Anthony
-
భారత బాక్సింగ్ చరిత్రలో ఇదొక మైలు రాయి: రానా
భారత్‌లో బాక్సింగ్‌కు ఆదరణ పెంచే దిశగా బాక్సింగ్‌బే, స్పిరిట్ మీడియా ఫౌండర్ రానా దగ్గుబాటి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండు బాక్సింగ్ ఈవెంట్లను నిర్వహించేందుకు 'ఆంథోనీ పెట్టిస్ ఫైట్ క్లబ్' వ్యవస్థాపకుడు ఆంథోనీ పెట్టిస్‌తో రాణా ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఈ ఏడాది డిసెంబర్ తర్వాత ఈ రెండు ఈవెంట్లు జరగనున్నాయి. ఒకటి భారత్‌లో, మరొకటి యునైటెడ్ స్టేట్స్లో నిర్వహించాలని రానా, ఆంథోని పెట్టిస్ నిర్ణయించుకున్నారు. కాగా ఈ రెండు ఈవెంట్లు 5 వర్సెస్ 5గా జరగనున్నాయి. ఇక ఈ ఒప్పందం మెక్సికోలో ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ (WBC) ప్రతినిథులు ఆస్కార్ వల్లే, ఎరికా కాంట్రేరాస్ ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. కాగా ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ క్లబ్‌లను ప్రమోట్ చేసేందుకు వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్‌ను 1963లో స్ధాపించారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. "ఆంథోనీ పెట్టిస్ ఫైట్ క్లబ్‌తో ఒప్పందం భారత బాక్సింగ్ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది. భారత టర్ఫ్‌లో స్టార్ యూఎస్ అథ్లెట్లకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా.. మన బాక్సర్లకు అంతర్జాతీయ స్ధాయిలో అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. నిజంగా గ్రేట్ బాక్సింగ్ క్లబ్‌తో భాగస్వామిగా చేరడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఒప్పందం భారత్, యూఎస్ బాక్సర్లకు మంచి అవకాశాలు కల్పిస్తోందన్న నమ్మకం మాకు ఉంది. అదేవిధంగా భారత్‌లో బాక్సింగ్‌కు ఆదరణ పెంచేందుకు బాక్సింగ్ బే క్లబ్ అన్ని విధాల కృషి చేస్తుంది.భారత బాక్సింగ్‌ను ప్రపంచానికి పరిచయం చేసేందుకే ఏపీఎఫ్సీతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని" పేర్కొన్నాడు. అయితే అగ్రశ్రేణి అమెరికన్ బాక్సర్లు భారత్‌లో జరిగే ఈవెంట్లో పాల్గోనుండడం ఇదే తొలిసారి. కాగా ఆంథోనీ పెట్టిస్.. ఒక మాజీ యూఎఫ్‌సీ లైట్ వెయిట్ ఛాంపియన్. -
స్వేచ్ఛాయుత ఎన్నికలకు వీలేది? ఈసీని నిలదీసిన విపక్షాలు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: రాష్ట్రంలో గతేడాది జరిగిన ఒక్క ఉపఎన్నికనే (మునుగోడు అసెంబ్లీ సీటుకు) సవ్యంగా నిర్వహించలేకపోయిన అధికార యంత్రాంగం.. శాసనసభ సాధారణ ఎన్నికలను ఏ మేరకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించగలుగుతుందని విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ సహా సీపీఎం, బీఎస్పీ, ఆప్, టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీశాయి. మునుగోడు ఉపఎన్నికలో రూ. వందల కోట్లను అధికార బీఆర్ఎస్ బహిరంగంగా పంచిపెట్టి ఓటర్లను ప్రలోభపెట్టినా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోయిందని ఆరోపించాయి. ఏకంగా పోలీసు వాహనాలు, అంబులెన్సుల్లో అధికార బీఆర్ఎస్ డబ్బు సరఫరా చేసిందని దుయ్యబట్టాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టింది. దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ తీవ్రంగా ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల బృందం హామీ ఇచ్చిందని విపక్షాలు తెలిపాయి. సీఈసీతో సమావేశం అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న బి.వినోద్ కుమార్. చిత్రంలో భరత్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర బలగాలను దింపాలి: బీజేపీ మునుగోడు ఉపఎన్నికతోపాటు గత శాసనసభ ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఈసారి అసెంబ్లీ ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించాలని బీజేపీ జాతీయ నేత ఓమ్ పాఠక్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, ఆంథోనీరెడ్డి ఈసీ బృందాన్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల సీనియర్ అధికారులను భారీ స్థాయిలో ఎన్నికల పరిశీలకులుగా పంపాలని కోరారు. బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు పనులు చేయా లని అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఓటర్ల జాబితాలో తీవ్ర లోపాలున్నాయని, వాటన్నింటినీ సరిచేసి పకడ్బందీగా తుది జాబితాను ప్రకటించాలని కోరారు. మద్యం షాపులు మూసేయిస్తే... మద్యం పంపిణీని నియంత్రించడానికి ఎన్నికల సమయంలో వైన్ షాపులను మూసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ సూచించింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు తమకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ప్రధానపోస్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిందని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి. శ్రీధర్‌బాబు, ఫిరోజ్‌ఖాన్, జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన అధికారుల బదిలీలను మళ్లీ జరపాలని కోరారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ కోసం వచ్చిన వేలసంఖ్యలోని దరఖాస్తులను ఇంకా పరిష్కరించలేదని, ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా ప్రచురణ గడువును అక్టోబర్ 4 నుంచి మరో తేదీకి పొడిగించాలన్నారు. ప్రజల మధ్య విభజనకు మతఛాందసవాదుల కుట్ర: బీఆర్ఎస్ ఎన్నికల వేళ హైదరాబాద్ సహా రాష్ట్రంలో ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి మతఛాందసవాదులు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక శాంతిభద్రతల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్లనున్న నేపథ్యంలో మతఛాందసవాదులను నియంత్రించాలని సీఈసీని కోరింది. పార్టీ నేతలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ ఈసీ బృందానికి కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారును పోలి ఉన్న రోడ్డురోలర్ గుర్తును ఓ పార్టీకి కేటా యించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కోరారు. కాగా, ఈ భేటీలో టీడీపీ నేతలు శ్రీపతి సతీష్‌కుమార్, కాసాని సతీష్, రాఘవేంద్ర ప్రతాప్, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, డీజీ నరసింహారావు, జ్యోతి, బీఎస్పీ నేతలు విజయార్య క్షత్రియ, రాజరత్నం, సురే‹Ùకుమార్, ఆప్ నేతలు దిడ్డి సుధాకర్, రాములు గౌడ్, హేమ ఈసీ బృందానికి తమ సూచనలు తెలియజేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఈసీ బృందానికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, పోలీసు అధికారులు స్వాగతం పలికారు. -
కార్డినల్‌గా తొలి దళితుడు.. పూల ఆంథోనీ
సాక్షి, హైదరాబాద్: ఆర్చిబిషప్ పూల ఆంథోనీ(60) క్యాథలిక్ కార్డినల్‌గా ప్రకటించబడ్డ విషయం తెలిసిందే. కేథలిక్కుల మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్.. వాటికన్ సిటీ(ఇటలీ) సెయింట్ పీటర్స్ బాసిలికాలో ఇవాళ పూల ఆంథోనీని కార్డినల్‌గా అధికారికంగా ప్రకటించనున్నారు. ఏపీ కర్నూల్‌కు చెందిన పూల ఆంథోనీ.. కార్డినల్ హోదా అందుకోబోయే తొలి దళితుడు కూడా. ఇవాళ(ఆగస్టు 27న) జరగబోయే కొత్త కార్డినల్స్ పరిషత్ సమావేశానికి కూడా పూల ఆంథోనీ హాజరుకానున్నారు. ఇక కేథలిక్ చర్చి చరిత్రలో ఈ హోదా పొందిన తొలి తెలుగు వ్యక్తి పూల ఆంథోనీ. కార్డినల్ హోదాలో.. పోప్ ఎన్నికలో పాల్గొనే అవకాశం పూల ఆంథోనీకి ఉంటుంది. ఆంథోనీతో పాటు భారత్ నుంచి గోవా, డామన్ ఆర్చి బిషప్ ఫిలిపె నెరి అంటోనియో సెబాస్టియో డొ రొసారియో ఫెర్రో కూడా కార్డినల్ ర్యాంక్ పొందిన వాళ్లలో ఉన్నారు. నేపథ్యం.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిందుకూరు గ్రామంలో జన్మించిన ఆంథోనీ.. 1992లో మొదటిసారిగా కడపలో క్రైస్తవ మతాచార్యుడుగా, 2008లో కర్నూలు బిషప్‌గా నియమితులయ్యారు. 2021 జనవరిలో హైదరాబాద్ ఆర్చిబిషప్ అయ్యారు. కార్డినల్‌గా నియమితులైన ఆంథోనీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ ఆర్చిబిషప్ హోదాలోనూ కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: 500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద వేలం -
కార్డినల్‌గా పూల ఆంథోనీ
హైదరాబాద్: ఆర్చిబిషప్ పూల ఆంథోనీ(60) భారత్‌లో కార్డినల్‌గా నియమితులయ్యారు. కేథలిక్కుల మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో ఆదివారం 21 మందిని కొత్త కార్డినల్స్‌గా ప్రకటించారు. వీరిలో భారత్ నుంచి ఆంథోనీతోపాటు గోవా, డామన్ ఆర్చి బిషప్ ఫిలిపె నెరి అంటోనియో సెబాస్టియో డొ రొసారియో ఫెర్రో ఉన్నారు. కేథలిక్ చర్చి చరిత్రలో ఈ హోదా పొందిన తొలి తెలుగు వ్యక్తి పూల ఆంథోనీ. కార్డినల్ హోదాలో పోప్ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఈయనకు ఉంటుంది. ఆగస్ట్ 27వ తేదీన జరిగే సమావేశం నాటికి కార్డినల్స్ సంఖ్య 229కు పెరగనుంది. అందులో 131 మందికి పోప్ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిందుకూరు గ్రామంలో జన్మించిన ఆంథోనీ 1992లో మొదటిసారిగా మతాచార్యుడుగా, 2008లో కర్నూలు బిషప్‌గా నియమితులయ్యారు. 2021 జనవరిలో హైదరాబాద్ ఆర్చిబిషప్ అయ్యారు. ఆగస్ట్ 27న వాటికన్లో కొత్త కార్డినల్స్ పరిషత్ సమావేశానికి పూల ఆంథోనీ హాజరుకానున్నారు. కార్డినల్‌గా నియమితులైన ఆంథోనీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ ఆర్చిబిషప్ హోదాలోనూ కొనసాగనున్నారు. -
అమెరికా దేనికైనా రెడీ
వాషింగ్టన్: ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి ఏ మార్గాౖన్నైనా అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నా మని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంథోని బ్లింకెన్ రష్యాకు హెచ్చరిక చేశారు. ఈ మేరకు ఆయన రష్యా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎలాంటి దారి ఎంచుకోవాలో రష్యానే నిర్ణయించుకోవాలన్నారు. లేఖలో రష్యా చర్యలపై యూఎస్, మిత్రపక్షాల ఆం దోళనను వివరించామని, రష్యా వెలిబుచ్చిన సందేహాలకు సమాధానమిచ్చామని చెప్పారు. సమస్య పరిష్కారానికి తమవద్ద ఉన్న పరిష్కారాలను సూచించామని తెలిపారు. ఉక్రెయిన్ సార్వ భౌమత్వాన్ని కాపాడడం సహా దేశాల హక్కుల పరిరక్షణకు కట్టుబడిఉన్నామని చెప్పారు. రష్యాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఉక్రెయి న్, యూరప్ మిత్రపక్షాలను సంప్రదించి ఈ లేఖ రాసినట్లు బ్లింకెన్ తెలిపారు. అనంతరం ఆయన ఈ విషయాలను కాంగ్రెస్ లీడర్లకు వివరించారు. నాటో తరఫున రష్యాకు మరో సందేశాన్ని విడిగా పంపినట్లు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్స్టాల్టెన్బర్గ్ తెలిపారు. మిలటరీ చర్య నివారణకు అవసరమైన మార్గాలు, ఆయుధ నియంత్రణ, చర్చలు జరపడం తదితర అంశాలను ఇందులో ప్రస్తావించామన్నారు. అయితే ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వకూడదన్న రష్యా అభ్యర్ధనపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అటు బ్లింకెన్, ఇటు జెన్స్ బహిర్గతం చేయలేదు. ఉక్రెయిన్, జార్జియా, మోల్డోవాల్లో మోహరించిన బలగాలను రష్యా ఉపసంహరించుకోవాలని జెన్స్ డిమాండ్ చేశారు. ఫ్రాన్స్ సెపరేటు రూటు ఒకపక్క యూఎస్, నాటో దేశాలు రష్యాకు హెచ్చరికల మీద హెచ్చరికలు చేస్తున్న వేళ ఫ్రాన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. ఉక్రెయిన్ అంశంలో ఇంకా చర్చలకు అవకాశం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియల్ మాక్రాన్ అభిప్రాయపడుతున్నారు. యుద్ధాల కన్నా రష్యాతో చర్చలే మేలంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికాకు వంతపాడడాన్ని ఫ్రాన్స్ మానేసింది. పైగా వచ్చే ఏప్రిల్‌లో దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో యుద్ధమంటే వ్యతిరేకత వస్తుందని మాక్రాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ఫ్రాన్స్ చర్చల పాట పాడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం రష్యా అధినేత పుతిన్‌తో మాక్రాన్ చర్చలు జరపబోతున్నారు. బుధవారం మాక్రాన్ నివాసంలో రష్యా, ఉక్రెయిన్ సలహాదారుల మధ్య సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరో రెండు వారాల్లో మరలా చర్చలు జరపాలని ఇందులో నిర్ణయించారు. తొలినుంచి కూడా రష్యా పట్ల మాక్రాన్ సామరస్య ధోరణినే కనబరుస్తూ వస్తున్నారు. పైగా జోబైడెన్ అధ్యక్షుడైన తర్వాత ఫ్రాన్స్, అమెరికా మధ్య సంబంధాలు వేగంగా క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌కు ఎన్ని యూరప్ దేశాలు మద్దతు పలుకుతాయో వేచిచూడాలని నిపుణులు పేర్కొన్నారు. -
మొత్తం కథే మారిపోయింది!
కెవిన్ స్పేసీ.. హాలీవుడ్ సినిమా అభిమానికి పరిచయం అక్కర్లేని పేరు. అవార్డులు, రివార్డులు, గొప్ప సినిమాల్లో నటించిన పేరు, గొప్ప నటుడన్న ప్రశంసలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, దర్శకులు తమ సినిమాలో ఆయన ఉంటే దానికి ఒక స్థాయి వస్తుందనుకునేలా తెచ్చుకున్న గౌరవం.. ఒక్కసారే ఇవన్నీ ఆయనకు దూరమయ్యే పరిస్థితి వస్తుందంటే విచిత్రంగా కనిపిస్తుంది కానీ, చిత్రంగా అదే నిజం!! హాలీవుడ్లో కొన్ని నెలలుగా బయటపడుతోన్న సెక్స్ స్కాండల్స్‌లో కెవిన్ స్పేసీ పేరు కూడా ఉంది. అక్టోబర్ 30న నటి ఆంతోని రాప్ ఒక ఇంటర్వ్యూలో గతంలో కెవిన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డ విషయాన్ని చెప్పింది. ఆ రోజు నుంచే హాలీవుడ్ కెవిన్‌ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న టీవీ సిరీస్ ‘హౌస్ ఆఫ్ కార్డ్స్’ను మధ్యలోనే ఆపేశారు. ఈ ఏడాది ఆయనకు ఇవ్వాల్సిన ఎమ్మీ అవార్డునూ ఈ ఉదంతంతో వెనక్కు తీసేసుకున్నారు. ఇక వీటన్నింటికంటే మించి, రిడ్లీ స్కాట్ తన ‘ఆల్ ది మనీ ఇన్ ద వరల్డ్’ సినిమాలో కెవిన్ నటించిన సన్నివేశాలన్నీ తీసేసి, క్రిస్టఫర్ ప్లమ్మర్ను అదే పాత్రకు తీసుకోవడం గురించి చెప్పుకోవాలి. క్రిస్మస్ కానుకగా సోమవారం విడుదల కానున్న ఈ సినిమాలో కెవిన్ స్పేసీ ఉన్నాడన్న పేరుతోనే మొదట ప్రచారం జరిగినా, చివరి నెలలో కెవిన్ సన్నివేశాలన్నీ తీసేసి, ప్లమ్మర్‌తో రీషూట్ చేశారు. ప్రీమియర్ షో నుంచే ఈ సినిమాకు మంచి టాక్ వస్తోంది. విశేషమేంటంటే ప్లమ్మర్‌కు సూపర్ రెస్పాన్స్ రావడం! కెవిన్ మిస్ చేసుకున్న పేరే కదూ!! ఒక ప్రముఖ నటుడు, అదీ అవార్డ్ విన్నింగ్ నటుడు, ఇలా ఒక సినిమాలో నటించడం, ఆ సన్నివేశాలు అద్భుతంగా వచ్చినా అవి తీసేసి వేరొక నటుడిని తీస్కోవడం.. పెద్ద అవమానమే! ఆ అవమానానికి కారణం స్వయంగా కెవినే! ఎంతటి నటుడైనా సెక్సువల్ హెరాస్‌మెంట్‌కు పాల్పడితే పట్టే గతి ఇదని కెవిన్ ఉదంతమే చెప్పేస్తోంది!! -
గీతాలావిష్కరణలో తారం ఉదయమాగిరదు
ఒక వ్యక్తి జీవిత పోరాటంగా తెరకెక్కిన చిత్రం తారం ఉదయమాగిరదు. విశేషం ఏమిటంటే ఈ చిత్ర కథకుడు, నిర్మాత, కథానాయకుడు ఐఎస్ఎస్.ఆంతోని నిజ జీవిత ఇతివృత్తంగా రూపొందిన చిత్రం ఇది. ఆర్థికసమస్యలతో పోరాడే కథానాయకుడి గెలుపునకు కారణం తన తల్లిదండ్రులా? కట్టుకున్న భార్యనా?బంధువులా, లేక స్నేహితులా? అన్న కథాంశంతో రూపుదిద్దుకుంటున్న తారం ఉదయమాగిరదు చిత్రాన్ని హృదయం ఫిలింస్ పతాకంపై రాజీ. ఐఎస్ఎస్.ఆంతోని నిర్మిస్తున్నారు. ఆస్టిక్.అరుణ్.జి కథనం, మాటలను అందించిన ఈ చిత్రానికి బాబు రాజేంద్రన్ దర్శకత్వ బాధ్యతలను నిర్విహ ంచారు.బీఆర్కే సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఆర్కేవీ.స్టూడియోలో జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని చిత్ర ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ఈ చిత్రం సంగీత దర్శకుడు బీఆర్కే మలయాళంలో పలు చిత్రాలకు పని చేసిన ప్రఖ్యాత సంగీత దర్శకుడని తెలిపారు. ఇందులోని అమ్మ పాట పాడినప్పుడు తాను తనకు తెలియకుండా కంటతడి పెట్టానని చెప్పారు. చిత్రంలోని పాటలన్నీ బాగా వచ్చాయని, చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చిత్ర పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు, నిర్మాత ఐఎస్ఎస్.ఆంతోని మాట్లాడుతూ ఈ చిత్రంలోని పాత్రలకు చెందిన వారు 70 శాతం జీవించే ఉన్నారని తెలిపారు.ఈ చిత్ర నిర్మాణానికి తన భార్య సహకారం ఎంతో ఉందని పేర్కొన్నారు. చిత్రంలో పాటలు చాలా సహజత్వంతో కూడుకుని, వినసొంపుగా ఉన్నాయని మరో అతిథి అభిరామి రామనాథన్ పేర్కొన్నారు. -
అద్దాలు పగులగొట్టి రూ.4 లక్షలు చోరీ
ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి జిల్లా): ఆగివున్న ఇన్నోవా వాహనం సైడ్ అద్దం పగులగొట్టి అందులోని నగదు, డాక్యుమెంట్లు, వివిధ బ్యాంకుల చెక్కులను గుర్తుతెలియని వ్యక్తులు శనివారం పట్టపగలు ఆపహరించుకుపోయారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయం సమీపంలో చోటుచోసుకుంది. స్థానిక సీఐ జగదీశ్వర్ కథనం ప్రకారం వివరాలు.. నగరంలోని హబ్సిగూడకు చెందిన అంతోని అనే బిల్డర్ మన్నేగూడ సమీంపలోని ప్రముఖ టౌన్ షిప్లో అపార్టుమెంట్ నిర్మిస్తున్నాడు. కూలీలకు డబ్బులు చెల్లించేందుకు వాహనంలో సుమారు నాలుగు లక్షల రూపాయలను తీసుకోచ్చాడు. ప్లాట్ల రిజిష్ట్రేషన్ వుండటంతో ఇబ్రహీంపట్నం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయానికి ఇన్నోవా వాహనంలో వచ్చారు. సమీపంలో వున్న మజీద్ వద్ద వాహనాన్ని నిలిపి సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయంలోనికి వెళ్లాడు. అరగంట వ్యవధిలోనే తిరిగి వాహనం వద్దకు చేరుకోని చూసే సరికి సైడ్ అద్దం పగలివుంది. అందులోని రెండు బ్యాగులను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకేళ్లారు. ఒక దాంట్లో సుమారు 4 లక్షల నగదు, వివిధ బ్యాంకుల చెక్కుబుక్కులు, మరో బ్యాగులో విలువైన డాక్యుమెంట్లు వున్నాట్లు తెలిపారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆయా రోడ్లలో వున్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు రెండు వాహనాలపై ఇన్నోవా వద్ద నిల్చుని ఉన్నట్టు అక్కడున్న స్థానికులు తెలిపారు. వందలమంది తిరిగే సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయం వద్ద పట్టపగలు చోరి జరగడంపట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకుంటామని సీఐ జగదీశ్వర్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాట్లు తెలిపారు. -
'మరో దశాబ్దం మా అబ్బాయిదే'
లండన్: ఫార్ములావన్‌లో రాబోయే పది సంవత్సరాలు కూడా తన కుమారుడు లూయిస్ హమిల్టన్ హవానే కొనసాగుతుందని తండ్రి ఆంథోని జోస్యం చెప్పాడు. ప్రపంచ ఫార్ములావన్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హమిల్టన్ మరొక దశాబ్దం పాటు రాజ్యమేలడం ఖాయమన్నాడు. హమిల్టన్ రోజు రోజుకీ మెరుగుపడటమే కాదు, మానసికంగా ఎంతో దృఢంగా తయారవుతున్నాడని కుమారునిపై విశ్వాసం వ్యక్తం చేశాడు. తన కుమారునికి మోటార్ రేస్‌పై ఉన్న మక్కువే అతన్ని మూడు సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలపిందన్నాడు. హమిల్టన్ కు గెలవాలన్న తపన చాలా ఎక్కువని, అందుకోసం తీవ్రంగా శ్రమిస్తూ తన అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ ఉంటాడని ఆంథోని తెలిపాడు. కనీసం మరో ఏడు సంవత్సరాలైనా తన కుమారుని జైత్రయాత్ర కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. గతేడాది హమిల్టన్ మూడోసారి ప్రపంచ చాంపియన్ గా అవతరించిన సంగతి తెలిసిందే. దీంతో తొమ్మిదేళ్ల వ్యవధిలో హామిల్టన్ మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి ఫార్ములావన్ లో తనదైన ముద్రను వేశాడు. దీంతో పాటు 43 గ్రాండ్‌ప్రి టైటిల్స్ గెలిచి ఫార్ములావన్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన మూడో డ్రైవర్ గా హమిల్టన్ గుర్తింపు సాధించాడు. -
సినిమా రివ్యూ: సికిందర్
నటీనటులు: సూర్య, సమంత, మనోజ్ బాజ్ పాయ్, విద్యుత్ జమ్వాల్, దిలీప్ తాహిల్, రాజ్ పాల్ యాదవ్ ఫోటోగ్రఫి: సంతోష్ శివన్ సంగీతం: యువన్ శంకర్ రాజా ఎడిటింగ్: ఆంథోని నిర్మాత: లగడపాటి శ్రీధర్, సుభాష్ చంద్రబోస్, సిద్దార్థ్ రాయ్ కపూర్ దర్శకత్వం: లింగుస్వామి రాజు భాయ్ (సూర్య) ముంబైలో ఓ మాఫియా డాన్. రాజుభాయ్ ను వెతుక్కుంటూ కృష్ణ (సూర్య) వైజాగ్ నుంచి ముంబైకి చేరుకుంటాడు. ముంబైలో రాజు భాయ్, అతని స్నేహితుడు చందు (విద్యుత్ జమ్వాల్) ల స్నేహం, మాఫియా సామ్రాజ్యం గురించి కృష్ణకు తెలుస్తుంది. రాజు భాయ్ స్నేహితుడు చందును ముంబైని శాసించే ఇమ్రాన్ భాయ్ (మనోజ్ బాజ్ పాయ్) చంపేస్తాడు. తన గ్రూప్ లో కొందరు చేసిన నమ్మక ద్రోహా వల్లే చందు మరణానికి కారణమని రాజుభాయ్ తెలుసుకుంటాడు. అయితే రాజుభాయ్ ని కూడా ఇమ్రాన్ గ్రూప్ కాల్చేస్తుంది. ఇమ్రాన్ గ్రూప్ జరిపిన కాల్పుల్లో గాయపడిన రాజుభాయ్ ఏమయ్యాడు? రాజుభాయ్ ను కృష్ణ కలిశాడా? రాజుభాయ్, కృష్ణను ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడు? ఇమ్రాన్ భాయ్ మాఫియా సామ్రాజ్యానికి ఎవరు చెక్ పెట్టారు? తన స్నేహితుడు చందు మరణానికి రాజుభాయ్ ప్రతీకారం తీర్చుకున్నాడా అనే ప్రశ్నలకు సమాధానమే 'సికిందర్' చిత్ర కథ. నటీనటుల, సాంకేతిక వర్గాల పనితీరు: ఎన్నో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్న సూర్య ఈ చిత్రంలో రాజుభాయ్, కృష్ణ అనే రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఈ చిత్రంలో రాజుభాయ్, కృష్ణ పాత్రలను సూర్య సమర్ధవంతంగా పోషించాడు. రెండు పాత్రల్లోనూ తన మార్కును ప్రదర్శించాడు. గత చిత్రాల్లోని పాత్రలను పోల్చుకుంటే రాజుభాయ్, కృష్ణ పాత్రలు సూర్య కెరీర్ లోనే సాదా సీదా పాత్రలని చెప్పవచ్చు. సూర్య ప్రేయసిగా సమంత నటించింది. ఈ చిత్రంలో సమంత పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు కాని.. ఓ అడుగు ముందుకేసి.. పరిమితుల్లేకుండా గ్లామర్ ను ప్రదర్శించింది. సమంత కొన్ని సన్నివేశాల్లో హాట్ హాట్ గా కనిపించింది. విద్యుత్ జమ్వాల్, మనోజ్ బాజ్ పాయ్, బ్రహ్మనందం పాత్రలు అంతంత మాత్రమే. సంతోష్ శివన్ ఫోట్రోగ్రఫి, యువన్ శంకర్ రాజా సంగీతం, ఆంథోని ఎడిటింగ్ పర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది. సమీక్ష: సూర్య గత చిత్రాలకు కథ, కథనాలే ప్రధానం. అయితే సికిందర్ చిత్ర కథ, కథనాలు గతంలోని సూర్య సినిమాలకు విభిన్నంగా కనిపిస్తుంది. సికిందర్ చిత్రంలో ఎలాంటి కొత్తదనం కనిపించకపోగా... కథనంలో దమ్ములేకపోవడం ప్రేక్షకుల్ని అసహనానికి గురిచేస్తుంది. ఇక రెండవ భాగంలో ఈ సాగతీత ఎక్కువగానే అనిపించింది. సుమారు మూడు గంటల సినిమాలో ఎక్కడా ప్రేక్షకుడు ఫీలయ్యే సన్నివేశాలు, వినోద సన్నివేశాలూ ఎక్కడా కనిపించవు. ఏదో సినిమా నడుస్తుందనే ధోరణి కనిపిస్తుంటుంది. కథ బలహీనంగా ఉండటమనే అంశం మిగితా విభాగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపించింది. ఓవరాల్ గా సూర్యను సికిందర్ గా చూపించాలని దర్శకుడు లింగుస్వామి చేసిన ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. సగటు ప్రేక్షకులు ఆదరించడంపైనే సికిందర్ విజయం ఆధారపడి ఉంటుంది. పేలవమైన కథ, కథనాలు సూర్యను సికిందర్ గా నిలబెట్టడం అనేది కష్టమైనదే అని చెప్పవచ్చు. -రాజబాబు అనుముల -
చైనా చొరబాట్లపై నిర్లక్ష్యమెందుకు?
న్యూఢిల్లీ: మన భూభాగంలోకి చైనా చొరబడుతున్నా.. కేంద్రం ఆ సమస్యను తగ్గించి చూపేందుకు యత్నిస్తోందని లోక్‌సభలో ఎంపీలు మండిపడ్డారు. ఈ అంశంపై పార్టీలకు అతీతంగా 29 మంది ఎంపీలు సంధించిన ప్రశ్నలకు.. రక్షణమంత్రి ఆంటోనీ సోమవారం లోక్‌సభలో సమాధానమిచ్చారు. 2010 నుంచి వివిధ దేశాలు భారత గగనతలాన్ని 28 సార్లు ఉల్లంఘించాయని వెల్లడిం చారు. కానీ భారత భూభాగంలోకి చైనా చొరబాట్ల అంశంపై సరైన వివరణ ఇవ్వలేదు. చైనా, భారత్ మధ్య వాస్తవాధీన రేఖపై ఇరుదేశాల మధ్య పలు విభేదాలున్నాయని.. అందువల్ల పలుమార్లు సరిహద్దుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయన్నారు. దీనిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వికలాంగుల రిజర్వేషన్ పెంపు: వికలాంగులకు ప్రస్తుతం ఉన్న 3 శాతం రిజర్వేషన్ 5 శాతానికి పెరగనుంది. ఈ మేరకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్రం ఓకే చెప్పింది. పర్సన్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్-1995 చట్టం ప్రకారం ఇప్పుడు 3 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉందని, అయితే వారికి మరింత తోడ్పాటును అందించే ఉద్దేశంతో రిజర్వేషన్‌ను 5 శాతానికి పెంచుతున్నట్లు సాధికార త, సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి బలరాం నాయక్ రాజ్యసభలో చెప్పారు. తగ్గిపోతున్న ప్రభుత్వ ఉద్యోగాలు: దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. 2008లో ప్రభుత్వ ఉద్యోగాలు 1,76,74,000గా ఉండగా... 2011 నాటికి 1,75,48,000కు తగ్గిపోయాయని, ప్రైవే టు ఉద్యోగాలు మాత్రం 98,75,000 నుంచి 1,14,52,000కు పెరిగాయని కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి సురేష్ లోక్‌సభలో చెప్పారు.