కిమురా ఆకస్మిక మృతి.. షాక్‌లో అభిమానులు | Sudden Death Of Hana Kimura Shocks Fans | Sakshi
Sakshi News home page

కిమురా ఆకస్మిక మృతి.. షాక్‌లో అభిమానులు

Published Sun, May 24 2020 2:07 PM | Last Updated on Sun, May 24 2020 2:10 PM

Sudden Death Of Hana Kimura Shocks Fans - Sakshi

టోక్యో : ప్రముఖ రెజ్లర్‌ హనా కిమురా(22) ఆకస్మిక మరణం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ విషయాన్ని రెజ్లింగ్‌ సంస్థ స్టార్‌డమ్‌ వెల్లడించింది. కిమురా మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. అయితే కిమురా మరణానికి గల కారణాలు తెలియడం లేదు. మరోవైపు సైబర్‌ వేధింపుల వల్లే ఆమె మరణించారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చనిపోవడానికి ముందు కిమురా చేసిన పోస్టులు తను సైబర్‌ బెదిరింపులకు గురయ్యారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వారు అంటున్నారు. 

కిమురా జపాన్‌లో మంచి రెజ్లర్‌గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఇటీవల విపరీతమైన ఆదరణ పొందిన నెటిఫ్లిక్స్‌ రియాలటీ షో టెర్రస్‌ హౌస్‌లో ఆమె నటించారు. టెర్రస్‌ హౌస్‌ షోలో ఉండే ఆరుగురు రెసిడెంట్స్‌లో కిమురా ఒకరు. అయితే కరోనా కారణంగా ఆ షో షూటింగ్‌ ఏప్రిల్‌ నుంచి నిలిచిపోయింది. కాగా, ఆమె తల్లి క్యోకో కిమురా కూడా మంచి రెజ్లర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement