Rio Olympics 2016
-
స్టార్ ఒలింపియన్ కన్నుమూత
Olympic Diver Ian Matos Dies Aged 32: బ్రెజిల్‌కు చెందిన ఒలింపిక్ డైవర్ ఇయాన్ మాటోస్ 32 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ గత రెండు నెలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాటోస్.. బుధావరం పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో మూడు మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్‌లో పోటీ పడ్డ మాటోస్.. పతకం గెలవలేనప్పటికీ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మాటోస్.. 2010 సౌత్ అమెరికన్ గేమ్స్‌లో మూడు కాంస్య పతకాలు సాధించి వెలుగులోకి వచ్చాడు. మాటోస్ అకాల మరణం పట్ల బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ సంతాపం తెలిపింది. కాగా, మాటోస్.. 2014లో తాను గే నంటూ సంచలన ప్రకటన చేసిన వార్తల్లో నిలిచాడు. చదవండి: అంతర్జాతీయ టోర్నీలో భారత స్కీయర్‌కు కాంస్యం -
ఆ మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయట..!
Boxing Bouts In 2016 Olympics Were Fixed: 2016 రియో ఒలింపిక్స్‌కు సంబంధించిన ఓ సంచలన విషయం తాజాగా వెలుగు చూసింది. ఆ విశ్వక్రీడల్లో రెండు పతకాల పోరులు(ఫైనల్స్) సహా మొత్తం 14 బాక్సింగ్ బౌట్లు ఫిక్స్ అయ్యాయని మెక్లారెన్ గ్లోబల్ స్పోర్ట్స్ సొల్యూషన్స్ (ఎమ్‌జీఎస్‌ఎస్) అనే సంస్థ చేపట్టిన స్వతంత్ర దర్యాప్తులో బహిర్గతమైనట్లు తెలుస్తోంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లోనే ఈ ఫిక్సింగ్ స్కాంకు బీజం పడినట్లు సదరు సంస్థ తమ నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య(ఏఐబీఏ)చే నియమించబడిన రిఫరీలు, న్యాయనిర్ణేతలే ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నివేదిక వెల్లడించింది. ఇందుకు నాటి ఏఐబీఏ అధ్యక్షుడు చింగ్ బాధ్యత వహించాల్సి ఉందని పేర్కొంది. కాగా, రియో ఒలింపిక్స్ క్వార్టర్స్ పోరులో రష్యా బాక్సర్ వ్లాదిమిర్ నికితిన్పై ప్రపంచ ఛాంపియన్ ఐర్లాండ్‌కు చెందిన మైఖేల్ కోన్లాన్ పిడిగుద్దులతో విరుచుకుపడినప్పటికీ రిఫరీ, న్యాయనిర్ణేతలు అతను ఓడిపోయినట్లు ప్రకటించారు. దీంతో మైఖేల్ సహనం కోల్పోయి న్యాయ నిర్ణేతలపై దూషణకు దిగాడు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే, తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో సైతం ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. న్యాయనిర్ణేతలు ప్రత్యర్ధులకు అనుకూలంగా వ్యవహరించారంటూ భారత స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్ సంచలన ఆరోపణలు చేసింది. చదవండి: సీఎస్కేలో 10 మందే బ్యాటర్లు.. ధోని కీపర్, కెప్టెన్ మాత్రమే..! -
పీవీ సింధు అరుదైన రికార్డు.. తొలిసారిగా
PV Sindhu In Tokyo Olympics Semi Final: టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు విజయపరంపర కొనసాగుతోంది. శుక్రవారం నాటి క్వార్టర్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి, నాలుగో సీడ్ అకానా యమగూచిని ఓడించడం ద్వారా ఆమె.. సెమీస్‌లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. తద్వారా ఓ అరుదైన రికార్డు సింధు పేరిట నమోదైంది. వరుసగా రెండుసార్లు ఒలిపింక్స్‌లో సెమీ ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణి, షట్లర్‌గా పీవీ సింధు నిలిచింది. తద్వారా విశ్వ క్రీడల్లో రెండుసార్లు క్వార్టర్ ఫైనల్స్(2008- బీజింగ్, 2012- లండన్), ఒకసారి సెమీస్(2012) చేరిన మరో షట్లర్ సైనా నెహ్వాల్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. ఇక 2016లో జరిగిన గత రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు తొలిసారిగా సెమీస్‌లో అడుగుపెట్టి.. గెలుపొంది.. ఆపై రజత పతకం గెలిచిన విషయం విదితమే. ప్రస్తుతం అదే రీతిలో.. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా 21-13, 22-20 వరుస గేమ్‌లలో యమగూచిని ఓడించి సత్తా చాటింది. స్వర్ణ పతకం సాధించడమే ధ్యేయంగా ముందుకు సాగుతూ సన్నద్ధమవుతోంది. కాగా 2012 నాటి లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ సెమీస్ చేరుకుని, కాంస్య పతకం గెలుపొందిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘సుశీల్ రియోలో ఆడి ఉంటే స్వర్ణమే’
సాక్షి, న్యూఢిల్లీ : 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా సుశీల్‌ని అడ్డుకొని ఉండకపోతే భారత్‌కు తప్పక బంగారు పతకం సాధించిపెట్టేవాడని యోగా గురు బాబా రాందేవ్ అభిప్రాయ పడ్డారు. గోల్డ్ కోస్ట్‌లో జరిగిన ‘కామన్వెల్త్ గేమ్స్-2018’లో 74 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణం సాధించిన సుశీల్ కుమార్‌ను, 125 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణం గెలుపొందిన సుమిత్ మాలిక్‌ను బాబా రాందేవ్ మంగళవారం అభినందించారు. ‘మీరిద్దరూ కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌ను నిలబెట్టారు. యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుంది. సుశీల్ గనుక రియో ఒలిపింక్స్‌లో పాల్గొని ఉంటే స్వర్ణం సాధించి ఉండేవాడు’ అంటూ రాందేవ్ వ్యాఖ్యానించారు. రియో ఒలింపిక్స్‌లో 74 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ పోటీల్లో బెర్త్ కోసం ముంబయ్‌కు చెందిన నార్సింగ్ యాదవ్‌కు, తనకు ట్రయల్ పోటీ నిర్వహించాలన్న సుశీల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. గాయం కారణంగా 2015 లాస్ వెగాస్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్లో సుశీల్ పాల్గొనక పోవడంతో నార్సింగ్ యాదవ్ రియోకి బెర్త్ ఖాయం చేసుకున్నాడు. -
రియో ఒలింపిక్ పతకం వేలానికి పెట్టాడు!
-
రియో ఒలింపిక్ పతకం వేలానికి పెట్టాడు!
ఒలింపిక్స్‌లో పతకం సాధించడం అంటే చిన్న విషయం కాదు. క్రీడాకారుల జీవితంలో చాలా అరుదుగా సాధించే విజయం అది. అలాంటి పతకాన్ని చాలా అపురూపంగా చూసుకుంటారు. కానీ, నిన్న కాక మొన్న ముగిసిన రియో ఒలింపిక్స్‌లో తాను సాధించిన రజత పతకాన్ని అప్పుడే వేలానికి పెట్టేశాడో క్రీడాకారుడు. అవును.. పోలండ్‌కు చెందిన డిస్కస్ త్రో క్రీడాకారుడు పియోటర్ మలచోవ్‌స్కీ తాను రియోలో సాధించిన పతకాన్ని వేలానికి పెట్టాడు. కేన్సర్‌తో బాధపడుతున్న మూడేళ్ల అబ్బాయికి చికిత్స చేయించడం కోసం అతడీ పని చేశాడు. ఒలెక్ అనే చిన్నారి.. రెండేళ్లుగా కంటి కేన్సర్‌తో బాధపడుతున్నాడు. అతడికి న్యూయార్క్ ఆస్పత్రిలో చికిత్స చేయించడం ఒక్కటే మార్గమని అన్నారు. నిజానికి తాను రియోలో స్వర్ణపతకం సాధించాలనే చాలా ప్రయత్నించానని, కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ అంతకంటే విలువైన వాటికోసం పోరాడాలని పిలుపునిస్తున్నానని మలచోవ్‌స్కీ తన ఫేస్బుక్ పేజిలో రాశాడు. ఇప్పుడు ఎవరైనా సాయం చేస్తే, తన రజత పతకం ఒలెక్‌కు బంగారం కంటే చాలా విలువైనది అవుతుందని చెబుతూ తన పతకాన్ని వేలానికి పెడుతున్నట్లు చెప్పాడు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మును తాను అతడి చికిత్సకే వెచ్చిస్తానన్నాడు. అది వేలంలో ఎంతకు పోయిందో తెలియదు గానీ.. తర్వాత మాత్రం 'సక్సెస్' అని తన ఫేస్బుక్ పేజీలో రాశాడు. అంటే, ఆ చిన్నారికి చికిత్సకు కావల్సిన మొత్తం వచ్చిందనే అనుకోవాలి. -
ఒలింపిక్స్‌కు ఎంత ఖర్చయింది?
ప్రపంచ క్రీడాకారుల్లో కొందరికి మధుర జ్ఞాపకాలను, కొందరికి చేదు జ్ఞాపకాలను మిగిల్చి రియో ఒలింపిక్స్ చరిత్ర పుటల్లోకి జారుకుంది. ఇలాంటి ఒలింపిక్స్ నిర్వహించాలంటే ఏ దేశానికైనా ఎంత ఖర్చవుతుంది? ఇప్పటివరకు ఏయే ఒలింపిక్స్‌కు ఎంత ఖర్చయిందన్నది ఆసక్తికరమైన అంశం. నాలుగేళ్లకోసారి నిర్వహించే సమ్మర్ ఒలింపిక్స్‌కు సరాసరి సగటున 520 కోట్ల డాలర్లు (2015 సంవత్సరం నాటి అమెరికా కరెన్సీ లెక్కల ప్రకారం), అంటే భారత కరెన్సీలో దాదాపు 34,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని, అదే వింటర్ ఒలింపిక్స్‌కు 310 కోట్ల డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో 20,806 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, దానికి అనుబంధంగా పనిచేస్తున్న బిజినెస్ స్కూల్ విభాగానికి చెందిన ఆర్థిక నిపుణులు లెక్కలు వేశారు. స్టేడియాల నిర్మాణం, క్రీడాకారులకు వసతి, రవాణా సౌకర్యాలు కాకుండా కేవలం క్రీడల నిర్వహణకే ఇంత ఖర్చవుతుందని వారు తేల్చారు. ఒలింపిక్స్ నిర్వహణకు సంబంధించిన గణాంకాలు 1964 నుంచే అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు ఈ క్రీడల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో గణాంకాలు అందుబాటులో లేవు. గతంలో ప్రతి ఒలింపిక్స్‌కు అంచనాలకు మించి వంద శాతానికన్నా ఎక్కువగా ఖర్చు అవుతుండగా, గతానుభవాల రీత్యా రియో ఒలింపిక్స్ ఖర్చు అంచనాలకన్నా 50 శాతం మాత్రమే ఎక్కువ ఖర్చయింది. ఏదేమైనా ఖర్చు మాత్రం ఒక ఒలింపిక్స్ నుంచి మరో ఒలింపిక్స్‌కు పెరుగుతూనే ఉంది. 2012 లండన్‌లో జరిగిన ఒలింపిక్స్ అత్యంత ఖరీదైనవిగా చరిత్ర సృష్టించింది. ఆ ఒలింపిక్స్‌కు 1500 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. 970 కోట్ల డాలర్ల ఖర్చుతో బార్సిలోనా ఒలింపిక్స్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. 1964లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌కు 28.20 కోట్ల డాలర్లు మాత్రమే ఖర్చయ్యాయి. అదే సంవత్సరం జరిగిన ఇన్స్‌బర్క్ వింటర్ ఒలింపిక్స్‌కు 2.20 కోట్ల డాలర్లు మాత్రమే ఖర్చయ్యాయి. లండన్‌లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌కు బడ్జెట్ అంచనాలకు మించి 76 శాతం ఎక్కువ నిధులు ఖర్చు కాగా, సోచిలో 2014లో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌కు బడ్జెట్ అంచనాలకు మించి 289 శాతం ఎక్కువ నిధులు ఖర్చయ్యాయి. అత్యధికంగా ఖర్చయిన వింటర్ ఒలింపిక్స్‌గా అది రికార్డులకు ఎక్కింది. ఇటీవల ముగిసిన రియో ఒలింపిక్స్ నిర్వహణకు 460 కోట్ల డాలర్లు ఖర్చు అవుతాయని తొలుత అంచనా వేశారు. కానీ దానికన్నా 51 శాతం ఎక్కువ నిధులు ఖర్చయ్యాయి. ఒలింపిక్స్ క్రీడల 'నాలెడ్జ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్' కింద గత ఒలింపిక్స్‌కు జరిగిన ఖర్చులను పంచుకోవడం ద్వారా అంచనాలకు, వాస్తవ ఖర్చులకు భారీ వ్యత్యాసం కాస్త తగ్గింది. -
ఇంటికి వెళ్లగానే దీపా కర్మాకర్ ఏం చేసింది?
రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం శాయశక్తులా కృషి చేసి, వెంట్రుక వాసిలో అదృష్టాన్ని మిస్సయిన దీపా కర్మాకర్.. ఇంటికి రాగానే పుస్తకాలు తీసింది. ఇంటికి వచ్చిన మర్నాటి నుంచే ఆమెకు ఎంఏ పరీక్షలు ఉన్నాయి. త్రిపుర యూనివర్సిటీ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్ ద్వారా ఆమె ఎంఏ రెండో సెమిస్టర్ పరీక్షలకు హాజరైంది. పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ తనకు త్వరలోనే వస్తుందని ఆమె గట్టి నమ్మకంతో చెప్పింది. ఒకవైపు క్రీడాంశాలపై అపారమైన ఆసక్తి చూపుతూనే, చదువు మీద కూడా ఇంత శ్రద్ధ పెట్టడం అద్భుతమని త్రిపుర యూనివర్సిటీ అధికారులు అంటున్నారు. సాధారణంగా క్రీడాకారులు చదువును పక్కన పెట్టేస్తారు. ఎప్పుడో వీలైనప్పుడు పరీక్షలు రాస్తారు. కానీ, దీప మాత్రం అలా కాకుండా అకుంఠిత దీక్షతో రియో నుంచి వచ్చిన మర్నాడే పరీక్షలకు హాజరైంది.. బాగా రాసింది కూడానట. పరీక్షలు తప్పించుకోడానికి వంకలు వెతికే పిల్లలు ఆమెను చూసి నేర్చుకోవాలని అధ్యాపకులు అంటున్ నారు. జిమ్నాస్టిక్స్ కోచింగ్, ప్రాక్టీసుకు చాలా సమయం పడుతుందని, అయినా దీప మాత్రం ఎప్పుడూ చదువును నిర్లక్ష్యం చేయలేదని ఆమె కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. చివరకు రియోకు వెళ్లేటప్పుడు కూడా ఆమె పుస్తకాలు తీసుకెళ్లిందట. మధ్యలో ఖాళీ దొరికితే చదువుకుందామని అలా తీసుకెళ్లిందని ఆమె తల్లి గౌరి చెప్పారు. మన దేశంలో చదువా.. ఆటలా అని ఏదో ఒకటి ఎంచుకోమంటారని, కానీ రెండూ ఒకేసారి చేయొచ్చని దీపా కర్మాకర్ నిరూపించిందని ఆమెతో పాటు పరీక్షకు హాజరైన యువకుడు చెప్పాడు. -
తమవాళ్లు ఓడారంటూ.. కోచ్‌ల వినూత్న నిరసన
రెజ్లింగ్‌లో తమ క్రీడాకారులు ఎలాగైనా గెలుస్తారని అనుకున్నారు. తాము ఇచ్చిన కోచింగ్ అలాంటిదని వారు భావించారు. కానీ, చివరకు తమ రెజ్లర్ ఓడిపోవడంతో తీవ్ర నిరాశ చెందిన మంగోలియన్ కోచ్‌లు రింగ్‌లోనే దుస్తులు విప్పి తమ నిరసన వ్యక్తం చేశారు. గంజోరిగీన్ మందఖ్నారన్ అనే రెజ్లర్ ఓడినట్లుగా జడ్జిలు ప్రకటించారు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అతడి ప్రత్యర్థికి పెనాల్టీ పాయింటు ఇవ్వడంతో పాయింట్ల తేడాతో మంగోలియా రెజ్లర్ ఓడిపోయాడు. అప్పటికి తమవాడు గెలిచాడని భావిస్తున్న కోచ్‌లు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టేశారు. కానీ కొన్ని సెకండ్ల తర్వాత.. వాళ్లకు అసలు విషయం తెలిసింది. జడ్జీల నిర్ణయాన్ని సవాలు చేయాలని కోచ్‌లు భావించారు. కానీ, అలా చేయడానికి వీల్లేదని జడ్జీలు వాళ్లకు చెప్పారు. దాంతో ఒకరు షర్టు విప్పేయగా, మరొకరు షర్టు, ప్యాంటు రెండూ విప్పేసి రింగ్‌లోనే పడేసి తమ నిరసన వ్యక్తం చేశారు. -
'ఈసారి షూటింగ్ బిగ్ ఫ్లాప్'
రియో డీ జనిరో: ఒలింపిక్స్ లో మనదేశ క్రీడాకారుల ప్రదర్శన సంతృప్తికరంగా లేదని భారత్ తరపున 'షెఫ్-డీ-మిషన్'గా వ్యవహరించిన రాకేశ్ గుప్తా అన్నారు. మరిన్ని పతకాలు వస్తాయని అనుకున్నామని చెప్పారు. మూడు బంగారం, వెండి, కంచు పతకాలు వస్తాయని ఊహించినట్టు వెల్లడించారు. మన ఆటగాళ్లు తీవ్రంగా నిరాశ పరిచారని వాపోయారు. ఈసారి షూటింగ్ విభాగంలో దారుణంగా విఫలమయ్యారని, ఈ విభాగంలో మూడు బంగారు పతకాలు వస్తాయని ఆశించామని తెలిపారు. రియో ఒలింపిక్స్ లో మనదేశానికి కేవలం రెండు పతకాలే దక్కాయి. రెజ్లింగ్ లో సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించగా, బ్యాడ్మింటన్ లో పీవీ సింధు వెండి పతకం కైవసం చేసుకుంది. -
శోభా డేకు అమితాబ్ చెప్పుదెబ్బ లాంటి జవాబు
మన క్రీడాకారులకు పతకాలు రానంతసేపు వాళ్లు సెల్ఫీలు తీసుకోడానికే రియో వెళ్లారని ఎద్దేవా చేసిన శోభా డే.. ఆ తర్వాత కూడా తన తీరు ఏమాత్రం మార్చుకోలేదు. జపాన్ క్రీడాకారిణి ఒకుహరాపై సెమీఫైనల్స్‌లో నెగ్గి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ పోరుకు సిద్ధమైన తెలుగు షట్లర్ పీవీ సింధు విషయంలో కూడా ఆమె ఇష్టారాజ్యంగా కామెంట్ చేయడంతో ట్విట్టర్ జనాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సింధును 'సిల్వర్ ప్రిన్సెస్' అంటూ ఆమె కామెంట్ పెట్టడంతో ఇక మీరు మారేది లేదా అంటూ ట్విట్టర్ కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం నుంచి మీరు దూరంగా ఉండాలని కొందరు సుతిమెత్తగా చెబితే మరికొందరు కాస్తంత గట్టిగానే స్పందించారు. క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే శోభా డే అనే పదాలతో ఆడుకున్నాడు. 'సాక్షి మెడలో కాంస్య పతకం ఎంత శోభను ఇస్తోంది' అనే అర్థం వచ్చేలా హిందీలో ట్వీట్ చేశారు. 'శోభా దే' రహాహై అన్నారు. ఇక బాలీవుడ్ పెద్దాయన అమితాబ్ బచ్చన్‌కు కూడా శోభా డే పట్ల చాలా కోపం వచ్చింది. అయితే ఆయన ఆమె పేరు ప్రస్తావించకుండానే తాను చెప్పదలచుకుంది చెప్పేశారు. ''మీరు ఖాళీ చేతులతో కాదు, మెడల్ తీసుకుని వస్తున్నారు.. మేం మీతో సెల్ఫీ తీసుకోవాలని అనుకుంటున్నాం'' అని పీవీ సింధును ఉద్దేశిస్తూ అమితాబ్ ట్వీట్ చేశారు. దాంతో పాటు మీరు అతిగా వాగేవాళ్ల నోరు మూయించారని మరో ట్వీట్ చేశారు. పనులే మాట్లాడతాయని, అవి కూడా అప్పుడప్పుడు 'పెన్ను'ను ఓడిస్తాయని ఆయన అన్నారు. మనవాళ్లు సెల్ఫీలు తీసుకోడానికే అక్కడకు వెళ్తున్నారన్న రచయిత్రి శోభా కామెంట్లను గుర్తుచేస్తూ అమితాబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. T 2352 - #PVSindhu .. aap "khaali haath" nahein, medal leke wapas aa rahein hain .. aur hum aapke saath 'selfie' nikalne chahate hain !! — Amitabh Bachchan (@SrBachchan) 18 August 2016 T 2352 - #PVSindhu ...aapne 'bolne walon' ki bolti bund kar di .. karm bolta hai aur wo kabhi kabhi 'kalam' ko bhi hara deta hai ! BADHAI !! — Amitabh Bachchan (@SrBachchan) 18 August 2016 T 2352 - Never ever underestimate power of female gender ! #PVSindhu you have destroyed so many 'naysayers' .. you are the PRIDE of INDIA ! — Amitabh Bachchan (@SrBachchan) 18 August 2016 -
'సింధు గోల్డ్ మెడల్ తెస్తుంది'
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో పీవీ సింధు బంగారం పతకం సాధించాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆకాంక్షించాడు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సింధు ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. సింధు విజయం సాధించాలని యావత్ దేశం కోరుకుంటోందని తెలిపాడు. సింధు మంచి ఆటతీరు కనబరుస్తోందని, ఆమె గోల్డ్ మెడల్ సాధించడం ఖాయమని సచిన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా, రియో ఒలింపిక్స్ లో దేశానికి మొదటి పతకం అందించిన మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కు 'లిటిల్ మాస్టర్' అభినందలు తెలిపాడు. ఆమెను చూసి దేశమంతా గర్విస్తోందని పేర్కొన్నాడు. Yeaaahh!! @Pvsindhu1 through to the #badminton finals with such an amazing performance!! Congratulations! Superb smashes! — sachin tendulkar (@sachin_rt) 18 August 2016 -
మిషన్ టోక్యో 2020 ప్రారంభించాలి
వంద కోట్ల మందికి పైగా జనాభా ఉన్న మన దేశంలో ఒలింపిక్ చాంపియన్లు కరువవుతున్నారని తెలంగాణ ఐటీ, పురపాలక, మునిసిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ట్వీట్ చేస్తూ.. 2020లో టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్‌కు మనం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని, అందుకోసం మిషన్ టోక్యో 2020 ప్రారంభించాలని కోరారు. మన చాంపియన్లకు అత్యుత్తమ అవకాశాలు కల్పించాలని ఆయన అన్నారు. అంతకు ముందు మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ఫైనల్స్‌కు చేరిన పీవీ సింధును ఆయన అభినందించారు. వందకోట్ల మంది ప్రజలు ఒక్క చాంపియన్ కోసం నిలబడటం చాలా అరుదుగా జరుగుతుందని, అలా ఇప్పుడు సింధు కోసం జరిగిందని చెప్పారు. ఆమెతో పాటు దేశాన్ని గర్వపడేలా చేసిన ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌ను కూడా కేటీఆర్ అభినందించారు. Country of billion craving for Olympic champs. Hon'ble PM @narendramodi ji, please start Mission Tokyo 2020 now & let's give our champs best — KTR (@KTRTRS) 19 August 2016 How often do you have billion people rooting for one champ!! Kudos @Pvsindhu1 & her coach Gopichand for making a nation proud -
సింధు నాదం
{పపంచ రెండో ర్యాంకర్ యిహాన్ వాంగ్‌పై అద్భుత విజయం సింగిల్స్‌లో సెమీస్‌లోకి ప్రవేశం నేడు ఒకుహారాతో అమీతుమీ గెలిస్తే కొత్త చరిత్ర పది రోజులు దాటిపోయినా రియో ఒలింపిక్స్‌లో తొలి పతకం కోసం ఎదురుచూపులు చూస్తున్న భారత్‌కు పీవీ సింధు ఆశాకిరణంలా ఉదయించింది. ఎలాంటి అంచనాలు లేకుండా రియోకు వెళ్లిన సింధు... సంచలన ఆటతీరుతో క్వార్టర్స్‌లో చైనా ‘గోడ’ను అధిగమించి సెమీస్‌కు చేరింది. ఇక ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు... భారత్ ఖాతాలో పతకం చేరుతుంది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సింధు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధిస్తుంది. ఓడితే మాత్రం కాంస్య పతకం కోసం ఆడుతుంది. రియో డి జనీరో: పతకం రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు అద్వితీయ ఆటతీరును ప్రదర్శించింది. ప్రపంచ రెండో ర్యాంకర్, లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత యిహాన్ వాంగ్‌పై అద్భుత విజయం సాధించింది. మహిళల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకం రేసులో నిలిచింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ సింధు 22-20, 21-19తో రెండో ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా)ను బోల్తా కొట్టించింది. యిహాన్ వాంగ్‌పై సింధు కెరీర్లో ఇది వరుసగా రెండో విజయం. గతేడాది డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలోనూ యిహాన్ వాంగ్‌పై సింధు గెలిచింది. తాజా విజయంతో సింధు ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న రెండో భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గత లండన్ ఒలింపిక్స్‌లో సైనా సెమీఫైనల్లో యిహాన్ వాంగ్ చేతిలో ఓడి... ఆ తర్వాత ప్లే ఆఫ్‌లో చైనా ప్లేయర్ జిన్ వాంగ్ (రిటైర్డ్ హర్ట్)పై గెలిచి కాంస్యం సాధించింది. హోరాహోరీ పోరు ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)ను ఓడించిన సింధు అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించింది. ప్రత్యర్థి ర్యాంక్‌ను, ఆమె అనుభవాన్ని చూసి బెదరకుండా తన సహజశైలిలో వ్యూహాత్మకంగా, ప్రణాళికబద్ధంగా ఆడింది. ఆరంభంలో 0-3తో వెనుకబడిన సింధు ఆ తర్వాత కోలుకొని స్కోరును 5-5తో సమం చేసింది. విరామ సమయానికి సింధు 8-11తో వెనుకంజలో ఉన్నా... తన ఆటతీరులోని లోపాలను సరిదిద్దుకుంటూ స్కోరును మరోసారి సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ ఒక్కో పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. ఇద్దరితో ఆధిక్యం దోబూచులాడింది. సింధు 20-18తో ఆధిక్యంలో ఉన్న సమయంలో యిహాన్ రెండు పాయింట్లు నెగ్గి స్కోరును సమం చేసింది. అయితే సింధు క్రాస్‌కోర్టు రిటర్న్ షాట్‌తో ఒక పాయింట్ నెగ్గగా... ఆ వెంటనే యిహాన్ వాంగ్ షాట్ బయటకు వెళ్లడంతో సింధు తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో అదే జోరు అనుభవజ్ఞురాలైన యిహాన్‌ను తేరుకోనిస్తే ఇబ్బంది తప్పదనుకున్న సింధు రెండో గేమ్‌లోనూ దూకుడుగానే ఆడింది. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూనే, అడపాదడపా స్మాష్‌లు సంధిస్తూ 8-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇదే జోరు కొనసాగిస్తూ 18-13తో మరింత ముందుకు వెళ్లింది. ఈ దశలో యిహాన్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 19-18తో ముందంజ వేయడంతో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది. కానీ సింధు కీలకదశలో తప్పిదాలు చేయకుండా సహనంతో ఆడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. యిహాన్ వాంగ్‌ను ఓడించి సింధు తన కెరీర్లో మరో గొప్ప విజయాన్ని సాధించింది. నా అంచనా ప్రకారం సింధులో మరింత మెరుగ్గా రాణించగల సత్తా ఉంది. ఒకట్రెండు అంశాల్లో కొంత మెరుగుపడాలి. ఆటపట్ల అంకితభావమున్న పోరాట యోధురాలు సింధు. - గోపీచంద్ (కోచ్) ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్లో యిహాన్ వాంగ్‌ను ఓడించడం ప్రత్యేక అనుభూతి. నా కెరీర్‌లోని మధుర క్షణాల్లో ఈ మ్యాచ్ కూడా ఒకటి. కీలక దశలో సహనం కోల్పోకుండా ఆడి మంచి ఫలితాన్ని సాధించాను. ప్రస్తుతం నా దృష్టి సెమీస్‌పైనే ఉంది. అందులోనూ నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాను. బాగా ఆడితే గెలుస్తాను. పతకం వస్తుంది. - సింధు -
రియో ఒలింపిక్స్ సమరం
-
ఆ పూల్ ఆకుపచ్చగా ఎందుకు మారిందంటే..
బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్ సందర్భంగా ఓ స్విమ్మింగ్ పూల్ నీలిరంగు నుంచి హఠాత్తుగా ఆకుపచ్చ రంగులోకి మారిపోవడంపై క్రీడాకారుల నుంచి ఆందోళన వ్యక్తం అవడం తెల్సిందే. ఆల్గే (శిలీంధ్రాలు.. ఆకుపచ్చ నాచు) వల్ల నీటి రంగు మారిపోయిందని, గాలి, వెలుతురు కూడా సరిగ్గా సోకకపోవడం వల్ల అలా జరిగిందని ఒలింపిక్స్ నిర్వాహకులు చెప్పారు. నీటిని శుభ్రం చేయడానికి అధిక రసాయనాలను ఉపయోగించడం వల్ల నీటి రంగు ఆకుపచ్చగా మారిందని, ఈ రంగు నీటి వల్ల క్రీడాకారులకు ఎలాంటి హాని లేదని నీటిని పరీక్షించిన ఈత ఈవెంట్లను నిర్వహించే అంతర్జాతీయ సంఘం 'ఫినా' ప్రకటించి ఈ అంశానికి తెరదించాలని భావించింది. కానీ ఏ రసాయనం వల్ల రంగు మారిందనే విషయానికి విజ్ఞానపరమైన కారణాలను మాత్రం ఇంతవరకు ఎవరూ వెల్లడించలేదు. యూనివర్సిటీలో వాటర్ కెమిస్ట్రీ చదువుకోవడంతో పాటు స్విమ్మింగ్ పూల్ బాయ్‌గా పనిచేసిన అనుభవం కలిగిన 'జీఆర్‌ఆర్‌ఎల్ సైంటిస్ట్' స్విమ్మింగ్‌పూల్‌లో నీటి రంగు మారడానికి వివరణ ఇచ్చారు. ఆల్గే కారణంగా నీటిరంగు మారలేదని, నీటిలో ఆల్గే పెరగడానికి కొన్ని రోజులు పడుతుందని ఆయన చెప్పారు. సరైన గాలి, వెలుతురు లేకపోవడం కూడా కారణం కాదన్నారు. నీలిరంగులో ఉండే కాపర్ సల్ఫేట్ లేదా కాపర్ సల్ఫేట్ పెంటా హైడ్రేట్‌ను అధిక మొత్తంలో ఉపయోగించడం వల్ల నీళ్లు ఆకుపచ్చ రంగులోకి మారిపోయి ఉంటాయని ఆయన చెప్పారు. నీటిలో ఆల్గే పెరగకుండా నిరోధించేందుకు పెద్ద స్విమ్మింగ్ పూల్స్‌లో, మున్సిపల్ వాటర్ ట్యాంకుల్లో కాపర్ సల్ఫేట్‌ను ఉపయోగిస్తారని, ఈ సల్ఫేట్‌ను తగిన మోతాదులో ఉపయోగిస్తే మానవుల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదని, చేపల లాంటి జలచరాలు మాత్రం పెరగవని ఆయన తెలిపారు. ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తే మాత్రం మనుషులకు చర్మంపై దురదలు లేస్తాయని, కళ్లు మండుతాయని చెప్పారు. ఒలింపిక్స్ క్రీడాకారులు కూడా కళ్లు మండుతున్నాయని, చర్మంపై దురద పెడుతోందని ఫిర్యాదుచేసిన విషయం ఇక్కడ గమనార్హం. కాపర్ సల్ఫేట్‌ను ఎక్కువ మొత్తంలో నీటిలో కలపడం వల్ల నీలిరంగులో ఉండే కాపర్ అయాన్లు నీటిలోని నాలుగు క్లోరిన్ అయాన్లతో కలసిపోయి కాపర్ (2) టెట్రాక్లోరో కాంప్లెక్స్‌గా మారుతుందని, అది ఆకుపచ్చగా ఉంటుందని, అప్పుడు నీరంతా ఆకుపచ్చగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. స్విమ్మింగ్ ఫూల్ ఆవరణ అంతా కుళ్లిన కోడిగుడ్ల వాసన వచ్చిందన్న వార్తలు కూడా వచ్చాయని, నీటిలోపల సల్ఫేట్ అయాన్లు హైడ్రోజన్ సల్ఫైడ్‌గా మారిపోతాయని, అప్పుడు నీటి నుంచి కుళ్లిన కోడిగుడ్ల వాసన పరిసర ప్రాంతాలకు వ్యాపిస్తుందని జీఆర్‌ఆర్‌ఎల్ సైంటిస్ట్ వివరించారు. ఒలింపిక్స్‌లో ఆకుపచ్చగా మారిన నీటిని పూర్తిగా తొలగించి కొత్త నీటితో నింపి ఈత ఈవెంట్లను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. -
రియో ఒలింపిక్స్ 2016.
-
రియోలో ఆ డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు!
ఒలింపిక్స్ చివరి దశకు చేరుకున్నాయి. మరో వారం రోజుల్లో ఇవి ముగియబోతున్నాయి. దాంతో విదేశీయులను ఆకట్టుకునేందుకు అక్కడున్న దాదాపు 12 వేల మంది సెక్స్ వర్కర్లు 50 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించారట. అయితే ఈసారి మాత్రం తాము అనుకున్న దానికంటే వ్యాపారం చాలా డల్‌గా ఉందని చెబుతున్నారు. రియోలో అతిపెద్ద రెడ్‌లైట్ ఏరియా అయిన విలా మిమోసా ప్రాంతం మరకానా స్టేడియంకు 1.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు వస్తే.. రోడ్డు మీద దోపిడీ దొంగలకు చిక్కుకుపోతామనే భయంతో చాలామంది ఆగిపోతున్నారని తెలిసింది. ఈ నగరంలో ఈ సంవత్సరం మొదటి ఏడు నెలల్లో ఏకంగా రెండు వేల హత్యలు జరిగాయి. ప్రస్తుతం ఈ రెడ్‌లైట్ ఏరియాలో ధరలు రూ. 1500 నుంచి రూ. 840కి పడిపోయాయని చెబుతున్నారు. విదేశీయులకు అర్థం అయ్యేందుకు వీలుగా ఇంగ్లీషు, పోర్చుగీసు, ఇతర భాషల్లో కూడా తగ్గింపు ధరలను రాసి పోస్టర్లు వేస్తున్నారు. బ్రెజిల్లో గత 18 ఏళ్లుగా వ్యభిచారం చట్టబద్ధంగా నడుస్తోంది. అయితే వేశ్యాగృహాలు నడపడం మాత్రం అక్కడ చట్టవిరుద్ధం. -
రియో ఒలింపిక్స్ 2016..
-
రియో ఒలింపిక్స్ 2016
-
ఫెల్ప్స్ కు 22వ ఒలింపిక్ గోల్డ్ మెడల్
రియో డి జనీరో: అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ బంగారు పతకాల వేట కొనసాగుతోంది. రియో ఒలింపిక్స్ లో వరుసగా నాలుగో పోటీలోనూ ఈ ‘ఫ్లయింగ్ ఫిష్’ అందరికంటే ముందు నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. 200 మీటర్ల మెడ్లీ విభాగంలో అతడు స్వర్ణ పతకం కైవసం చేసుకుని తనకు తిరుగులేదని మరోసారి చాటాడు. జపాన్ కు చెందిన కొసుకె హాంగినొ వెండి పతకం దక్కించుకున్నాడు. చైనా స్విమ్మర్ వాంగ్ షున్ రజతం సొంతం చేసుకున్నాడు. 22వ ఒలింపిక్ స్వర్ణాన్ని సొంతం చేసుకుని మైకేల్ ఫెల్ప్స్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఓవరాల్‌గా ఫెల్ప్స్కిది 26వ ఒలింపిక్ పతకం. ఇందులో 22 బంగారం, 2 రజతాలు, 2 కాంస్య పతకాలున్నాయి. -
బ్రిటన్ డైవర్స్ సంచలనం
డైవింగ్‌లో తొలిసారి స్వర్ణం ప్రపంచ చాంపియన్స్‌పై లాఫర్-మియర్స్ జోడీ గెలుపు రియో డి జనీరో: డైవింగ్ ఈవెంట్లో మూడు స్వర్ణాలు నెగ్గి జోరుమీదున్న చైనాకు బ్రిటన్ డైవర్లు షాక్ ఇచ్చారు. పురుషుల సింక్రనైజ్డ్ 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డు ఫైనల్లో జాక్ లాఫర్-క్రిస్ మియర్స్ (బ్రిటన్) ద్వయం 454.32 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ డైవింగ్ చరిత్రలో బ్రిటన్‌కు లభించిన తొలి స్వర్ణం ఇదే కావడం విశేషం. లాఫర్-మియర్స్ విన్యాసాల ధాటికి ప్రపంచ చాంపియన్స్ జోడీ కావో యువాన్-కిన్ కాయ్ (చైనా-443.70 పాయింట్లు) కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. సామ్ డోర్మాన్-మైక్ హిక్సాన్ (అమెరికా-450.21 పాయింట్లు) జోడీ రజత పతకాన్ని దక్కించుకుంది. మృత్యువు అంచుల నుంచి... ఏడేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో జరిగిన పోటీల సందర్భంగా 23 ఏళ్ల క్రిస్ మియర్స్కు పొత్తి కడుపులో తీవ్ర గాయమైంది. అత్యవసర శస్త్రచికిత్స చేసినా అతను కోలుకోవడం కష్టమేనని వైద్యులు తేల్చారు. మూడు రోజులు కోమాలో ఉన్నాక మియర్స్ స్పృహలోకి వచ్చాడు. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్నాడు. మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టి నమ్మశక్యంకాని రీతిలో రియోలో స్వర్ణం సాధించి ఔరా అనిపించాడు. 108 ఏళ్ల తర్వాత... పురుషుల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆల్‌రౌండ్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కొహి ఉచిమురా మళ్లీ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫ్లోర్ ఎక్సర్సైజ్, పామెల్ హార్స్, రింగ్స్, వాల్ట్, పారలల్ బార్స్, హరిజాంటల్ బార్ ఈవెంట్స్‌లో నిలకడగా రాణించిన ఉచిమురా ఓవరాల్‌గా 92.365 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. ఒలెగ్ వెర్నియెవ్ (ఉక్రెయిన్-92.266 పాయింట్లు) రజతం, మాక్స్ విట్లాక్ (బ్రిటన్-90.461 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఆల్‌రౌండ్ విభాగంలో 108 ఏళ్ల తర్వాత బ్రిటన్‌కు పతకం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. రోయింగ్‌లో జర్మనీ జోరు... గురువారం రోయింగ్‌లో ఆరు స్వర్ణాల కోసం పోటీలు జరిగాయి. ఇందులో పురుషుల, మహిళల క్వాడ్రాపుల్ స్కల్స్ విభాగంలో జర్మనీ జట్టు స్వర్ణాలు సొంతం చేసుకుంది. రెండు కిలోమీటర్ల దూరాన్ని జర్మనీ పురుషుల జట్టు 6 నిమిషాల 06.81 సెకన్లలో... జర్మనీ మహిళల జట్టు 6 నిమిషాల 49.39 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాయి. పురుషుల పెయిర్స్ విభాగంలో న్యూజిలాండ్‌కు... డబుల్ స్కల్స్ విభాగంలో క్రొయేషియాకు... మహిళల డబుల్ స్కల్స్ విభాగంలో పోలాండ్‌కు... లైట్‌వెయిట్ పురుషుల ఫోర్స్ విభాగంలో స్విట్జర్లాండ్‌కు స్వర్ణాలు లభించాయి. క్వార్టర్స్‌లో నాదల్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ ఈవెంట్లో మూడో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), డెల్ పొట్రో (అర్జెంటీనా) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో నాదల్ 7-6 (7/5), 6-3తో గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్)పై, డెల్ పొట్రో 6-7 (4/7), 6-1, 6-2తో తారో డానియల్ (జపాన్)పై గెలిచారు. మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) సింగిల్స్ విభాగంలో డింగ్ నింగ్ (చైనా) స్వర్ణం సాధించింది. ఫైనల్లో డింగ్ నింగ్ 4-3తో లి జియాజియా (చైనా)పై గెలిచింది. కాంస్య పతక పోరులో కిమ్ సాంగ్ (ఉత్తర కొరియా) 4-1తో ఫకుహరా (జపాన్)ను ఓడించింది. -
అథ్లెటిక్స్‌కు వేళాయె..!
ఒలింపిక్స్‌లో అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే అథ్లెటిక్స్ పోటీలు నేటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. 2008, 2012 గేమ్స్‌లో 100మీ. 200మీ. 4ఁ100మీ.లలో స్వర్ణాలతో అదరగొట్టిన బోల్ట్ ఆదివారం తొలిసారిగా ట్రాక్‌పై మెరవనున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఆరు గంటలకు 100మీ. హీట్స్‌లో, సోమవారం ఉదయం గం.6.55ని.కు ఫైనల్స్‌లో బోల్ట్ బరిలోకి దిగుతాడు. మహిళల 10 వేల మీ. పరుగులో వరుసగా మూడు స్వర్ణాలు నెగ్గిన తొలి మహిళా అథ్లెట్‌గా నిలిచేందుకు చాంపియన్ తిరునేష్ దిబాబా (ఇథియోపియా) ఎదురుచూస్తోంది. మరోవైపు భారత్ నుంచి 36 మంది అథ్లెటిక్స్ బరిలోకి దిగుతున్నారు. -
ఆరంభం...అదుర్స్
-
పతకం నంబర్ 24
-
పతకం నంబర్ 25
రియోడీజనీరో: అమెరికా స్టార్ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ రియో ఒలింపిక్స్ లో మరో రెండు బంగారు పతకాలు సాధించాడు. 200 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో, 4x100 ప్రీ స్టయిల్ రిలే విభాగాలలో గోల్డ్ మెడల్స్ దక్కించుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ లో ఈ విభాగంలో తనపై నెగ్గిన జపాన్ స్విమ్మర్ మసాటో సాకాయ్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు. అతడిని రెండో స్థానానికి నెట్టి మైకేల్ ఫెల్ప్స్ స్వర్ణ పతకం చేజిక్కించుకున్నాడు. క్వాలిఫయింగ్ రౌండ్ లో మొదటి స్థానంలో నిలిచిన హంగేరీ స్విమ్మర్ థామస్ కెండెర్సీ కాంస్య పతకం దక్కించుకున్నాడు. 4X100 ఫ్రిస్టయిల్ ఈత పోటీలోనూ మైకేల్ ఫెల్ప్స్ బంగారు పతకం సాధించాడు. తాజాగా సాధించిన పతకాలతో అతడి ఖాతాలో 25 ఒలింపిక్ పతకాలు ఉన్నాయి. ఇందులో 21 బంగారం, 2 రజతాలు, 2 కాంస్య పతకాలున్నాయి. -
‘ఫ్లయింగ్ ఫిష్’ కు గోల్డ్ మెడల్
రియోడీజనీరో: ఈతలో తనకు తిరుగులేదని అమెరికా స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ మరోసారి రుజువు చేశాడు. 23వ ఒలింపిక్ పతకాన్ని గెలిచి తన రికార్డును మరింత పదిలపరుచుకున్నాడు. రియో ఒలింపిక్స్ లో 4X100 ఫ్రిస్టయిల్ ఈత పోటీలో బంగారు పతకం సాధించి బోణి కొట్టాడు. అతడికిది 19వ ఒలింపిక్ గోల్డ్ మెడల్ కావడం విశేషం. 2 రజతాలు, 2 కాంస్యాలు కూడా అతడి ఖాతాలో ఉన్నాయి. ‘ఫ్లయింగ్ ఫిష్’ గా ప్రఖ్యాతి గాంచిన ఈ 6 అడుగుల 4 అంగుళాల ఎత్తున్న స్విమ్మర్ రియో ఒలింపిక్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో ఫెల్ప్స్ ఏకంగా 8 స్వర్ణాలు గెలిచి ఒకే ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు కూడా తిరగ రాస్తాడేమో చూడాలి. -
బ్రెజిల్ అథ్లెట్లకు డోప్ టెస్టులు చేయలేదు!
రియోడీజనీరో: రియో ఒలింపిక్స్ కు నెల రోజుల ముందు నుంచి ఇప్పటివరకూ తమ అథ్లెట్లకు డోపింగ్ టెస్టులు చేయలేదని ఆతిథ్య బ్రెజిల్ అధికారులు షాకింగ్ వార్త తెలిపారు. జూలై 1 - 24 తేదీల మధ్య ఒక్క అథ్లెట్ కు కూడా డోప్ టెస్టులు చేయలేదని వెల్లడించింది. ఈ విషయంపై ఇతర దేశాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి దేశం తమ అథ్లెట్లకు కచ్చితంగా డోపింగ్ టెస్టులు నిర్వహించాలి కానీ రియోకు ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్ అలా చేయకపోవడంపై ఇతర దేశాల అథ్లెట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం అక్కడ చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) తమ దేశ డోపింగ్ టెస్టింగ్ లాబోరేటరీని మూసివేసిన కారణంగా డోప్ టెస్టులు చేయలేదని బ్రెజిల్ వివరణ ఇచ్చుకుంది. డోపింగ్ టెస్టులు ఎందుకు నిర్వహించలేదో తెలపాలంటూ వాడా డైరెక్టర్ బ్రెజిల్ అధికారులను ప్రశ్నించగా, అసలు విషయాన్ని బయటపెట్టారు. అయితే ఈ వివరణపై వాడా అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ దేశంలోని మరో మూడు ల్యాబ్ లకు శాంపిల్స్ పంపించినా, అక్కడ పరికరాలు లేనందున టెస్టులకు వీలుకాలేదని బ్రెజిల్ చెబుతోంది. జూన్ 22న బ్రెజిల్ లాబోరేటరీపై విధించిన నిషేధాన్ని జూలై 20న ఎత్తివేసిన విషయం తెలిసిందే. -
రియో ఒలంపిక్స్‌లో సూపర్ పవర్ ఎవరు ?
-
చిన్నారులకు ఫ్రీగా ఒలింపిక్స్ టికెట్లు
రియోడీజనీరో: ఆటలంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. మరి ప్రపంచంలోనే పెద్ద ఆటల పండుగ.. రియో ఒలింపిక్స్ జరుగుతుంటే చిన్నారులు మాత్రం ఇంట్లో ఎందుకు కూర్చోవాలి?... సరిగ్గా ఇలాగే అనుకుందేమో... రియో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ రెండు లక్షల మంది చిన్నారులకు ఒలింపిక్స్ టికెట్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్గనైజింగ్ కమిటీ కమ్యూనికేషన్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మారియో అండ్రాడా గురువారం వెల్లడించారు. టికెట్ల అమ్మకం దాదాపుగా పూర్తయిందని, వందశాతం రెవెన్యూ వచ్చినందున కొన్ని టికెట్లను చిన్నారులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ఆండ్రాడా తెలిపారు. బ్రెజిల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్న పిల్లలకు ఈ టికెట్లు ఉచితంగా అందజేస్తామని చెప్పారు. నేటి నుంచి 21వ తేదీ వరకు బ్రెజిల్ రియో నగరంలో ఒలింపిక్స్ క్రీడలు జరుగనున్నాయి. -
అమెరికా నుంచి 555 మంది...
ఒలింపిక్స్‌కు రికార్డు స్థాయిలో జంబో బృందం మహిళలే ఎక్కువ లాస్ ఏంజెల్స్: రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్‌కు అమెరికా దేశం 555 మందితో కూడిన భారీ బృందాన్ని పంపించనుంది. ఇది చైనా (416)కన్నా ఎక్కువ కావడం విశేషం. మరోవైపు అమెరికా బృందంలో 263 మంది పురుషులుంటే 292 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. గత లండన్ ఒలింపిక్స్‌లోనూ యూఎస్.. మహిళలనే ఎక్కువగా పంపింది. ఓవరాల్‌గా ఇందులో 68 మంది స్వర్ణపతక విజేతలుండగా.. 191 మంది ఒలింపియన్స్ ఉన్నారు. 306 పతక ఈవెంట్స్‌లో అమెరికా 27 విభాగాల్లో 244 పతకాల కోసం బరిలోకి దిగబోతోంది. మైకేల్ ఫెల్ప్స్ (స్విమ్మింగ్), అలిసన్ ఫెలిక్స్ (ట్రాక్ అండ్ ఫీల్డ్), సెరెనా సిస్టర్స్ (టెన్నిస్) తదితర ప్రముఖ ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. -
అథ్లెట్లతో మోదీ భేటీ
-
టికెట్ల అమ్మకాలు షురూ
బ్రెజిల్ లో త్వరలో జరగనున్న ఒలింపిక్స్ టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఆగస్టు 5 నుంచి 21 వరకు రియో డి జెనిరోలో ఈ క్రీడోత్సవాలు జరుగుతాయి. వాటి టికెట్లను స్థానిక దుకాణాలలో తొలిసారిగా అమ్మకాలకు పెట్టినట్లు ఒలింపిక్స్ నిర్వాహకులు తెలిపారు. ఇంతకుముందు బ్రెజిల్ వాసులకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే టికెట్లు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు రియోలోని రెండు షాపింగ్ మాల్స్ లో కూడా వాటిని అమ్మకానికి పెట్టారు. రాబోయే వారాల్లో రియోతో పాటు ఒలింపిక్స్ ఫుట్ బాల్ మ్యాచ్ లు జరిగే సావో పాలో, బెలో హారిజాంట్, సాల్వడార్, బ్రసీలియా, మనౌస్ నగరాల్లో 30 టికెట్ కౌంటర్లను త్వరలో ప్రారంభిస్తామని చెబుతున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద భారీగా రష్ ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నామని, అందువల్ల బ్రెజిల్ వాసులు చిట్ట చివరి నిమిషం వరకు ఆగకుండా ముందే టికెట్లు కొనుక్కోవాలని సూచించారు. వెబ్ సైట్ లో ఉన్న ధరలకే టికెట్ కౌంటర్లలో కూడా అమ్ముతున్నారో లేదో జాగ్రత్తగా చూసుకోవాలని, అధిక ధర చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికే ఒలింపిక్స్ కోసం 42 లక్షల టికెట్లు అమ్మేశామని, మరో 18 లక్షల టికెట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఒలింపిక్ టికెట్ల ధరలు ఆయా క్రీడాంశాలను బట్టి రూ. 800 నుంచి కొన్ని వేల వరకు ఉన్నాయి. -
రియో ఒలంపిక్స్ కు స్టార్ ఇండియా సిద్ధం!
ప్రపంచ క్రీడా సంరంభానికి స్టార్ ఇండియా సర్వం సిద్ధం చేసింది. క్రీడాభిమానులను ఆకట్టుకునేందుకు వీలుగా 24x7 ప్రసారాలతో సమాయత్తమవుతోంది. మొత్తం 34 చానెల్స్.. వాటిలో 8 చానెల్స్ పూర్తిగా క్రీడా ప్రేమికులకోసమే. అవును...ఎప్పటినుంచి అనుకుంటున్నారా.. ఇంకా 49 రోజుల తర్వాత.. అంటే ఆగస్టు 5 నుంచి బ్రెజిల్ లో జరగబోయే రియో ఒలంపిక్స్ ప్రారంభతేదీ నుంచి ఈ ఒలంపిక్స్ ను 24x7 లు క్రీడాభిమానులు వీక్షించేలా ఈ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఎనిమిది చానెల్స్ ను పూర్తిగా రియో ఒలంపిక్స్ ప్రసారాలకు కేటాయిస్తున్నామని స్టార్ ఇండియా గురువారం వెల్లడించింది. ఇంగ్లీష్, హిందీ రెండు భాషల్లో రియో ఒలంపిక్స్ ప్రసారం చేయనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్ రెండూ కలిసి ఒలంపిక్స్ ను 3000 పైగా గంటలపాటు లైవ్ కంటెట్ ప్రసారం చేసేలా నిర్ణయం తీసుకున్నాయి. 'ఒలంపిక్స్ అనేది బహుళ క్రీడా వేడుక. ఈ వేడుకల్లో భారత్ క్రీడాకారులు చాలా మంది పాల్గొంటుంటారు. భారత క్రీడాభిమానులకు ఈ వేడుకలో జరగబోయే క్రీడలను గురించి సమగ్ర సమాచారం అందించడానికి తోడ్పడతాం.. 24x7 బేసిస్ తో ఎనిమిది చానెల్స్ ను ఈ అపూర్వమైన ప్రదర్శన ఇవ్వడానికే కేటాయించాం.. మొదటిసారి రెండు భాషల్లో ఈ వేడుకను ప్రసారం చేయబోతున్నాం.. ' అని స్టార్ స్పోర్ట్స్ సీఈవో నితిన్ కుక్రేజా తెలిపారు. యాడ్ సపోర్టుతో హాట్ స్టార్ లో ఒలంపిక్స్ కంటెట్ లను ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఎక్స్ క్లూజివ్ గా ఎలైట్ ప్యానెల్ తో పాటు, భారత స్పోర్ట్స్ నిపుణులను ఏర్పాటుచేసి, ఒలంపిక్స్ గురించి విశ్లేషణ, కామెంటరీ, అభిప్రాయాలను క్రీడాభిమానులతో షేర్ చేసుకునేలా లైవ్ ప్రోగ్రామ్ లు చేపడతామన్నారు. -
కొరియా మళ్లీ కమాల్ కియా..
206 దేశాలు, 60 వేల దుస్తుల హ్యాంగర్లు, 1కోటి కుర్చీలు, 34 వేల మంచాలు, 10,500 మంది ఆటగాళ్లు, 42 ఈవెంట్లు, 17 రోజులు, 75 లక్షల టికెట్లు తడిసిమోపెడయ్యే ఖర్చు. ఇవీ.. మరి కొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న విశ్వక్రీడా సంగ్రామం రియో ఒలింపిక్ 2016 కోసం జరుగుతోన్న ఏర్పాట్లు. క్రీడలు ప్రారంభం కాకముందే ఒలింపిక్ అంశంలో తనదైన పత్యేకతను చాటుకుని వార్తల్లో నిలిచింది ఆసియా దేశం దక్షిణకొరియా. పోటీలు జరుగుతోన్న బ్రెజిల్.. ప్రపంచాన్ని గడగడలాడించిన జికా వైరస్ కు జన్మస్థానం కావడంతో తన ఆటగాళ్లకు ఆ వైరస్ సోకకుండా జికా ప్రూఫ్ యూనిఫామ్ లను సిద్ధం చేసింది దక్షిణకొరియా. కాగా జికా వైరస్ తగ్గుముఖం పట్టిందని, దాదాపు అంతరింపజేశామని బ్రెజిల్ ఇదివరకు ప్రకటించడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దానిని ఆమోదించడంతో ఒలింపిక్ క్రీడలకు విఘ్నాలు తొలిగిపోయాయి. అయినాసరే ఎందుకైనా మంచిదని జికా ఫ్రూఫ్ దుస్తులు తయారుచేశామని, దీనిని ధరిస్తే వైరస్ వ్యాప్తిచేసే దోమలు దరిచేరవని కొరియా చెబుతోంది. సియోల్ లో బుధవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో కొరియర్ క్రీడాకారులు కొత్తగా రూపొందించిన జికా వైరస్ యూనిఫామ్ లను ప్రదర్శించారు. ముందుజాగ్రత్తగా దక్షిణ కొరియా చేపట్టిన ఈ దుస్తుల చర్యను తెలుసుకుని ఇతర దేశాల ఆటగాళ్లు అనుకుంటున్నారట.. 'కొరియా.. తూనే కమాల్ కియా'అని! దక్షిణ అమెరికా ఖండ దేశం బ్రెజిల్ లోని అతిపెద్ద తీర నగరం రియో డి జెనిరోలో ఆగస్ట్ 5 నుంచి 21 వరకు ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. -
సల్మాన్ కు సీనియర్ నటి మద్దతు
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడా బృందానికి గుడ్‌విల్ అంబాసిండర్‌గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను నియమించడాన్ని సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని సమర్థించారు. 'దబాంగ్' హీరోను ప్రజలు ఎంతో ఇష్టపడతారని, అతడిని బ్రాండ్ అంబాసిడర్ నియమిస్తే తప్పేంటని ప్రశ్నించారు. 'వ్యాట్ ఈజ్ ద ప్రాబ్లమ్' అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వెలుపల సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, సల్మాన్ ను గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించడం పట్ల లెజండరీ స్ప్రింటర్ మిల్ఖాసింగ్, రెజర్ల్ యోగేశ్వర్ దత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సల్మాన్ నియామకంలో ఎలాంటి డబ్బు ప్రస్తావన లేదని, ఒలింపిక్ క్రీడలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఆయనను అంబాసిడర్‌గా నియమించినట్టు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) తెలిపింది. -
రియో ఒలింపిక్స్ లో సానియాతో జోడీకి ఓకే!
చెన్నై: ఈ ఏడాది ఆగస్టులో జరుగనున్నరియో ఒలింపిక్స్ క్రీడలకు ఆటగాళ్ల ఎంపికలో రాజకీయాలకు తావుండరాదని భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా ఎంపిక వివాదాలను ఈసారి సృష్టించకూడదని, మెన్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో తనతో జట్టు కట్టడానికి రోహన్ బోపన్న, సానియా మీర్జా అర్హులని ఆయన పేర్కొన్నారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో పేస్ తో జతకట్టి ఆడటానికి బోపన్న, మహేశ్ భూపతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆనాటి ఘటనను గుర్తుచేసుకున్న పేస్ అప్పట్లో చెత్త రాజకీయాలకు పాల్పడ్డారని, ఈసారి అలా జరుగకూడదని అన్నారు. 'డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ కు సంబందించిన ఆనాటి ఘటన పునరావృతం కాబోదని ఆశిస్తున్నా. ప్రతిభ ఆధారంగానే సెలక్షన్ జరుగాలి. 2015లో నేను మూడు మిక్స్డ్ డబుల్స్ గ్రాండ్ స్లామ్స్ గెలుపొందాను. కాబట్టి రియో ఒలింపిక్స్ కు వెళ్లే భారత మిక్స్డ్ డబుల్స్ బృందంలో నేను ముందంజలో ఉంటానని భావిస్తున్నాను' అని పేస్ చెప్పారు. చెన్నై ఓపెన్ లో పాల్గొనడం ద్వారా 2016లో తన ఆటను మొదలుపెట్టిన పేస్ ప్రధానంగా రియో ఒలింపిక్స్ పై దృష్టి పెట్టినట్టు తెలిపారు. రియో ఒలింపిక్స్ లో భారత తరఫున డబుల్స్ లో బోపన్నతో, మిక్స్డ్ డబుల్స్ లో సానియాతో జత కట్టాలని తాను భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
తొలి గంటలోనే 1.2 లక్షల టికెట్ల అమ్మకాలు
రియో డి జనీరో: వచ్చే ఏడాది బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో నిర్వహించునున్న ఒలింపిక్స్ 2016 టికెట్ల కోసం క్రీడాభిమానులు ఎగబడుతున్నారు. ఆన్లైన్ లో ఉంచిన తొలి గంటలో ఒలింపిక్స్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తొలిగంటకే 1.2 లక్షల టికెట్ల విక్రయాలు జరిగాయని ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. అందులో ఎక్కువగా ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ గేమ్స్ టికెట్లకు అధిక డిమాండ్ ఉందని చెప్పారు. కాగా, తొలి 8 గంటల వ్యవధిలో 2.4 లక్షల టికెట్లు అమ్ముడయినట్లు చెప్పారు. కాగా ఇతర దేశాల వారు మాత్రం అధికారిక విక్రయదారుల నుంచి మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని ఈవెంట్ ఆర్గనైజర్స్ సూచించారు. స్వదేశం బ్రెజిల్ కోసం రెండు లక్షల టికెట్లు కేటాయించామని, తొలి రెండు లక్షల మందికి మాత్రమే ఈ అవకాశం అభిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. రియో డి జనీరో, సావో పోలో, మినాస్ గెరేస్, పరానా ఏరియాల వాళ్లు టికెట్లు కొనుగోలులో మంగళవారం అగ్రస్థానంలో ఉన్నారు. 518 గేమ్స్‌కు గానూ ఇంకా 400 మ్యాచ్‌లకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. రియో ఒలింపిక్స్ 2016 ఆగస్టు 5-21 తేదీల మధ్య నిర్వహించనున్న విషయం విదితమే. దక్షిణ అమెరికాలో జరగనున్న తొలి ఒలింపిక్ గేమ్స్ ఇవే కావడం గమనార్హం.