
‘ఫ్లయింగ్ ఫిష్’ కు గోల్డ్ మెడల్
రియోడీజనీరో: ఈతలో తనకు తిరుగులేదని అమెరికా స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ మరోసారి రుజువు చేశాడు. 23వ ఒలింపిక్ పతకాన్ని గెలిచి తన రికార్డును మరింత పదిలపరుచుకున్నాడు. రియో ఒలింపిక్స్ లో 4X100 ఫ్రిస్టయిల్ ఈత పోటీలో బంగారు పతకం సాధించి బోణి కొట్టాడు. అతడికిది 19వ ఒలింపిక్ గోల్డ్ మెడల్ కావడం విశేషం. 2 రజతాలు, 2 కాంస్యాలు కూడా అతడి ఖాతాలో ఉన్నాయి.
‘ఫ్లయింగ్ ఫిష్’ గా ప్రఖ్యాతి గాంచిన ఈ 6 అడుగుల 4 అంగుళాల ఎత్తున్న స్విమ్మర్ రియో ఒలింపిక్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో ఫెల్ప్స్ ఏకంగా 8 స్వర్ణాలు గెలిచి ఒకే ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు కూడా తిరగ రాస్తాడేమో చూడాలి.