
అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ యూబ్యూటర్‌పై ఏకంగా ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే మండిపడ్డారు. అలాంటిది ఒక ప్రజాప్రతినిధే బహిరంగంగా అశ్లీల నృత్యాలను ప్రొత్సహించడం.. అందునా ఆయనే అసభ్యంగా ప్రవర్తించడం.. పైగా వేదిక మీదే బూతు పాట పాడడంతో.. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అని పలువురు నెట్టింట ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
బీహార్ జనతా దల్(యునైటెడ్) ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. భగల్‌పూర్ జిల్లా నౌగాచియాలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అక్కడ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది.
వేదిక మీద ఉన్న నృత్యకారిణి దగ్గరకు వెళ్లి.. ఆమె పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. కరెన్సీ నోటును ఆమె చెంపకు అతికించాడు. అక్కడితో ఆగకుండా.. నేను డ్యాన్స్ మాత్రమే చేయలేదు.. ఆమెను ముద్దు కూడా పెట్టుకున్నా అంటూ మైకులో ప్రకటించారు. ఇది ఇక్కడితోనే ఆగలేదు.
రాత్రి సయమంలో జరిగిన వేడుకల్లోనూ ఆయన పాల్గొన్నారు. రికార్డింగ్ డ్యాన్సర్లతో చిందులేశారు. ఆపై మైక్ అందుకుని బూతు పాటలు పాడి అక్కడున్నవాళ్లను హుషారెత్తించారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఆర్జేడీ భగ్గుమంది. ఇలాంటి వాళ్లపై కేసులు నమోదు చేస్తారా? చర్యలు తీసుకుంటారా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ప్రజాప్రతినిధులపై కూడా న్యాయస్థానాలు తీవ్ర వ్యాఖ్యలు చేయాలని పలువురు కోరుకుంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
होली मिलन समारोह में जदयू विधायक गोपाल मंडल ने महिला डांसर के गाल पर नोट चिपकाया और साथ में मंच पर लगाए ठुमके।#Gopalmandal #Bihar #BiharNews #Bhagalpur #Holi2025 pic.twitter.com/ZBNs32uQz1
— FirstBiharJharkhand (@firstbiharnews) March 10, 2025
JDU विधायक गोपाल मंडल#gopalmandal @Jduonline @RJDforIndia #BiharNews #bhagalpur pic.twitter.com/1nikGeTmWV
— Shri Dhiraj Sharma (Journalist) (@ShriDhiraj) March 11, 2025
గోపాల్ మండల్ వార్తల్లోకి ఎక్కడం తొలిసారేం కాదు. గతంలో ఆయన అండర్‌వేర్‌పై రైలులో తిరిగి వైరల్ అయ్యారు. కొందరు ప్రయాణికులు ఆ చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ టైంలోనూ ఆయనపై విమర్శలు రాగా.. కంపార్ట్‌మెంట్‌లో మహిళలు లేరని, బాత్రూం వెళ్లాల్సి రావడంతో అలా వెళ్లానని అప్పుడు తన చర్యను సమర్థించుకున్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment