
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show) వల్ల కంటెస్టెంట్లకు పాపులారిటీ వస్తుందనేది నిజం. కానీ చాలామంది పాజిటివ్ పాపులారిటీకి బదులుగా నెగెటివిటీని మూటగట్టుకునే బయటకు వస్తుంటారు. తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కు వెళ్లిన సోనియా ఆకుల (Soniya Akula) విషయంలోనూ ఇదే జరిగింది. నాదే పెత్తనం ఉండాలి.. నేను చెప్పిందే వేదం అన్నట్లుగా మాట్లాడటంతో ఆమెపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె చేష్టల వల్ల విపరీతంగా ట్రోల్ అయింది. తాజాగా ఆమెకు బిగ్‌బాస్‌లో ఛాన్స్ వస్తే మళ్లీ వెళ్తారా? అన్న ప్రశ్న ఎదురైంది.
నాగార్జున వద్దు
అందుకు సోనియా మాట్లాడుతూ.. నాకైతే వెళ్లాలని లేదు. కానీ ఈసారి మాత్రం హోస్ట్‌గా నాగార్జున (Nagarjuna Akkineni) సార్ ఉండకూడదని కోరుకుంటున్నాను. హౌస్‌లో నేనొకటి మాట్లాడితే దాన్ని బాడీ షేమింగ్ అని ముద్ర వేశారు. అది చాలా తప్పు కదా! హోస్ట్‌గా సరైన జడ్జిమెంట్ ఇవ్వాలి. ఉన్నది లేనట్లుగా మాట్లాడకూడదు. అందుకే ఆయన వెళ్లిపోతే బాగుండు. తన స్థానంలో రానా దగ్గుబాటి రావాలనుకుంటున్నాను.
రానాకు ఎలా మాట్లాడాలనేది తెలుసు
రానా.. ఫ్రెండ్‌షిప్‌ను లవ్ అని ముద్ర వేయరనుకుంటున్నాను. తనకెలా మాట్లాడాలనేది తెలుసు. నాగార్జున హోస్ట్ అయితే మాత్రం నేను కచ్చితంగా బిగ్‌బాస్‌కు వెళ్లను. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమా అవకాశాలొస్తున్నాయి. సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాను. అందుకే నా కెరీర్ నెమ్మదిగా ముందుకుసాగుతోంది అని చెప్పుకొచ్చింది. సోనియా ప్రధాన పాత్రలో నటించిన కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ నేడు (మార్చి 21న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
చదవండి: బెట్టింగ్ యాప్స్.. సడన్‌గా ఇలా చేయడం సరికాదు: ఆర్జీవీ
Comments
Please login to add a commentAdd a comment