భారత్‌లో బాక్సింగ్‌కు ఆదరణ పెంచే దిశగా బాక్సింగ్‌బే, స్పిరిట్ మీడియా ఫౌండర్ రానా దగ్గుబాటి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండు బాక్సింగ్ ఈవెంట్‌లను నిర్వహించేందుకు 'ఆంథోనీ పెట్టిస్ ఫైట్ క్లబ్' వ్యవస్థాపకుడు ఆంథోనీ పెట్టిస్‌తో రాణా ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ ఏడాది డిసెంబర్ తర్వాత ఈ రెండు ఈవెంట్లు జరగనున్నాయి. ఒకటి భారత్‌లో, మరొకటి యునైటెడ్ స్టేట్స్‌లో నిర్వహించాలని రానా, ఆంథోని పెట్టిస్ నిర్ణయించుకున్నారు. కాగా ఈ రెండు ఈవెంట్లు 5 వర్సెస్ 5గా జరగనున్నాయి.
ఇక ఈ ఒప్పందం మెక్సికోలో ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ (WBC) ప్రతినిథులు ఆస్కార్ వల్లే, ఎరికా కాంట్రేరాస్ ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. కాగా ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ క్లబ్‌లను ప్రమోట్ చేసేందుకు వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్‌ను 1963లో స్ధాపించారు.
ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. "ఆంథోనీ పెట్టిస్ ఫైట్ క్లబ్‌తో ఒప్పందం భారత బాక్సింగ్ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది. భారత టర్ఫ్‌లో స్టార్ యూఎస్ అథ్లెట్లకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా.. మన బాక్సర్‌లకు అంతర్జాతీయ స్ధాయిలో అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి.
నిజంగా గ్రేట్ బాక్సింగ్ క్లబ్‌తో భాగస్వామిగా చేరడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఒప్పందం భారత్, యూఎస్ బాక్సర్లకు మంచి అవకాశాలు కల్పిస్తోందన్న నమ్మకం మాకు ఉంది. అదేవిధంగా భారత్‌లో బాక్సింగ్‌కు ఆదరణ పెంచేందుకు బాక్సింగ్ బే క్లబ్ అన్ని విధాల కృషి చేస్తుంది.
భారత బాక్సింగ్‌ను ప్రపంచానికి పరిచయం చేసేందుకే ఏపీఎఫ్‌సీతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని" పేర్కొన్నాడు. అయితే అగ్రశ్రేణి అమెరికన్ బాక్సర్లు భారత్‌లో జరిగే ఈవెంట్‌లో పాల్గోనుండడం ఇదే తొలిసారి. కాగా ఆంథోనీ పెట్టిస్.. ఒక మాజీ యూఎఫ్‌సీ లైట్ వెయిట్ ఛాంపియన్.
Comments
Please login to add a commentAdd a comment