sudden death
-
వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయం
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా డ్యాన్సులు వేస్తున్నారు. అంతలో ఊహించిన ఘటన.. ఆ ఊరిలో తీవ్ర విషాదం నింపింది. హుషారుగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఆ ఊరి సర్పంచ్ భర్త ఊపిరి ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే.. ఈలోపు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో చక్కర్లు కొట్టగా.. విచారణలో అసలు విషయం బయటపడింది.పంజాబ్ జలంధర్ గోరయా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ ఊరి సర్పంచ్ భర్త పరమ్‌జిత్ సింగ్(49) ఓ వివాహ వేడుకలో హుషారుగా చిందులేస్తూ కుప్పకూలిపోయారు. గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించారు. అయితే సోషల్ సోషల్ మీడియాలో ఓ వైరల్ అయ్యింది.వివాహ వేడుకలో ఓ వ్యక్తి చిందులేస్తూ.. తుపాకీ పేల్చాడు. అయితే అది పక్కనే డ్యాన్స్ చేస్తున్న పరమ్జిత్కు తగిలింది. దీంతో ఆయన కిందపడిపోయారు. కిందపడిన పరమ్‌జిత్.. తుపాకీతో కాల్చిన వ్యక్తిని మందలించారు కూడా. అయితే ఆ వెంటనే ఆయన అలాగే స్పృహ కోల్పోయారు. వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. బుల్లెట్ గాయంతోనే పరమ్‌జిత్ మరణించాడని, విషయం బయటకు రాకుండా బాధిత కుటుంబం పెద్దల సమక్షంలో డబ్బు తీసుకుందని తేలింది. పిస్టల్ పేల్చిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్ సహా భారతదేశంలో ఇలాంటి వేడుకలలో బహిరంగంగా ఆయుధాల్ని ప్రదర్శించడం నిషిద్ధం. ఒకవేళ అది ఉల్లంఘిస్తే నేరం కిందకే వస్తుంది. जालंधर में एक शादी समारोह में की गई हवाई फायरिंग में एक युवक को गोली लग गई, जिससे उसकी मौत हो गई. जानकारी के मुताबिक मृतक गांव की मौजूदा सरपंच के पति हैं. घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है. #Jalandhar | #Firing pic.twitter.com/NovyLH21vK— Veer Arjun (@VeerArjunDainik) February 22, 2025 VIDEO Credits: VeerArjunDainik -
రోడ్డుపైనే కుప్పకూలిన టెన్త్ విద్యార్థిని
కామారెడ్డి: జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని కన్నుమూసింది. స్కూల్‌కు వెళ్తున్న క్రమంలో ఈ విషాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన విద్యార్థిని శ్రీనిధి(14). కామారెడ్డిలోని కల్కినగర్‌లో తన పెద్దనాన్న ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం ఇంటి నుంచి టిఫిన్ బాక్స్‌తో ఆమె బయల్దేరింది. కాలినడకన వస్తూ పాఠశాలకు సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పాఠశాల యాజమాన్యం అక్కడికి చేరుకొని విద్యార్థినిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్ చేసి రక్షించే ప్రయత్నం చేశారు. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడా సీపీఆర్ చేస్తూ వైద్య చికిత్స అందిస్తుండగానే.. ప్రాణాలు కోల్పోయింది. గుండెపోటుతోనే ఆమె కన్నుమూసిందని వైద్యులు ధృవీకరించారు. -
తెలంగాణ హైకోర్టులో విషాదం.. కేసు వాదిస్తూ కుప్పకూలిన లాయర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేసు వాదించే సమయంలో ఓ సీనియర్ న్యాయవాది కుప్పకూలిపోయారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆయన మరణించారు. మృతి చెందిన సీనియర్ లాయర్ పేరు వేణుగోపాల్ రావు. ఓ కేసు విషయంలో ఆయన మంగళవారం వాదనలు వినిపిస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. న్యాయవాది మృతికి సంతాపంగా హైకోర్టులోని అన్ని బెంచ్‌లో విచారణ నిలిపి వేసి.. రేపటికి వాయిదా వేశారు. -
గుర్రంపై ఊరేగుతూ ప్రాణాలొదిలిన పెళ్లికొడుకు
ష్యోపూర్(ఎంపీ): పెళ్లి సంబరాల్లో మునిగితేలుతున్న ఓ పెళ్లికొడుకు హఠాన్మరణం అక్కడి వారందరినీ హుతాశులను చేసింది. మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్ జిల్లాలో పెళ్లివేడుకలో ఈ విషాదం చోటుచేసుకుంది. పెళ్లి సందర్భంగా గుర్రంపై ఊరేగుతూ శుక్రవారం రాత్రి వరుడు విగతజీవిగా మారిన వైనం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూన్స్‌వాడా గ్రామానికి చెందిన 26 ఏళ్ల ప్రదీప్ జాట్ పెళ్లివేడుక శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా అక్కడి వేదికవైపు ప్రదీప్ పెళ్లికొడుకు దుస్తుల్లో గుర్రంపై బయల్దేరారు. ఇదే సమయంలో హఠాత్తుగా ముందుకు ఒరిగి అలాగే గుర్రంపై కూలబడిపోయారు. ఇది గమనించిన బంధువులు వెంటనే ప్రదీప్‌ను జాగ్రత్తగా కిందకు దింపి హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతని ప్రాణం పోయిందని జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్బీ గోయల్ ధృవీకరించారు. గుండెపోటు కారణంగా పెళ్లికొడుకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. పెళ్లికొడుకు ప్రదీప్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ)కి ష్యోపూర్ జిల్లా అధ్యక్షునిగా గతంలో పనిచేశారు. -
ఖమ్మం: క్రికెట్ ఆడుతూ కన్నుమూత
ఖమ్మం, సాక్షి: సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. హుటాహుటినా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. గుండె పోటుతో అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కూసుమంచి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయ్ అనే యువకుడు టోర్నమెంట్లో భాగంగా ఆడుతున్నాడు. ఉన్నపళంగా అతను ఒక్కసారిగా గ్రౌండ్లో కింద పడిపోవడంతో.. నిర్వాహకులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతని ప్రాణం పోయింది. పరీక్షించిన వైద్యులు గుండెపోటు కారణంగానే చనిపోయాడని నిర్ధారించారు. దీంతో.. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు విజయ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎవరీ సుచీర్ బాలాజీ? ఎలాన్ మస్క్ ఎందుకు అలా స్పందించారు?
ఓపెన్ఏఐ విజిల్‌బ్లోయర్ సుచీర్ బాలాజీ హఠాన్మరణం చెందాడు. భారత సంతతికి చెందిన ఈ 26 ఏళ్ల యువ రీసెర్చర్.. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు ధృవీకరించారు.ఏఐ రీసెర్చర్ అయిన బాలాజీ ఓపెన్ఏఐ కంపెనీ కోసం నాలుగేళ్లుగా(2020-2024) పని చేశాడు. అయితే ఈ ఏడాది ఆగష్టులో కంపెనీని వీడిన ఈ యువ రీసెర్చర్.. అక్టోబర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. నవంబర్ 26వ తేదీన బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్‌లో బాలాజీ మరణించాడని, అతనిది ఆత్మహత్యే అయి ఉండొచ్చని.. ఇప్పటివరకు జరిగిన విచారణలో మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు తాజాగా ప్రకటించారు. ఓపెన్ఏఐలో చేరడానికి ముందు.. సుచీర్ బాలాజీ బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. అతని తల్లిదండ్రులు, భారత మూలాల వివరాలు తెలియాల్సి ఉంది.ఎలాన్ మస్క్‌కు ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్‌మన్‌కు చాలాకాలంగా నడుస్తున్న వైరం గురించి తెలిసిందే. వాస్తవానికి.. ఓపెన్‌ఏఐను 2015లో మస్క్-అల్ట్మన్లే ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఓపెన్ఏఐకు పోటీగా X ఏఐను మస్క్ స్థాపించాడు. ఈ నేపథ్యంలో.. ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగి బాలాజీ మృతిపై ఎక్స్ వేదిక ఎలాన్ మస్క్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు hmm అంటూ బదులిచ్చారాయన. Hmm https://t.co/HsElym3uLV— Elon Musk (@elonmusk) December 14, 2024తాను ఓపెన్ఏఐని వీడడానికి గల కారణం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరంటూ.. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్ బాలాజీ షాకింగ్ కామెంట్లు చేశాడతను. డాటా కలెక్షన్ కోసం ఓపెన్ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందని.. దీనివల్ల వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని పేర్కొన్నాడతను. అలాగే ఛాట్జీపీటీలాంటి సాంకేతికతలు ఇంటర్నెట్ను నాశనం చేస్తున్నాయని, చాట్‌జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. మరోవైపు సుచీర్ బాలాజీ మరణం.. AI సాంకేతికత నైతిక, చట్టపరమైన చిక్కుల గురించి చర్చలకు ఇప్పుడు దారితీసింది.I recently participated in a NYT story about fair use and generative AI, and why I'm skeptical "fair use" would be a plausible defense for a lot of generative AI products. I also wrote a blog post (https://t.co/xhiVyCk2Vk) about the nitty-gritty details of fair use and why I…— Suchir Balaji (@suchirbalaji) October 23, 2024 -
పని ఒత్తిడితో కుర్చీలోనే కుప్పకూలిన ఉద్యోగి?
లక్నో: పని ఒత్తిడి మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. పూణే ఉద్యోగి ఘటన మరవక ముందే.. లక్నోలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తూ కుర్చీలోనే ప్రాణాలు వదిలింది ఓ బ్యాంకు ఉద్యోగిణి!. ఉత్తర ప్రదేశ్ గోమతినగర్‌లోని ఓ ప్రైవేట్‌బ్యాంకులో మంచి పొజిషన్లోనే సదాఫ్ ఫాతిమా పని చేస్తోంది. మంగళవారం (సెప్టెంబర్ 24) డ్యూటీకి హాజరైన ఆమె కుర్చీలోనే కూలబడింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అయితే.. అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా ఆమెకు ఈ మధ్యే ప్రమోషన్ వచ్చిందని.. అప్పటి నుంచి ఆమె తీవ్రమైన పని ఒత్తిడికి గురైందని ఆమె తోటి ఉద్యోగులు చెబుతున్నారు. అయితే.. ఈ ఆరోపణలపై సదరు బ్యాంకు స్పందించాల్సి ఉంది. ఈ ఘటనపై సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎక్స్ ద్వారా స్పందించారు. ఆర్థిక లక్ష్యాల సాధన ఒత్తిడే.. ఇలాంటి ఘటనలకు కారణమవుతోందని ఆరోపించారాయన. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఎకానమీ టార్గెట్లను సీరియస్‌గా తీసుకుంటున్నాయి. అది ఉద్యోగులపై పడుతోంది. అందుకే ఇలాంటి మరణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇది ముమ్మాటికీ ఆందోళన కలిగించే అంశం. దీనిని అడ్డుకట్ట పడాలంటే.. ఆరోగ్యకరమైన పని వాతావరణం కలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన పేర్కొన్నారు.लखनऊ में काम के दबाव और तनाव के कारण एचडीएफ़सी की एक महिलाकर्मी की ऑफिस में ही, कुर्सी से गिरकर, मृत्यु का समाचार बेहद चिंतनीय है।ऐसे समाचार देश में वर्तमान अर्थव्यवस्था के दबाव के प्रतीक हैं। इस संदर्भ में सभी कंपनियों और सरकारी विभागों तक को गंभीरता से सोचना होगा। ये देश के… pic.twitter.com/Xj49E01MSs— Akhilesh Yadav (@yadavakhilesh) September 24, 2024 పని ఒత్తిడి కారణంగానే కేరళ కొచ్చికి చెందిన యువ సీఏ అన్నా సెబాస్టియన్ పెరియాళి కన్నుమూసిందన్న వార్త.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జులైలో పుణెలోని సంస్థ కార్యాలయంలో తన విధుల్లో ఉండగా.. అస్వస్థతకు గురవడంతో తోటి ఉద్యోగులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కాసేపటికే మరణించారు. అయితే పని ఒత్తిడే ఆమె మరణానికి కారణమంటూ కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు అన్నా సెబాస్టియన్ తల్లి అనితా తాజాగా ఈవై ఇండియా హెడ్‌కు లేఖ రాయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి.. పని ఒత్తిడి అంశం అటు ఉద్యోగ వర్గాల్లోనూ.. ఇటు దేశ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు కేంద్ర కార్మికశాఖ ఈ అంశంపై విచారణకు ఆదేశించగా.. మానవ హక్కుల కమిషన్ సైతం ఈ అంశంలో జోక్యం చేసుకుంది. -
Michaela DePrince: నృత్యం కాదు ‘యుద్ధమే’ చేసింది
‘మేము షాక్‌లో ఉన్నాం’ అంటూ మైఖేలా డిప్రిన్స్ ఆకస్మిక మరణంపై స్పందించారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే 29 ఏళ్ల ‘బ్యాలే ఐకాన్’ మైఖేలా డిప్రిన్స్ మరణం ఆమె కుటుంబ సభ్యులను మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్న వయసులోనే బ్యాలే ప్రపంచంలో పెద్ద పేరు తెచ్చుకున్న మైఖేలా డిప్రిన్స్ తన కీర్తి దగ్గరే ఆగిపోలేదు. ఆఫ్రికాలోని తన మూలాల్లోకి వెళ్లింది. యుద్ధ బాధిత పిల్లల కన్నీళ్లు తుడిచింది. వారికి ధైర్యాన్ని బహుమానంగా ఇచ్చి వెళ్లింది.దేశంలో ఎటు చూసినా అల్లర్లు. అంతులేని హింస. ఆ అంతర్యుద్ధకాలంలో మూడేళ్ల మాబింటి తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. బంధువులు ముఖం చాటేశారు. అనాథాశ్రమంలోనూ ఆ అమ్మాయి ఎన్నో కష్టాలు పడింది. చర్మ సమస్యలతో బాధ పడుతున్న మాబింటిని తోటి వాళ్లు ‘దెయ్యం పిల్ల’ అని వెక్కిరించేవాళ్లు. ఒక అమెరికన్ కుటుంబం మాబింటి బంగురాను దత్తత తీసుకోవడంతో ఆమె పేరు మైఖేలా డిప్రిన్స్గా మారింది. కష్టాలకు ‘శుభం’ కార్డు పడినట్లు అనిపించినా అది తాత్కాలికమే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు ఎదురొచ్చేవి.ఐదవ ఏట బ్యాలేలో శిక్షణ తీసుకోవడం మొదలు పెట్టింది డిప్రిన్స్. రాక్ స్కూల్ ఫర్ డ్యాన్స్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ అయిన డిప్రిన్స్ ప్రతిష్ఠాత్మకమైన అమెరికన్ బ్యాలే థియేటర్లో చదవడానికి ఎంపికైంది. కెరీర్ ప్రారంభంలోనే ‘బోస్టన్ బ్యాలే’లాంటి ప్రసిద్ధ కంపెనీలతో కలిసి పనిచేసింది.కొద్దికాలంలోనే ‘బ్యాలే’ లో ప్రపంచస్థాయి గుర్తింపు పోందింది. హైస్కూల్ చదువు పూర్తయిన తరువాత ప్రసిద్ధ హార్లెం డాన్స్ థియేటర్లో అది పిన్న వయస్కురాలు అయిన మెయిన్ డ్యాన్సర్‌గా డిప్రిన్స్ చరిత్ర సృష్టించింది. వృత్తి విజయాల మాట ఎలా ఉన్నా మరోవైపు... జాత్యహంకార కామెంట్స్ డిప్రిన్స్కు తరచుగా ఎదురయ్యేవి. అయితే తనని ఎవరైనా కించపరిచేలా కామెంట్ చేస్తే గట్టిగా సమాధానం చెప్పేది. తన జాతి జనుల గురించి, వారి సంస్కృతి గురించి గొప్పగా మాట్లాడేది.‘బ్యాలే’కు ఎంత ప్రాధాన్యత ఇచ్చేదో మానవత్వానికి అద్దం పట్టే కార్యక్రమాలకూ అంతే ప్రాధాన్యత ఇచ్చేది. తాను పుట్టి పెరిగిన ఆఫ్రికాలోని సియోర లియోన్ దేశంలో పేద పిల్లల కోసం డ్యాన్స్ స్కూల్ స్థాపించింది.‘మార్పు తెచ్చే శక్తి కళకు ఉంది. నా విషయానికి వస్తే నృత్యం అనేది ఇతరులతో నా భావోద్వేగాలను పంచుకోవడానికి ఉపకరణంలా పనికి వచ్చింది’ అనేది డిప్రిన్స్.‘వార్ చైల్డ్ నెదర్ల్యాండ్స్’ అంబాసిడర్‌గా పనిచేసిన డిప్రిన్స్ ‘డేర్ టు డ్రీమ్’ సంస్థ ద్వారా యుద్ధబాధిత పిల్లల మానసిక ఆరోగ్యం కోసం కృషి చేసింది. సేవారంగంలో డిప్రిన్స్ కృషిపై ‘ఫస్ట్ పోజిషన్’ అనే డాక్యుమెంటరీ వచ్చింది. డిప్రిన్స్ ఎదుర్కొన్న కష్టాలకు ఆమె రాసిన ‘టేకింగ్ ఫ్లైట్: ఫ్రమ్ వార్ ఆర్ఫన్ టు స్టార్ బ్యాలెరీన’ పుస్తకం అద్దం పడుతుంది.తాము పని చేస్తున్న రంగంలో పెద్ద పేరు రాగానే చాలామంది కళ్లు ఆకాశానికేసి మాత్రమే చూస్తాయి. కాని మైఖేలా డిప్రిన్స్ విషయంలో అలా జరగలేదు. ఆమె నేల కేసి చూడడమే కాదు, తాను నడిచి వచ్చిన దారిని బాగా గుర్తు పెట్టుకుంది.అందుకే ‘బ్యాలే ఐకాన్’గా కంటే ‘మానవతావాది’ ‘ఆత్మాభిమానం మూర్తీభవించిన సాహసి’గా మైఖేలా డిప్రిన్స్ను గుర్తు తెచ్చుకోవడానికి అభిమానులు ఇష్టపడతారు.కూతురిని వెదుక్కుంటూ వెళ్లిందితన కుమార్తె మైఖేలా డిప్రిన్స్ మరణించిన 24 గంటల్లోనే ఆమె తల్లి ఎలైన్ డిప్రిన్స్ కన్నుమూసింది. ఆస్పత్రిలో సర్జరీకి సన్నద్ధమవుతున్న సమయంలో ఎలైన్‌కు కుమార్తె మరణం గురించి తెలియదు. డిప్రిన్స్ను దత్తపుత్రిక అని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. సొంతబిడ్డలాగే చూసుకుంది. బ్యాలేపై డిప్రిన్స్ ఆసక్తిని గమనించి శిక్షణ ఇప్పించింది. ఎలైన్, చార్లెస్ దంపతులకు 11 మంది పిల్లలు. వీరిలో తొమ్మిదిమంది దత్తత తీసుకున్న పిల్లలే. -
డ్యాన్స్ చేస్తుండగా ఆగిన కానిస్టేబుల్ గుండె
గుండె ఆగిపోయి.. హఠాత్తుగా చనిపోతున్న ఘటనలు తరచూ చూస్తున్నదే. అయితే అలాంటి మరణాల వెనుక.. వైద్యపరంగా ఆరోగ్య సమస్యలూ ఉండొచ్చనే అభిప్రాయమూ నిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది. తాజాగా ఢిల్లీలో ఓ యువ పోలీస్ కానిస్టేబుల్ డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. ఢిల్లీ రూప్‌నగర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవికుమార్.. స్టేషన్ హౌస్ అధికారి (ఎస్‌హెచ్‌వో) బదిలీ కావడంతో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా రవికుమార్ పలు పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో ఆయనకు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో.. అతడి సహచరులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. రవికుమార్ చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో అప్పటివరకు తమతో సరదాగా ఉన్న కానిస్టేబుల్ మృతిచెందడంతో ఆయన మిత్రులు షాక్‌కు గురయ్యారు. హెడ్ కానిస్టేబుల్ డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన రవికుమార్ 2010లో ఢిల్లీ పోలీస్ విభాగంలో చేరాడు. అతడి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 45 రోజుల క్రితమే రవికుమార్ యాంజియోగ్రఫీ పరీక్ష చేయించుకున్నట్లు తెలుస్తోంది. Delhi Police Head Constable Dies of Heart Attack During Farewell PartyDelhi Police Head Constable Ravi Kumar, posted at Roop Nagar police station in North District, died of a heart attack on Wednesday evening. Kumar was attending a farewell party at the police station when he… pic.twitter.com/rfXSKGdcpa— Atulkrishan (@iAtulKrishan1) August 29, 2024 -
కోస్ట్ గార్డ్ డీజీ హఠాన్మరణం
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: భారత తీర రక్షక దళం(ఐసీజీ) డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ హఠాన్మరణం చెందారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన ఐసీజీ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండెపోటుకు గురైన రాకేశ్ పాల్‌ను వెంటనే చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. రాత్రి 7 గంటల సమయంలో ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారని అధికార వర్గాలు తెలిపాయి. చెన్నైలోనే ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆస్పత్రికి వెళ్లి రాకేశ్ పాల్‌కు నివాళులర్పించారు. రాకేశ్ పాల్ పారి్థవ దేహాన్ని ప్రత్యేక ఏర్పాట్లతో చెన్నై నుంచి అర్ధరాత్రి వేళ ఢిల్లీకి తరలించారు. రాకేశ్ పాల్ గతేడాది జూలై 19వ తేదీన ఐసీజీ 25వ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ నావల్ ఎకాడమీ విద్యార్థి అయిన రాకేశ్ పాల్ 1989లో ఐసీజీ (ఇండియన్ కోస్ట్ గార్డ్)లో చేరి 34 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. -
జన్యుమార్పిడి పంది కిడ్నీ గ్రహీత ఆకస్మిక మృతి
బోస్టన్: ప్రపంచంలో తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చుకున్న వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందారు. అమెరికాలోని వేమౌత్ పట్టణంలో నివసించే 62 ఏళ్ల రిచర్డ్ ‘రిక్’ స్లేమాన్‌కు మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో మార్చి నెలలో వైద్యులు విజయవంతంగా కిడ్నీని అమర్చారు. అది కనీసం రెండు సంవత్సరాలపాటు ఎలాంటి సమస్యల్లేకుండా పనిచేస్తుందని వైద్యులు ఆనాడు తెలిపారు. అయితే శనివారం ఆయన హఠాన్మరణం చెందారని వైద్యులు వెల్లడించారు. ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ వల్లే ఆయన మృతిచెందినట్లు ఎలాంటి ఆధారాలు ఇంకా లభ్యంకాలేదని వైద్యులు స్పష్టంచేశారు. సొంత కిడ్నీ పాడవడంతో 2018 డిసెంబర్లోనే స్లేమాన్‌కు మరో మనిషి కిడ్నీ అమర్చారు. అయితే ఐదేళ్ల తర్వాత అది నెమ్మదిగా పాడవుతూ వచి్చంది. దీంతో గత ఏడాది నుంచి మళ్లీ డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో వైద్యులు ఈసారి మరో ప్రత్యామ్నాయంలేక జన్యుమారి్పడి పంది కిడ్నీ అమర్చేందుకు ఆయనను ఒప్పించి రెండు నెలల క్రితం అమర్చారు. -
పసిపిల్లలను నిద్రలోనే బలితీసుకుంటున్న ఎస్‌యూడీసీ!
అడుతూ పాడుతూ తిరుగుతున్న బిడ్డ ఉన్నట్టుండి కుప్పకూలిపోతే.. గాయం, వ్యాధి, ఆరోగ్య సమస్యలేవీ లేకున్నా కళ్లు మూస్తే? ఆ విషాదాన్ని వర్ణించడం కష్టం. తల్లిదండ్రులు ఎవరైనా ఆ నష్టాన్ని దిగమింగుకోలేరు కూడా. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇలాంటి ఘటనలు కొన్ని చోటు చేసుకుంటూండటం. సౌత్ ఇంగ్లాండ్‌లోని బాన్‌బరీలో ఇటీవలే 13 ఏళ్ల బాలుడు ఒకరు ఇలా ఆకస్మికంగా కుప్పకూలిపోయాడు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఎందుకిలా జరుగుతుంది? కారణాలేమిటి? నివారించే అవకాశం ఏదైనా ఉందా? ఊహూ... ప్రస్తుతానికి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నో అనే చెప్పాలి. సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్ ఇన్ ఛైల్డ్‌హుడ్ (ఎస్‌యూడీసీ) అని పిలుస్తారు దీన్ని. పుట్టిన బిడ్డ మొదలుకొని 18 ఏళ్ల వయసు వారి వరకూ ఎవరికైనా ఎదురు కావచ్చు ఇలాంటి దుర్మరణం. బాన్‌బరీలో జరిగిన ఘటననే ఉదాహరణగా తీసుకుంటే...13 ఏళ్ల మాథ్యూ కౌలీ ముందురోజు రాత్రి... స్నేహితులతో వీడియో గేమ్ ఆడుకుని హాయిగా నిద్రపోయాడు. అలాగే శాశ్వతనిద్రలోకి జారుకున్నాడు. ఈ ఆకస్మిక మరణం అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. వైద్య పరీక్షల్లో, పోస్ట్‌మార్టంలోనూ మరణానికి కారణమేమిటన్నది స్పష్టం కాలేదు. ఎస్‌యూడీసీ అంటే... వైద్యుల అభిప్రాయం ప్రకారం, సడన్ అన్ ఎక్స్ప్లెయిన్డ్ డెత్ ఇన్ చైల్డ్ హుడ్ (SUDC) అంటారు. అకారణంగా ఆరోగ్యకరమైన పిల్లవాడు ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడం. 2021 నాటి లెక్కల ప్రకారం ఒక్క అమెరికాలోనే దాదాపు 450 మంది ఎస్‌యూడీసీ బారిన పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగానూ ఏటా 40 - 50 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. న్యూయార్క్ యూనివర్శిటీ గ్రాస్మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లోని వైద్యులు రిచర్డ్ ట్సీన్, ఓరిన్ డెవిన్స్కీ నేతృత్వంలో ఎస్యూడీసీకి కారణాలు తెలుసుకునేందుకు ఒక పరిశోధన జరిగింది కానీ ఫలితాలు మాత్రం అంత ఆశాజనకంగా ఏమీ లేవు. సుమారు 124 మంది ఎస్‌యూడీసీ బాధితుల శరీరాల నుంచి వారి తల్లిదండ్రుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో అనూహ్యంగా జరిగిన జన్యుపరమైన మార్పులు (ఉత్పరివర్తనాలు ఇంగ్లీషులో మ్యూటేషన్స్)లను గుర్తించారు. బాధితుల డీఎన్ఏలోని జన్యుపరమైన మార్పులు తల్లిదండ్రుల నుంచి సంక్రమించినవి కాకపోవడం గమనార్హం. ఇలా తల్లిదండ్రుల నుంచి కాకుండా స్వతంత్రంగా జరిగే జన్యుమార్పులను డీనోవో ఉత్పరివర్తనాలని పిలుస్తారు. డీనోవో ఉత్పరివర్తనాల విషయం ఇలా ఉంటే తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జన్యు ఉత్పరివర్తనాల్లో 80 శాతం పిల్లలకూ సంక్రమించాయి. మొత్తం జన్యుమార్పుల్లో 11 ఉత్పరివర్తనాలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ మార్పులు వందలో తొమ్మిది మంది మరణానికి కారణం కావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాల్షియం సిగ్నలింగ్‌లో మార్పు SUDCలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని జన్యుపరమైన ప్రమాద కారకాలను పెంచుతుందని పరిశోధనల ఫలితాలు సూచిస్తున్నాయి. -
ఆయన మరణం పుతిన్ నాశనానికే: బైడెన్ ఫైర్
ఆయన చనిపోవడం నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. నావల్నీ(అలెక్సీ నావల్నీ) చావుకి పుతిన్‌దే బాధ్యత, పుతిన్‌దే పూర్తి బాధ్యత.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు బైడెన్.. రష్యా ప్రతిపక్ష నేత, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నావల్నీ(47) హఠాన్మరణంపై యావత్ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. అర్కిటిక్ సర్కిల్లోని రష్యా పీనల్ కాలనీలో కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆయన.. ఉన్నట్లుండి కుప్పకూలి మరణించారని.. వైద్యులు ప్రయత్నించినా లాభం లేకపోయిందని అధికారిక వర్గాలు ప్రకటించాయి. అయితే.. అంతకు ముందు రోజు కూడా కోర్టు విచారణకు నవ్వుతూ హాజరైన నావల్నీ.. ఉన్నట్లుండి మరణించడంతో క్రెమ్లిన్ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలెక్సీ నావల్నీ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం వైట్‌హౌజ్‌లో ఆయన మాట్లాడుతూ.. నావల్నీ మరణం నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. ఆయనొక పోరాటయోధుడు. అవినీతి విషయంలో పుతిన్‌ను ఎదురించాడు. పుతిన్ ప్రభుత్వ పాల్పడుతున్న హింసకు ధైర్యంగా అడ్డుచెప్పాడు. నావల్నీ(అలెక్సీ నావల్నీ) చావుకి పుతిన్‌దే బాధ్యత.. ఇది పుతిన్ వినాశనానికి దారి తీయక తప్పదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. మరోవైపు నావల్నీ మృతిపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించే పనిలో ఉన్నట్లు వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి. #WATCH | On the death of jailed Russian opposition figure and Kremlin critic Alexey Navalny, US President Joe Biden says, "...Putin is responsible for Navalny's death. Putin is responsible..." (Video source: Reuters) pic.twitter.com/6xpoKvAnA4 — ANI (@ANI) February 17, 2024 ఇంకోవైపు మ్యూనిచ్ భద్రతా సదస్సులో పాల్గొన్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. అలెక్సీ నావల్నీ భార్య యూలియాని కలిసి ఓదార్చారు. ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ యూలియా కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నా భర్త మృతి నిజమే అయితే అందుకు పుతిన్, ఆయన అనుచర గణమే బాధ్యులు. ఎప్పటికైనా వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు’’ అని యూలియా అన్నారు. అతి(తీవ్ర)వాదం అభియోగాలపై కిందటి ఏడాది ఆగస్టులో అలెక్సీ నావల్నీకి 19 ఏళ్ల జైలుశిక్ష పడింది. ‘‘నా ప్రాణం ఉన్నంతవరకు లేదా ఈ (పుతిన్) ప్రభుత్వం ఉన్నంత కాలం నేను జైల్లోనే ఉంటానన్న సంగతి నాకు తెలుసు’’ అని నాటి తీర్పు సమయంలో నావల్నీ వ్యాఖ్యానించారు. రెండు నెలల కిందటే ఆయన్ని.. అర్కిటిక్ సర్కిల్లోని రష్యా పీనల్ కాలనీకి తరలించారు. ఇదీ చదవండి: నిరసన గళం మూగబోయింది పుతిన్ హేట్స్ నావల్నీ రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ విధానాలను వ్యతిరేకిస్తూ నావల్నీ అనేక నిరసనలు చేపట్టారు. అందుకుగాను పలుమార్లు అరెస్టయ్యారు. గత అధ్యక్ష ఎన్నికల్లో నావల్నీ పోటీ చేశారు. వ్లాదిమిర్ పుతిన్‌కు ఆయనంటే తీవ్ర కోపం. నావల్నీ పేరును పలికేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. నావల్నీకి మరింత ఎక్కువ పేరు రావొద్దనే ఆయన పేరును పుతిన్ పలికేవారు కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఎప్పుడైనా ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే.. ఆ వ్యక్తి అని మాత్రమే సంబోధించేవారు. ఆది నుంచీ ధిక్కార స్వరమే! ప్రభుత్వ అధికారుల అవినీతిపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. పుతిన్ సర్కారు పాలనా విధానాల్లో లోపాలను తీవ్రంగా ఎండగట్టారు. ఈ క్రమంలో తన ప్రాణాలకు ముప్పు ఎదురైనా లెక్కచేయలేదు. నాయకులు/అధికారుల అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు జరిపి అనేక కీలక వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వరంగ టీవీ ఛానళ్లలో నావల్నీకి ఏమాత్రం ప్రచారం లభించేది కాదు. అయితే యూట్యూబ్ వీడియోలు, సామాజిక మాధ్యమ ఖాతాలతో ఆయన జనానికి బాగా దగ్గరయ్యారు. -
విషాదం: రామజపంతో కుప్పకూలిన ‘హనుమాన్’
Sudden Death Video: అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట నేపథ్యంలో.. సోమవారం దేశమంతా భక్తిపారవశ్యంతో ఊగిపోయింది. పల్లెపట్టణం తేడా లేకుండా రామ మందిర వేడుకల్ని ఘనంగా చేసుకున్నాయి. దేశం నలుమూలల ఒక పండుగ వాతావరణం కనిపించింది. ఆలయాల్లో బయటా.. అన్నదానాలు.. బాణాసంచా కాల్చి సంబురాలు.. రథయాత్రలు.. ఊరేగింపులు.. రామాయణ ఘట్టాల్ని నాటక రూపంలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో హర్యానా భివానీలో నిర్వహించిన ‘రామ్‌లీలా’లో విషాదం చోటుచేసుకుంది. హనుమంతుడి వేషధారణలో ఉన్న నటుడు రామ నామం జపిస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే ఆయన నటిస్తున్నారేమో అనుకుని అంతా చప్పట్లు కొట్టగా.. రాముడి వేషధారణలో ఉన్న నటుడు దగ్గరగా వెళ్లి చూసేసరికి చలనం లేకుండా పడి ఉన్నాడు. హుటాహుటిన అలాగే ఆయన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. भिवानी में घटी दुखद घटना, श्री राम मूर्ति प्राण प्रतिष्ठा के उपलक्ष्य में हनुमान बने कलाकार ने त्यागे प्राण,भगवान राम की झांकी के दौरान श्री राम के चरणों में त्यागे प्राण।डॉक्टरों के मुताबिक कलाकार को हार्ट अटैक आने से हुई मौत। #RamMandirPranPrathistha #Haryana #bhiwani… pic.twitter.com/uBRwsRcT50 — Haryana Tak (@haryana_tak) January 23, 2024 Video Credits: Haryana Tak మృతుడి పేరును హరీష్ మెహతా. విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పని చేసిన ఆయన పదవీ విరమణ పొందారు. గత పాతికేళ్లుగా ఆయన హనుమంతుడి వేషధారణతో అలరిస్తూ వస్తున్నారు. సోమవారం ఒకవైపు అయోధ్య ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమమయంలో భివానీ జవహార్ చౌక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. -
టీకాతో అకాల మరణాల ముప్పుపై.. వెలుగులోకి కీలకాంశాలు
ఢిల్లీ: కరోనా వాక్సినేషన్ యువకుల్లో అకాల మరణాలను పెంచబోదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. కనీసం టీకా ఒక్క డోసు తీసుకున్నా.. అకాల మరణాలు సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. కరోనా టీకా తీసుకున్నవారిలో అకాల మరణాల ముప్పుకు సంబంధించి ఐసీఎమ్ఆర్ చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టీకాతో అకాల మరణాలు ముప్పు అంశంపై ఐసీఎమ్ఆర్ అక్టోబరు 1, 2021 నుండి మార్చి 31, 2023 మధ్య అధ్యయనాన్ని చేపట్టింది. ఈ పరిశోధనలో దేశవ్యాప్తంగా 47 ఆసుపత్రుల్లో రోగులను పరిశీలించారు. ముఖ్యంగా 18-45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులపై దృష్టి సారించారు. వారిలో ఎలాంటి ఆనారోగ్య లక్షణాలు కనిపించలేదని అధ్యయనంలో వెల్లడైంది. ఈ విశ్లేషణలో 729 కేసులను పరిశీలించారు. టీకా రెండు డోసులను తీసుకున్నవారికి అకాల మరణం సంభవించే ప్రమాదం చాలా తక్కువ అని అధ్యయనం స్పష్టం చేసింది. అయినప్పటికీ.. అకాల మరణ ప్రమాదాన్ని పెంచే అనేక అంశాలను అధ్యయనం గుర్తించింది. వీటిలో కోవిడ్-19 కారణంగా ఆస్పత్రిలో చేరిన రోగుల ఆరోగ్య చరిత్ర, ఆకస్మిక మరణానికి సంబంధించిన వ్యక్తి కుటుంబ ఆరోగ్య చరిత్ర ప్రభావితం చూపుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మరణానికి ముందు 48 గంటలలోపు అతిగా మద్యం సేవించడం, డ్రగ్స్ వంటి పదార్ధాల వినియోగం, తీవ్రమైన శారీరక శ్రమలో పాల్గొనడం వంటివి అకాల మరణ ప్రమాదాన్ని పెంచుతున్నాయని గుర్తించారు. ఇదీ చదవండి: IndiGo Flight Viral Incident: ప్రయాణీకులు ఆరుగురే అని... దించేసి పోయారు! -
హైదరాబాద్: షటిల్ ఆడుతూ కుప్పకూలి మృతి
హైదరాబాద్: వయసు తేడాలు లేకుండా.. హఠానర్మణాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ మరణాలు ప్రజల్లో భయాందోళన కల్గిస్తున్నాయి. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న వాళ్లు.. కార్డియాక్ అరెస్ట్ లేదంటే గుండెపోటుతోనో కుప్పకూలి కన్నుమూస్తున్నారు. తాజాగా.. నగరంలోనూ అలాంటి మరణం ఒకటి సంభవించింది. షటిల్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందాడు ఓ వ్యక్తి. బుధవారం ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్ ఎండోమెంట్ కాలనీలో షెటిల్ ఆడుతూ కృష్ణారెడ్డి (46)గా గుండెపోటుతో కుప్పకూలాడు. స్నేహితులు, స్థానికులు ఆయన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్దారించారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: పిల్లలు లేరనే ఆవేదనతో.. -
కరీంనగర్: సంబురంగా చిందులేస్తూ కుప్పకూలి..
సాక్షి, కరీంనగర్: వయసుతో సంబంధం లేకుండా హఠాన్మరణాలు సంభవిస్తున్న రోజులవి. పైగా గుండె సంబంధిత సమస్యలే అందుకు కారణం అవుతుండడం మరీ ఘోరం. తాజాగా జిల్లాలోనూ ఓ స్కూల్ స్టూడెంట్ గుండె ఆగి కన్నుమూసింది. అదీ సంబురంగా చిందులేస్తున్న సమయంలోనే.. గంగాధర మండలంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఫ్రెషర్స్ డే ఈవెంట్ జరిగింది. ఆ హుషారులో డాన్స్ చేస్తూ కుప్పకూలింది ఓ విద్యార్థి. ఊపిరి తీసుకోవడంలో అవస్థలు పడింది. దీంతో ఆమెకు సీపీఆర్ చేసి మరీ ఆస్పత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. అయితే మార్గం మధ్యలోనే ఆమె కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. మృతురాలిని వెంకటాయపల్లికి చెందిన ప్రదీప్తిగా గుర్తించారు.అయితే ఆమెకు గుండెలో రంధ్రం ఉందని వైద్యులు చెప్పడంతో అంతా షాక్ తిన్నారు. ప్రదీప్తి మరణంతో ఆమె సొంతూరు వెంకటాయపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: లవర్‌ను రప్పించి మరీ యువతి ఘాతుకం -
పెప్పర్ఫ్రై సీఈవో అనూహ్య మరణం: లాస్ట్పోస్ట్, వీడియో వైరల్
Ambareesh Murty Instapost viral ఆన్లైన్ ఫర్నిచర్ సంస్థ పెప్పర్ఫ్రై సహ వ్యవస్థాపకుడు సీఈవో అంబరీష్ మూర్తి ఆకస్మిక మరణం తరువాత ఏ నిమిషానికి ఏం జరుగునో..ఈ మాటలు కచ్చితంగా గుర్తొస్తాయి ఎవరికైనా. లేహ్‌లో విహార యాత్రలో ఉండగా గుండెపోటుతో మూర్తి కన్నుమూయడం దిగ్ర్భాంతికిగురించి చేసింది. ఈసందర్బంగా ఆగస్టు 6న ఆయన ఇన్‌స్టాలో పోస్ట్ వీడియో వైరల్‌గా మారింది. మోటార్ సైకిల్ డైరీస్ (వై మీ :)?)" అని టైటిల్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. బైకర్, ట్రెక్కర్ మూర్తి మోటార్‌సైకిల్‌తో కొన్ని గేర్ సమస్యలను ఎదుర్కొన్న తర్వాత దేవుడు తనను "దేవదూత"గా అంగీకరించడానికి "తిరస్కరించాడు" అని ప్రకటించారు. లడఖ్ ట్రిప్‌లో "ప్రతి బైకర్‌కి స్వర్గం" అంటూ లడఖ్ రోడ్లను ప్రశంసించిన ఆయన ఈ ట్రిప్‌లో తనకెదురైన సమస్య గురించి మాట్లాడుతూ, "నాకు గేర్ ట్రబుల్స్ మొదలయ్యాయి. నేను నా బైక్ థర్డ్, ఫోర్త్, ఫిప్త్ ఐదవ గేర్లను యాక్సెస్ చేయలేకపోయాను. అందుకే ఒక గేర్‌పై, ఫస్ట్, అండ్ సెకండ్లోవెళ్లా. చివరికి ఐన్‌స్టీన్ ఏమి చేస్తాడో అదే చేసా..ఒక పెద్ద రాయిని తీసుకొని గేర్ పెడల్‌ను కొట్టాను,ఆ తర్వాత అంతా బాగానే ఉంది." అన్నారు. కానీ అంతలోనే అనంతలోకాలకు తరలిపోవడం ఆయన కుటుంబ సభ్యులు, అభిమానలను విషాదంలో ముంచేసింది. లేహ్ పర్యటనలో ఉన్న ఆయన గుండెపోటుతో మరణించినట్లు మరో సహ వ్యవస్థాపకుడు ఆశీష్ షా సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బైక్ రైడ్ అంటే ఎంతగానో ఇష్టపడే మూర్తి.. తరచుగా మోటార్‌సైకిల్‌పై ముంబై నుంచి లేహ్‌కు వెళ్లేవారు. మూర్తి మృతిపై స్పాటిఫై ఇండియా ఎండీ అమర్జిత్ బాత్రా, డ్రూమ్ వ్యవస్థాపకుడు సందీప్ అగర్వాల్, క్యాష్‌కరో కో-ఫౌండర్ స్వాతి భార్గవ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 1994లో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఇంజినీరింగ్ చదివిన మూర్తి ఐఐఎం కోల్‌కతాలో ఎంబీఏ చేశారు. ఆ తర్వాత క్యాడ్బరీస్, ఐసీఐసీఐ ఏఎంసీ (ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్), లివైస్, ఈబే ఇండియా తదితర సంస్థల్లో పని చేశారు. 2011లో ఆశీష్ షాతో కలిసి పెప్పర్‌ఫ్రైని ప్రారంభించారు. View this post on Instagram A post shared by Ambareesh Vedantam Murty (@ambareeshmurty) -
నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!
Bollywood Art Director Nitin Desai: ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ (57) అకాల మరణం అటు పలువురి ప్రముఖులను ఇటు నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. అనుమానాస్పద మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ. బుధవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఆయన మరణానికి సంబంధించి కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.252 కోట్ల అప్పులున్నాయని, ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే ఊహాగానాలు విని పిస్తున్నాయి. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా, కర్జాత్‌లోని ఎన్డీ స్టూడియోలోని అతని గదిలో నితిన్ దేశాయ్ మృతదేహం లభ్యమైంది. క్లీనింగ్ సిబ్బంది గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా.. ఈ విషయాన్ని గమనించారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత కర్జాత్, ఖలాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు సూపరింటెండెంట్ సోమనాథ్ ఘర్గే స్పష్టం చేశారు. నివేదికల ప్రకారం నితిన్ దేశాయ్ కొన్ని ఆర్థిక సంస్థల నుండి ఫిక్స్డ్ టర్మ్ లోన్ తీసుకున్నాడు.అదే అతని జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టి వేసి, చివరికి మరణానికి దారి తీసింది. రూ. 180 కోట్ల రుణం వడ్డీతో కలిపి రూ.252 కోట్లకు చేరింది. దీనికి సంబంధించి సదరుసంస్థ ఎన్డీ స్టూడియోసీజ్కు సిద్ధమౌతోంది. కలీనాకు చెందిన ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ రాయగడ కలెక్టరేట్‌కు దరఖాస్తు చేసింది. కానీ జప్తు చర్యలకు కలెక్టర్ కార్యాలయం తుది అనుమతి ఇవ్వలేదు. ఎన్డి స్టూడియో సీజ్‌కు సంబంధించిన దరఖాస్తు తన కార్యాలయానికి అందిందని రాయగడ రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్ సందేశ్ షిర్కే ధృవీకరించారు. కానీ జూలై 25న, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరించింది. మార్చి 31, 2021న ఖాతాని నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (NPA)గా వర్గీకరించారని, జూన్ 30, 2022 నాటికి మొత్తం డిఫాల్ట్ మొత్తం రూ.252.48 కోట్లుగా తేలింది. (ఒప్పో కొత్త ఫోన్, ప్రారంభ ఆఫర్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?) నితిన్ దేశాయ్ వల్ల సీఎఫ్ఎం అనే ఆర్థిక సంస్థ నుంచి రూ.180 కోట్ల రుణం తీసుకున్నారు. 2 సంవత్సరాల 2016, 2018లో ఒప్పందం ప్రకారం దీని కోసం దేశాయ్ 40 ఎకరాల భూమి,ఇంకా 3 వేర్వేరు ఆస్తులను తనఖా పెట్టాడు. అనుకోని కారణాల వల్ల 2020నుంచి రుణం తిరిగి చెల్లించలేకపోయాడు. కొంత సమయం తర్వాత CFM తన రుణ ఖాతాలన్నింటినీ ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి కేటాయించింది. అయితే అప్పుడు కూడా రుణం రికవరీ కాలేదు. దీంతో దీంతో దేశాయ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ విషయమై కొద్దిరోజుల క్రితం ఖలాపూర్ ఎమ్మెల్యే మహేష్ బల్దితో కూడా చర్చించినట్టు సమాచారం. VIDEO | "He was a good friend of mine. I met him 10-15 days ago, but didn't feel that he was in any kind of tension," says Shiv Sena (UBT) leader Baban Dada Patil on film art director Nitin Desai's suicide. pic.twitter.com/uBBG8Q0cSX — Press Trust of India (@PTI_News) August 2, 2023 #WATCH | Maharashtra: Forensic team arrived at ND Studios in Karjat, Raigad district, where the body of art director Nitin Desai was found hanging. pic.twitter.com/lEgENNCRjy — ANI (@ANI) August 2, 2023 ఎమ్మెల్యే మహేష్ బల్ది ఏమన్నారు? ఆర్థిక ఇబ్బందుల వల్లే నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు కర్జాత్ ఎమ్మెల్యే మహేశ్ బల్ది తెలిపారు. ఆయన మాట్లాడుతూ- నితిన్ దేశాయ్ తన నియోజకవర్గానికి నిత్యం వచ్చేవారు. గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఉదయం ఎన్డీ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని వ్యాఖ్యానించారు. (రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా? ) నితిన్ కుడిభుజం కాకా ఎన్డీ స్టూడియోస్‌ను నడిపిన నితిన్ కుడిచేతిగా భావించే కాకా కూడా ఆర్థిక ఇబ్బందులగురించి మాట్లాడారు. కానీ ఇంత కఠిన నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరులకు ప్రేరణగా నిలిచేవ్యక్తి ఆయన. కొన్ని ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి.ఇంతలోనే ఇలా జరగడం విషాదకరమన్నారు. నితిన్ దేశాయ్ మరణంతో అక్షయ్ కుమార్, మేకర్స్ అప్‌కమింగ్ మూవీ OMG 2 ఆన్లైన్ ట్రైలర్ లాంచ్‌ను వాయిదా వేశారు. (Today August 2nd gold price గుడ్ న్యూస్: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు) Unbelievably sad to know about the demise of Nitin Desai. He was a stalwart in production design and such a big part of our cinema fraternity. He worked on so many of my films… this is a huge loss. Out of respect, we are not releasing the OMG 2 trailer today. Will launch it… — Akshay Kumar (@akshaykumar) August 2, 2023 నాలుగు జాతీయ అవార్డులు, అద్భుతమైన సినిమాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్ , దేవదాస్ మూవీలకు నాలుగు సార్లు జాతీయ అవార్డులను సాధించిన నితిన్ జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడంపై పలువురు నటులు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్లను కూడా రూపొందించిన ఘనత ఆయన సొంతం. లగాన్, జోధా అక్బర్, మున్నాభాయ్ M.B.B.S., లగే రహో మున్నా భాయ్ అతను పనిచేసిన కొన్ని ప్రముఖ బాలీవుడ్ సినిమాలు . Shocking news this morning - Art Director Nitin Desai is no more. Such a warm human being, associated with many of my projects and ballets, his passing is a terrible loss to the film industry. May he find peace wherever he is🙏 pic.twitter.com/STNsz6Kwr8 — Hema Malini (@dreamgirlhema) August 2, 2023 -
తెలంగాణ కళాకారుడు సాయిచంద్ హఠాన్మరణం
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ పాట ఊపిరి వదిలింది. తెలంగాణ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్(39) హఠాన్మరణం చెందారు. గత అర్ధరాత్రి గుండెపోటుకి గురైన ఆయన్ని ఆస్పత్రులకు తరలించగా.. చివరకు ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని కారుకొండ ఫామ్‌హౌజ్‌కు నిన్న ఆయన తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. అయితే.. అర్ధరాత్రి ఆయన అస్వస్థతకు గురికాగా.. స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి విషమించడంతో.. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అప్పటికే ఆలస్యం అయ్యిందని.. సాయిచంద్ మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. వనపర్తి జిల్లా అమరచింత సాయిచంద్ స్వస్థలం. విద్యార్థి దశ నుంచే గాయకుడిగా మంచి పేరుంది ఆయనకు. ఉద్యమ సమయంలో తన పాటలతో స్ఫూర్తిని రగిల్చారు ఆయన. జానపద పాటలతో సాగే పలు టీవీషోలలోనూ ఆయన సందడి చేశారు. ఉద్యమ కళాకారుడి గుర్తింపు పొందిన సాయిచంద్‌ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ పదవితో గౌరవించింది తెలంగాణ సర్కార్. తాజాగా అమరవీరుల జ్యోతి ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఆయన కనిపించారు. చిన్నవయసులోనే సాయిచంద్ హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ పలువురు కళాకారులు, ఉద్యమకారులు, నేతలు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. గతంలో ఆయనకు గుండెపోటు ఏమీ రాలేదని.. అనారోగ్య సమస్యలేవీ లేదని.. అర్ధరాత్రి భోజనం దాకా కూడా బాగానే ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కు రాజకీయ గురువు ఈయనే! -
వివాహితతో చనువుగా... యువకుడు మృతి
నరసన్నపేట: మడపాం పంచాయతీ కొత్తపేట గ్రామానికి చెందిన తోట కృష్ణ (35) అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈయన మృతదేహం మేజరు పంచాయతీ నరసన్నపేట మారుతీనగర్–1లోని సాయి మందిరం వద్ద పోలీసులు గుర్తించారు. కృష్ణ మృతికి స్పష్టమైన కారణాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇతని కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎవరో మృతి చెంది ఉన్నట్లు పోలీసులకు శనివారం ఉదయం సమాచారం వచ్చింది. వెంటనే ఎస్ఐ వై.సింహాచలం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఫోను లభించచడంతో దాని ద్వారా మృతుని ఆచూకీ తెలుసుకున్నారు. కొత్తపేటకు చెందిన తోట కృష్ణగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో తండ్రి లక్ష్మీనారాయణ, తల్లి సాయమ్మలు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని గుర్తు పట్టారు. కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. మహిళపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెనే తమ కుమారుడు కృష్ణను హత్య చేసి ఉంటుందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొంతకాలంగా కృష్ణ నరసన్నపేట మారుతీనగర్ ప్రాంతానికి చెందిన వివాహితతో చనువుగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే ఆయన మృతికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. కృష్ణ శుక్రవారం సాయంత్రం పని ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని.. రాత్రికి రాలేదని, ఉదయానికే పోలీసులు ఫోను చేస్తే తెలిసిందని మృతుని తండ్రి లక్ష్మీనారాయణ విలేకరులకు తెలిపారు. కృష్ణ గతంలో ఆటో నడిపే వాడ ని.. ప్రస్తుతం టోల్గేట్లో పని చేస్తున్నట్లు చెప్పారు. 2017లో ఈదులవలసకు చెందిన హారికతో కృష్ణకు వివాహమైంది. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. వారం క్రితమే సీమంతం చేశారు. కాగా వివాహిత ఇంటి వెనుక భాగంలో మృతదేహం లభించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మేడ పైనుంచి దూకడం వల్ల మృతి చెందాడా.. లేదా వివాహిత ఇంట్లో వాళ్లు ఏదో చేసి కిందకు పడేశారా అనే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ బాలచంద్రరెడ్డి, సీఐ డి.రాములు పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అవన్నీ గుండెపోట్లు కావు.. గుండెపోటు ఎవరికి వస్తుంది?
సాక్షి, హైదరాబాద్: నడుస్తూ నడుస్తూ కుప్పకూలిపోతున్నారు..నృత్యం చేస్తూ నేలరాలిపోతున్నారు. జిమ్ చేస్తూ జీవితాలు ముగిస్తున్నారు. జోకులేస్తూనే ప్రాణాలొదిలేస్తున్నారు. వీరిలో మధ్య వయసు్కలు, యువత, కొన్ని సందర్భాల్లో 15 ఏళ్ల లోపు వారూ ఉంటున్నారు. దీంతో ఆరోగ్యవంతుల్ని సైతం గుండెపోటు భయం పట్టిపీడిస్తోంది. అనుమానాలతో ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే అన్ని ఆకస్మిక మరణాలకూ గుండెపోట్లనే కారణంగా పరిగణించలేమని వైద్యులు చెబుతున్నారు. జన్యుపరమైన వ్యాధుల్ని గుర్తించడంలో జాప్యం కూడా ఆకస్మిక మరణాలకు దారితీస్తోందని వారంటున్నారు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులతో ఈ పరిస్థితుల్ని అధిగమించవచ్చని స్పష్టం చేస్తున్నారు. భయం..భయం.. గుండె పనితీరు గురించిన రకరకాల భయాలు, సందేహాలతో వైద్యుల్ని సంప్రదిస్తున్నవారు ఇటీ వల పెరిగారని ఆన్లైన్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ ‘ప్రాక్టో’అధ్యయనం తేల్చింది. గుండె పనితీరు గురించి సందేహాలతో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుణె నగరాల నుంచీ వైద్యుల్ని సంప్రదించిన వారిలో 56% మంది 30–39 సంవత్సరాల మధ్య వయస్కు లేనని వెల్లడించింది.వీరిలో 75% మంది పురుషులు, 25% మహిళలు ఉన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది తాము 100 మందికి పైగా కార్డియాలజిస్టులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుప్రాక్టో నిర్వాహకులు తెలిపారు. టీకా కారణం కాదు యువకులు, మధ్య వయస్కు లు ఆకస్మికంగా తీవ్రమైన అనారోగ్యాలకు గురికావడం ఒక్క ఏడాదిలో 31% నుంచి 51%కి పెరిగిందని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది. అయితే ఇవి కరోనా టీకాలు వేసిన, వేయని వారిలో కూడా కనిపిస్తున్నాయని తెలిపింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ నివేదిక ప్రకారం.. కోవిడ్ 19 వ్యాక్సిన్లు తీసుకున్న 1,00,000 మందిలో 1.7% మంది మాత్రమే మయోకార్డిటిస్ (కరోనా నేపథ్యంలో గుండె సంబంధిత వ్యాధికి గురికావడం)కు గురయ్యే అవకాశం ఉంది. గుండెపోటు ఎవరికి వస్తుంది? గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులలో ఆకస్మిక అడ్డంకులు ఏర్పడటం వల్ల గుండెపోటు సంభవిస్తుంది. ‘ధమనిలో కొవ్వు ఫలకం ఏర్పడి ఇది రక్తనాళంలోకి ప్రవేశించి, గడ్డ కట్టి, అకస్మాత్తుగా ఉక్కిరిబిక్కిరి చేయడాన్నే గుండెపోటుగా పేర్కొంటారు. ‘సాధారణంగా ధూమపానం చేసే వ్యక్తులు, కూర్చుని ఉద్యోగం చేసేవారు, ఊబకాయం కలిగినవారు, తక్కువ రక్తపోటు లేదా తీవ్రమైన మధుమేహం లేదా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలున్నవారిలో ఈ పరిస్థితి రావచ్చు..’అని వైద్యులు చెబుతున్నారు. ‘శిక్షణ లేకుండా లేదా అతిగా వ్యాయామం చేయడం వల్ల కూడా కరోనరీ నాళాలలో ఫలకాలు పగిలి, గుండె ఆగిపోవడానికి దారితీయవచ్చు..’అని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయకుమార్ చెప్పారు. వ్యాయామశాలకు వెళ్లేవారిలో, ప్రొటీన్ సప్లిమెంట్లను తీసుకోవడం పెరిగిందని, వైద్యుల పర్యవేక్షణ లేకపోతే అది ప్రమాదమని స్పష్టం చేశారు. జీవనశైలిలో మార్పులతో.. జీవనశైలిలో మార్పులు చాలావరకు యుక్త వయస్కులలో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అలాగే కొన్ని జన్యుపరమైన వ్యాధుల్ని గుర్తించడంలో ఆలస్యం కూడా ఆకస్మిక మరణాలను తెస్తోంది. నిజానికి ప్రతి ఆకస్మిక మరణాన్నీ హార్ట్ ఎటాక్‌గా పరిగణించలేం. మొత్తం ఆకస్మిక మరణాల్లో 3 శాతమే గుండె పోటు కారణంగా సంభవిస్తాయి. ఆహారపు అలవాట్లు, దినచర్యలో మార్పుచేర్పులతో జీవనశైలిని సరైన విధంగా తీర్చిదిద్దుకోవాలి. అలాగే ఏ మాత్రం సందేహం ఉన్నా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. – డా.ఆర్.కె.జైన్, కార్డియాలజిస్ట్, కిమ్స్ ఆసుపత్రి కార్డియో వ్యాస్క్యులర్వ్యాయామాలు అవసరం.. ధూమపానం, మద్యపానం, మధుమేహం, అధిక కొలె్రస్టాల్ వంటి వాటి వల్ల కావచ్చు, ఆధునిక జీవనశైలి వల్ల కావచ్చు గుండె బలహీనపడటం సాధారణమైపోయింది. హృద్రోగాల వల్ల కోల్పోయిన గుండె సామర్థ్యాన్ని తిరిగి దశలవారీగా సంతరించుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని కార్డియో వాసు్క్యలర్ వ్యాయామాలు చేయడం అవసరం. అవి గుండె పంపింగ్ సామర్థ్యాన్ని, శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని, మందుల వాడకాన్ని తగ్గిస్తాయి. – డాక్టర్ మురళీధర్, ఈఎస్ఐసీ ఆసుపత్రి -
RRR నటుడు రే స్టీవెన్సన్ హఠాన్మరణం
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఆర్ చిత్రంలో నటించిన విదేశీ నటుడు రే స్టీవెన్సన్(58) హఠాన్మరణం చెందారు. RRRలో ఆయన బ్రిటిష్ గవర్నర్ స్కాట్ బక్స్టన్ రోల్లో మెయిన్ విలన్ క్యారెక్టర్లో అలరించారు. కరడుగట్టిన ‘స్కాట్ దొర’ పాత్రగా అది ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఇటలీలో తన కొత్త చిత్రం ‘క్యాసినో’ షూటింగ్లో పాల్గొంటున్న ఆయన.. ఆదివారమే మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. బ్రిటిష్ నటుడైన రే స్టీవెన్సన్ పూర్తి పేరు జార్జ్ రేమండ్ స్టీవెన్సన్. పలు చిత్రాలతో పాటు టెలివిజన్ సిరీస్‌ల్లోనూ ఆయన నటించారు. 1964 మే 25వ తేదీన నార్త్ ఐర్లాండ్‌లోని లిస్బర్న్లో స్టీవెన్సన్ జన్మించారు. ఆయన తండ్రి రాయల్ ఎయిర్‌ఫోర్స్ పైలట్. తన 29వ ఏట బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ స్కూల్లో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేశాడు రే స్టీవెన్సన్. స్టేజ్ ఆర్టిస్ట్‌గా మొదలైన స్టీవెన్సన్ యాక్టింగ్ కెరీర్.. క్రమంగా సినిమాల వైపు మళ్లింది. ది థియరీ ఫ్లైట్(1998) చిత్రంతో ఆయన సిల్వర్ స్క్రీన్ యాక్టింక్ కెరీర్ ప్రారంభమైంది. కింగ్ ఆర్థర్(2004)లో డాగోనెట్ రోల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు, ప్రశంసలు దక్కాయి. హెచ్‌బీవో రోమ్ టీవీ సిరీస్‌లో టైటస్ పులోగా ఆయన అలరించారు. థోర్, స్టార్‌వార్స్ లాంటి హిట్ చిత్రాల్లోనూ ఆయన నటించారు. సరిగ్గా ఇరవై ఏళ్ల పాటు స్టేజ్ నాటకాలతో, చిత్రాలతో, వెబ్ సిరీస్‌లతో అలరించారాయన. స్టీవెన్సన్ బ్రిటిష్ నటి రుత్ గెమ్మెల్‌ను వివాహం చేసుకున్నారు. బాండ్ ఆఫ్ గోల్డ్ చిత్రంలో వీళ్ల పరిచయం కాస్త ప్రేమగా మారింది. 1997లో వీళ్ల వివాహం జరిగింది. అదే ఏడాది పీక్ ప్రాక్టీస్ అనే చిత్రంలోనూ వీళ్లు కలిసి నటించారు. అయితే ఎనిమిదేళ్ల తర్వాత వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది ఈ జంట. వీళ్లకు ముగ్గురు సంతానం. స్టీవెన్సన్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్రిపుల్ ఆర్ చిత్రయూనిట్ సంతాపం వ్యక్తం చేసింది. ‘సర్ స్కాట్.. మీరెప్పుడూ మా గుండెల్లో నిలిచి ఉంటార’ని ట్వీట్లో పేర్కొంది. What shocking news for all of us on the team! 💔 Rest in peace, Ray Stevenson. You will stay in our hearts forever, SIR SCOTT. pic.twitter.com/YRlB6iYLFi — RRR Movie (@RRRMovie) May 22, 2023 Ray Stevenson, who portrayed Volstagg in the #Thor trilogy, has passed away at the age of 58 years old: https://t.co/JcV4RIWIUj pic.twitter.com/vEpJu45LpK — MCU - The Direct (@MCU_Direct) May 22, 2023 -
డ్యాన్స్ చేయకుంటే.. కుప్పకూలి ప్రాణం పోయేది కాదా?
బస్.. ఆజ్‌కీ రాత్ హై జిందగీ.. కల్ హమ్ కహాన్.. తుమ్ కహాన్.. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. అందుకే సంతోషంగా గడపడమని చెప్తుండేవాళ్లు పెద్దలు. కానీ, సీను మారింది. మనుషులు ప్రాణాలు.. గాల్లో దీపంగా మారిపోయాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదుకాబట్టి.. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దానికి తోడు.. కుప్పకూలి మరణిస్తున్న వార్తలు ఈమధ్య కాలంలో చాలా చూస్తున్నాం. అందులో వయసు తేడాలు కూడా ఉండడం లేదు మరి!. సీసీ టీవీ ఫుటేజీలు, సోషల్ మీడియా-మెయిన్‌స్ట్రీమ్ మీడియా ఛానెల్స్ కారణంగా అందరికీ ఆ చావు క్షణాలను వీక్షించే స్థాయికి పరిస్థితి చేరింది. ఒకరకంగా ఇలాంటివి చూడడం అలవాటు అయిపోయింది జనాలకు. కర్ణుడి చావుకి లక్ష కారణాల మళ్లే.. ఇలాంటి హఠాన్మరణాలపై కూడా పోస్ట్‌మార్టం అనేక రకాలుగా, రకరకాల వెర్షన్లుగా ఉంటోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పోస్టల్ డిపార్ట్మెంట్కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ సురేంద్ర కుమార్ దీక్షిత్ మరణం.. మరో చర్చకు తావిచ్చింది. ఉన్నట్లుండి కుప్పకూలి చనిపోతున్న ఉదంతాల్లో జిమ్ మరణాలతో పాటు డ్యాన్స్లవి కూడా ఉంటున్నాయి. వేడుకల్లో హుషారుగా చిందులేయడం కూడా ఒకరకంగా ప్రమాదమే అంటూ వాదిస్తున్న కొందరు.. సురేంద్ర మరణాన్ని అందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. కానీ, దురదృష్టవశాత్తూ.. వైద్యులు, పరిశోధకుల దగ్గరే దీనికి సమాధానం లేకుండా పోయింది. ఆల్ ఇండియా పోస్టల్ హాకీ టోర్నమెంట్లో భాగంగా.. మార్చి 16వ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అందులో హుషారుగా చిందులేస్తూ సందడి చేశారాయన. ఈక్రమంలోనే ఉన్నట్లుండి కుప్పకూలి మరణించాడు. అందుకు కార్డియాక్ అరెస్ట్ కారణమని చెప్పారు వైద్యులు. అన్నట్లు.. పైన రెడ్ కలర్లో పేర్కొన్న హిందీ లైన్లతో కూడిన పాటకే పాపం సురేంద్ర డ్యాన్స్ వేశారు. విధి విచిత్రం అంటే ఇదేనేమో!. Bhopal: Officer dies of cardiac arrest while dancing at a function. #Bhopal #CardiacArrest pic.twitter.com/xgFW2XjqP6 — TIMES NOW (@TimesNow) March 20, 2023 Video Credits: టైమ్స్ నౌ సౌజన్యంతో.. -
లాంగ్ కోవిడ్ వల్లే ఆకస్మిక మరణాలు.. వ్యాక్సిన్లే కారణమా? డాక్టర్ల క్లారిటీ
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా ఆకస్మికంగా కుప్పకూలి మరణిస్తున్న ఘటనల్ని ఇటీవల చూస్తున్నాం. అలా కుప్పకూలి మరణించిన వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సినే కారణమని.. కొన్నిరకాల మందులు వాడటం వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆ ప్రచారం నిజం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆకస్మిక మరణాలకు కారణాలను కార్డియాలజీ నిపుణులు వివరిస్తున్నారు. కోవిడ్ తర్వాత పెరిగిన గుండె సమస్యలు కోవిడ్ తర్వాత ప్రజల్లో గుండె జబ్బులు బాగా పెరిగినట్టు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా లాంగ్ కోవిడ్ ప్రాబ్లమ్స్ (పోస్ట్ కోవిడ్ కండిషన్) ఎదుర్కొన్న వారిలో గుండె జబ్బులు రెండు రెట్లు అధికమని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారిలోనే కార్డియాక్ అరెస్ట్‌లు జరుగుతున్నట్టు వెల్లడిస్తున్నారు. ఆకస్మిక మరణాలతోపాటు, కొందరు పీఓటీఎస్ (పాచ్యురల్ టాచీకార్డియా సిండ్రోమ్) ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ఉన్న పొజిషన్ నుంచి మారినా, కూర్చుని, పడుకుని లేచినా గుండె దడగా ఉండటం జరుగుతుందని (కూర్చుని లేచిన తర్వాత లేదా పడుకున్న తర్వాత గుండె కొట్టుకునే రేటు చాలా త్వరగా పెరగటం) చెబుతున్నారు. ఇవీ కారణాలు ♦ రక్తనాళాల్లో పూడికల వల్ల గుండెపోట్లు వస్తున్నాయి. ♦ గుండె కండరాలు ఉబ్బడం (మయో కార్డిటైస్) వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ♦ గుండె అకస్మాత్తుగా ఆగిపోవడం (కార్డియాక్ అరెస్ట్–అర్రిటమియా) కూడా కారణం. ♦ పల్మనరీ ఎంబోలిజం (గుండె నుంచి ఊపిరితిత్తులకు వచ్చే రక్తనాళాల్లో పూడికలు) కూడా దీనికి కారణమవుతోంది. ముందుగా గుర్తించడం కష్టమే కోవిడ్ తర్వాత కొందరిలో హార్మోన్ల సమతుల్యత లోపించిన కారణంగా రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి వారిలో డీ–డైమర్ వంటి పరీక్ష చేసినప్పుడు రక్తం చాలా సాధారణంగా ఉన్నా.. మరుసటి రోజుకే గడ్డలు ఏర్పడి పల్మనరీ ఎంబోలిజమ్తో అకస్మాత్తుగా మరణించే అవకాశాలు కూడా ఉన్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. కార్డియాక్ అరెస్ట్, పల్మనరీ ఎంబోలిజంను ముందుగా గుర్తించడం కష్టమేనని పేర్కొంటున్నారు. రక్తంలో నీటి శాతం తగ్గినా రక్తం చిక్కబడి గడ్డలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అపోహలెన్నో.. ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమని.. ఫలానా వ్యాక్సిన్ వేసుకున్న వారికి గుండెపోటు వస్తోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వైద్యులు కొట్టిపారేస్తున్నారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ అత్యుత్తమ మార్గమని గుర్తించి అందరికీ వేయడం జరిగిందంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో వేసిన ఎంఆర్ఎన్ఏ (ప్రైజర్, మోడెర్నా) వంటి వ్యాక్సిన్లలో దుష్పలితాలను గుర్తించారని, అవి మన దేశంలో వేయలేదని స్పష్టం చేస్తున్నారు. ముందు జాగ్రత్తలే మేలు ♦ గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని వైద్యులు చెపుతున్నారు. ♦ శ్రమతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ♦ జీవన శైలిని మార్చుకోవడం ♦ స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం ♦ రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం ♦నీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. లాంగ్ కోవిడ్ ప్రాబ్లమ్స్‌తోనే.. కోవిడ్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగాయి. లాంగ్ కోవిడ్ ప్రాబ్లమ్స్ (పోస్టు కోవిడ్ కమిషన్) ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం రెండు రెట్లు అధికం. ఆకస్మిక మరణాలకు పల్మనరీ ఎంబోలిజం, కార్డియాక్ అరెస్ట్‌లు కారణంగా ఉంటున్నాయి. కోవిడ్ తర్వాత హార్మోన్లలో సమతుల్యత లోపించిన కారణంగా రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి. రక్తంలో నీటిశాతం తగ్గినా రక్తం చిక్కబడి గడ్డలు ఏర్పడతాయి. అలాంటి వారు ఆకస్మికంగా మరణించే అవకాశం ఉంది. జీవనశైలి మార్చుకోవడం, ఆహార నియమాలు పాటించడం, రెగ్యులర్ వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బులను అధిగమించవచ్చు. – బి.విజయ్ చైతన్య, కార్డియాలజిస్ట్, విజయవాడ -
‘అమ్మా.. తలనొప్పి’ అంటూ కుప్పకూలింది
ఈరోజుల్లో చావు అనేది.. హఠాత్తుగా వచ్చి మనిషి ప్రాణాన్ని చుట్టేసుకుని వెళ్లిపోతోంది. కరోనా తర్వాత ఇలాంటి మరణాలు.. వయసుతో సంబంధం లేకుండా సంభవిస్తుండడంతో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు ఈ మరణాల వెనుక కారణాల కోసమూ పరిశోధకుల అన్వేషణ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. యూఎస్ స్టేట్ జార్జియాలో ఓ టీనేజర్ మరణం.. సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. తలనొప్పితో బాధపడుతున్న ఆ టీనేజర్.. హఠాత్తుగా కుప్పకూలి ప్రాణం విడిచింది. ఈ మరణం వెనుక కారణాన్ని వైద్యులు తాజాగా వెల్లడించగా.. సోషల్ మీడియాలో ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదనే కామెంట్లు చేస్తున్నారు చాలామంది. 13 ఏళ్ల ఆ చిన్నారి పేరు జూలియా చావెజ్. కొలంబియా కౌంటీలోని హర్లీం మిడిల్ స్కూల్లో చదువుతోంది. అయితే వారం రోజులుగా విపరీతమైన తలనొప్పి.. చెవినొప్పితో బాధపడింది. తల్లికి ఈ విషయం చెప్తే స్థానికంగా ఓ ఆస్పత్రికి తీసుకెళ్లిందామె. ఆ డాక్టర్ ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పి యాంటీబయోటిక్స్ రాశాడు. అయితే గత ఆదివారం ఉదయం ఉన్నట్లుండి కుప్పకూలిందా అమ్మాయి. తల్లిదండ్రులు హుటాహుటిన ఓ పెద్దాసుపత్రికి తరలించగా.. లుకేమియా(రక్త క్యాన్సర్) కారణంగా మెదడు, ఊపిరితిత్తులు, కడుపు.. ఇలా ప్రతీ చోట రక్తస్రావం జరిగిందని షాక్ ఇచ్చారు. అప్పటికే పరిస్థితి చేజారిపోయిందని చెప్పారు. తల్లిదండ్రుల ఎదుటే నొప్పితో విలవిలలాడిన ఆమె.. మృత్యువు చేతిలో ఓడింది. ఆ చిన్నారికి అలాంటి స్థితి ఉందని ఆమె తల్లిదండ్రులకు తెలిసే మార్గం లేదని వైద్యులు చెప్పడం ఇక్కడ కొసమెరుపు. నిత్యం ఆడిపాడుతూ.. చదువుల్లో రాణిస్తూ.. మంచి మనసుతో అందరితో కలివిడిగా ఉండే ఆ చిన్నారి లేదన్న విషయాన్ని ఇంట్లోవాళ్లు, స్నేహితులు, టీచర్లు తట్టులేకపోతున్నారు. పుట్టినప్పటి నుంచి ఏనాడూ ఆస్పత్రి గడప తొక్కని ఆ చిన్నారి.. అర్ధాంతరంగా చిన్నవయసులోనే తనకు ఏం జబ్బు ఉందో కూడా తెలియకుండానే ప్రాణం విడిచింది. చావు చెప్పి రాదు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి మరణం సంభవిస్తుందో తెలియడం లేదు. మన చేతుల్లో ఉండేది.. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడం మాత్రమే!. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు. చిన్నచిన్న అనారోగ్యాలను పట్టించుకోకుండా ముందుకు పోతుంటారు చాలామంది. కానీ, ఒక్కోసారి దాని వెనుక విపరీతాలు ఉండొచ్చు. అందుకే ఎలాంటి సమస్య తలెత్తినా అప్రమత్తత అవసరం ఈరోజుల్లో. ఆరోగ్యంగా ఉండండి.. అయినవాళ్లతో సంతోషంగా గడపండి. -
జోష్‌తో డ్యాన్స్.. విధి విచిత్రంగా ప్రాణం తీసింది
వైరల్: ఏ నిమిషానినో ఏమి జరుగునో ఎవరూహించెదరు?.. మనిషి జీవం విషయంలో ఇప్పుడు ఇలాగే జరుగుతోంది. నిన్న కళ్లెదురుగా నవ్వుతూ హుషారుగా కనిపించిన మనిషి.. ఇవాళ బతికి లేడు అని వినాల్సి వస్తున్న రోజులువి. కన్నవాళ్లను, భార్యాబిడ్డలను, అయినవాళ్లను ఉన్నట్లుండి శోకంలో ముంచెత్తి వెళ్లిపోతున్నారు. పైగా ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు..అందునా పాతిక నుంచి నలభై ఐదేళ్లలోపు వాళ్ల మరణాలే అత్యధికంగా నమోదు అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. తాజాగా.. మధ్యప్రదేశ్‌లో ఓ పెళ్లింట నెలకొన్న విషాదం తాలుకా ఘటన వీడియో తెగ వైరల్ అవుతోంది. యూపీ కాన్పూర్‌కు చెందిన 32 ఏళ్ల అభయ్ సచాన్ను విధి విచిత్రంగా మరణంతో చుట్టుకెళ్లిపోయింది. అభయ్.. సోమవారం దగ్గరి బంధువుల వివాహం కోసం మధ్యప్రదేశ్ రేవాకు వచ్చాడు. మంగళవారం రాత్రి వివాహ వేడుకలో హుషారుగా డ్యాన్స్‌లు చేశాడు. అలా గంతులేస్తూనే ఉన్నట్లుండి.. నెమ్మదిగా కిందకు వాలిపోయాడతను. అది గమనించిన బంధువుల దగ్గరికి వెళ్లి చూసేసరికి.. అతనిలో ఎలాంటి చలనం లేదు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా.. కార్డియాక్ అరెస్ట్‌తో అప్పటికే కన్నుమూశాడని వైద్యులు ప్రకటించారు. పైగా షాకింగ్ విషయం ఏంటంటే.. అతను మద్యం మత్తులో లేడట. అతను పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని వైద్యులు ప్రకటించడం. దీంతో ఆ యువకుడి మరణాన్ని ఎవరూ తట్టుకోలేకపోయారు. అలా పెళ్లింటి విషాదం నెలకొని.. అతని సంతాప సభను నిర్వహించాల్సి వచ్చింది. సెలబ్రిటీలే కాదు.. ఇలాంటి మరణాలకు ఎవరూ అతీతులు కావడం లేదు. పదుల వయసున్న పిల్లల దగ్గరి నుంచి యుక్త వయసు కుర్రకారు కూడా ఇలాంటి మరణాల బారినపడుతోంది. వైద్య నిపుణులు సైతం ఇలాంటి మరణాలకు ఒక స్పష్టత అంటూ ఇవ్వలేకపోతుండగా.. అధ్యయనాలు మాత్రం రకరకాల నివేదికలను ఇస్తూ పోతోంది. 18 Jan 2023 : 🇮🇳 : On Camera, Abhay Sachan(32) dancing at Wedding collapses and Dies due to 🫀arrest💉... He is a resident of Uttar Pradesh's Kanpur districts, had come to Rewa for the wedding.#heartattack2023 #heartattack #cardiacarrest pic.twitter.com/FQFeZA3ZNa — Anand Panna (@AnandPanna1) January 18, 2023 -
బడే భాయ్.. శరద్ యాదవ్ మృతిపై లాలూ భావోద్వేగం
కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ హఠాన్మరణం.. బీహార్ రాజకీయాల్లో విషాద ఛాయలు నింపింది. ఐదు దశాబ్దాలపాటు.. జాతీయ రాజకీయాల్లో రాణించి తనదైన ముద్ర వేసుకున్నారాయన. అయితే చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా పేరున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్.. శరద్ యాదవ్ మరణంపై ఎమోషనల్ అయ్యారు. తమ మధ్య రాజకీయపరంగా రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా.. తమ మధ్య బంధం మాత్రం చెడిపోలేదని లాలూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్య కారణాల రిత్యా సింగపూర్‌లో ఉన్న లాలూ.. ఆస్పత్రి నుంచి వీడియో సందేశం ద్వారా ఓ వీడియో రిలీజ్ చేశారు. బడే భాయ్(పెద్దన్న)గా శరద్ యాదవ్‌ను సంబోధిస్తూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని లాలూ గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘అతను(శరద్ యాదవ్), ములాయం సింగ్, నితీశ్ కుమార్, నేను.. మీమంతా రామ్ మనోహర్ లోహిలా, కార్పూరి థాకూర్ నుంచి సోషలిజం రాజకీయాలు నేర్చుకున్నాం. ఎన్నోసార్లు మేం రాజకీయాల పరంగా పోటీ పడ్డాం. కానీ, మా మధ్య బంధం మాత్రం ఎప్పుడూ చెడిపోలేదు’’ అని లాలూ గుర్తు చేసుకున్నారు. अभी सिंगापुर में रात्रि में के समय शरद भाई के जाने का दुखद समाचार मिला। बहुत बेबस महसूस कर रहा हूँ। आने से पहले मुलाक़ात हुई थी और कितना कुछ हमने सोचा था समाजवादी व सामाजिक न्याय की धारा के संदर्भ में। शरद भाई...ऐसे अलविदा नही कहना था। भावपूर्ण श्रद्धांजलि! pic.twitter.com/t17VHO24Rg — Lalu Prasad Yadav (@laluprasadrjd) January 12, 2023 శరద్ యాదవ్ తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది.. సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ నుంచి మొదలుపెట్టినప్పటికీ.. ఆయన మాధేపురనే బేస్‌గా చేసుకుని ముందుకు వెళ్లారు. ఇందులో లాలూతోనే పోటాపోటీ నడిచింది. నాలుగుసార్లు గెలిస్తే.. నాలుగుసార్లు ఓడిపోయారు. 1991, 1996 నుంచి నెగ్గి, 1998లో లాలూ ప్రసాద్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. 1999లో లాలూను ఓడించారు. మళ్లీ 2004లో లాలూ చేతిలో ఓడారు. 2009లో మళ్లీ నెగ్గారు. 2014, 2019లో మోదీ మేనియాలో శరద్ యాదవ్ ఓటమి పాలయ్యారు. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో 1947 జులై 1న జన్మించిన శరద్ యాదవ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1999 నుంచి 2004 మధ్య వాజ్పేయూ ప్రభుత్వంలో శరద్ యాదవ్ పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2003లో జనతాదళ్ యునైటెడ్(జేడీ-యూ) జాతీయ అధ్యక్షుడయ్యారు. తన రాజకీయ ప్రస్థానంలో ఏడు సార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017లో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆయనతో విభేదించి జేడీయూ నుంచి బయటకొచ్చారు. 2018లో లోక్తాంత్రిక్ జనతాదళ్(ఎల్జేడీ) పార్టీ ఏర్పాటు చేశారు. కానీ, ఆ పార్టీకి అధికారిక గుర్తింపు లేకుండా పోయింది. తొలుత బహుజన్ ముక్తి పార్టీ తో విలీనం కావాలని భావించినప్పటికీ.. అది పూర్తి స్థాయిలో జరగలేదు. అయితే 2022 మార్చిలో ఆర్జేడీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో ప్రతిపక్షాలను ఏకం చేయడంలో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఇది తొలి అడుగని శరద్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సోషలిస్ట్ నేత, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి వెల్లడించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ యాదవ్ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. పల్స్ లేదు. మేము తొలుత సీపీఆర్ ప్రయత్నించి చూశాం. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాత్రి 10.19 గంటలకు ఆయన చనిపోయారు’ అని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. -
మ్యాచ్ కవర్ చేస్తూ కుప్పకూలాడు.. మృతిపై అనుమానాలు!
దోహా: అమెరికన్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్(48).. గుర్తున్నారా?.. ఫుట్‌బాల్ స్టేడియం వద్ద రెయిన్ బో కలర్ దుస్తులు ధరించి.. ఖతార్ పోలీసుల ఆగ్రహానికి గురైన వ్యక్తి. ఎల్జీబీటీక్యూ హక్కులకు మద్ధతుగా ఆయన ఈ పని చేశాడు. అయితే.. ఆయన శుక్రవారం మ్యాచ్ సమయంలో హఠాత్తుగా కుప్పకూలి మరణించారు. శుక్రవారం లుసాయిల్ స్టేడియంలో అర్జెంటీనా-నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను కవర్ చేస్తూ ఆయన హఠాత్తుగా కుప్పకూలాడు. పక్కనే ఉన్న జర్నలిస్టులు ఆయన్ని సీపీఆర్ కాపాడే యత్నం చేశారు. కానీ, అది ఫలించలేదు. అయితే.. ఆయన మరణం పట్ల సోదరుడిగా చెప్పుకుంటున్న ఎరిక్ వాల్ అనే వ్యక్తి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. గ్రాంట్ మరణంలో.. ఖతార్ ప్రభుత్వ ప్రమేయం ఉందేమో అనే అనుమానం వ్యక్తం చేశాడాయన. నా పేరు ఎరిక్ వాల్. వాషింగ్టన్ సియాటెల్‌లో జీవిస్తున్నా. గ్రాంట్ వాహ్ల్ సోదరుడిని నేను. నా కారణంగానే నా సోదరుడు రెయిన్బో రంగు షర్ట్‌తో ఫుట్‌బాల్ మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఆయన చాలా ఆరోగ్యవంతుడు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత.. చావు బెదిరింపులు వచ్చాయని ఆయన నాతో చెప్పాడు. చాలా ఆరోగ్యంగ ఉన్న ఆయన మరణించాడంటే నమ్మబుద్ధ ఇకావడం లేదు. ఆయన్ని చంపేసి ఉంటారు. సాయం కోసం అర్థిస్తున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన సోదరుడు ఒక వీడియో పోస్ట్ చేశాడు. అయితే ఇన్స్టాగ్రామ్ ఎందుకనో ఆ వీడియోపై ఆంక్షలు విధించింది. Free to read: What happened when Qatar World Cup security detained me for 25 minutes for wearing a t-shirt supporting LGBTQ rights, forcibly took my phone and angrily demanded that I remove my t-shirt to enter the stadium. (I refused.) Story: https://t.co/JKpXXETDkH pic.twitter.com/HEjr0xzxU5 — Subscribe to GrantWahl.com (@GrantWahl) November 21, 2022 ఇదిలా ఉంటే.. ఫిఫా వరల్డ్ కప్ ఆరంభంలో గ్రాంట్ వాల్‌ను సెక్యూరిటీ సిబ్బంది అల్ రయాన్లోని అహ్మద్ బిన్ అలీ స్టేడియం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు కూడా. సుమారు 25 నిమిషాల తర్వాత తానెవరో తెలుసుకుని.. ఆపై వాళ్లు తనకు క్షమాపణలు చెప్పి.. లోనికి అనుమతించారని తెలియజేశారు. ఇదిలా ఉంటే.. వాల్ భార్య గౌండర్ మాత్రం ఆయన హఠాన్మరణంపై అనుమానాలు వ్యక్తం చేయలేదు. కేవలం తన భర్త మరణంపై దిగ్భ్రాంతికి గురయ్యానంటూ ఆమె ట్విటర్ ద్వారా ఓ పోస్ట్ చేశారు. I am so thankful for the support of my husband @GrantWahl's soccer family & of so many friends who've reached out tonight. I'm in complete shock. https://t.co/OB3IzOxGlE — Céline Gounder, MD, ScM, FIDSA 🇺🇦 (@celinegounder) December 10, 2022 వాల్.. ప్రిన్స్టన్ నుంచి 1996లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అప్పటి నుంచి 2021 దాకా స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా రాణించారు. సాకర్, బాస్కెట్ బాల్ కవరేజీలకు ఆయన ప్రత్యేక గుర్తింపు దక్కింది. 2012 నుంచి ఏడేళ్ల పాటు ఆయన ఫాక్స్ స్పోర్ట్స్‌లో పనిచ చేశారు. ఆపై ఆయన తన సొంత వెబ్‌సైట్‌ను లాంఛ్ చేశారు. -
అవమానాల్ని దిగమింగుకుంది.. హఠాత్తుగా నింగికెగసింది
అట్టావా: ఆమె వీడియోలు చూసి బోలెడంత మంది పగలబడి నవ్వుకున్నారు. పుల్లలా ఉంది! ఇదేం ఇన్ఫ్లుయెన్సర్ రా బాబూ అంటూ జోకులు పేల్చారు. అయితే అవమానాలకు ఆమెకు కుంగిపోలేదు. నవ్వుతూనే ముందుకు సాగింది. ఒకానొక దశలో పరిధి దాటినా.. ఆమె ఒర్చుకుంది. ఆమె సానుకూల వైఖరికి, ఆత్మవిశ్వాసానికి ఫిదా అయిన నెటిజన్లు.. క్రమక్రమంగా ఆమెకు అభిమానులుగా మారిపోయారు. అలా అందనంత ఎత్తుకు ఎదుగుతుందని ఆమె తల్లిదండ్రులు ఆశపడుతున్న టైంలో.. విధి దెబ్బ కొట్టింది. ఇండో-కెనెడియన్ సోషల్ మీడియా సెలబ్రిటీ మేఘా థాకూర్.. కెనడాలో మరణించింది. 21 ఏళ్ల ఈ ఇన్ఫ్లూయెన్సర్ హఠాన్మరణాన్ని ఆమె తల్లిదండ్రులు ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా ధృవీకరించారు. ఆమె తమను వీడిందంటూ భావోద్వేగ సందేశం ద్వారా విషయాన్ని తెలియజేశారు. అయితే ఆమె ఎలా మరణించింది అనే విషయాన్ని వాళ్లు చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం.. మేఘా థాకూర్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది. నవంబర్ 24వ తేదీన ఆమె చనిపోగా.. మే 29వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు. View this post on Instagram A post shared by Megha (@meghaminnd) View this post on Instagram A post shared by Megha (@meghaminnd) భారత సంతతికి చెందిన 21 ఏళ్ల మేఘ థాకూర్.. 2001, జులై 17వ తేదీన ఇండోర్(మధ్యప్రదేశ్)లో జన్మించింది. ఆపై కుటుంబంతో కెనడాకు చేరుకుంది. ఒంటారియో మేఫీల్డ్ సెకండరీ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వెస్ట్రన్ యూనివర్సిటీలో చేరింది మేఘ. టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా పాపులర్ అయిన మేఘకు.. ఫాలోయింగ్ ఎక్కువే. View this post on Instagram A post shared by Megha (@meghaminnd) View this post on Instagram A post shared by Megha (@meghaminnd) మోడలింగ్ ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న ఆ యువతికి మొదట్లో బక్కచిక్కిన పర్సనాలిటీ వల్ల అవమానాలు ఎదురయ్యాయి. అయినా ఆమె ముందుకు సాగింది. ఈ క్రమంలో ఆత్మ విశ్వాసం, బాడీ పాజిటివిటీ గురించి ఆమె చేసిన వీడియోలు, స్పీచ్‌లు విపరీతంగా వైరల్ అయ్యాయి. సెలబ్రిటీల డ్రెస్సింగ్‌ను, వాళ్ల ఆటిట్యూడ్‌ను రిఫరెన్స్‌గా తీసుకుని వీడియోలు చేసేది మేఘ. అలా ఆమెకు సోషల్ మీడియా గుర్తింపు దక్కినా.. చిన్నవయసులో రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణంతో నింగికెగసి అభిమానుల్లో విషాదాన్ని నింపింది. -
బీజేపీ ఎమ్మెల్యే హఠాన్మరణం..ప్రధాని మోదీ సంతాపం
ఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, ఒడిషా ఎమ్మెల్యే బిష్ణు చరణ్ సేథీ(61) హఠాన్మరణం చెందారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసినట్లు సమాచారం. లంగ్ ఇన్ఫెక్షన్, మెదడులో రక్తస్రావం గత రెండు నెలలుగా ఆయన ఐసీయూలోనే ఉన్నట్లు ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. బిష్ణు చరణ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఆయన అందించిన సేవలను గుర్తు చేస్తూ కొనియాడారు. ఒడిషా గవర్నర్ గణేషీ లాల్, సీఎం నవీన్ పట్నాయక్ సంతాపం తెలియజేశారు. Shri Bishnu Charan Sethi Ji made an outstanding contribution to Odisha's progress. He distinguished himself as a hardworking legislator and contributed greatly to social empowerment. Saddened by his demise. Condolences to his family and supporters. Om Shanti. — Narendra Modi (@narendramodi) September 19, 2022 బీజేపీ ఒడిషా విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు బిష్ణు చరణ్. టికెట్ మీద మొదటిసారిగా 2000 సంవత్సరంలో బిష్ణు చరణ్ గెలుపొందారు. భద్రక్ జిల్లా ధామ్‌నగర్ నియోజకవర్గం నుంచి 2019లో గెలుపొందారు. ఒడిషా అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేతగా ఆయన పనిచేశారు. -
గణేష్ ఉత్సవాల్లో విషాదం.. స్టేజ్‌పైనే కుప్పకూలాడు
వైరల్: మనిషి జీవితం.. ఈరోజుల్లో నీటి బుడగలా మారిపోయింది. సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ రికార్డింగ్‌ల వల్ల.. ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు చాలామట్టుకు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు నాటక సమయంలోనే స్టేజ్‌పై కుప్పకూలి కన్నుమూశాడు. గణేష్ ఉత్సవాల సందర్భంగా.. యోగేష్ గుప్తా అనే ఆర్టిస్ట్ పార్వతి దేవి గెటప్ వేసి నాటకంలో పాల్గొన్నాడు. నాటకంలో భాగంగా నృత్యం చేసిన యోగేష్.. ఉన్నట్లుండి కింద పడిపోయాడు. అదీ నాటకంలో భాగమే అనుకుని పొరపడిన శివుడి పాత్రధారి యువకుడు.. దగ్గరగా వచ్చి లేపబోయాడు. కానీ, యోగేష్‌లో చలనం లేదు. దీంతో నిర్వాహకులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే యోగేష్ గుండెపోటు మృతి చెందినట్లు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా గత కొన్నిరోజలుగా ఇలాంటి ఆకస్మిక మరణాలకు సంబంధించిన ఉదంతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మలయాళం దిగ్గజ గాయకుడు ఎడవ బషీర్ సైతం ఇలాగే మే 28వ తేదీన అలపుజ్జాలో ప్రదర్శన ఇస్తూ కుప్పకూలి మృతి చెందారు. అలాగే.. ఈ ఏడాది జూన్‌లో ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే.. ప్రదర్శనలో ఇబ్బందిగా ఫీలై.. ఆ తర్వాత గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. వీళ్లే కాదు.. చాలా చోట్ల ఇలా మరణించిన ఘటనల తాలుకా వీడియోలు వైరల్ కావడం చూశాం. #WATCH | One more youth died with cardiac arrest..! Youth named #YogeshGupta who was performing the role of Maa Parvati during a Jagran in Bishnah Tehsil of #Jammu collapsed while dancing and died. He suffered a cardiac arrest. pic.twitter.com/dMRsy8M7up — Subodh Kumar (@kumarsubodh_) September 8, 2022 -
అప్పటివరకు హుషారుగా డ్యాన్స్.. అంతలోనే
వైరల్: మనిషి జీవితం నీటి బుడగలాగా మారిపోయింది. ఎప్పుడు.. ఎలా ముగుస్తుందో చెప్పని పరిస్థితులు నెలకొన్నాయి. మారుతున్న లైఫ్ స్టయిల్‌కు తగ్గట్లే రకరకాల రోగాలు.. కొత్త కొత్త వైరస్లు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయ్. ముఖ్యంగా సడన్ స్ట్రోక్‌లతో ప్రాణాలు పోతున్న ఘటనలు మన కళ్లముందే జరుగుతున్నాయ్. తాజాగా అలాంటి ఓ షాకింగ్ ఘటన.. వేడుకలో విషాదం నింపింది. ప్రభాత్ ప్రేమి (45).. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి ఆయన తన స్నేహితుడు మనీష్ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యాడు. ఉత్తర ప్రదేశ్ బరేలీ ఓ హోటల్లో పార్టీ నిర్వహించారు. మంచి డ్యాన్సర్ అయిన ప్రభాత్.. హుషారుగా బాలీవుడ్ సాంగ్స్‌కు స్టెప్పులేశాడు. అది చూసి అంతా విజిల్స్, గోలతో ఆయన్ని ఎంకరేజ్ చేశారు. అయితే.. ఉన్నట్లుండి ఆయన ఒక్కసారిగా కిందపడిపోయారు. बरेली: खुश दिल इंसान की पल भर में मौत.... ◆डांस करते-करते शख्स अचानक गिरा नीचे, डॉक्टरों ने मृत घोषित किया pic.twitter.com/AIOle7W9BA — News24 (@news24tvchannel) September 2, 2022 అలా కుప్పకూలిపోయి ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో చాలామంది ఆయనకు సీపీఆర్ లాంటి చేసి ఉండాల్సిందన్న అభిప్రాయం కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కుప్పకూలిన ప్రభాత్ దగ్గరకు వెళ్లి పైకి లేపేందుకు ప్రయత్నించారు అంతా. కానీ ఆయనలో చలనం లేదు. పార్టీలో ఉన్న మనీష్ మరో స్నేహితుడు డాక్టర్ వినోద్ పగ్రానీ.. ప్రభాత్‌కు సీపీఆర్, కార్డియాక్ ప్రెజర్ ఇచ్చినా లాభం లేకుండా పోయింది. చివరకు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే కార్డియక్ అరెస్ట్‌తో ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఇదీ చదవండి: నిప్పుతో గేమ్స్.. బెడిసి కొట్టడంతో చివరకు.. -
ఝున్‌ఝున్‌వాలా లేని ఆకాశ ఎయిర్‌లైన్ పరిస్థితి ఏంటి?
సాక్షి,ముంబై: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అకాలమరణంతో ఇటీవలే సేవలను ప్రారంభించిన సరికొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్ భవితవ్యం ఏంటి? ప్రణాళికలు ఏంటి? సంస్థ నిర్వహణ ఎలా ఉండబోతోంది అనే సందేహాలు బిజినెస్ వర్గాల్లో నెలకొన్నాయి. ఝున్‌ఝున్‌వాలా రెక్కల కింద ఎదగాలని, రాణించాలని ఎదురు చూసిన ఆకాశ ఎయిర్‌కి ఆయన ఆకస్మిక మరణం షాక్‌నిచ్చింది. (ఝున్‌ఝున్‌వాలా అస్తమయంపై స్మృతి ఇరానీ ఏమన్నారంటే) ముఖ్యంగా భారతదేశంలో, బిలియనీర్ యాజమాన్యంలోని విమానయాన సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, సుబ్రతా రాయ్ సహారాకు చెందిన సహారా ఎయిర్‌లైన్స్ కథ ఇదే. ఈ కారణంగానే విశ్లేషకులు ఆకాశ ఎయిర్ కార్యకలాపాలను ప్రారంభించకముందే దాని భవిష్యత్తుపై, సందేహాలను, భయాలను వ్యక్తం చేశారు. ఇపుడు ఆయన హఠాన్మరణంతో ఈ భయాలు మరింత పెరిగాయి. (రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా?) అయితే ఆకాశ సీఈఓ వినయ్ దూబే మాట్లాడుతూ ఝున్‌ఝున్‌వాలా వారసత్వాన్ని, విలువను ముందుకు తీసుకెడతామని, మంచి విలువలతో గొప్ప విమానయాన సంస్థగా నడపడానికి కృషి చేస్తామని దూబే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా తనపై విశ్వాసముంచిన ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆకాశకు ఝున్‌ఝున్‌వాలా చాలా కీలకం. ముఖ్యమైన పెట్టుబడిదారుడిగా మాత్రమే కాకుండా ఆయనకున్న అపారమైన పలుకుబడితో బ్యాంకులు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుండి చౌకగా ఫైనాన్సింగ్ ఏర్పాటు చేయగల సత్తా ఉన్నవారు. అలాంటి ఆయన మరణంతో కొంత ఒత్తిడి తప్పదని సీనియర్ ఎయిర్‌లైన్ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించారు. ఆయన మరణం కంపెనీ వృద్ధికి, ఆశయ సాధనకు తాత్కాలిక బ్రేక్స్ ఇస్తుందని, పెట్టుబడిదారులు కూడా జాగ్రత్తగా ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే దేశ విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే గ్లోబల్ఎయిర్లైన్స్తో ఆకాశ ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని మరికొంతమంది మార్కెట్ నిపుణుల అంచనా. ఝున్‌ఝున్‌వాలా ఎయిర్ లైన్స్ సంస్థ ఎల్సిసిలో 40 శాతానికి పైగా వాటా 3.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 264 కోట్లు) పెట్టుబడులు పెట్టాడు. ఇది ఆయన చివరి ప్రధాన పెట్టుబడులలో ఒకటి మాత్రమే కాదు, ఆయనకు అత్యంత ఇష్టమైనది కూడా. ఆకాశ మొదటి విమానంలోని ప్రయాణీకులతో తీసుకున్న సెల్పీలు తీపి జ్ఞాపకాలుగా మిగిలి పోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్ పేరొందిన ఝున్‌ఝున్‌వాలా చివరిసారిగా ఆగస్ట్ 7న ముంబై -అహ్మదాబాద్ మధ్య జరిగిన ఆకాశ ఎయిర్ తొలి విమాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనిపించారు. వీల్‌చైర్‌లో తిరుగుతూ అందరిన్నీ ఉత్సాహపరుస్తూ జోక్స్ వేస్తూ పోటీదారులతో ముచ్చటించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణీకుల సౌకర్యాల్లోగానీ, ఉత్పత్తి నాణ్యతలో ఎలాంటి రాజీలేకుండా పొదుపుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆకాశ యాజమాన్యం , సిబ్బందికి పిలుపునిచ్చారు. ఆకాశ కోసం ఝున్‌ఝున్‌వాలా ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టి ఇండిగో లాంటి సంస్థల్ని భయపెట్టిన ఝున్‌ఝున్‌వాలా సంస్థ భవిష్యత్తు కోసం భారీ ప్రణాళికలే వేశారు విస్తృతమైన పెట్టుబడితో పాటు, ఎయిర్‌లైన్ నిర్వహణ కోసం అగ్రశ్రేణి విమానయాన పరిశ్రమ లీడర్లను ఎంచుకున్నారు. ప్రపంచంలో బహుశా ఏ విమానయాన సంస్థ ఏర్పాటైన 12 నెలల్లో సేవలు ప్రారంభించ లేదు. కానీ ఝున్‌ఝున్‌వాలా ఆ ఘనతను సాధించారు. ముఖ్యంగా జెట్ ఎయిర్వేస్, గో ఫస్ట్ సీఈఓగా పనిచేసిన దుబెనే సీఈవోగా ఎంపిక చేశారు. విమానయాన సంస్థలో దుబేకు 31 శాతం వాటా ఉంది. అలాగే 2018 వరకు ఇండిగో డైరెక్టర్‌గా ఒక దశాబ్దం పాటు పనిచేసిన ఆదిత్య ఘోష్‌ను కూడా తన టీంలో చేర్చుకున్నారు. ఘోష్ ఎయిర్‌లైన్‌లో 10 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. ఝున్‌ఝున్‌వాలా చరిష్మా సలహాలు, ఫండ్ పుల్లింగ్ సామర్థ్యాలు ఆకాశకు ఇకపై అందుబాటులో లేనప్పటికీ, ఆకాశ అభివృద్ధి చెందుతుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లోని రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని అన్నారు. ఆ మేరకు ఆయన సంస్థను కట్టుదిట్టం చేశారన్నారు. ఇండియా జనాభా, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, ఏవియేషన్ పరిశ్రమ వృద్ధిపై ఆయన విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక ఆకాశ ఎయిర్ అని అన్నారు. అక్టోబర్ 11న రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ప్రమోటర్‌గా ఉన్న 'ఆకాశ ఎయిర్' అల్ట్రా-లో కాస్ట్ విమాన సేవలు ప్రారంభించేందుకు పౌర విమానయాన శాఖ నుంచి ప్రాథమిక అనుమతులు లభించాయి. జులై 7న సేవలు ప్రారంభించేందుకు 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్' నుంచి 'ఆపరేటర్ సర్టిఫికేట్' పొందింది. ఆకాశ ఎయిర్ ఆగస్టు 7న తొలి సర్వీసును నడిపింది. ఈ క్రమంలోనే ఆగస్టు 13న బెంగళూరు-కొచ్చి, ఆగస్టు19న బెంగళూరు-ముంబై,సెప్టెంబరు 15న చెన్నై-ముంబైకు తన విమాన సేవల్ని అందించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. -
సైమండ్స్‌కు ఐసీసీ నివాళి.. పాకిస్తాన్‌పై 143 నాటౌట్ వీడియో ట్వీట్
ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) హఠాన్మరణం యావత్ క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శనివారం రాత్రి ఆస్ట్రేలియాలోని టౌన్స్‌విల్లే సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేర్‌వార్న్ ఆకస్మిక మృతి ఘటనను మరువకముందే సైమండ్స్ మరణవార్త కలచివేస్తోంది. క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చుతున్నారు. ఈక్రమంలోనే సైమోకు నివాళి అర్పించిన ఐసీసీ 2003 ప్రపంచకప్‌లో ఆయన విధ్వంసక బ్యాటింగ్ వీడియోను ట్విటర్లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. చదవండి👉🏾 ఆండ్రూ సైమండ్స్ మృతి.. దిగ్గజ క్రికెటర్ల సంతాపం బౌండరీల వరద! 2003 దక్షిణాఫ్రికా వన్డే వరల్డ్‌కప్‌ను పాంటింగ్ సారథ్యంలో ఆస్ట్రేలియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు జరిగిన లీగ్ మ్యాచుల్లో జట్టు విజయంలో సైమండ్స్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తమ తొలిమ్యాచ్‌లోనే పాంటింగ్ సేన 82 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. 2 సిక్సర్లు, 18 ఫోర్లతో వీరవిహారం చేసిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సైమండ్స్ 125 బంతుల్లో 143 (నాటౌట్) పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఛేదనలో ఎంతమాత్రం సఫలీకృతం కాలేదు. 44.3 ఓవర్లకే పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. చదవండి👉🏻 IPL 2022: సన్‌రైజర్స్ ఢమాల్ As we mourn the loss of former Australian all-rounder Andrew Symonds, we take a look back to his tremendous 143* against Pakistan at the 2003 World Cup.#RIPRoy pic.twitter.com/oyoH7idzkb — ICC (@ICC) May 15, 2022 -
జిమ్ మరణం.. ఆమెది గుండెపోటు కాదు!
బెంగళూరు: జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కుప్పకూలి మృతి చెందిన మహిళ వీడియో ఒకటి సుమారు పదిరోజుల కిందట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె గుండెపోటుతోనే మృతి చెంది ఉంటారని పోలీసులు, అంతా ప్రాథమికంగా భావించారు. అయితే ఆమెది గుండెపోటు మరణం కాదని వైద్యులు ఇప్పుడు ధృవీకరించారు. ఈమధ్యకాలంలో ఉన్నపళంగా కుప్పకూలి చనిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వాటిలో చాలావరకు ఫిట్‌నెస్‌కు ముడిపడి ఉండడంతో.. జిమ్లంటేనే వణికిపోతున్నారు చాలామంది. ఈ తరుణంలో కర్ణాటక మహిళ హఠాన్మరణం సైతం ఆ ప్రచారానికి ఆజ్యం పోసింది. అయితే.. 44 ఏళ్ల వినయకుమారి విట్టల్ మరణం వెనుక గుండె పోటు కారణం కాదని వైద్యులు ధృవీకరించారు. ఆమె మరణానికి కారణం బ్రెయిన్ ఎటాక్ అని శవపరీక్షలో వైద్యులు గుర్తించారు. మెదడులోని రక్తనాళం పగిలి ఆమె మరణించారట. ఇందుకు సంబంధించిన ఆటాప్సీ రిపోర్ట్ కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. మెదడులో ఉబ్బిన రక్తనాళము పగిలి పోవడం వల్ల రక్తస్రావం జరిగి.. కోమా వెనువెంటనే మరణం సంభవించింది అని ఉంది ఆ నివేదికలో. కాబట్టి, జిమ్‌లకు వెళ్తున్న వాళ్లు.. ఒక్కసారిగా భారీ బరువులు ఎత్తడం లాంటివి చేయడం వల్ల.. రక్తపోటు స్థాయిలు పెరగడంతో పాటు మరణానికి దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఘటన వివరాలు.. మంగళూరు మల్లేశ్వపాళ్యంలో నివాసం ఉండే వినయకుమారి (44).. సీవీ రామ్‌నగర్ జీఎం పాల్యాలోని ఓ జిమ్ సెంటర్లో మార్చి 26న ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో జిమ్ చేస్తూ కుప్పకూలిపోయారు. వెంటనే పక్కనున్నవారు ఆమెను రక్షించాలని ప్రయత్నించినా.. క్షణాల వ్యవధిలోనే ఆమె కన్నుమూసింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వినయకుమారి ఓ ప్రైవేట్సంస్థలో పని చేస్తోంది. ఆమె అవివాహితురాలు. జిమ్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
మంచి మిత్రుణ్ని కోల్పోయా: సీఎం వైఎస్ జగన్
-
గుండె బద్ధలయ్యింది.. నమ్మలేకపోతున్నా: హర్నాజ్ సంధు
రంగుల ప్రపంచంలో మరో ధృవతార నేలరాలింది. మిస్ యూఎస్ఏ 2019 విజేత చెస్లై క్రిస్ట్ హఠాన్మరణం.. ఫ్యాషన్ ప్రపంచంలో విషాదం నింపింది. బ్యూటీ క్వీన్‌గా మాత్రమే కాదు.. ఫ్యాషన్ బ్లాగర్‌గా, లాయర్, ఉద్యమకారిణిగా 30 ఏళ్ల చెస్లై క్రిస్ట్ పేరు సంపాదించుకున్నారు. ఆదివారం ఉదయం క్రిస్ట్ న్యూయార్క్‌లోని తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె హఠాన్మరణంతో షాక్ తిన్న మోడలింగ్ ప్రపంచం నివాళులర్పిస్తోంది. భారతీయ మోడల్, మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధుతో ఆమెతో కలిసి ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుని భావోద్వేగానికి లోనైంది. ‘నువ్వు ఎంతో మందికి స్ఫూర్తి. నమ్మకలేకపోతున్నా. గుండెబద్ధలైంది. రెస్ట్ ఇన్ పీస్ చెస్లై’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది హర్నాజ్. ఇదిలా ఉండగా.. న్యూయార్క్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 60 అంతస్థుల ఆ బిల్డింగ్‌లో 9వ ఫ్లోర్లో ఆమె నివాసం ఉంటోంది. ఆమెది ఆత్మహత్యేనా? కారణాలేంటన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. 1991లో మిచ్‌గాన్, జాక్సన్లో జన్మించిన క్రిస్ట్.. సౌత్ కరోలీనాలో పెరిగింది. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలీనా నుంచి గ్రాడ్యుయేషన్, వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి న్యాయ పట్టా తీసుకుంది. నార్త్ కరోలీనాలోనే సివిల్ లిటిగేటర్‌గా విధులు నిర్వహించి.. ఆపై వైట్‌కాలర్ గ్లామర్ పేరుతో ఫ్యాషన్ బ్లాగ్‌ను నిర్వహించారు. 2019లో మిస్ నార్త్ కరోలీనాగా, అదే ఏడాది మిస్ యూఎస్ఏ టైటిల్‌ను గెల్చుకుంది. పలు అంశాలపై కూడా ఆమె వ్యతిరేక గళం వినిపించి ఉద్యమకారిణిగానూ పేరు సంపాదించుకుంది. -
పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం
-
కిమురా ఆకస్మిక మృతి.. షాక్‌లో అభిమానులు
టోక్యో : ప్రముఖ రెజ్లర్ హనా కిమురా(22) ఆకస్మిక మరణం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ విషయాన్ని రెజ్లింగ్ సంస్థ స్టార్డమ్ వెల్లడించింది. కిమురా మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. అయితే కిమురా మరణానికి గల కారణాలు తెలియడం లేదు. మరోవైపు సైబర్ వేధింపుల వల్లే ఆమె మరణించారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చనిపోవడానికి ముందు కిమురా చేసిన పోస్టులు తను సైబర్ బెదిరింపులకు గురయ్యారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వారు అంటున్నారు. కిమురా జపాన్‌లో మంచి రెజ్లర్‌గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఇటీవల విపరీతమైన ఆదరణ పొందిన నెటిఫ్లిక్స్ రియాలటీ షో టెర్రస్ హౌస్‌లో ఆమె నటించారు. టెర్రస్ హౌస్ షోలో ఉండే ఆరుగురు రెసిడెంట్స్‌లో కిమురా ఒకరు. అయితే కరోనా కారణంగా ఆ షో షూటింగ్ ఏప్రిల్ నుంచి నిలిచిపోయింది. కాగా, ఆమె తల్లి క్యోకో కిమురా కూడా మంచి రెజ్లర్. -
నటుడు ఉదయ్ కిరణ్ హఠాన్మరణం
సాక్షి, కాకినాడ: యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్ (34) హఠాన్మరణం చెందాడు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో గుండెపోటుతో అతడు మరణించాడు. ఉదయ్‌కిరణ్ పార్థివ దేహానికి పలువురు రాజకీయ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. (చిరంజీవి తొలి సినిమా దర్శకుడు మృతి) పరారే, ఫ్రెండ్స్‌బుక్ సినిమాల్లో హీరోగా ఉదయ్‌కిరణ్ నటించారు. పలు తమిళ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకుని కష్టాలు కొనితెచ్చుకున్నారు. 2016లో జూబ్లీహిల్స్‌లోని ఓవర్ ద మూన్ పబ్‌లో గొడవ చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఉదయ్ కిరణ్ పలు నేరాలకు పాల్పడినట్టు అప్పట్లో పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసులోనూ అరెస్టై జైలు జీవితం గడిపాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి కాకినాడలో మహిళను మోసం చేసిన కేసులోనూ అరెస్టయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 59లోని నందగిరిహిల్స్‌లో ఇంటి యాజమానిపై దౌర్జన్యం చేయడంతో 2018లో క్రిమినల్ కేసు పెట్టారు. ఇలా పలువురిని మోసం చేయడంతో అతడిపై పలుమార్లు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఉదయ్ కిరణ్‌కు 2016లో ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చికిత్స అందించారు. -
మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం
సాక్షి,ప్రతినిధి ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి) (56) బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. ఒంటి గంట సమయంలో తీవ్రస్థాయిలో గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆర్‌ఆర్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందిన్నట్లు నిర్ధారించారు. దివంగత సినీనటుడు ఎస్వీ రంగారావుకు స్వయానా మేనల్లుడైన బడేటి బుజ్జి 1995లో రాజకీయ రంగ ప్రవేశం చేసి మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 2000లోనూ గెలిచి వైస్ చైర్మన్‌గా పని చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుపున ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. బడేటి బుజ్జి మృతి వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని, మంత్రి కురసాల కన్నబాబు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు నివాళులు అరి్పంచారు. -
అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
వాషింగ్టన్: అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భారతీయుడు ఒకరు మంగళవారం అకస్మాత్తుగా చనిపోయాడు. నార్త్ కరొలినాలో నివసించే శివ చలపతి రాజు ఆరకిల్ సంస్థలో డెవలపర్‌గా ఉన్నారు. అంతకుముందు, ఆయన విప్రో, బ్రిటిష్ పెట్రోలియం సంస్థల్లో పనిచేశారు. రాజు మృతికి కారణాలు తెలియరాలేదు. ఆయన గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ప్రస్తుతం పరిశీలనలో ఉంది. గ్రీన్‌కార్డ్ లేకపోవడం వల్ల రాజు భార్య బాబీ సౌజన్య భారత్‌కు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజు మృతదేహాన్ని భారత్‌కు పంపించేందుకు మిత్రులు పీడ్మాంట్ ఏరియా తెలుగు అసోసియేషన్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారని అమెరికన్ బజార్ పత్రిక పేర్కొంది. కాగా శివ చలపతి రాజు రాజమండ్రిలో చదువుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హత్యా?ఆత్మహత్యా?
ఇన్స్పెక్టర్ జగదీష్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరుతుండగా అందిన వార్త ‘ప్రముఖ యువ నటి లలితారాణి ఆకస్మిక మరణం’. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న లలితారాణి, నందకుమార్ తమ పెళ్లి వార్తను ఒక వారంలో విడుదల చేస్తామన్న లోపే ఇలా జరగడం విచారకరం అని అన్ని టీవీ చానల్స్ బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేస్తూ, మధ్య మధ్యలో ఆమెది సహజ మరణమా? ఆత్మహత్య?అని మరొక ట్విస్ట్‌కు తెరలేపుతున్నాయి. అది చూసి నివ్వెరపోయాడు జగదీష్ ఎందుకంటే అతను కూడా ఆమెకు అభిమాని. ఆమె ఇప్పుడిప్పుడే ధ్రువతారగా వెలుగుతోంది, ఒక్కో సినిమాకు కోటి రూపాయలకు పైగానే పారితోషకం తీసుకొంటోంది అలాంటి నటీమణి మరణం పలు అనుమానాలకు దారి తీస్తోంది. జగదీష్ భృకుటి ముడిపడింది ఇందులో ఏదో మర్మం దాగివుంది అని ఆలోచిస్తూనే జీపు ఎక్కాడు.‘‘సార్! స్టేషన్ వచ్చింది’’ అని డ్రైవరు అన్నాక గాని ఈ లోకంలోకి రాలేదు. కుర్చీలో కూర్చున్నాడో లేదో టేబుల్‌పైన ఫోన్ మోగింది. ‘‘హలో ఎవరు?’’‘‘సార్! నా పేరు ప్రభాకరం. నా కూతురు సినిమా హీరోయిన్ లలితారాణి మరణించింది... మీరు వెంటనే రావాలి’’జగదీష్ తన అసిస్టెంట్ ప్రసాద్‌తో కలిసి లలితారాణి బంగళాకు పోలీసు వెహికిల్‌లో బయలుదేరి వెళ్ళాడు. అప్పటికే ఆమె అభిమానులు గేటు బయట బారులు తీరి ఉన్నారు. ‘‘ఏంటి ప్రసాద్! మనకంటే ముందే ఇంతమంది రావడం’’ అని జగదీష్ అనేలోపే ‘‘ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం సార్!’’పోలీసు కారును చూడగానే గూర్ఖా గేటు తీశాడు అదే అదనుగా కొందరు అభిమానులు లోపలకు చొరబడబోయరు గూర్ఖా వారిని వారించాడు. లలిత నాన్న ప్రభాకరం, అతని చిన్న భార్య తులసి, హీరో నందకుమార్ విషణ్ణ వదనాలతో లలితారాణి డెడ్ బాడీకి కాస్త దూరంగా నిలబడి ఉన్నారు. ఒక పక్కగా పనిమనిషి లక్ష్మి, ఆమె భర్త తోటమాలి శంకరయ్య వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అభిమానుల తాకిడి ఎక్కువవుతోందని తెలిసి పోలీసు ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసి తగినంత బలగాన్ని పంపమన్నాడు జగదీష్. ‘‘ఎలా జరిగింది?’’ అని ప్రభాకరాన్ని అడిగాడు. ‘‘నిన్న రాత్రి షూటింగ్ నుంచి బాగా పొద్దు పోయాక అంటే సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో వచ్చింది. మేడ మీద తన గదిలోకెళ్లిపడుకుంది. తెల్లారి ఎనిమిది గంటలైనా తలుపు తీయలేదు. లక్ష్మి కాలింగ్ బెల్ కొట్టింది. తలుపు కూడా తట్టింది. కిందికి వచ్చి మాకు విషయం చెప్పడంతో మేము పరుగున వెళ్లి తలుపును గట్టిగా తోస్తే బోల్ట్ ఊడి వచ్చింది. నిద్రపోతున్నట్టుగానే ఉంది. శరీరం పట్టుకొని చూస్తే పూర్తిగా చల్లబడింది. వెంటేనే మా ఫ్యామిలీ డాక్టరుకు ఫోన్ చేశాను. చనిపోయి కొన్ని గంటలవుతోందని చెప్పాడు’’‘‘ఆత్మహత్య చేసుకుందని కొన్ని టీవీ చానల్స్ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. రాణి ఆత్మ హత్య చేసుకొనేంత పిరికిది కాదు సార్!’’ అంది తులసి. ‘‘అన్ని విషయాలూ బయటకు వస్తాయి. ముందుగా క్లూస్ టీమ్ వారు వారి పనులు చేసుకుని ఫోటోలు అవి తీసుకున్నాక డెడ్ బాడీని పోస్ట్‌మార్టంకు పంపే ఏర్పాట్లు చేద్దాము’’ అని ప్రభుత్వ ఆసుపత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ పంపమన్నాడు. రిపోర్ట్ రావడానికి సాయంత్రం కావచ్చు అని ఇదే విషయాన్ని అభిమానులందరికీ చెప్పాడు.‘‘సార్ మా అభిమాన నటిది ఆత్మహత్య కాదు. ఇది కచ్చితంగా హత్యే వారిని ఎలాగైనా మీరు పట్టుకోవాలి’’ అన్నాడు ఒక అభిమాని.‘‘కడసారి చూపుకోసం ఎంతసేపయినా వేచివుంటాము సార్! అన్నారు’’ ముక్త కంఠంతో. ‘‘మీ అందరికీ తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. దయచేసి మాకు సహకరించండి. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు’’ అన్నాడు జగదీష్. అంబులెన్స్ డెడ్ బాడీని తీసుకెళ్లాక ప్రభాకరంగారిని ఉండమని మిగతా వారిని పంపించి, జగదీష్, ప్రసాద్‌ల పర్యవేక్షణలో క్లూస్ టీమ్ లలితారాణి గదిలో ఆధారాల కోసం అన్వేషణ మొదలు పెట్టింది. టీపాయ్ మీద ఉన్న హ్యాండ్ బ్యాగ్, దాని పక్కన సెల్ ఫోను తప్ప వారికి ఏమీ లభించలేదు. వాటిని స్వాధీనం చేసుకొని తలుపు గడియను బాగుచేయించి, తాళం వేయించి సీల్ చేసి కిందికి వచ్చారు. ఆ సమయానికి గుంటూరు నుంచి లలిత మేనత్త, ఆమె కొడుకు అంటే లలిత బావ చంద్రం వచ్చారు. వారిని మా అక్క, మా మేనల్లుడు అని జగదీష్‌కు పరిచయం చేశాడు ప్రభాకరం. ‘‘పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక మాట్లాడదాము’’ అని జగదీష్ ప్రభాకరానికి చెప్పి, సిబ్బందితో కలసి బయల్దేరాడు.పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. ప్రభాకరాన్ని రమ్మని కబురు పెట్టాడు జగదీష్. కొద్దిసేపటికి ప్రభాకరంతో పాటు నందకుమార్, చంద్రం కారులో వచ్చారు.‘‘అధిక మోతాదులో నిద్ర మాత్రలు వాడడం వల్ల లలితారాణి చనిపోయింది. ఆమె చనిపోయిన సమయం రాత్రి ఒంటిగంట’’ అని చెప్పి ప్రభాకరానికి రిపోర్ట్ ఇచ్చి డెడ్ బాడీని తీసుకెళ్లమన్నాడు జగదీష్.వారు వెళ్ళాక ‘‘ప్రసాద్! ఆ హాండ్ బ్యాగ్‌లో చిన్న పాకెట్ డైరీ, బాల్ పెన్, సెల్‌ఫోన్ మనకు ఏమైనా ఉపయోగపడ్డాయా?’’ అన్నాడు జగదీష్. ‘‘హాండ్ బ్యాగ్, అట్టతో ఉన్న పాకెట్ డైరీ, బాల్ పెన్‌ల మీద లలితారాణి వేలి ముద్రలు తప్ప వేరే వాళ్లవి లేవు సార్! సెల్ ఫోన్ డేటా కూడా ఉపయోగ పడలేదు. కానీ డైరీలో ఈ వాక్యాలు చూడండి సార్!’’‘బావకు నా ముఖం చూపించలేను.నాన్నకు పిన్నికి తలవంపులు తెచ్చాను’‘‘దీనిని బట్టి ఆమె ప్రెగ్నెంట్ అని అర్థమవుతోంది. అందువల్లే ఆత్మ హత్య చేసుకొని వుండవచ్చుకదా?’’ అన్నాడు ప్రసాద్. డెడ్ బాడీని అంబులెన్స్‌లో ఎక్కించే సమయంలో ప్రభాకరాన్ని, చంద్రాన్ని పిలిపించి డైరీలోని ఆ రెండు వాక్యాలను చూపించాడు. ‘‘ఆమె అంత్యక్రియలు రేపు అయిపోగానే ఎల్లుండి పరిశోధన మొదలుపెడతాము. అది పూర్తి అయ్యేవరకు ఈ విషయాలను మీరిద్దరూ చాలా గోప్యంగా ఉంచాలి అని చెప్పాడు. ‘‘అలాగే సార్’’ అన్నారు వారు. తమ అభిమాన నటిది ఆత్మహత్య కాదు, హత్య అని పలుచోట్ల ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు కొందరు అభిమానులు. పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్యన అభిమానులు సినీ పరిశ్రమ వారి ప్రముఖుల అశ్రునయనాల మధ్య లలితారాణి అంత్యక్రియలు జరిగాయి. జగదీష్, ప్రసాద్‌ను తీసుకొని తన మిత్రుడు డిటెక్టివ్ అయిన విశ్వంను కలవడానికి అతని ఇంటికి వెళ్లారు. ఎన్నో పరిశోధనలలో విశ్వం, జగదీష్‌కు సహాయపడ్డాడు. జగదీష్, ప్రసాద్‌లను సాధారంగా ఆహ్వానించాడు విశ్వం. స్నాక్స్ తింటూ టీ తాగుతున్న సమయంలో లలితారాణి తాలూకు డైరీని చూపించి,ఆ రెండు వాక్యాలను చదవమన్నాడు జగదీష్. అది చదివిన తరువాత విశ్వం ఫోన్ చేసి ఫోరెన్సిక్ లాబొరేటరీలో పనిచేసే కిరణ్‌ను వెంటనే రమ్మన్నాడు. కిరణ్ పావు గంటలో అక్కడకు చేరుకున్నాడు. విశ్వం అన్ని విషయాలూ చెప్పాడు. దస్తూరీ రిపోర్ట్ రావడానికి రెండు రోజుల సమయం పట్టవచ్చని డైరీని తీసుకు వెళ్లాడు.‘‘నీకు ఏ సమయంలోనైనా అందుబాటులో వుంటాను. నీ పరిశోధనను మొదలు పెట్టు’’ అన్నాడు జగదీష్‌తో విశ్వం. ‘‘అలాగే ఇప్పుడే లలితారాణి ఇంటికి వెళుతున్నాం..ఉంటా విశ్వం’’ అని చెప్పి బయలుదేరుతూ ప్రభాకరానికి వస్తున్నామని ఫోన్ చేశాడు. అక్కడకు చేరుకున్నాక ప్రభాకరం, తులసి, చంద్రం, లక్ష్మి, శంకరయ్యల నుంచి జగదీష్, ప్రసాద్‌లు విడి విడిగా విషయాలను సేకరించారు.రెండు రోజులకు వేలిముద్రల పరిశోధన రిపోర్టును, డైరీని కిరణ్ జగదీష్‌కు అందించాడు. ఆ రెండు వాక్యాలు లలితారాణివి కావని ఆ రిపోర్టులో ఉంది. లలితారాణి చనిపోయిన రోజున ఉదయం షూటింగ్ జరిగిన ప్రదేశం నుంచి కొన్ని వివరాలు సేకరించాడు ప్రసాద్, వాటిని జగదీష్ కు అందించాడు. రెండు రోజుల తరువాత అన్ని విషయాలను సమకూర్చుకొని జగదీష్. ప్రసాద్ కలిసి మళ్లీ విశ్వం వద్దకు వెళ్లారు. ‘‘మీరు సేకరించిన విషయాలలో ఎలాంటి లోపం లేదు రేపు ప్రెస్ వారిని కూడా పిలిచి దోషిని అరెస్ట్ చేయండి!’’ అన్నాడు విశ్వం. ప్రభాకరం ఇంట్లో అందరూ అందుబాటులో ఉండాలని ఒక ముఖ్యమైన విషయం ప్రకటిస్తానని ప్రెస్ వారికి కూడా కబురు పెట్టాడు. నందకుమార్, పల్లవి కూడా అక్కడకు చేరుకున్నారు.ప్రెస్ వారితో పాటు అందరూ సమావేశమయ్యారు. ‘‘ఏ విషయమో చెప్పండి సార్!’’ అన్నారు ప్రెస్ వాళ్లు. ‘‘ఆ విషయానికి వచ్చేముందు మీకు ఓ చిన్న కథ చెబుతాను...ఒక ఊరిలో ఒక అక్క, తమ్ముడు ఉన్నారు అక్కకు కొడుకు పుట్టాక బావ చనిపోయాడు. తమ్ముడికి కూడా వివాహమయ్యింది. అతను పట్నంలో కాపురం పెట్టాడు, అక్కడే వ్యాపారం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఏడాదికి అతనికి అమ్మాయి పుట్టింది...మేనల్లుడికే తన అమ్మాయిని ఇస్తానని అక్కకు వాగ్దానం చేశాడు.వ్యాపారంలో బాగా నష్టం రావడంవల్ల దిగులుతో అతని భార్య కన్నుమూసింది. బిడ్డను చూసుకోవడానికని అక్క తమ్ముడికి మళ్లీ పెళ్లి చేసింది. కాలచక్రం గిర్రున తిరిగింది అల్లుడు ఏజీ బియస్సీ చేసి వ్యవసాయం చూసుకుంటున్నాడు. కూతురు ఇంటర్లో చేరింది. ఆ అమ్మాయి ఒకసారి కాలేజీలో డ్రామా వేసింది. అది చూసిన ఒక నిర్మాత ఆమె సినిమాకు పనికొస్తుందని చెప్పి ప్రముఖ హీరో పక్కన హీరోయిన్ చేశాడు. అలా ఆమె మంచి పేరు తెచ్చుకుంది ఆమెకు బావ అంటే ఎంతో ఇష్టం. కానీ ఒకసారి సముద్రంలో బోటులో షూటింగ్ సన్నివేశాలు చిత్రికరిస్తుండగా ఆ స్పాట్లో బోటు ప్రమాదం నుంచి ఆమెను హీరో కాపాడాడు. అప్పటి నుంచి హీరో ప్రేమలో పడింది. హీరో కూడా ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అసలు చిక్కు అప్పుడే మొదలయ్యింది. హీరోకు కూడా ఒక మరదలు ఉంది. ఆమె బావను తప్ప ఎవ్వరినీ చేసుకోనని చెప్పింది.ఒక రోజు ఆమె హీరోయిన్ బావను కలిసి, నీవు నీ మరదలిని పెళ్లి చేసుకుంటేనే నా బావ నాకు దక్కుతాడు అని గట్టిగా చెప్పింది. కానీ లాభం లేక పోయింది. ఒక రోజు షూటింగ్ చేస్తున్న ప్రాంతానికి వెళ్లింది. షూటింగ్ ప్యాకప్ చెప్పారు. అప్పుడు సమయం రాత్రి పదకొండు అయ్యింది. మేకప్ తీసివేయడానికి హీరో, హీరోయిన్లు మేకప్ రూమ్‌కు వెళ్లారు. ఆఫీస్ బాయ్ మూడు గ్లాసులతో పళ్ల రసాన్ని తెచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్లాడు. ఒకటి మాములుది, రెండు చల్లనివి.. మామూలు గ్లాసులో ఆమె ఇంటి నుంచి తెచ్చిన నిద్ర మాత్రలను కరిగించిన ద్రవాన్ని కలిపింది.ఎవరికి వారు వాళ్ల కార్లలో ఇళ్లకు బయలుదేరారు. హీరోయిన్ను ఆమె కారు డ్రైవరు పది నిముషాల్లో ఆమెను ఇంటి వద్ద దింపాడు. తక్కువ మోతాదు ఉన్న నిద్ర మాత్రలను ఎక్కువ శాతంలో కరిగించిన ద్రవం ఉన్న పళ్ల రసాన్ని ఆమె తీసుకోవడం వల్ల అది మెల్లగా ప్రభావం చూపి ఆమె కన్ను మూసింది’’‘‘ఆమెది ఆత్మహత్యగా రిపోర్ట్ వచ్చింది. ఎవరో ఆవిడ చెప్పండి సార్ టెన్షన్ గా వుంది’’ అన్నాడు ఒక విలేఖరి. ‘‘ఒక రోజు మేము హీరోగారి ఇంటికి వెళ్లాము అతనితో మాట్లాడుతుండగా అప్పుడు అతని మరదలు స్నాక్స్ కాఫీ తీసుకొచ్చింది. మాటల మధ్యలో మా మరదలు కవితలు బాగా రాస్తుందని చెప్పాడు. నా అసిస్టెంట్ డైరీ పెన్ను ఇచ్చి ‘మేడమ్ మా పోలీసు డిపార్ట్మెంట్ మీద ఒక కవిత వ్రాయండి వచ్చే సావనీర్లో వేస్తాము’ అన్నాడు. ఆమె కవిత వ్రాసేలోపల ఆమె గదిలోకి వెళ్లి సోదా చేశాడు. అక్కడ నిద్ర మాత్రల ప్రిస్క్రిప్షన్‌తో పాటు కొన్ని నిద్ర మాత్రలు డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో దొరికాయి’’ ‘‘సార్ ఆమె కవితలు వ్రాయడానికి హత్యకు ఎలాంటి సంబంధం ఉంది?’’ అన్నాడు ఒకతను. హీరోయిన్ డైరీలో రెండు వాక్యాలు రాసి వున్నాయి.ఒకటి’ మా బావకు నా ముఖం చూపించలేను... రెండవది నాన్నకు పిన్నికి తలవంపులు తెచ్చాను’ ఇవి, కవితలు వాసిన వారు ఒక్కరే. ఇక కథను ముగిస్తున్నాను..ఆ హీరోయిన్ లలితారాణి ఆమెను హత్య చేసింది ఎవరో కాదు నందకుమార్ గారి మరదలు పల్లవి. అక్కడే ఉన్న పల్లవి ముఖంలో రంగులు మారాయి. ‘‘పల్లవిగారు ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకుంటారా?’’‘‘అవును నా బావ నాకు దక్కేలా లేడని నేనే ఈ పని చేశాను’’‘‘పోలీసులు పల్లవిని అరెస్ట్ చేశారు. నందకుమార్‌తో పాటు అందరూ నివ్వెరపోయి చూడ సాగారు. ‘‘చిక్కుముడిని ఎంతో చాకచక్యంగా విడదీసిన జగదీష్‌ను, ప్రసాద్‌ను అందరూ ప్రశంసించారు’’. యు.విజయశేఖర రెడ్డి -
కొడుకుని చూసి వెళుతుండగా..
నాయుడుపేటటౌన్ (నెల్లూరు): గురుకులంలో చదువుతున్న కొడుకుని చూసి తిరిగి బైక్‌పై ఇంటికి వెళుతున్న ఓ వ్యక్తి మండల పరిధిలోని పండ్లూరు జాతీయ రహదారి కూడలి వద్ద ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలి హఠాన్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. కోట మండలం లక్ష్మయ్యకండ్రిగ గ్రామానికి చెందిన కె.మాతయ్య (35) ఆదివారం తన భార్యతో కలిసి దొరవారిసత్రంలో ఉన్న గురుకులంలో చదువుతున్న కుమారుడిని చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి గ్రామానికి బయలుదేరారు. తాను ఇంటికి మళ్లీ వస్తానని భార్యను నాయుడుపేటలో బస్టాండ్‌లో కోట బస్సు ఎక్కించాడు. అనంతరం మాతయ్య ఒక్కడే బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో పండ్లూరు జాతీయ రహదారి కూడలి వద్దకు వచ్చేసరికి గుండెనొప్పిగా ఉందని బైక్‌ను రోడ్డు పక్కన నిలిపాడు. కొద్దిసేపటికే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు గుర్తించి 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మాతయ్య మృతిచెందినట్లుగా నిర్ధారించారు. ఈ విషయమై సమాచారం అందుకున్న ఎస్సై జి.వేణు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదుచేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మాతయ్య మృతిచెందినట్లు తెలుసుకున్న భార్య, అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
అవిసీ హఠాన్మరణం.. అనుమానాలు!
స్టాక్ హోమ్: ప్రముఖ సంగీత దర్శకుడు, డీజే.. అవిసీ హఠాన్మరణం పాప్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 28 ఏళ్లకే ఈ యువ సంచలనం మృతి చెందటం అనుమానాలకు తావిస్తోంది. ఆయన మృతి వార్తను పబ్లిసిస్ట్ బరోన్ మీడియాకు వెల్లడించారు. ఒమన్‌లో అవిసీ కన్నుమూసినట్లు శుక్రవారం బరోన్ పేరు మీద ఓ ప్రకటన విడుదలయ్యింది. అవిసీ ఎవరు?.. స్వీడన్‌కు చెందిన డీజే అవిసి. అసలు పేరు టిమ్ బర్గిలింగ్. చిన్న వయసులోనే పాప్ రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వేక్ మీ అప్ సాంగ్ అతని కెరీర్‌ను మలుపు తిప్పగా.. లెవల్స్ , అండ్ రీసెంట్లీ, లోన్లీ టుగెదర్ ఆల్బమ్‌లతో అవిసి పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. రెండుసార్లు అతని పేరు గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యింది కూడా. పాక్-అమెరికన్ సింగర్ నదిలా అలీతోపాటు పలువురు ప్రముఖ సింగర్లతో రాపర్‌గా కూడా ఆల్బమ్‌లను సృష్టించాడు. నిర్మాతగా కూడా అవిసీ రాణించాడు. మృతిపై అనుమానాలు... అవిసీ మృతికి గల కారణాలు తెలియరాలేదు. అయితే 2013లో అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నికోటిన్‌కు బానిసై అతను రోగాల బారిన పడ్డాడని పుకార్లు వినిపించాయి. అయితే అదంతా నిజం కాదని ఆ సమయంలో అవిసీ ఖండించాడు. కానీ, 2014లో అతను చాలా మట్టుకు షోలను అర్థంతరంగ రద్దు చేసుకోవటంతో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. చివరకు ఓ గార్డియన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవిసీ తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పరోక్షంగా తెలిపాడు. అవిసీ ఎలా చనిపోయాడన్నదానిపై అధికారులు ప్రకటన చేసే అవకాశం ఉంది. -
‘ఓరి భగవంతుడా .. ఎంత పని చేశావు..
‘ఓరి భగవంతుడా .. ఎంత పని చేశావు.. రాత్రి ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే తమ కుమారుడు ప్రాణాలు విడిచాడని అధికారుల నుంచి ఫోన్ రావడం ఏంటి...! తాము వచ్చి చూడగానే రక్తపు మరకలతో పడి వుండటం ఏంటి’ అంటూ ఏఆర్ కానిస్టేబుల్ తల్లిదండ్రులు బోరున విలపిస్తూ రిమ్స్ మార్చురీ వద్ద శనివారం ఉదయం కనిపించారు. కానిస్టేబుల్ భార్య అరుణ రోదిస్తూ, కుమారులు ఇద్దరూ తన తండ్రి మరణించాడనే విషయం అర్థం గాక అమాయకంగా అవ్వ, తాత వంక చూస్తున్నారు. ఈ సంఘటన అక్కడున్న వారి హృదయాలను కలచి వేసింది. కడప అర్బన్ : జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రధాన ద్వారం వద్ద సెంట్రీ విధుల్లో వున్న ఏఆర్ కానిస్టే బుల్ పెద్దశెట్టి వెంకటకిరణ్ (28) (ఏఆర్ పీసీ నంబర్ 2402).. తాను ధరించిన తుపాకీ 303 ప్రమాదవశాత్తు పేలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటకిరణ్‌ది 2009 బ్యాచ్. ఆయన తల్లిదండ్రులు పెద్దిశెట్టి వెంకటేశ్వర్లు, పద్మావతమ్మ. ముగ్గురు అక్కలు శ్రీదేవి, సుభాషిణి, భాగ్యలక్ష్మి ఉన్నారు. వెంకటకిరణ్‌కు భార్య అరుణ, కుమారులు వెంకట కైలాస్ (6), వెంకట భువనేష్ (4) ఉన్నారు. పోలీస్ క్వార్టర్స్‌లోనే కుటుంబ సభ్యులతో కలిసి నివాసం వుండే వాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 వరకు వుండే ప్రధాన ద్వారం సెంట్రీ షిప్ట్ డ్యూటీకి వచ్చాడు. వచ్చిన తర్వాత 12:45 గంటల ప్రాంతంలో తుపాకీ పేలడంతో.. అక్కడే విశ్రాంతి గదిలో వున్న సహచర సిబ్బంది వచ్చి చూసేలోపు కానిస్టేబుల్ రక్తపు మడుగులో పడి వున్నాడు. వెంటనే అధికారులు, సిబ్బం ది కలిసి రిమ్స్‌కు వైద్యం కోసం తరలించారు. అప్పటికే మృతి చెందాడని రిమ్స్ వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఆ సమయంలో జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ, కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా, ఏఆర్ డీఎస్పీ మురళీధర్, వన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ, రిమ్స్ సీఐ పురుషోత్తంరాజు తమ సిబ్బందితో కలిసి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసు లాంఛనాలతో నివాళి: వెంకటకిరణ్ మృతదేహాన్ని రిమ్స్‌లో జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడతోపాటు అధికారులు పరిశీలించారు. తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. పోస్టుమార్టం అనంతరం పోలీస్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ నివసించిన ఇంటి వద్ద పోలీసు లాంఛనాలతో తుపాకులను గాల్లోకి పేల్చి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ ఎ.శ్రీనివాసరెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ రుషికేశవ్‌రెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ మురళీధర్, ఆర్ఐలు విజయకుమార్, చంద్రశేఖర్, నాగభూషణం, సిబ్బంది, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీస్ లైన్‌లోని వారు పాల్గొన్నారు. పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నేతల సంతాపం పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అగ్రహారం శ్రీనివాస శర్మ, కడప తాలూకా ఎస్ఐ, కార్యదర్శి ఎన్.రాజరాజేశ్వరరెడ్డి, పెండ్లిమర్రి ఎస్ఐ ఎస్కె.రోషన్ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. రిమ్స్ మార్చురీలో కానిస్టేబుల్ మృతదేహాన్ని వారు పరిశీలించారు. సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం నుంచి కానిస్టేబుల్ కుటుంబానికి రావాల్సిన తక్షణ సహాయాలను వారికి అందేలా చూస్తామన్నారు. పోలీసులు ఏమన్నారంటే.. ఈ సంఘటనపై కడప వన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా పోలీసు కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద సెంట్రీ విధుల్లో వున్న ఏఆర్ కానిస్టేబుల్ వెంకటకిరణ్ శనివారం తెల్లవారుజామున 12:45 తుపాకీ పేలడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తమకు సమాచారం వచ్చిందన్నారు. వెంటనే రిమ్స్‌కు తరలించామని, అప్పడికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు. కేసు నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు చేపడతామన్నారు. -
శ్రీదేవి ప్లేస్‌లో మాధురి
శ్రీదేవి అతిలోక సుందరి. అందంలో కానీ అభినయంలో కానీ పోటీ అనే ప్రసక్తి లేకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేశారు. ఇటీవల దుబాయ్‌లో ఆమె దురదృష్టవశాత్తూ బాత్ టబ్‌లో పడి మరణించిన విషయం తెలిసిందే. ఇది జరగకముందే ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మ దర్శకత్వంలో ‘షిద్ధత్’ అనే సినిమాలో నటించటానికి అంగీకరించారట శ్రీదేవి. ఆమె హఠాన్మరణంతో ఆ ప్లేస్‌లో వేరే తారను తీసుకునే పనిలో పడింది చిత్రబృందం. పలువురు కథానాయికలను సంప్రదించారని సమాచారమ్. ఫైనల్లీ మాధురీ దీక్షిత్ ‘యస్’ చెప్పారు. ఈ విషయాన్ని శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ స్వయంగా వెల్లడించారు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ‘‘అభిషేక్ వర్మ రూపొందించబోయే తదుపరి సినిమా మమ్మీ హృదయానికి చాలా దగ్గరైనది. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నందుకు నేను, ఖుషీ, డాడీ మాధురీజీకి చాలా థాంక్‌ఫుల్‌గా ఉంటాం’’ అని పేర్కొన్నారామె. కరణ్ జోహార్ నిర్మించనున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్, ఆలియా భట్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. -
శ్రీదేవి: ఆ రోజు ఏం జరిగిందంటే..
ముంబై: ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణంపై వారం రోజులుగా అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆమె భర్త, ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్ తొలిసారి స్పందించారు. తన స్నేహితుని వద్ద శ్రీదేవి మరణించిన రోజు ఏం జరిగిందనే విషయంపై పెదవి విప్పారు. తాను సడెన్‌గా దుబాయ్ వెళ్లడం.. అక్కడ శ్రీదేవిని సర్ప్రైజ్ చేయడం.. ఇద్దరం కలసి గడపడం.. చివరిగా బాత్రూమ్లో శ్రీదేవిని విగతజీవిగా చూడటం.. ఇలా ఫిబ్రవరి 24న సాయంత్రం జరిగిన ప్రతి విషయాన్ని బోనీ తన స్నేహితుడు, ట్రేడ్ ఎనలిస్ట్ కోమల్ నాహ్తాకు పూసగుచ్చినట్టు వివరించారు. బుధవారం శ్రీదేవి అంత్యక్రియలకు కొద్దిసేపటి ముందు వారిద్దరి మధ్యా జరిగిన ఈ సంభాషణలను యథాతథంగా కోమల్ తన బ్లాగ్‌లో రాసి ఆ తర్వాత దానిని అధికారిక ట్వీటర్ పేజీలో షేర్ చేశారు. ఒంటరితనమంటే ఆమెకు భయం.. కోమల్ బ్లాగ్‌లో షేర్ చేసిన ప్రకారం(బోనీ కోణం నుంచి).. ఫిబ్రవరి 24 ఉదయం నేను శ్రీదేవితో మాట్లాడాను. ఆ రోజు సాయంత్రం నేను దుబాయ్ వస్తున్నట్టు ఆమెకు చెప్పలేదు. దుబాయ్ వెళ్లాలనే ఆలోచనకు జాన్వీ కూడా ఓకే చెప్పింది. ఎందుకంటే.. శ్రీదేవి ఒంటరిగా ఉంటే భయపడుతుందని, పాస్‌పోర్ట్, ఇతర కీలకమైన పత్రాలను ఎక్కడో పెట్టి మరిచిపోతుందనేది ఆమె భయం. గత 24 ఏళ్లలో నేను, శ్రీదేవి కలసి విదేశాలకు వెళ్లకపోవడం రెండుసార్లే జరిగింది. సినిమా ప్రదర్శనల కోసం న్యూజెర్సీ, వాంకోవర్‌లకు శ్రీదేవి వెళ్లింది. అప్పుడు నేను ఆమెతో లేను. అయితే నా స్నేహితుని భార్యను శ్రీదేవికి తోడుగా పంపాను. రెండు రోజులు శ్రీదేవి ఒంటరిగా ఓ విదేశీ గడ్డపై ఉండటం మాత్రం దుబాయ్‌లోనే జరిగింది. ఫిబ్రవరి 20న నేను, శ్రీదేవి, ఖుషీ ఓ వివాహం నిమిత్తం దుబాయ్ వెళ్లాం. ఫిబ్రవరి 22న లక్నోలో ఓ కీలకమైన సమావేశం ఉండటంతో దానికి హాజరయ్యేందుకు నేను ఇండియా వచ్చాను. ఫిబ్రవరి 22, 23వ తేదీల్లో జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్లోని రూమ్ నంబర్ 2201లో శ్రీదేవి రిలాక్స్ అవుతూ.. జాన్వీ కోసం షాపింగ్ చేసింది. ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3.30 గంటలకు నేను విమాన టికెట్ బుక్ చేసుకున్నాను. దుబాయ్ కాలమానం ప్రకారం సాయంత్రం 6.20 గంటలకు శ్రీదేవి ఉంటున్న హోటల్‌కు చేరుకున్నాను. హోటల్ వద్ద శ్రీదేవిని సర్ప్రైజ్ చేశాను. ఇద్దరం 15 నిమిషాలు గడిపాం. అనంతరం నేను ఫ్రెషప్ అయి.. రొమాంటిక్ డిన్నర్‌కు వెళదామని ప్రతిపాదించాను. దీనికి ఓకే అన్న శ్రీదేవి.. స్నానానికి వెళ్లింది.శ్రీదేవి మాస్టర్ బాత్రూమ్కు వెళ్లింది. లివింగ్ రూమ్‌కు వచ్చిన నేను టీవీ చూస్తూ కొద్దిసేపు గడిపాను. 15–20 నిమిషాల తర్వాత సమయం 8 గంటలకు సమీపిస్తుండటం.. శనివారం కావడంతో హోటల్లో రష్ పెరిగిపోతు0దనే ఉద్దేశంతో లివింగ్ రూమ్ నుంచే రెండుసార్లు బిగ్గరగా శ్రీదేవిని పిలిచినా పలక లేదు. టీవీ వాల్యూమ్ తగ్గించి మళ్లీ పిలిచినా స్పందన లేదు. దీంతో బెడ్రూమ్లోకి వెళ్లి డోర్ కొట్టి.. మళ్లీ శ్రీదేవిని పిలిచాను. ఎంతసేపటికీ డోర్ తీయకపో వడం.. లోపలి నుంచి ట్యాప్ అన్ చేసి ఉన్న శబ్దం రావడంతో ఆందోళన చెంది డోర్ తెరిచే ప్రయత్నం చేశాను. లోపల బోల్ట్ పెట్టకపోవడంతో డోర్ వెంటనే తెరుచుకుంది. లోపలికి వెళ్లి చూస్తే బాత్ట బ్లోని నీటిలో పూర్తిగా మునిగిన శ్రీదేవి కనిపించింది. షాక్‌కు గురై ఎటువంటి చలనం లేకుండా శ్రీదేవిని చూస్తూ ఉండిపోయాను. శ్రీదేవి మునిగిపోయింది.. బోనీ ప్రపంచం బద్దలైపో యింది. శ్రీదేవిని బోనీ సర్ప్రైజ్ చేసిన రెండు గంటల్లోనే అంతా జరిగిపోయిందని కోమల్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. తొలుత నీట మునిగి ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లి ఉండొచ్చని లేదా మొదట నిద్రలోకి జారుకుని లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లి నీట మునిగిపోయి ఉండొచ్చని కోమల్ అంచనా వేశారు. ఆమె ఒక్క నిమిషం కూడా వేదన అనుభవించిన దాఖలాలు లేవని, ఎందుకంటే బాత్‌టబ్ పూర్తిగా నిండినా చుక్క నీరు కింద పడకపోవడం దీనికి నిదర్శనమని స్పష్టం చేశారు. రామేశ్వరంలో శ్రీదేవి అస్థికలు నిమజ్జనం సాక్షి, చెన్నై: ప్రముఖ నటి శ్రీదేవి అస్థికలను ఆమె కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం రామేశ్వరం వద్ద సముద్రంలో కలిపారు. దుబాయ్‌లోని ఓ హోటల్లో ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడిపోయి శ్రీదేవి చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె భౌతికకాయానికి ముంబైలో ఫిబ్రవరి 28న అంత్యక్రియలు జరిగాయి. సంప్రదాయం ప్రకారం శ్రీదేవి మృతదేహాన్ని దహనం చేశారు. ప్రత్యేక విమానంలో శ్రీదేవి భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషి, ఇతర కుటుంబ సభ్యులు శుక్రవారం చెన్నై చేరుకున్నారు. అనంతరం ఈసీఆర్‌లోని శ్రీదేవి ఫామ్ హౌస్‌లో బసచేశారు. శనివారం ఉదయాన్నే పూజలు నిర్వహించిన తర్వాత రామేశ్వరానికి వెళ్లి అక్కడి సముద్రతీరంలోని అగ్నితీర్థంలో శ్రీదేవి అస్థికలను బోనీకపూర్ కలిపారు. -
నడుస్తు నడుస్తూనే కిందపడి వ్యక్తి మృతి
-
జాన్వీ తన కాళ్ల మీద తను నిలబడాలి
ఇటీవల ‘సాక్షి’కి శ్రీదేవి ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని విశేషాలు ► నాలుగేళ్ల క్రితం ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. వయసు పెరుగుతున్నట్టే అనిపించడం లేదు! (నవ్వుతూ...) ఏం చెప్పమంటారు? ఎవరైనా నా గురించి ఇలా చెబుతున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. హెల్దీ లైఫ్, హెల్దీ థింకింగ్, బీయింగ్ హ్యాపీ... ఈ మూడూ చాలు! మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటే అది ముఖంలో కనిపిస్తుంటుంది. ► ‘మామ్’ తల్లీకూతుళ్ల రిలేషన్ మీద సినిమా కాబట్టి, ఈ సినిమా చేస్తున్నప్పుడు మీ అమ్మగారు గుర్తొచ్చారా? లేదండీ! ‘మామ్’ చేసినప్పుడు మా అమ్మగారు గానీ, నా పిల్లలు గానీ గుర్తు రాలేదు. దేవకి (సినిమాలో శ్రీదేవి పాత్ర పేరు) మనసులో ఎంత బాధ ఉంది? పిల్లల కోసం ఏం చేస్తుంది? ఎంత దూరం వెళ్తుంది? అనేవి నా మనసులో ఉన్నాయి. దేవకి పాత్రలో ఉన్నంతసేపూ నా ఫ్యామిలీ మెంబర్స్ గుర్తు రాలేదు. ► మీ చిన్నప్పటి నుంచి స్టార్ హీరోయిన్గా ఎదిగే వరకూ.. మీ అమ్మగారు మిమ్మల్ని గైడ్ చేశారు.. ఆమె గురించి కొన్ని మాటలు... తప్పకుండా! ఈ రోజు నేను ఏమాత్రం కొంచెం ఎఛీవ్ చేశానన్నా... ఆ క్రెడిట్ మా అమ్మకే ఇవ్వాలి. అమ్మ నన్ను కూర్చోబెట్టి ఏం నేర్పలేదు. కానీ, ఆమె నుంచి జీవితం అంటే ఏంటనేది నేర్చుకున్నాను. లైఫ్‌లో ఏం చేసినా వంద శాతం కష్టపడాలి. ఊరికే చేయాలని చేయకూడదు. హార్డ్ వర్కింగ్. బీయింగ్ పంక్చువల్ – ఈ లక్షణాలన్నీ అమ్మ దగ్గర్నుంచి నేర్చుకున్నా. ‘కష్టే ఫలి. నో పెయిన్–నో గెయిన్’ – ఇలాంటివి నాకు నేర్పించింది. అమ్మ దగ్గర నేను నేర్చుకున్న దాంట్లో ఒక యాభై శాతం నేను నా పిల్లలకు ఇవ్వగలిగితే చాలు. అదే పెద్ద ఎచీవ్మెంట్ అనుకుంటా. ► నేను కొంచెమే ఎచీవ్ చేశాననడం మీ గొప్పతనం. 50 ఏళ్ల కెరీర్... 300 సినిమాలంటే జోక్ కాదు. మీరు చాలా ఎచీవ్ చేశారు. ఎప్పుడూ అలసిపోలేదా? ఇప్పుడీ ‘మామ్’ నా ఫస్ట్ ఫిల్మ్‌లా ఉంది (నవ్వులు). ఇప్పటికీ కొత్తగా చిత్రసీమలో అడుగు పెట్టినట్టు ఫీలవుతున్నా! మీరు చెబుతుంటే ‘300 సినిమాలు చేశానా?’ అనిపిస్తోంది. అదర్ వైజ్... ఐ ఫీల్ లైక్ థిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్. ► మీరెలాంటి మదర్? స్ట్రిక్టా, ఫ్రెండ్లీయా? ఫుల్ ఫ్రెండ్లీ. యాక్చువల్‌గా ఎప్పుడూ స్ట్రిక్ట్‌గా ఉండాల్సిన పరిస్థితి నా పిల్లలు తీసుకు రాలేదు. చాలా తక్కువ సార్లు స్ట్రిక్ట్‌గా ఉంటాను. ► ‘మామ్’ ట్రైలర్లో ‘వచ్చాను రా దానమ్మను’ అనే డైలాగ్ చెప్పే టైమ్‌లో మీ కళ్లలో ఆగ్రహం కనిపించింది. మీ పిల్లల గురించి రాకూడని వార్తలు వచ్చినప్పుడు ఓ మదర్‌గా మీరెలా ఫీలవుతారు? అమ్మ ఎక్కడైనా అమ్మే కదా. ఐయామ్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ మై చిల్డ్రన్. మా అమ్మాయి ఓ పార్టీకి వెళ్లొచ్చి, నాకు ఫొటోలు చూపించింది. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రదర్శకురాలు గౌరీ షిండేతో ఆ ఫొటోలు దిగింది. గౌరీ కూడా నాకు ఫోన్ చేసి ‘పాపతో పార్టీలో మాట్లాడాను. తనతో చాలా టైమ్ స్పెండ్ చేశా’ అని చెప్పింది. తర్వాత రోజు పేపర్లో మా పాప ఎవరో హీరో వెనకాల, అతను ఎక్కడికి వెళితే అక్కడే తిరుగుతుందని రాశారు. పాప చాలా అప్సెట్ అయ్యింది. కానీ, నా పాప గురించి నాకు తెలుసు. నేను అలాంటి వార్తలు చూసి నవ్వుకుంటా. కానీ, కొన్ని వార్తలు మాత్రం నిజంగా బాధకు గురిచేస్తాయి. అలాంటి వార్తలు రాసేవాళ్లు ‘వాళ్ల ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. తల్లి మనసు ఎంత బాధపడుతుంది’ అనేది అర్థం చేసుకోవాలి. ► ‘మామ్’ ట్రైలర్ చూసి, మీ పిల్లలేమన్నారు? వాళ్లు సినిమా కూడా చూశారు. జాన్వీ అయితే నన్ను గట్టిగా కౌగలించుకుంది. తను అలా చేయడం అదే మొదటిసారి. మా పిల్లలకు సినిమా బాగా నచ్చింది. ► జాన్వీ ఎవరితోనో లవ్‌లో ఉందని, మీరు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఇంకో న్యూస్ వచ్చింది... ఇక వాటన్నిటి గురించి మాట్లాడడం వేస్ట్. ముంబయ్‌లో ఇటీవల ఓ పత్రికలో ‘మా పాపకు పెళ్లి చేయాలి’ అని నేను చెప్పినట్టు రాశారు. ప్రతి అమ్మ తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటుంది కదా! నేనూ అదే చెప్పా. కానీ, అంతకు ముందు ‘జాన్వీ ఇండిపెండెంట్‌గా ఎదగాలి. తన కాళ్లపై తను నిలబడాలి. ఊరికే పెళ్లి చేసి కుక్కేయడం కాదు. తనకూ ఓ కెరీర్ ఉండాలి’ అని చెప్పా. అదంతా వదిలేసి ‘శ్రీదేవి తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటుంది’ అని రాశారు. దాన్నే హెడ్లైన్ చేశారు. ► ఇంట్లో ఆల్రెడీ ఓ సక్సెస్ఫుల్ స్టార్ ఉన్నారు కాబట్టి, జాన్వీని మీతో కంపేర్ చేస్తారు. మీరేమంటారు? జాన్వీ ఎంత పెద్ద స్టార్ అవుతుందనేది మన చేతుల్లో లేదు. తన టాలెంట్, హార్డ్‌వర్క్ బట్టి పైకొస్తుంది. తనింకా ఒక్క అడుగు కూడా వేయలేదు. నాతో తనను కంపేర్ చేయడమనేది చాలా రాంగ్. ఎందుకంటే... నేను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చాను. హీరోయిన్గా పరిచయమయ్యే టైమ్‌కి చైల్డ్ స్టార్‌గా సుమారు 50 సినిమాలు చేశా. హీరోయిన్గా ఫస్ట్ సినిమా చేసే టైమ్‌కి షూటింగ్ ఎలా ఉంటుంది? కెమెరా... వంటివన్నీ తెలుసు. మా పాపకు మాత్రం ‘ఇట్స్ జస్ట్ ఎ ఫస్ట్ ఫిల్మ్’ అన్నమాట. సో, తననూ, నన్నూ కంపేర్ చేయడమనేది న్యాయం కాదు. తనని ఇండివిడ్యువల్‌గా చూస్తే బాగుంటుంది. ► మీ పిల్లలిద్దరూ చాలా అందంగా ఉన్నారు. చిన్నమ్మాయి మీకంటే హైట్ అనుకుంటా! అవునండీ. జాన్వీ కంటే... నాకంటే చిన్న పాప ఖుషీ ఇంకా హైట్! ► ఈ వయసులోనూ మీరింత స్లిమ్‌గా ఉన్నారు. మీ పిల్లలకు మీరేమైనా టిప్స్ ఇస్తారా? నేనా? అయ్యో... లేదండీ! వాళ్లే నాకు టిప్స్ ఇస్తున్నారు. నేనెప్పుడైనా కొంచెం ఎక్కువ తింటే... ‘మమ్మా! ప్లీజ్ ఆపు’ అంటారు. ఇప్పుడు నాకంటే వాళ్లే ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. ► తెలుగు నుంచి మీ పెద్దమ్మాయికి చాలా ఆఫర్స్ వస్తున్నాయి కదా? ఏయే ఆఫర్స్ వచ్చాయి. ఎవరెవరు మా అమ్మాయిని నటించమని అడిగారు? అనేవి చెప్పడం నాకిష్టం లేదు. ఏదైనా దర్శక–నిర్మాతలు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారు. ► మీరు ఓ స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ చేస్తే చూడాలనుంది? నేను తెలుగమ్మాయినే. తెలుగు ఇండస్ట్రీ నాకెంతో ఆప్యాయత, అనురాగం, అభిమానం ఇచ్చింది. నేను ఏనాడూ దాన్ని మర్చిపోను. తెలుగులో చేయాలని నాకూ ఉంది. -
శ్రీదేవి ఇబ్బందుల్లో ఉందని విన్నాం
శ్రీదేవి చిన్నప్పుడు ఇష్టపడి ఏం తినేది? శ్రీదేవి తల్లి రాజేశ్వరి కూతురు సన్నగా ఉండటం కోసం కడుపు మాడ్చిందా? చెల్లెలు శ్రీలత, శ్రీదేవికి మధ్య విభేదాలు ఏంటి? ఎన్నిసార్లు ముక్కుకి సర్జరీ చేయించుకుంది? స్టార్ అయ్యాక బంధువులను చూసిందా? పెళ్లయ్యాక శ్రీదేవి బంధువులను దూరం పెట్టిందా? సవతి కొడుకు అర్జున్ కపూర్.. శ్రీదేవిని ఒత్తిడికి గురి చేసేవాడా? ... అతిలోక సుందరి శ్రీదేవి మరణం తర్వాత రేకెత్తిన ప్రశ్నలివి. గుండెపోటుతో ఆకస్మిక మరణం అనే వార్త నుంచి ‘డెత్ మిస్టరీ’ అనే టాక్ మొదలైంది. ఆమె మరణం పట్ల బంధువులకు ఏమైనా అనుమానాలున్నాయా? శ్రీదేవి బాబాయ్ ఎం. వేణుగోపాల్‌తో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ► శ్రీదేవిగారికి మీరు బాబాయ్ అవుతారు కదా.. ఆ బంధుత్వం గురించి వివరంగా చెబుతారా? శ్రీదేవి అమ్మ రాజేశ్వరమ్మ మా అమ్మకు అన్న కూతురు. నాకు వదిన అవుతుంది. శ్రీదేవి వాళ్ల పిన్నమ్మ అనసూయమ్మను మా అన్న (పెదనాన్న కొడుకు)కు చేసుకున్నాం. రాజేశ్వరమ్మ తమ్ముడికి మా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశాం. రాజేశ్వరమ్మ సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసేవారు. అప్పుడే శివకాశీలో అయ్యప్పన్‌ని పెళ్లి చేసుకున్నారు. రాజేశ్వరమ్మ పెళ్లికి మేం బంధువలమంతా వెళ్లాం. ► తిరుపతిలో మీ ఇంటి పక్కనే రాజేశ్వరమ్మ ఉండేవారా? అందరి ఇళ్లు దగ్గర దగ్గరే ఉండేవి. శ్రీదేవి వాళ్ల ఇంటికి ఒక నాలుగు ఇళ్లు అవతల శ్రీదేవి వాళ్ల పిన్ని (అనసూయమ్మ) ఇల్లు ఉండేది. చిన్నప్పుడు అందరి ఇళ్లల్లో శ్రీదేవి ఆడుకునేది. ► శ్రీదేవి అసలు పేరు ‘శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్’ కదా. మరి శ్రీదేవిగా ఎవరు మార్చారు? వాళ్ల నాన్నగారు తమిళియన్. కాబట్టి అమ్మయ్యంగార్ అని ఏదో పేరు పెట్టారు. మేం మాత్రం ఆ పేరుతో ఎప్పుడూ పిలిచింది లేదు. బంధువులమంతా తనని ‘పప్పీ’ అని పిలిచేవాళ్లం. పప్పీ సినిమాల్లోకి వెళ్లాక తన అమ్మానాన్న ఇద్దరూ కలసి ‘శ్రీదేవి’ అని పెట్టారు. ► శ్రీదేవిగారు యాక్ట్ చేసిన సినిమా షూటింగ్స్‌కు మీరు వెళ్లేవారా? ‘గోవిందా గోవిందా’ షూటింగ్ తిరుపతిలో జరిగినప్పుడు మేం వెళ్లాం. అప్పుడు శ్రీదేవి గెస్ట్ హౌస్‌లో ఉండేది. మేమంతా గెస్ట్‌హౌస్‌కు వెళ్లి రాత్రి వరకు మాట్లాడి వచ్చేవాళ్లం. ఆ సినిమా తప్ప వేరే ఏ సినిమా షూటింగ్‌కూ వెళ్లలేదు. ► స్టార్ అయ్యాక శ్రీదేవి బంధువుల ఇంటికి వచ్చేవారా? ప్రతి సంవత్సరం ఆగస్ట్ 13 తన పుట్టినరోజుకు తిరుపతి వస్తుంది. అప్పుడు బంధువులందర్నీ పిలుస్తుంది. అందరం కలిసి దర్శనానికి వెళ్తాం. ఆ రోజు తిరుపతిలోనే స్టే చేస్తుంది. వీలుంటే ఇంటికి వస్తుంది. ఏదైనా సెక్యూరిటీ ప్రాబ్లమ్ అయితే హోటల్లో ఉంటుంది. అయితే అంతకు ముందు ఇంటికి వస్తుండేది. క్రమంగా పెద్ద యాక్టర్ అయ్యే కొద్దీ ఇంటికి వస్తే.. జనం బాగా వస్తున్నారని హోటల్లో ఉండేది. మేమే తనని కలవటానికి వెళ్లేవాళ్లం. ఆ రోజంతా అక్కడే ఉండేవాళ్లం. ► శ్రీదేవి పెద్ద స్టార్ కాబట్టి బంధువులను పట్టించుకునేవారు కాదేమో అనే సందేహం చాలామందికి ఉంది.. ఒక వ్యక్తి గురించి బయటవాళ్ల కంటే వాళ్ల బంధువులకే ఎక్కువ తెలుస్తుంది. నా కొడుకు (ఉమేశ్)ని బాగా చూసేది. బాగా ముద్దు చేసేది. మద్రాస్ వెళ్లే వరకు వాణ్ణి బాగా చూసుకునేది. వెళ్లిన తర్వాత కూడా ఉమేశ్ మద్రాసు వెళుతుండేవాడు. ఇప్పుడు మా ఉమేశ్ అమెరికాలో ఉన్నాడు. తనకు కూడా శ్రీదేవి అంటే చాలా ఇష్టం. మేం ఇల్లు కట్టుకుంటుంటే సాయం చేసింది. మార్బుల్స్ అవీ పంపించింది. మావాళ్లు ఎవరు ఎప్పుడు వెళ్లినా అంతో ఇంతో సాయం కచ్చితంగా చేస్తుండేది. ► శ్రీదేవిగారి తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు ఉండేవని, శ్రీదేవిగారు స్టార్‌గా ఎదగడానికి ఆమె తల్లి మాత్రమే కారణమని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. నిజమా? ఆ మాటలు నిజం కాదు. రాజేశ్వరమ్మ, అయ్యప్పన్ బాగుండేవాళ్లు. శ్రీదేవిని షూటింగ్స్‌కి తీసుకెళ్లేవారాయన. భార్య, కూతురిని బాగా చూసుకునేవారు. ► తండ్రి చనిపోయినప్పుడు శ్రీదేవిగారు షూటింగ్లో ఉండి రాలేదని ఇప్పుడు అనుకుంటున్నారు. మాకు ఆవిడ హాజరైనట్లుగానే తెలుసు.. అప్పుడు శ్రీదేవి హిందీ సినిమా ‘లమ్హే’ షూటింగ్లో ఉంది. తండ్రిని చివరిసారిగా చూడ్డానికి మద్రాసు వచ్చింది. దాదాపు పదీ పదిహేను రోజులు షూటింగ్స్‌కి వెళ్లలేదు. ► శ్రీదేవిగారి పెళ్లికి వెళ్లారా ? చెన్నైలో పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అప్పుడు అందరం వెళ్లాం. ► బోనీ కపూర్గారితో శ్రీదేవిగారి పెళ్లయ్యాక మీకు రాకపోకలు ఉండేవా? పెళ్లి అవ్వకముందు వరకు బాగానే కలిసేది. పెళ్లయి బాంబేకు వెళ్లిపోయాక కొంచెం రాకపోకలు తగ్గిపోయాయి. మేము వెళ్లడం తగ్గిపోయింది. మేం బాంబే వెళ్లినప్పుడు తను ఉండకపోవచ్చు. బిజీగా ఉండేది. ఏమైనా గానీ ఆగస్ట్ 13న తిరుమల వస్తుంది. అప్పుడు తప్పనిసరిగా అందరి బంధువులను కలిసేది. లాస్ట్ ఇయర్ కూడా మా వాళ్లందరూ వెళ్లారు. ► శ్రీదేవిగారి కుమార్తెలు బంధువులందరికీ పరిచయమేనా? కూతుళ్లకు మా బాబాయ్, పిన్ని అంటూ మమ్మల్నందర్నీ పరిచయం చేసింది. ముఖ పరిచయం అంతే. వాళ్లకు మన భాష రాదు కదా. అంతా హిందీ, ఇంగ్లీష్. అందుకే పిల్లలు, మేం మాట్లాడుకునేవాళ్లం కాదు. ► బోనీ కపూర్‌గారు ఎలా ఉంటారు మీతో? ఆయన బాగానే మాట్లాడతారు. కొంచెం భాష ప్రాబ్లమ్ అంతే. కానీ చాలా బాగా మర్యాద ఇచ్చేవాడు. మమ్మల్ని చూడగానే నమస్కారం పెడతాడు. ► మీ ముందు పెరిగిన అమ్మాయి ‘ఆల్ ఇండియా స్టార్ అవుతుంది’ అని ఊహించారా? అనుకోలేదు. మా రంగంపేటలో ఉన్నప్పుడు చిన్న పాపగా ఉండేది. నాలుగేళ్ల వయసులోనే సినిమాలు చేయడం మొదలుపెట్టింది కదా. అప్పుడు మద్రాసు వెళ్లిపోయారు. శ్రీదేవి నటిగా ఎంత పెద్ద రేంజ్‌కి వెళుతుందని ఊహించడానికి మేం తన షూటింగ్స్‌కి వెళ్లలేదు కదా. అయితే మన బిడ్డ అంత పెద్ద పొజిషన్‌కి వెళ్లిందంటే మాకు సంతోషం. శ్రీదేవి బంధువులం అని చెప్పుకోవటం మాకు గొప్ప. ► చిన్నారి శ్రీదేవి ఇష్టపడి ఏం తినేది? చికెన్, మటన్ బాగా తినేది. నాన్ వెజ్ అంటే బాగా ఇష్టపడేది. ► కానీ శ్రీదేవి తల్లి ఆమెను సరిగ్గా తిననిచ్చేవారు కాదట.. నిజమేనా? సిటీల్లో దాదాపు అందరూ తక్కువే తింటారు కదా. మాకు తెలిసి కూతుర్ని మరీ అంత కట్టడి చేయలేదు. అయితే ఆపరేషన్లు అవీ చేయించుకున్నాక శ్రీదేవి తిండి బాగా తగ్గించింది. ► ఆపరేషన్లు అంటున్నారు. ఏం ఆపరేషన్లు. ఎన్ని? ముక్కు ఆపరేషన్ చేయించుకుంది కదా. మాకు తెలిసి మూడుసార్లు చేయించుకుంది. అవి చేయించుకున్నాక తిండి తగ్గించింది. ► సర్జరీలు వద్దు అని చెప్పే అవకాశం మీకు ఉండేది కాదేమో? రాజేశ్వరమ్మ ఉన్నప్పుడు కష్ట సుఖాలు మాట్లాడుకునేవాళ్లం. ఆవిడ పోయాక రాకపోకలు కూడా తగ్గాయి కాబట్టి, సలహాలు ఇచ్చే అవకాశం మాకు లేకుండాపోయింది. ► శ్రీదేవిగారి మరణ వార్త విన్న తర్వాత మీ బంధువులెవరైనా బాంబే వెళ్లారా? మా ఆవిడ, ఇంకొంతమంది బంధువులు వెళ్లారు. ముందు శ్రీదేవి వాళ్ల ఇంటికి వెళ్లారు. కొంతసేపు ఉండి హోటల్లో రూమ్ తీసుకుని ఉంటున్నారు. ► శ్రీదేవిగారి మరణం పట్ల చాలామందికి అనుమానాలున్నాయి. మీకేమైనా అనుమానం? అక్కడ ఏం జరిగిందో మాక్కూడా తెలియదు. అందరిలాగా టీవీల్లో చూడటమే. ► ఎప్పుడైనా శ్రీదేవిగారు బాధపడుతున్నట్లు అనిపించిందా? మీతో ఏమైనా చెప్పుకున్నారా? మా దగ్గరేం చెప్పలేదు కానీ, బోనీ కపూర్‌గారి పెద్ద భార్య కొడుకు (అర్జున్ కపూర్) కొంచెం ఇబ్బంది పెడతాడని బంధువులతో ఓసారి చెప్పి, బాధపడిందని విన్నాం. ► అంటే.. పైకి నవ్వుతూ కనిపించిన శ్రీదేవిగారి మనసులో బాధ ఉందంటారా? ఉండేదేమో అనిపిస్తోంది. ముఖ్యంగా భర్త ఆరోగ్యం విషయంలో చాలా ఆందోళన పడేదట. ఒకసారి ఆయనకు బాగా షుగర్ పెరిగిపోతే ఏమైపోతాడో.. పిల్లలు, తనూ ఏమైపోతామేమోనని చాలా బాధపడిందట. అలా అని మా బంధువులు చెబితే తెలిసింది. ► శ్రీదేవిగారు సున్నిత మనస్కురాలని చాలామంది అన్నారు.. మీరేమంటారు? మంచి అమ్మాయి. ఎవరితోనూ గొడవలున్నట్లు మాకు తెలియదు. ► మరి.. చెల్లెలు శ్రీలతకూ, శ్రీదేవిగారికీ మధ్య ఆస్తి గొడవలు వచ్చాయి కదా. అసలప్పుడు ఏం జరిగింది? అవి ఆస్తి గొడవలు కాదు. రాజేశ్వరమ్మ ఆరోగ్యం పాడైపోయినప్పుడు ఆపరేషన్ జరిగింది కదా. అప్పుడు ఒకచోట చేయాల్సిన ఆపరేషన్ని మరోచోట చేశారు. దాంతో ఆవిడ చనిపోయింది. ఆ తర్వాత ఆ హాస్పటల్‌పై కేస్ పెట్టారు. హాస్పటల్ డబ్బు విషయంలో అక్కచెల్లెళ్లిద్దరికీ ఏవో మనస్పర్థలు వచ్చాయి. అంతకు మించి ఏమీ లేదు. ► ఆ తర్వాత ఇద్దరూ మామూలుగానే ఉండేవారా? బాగానే ఉండేవారు. మొన్న బోనీ కపూర్‌గారి బంధువు పెళ్లికి శ్రీలత కూడా దుబాయ్ వెళ్లింది. ఆ ఫంక్షన్ అయ్యాక శ్రీలత వచ్చేసింది. అక్క చనిపోయిందని తెలిసి బాంబే వెళ్లింది. ► శ్రీదేవిగారు చాలా త్వరగా చనిపోయారు. మీ కళ్ల ముందు పెరిగిన పిల్ల ఇలా ఆకస్మిక మరణం పొందడం బాధగా ఉండి ఉంటుంది.. మేమంతా చాలా బాధపడ్డాం. చనిపోదగ్గ వయసు కాదు. ఎంతో పేరు సంపాదించుకుంది. ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నారు. కూతురి సినిమాని కళ్లారా చూసుకోలేకపోయింది. అందరూ ఆరాధించే శ్రీదేవి మా కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం మాకు గర్వకారణం. తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ‘‘బంధువులను చూడ్డానికి వచ్చినప్పుడు శ్రీదేవిగారు గిఫ్ట్స్ అవీ తెచ్చేవారా? తెచ్చేది. అలాంటి విషయాల్లో వెనకాడేది కాదు. దేవుడి దయ వల్ల మేం బాగానే ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు ఏవీ లేవు. మా కుటుంబానికి చెందిన అమ్మాయి ఇలా దేశం కాని దేశంలో హఠాత్తుగా చనిపోవడం మా అందరికీ ఎప్పటికీ తీరని బాధ మిగిల్చింది. – డి.జి. భవాని -
కార్డియాక్ అరెస్ట్ ఎందుకంటే...
సాక్షి, హైదరాబాద్: అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం యావత్ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎప్పుడూ ఆరోగ్యంగా, చెలాకీగా కనిపించే శ్రీదేవి ‘సడన్ కార్డియాక్ అరెస్ట్’కు గురై కన్నుమూయడం ఆమె అభిమానులనే కాదు హృద్రోగ నిపుణు లను సైతం నివ్వెరపరిచింది. ఉన్నఫళంగా ఆమె ‘సడన్ కార్డియాక్ అరెస్ట్’కు ఎందుకు గురైందనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది. దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే... ఒత్తిడి వల్ల గుండె రక్తనాళాలు కుంచించుకుపోతాయి... కొందరు సెలబ్రిటీలు కెరీర్, ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఒత్తిడి గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె నిమిషానికి 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. మనిషి ఒత్తిడికి గురైనప్పడు గుండె వేగం 120 నుంచి 150సార్లకు పైగా కొట్టుకుంటుంది. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణ వేగంగా సాగాల్సిన సమయంలో రక్త నాళాలు చిన్నవిగా కుంచించుకుపోతాయి. అప్పటివరకు రక్తనాళాల్లో బ్లాకులు లేకపోయిన ప్పటికీ ఒత్తిడి వల్ల అవి కుంచించుకుపోయి సడన్ కార్డియాక్ అరెస్ట్‌కు కారణమవుతాయి. – డాక్టర్ ఆర్.వి. కుమార్, హృద్రోగ నిపుణుడు, నిమ్స్ అతిగా వ్యాయామాలతోనూ చేటు... సెలబ్రిటీ స్టేటస్‌ను మేనేజ్ చేసుకోవడం ఒక దశకు వచ్చిన తర్వాత చాలా కష్టం. వృద్ధాప్యంలో కూడా అందంగా కన్పించాలనే కాంక్షతో కొందరు అతిగా వ్యాయామాలు చేయడం, ఆకలి తగ్గించే మందులు వాడుతుండటం చేస్తుంటారు. వేళకు తినకపోవడం వల్ల శరీరంలో పొటాషియం లెవల్స్ పడిపోతుంటాయి. ఒక్కోసారి ఇవి కార్డియాక్ అరెస్ట్‌కు దారితీస్తుంటాయి. ఒక దశ దాటిన తర్వాత ఏ పని ఎంతసేపు చేయాలో అంతే చేయాలి. వైద్యుల సలహా మేరకు డైట్ ఎంచుకోవాలి. 50 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏటా విధిగా హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలి. – డాక్టర్ గోపిచంద్ మన్నెం, హృద్రోగ నిపుణుడు, స్టార్ ఆస్పత్రి షాక్‌కు గురయ్యా.. శ్రీదేవి మరణ వార్త విని షాక్‌కు గురయ్యా. కోట్లాది అభిమానుల గుండెలు బద్దలు కొట్టేసి ఆమె వెళ్లిపోయారు. ముండ్రం పిరై, లమ్హే, ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రాల్లో ఆమె నటన ఎందరో నటీనటులకు ఆదర్శం. ఆమె కుటుంబ సభ్యులకు, ఆప్తులకు నా ప్రగాఢ సానుభూతి. – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రతిభగల నటి.. ఎంతో ప్రతిభ కలిగిన నటి శ్రీదేవి. ఆమె హఠాన్మరణం వల్ల తీవ్ర బాధ కలిగింది. దక్షిణాది భాషా చిత్రాలతోపాటు హిందీలోనూ ఆమె వైవిధ్యభరితమైన నటనను కనబరిచారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. – ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎంతో బాధించింది.. శ్రీదేవి అకాల మరణం నన్నెంతో బాధించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో అద్భుతమైన నటనను కన బరిచి చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటిగా ఆమె చెరగని ముద్రవేశారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యు లకు నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. – ప్రధాని నరేంద్ర మోదీ బహుముఖ ప్రజ్ఞాశాలి.. శ్రీదేవి అకాల మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా. ఆమె అసా ధారణ ప్రతిభ కలిగిన నటి. బహు ముఖ ప్రజ్ఞాశాలి. అనేక భాషల్లో వివిధ రకాల చిత్రాల్లో నటించారు. ఆమె కుటుంబానికి నా సానుభూతి. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. –రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీదేవి మృతికి గవర్నర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీదేవి అకాల మరణం పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. సినీ పరిశ్రమకు తీరని లోటు: సీఎం ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు, హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల సినిమాల్లో తన అందం, నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారని చెప్పారు. చిన్న వయసులోనే ఆమె మరణించడం విచారకరమన్నారు. శ్రీదేవి మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు సినీ అభిమానులకు ఎంతో వెలితిని మిగిల్చిందన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఏపీ సీఎం సంతాపం ప్రముఖ సినీ నటి శ్రీదేవి మరణానికి ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. శ్రీదేవి మృతి పట్ల జగన్ దిగ్భ్రాంతి ప్రఖ్యాత సినీ నటి శ్రీదేవి మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శ్రీదేవి తన నటన, ప్రతిభాపాటవాలతో ప్రజలను ఉర్రూతలూగించారని, బాలనటిగా మర్చిపోలేని నటనను ప్రదర్శించారని ఆదివారం ఒక సందేశంలో కొనియాడారు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు ధరించి మెప్పించిన శ్రీదేవి.. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’సినిమాలో గృహిణిగా అద్భుతమైన నటనను ప్రదర్శించి విశేష మన్ననలను అందుకున్నారన్నారు. సినీ ప్రియులకు, సినీ రంగానికి శ్రీదేవి మరణం తీరని లోటన్నారు. శ్రీదేవి మరణంతో దుఃఖ సాగరంలో మునిగి ఉన్న ఆమె కుటుంబీకులకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. శ్రీదేవి లేని లోటు తీర్చలేనిది: ఉత్తమ్, లక్ష్మణ్ ప్రముఖ సినీ తార, వందలాది తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసిన శ్రీదేవి హఠాన్మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. చిత్రపరిశ్రమ ఆమెను కోల్పోవడం దురదృష్టకరమని, ఆమె లేని లోటు తీర్చలేనిదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
శ్రీదేవి మరణాన్ని నమ్మలేకపోతున్నా
-
బాలనటి నుంచి మహానటి వరకు...
సాక్షి, సినిమా : శ్రీదేవికి స్టార్ స్టేటస్ అందించటంలో ముఖ్య పాత్ర పోషించిన దర్శకులెవరంటే ముందుగా వినిపించే పేరు కే రాఘవేంద్ర రావుదే. దర్శకేంద్రుడి డైరెక్షన్లోనే పదహారేళ్ల వయసు చిత్రంతో ఆమె హీరోయిన్గా మారారు. ఆపై ఆయన తెరకెక్కించిన వేటగాడు, జస్టిస్ చౌదరి, గజదొంగ, కొండవీటి సింహం, దేవత, జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఆమె హఠాన్మరణ నేపథ్యంలో ఆయన స్పందించారు. పదహారేళ్ళ వయసు నుంచి అతిలోక సుందరి వరకు.... తెలుగు తమిళ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు... శ్రీదేవి అధిరోహించని మైలు రాయి లేదంటే అతిశయోక్తి కాదు...అంటూ ట్వీట్ చేశారు. ‘బాలనటి నుంచి మహానటి వరకు నాతో ప్రయాణం చేసిన శ్రీదేవి హఠాన్మరణం అత్యంత బాధాకరం . భారతీయ చిత్ర పరిశ్రమ కి తీరని లోటు.. ఎక్కడున్నా తన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. -
అతిలోక సుందరి అస్తమయం
-
శ్రీదేవీ మరణవార్త విని మాటలు రావడం లేదు
-
కోట్లాది గుండెలు కొల్లగొట్టి నిష్క్రమించారు
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ నటి శ్రీదేవి(54) హఠాన్మరణంతో యావత్ భారత సినీ పరిశ్రమ, ప్రేక్షక లోకం దిగ్భ్రాంతికి గురైంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో సంతాపం తెలియజేశారు. శ్రీదేవి మృతి వార్త విని షాక్‌కి గురయ్యా. కోట్లాది అభిమానుల గుండెబద్ధలు కొట్టేసి ఆమె వెళ్లిపోయారు. ముండ్రమ్ పిరై, లమ్హే, ఇంగ్లీష్ వింగ్లీష్ లాంటి చిత్రాలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా అని రాష్ట్రపతి ట్విట్టర్లో పేర్కొన్నారు. నటి శ్రీదేవి మరణం బాధాకరం. చిరస్మరణీయ పాత్రలతో అలరించిన దిగ్గజ నటి. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ... ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అని ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు. సినీ ప్రముఖులు, క్రీడాకారులు, జాతీయ స్థాయి నేతలతోపాటు మరోవైపు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు కూడా ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. బహుబాషా నటిగా, తెలుగువారికి అత్యంతం ఇష్టమైన కథానాయికగా, దేశం గర్వించదగ్గ నటిగా ఎదిగారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక శ్రీదేవి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచే నటిస్తూ కోట్లాది మంది అభిమానులను ఆమె సంపాదించుకున్నారని.. తక్కువ వయసులోనే ఆమె మరణించడం భాదాకరమన్నారు.ఆమె పోషించిన పాత్రలు ఆమెను అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంచుతాయని ఆయన అన్నారు. ఇంకా పలువురు నేతలు ఆమె మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. Shocked to hear of passing of movie star Sridevi. She has left millions of fans heartbroken. Her performances in films such as Moondram Pirai, Lamhe and English Vinglish remain an inspiration for other actors. My condolences to her family and close associates #PresidentKovind — President of India (@rashtrapatibhvn) 25 February 2018 Saddened by the untimely demise of noted actor Sridevi. She was a veteran of the film industry, whose long career included diverse roles and memorable performances. My thoughts are with her family and admirers in this hour of grief. May her soul rest in peace: PM @narendramodi — PMO India (@PMOIndia) 25 February 2018 -
శవాన్ని హైవేపై వదిలేశారు
సాక్షి, చెన్నై : మానవ సంబంధాలు ఎంతలా దిగజారుతున్నాయనేందుకు పరాకాష్టగా తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఉదంతం నిలిచిపోతుంది. బస్సులో ప్రయాణిస్తూ తుదిశ్వాస విడిచిన ఓ వ్యక్తిని డ్రైవర్, కండక్టర్ ఏ మాత్రం కనికరం లేకుండా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లడం అందరినీ నివ్వెరపరుస్తోంది. తమిళనాడులోని సూళగిరి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుకోయిలూరు సమీపంలోని కనకనందం గ్రామానికి చెందిన వీరన్ (54), రాధాకృష్ణన్ (44) బెంగళూర్‌లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరు స్వగ్రామానికి వెళ్లేందుకు తమిళనాడు ఆర్టీసీ బస్సులో బుధవారం ఉదయం బయలుదేరారు. సూళగిరి సమీపంలో వీరన్ ఆకస్మాత్తుగా మరణించాడు. దీంతో డ్రైవర్, కండక్టర్ జాతీయ రహదారిపై వీరన్ మృతదేహాన్ని దించి వెళ్లిపోయారు. దిక్కుతోచని మిత్రడు రాధాకృష్ణన్ స్ధానిక పోలీసులకు సమాచారం అందించాడు. డ్రైవర్, కండక్టర్లు నిర్ధయగా వ్యవహరించి నడిరోడ్డుపై శవాన్ని వదిలి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంబులెన్స్ కోసం పడిగాపులు పడుతున్నానని చెప్పుకొచ్చాడు. ఇంతలో ఘటనా స్థలానికి చేరుకున్న సూళగిరి పోలీసులు వీరన్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి బంధువులకు సమాచారం అందచేశారు. -
ఇలాంటి మరణాలను ఊహించగలమా?
బ్యాంకాక్ : థాయ్‌లాండ్‌లో ఇప్పుడు హైపోథెర్మియా పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఆ స్థితి సంభవించిన సమయంలో మానవ శరీరం వేడిని త్వరగా బయటకు కోల్పోతుంది. శరీరంలో ఉష్టోగ్రతల తగ్గుదల మూలంగా ఏకంగా మనిషి ప్రాణాలే కోల్పోతాడు. ఇలా గత పదిహేను రోజుల్లో ఇలాంటి మరణాలు అక్కడ రెండు సంభవించాయి. మ్యూయాంగ్ జిల్లా ముక్దాన్ అనే పట్టణంలో మూడు రోజుల క్రితం ఓ వ్యక్తి తన ఇంట్లో ఇలాగే చనిపోయాడు. రాత్రి పడుకున్న వ్యక్తి ఉదయం లేచేసరికి విగతజీవిగా మారిపోయాడు. ఇక అతని మరణానికి కారణం ఏంటంటే... ఆ ప్రాంతంలో పగటి పూట బాధించే తీవ్రమైన ఉష్ణోగ్రతలు రాత్రి పూట దారుణంగా పడిపోతుంటాయి. ఈ క్రమంలోనే చొక్కా లేకుండా అతను పడుకోవటంతోనే శరీరం చల్లబడిపోయి చనిపోయాడంట. ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. ఇక పదిరోజుల క్రితం జరిగిన మరో ఘటనలో చయాఫూమ్ ప్రావిన్స్ కు చెందిన సొబ్తావీ (44) తాంబాన్ ముయాంగ్ లోని తల్లి (86)ని చూసేందుకు వెళ్లాడు. ఆ రాత్రి అక్కడే బసచేశాడు. ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో మూడు ఫ్యాన్లు పెట్టుకుని నిద్రపోయాడు. అయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా చల్లబడిపోవడానికి తోడు నేలపై పడుకోవడంతో అతని శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. ఈ ఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రజలు భయపడిపోతున్నారు. ఇక హైపోథెర్మియా వల్ల 98.6 ఫారన్ హీట్ ఉండాల్సిన శరీర ఉష్ణోగ్రత.. 95 ఫారన్ హీట్‌కు పడిపోతుంది. ఈ మరణాలకు మనిషి శారీరక దృఢత్వానికి ఏ మాత్రం సంబంధం ఉండబోదని వైద్యులు చెబుతున్నారు. -
అతి నవ్వు ఆమె ఆయుష్షు తీసింది
వాషింగ్టన్: నవ్వు ఆయుష్షు పెంచటం మాట ఏమోగానీ మెక్సికోలో మాత్రం ఓ టీచర్ ప్రాణాలు తీసింది. బిగ్గరగా నవ్వుతూనే పై అంతస్తు నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. షారోన్ రెగోలి సిఫోర్రోనో (50) పెన్నిసైల్వేనియాలోని హుస్టన్ మిడిల్ స్కూల్లో టీచర్ గా పని చేస్తోంది. సమ్మర్ సెలవులు కావటంతో సోమవారం తన కూతురితో ఓ స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ సరదాగా బాల్కనీలో ఓ బెంచ్ మీద కబుర్లు చెబుతూ గడిపింది. ఇంతలో ఏం జరిగిందో తెలీదుగానీ బిగ్గరగా నవ్వటం ప్రారంభించిన ఆమె ఆ కుదుపులో వెనక్కి ఒరిగి, అదుపు తప్పి బాల్కనీ నుంచి కింద పడిపోయింది. తలకు తీవ్రగాయాలు కావటంతో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఆ సమయంలో ఆమె మద్యం సేవించి ఉన్నట్లు అనుమానించినా.. తర్వాత పరీక్షల్లో నిజం కాదని తేలింది. బాల్కనీకి రక్షణ చర్యలు లేకపోవటమే ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. వివాహిత అయిన రెగోలికి ఇద్దరు పిల్లలు. -
రొయ్యల ఫ్యాక్టరీలో కూలీ మృతి
అత్తిలి : తిరుపతిపురంలో నిర్మిస్తున్న రొయ్యల ఫ్యాక్టరీలో ఓ కూలీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఎస్సై వి.ఎస్.వీరభద్రరావు కథనం ప్రకారం.. ఉండ్రాజవరం గ్రామానికి చెందిన బైరెత్తి మల్లేష్(30) అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో నిర్మిస్తున్న రొయ్యల ఫ్యాక్టరీలో కూలి పని చేయడానికి వస్తున్నాడు. గురువారం సాయంత్రం మల్లేష్ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతనిని తోటి కార్మికులు 108 వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని తల్లి సత్యవతి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
కొద్దిగంటల్లో పెళ్లి... అంతలోనే... వరుడు ఆకస్మిక మృతి
సచిన్ మృతదేహం బెంగళూరు(బనశంకరి): కొద్దిగంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు ఆకస్మికంగా మృతిచెందిన ఘటన చిక్కమంగళూరు జిల్లా సుళ్య పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు... సుళ్య తాలూకా పంజ గ్రామంలోని కండూరకు చెందిన పరమేశ్వరగౌడ కుమారుడు సచిన్(29)కు ఎడమంగలలోని హొన్నప్పాడి బాలకృష్ణగౌడ కుమార్తె గాయత్రితో వివాహం నిశ్చయించారు. పైందోడి సుబ్రమణ్యస్వామి దేవస్థానంలో బుధవారం ఉదయం వివాహం చేయడానికి ఇరుకుటుంబాలు సిద్ధమయ్యాయి. మంగళవారం రాత్రే బంధుమిత్రులతో కళ్యాణమంటపానికి చేరుకోవడానికి సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం ఇంటిలో పెళ్లి కుమారుడు సచిన్ షేవింగ్ చేసుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. గాయపడిన బాధితుడిని వెంటనే పుత్తూరు ఆదర్శ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సచిన్ మరణవార్త తెలియగానే ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. ఘటనపై సుళ్య పోలీసులు కేసు నమోదు చేశారు. -
షూటింగ్ లో తీవ్ర విషాదం
ముంబై: ప్రముఖ హాస్య కార్యక్రమం 'తారక్ మెహతా కా ఉల్టా ఛెష్మా' షూటింగ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ కామెడీ సీరియల్ ప్రొడక్షన్ కంట్రోలర్ అరవింద్ మర్చందే అకస్మాత్తుగా కన్నుమూయడం యూనిట్ సభ్యులందర్ని షాకు కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే....జూన్ 30 న తారక్ మెహతా కా ఉల్టా ఛెష్మా షూటింగ్ సెట్ లో ఉండగానే ముఖ్య నిర్మాణ బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్న అరవింద్ ఛాతీలో నొప్పి గా ఉందని తెలిపారు. యూనిట్ సభ్యులు అతనికి ఈనో (గ్యాస్ట్రిక్ మందు) తాగించారు. అంతలోనే తీవ్రమైన గుండెనొప్పితో కప్పకూలిపోయారు. హుటాహుటిన ఆయన్ని ఆసుపత్రి తీసుకెళ్లినప్పటికీ ఫలితంలేకపోయింది. అప్పటికే అరవింద్ తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో యూనిట్ అంతా తీవ్ర దిగ్భాంతికి లోనయ్యింది. ఆయన మృతికి సంతాపంగా షూటింగ్ నిలిపివేసిన టీం ఆసుపత్రిలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించింది. నిర్మాత అసిత్ మోడీ,సహా ఇతర యూనిట్ సభ్యులు, నటీనటులు అరవింద్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాగా డైలీ సీరియళ్ల టిఆర్పి రేటింగ్‌తో పోటీ పడుతూ దూసుకుపోయిన ఈ కామెడీ సీరియల్ అప్పట్లో టాప్ టెన్ లో నిలిచి ఎంతో జనాదరణపొందింది. దిలీప్ జోషి ప్రధాన పాత్ర పోషించిన ఈసీరియల్ పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఆ ఐపీఎస్కి మరో నెలలో పెళ్లి... అంతలోనే...
చెన్నై, సాక్షి ప్రతినిధి:పోలీస్‌శాఖలో ఉన్నతమైన ఉద్యోగం, మరో నెలలో పెళ్లి....ఇంతలోనే ఏమైందో ఏమో ఐపీఎస్ అధికారి హరీష్ ఆకస్మిక మృతి. అవినీతి నిరోధక శాఖ (చెన్నై) అదనపు ఎస్పీ హరీష్ (33) చెన్నైలోని తన పోలీస్ క్వార్టర్స్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఆయన బంధువులను కలవరపాటుకు గురిచేసింది. చెన్నై ఏసీబీ విభాగంలో అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎన్ హరీష్‌ది ఆత్మహత్య లేక గుండెపోటా అనే కోణంలో విచారణ జరుగుతోంది. అయితే పోలీసులు అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. హరీష్ మృతి నేపథ్యంలో శాఖాపరంగా సాగుతున్న విచారణ ఇతర అంశాలు వెలుగు చూడకున్నా కుటుంబ పరంగా అనేక విషాద కోణాలు వెల్లడయ్యాయి. ఆత్మహత్యకు పాల్పడిన హరీష్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన హరీష్ 2009లో ఐపీఎస్ ముగించి, తమిళనాడు, తూత్తుకూడిలో శిక్షణ పూర్తిచేసుకున్నారు. ఐపీఎస్ అధికారులు తాము పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన భాషలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. ఈ నిబంధన ప్రకారం హరీష్ తమిళ భాషా పరీక్షలకు అనేకసార్లు హాజరయ్యారు. తొమ్మిది సార్లు పరీక్ష రాసినా ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. తన పదోన్నతికి తమిళ పరీక్ష ఆటంకంగా మారిందనే వ్యథతో మద్యానికి బానిసైనట్లు సమాచారం. అంతేగాక విధుల్లో ఆయన పాటిస్తున్న నిబద్దతను కొందరు ఉన్నతాధికారులు సహించలేక పోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని గత డీజీపీ రామానుజం శాఖాపరమైన విచారణకు ఆదేశించడం, కొందరు ఉన్నతాధికారులు అకారణంగా వేధింపులకు పాల్పడడంతో హరీష్ ఆవేదన చెందేవాడని చెబుతున్నారు. ఓదార్చేవారు కరువైన ఒంటరి జీవితం ఆయనకు మరింతగా కృంగదీసింది. ఇదిలా ఉండగా, బంధువుల అమ్మాయితో వచ్చేనెల 21వ తేదీన హరీష్‌కు వివాహం నిశ్చయమైంది. వధువు సైతం ఇంజనీరింగ్ పూర్తిచేసింది. పెళ్లి ఆహ్వాన పత్రికలు సైతం అచ్చువేసి ఉన్నారు. ఐపీఎస్ అధికారితో వివాహమని వధువు తల్లిదండ్రులు మురిసిపోతూ పెళ్లి ఘడియ కోసం ఎదురుచూస్తున్నారు. ఆలస్యంగానైనా మంచి సంబంధం కుదిరిందని హరీష్ తల్లిదండ్రులు సైతం ఆనందించారు. ఇంతలో పిడుగులాంటి వార్త విని హతాశులయ్యారు. హరీష్ అనుమానాస్పద స్థితిలో మరణించాడని తెలుసుకున్న వధువు బాధతో కుప్పకూలిపోయింది. తండ్రి నాగప్పరాజ బంధువులు గురువారం రాత్రి చెన్నై చేరుకున్నారు. పోస్ట్‌మార్టం ముగిసిన అనంతరం శుక్రవారం హరీష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హరీష్ మృతదేహానికి సమీపంలో బిరియానీ పొట్లం, మద్యం బాటిల్ కనుగొన్నారు. మద్యంలో విషం కలుపుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే హరీష్ బంధువులు హత్యగా అనుమానిస్తున్నారు. అతనికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు కాబట్టి అనారోగ్యంతో మరణించే అవకాశాలు లేవని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని పేర్కొన్నారు. పోలీస్‌శాఖలో హరీష్ అంటే గిట్టని వారు కడతేర్చారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. మరణానికి దారితీసిన కారణాలు ఏవైనా తమ బిడ్డ దూరమయ్యాడని మీడియా వద్ద హరీష్ తండ్రి నాగరాజప్ప భోరుమని విలపించాడు. వేధింపులకు పాల్పడలేదు: మాజీ డీజీపీ రామానుజం తాను వేధింపులకు పాల్పడడం, పదోన్నతి కల్పించక పోవడం వల్లనే హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వస్తున్న ఆరోపణలను మాజీ డీజీపీ రామానుజం శనివారం ఒక ప్రకటనలో ఖండించారు. ఇవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని అన్నారు. తమిళ పరీక్షలో ఉత్తీర్ణత సాధించనందునే హరీష్‌కు పదోన్నతి కల్పించలేదని అన్నారు. అంతేగానీ అతనిపై ఉద్దేశపూర్వకమైన వేధింపులు, సాధింపులకు అవకాశం లేదని చెప్పారు. అతను ఎంతో నెమ్మదస్తుడు, భయస్తుడని, అతనికున్న సమస్యలను కర్ణాటక ఐపీఎస్ అధికారులతో చెప్పి పరిష్కరించి సహకరించానని తెలిపారు. -
‘తల్లి’డిల్లిన తనయుని గుండె..
అమ్మ కర్మకాండలకు సిద్ధమవుతూ హఠాన్మరణం తిరుమలాయపాలెం: చిన్ననాటి నుంచి అమ్మ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేని ఆ తనయుడు... చివరకు ఆ అమ్మనే వెతుక్కుంటూ తల్లి కర్మకాండ రోజే తనువు చాలించాడు. మాతృమూర్తి దూరమైన నాటి నుంచి నిత్యం ఆమెను తలచుకొని మదనపడుతూ ఆమె కర్మకాండ రోజే గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యూడు. ఖమ్మం జిల్లా పిండిప్రోలులో శనివారం జరిగిన ఈ ఘటన పూర్వాపరాలు.. పిండిప్రోలు గ్రామానికి చెందిన లలితమ్మ(50), ఆమె భర్త బాబు స్థానిక గ్రానైట్ క్వారీలో వంట మనుషులుగా పనిచేసేవారు. ఈనెల 9న క్వారీ పక్కనున్న గుంతలో నుంచి నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన లలితమ్మ... ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడి మరణించింది. అమ్మంటే ఎనలేని ప్రేమ ఉన్న ఆమె కుమారుడు ఉపేందర్ (27) ఆ రోజు నుంచి తీవ్ర వేదనతో కుంగిపోయాడు. శనివారం లలితమ్మ దశ దినకర్మ నిర్వహించాల్సి ఉంది. దీనికోసం కార్డులు పంపిణీ చేసి బంధుమిత్రులను ఆహ్వానించాడు. బంధువులంతా ఇంటికి చేరుకుని కర్మకాండల కోసం కావాల్సిన సామగ్రిని సిద్ధం చేసే పనిలో ఉండగా, ఉపేందర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు వదిలాడు. అయితే ఛాతీలో నొప్పి వస్తోందని అంతకు కొద్దిసేపటి ముందే ఉపేందర్ బంధుమిత్రుల్లో ఒకరిద్దరికి చెప్పాడు. డాక్టర్ వద్దకు వెళదామని వారు చెప్పినా... ఈ కార్యక్రమం పూర్తయ్యాక చూద్దామని చెబుతూ వచ్చాడు. చివరికి గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. ‘అమ్మంటే ఉపేందర్‌కు ఎంతో ఇష్టం.. ఆమెను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేదు. తల్లీ కొడుకులు ఇద్దరూ వెళ్లిపోయారు..’’ అంటూ ఉపేందర్ తండ్రి బాబు శోక సంద్రంలో మునిగిపోయాడు. తల్లి కర్మకాండ రోజే తమ్ముడు మరణించడాన్ని చూసి ఉపేందర్ అక్క స్పృహతప్పి పడిపోయింది. ఆమెను వెంటనే ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. కోలుకుంటోంది. ఉపేందర్‌కు ఒక కుమారుడు ఉండగా.. ఆయన భార్య ఉప్పమ్మ ప్రస్తుతం గర్భవతి. -
దుబాయ్ రాజకుమారుడి హఠాన్మరణం
దుబాయ్ రాజు కుమారుడు హఠాన్మరణం చెందాడు. రాజుగారి పెద్ద కొడుకైన షేక్ రషీద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ (33) శనివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. అల్ మక్తౌమ్ అంతిమయాత్ర శనివారం జరగనుంది. అనంతరం దుబాయ్‌లో మూడు రోజుల సంతాప దినాలు మొదలుకానున్నాయి. దుబాయ్ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ పెద్ద కుమారుడే అల్ మక్తౌమ్. అల్ మక్తౌమ్ అధికారిక ఫేస్ బుక్ పేజి చూస్తే.. ఆయన అనేక క్రీడా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఫొటోలు కనిపించాయి. -
పీఏసీ చైర్మన్ కిష్టారెడ్డి హఠాన్మరణం
గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూత * కేసీఆర్, రాహుల్, ఉత్తమ్, జానా సంతాపం * నేడు మెదక్ జిల్లా పంచగామలో అంత్యక్రియలు * హాజరవనున్న సీఎం, కాంగ్రెస్ నేతలు సాక్షి, హైదరాబాద్/నారాయణఖేడ్ రూరల్: ప్రజాపద్దుల కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పట్లోళ్ల కిష్టారెడ్డి (73) మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. హైదరాబాద్‌లోని నివాసంలో సోమవారం రాత్రి రోజువారీ కార్యక్రమాలు ముగించుకుని నిద్రపోయిన ఆయన మంగళవారం ఉదయానికి నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. సమీపంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు. నిద్రలో తీవ్రమైన గుండెపోటు రావడమే మరణానికి కారణమని తేల్చారు. అభిమానుల సందర్శనార్థం కిష్టారెడ్డి భౌతిక కాయాన్ని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా నారాయణఖేడ్‌కు తరలించారు. బుధవారం ఉదయం 11 గంటలకు స్వగ్రామం పంచగామలోని తన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొననున్నారు. కిష్టారెడ్డి మృతిపట్ల ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కిష్టారెడ్డి కుటుంబసభ్యులతో రాహుల్ ఫోనులో మాట్లాడారు. వారికి ధైర్యవచనాలు చెప్పారు. కిష్టారెడ్డి, తాను ఒకే జిల్లాకు చెందిన వారిమంటూ కేసీఆర్ తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కిష్టారెడ్డి మరణవార్త తెలియగానే ప్రజాప్రతినిధులు, ఆయన అభిమానులు కిమ్స్‌కు చేరుకున్నారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు డి.శ్రీనివాస్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి తదితరులు పార్థివదేహానికి నివాళులర్పించారు. నేతల నివాళులు కిష్టారెడ్డి నిరంతరం ప్రజల కోసం పరితపించే మనిషని ఉత్తమ్ అన్నారు. ఆయన హఠాన్మరణం వ్యక్తిగతంగా తనకు, పార్టీకి తీరని లోటన్నారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం తెలిపారన్నారు. ఆయన 50 ఏళ్లుగా తనతో కలిసి పనిచేసిన మంచి మిత్రుడని జైపాల్‌రెడ్డి అన్నారు. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఎంపీలు జితేందర్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రులు గీతారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డి, డీకే అరుణ, దామోదర్ రాజనరసింహ, రాంరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, విజయరామారావు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్, ఏనుగు రవీందర్‌రెడ్డి, మదన్మోహన్, వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు కిష్టారెడ్డి పార్థివదేహానికి నిమ్స్‌లో నివాళులు అర్పించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆర్.రవీంద్రకుమార్ సంతాపం ప్రకటించారు. పంచాయతీ స్థాయి నుంచి... 1942 అక్టోబర్ 2న జన్మించిన కిష్టారెడ్డి ఉస్మానియా నుంచి న్యాయవిద్యలో డిగ్రీ పొందారు. సంగారెడ్డి కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. స్వాతంత్య్రయోధుడు చివురావు షెట్కార్ శిష్యుడైన ఆయన, తన బావ, కాంగ్రెస్ సీనియర్ నేత బాగారెడ్డి ప్రభావంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1970 నుంచి 1980 దాకా పంచగామ సర్పంచ్‌గా, 1981 నుంచి 1986 దాకా పంచాయతీ సమితి అధ్యక్షునిగా పనిచేశారు. 1989, 1999, 2009, 2014ల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999-2004 మధ్య రెండుసార్లు పీఏసీ చైర్మన్‌గా చేశారు. ఆర్నెల్ల క్రితమే మూడోసారి పీఏసీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. పీఏసీ భేటీలో పాల్గొనేందుకే సోమవారం హైదరాబాద్ వచ్చారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులున్నారు. పెద్ద కుమారుడు సంజీవరెడ్డి నారాయణఖేడ్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు. -
ఆత్మరక్షణలో అమ్మ ప్రభుత్వం
టాస్మాక్ దుకాణాలపై రాష్ట్ర వ్యాప్తంగా పెల్లుబుకిన వ్యతిరేకత, అన్ని ప్రతిపక్షాలతోపాటు ప్రజలు, విద్యార్థి, ప్రజా సంఘాలు ఏకం కావడం అమ్మ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం జయలలిత సోమవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: గత కొంతకాలంగా చాపకింద నీరులా ఉండిన సంపూర్ణ మద్య నిషేధం డిమాండ్ గాంధేయవాది శశిపెరుమాళ్ ఆకస్మిక మరణంతో ఒక్కసారి భగ్గున లేచింది. కాంగ్రెస్, డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, వామపక్షాలు, బీజేపీ ఇలా అన్ని పార్టీలు మద్యం అమ్మకాలపై సమరశంఖం పూరించాయి. విపక్షాలు చేసే ఆందోళనలను తిప్పికొట్టగల సమర్దత గలిగిన ముఖ్యమంత్రి జయలలిత ప్రజలంతా ఏకమై ప్రభుత్వాన్ని దుయ్యబట్టడంతో ఆమె ఇరుకునపడ్డారు. మద్యం దుకాణాల కారణంగా ప్రజాగ్రహానికి గురైతే రాబోయే ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కాగలవనే ఆందోళన ఆమెలో నెలకొంది. శశిపెరుమాళ్ మరణం తరువాత రోజు రోజుకూ టాస్మాక్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు పెరిగిపోతున్న పరిస్థితులను సమీక్షించేందుకు సోమవారం సచివాలయంలో జయ సమావేశం అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్, డీజీపీ అశోక్‌కుమార్, శాంతి భద్రతల విభాగం ఏడీజీపీ రాజేంద్రన్ తదితరులతో పరిస్థితిని సమీక్షించారు. వైగోపై 12 కేసులు: ఇదిలా ఉండగా, మద్యంపై పోరుకు పెద్ద దిక్కుగా నిలిచిన ఎండీఎంకే ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోపై ప్రభుత్వం 12 కేసులు బనాయించింది. శంకరన్‌కోవిల్ కలింగపట్టిలో మద్యం దుకాణాలను మూసివేయాలని ఆందోళన చేసిన వైగో సహా 52 మందిపై ప్రభుత్వం కేసులు బనాయించింది. వైగో సొంతూరైన తిరునెల్వేలీ కలింగపట్టిలో టాస్మాక్‌దుకాణాలపై ఆయన యుద్దం ప్రకటించారు. ఈ సందర్భంగా టాస్మాక్ అధికారులపై వైగో దాడిచేశారని ఆరోపిస్తూ ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. శశిపెరుమాళ్ చనిపోయిన నాటి నుండి ఆందోళనలు సాగిస్తున్నారు. ప్రజా పోరాటాన్ని అన్నాడీఎంకే ప్రభుత్వం అడ్డుకోవడమేగాక కేసులు బనాయించడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని వైగో విమర్శించారు. అక్రమ కేసులను బనాయించడమేగాక తనను శాశ్వతంగా అంతం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆయన ఆరోపించారు. వైగో తదితరులపై 12 కేసులు బనాయించడంతో నెల్లై జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నేడు రాష్ట్రబంద్: రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని కోరుతూ ముందుగానే ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్త బంద్ పాటిస్తున్నారు. ఎండీఎంకే, వీసీకే, మనిదనేయ మక్కల్ కట్చి పార్టీలు ఈనెల 4వ తేదీన బంద్ పాటిస్తున్నట్లు ప్రకటించారు. 10న డీఎంకే ఆందోళన: కరుణ మద్య నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 వ తేదీన రాష్ట్రవ్యాప్త అందోళన చేపడుతున్నట్లు డీఎంకే అధ్యక్షులు కరుణానిధి సోమవారం ప్రకటించారు. డీఎంకే అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని తానిచ్చిన మాటకు కట్టుబడివ ఉన్నానని ఆయన అన్నారు. మద్యనిషేధం కోరుతూ ప్రజలు జరుపుతున్న పోరాటాన్ని పోలీసులు అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. -
సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం
* గుండెపోటుతో కన్నుమూత * నిర్ఘాంతపోయిన అభిమానులు * శోకసంద్రంలో చిత్రసీమ * తరలివచ్చిన అభిమానులు * చక్రి భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి * ముగిసిన అంత్యక్రియలు * ఇప్పటివరకు 99 చిత్రాలకు పనిచేసిన చక్రి సాక్షి, హైదరాబాద్, వరంగల్: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు చక్రి(40) సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతిచెందారు. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చి.. అనతికాలంలోనే ఉన్నతస్థాయికి ఎదిగిన చక్రి హఠాన్మరణంతో సినీ పరిశ్రమ, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. చక్రి ఇప్పటి వరకు 99 చిత్రాలకు సంగీతం అందించారు. సత్యం, కబడ్డీ కబడ్డీ, పెదబాబు, చక్రం, దేవదాసు, కృష్ణ, మస్కా, సింహా, జై బోలో తెలంగాణ, ఢీ, దేనికైనా రెడీ వంటి ప్రజాదరణ పొందిన చిత్రాలకు ఆయన పనిచేశారు. దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఎర్రబస్సు’ ఆయన ఆఖరి సినిమా. హీరో బాలకృష్ణతో 100వ చిత్రం చేయాలనుకున్నారు. కానీ ఇంతలోనే చక్రి ఈ లోకాన్ని వీడారు. యువ సంగీత దర్శకుడి హఠాన్మరణంతో తెలుగు చలనచిత్ర సీమ నిర్ఘాంతపోయింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో చక్రి మరణ వార్త తెలుసుకుని సినీ రంగానికి చెందిన పలువురు హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలివచ్చారు. తర్వాత కొద్దిసేపటికి చక్రి భౌతికకాయాన్ని ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్ ప్రాంగణానికి తరలించారు. చక్రి మృతదేహాన్ని చూసిన సన్నిహితులు, సినీ ప్రముఖులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమను పరిశ్రమకు పరిచయం చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని పలువురు గాయకులు కన్నీటిపర్యంతమయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో భౌతిక కాయాన్ని జర్నలిస్టుకాలనీలోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ వైదిక కర్మల అనంతరం సాయంత్రం ఐదు గంటలకు అంతిమయాత్ర మొదలైంది. పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. అప్పటికే అక్కడకు భారీ సంఖ్యలో అభిమానులు, సంగీత కళాకారులు తరలివచ్చారు. శ్రేయోభిలాషులు, బంధువులు అశ్రు నయనాలతో చక్రికి తుది వీడ్కోలు పలికారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, డెరైక్టర్ ఎన్. శంకర్, విమలక్క తదితరులు శ్మశానవాటిక వద్దకు చేరుకుని చక్రి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న సమయంలో చక్రి భార్య శ్రావణి స్పృహతప్పి కుప్పకూలిపోయారు. చక్రి మృతికి సంతాపంగా చిత్ర పరిశ్రమలో సోమవారం నాటి షూటింగ్‌లన్నీ వాయిదాపడ్డాయి. 14 ఏళ్ల సినీ ప్రస్థానం.. చక్రి సొంత ఊరు వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లి. ఆయన 1974 జూన్ 15న జన్మించారు. తల్లి విద్యావతి, తండ్రి వెంకటనారాయణ. చక్రి పూర్తి పేరు జిల్లా చక్రధర్. ప్రాథమిక విద్యాభ్యాసం కంబాలపల్లిలోనే సాగింది. మహబూబాబాద్‌లో పదో తరగతి, ఇంటర్ పూర్తి చేశారు. హన్మకొండలో డిగ్రీ చదివారు. డిగ్రీ రోజుల్లోనే సంగీత విద్వాంసురాలు విజయలక్ష్మి వద్ద వయొలీన్ నేర్చుకున్నారు. సంగీత విద్వాంసులు ఆచార్య వి.తిరుపతయ్య వద్ద కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నారు. చక్రికి పాటలు రాయడం కంటే పాటలు పాడటం అంటేనే ఎక్కువ ఇష్టం. తెలంగాణలో ఒకప్పుడు ఊర్రూతలూగించిన శంకర్, సారంగపాణి ఆర్కెస్ట్రా ఎక్కడ జరిగినా చక్రి అక్కడికి వెళ్లేవారు. ఇళయరాజా పాటల వింటూ ఆ స్థాయి సంగీత దర్శకుడిని కావాలని కలలు కనేవారు. చక్రి తన 18వ ఏట మొదటి పాటకు ట్యూన్ చేశారు. జాతీయవాద భావజాలంతో రాసిన ‘‘ఒకే జాతి మనదిరా... ఒకే బాట మనదిరా..’’ అనే దేశభక్తి గీతానికి అందరి ప్రశంసలు దక్కాయి. భారత వికాస పరిషత్ పోటీలలో చక్రి పాడిన పాటలు ఊర్రూతలూగించాయి. తన మిత్రుల ప్రోత్సాహంతో మహబూబాబాద్‌లో సాహితి కళాభారతి సంస్థను చక్రి స్థాపించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో తన ఆర్కెస్ట్రా బృందంతో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఈ క్రమంలోనే 1995లో హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఓ హాస్టల్లో పనిచేశారు. నెలకు రూ. 1300 జీతానికి మార్కెటింగ్ ఉద్యోగం చేశారు. తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూనే.. మిత్రులు కందికొండ, లక్ష్మణ్‌లతో కలసి ‘పండు వెన్నెల’ అనే అల్బమ్‌ను రూపొందించారు. మెగాస్టార్ చిరంజీవిని కాన్సెప్ట్‌గా తీసుకుని ‘చిరునవ్వుతో చిరుకానుక’ పేరిట పాటలను ట్యూన్ చేసి క్యాసెట్ రూపొందించారు. ఇవి బాగా ప్రజాదరణ పొందాయి. ఆదిత్య ఆడియో కంపెనీవారు సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌కు చక్రి పాటలను పరిచయం చేశారు. ఆ విధంగా పూరి అవకాశమివ్వడంతో 2000 సంవత్సరంలో ‘బాచి’ చిత్రంతో సంగీత దర్శకుడిగా చక్రి ఆరంగేట్రం చేశారు. 14 ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక విజయవంతమైన చిత్రాలకు పని చేశారు. ప్రతిష్టాత్మక అవార్డులను ఎన్నింటినో పొందారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగానూ అవార్డు పొందారు. ఎందరో కొత్తతరం గాయనీగాయకులను చిత్రసీమకు పరిచయం చేశారు. చక్రి చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించేవారు. ఆయన అకాల మరణంతో సంగీత లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. చక్రి మరణంతో దిగ్భ్రాంతి చెందా: సీఎం కేసీఆర్ ‘ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. చిన్న వయసులోనే ఎన్నో విజయాలు సాధించిన చక్రి మరణం తెలంగాణ రాష్ట్రానికి, సినిమా పరిశ్రమకు తీరని లోటు. మధురమైన సంగీతంతో ఎన్నో అవార్డులు పొందిన చక్రి అకాల మరణం దురదృష్టకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’. సంగీత ప్రపంచం మూగబోయింది చక్రి ఆకస్మికంగా మృతిచెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. ఆయన మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. కుటుంబ సభ్యులకు సానుభూతి par తెలియజేస్తున్నా. - కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వైఎస్సార్ సీపీ నేత జగన్ సంతాపం ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి ఆకస్మిక మృతికి దిగ్భ్రాంతికి గురయ్యా. ఆయన మృతికి సంతాపం. చక్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. సీఎల్పీ నేత జానారెడ్డి సంతాపం ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచే సింది. తన ప్రతిభా పాటవాలతో చిన్న వయస్సులోనే చక్రి అగ్ర సంగీత దర్శకుల జాబితాలో చేరారు. గాయకులకు స్ఫూర్తి దాయకుడు యువ సంగీతదర్శకులకు, వర్ధమాన గాయకులకు చక్రి స్ఫూర్తి దాయకులు. అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా తనవంతు సహాయాన్ని కూడా అందించేవారు. - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కలసి పని చేశాం చక్రి నాకు ఆత్మీయులు. స్వదేశీ జాగరణ మంచ్‌లో నాతో కలసి అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. వారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమ, సంగీత ప్రపంచానికి తీరని లోటు. చక్రి ఆత్మకు శాంతి par చేకూరాలి. - మురళీధరరావు, బీజేపీ నేత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంతాపం ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి మృతికి సంతాపం. చక్రి నివాసాన్ని సందర్శించిన చెవిరెడ్డి ఆయన మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. చక్రి తనకు ఎంతో ఆప్తుడు. ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. కళారంగానికి తీరని లోటు సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు చక్రి అకాల మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. చిన్నవయసులోనే సంగీత దర్శికుడిగా పేరొందిన చక్రి మరణం సినీ, కళా రంగాలకు తీరని లోటు. చక్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. - సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి -
‘కోట’ కమిషనర్ ఆకస్మిక మృతి
* గుండెపోటుతో శుక్రవారం ఉదయం కన్నుమూసిన నాగేంద్ర ప్రసాద్ * తనపై ఎస్సీ, ఎస్టీ కేసుతో కొన్నాళ్లుగా మనస్తాపం * ఈ నేపథ్యమే విషాదానికి కారణమంటున్న సిబ్బంది సామర్లకోట : సామర్లకోట మున్సిపల్ కమిషనర్ జ్యోతుల నాగేంద్రప్రసాద్ (48) శుక్రవారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. స్థానిక రత్నంరాజు ఆస్పత్రి సమీపంలోని అపార్టుమెంట్లో నివసిస్తున్న ఆయనకు తెల్లవారు జామున గుండెపోటు రావడంతో మాధవపట్నంలోని గ్లోబ ల్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తర్వాత కొద్దిసేపటికే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య లక్ష్మి, బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న యశ్వంత్, పదో తరగతి చదువుతున్న హేమంత్ అనే కుమారులు ఉన్నారు. ఇటీవల ఓ శానిటరీ ఇన్స్పెక్టర్ ఫిర్యాదుపై కమిషనర్‌తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ పైనా, ఆమె భర్త పైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. అప్పటి నుంచీ మనస్తాపంతో ఉన్న ప్రసాద్ ఆ ఒత్తిడిని తట్టుకోలేక కన్నుమూశారని మున్సిపల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్‌గా పట్టణంలో ఉత్తమ సేవలు అందించడమే కాక మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతగా నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, అలాంటి అధికారి ఇలా అకాలంగా మరణించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు నేపథ్యంతో మానసిక ఒత్తిడితోనే కమిషనర్ మృతి చెందారని మున్సిపల్ ఎంప్లాయీస్ ఎస్సీ సంఘ నాయకులు కె. రఘుప్రసాద్, అప్పారావు, దండోరా యూనియన్ నాయకులు తాతపూడి కృష్ణబాబు, వల్లూరి నాని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆర్డీ రవీంద్రబాబు, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, తుని, మండపేట, ఏలేశ్వరం కమిషనర్లు గోవిందస్వామి, ఎ. వెంకట్రావు, రాము, వెంకటరమణ, శ్రీరామశర్మ, సుధాకర్, రాష్ట్ర మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, ప్రధాన కార్యదర్శి ఏసుబాబు, మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్, ఉప ముఖ్యమంత్రి సోదరుడు జగ్గయ్యనాయుడు తదితరులు ప్రసాద్ భౌతిక కాయాన్ని సందర్శించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప..ప్రసాద్ భార్య లక్ష్మితో ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటామని హామీ ఇచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రసాద్ మృతికి సంతాపం తెలిపారు. సంతపసూచకంగా పట్టణ పరిధిలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. స్టేషన్, బళ్ల సెంటర్లలోని మున్సిపల్ షాపులను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసి వేశారు. ఆస్పత్రి నుంచి ప్రసాద్ భౌతికకాయాన్ని మున్సిపల్ కార్యాలయం ఆవరణకు తరలించారు. అక్కడ ప్రజల సందర్శనార్థం రెండు గంటలు ఉంచాక ఆయన నివాసం ఉంటున్న అపార్టుమెంట్‌కు తీసుకువచ్చారు. ఆ సమయంలో భార్యాబిడ్డల రోదన స్థానికుల హృదయాలను కలచివేసింది. తన భర్తను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని లక్ష్మి రోదించింది. ప్రసాద్ స్వగ్రామమైన అనకాపల్లి సమీపంలోని చోడవరంలో ప్రస్తుతం తుపాను కారణంగా విద్యుత్, నీటి సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. దాంతో అంత్యక్రియలను సామర్లకోటలోనే జరపాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శుక్రవారం రాత్రికి సమీప బంధువులు వచ్చాక ఏ విషయం నిర్ణయమవుతుంది. -
కానిస్టేబుల్ శ్రీపతి హఠాన్మరణం
ఎస్పీ సతీమణి, డీఎస్పీ, ఇతర పోలీసు అధికారుల సంతాపం అనంతపురం క్రైం : నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రీపతి(45) హఠాన్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మంగళవారం ఉదయం శ్రీపతి ఇంటి నుంచి విధులకు స్టేషన్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి ఇంటికొచ్చాడు. భోంచేసిన అనంతరం విశ్రాం తి తీసుకుంటానని భార్య పావనికి చెప్పి నిద్రకు ఉపక్రమించాడు. అరగంట తర్వాత పెద్దగా గురక వినిపిస్తుండడంతో భార్య వెళ్లి చూసింది. ఒళ్లంతా చెమటలు పట్టి వణుకుతుండడంతో ఆందోళనగా బంధువులు, చుట్టుపక్కల వారికి సమాచారం చేర వేసి వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా మారింది. వైద్యం ప్రారంభించిన కొద్ది సేపటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి కుమారులు మధు ప్రభాదిత్య(పదో తరగతి), అరుణాదిత్య(4వ తరగతి) ఉన్నారు. నిమిషాల వ్యవధిలో కళ్లెదుటే భర్తను మృత్యువు కాటేయడాన్ని పావని జీర్ణించుకోలేక పోయింది. ‘ఎంత అన్యా యం చేశావు దేవుడా... ఇంక మాకు దిక్కెవరురా..సామీ...ఇలా వదిలి వెళ్లి పోతి వే...’ అంటూ విలపించడాన్ని చూసిన వారు కన్నీరు పెట్టారు. ఎస్పీ సతీమణి మంజుల, వారి కుమారుడు విష్ణుప్రభాస్, డీఎస్పీ నాగరాజ, టూ టౌన్ సీఐ మన్సూరుద్దీన్, ఎస్ఐలు సుబ్బరాయు డు, రవిశంకర్‌రెడ్డి, సిబ్బంది, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కేసు విషయమై ఎస్ఐతో పాటు కలియదిరిగి... ఎస్ఐ సుబ్బరాయుడు, కానిస్టేబుల్ శ్రీపతి ఉదయం నుంచి ఓ చోరీ కేసు విషయమై కలియదిరిగారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో శ్రీపతి ఇంటికెళ్తానని ఎస్ఐకి చెప్పి వచ్చాడు. 2.30 గంటల సమయంలో ఎస్ఐకి కొందరు ఫోన్లు చేసి శ్రీపతి చనిపోయాడని చెప్పారు. దీంతో ఆయన విస్తుపోయారు. శ్రీపతి భౌతికకాయాన్ని సందర్శించి కంట తడి పెట్టారు. ‘ఇద్దరం ఉదయం నుంచి కలిసి తిరిగాం...ఇంతలోనే ఇలా జరిగింది’ అంటూ ఎస్ఐ వాపోయారు. మంత్రి సునీత చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్న శ్రీపతి ఇటీవల డీఎస్పీ పార్టీలో పని చేసిన శ్రీపతి సేవలను గుర్తించి ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నాడు. విధుల్లోనూ నిక్కచ్చిగా వ్యవహరించేవాడని, మంచి పోలీసును కోల్పోయామని సహచర సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. -
అన్నయ్య మరణవార్త విని తమ్ముడి హఠాన్మరణం
రెండు గ్రామాలలో విషాదం తుమ్మపాల: అన్నయ్య మరణవార్త విని తమ్ముడు హాఠాన్మరణం చెందిన సంఘటన అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారంలో బుధవారం చోటు చేసుకుంది. తుమ్మపాలకు చెంది న పీలా వెంకటరావు, పీలా జోగి నాయుడు అన్నదమ్ములు. అన్నయ్య పీలా వెంకటరావు (48) చింతనిప్పుల అగ్రహారంలో అత్తవారింట కొన్నేళ్లుగా ఉంటున్నారు. మూడు రోజుల క్రితం పీలా వెంకటరావు అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాక ఇంటికి వచ్చాడు. బుధవారం ఉదయం 10.00 గంటల సమయంలో మళ్లీ అస్వస్థతకు గురయి మరణించాడు. ఈ వార్త తెలిసి తమ్ముడు పీలా జోగినాయుడు (40) తుమ్మపాల నుంచి సిహెచ్.ఎన్. అగ్రహారం వచ్చాడు. అన్నయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. మనోవేదనతో అన్నయ్య మరణవార్తను తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బంధువులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుమ్మపాల వద్ద మరణించాడు. వీరికి అన్నయ్య జగ్గప్పారావు ఉన్నారు. దీంతో ఇటు సిహెచ్.ఎన్. అగ్రహారంలోను, అటు తుమ్మపాలలోను విషాదం అలుముకుంది. వెంకటరావుకు భార్య ధనలక్ష్మి దహన సంస్కారాలు నిర్వహించారు. -
'ఆయన లేని లోటు పూడ్చలేనిది'
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండేకు పార్టీలకు అతీతంగా నాయకులు సంతాపం తెలిపారు. ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనలేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. తన సహచరుడి మరణం తనను షాక్ కు గురిచేసిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. మరో కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముండే హఠాన్మణం పట్ల ఎన్సీపీ అధినేత శరద పవార్ సంతాపం ప్రకటించారు. తన పాత స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేపోతున్నానని జేడీ(యూ) నేత శరద్ యాదవ్ పేర్కొన్నారు. ముండే మరణం బీజేపీ, తమ పార్టీకి పెద్ద దెబ్బ అని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్ర మంచి నాయకున్ని కోల్పోయిందని నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ ట్వీట్ చేశారు. -
గుంటూరుతో శోభకు అనుబంధం
- టీడీపీ జిల్లా పరిశీలకురాలిగా సుపరిచితం - వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలి సమరదీక్షలో విజయమ్మకు వెన్నంటే... - శోభానాగిరెడ్డి ఆకస్మిక మృతితో ఖిన్నులైన జిల్లా నాయకులు సాక్షిప్రతినిధి, గుంటూరు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు భూమా శోభానాగిరెడ్డి ఆకస్మిక మరణం జిల్లా వాసులను, వైఎస్సార్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను తీవ్రంగా కలిచివేసింది. పార్టీలకు అతీతంగా నాయకులు ఆమె మృతికి సంతాపం తెలిపారు. జల్లాతో శోభానాగిరెడ్డికి ఎంతో అనుబంధం ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆమె 2005-06లోపార్టీ పరిశీలకురాలిగా వ్యవహరించారు. పార్టీలో ట్రబుల్షూటర్గా ఆమెకు మంచి పేరుండేది. పరిశీలకురాలి హోదాలోనే ఏడాది కాలంలోనే ఆమె సుమారు ఏడెనిమిది సార్లు జిల్లాకు వచ్చారు. కార్యకర్తల సమస్యలను, విన్నపాలను ఆమె పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే వారు. అటు తరువాత ఆమె పీఆర్పీలో చేరడం తదనంతర పరిణామాలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబానికి అండగా నిలిచారు. వైఎస్సార్సీపీలో ప్రముఖ నాయకురాలిగా ఎదిగారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు తోడుగా ఉండేవారు. విజయమ్మ ఎక్కడ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నా వెంట శోభానాగిరెడ్డి ఉండేవారు. గత ఏడాది బాపట్లలో జరిగిన పార్టీ మహిళా సదస్సుకు హాజరై మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నినదించారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో గత ఏడాది ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు ఐదురోజుల పాటు గుంటూరు నగరంలోని ఆర్టీసీబస్టాండ్ ఎదుట విజయమ్మ సమరదీక్ష చేపట్టినపుడు ఆమెకు తోడుగా శోభ ఇక్కడే ఉన్నారు. పోలీసులు విజయమ్మను అన్యాయంగా, కనీస నియమ నిబంధనలను పాటించకుండా జీజీహెచ్‌కు తరలించడంతో ఆమె ఆసుపత్రి బయటే ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 25వ తేదీన విజయమ్మ దీక్ష విరమించే వరకు శోభానాగిరెడ్డి ఆమెకు తోడుగా ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన కృష్ణాట్రిబ్యునల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై విజయమ్మ పులిచింతల ప్రాజెక్టు వద్ద చేపట్టిన సాగుపోరుదీక్షకు శోభానాగిరెడ్డి హాజరై ప్రసంగించారు. ఆమె ఆకస్మిక మరణంతో జిల్లాలోని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
సునందా పుష్కర్‌కు బాలీవుడ్ నివాళులు
ఆశా భోంస్లే, శ్రీదేవి, షబానా అజ్మీ లాంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ ఆకస్మిక మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. సోషల్ సర్కిళ్లలో చాలా చురుగ్గా వ్యవహరించిన సునంద ముఖ్యంగా పేజ్౩లో ఎక్కువగా కనిపించేవారు. అలాంటిది ఆమె శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలోని ఓ హోటల్లో మరణించి కనిపించారు. ఆమె మరణంపై పలువురు తమ సంతాపాలు తెలిపారు. ఎవరేమన్నారంటే.. ఆశా భోంస్లే: సునంద విషయం తెలిసి షాకయ్యాను. శశి థరూర్, సునంద కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి శ్రీదేవి: చాలా చురుగ్గా, ఎంతో ఆప్యాయంగా, ఉత్తేజపూరితంగా ఉండే సునందా పుష్కర్ మృతి చాలా విషాదకరం. ఆమె ఆత్మకు శాంతి కలుగు గాక షబానా అజ్మీ: సునంద విషాదాంతం చాలా బాధాకరం. ఆమె చాలా చురుగ్గా, ఆప్యాయంగా ఉండేవారు. ఆ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి ఫర్హాన్ అక్తర్: సునందా పుష్కర్ మరణం చాలా విషాదకరం. శశిథరూర్ కుటుంబానికి సానుభూతి. జూహీ చావ్లా: సునంద విషయం తెలిసి దిగ్భ్రాంతి చెందాను. నిన్నటి వరకు మాతోనే ఉండి, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లలో కూడా చాలా సరదాగా ఉండేవారు. ఇప్పుడు లేరంటే బాధగా ఉంది. సోహా అలీఖాన్: సునంద విషయం తెలిసి షాకయ్యాను. ఆమె జీవితంలో ఎప్పుడూ చాలా ఉత్సాహంగా ఉండేవారు, వెలుగులు విరజిమ్మేవారు. ఆమె మరణాన్ని నమ్మలేకపోతున్నా. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. జావేద్ అక్తర్: సునంద లాంటి వ్యక్తి లేరంటే నమ్మలేకపోతున్నాను. ఆమె జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించేవారు, పదిమందితో సరదాగా ఉండేవారు. ఆ సరదాలు, సంతోషాలు ఇక లేవు. శశీజీకి నా సానుభూతి. శేఖర్ కపూర్: సునందా థరూర్ మృతి అతిపెద్ద విషాదం. నిన్న రాత్రి 7.30 గంటలకే శశి థరూర్ మాట్లాడుతుంటే వింటూ ఢిల్లీ నుంచి బయల్దేరాను. ముంబై చేరుకునే సరికి ఆమె మరణవార్త తెలిసింది. అనుపమ్ ఖేర్: సునందాపుష్కర్ జీవితాన్ని బాగా ఆస్వాదించేవారు. జీవితం కంటే ఆమే ఎక్కువ. మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండేది. ఆమె మరణం చాలా దురదృష్టకరం. సోను సూద్: సునందా పుష్కర్ గురించి తెలిసి షాకయ్యాను. జీవితం గురించి ఏమీ ఊహించలేం. ఆమె ఆత్మకు శాంతి కలుగు గాక. కైలాష్ ఖేర్: సునందా పుష్కర్ విషాదాంతం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. త్వరలోనే దుబాయ్‌లో జరిగే వాళ్ల కార్యక్రమంలో నేను పాల్గొనాల్సి ఉంది. ఇంతలోనే ఇలా జరిగింది. రిప్ సునంద