మొత్తం కథే మారిపోయింది! | Ridley Scott reveals how he replaced Spacey in just days | Sakshi
Sakshi News home page

మొత్తం కథే మారిపోయింది!

Published Mon, Dec 25 2017 1:05 AM | Last Updated on Mon, Dec 25 2017 1:05 AM

Ridley Scott reveals how he replaced Spacey in just days - Sakshi

కెవిన్‌ స్పేసీ

కెవిన్‌ స్పేసీ.. హాలీవుడ్‌ సినిమా అభిమానికి పరిచయం అక్కర్లేని పేరు. అవార్డులు, రివార్డులు, గొప్ప సినిమాల్లో నటించిన పేరు, గొప్ప నటుడన్న ప్రశంసలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, దర్శకులు తమ సినిమాలో ఆయన ఉంటే దానికి ఒక స్థాయి వస్తుందనుకునేలా తెచ్చుకున్న గౌరవం.. ఒక్కసారే ఇవన్నీ ఆయనకు దూరమయ్యే పరిస్థితి వస్తుందంటే విచిత్రంగా కనిపిస్తుంది కానీ, చిత్రంగా అదే నిజం!! హాలీవుడ్‌లో కొన్ని నెలలుగా బయటపడుతోన్న సెక్స్‌ స్కాండల్స్‌లో కెవిన్‌ స్పేసీ పేరు కూడా ఉంది.

అక్టోబర్‌ 30న నటి ఆంతోని రాప్‌ ఒక ఇంటర్వ్యూలో గతంలో కెవిన్‌ తనపై లైంగిక దాడికి పాల్పడ్డ విషయాన్ని చెప్పింది. ఆ రోజు నుంచే హాలీవుడ్‌ కెవిన్‌ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న టీవీ సిరీస్‌ ‘హౌస్‌ ఆఫ్‌ కార్డ్స్‌’ను మధ్యలోనే ఆపేశారు. ఈ ఏడాది ఆయనకు ఇవ్వాల్సిన ఎమ్మీ అవార్డునూ ఈ ఉదంతంతో వెనక్కు తీసేసుకున్నారు. ఇక వీటన్నింటికంటే మించి, రిడ్లీ స్కాట్‌ తన ‘ఆల్‌ ది మనీ ఇన్‌ ద వరల్డ్‌’ సినిమాలో కెవిన్‌ నటించిన సన్నివేశాలన్నీ తీసేసి, క్రిస్టఫర్‌ ప్లమ్మర్‌ను అదే పాత్రకు తీసుకోవడం గురించి చెప్పుకోవాలి.

క్రిస్మస్‌ కానుకగా సోమవారం విడుదల కానున్న ఈ సినిమాలో కెవిన్‌ స్పేసీ ఉన్నాడన్న పేరుతోనే మొదట ప్రచారం జరిగినా, చివరి నెలలో కెవిన్‌ సన్నివేశాలన్నీ తీసేసి, ప్లమ్మర్‌తో రీషూట్‌ చేశారు. ప్రీమియర్‌ షో నుంచే ఈ సినిమాకు మంచి టాక్‌ వస్తోంది. విశేషమేంటంటే ప్లమ్మర్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ రావడం! కెవిన్‌ మిస్‌ చేసుకున్న పేరే కదూ!! ఒక ప్రముఖ నటుడు, అదీ అవార్డ్‌ విన్నింగ్‌ నటుడు, ఇలా ఒక సినిమాలో నటించడం, ఆ సన్నివేశాలు అద్భుతంగా వచ్చినా అవి తీసేసి వేరొక నటుడిని తీస్కోవడం.. పెద్ద అవమానమే! ఆ అవమానానికి కారణం స్వయంగా కెవినే! ఎంతటి నటుడైనా సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌కు పాల్పడితే పట్టే గతి ఇదని కెవిన్‌ ఉదంతమే చెప్పేస్తోంది!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement