భారీ వర్షాల కారణంగా అసోం అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా అసోం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. కాగా, వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. ఆయన చేసిన పనికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
వివరాల ప్రకారం.. బీజేపీ ఎమ్మెల్యే బిసు మిశ్రా గురువారం వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ ప్రాంతంలో వరద నీరు ఎక్కువగా ఉండటంతో ఆయనకు నడవడం సాధ్యపడలేదు. దీంతో, ఎమ్మెల్యే మిశ్రా.. అక్కడే ఉన్న రెస్క్యూ టీమ్ సభ్యుడిని పిలిచారు. అనంతరం రెస్క్యూ టీమ్ సభ్యుడి వీపుపై ఎక్కి, ఎమ్మెల్యే పడవ వరకూ వెళ్లి అందులో నిల్చున్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఎమ్మెల్యే అలా చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వర్షాల కారణంగా అసోంలో నాలుగు లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
#WATCH | Assam: BJP MLA from Lumding Assembly, Sibu Misra was seen taking a piggyback ride to a boat, on the back of a flood rescue worker yesterday, May 18th. He was in Hojai to review the flood situation in the area. pic.twitter.com/Rq0mJ8msxt
— ANI (@ANI) May 19, 2022
ఇది కూడా చదవండి: బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత
Comments
Please login to add a commentAdd a comment