Sushil kumar
-
పంత్‌ను ప్రత్యేకంగా కలిసిన ఇద్దరు.. ఎవరో తెలుసా?
డెహ్రడూన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్‌ను సోమవారం ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకంగా కలిశారు. వారెవరో కాదు.. అతడిని కాపాడిన రక్షకులు రజత్, నిషు. ఆస్పత్రికి వెళ్లి పంత్‌ను స్వయంగా కలిశారు. అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పంత్ ఒంటి నిండా బాండేజ్‌లు ఉన్నట్టు ఫొటోలో కనిపించింది. రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన వెంటనే అక్కడే ఉన్న రజత్, నిషు.. సకాలంలో స్పందించి అతడిని కారు నుంచి బయటకు తీసుకువచ్చారు. తర్వాత అక్కడికి వచ్చిన బస్ డ్రైవర్ సుశీల్ కుమార్.. అంబులెన్స్ ఏర్పాటు చేసి, పోలీసులకు ఫోన్ చేశారు. వీరు ముగ్గురి సహాయంతో పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాద సమయంలో పంత్‌ను తాము గుర్తించలేదని, అతడు క్రికెటర్ అన్న సంగతి తమకు తెలియదని రజత్, నిషు.. వార్తా చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు. సుశీల్ కుమార్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న సత్కరించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అటు బీసీసీఐ కూడా రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ప్రకటన చేసింది. శ్రీలంకతో మంగళవారం టీ20 మ్యాచ్ ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశం పంపారు. (క్లిక్ చేయండి: మిస్ యూ పంత్! ప్లీజ్.. త్వరగా కోలుకో.. కలిసి ఆడుదాం!) -
సుశీల్‌కు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్ దాదాపు ఏడాదిన్నర తర్వాత జైలునుంచి బయటకు రానున్నాడు. కుటుంబపరమైన సమస్యను ఎదుర్కొంటున్న కారణంగా మానవతా దృక్పథంతో ఈ నెల 12 వరకు అతనికి ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. సుశీల్ భార్య తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుండటంతో శస్త్రచికిత్సకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె బాగోగులు చూసుకునేందుకు 3 వారాల బెయిల్ ఇవ్వాల్సిందిగా సుశీల్ న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అయితే చివరకు కోర్టు వారం రోజుల బెయిల్ కోసం ఆదేశాలు ఇచ్చింది. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ 2021 జూన్ 2నుంచి జైల్లో ఉన్నాడు. -
కేబీసీలో 5 కోట్లు గెలిచాడు.. కానీ దివాళా తీశాడు!
కౌన్ బనేగా కరోడ్‌పతి 5వ సీజన్ విజేత సుశీల్ కుమార్ గుర్తున్నాడా? ఇప్పుడు అతడి ప్రస్తావన ఎందుకని అనుకుంటున్నారా? ఎందుకంటే కేబీసీ 13వ సీజన్ ఆగస్టు 23 నుంచి ప్రసారమవుతోంది. ఈ నేపథ్యంలో సుశీల్ కుమార్ మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాడు. 2011లో కేబీసీ విజేతగా నిలిచిన ఈ బిహారీ కామన్‌మేన్ నిజ జీవితంలో మాత్రం విఫల వ్యక్తిగా మిగిలాడు. రియాలిటీ క్విజ్ షోలో మొట్ట మొదటిసారిగా గెలిచిన 5 కోట్ల రూపాయలను ఇష్టారీతిని ఖర్చు చేసి చివరకు దివాళా తీశాడు. తన విఫలగాథను పేస్బుక్ పేజీలో గతేడాది ఏకరవు పెట్టాడు. 2011లో కేబీసీ 5వ సీజన్లో విజేతగా నిలిచి బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా 5 కోట్ల రూపాయల చెక్ అందుకున్నాడు సుశీల్ కుమార్. కానీ ఆ తర్వాత అతడి జీవితం ఊహించని మలుపులు తిరిగింది. ‘2015-16 నా జీవితంలో అత్యంత సవాల్‌తో కూడిన సమయం. ఏం చేస్తున్నానో నాకే తెలియదు. ఆ టైమ్‌లో నేను లోకల్ సెలబ్రిటీ అయిపోయాను. బిహార్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ నెలకు 10 నుంచి 15 కార్యక్రమాలకు హాజరయ్యేవాడిని. క్షణం తీరిక లేకపోవడంతో చదువులకు దూరమయ్యాను. లోకల్ సెలబ్రిటీ హోదా రావడంతో మీడియా కూడా నా వెంట పడేది. జర్నలిస్టులు నా ఇంటర్వ్యూలు తీసుకునే వారు. నా గురించి గొప్పగా రాసేవారు. మీడియాతో ఎలా మాట్లాడాలో తెలియకపోయినా ఏదేదో చెప్పేసేవాడిని. కాని కొన్నిరోజుల తర్వాత చూస్తే నా పరిస్థితి మొత్తం తలకిందులైంద’ని సుశీల్ రాసుకొచ్చాడు. ఎంతో మంది మోసం చేశారు కేబీసీలో ఐదు కోట్లు సంపాదించడంతో స్వచ్చంద సంస్థలు సుశీల్ కుమార్ వెంట పడ్డాయి. ముందు వెనుక చూడకుండా అతడు దానధర్మాలు చేసి మొత్తం ఊడ్చిపెట్టడంతో భార్యతో విభేదాలు తలెత్తాయి. ‘కేబీసీలో గెలిచాక మహా దాతగా మారిపోయాను. రహస్యంగా దానాలు చేయడం వ్యసనంగా మారిపోయింది. దీన్ని అలుసుగా తీసుకుని చాలా మంది నన్ను మోసం చేశారు. దానాలు చేసిన తర్వాతే ఈ విషయం నాకు బోధపడింది. ముందు వెనుక చూడకుండా దానాలు చేయొద్దని నా భార్య పోరు పెట్టేది. దీంతో నా భార్యతో గొడవలు మొదలయ్యాయి. తర్వాత నెమ్మదిగా మద్యానికి, పొగ తాగడానికి అలవాటుపడ్డాను. నేను ఢిల్లీలో వారం రోజులు ఉన్నప్పుడు పలు రకాల వ్యక్తులతో కలిసి మద్యం, ధూమపానం చేసేవాడిని. అక్కడ వారి మాటలు నాకు బాగా నచ్చేవి. దీంతో మీడియాను తేలిగ్గా తీసుకోవడం ప్రారంభించాన’ని సుశీల్ కుమార్ వెల్లడించాడు. దావానలంలా దివాళా వార్త.. తాను దివాళా తీశానన్న వార్త బయటకు రావడంతో జనం తనను పట్టించుకోవడం మానేశారని, కార్యక్రమాలకు పిలవడం మానేశారని సుశీల్ చెప్పాడు. ‘నేను ఎలా దివాళా తీశాననే విషయం గురించి సినిమాటిక్‌గా చెబుతా. ఒకసారి ఇంగ్లీషు న్యూస్‌పేపర్ జర్నలిస్ట్ ఒకరు నాకు ఫోన్ చేసి విసిగించడంతో.. నా డబ్బు మొత్తం అయిపోయిందని, నా దగ్గర కేవలం రెండు ఆవులు మాత్రమే ఉన్నాయని.. పాలు అమ్ముకుని బతుకుతున్నానని చెప్పాను. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో నా వెంట పడటం మానేశార’ని చెప్పుకొచ్చాడు. సినిమా కల.. ముంబై వల భార్యతో విభేతాలు తలెత్తడంతో దర్శకుడు కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు ముంబైకి మకాం మార్చాడు సుశీల్ కుమార్. ‘ముంబైలో నాకు సన్నిహితులైన గీత రచయితలతో రోజుల తరబడి మంతనాలు జరిపాను. రూమ్‌లో ఉంటూ రోజంతా సినిమాలు చూసేవాడిని. పుస్తకాలు చదివాను. ఇలా ఆరు నెలల కాలం గడిపేశాను. అప్పుడే రోజుకో ప్యాకెట్ సిగరెట్లు కాల్చేవాడిని. చాలా విషయాలు నేర్చుకున్న తర్వాత మూడు స్క్రిప్ట్‌లు రాశాను. ఒక ప్రొడక్షన్ హౌస్ నా స్క్రిప్ట్‌లకు 20 వేల రూపాయలు కూడా ఇచ్చింది. కొంత కాలం తర్వాత నా కళ్లు తెరుచుకున్నాయి. దాంతో ముంబై నుంచి మా ఊరికి తిరిగి వచ్చి టీచర్‌గా ఉద్యోగం సంపాదించాన’ని తెలిపాడు. ఇప్పుడంతా హ్యాపీ! ‘ముంబైలో ఆరు నెలల పాటు ఒంటరిగా గడిపిన తర్వాత నాకు విషయం బోధపడింది. ఫిల్మ్ మేకర్ కావడానికి ముంబై రాలేదని.. సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడకు వచ్చానని అర్థమయింది. మనసుకు నచ్చిందే చేయాలని ఆ క్షణంలో నిర్ణయించుకున్నాను. వెంటనే మా ఊరికి తిరిగి వచ్చి టీచర్ ఉద్యోగానికి ప్రిపరేషన్ మొదలుపెట్టాను. మొత్తానికి జాబ్ సాధించాను. మందు, సిగరెట్ మానేశాను. పర్యావరణ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాను. ప్రస్తుతం ప్రతి రోజు నాకు పండగలా గడుస్తోంది. తిండికి లోటు లేకుండా సంపాదిస్తే చాలు అనుకుంటున్నాను. పర్యావరణాన్ని మెరుగుపరచడానికి నా వంతు సాయం చేస్తూనే ఉంటాన’ని సుశీల్ కుమార్ ముగించాడు. సో.. సొమ్ములు సంపాదించడమే కాదు.. సవ్యంగా ఖర్చు పెట్టడం తెలియాలని సుశీల్ లైఫ్ స్టోరీ కళ్లకు కడుతోంది! -
Sushil Kumar: జైల్లో ఇచ్చే ప్రోటీన్ సరిపోదు!
న్యూఢిల్లీ: జైలులో ఇచ్చే ఆహారంలోని పోట్రీన్ తనకు సరిపోవని.. కాబట్టి ప్రోటీన్ షేక్, వ్యాయామ సామాగ్రి కావాలని రెజ్లర్ సుశీల్ కుమార్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. రాబోయే టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నందున ప్రోటీన్ సప్లిమెంట్స్, వ్యాయామ సామాగ్రి, ప్రత్యేక ఆహారం అందించాల్సిందిగా ఆయన కోర్టును కోరారు. ప్రత్యేక ఆహారం కింద ఒమేగా 3 క్యాప్సూల్స్, ప్రీ-వర్కౌట్ సప్లిమెంట్స్, మల్టీవిటమిన్ మాత్రలు కావాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా సుశీల్ కుమార్ పిటిషణ్‌పై బుధవారం కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఇక సాధారణంగా జైల్లో ఐదు రోటీలు, ఏదైనా కూరగాయలతో చేసిన రెండు కర్రీలు, పప్పు, అన్నం ఇస్తారు. అంతేకాకుండా క్యాంటీన్లో నెలకు రూ. 6,000 వరకు కొనుక్కుని తినవచ్చు. అయితే సుశీల్ కుమార్ రెజ్లర్ కావడంతో మరింత ప్రోటీన్స్ అవసరమని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇక ఛత్రసాల్ స్టేడియం వద్ద యువ రెజ్లర్ సాగర్ ధనకర్ హత్యకు సంబంధించి మే 23న ఢిల్లీ పోలీసులు సుశీల్ కుమార్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుశీల్‌ను ఢిల్లీలోని మాండోలి జైలులో ప్రత్యేక సెల్లో ఉంచారు. అంతేకాకుండా భద్రతా కారణాల దృష్ట్యా అతన్ని కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదు. -
రెజ్లర్ సుశీల్‌కుమార్ ఆయుధ లైసెన్స్ రద్దు
న్యూఢిల్లీ: ఛత్రసాల్ స్టేడియం వద్ద యువ రెజ్లర్ సాగర్ ధనకర్ హత్య కేసులో అరెస్టయిన ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ ఆయుధ లైసెన్స్‌ను (ఆర్మ్స్ లైసెన్స్) రద్దు చేసినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. లైసెన్స్ రద్దు ప్రక్రియను లైసెన్స్ డిపార్ట్మెంట్ ప్రారంభించినట్టు తెలిపారు. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం సుశీల్ కుమార్‌ను హరిద్వార్ తీసుకెళ్లి.విచారిస్తున్నారు.సుశీల్ కుమార్ పరారీలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ తలదాచుకున్నారు, ఆయనకు ఎవరెవరు సహకరించారనే దానిపై దర్యాప్తు సాగిస్తున్నారు. సుశీల్ కుమార్ 18 రోజుల పాటు పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. పరారీలో ఉన్న అతనికి ఆశ్రయం ఇచ్చిందెవరనే కూపీ లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నేరం చేసిన సమయంలో అతను వేసుకున్న దుస్తులు, వాడిన సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇంకా స్వాధీనపరచలేదు. విచారణలో రెజ్లర్ సహకరించకపోవడంతో పోలీసులు మేజిస్ట్రేట్ ముందు వాదనల్ని వినిపించి అతని కస్టడీని ఇంకొన్ని రోజులు పొడిగించుకున్నారు. సుశీల్ దాడిలో సాగర్ చికిత్స పొందుతూ మరణించగా ఈ విషయం తెలుసుకున్న రెజ్లర్ ముందుగా హరిద్వార్‌కే పరారైనట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో అతన్ని అక్కడికి తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆశ్రయమిచ్చిన వారెవరో తెలుసుకునేందుకు... -
ఆశ్రయమిచ్చిన వారెవరో తెలుసుకునేందుకు...
న్యూఢిల్లీ: హత్యానేరంపై అరెస్టయిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం హరిద్వార్‌కు తీసుకెళ్లారు. యువ రెజ్లర్ సాగర్ హత్యకు కారణమైన అతను 18 రోజుల పాటు పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. పరారీలో ఉన్న అతనికి ఆశ్రయం ఇచ్చిందెవరనే కూపీ లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నేరం చేసిన సమయంలో అతను వేసుకున్న దుస్తులు, వాడిన సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇంకా స్వాధీనపరచలేదు. విచారణలో రెజ్లర్ సహకరించకపోవడంతో పోలీసులు మేజిస్ట్రేట్ ముందు వాదనల్ని వినిపించి అతని కస్టడీని ఇంకొన్ని రోజులు పొడిగించుకున్నారు. సుశీల్ దాడిలో సాగర్ చికిత్స పొందుతూ మరణించగా ఈ విషయం తెలుసుకున్న రెజ్లర్ ముందుగా హరిద్వార్‌కే పరారైనట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో అతన్ని అక్కడికి తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. -
Wrestler Sushil Kumar: సుశీల్ హాకీ స్టిక్‌తో...
న్యూఢిల్లీ: రెజ్లర్ సుశీల్ కుమార్‌ను దోషిగా చూపిస్తున్న దృశ్యం ఇదేనా! పోలీసులు సాక్ష్యంగా చెబుతున్న వీడియోలో సుశీల్ చేతిలో స్టిక్ ఉండగా, ఇద్దరు వ్యక్తులు నేలపై పడి దెబ్బలు తింటున్నట్లుగా కనిపిస్తోంది. సుశీల్ పక్కనే ఉన్న కొందరు వారిని చావబాదుతున్నట్లుగా పూర్తి వీడియోలో ఉన్నట్లు సమాచారం. దీనిపై పోలీసులనుంచి ఇంకా అధికారికంగా స్పష్టత రాకున్నా... ఢిల్లీ రెజ్లింగ్ వర్గాల్లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. మే 4న సాగర్ రాణా అనే యువ రెజ్లర్ చనిపోయిన ఈ ఘటనలో సుశీల్ నిందితుడిగా ఉన్నాడు. ఇక ఈ హత్య కేసులో ఉద్దేశపూర్వకంగానే కొంతమంది సుశీల్‌కుమార్‌ను ఇరికించారని, దీనంతటి వెనుక పెద్ద కుట్ర ఉందని అతడి తరఫు లాయర్ బీఎస్ జాఖడ్ ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన ఛత్రశాల్ స్టేడియానికి వెళ్లి గాయపడిన ముగ్గురి స్టేట్మెంట్ రికార్డు చేయగా వారెవరూ సుశీల్ దాడి చేసినట్లుగా చెప్పలేదని, కానీ సాగర్ చనిపోయాక మాత్రమే కిడ్నాపింగ్, మర్డర్ కేసు పెట్టారని పేర్కొన్నారు. సుశీల్ కొట్టినట్లుగా చెబుతున్న వీడియోను అందరి ముందు బహిర్గతపర్చవచ్చు కదా అని సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఈ దృశ్యాలు బయటపడటం గమనార్హం. చదవండి: భూ తగాదాలు... గ్యాంగ్స్టర్లు... ప్రాణభయం -
క్రీడాభిమానులను షాక్‌కు గురి చేసిన సుశీల్‌కుమార్ ఎపిసోడ్
-
సుశీల్ కుమార్ ఆచూకీ చెబితే రూ.1 లక్ష!
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలను ఢిల్లీ పోలీసులు మరింత ముమ్మరం చేశారు. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యకు సంబంధించి నిందితుల్లో ఒకడిగా ఉన్న సుశీల్ కుమార్ ఈ నెల 4 నుంచి పరారీలో ఉన్నాడు. సుశీల్ సన్నిహితులను విచారించడంతో పాటు అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సుశీల్ ఆచూకీ తెలిపినవారికి రూ. 1 లక్ష బహుమతిగా అందిస్తామని తాజాగా పోలీసులు ప్రకటించారు. సుశీల్ సహచరుడు అజయ్ ఆచూకీ తెలిపినవారికి కూడా రూ. 50 వేలు అందిస్తామని వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన ప్రిన్స్ దలాల్ ఫోన్లో షూట్ చేసిన వీడియో రికార్డింగ్‌లో సుశీల్ కూడా కొందరిని కొట్టడం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతానికి పోలీసుల వద్ద ఉన్న కీలక ఆధారం కూడా ఇదే. -
సుశీల్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా మృతి వ్యవహారంపై పోలీసుల విచారణ కీలక మలుపు తీసుకుంది. గ్రీకో రోమన్ 97 కేజీల విభాగంలో జాతీయ జూనియర్ మాజీ చాంపియన్ అయిన 23 ఏళ్ల సాగర్ రాణాను కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టడంతో అతను చనిపోయాడు. భారత రెజ్లర్లకు అడ్డాలాంటి ఛత్రశాల్ స్టేడియం బయట జరిగిన ఈ ఘటనలో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉందని వినిపిస్తోంది. అయితే అతను ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. ఈ నేపథ్యంలో సుశీల్ మామ, సీనియర్ కోచ్ సత్పాల్ సింగ్‌ను పోలీసులు విచారించారు. ‘సుశీల్ మామ సత్పాల్ సింగ్, అతని బావమరిదిలను సుమారు రెండు గంటల పాటు విచారించాం. మంగళవారం స్టేడియం పార్కింగ్ ఏరియా వద్ద జరిగిన గొడవలో సుశీల్, అజయ్, ప్రిన్స్ దలాల్, సోనూ మహల్, సాగర్ అమిత్ భాగంగా ఉన్నారని మా విచారణలో తేలింది. సుశీల్, అతని సహచరులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నాం’ అని అడిషనల్ డీసీపీ గురిక్బాల్ సింగ్ వెల్లడించారు. మరోవైపు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జితేంద్ర సింగ్ రాసిన ఎఫ్ఐఆర్ కాపీలో ‘సుశీల్ పహిల్వాన్, అతని సహచరులు ఈ నేరం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది’ అని రాసి ఉంది. 1982 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సత్పాల్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు కూడా లభించాయి. కెరీర్ తొలినాళ్ల నుంచి సత్పాల్ సింగ్ వద్ద శిక్షణ తీసుకున్న సుశీల్ 2010లో సత్పాల్ సింగ్ కూతురు సావీని పెళ్లి చేసుకున్నాడు. -
నర్సింగ్, సుశీల్ మళ్లీ ‘ఢీ’
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితులు భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు కొత్త ఊపిరినిచ్చాయి. నాలుగేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించి... చివరి నిమిషంలో డోపింగ్ కారణంగా ఈ విశ్వ క్రీడల నుంచి నర్సింగ్ తప్పుకోవాల్సి వచ్చింది. డోపింగ్‌లో పట్టుబడినందుకు ఈ మహారాష్ట్ర రెజ్లర్‌పై నాలుగేళ్ల నిషేధం విధించారు. కరోనా వైరస్ లేకపోయి ఉంటే ఈపాటికి 2020 టోక్యో ఒలింపిక్స్ ముగిసేవి. నిషేధం కారణంగా నర్సింగ్ ఒలింపిక్ ఆశలు ఆవిరయ్యేవి. కానీ కరోనా మహమ్మారితో టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. నర్సింగ్పై గత నెలాఖర్లో నాలుగేళ్ల నిషేధం కూడా ముగిసింది. దాంతో అతని ఒలింపిక్ ఆశలు సజీవమయ్యాయి. నిషేధం గడువు పూర్తి కావడంతో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు హరియాణాలోని సోనెపట్‌లో మొదలయ్యే జాతీయ రెజ్లింగ్ శిబిరంలో తనకూ చోటు కల్పించాలని 31 ఏళ్ల నర్సింగ్ యాదవ్ చేసిన విన్నపాన్ని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మన్నించింది. జాతీయ శిబిరానికి నర్సింగ్ హాజరు కావొచ్చంటూ అనుమతించింది. టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి ఇప్పటిదాకా పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో ఎవరూ అర్హత సాధించలేదు. ఈ బెర్త్ కోసం ప్రస్తుతం స్టార్ రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్‌కుమార్, జితేందర్, ప్రవీణ్ రాణా రేసులో ఉన్నారు. తాజాగా వీరి సరసన నర్సింగ్ యాదవ్ కూడా చేరాడు. ఫలితంగా 74 కేజీల విభాగంలో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత్ తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించాలో తేల్చేందుకు తప్పనిసరిగా ట్రయల్స్ నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. దాంతో 2016లో వివాదానికి కేంద్ర బిందువైన సుశీల్ కుమార్‌తో నర్సింగ్ యాదవ్ మళ్లీ ‘ఢీ’కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘డోపింగ్ విషయంలో భవిష్యత్‌లో చాలా జాగ్రత్తగా ఉంటానంటూ నర్సింగ్ హామీ ఇచ్చాడు. అతనిపై నిషేధం కూడా ముగిసింది. టోక్యో ఒలింపిక్స్ కోసం శిక్షణ పొందేందుకు నర్సింగ్కు కూడా అర్హత ఉంది. 74 కేజీల విభాగంలో భారత్‌కు ఇంకా బెర్త్ లభించలేదు. ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం ట్రయల్స్ నిర్వహిస్తాం. ఇందులో సుశీల్‌తోపాటు నర్సింగ్ ఇతర రెజ్లర్లు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సుశీల్, నర్సింగ్ మధ్య బౌట్ జరిగే అవకాశం కూడా ఉంది’ అని డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ తెలిపారు. నాడు ఏం జరిగిందంటే.... భారత రెజ్లింగ్ సమాఖ్య నిబంధనల ప్రకారం... ప్రపంచ చాంపియన్‌షిప్ ద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వారు ఎలాంటి ట్రయల్స్ లేకుండా ఒలింపిక్స్‌లో పాల్గొనే వీలుంది. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 74 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గి నర్సింగ్ యాదవ్ 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అయితే గాయం కారణంగా తాను 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనలేకపోయానని... రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఎవరు ప్రాతినిధ్యం వహించాలో తనకు, నర్సింగ్కు మధ్య సెలెక్షన్ ట్రయల్స్ బౌట్ నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని ఆనాడు సుశీల్ కుమార్ డబ్ల్యూఎఫ్ఐను డిమాండ్ చేశాడు. అయితే సుశీల్ డిమాండ్‌ను రెజ్లింగ్ సమాఖ్య తోసిపుచ్చి నర్సింగ్‌నే రియో ఒలింపిక్స్‌కు పంపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై సుశీల్ కోర్టుకెళ్లినా ఫలితం లేకపోయింది. అయితే రియో ఒలింపిక్స్‌కు వారం రోజులముందు నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో పట్టుబడటం... నర్సింగ్పై కావాలనే సుశీల్ వర్గం కుట్ర చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సీబీఐ విచారణ చేపట్టినా సుశీల్‌కుమార్ కుట్ర చేశాడని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసును కొట్టివేశారు. -
సుశీల్ భవితవ్యం జితేందర్ చేతిలో...
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడు, భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ‘2020–టోక్యో ఒలింపిక్స్’లో బరిలోకి దిగేది లేనిది సహచర రెజ్లర్ జితేందర్ కుమార్ నిర్ణయించే పరిస్థితి ఏర్పడింది. ఈనెల 15 నుంచి 18 వరకు ఇటలీలో జరిగే వరల్డ్ సిరీస్ ర్యాంకింగ్ టోర్నీలో... ఫిబ్రవరి 18 నుంచి 23 వరకు న్యూఢిల్లీలో జరిగే ఆసియా ఛాంపియన్ షిప్ లో... మార్చి 27 నుంచి 29 వరకు చైనాలో జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే భారత జట్లను శుక్రవారం ట్రయల్స్ ద్వారా ఎంపిక చేశారు. 74 కేజీల విభాగంలో పోటీపడాల్సిన సుశీల్ కుమార్ గాయం కారణంగా ట్రయల్స్‌కు దూరమయ్యాడు. దాంతో 74 కేజీల విభాగంలో జితేందర్ కుమార్ విజేతగా నిలిచి వరల్డ్ సిరీస్ ర్యాంకింగ్ టోర్నీ, ఆసియా ఛాంపియన్ షిప్, ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. 74 కేజీల ట్రయల్స్ ఫైనల్లో జితేందర్ 5–2తో అమిత్ ధన్కర్పై గెలిచాడు. ఒకవేళ చైనా ఆతిథ్యమిచ్చే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో జితేందర్ ఫైనల్‌కు చేరుకుంటే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాడు. జితేందర్ అర్హత సాధించిన పక్షంలో ఈ విభాగంలో సుశీల్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉండ దు. గతంలో కూడా ఒలింపిక్స్ బెర్త్ సంపాదించిన రెజ్లర్లకు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎలాంటి ట్రయల్స్ నిర్వహించకుండా నేరుగా ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం కలి్పంచింది. అయితే జితేందర్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీలో, ఆసియా చాంపియన్íÙప్లో విఫలమైతే మాత్రం ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోరీ్నకి ముందు మరోసారి ట్రయల్స్ నిర్వహించే అవకాశముందని... ఈ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు సుశీల్‌కు అవకాశమిస్తామని డబ్ల్యూఎఫ్ఐ తెలిపింది. -
‘టోక్యో’కు సుశీల్ క్వాలిఫై కావాలంటే..
నూర్ సుల్తాన్(కజికిస్తాన్): వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. శుక్రవారం జరిగిన పురుషుల 74 కేజీల కేటగిరీలో సుశీల్ 9-11 తేడాతో కడ్జిమురాద్ గాడ్జియెవ్(అజెర్బైజాన్)చేతిలో పరాజయం చవిచూశాడు. ఈ పోరు రౌండ్-1లో సుశీల్ కుమార్ ఆధిక్యంలో నిలిచినా చివరకు ఓటమి తప్పలేదు. బ్రేక్ సమయానికి ఐదు పాయింట్లు ఆధిక్యంలో ఉన్న సుశీల్.. ఆపై వెనకబడ్డాడు. తిరిగి పుంజుకున్న గాడ్జియెవ్.. సుశీల్‌ను తేరుకోనివ్వలేదు. దాంతో రెండు పాయింట్ల తేడాతో సుశీల్ పరాజయం చెందాడు. దాంతో సుశీల్ కుమార్ టోక్యో ఒలింపిక్స్ బెర్తు క్లిష్ట తరంగా మారింది. గాడ్జియెవ్ ఫైనల్‌కు చేరితేనే సుశీల్‌కు రెపిచేజ్ ద్వారా ఒలింపిక్స్ బెర్తు ఆశలు సజీవంగా ఉంటాయి. కాంస్య పతకం కోసం జరిగే రెపిచేజ్‌లో సత్తాచాటితేనే సుశీల్ కాంస్యంతో పాటు ఒలింపిక్స్ బెర్తును ఖాయం చేసుకుంటాడు. ఇదిలా ఉంచితే, ప్రవీణ్ రాణా రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఈ రోజు జరిగిన 92 కేజీల ఫ్రీస్టైయిల్ రెజ్లింగ్ కేటగిరీలో ప్రవీణ్ 12-1 తేడాతో చాంగ్జె సు(దక్షిణ కొరియా)పై గెలిచాడు. -
ఇది కదా దురదృష్టమంటే..
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్) : భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పూనియాను ఆతిథ్య దేశం ఓడించింది. అంతకుముందే తన సత్తాతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన పూనియా ఆత్మవిశ్వాసంతో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. కానీ... సెమీఫైనల్లో ప్రత్యర్థి స్థానిక కజకిస్తాన్ రెజ్లర్ నియజ్బెకొవ్ కావడమే పూనియా పాపమైంది. దీంతో నిర్వాహకుల పక్షపాతం భారత రెజ్లర్ సువర్ణావకాశాన్ని దెబ్బతీసింది. సెమీస్ ఓటమితో బజ్రంగ్ ఇప్పుడు కాంస్యం కోసం తలపడనున్నాడు. మరో రెజ్లర్ రవి దహియా కూడా టోక్యో బెర్తు ఖాయం చేసుకున్నాడు. కానీ సెమీస్‌లో అతను కూడా పరాజయం చవిచూడటంతో భారత్‌కు ఇప్పుడు రజతం, బంగారం దూరమయ్యాయి. అంతా కలిసి ఏక ‘పక్ష’మయ్యారు... గత బుడాపెస్ట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్న బజ్రంగ్ ఈసారి స్వర్ణంపై కన్నేశాడు. అందుకు తగ్గట్లే కఠోరంగా శ్రమించాడు. ఎదురేలేకుండా 65 కేజీల విభాగంలో సెమీస్ చేరాడు. గురువారం కజకిస్తాన్‌కు చెందిన డౌలెత్ నియజ్బెకొవ్‌తో జరిగిన సెమీఫైనల్ బౌట్లో ఆరంభం నుంచి ఆతిథ్య దేశం ఎన్ని కుయుక్తులు చేసినా... పట్టువదలని ఈ కుస్తీవీరుడు పాయింట్లు గెలుస్తూనే వచ్చాడు. 6 నిమిషాల ఈ బౌట్ చివరకు 9–9 స్కోరు వద్ద ముగిసింది. అయితే నిర్వాహకులు, రిఫరీలు... ఈ కుస్తీ పోటీలో తమ కజకిస్తాన్ రెజ్లర్ త్రో పూనియా కంటే మెరుగని ఏకపక్షంగా తేల్చేశారు. ఆ సర్కిల్లో ప్రత్యర్థి త్రో ప్రభావవంతంగా ఉందని అదనంగా 4 పాయింట్లు కట్టబెట్టి నియజ్బెకొవ్‌ను విజేతగా ప్రకటించారు. క్వార్టర్స్‌లో అలవోకగా...: అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో కొరియా రెజ్లర్ జొంగ్ చొయ్ సన్తో తలపడిన బజ్రంగ్ అలవోక విజయం సాధించాడు. 8–1 స్కోరుతో ప్రత్యర్థిని తేలిగ్గానే చిత్తు చేశాడు. 57 కేజీల విభాగంలో రవి దహియా తొలి రెండు బౌట్లను టెక్నికల్ సుపీరియారిటీ ద్వారా గెలిచాడు. అనంతరం సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ జౌర్ యుగెయెవ్(రష్యా) చేతిలో పరాజయం పాలై కాంస్య పోరులో నిలిచాడు. -
బజరంగ్ సాధిస్తాడా!
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్): భారత రెజ్లింగ్ చరిత్రలో ఒకే ఒక్కడు సుశీల్ కుమార్ మాత్రమే ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. 2010లో అతను ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాతి నుంచి మరో స్వర్ణం మన ఖాతాలో చేరలేదు. ఇప్పుడు స్వర్ణం గెలుచుకునే లక్ష్యంతో వరల్డ్ నంబర్‌వన్ బజరంగ్ పూనియా (65 కేజీలు) శనివారం మొదలయ్యే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు తొలి అర్హత టోర్నీ అయిన ఈ మెగా ఈవెంట్లో మొత్తం 108 ఒలింపిక్ బెర్త్‌లు ఖరారవుతాయి. పురుషుల ఫ్రీస్టయిల్ (57, 65, 74, 86, 97, 125 కేజీలు), గ్రీకో రోమన్ (60, 67, 77, 87, 97, 130 కేజీలు), మహిళల ఫ్రీస్టయిల్ (50, 53, 57, 62, 68, 76 కేజీలు) విభాగాల్లో టాప్–6లో నిలిచిన వారు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. గత ఏడాది బుడాపెస్ట్‌లో జరిగిన ఇదే పోటీల్లో రజతం సాధించిన బజరంగ్ తన ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన సుశీల్ కుమార్ 74 కేజీల విభాగంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. జూనియర్ వరల్డ్ చాంపియన్ దీపక్ పూనియా (86 కేజీలు) ఇక్కడ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరం. బజరంగ్ 19న, సుశీల్ 20న, దీపక్ 21న బరిలోకి దిగుతారు. -
గ్రేడ్ ‘ఎ’లోకి సుశీల్, సాక్షి
ముంబై: స్టార్ రెజ్లర్లు, ఒలింపిక్ పతక విజేతలైన సుశీల్ కుమార్, సాక్షి మలిక్‌ల కాంట్రాక్టు గ్రేడ్‌ను ‘బి’ నుంచి ‘ఎ’కు మారుస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టగా, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, పూజా ధండాలకు ‘ఎ’ గ్రేడ్ దక్కింది. దీనిపై విమర్శలు రావడంతో డబ్ల్యూఎఫ్ఐ పొరపాటును సరిదిద్దుకుంది. ‘ఇది మా తప్పే. వారిద్దరూ ‘బి’ గ్రేడ్‌లో ఉండాల్సిన వారు కాదు. అందుకని ‘ఎ’లోకి మార్చుతున్నాం’ అని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ ప్రకటించారు. సుశీల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గాడు. సాక్షి 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుపొందింది. మరోవైపు డబ్ల్యూఎఫ్ఐ రెజ్లర్లను ‘ఎ’ నుంచి ‘ఎఫ్’ వరకు వర్గీకరించింది. సుశీల్, సాక్షి గ్రేడ్ ‘ఎ’లోకి వెళ్లడంతో ‘బి’లో ఎవరూ లేనట్లైంది. ‘సి’లో ఏడుగురు, ‘డి’లో 9 మంది, ‘ఇ’లో నలుగురున్నారు. అండర్–23 జాతీయ స్వర్ణ పతక విజేతలకు ‘ఎఫ్’లో చోటు దక్కుతుంది. డ్ ‘ఎ’లోకి సుశీల్, సాక్షి -
సుశీల్ కుమార్‌కు షాక్
జకర్తా : భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఆసియా క్రీడల్లో తొలి రోజే నిరాశ ఎదురైంది. పురుషుల రెజ్లింగ్ 74 కేజీల విభాగంలో బరిలోకి దిగిన సుశీల్.. బెహ్రేన్‌కు చెందిన ఆడమ్ బటిరోవో చేతిలో ఓటమి చెందాడు. సుశీల్‌పై 3-5 తేడాతో బటిరోవో గెలుపొందాడు. మొదటి రౌండ్లో 2-1తో దూసుకుపోయిన సుశీల్ ఆ తరువాత ఆ స్థాయి ప్రదర్శన కొనసాగించలేకపోయాడు. దీంతో అతను స్వర్ణ పతాకం పొందే అవకాశాన్ని కోల్పోయాడు. ఒకవేళ బటిరోవ్ ఫైనల్‌కు చేరితే రిపిచేజ్ ద్వారా కాంస్య పతాకం కోసం సుశీల్ పోటిపడే అవకాశం ఉంటుంది. సుశీల్ కుమార్ గతంలో రెండు సార్లు భారత్‌కు ఒలంపిక్ పతకాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశీల్‌పై భారత అభిమానులు పెట్టుకున్న ఆశలు అడియాశలైయ్యాయి. అంతకుముందు భారత్‌కు ఆసియా క్రీడల్లో తొలి పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగంలో అపూర్వి చండేలా, రవికుమార్ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. -
ఆటగాళ్ల ఫైర్ : పునరాలోచనలో హర్యానా ప్రభుత్వం
చండీగఢ్ : క్రీడాకారుల సంపాదనలో మూడోవంతును ప్రభుత్వానికి ఇవ్వాలని హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనోహర్ లాల్ ఖత్తర్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ నోటీఫికేషన్ జారీచేయవద్దని సంబంధిత క్రీడా మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ మీడియాకు తెలిపారు. తమ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల తాము గర్వంగా ఫీలవుతున్నామని, వారి సమస్యలను పరిగణలోకి తీసుకొని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం ఉద్యోగాల్లో ఉన్న అథ్లెట్లు వృత్తిపరమైన క్రీడలతో పాటు వాణిజ్యపరమైన ఆదాయంతో సహా లెక్కగట్టి.. మొత్తం సంపాదనలో మూడవ వంతు సొమ్మును క్రీడా మండలికి చెల్లించాలని ఏప్రిల్ 30 న హర్యానా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అథ్లెట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని ఒలింపిక్ పతాక విజేత సుశీల్ కుమార్, ఫోగట్ సిస్టర్స్ తప్పుబట్టారు. ఆటగాళ్లపై ప్రభుత్వం మరో భారాన్ని మోపడం సరికాదన్నారు. ఈ నోటీఫికేషన్ విడుదల చేసేముందు ప్రభుత్వం తమతో చర్చించాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ నోటిఫికేషన్‌ను ఆ రాష్ట్ర బీజేపీ నేత జవహార్ యాదవ్ వెనకేసుకొచ్చారు. అథ్లెట్లు క్రీడల్లో గెలిచిన ప్రైజ్ మనీని ఇవ్వమనడం లేదని, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వాణిజ్య ప్రకటనల ద్వారా ఆర్జిస్తున్నారో వారినే ఇవ్వమంటున్నామని తెలిపారు. -
సుశీల్, సాక్షిలకు మినహాయింపు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రయల్స్ నుంచి స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, సాక్షి మాలిక్‌లు తప్పుకున్నారు. వీరిద్దరితో పాటు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియాలు కూడా ట్రయల్స్‌లో పాల్గొనలేమని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు నివేదించారు. దీనిపై స్పందించిన డబ్ల్యూఎఫ్ఐ వారికి మినహాయింపు ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కీలకమైన పోటీలకు ముందు ఎలాంటి ఉదాసీనతలకు తావివ్వకుండా ఉండేందుకు డబ్ల్యూఎఫ్ఐ ఆధ్వర్యంలో సోనెపట్‌లోని భారత స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో వచ్చే నెల 10 నుంచి పురుషుల కోసం ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ ట్రయల్స్‌లో ఫ్రీస్టయిల్, గ్రీకోరోమన్ విభాగాల్లో రెజ్లర్లకు తర్ఫీదు ఇవ్వనున్నారు. మహిళల కోసం లక్నోలో జూన్ 17 నుంచి ఈ ట్రయల్స్ జరుగుతాయి. ఈ నేపథ్యంలో నలుగురు రెజ్లర్లు తమను ట్రయల్స్ నుంచి మినహాయించాలని కోరడంతో డబ్ల్యూఎఫ్ఐ అధికారులు దీనికి సమ్మతించారు. -
‘సుశీల్ రియోలో ఆడి ఉంటే స్వర్ణమే’
సాక్షి, న్యూఢిల్లీ : 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా సుశీల్‌ని అడ్డుకొని ఉండకపోతే భారత్‌కు తప్పక బంగారు పతకం సాధించిపెట్టేవాడని యోగా గురు బాబా రాందేవ్ అభిప్రాయ పడ్డారు. గోల్డ్ కోస్ట్‌లో జరిగిన ‘కామన్వెల్త్ గేమ్స్-2018’లో 74 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణం సాధించిన సుశీల్ కుమార్‌ను, 125 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణం గెలుపొందిన సుమిత్ మాలిక్‌ను బాబా రాందేవ్ మంగళవారం అభినందించారు. ‘మీరిద్దరూ కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌ను నిలబెట్టారు. యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుంది. సుశీల్ గనుక రియో ఒలిపింక్స్‌లో పాల్గొని ఉంటే స్వర్ణం సాధించి ఉండేవాడు’ అంటూ రాందేవ్ వ్యాఖ్యానించారు. రియో ఒలింపిక్స్‌లో 74 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ పోటీల్లో బెర్త్ కోసం ముంబయ్‌కు చెందిన నార్సింగ్ యాదవ్‌కు, తనకు ట్రయల్ పోటీ నిర్వహించాలన్న సుశీల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. గాయం కారణంగా 2015 లాస్ వెగాస్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్లో సుశీల్ పాల్గొనక పోవడంతో నార్సింగ్ యాదవ్ రియోకి బెర్త్ ఖాయం చేసుకున్నాడు. -
కామన్వెల్త్ క్రీడా విజేతలకు ఘనస్వాగతం
సాక్షి, న్యూఢిల్లీ: గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు గెల్చుకుని వచ్చిన భారత క్రీడాకారులకు దేశంలో ఘన స్వాగతం లభిస్తోంది. రెజ్లింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన సుశీల్ కుమార్‌కి, బాక్సింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన మేరికోమ్‌కి సొంత రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో దేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారిణి మనికా బత్రాకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. మంగళవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మనికాకు అభిమానులు పెద్దఎత్తున స్వాగత ర్యాలీ నిర్వహించారు. మనికా దేశం గర్వపడేలా చేసిందని, ఇలాగే మరిన్ని స్వర్ణ పతకాలు గెలవాలని క్రీడాభిమానులు కోరుకున్నారు. మనికా బత్రా మాట్లాడుతూ.. ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. కామన్వేల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించడం సంతోషంగా ఉందని, ఇలాగే మరిన్ని పతాకాలను భారత్‌కు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో భారతదేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించింది క్రీడాకారిణి మనికా బత్రా. సింగపూర్ క్రీడాకారిణి మెయినగ్యు యూతో జరిగిన హోరాహోరీ పోరులో మనికా 11-7, 11-6, 11-2, 11-7 పాయింట్లతో గెలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో కామన్వెల్త్ చరిత్రలో భారతదేశానికి టేబుల్ టెన్నిస్‌లో స్వర్ణపతకం తీసుకొచ్చిన మొదటి మహిళగా రికార్డులకెక్కింది. సెమీ ఫైనల్లో ఈమె వరల్డ్ నెంబర్ ఫోర్ మరియు ఒలింపిక్ మెడల్ గ్రహీతైన సింగపూర్ క్రీడాకారిణి తియాన్వై ఫెంగ్‌ను ఓడించడం విశేషం. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యలను భారత అథ్లెట్లు సొంతం చేసుకున్నారు. మొత్తం 66 పతకాలతో భారత్ మూడోస్థానంలో నిలిచింది. భారత మెన్స్ అథ్లెట్లు 13 స్వర్ణాలతో పాటు 9 రజతాలు, 13 కాంస్యా పతకాలు సాధించారు. ఇక ఉమెన్స్ విభాగంలో 12 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్యా పతకాలు వచ్చాయి. మిక్స్ డ్ టీమ్ విభాగం లో ఒక్కో స్వర్ణం, రజతం, కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. -
పసిడి పట్టు...
కొంతకాలంగా తనకు సంబంధం లేకుండానే వివాదాల్లో నిలిచిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ గేమ్స్‌లో మాత్రం విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ గేమ్స్‌లో వరుసగా మూడోసారి స్వర్ణ పతకాన్ని గెలిచి ‘హ్యాట్రిక్’ సాధించాడు. అంతేకాకుండా ఈ గేమ్స్ చరిత్రలో మూడుసార్లు బంగారు పతకం గెలిచిన ఏకైక భారత రెజ్లర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. సుశీల్‌కు తోడు మరో భారత రెజ్లర్ రాహుల్ అవారే కూడా పసిడి పతకం నెగ్గాడు. మహిళా రెజ్లర్లు బబిత రజతం, కిరణ్ కాంస్యం సాధించి భారత సత్తాను చాటారు. షూటింగ్లో తేజస్విని రజతం... అథ్లెటిక్స్‌లో సీమా పూనియా రజతం, నవ్‌జీత్ కాంస్యం గెలిచారు. దాంతో పోటీల ఎనిమిదో రోజు భారత్‌కు ఏకంగా ఏడు పతకాలు వచ్చాయి. గోల్డ్‌కోస్ట్: వెయిట్‌లిఫ్టర్లు తమ పతకాల వేటను ముగించగా... షూటర్లు దానిని కొనసాగిస్తుండగా... వీరి సరసన రెజ్లర్లు కూడా చేరారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. పోటీల ఎనిమిదో రోజు రెజ్లింగ్ ఈవెంట్ ప్రారంభంకాగా... బరిలోకి దిగిన నలుగురు భారత రెజ్లర్లు సుశీల్, రాహుల్ అవారే, బబిత కుమారి, కిరణ్ పతకాలు గెల్చుకోవడం విశేషం. భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్‌కు 74 కేజీల విభాగంలో తన ప్రత్యర్థుల నుంచి ఏమాత్రం పోటీ ఎదురుకాలేదు. సుశీల్ గెలిచిన నాలుగు బౌట్లలో మూడు టెక్నికల్ సుపీరియారిటీ (ఇద్దరి మధ్య కనీసం 10 పాయింట్లు తేడా) ద్వారా రాగా... మరొకటి ‘బై ఫాల్’ (ప్రత్యర్థి భుజాన్ని మ్యాట్‌కు రెండు సెకన్లకంటే ఎక్కువసేపు అదిమి పెట్టడం) ద్వారా వచ్చింది. తొలి రౌండ్లో 11–0తో జెవోన్ బాల్ఫోర్ (కెనడా)ను ఓడించిన సుశీల్... క్వార్టర్ ఫైనల్లో 10–0తో అసద్ బట్ (పాకిస్తాన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా రెజ్లర్ కానర్ ఇవాన్స్‌ను ‘బై ఫాల్’ పద్ధతిలో చిత్తు చేసిన సుశీల్...జోనస్ బోథా (దక్షిణాఫ్రికా)తో జరిగిన ఫైనల్లో కేవలం 80 సెకన్లలోనే 10–0తో ఆధిక్యంలోకి వెళ్లి విజయాన్ని, స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. 2010 ఢిల్లీ గేమ్స్‌లో 66 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన సుశీల్... 2014 గ్లాస్కో గేమ్స్‌లో 74 కేజీల విభాగంలో చాంపియన్ అయ్యాడు. మరోవైపు పురుషుల 57 కేజీల విభాగంలో మహారాష్ట్ర రెజ్లర్ రాహుల్ అవారే కూడా విజేతగా నిలిచాడు. తొలి రౌండ్లో 11–0తో జార్జి రమ్ (ఇంగ్లండ్)పై... క్వార్టర్ ఫైనల్లో 10–0తో థామస్ సిచిని (ఆస్ట్రేలియా)పై గెలిచిన రాహుల్... సెమీఫైనల్లో 12–8తో మొహమ్మద్ బిలాల్ (పాకిస్తాన్)పై, ఫైనల్లో 15–7తో స్టీవెన్ తకహాషి (కెనడా)పై విజయం సాధించి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. మహిళల రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో బబిత కుమారి స్వర్ణ పతక పోరులో 3–5తో డయానా వీకెర్ (కెనడా) చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది. ఈ విభాగంలో ఐదు ఎంట్రీలు మాత్రమే రావడంతో రౌండ్ రాబిన్ లీగ్‌లో బౌట్లను నిర్వహించారు. 76 కేజీల విభాగం కాంస్య పతక పోరులో కిరణ్ ‘బై ఫాల్’ పద్ధతిలో కటుస్కియా పరిధవెన్ (మారిషస్)ను ఓడించింది. అథ్లెటిక్స్‌లో బోణీ... మహిళల డిస్కస్ త్రోలో సీమా పూనియా, నవ్‌జీత్ ధిల్లాన్ అద్భుత ప్రదర్శనలతో అథ్లెటిక్స్‌లో భారత్ పతకాల బోణీ చేసింది. డిస్క్‌ను సీమా 60.41 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో... నవ్‌జీత్ 57.43 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచి వరుసగా రజత, కాంస్య పతకాలను గెల్చుకున్నారు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో అర్పిందర్ సింగ్, రాకేశ్ బాబు ఫైనల్‌కు అర్హత పొందారు. తేజస్విని గురికి రజతం... షూటింగ్లో భారత్‌కు మరో పతకం వచ్చింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్ తేజస్విని సావంత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ మహారాష్ట్ర షూటర్ 618.9 పాయింట్లు స్కోరు చేసి రజత పతకం సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో మరో భారత షూటర్ అంజుమ్ 16వ స్థానంలో నిలిచింది. బ్యాడ్మింటన్‌లో అదే జోరు భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు అదరగొట్టారు. వ్యక్తిగత విభాగాల్లో బరిలో దిగిన అందరూ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. ప్రిక్వార్టర్స్‌లో పీవీ సింధు 21–15, 21–9తో హువాన్ యు (ఆస్ట్రేలియా)పై; రుత్విక 21–10, 21–23, 21–10తో జియి మిన్ యో (సింగపూర్)పై; ప్రపంచ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 21–10, 21–10తో నిలుక కరుణరత్నే (శ్రీలంక)పై; ప్రణయ్ 21–18, 21–11తో ఆంథోని జోయ్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందారు. సైనా నెహ్వాల్ 21–4, 2–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ఆమె ప్రత్యర్థి జెసిక లీ (ఐల్ ఆఫ్ మ్యాన్) గాయం కారణంగా తప్పుకోవడంతో క్వార్టర్స్‌కు చేరింది. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్–అశ్విని పొన్నప్ప, ప్రణవ్ చోప్రా–సిక్కి రెడ్డి జంటలు... మహిళల డబుల్స్‌లో అశ్విని–సిక్కిరెడ్డి, పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి జంటలు కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. హాకీలో కాంస్యం కోసం... అందివచ్చిన అవకాశాలను వృథా చేసుకున్న భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో 1–0తో ఓడింది. మ్యాచ్ చివరి క్వార్టర్లో భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇక ఈ మెగా ఈవెంట్లో భారత్ కాంస్యం కోసం ఇంగ్లండ్‌తో తలపడనుంది. సెమీస్‌లో మనిక టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్ విభాగంలో మనిక బాత్రా సెమీఫైనల్‌కు అర్హత సాధించగా... మౌమా దాస్, మధురిక ఓటమి పాలయ్యారు. మనిక క్వార్టర్ ఫైనల్లో 4–1తో యిహాన్ జూ (సింగపూర్)పై గెలిచింది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో శరత్ 4–1తో హేమింగ్ హు (ఆస్ట్రేలియా)పై; హర్మీత్ 4–1తో చీ ఫెంగ్ లియాంగ్ (మలేసియా)పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. దీపిక జంట జోరు... మహిళల స్క్వాష్ డబుల్స్‌లో దీపిక పళ్లికల్–జోష్నా చినప్ప జంట సెమీ ఫైనల్ చేరింది. ఈ జోడీ క్వార్టర్స్‌లో 11–8, 11–10తో టెస్నీ ఈవాన్స్–పీటర్ క్రీడ్ (వేల్స్)పై గెలుపొందింది. సెమీస్‌లో టాప్ సీడ్ జెయెల్లె కింగ్–పాల్ కోల్ (న్యూజిలాండ్) ద్వయంతో తలపడనుంది. పురుషుల డబుల్స్‌లో విక్రమ్–రమిత్ టాండన్ జంట క్వార్టర్స్‌కు చేరింది. మిక్స్డ్ డబుల్స్‌లో దీపిక పళ్లికల్–సౌరవ్ జంట సెమీస్‌కు చేరగా... జోష్నా చినప్ప–హరిందర్ పాల్ సంధూ జంట క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. -
వరుసగా మూడో కామన్వెల్త్లో స్వర్ణం
-
వరుసగా మూడో కామన్వెల్త్లో స్వర్ణం
గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తున్నారు. భారత రెజ్లర్ సుశీల్ కుమార్ వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. గురువారం జరిగిన పురుషుల 74 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీపడిన రెజ్లర్ సుశీల్ భారత్ ఖాతాలో బంగారు పతకాన్ని చేర్చారు. స్వర్ణం కోసం జరిగిన పోరులో దక్షిణాఫ్రికాకు చెందిన రెజ్లర్ బోథాను మట్టికరిపించిన సుశీల్ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య 14కి చేరింది. కామన్వెల్త్ గేమ్స్ ఎనిమిదో రోజు భారత్ రెండు స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం నెగ్గింది. అందులో నాలుగు రెజ్లింగ్‌లో రాగా, షూటింగ్లో రజతం వచ్చింది. అంతకుముందు రెజ్లర్ రాహుల్ ఆవారే పరుషుల 57 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణాన్ని అందించిన విషయం తెలిసిందే. కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 14 స్వర్ణాలు, 6 రజతాలు, 9 కాంస్యాల కలిపి మొత్తం 29 పతకాలను భారత్ సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 2010- ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం 2014- గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం 2018- ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో 74 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో స్వర్ణం -
'సుశీల్ రెచ్చగొట్టి దాడి చేయించాడు'
న్యూఢిల్లీ:ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ మద్దతుదారులు తనపై చేయిచేసుకోవడంపై సహచర రెజ్లర్ ప్రవీణ్ రాణా స్పందించాడు. సుశీలే స్వయంగా అతని మద్దతుదారులను రెచ్చగొట్టి తనపై దాడి చేయించాడని రాణా ఆరోపించాడు. ఈ క్రమంలోనే సుశీల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘సెమీస్ బౌట్ ముగిసిన వెంటనే సుశీల్ .. అతని మద్దతుదారులను నాపైకి ఉసిగొల్పాడు. రాణా ఇక్కడే ఉన్నాడు చూసుకోండి అని చెప్పి గదిలోకి వెళ్లిపోయాడు. దగ్గరుండి మరీ ఇలా చేయించడం దారుణం. ఆ రోజు దాడిలో నా సోదరుని తలపై కుర్చీతో దాడి చేశారు. నా సోదరుడు ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు' అని రాణా పేర్కొన్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్ల ఎంపిక కోసం శుక్రవారం స్థానిక కేడీ జాదవ్ స్టేడియంలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా రచ్చ చోటు చేసుకుంది. ఇద్దరు రెజ్లర్లకు చెందిన అనుచరుల మధ్య గొడవ ముదిరి కొట్టుకునే వరకు వచ్చింది. నేరుగా కాకపోయినా దీనికంతటికీ పరోక్ష కారణంగా స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతకం సాధించిన సుశీల్ కుమార్ నిలవడం దురదృష్టకర పరిణామం. వచ్చే ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్లకు సంబంధించిన సెలక్షన్ ట్రయల్స్ జరిగాయి. ఇందులో 74 కేజీల విభాగంలో తన ఆటను ప్రదర్శించేందుకు సుశీల్ కుమార్ బరిలోకి దిగాడు. సెమీస్‌లో అతనికి ప్రత్యర్థిగా ప్రవీణ్ రాణా నిలిచాడు. ఈ బౌట్లో సుశీల్ సునాయాసంగానే నెగ్గాడు. ఆ తర్వాత ఫైనల్ కూడా గెలిచి కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించినా వివాదం మాత్రం సుశీల్‌ను వీడటం లేదు. -
అభిమానుల అతి.. చిక్కుల్లో రెజ్లర్ సుశీల్ కుమార్
న్యూఢిల్లీ : అభిమానులు అతిగా ప్రవర్తించడంతో రెండుసార్లు ఒలింపిక్ విజేతైన రెజ్లర్ సుశీల్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. సుశీల్ అనుచరులు తమపై దాడి చేశారని ప్రత్యర్థీ రెజ్లర్ ప్రవీణ్ రాణా సోదరుడు.. నవీన్రాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం ఢిల్లీ పోలీసులు సుశీల్‌పై కేసు నమోదు చేశారు. వచ్చే ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్ల ఎంపిక కోసం శుక్రవారం సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరి రెజ్లర్ల అనుచరుల మధ్య రచ్చ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో 74 కేజీల విభాగంలో తన ఆటను ప్రదర్శించేందుకు సుశీల్ కుమార్ బరిలోకి దిగాడు. సెమీస్‌లో అతనికి ప్రత్యర్థిగా ప్రవీణ్ రాణా నిలిచాడు. ఈ బౌట్లో సుశీల్ సునాయాసంగానే నెగ్గాడు. ఆ తర్వాత ఫైనల్ కూడా గెలిచి కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించాడు. అయితే సెమీస్ పోరు తర్వాత ప్రవీణ్ సుశీల్ అనచురులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ‘సుశీల్‌కు ప్రత్యర్థిగా నిలబడేంత సాహసం చేస్తావా’ అంటూ సుశీల్ అనుచరులు తనను, తన సోదరుడిని కొట్టారని అతను చెప్పాడు. తనను చంపేస్తామని కూడా వారు బెదిరించారని, ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో ఎలా పాల్గొంటావో చూస్తామంటూ హెచ్చరించారని కూడా ప్రవీణ్ ఆరోపించాడు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందినవారు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనను సుశీల్ ఖండించాడు. ‘బౌట్లో ప్రవీణ్ నన్ను కొరికాడు కూడా. అయితే అది అతని వ్యూహంలో భాగం కావచ్చు కాబట్టి పట్టించుకోను. అయితే బయట జరిగిన ఘటన సరైంది కాదు. నేను దానిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక్కసారి బౌట్ ముగిసిందంటే మేం ఒకరినొకరం గౌరవించుకుంటాం’ అని సుశీల్ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చాడు. కేసుపై స్పందించిన సుశీల్ కుమార్.. ‘ఇలాంటి ఘటనలు క్రీడల్లో చోటుచేసుకోకూడదు. ఓటమి, గెలుపు మంచిగానే తీసుకోవాలి. ఆ విషయంలో ప్రవీణ్ జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. అక్కడ క్రమశిక్షణతో నడుచుకోవాల్సింది, ఏ ఒక్కరు రఫ్‌గా ఆడలేదు. మనం దేశం తరుపున రెజ్లింగ్ ఆడుతున్నామని’ కేసునమోదవ్వడంపై సుశీల్ స్పందించాడు. -
మ్యాట్ బయట ముష్టిఘాతాలు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్ల ఎంపిక కోసం శుక్రవారం జరిగిన సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా రచ్చ చోటు చేసుకుంది. ఇద్దరు రెజ్లర్లకు చెందిన అనుచరుల మధ్య గొడవ ముదిరి కొట్టుకునే వరకు వచ్చింది. నేరుగా కాకపోయినా దీనికంతటికీ పరోక్ష కారణంగా స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతకం సాధించిన సుశీల్ కుమార్ నిలవడం దురదృష్టకర పరిణామం! వివరాల్లోకెళితే... వచ్చే ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్లకు సంబంధించిన సెలక్షన్ ట్రయల్స్ స్థానిక కేడీ జాదవ్ స్టేడియంలో జరిగాయి. ఇందులో 74 కేజీల విభాగంలో తన ఆటను ప్రదర్శించేందుకు సుశీల్ కుమార్ బరిలోకి దిగాడు. సెమీస్‌లో అతనికి ప్రత్యర్థిగా ప్రవీణ్ రాణా నిలిచాడు. ఈ బౌట్లో సుశీల్ సునాయాసంగానే నెగ్గాడు. ఆ తర్వాత ఫైనల్ కూడా గెలిచి కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించాడు. అయితే సెమీస్ పోరు తర్వాత ప్రవీణ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ‘సుశీల్‌కు ప్రత్యర్థిగా నిలబడేంత సాహసం చేస్తావా’ అంటూ సుశీల్ అనుచరులు తనను, తన సోదరుడిని కొట్టారని అతను చెప్పాడు. తనను చంపేస్తామని కూడా వారు బెదిరించారని, ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో ఎలా పాల్గొంటావో చూస్తామంటూ హెచ్చరించారని కూడా ప్రవీణ్ ఆరోపించాడు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందినవారు ఒకరిపై మరొకరు దాడి చేసినట్లుగా సమాచారం. అయితే ఈ ఘటనను సుశీల్ ఖండించాడు. ‘బౌట్లో ప్రవీణ్ నన్ను కొరికాడు కూడా. అయితే అది అతని వ్యూహంలో భాగం కావచ్చు కాబట్టి పట్టించుకోను. అయితే బయట జరిగిన ఘటన సరైంది కాదు. నేను దానిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక్కసారి బౌట్ ముగిసిందంటే మేం ఒకరినొకరం గౌరవించుకుంటాం’ అని సుశీల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇటీవల జాతీయ చాంపియన్‌షిప్‌లో సుశీల్‌తో తలపడక ముందే అతనిపై ‘గౌరవం’తో వాకోవర్ ఇచ్చిన ముగ్గురు రెజ్లర్లలో ప్రవీణ్ రాణా కూడా ఒకడు కావడం విశేషం! -
ఆటగాళ్ల కోసం కొట్టుకున్న అభిమానులు
-
అభిమానుల డిష్యుం డిష్యుం
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న కామన్ వెల్త్ గేమ్స్‌లో స్థానం కోసం జరిపిన రెజ్లింగ్ పోటీలు రసాభాసగా సాగాయి. భారత్ తరపున సుశీల్ కుమార్, ప్రవీణ్ రాణాలు ఈ పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్య నేడు సన్నాహక మ్యాచ్ జరిగింది. ఇందుకోసం ఇరువురి అభిమానులు పెద్ద ఎత్తున ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియానికి తరలివచ్చారు. ఈపోటీలో గెలిచిన వారికే కామన్ వెల్త్ గేమ్స్ లో ఆడే అవకాశం లభిస్తుంది. ఓడిన వారు వెనుదిరగాలి. దీంతో ఇరువర్గాల అభిమానులు గొడవకు దిగారు. అక్కడున్న కుర్చీలు, బల్లలు విరగొట్టారు. దీంతో స్టేడియంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అంతేకాకుండా సుశీల్ అభిమానులు ప్రవీణ్ రాణా సోదరుడుపై దాడికి దిగడంతో స్వల్ప గాయాలయ్యాయి. వివాదంపై సుశీల్ కుమార్ స్పందించాడు. జరిగిన సంఘటనను తాను ఖండిస్తున్నానని చెప్పాడు. అయితే గతంలో ప్రవీణ్ రాణా కూడా తన అభిమానుల్లాగే బౌట్లో ప్రవర్తించాడని విమర్శించాడు. నియమాలను వదిలేసి, కావాలనే కక్షపూరితంగా తనపై దాడిచేశాడని ఆరోపించాడు. అయినా తాను దీనిగురించి ఏమాత్రం బాధపడలేదని, ఆటలో ఇవన్నీ సర్వసాధారణం అన్నాడు. ఇప్పుడు ఈసమస్యకు కూడా పరస్పర అంగీకారంతోనే ఫుల్స్టాప్ పెడతామని సుశీల్ తెలిపాడు. గత కొద్ది వారాల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన మ్యాచ్‌ల్లో సుశీల్ కుమార్, ప్రవీణ్ రాణాను ఓడించాడు. అభిమానుల డిష్యుం డిష్యుం -
సుశీల్‌కు రూ. 55 లక్షలు
న్యూఢిల్లీ: మూడేళ్ల తర్వాత మళ్లీ మ్యాట్‌పై అడుగు పెట్టిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ప్రొ రెజ్లింగ్ లీగ్–3లో అత్యధిక ధర పలికింది. ఇటీవలే కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన సుశీల్‌ను ఢిల్లీ సుల్తాన్స్ ఫ్రాంచైజి రూ. 55 లక్షలకు కొనుగోలు చేసింది. జనవరి 9 నుంచి ప్రొ రెజ్లింగ్ లీగ్ మూడో సీజన్ మొదలవుతుంది. శనివారం జరిగిన రెజ్లర్ల వేలం కార్యక్రమంలో మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి. రియో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సాక్షి మలిక్‌ను ముంబై మహారథి జట్టు రూ. 39 లక్షలకు సొంతం చేసుకుంది. సాక్షి మలిక్ భర్త సత్యవర్త్ కడియాన్‌ను ముంబై జట్టు రూ. 12 లక్షలకు దక్కించుకుంది. యూపీ దంగల్ జట్టు రూ. 25 లక్షలకు బజరంగ్ పూనియాను... రూ. 40 లక్షలకు వినేశ్ ఫోగట్‌ను, రూ. 28 లక్షలకు గీత ఫోగట్‌ను దక్కించుకుంది. ఇరాన్ స్టార్ రెజ్లర్ హసన్ రహీమి సబ్జాలిపై హరియాణా హ్యామర్స్ జట్టు రూ. 46 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. -
పరిశీలకుడి పదవికి సుశీల్ రాజీనామా
న్యూఢిల్లీ: ప్రముఖ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ జాతీయ క్రీడా పరిశీలకుడి (నేషనల్ స్పోర్ట్స్ అబ్జర్వర్) పదవికి రాజీనామా చేశాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) దృష్ట్యా ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తున్న అథ్లెట్లు ఈ పదవిలో ఉండరాదని కేంద్ర క్రీడాశాఖ పేర్కొన్న నేపథ్యంలో సుశీల్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. మాజీ క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ ఈ ఏడాది మార్చిలో 12 మందితో కూడిన జాతీయ పరిశీలకుల బృందాన్ని నియమించారు. అందులో భారత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ కూడా ఉంది. ఆమె కొద్ది రోజుల క్రితమే ఈ పదవికి రాజీనామా చేసింది. వీరిద్దరి రాజీనామాలను బుధవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదించింది. -
2 నిమిషాల 33 సెకన్లలో పసిడి!
ఇండోర్: జాతీయ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ పతక విజేతలు సుశీల్ కుమార్, సాక్షి మాలిక్ తోపాటు గీతా ఫొగట్ తమతమ విభాగాలలో స్వర్ణాలు సాధించారు. మూడేళ్ల విరామం తర్వాత బరిలోకి దిగిన సుశీల్‌కు ఎదురే లేకపోయింది. ఈ చాంపియన్ షిప్ లో 74 కేజీల విభాగంలో రైల్వేస్ తరపున బరిలోకి దిగిన సుశీల్ కుమార్ కు మూడు వాకోవర్ల లభించడంతో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఫైనల్ కు చేరిన ప్రవీణ్ రాణా గాయం కారణంగా చివరి నిమిషంలో తప్పుకోవడంతో సుశీల్ కు స్వర్ణం ఖాయమైంది. అంతకుముందు క్వార్టర్స్, సెమీస్ ల్లో కూడా 34 ఏళ్ల సుశీల్ కు వాకోవర్ లభించింది. అతడు ఆరంభ రౌండ్లలో ప్రత్యర్ధులను నిమిషంలోపే చిత్తుచేయగా, ఆపై వరుసగా మూడు వాకోవర్లు దక్కాయి. దాంతో ఈ విభాగంలో సుశీల్ విజేతగా నిలిచి పసిడిని దక్కించుకున్నాడు. మొత్తంగా స్వర్ణ సాధనలో సుశీల్ అన్ని రౌండ్లలో కలిపి 2 నిమిషాల 33 సెకన్లు మాత్రమే పోరాడడం గమనార్హం. మరొకవైపు సాక్షి మాలిక్, గీతా పొగట్ లు తమతమ విభాగాల్లో పసిడి పతకాలు సాధించారు. -
సుశీల్ వస్తున్నాడు
న్యూఢిల్లీ: మూడేళ్ల తర్వాత భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ‘దంగల్’లో దూకడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. 2014 గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్‌లో 74 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన తర్వాత సుశీల్ మరే టోర్నమెంట్లోనూ బరిలోకి దిగలేదు. బుధవారం ఇండోర్‌లో మొదలయ్యే జాతీయ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 34 ఏళ్ల సుశీల్ రైల్వేస్ తరఫున తన ఎంట్రీని ఖరారు చేశాడు. జార్జియాలో శిక్షణ ముగించుకొని ఆదివారం భారత్‌కు చేరుకున్న సుశీల్ సెలెక్షన్ ట్రయల్స్‌లోనూ పాల్గొని విజేతగా నిలిచాడు. మరోవైపు జాతీయ చాంపియన్‌షిప్‌లో తాను పాల్గొనడంలేదని లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్ తెలిపాడు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌తోపాటు గీత ఫోగట్, వినేశ్ ఫోగట్ కూడా జాతీయ చాంపియన్‌షిప్‌లో ఆడనున్నారు. గత ఏడాది రియో ఒలింపిక్స్ సమయంలో మరో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్, సుశీల్ కుమార్ మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచ చాంపియన్ షిప్లో కాంస్యం నెగ్గి ఒలింపిక్ బెర్త్ సంపాదించిన నర్సింగ్ యాదవ్‌ను ‘రియో’కు పంపిస్తామని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) స్పష్టం చేయగా... నర్సింగ్‌తో ట్రయల్ నిర్వహించి అందులో గెలిచిన వారిని ‘రియో’కు పంపాలని సుశీల్ కోరాడు. అయితే సుశీల్ అభ్యర్థనను డబ్ల్యూఎఫ్ఐ తిరస్కరించడం, చివరకు నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో పట్టుబడటంతో రియో ఒలింపిక్స్‌లో 74 కేజీల విభాగంలో భారత్ తరపున ఎవరూ బరిలోకి దిగలేకపోయారు. -
హీరోలు అనుకుంటున్నారు కొడుకులు!
అమ్మాయిని బస్సులో ముట్టుకుంటేనే భయంతో ఆ అమ్మాయి మళ్లీ బస్సెక్కడానికి కొన్ని రోజులు పడుతుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని మనమే ఒక మాట అనం. ఈ దరిద్రులు.. ఆమె ప్రయాణిస్తున్న ప్రతిచోటా వెంబడిస్తూనే ఉన్నారు! ఛేజ్ చేస్తూనే ఉన్నారు! బస్సు కొంత నయం... నలుగురూ ఉంటారు. ఒంటరిగా టూ వీలర్ మీదో, కారులోనో వెళుతూ అమ్మాయి కనిపిస్తే ఇక ఈ నీచులకు అడ్డూ ఆపూ ఉంటుందా? ‘ఇది తప్పురా’ అని.. ఇంట్లో వాళ్ల అమ్మ చెప్పదా? లేక.. ‘ఆంబోతులా తిరుగురా’ అని వాళ్ల నాన్న చెప్పాడా? కొవ్వుతో కలిగిన బలుపుతో కలిసిన ఈ మదాంధుల్ని చెప్పుతో కొడితే లాభం లేదు. చట్టమే వీళ్లను తన చెప్పుచేతల్లోకి తీసుకుని కొత్త మార్గంలో నడిపించేలా చేయాలి. సినిమాలు చూసో.. వాళ్ల నాయన పలుకుబడిని చూసో.. హీరోలు అనుకుంటున్నారు కొడుకులు!! వీరేందర్ సింగ్ కుందు, ఐ.ఎ.ఎస్. రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి టూరిజం డిపార్ట్మెంట్ – హర్యానా ఐ.ఎ.ఎస్.లు ఎవరూ సాధారణంగా ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖలు రాయరు. కానీ వీరేందర్ సింగ్ కుందు 2017 ఆగస్టు 6 ఆదివారం ఫేస్బుక్లో ఒక లేఖను పోస్ట్ చేశారు! అయితే ఆ లేఖను ఆయన ఒక ఐ.ఎ.ఎస్. అధికారిగా రాయలేదు. ఒక సగటు ఆడపిల్ల తండ్రిగా రాశారు. ‘నిన్న అర్ధరాత్రి నా కూతురు వర్ణికకు ఒక భయానకమైన అనుభవం ఎదురైంది. డ్యూటీ ముగించుకుని ఆమె తన కారులో ఇంటికి వస్తుండగా, ఇద్దరు గూండాలు టాటా సఫారీలో ఆమెను వెంబడించారు. నా కూతురు గుండె నిబ్బరంతో వారి నుంచి వేగంగా తప్పించుకుని, కారును వేగంగా డ్రైవ్ చూస్తూనే పోలీసులకు ఫోన్ చేసింది. ఆ తర్వాత కూడా వాళ్లు ఆమె దారిని పదే పదే అడ్డగించారు. కొన్ని కిలోమీటర్ల్ల దూరం వరకు అలా చేశారు. ఒకచోటైతే వాళ్లలో ఒకడు టాటా సఫారీలోంచి దూకేసి, నా కూతురి కారులోకి దూరే ప్రయత్నం చేశాడు. ఈ లోపు పోలీస్‌లు రావడంతో వారు పారిపోయారు. మా అమ్మాయి ధైర్యంగా అయితే తప్పించుకోగలిగింది కానీ, ఆ భయం నుంచి ఇంకా తేరుకోలేదు. అందుకు ఇంకా కొంత సమయం పట్టేలా ఉంది. ఇద్దరు కూతుళ్ల తండ్రిగా నేనీ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టాలని అనుకోవడం లేదు. ఇదంతా మీకు చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి : ఇదీ వాస్తవంగా జరిగింది అని చెప్పడం. రెండు.. ఒకవేళ అవసరమైతే మద్దతు కూడగట్టుకోవడం కోసం. ఈ పోరాటాన్ని నేను ఆపదలచుకోలేదు. దోషులకు శిక్ష పడకపోతే ఇంకా ఎంతోమంది కూతుళ్లకు ఈ దుస్థితి రావచ్చు. వాళ్లందరూ నా కూతురంత అదృష్టవంతులు కాకపోవచ్చు. అలాంటి వారి కోసం ఎవరో ఒకరు నిలబడాలి. నేను నిలబడుతున్నాను. నిలబడగలిగినంత కాలం నిలబడతాను.’ ఇదీ వీరేందర్ సింగ్ కుందు రాసిన లేఖ. సోషల్ మీడియాలో ఈ లేఖ చదివిన వాళ్లంతా ఆ గూండాలపై విరుచుకు పడ్డారు. కానీ రణవీర్ భట్టీ అనే వ్యక్తి మాత్రం వీరేందర్ సింగ్ మీద విరుచుకు పడ్డాడు! రణవీర్ భట్టి హర్యానా బీజేపీ ఉపాధ్యక్షుడు! ‘‘అసలు అంత రాత్రప్పుడు ఆ పిల్లకు రోడ్ల మీద ఏం పని?’’ అన్నది రణవీర్ భట్టీ ప్రశ్న. ఆయన ప్రశ్నకు సమాధానం కాదు కానీ.. వర్ణిక.. డిస్క్ జాకీ. ఆ వేళప్పుడే ఆమె డ్యూటీ అయిపోతుంది. రోజూ ఆ వేళప్పుడే ఆమె తన కారులో ఇంటికి బయల్దేరుతుంది. ఆమె రోజూ వెళ్లొచ్చే రోడ్డు ఒకటే. కానీ ఆ గూండాల కారణంగా ఆ రోజు రాత్రి ఆమె రోడ్లన్నిటి మీదా పరుగులు తీయాల్సి వచ్చింది.. వాళ్ల నుంచి ఎస్కేప్ అవడానికి. ఆ రోజు వర్ణికను కిడ్నాప్ చేసేందుకు వేట కుక్కల్లా వెంటపడిన ఆ ఇద్దరు ఆగంతకులలో ఒకడు వికాస్ బరాలా. హర్యానా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కొడుకు. ఇంకొడు వికాస్ స్నేహితుడు అశీష్ కుమార్. మొదట వికాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వి.ఐ.పి. కొడుకని తెలిసి వదిలేశారు. తర్వాత వర్ణిక, ఆమె తండ్రి ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం, మీడియా ఒత్తిడి తేవడంతో వికాస్‌ను అరెస్ట్ చేశారు. ఆ వెంటనే వికాస్ తండ్రి పార్టీలో తన పదవికి రాజీనామా చేశాడు. ప్రస్తుతం వర్ణిక కేసు విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా.. గతంలో విఐపీ పుత్రరత్నాలు చేసిన కొన్ని ఘనకార్యాలను ఒకసారి చూద్దాం. మార్చి 2016 సుశీల్ కుమార్ సన్నాఫ్ రావెల కిషోర్ సుశీల్ మంత్రిగారి అబ్బాయి. నాన్నగారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. బంజారా హిల్స్‌లో నడుచుకుంటూ వెళుతున్న ఒక మహిళా టీచర్‌ను సుశీల్ కారులో వెంబడించారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో నలుగురూ గుమికూడారు. పోలీసులు బాధితురాలి కంప్లైంట్ తీసుకున్నారు. సుశీల్‌పై ఐ.పి.సి. సెక్షన్ 354 మోలెస్టేషన్ కేసును నమోదు చేశారు. జూన్ 2015 రితురాజ్ సన్నాఫ్ ప్రణతి ఫుకాన్ ప్రణతి ఫుకాన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. చేనేత, జౌళి ఉత్పతులు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి. ఆమె ఉండడం అస్సాంలో. తనయుడు రితురాజ్ ఉండడం బెంగళూరులో. ఫ్రెండ్స్‌తో కలిసి ఏదో బిజినెస్ చేస్తున్నాడు. పదేళ్ల బాలికను రేప్ చేసి, ఆ చిన్నారి మరణానికి కారణం అయ్యాడన్న ఫిర్యాదుపై సంజయ్ నగర్ పోలీసులు రితురాజ్పై కేసు ఫైల్ చేశారు. బాలిక తల్లి వీళ్ల దగ్గరే ఆఫీస్ అసిస్టెంట్‌గా పని చేస్తుంటుంది. అయితే విషయాన్ని పై అధికారులు బైటకు పొక్కనీయలేదు. మంత్రి గారి కొడుకును, అతడి స్నేహితులను తప్పించే ప్రయత్నాలు జరిగాయి. జూలై 2014 సురేశ్ బదానా సన్నాఫ్ హేమ్‌సింగ్ బదానా హేమ్‌సింగ్ రాజస్థాన్ పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆయన సుపుత్రుడు సురేశ్ అల్వార్‌లోని షాలిమార్ కాలనీలోకి.. కోళ్ల గంపలోకి దూరిన పిల్లిలా.. దూరాడు. ఒక యువతిని అసభ్యంగా కామెంట్ చేశాడు. నలుగురూ పట్టుకుని తన్నబోతే కాలనీలోని 308 క్వార్టర్లోకి దూరి తలుపేసుకున్నాడు. అది నాన్నగారికి ప్రభుత్వం కేటాయించిన క్వార్టరే. ఎవరొచ్చి తలుపు తట్టినా తియ్యలేదు. అర్ధరాత్రెప్పుడో బాల్కనీ లోంచి గోడ దూకి తప్పించుకున్నాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. జూన్ 2013 ఆదర్శ్ సన్నాఫ్ జోస్ తెట్టాయిల్ అప్పటికి లె ట్టాయిల్ కేరళ అపోజిషన్ లీడర్. ఎల్.డి.ఎఫ్. పార్టీ నాయకుడు. అంతకు ముందు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి. ఆయన నియోజకవర్గం అంగమల్లి. అక్కడి ఓ యువతి ఈ తండ్రీ కొడుకులిద్దరూ తనను లైంగికంగా వేధించారని కేసు పెట్టింది. ‘అబ్బే.. అలాంటిదేమీ లేదు. నా వెనుక పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోంది’ అని తప్పించుకోబోయాడు. విశేషం ఏంటంటే.. ఈ కేసులో తండ్రే ప్రధాన నిందితుడు. కొడుకు రెండో నిందితుడు. జూలై 2011 రోహిత్ సన్నాఫ్ అటనేషియో మాన్సెరెట్ మాన్సెరెట్ గోవా విద్యాశాఖ మంత్రి. గోవాలో ఉంటున్న ఒక జర్మన్ మైనర్ బాలికను రేప్ చేసిన కేసులో 2008 నవంబరులో రోహిత్‌ను అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయికి అసభ్యకరమైన మెజేస్‌లు కూడా అతడు పంపించినట్లు రూడీ అయింది. అయితే మాన్సెరెట్ తన పలుకుబడితో కొడుక్కి శిక్ష పడకుండా కాపాడుకుంటూ వచ్చాడు. కేసు నాలుగేళ్లు నడిచింది. చివరికి కోర్టు రోహిత్‌ను నిర్దోషిగా వదిలిపెట్టింది. జనవరి 2008 తేజస్వీ, తేజ్ ప్రతాప్.. సన్స్ ఆఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో జరిగింది ఈ ఘటన. న్యూ ఇయర్ వేడుకల్లో ఆయన ఇద్దరు కుమారులు కన్నూమిన్నూ కానకుండా అమ్మాయిల్నీ వేధించారు. గుర్తు తెలియని యువకులు వారికి దేహశుద్ధి చేశారు. ఈ తోపులాటలో తేజస్వి, తేజ్ ప్రతాప్‌ల గన్‌మెన్ తుపాకీని ఎవరో లాక్కున్నారు. దానిపై కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు వీళ్ల భాగోతం అంతా బయటపడింది. ముందు అశోకా హోటల్ దగ్గర కొందరు ఆడపిల్లల్ని ఏడిపించారు. తర్వాత కన్నాట్ ప్లేస్‌లో టీజ్ చేశారు. ఢిల్లీ–హర్యానా బార్డర్‌లోని ఛతార్పూర్లో పార్టీ ఉంటే, అక్కడికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మెహ్రాలీ దగ్గర ఫామ్ హౌస్ దగ్గర అమ్మాయిల మీద చెయ్యి వేశారు. అదిగో అప్పుడే ఇద్దర్నీ పట్టుకుని లోకల్ హీరోలు కొట్టేశారు. ముఖాలు వాచిపోయాయి. ప్రథమ చికిత్స కోసం అన్నదమ్ముల్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీళ్లమీద కేసు మాత్రం నమోదు కాలేదు! ఏడుగురు అక్కచెల్లెళ్లు ఉన్న ఈ ఇద్దరు ప్రబుద్ధులు అమ్మాయిల్ని ఏడిపించడం ఏమిటో! డిసెంబర్ 2007 మిస్టర్ ‘హూ?’ గ్రాండ్ సన్ ఆఫ్ ఎ సీనియర్ లీడర్ దేశంలోని మిగతా కేసుల్లోనైనా ప్రబుద్ధులెవరో, వారి సుపుత్రులెవరో పేర్లు తెలిశాయి కానీ, పదేళ్ల క్రితం ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో జరిగిన ఆయేషా హత్య కేసులో దోషులెవరో ఇంతవరకు తేల్లేదు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ కి ఇవ్వాలా వద్దా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆయేషా హత్యను చేసింది ఓ సీనియర్ కాంగ్రెస్ లీడర్ మనవడు అన్న ఆరోపణలు వచ్చాయి. అయితే సత్యంబాబు అనే యువకుడిని హంతకుడిగా నిర్థారించి, పదేళ్ల జైలు శిక్ష తర్వాత నిర్దోషిగా ఈ ఏడాదే విడుదల చేశారు. ఇన్నేళ్లలోనూ అసలు నేరస్థుడు దొరకలేదంటే.. వెనుక వీఐపీల ప్రెజర్ ఉన్నట్లేనని అనుకోవాల్సి వస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వి.ఐ.పి.ల పుత్రరత్నాలు తమ తండ్రుల పలుకుబడితో కేసుల నుండి, శిక్షల నుండి తప్పించుకుంటున్నారు. ఈ ధోరణి వల్ల సగటు బాధితురాలు న్యాయం కోసం పోరాడే మానసిక స్థయిర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. -
ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ తరుఫున ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న టీచర్, పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ ఎంపిక చేయనున్నట్లు ఆ పార్టీ కన్వీనర్ సుశీల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పూలే, అంబేడ్కర్ల ఆశయాల స్ఫూర్తితో సామాజిక సమస్యలను పరిష్కరించే దృఢ చిత్తం కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాను allindiabcobc@gmail.comకి పంపాల్సిందిగా కోరుతున్నారు. అలాగే త్వరలో జరగబోయే కార్యవర్గం ఎన్నికల్లో పోటీ చేసే ఔత్సాహికులు తమ వివరాలను పంపొచ్చని సుశీల్ కుమార్ తెలిపారు. -
రెజ్లర్ సుశీల్ కుమార్ కొత్త ఇన్నింగ్స్!
ముంబై: ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశాన్ని ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్.. కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. తన కెరీర్ కొత్త ఇన్నింగ్స్ లో భాగంగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్యూడబ్యూడబ్యూ)తో ఒప్పందం చేసుకునేందుకు సమాయత్తమవుతున్నాడు ఈ హర్యానా రెజ్లర్. ఈ మేరకు గత అక్టోబర్‌లో డబ్యూడబ్యూడబ్యూతో పూర్తిస్థాయి చర్చలు జరిపిన సుశీల్ కుమార్.. అందుకు తాజాగా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో డబ్యూడబ్యూడబ్యూ ఈవెంట్లలో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తికనబరచని సుశీల్.. తనకు అదే సరైనదని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దీనిలో భాగంగానే డబ్యూడబ్యూతో మరొకసారి సంప్రదింపులు జరిపి తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నవంబర్ లో డబ్యడబ్యూడబ్యూ ఈవెంట్లలో సుశీల్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ది గ్రేట్ ఖలీ తరువాత వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లలో పాల్గొన్న రెండో భారత రెజ్లర్‌గా సుశీల్ నిలుస్తాడు. గతంలో రెండుసార్లు ఒలింపిక్స్ పతకాలు సాధించిన సుశీల్ కుమార్.. రియోకు వెళ్లేందుకు తనకే అర్హత ఉందంటూ భారత రెజ్లింగ్ సమాఖ్యతో పోరాడి ఓడిపోయాడు. సాంకేతికంగా నర్సింగ్ యాదవ్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడంతో సుశీల్ దూరంగా ఉండాల్సి వచ్చింది. దీనిపై సుశీల్ కడవరకూ పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 30 నుంచి 40 వరకూ ఉన్న రెజ్లర్లను షార్ట్ లిస్ట్ చేసే పనిలో పడ్డ డబ్యూడబ్యూడబ్యూ.. భారత రెజ్లర్లపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. దీనిలో్ భాగంగా సుశీల్ కుమార్ పేరు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. -
నల్లధనం వెల్లడికి చివరి అవకాశం
పీఎంజీకేవై పథకంపై ఆదాయ పన్ను శాఖ స్పష్టీకరణ - 30లోగా లెక్కల్లో చూపని నగదును బ్యాంకుల్లో జమ చేయాలి - అందులో 50 శాతాన్ని పన్నులు, సర్‌చార్జి, జరిమానాగా చెల్లించాలి - మరో 25% నిర్బంధ బాండ్ల రూపంలో 4 ఏళ్లు డిపాజిట్ చేయాలి - మిగిలిన 25 శాతాన్ని వాడుకోవచ్చు - ఈ అవకాశాన్ని వినియోగించుకోకుంటే తీవ్ర పరిణామాలు - 75 శాతం నుంచి 85 శాతం ప్రభుత్వానికే.. - ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనర్ సుశీల్ కుమార్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: నల్లధనం వెల్లడికి కేంద్రం ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై)’ పథకమే చివరి అవకాశమని ఆదాయ పన్ను శాఖ హైదరాబాద్ విభాగం చీఫ్ కమిషనర్ సుశీల్‌కుమార్ స్పష్టం చేశారు. నల్లధనం ఉన్నవారు ఈ నెల 30లోగా వెల్లడిం చాలని, ఆ తర్వాత కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సోమవారం ఆదాయపన్ను శాఖ డైరెక్టర్ జనరల్ నీనా నిగమ్, చీఫ్ కమిషనర్ ఎం.రవీంద్ర సాయిలతో కలసి హైదరాబాద్‌లోని ఆదాయ పన్ను శాఖ కార్యా లయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నోట్ల రద్దు తర్వాత స్వాధీనం చేసుకున్న నల్లధనాన్ని పేదల సంక్షేమానికి వినియోగిం చేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిం దన్నారు. ఆయన చెప్పిన వివరాలు.. ► ఈ పథకం కింద నల్లధనాన్ని బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో జమ చేసేందుకు ఈనెల 30 వరకు అవకాశం ఉంటుంది. నల్లధనాన్ని ప్రకటించేవారు తొలుత లెక్క చూపని నగదు లేదా డిపాజిట్ నుంచి 50 శాతాన్ని పన్ను, సర్‌చార్జీ, జరిమానాల కింద ప్రభుత్వానికి చెల్లించాలి. ► మరో 25 శాతాన్ని నాలుగేళ్ల నిర్బంధ కాల వ్యవధి గల పీఎంజీకేవై బాండ్ల రూపంలో బ్యాంకుల్లో జమ చేయాలి. ఈ సొమ్మును 4 ఏళ్ల తర్వాతే తిరిగి తీసుకోవడానికి వీలుంటుంది, ఈ సొమ్ముకు వడ్డీ కూడా ఉండదు. మిగతా 25శాతాన్ని దరఖాస్తు దారులు ఎప్పుడైనా వాడుకోవచ్చు. ► లెక్కల్లో చూపని ధనంపై చెల్లించిన 50 శాతం పన్ను, సర్‌చార్జి, జరిమానాల రసీదులు, మరో 25 శాతాన్ని పీఎంజీవైకే బాండ్ రూపంలో జమ చేసిన పత్రాలుంటేనే.. పీఎంజీకేవై కింద నల్లధనం/ఆదాయ వెల్లడికి దరఖాస్తులను స్వీకరిస్తారు. ► ఆదాయ పన్ను కమిషనర్ ముందు 2017 మార్చి 31వ తేదీలోపు ‘ఫార్మ్–1’ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్వచ్ఛంద నల్లధన వెల్లడి కోసం గతంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) కింద కొందరు వ్యక్తులు నల్ల ధనం లేకపోయినా ఉన్నట్లు బోగస్ దరఖా స్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. దాంతో ఈసారి తొలుత పన్నులు, జరిమా నాలు చెల్లించాకే పీఎంజీకేవై కింద దరఖాస్తులు స్వీకరిస్తోంది. ► ఈ పథకం నగదు రూపంలో ఉన్న నల్లధనానికే వర్తిస్తుంది. స్థిరాస్తులు, చరాస్తులు, బంగారంగా ఉన్న ఆస్తులకు వర్తించదు. విదేశా ల్లోని ఆదాయం, ఆస్తుల ప్రకటనకు కూడా వర్తించదు. ► ఈ పథకం కింద స్వీకరించిన దరఖాస్తులను 21 నెలల్లో పరిష్కరిస్తారు. ► పీఎంజీకేవై కింద నల్లధనాన్ని ప్రకటించిన వ్యక్తుల వివరాలను ప్రభుత్వం రహస్యంగా ఉంచనుంది. ఈ పథకం కింద లబ్ధిపొందిన వ్యక్తులకు నేర కార్యకలాపాల చట్టాలు మినహా ఇతర అన్ని రకాల చట్టాల కింద విచారణ నుంచి ప్రత్యేక రక్షణ (ఇమ్యూనిటీ) సైతం లభించనుంది. నల్లధనాన్ని పట్టించేందుకు ఈ–మెయిల్ నల్ల కుబేరు లకు సంబంధించిన ఆస్తులు, ఆదాయానికి సంబంధించిన సమాచారం ఎవరి వద్దనైనా ఉంటే తమకు తెలపాలని ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనర్ సుశీల్‌కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదాయ పన్ను శాఖ మెయిల్ ఐడీ (blackmoneyinfo@incometax.gov.in)కు ఈ–మెయిల్ ద్వారా సమాచారం పంపాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో కఠిన చర్యలు నల్లధనం ఉండీ పీఎంజీకేవై పథకం కింద ప్రకటించని వారు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనర్ సుశీల్ కుమార్ స్పష్టం చేశారు. అవి.. ► నల్లధనం ప్రకటించని వ్యక్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016–17) సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నులను 2017 జూన్‌లోగా దాఖలు చేయవచ్చు. అయితే లెక్కలో చూపని నల్లధనాన్ని ఆదాయ పన్ను రిటర్న్‌లో చూపితే అందులో 60 శాతం పన్ను, 15 శాతం సర్‌చార్జి కలిపి మొత్తం 75 శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ► ఒకవేళ లెక్కలో చూపని ఆదాయాన్ని ఆదాయ పన్ను విభాగమే గుర్తిస్తే.. పైన పేర్కొన్న 75 శాతానికి మరో 10 శాతం జరిమానా కలిపి మొత్తం 85 శాతం వసూలు చేస్తారు. దీంతోపాటు 7 ఏళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. వీరికి ఈ పథకం వర్తించదు.. చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా నల్లధనాన్ని సంపాదించిన వ్యక్తులకు పీఎంజీకేవై వర్తించదు. నేర కార్య కలాపాలైన స్మగ్లింగ్, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, బినామీ లావాదేవీలు, మనీలాండరింగ్, 1992 సెక్యురిటీ స్కాం, ఐపీసీలోని 9వ అధ్యాయం ప్రకారం శిక్షార్హమైన నేరాలు(ప్రభుత్వ ఉద్యోగులు చట్ట వ్యతిరేకంగా వ్యాపారం చేయుట, చట్ట వ్యతిరేకంగా కొనుగోళ్లు, చట్ట వ్యతిరేకంగా వేలంలో పాల్గొనుట వంటి వి), ఐపీసీ అధ్యాయం 17 ప్రకారం శిక్షార్హమైన నేరాలైన దొంగతనం, దోపిడీ లు, బెదిరించి వసూళ్లు, హత్యల ద్వారా సంపాదించిన ఆస్తులను ఈ పథకం కింద ప్రకటించడానికి వీలులేదు. -
నర్సింగ్ నిషేధంపై సుశీల్ ఏమన్నాడంటే..
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ ముందు రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ వివాదంలో చిక్కుకోవడానికి మరో రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉందనే వాదన బలంగా వినిపించింది. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏమీ లభించలేదు. కాగా, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా).. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో చేసిన సవాల్‌తో నర్సింగ్పై నాలుగేళ్ల నిషేధం పడింది. దాంతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండానే నర్సింగ్ నిష్క్రమించాడు. అయితే నర్సింగ్ యాదవ్ నిషేధంపై సుశీల్ కుమార్ మరోసారి పెదవి విప్పాడు. ఆ నిషేధాన్ని వాడా పునఃసమీక్షిస్తే నర్సింగ్ యాదవ్ కు ఊరట లభిస్తుందన్నాడు. అతనిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలన్నా, లేక తగ్గించాలన్ని అది కేవలం వాడా చేతుల్లోనే ఉందన్నాడు. ఏ ఒక్క రెజ్లర్ నిషేధానికి గురైనా అతని కెరీర్ దాదాపు ముగిసిపోయేట్ల్లేనని, అదే క్రమంలో రూల్స్ ద్వారా లబ్ధి పొందే అవకాశం కూడా లేకపోలేదన్నాడు. ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్ నుంచి తాను అన్యూహ్యంగా వైదొలగడం మాత్రం ఇప్పటికీ క్షమించరానిదేనని సుశీల్ పేర్కొన్నాడు. తాను ఒలింపిక్స్ లో పాల్గొనకుండా వైదొలిగిన తీరును ఎప్పటికీ మరిచిపోలేనన్నాడు. -
నా కెరీర్ ఏమవుతుందో : సుశీల్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో తనకు అవకాశం కల్పించక పోవడంపై భారత రెజ్లర్ సుశీల్ కుమార్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశాడు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్ లో భారత్‌కు పతకాలు అందించిన ఏకైక ప్లేయర్ సుశీల్. రియో వివాదం తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడాడు. రియోలో పాల్గొనక పోవడం తన కెరీర్ పై ఎంతో ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డాడు. రియో ఒలింపిక్స్ కోసం ఎంతగానో శ్రమించానని చెప్పాడు. వరుసగా మూడో ఒలింపిక్స్ లో పాల్గొని దేశానికి తన వంతుగా మూడో పతకం సాధించాలన్న తన ఆకాంక్షను నెరవేరలేదని వాపోయాడు. దేశ అత్యున్నత మూడో పౌర పురస్కారానికి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) తన పేరును ప్రతిపాదించడంపై హర్షం వ్యక్తం చేశాడు. డబ్ల్యూఎఫ్ఐ ఇప్పటికైనా తన విజయాలను గుర్తించిందన్నాడు. రష్యా రెజ్లర్ బేసిక్ కుదుకోవ్ డోపీగా తేలడంతో లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన యోగేశ్వర్ దత్ రజతానికి అప్ డేట్ అవడంపై సుశీల్ స్పందించాడు. యోగేశ్వర్ కు అభినందనలు తెలిపాడు. ఆ పతకం కుదుకోవ్ కుటుంబం వద్ద ఉంటడమే కరెక్ట్ అని చెప్పి యోగేశ్వర్ మానవత్వాన్ని చాటుకున్నాడని ప్రశంసించాడు. 74 కేజీల విభాగంలో భారత్ నుంచి నర్సింగ్ యాదవ్ ను రియోకు పంపించగా నాటకీయ రీతిలో డోపింగ్ కారణాలతో అవకాశం ఇవ్వకపోగా, నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
పద్మభూషణ్‌కు సుశీల్ పేరు
న్యూఢిల్లీ: ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్ పేరును ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి నామినేట్ చేశారు. వ్యక్తిగత విభాగంలో రెండు సార్లు ఒలింపిక్స్ పతకం అందుకున్న ఏకై క అథ్లెట్‌గా 33 ఏళ్ల సుశీల్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అలాగే సుశీల్‌తో పాటు అతడి కోచ్ యశ్వీర్ సింగ్, మహిళా రెజ్లర్ అల్కా తోమర్ పేర్లను కూడా దేశ అత్యున్నత మూడో పౌర పురస్కారానికి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) ప్రతిపాదించింది. ఈ మగ్గురి పేర్లను గత నెలలోనే కేంద్రానికి పంపినట్టు సమాఖ్య సహాయక కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు. రెండేళ్ల క్రితమే సుశీల్ పేరును ఈ పురస్కారానికి పంపినా తిరస్కరించారు. -
పద్మభూషణ్‌కు సుశీల్ పేరు సిఫారసు
న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్‌కు పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అలాగే సుశీల్ కోచ్ యశ్వీస్ సింగ్‌కు, మహిళా రెజ్లర్ అల్కా తోమర్‌కు పద్మశ్రీ అవార్డులు బహూకరించాలని కేంద్ర క్రీడల శాఖను కోరింది. సుశీల్ బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, లండన్ గేమ్స్‌లో రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఈవెంట్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత క్రీడాకారుడిగా సుశీల్ చరిత్ర సృష్టించాడు. 15 సార్లు ప్రపంచ బిలియర్డ్స్, స్నూకర్ చాంపియన్ పంకజ్ అద్వానీ పేరును పద్మభూషణ్ అవార్డుకు ప్రతిపాదించారు. ఇటీవల ఖేల్ రత్న అవార్డు అందుకున్న షూర్ జూతూరాయ్తో పాటు టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ పేర్లను పద్మశ్రీకి ప్రదిపాదించారు. -
'భారత రెజ్లర్ స్వర్ణం నెగ్గుతాడు'
లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన యోగేశ్వర్‌దత్ పై భారత అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. భారత కాలమాన ప్రకారం ఆదివారం సాయంత్రం జరుగనున్న 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో బరిలోకి దిగనున్న రెజ్లర్ యోగేశ్వర్ స్వర్ణాన్ని నెగ్గుతాడని మరో భారత రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల వీరుడు సుశీల్ కుమార్ ధీమా వ్యక్తంచేశాడు. హరియాణాకు చెందిన యోగేశ్వర్ దత్ కు తన చిన్ననాటి స్నేహితుడు సుశీల్ బెస్ట్ విషెస్ చెప్పాడు. భారత్ మొత్తం అతడికి అండగా ఉంటుందన్నాడు. పతకాలను సాధించి దేశం గర్వించేలా చేసిన మహిళా అథ్లెట్లు పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్, పతకం కోసం చివరివరకు పోరాడిన దీపా కర్మాకర్ రియోలో అద్భుత ప్రదర్శన చేశారని కొనియాడాడు. ఎన్నో ఆశలతో రియోకు వెళ్లిన మరో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ వివాదంతో బరిలోకి దిగక ముందురోజే వెనుదిరగాల్సి రావడంతో యోగేశ్వర్ పతకావకాశాలపై ప్రభావం చూపుతుందని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
సుశీల్ చేసిన తప్పేంటి?
రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతకం కోసం58 ఏళ్ల ఎదురు చూపులకు తెరదించడం అతను చేసిన నేరమా? వరుసగా రెండు ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించడం అతను చేసిన తప్పా? ఏం చేశాడని ఈ వివక్ష...? ఎందుకు సుశీల్ కుమార్‌ను ఇంత దారుణంగా అవమానించారు? దేశానికి బెర్త్ తెచ్చింది నర్సింగ్ యాదవ్ కాబట్టి... అతడినే రియో ఒలింపిక్స్‌కు పంపిస్తామంటే... సహజ న్యాయాన్ని పాటిస్తున్నారులే అని సరిపెట్టుకున్నాం... కానీ నర్సింగ్ డోపింగ్‌లో దొరికన తర్వాత అతని స్థానంలో మరో ఆటగాడిని పంపించే అవకాశం ఉన్నా... సుశీల్‌ను కాదన్నారంటే దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లలో మువ్వన్నెలను రెపరెపలాడించి, దేశానికి కీర్తి తెచ్చిన ఆటగాడిని ఇంత దారుణంగా అవమానిస్తారా? దేశ ప్రయోజనాల కంటే తమ స్వార్థానికే పెద్దపీట వేసే పెద్దలు ఆటను నడుపుతారా? ఒలింపిక్స్‌కు ముందు దేశంలో రె జ్లింగ్లో జరిగిన పరిణామాలు క్రీడారంగానికి ఏ మాత్రం మేలు చేసేవి కావు. సాక్షి క్రీడావిభాగం ‘లండన్‌లో దక్కని స్వర్ణాన్ని రియోలో సాధిస్తా... ‘పసిడి’ ప్రయత్నాలకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెడతా’ నాలుగేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న వెంటనే భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలివి. అయితే రెజ్లింగ్‌ను 2020 టోక్యో ఒలింపిక్స్ నుంచి తొలగిస్తున్నామంటూ 2013 ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అయితే రెజ్లింగ్ ఒలింపిక్స్‌లో కొనసాగించాలనే పట్టుదలతో యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ కొత్త తరహా ఆలోచనలతో ముందుకు వచ్చింది. వెయిట్ కేటగిరీలను మార్చడం, ఈ క్రీడను సులభంగా అర్ధం చేసుకొనేలా నిబంధనలను రూపొందిం చడం, ఒలింపిక్స్‌లో పురుషులతోపాటు మహిళా రెజ్లర్లకు కూడా సమానంగా స్వర్ణాలు లభించేలా చేయడం లాంటివి ఇందులో భాగమే. ఈ మార్పులను 2016 రియో ఒలింపిక్స్ నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. దాంతో సుశీల్ పోటీపడే 66 కేజీల విభాగం, యోగేశ్వర్ దత్ పాల్గొనే 60 కేజీల విభాగం ఒలింపిక్స్‌లో లేకుండా పోయాయి. వీటి స్థానంలో కొత్తగా 65 కేజీల విభాగం వచ్చింది. లండన్ ఒలింపిక్స్‌లో 60 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గిన యోగేశ్వర్ దత్ అవకాశాలు దెబ్బ తినకూడదనే ఉద్దేశంతో సుశీల్ 74 కేజీల విభాగానికి మారిపోయాడు. యోగేశ్వర్ 65 కేజీల విభాగంలో పోటీపడాలని నిర్ణయించుకున్నారు. 2013 సెప్టెంబరులో నిర్వహించిన ఓటింగ్‌లో రెజ్లింగ్‌కు అత్యధిక ఓట్లు రావడంతో 2020, 2024 ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ఐఓసీ ప్రకటించింది. రెండో అవకాశం లేకుండా: సుశీల్ కొత్తగా మారిన 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ అప్పటికే నిలకడగా రాణిస్తున్నాడు. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో సుశీల్ 74 కేజీల విభాగంలో పోటీపడి స్వర్ణాన్ని సాధించాడు. అదే ఏడాది ఇంచియాన్ ఆసియా క్రీడలకు సుశీల్ దూరంగా ఉండటంతో... అతని స్థానంలో బరిలోకి దిగిన నర్సింగ్ కాంస్య పతకాన్ని నెగ్గాడు. ఆ తర్వాత సుశీల్ భుజం గాయం కారణంగా మరే అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనకున్నా ఒలింపిక్స్ సన్నాహాలను మాత్రం కొనసాగించాడు. 2015 సెప్టెంబరులో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల సమయానికి సుశీల్ కోలుకోకపోవడంతో నర్సింగ్ 74 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిం చాడు. కాంస్యాన్ని సాధించడంతోపాటు భారత్‌కు ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఒకసారి ఒక వెయిట్ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్ ఖాయమైతే ఆ కేటగిరీలో ఆ దేశానికి మరోసారి పోటీపడే అవకాశం ఉండ దు. నర్సింగ్ ఒలింపిక్ బెర్త్ సంపాదించడంతో 74 కిలోల విభాగంలో సుశీల్‌కు ఒలింపిక్ బెర్త్ సాధించే అవకాశం లేకుండా పోయింది. తేడా ఎక్కడ వచ్చిదంటే: నర్సింగ్ ఒలింపిక్ బెర్త్ తెచ్చినా రెండు ఒలింపిక్ పతకాలు నెగ్గిన సుశీల్ కూడా ఇదే విభాగంలో పోటీ పడుతుండటంతో రియోకు ఎవరు వెళ్తారనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ విషయాన్ని సుశీల్ కుమార్ వర్గం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ దృష్టికి తెచ్చింది. అప్పటికి ఒలింపిక్స్‌కు ఏడాది సమయం ఉండటంతో... రియోకు ఎవరిని పంపించాలి అనే విషయం ట్రయల్స్ ద్వారా నిర్ణయిస్తామని సుశీల్ వర్గానికి బ్రిజ్‌భూషణ్ హామీ ఇచ్చారు. దాంతో ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు. అయితే 2015 డిసెంబరులో భారత్‌లో తొలిసారి ప్రొ రెజ్లింగ్ లీగ్‌ను నిర్వహించారు. సుశీల్‌ను ఉత్తర్‌ప్రదేశ్ వారియర్స్ ఫ్రాంచైజీ రూ. 38.20 లక్షలకు కొనుగోలు చేసింది. మరోవైపు యోగేశ్వర్ దత్, ఇద్దరు విదేశీ మహిళా రెజ్లర్లకు సుశీల్ కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేయడం ఆశ్చర్యపరచింది. ప్రొ రెజ్లింగ్ లీగ్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు సుశీల్ గాయం కారణంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించడం తో లీగ్ నిర్వాహకులు షాక్ తిన్నారు. సుశీల్ గైర్హాజరీలో లీగ్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. సుశీల్ కారణంగానే లీగ్‌కు దెబ్బ పడిందని నిర్వాహకులతోపాటు బ్రిజ్‌భూషణ్ భావించారు. అసలు విలన్ ఆయనే: లీగ్ ముగిశాక జరిగిన ఒలింపిక్ అర్హత టోర్నీల ద్వారా భారత్‌కు ఎనిమిది బెర్త్‌లు ఖాయమయ్యాయి. మరోవైపు ఒలింపిక్స్ గడువు సమీపిస్తుండటంతో ట్రయల్స్ గురించి బ్రిజ్‌భూషణ్‌ను సుశీల్ వర్గం వాకబు చేసింది. అయితే ప్రొ రెజ్లింగ్ లీగ్ సమయంలో సుశీల్ చివరి నిమిషంలో వైదొలిగిన విషయాన్ని మనసులో పెట్టుకున్న డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు ఒలింపిక్ బెర్త్ సంపాదించిన నర్సింగ్ యాదవే 74 కేజీల విభాగంలో పాల్గొంటాడని, గతంలోనూ బెర్త్ సాధించినవారే ఒలింపిక్స్‌కు వెళ్లారని, ట్రయల్స్ నిర్వహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ట్రయల్స్ నిర్వహిస్తామని గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని సుశీల్ వర్గం గుర్తు చేసినా ఫలితం లేకపోయింది. సుశీల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం, అక్కడా అతనికి నిరాశ ఎదురుకావడంతో ఈ స్టార్ రెజ్లర్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే ఆశలను వదులుకున్నాడు. ప్రత్యామ్నాయ అవకాశం ఉన్నా... అనుకోకుండా నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికిపోవడం... అతనిపై తాత్కాలిక నిషేధం పడటంతో 74 కేజీల విభాగంలో బెర్త్ ఖాళీ అయింది. నర్సింగ్ స్థానంలో వేరే రెజ్లర్‌ను పంపించే వెసులుబాటు ఉందని యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ భారత సమాఖ్యకు, ఒలింపిక్ సంఘానికి సమాచారం అందించింది. అయితే సుశీల్‌ను పంపించే అవకాశం ఉన్నా... రెజ్లింగ్ సమాఖ్య ఈ స్టార్ రెజ్లర్‌ను విస్మరించి అంతగా అనుభవం లేని ప్రవీణ్ రాణా పేరును ఖాయం చేసింది. తద్వారా సుశీల్‌ను రియోకు పంపించకూడదనే తన మాట ను బ్రిజ్‌భూషణ్ నెగ్గించుకున్నారు. నర్సింగ్పై నిజంగానే కుట్ర జరి గిందా లేదా అనే విషయంపై రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశమున్నా... రెజ్లింగ్ సమాఖ్య రాజకీయాలకు సుశీల్ భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. పంతానికి పోకుండా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమాఖ్య ట్రయల్స్ నిర్వహించి ఉంటే ఈ వివాదం ఇక్కడి వరకు వచ్చేదే కాదు. మరో పతకం గెలిచే సత్తా ఉన్న సుశీల్‌ను కాదని ఒక జూనియర్‌ను పంపిస్తున్న భారత్ పతకంపై ఆశలు పెట్టుకునే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. -
'అప్పుడే నన్ను వీడ్కోలు చెప్పమన్నారు'
న్యూఢిల్లీ:ఒలింపిక్స్‌లో దేశం తరపున ఒక పతకం సాధించడమే అరుదు. అటువంటిది వరుసగా రెండు ఒలింపిక్స్ల్లో పాల్గొని పతకాలు సాధించడమంటే సాధారణ విషయం కాదు. 2008 బీజింగ్ ఒలింపిక్స్, 2012 లండన్ ఒలింపిక్స్ లలో పతకాలు సాధించిన ఘనత రెజ్లర్ సుశీల్ కుమార్‌ది. దీంతో భారత తరపున రెండు పతకాలు సాధించిన ఏకైక రెజ్లర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కాగా, 2008 ఒలింపిక్స్ తరువాత సుశీల్‌ను కొంతమంది రెజ్లింగ్ నుంచి వీడ్కోలు చెప్పమని సలహా ఇచ్చారట. ఈ విషయాన్ని సుశీల్ తాజాగా వెల్లడించాడు. 'బీజింగ్ ఒలింపిక్స్ తరువాత ఇంటికొచ్చిన నాకు చేదు అనుభవం ఎదురైంది. ఆ ఒలింపిక్స్‌తో ఇక రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పమని కొంతమంది సలహా ఇచ్చారు. దీంతో ఎటూ తోచని అయోమయ పరిస్థితికి గురయ్యా. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ తరువాత తిరిగి లండన్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టి స్వర్ణ పతకాన్ని సాధించే అవకాశాన్ని తృటిలో కోల్పోయా. నా అత్యుత్తమ పోటీని ఇవ్వలేకపోవడం వల్లే పసిడి కోల్పోయా. అయినప్పటికీ రెండు సార్లు పోడియం పొజిషన్ సాధించడం తృప్తిగా ఉంది' అని సుశీల్ కుమార్ పేర్కొన్నాడు. ఈసారి జరిగే రియో ఒలింపిక్స్‌లో సుశీల్ కు అవకాశం దక్కని సంగతి తెలిసిందే. 74 కేజీల విభాగంలో మరో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ అర్హత సాధించడంతో సుశీల్ అవకాశాలు దెబ్బతిన్నాయి. అయితే దీనిపై నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్ నిర్వహించాలన్న వాదనను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్యూఎఫ్ఐ) తోసిపుచ్చింది. దీంతో సుశీల్ స్థానం దక్కలేదు. -
సుశీల్‌కు అవకాశం దక్కలేదు..
న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్‌లో భాగంగా రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్ నిర్వహించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మరో రెజ్లర్ సుశీల్ కుమార్ కు నిరాశే ఎదురైంది. నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్ నిర్వహించాలన్న సుశీల్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఒలింపిక్స్ కు సమయం దగ్గరకొస్తున్న సమయంలో ఇద్దరు రెజ్లర్లకు ట్రయల్స్ నిర్వహించడం సమంజసం కాదన్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్యూఎఫ్ఐ) వాదనను హైకోర్టు సమర్థించింది. ఒకవేళ ట్రయల్స్ నిర్వహించిన క్రమంలో అథ్లెట్ కు గాయమైతే అది ఒలింపిక్స్ కు వెళ్లే భారత రెజ్లర్ల బృందంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న డబ్యూఎఫ్ఐ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. వాస్తవానికి రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో పాల్గొంటామని ఇద్దరు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ పోటీ పడ్డారు. భారత్ తరఫున ఈ కేటగిరిలో సుశీల్ (ఢిల్లీ), నర్సింగ్ (ముంబై) అత్యుత్తమ రెజ్లర్లు కాగా, కేవలం ఒకరికి మాత్రమే ఒలింపిక్ బెర్త్ దక్కుతుంది. గతేడాది లాస్వేగాస్లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ యాదవ్ 74 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గడంతోపాటు టాప్-6లో నిలిచి భారత్ కు ఆ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఆ ఈవెంట్‌కు వెళ్లాల్సిన సుశీల్ గాయం కారణంగా తప్పుకోవడంతో నర్సింగ్ ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్నాడు. ఒకసారి ఒక దేశానికి బెర్త్ దక్కాక... మరో క్రీడాకారుడు ఒలింపిక్ బెర్త్ కోసం పోటీపడకూడదు. గతంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు పతకాలు తెచ్చానని తనకు ఈసారి మరో అవకావం ఇవ్వాలని సుశీల్ పట్టుబట్టినా.. నిబంధనల ప్రకారం నర్సింగ్ యాదవ్ కు అవకాశం కల్పించారు. దీంతో రియో ఒలింపిక్స్‌కు భారత్ తరఫున పంపే రెజ్లర్ ఎంపిక కోసం సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలంటూ సుశీల్ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. -
హైకోర్టులో సుశీల్‌కు నిరాశ
ఢిల్లీ:రియో ఒలింపిక్స్‌లో భాగంగా రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌తో సెలక్షన్ ట్రయల్ నిర్వహించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మరో రెజ్లర్ సుశీల్ కుమార్‌కు నిరాశే ఎదురైంది. ఈ వ్యవహారంలో తమ జోక్యం అనవరసమని మంగళవారం విచారణ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. ఇద్దరు రెజ్లర్లకు ట్రయల్ నిర్వహించే అంశంలో తాము కల్పించుకోలేమని పేర్కొంది. 'గతంలో సుశీల్ చాలా సాధించాడు. కానీ రియోకు వెళ్లడానికి ఇది గ్రౌండ్ కాదు. ఒలింపిక్స్‌కు ఎవరిని పంపాలనే అంశంపై డబ్యూఎఫ్ఐకు అధికారం ఉంది. ఇదే సందర్భంలో నర్సింగ్ యాదవ్ ప్రదర్శనను తక్కువగా చూడొద్దు. అటు న్యాయంగా చూసినా, నైతికంగా చూసినా నర్సింగ్ లేకుండా మీ బెర్తుపై హామీ లేదు కదా' అని సుశీల్ కుమార్‌ను జడ్జి ప్రశ్నించారు. దేశంకోసం సుశీల్ చాలా సాధించినా, ఇలా ట్రయల్ నిర్వహించాలని కోరుతూ నర్సింగ్ యాదవ్ ను చిన్నబుచ్చటం తగదని పేర్కొన్నారు. రియో బెర్తుపై ఏమైనా అనుమానాలుంటే డబ్యూఎఫ్ఐతోనే తేల్చుకోవాలని సూచించారు. గతేడాది లాస్వేగాస్లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ యాదవ్ 74 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గడంతోపాటు టాప్-6లో నిలిచి భారత్ కు ఆ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఆ ఈవెంట్‌కు వెళ్లాల్సిన సుశీల్ గాయం కారణంగా తప్పుకోవడంతో నర్సింగ్ ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్నాడు. ఒకసారి ఒక దేశానికి బెర్త్ దక్కాక... మరో క్రీడాకారుడు ఒలింపిక్ బెర్త్ కోసం పోటీపడకూడదు. గతంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు పతకాలు తెచ్చానని తనకు ఈసారి మరో అవకావం ఇవ్వాలని సుశీల్ కోరడంతో వివాదం ముదిరింది. -
సుశీల్ కుమార్ తప్పు చేస్తున్నాడు..!
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌లో ‘రియో ఒలింపిక్’ బెర్త్ వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఓవైపు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు చివరి ప్రయత్నంగా స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. మరోవైపు.. 74 కేజీల విభాగంలో తానే బెస్ట్ అని రెజ్లర్ నర్సింగ్ యాదవ్ అంటున్నాడు. సుశీల్ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నర్సింగ్ మీడియాతో మాట్లాడాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిర్ణయాన్ని గౌరవించాలని సుశీల్ కు సూచించాడు. డబ్ల్యూఎఫ్ఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ ఇద్దరికి ట్రయల్స్ నిర్వహించాలని కోరుతూ సుశీల్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడాన్ని రియో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ తప్పుబట్టాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య ఏ నిర్ణయం తీసుకున్నా సరే.. అందుకు తాను కట్టుబడి ఉంటానని నర్సింగ్ యాదవ్ స్పష్టచేశాడు. అసలు ఈ విషయంలో సుశీల్ కుమార్ కోర్టుకు వెళ్లవలసిన అవసరం ఏముందని వ్యాఖ్యానించాడు. ఇప్పటికే సుశీల్ తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర క్రీడా శాఖ, భారత ఒలింపిక్ సంఘం, రెజ్లింగ్ సమాఖ్య ప్రతినిధులకు అభ్యర్థించగా, ఎవ్వరి నుంచి కూడా సానుకూల స్పందన రాలేదన్న విషయం తెలిసిందే. దీంతో సుశీల్ చివరగా న్యాయస్థానంలోనే న్యాయం జరగుతుందని ట్రయల్స్ కోసం కోర్టుకు వెళ్లగా, అతడి నిర్ణయాన్ని నర్సింగ్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. -
కోర్టుకెక్కిన రెజ్లర్ సుశీల్ కుమార్
న్యూఢిల్లీ:భారత రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ ల మధ్య చోటు చేసుకున్న రియో ఒలింపిక్స్ బెర్తు గొడవ ఇప్పట్లో సమసిపోయేలా లేదు. తాజాగా రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ను 74 కేజీల విభాగంలో రియో సన్నాహక శిబిరానికి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్యూఎఫ్ఐ) ఎంపిక చేయడంతో వివాదం మరింత తారస్థాయికి చేరింది. బుధవారం నుంచి హరియాణాలోని సోన్పేట్లో భారత రెజ్లింగ్ రియో సన్నాహకాల్లో ఆరంభమవుతున్న నేపథ్యంలో నర్సింగ్ యాదవ్ పేరును డబ్యూఎఫ్ఐ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సుశీల్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తమలో ఎవరు భారత్‌కు ప్రాతినిథ్యం వహించాలో తేల్చాలంటూ కోర్టును కోరాడు. 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సుశీల్.. ట్రయల్ ఆధారంగానే తుది ఎంపిక జరగాలని పట్టుబడుతున్నాడు. వాస్తవానికి రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో పాల్గొంటామని ఇద్దరు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ లు పోటీ పడ్డారు. భారత్ తరపున ఈ కేటగిరిలో సుశీల్ (ఢిల్లీ), నర్సింగ్ (ముంబై) అత్యుత్తమ రెజ్లర్లు కాగా, కేవలం ఒకరికి మాత్రమే ఒలింపిక్ బెర్త్ దక్కుతుంది. గతేడాది లాస్వేగాస్లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ యాదవ్ 74 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గడంతోపాటు టాప్-6లో నిలిచి భారత్ కు ఆ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఆ ఈవెంట్‌కు వెళ్లాల్సిన సుశీల్ గాయం కారణంగా తప్పుకోవడంతో నర్సింగ్ ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్నాడు. ఒకసారి ఒక దేశానికి బెర్త్ దక్కాక... మరో క్రీడాకారుడు ఒలింపిక్ బెర్త్ కోసం పోటీపడకూడదు. గతంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు పతకాలు తెచ్చానని తనకు ఈసారి మరో అవకావం ఇవ్వాలని సుశీల్ కోరుతున్నాడు. -
సుశీల్ కుమార్‌కు ఆశాభంగం
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ బెర్తును ఆశించిన భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అతని స్థానంలో మరో రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ను ఎంపిక చేస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్యూఎఫ్ఐ) తాజాగా నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి సోన్పేట్లో భారత రెజ్లింగ్ రియో సన్నాహకాల్లో ఆరంభమవుతున్న నేపథ్యంలో సుశీల్ కుమార్-నర్సింగ్ యాదవ్‌ల రియో బెర్తుపై నెలకొన్న వివాదానికి డబ్యూఎఫ్ఐ ఎట్టకేలకు తెరదించింది. వాస్తవానికి రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో పాల్గొంటామని ఇద్దరు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ పోటీ పడ్డారు. భారత్ తరఫున ఈ కేటగిరిలో సుశీల్ (ఢిల్లీ), నర్సింగ్ (ముంబై) అత్యుత్తమ రెజ్లర్లు కాగా, కేవలం ఒకరికి మాత్రమే ఒలింపిక్ బెర్త్ దక్కుతుంది. గతేడాది లాస్వేగాస్లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ యాదవ్ 74 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గడంతోపాటు టాప్-6లో నిలిచి భారత్ కు ఆ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఆ ఈవెంట్‌కు వెళ్లాల్సిన సుశీల్ గాయం కారణంగా తప్పుకోవడంతో నర్సింగ్ ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్నాడు. ఒకసారి ఒక దేశానికి బెర్త్ దక్కాక... మరో క్రీడాకారుడు ఒలింపిక్ బెర్త్ కోసం పోటీపడకూడదు. గతంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు పతకాలు తెచ్చానని తనకు ఈసారి మరో అవకావం ఇవ్వాలని సుశీల్ పట్టుబట్టినా.. నిబంధనల ప్రకారం నర్సింగ్ యాదవ్ కు అవకాశం కల్పించారు. '74 కేజీల విభాగంలో సుశీల్-నర్సింగ్ల మధ్య ట్రయల్స్ నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ అందలేదు. అందుజేత నర్సింగ్ యాదవ్ ను ఈ కేటగిరీ నుంచి రియో సన్నాహకానికి ఎంపిక చేశాం. నిబంధనల మేరకు నర్సింగ్ యాదవ్ ఎంపిక జరిగింది. రాబోవు రోజుల్లో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా?అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ సుశీల్ రియో సన్నాహకాలకు వస్తానంటే కాదనం 'అని డబ్యూఎఫ్ఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
రెజ్లింగ్ ట్రయిల్స్ నిర్వహించండి: సుశీల్ కుమార్
న్యూఢిల్లీ : రెజ్లర్ సుశీల్ కుమార్ శుక్రవారం కేంద్ర కీడ్రాశాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్‌కు లేఖ రాశాడు. రెజ్లింగ్ ట్రయిల్స్ నిర్వహించాలంటూ అతడు తన లేఖలో పేర్కొన్నాడు. కాగా రియో ఒలింపిక్స్‌కు క్రీడాకారుల అక్రిడిటేషన్ కోసం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు వచ్చిన రెజ్లర్ల జాబితాలో సుశీల్ కుమార్ పేరు లేకపోవడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. 74 కేజీల విభాగంలో రియోకు ఎవరు వెళ్లాలనే విషయంపై సుశీల్, నర్సింగ్ల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఐఓఏకు వచ్చిన జాబితాలో సుశీల్ పేరు లేదు. అయితే ఈ జాబితాను తాము పంపలేదని, సుశీల్‌కు అవకాశం ఉందని భారత రెజ్లింగ్ సమాఖ్య పంపింది. ‘ఒలింపిక్స్‌కు అర్హత పొందిన రెజ్లర్ల పేర్లను ప్రపంచ రెజ్లింగ్ సంఘం ఐఓఏకు పంపుతుంది. కాగా రియో ఒలింపిక్స్ కు రెజ్లర్ సుశీల్ కుమార్ కు మొండిచేయి చూపారని వచ్చిన వార్తలను భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) తోసిపుచ్చింది. మరోవైపు ఈ వివాదంలో తాము జోక్యం చేసుకోమని క్రీడా శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో సుశీల్ కుమార్ రాసిన లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ లేఖపై మంత్రిత్వ శాఖ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. -
సుశీల్ ను తప్పించలేదు: డబ్ల్యూఎఫ్ఐ
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ కు రెజ్లర్ సుశీల్ కుమార్ కు మొండిచేయి చూపారని వచ్చిన వార్తలను భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) తోసిపుచ్చింది. ఒలింపిక్స్ ప్రాబబుల్స్ కు తాము ఎటువంటి జాబితా పంపించలేదని స్పష్టం చేసింది. రియో ఒలింపిక్స్ జాబితా నుంచి సుశీల్ కుమార్ ను తప్పించలేదని తెలిపింది. రియో ఒలింపిక్స్ ప్రాబబుల్స్ లో రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో సుశీల్ కు చోటు దక్కలేదని, నర్సింగ్ యాదవ్ వైపు రెజ్లింగ్ సమాఖ్య మొగ్గు చూపిందని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే భారత్ ఒలింపిక్స్ సంఘానికి తాము ఎటువంటి జాబితా పంపించలేదని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు. ఒలింపిక్స్ లో వివిధ కేటగిరీల్లో పోటీ పడే అవకాశమున్న క్రీడాకారుల పేర్ల జాబితాను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అనే సంస్థ పంపిస్తుంటుందని వివరణయిచ్చారు. సుశీల్ కుమార్ కు దారులు పూర్తిగా మూసుకుపోలేదన్నారు. భారత్ ఒలింపిక్స్ సంఘం ఎవరి పేరుకు ఖరారు చేస్తే వారే దేశం తరపున పోటీకి వెళతారని డబ్ల్యూఎఫ్ఐ సహ కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు. -
కుస్తీ రారాజుకు నిరాశే..!
న్యూఢిల్లీ: రెజ్లింగ్ లో భారత్ కు పతకాల పంట పండించిన రెజ్లర్ సుశీల్ కుమార్ కు నిరాశే ఎదురైంది. బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్యం, లండన్ ఒలింపిక్స్ లో రజతం నెగ్గిన సుశీల్ కు ఈ ఏడాది జరగనున్న రియో ఒలింపిక్స్ బెర్త్ దక్కలేదు. రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ ఆ అవకాశాన్ని సాధించాడు. రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన నర్సింగ్ యాదవ్ వైపు రెజ్లింగ్ సమాఖ్య మొగ్గు చూపింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించడంతో సుశీల్ కు నిరాశే మిగిలింది. వాస్తవానికి రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో పాల్గొంటామని ఇద్దరు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ పోటీ పడుతున్నారు. భారత్ తరఫున ఈ కేటగిరిలో సుశీల్ (ఢిల్లీ), నర్సింగ్ (ముంబై) అత్యుత్తమ రెజ్లర్లు కాగా, కేవలం ఒకరికి మాత్రమే ఒలింపిక్ బెర్త్ దక్కుతుంది. గతేడాది లాస్వేగాస్లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ యాదవ్ 74 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గడంతోపాటు టాప్-6లో నిలిచి భారత్ కు ఆ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఆ ఈవెంట్‌కు వెళ్లాల్సిన సుశీల్ గాయం కారణంగా తప్పుకోవడంతో నర్సింగ్ ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్నాడు. ఒకసారి ఒక దేశానికి బెర్త్ దక్కాక... మరో క్రీడాకారుడు ఒలింపిక్ బెర్త్ కోసం పోటీపడకూడదు. గతంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు పతకాలు తెచ్చానని తనకు ఈసారి మరో అవకావం ఇవ్వాలని పట్టుబడుతుండగా, భారత్ కు 74 కేజీల విభాగంలో అవకావం దక్కేలా చేసిన తనకే ఒలింపిక్ బెర్త్ దక్కుతుందని నర్సింగ్ యాదవ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఒలింపిక్ బెర్త్ దక్కక పోవడంపై సుశీల్ కుమార్ స్పందించాడు. తమ ఇద్దరిలో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారో వారినే ఒలింపిక్ బెర్త్ వరిస్తుందని పేర్కొన్నాడు. -
విధిలేని పరిస్థితుల్లోనే విద్యార్థుల సస్పెన్షన్
-
విధిలేని పరిస్థితుల్లోనే విద్యార్థుల సస్పెన్షన్
• హైకోర్టులో హెచ్‌సీయూ రిజిస్ట్రార్ కౌంటర్ దాఖలు • భవిష్యత్తులో పునరావృతం కాకూడదనే కఠిన నిర్ణయం • యూనివర్సిటీ నుంచే పంపేయాలని బోర్డు సిఫారసు చేసింది • అయితే మేం వారి పట్ల ఉదారంగా వ్యవహరించాం • వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సస్పెన్షన్ ఎత్తేశాం • హాస్టళ్లలో ప్రవేశం, ఎన్నికల్లో పోటీకి మాత్రమే సస్పెన్షన్‌ను వర్తింపజేశాం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్‌పై జరిగిన దాడి వ్యవహారంలో ఐదుగురు పరిశోధక (పీహెచ్డీ) విద్యార్థులను యూనివర్సిటీ నుంచే పంపేయాలని ప్రొక్టోరియల్ బోర్డు సిఫారసు చేసిందని వర్సిటీ రిజిస్ట్రార్(ఇన్చార్జ్) ఎం.సుధాకర్ హైకోర్టుకు నివేదించారు. అయితే వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎంతో ఉదారంగా వ్యవహరించామని, అందులో భాగంగానే పూర్తిస్థాయి సస్పెన్షన్‌ను రద్దు చేశామని తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు, మిగిలిన విద్యార్థులకు గుణపాఠం కావాలన్న ఉద్దేశంతోనే విధిలేని పరిస్థితుల్లోనే ఐదుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశామన్నారు. యూనివర్సిటీలో అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అయిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసు మేరకే సస్పెన్షన్‌ను ఎత్తివేశామని కోర్టుకు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రతిదీ యూనివర్సిటీ నిబంధనల మేరకే జరిగిందన్నారు. యూనివర్సిటీ తమపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పీహెచ్డీ విద్యార్థులు దొంత ప్రశాంత్ తదితరులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఇన్చార్జ్ రిజిస్ట్రార్ తాజాగా కౌంటర్ దాఖలు చేశారు. అది స్వచ్ఛంద క్షమాపణ కాదు సుశీల్ కుమార్ తమకు స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పారని పిటిషనర్లు పేర్కొనడంలో వాస్తవం లేదని రిజిస్ట్రార్ తన కౌంటర్లో పేర్కొన్నారు. ‘‘అంబేద్కర్ విద్యార్థి సంఘానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరుతూ ఎన్ఆర్ఎస్ హాస్టల్లో సుశీల్‌కుమార్ ఉన్న గదికి 30 మంది వరకు విద్యార్థులు వెళ్లినట్లు 2015 ఆగస్టు 4 రోజు వేకువజామున మాకు సమాచారం వచ్చింది. సుశీల్‌ను అతని రూం నుంచి సైకిల్ షెడ్ వరకు తీసుకొచ్చి రాతపూర్వక క్షమాపణలు తీసుకున్నారు. గది నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలో పిటిషనర్లు అతనిపై భౌతిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఒత్తిడిలో సుశీల్‌కుమార్ క్షమాపణలు చెప్పారు. యూనివర్సిటీ భద్రతా సిబ్బంది తమ వాహనంలో సుశీల్‌కుమార్‌ను మెయిన్‌గేట్ సమీపంలోని సెక్యూరిటీ పోస్ట్ వద్దకు తీసుకొచ్చారు. పిటిషనర్లు, ఇతరులు అక్కడకు వచ్చి ఫేస్బుక్లో తన క్షమాపణలను సుశీల్కుమార్తోనే అప్లోడ్ చేసేలా చేశారు. సుశీల్‌కుమార్ తన క్షమాపణలను శాంతిపూర్వకంగా, స్వచ్ఛందంగా చెప్పారన్న పిటిషనర్ల వాదనలను ఖండిస్తున్నా. అసలు అంత మంది ఓ విద్యార్థి హాస్టల్ గదికి వెళ్లి, బలవంతంగా బయటకు తీసుకురావడం న్యాయబద్ధం కాదు. అసలు భౌతిక హింసే జరగలేదని అనుకున్నా.. మొత్తం వ్యవహారం ప్రజాస్వామ్యయుతంగా, శాంతిపూర్వకంగా జరిగిందని పిటిషనర్లు చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఈ ఘోర తప్పిదానికి పిటిషనర్లే కారణం. వారు తమ పాత్రను ఎంత మాత్రం తోసిపుచ్చలేరు’’ అని రిజిస్ట్రార్ వివరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు ‘‘సుశీల్‌కుమార్ ఫేస్బుక్లో చేసిన వ్యాఖ్యల వల్ల తమకు ఇబ్బంది ఉందని భావిస్తే పిటిషనర్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయాల్సింది. అంతే తప్ప చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు’’ అని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ‘‘ఆ రోజు సుశీల్‌కుమార్ ఫోన్ చేయడంతో పోలీసులు హాస్టల్‌కు చేరుకున్నారు. తర్వాత పిటిషనర్లపై అదేరోజు కేసు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో అటు యూనివర్సిటీని, ఇటు పోలీసులను ఎవరో తప్పుదోవ పట్టించారంటూ పిటిషనర్లు చేస్తున్న వాదనలో ఎంత మాత్రం వాస్త వం లేదు. ప్రొక్టోరియల్ బోర్డు నిర్వహించిన విచారణలో ఈ మొత్తం ఘటన వెనుక పిటిషనర్ల పాత్ర ఉన్నట్లు తేలింది. బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు సుశీల్‌కుమార్ తల్లి, ఇతరుల సమక్షంలో వైస్ ఛాన్స్‌లర్‌ను కలిసిన మాట నిజమే. బాధ్యులైన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరిన మాట కూడా నిజం. ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి చేసిన ఫిర్యాదుకు కౌంట ర్గా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు కూడా ఫిర్యాదు చేసి సుశీల్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలన్నారు. ఈ రెండు ఫిర్యాదుల ను యూనివర్సిటీలో విద్యార్థుల క్రమశిక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే ప్రొక్టోరియల్ బోర్డుకు నివేదించాం. పిటిషనర్లకు కూడా నోటీసులు జారీ చేసి బోర్డు ముందు హాజరు కావాలన్నాం. వారి వాంగ్మూలాలు నమోదు చేశాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సుశీల్‌కుమార్ విచారణకు హాజరు కాలేదు. అయినా బోర్డు విచారణను కొనసాగించి, ఆగస్టు 12న మధ్యంతర నివేదిక ఇచ్చింది. వర్సిటీ వర్గాలకు ఫిర్యాదు చేయకుండా సుశీల్‌కుమార్ గదికి వెళ్లి గొడవకు దిగిన పిటిషనర్లకు గట్టి హెచ్చరికలు చేయాలని బోర్డు తన నివేదికలో సిఫారసు చేసింది. సుశీల్‌కుమార్, ఇతర సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసేం దుకు బోర్డు మరోసారి సమావేశమై ఆగస్టు 31న తుది నివేదిక సమర్పించింది. సుశీల్‌కుమార్‌పై పిటిషనర్లు భౌతికంగా దాడి చేశారని, అందువల్ల వారిని యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయాలని సిఫారసు చేసింది. అందులో భాగంగానే సెప్టెంబర్ 8న పిటిషనర్లను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశాం. ఈ ఘటనలో వారు ఎక్కడా తమ పాత్రను తోసిపుచ్చలేదు. అయితే విద్యార్థుల నుంచి వచ్చిన వినతి మేరకు సెప్టెంబర్ 11న వారి సస్పెన్షన్‌ను ఎత్తివేశాం’’ అని రిజిస్ట్రార్ కోర్టుకు తెలిపారు. ఉదారంగా వ్యవహరించాం ‘‘ప్రొక్టోరియల్ బోర్డు నివేదికను వైస్ ఛాన్సలర్ ఏర్పాటు చేసిన సబ్ కమిటీ పరిశీలించి, అందులో చేసిన సిఫారసులతో ఏకీభవించింది. తన నివేదికను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందు ఉంచింది. ప్రొక్టోరియల్ బోర్డు, సబ్ కమిటీల నివేదికను పరిశీలించిన కౌన్సిల్ విద్యార్థుల విద్యా, ఆర్థిక పరిస్థితులను దృష్టి పెట్టుకుని వారి పట్ల ఉదారంగా వ్యవహరించాలని నిర్ణయించింది. యూనివర్సిటీ నుంచి కాకుండా హాస్టళ్లు, పరిపాలన భవనాల్లో ప్రవేశానికి, ఎన్నికల్లో పోటీ చేయకుండా మాత్రమే పిటిషనర్లను అనర్హులుగా చేస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది’’ అని రిజిస్ట్రార్ తన కౌంటర్లో వివరించారు. ‘‘పిటిషనర్లలో ఒకరైన వేల్పుల సుంకన్న ఇప్పటికే పీహెచ్డీ థీసిస్ సమర్పించారు. అయితే సస్పెన్షన్ అతని విద్య కొనసాగింపునకు అడ్డంకి కాదు. తరగతులకు, సెమినార్లకు, వర్క్‌షాపులకు, గ్రంథాలయానికి హాజరు కాకుండా అతన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. విషయపరంగా ఓ అంశంపై ఆరోగ్యకరమైన చర్చలు విద్యార్థి జీవితంలో భాగం. అయితే రెచ్చిపోయి ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగడాన్ని సహించం. అందుకే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో పిటిషనర్లను హాస్టళ్ల నుంచి సస్పెండ్ చేశాం’’ అని రిజిస్ట్రార్ వివరించారు. -
ఇద్దరు కుమారులు సహా తల్లి ఆత్మహత్య
జీవితం విరక్తి చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమారులు సహా బావిలో దూకి తనువు చాలించింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా డక్కిలి మండలం నాగులపాడు గ్రామంలో జరిగింది. గ్రామ హరిజనవాడకు చెందిన కట్కం ప్రమీల(28), బుధవారం రాత్రి కుమారులు శేఖర్(11), సుశీల్‌కుమార్(8)తో సహా వెళ్లి సమీపంలోని బావిలో దూకేసింది. బావిలో తేలియాడుతున్న శవాలను గురువారం ఉదయం స్థానికులు గుర్తించారు. మతిస్థిమితం లేకనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని అంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వాళ్లు ఎప్పుడైనా ‘రెజ్లింగ్’ చూశారా!
ఫ్రాంచైజీలపై సుశీల్ ఆగ్రహం ప్రొ లీగ్ నుంచి తప్పుకోవడంపై వివరణ న్యూఢిల్లీ: తొలిసారి నిర్వహించిన ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) నుంచి చివరి నిమిషంలో తాను తప్పుకోవడంపై స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ నోరు విప్పాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడం వల్లే తాను ఈ లీగ్‌లో ఆడలేదని, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడి సూచన మేరకు లీగ్‌లో పాల్గొనలేదని అతను స్పష్టం చేశాడు. ‘మా కోచ్ సత్పాల్సింగ్, సమా ఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌తో మాట్లాడిన తర్వాత మ్యాచ్ ఫిట్ గా మారేందుకు జార్జియాలో 21 రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నాను. అయితే తిరిగొచ్చిన తర్వాత నేను 100 శాతం ఫిట్‌గా లేనని అనిపించింది. నేను లీగ్‌లో పాల్గొనడంకంటే రియో ఒలింపిక్స్‌కు పూర్తి ఫిట్నెస్తో ఉండటం ముఖ్యమని భావించారు. అం దుకే ఆడలేదు’ అని సుశీల్ కుమార్ స్పష్టం చేశాడు. నా గురించి మాట్లాడే స్థాయి లేదు... రెజ్లర్‌గా తన ప్రాధాన్యాలు మారాయని, ఇతర ఒప్పందాలతో బిజీగా ఉండటం వల్లే పాల్గొనలేదని లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలు రష్మి సులేజా, నిర్వాహకులు ప్రొ స్పోర్టిఫై, ఫ్రాంచైజీ యజమానులు చేసిన విమర్శలపై అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నర్సింగ్ యాదవ్‌తో పోటీ పడలేకే తప్పుకున్నాడని మరొకరు చేసిన వ్యాఖ్యను కూడా సుశీల్ తిప్పి కొట్టాడు. ‘ఫ్రాంచైజీ యజమానులు నన్ను కలిసిన వారం రోజుల్లోపే నా గురించి తెలుసుకునేంత తెలివైనవారా. అసలు వారికి రెజ్లింగ్ గురించి ఏమైనా తెలుసా. ఒక్కసారైనా కనీసం మ్యాచ్ చూశారా. 2008 బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత నా జీవితంలో అన్నీ పొందాను. అసలు నా స్థాయి గురించి వారికేమీ తెలీదు. నర్సింగ్‌తో గతంలో చాలా సార్లు తలపడి గెలిచాను. ఒక రెజ్లర్ ప్రత్యర్థి గురించి భయపడటం మొదలు పెడితే అతను ఒలింపిక్స్‌లో పాల్గొనడం గురించి మర్చిపోవాలి. నర్సింగ్ స్థానం కోల్పోరాదనే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నేను ఆడలేదు. మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరిలో ఎవరికో ఒకరికే రియోకు అవకాశం లభిస్తుందనుకుంటే పోరాడి సాధిస్తా’ అని గట్టిగా బదులిచ్చిన సుశీల్ కుమార్... వచ్చే ఏడాది కూడా ఈ లీగ్ ఉంటే అప్పుడు పాల్గొనడంపై ఆలోచిస్తానని చెప్పాడు -
ఊరించి.. ఉసూరుమనిపించి!
కొత్తగూడెం: ‘పరీక్షలు రాయించారు... అర్హత సాధించాం.. తీరా నియామకం ముందు వయసు సరిపోలేదని తిరస్కరిస్తున్నారు. ఆరు నెలల నుంచి ఊరించి ఇప్పుడు మొండిచేయి చూపుతున్నారు. వయసు సరిపోనప్పడు పరీక్షకు ఎలా అనుమతించారు.’ అంటూ సింగరేణి జేఎం ఈటీ పరీక్షల్లో అర్హత సాధించని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం జూనియర్ మైనింగ్ ఇంజినీరింగ్ ట్రైనీ(జేఎంఈటీ) పోస్టులకు పరీక్షలు నిర్వహించింది. దీనికి మైనింగ్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారితోపాటు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవకాశం కల్పించింది. పరీక్ష రాసే అభ్యర్థులు ఫిబ్రవరి 1, 2015 నాటికి 30 ఏళ్ల లోపు వారై ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయసు సడలింపు ఉం టుందని నోటిఫికేషన్లో పేర్కొంది. నిబంధనల సడలింపుతో... ఈ ఏడాది మే 10న జేఎంఈటీ పరీక్షలు నిర్వహించగా 894 మంది అభ్యర్థులు హాజరయ్యా రు. వీరిలో 682 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో ఎక్కువమంది ఫైనలియర్ విద్యార్థులు ఉండటంతో వారి సర్టిఫికెట్లను అందించాలని యాజమాన్యం కోరింది. తాము ఫైనలియర్ చదువుతున్నామని, సర్టిఫికెట్లు వచ్చే వరకు నియామకాన్ని నిలిపివేయాలని అర్హత సాధించిన ఫైనలియర్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో నియామక ప్రక్రియ 6 నెలలపాటు వాయిదాపడింది. అనంతరం యాజమాన్యం నిబంధనలను సడలిస్తూ జూలై 1, 2015 నాటికి అభ్యర్థులు 18 ఏళ్లు నిండి ఉండాలని సర్క్యులర్‌ను జారీ చేసింది. దీంతో ఫైనలియర్ చదువుతూ అర్హత సాధిం చిన అభ్యర్థులు అనర్హులుగా మారారు. 811 పోస్టులకు నిర్వహించిన ఈ పరీక్షలకు 682 మంది ఉత్తీర్ణత సాధించగా అందులో 33 మంది ఫైనల్ విద్యార్థులు వయసు సరిపడక తిరస్కరణకు గురయ్యారు. నోటిఫికేషన్లో కనిష్ట వయోపరిమితిని విధించని యాజమాన్యం అర్ధాం తరంగా సర్క్యూలర్ ను జారీ చేసిందని, దీనిపై కోర్టుకు వెళ్తామని పేర్కొంటున్నారు. అర్హత సాధించాం.. ఉద్యోగం ఇవ్వండి ఉద్యోగ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులయ్యాం.. ఫైనలియర్ పరీక్షలో సైతం మంచి మార్కులతో పాసయ్యాం. మాకు ఉద్యోగం ఇవ్వకుండా వయసు సరిపోలేదని మధ్యలో నిబంధన విధించడంతో కేవలం రెండు, మూడు నెలల వయసు తేడా మాత్రమే ఉంది. నిబంధనను సడలించి మాకు ఉద్యోగం ఇవ్వాలి. -వినీత్బాబు కట్ ఆఫ్ డేట్ పెంచాలి సింగరేణి యాజమాన్యం విడుదలచేసిన నోటిఫికేషన్లో మినిమమ్ ఏజ్ లిమిట్ నిబంధనను పెట్టకుండా ఫలితాలు వచ్చిన అనంతరం వయసు సరిపోలేదంటూ నిబంధనలు విధించడం సరికాదు. కటాఫ్‌డేట్‌ను పెంచి అర్హత సాధించిన ఫైనలియర్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. -సుశీల్ కుమార్ -
'గెలిపిస్తే గోవధను నిషేధిస్తాం'
పట్నా: ఒకవైపు గోవధ, గోమాంసం నిషేధంపై తీవ్ర వివాదం చెలరేగుతోంటే మరోవైపు బిహార్ బీజేపీ నాయకులు ఎన్నికల హామీలు గుప్పిస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే గోవధను నిషేధిస్తామని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ వాగ్దానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గోవధను నిషేధించడం ద్వారా వేలాది ఆవులను రక్షించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సుశీల్ కుమార్ సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేశారు. ప్రధాని తన చర్య ద్వారా ఆవుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారంటూ ట్వీట్ చేశారు. ఆవులను రక్షించడం ద్వారా గోపాలకుల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. -
హెచ్‌సీయుూలో ‘ఫేస్బుక్’ వార్
విద్యార్థి సంఘాల పోటాపోటీ ధర్నాలు ఆందోళనలతో అట్టుడికిన వర్సిటీ హైదరాబాద్: తమ సంఘ నాయకులను దూషిస్తూ ఏబీవీపీ నాయకుడు ఫేస్బుక్లో కామెంట్లు చేశారని ఓ సంఘం.. తమపై దాడి చేశారని మరో సంఘం నాయకులు పోటాపోటీగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మంగళవారం ఆందోళనలు చేపట్టాయి. ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్‌పై అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు దాడి చేశారని ఆరోపిస్తూ వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఏబీవీపీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు వర్సిటీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం వీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. బీజేపీ నేత, ఎమ్మెల్సీ రామచందర్‌రావు అక్కడికి వచ్చి ఏబీవీపీకి మద్దతు పలికారు. కామెంట్లు చేసినవారిపై చర్యలు తీసుకోవాలి.. అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులను గూండాలుగా పేర్కొంటూ ఫేస్బుక్లో కామెంట్స్ చేసిన వర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఏ, ఇతర విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడకున్నా.. అకారణంగా పోలీసులు అదుపులోకి తీసుకొన్న ఏఎస్ఏ సంఘం నాయకులు ప్రశాంత్, విన్సెంట్, అశోక్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళితులను, అణగారిన వర్గాలను కించపరిచేలా ఏబీవీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని, కామెంట్లు దానిలో భాగమేనని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. ఏఎస్‌ఏకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ, డీఎస్‌యూ, ఎంఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, టీఎస్ఎఫ్, ఓబీసీఏ, టీఆర్ఎస్వీ సంఘాల నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఏఎస్ఎ నాయకులను విడుదల చేశారు. ఇరువర్గాల మధ్య జరిగిన వివాదంపై అధికారులు, అధ్యాపకులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి నిజానిజాలను నిర్ధారణ చేస్తామని వర్సిటీ వీసీ ఆర్పీ శర్మ విద్యార్థి నాయకులకు హామీ ఇచ్చారు. ఈ గొడవపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఇక రెజ్లింగ్‌లోనూ ప్రొ లీగ్...
నవంబరు 8 నుంచి 29 వరకు భారత్‌లోని 6 నగరాల్లో పోటీలు న్యూఢిల్లీ: ఇప్పటికే క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, టెన్నిస్, కబడ్డీ లీగ్‌లను చూసిన భారత క్రీడాభిమానులకు మరో లీగ్ కనువిందు చేయనుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ), ప్రొ స్పోర్టీఫై సంస్థ ఆధ్వర్యంలో తాజాగా రెజ్లింగ్ క్రీడలోనూ ప్రొ లీగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది నవంబరు 8 నుంచి 29 వరకు భారత్‌లోని ఆరు నగరాల్లో జరిగే ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)కు సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. భారత మేటి రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, బజరంగ్, అనూజ్ చౌదరీ, గీత ఫోగట్, బబితా కుమారి, గీతిక జక్కర్ పలువురు మోడల్స్‌తో కలిసి ఈ ఆవిష్కరణోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విఖ్యాత పాప్ సింగర్ అపాచీ ఇండియన్ పీడబ్ల్యూఎల్ థీమ్ సాంగ్‌ను పాడగా... పలువురు రెజ్లర్లు గ్రీకు యుద్ధవీరుల వేషాధారణలో ర్యాంప్‌పైకి వచ్చారు. ప్రొ రెజ్లింగ్ లీగ్ భారత క్రీడారంగంలో చారిత్రక క్షణం అని ఒలింపిక్ పతక విజేతలు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ అన్నారు. ప్రొ లీగ్ భారత రెజ్లింగ్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళుతుందని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. ►భారత్‌లోని ఆరు నగరాల్లో మూడు వారాలపాటు ప్రొ రెజ్లింగ్ లీగ్‌ను నిర్వహిస్తారు. ఉత్తర భారత్ నుంచి మూడు ఫ్రాంచైజీలు.. పశ్చిమ, దక్షిణ, ఈశాన్య భారత్ నుంచి ఒక్కో ఫ్రాంచైజీ ఉంటాయి. ►{పతి జట్టులో 11 మంది రెజ్లర్లు (పురుషులు-6, మహిళలు-5) ఉంటారు. ప్రతి జట్టులో ఆరుగురు భారత రెజ్లర్లు, ఐదుగురు విదేశీ రెజ్లర్లు ఉంటారు. ► మొత్తం లీగ్ ప్రైజ్‌మనీ రూ. 5 కోట్లు. ఇప్పటికే ప్రపంచంలోని టాప్-20 మంది రెజ్లర్లు ఈ లీగ్‌లో పాల్గొనేందుకు తమ అంగీకారాన్ని తెలిపారు. ► {పతి ఫ్రాంచైజీ కనీస ధర రూ. 3 కోట్లు. సె ప్టెంబరు 7లోపు ఆరు జట్లను ఖరారు చేస్తా రు. ఆగస్టు 30లోపు ఈ లీగ్ ప్రసారకర్తను ఎంపిక చేస్తారు. సెప్టెంబరు 15న రెజ్లర్ల వేలం నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లో ఈ లీగ్‌ను ప్రసారం చేస్తారు. ► మూడు వారాలు జరిగే ఈ లీగ్‌లో ప్రతి జట్టు అన్ని జట్లతో కనీసం ఒక్కసారైనా ఆడుతుంది. ‘బెస్ట్ ఆఫ్-9 బౌట్స్’ పద్ధతిలో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఒక్కో బౌట్లో మూడు నిమిషాల నిడివిగల మూడు రౌండ్లు ఉంటాయి. ప్రతి రౌండ్ మధ్య నిమిషం విరామం ఉంటుంది. లీగ్ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. ఆ తర్వాత ఫైనల్ జరుగుతుంది. -
రెజ్లర్ సుశీల్‌కు గాయం
ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరం న్యూఢిల్లీ: భుజం గాయం కారణంగా రెజ్లర్ సుశీల్ కుమార్ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరమయ్యాడు. సెప్టెంబర్ 7 నుంచి 12 వరకు లాస్‌వెగాస్‌లో ఈ మెగా టోర్నీ జరుగనుంది. 2016 రియో ఒలింపిక్స్ కోసం ఇది తొలి క్వాలిఫయింగ్ ఈవెంట్. ‘ప్రాక్టీస్ సమయంలో నా కుడి భుజానికి గాయమైంది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చా రు. ప్రస్తుతానికైతే ఈ గాయం ఎప్పుడు నయమవుతుందో చెప్పలేను. దీంతో ఈనెల 6,7న జరిగే సెలక్ష న్ ట్రయల్స్‌కు అందుబాటులో ఉండలేకపోతున్నా ను. ఈ కారణంగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ ఆడనట్టే. ఈ టోర్నీ అనంతరం వచ్చే ఏడాది మరో ఆరు క్వాలిఫయింగ్ టోర్నీలు ఉంటాయి. వీటిలో పాల్గొని సత్తా చూపాలనుకుంటున్నాను’ అని లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సుశీల్ చెప్పాడు. -
కరోడ్‌పతి
ఉన్నట్టుండి ఐదు కోట్ల రూపాయలు లభిస్తే? ‘జీవితమే మారిపోతుంది’ అనే సమాధానాన్నే చెబుతారెవరైనా. మరి నిజంగా మారిపోతుందా? ప్రాక్టికల్‌గా అది సాధ్యం అవుతుందా.. అంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఇలాంటి ఆలోచననే జనింపజేస్తోంది సుశీల్‌కుమార్ జీవితం. సుశీల్‌కుమార్‌ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2011లో దేశవ్యాప్తంగా సుశీల్ పేరు మార్మోగింది. అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించే సోనీటీవీ వారి కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో ఐదు కోట్ల రూపాయల ప్రైజ్‌మనీని గెలుచుకొన్న విజే తగా ఈ బిహారీ అందరికీ పరిచయం అయ్యాడు. కేబీసీ చరిత్రలోనే తొలిసారి అంత పెద్ద మొత్తాన్ని గెలుచుకొన్న వ్యక్తి కూడా కావడంతో ఇతడికి అప్పట్లో బీభత్సమైన క్రేజ్ కనిపించింది. ఉత్తర బీహార్‌లోని మోతిహరి ప్రాంతానికి చెందిన ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి సుశీల్. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నానని... నెలకు ఆరువేల రూపాయల జీతం వస్తుందని.. కేబీసీ సీజన్ ఫైవ్‌లో సుశీల్ తన నేపథ్యం గురించి చెప్పుకున్నాడు. ఆ షోలో సుశీల్ ఐదు కోట్ల రూపాయలు గెలుచుకొని ఇప్పటికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అతడి పరిస్థితి ఏమిటి అనే విషయం గురించి పరిశీలిస్తే... ఇప్పుడు సుశీల్‌కు ఆ ఉద్యోగం కూడా లేదు! అతను ఒక నిరుద్యోగి. అంతే. సుశీల్ నేటికీ తన సొంతూళ్లోనే ఉంటున్నాడు. ఉమ్మడి కుటుంబంతోనే గడుపుతున్నాడు. ఇదంతా సింప్లిసిటీ అనుకోవద్దు. ఇంతకన్నా గొప్పగా బతకడానికి తన ఆర్థిక స్థితి సరిపోలేదని సుశీల్ చెబుతాడు! ఐదు కోట్ల రూపాయల ప్రైజ్‌మనీలో పన్నులు పోనూ మూడు కోట్ల అరవై లక్షలు చేతికి వచ్చాయట. ఆ డబ్బుతో సొంతూళ్లో ఒక ఇల్లు కట్టడం, నలుగురు సోదరులు సెటిలవ్వడానికి కొంత కేటాయించడం, స్థానికంగా కొంత భూమిని కొని, మిగిలిన కొంచెం డబ్బును తల్లి పేరుతో బ్యాంక్ అకౌంట్లో జమ చేయడంతోనే సుశీల్ బ్యాలెన్స్‌షీట్ జీరోను చూపించిందట! ఇక ప్రత్యేకంగా తను సెటిలవడానికి, విలాసంగా గడపడానికీ డబ్బులేమీ లేకుండాపోయాయట. వినడానికి కొంత విడ్డూరంగా, ఆశ్చర్యంగా ఉన్నా సుశీల్ ప్రస్తుత సాదాసీదా జీవన శైలి ఇదే వాస్తవమని చెబుతోంది. డబ్బు వచ్చిందనే ఆనందంలో ఉద్యోగం మానేశాడు సుశీల్. బీఎడ్ పూర్తి చేసినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు, సివిల్స్ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఇప్పుడు బ్యాంక్‌లో ఉన్న మొత్తంపై వచ్చే వడ్డీ డబ్బు, ఇంటి దగ్గర ఉన్న నాలుగు ఆవులు సుశీల్ కుటుంబానికి జీవనాధారం. సోదరులు సుశీల్ ఇచ్చిన డబ్బుతో వ్యాపారం చేస్తున్నా అది వారి కుటుంబాల పోషణకే సరిపోతోంది. దీంతో తన భార్య ఇప్పుడు తీవ్రమైన అసంతృప్తితో ఉందని సుశీల్ చెబుతున్నాడు. అంత డబ్బు వచ్చినా మన జీవితాలేమీ మారలేదు కదా.. అని అమె సుశీల్ దగ్గర అంటూ ఉంటుందట. నాలుగేళ్ల కిందట సుశీల్ ఒక సెలబ్రిటీ. మీడియా ఇతడి మేధోతనాన్ని మెచ్చుకొంది. సమాజం ఇతడిని ఆరాధించింది. అప్పటి బి హార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సుశీల్ ఇంటికి వెళ్లి మరీ రాజకీయాల్లోకి ఆహ్వానించాడు. అయితే ఇప్పుడు సుశీల్‌ను ప్రత్యేకమైన వ్యక్తిగా చూసేవారెవరూ లేరు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. మరి సుశీల్ వ్యవహారం ‘డబ్బు- జీవితం’తో ముడిపడిన సమీకరణాల గురించి ఏదో సందేశాన్నే ఇస్తోంది. కొంచెం ఆలోచిస్తే అది ఎవరికైనా అర్థం అవుతుంది! - జీవన్ డబ్బు వచ్చిందనే ఆనందంలో ఉద్యోగం మానేశాడు సుశీల్. బీఎడ్ పూర్తి చేసినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు, సివిల్స్ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. -
నాకు పద్మభూషణ్ ఎందుకివ్వరు ?
-
నాకు పద్మభూషణ్ ఎందుకివ్వరు?
ఒలింపిక్స్‌లో కాంస్యపతకం సాధించినా.. దేశం తరఫున మంచి ప్రదర్శనలు చూపించినా తన పేరును పద్మభూషణ్ అవార్డుకు ఎందుకు పంపలేదని సైనా నెహ్వాల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత సంవత్సరం ఆగస్టులో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) సైనా పేరును క్రీడా మంత్రిత్వశాఖకు పంపింది. కానీ, క్రీడా శాఖ మాత్రం సైనా పేరును పక్కన పెట్టి.. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన రెజ్లర్ సుశీల్ కుమార్ పేరును హోం శాఖకు ప్రతిపాదించింది. దీనిపైనే సైనా స్పందించింది. ''సుశీల్ కుమార్ పేరును ప్రత్యేకంగా పద్మ అవార్డుకు పంపినట్లు తెలిసింద.ఇ నా పేరు మాత్రం పంపలేదు. రెండు పద్మ అవార్డుల మధ్య రెండేళ్ల తేడా ఉండాలన్నది మంత్రిత్వశాఖ నిబంధన అని చెబుతున్నారు. అయినా అతడి పేరు పంపారు గానీ, నా పేరు మాత్రం పంపలేదు. నాకు ఐదేళ్ల తేడా ఉన్నా పంపనందుకు చాలా బాధగా ఉంది" అని సైనా చెప్పింది. గత సంవత్సరం కూడా ఇవే కారణాలతో తన దరఖాస్తు తిరస్కరించారని.. ఈసారి దరఖాస్తు చేసినా ఫలితం లేదని అంటోంది. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడానని, వాళ్లు మాత్రం ఇప్పటికే సుశీల్ పేరు వెళ్లిపోయినట్లు చెప్పారని సైనా తెలిపింది. తామిద్దరికీ ఒలింపిక్స్‌లో పతకాలు వచ్చాయని, అలాంటప్పుడు తనకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించింది. ఆమెకు ఇంతకుముందు 2010లో రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. 2009లో అర్జున అవార్డు కూడా వచ్చింది. -
ఆసియా క్రీడలకు సుశీల్ దూరం
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ సుశీల్‌కుమార్ వచ్చే నెలలో జరగనున్న ఆసియా క్రీడలతోపాటు ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సుశీల్.. 2016లో రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా సిద్ధమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) వెల్లడించింది. ఆసియా క్రీడలకు రెజ్లింగ్ జట్టును బుధవారం ప్రకటించిన డబ్ల్యుఎఫ్ఐ.. సుశీల్ స్థానంలో నర్సింగ్ పంచమ్ యాదవ్‌కు చోటు కల్పించింది. ఏడుగురు సభ్యుల ఫ్రీ స్టయిల్ జట్టుకు యోగేశ్వర్‌దత్ సారథ్యం వహించనున్నాడు. మహిళల జట్టు ఎంపిక కోసం గురువారం లక్నోలో ట్రయల్స్ జరగనున్నాయి. -
ఒకే రోజు మూడు స్వర్ణాలు, రజతం
-
పసిడి ‘పట్టు’
మెరిసిన భారత రెజ్లర్లు ఒకే రోజు మూడు స్వర్ణాలు, రజతం అలరించిన సుశీల్ కుమార్ కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమైన తర్వాత ఆరో రోజు ఎవరూ ఊహించని విధంగా భారత క్రీడాకారులు పసిడి పంట పండించారు. రెజ్లర్లు తమ పట్టు ప్రదర్శించి ఒకే రోజు మూడు స్వర్ణాలతోపాటు రజత పతకం సొంతం చేసుకున్నారు. మరోవైపు షూటర్లు కూడా రాణించడంతో... మంగళవారం ఒక్కరోజే భారత్‌కు తొమ్మిది పతకాలు వచ్చాయి. గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో ఆరో రోజును స్వర్ణం లేకుండానే ముగిస్తామా అని అనుకుంటున్న తరుణంలో... భారత రెజ్లర్లు తమ ఉడుంపట్టును ప్రదర్శించారు. ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చలాయించి మూడు స్వర్ణాలతోపాటు రజత పతకం గెల్చుకున్నారు. మంగళవారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్ (74 కేజీలు), అమిత్ కుమార్ దహియా (57 కేజీలు)... మహిళల విభాగంలో వినేశ్ ఫోగట్ (48 కేజీలు) పసిడి పతకాలు సంపాదించగా... పురుషుల 125 కేజీల విభాగంలో రాజీవ్ తోమర్ రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. 107 సెకన్లలోనే... కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి 74 కేజీల విభాగంలో పోటీపడిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఎలాంటి పోటీనే ఎదురుకాలేదు. ఫైనల్లో సుశీల్ కేవలం 107 సెకన్లలో తన ప్రత్యర్థి ఖమర్ అబ్బాస్ (పాకిస్థాన్)ను చిత్తు చేశాడు. సుశీల్ 6-2తో ఆధిక్యంలో ఉన్న దశలో అబ్బాస్ భుజాన్ని కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు అట్టిపెట్టడంతో రిఫరీ పోటీని నిలిపివేసి ‘బై ఫాల్’ పద్ధతిలో సుశీల్‌ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు తొలి రౌండ్లో సుశీల్ 11-1తో లారెన్స్ (ఆస్ట్రేలియా)పై; క్వార్టర్ ఫైనల్లో 10-0తో కుశాన్ సంద్రాగె (శ్రీలంక)పై; సెమీఫైనల్లో 8-4తో మెల్విన్ బిబో (నైజీరియా)పై గెలిచాడు. 57 కేజీల ఫైనల్లో అమిత్ కుమార్ 6-2 పాయింట్ల తేడాతో వెల్సన్ (నైజీరియా)ను ఓడించగా... మహిళల 48 కేజీ ఫైనల్లో వినేశ్ 11-8 పాయింట్ల తేడాతో యానా రటిగన్ (ఇంగ్లండ్)పై అద్భుత విజయం సాధించింది. ఇక పురుషుల 125 కేజీల ఫైనల్లో రాజీవ్ తోమర్ (భారత్) 0-3 పాయింట్లతో కోరె జార్విస్ (కెనడా) చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్నాడు. -
సొహైల్ కోచ్ సుశీల్
సల్మాన్‌ఖాన్ తమ్ముడు సొహైల్ ఖాన్ తాజా సినిమా కోసం ఒలింపిక్ పతక విజేత సుశీల్‌కుమార్ కూడా పని చేయనున్నాడు. ప్రముఖ రెజ్లర్ గామా పహిల్వాన్ జీవితం ఆధారంగా తీయబోయే సినిమా కాబట్టి కుస్తీపోటీల్లో సొహైల్‌కు శిక్షణ తప్పసరిగా మారింది. ఈ సినిమాను సల్లూభాయ్ స్వయంగా నిర్మిస్తుండగా, పునీత్ ఇస్సార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అందుకే సొహైల్ మూడునెలలపాటు రెజ్లింగ్‌లో సుశీల్ దగ్గర శిక్షణ తీసుకోనున్నాడు. సుశీల్ గురువు, అతని మామ సత్పాల్సింగ్ కూడా సొహైల్‌కు కొన్ని మెళకువలు నేర్పుతారు. ఈ సినిమా, పాత్ర కోసం సల్మాన్ తన తమ్ముడికి వ్యాయామం, ఆహారం గురించి చాలా విషయాలు చెబుతున్నాడు. గామా పహిల్వాన్ దాదాపు 99 కిలోల బరువుఉండేవాడు. ఆయన తగ్గట్టే సొహైల్ కూడా బరువు పెరుగుతున్నాడు. ఇప్పటి వరకు 15 కేజీలు పెరిగాడు. మరింత పెరగాలని అన్న సూచించాడు. ‘ఈ పాత్ర కోసం సొహైల్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. శరీరంలో కొంచెం కూడా కొవ్వు లేకుండా తయారయ్యాడు. ఫొటోలు కూడా చాలా బాగా వచ్చాయి. సినిమా షూటింగ్‌ను నవంబర్ నుంచి మొదలుపెడతాం. సుశీల్ దగ్గర శిక్షణ పూర్తయ్యాక, సొహైలే మాకు పోరాట సన్నివేశాల్లో సాయం కూడా చేస్తాడు. పహిల్వాన్ జీవితం, కవిత్వాన్ని అమితంగా అభిమానించడం, ప్రముఖ గాయకుడు బడే ఘులామ్ అలీఖాన్‌తో స్నేహం వంటి వాటిని ఈ సినిమాలో చూడవచ్చు’ అని పునీత్ వివరించాడు. సహాయ పాత్రల్లో కనిపించే రెజ్లర్ల కోసం పునీత్ దేశవ్యాప్తంగా ఆడిషన్లు నిర్వహించనున్నాడు. సల్మాన్ కూడా కొందరు అంతర్జాతీయ రెజ్లర్లతో మాట్లాడుతున్నాడు. గామా పహిల్వాన్ దాదాపు ఐదు వేల మంది రెజ్లర్లను ఓడించాడు. -
సుశీల్ 74 కేజీలకు... యోగేశ్వర్ 65 కేజీలకు
న్యూఢిల్లీ: ఊహించినట్టే భారత స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ కొత్త వెయిట్ కేటగిరీలకు మారారు. 2016 రియో ఒలింపిక్స్ క్రీడల్లో సుశీల్ కుమార్ 74 కేజీల విభాగంలో... యోగేశ్వర్ దత్ 65 కేజీల విభాగంలో పోటీపడతారు. ఇప్పటిదాకా సుశీల్ 66 కేజీల్లో... యోగేశ్వర్ 60 కేజీల్లో పాల్గొనేవారు. అయితే అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (ఫిలా) ఇటీవల వెయిట్ కేటగిరీలలో మార్పులు చేసింది. ఆ జాబితాలో వీరిద్దరి కేటగిరీలు లేకపోవడంతో కొత్త విభాగాలకు మారడం అనివార్యమైంది. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ మినహా మిగతా అంతర్జాతీయ టోర్నీలలో మాత్రం సుశీల్ 70 కేజీల విభాగంలో బరిలోకి దిగుతాడు. గత ఏడాది లండన్ ఒలింపిక్స్ తర్వాత ఏ టోర్నీలోనూ పాల్గొనని సుశీల్, యోగేశ్వర్ ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు అమెరికాలో జరిగే డేవ్ షుల్జ్ స్మారక అంతర్జాతీయ టోర్నీలకు తమ ఎంట్రీలను ఖరారు చేశారు. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు నెగ్గిన అమిత్ కుమార్ దహియా 57 కేజీల్లో... బజరంగ్ 61 కేజీల్లో పాల్గొంటారు. ఇప్పటిదాకా 74 కేజీ విభాగంలో పోటీపడిన ఒలింపియన్ నర్సింగ్ యాదవ్ ఇక నుంచి 86 కేజీల విభాగానికి మారుతాడు. -
ఓడిపోతే రూ.3 కోట్లు!
న్యూఢిల్లీ: ఫిక్సింగ్.. సామాన్యంగా ఈ జాడ్యం ఎక్కువగా క్రికెట్లోనే కనిపిస్తుంటుంది. అయితే కాదేదీ ఫిక్సింగ్‌కు అనర్హం అన్నట్టుగా ఇది ప్రపంచ క్రీడలన్నింటికీ పాకింది. తాజాగా ప్రఖ్యాత రెజ్లర్ సుశీల్ కుమార్ సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టాడు. 2010 మాస్కోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తనకెదురైన ఫిక్సింగ్ అనుభవాన్ని వెల్లడించాడు. 66కేజీ ఫ్రీస్టయిల్ ఫైనల్ బౌట్లో రష్యా రెజ్లర్ అలన్ గొగేవ్ చేతిలో ఓడితే రూ.3 కోట్ల భారీ మొత్తం ముడుతుందని కొంత మంది ఆఫర్ చేసినట్టు సుశీల్ చెప్పాడు. అయితే ఈ విషయాన్ని అప్పుడే అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని అన్నాడు. ‘మా జట్టు విదేశీ కోచ్‌ల్లో ఒకరి ద్వారా ఈ ప్రతిపాదనను నా దగ్గరికి తెచ్చారు. ఫైనల్ బౌట్ ఓడితే రూ.3 కోట్లు ఇస్తామన్నారు. ఓ రెజ్లర్‌కు నిజంగా ఇది చాలా పెద్ద మొత్తం. రష్యాలో రెజ్లింగ్‌కు భారీ క్రేజ్ ఉంటుంది. వారు ఓ భారత ఆటగాడు ఫైనల్‌కు వస్తాడని ఊహించలేకపోయారు. వారి సొంత దేశంలో పోటీలు కాబట్టి అక్కడి వారే గెలవాలని వారు భావించారు. కానీ 3-1తో తనను ఓడించాను. డబ్బు విషయం ఇక్కడ ముఖ్యం కాదు. దేశ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. బౌట్ గెలిచాక అందరూ లేచి చప్పట్లు కొట్టారు. నాలుగైదు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్నా మాస్కోలో నాకు లభించిన ఆదరణ అపూర్వం. అయితే ఈ ఫిక్సింగ్ గురించి 2010లోనే అధికారులకు సమాచారమిచ్చాను. కానీ ఎవరూ స్పందించలేదు’ అని ఓ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో సుశీల్ పేర్కొన్నాడు. మ్యాచ్ ఫిక్సర్లకు అత్యంత కఠిన శిక్షలు పడాలని ఆశించాడు. అలాగే అవినీతి అధికారులను రెజ్లింగ్ నుంచి తొలగించాలని కోరాడు. రెజ్లింగ్‌లో మామూలే: అధికారులు రెజ్లర్ సుశీల్ కుమార్ చెప్పిన ఫిక్సింగ్ అంశాన్ని భారత అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. అసలు సుశీల్ అప్పట్లో ఈ విషయాన్ని ఫిర్యాదు చేయలేదని భారత రెజ్లింగ్ సమాఖ్య సెక్రటరీ జనరల్ రాజ్ సింగ్ చెప్పారు. అలాగే ఈ అంశంపై తానేమీ ఆశ్చర్యపోలేదని అన్నారు. ‘ఇలాంటివి గతంలోనే నేను విన్నాను. వీటిపై మనం మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. ‘ఫిక్సింగ్‌కు సచిన్ దూరంగా ఉండమన్నాడు’ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సలహా ఇచ్చాడని రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన సుశీల్ కుమార్ చెప్పాడు. ‘సచిన్‌తో కలిసి కూర్చున్నప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఒకసారి మేం ఓ ప్రమోషనల్ ఈవెంట్లో కలుసుకున్నాం. కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ఫిక్సింగ్ గురించి మాట్లాడారు. ‘నీవు కనుక మరో పతకం గెలవాలని అనుకుంటే మాత్రం అలాంటి వారు చేస్తున్న పనులను మాత్రం చేయకు’ అని అక్కడే ఉన్న కొంత మందిని చూపిస్తూ సచిన్ అన్నాడు. ఎవరా అని నేను తలెత్తి వారి వైపు చూశాను. తన తోటి క్రికెటర్లను చూపిస్తూ సచిన్ అలా చెప్పాడు. వారి పేర్లు నేను చెప్పను. మీరే ఓ నిర్ధారణకు రండి’ అని సుశీల్ పేర్కొన్నాడు. -
ఓడిపోతే రూ.3 కోట్లు!
న్యూఢిల్లీ: ఫిక్సింగ్.. సామాన్యంగా ఈ జాడ్యం ఎక్కువగా క్రికెట్లోనే కనిపిస్తుంటుంది. అయితే కాదేదీ ఫిక్సింగ్‌కు అనర్హం అన్నట్టుగా ఇది ప్రపంచ క్రీడలన్నింటికీ పాకింది. తాజాగా ప్రఖ్యాత రెజ్లర్ సుశీల్ కుమార్ సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టాడు. 2010 మాస్కోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తనకెదురైన ఫిక్సింగ్ అనుభవాన్ని వెల్లడించాడు. 66కేజీ ఫ్రీస్టయిల్ ఫైనల్ బౌట్లో రష్యా రెజ్లర్ అలన్ గొగేవ్ చేతిలో ఓడితే రూ.3 కోట్ల భారీ మొత్తం ముడుతుందని కొంత మంది ఆఫర్ చేసినట్టు సుశీల్ చెప్పాడు. అయితే ఈ విషయాన్ని అప్పుడే అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని అన్నాడు. ‘మా జట్టు విదేశీ కోచ్‌ల్లో ఒకరి ద్వారా ఈ ప్రతిపాదనను నా దగ్గరికి తెచ్చారు. ఫైనల్ బౌట్ ఓడితే రూ.3 కోట్లు ఇస్తామన్నారు. ఓ రెజ్లర్‌కు నిజంగా ఇది చాలా పెద్ద మొత్తం. రష్యాలో రెజ్లింగ్‌కు భారీ క్రేజ్ ఉంటుంది. వారు ఓ భారత ఆటగాడు ఫైనల్‌కు వస్తాడని ఊహించలేకపోయారు. వారి సొంత దేశంలో పోటీలు కాబట్టి అక్కడి వారే గెలవాలని వారు భావించారు. కానీ 3-1తో తనను ఓడించాను. డబ్బు విషయం ఇక్కడ ముఖ్యం కాదు. దేశ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. బౌట్ గెలిచాక అందరూ లేచి చప్పట్లు కొట్టారు. నాలుగైదు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్నా మాస్కోలో నాకు లభించిన ఆదరణ అపూర్వం. అయితే ఈ ఫిక్సింగ్ గురించి 2010లోనే అధికారులకు సమాచారమిచ్చాను. కానీ ఎవరూ స్పందించలేదు’ అని ఓ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో సుశీల్ పేర్కొన్నాడు. మ్యాచ్ ఫిక్సర్లకు అత్యంత కఠిన శిక్షలు పడాలని ఆశించాడు. అలాగే అవినీతి అధికారులను రెజ్లింగ్ నుంచి తొలగించాలని కోరాడు. రెజ్లింగ్‌లో మామూలే: అధికారులు రెజ్లర్ సుశీల్ కుమార్ చెప్పిన ఫిక్సింగ్ అంశాన్ని భారత అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. అసలు సుశీల్ అప్పట్లో ఈ విషయాన్ని ఫిర్యాదు చేయలేదని భారత రెజ్లింగ్ సమాఖ్య సెక్రటరీ జనరల్ రాజ్ సింగ్ చెప్పారు. అలాగే ఈ అంశంపై తానేమీ ఆశ్చర్యపోలేదని అన్నారు. ‘ఇలాంటివి గతంలోనే నేను విన్నాను. వీటిపై మనం మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. ‘ఫిక్సింగ్‌కు సచిన్ దూరంగా ఉండమన్నాడు’ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సలహా ఇచ్చాడని రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన సుశీల్ కుమార్ చెప్పాడు. ‘సచిన్‌తో కలిసి కూర్చున్నప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఒకసారి మేం ఓ ప్రమోషనల్ ఈవెంట్లో కలుసుకున్నాం. కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ఫిక్సింగ్ గురించి మాట్లాడారు. ‘నీవు కనుక మరో పతకం గెలవాలని అనుకుంటే మాత్రం అలాంటి వారు చేస్తున్న పనులను మాత్రం చేయకు’ అని అక్కడే ఉన్న కొంత మందిని చూపిస్తూ సచిన్ అన్నాడు. ఎవరా అని నేను తలెత్తి వారి వైపు చూశాను. తన తోటి క్రికెటర్లను చూపిస్తూ సచిన్ అలా చెప్పాడు. వారి పేర్లు నేను చెప్పను. మీరే ఓ నిర్ధారణకు రండి’ అని సుశీల్ పేర్కొన్నాడు.