పెళ్లి రోజే భార్య కళ్ల ముందు కుప్పకూలి.. | UP Bareilly Businessman Collapses On Stage While Dancing Dies With Heart Attack, Watch Video Viral | Sakshi
Sakshi News home page

వీడియో: పెళ్లి రోజు సంబురంగా జంట డ్యాన్సులు, అంతా చూస్తుండగానే కుప్పకూలి..

Published Fri, Apr 4 2025 10:27 AM | Last Updated on Fri, Apr 4 2025 12:20 PM

UP Bareilly Businessman Dance Collapsed With Heart Attack Video Viral

ప్రతీకాత్మక చిత్రం

ఆ జంట విజయవంతంగా పాతికేళ్లు వివాహ బంధం పూర్తి చేసుకుంది. కుటుంబ సభ్యుల సూచన మేరకు సిల్వర్‌ జూబ్లీ వేడుకలు నిర్వహించింది. బంధువులు, అతిథులంతా ఆ సంబురంలో భాగం అయ్యారు. కొందరు అమ్మాయిలు ఆ జంటతో  వేదిక మీద డ్యాన్సులు వేయించారు. అయితే అంతలోనే అనుకోని విషాదం ఆ వేదికను ఆవిరించింది. అచేతనంగా పడి ఉన్న భర్తను చూసి ఆ భార్య గుండెలు అవిసేలా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. 

లక్నో: వసీం సర్వత్‌(Wasim sarwat) ఉత్తర ప్రదేశ్‌ బరేలీ(Bareilly)లో షూ వ్యాపారి. 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. హ్యాపీగా స్టేజ్‌పై తన భార్య ఫరాతో కలిసి డ్యాన్స్‌ చేశాడు. అయితే, ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. దీంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. 

హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా లాభం లేకపోయింది. అప్పటికే ఆయన గుండెపోటు(Heart Attack)తో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  కళ్లెదుటే భర్త మరణంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. వసీం స్టేజ్‌పై కుప్పకూలి పడిపోయిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

హఠాన్మరణాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అప్పటిదాకా ఆరోగ్యంగా.. హుషారుగా కనిపించవాళ్లు ఉన్నట్లుండి కుప్పకూలి ప్రాణం విడుస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలని నిపుణులు సూచిస్తుండగా.. ఇలాంటి అత్యవసర సందర్భాల్లో సీపీఆర్‌లాంటి వాటిపై ప్రజలకు అవగాహన తప్పనిసరిగా ఉండాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పై వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేయొచ్చు. కేవలం వార్తను అథెంటిక్‌గా అందించే ఉద్దేశంలో భాగంగానే వీడియోను అందిస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement