ఏడ్చిన సోనియా.. విష్ణుప్రియకు క్లాస్‌ పీకిన నాగ్‌ | Bigg Boss Telugu 8 Promo: Nagarjuna Highlights Contestants Mistakes | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: అడల్ట్‌ జోకులు! ఏడ్చేసిన సోనియా.. విష్ణుప్రియకు నాగ్‌ కౌంటర్‌

Sep 7 2024 7:30 PM | Updated on Sep 7 2024 7:44 PM

Bigg Boss Telugu 8 Promo: Nagarjuna Highlights Contestants Mistakes

బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్న ప్రోమో రానే వచ్చింది. వినాయక చవితి సందర్భంగా నాగార్జున హౌస్‌మేట్స్‌కు స్వీట్లు పంపించాడు. అలాగే ప్రతి వీకెండ్‌లో తప్పొప్పులు ఎత్తి చూపే నాగ్‌ మీ పొరపాట్లు ఏంటో మీరే చెప్పండని కంటెస్టెంట్లను ఆదేశించాడు. దీంతో అందరూ లేచి నిలబడ్డారు.

మణిని గుచ్చిన బాషా
తనలో తను మాట్లాడుకోవడం ఒంటరితనమో ఏంటో అర్థం కావడం లేదంటూ నాగమణికంఠను కత్తితో పొడిచాడు బాషా. ఆ ఒంటరితనం ఎందువల్ల ఏర్పడిందనేది తర్వాత చెప్పాడుగా అని నాగ్‌ బదులివ్వగా వాటిని నేను ఆమోదించలేనన్నాడు బాషా. తర్వాత విష్ణుప్రియ.. సోనియాకు కోపంలో అనే మాటలు మనసుకు బాధ కలిగిస్తున్నాయంది. దీంతో ఓ వీడియో ప్లే చేశారు. 

ఉన్నమాట అడిగిన  విష్ణుప్రియ
అందులో విష్ణుప్రియ.. నీకు ముందునుంచి నిఖిల్‌ అంతగా నచ్చలేదు. అలాంటిది మీ మధ్య ఫ్రెండ్‌షిప్‌ ఎలా కుదిరింది? అని ఉన్నమాట అడిగింది. ఇది కేవలం విష్ణుప్రియకు వచ్చిన డౌటే కాదు.. బిగ్‌బాస్‌ చూసే ఆడియన్స్‌కు వచ్చిన డౌట్‌ కూడా! కానీ ఆ ప్రశ్నకు సోనియా సమాధానం దాటవేసింది. అంతేకాకుండా ఇలాంటి అడల్ట్రేటెడ్‌ కామెడీ తన మీద ప్రయోగించొద్దని సీరియస్‌ అయింది. దీంతో విష్ణుప్రియకు చిర్రెత్తుకొచ్చింది. 

నువ్వొక్కదానివే పుణ్య స్త్రీవా?
మీ మధ్య ఏమైనా నడుస్తుందా? అని ఆ టైప్‌లో ఏమైనా జోకులు వేశానా? లేదు కదా? అని నిలదీసింది. ఆ మాటతో సోనియా.. ఇక ఆపేయ్‌ అని అరుచుకుంటూ బయటకు వెళ్లి ఏడ్చేసింది. అది చూసిన విష్ణుప్రియ.. నేను కూడా ఏడుస్తాను.. నువ్వొక్కదానివే పుణ్య స్త్రీవా? అని నోరుపారేసుకుంది. ఇది చూసిన నాగార్జున.. తను ఏడుస్తున్నప్పుడు మళ్లీ గుచ్చేలా మాట్లాడటం అవసరమా? అని కోప్పడ్డాడు. మరి ఇంకా ఎవరెవరికి క్లాసులు పీకాడో తెలియాలంటే ఎపిసోడ్‌ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

 

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement