
దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో రానా దగ్గుబాటి సారథ్యంలో సౌత్‌బే కీలక ముందడుగు వేసింది. ఇండియన్ ప్రొ బాక్సింగ్ లీగ్, ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్‌తో కలిసి ‘బాక్సింగ్ బే’ ఈవెంట్‌కు శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా నాలుగు రోజుల పాటు ‘ఫైట్ నైట్స్’ నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన టాప్- 20 ప్రొఫెషనల్ బాక్సర్లు ఇందులో పాల్గొనున్నారు. ఫిబ్రవరి 29, మార్చి 7, 14, 28 తేదీల్లో బాక్సింగ్‌బే ఫైట్ నైట్స్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment