం అంటూ ప్రజల ముందుకు వచ్చిన టీజేఎస్ ఈ ఎన్నికల్లో తన ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. 2018 మార్చి 31న ఏర్పడిన టీజేఎస్.. ఏప్రిల్ 29న భారీ బహిరంగ సభతో ప్రజల ముందుకు వచ్చింది. ఈ ఎన్నికల్లో 4 స్థానాల్లో సొంతంగా, మరో 4 స్థానాల్లో ప్రజా కూటమిలో స్నేహపూర్వక పోటీ చేసినా ఒక్కచోట కూడా గెలువలేకపోయింది. కూటమిలో టీడీపీ భాగస్వామి కావడం, సభల్లో ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేయడంతో ప్రజలు కూటమిని కూడా తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్‌తో పాటు టీజేఎస్ కూడా తన ఉనికిని కో ల్పోయింది. టీజేఎస్ తరఫున మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన కపిలవాయి దిలీప్‌కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. అంబర్‌పేటలో నిజ్జన రమేశ్‌ది అదే పరిస్థితి. వర్ధన్నపేటలో పి.దేవయ్య, సిద్దిపేటలో ఎం.భవాని రెండో స్థానంలో నిలిచారు. స్నేహపూర్వక పోటీ కింద వరంగల్ ఈస్ట్‌లో గాదె ఇన్నయ్య, దుబ్బాకలో రాజ్‌కుమార్, ఆసిఫాబాద్‌లో విజయ్‌కుమార్, ఖానాపూర్‌లో భీంరావును పోటీలో దింపినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. భవిష్యత్తు ఏంటి? టీజేఎస్‌కు ఒక్క సీటు కూడా రాకపోవడంతో పార్టీ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. కూటమి అధికారం లోకి వస్తే కొన్ని ఎమ్మెల్సీ స్థానాలను తీసుకొని పార్టీ ని బలోపేతం చేసుకోవాలన్న ఆలోచనల్లో ఉన్న టీజేఎస్‌కు ఆ అవకాశమూ లేకుండాపోయింది. ఈ నేప థ్యంలో పార్టీ భవిష్యత్తుపై గందరగోళం నెలకొంది. -
హరీశ్ అదుర్స్...
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, ఆ పార్టీ సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీశ్‌రావు రికార్డుల మోత మోగించారు. తెలంగాణ జన సమితి అభ్యర్థి భవానీ మరికంటిపై ఏకంగా 1,18,699 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా హరీశ్ అరుదైన ఘనత సాధించారు. తెలంగాణతోపాటు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా హరీశ్‌రావు నిలిచారు. అలాగే అతిపిన్న వయసులో వరుసగా ఆరుసార్లు శాసనసభకు ఎన్నికై డబుల్ హ్యాట్రిక్ సాధించిన ప్రజాప్రతినిధిగా కూడా మరో రికార్డు సొంతం చేసుకున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కె.ఎం. మణి (49 ఏళ్ల వయసులో) గతంలో అసెంబ్లీకి ఆరుసార్లు ఎన్నికవగా ప్రస్తుతం హరీశ్‌రావు 47 ఏళ్ల వయసులోనే ఈ రికార్డు సాధించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో సిద్దిపేట నియోజకవర్గం నుంచి వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఆయన వయసు 50 ఏళ్లు. అలాగే ఇప్పటివరకు ఐదుసార్లు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు చేసి హరీశ్ మరో రికార్డు నమోదు చేశారు. దీనికితోడు పోటీ చేసిన ప్రతిసారీ తన మెజారిటీని మరింత పెంచుకుంటూ విజయం సాధించారు. పోటీ చేసిన ఐదు వరుస ఎన్నికల్లోనూ పోలైన ఓట్లలో 80 శాతానికిపైగా ఓట్లు సాధించి ఇంకో రికార్డును సొంతం చేసుకున్నారు. గొప్ప గౌరవం ప్రజాజీవితంలో ఇంతకన్నా గొప్ప గౌరవం, ఇంతకన్నా అద్భుతమైన అనుభవం మరొకటి ఉండదు. సిద్దిపేటకు నేను ఇచ్చింది గోరంత. అది నాకు తిరిగి ఇచ్చింది కొండంత. జనం తిరగరాసినవి కేవలం ఎన్నికల రికార్డులనే కాదు... వారు ప్రతిసారీ తెలంగాణ చరిత్రనే తిరగరాస్తున్నారు. – టి.హరీశ్‌రావు -
ఖాతా తెరవని టీజేఎస్, సీపీఐ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరుగా దూసుకుపోతుంది. ఇప్పటికే 83 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్.. మరో 4 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా బరిలోకి దిగిన కూటమి ఘోర పరాజయం పాలైంది. కూటమి అభ్యర్థులు 18 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే కూటమితో జట్టు కట్టిన తెలంగాణ జన సమితి, సీపీఐ ఖాతా తెరవలేదు. కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. సీపీఐ... 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాల నుంచి పోటి చేసిన సీపీఐ అన్ని చోట్ల ఓటమి పాలయ్యంది. బెల్లంపల్లి నుంచి గుండా మల్లేష్, హుస్నాబాద్ నుంచి చాడ వెంకటరెడ్డి, వైరా నుంచి బానోతు విజయ పోటీ చేశారు. కానీ వీరు ముగ్గురు ఓడిపోయారు. బెల్లంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య, హుస్నాబాద్‌లో వడితెల సతీష్ కుమార్(టీఆర్ఎస్), వైరా నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి రాములు నాయక్ విజయం సాధించారు. టీజేఎస్... తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీజేఏసీ కన్వీనర్ కోదండరాం ఆధ్యర్యంలో ఏర్పాటైన తెలంగాణ జనసమితి(టీజేఎస్) ఈ ఎన్నికల్లో బొక్కబొర్ల పడింది. ఆరు స్థానాల్లో పోటీ చేసిన టీజేఎస్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. మెదక్ నుంచి ఉపేందర్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి కపిలవాయి దిలిప్ కుమార్, వర్ధన్నపేట నుంచి పగిడిపాటి దేవయ్య, వరంగల్(ఈస్ట్) నుంచి గాదె ఇన్నయ్య, సిద్ధిపేట నుంచి భవాని రెడ్డి పోటీ చేశారు. వీరంతా అధికార టీఆర్ఎస్ అభ్యర్ధుల చేతిలో ఓటమి పాలయ్యారు. సిద్ధిపేట నుంచి హరీశ్ రావుపై పోటీ చేసిన భవానీ రెడ్డి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయినట్లు సమాచారం. -
కూటమి ఓట్ల బదిలీ జరిగిందా?
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల యుద్ధం ముగిసింది. ఇంతకాలం వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగిన నేతలకు ఇపుడు కొత్త భయం వచ్చిపడింది. అధికార పార్టీని ఓడించడానికి ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి.. కూటమికి చెక్ పెట్టేందుకు అధికార టీఆర్ఎస్, మజ్లిస్ మధ్య అవగాహనతో ఎన్నికలకు వెళ్లాయి. అయితే.. ఈ అవగాహన క్షేత్రస్థాయిలో ఇరు పక్షాల్లో ఓట్లను బదిలీ చేసేందుకు ప్రభావితం చేసిందా అనేదే టీఆర్ఎస్, కాంగ్రెస్‌లను కలవరపెడుతోంది. ఓటరునాడి అర్థం అసలేమాత్రం అందకపోవడంతో.. ఫలితాలు వెల్లడయ్యే దాకా ఈ ఉత్కంఠ తప్పేట్లు లేదు. కూటమిలో టీజేఎస్‌కే అధిక భయం కాంగ్రెస్‌తో జతకలిసిన కోదండరాం పార్టీ టీజేఎస్‌కు కూటమి పార్టీల ఓట్ల బదిలీయే ప్రశ్నార్థకంగా మారింది. ఈ పార్టీ పోటీ చేసిన చోట్ల కాంగ్రెస్, టీడీపీ ఓట్లు బదిలీ అవుతాయా అన్న విషయంపై.. టీజేఎస్కూ అనుమానాలున్నాయి. మరోవైపు 14 స్థానాలకు పోటీ చేస్తానన్న టీడీపీ పటాన్చెరును కాంగ్రెస్‌కే వదిలేసింది. ఇబ్రహీంపట్నం టికెట్‌ను టీడీపీ తీసుకున్నా.. ఇక్కడ కాంగ్రెస్ రెబెల్ మల్రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ తరఫున బరిలో నిలిచారు. దీంతో ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. పోలింగ్‌కు ఒక్కరోజు ముందు రంగారెడ్డికి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడం మరింత గందరగోళానికి దారి తీసింది. ఇక్కడ టీడీపీ నుంచి బరిలో ఉన్న సామ రంగారెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందుజాగ్రత్త చర్యగా ఓట్లు చీలిపోతాయన్న భయంతో కూటమి తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఖమ్మం, రంగారెడ్డికి మాత్రమే పరిమితం చేశారు. అధికార పక్షానికీ హడలే! పైకి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అధికార టీఆర్ఎస్ కూడా ఓటు బదిలీపై ఆందోళనగానే ఉంది. టీఆర్ఎస్కే ఓటేయాలని అసదుద్దీన్ ముస్లింలకు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ జిల్లా కేంద్రాల్లో ఓటు బదిలీపై టీఆర్ఎస్ గంపెడాశలు పెట్టుకుంది. అయితే.. ఈ ఓట్లు నిజంగానే తమకు బదిలీ అయ్యాయా అన్న కంగారు అధికార పార్టీలో కనబడుతోంది. రాజేంద్రనగర్‌లో ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులుగా బరిలో ఉన్నాయి. పాతబస్తీలో నామినేషన్లు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు నామమాత్రంగా ప్రచారం చేసినా.. వీరి ఓట్లు కూడా మజ్లిస్‌ను కలవరపెడుతున్నాయి. చీలికపైనే బీజేపీ ఆశలు! ఈసారి నగరంలో ఉన్న 5 స్థానాలకు తోడుగా జిల్లాల నుంచి మరో 7 స్థానాలపై బీజేపీ కన్నేసింది. తాము లేకుండా రాబోయే ప్రభుత్వం ఏర్పడదంటూ చెప్పుకుంటున్న పార్టీ.. ఓట్ల చీలికపై గంపెడాశలు పెట్టుకుంది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ (అర్బన్), కల్వకుర్తి, మహబూబ్‌నగర్, భూపాలపల్లి, చొప్పదండి, రాజేంద్రనగర్‌లలో ముక్కోణపు పోటీ నెలకొంది. ప్రజాకూటమి, అధికార పక్షాల ఓట్లు చీలిపోగా.. ఈ స్థానాల్లో తమకున్న ప్రాబల్యంతో ఈసారి డబుల్ డిజిట్ చేరుకుంటామని కమలం పార్టీ లెక్కలు వేస్తోంది. ఈసారి 12 స్థానాల్లో గెలుస్తామని, ఎవరికీ స్పష్టమైన మెజారిటీరాని పక్షంలో తామే ప్రభుత్వ ఏర్పాటులో కీలకమవుతామని ధీమాగా చెబుతోంది. -
తార్నాకలో ఓటు వేసిన కొదండరాం
-
కూటమి నేతలు రాజకీయ బ్రోకర్లు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ జన సమితి(టీజేఎస్)కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, అడ్వొకేట్ రచనారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆమెతోపాటు మర్రి శశిధర్‌రెడ్డి తనయుడు ఆదిత్యారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ప్రకటించారు. ఈ సందర్భంగా టీజేఎస్ అధినేత కోదండరాంపై రచనారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కూటమి కూర్పే లేదన్నారు. ఈ విషకూటమితో ప్రత్యామ్నాయం వచ్చే అవకాశం లేదన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. మరో రాష్ట్రానికి చెందిన సీఎం ఇక్కడ ప్రచారానికి రావడమే తప్పని, తెలంగాణ ప్రజలు ఎంతో అవగాహన కలిగిన వారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారాన్ని ఇక్కడి ప్రజలు కచ్చితంగా తిరస్కరిస్తారని, ఆయన చేసే కుట్రలు వారికి బాగా తెలుసని చెప్పారు. కూటమిలో ఏ క్యాడర్ పనిచేస్తలేదని, కూటమి పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కూటమిలోని నేతలు రాజకీయ బ్రోకర్లుగా తయారయ్యారని, కూరగాయల మాదిరిగా అసెంబ్లీ సీట్లు అమ్ముకున్నారని తీవ్రంగా విమర్శించారు. టీజేఎస్ పెట్టడానికి కారణాలు ఏంటి? మీరు చేస్తున్నదేంటి? అని ప్రశ్నిస్తూ టీజేఎస్‌ను నమ్ముకున్న వారిని నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే ప్రజాకూటమి ఫిక్స్ అయిందని, కూటమితో కోదండరాం అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. కూటమిలో సామాజిక న్యాయంలేదు... ప్రజాకూటమి కూర్పులో సామాజిక న్యాయం జరగలేదని, కోదండరాంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని రచనారెడ్డి ఎద్దేవా చేశారు. ఉద్యమకారులకు ప్రాధాన్యం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలకు టీజేఎస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని, దీంతో మైనార్టీలకు ఏవిధంగా న్యాయం జరిగినట్లో చెప్పాలన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు ఇచ్చారని, ఈ కుమ్మక్కులో కోదండరాం కూడా భాగస్వామిగా ఉన్నారన్నారు. కూటమిలో చాలామంది నేతలను బలిపశువులను చేశారని మండిపడ్డారు. కోదండరాం కాంగ్రెస్‌తో కలసి తనకు తానే ఓటమి చెందుతున్నారని, అసలు కూటమి ఏర్పడింది.. గెలువడానికా లేక ఓడిపోవడానికా అని ప్రశ్నించారు. కోదండరాం కూటమి కన్వీనర్ అంటే.. ఏ దేశానికి రాజు? అని ఎద్దేవా చేశారు. పార్టీకి కామన్ మినిమం ప్రోగ్రాం లాంటి పెద్ద, పెద్ద పదాలు పనికిరావన్నారు. టీజేఎస్ ఒక్క సీటు కూడా గెలవకపోతే రాజ్యసభ, ఎమ్మెల్సీ, బోర్డుమెంబర్ పదవి కూడా ఇవ్వరని, కనీసం వారి ఫోన్లను కూడా కాంగ్రెస్ వారు ఎత్తరని ఎద్దేవా చేశారు. తమ వెంట పడి టీజేఎస్‌లో చేరేవరకు వదిలిపెట్టలేదని, చేరాక పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశా రు. టీజేఎస్‌కు అడిగినన్ని టికెట్లు ఇవ్వనప్పుడు కోదండరాం కూటమి నుంచి ఎందుకు బయటకు రాలేదని, చర్చల పేరుతో హోటళ్లలో సమావేశాలు పెట్టి ఎందుకు టైంపాస్ చేశారని దుయ్యబట్టారు. రాహుల్ పారాచూట్లకు టికెట్లు ఇవ్వవద్దని, కుటుంబంలో ఒక్కటే టికెట్ ఇవ్వాలని, వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వారికి టికెట్లు కేటాయించవద్దని చెప్పినా దాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తుంగలో తొక్కారని ఆరోపించారు. ఎందుకూ పనికిరాని పొలిటికల్ బ్రోకర్లు కాంగ్రెస్‌లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కోదండరాం.. మమ్మల్ని ఎందుకు పా ర్టీలోకి తెచ్చావు? నిన్ను నమ్ముకుని వచ్చిన వారిని మోసం చేశావు, వారి భవిష్యత్ ఇక్కడికే అంతమైంది. కాంగ్రెస్‌తో మీ డీలింగ్ ఏమిటి’ అని ప్రశ్నించారు. ‘16 నుంచి 18 పేర్ల తో జాబి తా తయారు చేసి, గంటకు ఒకరి పేరు జాబితాలో మార్చారు. నీవు అది తీసుకో, నేను ఇది తీసుకుంటానంటూ బఠానీలూ, పల్లీల్లా బేరసారాలు చేశారు’ అని ఆమె విమర్శించారు. రచనారెడ్డి సస్పెన్షన్.. టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రచనా రెడ్డి, మర్రి ఆదిత్యరెడ్డిలను ప్రాథమిక సభ్య త్వం నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, అధికార ప్రతినిధి జి.వెంకట్‌రెడ్డి విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ పార్టీ వ్యతిరేక కార్యక లాపాలకు పాల్పడినందున వారిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ప్రశ్నిస్తే నాపై దాడికి యత్నం... అన్నింటికీ డబ్బులేనని, అలాంటప్పుడు కూటమి ఎందుకని రచనారెడ్డి ప్రశ్నించారు. మర్రి కుటుంబాన్ని కూడా కూటమిలో బాధితులుగా చేశారన్నారు. తాను ఒక్కసారే సీటు అడిగానని, ఎవరో డబ్బులు ఇచ్చి తనతో స మావేశం పెట్టించారనే దాంట్లో వాస్తవంలేదని ఆమె అన్నారు. జనసమితి సమావేశాల్లో ప్రశ్నిస్తే తనపై దాడి చేసేందుకు యత్నించా రని ఆరోపించారు. కోదండరాం 2014 వరకు ఉద్యమం చేశారని, తరువాత ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం తప్ప చేసిందేమీ లేదన్నారు. గడిచిన నాలుగేళ్లలో కూటమిలోని సభ్యులు ఎవరూ ఏం చేయలేదని, వారు ఏం చేయలేకపోవడంవల్లే తాను న్యాయస్థానంలో కేసులు వేశానని తెలిపారు. మర్రి ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ కూటమిలో టికెట్లు అమ్ముకున్నది వాస్తవమని, తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, దీనిపై విచారణ చేపట్టాలన్నారు. ‘కోదండరాం ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసిన మాట వాస్తవం కాదా.. అమిత్ షా 40 సీట్లు ఇస్తామని ఒప్పుకోలేదా..’ అని ప్రశ్నించారు. కూటమి ఏర్పాటుకు ముందే ఉప్పల్ సీటును టీడీపీ నేత దేవేందర్‌గౌడ్ కుమారుడికి ఎలా కేటాయించారని ప్రశ్నించారు. కోదండరాం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, వర్ధన్నపేట సీటును అడగకున్నా టీజేఎస్‌కు ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. -
రచనారెడ్డి, ఆదిత్యారెడ్డిపై వేటు..!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు మహాకూటమి ప్రత్యామ్నాయం కాబోదని, మహాకూటమిలో రాజకీయ బ్రోకర్లు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ జనసమితి పార్టీ వైస్ ప్రెసిడెంట్ రచనారెడ్డి, మర్రి ఆదిత్యారెడ్డిలపై ఆ పార్టీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ ఏకగ్రీవ తీర్మానం మేరకు టీజెఎస్ ప్రజాకూటమిలో భాగస్వామ్యం అయిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. రచనా రెడ్డి, ఆదిత్యారెడ్డి ఎన్నికల్లో యెల్లారెడ్డి, తాండూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనుకున్నారని, వారి సీట్ల విషయంలో పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయం వారికి బాగా తెలుసునని తెలిపారు. టీఆర్ఎస్కు ఎవరూ ప్రత్యామ్యాయం లేదని చెప్పడం వెనక వారు ఏ పార్టీతో అవగహన కుదుర్చుకుంటున్నారో స్పష్టమవుతోందని టీజేఎస్ ఆరోపించింది. సీట్లు అమ్ముకున్నట్టు పార్టీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఈ మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని తెలిపింది. పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది రచనా రెడ్డి.. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంపై తీవ్ర విమర్శలు చేశారు. కోదండరాం మహాకూటమితో అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆయన మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. మహాకూటమిలో సామాజిక న్యాయం జరగలేదని, కోదండరాంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆమె అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు ఇచ్చారని, ఈ కుమ్మక్కులో కోదండరాం కూడా భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. కూటమిలో చాలామంది నేతలను బలిపశువులను చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఇంగితజ్ఞానం ఉందని, చంద్రబాబు ప్రచారాన్ని వారు తిరస్కరిస్తారని ఆమె పేర్కొన్నారు. -
టీజేఎస్‌కు షాకిచ్చిన రచనా రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ జన సమితి (టీజేఎస్)కు భారీ షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది రచనా రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీజేఎస్ ఛైర్మన్ కోదండరాంపై తీవ్ర విమర్శలతో మండిపడ్డారు. ఎన్నికలకు ముందే మహాకూటమి ఫిక్స్ అయ్యిందని, కోదండరాం కూటమితో అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని ఆమె ఆరోపించారు. మహాకూటమిలో సామాజిక న్యాయం జరగలేదని, కోదండరాంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆమె అన్నారు. మైనార్టీలకు టీజేఎస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని.. ఇక మైనార్టీలకు ఏవిధంగా న్యాయం జరిగినట్లని ఆమె ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు ఇచ్చారని, ఈ కుమ్మక్కులో కోదండరాం కూడా భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. కూటమిలో చాలామంది నేతలను బలిపశువులను చేశారని మండిపడ్డారు. కోదండరాం కాంగ్రెస్‌తో కలిసి తనకు తానే ఓటమి చెందుతున్నారని, అసలు కూటమి గెలవడానికా లేక ఓడిపోవడానికా అని ఆమె ప్రశ్నించారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కూటమి కూర్పు లేదని, దానిలో నేతలు రాజకీయ బ్రోకర్లుగా తయారయ్యారని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు ఇంగితజ్ఞానం ఉందని, చంద్రబాబు ప్రచారాన్ని తిరస్కరిస్తారని అన్నారు. -
టీజేఎస్‌కు షాకిచ్చిన రచనా రెడ్డి
-
కొత్త ఎ‘జెండా’
వనపర్తి: గత ముప్పై ఏళ్లుగా రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికార టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు ఈసారి జత కట్టాయి. ప్రజా కూటమిగా ఏర్పడి కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అన్ని పార్టీల జెండాలు పట్టుకోలేక.. అన్నింటినీ కలిపి ఒకే జెండాగా కుట్టించారు. ఈ జెండాలతో వనపర్తి ప్రజాకూటమి అభ్యర్థి చిన్నారెడ్డికి మద్దతుగా కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు. -
వర్ధన్నపేట టీజేఎస్ ప్రచారంలో తేనెటీగల దాడి
సాక్షి, వర్ధన్నపేట: మండలంలో శుక్రవారం మహాకూటమి బలపరిచిన టీజేఎస్ అభ్యర్థి డాక్టర్ పగిడపాటి దేవయ్య ప్రచార పర్వంలో నల్లబెల్లి శివారు గుంటూరుపల్లి వద్ద భోజన సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే వర్ధన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఓ బాలుడి ముఖంపై కుట్టడంతో తీవ్ర అ స్వస్థతకు గురయ్యాడు. కాగా ఆ బాలుడిని వరంగల్‌లోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం ప్రచారంలో భాగంగా చెన్నారం, కాషగూడెం, నల్లబెల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించి మధ్యాహ్నం సమయంలో నల్లబెల్లి శివారు గుంటరుపల్లిలో ఓ షెడ్డులో భోజనాలు చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న తేనెటీగలు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. ఐనవోలు మాజీ చైర్మన్ చంద్రారెడ్డితో పాటు ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ పరమార్శించారు. -
12 ఓరుగల్లు కోటలో..స్తంభాలాట
సమ్మక్క, సారలమ్మ వీరోచిత పోరాటం, రాణి రుద్రమదేవి ప్రతాపం, ప్రతాపరుద్రుడి పాలన ఈ గడ్డ సొంతం. పోరుగల్లుగా పేరొందిన ఈ జిల్లా ఘనమైన వారసత్వ సంపదకూ పుట్టినిల్లు. వెలుగు పంచే కాకతీయ థర్మల్ స్టేషన్.. కొంగుబంగారమై విలసిల్లే ‘నల్ల బంగారు’ గనుల భూపాలపల్లి.. రాజకీయంగానూ, ఉద్యమాలపరంగానూ చైతన్యం వెల్లివిరిసే ఖిల్లా ఇది. తెలంగాణలో హైదరాబాద్ తరువాత రెండో పెద్ద నగరం వరంగల్. పట్టణ జనాభా అధికంగా ఉండే జిల్లా ఇది. ప్రస్తుత ఎన్నికల విషయానికొస్తే.. జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రధాన పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయి. గత ఎన్నికల్లో జిల్లా నుంచి టీఆర్ఎస్ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా, తెలుగుదేశం రెండు, కాంగ్రెస్ ఒకచోట, మరో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాల నుంచి నగరానికి వచ్చే రహదారులు బాగానే ఉన్నాయి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై సామాన్య ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకోవాలని ఓటర్లు అంటున్నారు. వర్ధన్నపేట (ఎస్సీ): వార్ వన్‌సైడ్! వరంగల్ నగర ప్రభావం ఉన్న ఈ నియోజకవర్గంలో పోటీ నామమాత్రంగానే ఉంది. ఇక్కడ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ (టీఆర్ఎస్) మరోసారి పోటీకి దిగగా, కూటమిలో భాగంగా టీజేఎస్ నుంచి పగిడిపాటి దేవయ్య, బీజేపీ నుంచి కొత్త సారంగరావు రంగంలో ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండడం అరూరి రమేష్‌కు కలిసి వచ్చే అంశం. టీజేఎస్ నుంచి పోటీ చేస్తున్న దేవయ్య నియోజకవర్గానికి కొత్త. ఆయనకు కూటమి పార్టీల నుంచి మద్దతు అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఇక్కడ పోటీ పెద్దగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నర్సంపేట: వస్తాద్ ఎవరట నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య హోరాహోరి పోరు జరుగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి సత్తా చాటిన దొంతి మాధవరెడ్డి ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. గతంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పెద్ది సుదర్శన్‌రెడ్డి ఈసారీ పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్యే పోటీ ఉండబోతోంది. ఓంకార్ తనయుడు మద్దికాయల అశోక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి రంగంలో ఉన్నా.. ప్రభావం అంతంతే. టీడీపీకి చెందిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి.. కూటమి అభ్యర్థి ‘దొంతి’కి పూర్తిగా సహకరిస్తే.. గెలుపు సులువవుతుందని అంచనా. స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ): కూత పెట్టేది ఏ పార్టీ? నియోజకవర్గంలో తాటికొండ రాజయ్య (టీఆర్ఎస్), ఇందిర (కాంగ్రెస్) ప్రధానంగా పోటీ పడుతుండగా. బీఎస్పీ నుంచి రాజా రపు ప్రతాప్ కూడా గట్టి పోటీనిస్తున్నారు. మొదట టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి.. రాకపోవడంతో ప్రతాప్ బీఎస్పీ నుంచి బరిలోకి దిగారు. ఇది రాజయ్యకు ఇబ్బందికరమే. ప్రతాప్ టీఆర్ఎస్ ఓట్లు చీల్చే పక్షంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరకు సానుకూలంగా మారనుంది. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రాజయ్య.. 2014లో టీఆర్ఎస్ నుంచి గెలుపొంది ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేయలేదన్న అపవాదు ఉంది. రాజకీయాలకు కొత్త అయిన ఇందిర ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. ములుగు (ఎస్టీ): తేలేదెవరు? ఆపద్ధర్మ మంత్రి చందూలాల్ (టీఆర్ఎస్) – కూటమి అభ్యర్థి సీతక్క (కాంగ్రెస్) మధ్య ప్రధాన పోటీ ఉంది. మంత్రిగా ఉన్నా.. చందులాల్ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్న అసంతృప్తి ప్రజ ల్లో కనిపిస్తోంది. ములుగును జిల్లా కేంద్రంగా చేయడంలోనూ విఫలమయ్యారన్న అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితి సీతక్కకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలోనే సమ్మక్క, సారలమ్మ వనదేవతలు కొలువున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు ఇప్పటికీ రవాణా సౌకర్యం సరిగా లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. భూపాలపల్లి: ప్రధాన పార్టీలకు ‘సింహ’స్వప్నం నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. సింగరేణి కార్మికులు, కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ కార్మికులు, రైతన్నలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు గండ్ర సత్యనారాయణరావు వణుకు పుట్టిస్తున్నారు. టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఈయన సింహం గుర్తు (ఏఐఎఫ్బీ) నుంచి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి స్పీకర్ మధుసూదనాచారి, కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకట రమణారెడ్డి, బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నియోజకవర్గంలో ఉధృతంగా చేస్తున్న ప్రచారం ఎవరికి చేటు తెస్తుందోనన్న ఆందోళన ఉంది. జనగామ: ‘పథకం’ ప్రకారం.. వ్యవసాయధారిత ప్రాంతమైన జనగా మలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (టీఆర్ఎస్), మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య (కాంగ్రెస్) పోటీపడుతున్నారు. ము త్తిరెడ్డి ప్రజలకు అందుబాటులో ఉన్నా.. ఆయనపై భూములకు సంబంధించిన ఆరోపణలున్నాయి. పొన్నాల ఎన్నికలప్పుడు తప్ప.. నియోజకవర్గాన్ని పట్టిం చుకున్నది లేదన్నది సామాన్య ప్రజల ఆవేదన. ఇటీవల కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి చేరికతో కాస్త కాంగ్రెస్ బలం పెరిగింది. నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయన్న అభిప్రాయం ఉంది. సీఎం కేసీఆర్‌ను చూసే ఓటేస్తామని ప్రజలు అంటున్నారు. డోర్నకల్: గెలిచే వారే ‘నాయక్’ నియోజకవర్గంలో చెయ్యి గుర్తంటే రెడ్యానాయక్.. రెడ్యానాయక్ అంటే చెయ్యి గు ర్తన్నట్టు భావించే ఇక్కడి గిరిజన ఓటర్లు ఈసారి ఎటు మొగ్గుతారనేది ఆసక్తికరం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రె డ్యా.. తరువాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడా పార్టీ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి యువనేత డాక్టర్ రామచంద్రు నాయక్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి లక్ష్మణ్నా యక్ కూడా పోటీలో ఉన్నా.. రెడ్యా, రామచంద్రు మధ్యే హోరాహోరీ ఉండనుంది. గిరిజనం రెడ్యానాయక్ గుర్తు చేయి అని పొరబడితే.. ఇబ్బందే. నియోజకవర్గ అభివృద్ధిపైనా అసంతృప్తి ఉంది. వరంగల్ (తూర్పు): ఎవరికి పొద్దుపొడుపు? వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లో ఈ నియోజకవర్గం అంతర్భాగం. ఇక్కడ నగ ర మేయర్ నన్నపునేని నరేందర్ (టీఆర్ఎస్)తో వద్దిరాజు రవిచంద్ర (కాంగ్రెస్) తలపడుతున్నారు. కూటమిలోని టీజేఎస్ నుంచి గాదె ఇన్నయ్య కూడా రంగంలో ఉన్నారు. నియోజకవర్గంలో అభ్యర్థులు చివరి నిమిషం వరకు ఖరారు కాకపోవడంతో నామినేషన్ల ఉపసంహరణ తరువాతే ప్రచారం వేడెక్కింది. మేయర్‌గా రెం డున్నరేళ్లు ఉన్న నరేందర్ ఆశించిన మేర కు అభివృద్ధి చేయలేదన్న విమర్శ ఉంది. రవిచంద్ర స్థానికుడు కాదన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది. గాదె ఇన్నయ్య ఏ మేరకు ప్రభావం చూపిస్తారో చూడాలి. వరంగల్ (పశ్చిమ): ముగ్గురి నడుమ.. ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది. తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ (టీఆర్ఎస్), కూటమి అభ్యర్థిగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి (టీడీపీ), మాజీ ఎమ్మెల్యే ధర్మారావు (బీజేపీ) పోటీ పడుతున్నారు. ఇక్కడ విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గం నుంచి 1994 తరువాత ఏనాడూ టీడీపీ గెలవలేదు. కాంగ్రెస్ టికెట్ ఆశిం చిన నాయిని రాజేందర్‌రెడ్డి.. అసంతృప్తితో ఉన్నారు. ఆయన సహకారం రేవూరికి ఎంతవరకు లభిస్తుందనేది ప్రశ్నార్థకం. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన వినయ్‌భాస్కర్‌కు నియోజకవర్గంపై పట్టుంది. అదే సమయంలో ఆయన అనుచరగణం వ్యవహారశైలిపై ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. పరకాల: తాజా మాజీల పోరు ఇక్కడ తాజా మాజీ ఎమ్మెల్యేలు కొండా సురేఖ (కాంగ్రెస్), చల్లా ధర్మారెడ్డి (టీఆర్ఎస్) పోటీపడుతున్నారు. గతంలో పరకాల ఎమ్మెల్యేగా ఉన్న సురేఖ 2014లో టీఆర్ఎస్ తరఫున వరంగల్ తూర్పు నుంచి గెలిచారు. ఈసారి ఆ పార్టీ టికెట్ లభించకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. మళ్లీ తన పాత నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన ధర్మారెడ్డి టీఆర్ఎస్లో చేరి, అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మహబూబాబాద్: ‘మానుకోట’ రహస్యం నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయ త్నించి విఫలమైన హుస్సేన్‌నాయక్ బీజేపీ నుంచి బరిలోకి దిగి ప్రధాన పార్టీల అభ్యర్థులకు సవాల్ విసురుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న ఈయన.. కాంగ్రెస్, టీఆర్ఎస్ల్లోని ద్వితీయ శ్రేణిని తన వైపు తిప్పుకునే యత్నం చేస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పోటీ పడుతున్నారు. హుస్సేన్‌నాయక్ కాంగ్రెస్ ఓట్లు ఎంత ఎక్కువ చీలిస్తే.. శంకర్‌నాయక్‌కు అంత సానుకూలం.. ఇక్కడ బీఎల్ఎఫ్ కూటమి నుంచి పోటీ చేస్తున్న మోహన్‌లాల్ సంప్రదాయ కమ్యూనిస్టుల ఓట్లను కొంత వరకు రాబట్టుకుంటారు. పాలకుర్తి: పోటీ రసవత్తరం టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉంటూ.. టీఆర్ఎస్లో చేరిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ‘కారు’ గుర్తుతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి జంగా రాఘవరెడ్డి, బీజేపీ నుంచి సోమయ్య రంగంలో ఉన్నారు. కాని ఇక్కడ ప్రధాన పోటీ దయాకర్‌రావు–రాఘవరెడ్డి మధ్యే ఉంది. ఇద్దరికీ నియోజకవర్గంపై పూర్తి పట్టుండటం.. విజయం కోసం ఎంతవరకైనా పోరాడే మన స్తత్వాలు కావడం.. ఆర్థికంగా ఇద్దరూ బలమైన వారే కావడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. నియోజకవర్గానికి సాగునీటి జలాలు తీసుకురావడమే కాక అభి వృద్ధి కార్యక్రమాలు గెలిపిస్తాయని దయాకర్‌రావు భావిస్తున్నారు. ఎలాగైనా గెలుపొందాలని జంగా రాఘవరెడ్డి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ అభ్యర్థిది ప్రేక్షక పాత్రే. ఇంకా.. ఇంకా కావాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగున్నాయి. పెన్షన్లు, షాదీ ముబారక్ పథకాలు పేదలకు ఉపయోగపడతాయి. భూమి లేని వారికి భూమి పంపిణీ చేయాలి. తాగునీటి సమస్య పరిష్కరించాలి. హోటల్ నడిస్తేనే మాకు జీవనాధారం. చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థికసాయం అందించాలి. – సలీమాబేగం, ఖానాపురం అంతన్నారు.. ఇంతన్నారు పోడు భూములకు పట్టాలిచ్చినా అక్కడ వ్యవసాయం చేసుకోనివ్వకుండా అటవీ అధికారులు ట్రెంచింగ్‌లు కొడుతున్నారు. రైతుబంధు కింద పైసలొచ్చినా సాగంటేనే భయమేస్తోంది. మా ఊరును గ్రామ పంచాయతీ చేస్తామని చెప్పి.. ఆ తరువాత జాడలేరు. రోడ్లు లేవు. తాగునీరు లేదు. – ధన్‌సింగ్‌నాయక్, గండితండ, గూడూరు భక్తులకు సౌకర్యాలేవి? లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తుంటారు. వారికి సౌకర్యాలు కల్పించాలి. అటవీ పర్యాటక ప్రాంతంగా మేడారం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ములుగును జిల్లా చేయాలి. – జైపాల్‌రెడ్డి, ఎస్ఎస్ తాడ్వాయి అధికారుల నిర్వాకానికి.. అసైన్డ్ భూముల పేరిట మాకు రైతుబంధు సాయం అందలేదు. ఒకే సర్వేనంబర్‌లోని మరికొందరికి మాత్రం ఇచ్చారు. మాకు తెలియకుండానే నాకున్న ఎకరా భూమిని అసైన్డ్ భూమిగా అధికారులు రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. అది మార్చుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా. – సత్యం, బుధరావుపేట అలాచేస్తే పంట పండినట్టే! ఏ ప్రభుత్వమొచ్చినా.. ఏముంది? మేం కూలీ చేసుకుంటేనే పొట్టనిండుతది. కోతలు కోయడం, వరికుప్పలు వేయడం, వరిగింజలు చేసి సంచుల్లో నింపడం మా పని. ఎకరా ఆరున్నర వేలకు గుత్త తీసుకుంటాం. పది మందితో కూడిన మా బృందం వరికోతలు ముగిసే నెలన్నరలో రూ.6 వేలు సంపాదిస్తది. పాకాల రిజర్వాయర్ నుంచి మా భూములకు నీళ్లిస్తామంటున్నారు. అలా చేస్తే మా పంట పండినట్టే. – బుచ్చయ్య, బుధరావుపేట -
గెలిపిస్తే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా..
సాక్షి, పర్వతగిరి: తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని వర్ధన్నపేట ప్రజా కూటమి (టీజేఎస్) అభ్యర్థి పగిడిపాటి దేవయ్య అన్నారు. మంగళవారం మండలంలోని అనంతారం, గోపనపల్లి, కొంకపాక, చౌటపల్లి, సోమారం, జమాళ్లపురం, నారాయణపురం, రోళ్లకల్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశారన్నారు. తాను మూడు వందల కంపెనీలకు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. మండలానికి ఒక వృద్ధాశ్రమం కట్టించి వైద్యం అందిస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజా కూటమి అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామన్నారు. ప్రచారంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్‌రావు, చౌటపల్లి పీఏసీఏస్ చైర్మెన్ గంధం బాలరాజు, మాజీ సర్పంచ్‌లు బుక్క కుమారస్వామి, యాకయ్య, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వంగాల రవీందర్, అబ్జల్, ప్రభాకర్, గంగాధర్‌రావు, ప్రతినిధి జాటోత్ శ్రీనివాస్ నాయక్, విక్రం నాయక్, జ్యేష్ట చందర్, వెంకటయ్య, సులోచన పాల్గొన్నారు. ప్రజా కూటమితో నవ తెలంగాణ.. ప్రజా కూటమితోనే నవ తెలంగాణ సిద్ధి్దస్తుందని టీడీపీ నేత ఈగ మల్లేషం అన్నారు. మండలంలోని తురుకుల సోమారంలో టీజేఎస్ అభ్యర్థి పగిడిపాటి దేవయ్య గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే శ్రీధర్, బొంపెల్లి దేవేందర్‌రావు పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్ మోసం చేసింది’
ఖిలా వరంగల్: కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాల్లో స్నేహపూర్వక పోటీగా అభ్యర్థులను నిలిపి మోసం చేసిందని, పొత్తు నిబంధనలు పాటించడం లేదని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం వరంగల్ విద్యానగర్ కాలనీలోని టీజేఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి నాలుగేళ్లు రాచరిక పాలన చేసిన కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మహాకూటమి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గాదె ఇన్నయ్య నిజమైన తెలంగాణ ఉద్యమకారుడని, నిరుపేద, అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కోదండరాం చెప్పారు. -
‘అగ్గిపెట్టె’ అందరిదీ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ జనసమితి(టీజేఎస్)కి ఎన్నికల సంఘం కేటాయించిన అగ్గిపెట్టె గుర్తును పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులకూ కేటాయించింది. ఈ ఎన్నికల్లో టీజేఎస్ కేవలం 8 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుండటంతో మిగిలిన నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థుల కోసం ఈ గుర్తును ఈసీ అందుబాటులో ఉంచింది. 111 స్థానాల్లో అగ్గిపెట్టె గుర్తును కేటాయించాలని అడిగిన స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఈ గుర్తును కేటాయించింది. తొలుత రాష్ట్రం లోని 119 స్థానాల్లోనూ పోటీ చేస్తామని అన్ని స్థానాలకు ఉమ్మడి గుర్తును కేటాయించాలని టీజేఎస్ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుని ఆ పార్టీకి అగ్గిపెట్టె గుర్తును కేటాయించింది. అయితే మహాకూటమిలో భాగస్వామ్య పార్టీగా చేరిన టీజేఎస్ కూటమి తరఫున మల్కాజ్గిరి, సిద్దిపేట, అంబర్‌పేట, వర్ధన్నపేట స్థానాల్లో పోటీ చేస్తుండగా ఆసిఫాబాద్, ఖానాపూర్, వరంగల్ ఈస్ట్, దుబ్బాక స్థానాల్లో స్నేహపూర్వక పోటీ నిమిత్తం అభ్యర్థులను బరిలో నిలిపింది. ఈనెల 22న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం నియోజకవర్గాల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలు సిద్ధమయ్యాయి. ఎన్నికల బ్యాలెట్లను ముద్రించడంలో భాగంగా అదేరోజు గుర్తింపు రాజకీయ పార్టీల అభ్యర్థులకు శాశ్వత ఎన్నికల గుర్తులతో పాటు గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులకు ముందే రిజర్వు చేసిన గుర్తులను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు కేటాయించారు. అడిగిన వారికి మాత్రమే.. ఆ తర్వాత జాబితాలో మిగిలిపోయిన గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. ఎనిమిది స్థానాల్లో టీజేఎస్ అభ్యర్థులకు అగ్గిపెట్టె గుర్తును కేటాయించారు. మిగిలిన స్థానాల్లో ఆ పార్టీ కోసం రిజర్వు చేసిన అగ్గిపెట్టె గుర్తు మిగిలిపోయింది. దీంతో ఈ గుర్తు 111 నియోజకవర్గాల్లో ఆ గుర్తు కావాలని అడిగిన స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ ఈ గుర్తును కేటాయించింది. అభ్యర్థుల వినతి మేరకే.. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు అగ్గిపెట్టె గుర్తును కేటాయిం చాలని కోరడంతో స్థానిక రిటర్నింగ్ అధికారులు ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయానికి నివేదించారు. కొత్తగా ఏర్పడిన టీజేఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా గుర్తింపు లభించలేదని, గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీల కోసం రిజర్వు చేసిన ఎన్నికల గుర్తును ఆ పార్టీలు పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించవచ్చని సీఈఓ కార్యాలయం వివరణ ఇచ్చింది. ఎన్నికల బ్యాలెట్లో పార్టీ పేరు స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నప్పటికీ, ఓటర్లు గందరగోళానికి గురై టీజేఎస్ అభ్యర్థిగా భావించి ఓటేసే అవకాశాలు ఉండటం గమనార్హం. -
ముందుస్తు ఎన్నికలు మన అదృష్టం: కోదండరాం
-
ముందుస్తు ఎన్నికలు మన అదృష్టం: కోదండరాం
సాక్షి, మేడ్చల్ : తెలంగాణ రాష్ట్రంలో ముందుస్తు ఎన్నికలు రావటం తెలంగాణ ప్రజల అదృష్టమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ కోదండరామ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 9 నెలల ముందే గద్దె దిగిన కేసీఆర్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. కేసీఆర్‌కు ఓటు వేసినా ఫాంహౌసే, వేయకపోయినా ఫాంహౌసే అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్కు వేసిన ప్రతి ఓటు బురద గుంటలోకి వెళుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి బతుకు దెరువు దొరకాలని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు ఇవ్వలేదన్నారు. ప్రతి వర్గానికి న్యాయం జరగాలని.. తాము సంఘటితంగా బయలు దేరామని, అందరం కలిసి నిలబడతామని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కోట్ల రూపాయలు వెదజల్లుతోందన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్ 25 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ నాలుగు సంవత్సరాలలో మద్దతు ధర అడిగినందుకు రైతుల చేతికి బేడీలు వేశారని, ఇసుక మాఫియాను ఆపినందుకు దళితులను విచ్చలవిడిగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్లలో రేషన్ డీలర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం కూడా పెంచలేదన్నారు. కేసీఆర్‌ది నిరంకుశ, నియంతపాలన.. నిరంకుశ పాలనకు సమాధి కట్టేందుకు అందరూ కూటమికే ఓటేయ్యాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత వార్తలు : ‘కేసీఆర్ కుటుంబం కాళ్లు ఎందుకు అడ్డం పెట్టలేదు’ దానికోసమే సోనియా గాంధీ వచ్చారు : రేవంత్ రెడ్డి -
అవమానాలు భరించాం!
సాక్షి, హైదరాబాద్: ‘‘ఉద్యమ ఆకాంక్షలు, ప్రజల మేలు కోసం కూటమిని ఏర్పాటు చేసుకున్నాం. కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలనుకున్నాం. అందుకే అవమానాలు భరించాం. వివక్ష చూపినా వదిలేశాం. మా పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసే పరిస్థితి తెచ్చారు. మాకు ఇస్తామన్న స్థానాలు ఇమ్మని అడిగినా కాంగ్రెస్ కనికరించలేదు. ఉద్యమంలో పని చేసి, మా పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్న వారి భవిష్యత్‌ను వదులుకున్నాం’’అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. గురువారం అభ్యర్థుల ఉపసంహరణ అనంతరం టీజేఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి అభ్యర్థులుగా టీజేఎస్ 4 స్థానాల్లో పోటీ చేస్తోందని, మరో 4 చోట్ల టీజేఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు స్నేహపూర్వక పోటీ చేస్తున్నారన్నారు. ప్రజలు ఈ పరిస్థితిని గమనించి ఆ 8 స్థానాల్లో టీజేఎస్ అభ్యర్థులకు, అగ్గిపెట్టె గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభిస్తామన్నారు. అభ్యర్థుల ఎంపిక సమయంలో సర్వేల పేరుతో మీవాడు పనికి రాడంటూ కాంగ్రెస్ తమ అభ్యర్థులను చులకన చేసిందన్నారు. అయినా భరించి, పొత్తు ధర్మాన్ని అనుసరించి జనగామ, మిర్యాలగూడ స్థానాలను వదులుకున్నామన్నారు. పొత్తుల్లో జాప్యం వద్దని పోరాటం చేసినా సమాధానం రాలేదన్నారు. తాను పోటీలో లేకపోవడం మంచిదేనని, కేసీఆర్ నిరంకుశ పాలనను ప్రజలకు వివరిస్తానన్నారు. మల్కాజ్గిరి, అంబర్‌పేట, వర్దన్నపేట, సిద్దిపేట, వరంగల్ ఈస్ట్, దుబ్బాక, ఆసిఫాబాద్, ఖానా పూర్లో తమ అభ్యర్థులను గెలిపించాలని, మిగతా స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. హామీల అమలు కోసమే పట్టుబట్టి ‘కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‘ బాధ్యతను తీసుకున్నామన్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆ ఎజెండాను అందుబాటులోకి తెస్తామన్నారు. నాలుగున్నరేళ్లల్లో కేసీఆర్ ఆస్తులు పెంచుకోవడానికే పనిచేశారన్నారు. తాను ఓడితే తనకు నష్టం ఏం లేదని కేసీఆర్ చెప్పిన మాట వాస్తవమేన్నారు. గెలిచినా, ఓడినా ఫాంహౌజ్‌కే పరిమితం అన్నారు. సోనియా సభలో పాల్గొనాలని తనకు ఆహ్వానం వచ్చిందని పాల్గొంటానన్నారు. -
టీజేఎస్‌కు మిగిలింది నాలుగే!
సాక్షి, హైదరాబాద్: ప్రజా కూటమి పొత్తులో తెలంగాణ జన సమితి (టీజేఎస్) సొంతంగా 4 స్థానాల్లో పోటీకే పరిమితమైంది. మరో 4 స్థానాల్లో టీజేఎస్ పోటీ చేస్తున్నా, అక్కడ స్నేహపూర్వక పోటీ పేరుతో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. కోదండరాం చర్చలు జరిపినా కాంగ్రెస్ ససేమిరా అనడంతో టీజేఎస్ 4 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. టీజేఎస్‌కు 8 స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ మొదట్లో చెప్పినప్పటికీ 6 స్థానాలపైనే స్పష్టత ఇచ్చింది. మరో 2 స్థానాలను నామినేషన్ల చివరిరోజు వరకూ దాటవేస్తూ వచ్చింది. కాంగ్రెస్ వైఖరిని గ్రహించిన టీజేఎస్ 14 స్థానాల్లో అభ్యర్థులకు బీ– ఫారాలు ఇచ్చి నామినేషన్లు వేయించింది. గురు వారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఉదయం నుంచి కాంగ్రెస్ నేతలతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పలుమార్లు భేటీ అయ్యారు. తమకు ఇస్తామన్న 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ లేకుండా చూడాలని కోరారు. తొలుత కేటాయించిన మల్కాజిగిరి, వర్ధన్నపేట, సిద్దిపేట స్థానాలు గాక అంబర్‌పేట్‌లో కాంగ్రెస్ తమ అభ్యర్థిని పోటీ నుంచి విరమింపజేయించి టీజేఎస్‌కు ఇచ్చింది. వరంగల్ ఈస్ట్, దుబ్బాక, ఆసిఫాబాద్, ఖానాపూర్ స్థానాలను కూడా ఇవ్వాలని కోదండరాం కోరినా కాంగ్రెస్ తమ అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయలేదు. దీంతో ఈ 4 చోట్ల స్నేహపూర్వక పోటీ తప్పలేదు. టీజేఎస్ నామినేషన్లు వేసిన 14 స్థానాల్లో 8 స్థానాలపై స్పష్టత వచ్చింది. ఇక స్టేషన్ ఘన్పూర్ నుంచి నామినేషన్ వేసిన టీజేఎస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురయింది. దీంతో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థే పోటీలో ఉన్నారు. చర్చల అనం తరం కాంగ్రెస్ అంబర్‌పేట్‌లో తమ అభ్యర్థిని విరమింపజేసి టీజేఎస్‌కు కేటాయించగా, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్, చెన్నూ రు, అశ్వరావుపేట్, మెదక్ స్థానాల్లో స్నేహపూర్వక పోటీకి టీజేఎస్ ప్రతిపాదించినా కాం గ్రెస్ ససేమిరా అనడంతో టీజేఎస్ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అసంతృప్తిలో టీజేఎస్.. సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కాంగ్రెస్ వైఖరి పట్ల టీజేఎస్ తీవ్ర అసహనంతో ఉంది. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి నెలకొందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి కోసం తమ పార్టీని ఫణంగా పెట్టినట్లు అయిందన్న అసంతృప్తిలో ఉన్నారు. టీజేఎస్ అడ్వొకేట్ విభాగం నేతలు గురువారం పార్టీ కార్యాలయంలోనే ఈ విషయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇస్తామన్న 8 స్థానాలను పూర్తిస్థాయిలో ఇవ్వకుండా, స్నేహపూర్వక పోటీ పేరుతో తమ అభ్యర్థులకు నష్టం కలిగించే పరిస్థితిని కాంగ్రెస్ తెచ్చిందన్నారు. ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్ పార్టీ కనికరించలేదని కోదండరామే స్వయంగా పేర్కొనడంతో పార్టీ శ్రేణులు కాంగ్రెస్ తీరుపై భగ్గుమన్నాయి. పొత్తు పేరుతో కాంగ్రెస్.. తమ పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేసిందన్నారు. సీట్ల వ్యవహారంలోనే ఇలా ఉంటే రేపు ప్రజా ఆకాంక్షల అమలుకు కాంగ్రెస్ ఎంత మేరకు సహకరిస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
TJS ,కాంగ్రెస్ మధ్య అయోమయం
-
ఒకేసారి 2 లక్షల రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: అసమానతలు లేని తెలంగాణ సాధన, పరిపాలనలో మార్పు, అమరులు, ఉద్యమ కారుల ఆకాంక్షల సాధన ప్రాతిపదికగా తెలంగాణ జన సమితి (టీజేఎస్) తన ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. పారదర్శక, ప్రజాస్వామిక, బాధ్యతాయుత సుపరిపాలన ధ్యేయంగా తాము పని చేస్తామని.. విధాన నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ముఖ్యమంత్రి ప్రతిరోజు ఉదయం ఒక గంటపాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా పౌర సమాజ సూచనలు, సలహాలు తీసుకునేలా పరిపాలన చేస్తామని పేర్కొంది. సామాజిక న్యా యం, సాధికారత, అందరికీ ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధి కల్పన, వ్యవసాయ అభివృద్ధి ప్రధానాంశాలుగా రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం పార్టీ అధ్యక్షుడు కోదండరాం విడుదల చేశారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివీ.. - రైతులకు ఒకేసారి రూ.2 లక్షల పంటరుణాల మాఫీ - అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో లక్ష ఉద్యోగాలు. ఉపాధి లభించే వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి - ఉద్యమ కాలంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎత్తివేత - వాస్తవ కౌలుదారులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడం - తెలంగాణ మ్యూజియంగా ప్రగతిభవన్ - పేదరైతులను నిరాశ్రయులను చేస్తున్న 2016 భూసేకరణ చట్టం తొలగింపు, 2013 భూసేకరణ చట్టం యథావిధిగా అమలు - ప్రైవేటు యూనివర్సిటీల చట్టం రద్దు - రాష్ట్ర పునర్విభజన చట్టంలోని ఆర్టికల్ 8 రద్దుకు కృషి - అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల ఫిర్యాదుల కోసం వారానికి మూడు గంటల కేటాయింపు - ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆంగ్ల మీడియం బోధన. ప్రతి మండలంలో ఐటీఐ ఏర్పాటు - పేద, మద్య తరగతి ప్రజల ఆరోగ్య వ్యవస్థను మెరుగుపర్చడానికి ఢిల్లీ తరహాలో ‘బస్తీ క్లినిక్’ల ఏర్పాటు - జిల్లా స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు - రిజర్వ్ పంచాయతీలకు రూ.10 లక్షల గ్రాంట్ - గ్రామ పంచాయతీ సిబ్బంది రెగ్యులరైజేషన్ - హైదరాబాద్ నగర ట్రాఫిక్ అధ్యయనం, రోడ్ల మరమ్మతులు - గృహనిర్మాణం కోసం బీపీఎల్ కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లింపు - పేద కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 100–200 యూనిట్ల వరకు సగం ధరకే విద్యుత్తు. గృహ, వ్యాపార, కుటీర పరిశ్రమలు, దోభిఘాట్, హెయిర్సెలూన్లకు విద్యుత్‌చార్జీల తగ్గింపు - సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకం, కొత్త ఓపెన్ కాస్ట్ గనులకు అనుమతి నిరాకరణ - చేనేత కార్మికులకు 8 గంటల పనిదినం. లేబర్ యాక్టు అమలు - గీత కార్మికులకు రూ.2 లక్షల ప్రమాద బీమా, రూ.6లక్షల జీవిత బీమా - గీత కార్మికులకు గృహానిర్మాణ పథకం కింద రూ.5 లక్షలు - పెట్రోల్, డీజీల్, గ్యాస్ రేట్లపై రాష్ట్ర పన్నులు తగ్గింపు - ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు - బీసీ, ముస్లిం మైనార్టీల కోసం సబ్‌ప్లాన్ - అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు 3 నెలల పాటు ఆర్థిక సహాయం - వికలాంగుల పింఛను రూ.2500కు పెంపు - అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోగా అమరులకు స్మృతివనం - సీపీఎస్ విధానం రద్దు. వేతన పెంపు కమిటీ సిఫా ర్సులు అమలు - కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత - బెల్టుషాపుల మూసివేత. పర్మిట్ రూముల రద్దు - 65 సంవత్సరాల పైబడిన జర్నలిస్టులకు పెన్షన్ - బీడీ కార్మికులకు నెలకు రూ.3వేల పెన్షన్. ఎన్నికల అధికారిపై ఫిర్యాదు.. స్టేషన్ ఘన్‌పూర్‌లో తమ పార్టీ అభ్యర్థి చింతా స్వామిని తప్పుదారి పట్టించిన ఎన్నికల అధికారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కోదండరాం తెలిపారు. నామినేషన్ సమయంలో రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థిని ఒక్కరు, రికగ్నైజ్డ్ పార్టీ అభ్యర్థిని పది మంది బలపరచాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే స్టేషన్ ఘన్‌పూర్‌లో తమ పార్టీ అభ్యర్థి పది మందిని తీసుకెళ్లినప్పటికీ.. అక్కడి ఎన్నికల అధికారి ఒక్కరు బలపరిస్తే సరిపోతుందని చెప్పారని తెలిపారు. దీంతో ప్రస్తుతం తమ పార్టీ అభ్యర్థి నామినేషన్ గందరగోళంలో పడిందన్నారు. ముందు మీరు..తర్వాతే మేం! ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమకు ఇస్తామన్న 8 స్థానాలను పూర్తిస్థాయిలో కేటాయించకపోగా.. వరంగల్ ఈస్ట్, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్‌లలో రెండు స్థానాలను ఇస్తామని చెప్పి, వాటిని కూడా తేల్చలేదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. తమకు ఇచ్చిన స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను పోటీలో నిలిపిన నేపథ్యంలో ముందుగా వారు విత్‌డ్రా చేసుకోవాలని, తర్వాతే తాము ఆ పని చేస్తామని స్పష్టంచేశారు. మంగళవారం టీజేఎస్ కార్యాలయంలో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. తాము కూటమి లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని, అయితే అందుకు తమ పార్టీని ఫణంగా పెట్టే పరిస్థితి తెచ్చుకోలేమని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రయోజనం కోసం కాకుండా, ఇవాళ నష్టం జరిగినా.. రేపు కూటమి బతికే విధంగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఎజెండా అమలు విషయంలో కూటమిలోని ఇతర పక్షాలు సహకరించకపోతే ఊరుకోబోమని స్పష్టంచేశారు. కూటమిని సరిగ్గా నడిపిస్తేనే ప్రజలకు లాభం జరుగుతుందని, ఈ విషయాన్ని కూటమిలో పెద్ద పక్షమైన కాంగ్రెస్ గుర్తించనంత కాలం ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డారు. ఆ పాత్రను సరిగ్గా నిర్వహించాలంటే కాంగ్రెస్ కొంత కలుపుకొని పోయే తత్వం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించాలని సూచించారు. వరంగల్ ఈస్ట్ తమకు ఇస్తామన్నందునే ఇన్నయ్యను బరిలో దింపామని కోదండరాం తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ తక్షణ ప్రయోజనాల రీత్యా మరో అభ్యర్థికి సీటు ఇచ్చిందన్నారు. ఇప్పటికీ తమకు ఇచ్చిన స్థానాలను వదిలిపెట్టకుండా వెంట పడితే ఎలా? అన్న అభిప్రాయం ప్రజల్లో వచ్చిందన్నారు. ఇది కూటమికి నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. తమకు ఇస్తామన్న మిర్యాలగూడ సీటును ఆర్.కృష్ణయ్యకు ఇచ్చారని, ఆ విషయం తమకు చెప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ముందుగానే ఈ విషయం చెబితే తమ పార్టీ అభ్యర్థిని నిలిపే విషయంలో ఆలోచించేవారమని పేర్కొన్నారు. -
14 స్థానాల్లో టీజేఎస్ అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా తెలంగాణ జన సమితి (టీజేఎస్)కి కాంగ్రెస్ పార్టీ కేటాయించిన 8 స్థానాలతో పాటు మరో 6 స్థానాల్లో టీజేఎస్ తమ అభ్యర్థులను పోటీలో దింపింది. వాస్తవానికి టీజేఎస్‌కు కేటాయించిన 8 స్థానాల్లో ఆరు స్థానాల విషయంలో స్పష్టత ఇచ్చినా.. వాటిల్లోనూ కాంగ్రెస్ తమ అభ్యర్థులను పోటీలో నిలిపింది. మరో రెండు స్థానాలపైనా పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వలేదు. దీంతో టీజేఎస్ తమకు కాంగ్రెస్ ఇస్తానన్న 8 స్థానాలతోపాటు మరో ఆరు స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీలోకి దింపింది. అయితే విత్‌డ్రాకు సమయం ఉన్నందున ఈలోగా చర్చించి అదనపు సీట్లపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు మెదక్– జనార్దన్‌రెడ్డి, దుబ్బాక– రాజ్‌కుమార్, సిద్దిపేట్– భవానిరెడ్డి, వరంగల్ ఈస్ట్– గాదె ఇన్నయ్య, ఆసిఫాబాద్– విజయ్, చెన్నూరు– నరేష్, మల్కాజిగిరి– కపిలవాయి దిలీప్ కుమార్, మిర్యాలగూడ– విద్యాధర్‌రెడ్డి, మహబూబ్‌నగర్– రాజేందర్‌రెడ్డి, అశ్వారావుపేట– ప్రసాద్, స్టేషన్‌ఘన్‌పూర్– చింతా స్వామి, ఖానాపూర్– భీంరావు, అంబర్పేట్– రమేష్, వర్ధన్నపేట్– దేవయ్య. -
‘తెలంగాణ ఏర్పాటు చివరి మజిలీ కాదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరంకుశ పాలన అంతమొందించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం ఆయన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. తమ పార్టీ పెట్టిన నాలుగు నెలల్లోనే సంఘాన్ని నిలబెట్టామని గర్తుచేశారు. జేఏసీ నుంచి మరికొంత బలాన్ని సమీకరించకున్నట్టు తెలిపారు. జేఏసీగా ఉన్న రోజుల్లోనే రాజకీయ పార్టీపై సమాలోచనలు జరిపామని అన్నారు. రాజకీయరంగం మారకుండా సమస్యలకు పరిష్కారం లభించదనే భావనతో జనసమితి అవిర్భవించిందని పేర్కొన్నారు. అనేక మంది మేధావులతో తమ పార్టీ పటిష్టంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు చివరి మజిలీ కాదని.. తాము ఆశిస్తున్నది సామాజిక మార్పు అని వెల్లడించారు. ఎన్నికల ద్వారా ఏర్పాటైన ప్రభుత్వం ఆ తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం అనేది భారతదేశంలో నెలకొన్న విచిత్ర పరిస్థితి అని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం కొత్త రాజకీయ విధానాలకు రూపకల్పన చేయగలిగిన మార్పు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. అనేక విమర్శలను దృష్టిలో పెట్టుకుని పీపుల్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రతి ఘర్షణ నుంచి ఒక ఐకత్యను నెల రోజుల చర్చల్లో గమనించినట్టు ఆయన తెలిపారు. ప్రజల తరఫున నిలబడి ప్రజల కోసం పోరాడగలిగే కొత్తతరం నాయకత్వం అవసరమని ఆయన అన్నారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారనే ధీమా వ్యక్తం చేశారు. తాము గరికె గడ్డి లాంటి వాళ్లమని.. పీకేసిన కొద్ది మొలుస్తూనే ఉంటామని తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ ఎజెండా గెలిస్తే.. తాము గెలిచినట్టేనని అన్నారు. -
తుది జాబితా ప్రకటించిన టీజేఎస్ అధినేత
సాక్షి, వరంగల్/హసన్‌పర్తి: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐతో ఏర్పడిన మహాకూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థుల తుదిజాబితా ఎట్టకేలకు ఆదివారం రాత్రి విడుదలైంది. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాలకు తెలంగాణ జన సమితి(టీజేఎస్) ఆదివారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ తూర్పు స్థానానికి గాదె ఇన్నయ్య, వర్ధన్నపేటకు డాక్టర్ పగిడిపాటి దేవయ్యను ఖరారు చేసింది. దీంతో వారు సోమవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐతో ఏర్పడిన మహాకూటమి సీట్ల సర్దుబాటులో అనేక మలుపులు, కుదుపులు చోటుచేసుకున్నాయి. పొత్తులో భాగంగా తమ పార్టీలకు కేటాయించిన సీట్లకు ఆయా పార్టీలు అభ్యర్థులను విడతల వారీగా ప్రకటించాయి. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్థానాలను కాంగ్రెస్‌కు కేటాయించగా, ఒక స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, పాలకుర్తి, జనగామ, నర్సంపేట, పరకాల నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి, వరంగల్ పశ్చిమ టీడీపీకి, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట స్థానాలు టీజేఎస్‌కు దక్కాయి. తొలుత వరంగల్ పశ్చిమ స్థానాన్ని తొలుత టీజేఎస్‌కు కేటాయిస్తారని అనుకున్నప్పటికీ టీడీపీలో అగ్రనేతలు ఇతర చోట్ల నిలబడేందుకు వీలు కాకపోడంతో తప్పని పరిస్థితుల్లో టీడీపీకి కేటాయించి ప్రకాశ్‌రెడ్డిని ఇక్కడకు పంపించారు. జనగామ టీజేఎస్‌కు కేటాయించడంతో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో మంతనాలు జరపడంతో చిట్టచివరికి కాంగ్రెస్ నుంచి టికెట్‌ను ప్రకటించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వరంగల్ తూర్పు, వర్ధన్నపేట స్థానాలను టీజేఎస్‌కే కేటాయించినట్లు తెలిసింది. కూటమి పొత్తులో టీజేఎస్ అభ్యర్థులుగా వరంగల్ తూర్పు నుంచి గాదె ఇన్నయ్య, వర్ధన్నపేట నుంచి పగిడిపాటి దేవయ్య సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రెబల్స్ తంటా... కూటమి పొత్తుల్లో వరంగల్ పశ్చిమ, తూర్పు, వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు టీడీపీ, టీజేఎస్‌కు దక్కడంతో ఆ పార్టీలోని నేతలు ఇప్పటికే నామినేషన్లు వేసి రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తామని ప్రకటించారు. వరంగల్ పశ్చిమ నుంచి రాజేందర్‌రెడ్డి, తూర్పు నుంచి రాజనాల శ్రీహరి, వర్ధన్నపేట నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు వినపడుతున్నాయి. రవిచంద్ర గత రెండు రోజులుగా స్థానిక కాంగ్రెస్ నేతలతో సమావేశాలు నిర్వహించడంతో పోటీ చేస్తారని తెలుస్తోంది. బరిలో నిలిచేవారు ఎవరనే విషయం నేడు తేలనుంది. -
పొత్తు పొత్తే.. పోటీ పోటీయే..!!
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల చివరి రోజున మహాకూటమిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అనుకున్నదానికన్నా మరో ఐదు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మహాకూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ 94, టీడీపీ 14, తెలంగాణ జన సమితి 8, సీపీఐ 3 స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ అదనంగా మరో ఐదుగురు అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందజేసీ.. టీడీపీ, టీజేఎస్‌లకు షాక్ ఇచ్చింది. టీడీపీకి కేటాయించిన 2 స్థానాల్లో, టీజేఎస్‌కు కేటాయించిన 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. పఠాన్‌చెరులో శ్రీనివాస్ గౌడ్, దుబ్బాకలో నాగేశ్వర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి, వరంగల్ తూర్పులో గాయత్రి రవి, మిర్యాలగూడలో ఆర్ కృష్ణయ్యలను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపింది. కూటమి పొత్తులో భాగంగా ఇబ్రహీంపట్నం సీటును సామ రంగారెడ్డికి కేటాయించిన టీడీపీ.. పఠాన్‌చెరు నుంచి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. టీజేఎస్‌కు కేటాయించిన మిర్యాలగూడ, వరంగల్ తూర్పు, దుబ్బాక స్థానాల నుంచి ఆ పార్టీ విద్యాధర్‌రెడ్డి, ఇన్నయ్య, చిందం రాజ్‌కుమార్‌లకు బీ ఫామ్‌లు అందజేసింది. అయితే ఈ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలపడంపై టీడీపీ, టీజేఎస్‌లు ఎలా స్పందిస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మహబూబ్‌నగర్‌లో అభ్యర్థిని నిలిపిన టీజేఎస్ కూటమి పొత్తులో భాగంగా మహబూబ్‌నగర్‌ను సొంతం చేసుకున్న టీడీపీ ఆ స్థానం నుంచి ఎర్రశేఖర్‌ను బరిలో నిలిపింది. అయితే మిత్రపక్షమైన టీజేఎస్ కూడా ఆ స్థానానికి తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. మహబూబ్‌నగర్ స్థానానికిగానూ రాజేందర్‌రెడ్డికి టీజేఎస్ బీ ఫామ్ అందజేసింది. దీంతో టీజేఎస్ మొత్తంగా తొమ్మిది స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలిపినట్టయింది. -
కూటమిలో ‘ట్విస్ట్’.. టీడీపీ స్థానంలో టీజేఎస్ బీఫారం
సాక్షి, హైదరాబాద్: కూటమిలో కొత్త ట్విస్ట్ మొదలైంది. సీట్ల సర్దుబాటు ఎంతకూ తెగకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కూటమి పార్టీలు ముందుగా బీ–ఫారాలు ఇచ్చేస్తున్నాయి. నామినేషన్ల దాఖలుకు సోమవారం తుది గడువు కావడంతో ముందు బీ–ఫారం ఇవ్వడం ద్వారా అభ్యర్థికి వెసులుబాటు కల్పించాలని, నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు తుది నిర్ణయం తీసుకోవచ్చనే అంచనాతో టీజేఎస్ ఆదివారం ఏడుగురు అభ్యర్థులకు బీ–ఫారాలు ఇచ్చింది. ఈ జాబితాలో సిద్దిపేట, మెదక్, దుబ్బాక, మల్కాజ్గిరి, మిర్యాలగూడ, వరంగల్ (ఈస్ట్), మహబూబ్‌నగర్ స్థానాలున్నాయి. అయితే, టీజేఎస్ బీ–ఫారాలు ఇచ్చిన స్థానాల్లో నాలుగు చోట్ల ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదు. మహబూబ్‌నగర్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎర్ర శేఖర్‌ను ప్రకటించి బీ–ఫారం కూడా ఇచ్చింది. అలాగే మిర్యాలగూడ విషయం ఎటూ తేలలేదు. ఇక్కడ తన కుమారుడు రఘువీర్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని జానారెడ్డి పట్టుపడుతున్నారు. టీజేఎస్ నుంచి ఆయన బంధువు విజయేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. దీనిపై ఏమీ తేలకుండానే టీజేఎస్ విద్యాధర్‌రెడ్డికి బీ–ఫారం ఇచ్చేసింది. ఇక వరంగల్–ఈస్ట్‌లో కూడా ఇదే పరిస్థితి. ఈ స్థానాన్ని కాంగ్రెస్ ఆశిస్తుండగా అక్కడ గాదె ఇన్నయ్యకు టీజేఎస్ బీ–ఫారం ఇచ్చేసింది. దుబ్బాక స్థానాన్ని చిందం విజయ్‌కుమార్‌కు టీజేఎస్ కేటాయించగా, ఆయన్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన దూతలు ఆదివారం పిలిపించారు. ఆయనతో పాటు దుబ్బాక టికెట్‌ను కాంగ్రెస్ తరఫున ఆశిస్తున్న మద్దుల నాగేశ్వర్‌రెడ్డిని కూడా పిలిపించి మాట్లాడారు. అక్కడ కాంగ్రెస్‌కు పోటీచేసే అవకాశం ఇవ్వాలని విజయ్ను కాంగ్రెస్ దూతలు కోరినట్టు సమాచారం. ఈ నాలుగు స్థానాల్లో ఏమీ తేలకుండానే టీజేఎస్ బీ–ఫారాలు ఇచ్చేయడం గమనార్హం. ప్రకటించారు.. కానీ.. ఇక టీడీపీలో మరో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇబ్రహీంపట్నం స్థానాన్ని సామ రంగారెడ్డికి ఆ పార్టీ ప్రకటించింది. అయితే, ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థులందరికీ బీ–ఫారాలు ఇచ్చారు కానీ, రంగారెడ్డికి ఇవ్వలేదు. అభ్యర్థులందరితో ప్రమాణం చేయించినప్పుడు రంగారెడ్డి కూడా ప్రమాణం చేశారు కానీ, బీ–ఫారం మాత్రం ఇవ్వకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ప్రమాణం చేయించిన వ్యక్తికి బీ–ఫారం ఇవ్వలేదంటే ఆయన్ను అభ్యర్థిగా కొనసాగిస్తారా?.. కొనసాగిస్తే నియోజకవర్గాన్ని మారుస్తారా..? మారిస్తే ఎక్కడ అవకాశం ఇస్తారన్నది ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. టీజేఎస్‌కు 9 స్థానాలు తెలంగాణ జన సమితి 9 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలను ఇచ్చేందుకు ఓకే చెప్పినా 6 స్థానాలకే క్లియరెన్స్ ఇచ్చింది. అయితే టీజేఎస్ తాము 9 స్థానాల్లో పోటీ చేసేలా ఏర్పాట్లు చేసుకుం టోంది. దీంతోపాటు అదనంగా మరో ఎస్టీ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరుతోంది. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకుడు ఆర్సీ కుంతియాతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సమావేశమై చర్చించారు. ఆదివారం స్పష్టత వస్తుందని భావించినా ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో టీజేఎస్ 7 స్థానాల్లో పోటీలో నిలుపనున్న అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేసింది. మెదక్ నుంచి జనార్దన్‌రెడ్డి, సిద్దిపేట నుంచి భవానిరెడ్డి, దుబ్బాక నుంచి రాజ్‌కుమార్, మల్కాజిగిరి నుంచి దిలీప్‌కుమార్, వరం గల్ ఈస్ట్ నుంచి ఇన్నయ్య, మిర్యాల్గూడ నుంచి విద్యాధర్ రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి రాజేందర్ రెడ్డికి బీ–ఫారాలను అందజేశారు. వర్ధన్నపేట, అంబర్పేట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను సోమవారం ఖరారు చేసి, బీ–ఫారాలను అందజేయాలని నిర్ణయించింది. -
టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చోట టీజేఎస్ బీ-ఫారం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు దేశం, తెలంగాణ జన సమితి పార్టీలు తమ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేస్తున్నాయి. మహాకూటమిలో భాగంగా తమ పార్టీ తరపున సీటు ఖరారైన అభ్యర్థులకు ఆయా పార్టీలు బీ-ఫారాలు ఇస్తున్నాయి. ఈ ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ 13 మంది అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేశారు. నందమూరి సుహాసిని తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా తాత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారామె. ఇక తెలంగాణ జన సమితి సైతం ఎన్నిక చేసిన అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసింది. మహకూటమిలో భాగంగా టీజేఎస్‌కు 4 స్థానాలు కేటాయించగా, టీజేఎస్ మాత్రం 7 నియోజవర్గాల అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చింది. మెదక్, సిద్ధిపేట, దుబ్బాక, మల్యాజిగిరి, వరంగల్, మిర్యాలగూడ, మహబూబ్ నగర్ నియోజకవర్గాల అభ్యర్థులకు అధ్యక్షుడు కోదండరామ్ ఫారాలు అందజేశారు. కాగా టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చోట కూడా తమ అభ్యర్థికి టీజేఎస్ బీ-ఫారం ఇచ్చింది. -
నాలుగు స్థానాలకు టీజేఎస్ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనసమితి ఎట్టకేలకు 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిం చింది. టీజేఎస్ అధ్యక్షు డు, ప్రజాకూటమి చైర్మన్ కోదండరాం ఆమోదంతో నలుగురి పేర్లను ఖరా రు చేసినట్లు పార్టీ అధికార ప్రతినిధి యోగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రజాకూటమిలో భాగంగా టీజేఎస్ తరఫున మల్కాజిగిరి నుంచి కపిలవాయి దిలీప్‌కుమార్ పోటీ చేస్తారని తెలిపారు. మెదక్ నియోజకవర్గం నుంచి జనార్దన్‌రెడ్డి, దుబ్బాక నుంచి చిందం రాజ్‌కుమార్, సిద్దిపేట నుంచి భవానీరెడ్డి పోటీలో ఉంటారని వివరించారు. వారు ఈ నెల 18, 19 తేదీల్లో నామినేషన్లు వేస్తారని వివరించారు. మరో 2 స్థానాలకు ఆదివారం అభ్యర్థులను ప్రకటించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. కూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ టీజేఎస్‌కు 8 స్థానాలను ఇస్తామని పేర్కొం దని టీజేఎస్ వర్గాలు తెలిపాయి. వీటిలో ఆరు స్థానాలకు క్లియరెన్స్ ఇచ్చింది. వర్ధన్నపేట, అంబర్పేట్ నియోజకవర్గాలకు కూడా కాంగ్రెస్ గతంలోనే ఓకే చెప్పినా, ఆ స్థానాలను తాము అడగలేదని, స్టేషన్ ఘన్పూర్, జనగామ స్థానాలను తాము అడిగినా ఇవ్వలేదని టీజేఎస్ వర్గా లు పేర్కొన్నాయి. ఇవికాకుండా మరో 2 స్థానాలను కాంగ్రెస్ తమకు ఇచ్చే అవకాశం ఉందని, అందులో మిర్యాలగూడ, వరంగల్ వెస్ట్ స్థానాలపై స్పష్టత వస్తే వాటికి అభ్యర్థులను నేడు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. టీజేఎస్ 12 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో మహబూబ్‌నగర్, స్టేషన్‌ఘన్‌పూర్ వంటి స్థానా ల్లో స్నేహపూర్వక పోటీకి సిద్ధం అవుతోంది. -
కోదండరాం పోటీ లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. ఆయన పోటీ నుంచి తప్పుకున్నారా.. అంటే పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. జనగామను టీజేఎస్‌కు కేటాయించాలని, అక్కడి నుంచి తానే పోటీ చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం భావించారు. అయితే అనేకసార్లు మంతనాలు, సంప్రదింపుల తరువాత జనగామ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య పోటీలో ఉంటారని ప్రకటించారు. దీంతో ఇక కోదండరాం పోటీలో ఉండరని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జనగామతోపాటు మరికొన్ని స్థానాలపై స్పష్టత కోసం శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు చర్చలు జరిపినా టీజేఎస్‌కు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్యను పోటీలో నిలిపేందుకు నిర్ణయించారు. టీజేఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జనగామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య తదితరులు కోదండరాంతో మంతనాలు జరిపిన అనంతరం కుంతియా మీడియాతో మాట్లాడారు. జనగామ నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తుందని, లక్ష్మయ్య బరిలో దిగుతారని వెల్లడించారు. పెద్ద మనసుతో కోదండరాం జనగామ పోటీ నుంచి తప్పుకున్నారన్నారు. ప్రచారం కోసం ఆయన రాష్ట్రమంతా పర్యటించాలని కోరుతున్నామన్నారు. అనేక మంది నాయకులు, విద్యార్థుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. చివరి దశ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాం కీలక పాత్ర పోషించారన్నారు. అయితే పోరా>డి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. టీజేఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ కలసి కేసీఆర్ పాలనను అంతం చేస్తాయన్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకే కూటమి ఏర్పడిందని అన్నారు. కూటమికి కన్వీనర్‌గా కోదండరాం, అధ్యక్షునిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందుకు నడిపిస్తారన్నారు. ప్రచారంలో సోనియా, రాహుల్ పాల్గొంటారని చెప్పారు. కోదండరాం కూడా తమతో సంయుక్త ప్రచారానికి రావాలని కోరుతున్నామన్నారు. తమ ప్రభుత్వ ఏర్పాటులో అందరికీ అవకాశం కలిపిస్తామన్నారు. మేనిఫెస్టోలో చెప్పింది తూచ తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. విభిన్న భావాలు ఉన్నప్పటికీ కామన్ అజెండాతో ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణ ప్రజల నాడి కోదండరాంకు బాగా తెలుసునని, అది తమకు బాగా లాభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎట్టకేలకు టీజేఎస్ తొలి జాబితా
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణ జన సమితి (టీజేఎస్) తెలంగాణా అసెంబ్లీకి పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పీపుల్స్ ఫ్రంట్ కూటమిలో భాగంగా టీజేఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండో జాబితాను ఆదివారం ప్రకటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొపెసర్ కోదండారాం తెలిపారు. అయితే కోదండరాం పోటీ చేసే అంశంపై పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎందరో నేతలతో భేటీల అనంతరం శుక్రవారం అర్ధరాత్రి వరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియాతో కోదండరాం భేటీ అయిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం పార్టీ కోర్ కమిటీతో చర్చించిన అనంతరం నలుగురుతో కూడిని తొలి జాబితాను విడుదల చేశారు. టీజేఎస్ తొలి జాబితా ఇదే.. మల్కాజిగిరి : దిలీప్ కుమార్ కపిలవాయి మెదక్: జనార్ధన్ రెడ్డి దుబ్బాక: చిందం రాజ్ కుమార్ సిద్దిపేట: భవాని రెడ్డి -
ఉద్యమ ఆకాంక్షలే కూల్చుతయ్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాజకీయ పార్టీల ప్రచార సరళిలో నూతన రూపం వచ్చిందని, కొత్త రకం రాజకీయం చేస్తే తప్ప టీఆర్ఎస్ను ఎదుర్కోలేమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. శుక్రవారం టీజేఎస్ కార్యాలయంలో ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి నిర్మాణం లేదు.. పాడు లేదు.. ఉద్యమ ఆకాంక్షలే నాడు గెలిపించాయన్నారు. ఆ ఆకాంక్షలను ప్రజల్లోకి తీసుకుపోతేనే కూటమికి భవిష్యత్తు ఉంటుందన్నారు. గెలిచిన తరువాత టీఆర్ఎస్ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చలేదని, అందుకే అవే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చుతాయన్నారు. సంక్షేమ పథకాల ద్వారా డబ్బు సంపాదించి, వాటిని ఎన్నికలకు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఇప్పుడు గెలవాలని చూస్తున్నారన్నారు. డబ్బు, మద్యం ద్వారా అధికార పార్టీ ముందుకు సాగుతుందని, అందులో తాము వెనుకేనన్నారు. వాటితో గెలవడం కష్టమని, తమ ఎజెండానే తమను గెలిపిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అజెండాను వివరిస్తూ ప్రజల వద్దకు వెళ్తామని, అందుకు సమయం కావాలన్నారు. గతంలో టీఆర్ఎస్ ఇంటింటి ప్రచారంతోనే గెలిచిందన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ కూడా స్వీకరించాలన్నారు. పాత విధానంలో పోతే నష్టమేనని, ప్రచార విధానం మార్చాలని అభిప్రాయపడ్డారు. టీజేఎస్ అభ్యర్థుల ప్రచారం విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని, ప్రస్తుతం పరిస్థితులు, పరిణామాలు ఏం బాగా లేవన్నారు. కాంగ్రెస్ జాప్యంతో ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్న వాళ్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతామని, తమ పార్టీ అభ్యర్థులకు శనివారం బీ–ఫారాలు అందజేస్తామన్నారు. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమకు కేటాయించిన 8 సీట్లలో ఇప్పటి వరకు 6 సీట్లకే స్పష్టత వచ్చిందన్నారు. ఒకట్రెండు నియోజకవర్గాల్లో కూటమి పార్టీలతో స్నేహపూర్వక పోటీ ఉండొచ్చన్నారు. జనగామ సీటు విషయం ఇంకా తేలలేదని, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి ప్రచారానికి తాను వెళ్లనున్నట్లు చెప్పారు. తెలంగాణ జన సమితి బలంగా ఉన్న నియోజక వర్గాల్లో ప్రచారం చేస్తామని కోదండరాం వివరించారు. ఇందులో భాగంగా సభలు, సదస్సులు, ధూంధాంలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా ఈ ఆరు సీట్లకు శుక్రవారం రాత్రి వరకు అభ్యర్థు ల్ని ప్రకటిస్తామని టీజేఎస్ అధినేత తెలిపినా.. జాబితా మాత్రం వెల్లడికాలేదు. -
కోదండరాంకు లైన్‌క్లియర్!
సాక్షి, జనగామ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న జనగామ స్థానం నుంచి పోటీ చేయడానికి తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధినేత ప్రొఫెసర్ కోదండరాంకు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా జనగామ టీజేఎస్‌కు కేటాయించే అవకాశాలు ఖాయమైనట్లుగా తెలుస్తున్నాయి. సిద్ధమైన ప్రచార రథాలు కాంగ్రెస్ ఇప్పటి వరకు మూడు జాబితాలను విడుదల చేసినా జనగామ నుంచి టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే జనగామతోపాటు 11 స్థానాల్లో పోటీ చేస్తా మని టీజేఎస్ ప్రకటించింది. టీజేఎస్ వ్యవహార తీరుపై పొన్నాలతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రెండు పార్టీల్లోనూ జనగామ సీటు పీటముడి వీడటం లేదు. దాదాపుగా జనగామ టీజేఎస్‌కే కేటాయించే అవకాశం ఉండటంతో ప్రచారానికి ఆ పార్టీ సిద్ధం అవుతోంది. ఎనిమిది ప్రచార రథాలను సిద్ధం చేశారు. శుక్రవారం నియోజకవర్గంలో తిప్పడానికి పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ ప్రచార రథాలపై జనగామ అభ్యర్థి కోదండరాం అని రాయడం గమనార్హం. జనగామ జిల్లా కేంద్రంలో టీజేఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఆ పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎన్నికలు అయిపోయే వరకు కోదండరాం ఇక్కడే నివా సం ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కోదండరాం సమీప బంధువులు జనగామలోనే మకాం వేసి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లతోపాటు గుర్తింపు పొందిన ప్రముఖులను కలసి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన ఇద్దరు బలమైన నేతలు కోదండరాం కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19న కోదండరాం నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. ముం దుగా 17న కోదండరాం తరుపున పార్టీ నేతలు మొదటి నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. కార్యకర్తల మూకుమ్మడి రాజీనామా పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు జనగామ అసెంబ్లీ టికెట్ కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న తీరుతో ఆ పార్టీ కార్యకర్తలు, పొన్నాల అనుచరులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 13 మంది కౌన్సిలర్లతోపాటు 28, 500 మంది క్రియాశీలక కార్యకర్తలు మూకు మ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు లేఖ రాశారు. కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. -
‘మహా’ కుదుపు కూటమికి
సాక్షి, వరంగల్: జట్టు కట్టక ముందే కూటమిలో మహా కుదుపు మొదలైంది. సీట్ల పంపకాల్లో పొత్తులు పొసగక పోవడంతో ఎవరికి వారుగా వేరు కుంపటికి సిద్ధమవుతున్నారు. మూడు ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వాళ్లుగా విడిపోయి పోటీకి రెడీ అవుతున్నారు. పెద్ద భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ జిల్లాలో ఐదు సీట్లను త్యాగం చేయాల్సి వస్తుండడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ‘పశ్చిమ’లో తిరుగుబాటు పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తిరుగుబాటు ఎగురవేశారు. కూటమి ఒడంబడికను పక్కనపెట్టి ఆయన తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇక టీజేఎస్ 12 సీట్లలో పోటీ చేస్తామని ఏకపక్షంగా ప్రకటించింది. అందులో నాలుగు సీట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉండడంతో ఇక్కడి మహా కూటమి నేతల్లో ఆందోళన మొదలైంది. టీజేఎస్ ప్రకటించిన వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ తూర్పు, జనగామ నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాయి. కానీ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా సింగపురం ఇందిరను ప్రకటించిన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తామని చెప్పడం గందరగోళానికి దారితీసింది. జనగామ మాదే.. కాదు మాదే.. ఇద్దరు ముఖ్య నాయకులు జనగామ కోసం పోటీ పడుతున్నారు. టీజేఎస్ చీఫ్ కోదండరాం ఇక్కడి నుంచే పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కోదండరాం సమీప బంధువులు నియోజకవర్గంలో మకాం వేశారు. పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఇతర నాయకులను కలుస్తున్నారు. మరోవైపు జనగామ సీటు తనదేనని పొన్నాల లక్ష్మయ్య విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో మకాం వేసి తన సీటును కాపాడుకునేందుకు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పొన్నాలకు మొదటి, రెండో జాబితాల్లో సీటు ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ కొందరు కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఒకటి రెండు రోజుల్లో మరి కొంత మంది నేతలు కూడా రాజీనామాలు చేసే అవకాశం ఉంది. స్టేషన్ ఘన్‌పూర్‌లో గందరగోళం.. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన స్టేషన్‌ఘన్‌పూర్‌లోనూ బరిలోకి దిగుతామని టీజేఎస్ ప్రకటించడంతో మళ్లీ గందరగోళం రేగింది. తొలి జాబితాలోనే కాంగ్రెస్ పార్టీ సింగపురం ఇందిరకు టికెట్ కేటాయించింది. ఈమేరకు ఆమె నామినేషన్‌కు సిద్ధమవుతున్నారు. తాజాగా తాము ఇక్కడి నుంచి కూడా పోటీ చేస్తామని ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. మరో వైపు వర్ధన్నపేట టికెట్ తనకే ఇవ్వాలని కొండేటి శ్రీధర్ గాంధీ భవన్లో ధర్నా చేశారు. కొండేటి నామినేషన్‌కు సిద్ధమవుతున్నట్లు ఆయన అనుచరులు బుధవారం ప్రకటించారు. -
కూటమిలో రె‘బెల్స్’.. పొత్తు చిత్తేనా..?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :మహాకూటమి పొత్తు లెక్కలు మహా సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. కూటమిలో భాగంగా ఆయా పార్టీలకు కేటాయిస్తున్న లెక్కలు దారితప్పుతున్నాయి. ముఖ్యంగా తొలి జాబితాలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ కలిపి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. వీటిలో కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు, రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. కూటమిలో భాగంగా మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ తన అభ్యర్థిగా ఎర్ర శేఖర్‌ను ప్రకటించింది. అయితే ఆశ్చర్యకరంగా అదే స్థానానికి తెలంగాణ జన సమితితో పాటు తెలంగాణ ఇంటి పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించింది. టీజేఎస్ తరఫున పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.రాజేందర్‌రెడ్డి పేరును ప్రకటించగా.. తెలంగాణ ఇంటి పార్టీ తమ అభ్యర్థిగా యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేరును ప్రకటిస్తూ జాబితా వెల్లడించింది. అంతేకాకుండా తెలంగాణ ఇంటి పార్టీ జడ్చర్ల అభ్యర్థిగా వి.శివకుమార్, నారాయణపేట అభ్యర్థిగా జనగారి నవిత పేర్ల ను ప్రకటించారు. జడ్చర్ల స్థానానికి మహాకూటమి నుంచి కాంగ్రెస్ నేత మల్లు రవి పేర్లు ఇప్పటికే వెల్లడించారు. ఇక దేవరకద్ర అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి బరిలో నిలవాలని భావిస్తుండగా... టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతమ్మ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు మక్తల్‌లో జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరికి టికెట్ ఇప్పించేందుకు డీకే.అరుణ ఢిల్లీలో యత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మహాకూటమి ఉన్నట్లా, విచ్ఛినమైనట్లేనా అనే చర్చ మొదలైంది. ఎత్తుకు పైఎత్తు! ముందస్తు ఎన్నికల్లో భాగంగా మహాకూటమి భాగస్వామ్య పార్టీలన్నీ ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఎన్నికల బరిలో నిలిచే విషయంలో ఎక్కువ స్థానాలు దక్కించుకునేందుకు ఒకరిపై ఒకరు మైండ్ గేమ్ ఆడుతున్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్ఎస్ను గద్దె దింపడం కోసం అన్ని రాజకీయపక్షాలు కలిపి మహాకూటమిగా జత కట్టిన విషయం తెలిసిందే. అయితే కూటమిలోని పార్టీలన్నీ కూడా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు తహతహలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తు లెక్కల విషయంలో సయోధ్య కుదరక అన్ని పార్టీలు కూడా సతమతమవుతున్నాయి. అసెంబ్లీని రద్దు చేసి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా పొత్తులు ఓ కొలిక్కి రావడం లేదు. తాజాగా నోటిఫికేషన్ వెలువడి.. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ఏదో ఒకటి తేల్చాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ఎనిమిది, టీడీపీ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో కూటమి భాగస్వామ్య పక్షాలైన టీజేఎస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన టీజేఎస్ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో భాగంగా మహబూబ్‌నగర్ నుంచి రాజేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇదిలా ఉంటే మరోవైపు కూటమిలో భాగంగా టీడీపీకి ఇదివరకే రెండు స్థానాలు కేటాయించగా.. దేవరకద్ర నుంచి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సీతమ్మ బుధవారం నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. అంతేకాకుండా మహాకూటమి నుంచి టీడీపీ, కాంగ్రెస్‌కు సీట్లు కేటాయించిన మహబూబ్‌నగర్, జడ్చర్లకు తెలంగాణ ఇంటి పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేయడం విశేషం. అంతేకాకుండా ఇంకా మహాకూటమి అభ్యర్థి ఖరారు కాని నారాయణపేట నుంచి ఈ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. మక్తల్ సీటుపై పీటముడి మక్తల్ అసెంబ్లీ స్థానం విషయంలో మళ్లీ కొత్త అంశం తెరపైకి వచ్చింది. కూటమి భాగస్వామ్యంలో భాగంగా టీడీపీకి ఈ స్థానాన్ని కేటాయించారు. అందుకు అనుగుణంగా టీడీపీ తరఫున ఆ పార్టీ అభ్యర్థిగా కె.దయాకర్‌రెడ్డి బుధవారం నామినేషన్ సైతం దాఖలు చేశారు. అయితే ఈ స్థానాన్ని కాంగ్రెస్ అంత సులువుగా వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. మక్తల్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ బీసీ కోటాలో సిట్టింగ్ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరికి ఇవ్వాలంటూ మాజీ మంత్రి డీకే.అరుణ ఢిల్లీలో అధిష్టానం వద్ద యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజికవర్గం ఎక్కువగా ఉండడంతో పాటు శ్రీహరికి మక్తల్‌లో పట్టు ఉందని కొన్ని సర్వేల నివేదికలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అంతేకాదు గత ఎన్నికల్లో మక్తల్ నుంచి పోటీ చేసిన దయాకర్‌రెడ్డి బీజేపీ మద్దతు ప్రకటించినా మూడో స్థానంలో నిలిచారని కాంగ్రెస్ హైకమాండ్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం మీద సీట్ల పంపిణీ కథ మొదటికి వచ్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వీడని ఉత్కంఠ ఓవైపు కూటమి చిచ్చు రగులుతుండగా... మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థుల అంశం ఆ పార్టీ కేడర్‌కు మరింత ఉత్కంఠతకు గురిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు రెండు విడతల్లో భాగంగా విడుదల చేసిన జాబితాలో ఉమ్మడి జిల్లా నుంచి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. ఇక రెండు స్థానాలు కూటమిలో భాగంగా టీడీపీకి కేటాయించారు. అయితే మరో మూడు స్థానాల విషయంలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. దేవరకద్ర, నారాయణపేట, కొల్లా పూర్‌కు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో రెండు గ్రూపులుగా ఉన్న డీకే.అరుణ, జైపాల్‌రెడ్డి ఎవరికి వారు తమ వర్గం నేతలకు టికెట్లు ఇప్పించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరు వర్గాలు కూడా ఢిల్లీలో మకాం వేయడంతో అభ్యర్థుల ఖరారు విషయంలో మరింత జాప్యం జరుగుతోంది. -
పొత్తుల్లో సందిగ్ధతే కారణం: పొన్నాల
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా కూటమిలోని మిత్రప క్షాల మధ్య పొత్తుల విష యంలో ఏర్పడిన సంది గ్ధత వల్లే జనగాం సీటు ప్రకటన విషయంలో ఆలస్యమవుతోంది తప్ప.. తనకు సీటు ఇవ్వాలా వద్దా అన్న విషయంలో కాదని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. ఢిల్లీలో బుధ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనగాం నుంచి పోటీ చేసేది తానేనని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. పొత్తుల విషయంలో ఏర్పడిన సందిగ్ధతను పరిష్కరించడంలో ఆలస్యమవు తోందన్నారు. ఇక కొత్తగా వచ్చిన ఓ రాజకీయ పార్టీ కూడా జనగాం నుంచే పోటీ చేస్తామన డంపై ముందుగా తేల్చాలన్నారు. -
12 స్థానాల్లో పోటీ
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల పంపకంలో గందరగోళానికి ఇంకా తెరపడలేదు. తాము 12 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలంగాణ జన సమితి ప్రకటించింది. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పి.ఎల్ విశ్వేశ్వరరావు టీజేఎస్ పోటీ చేసే స్థానాల పేర్లు ప్రకటించారు. దుబ్బాక, మెదక్, మల్కాజ్గిరి, అంబర్‌పేట, సిద్దిపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్పూర్, జనగాం, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. కాగా, మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై సంప్రదింపులు ఇంకా సాగుతున్నట్లు టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి తెలిపారు. పార్టీ ప్రకటించిన అన్ని స్థానాల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటామని చెబుతూనే ఒకటి రెండు సీట్లు అటూఇటుగా పోటీ చేస్తామని చెప్పడం గందరగోళానికి తెరలేపింది. మిత్రపక్షాల స్థానాల్లోనూ పోటీ టీజేఎస్ పోటీ చేయనున్నట్లు ప్రకటించిన స్థానా ల్లో మహాకూటమి పక్షాలు కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన స్థానాలు కూడా ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్, ఆసిఫాబాద్ స్థానాల నుంచి కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్‌నగర్ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించారు. పొన్నాల లక్ష్మయ్య ఆశిస్తున్న జనగాం స్థానం నుంచి తామే పోటీలో ఉంటామని టీజేఎస్ ప్రకటించింది. -
ట్విస్ట్: 12 స్థానాల్లో టీజేఎస్ పోటీ
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల పంపకంలో గందరగోళం కొనసాగుతుంది. తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) ప్రకటించింది. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. టీజేఎస్ కార్యాలయంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పిఎల్ విశ్వేశ్వర రావు తాము పోటీ చేసే నియోజకవర్గాల పేర్లు ప్రకటించారు. దుబ్బాక, మెదక్, మల్కాజిగిరి, అంబర్ పేట, సిద్దిపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, అసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్, జనగాం, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ నుంచి పోటీకి దిగనున్నట్టు ప్రకటించారు. టీజేఎస్‌కు 8 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జనగాం మాదే: టీజేఎస్ కాంగ్రెస్ పార్టీతో జనగాం సీటుపై పంచాయతీ తేలకుండానే ఇక్కడి నుంచి తామే పోటీ చేస్తామని టీజేఎస్ ప్రకటించడం విశేషం. మరోవైపు జనగాం సీటు తనదేనని పొన్నాల లక్ష్మయ్య విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో మకాం వేసి తన సీటును కాపాడుకునేందుకు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్లిన మహబూబ్‌నగర్ స్థానంలోనూ పోటీ చేస్తామని టీజేఎస్ ప్రకటించడంతో మళ్లీ గందరగోళం రేగింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన అసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్‌లోనూ బరిలోకి దిగుతామని ప్రకటించింది. కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకేనా? మహాకూటమిలో తమకు కేటాయించిన 8 స్థానాలకు మించి టీజేఎస్ అభ్యర్థులను ప్రకటించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబ్‌నగర్‌లో తాము బలంగా ఉన్నామని, కచ్చితంగా గెలుస్తామని టీజేఎస్ చెబుతోంది. ఇక్కడి అభ్యర్థులను ఉపసంహరించుకునేలా కాంగ్రెస్, టీడీపీలను ఒప్పిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఎక్కడా స్నేహపూరక పోటీ ఉండదని చెబుతూనే, తాము మాత్రం వెనక్కు తగ్గబోమన్న సంకేతాలు ఇచ్చింది. కూటమిలో పట్టువిడుపులు ఉండాలని, తాము బలంగా ఉన్న సీట్లను మాత్రమే కోరుతున్నామని తెలిపింది. కాంగ్రెస్ హైకమాండ్‌తో తమ పార్టీ అధ్యక్షుడు కోదండరాం జరుపుతున్న చర్చలు ఫలిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచింది. అయితే ఆశావహులను బుజ్జగించే ప్రయత్నంలోనే టీజేఎస్ ఈ ఎత్తుగడ వేసిందన్న వాదనలు లేకపోలేదు. మహాకూటమిలో కొనసాగుతామని టీజేఎస్ స్పష్టం చేసింది. -
గౌరవాన్ని తాకట్టు పెడతారా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సీపీఐ, టీజేఎస్ నేతలు కూటమిలో అవమానాలు భరిస్తూ సీట్ల కోసం తమ గౌరవాన్ని తాకట్టు పెట్టొ ద్దని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం హితవు పలికారు. కూటమి నుంచి బయటకు వచ్చి బీఎల్‌ఎఫ్‌తో కలిస్తే అడిగినన్ని సీట్లు ఇస్తామని చెప్పా రు. ఖమ్మంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు, మూడు సీట్ల కోసం పాకులాడి చులకన కావద్దని సీపీఐకి హితవు పలికారు. టీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అంటూ సీపీఐ చెప్పడం ఆత్మహత్యాసదృశమేనని చెప్పారు. ఈ పరిస్థితి నుంచి సీపీఐతో పాటు టీజేఎస్ బయటపడి ప్రజల కోసం విధానపరంగా పోరాడుతున్న సీపీఎం–బీఎల్ఎఫ్ కూటమికి చేరువ కావాలని కోరారు. స్వచ్ఛమైన రాజకీయాల కోసం ప్రత్యామ్నాయ రాజకీయమే లక్ష్యంగా బీఎల్ఎఫ్ పోటీ చేస్తోందని చెప్పారు. 72 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశాన్ని అధోగతి పాలు చేసిందని, టీఆర్ఎస్ కుటుంబ పాలనతో ఆపార్టీ నేతలు జనం కలలను కల్లలు చేశారన్నారు. ఇప్పటికైనా సీపీఐ, టీజేఎస్‌లు పునరాలోచించుకోవాలని కోరారు. -
పోటీ నుంచి తప్పుకుంటున్నా : కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. దీంతో అక్కడ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్న పీసీపీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కోదండరాం జనగామ నుంచి బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ కూడా తన తొలి జాబితాలో జనగామ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో అక్కడ నుంచి కోదండరాం బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా తాను జనగామ పోటీ నుంచి తప్పుకుంటున్నాని కోదండరాం పేర్కొన్నారు. బీసీ సీటు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయనే భావనతో జనగామ పోటీ నుంచి కోదండరాం తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్న పీసీపీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు లైన్‌క్లియర్ అయింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గ సీటును తనకే కేటాయించాలని పొన్నాల మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. కోదండరాం తప్పుకోవడంతో కాంగ్రెస్ జనగామ టికెట్‌ను పొన్నాలకు కేటాయించే అవకాశం ఉంది. కాగా కోదండరాం ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి తరపున ప్రచారం చేస్తారని తెలుస్తోంది. కానీ ఈ విషయంపై కోదండ రాం ఎలాంటి ప్రకటన చేయలేదు. తన పోటీపై ఇప్పుడేమి మాట్లాడని కోదండరాం మంగళవారం మీడియాతో చెప్పారు. ఎక్కడ నుంచి పోటీ చేసేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. టీజేఎస్ కు మొత్తం 11 సీట్లు ఖరారయ్యాయని కోదండరాం పేర్కొన్నారు. మల్కాజ్గిరి, మెదక్, దుబ్బాక, సిద్ధిపేట, వర్ధన్నపేట, అంబర్‌పేట సీట్లను టీజేఎస్‌కు కేటాయించారన్నారు. మరో ఐదు సీట్ల విషయంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. టీజేఎస్ సీట్లను బుధవారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. -
ఎన్నికల బరి నుండి తప్పుకోనున్న కోదండరామ్