
ఇండియన్ ప్రొ బాక్సింగ్ లీగ్(IPBL)లో భాగంగా వరల్డ్ చాంపియన్స్‌తో పోటీలో భారత బాక్సర్లు అదరగొట్టారు. రానా దగ్గుబాటి బాక్సింగ్ బే- ఆంటొని పెట్టిస్ ఏపీఎఫ్‌సీల మధ్య జరుగుతున్న బాక్సింగ్ పోటీల్లో అక్షయ్ చహల్- సబరి జయశంకర్ సత్తా చాటారు.
హైదరాబాద్ వేదికగా ప్రపంచ చాంపియన్లు అయిన లూయీస్ ఫెలిషియానో, సెర్గియో పెట్టిస్‌లపై అద్భుత విజయం సాధించి.. ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు భారత్ సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు.
అక్షయ్-సబరి అద్బుత పోరాటం కారణంగా టీమిండియా- టీమ్ అమెరికా మధ్య సాగిన పోరు 2-2తో డ్రాగా ముగిసింది. ఈ సందర్భంగా మాజీ యూఎఫ్‌సీ లైట్ వెయిట్ ఛాంపియన్ ఆంటోని పెట్టిస్ మాట్లాడుతూ.. ‘‘IPBL ప్రపంచంలోని అతిపెద్ద బాక్సింగ్ లీగ్‌లలో ఒకటిగా ఎదుగుతుందనడంలో సందేహం లేదు.
అగ్రశ్రేణి బాక్సర్లను ఇక్కడికి తీసుకువచ్చేందుకు నేను కట్టుబడి ఉన్నాను. ఇండియాలో ఈ పోటీలను మరింత విస్తృతం చేయాలనే సంకల్పంతో ఉన్నాం’’ అని తెలిపాడు. ఇక రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ అసమాన హోస్ట్ అని మరోసారి నిరూపితమైంది’’అని హర్షం వ్యక్తం చేశాడు.
ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. ఇండియాలోనే బాక్సింగ్ క్యాపిటల్‌గా హైదరాబాద్ ఎదిగేలా తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. పెట్టిస్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచాడని.. అతడి సహకారం ఇలాగే కొనసాగుతుందని రానా ఆశాభావం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment