wrestler
-
2 వేల కోట్లు వసూలు చేస్తే.. మాకిచ్చింది కోటే..!
-
ట్రెండింగ్‌లో సాక్షి మాలిక్: ఆమె భర్త ఎవరో తెలుసా? అతడి బ్యాగ్రౌండ్ ఇదే! (ఫొటోలు)
-
పాక్ రెజ్లర్ అలీ అసద్‌పై నాలుగేళ్ల నిషేధం
కరాచీ: ప్రదర్శన మెరుగయ్యేందుకు నిషేధిత ఉ్రత్పేరకాలు ఉపయోగించిన పాకిస్తాన్ రెజ్లర్ అలీ అసద్‌పై ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) నాలుగేళ్ల నిషేధం విధించింది. 2022 బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో అలీ అసద్ పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతక బౌట్లో అలీ అసద్ 11–0తో సూరజ్ సింగ్ (న్యూజిలాండ్)పై గెలుపొందాడు.అయితే, 2022 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అలీ అసద్ నిషేధిత ఉ్రత్పేరకాలు వాడినట్లు తేలింది. దాంతో 2022 నవంబర్‌లో అలీ అసద్‌పై తాత్కాలిక నిషేధం విధించారు. అలీ అసద్ నెగ్గిన కాంస్య పతకాన్ని వెనక్కి తీసుకొని నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ రెజ్లర్ సూరజ్ సింగ్‌కు ఈ పతకాన్ని అందించారు. ఈ కేసును రెండేళ్లపాటు విచారించిన ఐటీఏ అలీ అసద్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఈ వారంలో అతడిపై నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. విచారణ సమయంలో అలీ అసద్ గైర్హాజరు కావడంతో ఐటీఏ తుది నిర్ణయాన్ని ప్రకటించింది. -
రైతుల గోడు కేంద్రం వినాలి
చండీగఢ్: ఒలింపిక్ క్రీడాకారిణి, మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ గత 200 రోజులుగా ఉద్యమిస్తున్న రైతన్నలకు సంఘీభావం ప్రకటించారు. శనివారం పంజాబ్, హరియాణా సరిహద్దులోని శంభు, ఖనౌరీ బోర్డర్ పాయింట్ల వద్ద పంజాబ్ రైతుల ‘ఢిల్లీ చలో’ నిరసనోద్యమం శనివారం 200వ రోజుకు చేరిన సందర్భంగా శంభు బోర్డర్తోపాటు ఖనౌరీ బోర్డర్ వద్దకు వచ్చి రైతులతో కలిసి నిరసన స్థలాల వద్ద బైఠాయించి వారికి వినేశ్ ఫొగాట్ మద్దతు పలికారు. రైతు కుటుంబంలో పుట్టిన వినేశ్ ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘ మీ కూతురు మీకు బాసటగా ఉంటుందని చెప్పేందుకే ఇక్కడికి వచ్చా. డిమాండ్లు ఇంకా నెరవేర్చనందుకే రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. 200 రోజులుగా ఉద్యమిస్తున్న వీళ్లను చూస్తే బాధేస్తోంది. రెజ్లర్లుగా మేం రైతులకు మావంతుగా ఏమీ చేయలేకపోయామని ఒక్కోసారి అనిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మేము ఇక్కడ సొంత కుటుంబం కోసం ఏమీ చేయలేక నిస్సహాయులమయ్యాం. వీళ్ల బాధను ఇప్పటికైనా ప్రభుత్వం వినాలి. రైతన్న అన్నం పెట్టకపోతే మనమెలా బతుకుతాం?. ప్రభుత్వం అస్సలు పట్టించుకోకపోయినా నిస్వార్థంగా రైతులు పంటలు పండించి దేశానికి తిండి పెడుతున్నారు. వాళ్లది పెద్ద మనసు. ప్రభుత్వం కూడా తమది పెద్దమనసు అని చాటిచెప్పాలి. డిమాండ్లను నెరవేర్చాలి. హరియాణాలో రైతులు ఉద్యమిస్తే వారికీ నేను మద్దతు పలుకుతా. రైతుల కష్టాలను పరిష్కరించాల్సిందే. సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. రైతుల ఉద్యమం వృథా కాకూడదు’’ అని అన్నారు. హరియాణాలోని ఛర్ఖీ దాద్రీ జిల్లాకు చెందిన మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తారా? అని విలేకరి ప్రశ్నించగా ‘‘ నాకు రాజకీయాల గురించి అస్సలు తెలియదు. నాకు రాజకీయ అనుభవం కూడా లేదు. నేను రాజకీయాల్లోకి రాబోను. ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దు. ఇది రైతుల ఉద్యమస్థలి. ఇక్కడ రైతన్నల సమస్యల గురించే మాట్లాడదాం. చర్చిద్దాం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. నిరసనోద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ సంయుక్తంగా అక్కడే ‘కిసాన్ మహాపంచాయత్’ ఏర్పాటుచేశాయి. -
Sakshi Malik: నా జీవితాన్ని నిజాయితీగా వివరించాను
కొన్నాళ్ల క్రితం బౌట్లలో... మెడలో పతకాలతో... తదనంతరం ఢిల్లీ రోడ్లపై కనిపించిన భారత స్టార్ మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ ఇప్పుడు అక్షర రూపంలో చదివించనుంది. ఆమె స్వీయచరిత్ర ఇప్పుడు పుస్తకంగా మార్కెట్లోకి రానుంది. ‘విట్నెస్’ పేరుతో ఆమె ఆత్మకథను అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు ప్రచురణకర్తలు వెల్లడించారు. రచయిత జొనాథన్ సెల్వరాజ్ రాసిన ఈ పుస్తకాన్ని జుగ్గర్‌నాట్ బుక్స్ అనే సంస్థ ప్రచురించింది.బౌట్లో నిబద్ధతను చాటిన ఆమె... పుస్తకంలో తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్ని నిజాయితీగా, నిక్కచ్చిగా వెలిబుచ్చి నట్లు పబ్లిషర్లు తెలిపారు. ఆమె బాల్యం, రోహ్తక్లోని అఖాడాలో రెజ్లింగ్ నేర్చుకోవడం, దాన్ని కెరీర్‌గా మలచుకోవడం అక్కడి నుంచి గ్రామీణ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల నుంచి ఏకంగా ‘రియో’ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మువ్వన్నెల పతాకాన్ని ఎగరేయడం దాకా అన్నీ పుస్తకంలో ఉన్నాయి. వెన్నుచూపని తీరుఈ క్రమంలో ఆమె పడిన పాట్లు, ఓడినప్పుడు నేర్చుకున్న గుణపాఠాలు, పోరాటం పెట్టిన పరీక్షలు, భారత రెజ్లింగ్ సమాఖ్యలోని చీడపురుగుల వికృత చేష్టలపై పిడికిలి బిగించిన వైనం, వెన్నుచూపని తీరు ఇవన్నీ కూడా పుస్తక రూపంలో అందుబాటులోకి రానుంది. కొన్ని ఆత్మకథలు ఆసక్తికర, నాటకీయ మలుపులకే పెద్దపీట వేస్తాయి. కానీ సాక్షి స్వీయచరిత్ర మాత్రం మలుపులతో కాదు... ప్రతి అడుగుతో ముడిపడి రాబోతోందని ప్రచురణ సంస్థ వెల్లడించింది. పురుషాధిక్య భారత రెజ్లింగ్ ప్రపంచంలో మహిళలకు ఎదురైన సవాళ్లు, శిక్షణ శిబిరంలో అబలల పాట్లు, బౌట్లలో ప్రత్యర్థులతో కుస్తీ పట్టినట్లే... ఆర్థిక సమస్యలపై పట్టిన కుస్తీ, బాడీ ఇమేజ్, డేటింగ్ ఇలా ఏ ఒక్కటీ వదలకుండా నిగూఢమైన నిజాలన్నీ పుస్తకంలో అక్షర సాక్ష్యాలు కానున్నాయి. ‘నా జీవితాన్ని నిజాయితీగా వివరించాను. ఎదురైన సవాళ్లు, ఎత్తు పల్లాలు ప్రతిఒక్కటి స్పృశించాను’ అని సాక్షి మలిక్ తెలిపింది. -
వినేశ్‌కు అపూర్వ స్వాగతం
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శనివారం స్వదేశానికి చేరుకుంది. స్వర్ణపతక పోరుకు ముందు అనర్హతకు గురై అప్పీల్‌కు వెళ్లిన ఆమె ఇన్నాళ్లూ పారిస్‌లోనే ఉండిపోయింది. ఫైనల్ రోజు కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె అనర్హతకు గురైంది. ఫైనల్లో ఓడినా కనీసం రజతం ఖాయం అనుకోగా, అదీ చేజారిపోయింది. సంయుక్త రజతం కోసం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో వినేశ్ అప్పీలు చేసింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మద్దతుతో నిష్ణాతులైన లాయర్ల బృందం ఆమె కేసును వాదించింది. విచారణ తదుపరి వాయిదాల అనంతరం చివరకు భారత రెజ్లర్‌కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. దీంతో భారత్‌కు పయనమైన వినేశ్ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే క్రీడాభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. డోలు బాజాలు, భాంగ్రా నృత్యాల మధ్య ఆమె బయటకు వచ్చింది. వినేశ్ భర్త సోమ్‌వీర్ రాఠీ కూడా ఆమె వెంట ఉన్నాడు. ఒలింపిక్ పతక విజేతలైన స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాలతో పాటు, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, పోటెత్తిన అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వెల్లువెత్తిన అభిమానం చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన ఫొగాట్ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది గమనించిన సాక్షి, బజరంగ్ ఆమెను దగ్గరికి తీసుకొని ఓదార్చారు. అనంతరం తేరుకొని వినమ్రంగా చేతులు జోడించి ‘యావత్ దేశానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని చెప్పింది. పెద్ద సంఖ్యలో అభిమానులంతా తమ వాహనాల్లో వినేశ్‌ను ఆమె స్వగ్రామం బలాలి (హరియాణా) చేరే వరకు అనుసరించారు. దీంతో ఈ 135 కిలో మీటర్ల మార్గమంతా వీఐపీ కాన్వాయ్‌ని తలపించింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత బృందానికి చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించిన మాజీ షూటర్ గగన్ నారంగ్ కూడా శనివారం ఆమెతో పాటు స్వదేశం చేరుకున్నారు. ఆమెతో పారిస్‌లో దిగిన ఫొటోని ‘ఎక్స్’లో షేర్ చేస్తూ వినేశ్ నిజమైన చాంపియన్‌గా అభివర్ణించారు.‘క్రీడా గ్రామంలో తొలి రోజే ఆమె చాంపియన్‌గా అడుగుపెట్టింది. అనర్హతకు గురైనా ఇప్పటికీ ఆమెనే చాంపియన్. పతకాలు, విజయాలే కాదు... కొన్నిసార్లు పోరాటం కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. వినేశ్ కనబరిచింది కూడా అదే! యువతరానికి ప్రేరణగా నిలిచిన ఆమెకు నా సెల్యూట్’ అని నారంగ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. వినేశ్ కోసం ఢిల్లీలో, తమ స్వగ్రామంలో ఎదురు చూసిన అభిమానులు ఆమెకు బ్రహ్మరథం పట్టారని సోదరుడు హర్విందర్ ఫొగాట్ చెప్పాడు. ‘ఒలింపిక్స్ నిర్వాహకులు నాకు పతకం ఇవ్వకపోతేనేమి. ఇక్కడి ప్రజలంత ఎంతో ప్రేమ, గౌరవం అందించారు. నాకు ఇది 1000 ఒలింపిక్ పతకాలతో సమానం’ అని వినేశ్ వ్యాఖ్యానించింది. -
వినేశ్‌కు చుక్కెదురు
కోట్లాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. పారిస్ ఒలింపిక్స్‌లో అసమాన పోరాటంతో ఫైనల్‌కు చేరి... అనంతరం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు న్యాయ పోరాటంలోనూ ఊరట దక్కలేదు. తుదిపోరుకు చేరినందుకు రజత పతకమైనా ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)ను ఆశ్రయించిన వినేశ్ ఫొగాట్ అప్పీలు తిరస్కరణకు గురైంది. పారిస్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో చుక్కెదురైంది. పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్... నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైంది. దీంతో అనుమతించిన బరువుతోనే ఫైనల్ వరకు చేరినందుకు గానూ... రజత పతకం అందించాలని వినేశ్ సీఏఎస్‌ను ఆశ్రయించింది. అయితే ఈ అంశంపై ఇప్పటికే రెండుసార్లు తీర్పు వాయిదా వేసిన సీఏఎస్... ఎట్టకేలకు బుధవారం రాత్రి ఏకవాక్యంలో తుది తీర్పు వెల్లడించింది. వినేశ్ పిటిషన్‌ను సీఏఎస్ అడ్హాక్ డివిజన్ కొట్టి వేసింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) వివరాలు వెల్లడించింది. అథ్లెట్లు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక ఒత్తిళ్లను పరిగణనలోకి తీసుకోవడంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ విఫలమైందని... ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష అభిప్రాయపడింది.‘నిరాశాజనక తీర్పు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి వ్యతిరేకంగా వినేశ్ ఫొగాట్ అభ్యర్థనను ఆర్బిట్రేటర్ తిరస్కరించారు. మహిళల 50 కేజీల విభాగంలో తనకు కూడా రజత పతకం ఇవ్వాలన్న వినేశ్ దరఖాస్తూను కొట్టేశారు’ అని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష ఒక ప్రకటనలో తెలిపింది. తొలి రోజు నిబంధనల ప్రకారమే బరువు ఉన్నందుకుగానూ దాన్ని పరిగణనలోకి తీసుకొని మానవీయ కోణంలో తీర్పు ఇవ్వాల్సిందని... కానీ అది జరగలేదని పీటీ ఉష వాపోయింది.కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం సబబు కాదని పేర్కొంది. దీంతో ‘పారిస్’ క్రీడల్లో భారత్‌కు మరో పతకం వస్తుందనే ఆశలు ఆవిరయ్యాయి. ఫలితంగా విశ్వక్రీడల్లో భారత్ ఆరు (ఒక రజతం, 5 కాంస్యాలు) పతకాలతోనే సరిపెట్టుకోనుంది. అనర్హత వేటు అనంతరం మానసికంగా కుంగిపోయిన 29 ఏళ్ల వినేశ్.. కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. సీఏఎస్ తీర్పుపై అప్పీల్ చేయవచ్చా? కష్ట కాలంలో వినేశ్‌కు అండగా నిలుస్తామని ఐఓఏ ప్రకటించింది. తదుపరి న్యాయ పరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం సీఏఎస్ తీర్పుపై అప్పీలు చేసే అవకాశం ఉంది. అయితే సీఏఎస్ తీర్పు మారే అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి.‘ప్రాథమిక విధానపరమైన నియమాల ఉల్లంఘన, ప్రజా పాలసీతో సంబంధం ఉన్న చాలా పరిమిత అంశాలపైనే తీర్పు మార్చే అవకాశం ఉంది. అది మినహా స్విస్ ఫెడరల్ ట్రిబ్యునల్‌కు న్యాయపరిధి పరిమితం’ అని వినేశ్ కేసు వాదించిన ఫ్రాన్స్ లాయర్లు తెలిపారు. -
మూడు రోజుల తర్వాత... సీఏఎస్ తీర్పు మళ్లీ వాయిదా
పారిస్: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రజత పతకం కోసం చేస్తున్న న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆమెకు పతకం ఇవ్వాలా వద్దా అనే అంశంపై మంగళవారం రావాల్సిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పు మరోసారి వాయిదా పడింది. దీనిని మరో మూడు రోజులకు వాయిదా వేస్తున్నట్లు సీఏఎస్ ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెల 16న భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు తీర్పు వస్తుంది. 50 కేజీల కేటగిరీలో 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైన వినేశ్ తాను అనుమతించిన బరువుతోనే ఫైనల్ వరకు చేరాను కాబట్టి తనకు సంయుక్తంగా రజత పతకం అందించాలని సీఏఎస్‌ను ఆశ్రయించింది. మరోవైపు ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమం వరకు పారిస్ క్రీడాగ్రామంలోనే ఉన్న వినేశ్ అక్కడి నుంచి బయలుదేరి మంగళవారమే భారత్‌కు చేరుకుంది. -
శెభాష్ అమన్.. 10 గంటల్లో 4.6 కేజీలు తగ్గిన రెజ్లర్! లేదంటే?
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకంతో మెరిశాడు. 57 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో బరిలోకి దిగిన అమన్ సెమీస్‌లో ఓడినా.. కాంస్య పతక పోరులో మాత్రం అదరగొట్టాడు.ప్రత్యర్ధి క్రజ్ డెరియన్ (పూర్టోరికో)ను 13-5తో ఓడించిన అమన్.. తొలి ఒలింపిక్ పతకాన్ని ముద్దాడాడు. తద్వారా ఒలిపింక్స్‌లో భారత తరపున పతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా అమన్ చరిత్ర సృష్టించాడు.కాంస్యం వెనక కఠోర శ్రమ..అయితే అమన్ సెహ్రావత్ కాంస్య పతకం సొంతం చేసుకోవడం వెనక కఠోర శ్రమ దాగింది. అమన్ తృటిలో ఆనర్హత వేటును తప్పించుకున్నాడు. అమన్ కాంస్య పతక మ్యాచ్‌కు ముందు భారత రెజ్లింగ్ శిబిరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమన్ బరువు(57 కేజీలు) ఉండాల్సిన కంటే 4.5 కేజీలు ఆధికంగా ఉండటమే అందుకు కారణం . సెమీస్‌లో ఓటమి తర్వాత గురువారం(ఆగస్టు 8) నాడు సాయంత్రం 6: 30 గంటలకు అమన్ బరువు 61.5 కేజీలు ఉందట. ఇప్పటికే స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై ఆధిక బరువు కారణంగా అనర్హత వేటు పడినందున.. అమన్ విషయంలో మాత్రం భారత మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకుంది. దీంతో కాంస్య పతక పోరుకు ముందు బరువు తూచే సమయానికి అమన్ 4.6 కిలోల బరువు తగ్గాల్సి ఉంది. ఈ క్రమంలో అమన్ తన బరువు తగ్గడానికి కఠినంగా శ్రమించాడు. గురువారం రాత్రి మొత్తం అమన్ నిద్ర పోలేదు. హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. కోచ్‌లు వీరేంద్ర దహియా, జగ్మందర్ సింగ్ సెహ్రావత్ బరువు తగ్గించడాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు.అమన్ మిషన్ సాగింది ఇలా..తొలుత ఇద్దరు కోచ్‌లతో గంటన్నర సుదీర్ఘ మ్యాట్ సెషన్‌తో అమన్ వెయిట్ లాస్ మిషన్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ యువ రెజ్లర్ ఒక గంట పాటు హాట్ బాత్(వేడి నీళ్ల స్నానం) సెషన్లో పాల్గోన్నాడు. అనంతరం అర్ధరాత్రి దాటాక జిమ్‌లో 30 నిమిషాల నాన్‌స్టాప్ ట్రెడ్‌మిల్‌పై సాధన చేశాడు. ఆ తర్వాత అతడికి 30 నిమిషాల పాటు విరామం ఇచ్చారు. బ్రేక్ తర్వాత దాదాపు ఐదు సెషన్లపాటు ఐదేసి నిమిషాల చొప్పున సానా బాత్( ఆవిరి స్నానం) చేయించారు.అప్పటికి అతడు 3.6 కిలోలు తగ్గాడు. కానీ అమన్‌పై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు మరింత బరువు తగ్గాల్సి ఉంది. ఈ క్రమంలో అతడికి మసాజ్ సెషన్ నిర్వహించారు. ఆ తర్వాత లైట్ జాగింగ్, 15 నిమిషాల రన్నింగ్ సెషన్లో పాల్గోన్నాడు. సరిగ్గా ఉదయం 4:30 గంటలకు అతని బరువు 4.6 కేజీల తగ్గి 56.9 కిలోలకు వచ్చింది. దీంతో భారత బృందం ఊపిరిపీల్చుకుంది. దాదాపు 10 గంటల పాటు తీవ్రంగా శ్రమించి అమన్ తన బరువును తగ్గించుకున్నాడు. శుక్రవారం మ్యాచ్ జరిగే ముందు బరువు తూచే సమయానికి అమన్ సరిగ్గా 56.9 కిలోల బరువు ఉన్నాడు. దీంతో మ్యాచ్‌లో పాల్గోని కాంస్య పతకాన్ని భారత్‌కు అందించాడు. ఈ క్రమంలో అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజంగా నీవు వారియర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
నేను అలసిపోయాను!
‘‘అమ్మలాంటి రెజ్లింగ్ నా మీద గెలిచింది. నేనేమో ఓడిపోయాను. దయచేసి... మీరంతా నన్ను క్షమించండి. మీ కలలు, నా ధైర్యం అన్నీ ముక్కలయ్యాయి. ఇకపై నాకు పోరాడే శక్తి లేదు. గుడ్‌బై రెజ్లింగ్ 2001–2024. నన్ను అభిమానించిన, మద్దతు తెలిపిన మీ అందరికీ నేనెప్పుడు రుణపడే ఉంటాను’’... కుస్తీనే లోకంగా, ఒలింపిక్స్ పతకమే ధ్యేయంగా ఎదిగి... ఇంటా బయటా క్రీడ, క్రీడేతర శక్తులతో పోరాడిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఈ రిటైర్మెంట్ నిర్ణయంతో మళ్లీ మన గుండెల్ని బరువెక్కించింది. పారిస్: సెమీస్‌లో గెలిచి... ఫైనల్‌కు ముందు 100 గ్రాముల తేడాతో అనర్హతకు గురైన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మళ్లీ మ్యాట్‌పైకి దిగే ఉద్దేశం లేదని ప్రకటించింది. రెజ్లింగ్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని గురువారం 29 ఏళ్ల వినేశ్ వెల్లడించింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఎఎస్) అప్పీలుకు సైతం వెళ్లిన ఆమె తీర్పు వెలువడక ముందే అనూహ్యంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంది. అలసిపోయిన తనకు ఇకపై కుస్తీలో ప్రత్యర్థులను పట్టుపట్టే బలం లేదంటూ గురువారం సోషల్ మీడియా వేదికగా గుడ్‌బై చెప్పింది. ఊహించని ఆమె నిర్ణయానికి భారత క్రీడాలోకం నిర్ఘాంతపోయింది. ఆమెను పోరాట యోధురాలిగా చూసిన క్రీడాకారులంతా వారిస్తున్నారు. ఆమెను అభిమానించే వారంతా రెజ్లర్ అధైర్యపడొద్దని వేడుకొంటున్నారు. తల్లిలాంటి రెజ్లింగ్‌పై తన ఉక్కు సంకల్పం సడలించవద్దని అదేపనిగా విజ్ఞప్తి చేస్తున్నారు. వినేశ్ పెదనాన్న ద్రోణాచార్య అవార్డీ, కోచ్ మహావీర్ ఫొగాట్ మాట్లాడుతూ భారత్‌కు చేరగానే తనతో మాట్లాడి వీడ్కోలు నిర్ణయాన్ని విరమించుకునేలా చేస్తానని తెలిపారు. ‘నేను బజరంగ్ పూనియా, గీత కలిసి కూర్చొని అమెతో మాట్లాడతాం. అంతా కలిసి ఆమెకు నచ్చజెబుతాం. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ కోసం లక్ష్య నిర్దేశం చేస్తాం’ అని మహావీర్ అన్నారు. వినేశ్ పోటీపడ్డ ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన సారా హిల్డర్బ్రంట్ (అమెరికా) మాట్లాడుతూ ‘వినేశ్ అనర్హతకు గురవడం బాధాకరం. బరువు తగ్గడం కోసం పడే పాట్లు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అమె కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను’ అని పేర్కొంది. కల కాదు... ఆమెకు ఒలింపిక్స్ ఓ పీడకల! ప్రపంచ చాంపియన్íÙప్లు, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో మంచి రికార్డే ఉన్న వినేశ్‌కు ఏ ఒలింపిక్స్ కూడా అచ్చి రాలేదు. అందుకే ఆమె కెరీర్లో ఒలింపిక్స్ కల కాదు ఓ పీడకలగా మిగిలిపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో కీలకమైన క్వార్టర్ ఫైనల్ బౌట్లో గాయం వల్ల ముందంజ వేయలేకపోయింది. మళ్లీ ఐదేళ్ల (కోవిడ్ వల్ల 2021లో) తర్వాత టోక్యో విశ్వక్రీడల్లో క్వార్టర్స్‌లోనే ఓటమితో ని్రష్కమించింది. ఇప్పుడు మూడేళ్లకే జరిగిన పారిస్ ఈవెంట్లో కనీసం ఖాయమనుకున్న రజతాన్ని అనర్హత వేటు అవహేళన చేసింది. క్రీడ అనేది మానవ సంకల్పానికి వేడుకలాంటింది. నా కెరీర్లో ఇలాంటి సందర్భాల్ని, వేడుకల్ని చాలాసార్లు చవిచూశాను. వినేశ్ సంకల్పానికి దేశం ఒక్కటై పలికిన జేజేలను మాత్రం ఎప్పుడూ చూడలేదు. పట్టు సడలించని ఆమె సంకల్పాన్ని జాతి యావత్తు వేడుక చేసుకుంటోంది. –అభినవ్ బింద్రా, షూటింగ్లో బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత క్రీడాకారులు జీవితమంతా సవాళ్లతోనే సహవాసం చేస్తారు. ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూస్తారు. కలను నెరవేర్చుకునే రోజు నైపుణ్యంతో రాణిస్తే విజయం చేకూరుతుంది. కానీ ఊహకందని ఈ పొరపాట్లు (స్వల్ప బరువుతో అనర్హత) జరిగితే మాత్రం ఎవరికైనా గుండె బద్దలవుతుంది. –కేంద్ర క్రీడల మాజీ మంత్రి, షూటర్ రాజ్యవర్ధన్ రాథోడ్ మేమంతా వినేశ్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం. కఠోర సాధనతో లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ (2028)లో స్వర్ణం గెలిచి మా పిన్ని (వినేశ్ తల్లి), మా నాన్న మహావీర్ కలల్ని సాకారం చేసుకుంటుంది. ఇంటికొచ్చాక నాన్న ఆమెతో మాట్లాడి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తారు. –మాజీ రెజ్లర్ బబితా ఫొగాట్ వినేశ్... అంతపని (రిటైర్మెంట్) చేయొద్దు. బాధలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తగదు. నేను భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తరఫున ఆమె వీడ్కోలుకు బై చెప్పి ఎప్పట్లాగే బౌట్లో సత్తాచాటాలని విజ్ఞప్తి చేస్తున్నాను. –డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ సంజయ్ సింగ్ వినేశ్ ప్రొఫైల్ -
కాంస్యం కోసం అమన్ పోరు
పారిస్: ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న తొలి ప్రయత్నంలోనే పతకం సొంతం చేసుకునేందుకు భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ ఒక విజయం దూరంలో నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో అమన్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్ రజత పతక విజేత రె హిగుచి (జపాన్)తో జరిగిన సెమీఫైనల్లో 21 ఏళ్ల అమన్ ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో పరాజయం చవిచూశాడు. మూడు నిమిషాల నిడివిగల తొలి భాగంలో 2 నిమిషాల 14 సెకన్లలో రె హిగుచి 10–0తో ఆధిక్యాన్ని సంపాదించడంతో రిఫరీ బౌట్‌ను ముగించాడు. ఇద్దరి రెజ్లర్ల మధ్య 10 పాయింట్ల తేడా వచ్చిన వెంటనే రిఫరీ బౌట్‌ను నిలిపి వేసి పది పాయింట్ల ఆధిక్యం సాధించిన రెజ్లర్‌ను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. నేడు జరిగే కాంస్య పతక బౌట్లో ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్తో అమన్ తలపడతాడు. రెండు ఘనవిజయాలతో... అంతకుముందు అమన్ రెండు వరుస ఘనవిజయాలతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో అమన్ 3 నిమిషాల 59 సెకన్లలో 10–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో వ్లాదిమిర్ ఇగొరోవ్ (నార్త్ మెసడోనియా)ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్లో అమన్ 3 నిమిషాల 56 సెకన్లలో 12–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో అబాకరోవ్ జెలీమ్ ఖాన్ (అల్బేనియా)పై గెలుపొందాడు. అబాకరోవ్ 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 57 కేజీల విభాగంలో స్వర్ణం, 2023 ప్రపంచ చాంపియన్íÙప్లో కాంస్యం సాధించడం విశేషం. అమన్ తన సహజశైలిలో ఆడితే నేడు జరిగే కాంస్య పతక బౌట్లో దరియన్‌పై నెగ్గడం అంత కష్టమేమీ కాదు. అన్షు తొలి రౌండ్లోనే... మహిళల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మలిక్ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. హెలెన్ లూసీ మరూలిస్ (అమెరికా)తో జరిగిన బౌట్లో అన్షు 2–7 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. అయితే హెలెన్ ఫైనల్ చేరుకోకపోవడంతో అన్షుకు రెపిచాజ్ రూపంలో కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం చేజారింది. భారత్ ః పారిస్ ఒలింపిక్స్నాలుగో స్థానంలో నిలిచిన ప్లేయర్లులక్ష్య సేన్బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్అంకిత భకత్–బొమ్మదేవర ధీరజ్ఆర్చరీ మిక్స్డ్ టీమ్ మహేశ్వరీ చౌహాన్–అనంత్‌జీత్ సింగ్ షూటింగ్ స్కీట్ మిక్స్డ్ టీమ్ అర్జున్ బబూతాషూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్మనూభాకర్ షూటింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ 10 మీటర్ల వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగంలో రెండు కాంస్యాలు గెలిచింది.మీరాబాయి చానూవెయిట్ లిఫ్టింగ్ మహిళల 49 కేజీలు ఆ ఆరు వచ్చి ఉంటే ‘పది’ దాటేవాళ్లం...పారిస్ ఒలింపిక్స్‌లో అదృష్టం కూడా కలిసి వచ్చి ఉంటే భారత్ పతకాల సంఖ్య రెండంకెలు దాటేది. ఇప్పటికే ఐదు పతకాలు నెగ్గిన భారత్ త్రుటిలో నాలుగు కాంస్య పతకాలను కోల్పోయింది. షూటర్లు అదరగొట్టగా... ఆర్చరీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో మనవాళ్లు నిరాశ పరిచారు. కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న ఆటగాళ్లు తడబడగా... మరో ఆరుగురు ప్లేయర్లు నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో మెడల్ చేజార్చుకున్నారు. -
భారత మహిళా రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌పై మూడేళ్ల నిషేధం
-
వినేశ్ ఫోగట్ సంచలన నిర్ణయం... రెజ్లింగ్‌కు గుడ్ బై
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్‌కు వినేష్ ఫొగాట్ రిటైర్మెంట్ ప్రకటించింది. ప్యారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో తలపడాల్సిన వినేశ్.. ఆధిక బరువు వల్ల అనర్హతకు గురైన విషయం తెలిసిందే. బంగారు పతకానికి అడుగు దూరంలో నిలబడిన వినేశ్‌కు ఎదురుదెబ్బ తగలడంతో ఆమె కల చెదిరింది. ఈ క్రమంలోనే తన ఇష్టమైన క్రీడకు వినేశ్ విడ్కోలు పలికింది. "నాపై రెజ్లింగ్ గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించిండి. మీ కల, నా ధైర్యం అన్ని విచ్ఛిన్నం అయ్యాయి. నాకు ఇంకా పోరాడే ఓపిక లేదు. అందుకే నాకు ఇష్టమైన క్రీడ రెజ్లింగ్(2001-2024) నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని ఎక్స్‌లో వినేశ్ రాసుకొచ్చింది.కాగా ఈ విశ్వక్రీడల్లో 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ పై 140 కోట్ల భారతీయలు బంగారు ఆశలు పెట్టుకున్నారు. కానీ అంతలోనే ఫోగాట్‌తో పాటు అందరి ఆశలు నీరుగారాయి. అనూహ్యంగా తన బరువు విభాగం (50కేజీ) కంటే 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారని వినేశ్‌పై అనర్హత వేటు పడింది.కాగా ఫొగాట్ తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. తను రజత పతకానికి అర్హురాలినని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆర్భిట్రేషన్ తీర్పు వెల్లడించాల్సి ఉండగా.. ఇంతలోనే వినేశ్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।अलविदा कुश्ती 2001-2024 🙏आप सबकी हमेशा ऋणी रहूँगी माफी 🙏🙏— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024 -
Paris Olympics: రెజ్లింగ్‌లో భారత్‌కు పతకం ఖాయం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం ఖరారైంది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్ ఖాతాలో చేరేది స్వర్ణమా, రజతమా అనేది నేడు రాత్రి తేలనుంది. ఈరోజు రాత్రి 11 తర్వాత అమెరికా రెజ్లర్ సారా హిల్డెబ్రాంట్తో జరిగే ఫైనల్లో వినేశ్ విజయం సాధిస్తే ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది. ఒకవేళ ఓడిపోయినా రజత పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా ఆమె గుర్తింపు పొందుతుంది. పారిస్: విశ్వ క్రీడల్లో తమ ‘పట్టు’ను నిలబెట్టుకుంటూ వరుసగా ఐదో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ క్రీడాంశంలో భారత్‌కు పతకం ఖరారైంది. మహిళల ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన 50 కేజీల ఈవెంట్లో వినేశ్ వరుసగా మూడు బౌట్లలో విజయం సాధించి స్వర్ణ–రజత పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో వినేశ్ 5–0తో పాన్ అమెరికన్ గేమ్స్ చాంపియన్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్పై గెలిచింది. మూడు నిమిషాల నిడివి గల తొలి భాగం ముగిసేసరికి వినేశ్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడు నిమిషాల నిడివి గల రెండో భాగంలోనూ వినేశ్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన వినేశ్ ఈ భాగంలో నాలుగు పాయింట్లు స్కోరు చేసింది. వినేశ్ డిఫెన్స్‌ను ఛేదించలేక క్యూబా రెజ్లర్ ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది.యూరోపియన్ మాజీ విజేతను ఓడించి... క్వార్టర్ ఫైనల్లో వినేశ్ 7–5 పాయింట్ల తేడాతో 2018 ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత, 2019 యూరోపియన్ చాంపియన్ ఒక్సానా లివాచ్ (ఉక్రెయిన్)ను ఓడించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ బౌట్లో వినేశ్ ఆరంభంలోనే 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఉక్రెయిన్ రెజ్లర్ కోలుకొని స్కోరును సమం చేసింది. అయితే చివర్లో వినేశ్ దూకుడుగా వ్యవహరించి రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది.ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్‌ను మట్టికరిపించి... అంతకుముందు తొలి రౌండ్లో వినేశ్ పెను సంచలనం సృష్టించింది. 50 కేజీల విభాగంలో ప్రస్తుత ఒలింపిక్ చాంపియన్, మూడుసార్లు ప్రపంచ చాంపియన్ సుసాకి యుయి (జపాన్)పై 3–2తో గెలిచి రెజ్లింగ్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 25 ఏళ్ల సుసాకి ఈ బౌట్‌కు ముందు తన అంతర్జాతీయ కెరీర్లో ఒక్క పరాజయం కూడా చవిచూడలేదు. తాను పోటీపడిన 82 బౌట్లలోనూ సుసాకి విజేతగా నిలిచింది.టోక్యో ఒలింపిక్స్‌లో సుసాకి తన ప్రత్యర్థులకు ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. వినేశ్తో పోరులో సుసాకి ఫేవరెట్ అని అందరూ భావించారు. బౌట్ కూడా అలాగే సాగింది. ఐదు నిమిషాల 49 సెకన్లు ముగిసే వరకు సుసాకి 2–0తో ఆధిక్యంలో నిలిచి విజయం అంచుల్లో నిలిచింది. ఈ దశలోనే వినేశ్ అద్భుతం చేసింది. అందివచి్చన అవకాశాన్ని వదలకుండా ఒక్కసారిగా సుసాకిని కిందపడేసి మూడు పాయింట్లు సాధించి అనూహ్య విజయాన్ని అందుకుంది.సాక్షి తర్వాత వినేశ్... 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి భారత్‌కు పతకాలు లభిస్తున్నాయి. 2008 బీజింగ్‌లో సుశీల్ కుమార్ (66 కేజీలు) కాంస్యం గెలిచాడు. 2012 లండన్‌లో సుశీల్ కుమార్ (66 కేజీలు) రజత పతకం నెగ్గగా... యోగేశ్వర్ దత్ (60 కేజీలు) కాంస్య పతకం సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ (58 కేజీలు) కాంస్య పతకం సొంతం చేసుకుంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బజరంగ్ (65 కేజీలు) కాంస్యం... రవి కుమార్ (57 కేజీలు) రజతం గెల్చుకున్నారు. సాక్షి మలిక్ తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన రెండో భారతీయ మహిళా రెజ్లర్‌గా వినేశ్ గుర్తింపు పొందనుంది. ‘పట్టు’ వీడని పోరాటంఅసాధారణం వినేశ్ ఫొగాట్ ఒలింపిక్ పతక ప్రస్థానం ‘ఈ అమ్మాయిని పోలీసు దెబ్బలతో అణచివేశారు... ఈ అమ్మాయిని తన దేశంలోనే రోడ్లపై ఈడ్చుకెళ్లారు... కానీ ఇదే అమ్మాయి ఇప్పుడు ప్రపంచాన్ని గెలుస్తోంది... పోరాటంలో ఎక్కడా తగ్గని మా వినేశ్ సివంగిలాంటిది. ఆమె విజయాలు చూస్తుంటే ఆనందిస్తున్నామో, కన్నీళ్లు వస్తున్నాయో కూడా తెలియడం లేదు. ఆమె ఆడుతున్న తీరు చూస్తే వినేశ్ ఒక్కతే కాదు... దేశంలోని ప్రతీ మహిళ పోరాడుతున్నట్లుగా ఉంది’... భారత మాజీ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పూనియా మంగళవారం వినేశ్ ఫొగాట్ గురించి భావోద్వేగంతో చేసిన వ్యాఖ్య ఇది.నిజం... వినేశ్ సాధించిన ఘనత ఇప్పుడు ఒలింపిక్ పతకం మాత్రమే కాదు, అంతకుమించి దానికి విలువ ఉంది. ఆటలో కాకుండా మ్యాట్ బయట ఆమె ఎదుర్కొన్న అవమానం, బాధలు, కన్నీళ్లు ఈ పతకం వెనక ఉన్నాయి. ఏడాదిన్నర ముందు ఆమె ఈ పతకం గెలిచి ఉంటే ఒక ప్లేయర్‌గానే ఆమె గొప్పతనం కనిపించేది. కానీ ఇప్పుడు అన్ని ప్రతికూల పరిస్థితులను దాటి సాధించిన ఈ గెలుపు అసాధారణం.ఢిల్లీ వీధుల్లో ఆమె జీవితంలో అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కొంది. పోలీసు దెబ్బలు, అరెస్ట్, బహిరంగంగా అవమానాలు, చంపేస్తామనే బెదిరింపులు, అవార్డులను వెనక్కి ఇచ్చే పరిస్థితులు రావడం, గెలిచిన పతకాలన్నీ గంగానదిలో పడేసేందుకు సిద్ధం కావడం... ఇలా ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా వినేశ్ వేదన అనుభవించింది. తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశి్నంచడం వల్లే, సహచర మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు కారణమైన వ్యక్తిపై చర్య తీసుకోమని కోరడం వల్లే ఇదంతా జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో వినేశ్ తన కెరీర్‌ను పణంగా పెట్టింది. రిటైర్మెంట్కు చేరువైంది కాబట్టే ఇలా చేస్తోందంటూ వినిపించిన వ్యాఖ్యానాలను ఆ తర్వాత బలంగా తిప్పి కొట్టింది. మళ్లీ రెజ్లింగ్‌పై దృష్టి పెట్టింది. తీవ్ర గాయం నుంచి కోలుకొని మరీ పోరాడింది. ఆరు నెలలు ముగిసేలోపు తానేంటో నిరూపించుకుంటూ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. వరుసగా మూడు ఒలింపిక్స్ ఆడిన భారత రెజ్లర్‌గా బరిలోకి దిగి మూడో ప్రయత్నంలో తన అద్భుత కెరీర్లో లోటుగా ఉన్న ఒలింపిక్ పతకాన్ని సాధించి సగర్వంగా నిలిచింది. కెరీర్లో ఎన్నోసార్లు గాయాలతో సహవాసం చేసి కోలుకోగానే మళ్లీ మ్యాట్‌పై సంచలనాలు సృష్టించిన వినేశ్‌పై ఢిల్లీ ఉదంతం తీవ్ర ప్రభావం చూపించింది. శరీరానికి తగిలిన గాయాలకంటే మనసుకు తగిలిన ఈ గాయం బాధ చాలా పెద్దది అంటూ కన్నీళ్ల పర్యంతమైంది. బ్రిజ్‌భూషణ్ శరణ్‌పై పోరాటం తర్వాత మళ్లీ ఆటలోకి అడుగు పెట్టే క్రమంలో కూడా అడ్డంకులు ఎదురయ్యాయి. సెలక్షన్ ట్రయల్స్‌కు హాజరు కాకుండా సీనియార్టీ ద్వారా అడ్డదారిలో వెళ్లేందుకు ప్రయతి్నస్తోందంటూ మళ్లీ విమర్శలు. ఈ మనో వేదన వెంటాడినా వినేశ్ బేలగా మారిపోలేదు. మళ్లీ పట్టుదలతో నిలబడింది. కెరీర్ ఆరంభం నుంచి 53 కేజీల కేటగిరీలోనే పోటీ పడిన ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో 50 కేజీలకు మారాల్సి వచి్చంది. రెజ్లింగ్‌లో ఇలా కేటగిరీ మారడం... అందులోనూ తక్కువ బరువుకు మారి రాణించడం అంత సులువు కాదు. కానీ ఎక్కడైనా నెగ్గగలననే పట్టుదల తనను నడిపించగా ఈ సవాల్‌ను వినేశ్ అధిగమించింది. 2016 రియోలో తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన వినేశ్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరినా... చైనా రెజ్లర్‌తో బౌట్లో ఎడమకాలు విరిగి కన్నీళ్లపర్యంతమై నిష్క్రమించింది. స్ట్రెచర్‌పై ఆమెను బయటకు తీసుకుపోవాల్సి వచి్చంది. 2020 టోక్యో ఒలింపిక్స్ సమయంలో అద్భుత ఫామ్‌తో అడుగు పెట్టినా క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి ఎదురైంది. దీనికి తోడు టీమ్ యూనిఫామ్ ధరించలేదని, గేమ్స్ విలేజ్ బయట ఉందని, భారత సహచరులతో కలిసి సాధన చేయలేదని క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఫెడరేషన్ ఆమెపై సస్పెన్షన్ విధించింది. కొన్నాళ్లకు దానిని ఎత్తివేయడంతో మళ్లీ ఆటలోకి అడుగు పెట్టినా... గత ఏడాది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయంతో దెబ్బ పడింది. ఆపై మళ్లీ శస్త్రచికిత్స, రీహాబిలిటేషన్. మళ్లీ కోలుకొని మ్యాట్‌పై అడుగు పెట్టిన వినేశ్ ఒలింపిక్ పతకం సాధించే వరకు విశ్రమించలేదు. కొన్నాళ్ల క్రితం తన ఇన్‌స్ట్రాగామ్ ప్రొఫైల్‌లో ఒక స్ఫూర్తిదాయక వాక్యం రాసుకుంది. ‘ఖుదీ కో కర్ బులంద్ ఇత్నా కే హర్ తఖ్దీర్ సే పహ్లే ఖుదా బందేసే ఖుద్ పూఛే బతా తేరీ రజా క్యా హై’ (నిన్ను నువ్వు ఎంత బలంగా మార్చుకో అంటే అదృష్టం అవసరం పడే ప్రతీ సందర్భంలో నీకు ఏం కావాలని దేవుడే స్వయంగా అడగాలి). దీనికి తగినట్లుగా ఇప్పుడు వినేశ్ తన రాతను తానే మార్చుకొని రెజ్లింగ్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. – సాక్షి క్రీడా విభాగం -
Vinesh Phogat: పట్టు వదలని పోరాటం..!
దాదాపు ఏడాదిన్నర క్రితం ఆమె.. జీవితంలో అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కొంది. అయితే అది రెజ్లింగ్ మ్యాట్‌పై కాదు.. ఢిల్లీ వీథుల్లో.. కొన్ని రోజుల పాటు ఫుట్‌పాత్‌పై పడుకోవడం.. పోలీసు దెబ్బలు, ఆపై అరెస్ట్, బహిరంగంగా అవమానాలు.. ఆన్లైన్లో చంపేస్తామనే బెదిరింపులు.. ప్రభుత్వ పెద్దల అబద్ధపు హామీలు.. జీవిత కాలపు శ్రమతో సాధించిన ఖేల్రత్నలాంటి అవార్డులు వెనక్కి ఇచ్చేయడం, ఒక దశలో సాధించిన పతకాలన్నింటినీ గంగానదిపాలు చేయాల్సిన స్థితికి చేరడం.. ఇక కెరీర్ ముగిసినట్లే, రిటైర్మెంట్ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చేసినట్లే అనిపించిన క్షణం.. ఇదంతా ఎందుకు జరిగింది? ఇదంతా తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడం వల్లే!సహచర మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు కారణమైన వ్యక్తిని తప్పించి తమకు న్యాయం చేయమని కోరడం వల్లే! కెరీర్‌ను పణంగా పెట్టి చేసిన ఆ పోరాటం వెంటనే సత్ఫలితాన్నివ్వలేదు. పైగా భవిష్యత్తును అనిశ్చితిలో పడేసింది. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. మళ్లీ రెజ్లింగ్‌పై దృష్టి పెట్టింది. తీవ్ర గాయంతో ఆటకు దూరమయ్యే పరిస్థితి వచ్చినా పట్టుదల వీడలేదు. గాయం నుంచి కోలుకొని మళ్లీ పోరాడింది.ఆరు నెలలు ముగిసేలోగా తనేంటో నిరూపిస్తూ వరుస విజయాలు అందుకుంది. దాంతో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. వరుసగా మూడో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫొగాట్ నిలిచింది. ఇప్పటికే వరల్డ్, ఆసియా, కామన్వెల్త్ పతకాలతో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న వినేశ్.. ఒలింపిక్స్ పతకంతో కెరీర్‌ను పరిపూర్ణం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.రియో ఒలింపిక్స్‌లో గాయపడి..‘గాయాలు నాకు కొత్త కాదు. కెరీర్లో ఎన్నోసార్లు వాటితో ఇబ్బంది పడ్డాను. కానీ శస్త్ర చికిత్సలతో కోలుకొని మళ్లీ మ్యాట్‌పై అడుగు పెట్టగలిగాను. ఇప్పుడు తగిలిన గాయం మాత్రం చాలా పెద్దది. నేను కాలు విరిగినప్పుడు కూడా బాగానే ఉన్నాననిపించింది. కానీ ఇప్పుడు నా మనసు విరిగిపోయింది’ అంటూ ఢిల్లీ ఉదంతం తర్వాత కన్నీటితో వినేశ్ ఫొగాట్ చేసిన వ్యాఖ్య ఇది.భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ సహచరులు బజరంగ్ పూనియా, సాక్షి మలిక్‌లతో కలసి వినేశ్ నిరసన చేపట్టింది. అయితే బ్రిజ్‌భూషణ్ అధికార పార్టీ ఎంపీ కావడంతో వారికి ఆశించిన మద్దతు లభించలేదు. దానికి తోడు తీవ్ర విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు.ఈ పోరాటం ముగిసిన తర్వాత మళ్లీ ఆటపై అడుగు పెట్టేందుకు చేసిన క్రమంలో విమర్శలు ఇంకా తీవ్రమయ్యాయి. సెలక్షన్ ట్రయల్స్‌కు హాజరు కాకుండా తన సీనియారిటీని ఉపయోగించి అడ్డదారిలో ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. ప్రాక్టీస్ కొనసాగించాల్సిన సమయంలో ఈ మనోవేదన. కానీ వినేశ్ బేలగా మారిపోలేదు. మరింత బలంగా నిలబడింది. గతంలోలాగే రెట్టింపు శ్రమించి మ్యాట్‌పైనే సత్తా చాటింది.2018 ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ సాధించిన సందర్భం..రెజ్లింగ్ కుటుంబం నుంచి వచ్చి..‘ఫొగాట్ సిస్టర్స్’.. అని వినగానే భారత క్రీడా, సినిమా అభిమానుల దృష్టిలో దంగల్ సినిమా కదలాడుతుంది. మాజీ రెజ్లర్, కోచ్ మహావీర్ సింగ్ ఫొగాట్ జీవిత విశేషాలతో ఆ సినిమా రూపొందింది. సినిమాలో ప్రధాన పాత్రలైన గీత, బబితలతో పాటు రీతూ, సంగీత కూడా మహావీర్ సింగ్ కూతుళ్లే. అతని సోదరుడైన రాజ్‌పాల్ ఫొగాట్ కూతురే వినేశ్. ఆమెకు ప్రియంకా అనే సోదరి కూడా ఉంది. తనకు 9 ఏళ్ల వయసున్నప్పుడు తండ్రి అనూహ్యంగా మరణించారు. ఆ తర్వాత పెదనాన్న వద్దే వినేశ్ కూడా రెజ్లింగ్‌లో ఓనమాలు నేర్చుకుంది. తన కజిన్ గీత కంటే వినేశ్ ఆరేళ్లు చిన్నది. గీత జాతీయ స్థాయిలో విజయాలతో వెలుగులోకి వస్తున్న దశలో వినేశ్ రెజ్లింగ్‌లోకి ప్రవేశించింది. అమ్మాయిలపై వివక్ష చూపించడంలో అగ్రస్థానంలో ఉండే హరియాణా రాష్ట్రంలో అందరిలాగే తాను కూడా ఈ ఆటలో ప్రవేశించే ముందు సూటిపోటి మాటలు ఎదుర్కొంది. కానీ పెదనాన్న అండతో వాటన్నంటినీ వెనక్కి తోసి రెజ్లింగ్‌లో తన పట్టును చూపించింది. జూనియర్, యూత్ స్థాయిలో వరుస విజయాలతో ఆపై వినేశ్ దూసుకుపోయింది. 2013లో దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన యూత్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రజతపతకం గెలుచుకోవడంతో వినేశ్ అందరి దృష్టిలో పడింది.సీనియర్ స్థాయిలో విజయాలతో..న్యూఢిల్లీలో 2013లో ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ జరిగింది. 19 ఏళ్ల వినేశ్ మొదటిసారి అంతర్జాతీయ సీనియర్ స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగింది. క్వార్టర్స్ వరకు చేరి అక్కడ ఓడినా.. రెపిచెజ్ రూపంలో మరో అవకాశం దక్కింది. ఇందులో థాయిలండ్ రెజ్లర్ శ్రీప్రపను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.లైంగిక వేధింపులను నిరసిస్తూ..ఆమె సాధించిన తొలి అంతర్జాతీయ పతకం ఇదే కావడం విశేషం. ఇది ఆరంభం మాత్రమే. వినేశ్ అంతటితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆమె మరో 3 కాంస్యాలు, 3 రజతాలు, ఒక స్వర్ణం గెలుచుకుంది. తన సోదరీమణులను దాటి వారికంటే మరిన్ని పెద్ద విజయాలతో వినేశ్ పైకి దూసుకుపోయింది. ప్రతిష్ఠాత్మక మూడు ఈవెంట్లలో ఆమె పతకాలు గెలుచుకోవడం విశేషం. వరుసగా మూడు కామన్వెల్త్ (2014, 2018, 2022)క్రీడల్లో వినేశ్ స్వర్ణపతకాలు గెలుచుకుంది. ఆపై ఆసియా క్రీడల్లోనూ సత్తా చాటింది. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన ఆమె తర్వాతి క్రీడలకు (2018) వచ్చేసరికి స్వర్ణంతో మెరిసింది. ఇక 2019, 2022 వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో వినేశ్ గెలుచుకున్న కాంస్య పతకాలు ఆమె ఘనతను మరింత పెంచాయి.ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా..2016 రియో ఒలింపిక్స్‌లో జరిగిన ఘటన వినేశ్ కెరీర్లో ఒక్కసారిగా విషాదాన్ని తెచ్చింది. ఇస్తాంబుల్‌లో జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో గెలిచి అమిత ఉత్సాహంతో ఆమె ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టింది. చక్కటి ఆటతో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకుంది. అయితే 21 ఏళ్ల వినేశ్ ఒలింపిక్స్ పతకం కలలు అక్కడే కల్లలయ్యాయి. చైనాకు చెందిన సున్ యానన్‌తో ఆమె ఈ మ్యాచ్‌లో తలపడింది. బౌట్ మధ్యలో ఆమె కుడి మోకాలుకు తీవ్ర గాయమైంది. ఆ బాధను తట్టుకోలేక ఆమె మ్యాట్‌పైనే ఏడ్చేసింది.స్ట్రెచర్‌పై వినేశ్‌ను బయటకు తీసుకుపోవాల్సి వచ్చింది. అయితే ఇది ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ మరింత ప్రేరణ పొందింది. శస్త్రచికిత్స, ఆపై రీహాబిలిటేషన్ తర్వాత మళ్లీ బరిలోకి దిగి విజయాలు అందుకుంది. ఈ క్రమంలో 2021 టోక్యో ఒలింపిక్స్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం వచ్చింది. అప్పుడే అద్భుత ఫామ్‌లో ఉన్న ఆమె టాప్ సీడ్‌గా అడుగు పెట్టింది.పారిస్ ఒలింపిక్స్‌కి అర్హత సాధించి.., సర్జరీ తర్వాత..అయితే మరోసారి నిరాశను కలిగిస్తూ రెండో రౌండ్లో వెనుదిరిగింది. ఈ మెగా ఈవెంట్ వైఫల్యం తర్వాత జరిగిన ఘటనలు ఆమెను మానసికంగా మరింత కుంగిపోయేలా చేశాయి. ఓటమి తర్వాత వినేశ్‌పై క్రమశిక్షణా చర్యలు అంటూ రెజ్లింగ్ ఫెడరేషన్ సస్పెన్షన్ విధించింది. టీమ్‌కి ఇచ్చిన యూనిఫామ్‌ను ధరించకుండా మరో లోగో వాడిందని, గేమ్స్ విలేజ్‌లో కాకుండా బయట ఉందని, భారత జట్టు సహచరులతో కలసి సాధన చేయలేదని ఆరోపణలు వచ్చాయి.అదృష్టవశాత్తు ఫెడరేషన్ కొద్ది రోజులకే సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. గత ఏడాది ఆగస్టులో ఆమె మళ్లీ గాయపడింది. ఎడమ మోకాలుకు యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయమైంది. దానికి మళ్లీ శస్త్ర చికిత్స, రీహాబిలిటేషన్.. ఆపై మ్యాట్‌పై పోరుకు సిద్ధమైంది. అన్నింటికి మించి ఒలింపిక్స్ కోసం వెయిట్ కేటగిరీ మారాల్సి రావడం ఆమెకు పెద్ద సవాల్ అయింది. సాధారణంగా రెజ్లింగ్‌లో వెయిట్ కేటగిరీ మారడం అంత సులువు కాదు. పైగా తక్కువకు మారడం మరీ కష్టం.ఆట ఆరంభంనుంచి ఆమె 53 కేజీల విభాగంలోనే పోటీ పడింది. అయితే వేర్వేరు కారణాలు, మరో ప్లేయర్ అదే కేటగిరీలో అర్హత సాధించడంతో తప్పనిసరిగా మారాల్సి వచ్చింది. తాను దేంట్లో అయినా నెగ్గగలననే పట్టుదలే మళ్లీ వినేశ్‌ను నడిపించింది. 50 కేజీల విభాగానికి మారి మరీ ఆమె పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇన్ని అవరోధాలను దాటి ఇక్కడి వరకు వచ్చిన వినేశ్ తన మూడో ప్రయత్నంలోనైనా ఒలింపిక్స్ పతకం గెలిచి తన కలను సాకారం చేసుకోవాలని ఆశిద్దాం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
స్టార్ రెజ్లర్ బజరంగ్‌పై.. తాత్కాలిక నిషేధం!
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలిక నిషేధం విధించింది. మార్చి 10వ తేదీన సోనెపట్‌లో నిర్వహించిన జాతీయ రెజ్లింగ్ ట్రయల్స్ సందర్భంగా బజరంగ్ సెమీఫైనల్లో ఓడిపోయాక డోపింగ్ పరీక్షకు హాజరుకాకుండానే బయటకు వెళ్లిపోయాడు.దాంతో ‘నాడా’ ఏప్రిల్ 23న బజరంగ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. డోపింగ్ పరీక్షకు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని కోరుతూ మే 7వ తేదీ వరకు బజరంగ్‌కు గడువు ఇచి్చంది. మరోవైపు తాను డోపింగ్ పరీక్షకు హాజరయ్యేందుకు నిరాకరించలేదని... ‘నాడా’ అధికారులు ఆరోజు గడువు తీరిన కిట్స్‌తో తన నుంచి శాంపిల్స్ సేకరించేందుకు వచ్చారని బజరంగ్ ఆరోపించాడు. ‘నాడా’ అధికారులకు తన న్యాయవాది సమాధానం ఇస్తాడని బజరంగ్ తెలిపాడు.ఇవి చదవండి: రవీంద్రజాలం... జడేజా ఆల్‌రౌండ్ షో.. -
‘నన్నోడించిన వాడ్నే పెళ్లి చేసుకుంటా’
‘‘బరిలో దూకండి. నన్ను ఓడించండి. ఆ దమ్మున్న మగవాడినే నేను పెళ్లి చేసుకుంటా’’.. పురుషాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఓ మహిళ విసిరిన సవాల్ ఇది. సాధారణ మహిళ అయితే చర్చకు అంతగా ఆస్కారం ఉండేది కాదు. కానీ, ఆ సవాల్ విసిరింది హమీదా బాను. ఇంతకీ ఇవాళ గూగుల్ హోం పేజీని గమనించారా?.. అందులో ఉంది ఆమెనే.1940-55 మధ్య.. కుస్తీ పోటీల్లో వందల మందిని ఓడించానని తనకు తానుగా ప్రకటించుకుంది హమీదా బాను. కళ్లారా ఆమె పాల్గొన్న పోటీలు చూసి అప్పటి మీడియా పొగడ్తలతో ఆమెను ఆకాశానికి ఎత్తేసింది. భారతదేశంలో తొలి మల్ల యోధురాలిగా హమిదా బాను పేరు చరిత్రకెక్కింది. ఇప్పుడు.. డూడుల్ రూపంలో ఆ యోధురాలికి గౌరవం ఇచ్చింది గూగుల్.సంప్రదాయ కుటుంబంలో పుట్టి.. హేతుబద్ధమైన పెద్దల్ని ఎదురించి.. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది హమీదా. ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ ఆమె స్వస్థలం. అక్కడి నుంచి ఆమె అలీఘడ్ వలస వెళ్లింది. అక్కడే సలాం పహిల్వాన్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర కుస్తీ శిక్షణ తీసుకుంటూ పలు పోటీల్లో పాల్గొందామె. అయితే 1954 ఫిబ్రవరిలో ఆమె ఇచ్చిన ఒక బహిరంగ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ఓడించిన వాళ్లను వివాహం చేసుకుంటానని ప్రకటించి అటు ప్రజలు, ఇటు మీడియా దృష్టిని ఆకర్షించింది.ఛాలెంజ్‌లో భాగంగా.. పంజాబ్‌లో ఒకరిని, కోల్‌కతాలో ఒకరిని బాను ఓడించింది. ఆ తర్వాత గుజరాత్ బరోడాకు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. అప్పటికి ఆమె వయసు 34 ఏళ్లు. ఆ సవాల్ విసిరిన నాటికి ఆమె 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకుందట. అయితే ఆమెతో తలపడాల్సిన చోటే గామా పహిల్వాన్ ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆమె బాబా పహిల్వాన్‌తో తలపడి.. కేవలం నిమిషం వ్యవధిలోనే ఆమె నెగ్గింది.బాను పాపులారిటీ ఏ స్థాయికి చేరిందో.. 1944లో బాంబే క్రానికల్ రాసిన ఒక కథనం చూస్తే తెలుస్తుంది. బాంబేలో ఆమె పాల్గొన్న ఒక మ్యాచ్ చూసేందుకు 20 వేల మంది ప్రేక్షకులు వచ్చారట. అయితే ప్రత్యర్థి గూంగా పహిల్వాన్ అసంబంద్ధమైన డిమాండ్లతో ఆ మ్యాచ్ జరగకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన ప్రేక్షకులు స్టేడియంలో బీభత్సం సృష్టించారట.అమెజాన్ ఆఫ్ అలీగఢ్.. ముద్దుగా హమీదా బానుకు అప్పటి మీడియా పెట్టుకున్నపేరు. ఐదడుగల మూడు అంగుళాలు, 108 కేజీల బరువుతో.. రోజుకు ఐదున్నర లీటర్ల పాలు, రెండు లీటర్ల పండ్ల రసేఆలు, కేజీ మటన్, అరకేజీ బటర్, ఆరు గుడ్లు, రెండు ప్లేట్ల బిర్యానీ.. ఇలా ఆమె డైట్ గురించి కూడా అప్పట్లో పేపర్లు కథనాలు రాసేవి.హమిదా బాను కెరీర్ సగానికి పైగా వివాదాలతోనే సాగింది. మగవాళ్లతో ఆమె తలపడడాన్ని పలువురు బహిరంగంగానే వ్యతిరేకించారు. మొరార్జీ దేశాయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పోటీలపై నిషేధం విధించారు. అందుకు ఆమె బహిరంగంగానే ఆయనపై విమర్శలు గుప్పించింది. అలాగే.. ఆమె పాల్గొన్న పోటీల్లోనూ ప్రేక్షకుల నుంచి దాడులు తప్పలేదట. 1954 దాకా దేశ, విదేశీ రెజ్లర్లతో ఆమె తలపడింది. అయితే అదే ఏడాది విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినా.. ఆర్థిక స్తోమత లేకపోవడం, స్పానర్లు ఎవరూ ముందుకు రాలేదన్న కారణాలతో ఆమె ఆగిపోయింది. అయితే ఆ ఆగిపోవడం.. బరికి శాశ్వతంగా హమిదా బానును దూరం చేసింది కూడా. 1987లో మహేశ్వర్ దయాల్ అనే రచయిత ఆమె జీవితం మీద రాసిన పుస్తకంలో సంచలన విషయాల్ని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లో ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొందని, మగ పోటీదారులతో మాత్రమే ఆమె తలపడేదని, అయితే కొన్ని చోట్ల ఆమె రహస్య ఒప్పందాలు కూడా చేసుకునేదని ఆయన రాశారు.రెజ్లింగ్ కెరీర్ మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకుల నడుమ సాగింది. కోచ్ సలాం పహిల్వాన్‌తో కలిసి అప్పటిదాకా ప్రొఫెషనల్ రిలేషన్ సాగించిన ఆమె.. ఆ తర్వాత ఆయనతో సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే ఆమెను విదేశీ పోటీలకు వెళ్లకుండా సలామే అడ్డుకున్నాడనన్న ఆరోపణ ఒకటి ఉంది. ఇంకోవైపు ఉత్తర భారతం నలుమూలల పోటీల్లో పాల్గొన్న హమిదాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ముంబై కల్యాణ్ ప్రాంతంలో ఉంటూ.. సలాంతో కలిసి పాల వ్యాపారం మొదలుపెట్టింది.సలాం కూతురు సహారా, బానును పినమ్మగా చెబుతుంటుంది. అయితే సలాం ఆమెను శారీరకంగానూ ఎంతో వేధించేవాడని బాను మనవడు ఫిరోజ్ షేక్(ఆమె దత్తపుత్రుడి కొడుకు) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యూరప్‌కు వెళ్లకుండా బానును నిలువరించిన సలాం.. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని, ఈ క్రమంలోనే ఆమె కాళ్లు, చేతులు విరిగియాని ఆరోపించారాయన. కొన్నాళ్లకు సలాం, బానులు విడిపోయారు. సలాం కల్యాణ్‌లోనే ఉంటూ పాల వ్యాపారం కొనసాగించింది. డబ్బు సరిపోని సమయంలో పిండి వంటలు చేసి రోడ్ల మీద అమ్ముకునేది. అలా మల్లు యోధురాలిగా పేరున్న హమీదా బాను.. చివరి రోజులు మాత్రం కష్టంగానే గడిచాయని పలు కథనాలు వెల్లడించాయి. -
మాజీ రెజ్లర్‌ను పెళ్లాడిన టెక్ సీఈఓ అంకుర్ జైన్.. ఫోటోలు
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త, బిలినీయర్ 'అంకుర్ జైన్' గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. భారతీయ మూలాలున్న ఈయన బిల్ట్ రివార్డ్స్ సీఈఓగా ఉన్నారు. ఇటీవల ఈయన మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ 'ఎరికా హమ్మండ్'ను వివాహం చేసుకుని ఓ ఇంటివారయ్యారు.అంకుర్ జైన్, ఎరికా హమ్మండ్ ఏప్రిల్ 26న ఈజిప్ట్‌లోని పిరమిడ్స్ ఎదురుగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు.. పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.పెళ్లి కొంత భిన్నంగా ఉండాలనే ఆలోచనతోనే వారు దక్షిణాఫ్రికాలోని సఫారీ సందర్శనలో మొదలు పెట్టి ఈజిప్ట్‌లో పెళ్లి వేడుకలను ముగించారు. న్యూయార్క్ సిటీకి చెందిన భారత సంతతి బిలియనీర్ అంకుర్ జైన్ రంబుల్ బాక్సింగ్ జిమ్‌కి వెళ్లే సమయంలో.. ఎరికా హమ్మండ్, అంకుర్‌కు ఫిజికల్ ట్రైనర్‌గా వ్యవహరించారు. ఈ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.ఎవరీ ఎరికా హమ్మండ్?ఎరికా హమ్మండ్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్. ఆమె రెజ్లింగ్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఫిట్నెస్ కోచ్‌గా మారింది. ఈ సమయంలోనే బిలినీయర్ 'అంకుర్ జైన్'ను కలుసుకున్నారు. ఈమె స్ట్రాంగ్ అనే యాప్ కూడా స్టార్ట్ చేశారు. View this post on Instagram A post shared by Ankur Jain (@ankurjain) -
వినేశ్‌పైనే దృష్టి
బిషె్కక్ (కిర్గిస్తాన్): భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు సమాయత్తమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో వినేశ్ బరిలోకి దిగనుంది. వినేశ్ రెగ్యులర్ వెయిట్ కేటగిరీ 53 కేజీలు అయినప్పటికీ ఈ విభాగంలో ఇప్పటికే భారత్ నుంచి అంతిమ్ పంఘాల్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. దాంతో వినేశ్ 50 కేజీల విభాగంలో పోటీపడాలని నిర్ణయం తీసుకుంది. గత ఏడాది భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులకు సంబంధించిన వివాదంలో సాక్షి మలిక్, బజరంగ్ పూనియాలతో కలిసి వినేశ్ పోరాడింది. -
ఇది మహిళలందరి విజయం..మాకూ ధైర్యం: రెజ్లర్ వినేష్ ఫోగట్
బిల్కిస్ బానో కేసులో దోషుల క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ మెడల్ విజేత వినేష్ ఫోగట్ (Vinesh Phogat) స్పందించారు. ఇది మహిళల విజయం అంటూ ఆమె ట్వీట్ చేశారు.ఈ పోరాటంలో విజయం సాధించిన బిల్కిస్ బానోకు అభినందనలు తెలిపారు. “బిల్కిస్ జీ, ఇది మన మహిళలదరి విజయం. మీరు సుదీర్ఘ పోరాటం చేశారు. మీ విశ్వాసం చూసి మాకూ ధైర్యం వచ్చింది” అని ఫోగట్ ట్విటర్లో పేర్కొంది. बिलकिस जी ये हम सब महिलाओं की जीत है। आपने लंबी लड़ाई लड़ी है। आपको देखकर हमें भी हिम्मत मिली है। 🙏 pic.twitter.com/zKWsPMjdhF — Vinesh Phogat (@Phogat_Vinesh) January 8, 2024 బీజేపీ ఎంపీ,మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు నిరసనగా మహిళా రెజ్లర్లు చేసిన చాలా పెద్ద పోరాటమే చేశారు. దాదాపు ఏడుగురుమహిళా రెజర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపించిన సుదీర్ఘ పోరాటం చేసిన వినేష్ ఫోగట్ ఒకరు. అయితే ఆ ఆరోపణలను సింగ్ ఖండిస్తూ వచ్చారు. (బిల్కిస్ బానో కేసు: ఎవరీ సంచలన మహిళా జడ్జి?) ఇది ఇలా ఉంటే ఇటీవల బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్‌ను ఆ పదవిలో నియమించడం పెద్ద దుమారాన్ని రేపింది. దీంతో తమకు న్యాయం జరగలేదంటూ మహిళ రెజర్లు తీవ్ర అసంతృప్తిని ప్రకటించారు. ముఖ్యంగా ఈ పోరాటంలో మరో కీలక రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. అలాగే వినేష్ ఫోగట్ ప్రతిష్టాత్మక అర్జున, ఖేల్ రత్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. వీరికి మద్దతుగా రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా తన అవార్డులను వెనక్కి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. (హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా!) కాగా ఫోగట్ కామన్వెల్త్ , ఆసియా క్రీడలలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్, అలాగే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లలో అనేక ప తకాలు చాటుకుని భారతీయ సత్తా చాటిన ఏకైక భారతీయ మహిళా రెజ్లర్ కూడా. -
వినేశ్ కూడా వెనక్కిచ్చేసింది!
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కూడా కేంద్ర క్రీడా అవార్డులను వెనక్కి ఇచ్చేసింది. శనివారం కర్తవ్యపథ్ వద్ద ఆమె ‘ఖేల్‌రత్న’, అర్జున అవార్డులను వదిలేసి వెళ్లింది. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పతకాలతో ఆమె దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఫొగాట్ ఘనతలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’, అర్జున అవార్డులను ఇచ్చింది. అయితే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)లో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ వర్గమే కొత్తగా ఎన్నికైంది. ఆయన విధేయుడైన సంజయ్ సింగ్ అధ్యక్షుడు అయ్యారు. దీన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ నిమిషాల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించింది. బజరంగ్ ‘పద్మశ్రీ’ని వెనక్కిచ్చాడు. బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా తన పురస్కారాన్ని వెనక్కిస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఫొగాట్ కూడా ముందు ప్రకటించినట్లే ఖేల్‌రత్న, అర్జున అవార్డుల్ని వెనక్కి ఇచ్చేందుకు ప్రధానమంత్రి నివాసానికి బయల్దేరింది. కర్తవ్యపథ్ వద్ద ఢిల్లీ పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో అవార్డుల్ని రోడ్డుపైనే వదిలేసింది. ఆ పురస్కారాలు ఇప్పుడు పోలీసుల ఆ«దీనంలో ఉన్నాయి. -
Rahul Gandhi: రెజ్లర్ల నిరసనలో పాల్గొని రాహుల్ కుస్తీ (ఫొటోలు)
-
వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం.. ‘ఖేల్‌రత్న... అర్జున’ వెనక్కి
న్యూఢిల్లీ: ఇప్పుడు వినేశ్ ఫొగాట్ వంతు వచ్చింది. ఈ స్టార్ రెజ్లర్ కూడా తన ఘనతలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వెనక్కివ్వాలని నిర్ణయించుకుంది. రోడ్డెక్కి పోరాడినా... క్రీడాశాఖ నుంచి స్పష్టమైన హామీ లభించినా... మళ్లీ రెజ్లర్లకు అన్యాయమే జరిగిందని వాపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పురస్కారాలను అట్టిపెట్టుకోవడంలో అర్థమేలేదని వినేశ్ తెలిపింది. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా తన ఆవేదనను ప్రధానికి లేఖ ద్వారా తెలియజేసింది. ‘ఇంత జరిగాక ఇక నా జీవితంలో ఈ రెండు అవార్డులకు విలువే లేదు. ఎందుకంటే ఏ మహిళ అయినా ఆత్మ గౌరవాన్నే కోరుకుంటుంది. నేనూ అంతే... నా జీవితానికి ఆ అవార్డులు ఇకపై భారం కాకూడదనే ఉద్దేశంతోనే నాకు మీరిచ్చిన అవార్డుల్ని వెనక్కి ఇస్తున్నాను ప్రధాని సార్’ అని ఆమె ‘ఎక్స్’లో లేఖను పోస్ట్ చేసింది. మహిళా సాధికారత, సమ సమానత్వం అనే ప్రకటనలకే ప్రభుత్వం పరిమితమని తీవ్రంగా ఆక్షేపించింది. మేటి రెజ్లర్ ఫొగాట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్య పతకాలు సాధించింది. మూడు (2014, 2018, 2022) కామన్వెల్త్ క్రీడల్లోనూ చాంపియన్‌గా నిలిచింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం (2018), కాంస్యం (2014) చేజిక్కించుకుంది. కుస్తీలో ఆమె పతకాల పట్టును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2016లో అర్జున, 2020లో ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ అవార్డులతో సత్కరించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో లైంగిక ఆరోపణల కేసులో నిందితుడైన వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ వర్గమే గెలిచింది. ఆయన విధేయుడు సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో సాక్షి మలిక్ ఉన్న పళంగా రిటైర్మెంట్ ప్రకటించింది. రెజ్లర్ బజరంగ్ పూనియా, బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ ‘పద్మశ్రీ’ పురస్కారాలను వెనక్కి ఇచ్చారు. అయితే కేంద్ర క్రీడాశాఖ నియమావళిని అతిక్రమించడంతో డబ్ల్యూఎఫ్ఐని సస్పెండ్ చేసింది. -
స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్ మెంట్
-
కుస్తీకి సాక్షి స్వస్తి
న్యూఢిల్లీ: సాక్షి మలిక్... మహిళల కుస్తీలో పతకం పట్టుబట్టే స్టార్ రెజ్లర్. కామన్వెల్త్ క్రీడల్లో మూడు పతకాలు... ఆసియా చాంపియన్íÙప్లో నాలుగు పతకాలు... రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం... ఇవిచాలు సాక్షి ఏస్థాయి రెజ్లరో చెప్పడానికి! దేశానికి పతకాలెన్నో తెచ్చిపెట్టిన ఆమె... గురువారం జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విధేయుడే అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఇక చేసేదేమీ లేక బయట పోరాటానికి, బౌట్లో పతకం ఆరాటానికి సెలవిచ్చింది. కన్నీటి చెమ్మతో బరువెక్కిన హృదయంతో రిటైర్మెంట్ ప్రకటించింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడైన బ్రిజ్‌భూషణ్ ప్రధాన అనుచరుడు సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బ్రిజ్‌భూషణ్ పై ఢిల్లీ రోడ్లెక్కి సాక్షి సహా స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్ తదితరులు నిరసన తెలిపారు. పగలనక... రాత్రనక... తిండి నిద్రలేని రాత్రులెన్నో గడిపి బ్రిజ్‌భూషణ్‌ను గద్దె దింపాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన గద్దె దిగినప్పటికీ ఆయన నీడ సంజయ్ సింగ్ అధ్యక్షుడు కావడంతో జీర్ణించుకోలేకపోయిన సాక్షి తన ఆటకు టాటా చెప్పేసింది. స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ కూడా సంజయ్ ఎన్నికపై తప్పుబట్టారు. అవును... అందుకే గుడ్‌బై ‘బ్రిజ్‌భూషణ్ మహిళా రెజ్లర్ల పట్ల ప్రవర్తించిన తీరుపై గళమెత్తాం. కదంతొక్కాం. కేసు నమోదు చేయించాం. కానీ డబ్ల్యూఎఫ్ఐ తాజా ఎన్నికల్లో చివరకు ఆయన వర్గమే గెలిచింది. పదవులన్నీ చేజిక్కించుకుంది. అందుకే కెరీర్‌కు గుడ్‌బై చెప్పా. మేం మహిళా అధ్యక్షురాలైతే బాగుంటుందని అనుకున్నాం. కానీ అలా జరగలేదు’ అని మీడియా సమావేశంలో సాక్షి వాపోయింది. 15లో 13 పదవులు బ్రిజ్‌భూషణ్ వర్గానివే మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ డబ్ల్యూఎఫ్ఐలో తన పట్టు నిరూపించుకున్నాడు. ఆయన బరిలో లేకపోయినా... 15 పదవుల్లో ఆయన వర్గానికి చెందిన 13 మంది పదవుల్ని చేజిక్కించుకున్నారు. అధ్యక్ష పదవి ఎన్నికలో ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడైన సంజయ్... 2010 కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అనిత షెరాన్‌పై 40–7 ఓట్ల తేడాతో గెలిచాడు. అనిత వర్గానికి చెందిన ప్రేమ్‌చంద్ లోచబ్ ప్రధాన కార్యదర్శి పదవి పొందడం... సీనియర్ ఉపాధ్యక్షుడిగా దేవేందర్ సింగ్ కడియాన్ ఎన్నికవడం ఒక్కటే ఊరట. మిగతా 4 ఉపాధ్యక్ష పదవులు బ్రిజ్‌భూషణ్ క్యాంప్‌లోని జైప్రకాశ్ (ఢిల్లీ), అశిత్ సాహా (బెంగాల్), కర్తార్ సింగ్ (పంజాబ్), ఫొని (మణిపూర్)లే సొంతం చేసుకున్నారు. ఉపాధ్యక్ష బరిలో దిగిన మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి, మాజీ రెజ్లర్ మోహన్ యాదవ్‌కు కేవలం ఐదు ఓట్లు లభించడం గమనార్హం. కోశాధికారిగా సత్యపాల్ (ఉత్తరాఖండ్), ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ బ్రిజ్‌భూషణ్ వర్గం వారే ఎన్నికయ్యారు. నిరసన దీక్ష చేపట్టిన రెజ్లర్లపై ఎలాంటి వివక్ష చూపం. ప్రతీకారం తీర్చుకోం. రెజ్లర్లందరిని సమానంగా చూస్తాం. వారికి కావాల్సిన సహకారాలు అందిస్తాం. మేం రెజ్లింగ్ ఆటపైనే దృష్టి పెడతాం. రెజ్లర్ల పొరపాట్లపై కాదు. ఎన్నికైన కొత్త కార్యవర్గమే డబ్ల్యూఎఫ్ఐని నడిపిస్తుంది. రోజువారీ వ్యవహారాల్లో నా ప్రమేయం ఉండదు. వారు కోరితేనే సలహాలిస్తా. –మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్