లక్నో: ఇటీవలి కాలంలో గుండెపోటు కారణంగా చూస్తుండగానే అకస్మాత్తుగా ఎంతోమంది చనిపోయారు. ఉన్నట్టుండి కూర్చున్న, నిలుచున్న చోటే కుప్పకూలిన ఘటనలు ఎన్నో ఘటనలు సోషల్ మీడియాలో చనిపించాయి. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన వ్యక్తి ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఉన్నచోటే కుప్పకూలి మృతిచెందాడు.
వివరాల ప్రకారం.. యూపీలోని లఖింపుర్‌ఖేరీలో సినిమా చూసేందుకు వెళ్తున్న ఓ యువకుడు సినిమా హాలులో నడుస్తుండగానే కుప్పకూలిపోయాడు. కాగా, ఇటీవల విడుదలైన గదర్ -2 సినిమాను చూసుందుకు థియేటర్‌లోకి వస్తున్న 35 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. శనివారం రాత్రి 7.43 గంటల సమయంలో ఒక్కసారిగా ఫ్లోర్‌పై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు థియేటర్‌లో ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తిని అక్షత్ తివారీగా గుర్తించారు.
प्रदेश के लखीमपुर खीरी के एक मॉल में चलते–चलते एक युवक को हर्ट अटैक आ गया, युवक नीचे गिरा और मर गया।#lakhimpurkheri pic.twitter.com/jmQpfWvO9w
— Aviral Singh (@aviralsingh15) August 28, 2023
అయితే, తివారీ.. థియేటర్ వద్ద ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ సినిమా హాలు మెట్లు ఎక్కి పైకి వచ్చాడు. అనంతరం.. ఓ స్టాల్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అతడి ముందు ఇద్దరు యువకులు నడుస్తున్నట్టుగా సీపీ టీవీ వీడియోలో రికార్డు అయ్యింది. అతడు కుర్చీల వద్ద పడిపోవడాన్ని గమనించిన మరికొందరు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో వెంటనే తివారీని ఆసుపత్రికి తరలించారు. తివారీని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: విమానంలో అద్భుతం.. పసిబిడ్డ ప్రాణాలు కాపాడిన ఎయిమ్స్ డాక్టర్లు
Comments
Please login to add a commentAdd a comment