
Boxing Bouts In 2016 Olympics Were Fixed: 2016 రియో ఒలింపిక్స్‌కు సంబంధించిన ఓ సంచలన విషయం తాజాగా వెలుగు చూసింది. ఆ విశ్వక్రీడల్లో రెండు పతకాల పోరులు(ఫైనల్స్) సహా మొత్తం 14 బాక్సింగ్ బౌట్లు ఫిక్స్ అయ్యాయని మెక్‌లారెన్ గ్లోబల్ స్పోర్ట్స్ సొల్యూషన్స్ (ఎమ్‌జీఎస్‌ఎస్) అనే సంస్థ చేపట్టిన స్వతంత్ర దర్యాప్తులో బహిర్గతమైనట్లు తెలుస్తోంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లోనే ఈ ఫిక్సింగ్ స్కాంకు బీజం పడినట్లు సదరు సంస్థ తమ నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య(ఏఐబీఏ)చే నియమించబడిన రిఫరీలు, న్యాయనిర్ణేతలే ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నివేదిక వెల్లడించింది. ఇందుకు నాటి ఏఐబీఏ అధ్యక్షుడు చింగ్ బాధ్యత వహించాల్సి ఉందని పేర్కొంది.
కాగా, రియో ఒలింపిక్స్ క్వార్టర్స్ పోరులో రష్యా బాక్సర్ వ్లాదిమిర్ నికితిన్‌పై ప్రపంచ ఛాంపియన్ ఐర్లాండ్‌కు చెందిన మైఖేల్ కోన్‌లాన్ పిడిగుద్దులతో విరుచుకుపడినప్పటికీ రిఫరీ, న్యాయనిర్ణేతలు అతను ఓడిపోయినట్లు ప్రకటించారు. దీంతో మైఖేల్ సహనం కోల్పోయి న్యాయ నిర్ణేతలపై దూషణకు దిగాడు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే, తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో సైతం ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. న్యాయనిర్ణేతలు ప్రత్యర్ధులకు అనుకూలంగా వ్యవహరించారంటూ భారత స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్ సంచలన ఆరోపణలు చేసింది.
చదవండి: సీఎస్‌కేలో 10 మందే బ్యాటర్లు.. ధోని కీపర్, కెప్టెన్ మాత్రమే..!