సై అంటే సై.. నాయకుల సోషల్‌ యుద్ధం | Sircilla: Political Leaders War in Social media | Sakshi
Sakshi News home page

సై అంటే సై.. నాయకుల సోషల్‌ యుద్ధం

Published Sat, May 29 2021 9:05 AM | Last Updated on Sat, May 29 2021 9:09 AM

Sircilla: Political Leaders War in Social media - Sakshi

ఎమ్మెల్యే రమేశ్‌బాబు పోస్టు చేసిన కరపత్రం, ఆది శ్రీనివాస్‌ పోస్టు చేసిన కరపత్రం 

సాక్షి,వేములవాడ: రాజకీయ నాయకులు సోషల్‌ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే రమేశ్‌బాబు ‘వంద పడకలే కాదు.. వంద సమాధానాలు’ అంటూ సామాజిక మధ్యమంలో కరపత్రం పోస్టు చేశారు. దీంతో టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌ ‘ఈ ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పండి’ అని మరో కరపత్రం పోస్టు చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీరి ప్రచారం చర్చనీయాంశంగా మారింది. 

కాగా వేములవాడ శివారులోని తిప్పాపూర్‌లో రూ.22.50 కోట్లతో నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో కరోనా ఉధృతి తగ్గుతోందన్నారు. ఇటీవల చేపట్టిన సర్వేలో 3,900 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు తేలిందని, వారిని గుర్తించి కిట్లు అందించామని తెలిపారు. వంద పడకల ఆస్పత్రి ప్రారంభంతో వేములవాడ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు దరి చేరాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 50పడకలతో కోవిడ్‌–19 సేవలు అందుబాటులోకి వచ్చాయని కేటీఆర్‌ తెలిపారు.

చదవండి: ఒక్క చాన్స్‌.. ఈటలపై పోటీకి సై అంటున్న నేతలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement