
న్యూఢిల్లీ: హత్యానేరంపై అరెస్టయిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం హరిద్వార్‌కు తీసుకెళ్లారు. యువ రెజ్లర్ సాగర్ హత్యకు కారణమైన అతను 18 రోజుల పాటు పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. పరారీలో ఉన్న అతనికి ఆశ్రయం ఇచ్చిందెవరనే కూపీ లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నేరం చేసిన సమయంలో అతను వేసుకున్న దుస్తులు, వాడిన సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇంకా స్వాధీనపరచలేదు. విచారణలో రెజ్లర్ సహకరించకపోవడంతో పోలీసులు మేజిస్ట్రేట్ ముందు వాదనల్ని వినిపించి అతని కస్టడీని ఇంకొన్ని రోజులు పొడిగించుకున్నారు. సుశీల్ దాడిలో సాగర్ చికిత్స పొందుతూ మరణించగా ఈ విషయం తెలుసుకున్న రెజ్లర్ ముందుగా హరిద్వార్‌కే పరారైనట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో అతన్ని అక్కడికి తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment