26 ఏళ్ల అమెరికా మహిళా స్విమ్మర్ కేటీ లెడెకీ చరిత్ర సృష్టించింది. జపాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో 16 స్వర్ణ పతాకాలు సాధించి, ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు సాధించిన రికార్డు దిగ్గజ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ (15) పేరిట ఉండేది.
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కేటీ.. ఫెల్ప్స్ రికార్డు బద్దలు కొట్టి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇవాళ (జులై 30) జరిగిన 800 మీటర్ల ఫ్రీస్టైల్ ఫైనల్‌లో స్వర్ణం గెలవడం ద్వారా లెడెకీ ఈ ఘనత సాధించింది. 800 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణం కైవసం చేసుకున్న లెడెకీ మరో రికార్డును కూడా బద్దలు కొట్టింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ మహిళల 800 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు (6) సాధించిన స్విమ్మర్‌గా రికార్డు నెలకొల్పింది.
అలాగే ఒకే ఈవెంట్‌లో అత్యధిక ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ బంగారు పతకాలు (6) సాధించిన స్విమ్మర్‌గానూ రికార్డుల్లోకెక్కింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లోనూ స్వర్ణంతో మెరిసిన కేటీ.. ఇప్పటివరకు తన కెరీర్‌లో 20 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ స్వర్ణాలు, 7 ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ సాధించింది. మహిళల స్విమ్మింగ్ చరిత్రలో ఏ సిమ్మర్ కేటీ సాధించినన్ని గోల్డ్ మెడల్స్ సాధించలేదు.
Comments
Please login to add a commentAdd a comment