TRS leaders
-
క్యాసినో వ్యవహారం.. చికోటి పొలిటికల్ లింకుల్లో టెన్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు. రాజకీయ వేడిని పెంచుతున్నాయి. విదేశాల్లో క్యాసినో అక్రమ నిర్వహణ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేసింది ఈడీ. ఈ క్రమంలో.. చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో నోటీసులు అందుకున్న నేతల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే మంత్రి తలసాని సోదరులు మహేష్, ధర్మేంద్రలను సుదీర్ఘంగా ప్రశ్నించారు ఈడీ అధికారులు. క్యాసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలు, మనీలాండరింగ్, హవాలా చెల్లింపులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. శుక్రవారం వీళ్లిద్దరినీ మరోసారి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చీకోటి ప్రవీణ్, ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డులను పరిశీలించిన ఈడీ అధికారులు ఈ కేసీనో వ్యవహారంలో ఎవరెవరూ ఉన్నారన్న పూర్తి సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఫ్లయిట్ టికెట్ బుకింగ్ వివరాలు సేకరించింది. దీనిలో దాదాపు వంద మంది క్యాసినో కస్టమర్లు ఉన్నట్లు గుర్తించి.. ఆ మేరకు జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. అంతేకాదు.. క్యాసినో వ్యవహారంతో సంబంధమున్న వారికి నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. అందులో భాగంగానే శుక్రవారం విచారణకు హాజరుకావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డిలకు సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో చికోటి ప్రవీణ్‌తో సంబంధాలు ఉన్న రాజకీయ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ కొలువు.. ఇక సో ఈజీ! -
షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత
ధర్మారం: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల పెద్దపల్లి జిల్లా ధర్మారంలో చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర ఆదివారం ఉద్రిక్తతల మధ్య సాగింది. మండలంలోని కొత్తూరు గ్రామానికి పాదయాత్ర చేరుకుంది. చౌరస్తాలో షర్మిల మాట్లాడుతుండగా గ్రామ సర్పంచ్ తాళ్ల మల్లేశం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా కేసీఆర్ డౌన్‌డౌన్ అని షర్మిలతోపాటు వైఎస్సార్టీపీ నాయకులు నినదించారు. ఈ క్రమంలోనే షర్మిల మాట్లాడుతున్న వ్యాన్‌వైపు టీఆర్ఎస్ నాయకులు దూసుకొచ్చారు. స్పందించిన షర్మిల..‘దాడులకు భయపడేదిలేదు. రండి..దమ్ముంటే దాడులు చేయండి.. దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు..’అని ప్రశ్నించారు. పోలీసులు వారందరినీ అక్కడ్నుంచి వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా చామనపల్లికి వెళ్లవద్దని షర్మిలకు పోలీసులు సూచించగా..తాను తప్పకుండా వెళ్తానని స్పష్టం చేశారు. చామనపల్లి మార్గంమధ్యలో అడ్డగింపు కొత్తూరు గ్రామం నుంచి చామనపల్లి గ్రామానికి పాదయాత్రకు వెళ్తున్న షర్మిలను గ్రామానికి వెళ్లకుండా మార్గంమధ్యలో న్యూకొత్తపల్లి వద్ద టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాసూరి శ్రీధర్ ఆధ్వర్యంలో నాయకులు రాస్తారోకో చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు టీఆర్ఎస్ నాయకులను అడ్డుతొలగించారు. షర్మిల తాత్కాలిక షెడ్ల తొలగింపు మండలంలోని కటికెనపల్లి శివారులో ఆదివారం రాత్రి బస చేసేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లను తొలగించారు. అనంతరం అదే శివారులోని మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మామిడితోట సమీపంలో తిరిగి షెడ్లను వేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..ఆడపిల్లపై దాడిచేస్తే ఆడోళ్లంటారని, ప్రశ్నిస్తే ఎదుర్కొనే దమ్ములేక దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. -
నోటికొచ్చినట్లు మొరుగుతూనే వుంటారు.. పట్టించుకోవద్దు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని విజ్ఞప్తి. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.’ అని ట్వీట్ చేశారు కేటీఆర్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు — KTR (@KTRTRS) October 27, 2022 ఇదీ చదవండి: అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా? -
కారు గుర్తును పోలి 8 గుర్తులు.. ఈసీని కలిసిన టీఆర్ఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను టీఆర్ఎస్ నేతలు కలిశారు. కారు గుర్తును పోలి ఉన్న 8 గుర్తులను మార్చాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌పై క్షుద్ర పూజల ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారిని కలిసినవారిలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ ఉన్నారు. చదవండి: చిక్కుల్లో మంత్రి మల్లారెడ్డి.. బయటపడిన వీడియో.. ఆయన స్పందన ఇదే.. కాగా, కేసీఆర్ చాలా రోజుల నుంచి తాంత్రిక పూజలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. తనకు ఉన్న సమాచారం మేరకు తాంత్రికుడు చెప్పడం వల్లే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) అన్న పేరుకు కాలం ముగిసిందని, ఆ పేరుతో వెళ్తే తలకిందులేసి తపస్సు చేసినా పార్టీ గెలవదని తాంత్రికుడు చెప్పాడని, అందుకే తాంత్రికుల సూచనతో బీఆర్ఎస్గా పేరు మార్చారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కు జెండా లేదు.. ఎజెండా లేదు. దేశాన్ని ఉద్ధరించడానికి బీఆర్ఎస్ పెట్టలేదని.. కేవలం దెయ్యాలు, రాక్షస పూజలు చేస్తున్నాడు కాబట్టే వారి మాటలు విని పార్టీ పేరు మార్చాడని బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. -
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణాలో దుమారం
-
మావోల హిట్‌లిస్టులో ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్..!
సాక్షి , కరీంనగర్: ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కరీంనగర్లో రెండువారాలుగా కలకలం రేగుతోంది. మావో యిస్టు రాష్ట్ర కార్యదర్శి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, యాక్షన్ కమిటీ సభ్యుడు పాండు అలియాస్ మంగులు దళాలు ప్రవేశించాయని పోలీసులు అప్రమత్తమయ్యారు. గోదావరి నది దాటి వీరు పెద్దపల్లి జిల్లాలోనూ ప్రవేశించే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో సోమవారం సీఎం పెద్దపల్లి పర్యటనలో ఆఖరు నిమిషాన రోడ్డు మార్గం వద్దని పోలీసులు కేసీఆర్‌ను ఆకాశమార్గం (హెలీక్యాప్టర్) ద్వారా రప్పించారు. 2005 తరువాత మావోయిస్టు పార్టీ పాత కరీంనగర్ జిల్లాలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. 2020 లాక్డౌన్ సమయంలో జిల్లాలో కార్యకలాపాలు సాగించేందుకు తిరిగి యత్నాలు ప్రారంభించింది. సిరిసిల్లలో ఓ కాంట్రాక్టరు వద్ద డబ్బులు వసూలు చేయడం, జగిత్యాలలోనూ రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నించడం వంటి ఘటనలు వెలుగుచూశాయి. ఎక్కడికక్కడ అణిచివేత..! మావోలతో సంబంధాలున్న ఏ నెట్‌వర్క్‌నైనా ఉమ్మడి జిల్లా పోలీసులు ఎక్కడికక్కడ భగ్నం చేశారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో గ్రానైట్ పరిశ్రమలలో పనిచేసే కొందరితో మావోలు కొంతకాలం రహస్య సంబంధాలు నెరిపారు. ఈ వ్యవహారంపై కన్నేసిన కరీంనగర్ సీపీ సత్యనారాయణ గంగాధర, చొప్పదండి, బావుపేట, హుస్నాబాద్‌లకు చెందిన పలువురిని అరెస్టు చేసి మావోల నెట్‌వర్క్‌ను తెంచారు. అలాగే.. జనశక్తి పేరిట కొందరు మాజీలు సిరిసిల్లలో కార్యకలాపాలకు పూనుకునేందుకు సిద్ధమైనా.. ఎస్పీ రాహుల్ హెగ్డే వీరిని ఆదిలోనే అణిచివేశారు. ఇదే జనశక్తికి చెందిన పలువురు ఆయుధాలతో జగిత్యాలలో సంచరిస్తుండగా.. ఎస్పీ సింధు శర్మ బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఎలాంటి కదలికల్లేకుండా జాగ్రత్తపడుతున్నారు. సున్నిత ప్రాంతంగా పెద్దపల్లి జిల్లా.. తాజాగా పెద్దపల్లి జిల్లాలోని ఆర్ఎఫ్సీఎల్లో వెలుగుచూసిన కుంభకోణంలో మావోయిస్టు కార్యదర్శి వెంకటేశ్ పేరుతో విడుదలవుతున్న లేఖలపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఆ లేఖల్లో పలువురు నేతల పేర్లు ప్రస్తావించడంతో అవి ఎక్కడ నుంచి వచ్చాయన్న విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. అదే విధంగా మాజీ మావోలపైనా రహస్యంగా నిఘా కొనసాగిస్తున్నారు. ఈ లేఖలు తొలుత ఆగస్టు 25న, ఆ తరువాత 31న మావోయిస్టు పార్టీ జయశంకర్– మహబూబాబాద్– వరంగల్2– పెద్దపల్లి జిల్లాల డివిజన్ కమిటీ పేరుతో వచ్చాయి. తొలుత ఈ లేఖను కొందరు ఆకతాయిలు విడుదల చేశారని పోలీసులు భావించారు. కానీ.. వీటిని మావోయిస్టులే విడుదల చేశారని ఇటీవల పోలీసులు కూడా నిర్ధారించినట్లు సమాచారం. మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులకు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతంలోని కొందరు నాయకులకు ముప్పు అధికంగా ఉందని, దీన్ని సున్నిత ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అనుమానితులు, కొత్త వ్యక్తుల సమాచారాన్ని నిరంతరం తెప్పించుకుంటున్నారు. జిల్లా సరిహద్దుల వద్ద సీసీ కెమెరాలు, ఇన్ఫార్మర్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. చదవండి: Hyderabad: చూస్తుండగానే బాలుడిపైకి దూసుకెళ్లిన కారు.. భయానక దృశ్యాలు టీఆర్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్..! విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలను టార్గెట్‌గా చేసుకుని మావోలు దాడులకు పాల్పడతారన్న సమాచారం పోలీసుల వద్ద ఉంది. తద్వారా పాత జిల్లాలో తిరిగి ఉనికిని చాటుకోవాలన్నది మావోల వ్యూహమని పోలీసులు చెబుతున్నారు. దీంతో మావోల జాబితాలో ఉన్న సదరు నేతలను పోలీసులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎక్కడా పర్యటించవద్దని స్పష్టంచేశారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా నేతలకు ముప్పు అధికంగా పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నెట్వర్క్ నాశనమైందన్న ఆందోళనలో ఉన్న మావోలు దాన్ని పునరుద్ధరించుకోవాలన్నా.. పార్టీకి నిధులు సమకూర్చుకోవాలన్నా.. వారి ముందున్న ఏకైక మార్గం హింస. అందుకే.. పోలీసులు వీఐపీ నేతల రక్షణకు సంబంధించిన ప్రతీ అంశాన్ని చాలా పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. భద్రత విషయంలో చిన్న లోపమున్నా.. మావోలు హింసకు పాల్పడతారన్న సమాచారంతో అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. -
ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై గ్రామస్తుల దాడి
ఇబ్రహీంపట్నం/కోరుట్ల/జగిత్యాల: వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై ఎర్దండి గ్రామస్తులు దాడి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టునుంచి నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిని ఆ వరద చుట్టుముట్టింది. బాధితులను పరామర్శించి, గోదావరి వరదపై సమీక్షించేందుకు ఎంపీ అర్వింద్ శుక్రవారం ఆ గ్రామానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ‘ఎంపీ అర్వింద్ డౌన్ డౌన్.. గో బ్యాక్’అని నినాదా లు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఓ గ్రామస్తుడు ఎంపీకి చెప్పుల దండ వేసేందుకు య త్నించాడు. పోలీసులు అడ్డుకుని అతడిని పక్క కు పంపించారు. తమ గ్రామంలో భూ సమస్యను పరిష్కరించకుండా ఎందుకు వచ్చారని గ్రామస్తులు ఆయనను నిలదీశారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకుని పంపించారు. దీంతో ఎంపీ గోదావరి నది వద్దకు వెళ్లి వరద పరిస్థితి సమీక్షించి వెనుదిరిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మరోసారి ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కొందరు ఆగ్రహంతో ఎంపీ కారుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎంపీ కారు వెనుకాల అద్దం పగిలిపోయింది. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులు బందోబస్తు మధ్య ఎంపీని అక్కడినుంచి పంపించివేశారు. కారుపై దాడి చేసిన ఓ వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. గోదావరి వరద ముంపు కారణంగా 1996లో ఎర్దండి గ్రామంలోని 200 మందికి సమీపంలోని బర్ధీపూర్‌లో భూములు కేటాయించారు. అయితే గతంలోనే బర్ధీపూర్లోని మరికొందరికి కూడా ఆ భూములు కేటాయించారు. ఒకే సర్వేనంబర్‌లోని భూములు కావడంతో అది వివాదంగా మారింది. ఏడాది కిందట విజ్ఞప్తి చేసినా తమ సమస్య పరిష్కరించలేదని ఎర్దండి వాసులు ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంత్రి, ఎమ్మెల్యేల కుట్ర: అర్వింద్ తమ భూ దందాలు బయట పడతా యన్న భయంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తనపై దాడి చేయించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. శుక్రవారం కోరుట్లలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిర్మల్ ప్రాంతానికి చెందిన ఎస్సారెస్పీ ముంపు బా«ధితులకు ఎర్దండిలో రోడ్డు వెంట కేటాయించిన భూమిని ఆక్రమించాలన్న లక్ష్యంతో కుట్ర లు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ గూండాలను ఉసిగొలిపి తన కారు అద్దాలు ధ్వంసం చేయడం సిగ్గుచేటన్నారు. చదవండి: వరద విరుచుకుపడినా నిలబడిన కడెం.. చరిత్రలో తొలిసారి భీకర దృశ్యాలు అర్వింద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై జరిగిన దాడిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. దాడి జరిగిందనే సమాచారం తెలియగానే అమిత్ షా అర్వింద్‌కు ఫోన్‌చేసి ఘటనపై ఆరా తీశారు. పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందని, అమిత్ షాకు అర్వింద్ వివరించా రు. నియోజకవర్గం పరిధిలో తాను ఎక్కడ పర్యటించినా దాడులు చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు సూచించిందని ఆయన అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లా రు. దాడి వెనుక కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు హస్తం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, ఆర్వింద్‌పై దాడి ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. -
అధికార పార్టీలో ధిక్కార స్వరం.. ‘కారు’కు ఏమైంది? సైలెంట్ అవ్వడం తాత్కాలికమేనా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికార పార్టీలో అసమ్మతి స్వరం పెరుగుతోంది. ఇప్పటికే చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా, తాజాగా మహేశ్వరంలో మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్లుగా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సబితారెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం అభివృద్ధే ధ్యేయమంటూ హస్తం పార్టీకి బైబై చెప్పి.. గులాబీ కండువా వేసుకున్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక్కడ అధికార పార్టీ తరఫున పోటీచేసి ఓటమి పాలైన నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి అధిష్టానం హామీతో తాత్కాలికంగా సైలెంట్ అయ్యారు. కోడలు అనితారెడ్డికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టడంలో సఫలీకృతుడయ్యారు. ఇదిలా ఉండగా పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో తనకు సరైన ప్రాధాన్యః దక్కడం లేదంటూ ఇటీవల ధిక్కార స్వరం అందుకున్నారు. భగ్గుమంటున్న విభేదాలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సరూర్‌నగర్, ఆర్కేపురం డివిజన్లను బీజేపీ కైవసం చేసుకుంది. తుక్కుగూడ మున్సిపాలిటీలో టీఆర్ఎస్కు మెజార్టీ స్థానాలు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చి ఆయనను చైర్మన్‌గా ఎన్నుకుంది. ఆ తర్వాత మంత్రితో చైర్మన్‌కు పొసగకపోవడంతో ఆయన టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్లలో మెజార్టీ స్థానాలను గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. అధికార పార్టీ ఇక్కడ మేయర్లుగా ఎన్నికయ్యారు. వీరిలో బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత.. మంత్రి సబితకు మధ్య అంతర్గత విబేధాలు తార స్థాయికి చేరాయి. మంత్రితో పొసగక మేయర్ దంపతులు, మరో ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అసమ్మతి వర్గం కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్న సమయంలోనే అనూహ్యంగా గత మంగళవారం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మంత్రినే టార్గెట్ చేస్తూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఇదంతా టీ కప్పులో తుఫాను వంటిదేనని, అన్నతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతానని సబిత ప్రకటించారు. నేతల చూపు.. కాంగ్రెస్ వైపు పరిస్థితి చక్కబడకముందే బుధవారం అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత కొత్త మనోహర్‌రెడ్డి మంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. మొదటి నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతున్న మనోహర్‌రెడ్డితో పాటు మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు బడంగ్పేట్, మీర్‌పేటకు చెందిన మరికొందరు కార్పొరేటర్లు కూడా అసమ్మతి స్వరం వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన జిల్లా అధిష్టానం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసమ్మతి స్వరం పెంచిన సీనియర్లంతా త్వరలోనే పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది. -
కారు ‘ఓవర్‌లోడు’ సౌండ్.. సుమారు 45 నియోజకవర్గాల్లో నువ్వా నేనా?
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీని బహుళ నాయకత్వ సమస్య వెంటాడుతోంది. సొంత పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్, టీడీపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలతో కారు ఓవర్ లోడ్ కావడం కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సుమారు 45 స్థానాల్లో టీఆర్ఎస్ బలమైన బహుళ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. మరో 20 నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితా లను కొంతమేర ప్రభావం చూపగలిగే నేతలు ఉన్నారు. మొత్తంగా కనీసం 30 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. సొంత పార్టీలోని బలమైన నేతలతో తలపడాల్సిన పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ తమనే వరిస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. కొన్ని సెగ్మెంట్లలో సిట్టింగ్‌లకు మళ్లీ అవకాశం దొరకక పోవచ్చనే వార్తలు ఆశావహుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మరోవైపు తమకు టికెట్ కష్టమని భావి స్తున్నవారు.. విపక్ష పార్టీలు చేరికల కోసం చేస్తున్న ప్రయత్నాలను అవకాశంగా తీసుకుని ఒకరి వెంట మరొకరు అన్నట్టుగా సొంతదారి చూసుకుంటున్నారు. మరికొందరు అసంతృప్త నేతలు మాత్రం పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే నేతల అంతర్గత విభేదాలపై ఆరా తీసిన అధినేత ఇప్పటికే దిద్దుబాటు చర్యలకు దిగినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. చదవండి👉🏼సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు పీకే నివేదికల నేపథ్యంలో.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ బృందం ఈ ఏడాది మార్చిలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు అందజేసింది. ఈ నివేదికలను లోతుగా పరిశీలించి, ఎన్నికల నాటికి ఆయా నియోజకవర్గాల్లో ఉండే రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో సిట్టింగులు, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సొంత రాజకీయ అస్తిత్వం కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన తప్పనిసరి స్థితిలో కొందరు నేతలు ఇప్పటినుంచే సొంతదారిని వెతుక్కునే పనిలో పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం దక్కదని భావించిన అసంతృప్త నేతలు నల్లాల ఓదెలు (చెన్నూరు), బూడిద భిక్షమయ్య (ఆలేరు), విజయారెడ్డి (ఖైరతాబాద్), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట) తదితరులు ఇప్పటికే సొంతదారి చూసుకున్నారు. చదవండి👉🏼కేటీఆర్ సెటైర్, దేశ ప్రజలకు మోదీ అందించిన బహుమతి ఇదే! ప్రత్యర్థితో బహిరంగ యుద్ధం రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న కొద్దీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతలు పలువురు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఓ వైపు పార్టీపై, అధినేతపై విశ్వాసం ప్రకటిస్తూనే మరోవైపు స్థానికంగా ఉన్న తమ రాజకీయ ప్రత్యర్థితో బహిరంగ యుద్ధానికి దిగుతున్నారు. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు..ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, తాండూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఉప్పల్‌లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి..మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నడుమ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బొంతు జన్మదినం పురస్కరించుకుని మంగళవారం భారీయెత్తున దర్శనమిచ్చిన ఫ్లెక్సీలు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా మహేశ్వరం నియోజకవర్గం కూడా ఈ జాబితాలో చేరింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. హుస్నాబాద్, నకిరేకల్ తదితర అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతల నడుమ ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తోంది. రేగ కాంతారావు, పాయం వెంకటేశ్వర్లు (పినపాక), భానోత్ హరిప్రియ, కోరం కనకయ్య (ఇల్లందు), వనమా వెంకటేశ్వర్రావు, జలగం వెంకటరావు (కొత్తగూడెం), కందాల ఉపేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు (పాలేరు) ఈ జాబితాలో ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరినవారు కావడం గమనార్హం. ఆధిపత్య పోరు కొనసాగుతున్న మరికొన్ని నియోజకవర్గాలు, నేతలు -
మంత్రి మల్లారెడ్డిపై దాడి ఘటనపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డిపై దాడి ఘటనపై కేసు నమోదైంది. ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లారెడ్డిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఇద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు నమోదు చేశారు. సోమశేఖర్‌రెడ్డి, హరివర్ధన్‌రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. మొత్తం 16 మందిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సెక్షన్ 173, 147, 149, 341, 352, 506 కింద కేసు నమోదు చేశారు. రేవంత్‌రెడ్డి అనుచరులే దాడి చేశారంటూ టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు చేశారు. చదవండి: నన్ను చంపేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు -
ఎన్టీఆర్‌కు 'గులాబీ' నివాళి..!
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావు శత జయంతి వేదికగా టీఆర్ఎస్ పార్టీ ఎన్టీఆర్ నామస్మరణ చేసింది. జై తెలంగాణ, జై కేసీఆర్‌తో పాటు కొత్తగా జై ఎన్టీఆర్ అంటూ టీఆర్ఎస్ నేతలు కొత్త నినాదం అందుకున్నారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు ఎన్టీఆర్‌కు నివాళి అర్పించేందుకు బారులు తీరారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను ప్రస్తుతిస్తూ ఘనంగా నివాళి అర్పించారు. ఇన్నాళ్లూ ఎన్నడూ ఎన్టీఆర్ ఊసెత్తని టీఆర్ఎస్.. ఇప్పుడు ఒక్కసారిగా జై ఎన్టీఆర్ అని నినదించడం చర్చనీయాంశంగా మారింది. నివాళి అర్పించిన టీఆర్ఎస్ ముఖ్యనేతలంతా గతంలో టీడీపీలో కీలక పదవుల్లో పనిచేసిన వారే కావడం గమనార్హం. దీని వెనుక హైదరాబాద్‌లో ఓటర్లకు గాలం వేయడం, ఓ సామాజికవర్గం మద్దతు కూడగట్టడమే గులాబీ పార్టీ లక్ష్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళి అర్పించిన వారిలో రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్, చామకూర మల్లారెడ్డి, లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వర్రావు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ నవీన్‌రావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మరికొందరు టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నారంటూ.. ‘జబ్ తక్ సూరజ్, చాంద్ రహేగా.. ఎన్టీఆర్ కా నామ్ రహేగా (సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు మారుమోగుతుంది)’అని టీఆర్ఎస్ నేతలు నినదించడం గమనార్హం. గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుందంటూ ప్రకటనలు విడుదల చేశారు. ‘‘ప్రపంచంలో చరిత్ర సృష్టించిన తెలుగు బిడ్డకు నివాళి అర్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎన్టీఆర్ కేంద్రం మెడలు వంచి జాతీయ నాయకుడిగా పనిచేయాలనుకున్నారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నందున దివంగత నేత ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చాం. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం పార్లమెంటులో పోరాడుతాం. బడుగు బలహీనవర్గాలకు పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత ఆయనదే. కేసీఆర్ కూడా రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటూ ముందుకు వెళ్తున్నారు..’’అని మంత్రి మల్లారెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్రావు పేర్కొన్నారు. అంతా పక్కాలెక్కతోనే.. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం మొదలుకుని ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాతా ఏనాడూ ఎన్టీఆర్ ఊసెత్తని టీఆర్ఎస్.. ఆయన శత జయంతి రోజు ఏకంగా జై ఎన్టీఆర్ అంటూ నినదించడం చర్చనీయాంశమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓ సామాజికవర్గం ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. ఇక్కడ శాసనసభ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించేందుకు.. నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ విజయం కోసం సదరు సామాజికవర్గం మద్దతు అవసరమని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ సామాజికవర్గం ఓటర్లను టీఆర్ఎస్కు అనుకూలంగా పోలరైజ్ చేసేందుకే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే నినాదాన్ని బలంగా వినిపించాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్టు రాజకీయవర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ దాదాపు అంతర్ధానం కాగా.. అక్కడక్కడా మిగిలి ఉన్న సానుభూతిపరులు, కేడర్‌ను టీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకునే ఎత్తుగడలో భాగంగా జై ఎన్టీఆర్ నినాదాన్ని ఎత్తుకున్నారని అంటున్నాయి. మరోవైపు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలమయ్యేందుకు వరుస పర్యటనలు, సమావేశాల్లో పాల్గొంటున్న కేసీఆర్.. ‘తెలుగు కుటుంబం’అనే భావనను తెరమీదకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారని పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహంలో భాగంగానే టీడీపీ మాజీలైన ప్రస్తుత టీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా హడావుడి చేసినట్టు చెప్తున్నాయి. ఓవైపు పార్టీ.. మరోవైపు సామాజికవర్గం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన వారిలో ఒకరిద్దరు మినహా కీలక నేతలంతా గతంలో టీడీపీలో పనిచేసినవారే. అందులోనూ ఎక్కువ మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన నేతల్లో హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల వారే ఎక్కువగా ఉన్నారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని టీఆర్ఎస్ నేతలు చెప్పుకొస్తున్నా.. ఈ కొత్త నినాదం వెనుక ఓట్లు, సీట్ల రాజకీయం దాగి ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 2014లో టీడీపీ నుంచి ఎంపీగా గెలుపొందిన మల్లారెడ్డి, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, ప్రకాశ్‌గౌడ్ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. వీరంతా 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి గెలుపొందిన పువ్వాడ అజయ్, భాస్కర్‌రావు కూడా టీఆర్ఎస్లో చేరి రెండోసారి ఎమ్మెల్యేలు అయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ప్రస్తుతం టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేతగా ఉన్న నామా నాగేశ్వర్రావు కూడా టీడీపీ నుంచే వచ్చారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి గతంలో టీడీపీలో క్రియాశీల నేతలే. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సుదీర్ఘకాలంలో టీడీపీలోనే ఉన్నారు. మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వర్రావు, ఎమ్మెల్యేలు గాంధీ, గోపీనాథ్, భాస్కర్‌రావు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కూడా. ఎన్టీఆర్ ఘాట్ వద్ద... మాజీ సీఎం ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుం బసభ్యులు, అభిమానులు, నేతలు ఘనంగా నివాళి అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు పలు వురు సినీనటులు, ఏపీ రాజకీయ నాయకులు నివాళి అర్పించారు. అటు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఎన్టీఆర్ కృష్ణావతార కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ ఈ విగ్రహదాత కాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆవిష్కరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ఫిల్మ్‌నగర్ సొసైటీ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే టీఆర్ఎస్ నివాళులు ఎనిమిదేళ్లుగా ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణను పట్టించుకోని కేసీఆర్.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే మంత్రులు, ఎమ్మెల్యేలను ఎన్టీఆర్ ఘాట్‌కు పంపించారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్ ప్రతి నిర్ణయం రాజకీయ కోణంలోనే ఉంటుందని.. ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చే అర్హత టీఆర్ఎస్ నేతలకు లేదని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటారు భూమి, ఆకాశం ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన గొప్ప నాయకుడు, చిరస్మరణీయుడు ఎన్టీఆర్ అని శనివారం ఒక ప్రకటనలో కొనియాడారు. -
సిద్ధిపేట జిల్లాలో కేఏ పాల్‌పై టీఆర్ఎస్ నేతల దాడి
సాక్షి, సిద్ధిపేట జిల్లా: జక్కాపూర్‌లో కేఏ పాల్‌పై దాడి జరిగింది. వర్షాలతో నష్టపోయిన రైతుల్ని పరామర్శించడానికి సిరిసిల్ల జిల్లా వెళ్తున్న పాల్‌ను టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. డీఎస్పీ ముందే కేఏ పాల్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పాల్ వస్తున్నారనే సమాచారంతో సిరిసిల్లా జిల్లా సరిహద్దులకు చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు.. ఆయనను అడ్డుకుని బూతులు తిడుతూ దాడికి దిగారు. పోలీసుల తీరుపై కేఏ పాల్ ఆగ్రహం టీఆర్ఎస్ నేతలు గూండాలలా వ్యవహరించారని, పోలీసుల సమక్షంలోనే తనపై దాడి జరిగిందని.. దీనికి పోలీసులే బాధ్యత వహించాలంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీఆర్ఎస్ నేతలకు షాక్.. ఫ్లెక్సీలపై పెనాల్టీలు
సాక్షి,హైదరాబాద్: గత ఏడాది మాదిరిగానే ఈసారీ టీఆర్ఎస్ ప్లీనరీని పురస్కరించుకొని పలువురు టీఆర్ఎస్ నేతలు నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగుల వంటివి భారీగా ఏర్పాటు చేశారు. వాటితో ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, వెంటనే తొలగించాలని, వాటిని ఏర్పాటు చేసిన వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సోషల్‌మీడియా ద్వారా పౌరుల నుంచి అందిన ఫిర్యాదులకు స్పందించిన ఈవీడీఎంలోని సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌సెల్(సీఈసీ) ఈ చలానాల జారీ ప్రారంభించింది. వాటిని తొలగించే బాధ్యత మాత్రం తమది కాదంటూ జోనల్, సర్కిల్ అధికారులదని పేర్కొంది. ట్విట్టర్ ద్వారా సీఈసీ ఖాతాకు అందిన ఫిర్యాదులకు స్పందిస్తూ.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నుంచి పార్టీ డివిజన్ స్థాయి నాయకుల వరకు పెనాల్టీల ఈ– చలానాలు జారీ చేస్తున్నారు. నగరవ్యాప్తంగా వందలాది ఫ్లెక్సీలున్నప్పటికీ పౌరుల నుంచి అందిన ఫిర్యాదులకే పెనాల్టీలు వేయడంతో, పెనాల్టీలు పడనివి అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. ► మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేరిట నగరంలోని జూబ్లీహిల్స్, కేబీఆర్పార్క్, పంజగుట్ట, నాంపల్లి, నారాయణగూడ, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, తార్నాక, ప్యాట్నీ ఈస్ట్‌మారేడ్‌పల్లి, మెట్టుగూడ, తదితర ప్రాంతాల్లో వెలసిన ఫ్లెక్సీలపై అందిన ఫిర్యాదులకు ఈ– చలానాలు జారీ చేశారు. ఒక్కో ఫ్లెక్సీకి రూ. 5వేల వంతున చలానాలు జారీ అయ్యాయి. ► హైటెక్‌సిటీలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు రూ. 50 వేల వంతున రెండింటికి లక్ష రూపాయల చలానాలు జారీ చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ పేరిట ఏర్పాటైన వాటికి, పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, తదితర డివిజన్ నాయకులు ఏర్పాటు చేసిన వాటికి పెనాల్టీలు విధించా రు. బుధవారం సాయంత్రం వరకు తలసానిపై ఇరవైకి పైగా, పార్టీ జనరల్సెక్రటరీపై దాదాపు ఇరవై ఫ్లెక్సీలకు ఈచలానాలు జారీ చేశారు. ► టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్‌రెడ్డి హుస్సేన్‌సాగర్‌లో బోట్‌కు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు రూ. 50వేలు, రూ.15వేలు వంతున రెండు ఈ– చలానాలు జారీ అయ్యాయి. గచ్చిబౌలిలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లికి చెందిన షేక్‌హమీద్‌కు లక్ష రూపాయల వంతున రెండు ఈ– చలానాలు జారీ చేశారు. ఈచలానాల జారీ ఇంకా కొనసాగుతుండటంతో కచ్చితంగా ఎంత మొత్తం అనేది తెలియడానికి సమయం పట్టనుంది. తగ్గేదేలే.. ► పెనాల్టీలు వేసినా తాము తగ్గేది లేదని, పార్టీపై.. అగ్రనాయకులపై తమ అభిమానానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేరన్నట్లుగా పలువురు నేతలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా ఫ్లెక్సీలు తదితరమైన వాటితో స్వాగతాలు పలికారు. పెనాల్టీలు పడినా సరే అధిష్టానం దృష్టిలో పడితే చాలన్నట్లుగా కొందరు వీటిని ఏర్పాటు చేశారు. ► ట్విట్టర్ వేదిక ద్వారా కొందరు పౌరులు టీఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానాలు చేశారు. ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన లీడర్లు కారు అని అన్న మీరే ఇలా వ్యవహరించారేం? అని ప్రశ్నించారు. మేం నిబంధనలు పాటించాలి కానీ మీ పార్టీ పాటించవద్దా అని పేర్కొన్నారు. బెంగళూర్‌లో ఫ్లెక్సీలు, గుట్కా, ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారని పోస్ట్‌చేశారు. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటదో తెలియని నగరంలో ఒక్కసారిగా గాలిదుమారం వీస్తే రోడ్డున పోయే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన వారూ ఉన్నారు. -
మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనలో టీఆర్ఎస్ నేతలకు జరిమానాలు
-
కేటీఆర్ పర్యటన.. టీఆర్ఎస్ నేతలకు షాకిచ్చిన వరంగల్ కార్పొరేషన్
సాక్షి, వరంగల్: మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారకరామారావు పర్యటన నేపథ్యంలో వరంగల్ మున్సిపల్‌కార్పొరేషన్ టీఆర్ఎస్ నేతలకు షాకిచ్చింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినవారికి భారీ ఫైన్ విధించింది. వరంగల్ మేయర్ గుండు సుధారాణికి బల్దియా అధికారులు ఏకంగా రూ.2 లక్షలు జరిమానా విధించారు. టీఆర్ఎస్ నాయకులు కేశవరావుకు రూ.50 వేల జరిమానా విధించారు. కాగా, నేడు కేటీఆర్ వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. మంత్రి రాక నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. జెండాలు, తోరణాలు, బ్యానర్లతో మడికొండ నుంచి వరంగల్ వరకు రోడ్లన్నీ గులాబీమయం అయ్యాయి. -
తెలంగాణాలో జాతీయ రహదారులపై టీఆర్ఎస్ ఆందోళనలు
-
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ముఖ్యనేతల సమావేశం
-
గులాబీలో నేతల మధ్య గలాట
-
రూపాయికే గులాబీ దోశ.. ఎక్కడో తెలుసా?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు(ఫిబ్రవరి15) నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రెండు, మూడు రోజుల ముందు నుంచే వేడుకలు పండుగలా నిర్వహిస్తున్న విషయం తెలిందే. అన్నదానం, రక్తదానం, బట్టలు పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ పుట్టిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. చదవండి: చనిపోయిన వ్యక్తికి బూస్టర్ డోస్ ఇచ్చారట.. ఇంకేముంది!! మంత్రి పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో ఒక్క రూపాయికే దోశ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ దోశలో ఇంకో స్పెషల్ కూడా ఉంది. బీట్రూట్తో తయారు చేసిన గులాబీ రంగు దోశలను చేయించి ఒక్కో దోశను కేవలం రూపాయికే స్థానికులకు అందజేశారు. దీంతో కొత్త రంగులో ఉన్న దోశలను తినేందుకు ప్రజల ఎగబడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమితులైన టీఆర్ఎస్ నేతలు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్‌లోని టీఎస్ఎండీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్‌గా మన్నె క్రిషాంక్, అసెంబ్లీ ఎదురుగా ఉన్న హాకా భవన్లో తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్రావు బాధ్యతలు స్వీకరించారు. మన్నె క్రిషాంక్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హాజరై అభినందించారు. నూతన టీఎస్టీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పాటిమీది జగన్మోహన్రావును మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. అనంతరం బేవరేజెస్ కార్పోరేషన్ చైర్మన్‌గా గజ్జెల నాగేశ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు హాజరై అభినందనలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన దూదిమెట్ల బాలరాజు యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరిస్తారు. -
టీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం.. జారిపడిన లిఫ్ట్..
సాక్షి, శంషాబాద్(హైదరాబాద్): టీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం ఓ ప్రమాదానికి కారణమైంది. పట్టణంలోని అర్కాన్ ప్రైవేట్ ఆస్పత్రిని ప్రారంభించేందుకు వైద్యశాఖ మంత్రి హరీష్‌రావుతో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన స్థానిక నేతలు పైకి వెళ్లేందుకు లిఫ్టు ఎక్కారు. గరిష్ఠంగా ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్టులో పదిహేను మందికి పైగా ఎక్కడంతో ఒక్కసారిగా పైకి లేచి కిందపడింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది లిఫ్టు నుంచి అందరికి బయటికి తీశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కూడా లిఫ్టులో వెళదామనుకున్నప్పటికి అప్పటికే లిఫ్టులో ఎక్కువమంది ఉండడంతో మెట్లు ఎక్కి పైకి పైకి వెళ్లారు. ముఖ్యనేతలు తాము అందులో ఎక్కక్కపోవడమే మంచిదైందని అనుకున్నారు. -
ఆత్మగౌరవానికి వెలకట్టి కొంటున్నారు
వీణవంక: ‘ఆత్మగౌరవానికి వెలకట్టి నాయకులను కొనుగోలు చేస్తున్నారు. వాళ్లు కొన్నట్టు భావిస్తున్నారు. మనవాళ్లు అమ్ముడుపోయినట్లు నటిస్తున్నారు’అని మాజీమంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. పోతిరెడ్డిపల్లి గ్రామంలో వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆనంతరం ఈటల మాట్లాడుతూ ‘పొద్దున్నే లేచి నా భార్య ఒక మాట అడిగింది. నీ చుట్టూ తిరిగే వాళ్లను లేకుండా చేశారు. ఇక డ్రైవర్‌ను కూడా ఉంచరట అని. అప్పుడు నేను అన్నా. సరే నిన్ను (జమున) అన్నా ఉంచుతరటనా లేదా’అని పేర్కొన్నారు. ఈ పోరాటం తన ఒక్కడిది కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటమని అన్నారు. సీఎం కేసీఆర్ పథకాల పేరుతో చెక్కుతోపాటు కత్తిని కూడా ఇస్తున్నారని ఈటల మండిపడ్డారు. -
రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్
-
మంత్రుల పర్యటన లో చోరకళను ప్రదర్శించిన దొంగ
-
టీఆర్ఎస్ నేతలు తెలంగాణ పరువు తీస్తున్నారు: అద్దంకి దయాకర్
-
రేవంత్ మాటలు శ్రుతి మించితే ఏం చేయాలో తెలుసు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గత కొద్ది రోజులుగా మాట్లాడిన తీరుపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. గురువారం పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఓ డ్రామా ఆర్టిస్టు అని, టెంట్, స్టంట్, ప్రెజెంట్, ఆబ్సెంట్ అన్నట్టుగా రేవంత్ రాజకీయం నడుస్తోందని ఎద్దేవాచేశారు. రేవంత్ తొక్కుతా అంటున్నాడు.. వంద మంది ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ తలుచుకుంటే నిన్ను ఎంత లోతు తొక్కగలమో తెలుసా? అని ధ్వజమెత్తారు. రేవంత్ తీరుపై కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాయాలనే యోచనలో భాగంగా సోనియా, రాహుల్ కు ట్విట్టర్ లో లేఖ రాశానన్నారు. రేవంత్ మాటలు శ్రుతి మించితే ఏం చేయాలో తమకు తెలుసునని, కాంగ్రెస్‌లో పెద్ద నాయకులు లేనిది చూసి దొరికింది దోచుకోవడేమే రేవంత్ వైఖరి అని ఆరోపించారు. -
టీఆర్ఎస్ అవినీతిపై దృష్టి పెట్టండి
సాక్షి, హైదరాబాద్: ఏడున్నరేళ్లుగా రాష్ట్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న టీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిపై ప్రత్యేక దృష్టి సారించాలని, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో వారి అవి నీతి కార్యకలాపాలపై నివేదికలు రూపొందిం చాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీన్ని ఆధారాలతోసహా నిరూపిం చేలా నియోజకవర్గాల సమన్వయకర్తలు స్థానిక నేతలతో కలిసి పనిచేయాలని సూచించారు. గురువారం ఇందిరాభవన్‌లో ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ కార్యక్రమం కోసం నియమించిన అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశం జరిగింది. దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి రాని నేతలకు నోటీసులిచ్చి వివరణ కోరాలని, ఆసక్తి లేని వారిని ఇబ్బంది పెట్టి పనిచేయించు కోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతల అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థల విచారణకు డిమాండ్ చేయాలని చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ హామీలను అమలుచేయడంలో ఎలా విఫలమయ్యారో వివరించాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని, ఇదే ఊపును అధికారంలోకి వచ్చేవరకు కొనసాగిం చాలని మాణిక్యం చెప్పారు. రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు: రేవంత్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 72 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని, దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. హైదరాబాద్ లో వరదలు వచ్చిన ప్పుడు రూ.10వేలు కూడా సరిగా ఇవ్వలేని కేసీఆర్ రాష్ట్రంలోని 30 లక్షల దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎలా ఇస్తారో ప్రశ్నించాలన్నారు. సమన్వయకర్తలే ప్రచారం చేయాలి: భట్టి కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేసే బాధ్యత నియో జకవర్గాల సమన్వయకర్తలదేనని అన్నారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్ గౌడ్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, అజారు ద్దీన్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి, పొడెం వీరయ్య తదితరులు కూడా పాల్గొన్నారు. -
తెలంగాణలో ఆత్మగౌరవం ప్రశ్నార్థకం: ఈటల
సాక్షి, కరీంనగర్: పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవం ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్‌లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు గొప్పవని చెప్పుకునే పరిస్థితి మాత్రమే ఉందని.. ప్రజలు హక్కుదారులు కాదు.. బిచ్చగాళ్లుగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. తమ హక్కుల్ని భంగం కలిగించే ప్రయత్నం చేస్తే దేనినైనా ధ్వంసం చేయడానికి వెనుకాడమన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాముల దూరినట్లు తనపై ఓ మంత్రి మాట్లాడటం వాళ్ల సంస్కారానికి నిదర్శనమన్నారు. కులం, మతంతో తనకు సంబంధం లేదు, పార్టీ కార్యకర్తలు వారి ఆలోచనతో సంబంధం ఉంటుందని ఈటల రాజేందర్ అన్నారు. ప్రతి పైసా కేంద్రం ఇచ్చినవే: బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి నిధులు, సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివేనన్నారు. కోవిడ్ సమయంలో రాష్ట్రంలో ఖర్చు చేసిన ప్రతి పైసా కేంద్రం ఇచ్చినవేనన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా ఎన్ని నిధులు కేటాయించారో, కేంద్ర వాటా లేని సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేస్తున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘‘నమ్ముకున్న సిద్ధాంతం కోసం పని చేసే పార్టీ బీజేపీ. తెలంగాణ అధికారం చేపట్టే దిశగా ముందుకు వెళ్తున్నాం. మాట తప్పిన సీఎంను అడ్రస్ లేకుండా చేయాలి. తెలంగాణలో మార్పు కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మలిదశ ఉద్యమానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ తెలిపారు. చదవండి: Huzurabad: ‘సాగర్’ ఫార్మూలాతో ఈటలకు చెక్.. బాస్ ప్లాన్ ఇదేనా? తెలంగాణలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేత -
Huzurabad: చిలక పలుకుల మంత్రులకు ఆత్మగౌరవం ఉందా?
సాక్షి, కరీంనగర్ జిల్లా: మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత కాషాయ కండువాతో తొలిసారి నియోజకవర్గంలో అడుగు పెట్టారు. దారి పొడవునా అభిమానులు, బీజేపి కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో ఈటల రోడ్ షో నిర్వహించగా ఆయన సతీమణి జమున కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల మద్దతు కోరారు. ఈటల దంపతుల తొలి రోజు ప్రచారం బీజేపీకి కొత్త ఊపునివ్వగా.. గులాబీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. జమ్మికుంట మండలం నాగారం ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హుజురాబాద్ ఉప ఎన్నికతో ప్రజలు.. టీఆర్ఎస్ అహంకారానికి ఘోరీ కడతారని వ్యాఖ్యానించారు. 2023 ఎన్నికలకు.. ఈ ఉప ఎన్నిక రిహార్సల్‌గా ఆయన అభివర్ణించారు. తనకు మద్దతిస్తున్న వారిని ఇంటిలిజెన్స్ అధికారులు వేధిస్తున్నారని ఈటల ఆరోపించారు. ప్రజలు ప్రేమకు లొంగుతారని. బెదిరింపులకు కాదనన్నారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఆత్మ గౌరవం ఉందా అని ప్రశ్నించారు. ఆత్మ గౌరవం పోరాటానికి హుజురాబాద్ వేదిక అని రేపటి నుంచి ఇంటింటికి వెళ్తానని ఈటల రాజేందర్ వెల్లడించారు. చదవండి: Huzurabad: టార్గెట్ ఈటల..పెద్దిరెడ్డి మాటల వెనుక అర్థం ఏమిటో? ‘ఈటల’ నియోజకవర్గానికి భారీగా నిధులు -
ఈటల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతల కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈటల తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకమని వ్యాఖ్యానించారు. కన్నతల్లిలాంటి పార్టీపై ఈటల అభాండాలు వేశారని ఆయన మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఉద్యమ ఎజెండా రూపొందించింది కేసీఆర్. నాయకత్వ లక్షణాలు లేకున్నా ఈటలను కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. ఈటలకు ఎన్నో పదవులు ఇచ్చి గౌరవించారు. పార్టీలో ఉన్నప్పుడు దేవుడన్నారు.. ఇప్పుడేమో నియంతా?’’ అంటూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘బడుగుబలహీన వర్గాలకు చెందిన భూములను ఈటల ఎలా కొంటారు?. అనామకుడి ఫిర్యాదుపై సీఎం స్పందించారంటే అది ప్రజాస్వామ్యం గొప్ప. ఈటలకు ఆత్మగౌరవంపై కాదు.. ఆస్తులపై గౌరవం ఉంది. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే ఆత్మగౌరవ నినాదం. అధికారులను వాడుకుని వారిపైనే నిందలు మోపుతున్నారని’’ పల్లా నిప్పులు చెరిగారు. ఆస్తులను రక్షించుకోవడానికే ఈటల ప్రయత్నాలు: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆస్తులను రక్షించుకోవడానికే ఈటల రాజేందర్ ప్రయత్నాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దుయ్యబట్టారు. ఢిల్లీలో ఉన్నవాళ్లు కూడా ఈటలను కాపాడలేరన్నారు. ప్రగతి భవన్ లో అడుగుపెట్ట నివ్వలేదంటూ ఈటల దిగజారుడు మాటలు బడుగు బలహీన వర్గాలు విశ్వసించరని బాలరాజు అన్నారు. చదవండి: Etela Rajender: టీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా కిడ్నాప్ తరహాలో జర్నలిస్ట్ అరెస్టా?: సంజయ్ -
సై అంటే సై.. నాయకుల సోషల్ యుద్ధం
సాక్షి,వేములవాడ: రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే రమేశ్‌బాబు ‘వంద పడకలే కాదు.. వంద సమాధానాలు’ అంటూ సామాజిక మధ్యమంలో కరపత్రం పోస్టు చేశారు. దీంతో టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ ‘ఈ ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పండి’ అని మరో కరపత్రం పోస్టు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి ప్రచారం చర్చనీయాంశంగా మారింది. కాగా వేములవాడ శివారులోని తిప్పాపూర్‌లో రూ.22.50 కోట్లతో నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో కరోనా ఉధృతి తగ్గుతోందన్నారు. ఇటీవల చేపట్టిన సర్వేలో 3,900 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు తేలిందని, వారిని గుర్తించి కిట్లు అందించామని తెలిపారు. వంద పడకల ఆస్పత్రి ప్రారంభంతో వేములవాడ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు దరి చేరాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 50పడకలతో కోవిడ్–19 సేవలు అందుబాటులోకి వచ్చాయని కేటీఆర్ తెలిపారు. చదవండి: ఒక్క చాన్స్.. ఈటలపై పోటీకి సై అంటున్న నేతలు -
‘సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెడుతున్నారు’
సాక్షి, సిరిసిల్ల: అండగా నిలవాల్సిన సొంత పార్టీ నాయకులే తన వ్యవసాయ భూమి విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని సిరిసిల్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ లింగం రాణి ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి తక్కళ్ల సుందర్ తాడూరు గ్రామ శివారు సర్వే నంబర్ 1147లో ఎకరం 22 గుంటలు వ్యవసాయ భూమిని 1985లో సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశారని అన్నారు. అప్పటినుంచి కాస్తులో తామే ఉన్నామని తెలిపారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్నారు. దీనిని సాకుగా చూపుతూ ఆ భూమి తమదేనని టీఆర్ఎస్ నాయకుడు కుర్మ రాజయ్య తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. తనకు రూ.70 వేలు ఇస్తేనే భూమిని వదిలేస్తానని డిమాండ్ చేయడంతో గతేడాది రూ.30వేలు చెల్లించానని తెలిపారు. ప్రస్తుత సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్ అన్న అనంతరెడ్డి ఆ భూమిని తమకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇతరులకు అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు. వీరికి తంగళ్లపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కూడా అండగా ఉన్నాడని ఆరోపించారు. సొంత పార్టీ వాళ్లే ఇలా తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. పోలీస్, రెవెన్యూ అధికారులు కూడా వారికే వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుంటానని ఆమె హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులపై సొంత పార్టీకి చెందిన మహిళా నాయకురాలు మాజీ ఏఎంసీ చైర్పర్సన్ స్థాయి వ్యక్తి ఆరోపణలు చేయడంపై మండల వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయం మండల టీఆర్ఎస్లో చిచ్చు రేపుతుందో? లేదా టీ కప్పులో తుపానులా సద్దుమణుగుతుందోనని టీఆర్ఎస్ కార్యకర్తలు గుసగసులు పెడుతున్నారు. చదవండి: ఆక్సిజన్ కొరత.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గుడ్‌న్యూస్ కన్నీరు పెడుతున్న లింగం రాణి -
వారికి వారే మాట్లాడుకొని వెళ్లారు!
సాక్షి, హైదరాబాద్: లింగోజీగూడ కార్పొరేటర్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం కోసం పలువురు కార్పొరేటర్లతోపాటు బీజేపీ ముఖ్య నేతలు రాంచందర్‌రావు, శేఖర్‌రావు తదితరులు టీఆర్ఎస్ నేతలను, మంత్రి కేటీఆర్‌ను కలిసిన విషయంలో వారికి వారే సొంతంగా నిర్ణయం తీసుకొని వెళ్లారని నిజ నిర్ధారణ కమిటీ పేర్కొంది. ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికను ఆయనకు అందజేసింది. ఈ విషయంపై బండి సంజయ్‌కి సమాచారం ఇవ్వకపోవడం పొరపాటేనని నేతలు కమిటీ ముందు ఒప్పుకున్నారు. అయితే నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది. చదవండి: మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్ అవమానాలు భరించలేం, పార్టీలో నుంచి వెళ్లిపోదామా? -
టీఆర్ఎస్ నాయకులపై ఎంపీ అరవింద్ ఫైర్!
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో పై టీఆర్ఎస్ నాయకులు పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలు మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్నాయని, అక్కడ ఇరు పార్టీల కూటమి అధికారంలోకి వస్తే పసుపు రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అక్కడ పసుపు బోర్డును కేంద్రమే ఏర్పాటు చేస్తే, ఆ రాష్ట్ర ఇంచార్జీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టతనిస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం.. నిజామాబాద్ పసుపు రైతులకు ఆశించిన స్థాయి కన్నా ఎక్కువగానే సహాయం చేస్తుందని పేర్కొన్నారు. పసుపు రైతుల కోసం కేంద్రం స్పైసెస్ ఎక్స్టెన్షన్ బోర్డును ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్త చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచిందని ప్రకటించారు. పసుపు రైతుల కోసం ప్రతి ఏటా బడ్జెట్ కేటాయింపుల్లో పది కోట్ల రూపాయలు పెంచుతున్నామని, వారికి మద్దతు ధరకు మించిన రేటునే ఇస్తున్నామని వెల్లడించారు. క్వాలిటీ పసుపు పదివేలకు పైగానే ధర పలుకుతోందని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌లు రైతులకు రుణ మాఫీ చేస్తామని అన్యాయం చేస్తున్నారని, నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక నాపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలు: పార్టీ నేతలకు కేటీఆర్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ పార్టీ నేతలతో మంత్రి కేటీఆర్ శనివారం హైదరాబాద్‌లో భేటీ నిర్వహించారు. ఈ సందర్భగా టీఆర్ఎస్లోని కొంతమంది పార్టీ నేతల తీరుపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాయకులు ప్రచారం చేయకుండా ఉంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఇంట్లో కూర్చుంటాం అంటే కుదరదని, అందరూ కలిసి ప్రచారం చేయాలని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. సమావేశానికి ఎవరెవరు రాలేదో తనకు తెలుసని అన్నారు. పదవుల కోసం ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్నవారు చాలామంది ఉన్నారని, అవకాశాన్ని బట్టి పదవులు అవే వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ ఉద్యమకారుడికి కేటీఆర్ సాయం ‘కేటీఆర్ పీఏ’నంటూ ఫోన్.. డబ్బు డిమాండ్ -
ఎమ్మెల్యేలకు చెక్.. రాష్ట్ర కార్యవర్గానికి కొత్తరూపు..!
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఏకపక్ష పోకడలకు చెక్ పెట్టాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న వారిని, పార్టీకి అంకితమైన, నిరంతరం ప్రజల్లో ఉంటున్నవారిని గుర్తించి వారి సేవలకు తగిన ‘గుర్తింపు’నిచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నారు. ప్రతి దానికీ ఎమ్మెల్యే ‘ప్రాపకం’పై ఆధారపడే పరిస్థితి పార్టీకి వ్యవస్థాగతంగా మంచిది కాదని భావిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో కేడర్ మీద ఎమ్మెల్యేలు చెలాయిస్తున్న అపరిమిత పెత్తనానికి కత్తెర వేస్తూ పార్టీ యంత్రాంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలో రద్దు చేసిన జిల్లా కమిటీలను తిరిగి ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర కమిటీని కూడా పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ వేదికగా జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గం, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధుల సమావేశంలో పార్టీ బలోపేతానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ సంస్థాగతంగా బలోపేతమవుతూ దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గట్టి పోటీని ఇవ్వడంతో టీఆర్ఎస్ను అన్ని స్థాయిల్లోనూ పటిష్టం చేయా లనే నిర్ణయానికి పార్టీ అధినేత వచ్చినట్లు సమాచారం. పార్టీ సభ్యత్వ పునరుద్ధరణ, సంస్థాగత శిక్షణ, పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం వంటి సంస్థాగత విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. చదవండి: (టీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ.. రేపే సమావేశం) తెరమీదకు జిల్లా కమిటీల ఏర్పాటు పార్టీపరంగా గ్రామ, మండల స్థాయి కమిటీలతో పాటు రాష్ట్ర స్థాయి కార్యవర్గం మాత్రమే ఉంటుందని గతంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లా స్థాయిలో పార్టీ అధ్యక్షుడితో పాటు ఇతర కార్యవర్గం, అనుబంధ సంఘాలను రద్దు చేయడంతో పాటు నియోజకవర్గ స్థాయిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలకు పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. 2019 జూలైలో పార్టీ సభ్యత్వ నమోదు అనంతరం గ్రామ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటైనా కేసీఆర్ నిర్ణయం మేరకు జిల్లా కమిటీలు ఏర్పాటు చేయలేదు. దీంతో పార్టీ కార్యకలాపాల్లో ఎమ్మెల్యేలకు ఎదురులేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో నేతల నడుమ అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. వివిధ పార్టీల నుంచి చేరిన నేతలు, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారి నడుమ ఆధిపత్య పోరు సాగుతుండగా ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉండే వారికే వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చాలా చోట్ల కేడర్ గ్రూపులుగా విడిపోవడం... విభేదాల పరిష్కారం, పనిచేసే కేడర్‌కు గుర్తింపు వంటి అంశాలపై దృష్టి పెట్టే యంత్రాంగమంటూ ప్రత్యేకంగా ఏదీ లేకపోవడంతో నష్టం జరుగుతున్నట్లు పార్టీ అధినేత గుర్తించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో పార్టీ అధ్యక్షుడి నియామకంతో పాటు పార్టీ జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘాలను కూడా ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. భారీగా ప్లీనరీ... 2019 జూన్, జూలై మాసాల్లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా 65 లక్షల మందికి పార్టీ సభ్యత్వం ఇచ్చారు. పార్టీ సభ్యత్వం కాల పరిమితి రెండేళ్లు కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో పార్టీ ప్లీనరీ తర్వాత సభ్యత్వ పునరుద్దరణ చేపట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్, వరంగల్ మినహా మిగతా 28 జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయాన్ని గత ఏడాది డిసెంబర్లో కేసీఆర్ ప్రారంభించగా, మిగతా చోట్ల కూడా ఏప్రిల్‌లోగా ప్రారంభించి సంస్థాగత శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని పార్టీ అధినేత నిర్ణయించినట్లు తెలిసింది. గత ఏడాది ఏప్రిల్ 27నాటికి టీఆర్ఎస్ 20వ వసంతంలోకి అడుగు పెట్టగా కరోనా నేపథ్యంలో సాదాసీదాగా కార్యక్రమం జరిగిపోయింది. కాబట్టి ఈ ఏడాది ప్లీనరీని ఆర్భాటంగా నిర్వహించాలనే యోచనలో పార్టీ అధినేత ఉన్నట్లు సమాచారం. దీంతో ఆదివారం జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సంస్థాగత నిర్మాణం, బలోపేతానికి సంబంధించి కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గానికి కొత్తరూపు.. సుమారు మూడున్నరేళ్ల క్రితం 2017 అక్టోబర్‌లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాష్ట్రస్థాయిలో జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. 20 మంది ప్రధాన కార్యదర్శులు, 33 మంది కార్యదర్శులు, 12 మంది డిప్యూటీ కార్యదర్శులతో ఏర్పాటైన రాష్ట్ర కార్యవర్గానికి ఎన్నికల సమయంలోనే క్రియాశీల బాధ్యతలు అప్పగిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గంలోని సత్య వతి రాథోడ్‌కు మంత్రి పదవి దక్కగా, పి.రాములు, బండా ప్రకాశ్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్, మాలోత్ కవిత ఎంపీగా ఎన్నికయ్యారు. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్యకు ఎమ్మెల్సీ పదవి దక్కగా, భూపతిరెడ్డి, సపాన్‌దేవ్ వంటి నేతలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో పార్టీని బలో పేతం చేయాలని భావిస్తున్న కేసీఆర్ రాష్ట్ర కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వివిధ పార్టీలకు చెందిన నేతలు అన్ని స్థాయిల్లో పార్టీలో చేరడంతో అధికారిక పదవులు దక్కని వారికి పార్టీ కమిటీల్లో చోటు కల్పించడంతోపాటు పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తారు. -
టీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ.. రేపే సమావేశం
సారు పిలిసిండు... అందరినీ రమ్మన్నడు. రొటీన్ మీటింగేనా? బీజేపీపై వైఖరి చెబుతడా? భారీ ప్లీనరీ పెడదమంటాడా? రాబోయే ఎన్నికల్లో ఎట్ల కొట్లాడుదమో చెప్తాడా? హు... హుహూ! ఇప్పుడివేవి జనం మదిలో లేవు. టీఆర్ఎస్ శ్రేణుల్లో అంతకన్నా లేవు. సమయం వచ్చేసిందా? కబ్ బనేగా? స్పష్టత ఇచ్చేస్తారా? అందరిలోనూ ఇదే టెన్షన్. ఎవరు? ఏమవుతారనే... ముచ్చట అందరికీ ఎరుకే. సంకేతాలిచ్చి సరిపెడతారా? సరాసరి ప్రకటనే వచ్చేస్తుందా? అధికారిక ‘ముద్ర’పడుతుందా? సంచలనాలేమీ లేకుండా ఆనవాయితీగా అధినేత దిశానిర్దేశంతో ముగుస్తుందా? చూద్దాం... ఆదివారం దాకా!! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మికంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తుండటంపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్య క్షులు హాజరవుతారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల నియామకం, ఏప్రిల్ 27న పార్టీ వార్షికోత్సవం సందర్భంగా మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఆదివారం జరిగే సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారని పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ప్లీనరీ, సంస్థాగత అంశాలపై చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నా... ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారని జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్ ఈ సమావేశంలో స్పష్టతనిచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చదవండి: (నేడు రాష్ట్రానికి మాణిక్కం ఠాగూర్) సీఎం పీఠంపై కేటీఆర్.. అంతటా అదే చర్చ ఈ నెల 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదినం కాగా, మరుసటి రోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా పదవి చేపడతారని కొంతకాలంగా విస్తృత ప్రచారం సాగుతోంది. ఇదే అంశంపై మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతకాలంగా ప్రకటనలు చేస్తుండగా, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఏకంగా కేటీఆర్ సమక్షంలోనే ముఖ్యమంత్రి మార్పిడికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. దీంతో ముఖ్యమంత్రి పదవిని కేటీఆర్ చేపట్టడం ఖాయమని, ఫిబ్రవరి లేదా మే నెలలో సీఎం మార్పు ఖాయమని పార్టీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టతనిచ్చే అవకాశముందని పార్టీ నేతలు భావిస్తున్నారు. సీఎం మార్పునకు సంబంధించిన ప్రచారం ఎక్కువ కాలం కొనసాగితే పార్టీకి నష్టం కూడా జరిగే అవకాశమున్నందున ఈ అంశంపై వీలైనంత త్వరగా స్పష్టతనివ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే మాత్రం రాష్ట్ర కార్యవర్గ సమావేశం వేదికగా సంకేతాలు ఇస్తారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే అటు పార్టీలో, బయటా శరవేగంగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. వివాదాస్పద నేతలకు హెచ్చరికలు ఇటీవలి కాలంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కొందరు ముఖ్య నేతలు వివిధ సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియా వేదికగా పార్టీ కొంత మేర ఇరకాట పరిస్థితి ఎదుర్కొంటోంది. మరోవైపు ఖమ్మం జిల్లాతో పాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు తరచూ విభేదాలతో రచ్చకెక్కుతున్నారు. వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నేతల నడుమ ఆధిపత్య పోరు కొనసాగుతుండటంతో పార్టీలో అంతర్గత క్రమశిక్షణ కట్టు తప్పుతోందనే భావన నెలకొంది. చదవండి: (ఆ రాబడులే రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు కీలకం) ఆదివారం జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇలాంటి అంశాలపై పార్టీ అధినేత కేసీఆర్ స్పందిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఇటీవలి కాలంలో బీజేపీతో నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణం, అక్కడక్కడా దాడులకు కూడా దారితీస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీ పట్ల టీఆర్ఎస్ వైఖరిపై కూడా కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశముంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత జరిగిన సీఎం ఢిల్లీ పర్యటన, వ్యవసాయ చట్టాలు, బడ్జెట్ తదితర అంశాలపై టీఆర్ఎస్ ప్రదర్శిస్తున్న వైఖరిపైనా ఈ సమావేశంలో ప్రస్తావనకు వస్తుందని భావిస్తున్నారు. స్తబ్దుగా పార్టీ కార్యకలాపాలు ఇటీవలి కాలంలో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు మినహా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన అన్ని రకాల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఏకపక్ష విజయాలు సాధిస్తూ వచ్చింది. అయితే ఎన్నికలు వస్తే తప్ప మిగతా సందర్భాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యకలాపాలపై అంతగా దృష్టి సారించడం లేదనే అభిప్రాయం పార్టీ యంత్రాంగంలో ఉంది. జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు లేకపోవడం, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే కార్యక్రమాలు జరుగుతుండటంతో పార్టీ కార్యకలాపాలు స్తబ్దుగా మారాయి. లోక్‌సభ ఎన్నికలు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్లుగా పార్టీ ప్లీనరీ జరగకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్ 27న భారీగా ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. సుమారు రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ప్రారంభం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణంతో పాటు పార్టీ సభ్యత్వ పునరుద్దరణ వంటి అంశాలపై ఆదివారం జరిగే సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దీంతో పాటు త్వరలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల ఎన్నికలకు సంబంధించిన అంశాలపైనా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనం చేస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
టీఆర్ఎస్ నేతను హతమార్చిన మావోలు
సాక్షి, ములుగు: జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. వెంకటాపురం మండంలోని అలుబాక గ్రామంలో శనివారం అర్ధరాత్రి టీఆర్ఎస్ నేత భీమేశ్వర్‌రావును మావోయిస్టులు హతమార్చారు. అర్థరాత్రి ఇంట్లో నుంచి ఆయన్ని బయటకు తీసుకొచ్చి కత్తితో పొడిచి, తుపాకితో కాల్చి హత్య చేశారు. ఈ హత్యలో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో మావోయిస్టులు లేఖను వదిలి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. భీమేశ్వరరావుకు భార్య కుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసులు కూబింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారి ఉనికి తెలిపేందుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టులు వదిలివెళ్లిన లేఖ, దాడికి ఉపయోగించిన కత్తి -
ప్రభుత్వాసుపత్రులకు అంబులెన్సులు
సాక్షి, హైదరాబాద్: సొంత నిధులతో ప్రభుత్వాసుపత్రులకు అంబులెన్సులను సమకూర్చేందుకు పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావును సోమవారం ప్రగతిభవన్‌లో కలసి విరాళాల చెక్కులను అందజేశారు. సొంత నిధులతో ఆరు అంబులెన్సులను సమకూరుస్తానంటూ ఇటీవల కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అంబులెన్సులకు నిధులు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో మొత్తంగా వంద అంబులెన్సులను సమకూర్చాలని మంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి), మనోహర్‌రెడ్డి (పెద్దపల్లి) రెండు చొప్పున, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు ఒకటి, నవీన్‌కుమార్ రెండు చొప్పున అంబులెన్సులు సమకూరుస్తున్నారు. మరో టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి కూడా ఒక అంబులెన్సుకు సంబంధించిన చెక్కును కేటీఆర్‌కు అందజేశారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా అంబులెన్సు కొనుగోలుకు చెక్కును ఇచ్చినట్లు శంభీపూర్ రాజు వెల్లడించారు. -
పోటాపోటీ నిరసనలు
హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు సోమవారం పోటాపోటీగా నిరసనలు తెలిపాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెల కొంది. టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎ మ్మెల్యేలపై నిజామాబాద్ ఎంపీ ధర్మ పురి అర్వింద్ చేసిన వివాదాస్పద వ్యా ఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం విదితమే. దీంతో ఆగ్రహించిన టీఆర్ ఎస్ శ్రేణులు.. ఎంపీ కాన్వాయ్, హ న్మకొండలోని బీజేపీ కార్యాలయంపై దాడికి దిగాయి. దీన్ని నిరసిస్తూ సోమ వారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తం గా ఆందోళనలు చేపట్టాలని బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు హన్మకొండలోని అమరుల స్తూపం కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు తమ ఎమ్మెల్యేలను భూకబ్జాదారులని ఆరోపించడంపై టీఆర్ఎస్ శ్రేణులూ భగ్గుమన్నాయి. ధర్నా నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అప్పటికే బందోబస్తులో ఉన్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. బీజేపీ కార్యకర్తలను కూడా అరెస్టు చేసి బీమారంలోని ఓ ఫంక్షన్ హాల్‌కు తరలించారు. అంతకుముందు హన్మకొండ బాలసముద్రం లోని చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్‌లోని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ క్యాంపు కార్యాలయాలపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. మరోవైపు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు వెళుతుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. -
తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ సాధారణ ప్రజలతోపాటు ప్రజా ప్రతినిధులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలను కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇటీవల హోంశాఖ మంత్రి మమమూద్ అలీకి కరోనా సోకగా, తాజాగా తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. మూడు రోజుల నుంచి జ్వరం గొంతునొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. పద్మారావుతోపాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు సైతం కోవిడ్ బారిన పడ్డారు. వీరంతా ప్రస్తుతం సికింద్రాబాద్‌లో హోం క్వారంటైన్లో ఉన్నారు. (తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్) తెలంగాణలో కరోనా బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీలో కరోనా సోకిన నేతల్లో పద్మారావు అయిదవ వ్యక్తి. ఇప్పటి వరకు టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్తా, హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో చాలా మంది రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇక సోమవారం ఒక్కరోజే తెలంగాణలో 973 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 15 వేలు దాటింది. మొత్తం 15,394 కేసులు నమోదవ్వగా 253 మంది మృత్యువాతపడ్డారు. కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 5,582 ఉండగా.. ప్రస్తుతం 9,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (మళ్లీ లాక్డౌన్.. సిద్ధంగా ఉన్నారా?) -
పదవుల ‘కల’వరం.. ఎప్పుడో పందేరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి వరుసగా రెండో పర్యాయం అధికారం చేపట్టి ఏడాది గడిచినా నామినేటెడ్ పదవుల భర్తీ అంశం కొలిక్కి రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి నామినేటెడ్ పదవుల భర్తీ అంశం తెరమీదకు వస్తున్నా తరచూ వాయిదా పడుతోంది. వరుస ఎన్నికలు వీటికి అవరోధంగా మారాయి. తాజాగా సహకార ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవి ముగిశాక పార్టీ అధినేత కేసీఆర్ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చేపడతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏడాదిన్నరగా ఒకటీ అరా మినహా నామినేటెడ్ పదవుల భర్తీ జరగక పోవడంతో పార్టీ లో పదవుల కోసం పోటీ నెలకొంది.అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన 12 మంది శాసనసభ్యులు కూడా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. సీనియర్లకు హామీ ఇచ్చిన అధిష్టానం రెండో పర్యాయం సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ 3 విడతల్లో మంత్రివర్గాన్ని విస్తరించారు. తనతో పాటు మరో 16 మందికి మాత్రమే అవకాశం ఉండటంతో వివిధ సామాజికవర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని చోటు కల్పించారు. అవకాశం దక్కని నేతలకు నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యమిస్తామంటూ గతేడాది జరిగిన మూడో విడత కేబి నెట్ విస్తరణ సందర్భంగా సంకేతా లు ఇచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం, మాజీ హోంమంత్రి నాయి ని, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, జూపల్లి, తుమ్మ ల నాగేశ్వర్రావు, బాజిరెడ్డి గోవర్ధన్‌తో సహా మొత్తం 12 మంది పేర్లను ప్రస్తావిస్తూ నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. సుమారు 90 ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు ఉండ గా గతేడాది అక్టోబర్ నాటికి 95% పదవులు ఖాళీ అయ్యాయి. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ముఖ్య నేతలు ఈ పదవులను ఆశిస్తూ సీఎం కేసీఆర్‌తో పాటు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని లాబీయింగ్ చేస్తున్నారు. ఒకటీ అరా పదవుల భర్తీ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ను అసెంబ్లీలో, బి. వెంకటేశ్వర్లును మండలిలో చీఫ్ విప్‌లుగా నియమించారు. ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ఎ.జీవన్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ కమిటీల్లో చోటు కల్పించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఆయాచితం శ్రీధర్ ను కొనసాగించారు. మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా కేబినెట్ హోదాలో నియమించారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అడ్వొకేట్ శ్రీరంగారావును టీఎస్ఈఆర్సీ చైర్మన్‌గా నియమించారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను టెస్కో చైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించినా ఉత్తర్వులు రాలేదు. రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డికి మండలి చైర్మన్ పదవి అప్పగించారు. పార్టీలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేబినెట్ హోదాలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సుధీర్ రెడ్డిని నియమించారు. కార్పొరేషన్లలో ఖాళీగా పదవులు రోడ్డు రవాణా సంస్థ, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ, మిషన్ భగీరథ, ఎస్సీ కార్పొరేషన్, మహిళా కమిషన్ వంటి కీలక సంస్థల్లో చైర్మన్, పాలక మండలి సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా స్థాయిలో మార్కె ట్, దేవాలయ కమిటీలు, గ్రంథాలయ సంస్థ పాలక మండళ్లలో ఖాళీగా ఉన్నాయి. మున్సిప ల్ ఎన్నికల్లో పోటీ అవకాశం దక్కని నేతలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. సుమారు 4 వేల వరకు నామినేటెడ్ పదవుల భర్తీకి అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు పార్టీ నేతలు, కేడర్‌ను సంతృప్తి పరిచేలా పదవులను భర్తీ చేయాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల నేతలు రాష్ట్ర స్థాయి పదవులు ఆశిస్తుండటంతో, వీరిలో కొందరికి పార్టీ పదవులను కట్టబెట్టడం ద్వారా సంతృప్తి పరిచే అవకాశముందని సమాచారం. -
‘సహకార’ బరి.. డీసీసీబీ పీఠంపై గురి
సాక్షి, హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పాలక మండలి ఎన్నికలు పూర్వపు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో డీసీసీబీ చైర్మన్ పదవులపై కన్నేసిన టీఆర్ఎస్ నేతలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలపై దృష్టి సారించారు. పీఏసీఎస్ డైరెక్టర్లుగా, ఆ తర్వాత పీఏసీఎస్ చైర్మన్లుగా ఎన్నికైతేనే డీసీసీబీ అధ్యక్ష పీఠానికి పోటీపడే అవకాశం ఉం టుంది. దీంతో డీసీసీబీ పీఠాన్ని ఆశిస్తున్న పలువురు నేతలు పీఏసీఎస్ స్థాయి లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు తమ వంతు ప్రయత్నా లు సాగిస్తున్నారు. రాష్ట్రంలో 905 పీఏసీఎస్‌ల పరిధిలోని 12,100 డైరెక్టర్ స్థానాలకు శనివారంతో నామినేషన్ల స్వీకరణ ముగిసింది. సోమవారం ఉపసంహరణకు గడువు ఉండటంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్య క్ష పదవిని ఆశిస్తున్న నేతలు డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 2013లో ఉమ్మడి ఏపీలో జరిగిన సహకార ఎన్నికల్లో తెలంగాణలోని 9పూర్వపు జిల్లాల డీసీసీబీ అధ్యక్షులు కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వరంగల్ మిన హా మిగతా 8 జిల్లాల డీసీసీబీ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గతంలో టీఆర్ఎస్లో చేరిన డీసీసీబీ అధ్యక్షుల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారు మరోమారు అదే పదవిని ఆశిస్తూ సహకార ఎన్నికల్లో పీఏసీఎస్ డైరెక్టర్ స్థానాలకు నామినేషన్లు దాఖ లు చేశారు. మరో వారంలో పీఏసీఎస్ స్థాయిలో ఎన్నిక పూర్తవ్వనుండటంతో, డీసీసీబీ అధ్యక్ష పదవిపై ఏకాభిప్రాయానికి వచ్చేందుకు పూర్వపు ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ముఖ్యనేతలతో సమావేశాలు జరపాల్సిందిగా సంబంధిత జిల్లాలకు చెందిన మంత్రులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన –ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం పూర్తికాగా, త్వరలో ఇతర జిల్లాల నేతలు కూడా భేటీ కానున్నారు. మెదక్ డీసీసీబీ బరిలో పద్మా దేవేందర్‌రెడ్డి భర్త మెదక్ డీసీసీబీ పదవిని ఆశిస్తూ ప్రస్తుత అధ్యక్షుడు చిట్టి దేవేందర్‌రెడ్డి కొండపాక సొసైటీ పరిధిలో మరోమారు పోటీ చేస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి భర్త కూడా కోనాపూర్ సొసైటీ నుంచి బరిలోకి దిగారు. గతంలో రెండు పర్యాయాలు వరుసగా కోనాపూర్ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికవ్వగా, ప్రస్తుతం మూడోసారి పోటీ చేస్తున్నారు. వరంగల్ డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశిస్తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సన్నిహితుడు మార్నేని రవీందర్రావు సింగారం సొసైటీ పరిధిలో నామినేషన్ దాఖలు చేశారు. ఆదిలాబాద్ డీసీసీబీ అధ్యక్ష పదవిని మరోమారు ఆశిస్తూ ఎం.దామోదర్ రెడ్డి తలమడుగు పీఏసీఎస్ నుంచి పోటీ చేస్తుం డగా, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అడ్డి బోజారెడ్డి తాంసి పీఏసీఎస్ పరిధిలో నామినేషన్ వేశారు. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ పదవిని ఆశిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారి బి.మనోహర్‌రెడ్డి కుల్కచర్ల పీఏసీఎస్ పరిధిలో డైరెక్టర్‌గా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కేటీఆర్‌ను కలిసిన ఔత్సాహికులు డీసీసీబీ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న పలువురు టీఆర్ఎస్ నాయకులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిసి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. కరీంనగర్ డీసీసీబీ అధ్యక్షుడిగా, రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్ చైర్మన్‌గా పనిచేసిన కొండూరు రవీందర్రావు మరోమారు అదే పదవిని ఆశిస్తూ, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పీఏసీఎస్ పరిధిలో డైరక్టర్ స్థానానికి నామినేషన్ వేశారు. గతంలో టెస్కాబ్ చైర్మన్‌గా స్వల్ప కాలం పనిచేసిన ఎడవెళ్లి విజయేందర్‌రెడ్డి నల్గొండ డీసీసీబీ అధ్యక్ష పదవిని దృష్టిలో పెట్టుకుని బరిలోకి దిగారు. మరోవైపు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త మహేందర్‌రెడ్డి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి సొసైటీ డైరక్టర్‌గా నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశిస్తూ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు భాస్కర్‌రెడ్డి దేశాయిపేట పీఏసీఎస్ పరిధిలో నామినేషన్ వేశారు. మహబూబ్‌నగర్ డీసీసీబీ పీఠాన్ని దృష్టిలో పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి కొడంగల్ పీఏసీఎస్ పరిధిలో పోటీకి దిగారు. -
చైర్మన్ పీఠంపై గురి
సాక్షి, నిజామాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ స్థానంపై అధికార టీఆర్ఎస్ జిల్లా ముఖ్య నేతలు గురిపెట్టారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉండే ఈ కీలకమైన స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. ఇందులో భాగంగా తమ పరిధిలోని సొసైటీ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు డైరెక్టర్లుగా నామినేషన్లు వేశారు. డీసీసీబీ చైర్మన్ పదవి దక్కాలంటే ఏదైనా సహకార సంఘం డైరెక్టర్‌గా ఎన్నికై, సొసైటీ చైర్మన్ పదవి పొందాల్సి ఉంటుంది. దీంతో డీసీసీబీ రేసులో ఉన్న నాయకులు తమ సహకార సంఘాన్ని ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చైర్మన్ రేసులో ఉన్న కొందరు నేతలు తమ సొసైటీలను ఏకగ్రీవం చేసుకున్నారు. అయితే ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో డీసీసీబీతో పాటు, డీసీఎంఎస్ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. దీంతో ఆ పార్టీ నేతలు ఈ పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. రేసులో పలువురు.. డీసీసీబీ చైర్మన్ రేసులో ప్రధానంగా పోచారం భాస్కర్‌రెడ్డి, కుంట రమేశ్‌రెడ్డి, బిగాల కృష్ణమూర్తి గుప్తా, మార గంగారెడ్డి తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు భాస్కర్‌రెడ్డి ఆశిస్తున్న దేశాయిపేట్ సొసైటీ డైరెక్టర్ల స్థానాలు దాదాపు ఏకగ్రీవం అయ్యాయి. ఈ సొసైటీ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశాలున్న భాస్కర్‌రెడ్డి డీసీసీబీ చైర్మన్‌తో పాటు, టీఎస్ కాబ్ పదవి రేసులో కూడా ఉండే అవకాశాలున్నాయి. అలాగే ఇప్పటికే ఏకగ్రీవమైన వేల్పూర్ సొసైటీ చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాలున్న కుంట రమేశ్‌రెడ్డి డీసీసీబీ పీఠాన్ని ఆశిస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బంధువైన రమేశ్‌రెడ్డికి మంత్రి ఆశీస్సులున్నాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా తండ్రి బిగాల కృష్ణమూర్తి గుప్తా కూడా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పదవిని ఆశిస్తున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్లూర్ సొసైటీ డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఎమ్మెల్యే గణేశ్ గుప్తా మంత్రి కేటీఆర్‌ను కలిసే ప్రయత్నంలో ఉన్నారు. అంకాపూర్ సహకార సంఘం చైర్మన్‌గా పనిచేసిన మార గంగారెడ్డి, బోధన్‌కు చెందిన గిర్దావార్ గంగారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో మార గంగారెడ్డి కేటీఆర్‌ను కలిసినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ పేర్లు వినిపిస్తున్నప్పటికీ, చివరి వరకు ఇవేవీ కాకుండా కొత్త ముఖాలు తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పదవి విషయంలో అధినేత కేసీఆర్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయనేది త్వరలోనే తేలనుంది. డీసీసీబీ దక్కకపోతే డీసీఎంఎస్ డీసీసీబీ ప్రయత్నాల్లో ఉన్న నేతలు ఆ పదవి దక్కని పక్షంలో డీసీఎంఎస్ చైర్మన్ పదవితోనైనా సరిపెట్టుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డీసీసీబీ ప్రస్తుతం ఉన్నట్లుగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగనుండగా, డీసీఎంఎస్ మాత్రం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు వేర్వేరుగా ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. -
‘ఆ బిల్లును వ్యతిరేకిస్తే..పాకిస్తాన్‌కు మద్దతిచ్చినట్లే’
సాక్షి, ఆదిలాబాద్: పౌరసత్వ సవరణ బిల్లుపై కొన్ని పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. ఆయన ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..దేశంలో ఉన్న ముస్లింలకు అన్యాయం చేసే చట్టం కాదని.. టెర్రరిస్టులకు, చొరబాటుదారులకు అందులో చోటు కల్పించలేదని వివరించారు. బిల్లును వ్యతిరేకించే వారు పాకిస్తాన్‌కు మద్దతిచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. ప్రజలకు మాయామాటలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముస్లింల ఓట్లు కోసం బిల్లును టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. హిందువులంతా ఒక్కటై మున్సిపల్ ఎన్నికల్లో గెలుపును మోదీకి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ‘పౌరసత్వ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు.. ఆదిలాబాద్ స్థానిక నేతలు పిచ్చివాళ్లలా మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు. డబ్బు కేంద్రానిది..సోకులు టీఆర్ఎస్ వాళ్లదని విమర్శించారు. టీఆర్ఎస్ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దన్నారు. గెలిచేవారికే మున్సిపల్ టికెట్లు ఇస్తామని, పైరవీకారులకు టికెట్లు ఇచ్చేదిలేదని స్పష్టం చేశారు. సర్వేలు ప్రకారమే టికెట్లు కేటాయిస్తామని బాపురావు వెల్లడించారు. -
అమరుల స్తూపానికి కాళేశ్వరం జలాలతో అభిషేకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా టీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం జలాలతో అమరుల స్తూపానికి అభిషేకం చేశారు. డిసెంబర్ 9 ప్రకటనను గుర్తు చేసుకుంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన అనుచరులతో కలసి సోమవారం గోదావరిఖని నుంచి గోదావరి నీటితో భారీ ర్యాలీగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కుకు చేరుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరులతో కలసి అమరుల స్తూపానికి జలాభిషేకం చేశారు. గోదావరి జలాలను తెలంగాణకు తీసుకురావాలనే లక్ష్యంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం ద్వారా అమరుల కల నెరవేరిందని ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. -
డజను కార్పొరేషన్లకు కేబినెట్ హోదా?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి సుమారు ఏడాది కావస్తోంది. రికార్డు స్థాయిలో 89 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడంతో పాటు, ఇతర పార్టీల శాసనసభ్యుల చేరికతో ప్రస్తుతం అసెంబ్లీలో టీఆర్ఎస్కు 104 మంది సభ్యుల బలం ఉంది. 40 మంది సభ్యులు ఉండే శాసన మండలిలోనూ టీఆర్ఎస్కు సంపూర్ణ బలం ఉండటంతో మంత్రివర్గంలో చోటు కోసం సీనియర్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో పోటీ పడ్డారు. అయితే గత ఏడాది డిసెంబర్ 13న రెండో పర్యాయం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది మొదలుకుని ఈ ఏడాది సెప్టెంబర్ 8న జరిగిన మూడో విడత మంత్రివర్గ విస్తరణ వరకు మంత్రిమండలి సభ్యుల సంఖ్య సీఎం కేసీఆర్‌తో కలుపుకుని 18కి చేరుకుంది. మంత్రివర్గంలో వివిధ సామాజిక వర్గాల సమీకరణలను దృష్టిలో పెట్టుకుని చోటు కల్పించాల్సి రావడంతో పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర పార్టీల నుంచి చేరిన ముఖ్య నేతలకు మంత్రివర్గంలో సీఎం చోటు క ల్పించలేకపోయారు. దీంతో పలు కార్పొరేషన్లతో పాటు ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో జరిగిన మంత్రివర్గ విస్తరణ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలకు సంకేతాలు ఇచ్చారు. కేబినెట్ హోదాలో నామినేటెడ్ పదవులు టీఆర్ఎస్ వరుసగా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు హౌజింగ్ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, టీఎస్ఐఐసీ సంస్థల పాలక మండళ్ల చైర్మన్ల పదవీ కాలాన్ని మాత్రమే సీఎం కేసీఆర్ పొడిగించారు. పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌గా సిద్దిపేట జిల్లాకు చెందిన మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. మంత్రివర్గంలో చోటు ఆశించిన మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసి, శాసన మండలి చైర్మన్ పదవి అప్పగించారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా కేబినెట్ హోదాలో నియమించారు. కేబినెట్లో స్థానం ఆశించిన వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయభాస్కర్, శాసన మండలి సభ్యులు బోడకుంట వెంకటేశ్వర్లును ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తూ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను విప్‌లుగా, శానసన సభ కమిటీ చైర్మన్లుగా నియమిస్తూ సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. తాజాగా శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేబినెట్ హోదాలో రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా నియమించారు. మరో డజను మందికి కేబినెట్ హోదా? పలు ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నియమించాలనే యోచనలో ఉన్న సీఎం కేసీఆర్, కొందరికి కేబినెట్ హోదా కూడా కల్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల 29 కార్పొరేషన్ల చైర్మన్ పదవులను లాభదాయక పదవుల జాబితా నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ జాబితాలో మూసీనది పరివాహక (రివర్‌ఫ్రంట్) అభివృద్ధి కార్పొరేషన్ (ఎంఆర్డీసీ), రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ, కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు సంస్థ, యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ), హైదరాబాద్ మహానగరాభివృద్ధి ప్రాధికార సంస్థ, రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థలు, తెలంగాణ రాష్ట్ర క్రీడల ప్రాధికార సంస్థ, తెలుగు అకాడమీ, హాకా, అధికార భాషా కమిషన్, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సంఘం (టీఆర్ఈఐ), హజ్ కమిషన్, సాహిత్య అకాడమీ, టీఎస్జెన్కో, టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్ డిస్కమ్ చైర్మన్లు కేబినెట్ హోదా జాబితాలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం టీఆర్ఎస్లో పోటీ తీవ్రంగా ఉన్నా, కేబినెట్ హోదా పదవులను బాజిరెడ్డి గోవర్దన్, జోగు రామన్న, రెడ్యా నాయక్, తుమ్మల నాగేశ్వరరావు, పద్మా దేవేందర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి తదితరులు ఆశిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
యాదాద్రిలో ప్రొటోకాల్ పంచాయితీ
యాదగిరిగుట్ట (ఆలేరు) : ఒకరు మహిళ అధికారి.. మరొకరు మహిళ ప్రజాప్రతినిధి.. వారిద్దరి మధ్య నువ్వానేనా అన్న తరహాలో వార్ నడుస్తోంది. అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదంటూ.. స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం ఆహ్వానాలు ఇవ్వడం లేదంటూ అధికారిపై గతంలో మంత్రులకు, ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. నిన్నటివరకు ఈ ప్రొటోకాల్ విషయం లోలోపలనే ఉన్నా.. శనివారం జరగాల్సిన ఓ కార్యక్రమానికి ఆ ప్రజాప్రతినిధితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని ఆమె అనుచరులంతా ఆ అధికారిపై ఉన్నతస్థాయి అధికారులకు మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన యాదగిరిగుట్టలో శనివారం చోటు చేసుకుంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈఓ గీతారెడ్డి.. ఆలయానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ఏవీ చేసినా ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డికి, ఎంపీ, ఎమ్మెల్సీలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం ఇవ్వడం లేదని, కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదంటూ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సందర్శనకు వచ్చిన సీఎస్ జోషి దృష్టికి తీసుకెళ్లారు. అసలేమీ జరిగిందంటే... యాదాద్రి దేవస్థానం ఆధీనంలో ఉన్న నల్లపోచమ్మవాడలోని గోశాలను మల్లాపురం మార్గంలో ఉన్న దేవస్థానం బావి వద్ద నూతనంగా నిర్మించిన తులసీ వనానికి తరలించారు. కొంతకాలంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. శనివారం తులసీ వనంలో నిర్మించిన నూతన గోశాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడంతోపాటు వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన భోజనాలకు వచ్చిన సీఎస్ జోషితో ప్రారంభించాలని అధికారులు అంతా సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో ప్రొటోకాల్ పాటించడం లేదని ప్రారంభోత్సవాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అనుచరులు అడ్డుకుంటారని చేయలేదు. పూలతో అలంకరణతోపాటు టెంకాయలు, ప్రారంభో త్సవ రిబ్బన్ కూడా సిద్ధం చేసి చివరికి ప్రారంభం చేయకుండా వాటిని తొలగించడంతో అక్కడున్న ఆచార్యులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజాప్రతినిధులు రావడంతోనే.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతోపాటు ఎంపీ, ఎమ్మెల్సీ, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, కనీసం ప్రొటోకాల్ పాటించకుండానే గోశాలను ఎలా ప్రారంభిస్తారో చూడాలని ఈఓ గీతారెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున గోశాలకు చేరుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆలయ అధికారులు ప్రారంభోత్స వానికి సిద్ధం చేసిన రిబ్బన్‌ను తొలగించి, అలంకరణ మాత్రమే ఉంచారు. ప్రజాప్రతినిధులు గొడవకు దిగుతారనే ముందుగా గ్రహించిన ఈఓ గీతారెడ్డి ప్రారంభోత్సవం రద్దు చేశారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఎలాంటి ప్రారంభోత్సవం లేనప్పుడు హంగులు, ఆర్భాటాలు ఎందుకని ప్రశ్నించారు. గతంలో కూడా ఈఓ గీతారెడ్డి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా ఉన్న గొంగిడి సునితామహేందర్‌రెడ్డికి ప్రొటోకాల్ పాటించడం లేదని, రెండేళ్ల క్రితం బ్రహ్మోత్సవాల సమయంలో కరపత్రాలపై విప్ సునీత పేరు ముద్రించడంలో తప్పులు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా ఆలయానికి వచ్చిన సందర్భంలో ఆమెను సరిగా ఆహ్వానించరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఓపై చర్యలు తీసుకోవాలి.. ప్రొటోకాల్ పాటించకుండా స్థానిక ప్రజాప్రతినిధులను అవమాన పరుస్తున్న ఆలయ ఈఓ గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, మిట్ట వెంకటయ్యగౌడ్, యువజన విభాగం కన్వీనర్ గడ్డమీది రవీందర్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో సీఎస్ జోషికి వినతిపత్రం అందజేశారు. సీఎం కేసీఆర్ రూ.వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారని, కానీ శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యేను, ఎంపీని, ఎమ్మెల్సీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లను ఆహ్వానించకుండా అగౌరవపరుస్తున్నారని తెలిపారు. ఈఓ వచ్చిన నాటినుంచి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రోజుకో రాయికి పూజలు చేస్తాం.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండపైన ప్రతి రోజూ ఒక రాయికి పూజలు చేస్తాం. వాటన్నింటికి పిలవాలని లేదు. ప్రధాన ఆలయం ప్రారంభోత్సవంతోనే మిగతా ప్రారంభోత్సవాలు జరుగుతాయి. ఇప్పటి వరకు ఎక్కడ ప్రారంభోత్సవాలు జరగలేదు. పాత గోశాలను మల్లాపురం రోడ్డులో నూతనంగా నిర్మితం గోశాలకు తరలించాలని వైటీడీఏ అధికారులు ఆదేశించారు. కానీ దీనికి ఎవరిని మేము పిలవలేదు. –గీతారెడ్డి, ఈఓ, యాదాద్రి దేవస్థానం ఆహ్వానం అందలేదు.. వాస్తవమే యాదాద్రి దేవస్థానానికి సంబంధించిన గోశాల ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వానం అందలేదు. ఇది వాస్తవమే. గతంలో ఒకటి, రెండు సార్లు ఇలాంటి సంఘటనలకు మమ్మల్ని ఆహ్వానించలేదు. అయినా మేము ఎక్కడ కూడా ఈఓను ఇబ్బంది పెట్టలేదు. సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ప్రొటోకాల్ విషయాన్ని ఎప్పుడూ అంతగా పట్టించుకోలేదు. – గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే -
టీఆర్ఎస్కు మావోయిస్టుల హెచ్చరిక
సాక్షి,కొత్తగూడెం: చర్ల మండలంలో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే నల్లూరి శ్రీనివాసరావును హతమార్చామని, పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తే ప్రజల చేతిలో శిక్ష తప్పదని మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ హెచ్చరించారు. శ్రీనివాసరావును ఎస్బీ పోలీసులు ఇన్ఫార్మర్గా మార్చుకుని దళాల సమాచారం సేకరించేవారని, అలాగే ఆదివాసీల 80 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేసినం దునే చంపినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం లేఖను విడుదల చేశారు. ఆదివాసీలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్, అధికారంలోకి వచ్చిన అనంతరం అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి హరితహారం పేరుతో అటవీశాఖ, పోలీసులతో పెద్ద ఎత్తున అటవీ భూములపై దాడులను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఆరేళ్లుగా కార్పొరేట్లు, భూస్వాముల కోసం సల్వాజుడం దాడులను కొనసాగిస్తున్నారన్నారు. కొమ్రం భీం జిల్లా కొత్త సార్సాల గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుండాలపాడు, చెలిమన్ననగర్ గ్రామాల్లో అటవీ శాఖాధి కారులు, పోలీసులు ఆదివాసీలకు జీవనాధారమైన భూముల్లో బలవంతంగా ట్రాక్టర్లతో దున్ను తూ మొక్కలు నాటుతూ ఆదివాసీలను గెంటివేస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో ప్రజలు దాడులకు దిగాల్సి వచ్చిందన్నారు. దీనికి బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఇల్లెందు మండలం కోటగడ్డ, వీరాపురం, ముత్తారికట్ట, లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లెందు క్రాస్‌రోడ్, దమ్మపేట మం డలం బాలరాజుగూడెం, ఇల్లెందు, బయ్యారం, కారేపల్లి గ్రామాల్లో ఆదివాసీ రైతులను భూముల నుంచి గెంటివేస్తూ అటవీ అధికారులు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇచ్చిన భూముల్లో కూడా కందకాలు తవ్వి భూములను సాగు చేయకుండా ఆపారన్నారు. కేసీఆర్ పాలన మొదలైనప్పటి నుంచి అడవిలో ఆదివాసీలు ఉడతలు పట్టుకున్నా.. ఉడుములు పట్టుకున్నా వేల రూపాయల జరిమానా విధిస్తూ జైళ్లలో పెడుతున్నారన్నారు. మావోయిస్టు పార్టీ పాలకుల కుట్రలను, వాస్తవ విషయాలను ఆదివాసీలకు, పీడిత ప్రజలకు తెలియజేస్తూ ఉంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, పోలీసు అధికారులు ఆదివాసీలను మావోయిస్టు పార్టీ తప్పుదోవ పట్టిస్తున్న దని చెప్పడం దొంగే దొంగ అన్న చందంగా ఉంద న్నారు. అనేక గ్రామాల్లో ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో అక్రమంగా అరెస్టులు చేసి తీవ్రమైన చిత్రహింసలకు గురిచేస్తున్నారని, మావోయిస్టు దళాలకు కొరియర్లుగా పనిచేస్తూ జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, ఆహారం సప్లై చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పోలీసులను చంపడానికి పెట్టిన బాంబులను నిర్వీర్యం చేస్తున్న క్రమంలో అరెస్టులు చేస్తున్నట్లు మహబూబాబాద్, జయశంకర్, భద్రాద్రి జిల్లాల ఎస్పీలు బూటకపు ప్రచారం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసు, అటవీ శాఖల అధికారులు హరితహారం పేరుతో దాడులను ఆపకపోతే, మావోయిస్టుల పేరుతో అక్రమ అరెస్టులను నిలిపి వేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ ప్రాంతంలో అధికంగా అడవులను నరికిన భూస్వాములు, రాజకీయ నాయకులు, పెత్తందారులు, ధనిక రైతుల చేతిలో ఎక్కువ భూములున్నాయన్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు కొనసాగించాలని జగన్ పిలుపునిచ్చారు. -
అభివృద్ధి చేయకుండా ఓట్లెలా అడుగుతారు: ఉత్తమ్
అనంతగిరి: టీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో అభివృద్ధి చేయకుండా ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని వెంకట్రాంపురం, వాయిలసింగారం, త్రిపురవరం, చనుపల్లి గ్రామాలలో ఆదివారం ఆయన పరిషత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రతి గ్రామానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు, మిషన్ భగీరథ నీరు, ఇంటికో ఉద్యోగం, రైతుల రుణమాఫీపై ఇచ్చిన హామీలు ఎటుపోయాయని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కేంద్ర కేబినెట్లో ఉన్నత స్థాయిలో తెలంగాణ రథసారథులు ఉంటారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. డబ్బుకోసం పార్టీ మారిన రాజకీయ నాయకులు తల దించుకునేలా ప్రజల నిర్ణయం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి వాసు, ముస్కు శ్రీనివాసరెడ్డి, బుర్రా సుధారాణి, పుల్లారెడ్డి పాల్గొన్నార -
కనకారెడ్డి మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు
-
చట్టసభల్లో మోసగాళ్లకు చోటులేదు: భట్టి
కూసుమంచి: చట్టసభల్లో మోసగాళ్లకు చోటు లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అవి దేవాలయాలతో సమానమని, అందుకే తమ బాధ్యతగా ఫిరాయింపులపై పోరాటాలు చేస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి.. నిలదీస్తామనే భయంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. సీఎల్పీని విలీనం చేస్తామని టీఆర్ఎస్ నేతలు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల విషయమై రాష్ట్రపతిని కలసి విషయాన్ని వివరిస్తామని చెప్పారు. -
భాగ్యనగరంలో ‘బాలాకోట్’!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దృష్టి దేశంపై పడేలా చేశామంటూ కేంద్ర ప్రభుత్వ ఘనతను చెప్పుకునే బీజేపీ నేతలు.. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అంటూ బలంగా వినిపించే టీఆర్ఎస్ నేతలు... సంక్షేమంలో నాటి యూపీఏ ప్రభుత్వ పథకాలే భేష్ అంటూ ప్రసంగించే కాంగ్రెస్ నేతలు... భాగ్యనగర రాజకీయ గోదాలోకి వచ్చేసరికి ప్రచారం తీరు మారుస్తున్నారు. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై భారత సైన్యం జరిపిన దాడుల అంశానికి వద్దు వద్దంటూనే ప్రచారంలో పెద్ద పీట వేస్తున్నారు. మోదీ మరోసారి ప్రధాని కాకుంటే పాకిస్తాన్ రెచ్చిపోతుందని, అది దేశానికే నష్టమని బీజేపీ నేతలు.. ఆ దాడుల్లో గొప్పేముంది, గతంలో యూపీఏ హయాంలోనూ ఇలాంటి సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయంటూ టీఆర్ఎస్ నేతలు.. అసలు బాలాకోట్ దాడుల్లో పేరుతో పాక్‌కు జరిగిన నష్టమేమీ లేదని, లేని ఘనతను బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు... ఇలా అందరికీ భాగ్యనగరంలో పాక్‌పై దాడుల అంశమే ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. హైదరాబాద్‌లో అంతే.. ‘కారు.. సారు.. పదహారు..’అంటూ రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర ప్రచారం చేస్తున్నా టీఆర్ఎస్ నేతలు.. హైదరాబాద్‌కు వచ్చేసరికి మాత్రం ప్రధాని మోదీ దూకుడుకు అడ్డుకట్ట వేసేలా ప్రచార సరళి మారుస్తున్నారు. ఇటు కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి తెలంగాణ జనాన్ని వంచిస్తోందంటూ ఇతర ప్రాంతాల్లో గట్టిగా విమర్శిస్తున్న బీజేపీ నేతలు.. హైదరాబాద్‌లో మాత్రం పాక్‌పై దాడుల అంశానికే ప్రాధాన్యమిస్తున్నారు. 16 స్థానాలు గెలిచినా కేంద్రంలో టీఆర్ఎస్ చక్రం కాదు కదా కనీసం బొంగరం కూడా తిప్పలేదంటూ ఎద్దేవా చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. నగరంలో మోదీని టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాలపై ప్రధాని ఫైర్ మూడ్రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో వాడివేడీగా ప్రసంగించారు. ఆయన మాటల్లో ఎక్కువగా మజ్లిస్, పాక్‌కు అనుకూలంగా ప్రతిపక్షాలు మాట్లాడటం, కశ్మీర్.. అంశాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ఆయన తన మాటతీరు మార్చుకున్నారు. సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడటం కంటే పరోక్షంగా పాక్‌పై భారత సైన్యం దాడులను ప్రస్తావించేలా ఉపన్యాసం సాగింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధానమంత్రి కావాలన్న ఫరూక్ అబ్దుల్లా మాటలను కూడా ఉటంకించారు. పాక్‌ను సమర్థించేలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయంటూ.. వారికి దేశంపై ఉన్న అభిమానాన్ని శంకించేలా మాట్లాడి ఆకట్టుకున్నారు. మోదీ వస్తేనే దేశం సేఫ్..: బీజేపీ ఇక జనం దృష్టిని ఆకర్షించేందుకు బీజేపీ మోదీ గ్రాఫ్‌ను ముందుంచుతోంది. ఎట్టి పరిస్థితిలో ఆయన మరోసారి ప్రధాని కావాల్సిందేనని, లేకుంటే దేశ భవిష్యత్ గందరగోళమవుతుందంటూ ప్రచారం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తావించిన డబుల్ బెడ్రూం ఇళ్లు, భగీరథ నీళ్లు, నగరంలో రోడ్లు.. లాంటి అంశాల జోలికే వెళ్లటం లేదు. దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీ మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించాలని, టీఆర్ఎస్కు ఓటేస్తే మోదీ వ్యతిరేకులకు ఓటేసినట్టేనని, ఇటు కాంగ్రెస్‌కు ఓటేసినా, టీఆర్ఎస్కు వెళ్తుందంటూ బీజేపీ ప్రచారంలో చెప్పుకుంటోంది. బీజేపీ ఎంత బలంగా పాక్‌పై దాడుల అంశాన్ని తెరపైకి తెస్తుంటే.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు వాటిని ఖండించే క్రమంలో అవే అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రచారం సాగిస్తున్నాయి. సిటీలో సీఎం టార్గెట్ బీజేపీనే.. ఇక సీఎం కేసీఆర్ కూడా వీలైనప్పుడల్లా సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడులపై కేంద్రం చెప్పేవి అబద్ధాలంటూ.. తన పదునైన వ్యాఖ్యలతో జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బీజేపీనే బలంగా ఉందన్న భావనతో ఆయన వీలైనంత వరకు ఆ పార్టీపైనే ఆరోపణలు, విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సీఎంతోపాటు ఆ పార్టీ నేతలు కూడా సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌పై కంటే బీజేపీనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇటు సికింద్రాబాద్, మల్కాజిగిరిలలో కూడా బీజేపీనే బాగా టార్గెట్ చేస్తున్నారు. ఇక మల్కాజిగిరి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి కూడా ఇటు టీఆర్ఎస్ను అటు బీజేపీని ఒకేస్థాయిలో విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన తరఫున జరుగుతున్న ప్రచారంలో కూడా పాక్‌పై దాడుల అంశాలే ప్రస్తావనకు వస్తున్నాయి. -
‘నీ అంతటి నీచ చరిత్ర మరో నాయకుడికి లేదు’
సాక్షి, సంగారెడ్డి : సింగూరు నీటిని హరీష్‌రావు దొంగిలించారన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై టీఆర్నేతలు నిప్పులు చెరిగారు. జగ్గారెడ్డి విమర్శలపై టీఆర్ఎస్ నేతలు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, జిల్లా పరిషత్ ఛైర్మన్ రాజమణి శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. 'జగ్గారెడ్డి తీరుతో ఎందుకు గెలిపించామా అని సంగారెడ్డి ప్రజలు ఆవేదన పడుతున్నారు. జగ్గారెడ్డి వ్యవహారం చూసి పిచ్చి వాడిని గెలిపించాము అని సంగారెడ్డి ప్రజలు భావిస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తున్నాడు. నీటి సమస్యలు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం అన్ని పనులు చేస్తుంటే, నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభం. నీకు జనాలు ఓట్లు వేసి ఏం లాభం. జగ్గారెడ్డి ముమ్మాటికీ చెల్లని రూపాయి. ఎమ్మెల్యేగా గెలవగానే, తెలంగాణకు ద్రోహం చేశావు. ఈదులనాగులపల్లి, ధర్మసాగర్, కంది, చేర్యాలలో ప్రభుత్వ భూములు కబ్జా చేసి అమ్ముకున్నావు. ఇంతటి నీచ చరిత్ర రాష్ట్రంలో మరో నాయకునికి లేదు. తప్పని పరిస్థితిలో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల రైతులను కాపాడాలనే ఉద్దేశంతో నీటిని విడుదల చేశారు. ప్రజలను రెచ్చగొట్టి హింసను ప్రోత్సహిస్తే ఉక్కుపాదం కింద నలిగిపోక తప్పదు. జగ్గారెడ్డి ఎన్ని జన్మలు ఎత్తినా హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని అడ్డుకోలేవు. కేసులు, శిక్షల నుంచి తప్పించుకోవడానికే జగ్గారెడ్డి కేసీఆర్‌ను పొగుడుతున్నాడు' అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మండిపడ్డారు. 'జగ్గారెడ్డి గత కొన్ని నెలలుగా ప్రెస్ మీట్లు పెట్టి హరీష్ రావుపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. తప్పుడు హామీలు ఇచ్చి గెలుపొందిన జగ్గారెడ్డి వాటిని నెరవేర్చకుండా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. తాను చేసిన నేరాలకు జైలుకు వెళ్ళక తప్పదనే భయంతోనే జగ్గారెడ్డి హరీష్ రావు మీద విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం హరీష్ రావు చేసిన కృషి నువ్వు చేసిన నిర్వాకాలు అందరికి తెలుసు. కార్గిల్ యుద్ధ సమయంలో కార్గిల్ అమరవీరుల కోసం డబ్బులు వసూలు చేసి వాటిని స్వాహా చేసిన చరిత్ర జగ్గారెడ్డిది. సరిహద్దులో సైనికులు ఉండి శత్రువులతో పోరాడుతుంటే నువ్వు అక్రమంగా గుజరాత్ మహిళను అమెరికాకు తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చావు. వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేశావు. ప్రజాసేవను వదిలిపెట్టి ఇటువంటి విమర్శలు చేస్తూ కాలం గడిపితే చరిత్రలో పుట్టగతులుండవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంవత్సరానికి 7టీఎంసీల నీటిని హైద్రాబాద్‌కు తరలించారు. అప్పుడు ఎందుకు స్పందించ లేదు. రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమం చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అందుకే ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. శిక్షల నుంచి తప్పించుకోవడానికి నిష్కలంకమైన హరీష్ రావుపై విమర్శలు చేస్తున్నావు. కాళేశ్వరం నుంచి సింగూర్‌ను నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎక్కువ నీరు ఉన్న దగ్గరి నుంచి అవసరం ఉన్న ప్రాంతాలకు తరలిస్తారు. కృష్ణ, గోదావరిలోంచి నీటిని హైదరాబాద్ తాగునీటి కోసం తరలిస్తున్నారు. దీన్ని అక్కడి ప్రజలు అడ్డుకుంటే హైదరాబాద్ పరిస్థితి ఏంటి. చట్ట సభల్లో కూర్చొని జగ్గారెడ్డి గల్లీ నాయకునిలా వ్యవహరిస్తున్నాడు. గల్లీ రాజకీయాలపై ఆసక్తి ఉంటే వచ్చే ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చెయ్యి. ప్రజా ఆదరణ ఉన్న నాయకులను విమర్శించి జగ్గారెడ్డి వికృత ఆనందం పొందుతున్నాడు. జగ్గారెడ్డి తన చర్యలతో సంగారెడ్డి నియోజకవర్గానికి నష్టం చేస్తున్నాడు' అని మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ పేర్కొన్నారు. 'జగ్గారెడ్డి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేసింది ఏం లేదు. హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తగదు. ఎమ్మెల్యేగా వీలైతే అభివృద్ధి చెయ్యాలి. లేకపోతే మా ప్రభుత్వమే అభివృద్ధి చేసుకుంటుంది' అని జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి అన్నారు. కాగా, సింగూరు నీటిని హరీష్‌రావు దొంగిలించారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. హరీష్‌రావు ఆదేశాల మేరకే సింగూరు నీటిని నిజాంసాగర్‌కు తరలించారని విమర్శించారు. నీటిని తరలిస్తుంటే ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సింగూరుపై హరీష్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. -
టీఆర్ఎస్ కార్యాలయంపై దాడి
టేకులపల్లి: టీఆర్ఎస్ కార్యాలయంపై శుక్రవారం దాడి జరిగింది. కోయగూడెంలో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకుని అవమానించారన్న ఆగ్రహంతో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు కలిసి టేకులపల్లిలోని టీఆర్ఎస్ కార్యాలయంపై శుక్రవారం దాడి చేశారు. ఇల్లెందు ఎమ్మెల్యే బాణోతు హరిప్రియ, కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం శుక్రవారం ప్రచారం చేస్తున్నారు. ఆమెను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నాయకులు.. టీఆర్ఎస్ కార్యాలయంలోకి ప్రవేశించి ఫ్లెక్సీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. టేకులపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి బోడ సరితకు చెందిన ప్రచార వాహనం అద్దం పగులకొట్టారు. సీఐలు నాగరాజు, వేణుచందర్, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ పంచనామా నిర్వహించారు. విచారణ చేపట్టారు. -
టీఆర్ఎస్ నేతల మధ్యే పోరు
గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు టీఆర్ఎస్ నేతలే ప్రత్యర్థులుగా ఉన్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఏకగ్రీవం చేసేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మరోవైపు గ్రామాల్లో విందు రాజకీయాలు జోరందుకున్నాయి. పెద్ద ఎత్తున మద్యం, మాంసం విందులు ఇస్తున్నారు. సర్పంచ్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అభ్యర్థులు కొన్ని పంచాయతీల్లో రూ.10 లక్షలకు మించి వ్యయం చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఎన్నికలంటే రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ ఉం టుంది. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు సైతం ఆయా పార్టీల మద్దతుదారులే ప్రత్యర్థులుగా ఉం టారు. అయితే ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికలు ఇందుకు భిన్నంగా సాగుతున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు టీఆర్ఎస్ నేతలే ప్రత్యర్థులుగా ఉన్నారు. ఆయా మం డలాల్లో రెండు, మూడు గ్రామ పంచాయతీ లు మినహా మిగిలిన అన్ని గ్రామాల్లో ఇద్దరు, ముగ్గురు టీఆర్ఎస్ నేతలే పోటీ చేయడంతో పోరు రసవత్తరంగా మారింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి ఏకగ్రీవం చేసేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. దీంతో టీఆర్ఎస్ గ్రామ స్థాయి కేడర్ రెండు, మూడు గ్రూపులుగా తయారైంది. ఇటీవ ల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కలిసి పనిచేసిన కేడర్ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఎవరికి వారే అన్న చందంగా మారిపోయింది. చాలా గ్రామాల్లో కాంగ్రెస్ కేడర్ స్తబ్ధుగా ఉండటం తో టీఆర్ఎస్ నేతల్లోనే ప్రధాన పోటీ నెలకొనడం ఆసక్తికరంగా మారింది. సగటున నలుగురు పోటీ.. జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్న 177 గ్రామ పంచాయతీల్లో 36 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 141 పంచాయతీల్లో మొత్తం 545 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కో పంచాయతీలో సగటున సుమా రు నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా భీంగల్ మండలంలో ఎన్నికలు జరుగుతున్న 20 జీపీలకు 103 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నేతల మధ్యే ప్రధాన పోటీ నెలకొనడంతో ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఎవరికి మద్దుతు పలకా లో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. 42 శాతం వార్డులు ఏకగ్రీవమే.. సర్పంచ్ స్థానాలు నామమాత్రంగా ఏకగ్రీ వం కాగా, వార్డు సభ్యుల స్థానాలు మాత్రం భారీ గా ఏకగ్రీవమయ్యాయి. మొత్తం వార్డుల్లో ఏకంగా 42 శాతం వార్డులు ఏకగ్రీవం కావడం గమనార్హం. మొదటి విడతలోని 177 గ్రామపంచాయతీల్లో మొత్తం 1,746 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఏకంగా 736 వార్డు సభ్యుల స్థానాలకు ఏకగీవ్రంగా ఎన్నిక జరిగింది. మిగితా 1004 వార్డు సభ్యుల స్థానాలకు 2,386 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా మరో ఆరు వార్డు సభ్యుల స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దాఖలైన నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా, ఈ 6 వార్డులకు ఈ విడతలో ఎన్నికలు జరగడం లేదు. జోరందుకున్న విందు రాజకీయాలు.. బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేలడంతో గ్రామ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. గుర్తులు కూడా అధికారులు ప్రకటించడంతో అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి తిరిగి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో విందు రాజకీయాలు జోరందుకున్నాయి. పెద్ద ఎత్తున మద్యం, మాంసం విందులు ఇస్తున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను తెరపైకి తెచ్చి తమను గెలిపిస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీలు ఇస్తున్నారు. గంప గుత్తాగా ఓట్లు రాబట్టుకునేందుకు ఆయా కుల సంఘాల పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. వారిని మచ్చిక చేసుకునేందుకు విందులు ఇస్తున్నారు. అలాగే యువకుల ఓట్లకు గాలం వేసేందుకు యువజన సంఘాలకు తాయిలాలను ప్రకటిస్తున్నారు. రూ.లక్షల్లో వ్యయం.. జనాభా ఐదు వేల లోపు ఉన్న గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల వ్యయం రూ.1.50 లక్షలకు మించి ఉండరాదని ఎన్నికల కమిషన్ తేల్చిచెప్పింది. ఐదు వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో రూ.2.5 లక్షలుగా నిర్దేశించింది. కాగా అభ్యర్థుల వ్యయం భారీగా ఉంటోంది. నాలుగైదు వందల ఓటర్లు ఉన్న పంచాయతీల్లో సైతం రూ.10 లక్షలకు మించి వ్యయం చేసేందుకు అభ్యర్థులు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. సర్పంచ్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అభ్యర్థులు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. -
శాంతిదూత ఏసుక్రీస్తు
సిరిసిల్లకల్చరల్: కరుణామయుడు, శాంతిదూత ఏసుక్రీస్తు జననం సందర్భంగా జిల్లావ్యాప్తంగా మంగళవారం క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చర్చిలు, ప్రార్థనా మందిరాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచే క్రైస్తవులు ప్రత్యేకపూజలు చేయడం ప్రారంభించారు. మతపెద్దలు ఏసుక్రీస్తు బోధనలను చదివి వినిపించారు. జిల్లా కేంద్రంతోపాటు సమీప గ్రామాలు, వేములవాడ పట్టణం, అన్ని మండల కేంద్రాల్లోని చర్చిలు భక్తుల రాకతో కళకళలాడాయి. సిరిసిల్ల బీవై నగర్ రిజరెక్షన్ లైఫ్ మినిస్ట్రీస్, బెతెస్థ బాప్టిస్ట్ చర్చిలో క్రైస్తవ సంఘం జిల్లా అధ్యక్షుడు జాన్ ఐజాక్ ప్రసంగించారు. లోక కల్యాణకారకుడు క్రీస్తు జీవితం, ఆయన అనుసరించిన ప్రేమ మార్గం ప్రపంచ ప్రజానీకం శాంతియుతంగా జీవించేందుకు ఆచరణ యోగ్యమైనదన్నారు. మానవ సమాజంలో శాంతి సాధనకు క్రీస్తు చూపిన మార్గమే శిరోధార్యమనిచెప్పారు. ఏసు ద్వారా అందిన శాంతి సందేశాన్ని అందరికీ చేరవేయడం ద్వారా ప్రజల జీవితాల్లో సుఖశాంతులను స్థాపింప జేయాలని కోరారు. రెవరెండ్ శ్యామ్ కల్వల ప్రత్యేక ప్రసంగం చేశారు. వేడుకల్లో దేవకర్ణతోపాటు సుమారు వెయ్యి మంది క్రైస్తవులు పాల్గొన్నారు. సుభాష్‌నగర్ సీఎస్ఐ చర్చిలో సుధాకర్ ప్రసంగిస్తూ ప్రభువు చూపిన దారిలో పయనించే ప్రజలందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. క్రైస్తవ సమాజం పెద్దలు సత్యం బాబూరావు, అనంతరావు, సులోచన, నర్సయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో టీఆర్ఎస్ నాయకులు.. జిల్లాకేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, చిక్కాల రామారావు, పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు గూడూరి ప్రవీణ్, ఎండీ సలీం తదితరులు కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, త్వరలోనే ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని వారు పేర్కొన్నారు. -
‘కారు’ దిగుతున్న గులాబీ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల తరుణంలో టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు వలసలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు అమలు చేస్తున్నాయి. టీఆర్ఎస్లోని పలువురు కీలక ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి దూరమవుతున్నారు. మరికొందరిపై టీఆర్ఎస్ అధిష్టానం స్వయంగా వేటు వేస్తోంది. కారణాలు ఏమైనా అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్ఎస్కు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు దూరమయ్యారు. ఎన్నికలు ముగిసేలోపు ఇంకెంత మంది ఈ జాబితాలో ఉంటారనేది ఆసక్తికరంగా మారుతోంది. చేవెళ్ల లోక్‌సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈ నెల 20న టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో యాదవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేలోపే మరికొందరు కీలక ప్రజాప్రతినిధులపై ఇదే తరహా నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ముఖ్యలు ప్రకటిస్తున్నారు. అసంతృప్తితో ఒక్కొక్కరు.. టీఆర్ఎస్ వ్యవహారాలకు కొన్ని నెలలుగా దూరంగా ఉంటూ వచ్చిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కొన్ని రోజుల క్రితం రాహుల్‌ని, ఆ తర్వాత సోనియాగాంధీని కలిశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు డీఎస్ అధికారికంగా ప్రకటించకపోయినా టీఆర్ఎస్కు దూరమయ్యారు. అసెంబ్లీ రద్దయిన వెంటనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ నుంచి పోటీ చేసే 105 అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. పోటీ చేసే అవకాశం రాకపోవడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు ఆర్.భూపతిరెడ్డి, రాములునాయక్, కొండా మురళీధర్‌రావు టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరారు. అలాగే తాజా మాజీ ఎమ్మెల్యేలు కొండా సురేఖ, బాబుమోహన్, బొడిగె శోభ, బి.సంజీవరావు టీఆర్ఎస్ను వీడారు. వీరిలో కొండా సురేఖ, సంజీవరావు కాంగ్రెస్‌లో చేరారు. బాబుమోహన్, శోభ బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీకి దిగారు. మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్‌గౌడ్, ఎన్.బాలునాయక్, రమేశ్‌రాథోడ్, కేఎస్ రత్నం సైతం టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. యాదవరెడ్డిపై వేటు.. ఎమ్మెల్సీ యాదవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీఆర్ఎస్ అధిష్టానం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
‘టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుపై వ్యక్తిగత ఆరోపణలు, దూషణలకు పాల్పడిన టీడీపీ నేతలు వంటేరు ప్రతాప్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్ కుమార్‌కు గురువారం టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉండటంతో సీఈఓకు ఫిర్యాదుచేశామని టీఆర్ఎస్ నేతలు గట్టు రాంచంద్రారావు, ఉపేందర్ ఈ సందర్భంగా తెలిపారు. ఒక వేళ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడితే హరీశ్ సీఎం అవుతారని రేవూరి ప్రకాశ్‌రెడ్డి, తాగుబోతు ముఖ్యమంత్రి నుంచి విముక్తి కల్పించాలని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. కేసీఆర్‌ను ఓడించాలని హరీశ్‌రావు తనకు ఫోన్ చేసినట్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి నిరాధారంగా ఆరోపణలు చేశారని తప్పుబట్టారు. నర్సాపూర్ ప్రచారంలో రేవంత్ రెడ్డి సీఎం పదవిని గౌరవించకుండా మీడియాలో ప్రచురించలేని బూతులు మాట్లాడారని ఆరోపించారు. -
టీజేఎస్ కార్యాలయంపై టీఆర్ఎస్ నాయకుల దాడి..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ రగడ మొదలైంది. ఎన్నికల ప్రచారంతో పాటు ప్రత్యర్థి పార్టీకి చెందిన కార్యాలయాలపై కూడా దాడులు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ కార్యాలయంపై టీఆర్ఎస్కు చెందిన వ్యక్తులు బుధవారం రాత్రి దాడి చేశారని తెలంగాణ జనసమితి పార్టీ ఆరోపించింది. మిర్జాల్‌గూడలోని తెలంగాణ జనసమితి ఆఫీసుపై దుండగులు దాడి చేసి బ్యానర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారని మల్కాజిగిరి టీజేఎస్ అభ్యర్థి కపిలవాయి దిలీప్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యాలయంలో సమీపంలో గల సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందనీ, భద్రత కల్పించాలని మల్కాజిగిరి డీసీపీకి విన్నవించారు. టీజేఎస్ అధికార ప్రతినిధి యోగేశ్వర్ రెడ్డి వెదిరె ఈ దాడిని ఖండించారు. -
గులాబీల గుండెల్లో గుబులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: రెండు నెలల క్రితం ముందస్తు ఎన్నికలకు సమర శంఖం పూరించినప్పుడే ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన వెలువడింది. టికెట్టు దక్కిన ఆనందంతోపాటే అసమ్మతి పోటు కూడా ఆ రోజు నుంచే మొదలైంది. రోజులు గడిచే కొద్దీ అదే సద్దుమణుగుతుందని భావించిన అభ్యర్థులకు సీన్ రివర్స్ అయింది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు తిరుగుబావుటాలు ఎగురవేశారు. పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డ రాథోడ్ రమేష్ కాంగ్రెస్ పంచన చేరి టికెట్టు కోసం ప్రయత్నిస్తుండగా, సిర్పూరులో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. చెన్నూరులో సీటు కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కోసం ఏకంగా ఆత్మాహుతే జరిగింది. ఓదెలు తరువాత కేసీఆర్ హామీతో చల్లబడ్డా, ఇక్కడ మరో మాజీ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరేందుకు విఫలయత్నం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తరువాతే ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇదే నియోజకవర్గానికి చెందిన జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు సమాయత్తం అవుతున్నారు. మిగతా నియోజకవర్గాలలో పార్టీలు మారకపోయినా... సొంతింట్లోనే కుంపటి పెడుతున్నారు. మునిసిపాలిటీ పాలకవర్గాల షాక్ నిర్మల్ మునిసిపాలిటీ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి కౌన్సిలర్లతో కలిసి మూకుమ్మడిగా కాంగ్రెస్‌లో చేరడంతో మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి తేరుకోలేని పరిస్థితి. నిర్మల్ నియోజకవర్గంలో మునిసిపాలిటీ ఓట్లే కీలకం కాగా, కౌన్సిలర్ల తోపాటు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడం మింగుడుపడని అంశం. దీన్ని సరిచేసేందుకు మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులను టీఆర్ఎస్లో చేర్పించే పనిలో ఆ పార్టీ నాయకులు పడ్డారు. బెల్లంపల్లి మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌తోపాటు సుమారు 20 మందికి పైగా కౌన్సిలర్లది అదే తీరు. వీరెవరూ పార్టీ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు ఏ మాత్రం సహకరించడం లేదు. వేమనపల్లి జెడ్పీటీసీతోపాటు పలువురు ఎంపీటీసీలు, నాయకులు టీఆర్ఎస్కు దూరంగానే ఉంటున్నారు. ఇక్కడ పార్టీ టికెట్టు ఆశించి భంగపడ్డ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్‌కుమార్ చెన్నూరు అభ్యర్థి బాల్క సుమన్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన మద్దతుదారులు కూడా దూరంగానే ఉంటున్నారు. మంచిర్యాల మునిసిపాలిటీ పాలక వర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్.దివాకర్‌రావుకు ఎలాంటి సహకారం లభించడం లేదు. ఇటీవల పాత మంచిర్యాలలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశానికి మాజీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. మునిసిపల్ చైర్పర్సన్ వసుంధరతోపాటు పలువురు కౌన్సిలర్లు కూడా దూరదూరంగానే ఉంటున్నారు. మంచిర్యాల ఎంపీపీ బేర సత్యనారాయణ ఏకంగా బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాగజ్‌నగర్ మునిసిపాలిటీలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. చెన్నూరులో దూరదూరంగా నాయకులు పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు శాసనసభ అభ్యర్థి బాల్క సుమన్ గ్రామ గ్రామాన ప్రచారం సాగిస్తున్నప్పటికీ, పార్టీ నాయకుల నుంచి ఆశించిన సహకారం లభించడం లేదు. కోటపల్లి, చెన్నూరు మండలాలల్లో ప్రభావం చూపగల జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, ఆయన మద్దతుదారులు టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. వీరంతా దీపావళి తరువాత కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఇక్కడ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ను నమ్ముకున్నా, పాత తరం నాయకులు స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మందమర్రిలో తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఎఫెక్ట్ కనిపిస్తోంది. మండలాల్లో బూత్‌ల వారీగా పార్టీ నాయకులకు బాధ్యతలను అప్పగించడం లేదని చాలా మంది దూరంగా ఉంటున్నారు. కేవలం యూత్‌ను నమ్ముకొనే రాజకీయం చేస్తామంటే చెన్నూరులో సాధ్యం కాదని ఆయన వెంట ఉండే నాయకులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. బోథ్‌లో బాపూరావుకు నగేష్ తలనొప్పి బోథ్ సీటు ఆశించి భంగపడ్డ ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇక్కడ అభ్యర్థి బాపూరావుకు ఏమాత్రం సహకరించడం లేదు. బాపూరావుతోపాటు ఇప్పటి వరకు ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. ఇటీవల ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్న వెంట పర్యటించిన నగేష్ సొంత నియోజకవర్గం బోథ్‌లో దూరంగా ఉంటున్నారు. ఆయనతోపాటు మద్దతుదారులెవరూ బాపూరావు వెంట నడవడం లేదు. ముథోల్‌లో కూడా మాజీ ఎమ్మెల్యే సముద్రాల వేణుగోపాలాచారి మద్దతుదారులు విఠల్‌రెడ్డికి సహకారం అందించడం లేదు. ఆసిఫాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కోవలక్ష్మికి కూడా అసమ్మతి వెంటాడుతోంది. ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు టీఆర్ఎస్ను వీడుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అ«భ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏకపక్షంగా ఉంటుందని భావించిన ఎన్నికలు హోరాహోరీగా మారిపోతున్న తరుణంలో సొంతపార్టీలోని కుంపట్లు పుట్టిముంచుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారైతే అసంతృప్తి వాదులను పార్టీలోకి లాక్కోవాలనే ఆలోచనతో కొందరు నాయకులున్నారు. -
నీటి ఎద్దడికి పొన్నాలే కారణం
వరంగల్ / నర్మెట: ‘తెలంగాణలో నీటి ఎద్దడికి పొన్నాలే కారణం.. ఆనాడు భారీ నీటి పారుదల శాఖామంత్రిగా ఉండి ఆంధ్రా నాయకులతో కుమ్మక్కై తెలంగాణ రైతులకు తీరని ద్రోహం చేశాడు’ అని తాజా మాజీ ఎమ్మల్యే, టీఆర్ఎస్ జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి «అన్నారు. మండలంలోని అమ్మాపూర్‌లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం సాగించిన పొన్నాల దేవాదుల నిర్మాణంలో తక్కువ వ్యాసం కలిగిన పైపులైన్ల వినియోగంతో తెలంగాణకు తీరని అన్యాయం చేశాడని దీంతో నీటిపంపింగ్ సామర్థ్యం తగ్గడంతో చెరువులు, కుంటలు నింపడం ఆలస్యమవుతోందన్నారు. వెచ్చించిన వేలకోట్ల ప్రజాధనం వృథాచేసి కరువుకు కారణమైన లక్ష్మయ్యను గ్రామాల్లోకి రాకుం డా అడ్డుకుని ఓటు ఆయుధంతో గుణపాఠం చెప్పాలన్నారు. సాగు,తాగునీటికి అలమటిస్తున్న తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వనన్న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డికి ప్రజల ఉసురు తాకి పత్తాలేకుండా పోయాడని, పొన్నాల ఓటమి పాలయ్యాడన్నారు. మహిళలు బోనాలు, బతుకమ్మలతో ముత్తిరెడ్డికి స్వాగతం పలకగా ఆయన వారితో కలిసి బతుకమ్మ ఆడారు. గుండెపోటుతో ఇటీవల మృతిచెందిన పార్టీ నాయకుడు పెద్ద చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని ఓదార్చారు. అనంతరం టీడీపీకి చెందిన వంద మంది నాయకులు, కార్యకర్తలు పిట్టల రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరగా వారికి ముత్తిరెడ్డి కండువా కప్పి స్వాగతించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది రాజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఎండీ గౌస్, టీఆర్ఎస్వీ జిల్లా కన్వీనర్ వంగ ప్రణీత్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు దేవరాయ కనకయ్య, కుంటి లక్ష్మయ్య, మాజీ ఎంపిటీసి చెక్కిల్ల నర్సమ్మ, చెక్కిల్ల రవీందర్ దంపతులు, బండి నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, ఇర్రి గాల్‌రెడ్డి, బుచ్చాల గాలయ్య, మండల యూత్ నాయకులు పార్నంది సతీష్ శర్మ, శశిరథ్, రవి పాల్గొన్నారు. -
కారు..జోరు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముందస్తు ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ జోరు కొనసాగుతోంది. అసెంబ్లీ రద్దు అనంతరం ఒకేసారి బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించడం... వారంతా ప్రచారంలో నిమగ్నం కావడం అంతా చకచకా జరిగిన విషయం విదితమే. తాజాగా ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు ముఖ్యనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవలే మంత్రి హరీశ్‌రావు పర్యటన నాగర్‌కర్నూల్‌లో, తాజాగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. అలాగే సోమవారం మంత్రి కేటీఆర్ ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. మక్తల్, అచ్చంపేటల్లో జరిగే బహిరంగసభల్లో కేటీఆర్ పాల్గొంటారు. ఇక ఈనెల 31న నారాయణపేటలో జరిగే మైనారిటీల సమావేశానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హాజరుకానున్నారు. అదే వి«ధంగా నవంబర్ మొదటి వారంలో స్వయంగా సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాకు మరోసారి రానున్నారు. ఈసారి మంత్రి లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్చర్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారిని టీఆర్ఎస్ అభ్యర్థులు స్వయంగా కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇలా మొత్తం మీద టీఆర్ఎస్ తన ప్రచారంలో జోరు పెంచుతోంది. ఆశలన్నీ లబ్ధిదారులపైనే... సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 6న అభ్యర్థులను ప్రకటించిన వెంటనే వారు రంగంలోకి దిగారు. దాదాపు 50రోజులుగా నిత్యం ప్రజల్లో మమేకమవుతూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారిని ఖచ్చితంగా కలవాలని సీఎం కేసీఆర్ స్వయంగా అభ్యర్థులకు హితబోధ చేసిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ప్రతీ నియోజకవర్గంలో ఎవరెవరు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారనే విషయాలతో కూడిన జాబితాను అందజేశారు. ఈ మేరకు అభ్యర్థులు సీఎం రిలీఫ్ ఫండ్‌తో పాటు కేసీఆర్ కిట్, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిని నేరుగా కలుస్తున్నారు. మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే చేయబోయే పనులను, చేకూరనున్న లబ్ధిని ఈ సందర్భంగా వివరిస్తున్నారు. అంతేకాదు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై పుస్తకాలు, కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తుండడమే కాకుండా ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వీడియో తెరల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి విషయంలో రూపొందించిన వీడియో ప్రసారాల కోసం ప్రత్యేక వాహనాలను సైతం సమకూర్చుకున్నారు. ఇలా మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థులందరూ ప్రభుత్వ లబ్ధిదారుల మీదే గంపెడాశలు పెట్టుకున్నారు. రంగంలోకి ముఖ్యనేతలు ప్రచార పర్వాన్ని మరింత ఉధృతం చేసేందుకు టీఆర్ఎస్ ముఖ్యనేతలు రంగం ప్రవేశం చేస్తున్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి సీఎం కేసీఆర్ 40 మందికి బాధ్యతలు అప్పగించిన విష యం తెలిసిందే. ఆయా నేతలందరూ నిత్యం ప్రతీ జిల్లాలో ఏదో ఒక కార్యక్రమం రూపొందించుకుని ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యనేతలందరూ కూడా ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా నాగర్‌కర్నూల్‌లో మంత్రి హరీశ్‌రావు రెండు రోజు ల క్రితం పర్యటించగా.. తాజాగా శనివారం కల్వకుర్తి నియోజకవర్గంలో హోంమంత్రి నాయిని న ర్సింహారెడ్డి పర్యటించి, అభ్యర్థుల తరఫున ప్రచా రం చేశారు. ఈ నెల 29న(సోమవారం) మంత్రి కేటీఆర్ ఉమ్మడి జిల్లాలోని మక్తల్, అచ్చంపేటల్లో జరగనున్న బహిరంగసభల్లో పాల్గొననున్నారు. అలాగే నవంబర్ మొదటి వారంలోని 3 లేదా 4 తేదీల్లో సీఎం కేసీఆర్ సభను జడ్చర్లలో నిర్వహించేందుకు టీఆర్ఎస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. అసమ్మతిపై వేటు ఖాయం టీఆర్ఎస్ అభ్యర్థులు ఓ పక్క ప్రచారంలో దూసుకువెళ్తుండగా.. అక్కడక్కడా అసమ్మతి గళాలు గొంతెత్తుతున్నాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో అసమ్మతి రాగం వినిపిస్తున్న కల్వకుర్తి, మక్తల్ నియోజకవర్గాల్లోని నేతలపై వేటు వేయడం ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసమ్మతి నేతల కారణంగా పార్టీ అభ్యర్థులకు కొత్త చిక్కులు వస్తున్నాయనేది టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కోసం స్వయంగా మంత్రి కేటీఆర్ బహిరంగసభను రద్దు చేసుకున్నారు. అయితే అసమ్మతి నేతలకు ఎంతగా సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా వారు దారికి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో బహిరంగ సభల నిర్వహణకు దూరంగా ఉంటే వేటు వేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. తాజాగా మక్తల్ బహిరంగ సభ నేపథ్యంలో అక్కడి నేతల అభిప్రాయాలను ఆరా తీస్తున్నారు. కానీ మక్తల్‌లోని అసమ్మతి నేతలు మాత్రం మెట్టుదిగడం లేదు. ఈ నేపథ్యంలో వారిపై వేటు వేయాలని పార్టీ కూడా నిర్ణయించింది. అలాగే కల్వకుర్తి విషయంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కోసం టీఆర్ఎస్ దూతలు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ససేమిరా అంటున్నట్లు తెలిసింది. దీంతో సాధ్యమైనంత త్వరలో ఎమ్మెల్సీ కసిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. -
టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు..!
గులాబీ కండువాను తీసివేసి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు జిల్లా నాయకులు కొందరు ముహూర్తాలు పెట్టుకుం టున్నారు. టికెట్ దక్కక కొందరు, పాత గూటికి చేరాలని మరికొందరు, అసంతృప్తులు ఇంకొందరు టీఆర్ఎస్ పార్టీకి టాటా చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్ కాంగ్రెస్‌లో చేరగా, తాజాగా టీఆర్ఎస్ మిర్యాలగూడ టికెట్ దక్కకపోవడంతో అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి బుధవారం కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. నల్లగొండ పట్టణంలో ఇప్పటికే కొందరు హస్తం బాట పట్టగా... మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, తన సహచరులు కొందరితో కలిసి టీఆర్ఎస్ను వీడడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆ యా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడిన నేతలు నెల రోజులుగా తర్జన భర్జన పడి.. చివరకు కారు ది గాలనే నిర్ణయించుకుంటున్నారు. మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి ఈ ఎన్నికల్లోనూ టికెట్ ఆశించారు. కానీ, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన ఎన్.భాస్కర్‌రావుకు సిట్టింగుగా భావించి టికెట్ ప్రకటించారు. దీంతో అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి ప్రత్యామ్నాయం చూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. నెల రోజులకు పైగా తన అనుచరులతో, దగ్గరి నాయకులతో మంతనాలు జరిపిన ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారని సమాచారం. బుధవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ఆయన ముహూర్తం కూడా పెట్టుకున్నారని తెలిసింది. ప్రస్తుతం మిర్యాలగూడలో కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే, ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇవ్వమన్న నిబంధన అమలయితే.. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు జనరల్ అభ్యర్థుల కొరత ఉందని అంటున్నారు. ఈ తరుణంలో అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి ఎలాంటి హామీ తీసుకోకుండానే బేషరతుగా కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారని ఆయన అనుచరవర్గం చెబుతోంది. టికెట్లు ఆశించి భగంగపడిన నాయకులు సొంత దారులు వెదుక్కుంటున్నారని దానిలో భాగంగానే అలుగుబెల్లి ఈనిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇప్పటికే జెడ్పీ చైర్మన్ బాలునాయక్ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఆయన కాంగ్రెస్ నుంచే టీఆర్ఎస్లోకి వచ్చారు. దేవరకొండ టికెట్ హామీపైనే నాడు టీఆర్ఎస్లో చేరారని, కానీ, ఆయనకు టికెట్ దక్కలేదు. గత ఎన్నికల్లో సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రకుమార్ ఆతర్వాత పరిణామాల్లో టీఆర్ఎస్లో చేరారు. తమ సిట్టింగుగానే భావించిన టీఆర్ఎస్ నాయకత్వం టికెట్ ఆయనకే ఖరారు చేసింది. దీంతో బాలునాయక్‌కు అవకాశం దక్కకుండా పోయింది. గతంలో ఆయన దేవరకొండ నుం చి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించా రు. 2009 ఎన్నికల్లో గెలిచిన బాలునాయక్ 2014 ఎన్నిక ల నాటికి జెడ్పీ చైర్మన్‌గా అవకాశం దక్కించుకున్నారు. దీంతో పొత్తుల్లో భాగంగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. అదే దారిలో మరికొందరు నేతలు టీఆర్ఎస్లో టికెట్ దక్కక కాంగ్రెస్‌లోకి వెళుతున్న వారే కాకుండా, ఆయా స్థానాల్లో అభ్యర్థుల పట్ల అసంతృప్తిగా ఉన్న వారు, అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి టీ ఆర్ఎస్లో చేరిన వారు తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ప్రధానంగా నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పటికే కొందరు ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. పట్టణ కౌన్సిలర్లు కొందరు కాంగ్రెస్ బాట పట్టగా... మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, తన సహచరులు కొందరితో కలిసి టీఆర్ఎస్ను వీడడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా టీఆర్ఎస్ నాయకత్వ నిర్ణయాలపై అసంతృప్తితో కొందరు, అవకాశాలు రాక మరికొందరు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయాలు తీసుకుంటున్నారని విధితమవుతోంది. -
పెద్ద తలకాయల వేటలో ఇద్దరు ‘హస్తం’ సీనియర్లు
సాక్షి, హైదరాబాద్: టికెట్లు ఆశించి భంగపడ్డ టీఆర్ఎస్ అసంతృప్తవాదులకు కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోంది. ఇందులో భాగంగానే.. సొంత పార్టీలోని ప్రత్యర్థులను మట్టికరిపించాలని భావిస్తున్న ఇద్దరు టీఆర్ఎస్ మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఓ ఎమ్మెల్సీ.. కాంగ్రెస్ జాబితాలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నెల 20న రాహుల్ గాంధీ పర్యటన తర్వాత వీరంతా పార్టీలో చేరే అవకాశం పుష్కలంగా ఉందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డే ‘సాక్షి’ ప్రతినిధితో వెల్లడించారు. ప్రస్తుతం చర్చలు తుది దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. నిజామాబాద్ మాజీ ఎంపీ, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి కలిసి.. టీఆర్ఎస్ అసంతృప్తులతో చర్చలు జరుపుతున్నారని విశ్వసనీయ సమాచారం. టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ చాలా మంది కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ.. పెద్ద తలకాయలను చేర్చుకునేందుకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీపీసీసీ వర్గాలు చెప్పాయి. అయితే, ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న మైండ్‌గేమని టీఆర్ఎస్ ముఖ్య నాయకుడొకరు తేలిగ్గా తీసిపారేశారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసే.. కాంగ్రెస్ ఇలాంటి నక్కజిత్తులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. కేసీఆర్ వద్దనుకున్నందుకే.. ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఓ మంత్రి ఈసారి శాసనసభకు పోటీ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే, కేసీఆర్ ఒకేసారి ప్రకటించిన 105 నియోజకవర్గాల అభ్యర్థుల్లో.. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి తాజా మాజీ ఎమ్మెల్యే పేరు ప్రకటించడంతో ఆయనతోపాటు ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోటీ చేయకపోతే.. ఆ నియోజకవర్గంపై పట్టు కోల్పోతానన్న భావనలో సదరు మంత్రి ఉన్నారు. దీనిని అదనుగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ మంత్రితో రాయబారం నెరిపింది. తాను కోరుకున్న నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నామన్న సందేశం పంపింది. అయితే తనతో పాటు తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి మరో చోట నుంచి టిక్కెట్ ఇవ్వాలని ఆయన షరతు పెట్టినట్లు తెలిసింది. బుధవారం ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కొత్తగా పార్టీలో చేరేవారి వివరాలు, వారు పెడుతున్న డిమాండ్లను పార్టీ పెద్దల దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన మరో మంత్రి తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి టీఆర్ఎస్ టిక్కెట్ కావాలని గట్టిగా అడుగుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. అయితే సదరు మంత్రికి, ఆయన కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో.. టీఆర్ఎస్ టిక్కెట్ రాకపోతే ఆలోచిస్తానని ఆయన చెప్పినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. మంత్రిని ఓడించాలన్న కసితో ఎంపీ దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన లోక్‌సభ సభ్యుడొకరు ప్రస్తుత మంత్రి ఒకరిని ఓడించాలన్న కసితో ఉన్నారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేసి అయినా అనుకున్నది సాధించాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితులతో చెప్పారని తెలుసుకున్న కాంగ్రెస్ ఆయనకు పార్టీ టిక్కెట్ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై ఆ ఎంపీ తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన మరో ఎంపీ కూడా శాసనసభకు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయనకు కూడా కాంగ్రెస్ టికెట్ ఇస్తామని భరోసా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజవకర్గం నుంచి పోటీ చేయాలన్న భావనలో ఉన్న అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ ఎమ్మెల్సీకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అయితే.. ఈ విషయాన్ని సదరు ఎమ్మెల్సీ కొట్టిపారేయగా, ఆయన సీటు కోసం తమతో సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్ అంటోంది. -
సర్దు‘బాట’లో..
తెలంగాణ రాష్ట్ర సమితిలో టికెట్ల కేటాయింపు జరిగి నెల రోజులు కావస్తున్నా పార్టీలో అంతర్గతంగా తలెత్తిన అసమ్మతి కొలిక్కి రావడం లేదు. ఇతర పార్టీల నుంచి రాజకీయ వలసలు కూడా ఆశించిన రీతిలో జరగడం లేదు. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు, క్రియాశీల నాయకులు పార్టీని వీడుతున్నారు. సొంత గూటిలో అసమ్మతిని సర్దుబాటు చేసే బాధ్యతను పార్టీ అభ్యర్థులకు అప్పగించినా ఫలితం కనిపించడం లేదు. దీంతో అప్రమత్తమైన పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో అసమ్మతి సెగను ఆర్పే బాధ్యతను ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో టీఆర్ఎస్లో అంతర్గత అసమ్మతితో పాటు రాజకీయ వలసలు ఆందోళన కలిగిస్తున్నాయి. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్య నేతలు నలుగురు ఒకే రోజు కాంగ్రెస్ గూటికి చేరడం చర్చనీయాంశమైంది. అందోలులో టికెట్ దక్కని తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ బీజేపీలో చేరారు. సంగారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎంపీపీ రాజేశ్వర్ రావు దేశ్‌పాండే బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో గ్రామస్థాయి నాయకులు కాంగ్రెస్‌లో చేరినా, మరుసటి రోజే టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. నర్సాపూర్, సంగారెడ్డి, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు పార్టీ అభ్యర్థుల వెంట ప్రచార పర్వంలో కనిపించడం లేదు. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఖరారు కాకపోవడంతో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం పట్టాలెక్కలేదు. మరోవైపు గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాణిక్‌రావుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ అవకాశం ఇవ్వకూడదంటూ కొందరు నేతలు తెగేసి చెబుతున్నారు. అసెంబ్లీ రద్దు ప్రకటన రోజే పార్టీ అభ్యర్థులను ప్రకటించినా, నెల రోజులుగా పార్టీలో నెలకొన్న అసమ్మతి సర్దుబాటు కావడం లేదు. అసమ్మతి నేతలతో మంతనాలు జరిపి సర్దుబాటు చేసుకోవాల్సిందిగా పార్టీ అభ్యర్థులకు సూచించింది. అభ్యర్థులతో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ పలు దఫాలుగా భేటీ జరిపి సూచనలు చేసినా క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితం కనిపించడం లేదు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా అసమ్మతి సర్దుబాటు కాకపోవడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. రంగంలోకి మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని ప్రత్యేక బృందాలు, సర్వే టీంలతో పార్టీ ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. ప్రత్యేక బృందాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా అసమ్మతిని సర్దుబాటు చేసే బాద్యతను మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. నర్సాపూర్‌లో జెడ్పీ చైర్మన్ రాజమణి మురళీయాదవ్, జెడ్పీటీసీ సభ్యులు కమలాబాయి, జయశ్రీ, ఇతర అసంతృప్త నేతలతో మంత్రి మాట్లాడారు. పార్టీ అభ్యర్థి మదన్ రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొనేలా సయోధ్య కుదిర్చారు. సంగారెడ్డి నియోజకవర్గంలో జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్‌తోనూ మంతనాలు జరిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రచారానికి దూరంగా ఉంటున్న నేతలతో మరోమారు సమావేశం కావాలని మంత్రి నిర్ణయించారు. సిద్దిపేట, గజ్వేల్, మెదక్, దుబ్బాక నియోజకవర్గాల్లో పెద్దగా అసమ్మతి బెడద లేకున్నా, స్థానికంగా సమన్వయం ఉండేలా చూసుకోవాలని మంత్రి హరీశ్‌రావు పార్టీ నేతలకు జాగ్రత్తలు చెబుతున్నారు. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఖరారు కాకపోవడంతో అసమ్మతి గళం వినిపించడం లేదు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాణిక్‌రావుకు మరోమారు అవకాశం ఇవ్వొద్దంటూ స్థానిక నేతలు హరీశ్ వద్దకు బారులు తీరుతున్నారు. దీంతో మాణిక్‌రావు, నరోత్తమ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. చేరికలపై ప్రత్యేక వ్యూహం ఓ వైపు పార్టీలో నెలకొన్న అసమ్మతిని సర్దుబాటు చేస్తూనే, ఎదుటి పార్టీల నుంచి ముఖ్య నేతలను టీఆర్ఎస్ గూటికి చేర్చేందుకు హరీశ్ వ్యూహ రచన చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకునే దిశగా చర్చలు సాగుతున్నాయి. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ముఖ్యులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్‌లోనూ ఇద్దరు ముఖ్య నేతలతో చర్చలు సఫలం అయితే, ఓ ప్రధాన సామాజిక వర్గం ఓటర్లు పార్టీ వైపు మొగ్గు చూపుతారనే అంచనాతో హరీశ్ ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు తర్వాత తలెత్తే పరిణామాలను విశ్లేషించుకుంటూ, చేరికల వ్యూహాన్ని అమలు చేయాలనే ఆలోచనలో మంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. ‘మన ప్రచారాన్ని చురుగ్గా సాగిస్తూనే, ఎదుటి పార్టీ కదలికలపైనా కన్నేయాలని’ పార్టీ అభ్యర్థులకు హరీశ్‌రావు సూచనలు చేస్తున్నట్లు సమాచారం. -
ఇబ్రహీంపట్నం: టీఆర్ఎస్లో బయటపడ్డ వర్గ విభేదాలు
-
పారని ‘తారక’ మంత్రాంగం
సాక్షి ప్రతినిధి, వరంగల్: అసమ్మతి నేతలు అదే పట్టు మీదున్నారు. బరిలో నిలబడి తీరుతాం అని తెగేసి చెప్పారు. ‘నిండా ముంచినాక ఇంకా అధిష్టానం ఏమిటి? మా కార్యకర్తల మాటే శిరోధార్యం’ అని కరాఖండీగా చెబుతున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, యువరాజు కేటీఆర్ మంగళవారం మరికొంత మంది వరంగల్ అసమ్మతి నేతలను ప్రగతి భవన్‌కు పిలిచి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ.. స్టేషన్ ఘన్పూర్ తరహాలోనే సీన్ రిపీట్ అయ్యింది. కేటీఆర్ చేసిన సంప్రదింపులు అర్ధంతరంగానే ముగిసినట్లు తెలిసింది. భవిష్యత్‌లో సముచిత స్థానం ఇస్తామని, ఎన్నికల్లో కలిసి పనిచేద్దామన్న కేటీఆర్ విజ్ఞప్తిని అసమ్మతి నేతలు తోసిపుచ్చినట్లు సమాచారం. దీంతో మరోమారు కేసీఆర్‌తో కలిసి మాట్లాడుకుందామని కేటీఆర్ కోరినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అసమ్మతిని సర్దుబాటు చేసేందుకు కేటీఆర్ రెండు రోజులుగా ఉమ్మడి వరంగల్ అసమ్మతి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మంగళవారం టీఆర్ఎస్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు తకెళ్లిపల్లి రవీందర్రావు, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితను చర్చలకు ఆహ్వానించి.. వారితో వేర్వేరుగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంటే ఉన్న తక్కెళ్లపల్లి రవీందర్రావు పాలకుర్తి నియోజకర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్ఎస్లోకి రావడంతో ఈసారి టికెట్ ఆయనకు కేటాయించారు. కేసీఆర్ నిర్ణయంతో తక్కెళ్లపల్లి విభేదించారు. పార్టీ అభ్యర్థిపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఇండిపెండెంటుగా బరిలోకి దిగడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆయనను రాజీకి పిలిచారు. దాదాపు 40 నిమిషాలపాటు కేటీఆర్‌తో మాట్లాడిన తక్కెళ్లపల్లి తన గోడు మొత్తం వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ తనకు అన్యాయం చేసిందనిచెప్పినట్లు సమాచారం. ఆయన చెప్పింది అంతా విన్నా కేటీఆర్ భవిష్యత్‌లో సముచిత స్థానం ఇస్తామని, ఎన్నికల్లో కలిసి పనిచేయాలని కోరినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు సమ్మతించని రవీందర్రావు ఇండిపెండెంటుగానైనా పోటీచేయాలని కార్యకర్తలు తనపై ఒత్తిడి తెస్తున్నారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ల మాట కాదనలేనని చెప్పినట్లు తెలిసింది. దీంతో కేటీఆర్ కల్పించుకుని మీరు చెప్పిన అంశాలను నాన్నగారికి (కేసీఆర్) దృష్టికి తీసుకెళ్తాను, మరో రెండు రోజుల్లో మళ్లీ పిలుస్తామని చెప్పి పంపినట్లు తెలిసింది. డోర్నకల్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ఆమెను చర్చలకు ఆహ్వానించారు. ప్రగతి భవన్లో దాదాపు గంట పాటు ఆమెతో చర్చించారు. టీడీపీని, పదవులను, ఆస్తులను త్యాగం చేసిన తనను పక్కన పెట్టి మధ్యలో వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని ఆమె గట్టిగానే అడిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాకపోతే మాకు ఇంకెప్పుడు న్యాయం చేస్తారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నేను ఇంతకాలం మౌనంగా ఉన్నాను, కానీ నా అనుచరులు, కార్యకర్తలు ఆగటం లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ అధిష్టానం కంటే నా కార్యకర్తల మాటే నాకు శిరోధార్యం అని కరాఖండీగా చెప్పినట్లు తెలుస్తోంది. సత్యవతిని కూడా రెండు రోజుల్లో కేసీఆర్‌తో కలిపిస్తామని చెప్పి పంపినట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ టికెట్‌ను ఆశించిన మాలోతు కవితతో మాత్రం చర్చలు కొంతమేరకు సఫలమైనట్లు తెలుస్తోంది. పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని కేటీఆర్ ఇచ్చిన హామీ పట్ల ఆమె కొంత సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండు రోజుల తర్వాత తన తండి రెడ్యా నాయక్‌తో కలిపి మరోమారు చర్చలకు కూర్చోవాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
ఆ ముగ్గురు అభ్యర్థులు వద్దే వద్దు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: గులాబీ దండులో అసంతృప్తి జ్వాల చల్లారడం లేదు. వేములవాడ, రామగుండంలలో అభ్యర్థుల మార్పు.. చొప్పదండిలో కొత్త వారికి టికెట్ కోసం లొల్లి సద్దుమణగడం లేదు. జగిత్యాలలో డాక్టర్ సంజయ్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని సైతం పలువురు వ్యతిరేకిస్తుండగా, పెద్దపల్లిలో చాపకింది నీరులా అసంతృప్తి రగులుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్ సెంటిమెంట్ జిల్లా.. ఉమ్మడి కరీంనగర్లో అసమ్మతి రోజురోజుకూ రాజుకుంటోంది. నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రచారాస్త్రంగా మలుచుకొని అధికారం చేపట్టాలని తహతహలాడుతున్న టీఆర్ఎస్లో పలుచోట్ల అంటుకున్న అంతర్గత పోరు చల్లారడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ఎంపీ స్థానాలతోపాటు 13 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2014 ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ స్థానం మినహా రెండు పార్లమెంట్, 12 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేశారు. ఈసారి జరిగే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ట్రెండ్ కొనసాగించాలనుకుంటోంది. అందుకే చొప్పదండి మినహా 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించగా.. పలుచోట్ల అసంతృప్తులు అధిష్టానం అంచనాలకు గండి కొడుతున్నారు. ఆ ముగ్గురు వద్దే వద్దు.. టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన వెలువడి 25 రోజులు కావస్తున్నా.. అధికార టీఆర్ఎస్ పార్టీలో కొందరు అభ్యర్థులను మార్చాలంటూ ఇంకా పట్టుపడుతూనే ఉన్నారు. వేములవాడ, రామగుండంలలో చెన్నమనేని రమేష్‌బాబు, సోమారపు సత్యనారాయణను మార్చాలంటున్నారు. చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు టికెట్ నిలిపి వేయగా, ఆ స్థానాలలో వేరొకరికి అవకాశం కల్పించాలంటున్నారు. వేములవాడ నియోజకవర్గంలో అయితే ‘జర్మనీ బాబు’ను మార్చాలంటూ బహిరంగంగానే ఆయన వ్యతిరేకులు సభలు పెట్టి సవాల్ చేస్తున్నారు. పాదయాత్రలు, «ర్యాలీలు, నిరసన ప్రదర్శనలతో రోజూ వేములవాడ అట్టుడుకుతోంది. వేములవాడ అభ్యర్థిపై అసమ్మతి సెగ పతాక స్థాయికి చేరుకుంది. అభ్యర్థిత్వం ఖరారైన రోజే రమేష్ బాబు వ్యతిరేక వర్గం వెయ్యి మంది కార్యకర్తలతో సమావేశమైంది. రమేశ్‌బాబును తప్పించడమే లక్ష్యంగా ఆ పార్టీకి చెందిన వారంతా అదే వేదిక నుంచి బాహాటంగా ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని, జెండాలు మోసి, పార్టీ కోసమే పనిచేస్తున్న తమపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సోమారపు సత్యనారాయణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదని, ఉద్యమ సమయంలో పార్టీలో పని చేసిన నాయకులను, కార్యకర్తలను పూర్తిగా విస్మరించి తన చెప్పుచేతల్లో ఉన్న కొంతమందితోనే రాజకీయం చేస్తున్నారని ఆయన వ్యతిరేకవర్గం బయటకు వచ్చి బాహాటంగానే ఆరోపణలు చేస్తోంది. కోరుకంటి చందర్, కొంకటి లక్ష్మీనారాయణ తదితరులు ఓ గ్రూపుగా ఏర్పడి సత్యనారాయణ టికెట్ రద్దు చేయాలని, లేదంటే రెబల్‌గా పోటీ చేస్తామంటున్నారు. చొప్పదండి విషయానికి వస్తే బొడిగె శోభ స్థానంలో సుంకె రవిశంకర్‌కు అవకాశం ఇవ్వాలని ఆ నియోజకవర్గంలోని మెజార్టీ నాయకులు తిరుగుబాటు చేశారు. మంగళవారం కూడా నియోజకవర్గంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే.. శోభ మాత్రం టీఆర్ఎస్ అధిష్టానం తనకే అవకాశం కల్పిస్తుందన్న ధీమాతో ఉన్నారు. జగిత్యాలలోనూ అసమ్మతి సెగలు.. పెద్దపల్లిలో చాపకింద నీరులా.. జగిత్యాల నియోజకవర్గంలో సీనియర్ నాయకు డు డాక్టర్ సంజయ్‌కుమార్‌కు టికెట్ కేటాయించగా, అదే నియోజకవర్గానికి చెందిన ఓరుగంటి రమణారావు సైతం టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. దీంతో రెబల్‌గా పోటీ చేయాలంటూ తన అనుచరులు ఒత్తిడి చేయడంతో పోటీకి సన్నద్ధమయ్యారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత రంగ ప్రవేశం చేసి ఇరువురికి రాజీ కుదర్చడంతో సద్దుమణిగినట్లు కనిపించిన అసమ్మతి మరో రూపంలో బయటపడింది. అభ్యర్థి సంజయ్‌కుమార్ సమీప బంధువు పార్టీ నాయకుడు ఎం.జితేందర్రావుతోపాటు, బండ భాస్కర్‌రెడ్డి, ము స్కు గంగారెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ తాటిపర్తి సరళాదేవి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శంకర్ జగిత్యాల అభ్యర్థిని మార్చాల్సిందేనని అల్టిమేటం జారీ చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో టికెట్లు ఆశించి దక్కని నేతలు కొందరు దాసరి మనోహర్‌రెడ్డిపై అసంతృప్తి చర్యలు సాగిస్తూనే ఉన్నారు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు ‘అసమ్మతి వర్గం’గా జట్లు కడుతున్నారు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా.. బరిలో ఉంటామని తెగేసి చెబుతున్నారు. తమకు ఇదే ఆఖరి మోఖా అని, చావో రేవో తేల్చుకుంటామని కూడా స్పష్టం చేస్తుండటం అక్కడ కూడా సమస్యగా మారింది. ఇదిలా వుండగా 2014 ఎన్నికల సమయంలో కొత్త వాళ్లకు టికెట్లు ఇస్తే ఊరుకునేది లేదని.. సామూహికంగా రాజీనామాలు చేస్తామని మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి హెచ్చరించారు. ఆయనతోపాటు ఆయన తనయుడు చందుపట్ల సునీల్‌రెడ్డి కూడా అప్పుడు పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. తమకే టికెట్ వస్తుందనే నమ్మకంతో వారికి అప్పటికే మాజీ జెడ్పీటీసీగా ఉన్న పుట్ట మధుకు కేటాయించడం ఇబ్బందికరంగా మారింది. ఈసారి కూడా సునీల్‌రెడ్డి టికెట్ ఆశించినప్పటికీ పుట్ట మధుకే కేటా యించడం కొంత అసంతృప్తికి కారణమవుతోంది. మానకొండూరు, కోరుట్లలో కూడా కొంత కిరికిరి జరిగినా.. చివరికి సర్దుకుంది. మిగతా స్థానాల్లో అభ్యర్థుల పరిస్థితి బాగానే ఉంది. ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలన్న ఆందోళనలు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. -
సర్వం.. సర్వేపైనే!
తెలంగాణ రాష్ట్ర సమితిలో జహీరాబాద్ నియోజకవర్గం మినహా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో పోటీ చేసే ఇతర నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చింది. ప్రధాన రాజకీయ పక్షం కాంగ్రెస్‌లో మాత్రం స్పష్టత ఉన్న చోట కూడా అభ్యర్థుల జాబితా ఖరారు కావడం లేదు. మరోవైపు టికెట్ల కోసం బహుముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నేతలు లాబీయింగ్‌లో మునిగి తేలుతున్నారు. కొందరు హైదరాబాద్, మరికొందరు ఢిల్లీ స్థాయిలో తమ పరిచయాలను ఉపయోగించుకుని టికెట్ సాధించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : జహీరాబాద్ మినహా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ ప్రకటించింది. ప్రధాన రాజకీయ పక్షం కాంగ్రెస్‌లో మాత్రం అభ్యర్థులు ఎవరనే అంశంపై స్పష్టత రావడం లేదు. మహాకూటమి పేరిట తెలుగుదేశం, సీపీఐతో ఎన్నికల అవగాహన దాదాపు ఖాయం కావడంతో ఏయే స్థానాలు కూటమిలోని మిత్ర పక్షాలకు కేటాయిస్తుందో పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు. ఏక నాయకత్వం ఉన్న నియోజకవర్గాల్లో తొలి విడతగా రాష్ట్ర స్థాయిలో 40 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను టీపీసీసీ ప్రకటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. తొలి జాబితాలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (అందోలు–ఎస్సీ), మాజీ మంత్రులు గీతారెడ్డి (జహీరాబాద్–ఎస్సీ), జగ్గారెడ్డి (సంగారెడ్డి), ప్రతాప్‌రెడ్డి (గజ్వేల్) పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఇతర నేతలెవరూ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశించకపోవడంతో, జాబితా ప్రకటనలో పెద్దగా సమస్యలు ఉండే అవకాశం కనిపించడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ టికెట్ కోసం బహుముఖ పోటీ నెలకొంది. మహాకూటమిలో భాగస్వాములైన సీపీఐ హుస్నాబాద్, తెలుగుదేశం పార్టీ పటాన్చెరు స్థానాన్ని కోరే సూచనలు కనిపిస్తున్నాయి. గాడ్ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలు ఏఐసీసీ, పీసీసీ స్థాయిలో తమకున్న పరిచయాలతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో డజనుకు పైగా దరఖాస్తులు అందడంతో సర్వే ఆధారంగా జాబితాను కుదిస్తామని ఔత్సాహికులకు టీపీసీసీ నుంచి సమాధానం వస్తోంది. కుదించిన జాబితాలోని వ్యక్తుల పలుకుబడి, ఆర్థిక పరిస్థితి, కుటుంబ నేపథ్యం, జనాదరణ తదితర కోణాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించినట్లు సమాచారం. సర్వే నివేదిక ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ చెబుతున్నట్లు తెలిసింది. ఆశ వీడని నేతలు మాత్రం టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, నాగం జనార్దన్‌రెడ్డి తదితరుల ద్వారా లాబీయింగ్ చేస్తున్నారు. మాజీ ఎంపీ విజయశాంతి కూడా మెదక్ నియోజకవర్గంలో ఓ నాయకుడికి మద్దతు ఇస్తున్నట్లు తెలిసింది. కొందరు నాయకులు గులామ్ నబీ ఆజాద్, ఆర్సీ కుంతియా, ఏఐసీసీ పరిశీలకుడు బోసురాజు తదితరులను కలిసి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతున్నారు. ఆ ఆరు చోట్లా ఆసక్తికరం హుస్నాబాద్ అసెంబ్లీ స్థానాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరుతున్నా, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు. మరో నాయకుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తాడూరు శ్రీనివాస్‌గౌడ్, ప్రభాకర్ వర్మ, గంప మహేందర్‌రావు, పూజల హరికృష్ణ, గూడూరు శ్రీను, గొడుగు రఘు, కలీం తదితరులతో కలిపి మొత్తం 13 మంది కాంగ్రెస్ పార్టీ టికెట్ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దుబ్బాక నుంచి మాజీ మంత్రి ముత్యంరెడ్డి, డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డితో పాటు స్వచ్ఛంద సంస్థ పేరిట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఓ నేత కూడా దరఖాస్తు అందజేసినట్లు సమాచారం. మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోరుతూ 14 మంది నాయకులు టీపీసీసీకి దరఖాస్తులు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, సుప్రభాతరావు, ప్రతాప్‌రెడ్డి, బట్టి జగపతి, అమరసేనారెడ్డి తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాటా శ్రీనివాస్‌గౌడ్, కార్పొరేటర్ శంకర్‌యాదవ్, జెడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్, గోదావరి అంజిరెడ్డి, శశికళ యాదవరెడ్డి తదితరులు దరఖాస్తులు అందజేశారు. నారాయణఖేడ్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎంపీపీ డాక్టర్ సంజీవరెడ్డి టికెట్ల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
‘గడీల పాలనకు చరమగీతం పాడాలి’
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణలో గడీల పాలనకు చరమగీతం పాడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని అమ్మనా బొమ్మనా అంటున్న మూర్ఖుడు కేటీఆర్ అని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి నైతికత లేదని విమర్శించారు. కేంద్ర హోం శాఖ భారత పౌరుడు కాదని చెప్పిన చెన్నమనేని రమేష్‌కు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎలా ఇచ్చిందో చెప్పాలన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేవారు.. ఏంపీ కవిత బతుకమ్మ ఎక్కడ ఆడేవారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఢిల్లీకి వేసినట్టే అంటూ టీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై కూడా పొన్నం స్పందించారు. మరి టీఆర్ఎస్కు ఓటువేస్తే దొరల గడీలకు వేసినట్టు కాదా అని ప్రశ్నించారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. ప్రజల పక్షాన మాట్లాడే వారిపై కేసులు పెడితే భయపడేది లేదని పేర్కొన్నారు. -
ముందస్తు హోరు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముందస్తు ఎన్నికల ప్రచారహోరు జోరందుకుంది. అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్న ప్రచారంతో రాజకీయ పార్టీల ప్రచారపర్వం ఉధృతమవుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు ప్రకటించడం... మరో వైపు కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో స్పష్టత ఉండడం తో రెండు పార్టీల నేతలు ప్రచారం ము మ్మరం చేశారు. ఉమ్మడి జిల్లాలో మంత్రు లు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున ప్రచార కమిటీ కోకన్వీనర్ డీకే.అరుణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, సీనియర్‌నేత చిన్నారెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రచారపర్వంలో భాగంగా రాష్ట్ర స్థాయి ముఖ్యనేతల పర్యటనల జోరు కూడా పెరిగింది. ఇక నుంచి టీఆర్ఎస్కు సంబంధించి ప్రతీ వారం రాష్ట్రస్థాయి నేతల పర్యటనలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే గురువారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొననున్నారు. అలాగే అక్టోబర్ 5న సీఎం కేసీఆర్ వనపర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఇప్పటికే ప్రకటించారు. అదే విధంగా టీడీపీ, తెలంగాణ జనసమితి పార్టీలు క్రీయాశీలంగా వ్యవహరిస్తున్నాయి. ఇలా మొత్తం మీద ఎన్నికల జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. స్పీడ్ అందుకున్న కారు అసెంబ్లీ రద్దు అనంతరం అభ్యర్థుల ప్రకటనతో దూకుడు మీదున్న టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో... అసమ్మతివర్గం తో సంబంధం లేకుండా బరిలో నిలిచే నేతలు తమ పనికానిచ్చేస్తున్నారు. ఈ సారి ఉమ్మడి జిల్లాలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు పార్టీ అధిష్టానం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. అందుకోసం జిల్లాకు చెందిన మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను సమన్వయం చేసుకోవాల్సిందిగా మం త్రి లక్ష్మారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను మంత్రి జూపల్లి కృష్ణారావుకు అప్పగించారు. దీంతో మంత్రి లక్ష్మారెడ్డి షాద్‌నగర్ మొదలుకుని జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలలో పరిస్థితిని అంచనా వేస్తూ అవసరమైన చోట ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందు లో భాగం గా కాస్త ఇబ్బందికరంగా ఉన్న షాద్‌నగర్, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో విసృ ్తతంగా పర్యటిస్తున్నారు. అలాగే నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధి లోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్, గద్వాల నియోజకవర్గాలను మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందులో సమస్యలు ఎదురవుతున్న కల్వకుర్తి, గద్వాల నియోజకవర్గాలపై ఆయన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అలాగే ప్రచారంలో మరింత ఊపు తీసుకొచ్చేందుకు పార్టీలో కీలకమైన నేత, మంత్రి కేటీఆర్ గురువారం నాగర్‌కర్నూల్ బహిరంగసభలో పాల్గొననున్నారు. అదే విధంగా వచ్చే వారం అక్టోబర్ 5న సీఎం కేసీఆర్ వనపర్తి సభలో పాల్గొంటారు.ననున్నారు. కదం తొక్కుతున్న కాంగ్రెస్ పాలమూరు ప్రాంతంలో గట్టి పట్టు ఉన్న కాంగ్రెస్ సైతం దూకుడు పెంచింది. అభ్యర్థులను ప్రకటించకపోయినా... బరిలో ని లిచే నేతల విషయంలో స్పష్టత ఉండడం తో ప్రచారపర్వంలో మునిగిపోయా రు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కాంగ్రెస్ నేతలు డీకే.అరుణ, చిన్నారెడ్డి, రేవంత్ జిల్లా వాసులే కావడంతో పార్టీకి కొత్త ఊపు తీసుకొస్తున్నారు. ఇప్పటికే గద్వాలలో ముమ్మర ప్రచారం చేస్తున్న డీకే అరుణ... తనకు పట్టు ఉన్న నారా యణపేట, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో కూ డా పర్యటిస్తున్నారు. అదే విధంగా మాట ల వాగ్దాటితో టీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేసే రేవంత్‌రెడ్డి సైతం జడ్చ ర్ల, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి నియో జకవర్గాలలో వీలుచిక్కినప్పుడల్లా పర్యటిస్తున్నారు. ఆ యన ప్రాతినిధ్యం వహి స్తున్న కొడంగల్ నియోజకవర్గంలో గురువారం నుంచి ప్ర చారపర్వాన్ని ప్రారంభించనున్నారు. అ లాగే అక్టోబర్ 2 లేదా 3న అచ్చంపేటలో వంశీకృష్ణ, కొల్లాపూర్‌లో బీ రం హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో బహిరంగసభలు నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందరినీ కలుపుకుంటూ... మహాకూటమిలో భాగం కానున్న టీడీపీ, తెలంగాణ జన సమితి పార్టీలు ఇటీవలి కాలంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాయి. కూటమిలో భాగంగా సీట్లు సాధించేందుకు ఆయా పార్టీల నేతలు నియోజకవర్గాల్లో ముమ్మర పర్యటనలు చేస్తున్నారు. మహాకూటమి ద్వారా పోటీ చేయాల్సి వస్తే అందరినీ కలుపుపోయేలా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ సీటు కోసం టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, టీజేఎస్ తరఫున ఎస్.రాజేందర్‌రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా మక్తల్ తరఫున కూటమిలో భాగంగా సీటు ఖాయమనే భావనతో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు. అలాగే పొత్తులో మూడో సీటు లో భాగంగా దేవరకద్ర కూడా దక్కితే టీడీపీ తరఫున తన భార్య సీతమ్మను బరిలో నిలపాలని దయాకర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ వనపర్తి మాజీ ఎమ్మె ల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డికి అవకాశం ఇవ్వొద్దనే పట్టుదలతో దయాకర్‌రెడ్డి ఉన్న ట్లు తెలుస్తోంది. అందుకే నియోజకవర్గ కేంద్రం దేవరకద్రతో పాటు అన్ని మండ ల కేంద్రాల్లో కూడా పార్టీశ్రేణులతో సభ లు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. -
మా దగ్గర మార్చాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల వ్యూహంలో ముందున్న టీఆర్ఎస్లో అసంతృప్తుల సమస్యకు ఎంతకీ తెర పడట్లేదు. డజను వరకు నియోజకవర్గాల్లో ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. ఎనిమిది సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి పోటీగా అసమ్మతి నేతలు ఏకంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని చెబుతున్నారు. అభ్యర్థులను మార్చాలని, లేకుంటే పార్టీ విజయం సాధించదని మరో 4 సెగ్మెంట్లలో ద్వితీయ శ్రేణి నేతలు కార్యక్రమాలు చేపడుతున్నారు. 105 అసెంబ్లీ స్థానాలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్లు ప్రకటించిన రోజే అసమ్మతి రాజకీయాలు మొదలయ్యాయి. ప్రతిరోజూ కేటీఆర్ చర్చ లు జరుపుతుండటంతో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేసేందుకు అసమ్మతి, అసంతృప్త నేతలు అంగీకరిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి ఎంతకీ మారట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు నేతలు సొంతంగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోక్యంతోనే అన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు, అసమ్మతి నేతలు పార్టీ దారిలోకి వస్తారనే అభిప్రాయం ఉంది. ప్రచార సభలు నిర్వహించేలోపే అసంతృప్త, అసమ్మతి నేతల బుజ్జగింపుల కార్యక్రమం ముగించాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. ► రామగుండంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు ప్రధాన పోటీదారుగా తిరుగుబాటు అభ్యర్థి కోరుకంటి చందర్ ప్రచారం చేస్తున్నా రు. మంత్రి కేటీఆర్ చర్చలకు పిలిచినా చందర్ రావట్లేదని, పోటీలో ఉంటానని తేల్చి చెప్పినట్లు తెలిసిం ది. ఒకే పార్టీ నుంచి ఇద్దరు ప్రచారం చేస్తుండటంతో ఇక్కడి శ్రేణుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ► భూపాలపల్లిలోనూ ఇద్దరు టీఆర్ఎస్ నేతల ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారితో సమానంగా అసమ్మతి నేత గండ్ర సత్యనారాయణరావు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏ హామీ ఇచ్చినా కచ్చితంగా పోటీలో ఉంటానని చెబుతున్నారు. ► వేములవాడలో టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబును మార్చాలని ద్వితీయ శ్రేణి నేతలు రోజూ డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ► మిర్యాలగూడలో తాజా మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు టీఆర్ఎస్ మరో నేత పోటీ వచ్చే పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి ఇక్కడ ప్రచారం కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని మార్చకుంటే ఈ సెగ్మెంట్లో పార్టీ గెలవదని చెబుతున్నారు. ► సత్తుపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవికి పోటీగా ఆ పార్టీ మరో నేత మట్టా దయానంద్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దయానంద్ గత ఎన్నికల్లో ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు. ► ఉప్పల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి బేతి సుభాష్‌రెడ్డిని మార్చాలని అక్కడి కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. సెగ్మెంట్లోని మొత్తం ఎనిమిది మంది కార్పొరేటర్లు బహిరంగంగా ఇదే డిమాండ్ చేస్తున్నారు. సుభాష్‌రెడ్డిని మార్చకుంటే ఇక్కడ టీఆర్ఎస్ గెలవదని.. గెలిచే వారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ► షాద్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్‌ను మార్చాలన్న డిమాండ్‌తో అసమ్మతి నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు వి.శంకర్, అందె బాబయ్య ఆధ్వర్యంలో అధికారిక అభ్యర్థికి పోటీగా ప్రచారం చేస్తున్నారు. తమలో ఒకరు పోటీలో ఉంటారని చెబుతున్నారు. ► ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గత ఎన్నికల అభ్యర్థి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వతంత్రంగా పోటీ చేసేందుకు చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ► నాగార్జునసాగర్‌లో నోముల నర్సింహయ్యను మార్చాలని డిమాండ్ కొనసాగుతోంది. మరో నేత ఎంసీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లోనూ రోజూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ► జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్‌ను మార్చాలని అక్కడి నేతలు డిమాండ్ చేస్తున్నారు. సంజయ్‌ను మార్చకుంటే టీఆర్ఎస్ విజయం సాదించదని మాజీ జడ్పీటీసీ ఎం.జితేందర్‌రావు, ఎం.గంగారెడ్డి, బి.భాస్కర్‌రెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బి.శంకర్, జగిత్యాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ టి.సరళాదేవీ అంటున్నారు. ► పటాన్చెరు నియోజకవర్గంలోనూ అభ్యర్థిని మార్చాలనే డిమాండ్ ఆగట్లేదు. తాజా మాజీ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికే ఇక్కడ టికెట్ ఇచ్చారు. టీఆర్ఎస్ నేతలు సఫాన్దేవ్, కొలను బాల్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్‌లు తమకే అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ► ఆలేరులో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతకు వ్యతిరేకంగా అక్కడి స్థానిక నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరుతూ ఆలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఇన్చార్జి సుంకరి శెట్టయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యులు గట్టు నరేందర్, కొంతం మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు వంచ వీరారెడ్డి, బోల్ల కొండల్‌రెడ్డి. బి.ఉపేందర్‌రెడ్డి తదితరులు యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ మెట్లపై కొబ్బరికాయలు కొట్టారు. ► మహబూబాబాద్ అభ్యర్థి శంకర్‌నాయక్ ప్రచారం సాగట్లేదు. ఏ ఊరికెళ్లినా ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే పరిస్థితి ఉంది. దీంతో రెండు రోజుల కింద హైదరాబాద్‌కు వచ్చి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. నియోజకవర్గంలో పరిస్థితిని సమీక్షిస్తానని కేటీఆర్ చెప్పారు. -
కారులో కయ్యం!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: టీఆర్ఎస్లో అసమ్మతి సెగలు కక్కుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన విషయంలో రగులుకున్న అసమ్మతిని చల్లార్చేందుకు పార్టీ నాయకులు ఒకవైపు రంగంలోకి దిగుతున్నా.. మరోవైపు అసమ్మతి నేతలు మెట్టు దిగకుండా తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తాము చేసిన సేవలకు గుర్తింపుగా టికెట్ ఆశించగా.. దీనిని పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నాయకులు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. సత్తుపల్లి, వైరా, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లో అసమ్మతి కార్యకలాపాలు వేడెక్కుతుండటంతో పార్టీ విజయం కోసం అధినేత ప్రకటించిన అభ్యర్థుల గెలుపునకు జిల్లా నేతలు ఏకతాటిపైకి వచ్చి పనిచేసేలా వ్యూహాన్ని రూపొందిస్తారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతను స్వీకరించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై పలు నియోజకవర్గాల నేతలు ఆశలు పెట్టుకున్నారు. అసమ్మతి నేతలకు నచ్చజెప్పి.. దారిలోకి తెచ్చే బాధ్యతను తుమ్మలపై పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పాలేరు అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్ తుమ్మలను ఖరారు చేశాక ఈనెల 14న తొలిసారి పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటించిన తుమ్మల మళ్లీ వారంరోజుల విరామం తర్వాత జిల్లాలో పర్యటించి.. ఈసారి అసమ్మతి సెగలు కక్కుతున్న నియోజక వర్గాల్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పరోక్ష హెచ్చరికలు.. సదరు అభ్యర్థులకు మానసిక స్థైర్యం కల్పించడంతోపాటు అసమ్మతికి కాయకల్ప చికిత్స చేయాలని భావిస్తున్న ఆయన శుక్రవారం సత్తుపల్లిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన తీరు.. చేసిన పరోక్ష హెచ్చరికలు రాజకీయ కార్యకలాపాలను వేగవంతం చేయడంలో భాగమేనని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ ఎంపిక చేసిన సత్తుపల్లి అభ్యర్థి పిడమర్తి రవిని గెలిపించుకోలేకపోతే తాను వచ్చే మంత్రివర్గంలో ఉండటమే అనవసరమని వ్యాఖ్యానించడంతో పార్టీ కార్యకర్తలు.. నేతల్లోనూ ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగమేనని, తనకోసం పని చేయాలని నియోజకవర్గంలో అసమ్మతి నేతలకు సైతం పరోక్షంగా చెప్పినట్లయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సత్తుపల్లిలో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించిన మట్టా దయానంద్ విజయ్‌కుమార్ తనకు టికెట్ రాకపోవడంతో భవిష్యత్ కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను కలవడం, సభలు, సమావేశాలు, మోటారు సైకిల్ ర్యాలీలు చేపట్టడం ద్వారా తనకు ప్రజలతో ఉన్న సంబంధాలు, కార్యకర్తల అండ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే మంత్రి తుమ్మలకు రాజకీయ భవిష్యత్‌ను ప్రసాదించిన సత్తుపల్లి నియోజకవర్గంలో అధినేత బలపరిచిన అభ్యర్థి పిడమర్తి రవిని గెలిపించాలన్న పట్టుదలతో తుమ్మల ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడం అక్కడ పార్టీలోని రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. మధిర, వైరాలో.. అదే రీతిన మధిర నియోజకవర్గంలోనూ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పర్యటించిన మంత్రి తుమ్మల.. మధిర అభ్యర్థిని గెలిపించుకోవడం చారిత్రక అవసరమని, ఇక్కడ మార్పు కోరుతున్న ప్రజలు టీఆర్ఎస్ వెంట ఉన్నారని వ్యాఖ్యానించడం అక్కడి కార్యకర్తల్లోనూ నూతనోత్తేజం కలగడానికి ఉపయోగపడినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక వైరా నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌పై అక్కడి నేతలు కొందరు రగిలించిన అసమ్మతి అగ్గి ఇప్పటికిప్పుడు సమసిపోయేలా కనిపించడం లేదు. రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించిన తుమ్మల తన నియోజకవర్గంతోపాటు మరో రెండు నియోజకవర్గాల్లో రాజకీయ పర్యటన చేసిన తుమ్మల.. రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యకలాపాలపై ఇదే తరహాలో దృష్టి సారిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి గురు, శుక్రవారాల్లో చేసిన రాజకీయ పర్యటనలో రాజకీయ విమర్శలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనే దృష్టి సారించారన్న భావన క్షేత్రస్థాయిలో కలిగించడానికేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పరిస్థితుల ఆకళింపునకు ప్రయత్నం.. ఇక ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో దశలవారీగా పర్యటనలు చేయడం ద్వారా పార్టీ పరిస్థితులను ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్లో నెలకొన్న అంతర్గత విభేదా లు, కొన్నిచోట్ల వర్గ పోరును తుదముట్టించాలని, ఇందుకోసం తమ ప్రాంతాల్లో పర్యటించాలని వస్తున్న విజ్ఞప్తులపై తుమ్మల ఆచితూచి స్పందిస్తూ.. నేతలంతా ఐక్యంగా పనిచేయాలని భరోసా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు ఆయా నియో జకవర్గాల అభ్యర్థులతో ఎప్పటికప్పుడు సమాలోచనలు జరపడం ద్వారా రాజకీయ పరిస్థితులను తెలుసుకోవడంతోపాటు అందుకు అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించుకోవాలని పార్టీ యోచిస్తోంది. ఇక పార్టీ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో కొంత అసంతృప్తి, అసమ్మతి వంటి పరిస్థితులున్నా.. ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. ఖమ్మం తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆత్మీయ సమావేశాల పేరుతో నగరంలోని ప్రతి డివిజన్లో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను కలిసి ప్రచార పర్వాన్ని వేడెక్కిస్తుండగా.. సత్తుపల్లిలో పిడమర్తి రవి, మధిరలో లింగాల కమల్‌రాజ్, వైరాలో బాణోతు మదన్‌లాల్, పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టడం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. సత్తుపల్లి, పినపాక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించిన ఆశావహులు మట్టా దయానంద్, వట్టం రాంబాబు నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో తమ రాజకీయ భవిష్యత్‌ను పరీక్షించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైరా నియోజకవర్గంలో అసమ్మతి కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న బొర్రా రాజశేఖర్‌తోపాటు పలువురు నేతలు మండలాలవారీగా సమావేశాలు నిర్వహిస్తుండటంతో అసమ్మతి కార్యకలాపాలు వేడెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇల్లెందు నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు సైతం అసమ్మతి సెగలు తప్పడం లేదు. అక్కడ టికెట్ ఆశించిన పార్టీ నాయకుడు దేవీలాల్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించి కార్యకర్తలతో సమాలోచనలు జరిపారు. -
నేతలకు తిర‘కేసు’
మోర్తాడ్(బాల్కొండ): ‘ముందస్తు’ జోష్‌లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న టీఆర్ఎస్ నేతలకు నిరసన సెగ తగలనుందా..? పల్లెలకు వచ్చే నాయకులపై రైతుల నుంచి ఒత్తిడి ఎదురుకానుం దా? అంటే తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఎస్సారెస్పీ కాకతీయ కాలువ పరివాహక ప్రాంత రైతులు ఇటీవల చేపట్టిన సాగునీటి ఉద్యమం ప్రజాప్రతినిధులకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు నీటి విడుదల కోసం ఉద్యమించిన పలువురు రైతులపై పోలీసులు అప్పట్లో కేసులు నమోదు చేశారు. అయితే, ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈ కేసులు ఇరకాటంగా మారుతున్నాయి. గ్రామాలకు వస్తున్న నేతలకు నిరసన సెగలు తగులుతున్నాయి. మిషన్ భగీరథ వైస్ చైర్మన్, తాజా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి రెండ్రోజుల క్రితం మెండోరా మండలంలో పర్యటనకు వెళ్లగా, రైతులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తాజాగా ఆదివారం ఏర్గట్లలో సమావేశమైన ఆ గ్రామ రైతులు కేసుల ఎత్తివేత కోసం పలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. తాజా పరిస్థితులు గమనిస్తుంటే రానున్న రోజుల్లో ‘కాకతీయ కేసులు’ టీఆర్ఎస్కు సంకటంగా మారనున్నాయనే భావన వ్యక్తమవుతోంది. సాగునీటి కోసం ఉద్యమం.. కాకతీయ కాలువ పరివాహక ప్రాంతాలైన ఏర్గట్ల, తిమ్మాపూర్, ఉప్లూర్, తొర్తి, వెంచిర్యాల్, వెల్కటూర్, మెండోరా, బట్టాపూర్, రాజరాజేశ్వర్ నగర్ తదితర గ్రామాల రైతులు సాగు చేస్తున్న పంటలకు లీకేజీ నీరే ప్రాణాధారం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయకపోయినా జిల్లాలోని రైతాంగానికి లీకేజీల ద్వారా వచ్చే నీరు ఎంతో ఉపయోగపడేది. కాకతీయ కాలువకు ఇరువైపులా ఉన్న గ్రామాల రైతులు కాలువలో పంపుసెట్లు ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా పంటలకు నీరు అందించుకుంటున్నారు. ఈసారి వర్షాలు ఆలస్యంగా కురువడంతో రైతులు గత్యంతరం లేని పరిస్థితిలో కాకతీయ కాలువ నీటి కోసం ఉద్యమ బాట పట్టారు. అయితే, నీటి విడుదల కుదరదని ప్రభుత్వం స్పష్టతనివ్వడం, రైతులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడం, పల్లెల్లో పోలీసుల మోహరింపుతో అప్పట్లో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోచంపాడ్‌లో రాస్తారోకో సందర్భంగా చెలరేగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు పలువురిపై క్రిమినల్ కేసులను నమోదు చేశారు. 25 మంది రైతులతో పాటు వారికి మద్దతిచ్చిన ఐదుగురు నేతలపై కేసులు నమోదయ్యాయి. అనువైన సమయమని.. పోలీసులు కేసులలో నిందితులుగా ఉన్న రైతులు పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని బతికే తాము పంట పొలాలను వదలి కోర్టులు, స్టేషన్ల చుట్టూ తిరిగితే మా పనులు ఏమి కావాలని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ముందస్తు ఎన్నికలు మంచి అవకాశంగా కలిసి వచ్చాయని వారు భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తూనే ప్రచార పర్వానికి ఏకకాలంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బాల్కొండ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మూడు రోజుల నుంచి నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేస్తున్నారు. అయితే, తమపై నమోదైన కేసుల ఎత్తివేతకు ఇదే అనువైన సమయమని గుర్తించిన బాధిత రైతులు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మెండోరా మండల కేంద్రంలో ప్రశాంత్‌రెడ్డి పర్యటించగా, నల్లబ్యాడ్జీలు ధరించి కేసులు ఎత్తివేయాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన రైతులు కూడా కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేసులు ఎత్తివేయక పోతే భవిష్యత్తులో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని రైతులు స్పష్టం చేస్తున్నారు. బేషరతుగా కేసులు ఎత్తి వేయాలి రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తి వేయాలి. ప్రభుత్వం స్పందించక పోతే మరో ఉద్యమం తప్ప దు. రైతులను హిం సించిన ఏ ప్రభుత్వం బాగు పడలేదు. రైతులు అన్నం పెట్టే వారే తప్ప మరొకరిని ఇబ్బంది పెట్టేవారు కాదు. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. కేసులను ఎత్తి వేయాలి. – అశోక్, రైతు, మెండోరా రైతులకు మద్దతిస్తే కేసులా..? రైతులు నీటి కోసం ఆందోళన చేపడితే మద్దతు ఇచ్చిన వారిపైనా పోలీసులు కేసులను నమోదు చేయడం ఎంత వరకు సమంజసం. పోలీసుల తీరు సరికాదు. ప్రభుత్వం స్పందించి కేసులను ఎత్తివేయడానికి చర్యలు తీసుకోవాలి. – శివన్నోల్ల శివకుమార్, ఏర్గట్ల నీళ్లడిగితే కేసులు పెడతారా..? మేము న్యాయబద్ధంగా నీటి కోసం ఉద్యమించాం. నీళ్లడిగిన రైతులపై కేసులా..? ఎన్నో నేరాలు చేస్తున్న వారిని వదిలి, సాగు నీటి కోసం ఉద్య మించిన రైతులపై కేసులు పెడతారా..? మహిళలు అని కూడా చూడకుండా మాపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇది ఎంత వరకు సమంజసం. రైతులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలి. – బద్దం రజిత, రైతు, ఏర్గట్ల -
కప్పదాట్లు..!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నేతల వలసలతో జిల్లాలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతల కప్పదాట్లతో ఆయా నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీ ముఖ్య నాయకులు పార్టీలు మారుతుండటంతో ఆయా నియోజకవర్గాల్లో సమీకరణలు మారుతున్నాయి. ఇటీవల మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పగా, తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. భూపతిరెడ్డి కాంగ్రెస్‌లోకి రాకతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఆశావహుల సంఖ్య మరింత పెరిగినట్లయింది. ఇప్పటికే ఇక్కడ నలుగురు నేతలు రూరల్ టికెట్‌ను ఆశిస్తున్నారు. పొత్తులో భాగంగా రూరల్ నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం నెలకొంటే.. రూరల్ టికెట్‌పై స్పష్టమైన హామీ ఇచ్చాకే భూపతిరెడ్డి పార్టీలో చేరినట్లు ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. మరోవైపు స్పీకర్ సురేశ్‌రెడ్డి టీఆర్ఎస్లోకి రావడంతో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో కూడా సమీకరణలు మారాయి. గత ఎన్నికల్లో సురేశ్‌రెడ్డి కాంగ్రెస్ తరపున ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయన ఆర్మూర్ నుంచి గానీ, బాల్కొండ నుంచి గానీ పోటీ చేయాలనే ఊగిసలాటలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి, కారెక్కారు. దీంతో కాంగ్రెస్‌లో ఆర్మూర్ తెరపైకి కొత్త నేతల పేర్లు వచ్చాయి. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ ఆకుల లలిత కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండుసార్లు ఆర్మూర్‌లో ఓటమి పాలైన సురేశ్‌రెడ్డి ఈసారి ఎలాగైనా బాల్కొండ నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. దీంతో ఇక్కడి స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈరవత్రి అనిల్‌తో పాటు, సురేశ్‌రెడ్డి కూడా టికెట్ రేసులో ఉంటారని భావించారు. సురేశ్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో ప్రస్తుతానికి కాంగ్రెస్ టికెట్ రేసులో అనిల్ ఒక్కరే మిగిలారు. కాగా పొత్తులో భాగంగా ఈ స్థానంపై టీడీపీ కన్నేసింది. ఇక్కడి నుంచి అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. ఇలా నేతల కప్పదాట్లు మూడు నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతోంది. -
అమ్మా నాన్న.. ఓ ఎమ్మెల్యే టికెట్
ఇది అమ్మానాన్నల తండ్లాట.. పిల్లల రాజకీయ భవిష్యత్ కోసం తండ్లాట.. తమకు బలం ఉన్నప్పుడే బిడ్డలను నేతలుగా నిలబెట్టాలనే తపన.. తమ రాజకీయ జీవితాలను త్యాగం చేసైనా కొడుకు, కూతుళ్లను అధికారంలోకి తేవాలనే ఆరాటం.. కొండా దంపతులు తమ కూతురు కోసం తమ రాజకీయ జీవితాన్ని త్యాగం చేసేందుకు సిద్ధపడితే.. ములుగులో చందూలాల్ తన కొడుకు కోసం పూర్తిగా రాజకీయాలకే దూరమయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మాజీ మంత్రి రెడ్యానాయక్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజకీయ బలం ఉపయోగించి కూతుళ్ల కోసం చక్రం తిప్పుతున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సీనియర్ రాజకీయ నాయకులు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలోపడ్డారు. తమకు ప్రజల్లో పేరు, ప్రతిష్టలు ఉన్నప్పుడే తమ వారసులను రాజకీయ రంగం మీద అరంగేట్రం చేయించాలని భావిస్తున్నారు. తమకు టికెట్లు రాకపోయిన ఫరవాలేదు.. తమ పిల్లలను మాత్రం ఎమ్మెల్యేలుగా చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. కూతురు కోసం కొండా దంపతులు.. ఈ సారి కూతురు సుష్మితా పటేల్‌ను రాజకీయ అరంగేట్రం చేయించడానికి కొండా మురళి, సురేఖ దంపతులు గట్టి పట్టుదలతో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి రెండు టికెట్లను ఆశించారు. అవకాశం కలిసి వస్తే భూపాలపల్లి నుంచి సుష్మితను నిలబెట్టాలని ఆలోచించారు. రెండు సీట్లు రాకుంటే వరంగల్ తూర్పులో సురేఖ రాజకీయ జీవితాన్ని త్యాగం చేసి కూతురు భవిష్యత్‌కు పునాదులు వేయాలని నిర్ణయించుకున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ ఆమె టికెట్‌ను పెండింగ్‌లో పెట్టింది. దీంతో వాళ్లు కారుతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కూతురు సుష్మితను పరకాల నుంచి, సురేఖ వరంగల్ తూర్పు నుంచి నిలబడేందుకు ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో కూడా ఏకాభిప్రాయం కుదరకపోతే స్వతంత్య్ర అభ్యర్థులుగా బరిలో నిలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇండిపెండెంట్‌గా అయితే పరకాల, భూపాలపల్లి, వరంగల్ తూర్పు నుంచి ముగ్గురు నిలబడే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. స్టేషన్‌ఘన్‌పూర్‌పై శ్రీహరి.. ఎమ్మెల్సీతో రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యను రాజకీయ రంగంలోకి దింపే ప్రయత్నంలో ఉన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఆమెను పోటీ చేయించేందుకు స్కెచ్ వేశారు. అయితే సిట్టింగుల కోటా కింద గులాబీ దళపతి కేసీఆర్.. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ ఇచ్చారు. ఈ నిర్ణయం కడియం శ్రీహరి వర్గాన్ని కలవరపరిచింది. నియోజకవర్గంలోని ఆయన అనుకూల వర్గం ప్రజాప్రనిధులు రోడ్డెక్కారు. సభలు పెట్టి రాజయ్య అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఒక మహిళతో శృంగార పలుకులతో రాజయ్య స్వరాన్ని పోలిన ఆడియో క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ములుగులో.. ములుగు ఎమ్మెల్యే, ఆపద్ధర్మ మంత్రి చందూలాల్ ఆరోగ్య పరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సారి టికెట్ తన కుమారుడు, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్‌కు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ములుగు నియోజకవర్గంలో చందూలాల్‌కు సంబంధించిన అన్ని వ్యవహారాలను ప్రహ్లాద్ చక్కబెడుతున్నారు. అధికారులతో మాట్లాడడంతోపాటు అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్నారు. డోర్నకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి రెడ్యానాయక్‌కు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఖరారైంది. తన కూతురు మాజీ ఎమ్మెల్యే కవిత మహబూబాబాద్ నుంచి టీఆర్ఎస్ టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. దీంతో కూతురు టికెట్ విషయంపై ఆయన ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమనుకుంటే కూతురు కోసం తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. -
తారస్థాయికి..అసమ్మతి రాగం!
మిర్యాలగూడ నియోజకవర్గంలో బుధవారం అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి భారీ ర్యాలీ.. నార్కట్‌పల్లిలో దుబ్బాక నర్సింహారెడ్డి, మరికొందరు నేతలతో కలిసి సన్నాహక సమావేశం.. మునుగోడులో వేనేపల్లి వెంకటేశ్వరరావు, నాగార్జునసాగర్‌లో ఎంసీ కోటిరెడ్డి కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు.. ఇదీ.. జిల్లాలో రెండు, మూడు రోజులుగా ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన టీఆర్ఎస్ అసమ్మతి నేతల హడావుడి. సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్ఎస్లో రోజు రోజుకూ పెరిగిపోతున్న అసమ్మతి రాజకీయం ఆ పార్టీ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పది స్థానాలకు టికెట్లను ఖరారు చేశారు. నల్లగొండలో కొత్తగా ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్న కంచర్ల భూపాల్‌రెడ్డిని మినహాయిస్తే మిగిలిన తొమ్మిది స్థానాల్లో ఎని మిది మంది సిట్టింగులే ఉన్నారు. నాగార్జునసాగర్‌లో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఇన్చార్జి నోముల నర్సింహయ్యకే టికెట్ ఇచ్చారు. కోదాడ, హుజూర్‌నగర్‌లో అభ్యర్థుల ఖరారు పెండింగులో ఉంది. కాగా, ఈ స్థానాల్లో వేనేపల్లి చం దర్రావు, శంకరమ్మ పేర్లనే ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో టికె ట్లు ప్రకటించిన నియోజకవర్గాల్లో సగానికి సగం స్థానాల్లో అసమ్మతి రాజకీయాలు నడవడం ఆ పార్టీ నాయకత్వాన్ని కలవరానికి గురిచేస్తోంది. టికెట్లు ప్రకటించిన మరుసటి రోజు నుం చే దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, తుంగతుర్తి, నల్లగొండ, మిర్యాలగూడలో అసమ్మతి నేతల రాగాలు మొదలయ్యాయి. దేవరకొండకు చెందిన జెడ్పీ చైర్మన్ బాలూ నాయక్ తన దగ్గరి నేతలతో హైదరాబాద్‌లో భేటీ అయ్యి సమాలోచనలు జరిపారు. నాగార్జున సాగర్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌లో తేరా చిన్నపరెడ్డి ఇంటిలో భేటీ అయ్యారు. అక్కడ తీసుకున్న నిర్ణయం మేరకు హాలియా మార్కెట్ యార్డులో నోముల నర్సిం హయ్య అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా పెద్ద సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత నియోజకవర్గం లోని మెజారిటీ ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు మీడియా ముం దుకు వచ్చి స్థానికేతరుడైన నోములకు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ఒక వేళ బీసీ కోణంలో ఆలోచిస్తే, నియోజకవర్గంలోనే సమర్థులైన బీసీ నేతలు ఉన్నారని, వారి అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హాలియా సమావేశంలో తీర్మానించారు. ఇక, మిర్యాలగూడలో ఆ పార్టీ సీనియర్ నేత అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి వర్గం భాస్కర్‌రావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది. బుధవారం ఆయన ర్యాలీ నిర్వహించడమే కాకుండా సమావేశం కూడా జరిపి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తుంగతుర్తిలో అభ్యర్థి గాదరి కిశోర్ కుమార్‌ను స్థానికేతరుడని పక్కన పెట్టాలన్న డి మాండ్‌తో అసమ్మతి సమావేశం జరిగింది. మునుగోడులో తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని అక్కడి నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీ నాయకుడు వేనేపల్లి వెంకటేశ్వరరావు నేతృత్వంలో వీరంతా ఇప్పటికే హైదరాబా ద్లో సమావేశమై చర్చించారు. నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డికి పార్టీ సీనియర్లనుంచి సహా య నిరాకరణ మొదలైంది. ఆయనకు కాకుండా, సీని యర్లలో ఎవరికి టికెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ మారు చకిలం అనిల్‌కుమార్ సమావేశం జరిపి తాను పోటీలో ఉంటానని ప్రకటించారు. ఏడాది కిందటి దాకా ఇన్చార్జ్గా వ్యవహరించిన దుబ్బాక నర్సింహారెడ్డి నేతృత్వంలో బుధవారం నార్కట్‌పల్లిలో సన్నాహక సమావేశం జరిపారు. సోమవారం జిల్లా కేంద్రం లోని ఎన్జీ కాలేజీ మైదానంలో అసమ్మతి సభ జరపాలని నిర్ణయించారు. నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు తండు సైదులు గౌడ్, కౌన్సిలర్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముందునుంచీ పార్టీలో ఉన్న సీనియర్లను గౌరవించి టికెట్ ఇవ్వాలన్నది అసమ్మతి నేతల డిమాండ్‌గా ఉంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లో అసమ్మతి రాజకీయం జోరుగా సాగుతోంది. తారస్థాయికి..అసమ్మతి రాగం! -
పట్నం చేరిన ‘పంచాయితీ’
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నిరసన సెగ రాజధానికి తాకింది. టీఆర్ఎస్ అభ్యర్థులను మార్చాలనే నిరసనలు ఇప్పటివరకు నియోజకవర్గాలకే పరిమితమయ్యాయి. అయితే ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశించిన నేతలతోపాటు అభ్యర్థుల వైఖరిని వ్యతిరేకిస్తున్న పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కొద్ది రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేయడం.. వారిపై ఉన్న అసం తృప్తిని పార్టీ అధినాయకత్వానికి చాటిచెప్పే ప్రయత్నాలను వేగవంతం చేశారు. సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలతోపాటు కొత్తగూడెంలోనూ అభ్యర్థులను మార్చాలంటూ ఆందోళనలు చేపట్టడంతో ఇవి ఎటు దారితీస్తాయోనని పార్టీ వర్గాల్లో గుబులు వ్యక్తమవుతోంది. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించిన మట్టా దయానంద్ తనకు టికెట్ రాకపోవడంపై తీవ్ర నిర్వేదానికి గురై కార్యకర్తలతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ.. తన రాజకీయ భవిష్యత్.. కార్యాచరణ రూపొందించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని తల్లాడ నుంచి సత్తుపల్లి వరకు మోటారు సైకిళ్ల ప్రదర్శన, సత్తుపల్లిలో సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్లో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండే వ్యక్తిగా.. స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న వ్యక్తిగా పార్టీ టికెట్ ఆశించానని, కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ సత్తుపల్లి అభ్యర్థిత్వం విషయంలో పునఃపరిశీలించాలని కోరారు. కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటానని స్పష్టం చేయడం, దయానంద్ నిర్వహించిన ర్యాలీకి లభించిన స్పందనపై ఇంటెలీజెన్స్ వర్గాలు సైతం ప్రభుత్వానికి నివేదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ జిల్లాలోని పలువురు అభ్యర్థుల అభ్యర్థిత్వంపై వస్తున్న వ్యతిరేకతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకు గౌరవం ఇచ్చి.. కార్యకర్తలకు అండగా ఉండే వారికి టికెట్లు ఇస్తే వారిని గెలిపించడానికి సిద్ధమంటూ వైరా నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న అసమ్మతి వర్గం నాయకులు ఆయా మండలాల్లో సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి రాజకీయ సెగ అధినాయకత్వానికి తెలియాలన్న లక్ష్యంతో ఇద్దరు జెడ్పీటీసీలు, ఎంపీపీలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు తమ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేయడం పార్టీలో కలకలం రేపింది. కొత్తగూడెంలో కూడా.. మరోవైపు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ.. అక్కడి టీఆర్ఎస్లోని అసమ్మతి వర్గం మంగళవారం ఆందోళనకు దిగడంతో జిల్లాలో అభ్యర్థుల ఖరారుపై నిరసన సెగలు అలుముకున్న తీరును నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక వైరా నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితిపై తాజా మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న అసమ్మతి వర్గం బొర్రా రాజశేఖర్ నేతృత్వంలో బుధవారం హైదరాబాద్‌కు వెళ్లి ఎంపీ, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావును, పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కలిసి నియోజకవర్గ పరిస్థితులపై వివరించారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించి.. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిత్వంపై పునరాలోచన చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన మట్టా దయానంద్ సైతం తనకు మద్దతు పలుకుతున్న కార్యకర్తలు, నాయకులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లి పరిస్థితిని వివరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల బరిలో ఉండాలని మంగళవారం జరిగిన సమావేశంలో దయానంద్‌ను పలువురు కోరడం, దానిపై ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమాలోచనలు జరిపి అనంతరం నియోజకవర్గ పరిస్థితులను పార్టీ అధినాయకత్వానికి తెలియజేయాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారుపై నెలకొన్న అసంతృప్తి, అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉన్నట్లు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్లోని పలు నియోజకవర్గాల అభ్యర్థిత్వాలపై నెలకొన్న వ్యతిరేకతను తొలగించడానికి.. అసమ్మతి నేతలకు నచ్చజెప్పేందుకు పార్టీ అధినాయకత్వం జిల్లా మంత్రికి బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరును పాలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈనెల 6న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఈనెల 14న పాలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి హోదాలో తొలిసారిగా జిల్లాకు రానుండడంతో తన నియోజకవర్గంలో తొలి ఎన్నికల ప్రచార సభ పూర్తి చేసుకుని తర్వాత జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎగసిపడుతున్న అసమ్మతిపై దృష్టి సారించనున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాలవారీగా అభ్యర్థులతోనూ.. అభ్యర్థిత్వాలను వ్యతిరేకిస్తున్న నేతలతోనూ సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
పోటాపోటీ..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విదేశాలకు మహిళల అక్రమ రవాణా కేసులో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అరెస్టుతో జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మంగళవారం కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటాపోటీ నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిని హైదరాబాద్ నార్త్‌జోన్ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుని, మంగళవారం రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. జగ్గారెడ్డి అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి పట్టణ బంద్‌కు పిలుపునిచ్చింది. మంగళవారం ఉదయం పట్టణంలో ర్యాలీ నిర్వహించి బంద్ నిర్వహించేందుకు ప్రయత్నించిన కసిని రాజు, శ్రీకాంత్, మహేశ్ తదితర కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదాశివపేటలోనూ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ నేతృత్వంలో బంద్‌కు పిలుపునిచ్చారు. కార్యకర్తల అరెస్టుతో సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల్లో బంద్‌కు నామమాత్ర స్పందన లభించింది. జగ్గారెడ్డి భార్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలకు సంఘీభావం తెలిపేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి మంగళవారం ఉదయం సంగారెడ్డికి వచ్చారు. ఆమె వెంట పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన గోదావరి అంజిరెడ్డి, శశికళ యాదవరెడ్డి, జిన్నారం జెడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్ ఉన్నారు. జగ్గారెడ్డి కుటుంబానికి సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నేతలు పట్టణంలో ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలోని పోలీసులు అడ్డుకున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారని సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే తన భర్తపై టీఆర్ఎస్ అక్రమ కేసులు బనాయిస్తోందని జగ్గారెడ్డి భార్య నిర్మల ఆరోపించారు. కాగా జగ్గారెడ్డి కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ఔటర్ రింగు రోడ్డు ముత్తంగి టోల్‌ప్లాజా వద్ద పటాన్చెరు పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత వదిలేశారు. టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు మహిళలను విదేశాలకు అక్రమంగా రవాణా చేసిన తూర్పు జయప్రకాశ్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంఘీభావం తెలపడంపై టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరస్తులకు కాంగ్రెస్ వత్తాసు పలుకుతోందని ఆరోపిస్తూ టీఆర్ఎస్ మహిళా విభాగం కార్యకర్తలు సంగారెడ్డి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఐసీడీఎస్ రీజినల్ ఆర్గనైజర్ దుర్గల్ల లక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి నేతృత్వంలో ఉత్తమ్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్ మహిళా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న భార్యను మోసగించి, మహిళలను అక్రమంగా విదేశాలకు రవాణా చేసిన జగ్గారెడ్డికి టీపీసీసీ నేతలు వత్తాసు పలకడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఆర్థికంగా నిలువునా మోసం చేసిన జగ్గారెడ్డి, తన వెంట తిరిగిన కార్యకర్తలను యాచకులుగా మార్చారని మున్సిపల్ వైస్ చైర్మన్ గోవర్దన్నాయక్ మరో ప్రెస్మీట్లో ఆరోపించారు. మొత్తంగా ఉదయం నుంచి అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ నాయకుల ఆందోళనలతో సంగారెడ్డి పట్టణం అట్టుడికిపోయింది.