
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈసందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కుమారుడు, ఐటీ శాఖా మంత్రి కె తారక రామరావు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలంటూ ఆకాంక్షించారు. తండ్రి గొప్పతనాన్ని వర్ణిస్తూ ట్విటర్‌లో ఓ కవితను పోస్టు చేశారు. కేసీఆర్ కుమార్తె, నిజమాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సింద్రాబాద్ మహంకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు:
- తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని, ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని గవర్నర్ ఆకాంక్షించారు.
- తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి వంటి చారిత్రాత్మక పథకాలతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే సీఎం పది కాలాలు చల్లగా ఉండాలన్నారు. ఇంకా అనేక సంవత్సరాలు ప్రజాసేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు.
- ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్(ఎస్) మండలం నేమ్మికల్ గ్రామంలోని దండిమైసమ్మ దేవాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేకు కట్ చేశారు.
- వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనంతగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుభప్రద్ పటేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
Happy Birthday Dad 😊
— KTR (@KTRTRS) 16 February 2018
Wish you many many years of good Health & loads of Happiness pic.twitter.com/6tM9zCHzUq
Happy Birthday Dear Father !! Proud to be your follower & Blessed to be your Daughter 🙏 pic.twitter.com/1Xdj3EEJRF
— Kavitha Kalvakuntla (@RaoKavitha) 17 February 2018