World Swimming Championship
-
చరిత్ర సృష్టించిన కేటీ.. మైఖేల్ ఫెల్ప్స్ రికార్డు బద్ధలు
26 ఏళ్ల అమెరికా మహిళా స్విమ్మర్ కేటీ లెడెకీ చరిత్ర సృష్టించింది. జపాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్లో 16 స్వర్ణ పతాకాలు సాధించి, ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్లో అత్యధిక స్వర్ణ పతకాలు సాధించిన రికార్డు దిగ్గజ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ (15) పేరిట ఉండేది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కేటీ.. ఫెల్ప్స్ రికార్డు బద్దలు కొట్టి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇవాళ (జులై 30) జరిగిన 800 మీటర్ల ఫ్రీస్టైల్ ఫైనల్లో స్వర్ణం గెలవడం ద్వారా లెడెకీ ఈ ఘనత సాధించింది. 800 మీటర్ల ఈవెంట్లో స్వర్ణం కైవసం చేసుకున్న లెడెకీ మరో రికార్డును కూడా బద్దలు కొట్టింది. వరల్డ్ ఛాంపియన్షిప్ మహిళల 800 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్స్లో అత్యధిక స్వర్ణ పతకాలు (6) సాధించిన స్విమ్మర్గా రికార్డు నెలకొల్పింది. అలాగే ఒకే ఈవెంట్లో అత్యధిక ప్రపంచ ఛాంపియన్షిప్స్ బంగారు పతకాలు (6) సాధించిన స్విమ్మర్గానూ రికార్డుల్లోకెక్కింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్స్లో 1500 మీటర్ల ఫ్రీస్టైల్లోనూ స్వర్ణంతో మెరిసిన కేటీ.. ఇప్పటివరకు తన కెరీర్లో 20 వరల్డ్ ఛాంపియన్షిప్స్ స్వర్ణాలు, 7 ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ సాధించింది. మహిళల స్విమ్మింగ్ చరిత్రలో ఏ సిమ్మర్ కేటీ సాధించినన్ని గోల్డ్ మెడల్స్ సాధించలేదు. -
ఒకే ఈవెంట్లో 3 ప్రపంచ రికార్డులు
కజాన్ (రష్యా) : ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో ప్రపంచ రికార్డుల జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన మిక్స్డ్ 4ఁ100 మీటర్ల మెడ్లే రిలేలో మూడు కొత్త ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఉదయం జరిగిన రెండో హీట్లో రష్యా బృందం 3ని:45.87 సెకన్లతో రేసును ముగించి... 2014 జనవరిలో 3ని:46.52 సెకన్లతో ఆస్ట్రేలియా జట్టు నెలకొల్పిన ప్రపంచ రికార్డును తిరగరాసింది. ఆ వెంటనే మూడో హీట్లో రియాన్ మర్ఫీ, కెవిన్ కార్డెస్, కెండిల్ స్టీవార్ట్, లియా నీల్లతో కూడిన అమెరికా బృందం 3ని:42.33 సెకన్లలో గమ్యానికి చేరుకొని కొన్ని నిమిషాలముందు రష్యా సాధించిన ప్రపంచ రికార్డును సవరించింది. సాయంత్రం జరిగిన మిక్స్డ్ 4ఁ100 మీటర్ల మెడ్లే రిలే ఫైనల్లో క్రిస్ వాకర్, ఆడమ్ పీటీ, మేరీ ఒకానర్, ఫ్రాన్ హల్సల్లతో కూడిన బ్రిటన్ జట్టు 3ని:41.71 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని కొత్త ప్రపంచ రికార్డు లిఖిండంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. -
లెడెకి ప్రపంచ రికార్డు
ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్ కజాన్ (రష్యా): ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో అమెరికా సూపర్ స్టార్ స్విమ్మర్ కేటీ లెడెకి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. సోమవారం జరిగిన మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ హీట్ రేసును 18 ఏళ్ల లెడెకి 15ని: 27.71 సెకన్లలో ముగించింది. తద్వారా గతేడాది పాన్ పసిఫిక్ చాంపియన్షిప్లో 15ని:28.35 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది. 1500 మీటర్ల విభాగంలో లెడెకిది నాలుగో ప్రపం చ రికార్డు కావడం విశేషం. 16 ఏళ్ల ప్రాయంలో 2013 ప్రపంచ చాంపియన్షిప్లో 15ని:36.53 సెకన్లతో తొలి ప్రపంచ రికార్డును సృష్టించిన లెడెకి... ఆ తర్వాత వుడ్లాండ్స్ మీట్లో (15ని:34.23 సెకన్లు), పాన్ పసిఫిక్ చాంపియన్షిప్లో మరో రెండుసార్లు ప్రపంచ రికార్డును సవరించింది. 400, 800 మీటర్ల విభాగాల్లోనూ లెడెకి పేరిటే ప్రపంచ రికార్డులు ఉండటం విశేషం.