సుశీల్ కుమార్,సుమిత్ మాలిక్‌లతో యోగా గురు బాబా రాందేవ్
సాక్షి, న్యూఢిల్లీ : 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా సుశీల్‌ని అడ్డుకొని ఉండకపోతే భారత్‌కు తప్పక బంగారు పతకం సాధించిపెట్టేవాడని యోగా గురు బాబా రాందేవ్ అభిప్రాయ పడ్డారు. గోల్డ్ కోస్ట్‌లో జరిగిన ‘కామన్‌వెల్త్ గేమ్స్-2018’లో 74 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణం సాధించిన సుశీల్ కుమార్‌ను, 125 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణం గెలుపొందిన సుమిత్ మాలిక్‌ను బాబా రాందేవ్ మంగళవారం అభినందించారు.
‘మీరిద్దరూ కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్‌ను నిలబెట్టారు. యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుంది. సుశీల్ గనుక రియో ఒలిపింక్స్‌లో పాల్గొని ఉంటే స్వర్ణం సాధించి ఉండేవాడు’ అంటూ రాందేవ్ వ్యాఖ్యానించారు. రియో ఒలింపిక్స్‌లో 74 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ పోటీల్లో బెర్త్ కోసం ముంబయ్‌కు చెందిన నార్సింగ్ యాదవ్‌కు, తనకు ట్రయల్ పోటీ నిర్వహించాలన్న సుశీల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. గాయం కారణంగా 2015 లాస్ వెగాస్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో సుశీల్ పాల్గొనక పోవడంతో నార్సింగ్ యాదవ్ రియోకి బెర్త్ ఖాయం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment