![TJS Party Leader Filed A Complaint Against TRS Party - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/8/complaint1.jpg.webp?itok=W-raQ7Ix)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ రగడ మొదలైంది. ఎన్నికల ప్రచారంతో పాటు ప్రత్యర్థి పార్టీకి చెందిన కార్యాలయాలపై కూడా దాడులు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ కార్యాలయంపై టీఆర్‌ఎస్‌కు చెందిన వ్యక్తులు బుధవారం రాత్రి దాడి చేశారని తెలంగాణ జనసమితి పార్టీ ఆరోపించింది.
మిర్జాల్‌గూడలోని తెలంగాణ జనసమితి ఆఫీసుపై దుండగులు దాడి చేసి బ్యానర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారని మల్కాజిగిరి టీజేఎస్ అభ్యర్థి కపిలవాయి దిలీప్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యాలయంలో సమీపంలో గల సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్ పార్టీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందనీ, భద్రత కల్పించాలని మల్కాజిగిరి డీసీపీకి విన్నవించారు. టీజేఎస్ అధికార ప్రతినిధి యోగేశ్వర్ రెడ్డి వెదిరె ఈ దాడిని ఖండించారు.
![1](https://www.sakshi.com/gallery_images/2018/11/8/complaint.jpg)
Comments
Please login to add a commentAdd a comment