Antony
-
Keerthy Suresh: భర్తతో కీర్తి స్టెప్పులు.. ఈ ఫోటోలు చూశారా?
-
సంధ్య థియేటర్ ఘటన.. ప్రధాన నిందితుడు అరెస్ట్
సంధ్య థియేటర్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు కారణమైన బౌన్సర్ ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా బౌన్సర్ ఆంటోనీని పోలీసులు గుర్తించారు. పలు ఈవెంట్స్‌కు బౌన్సర్ల ఆర్గనైజర్‌గా ఆంటోనీ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు చేశారు.అసలేం జరిగిందంటే..ఈనెల 5న అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 చిత్రం విడుదలైంది. అయితే అంతకుముందు రోజే ఈ మూవీకి సంబంధించిన బెనిఫిట్ షోను ప్రదర్శించారు. ఈ షోను వీక్షించేందుకు అల్లు అర్జున్ తన భార్యతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారు. అదే సమయంలో అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు చేశారు. -
సోషల్‌మీడియా బ్యాన్.. మస్క్‌కు ఆస్ట్రేలియా పీఎం కౌంటర్
కాన్బెర్రా:పదహారేళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. దీనిపై అమెరికా బిలియనీర్,టెస్లా అధినేత ఇలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. మస్క్ విమర్శలను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ తప్పుపట్టారు. ఆస్ట్రేలియాలో ఇంటర్నెట్ను నియంత్రించడానికి ఈ నిషేధం బ్యాక్ డోర్లా ఉందని మస్క్ వ్యాఖ్యానించారు.మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆంటోనీ స్పందించారు.ఇలాన్ మస్క్‌కు ఓ ఎజెండా ఉందని, ఆయన ‘ఎక్స్(ట్విటర్)’ యజమాని అయినందునే అలా మాట్లాడుతున్నారన్నారు. సోషల్ మీడియా నిషేధంపై ఎవరితోనైనా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆంటోనీ తెలిపారు. కాగా,ఆస్ట్రేలియా ప్రభుత్వం గత వారం పిల్లల సోషల్‌మీడియా వాడకంపై నిషేధ బిల్లును దిగువ సభలో ప్రవేశపెట్టింది.ఈ బిల్లు దిగువ సభ ఆమోదం పొందింది. దీనికి సెనేట్ కూడా ఆమోదం తెలిపితే చట్టరూపం దాల్చనుంది.జనవరి నుంచి ట్రయల్ బ్యాన్,ఏడాది తర్వాత రియల్ బ్యాన్‌ను అమలు చేయనున్నారు. -
ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్ కీర్తి సురేశ్
గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్లు నిజమయ్యాయి. హీరోయిన్ కీర్తి సురేశ్.. తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది. ఆంటోని తట్టిళ్‌తో 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఇద్దరూ కలిసున్న ఫొటోని అయితే పోస్ట్ చేసింది గానీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.మలయాళ నిర్మాత సురేశ్, నటి మేనకల కూతురైన కీర్తి సురేశ్.. బాలనటిగా చేసింది. 'నేను శైలజ' మూవీ హీరోయిన్ అయింది. తెలుగు, తమిళ, మలయాళంలో నటించింది. హిందీలోనూ ఈమె తొలి మూవీ 'బేబీ జాన్' త్వరలో రిలీజ్ కానుంది. ఇంతలోనే పెళ్లి రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని కీర్తి నిజమని ధ్రువీకరించింది.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే)కీర్తి సురేశ్ చెప్పిన దానిబట్టి చూస్తే 15 ఏళ్ల ప్రేమ అంటే ఇంటర్మీడియట్లో ఒకరికి ఒకరు పరిచయం. ఆ తర్వాత ఈమె హీరోయిన్ కాగా.. ఆంటోని ఇంజినీరింగ్ చేసి ఖతార్‌లో కొన్నాళ్లు పనిచేసాడు. తిరిగి స్వదేశానికి వచ్చి కొచ్చిలో విండో సొల్యూషన్స్ కోసం యాస్పెరాస్ కంపెనీ పెట్టాడు. తర్వాత హోటల్స్ వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు.15 ఏళ్ల ప్రేమని కొన్నాళ్ల క్రితం పెద్దలకు చెప్పారు. వాళ్ల కూడా అంగీకరించడంతో ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. డిసెంబరు 11న గోవాలోని ఓ రిసార్ట్‌లో ఈ వేడుక జరగనుంది. బహుశా హిందూ-క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి జరుగుతుందేమో!(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
Keerthy Suresh: కీర్తి సురేశ్ మ్యారేజ్ ఫిక్స్.. వరుడు ఎవరంటే
-
15 ఏళ్లుగా ఆంటోనీతో ప్రేమలో కీర్తి..
-
ఆ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నా: యంగ్ హీరోయిన్
ఇటీవలే ఆంటోనీ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించిన కోలీవుడ్ భామ కల్యాణి ప్రియదర్శన్. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇంతకు ముందు ఎప్పుడు కనిపించని కిక్ బాక్సర్ పాత్రలో మెప్పించింది. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలన్నింటిలో తనదైన నటనతో ఆకట్టుకుంది. జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జోజు జార్జ్ హీరోగా నటించారు. దర్శకుడు ప్రియదర్శన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన కల్యాణి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంలోనే కాకుండా సౌత్ ఇండియాలో క్రేజీ హీరోయిన్గా రాణిస్తోంది. తాజాగా తాను నటించిన ఆంటోనీ చిత్రం గురించి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ మూవీ కోసం చాలా కష్టపడినట్లు తెలిపింది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం కల్యాణి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'కంఫర్ట్ జోన్లో గ్రోత్ లేదు. గ్రోత్ జోన్లో కంఫర్ట్ లేదు. నేను ఈ విషయాన్ని కాస్తా ఆలస్యంగా తెలుసుకున్నా. కానీ ఆ పంచ్‌లు, కిక్‌లు, గాయాలు, కన్నీళ్లు, చిరునవ్వులు మాత్రమే నిజమయ్యాయి. కానీ ఆ రక్తం మాత్రం నిజం కాదు. మీ ప్రశంసలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ కేరింతలకు ధన్యవాదాలు. అన్నింటికంటే మించి నాపై, నా సినిమాపై ప్రేమ చూపినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇంతకుముందే ఓ ఇంటర్వ్యూలో షూటింగ్ సమయంలో గాయపడినట్లు కల్యాణి తెలిపింది. మూడు వారాలపాటు ప్రతిరోజూ దాదాపు నాలుగు గంటలు కిక్ బాక్సింగ్ శిక్షణ ఉండేదని వివరించింది. అందుకోసం చాలా శిక్షణ కష్టపడ్డానని.. గాయాల కారణంగా రెండు రోజులు షూటింగ్ నుంచి విరామం తీసుకోవలసి వచ్చిందని వెల్లడించింది. అందుకే ఇతర నటీనటులకు కూడా డేట్స్ విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చాయని కల్యాణి తెలిపింది. కాగా.. ఆంటోనీ చిత్రంల నైల ఉష, చెంబన్ వినోద్, ఆశా శరత్, విజయరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం కల్యాణి ఫాతిమా ఆన్ మైక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) -
ఆస్ట్రేలియాకు అమెరికా సబ్మెరైన్లు
వాషింగ్టన్: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల ‘ఆకస్’ కూటమి మరో అడుగు ముందుకేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంత స్వేచ్ఛా, సంరక్షణ కోసం అణు జలాంతర్గాముల ప్రాజెక్ట్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఈ మూడు దేశాలు ప్రకటించాయి. ఇందుకు సోమవారం అమెరికాలోని శాన్ డీగోలో జరిగిన ఒక కార్యక్రమం వేదికైంది. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ పాల్గొన్నారు. ఆకస్ ఒప్పందంలో అంతర్భాగమైన అణు జలాంతర్గామి ప్రాజెక్టులో భాగంగా ఆ్రస్టేలియాకు అమెరికా 2030దశకం తొలినాళ్లలో దశలవారీగా మూడు అణుఇంథనంతో పనిచేసే జలాంతర్గాములను అందించనుంది. ‘వచ్చే ఐదేళ్లలో అమెరికా జలాంతర్గాముల నిర్మాణ సామర్థ్యం పెంపు, వర్జీనియా శ్రేణి సబ్మెరైన్ల నిర్వహణ కోసం మొత్తంగా 460 కోట్ల డాలర్లు వినియోగిస్తాం. ‘వర్జీనియా’ జలాంతర్గాములతో దశాబ్దకాలం ముందుగానే ఆస్ట్రేలియా జలాంతర సామర్థ్యం ద్విగుణీకృతం అవుతోంది’ అని సునాక్, అల్బనీస్‌ల సమక్షంలో బైడెన్ ప్రకటించారు. బ్రిటన్ జలాంతర్గామి టెక్నాలజీ, అమెరికా సాంకేతికతల మేలిమి కలయికగా అణుఇంధనంతో నడిచే సంప్రదాయక ఆయుధాలు అమర్చిన జలాంతర్గామి తయారుకాబోతోంది’ అని బైడెన్ చెప్పారు. మూడు దేశాల మైత్రిలో కొత్త అధ్యాయం మొదలైందని ఈ సందర్భంగా అల్బనీస్ వ్యాఖ్యానించారు. హిందూ మహాసముద్రం, పశ్చిమ, మధ్య పసిఫిక్ సముద్రం, దక్షిణ చైనా సముద్రాలు ఉన్న ఇండో–పసిఫిక్ ప్రాంతం భౌగోళికంగా, అంతర్జాతీయ జలరవాణాకు కీలకమైన ప్రాంతం. దక్షిణ చైనా సముద్ర జలాలపై హక్కులు తనకే చెందుతాయని చైనా వాదిస్తుండటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం తెల్సిందే. -
చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడనున్న హీరో
మలయాళ నటుడు ‘అంగమాలి డైరీస్’ ఫేం అంటోని వర్గీస్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ఇష్టసఖి అనిషా పౌలోస్‌తో కలిసి ఆగష్టు 8న ఏడడుగులు వేయనున్నాడు. పెళ్లి ఘడియలు దగ్గరపడుతుండటంతో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా హల్దీ ఫంక్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందులో ఆంటోనీ వర్గీస్ తెల్లని కుర్తా, ధోతిని ధరించగా, అనిషా హల్దీ వేడుక కోసం ఆకుపచ్చ,పసుపు ధరించింది. ఈ జంట తమ స్నేహితులతో కలిసి సూపర్‌హిట్ పాటలకు హుషారుగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇక ఇటీవలే అనిషాతో నటుడు నిశ్చితార్థం చేసుకున్నాడు. కేరలోని అంగమాలిలో జరిగిన ఈ వేడుకకు కోవిడ్ కారణంగా అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. కాగా ఆంటోని, అనిషా పౌలోస్ చిన్ననాటి స్నేహితులు. అనిషా అంగమాలి ప్రాంతానికి చెందిన వృత్తిరీత్యా నర్సు. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. వీరి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించడంతో లవ్ కమ్ ఆరేంజ్డ్ మ్యారేజ్‌గా మారింది. ఇక ఆంటోని విషయానికొస్తే 2017లో విడుదలైన అంగమాలి డైరీస్ చిత్రంతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ చిత్రంలో వెన్సెంట్ పెపే పాత్ర పోషించిన తనకు అనంతరం అభిమానులు ముద్దుగా పెపే పేరుతోనే పిలవడం ప్రారంభించారు. ఈ సినిమా ఘన విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు పొందడంతో ఆంటోని మంచి పేరు సంపాదించాడు. ఆ తరువాత జల్లికట్టు, స్వతంత్ర్యం అర్ధరాత్రి వంటి చిత్రాల్లో నటించగా ప్రస్తుతం అజగజంతరం, జాన్ మేరీ, ఆనప్రంబిలే వరల్డ్ కప్, ఆరవం చిత్రాలు చేస్తున్నాడు. -
సిల్క్ స్మిత డైరెక్టర్ ఆంథోని ఇకలేరు
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ డైరెక్టర్, నిర్మాత ఆంథోని ఈస్ట్‌మన్(75) గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం ఆయనకు గుండెపోటు రావడవంతో కుటుంబ సభ్యులు త్రిస్పూర్‌లోని మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతు ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతికి మలయాళ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ చేసిన ఆంథోని ఈస్టమన్ అనే స్టూడియో ప్రారంభించారు. ‘ఇనాయే తేడి’ అనే చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. ఈ మూవీ తర్వాత అంబాడే న్జానే, ఐస్ క్రీమ్, వయల్ వంటి చిత్రాలను తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ఇక సీనియర్ నటి సిల్క్ స్మితను వెండితెరకు పరిచయం చేసింది కూడా ఈయనే. గతంలో ఆయన ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ సిల్క్ స్మితను వెండితెరకు ఎలా పరియం చేశారో వివరించారు. ‘హీరోయిన్ కోసం వెతుకుతున్న క్రమంలో కొద్ది రోజులకు కోడంబక్కంలోని కొందరూ యువతులు మేకప్ వేసుకోని ఆడిషన్స్ ఇస్తున్నారు. అక్కడే ఓ యువతి పనిమనిషిలా కుర్చోని ఉంది. ఆమెను ఫొటో తీసుకోవచ్చా అని ఆమె అమ్మ దగ్గరి అనుమతి తీసుకుని ఆ యువతిని మేకప్ లేకుండా ఫొటోలు తీసుకున్నాను. ఆ ఫొటోలను కొందరు డైరెక్టర్స్‌కు చూపించాను. అందరూ ఆమెను హీరోయిన్గా తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. దీంతో ఆమెను సంప్రదించాం. ఆమె కూడా సినిమాలకు ఒకే చెప్పింది. అయితే తన పేరు మారుస్తామని చెప్పడంతో ఆమెకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. అలా సిల్క్ మూవీకి ఆమెను హీరోయిన్గా తీసుకున్నాం. అయితే అప్పట్లో స్మిత పాటిల్ పాపులర్‌గా నటిగా ఉన్న సమయం అది. అందుకే ఆమెకు స్మిత అని పేరు పెట్టాం. చివరకు తన తొలి చిత్రం సిల్క్‌తో కలిపి సిల్క్ స్మిత విజయమాల మారిపోయింది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. -
నలభై ఏళ్లకు బాకీ తీరింది!
ఎర్నాకులం టౌన్‌హాల్, కేరళ. చేతిలో ఓ కవర్‌తో సీనియర్ నిర్మాత వీవీ ఆంటోని ఓపికగా ఎదురుచూస్తున్నారు. ఆ మీటింగ్ కోసం సుమారు నలభై ఏళ్ల నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు ఆంటోని. పాత బాకీ తీర్చడం కోసం, తన మాట నిలబెట్టుకోవడం కోసం. 1979లో ‘పుష్యరాగం’ అనే మలయాళ సినిమాను నిర్మించారు ఆంటోని. మధు, జయన్, శారద, శ్రీవిద్య ముఖ్య పాత్రల్లో నటించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల శారదకు పూర్తి పారితోషికం ఇవ్వలేకపోయారు ఆంటోని. ఆ తర్వాత మరో రెండు సినిమాలకు భాగస్వామ్యం వహించినా లాభాలు చూడలేకపోయారాయన. కాలం ఫాస్ట్‌ఫార్వాడ్‌లో 40 ఏళ్లు గిర్రున తిరిగింది. ఆంటోని ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. కానీ శారదకు ఇవ్వాల్సిన పారితోషికం ఇంకా ఇవ్వలేదనే ఆలోచన మాత్రం తనని నిలబడనివ్వడం లేదు. శారదను కలసి మిగిలిన పారితోషికాన్ని ఇచ్చేద్దాం అనుకుంటున్న సమయంలో శారదే ఓ ఈవెంట్ కోసం కేరళ వస్తున్నారని తెలుసుకున్నారు ఆంటోని. ‘ఆది మక్కళ్’ అనే సినిమా 50 సంవత్సరాల వేడుక కోసం ముఖ్య అతిథిగా హాజరయ్యారు శారద. అక్కడే శారదను కలిశారు ఆంటోని. తనతో సినిమా నిర్మించిన నిర్మాతను గుర్తుపట్టి యోగక్షేమాలు మాట్లాడారు శారద. మాటల మధ్యలో మిగిలిన పారితోషికాన్ని అందజేశారు ఆంటోని. మిగిలిన పారితోషికం అందించడానికే ఆయన వచ్చారని తెలిసి శారద ఆశ్చర్యపోయారు. ఆమెకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చాక ఆంటోని కుదుటపడ్డారు. అలా నలభై ఏళ్లకు ఆంటోని తన బాకీ తీర్చుకున్నారు. ‘నిర్మాత నా పారితోషికం ఎగ్గొట్టారు’ అని నటీనటులు వాపోతున్న సందర్భాలు చూశాం. అయితే ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఇవ్వాల్సిన బాకీని చెల్లించిన ఆంటొనీలాంటి నిర్మాతలు అరుదుగా ఉంటారు. -
అమర్-అక్బర్-ఆంటోనీ మళ్లీ పుట్టారు!
అమర్.. అక్బర్.. ఆంటోని.. అన్నదమ్ముల ఆత్మీయ అనుబంధానికి అద్దంపట్టిన వెండితెర దృశ్యరూపం. సినిమా విడుదలై, హిట్టై 39 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు ఆ ముగ్గురూ మరో రూపంలో పునర్జన్మ పొందారు. పులి కూనలుగా భూమి మీదకు పాదంమోపి, గురువారం నామకరణ మహోత్సవం జరుపుకొన్నారు. మంగళూరు శివారులోని పిలికులా జాతీయ పార్కు పులలకు ఫేమస్. అక్కడి నేత్రావతి, విక్రమ్ అనే జంటకు మార్చిలో జన్మించిన కూనలే ఈ అమర్, అక్బర్, ఆంటోనీ, నిషాలు. నిధుల కొరతతో సతమతమవుతోన్న పార్క్ నిర్వాహకులు.. పులులను దత్తత తీసుకోవాల్సిందిగా(నిర్వహణా బాధ్యతలు తీసుకోవాల్సిందిగా) చేసిన అభ్యర్థనలకు మంచి స్పందన లభించింది. అబుదాబికి చెందిన మిచెల్ డిసౌజా అనే వ్యక్తి నాలుగు పులి పిల్లల సంరక్షణార్థం ఏడాదికి రూ.5 లక్షల వితరణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. దీంతో పులి పిల్లలకు పేరుపెట్టే అవకాశం ఆయనకు లభించింది. బాలీవుడ్ హిట్ సినిమా అమర్- అక్బర్- ఆంటోనీ పేర్లను మూడు మగ పులి పిల్లలలకు, ఆడ పిల్లకేమో నిషా అని పేరు పెట్టాయన. ప్రస్తుతం పిలికులా పార్క్ లో 11 పులులు ఉన్నాయని, సంరక్షణా బాధ్యతలు స్వీకరించాలనుకునేవారు తమను సంప్రదించవచ్చని చెబుతున్నారు జూ డైరెక్టర్ హెచ్ జే భండారి. మీరూ pilikulazoo.com ను దర్శించి, ఏదేని జంతువునో, పక్షినో దత్తత తీసుకుని ఇష్టమైన పేరు పెట్టుకోండిమరి! -
సినిమాకని వెళ్లి.. సాప్ట్వేర్ ఉద్యోగుల అదృశ్యం
హైదరాబాద్ : సినిమాకు అని వెళ్లిన ఇద్దరు సాప్ట్వేర్ ఉద్యోగులు అదృశ్యమయ్యారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. ఎస్ఐ శివశంకర్ రావు కథనం ప్రకారం బోడుప్పల్ బాలాజీ హిల్స్ కాలనీలో నివసించే మనేష్ పాటిల్ (32), ఆంటోని (21) సాప్ట్వేర్ ఉద్యోగులు. వీరిద్దరూ ఈనెల 9న సినిమాకని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వారి గురించి గాలించినా ఆచూకీ దొరక్కపోవటంతో కుటుంబ సభ్యులు నిన్న మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగుల కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. -
ఓటమి సాధారణమే
లోక్‌సభ ఎన్నికలపై సీఎం సిద్ధు పరమేశ్వరతో కలిసి ఢిల్లీలో ఆంటోనితో భేటీ పార్టీ బలోపేతమే లక్ష్యం : పరమేశ్వర సీఎం రేసులో లేను : దేశ్‌పాండే సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు గెలుపోటములు సర్వ సాధారణమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఓటమిపై అధిష్టానానికి వివరణ ఇవ్వడానికి బుధవారం ఢిల్లీ వెళ్లిన ఆయన, కేపీసీసీ చీఫ్ పరమేశ్వరతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక మాత్రమే కాకుండా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఓటమిపై కేంద్ర మాజీ మంత్రి ఏకే. ఆంటోనీ నాయకత్వంలో ఏర్పడిన కమిటీతో సమావేశమవడానికి పరమేశ్వరతో కలసి ఆయన వెళ్లారు. ఆంటోనీతో జరిగిన సమావేశంలో ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషించడంతో పాటు పార్టీని బలోపేతం చేసే విషయమై చర్చించినట్లు విలేకరులకు పరమేశ్వర తెలిపారు. కాగా ఎన్నికల్లో పార్టీ ఓటమికి సీఎం వైఖరే కారణమని గత వారాంతంలో ఇక్కడ జరిగిన ఆత్మావలోకన సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పరోక్షంగా ఆరోపించడంతో వారిద్దరి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పదవి ఉంటుందో, ఊడుతుందో అని అదే సమావేశంలో సీఎం వేదాంత ధోరణిలో మాట్లాడడం చర్చనీయాంశమైంది. నాయకత్వ మార్పు దిశగా కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోందా అనే సందేహాలూ తలెత్తాయి. సీఎంకు దేశ్‌పాండే బాసట శాసన సభ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్వీ. దేశ్‌పాండే ముఖ్యమంత్రికి మద్దతుగా మాట్లాడారు. శాసన సభ వెలుపల ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం సీఎంను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించిందని, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఆయనే కారణమంటూ పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ఆరోపించారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి చక్కగా పని చేస్తున్నారని కితాబునిస్తూ, ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. అల్ప సంఖ్యాకులు, వెనుకబడిన తరగుతులు, దళితులతో కూడిన ‘అహింద’ ప్రభుత్వాన్ని సిద్ధరామయ్య నడుపుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పస లేనివని కొట్టి పారేశారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇటీవల శాసన మండలికి ఐదుగురిని నామినేట్ చేసిన విషయంలో సీఎం ‘కోటరీ’ పాత్ర ఉందని వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, పార్టీ అధిష్టానం అనుమతితోనే ఈ ఎంపికలు జరిగాయని వివరించారు. రాష్ర్ట మంత్రి వర్గంలో చర్చించిన తర్వాతే పేర్లను ఖరారు చేశారని తెలిపారు. కాగా తాను ముఖ్యమంత్రి పదవిని కోరుకోవడం లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
‘టట్రా’ కేసులో ఆంటోనీ వాంగ్మూలం నమోదు
న్యూఢిల్లీ: టట్రా ట్రక్కుల కొనుగోలుకు సంబంధించి తనకు రూ. 14 కోట్ల లంచం ఇవ్వజూపారన్న ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ ఆరోపణల కేసులో రక్షణ మంత్రి ఆంటోనీ, ప్రధాని సలహాదారు టీకేఏ నాయర్ వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. ‘వారి వాంగ్మూలాలను నమోదు చేశాం’ అని సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా మంగళవారం ఢిల్లీలో వెల్లడించారు. ప్రభుత్వరంగ సంస్థ బీఈఎంఎల్ నుంచి 1,600 టట్రా ట్రక్కుల కొనుగోలుకు ఆమోదం తెలిపితే రూ. 14 కోట్లు ఇస్తామని ఆర్మీ మాజీ ఉన్నతాధికారి తేజీందర్‌సింగ్ తనకు ఆశ చూపారని వీకే సింగ్ గతంలో బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇది పెద్ద సంచలనం కావడంతో దీనిపై సీబీఐ విచారణకు రక్షణశాఖ ఆదేశించింది. -
రాజకీయ లబ్ధి కోసమే వి‘భజన’
తిరుపతి, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం రాష్ట్రాన్ని విభజించేందుకు కుట్రలు పన్నుతోందని సమైక్యవాదులు మండి పడుతున్నారు. దిగ్విజయ్, ఆంటోనీ వంటి వృద్ధుల సలహాలు తీసుకున్నంత కాలం కాంగ్రెస్ బాగుపడదని శాపనార్థాలు పెడుతున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర సమైక్యత కోసం తుదికంటా పోరాడతామని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లాలో నిరసన కార్యక్రమాలు యధావిధిగా కొనసాగాయి. తిరుపతి తుడా సర్కిల్లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రిలే దీక్షల్లో 50వ డివిజన్ పరిధిలోని ప్రశాంతినగర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి దీక్షా శిబిరానికి వచ్చి వారికి సంఘీభావంగా కాసేపు శిబిరంలో కూర్చున్నారు. టౌన్ క ్లబ్ కూడలిలో మబ్బు చెంగారెడ్డి ఆధ్వర్యంలో సమైక్యవాదులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. పలమనేరులో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పాల్గొని విభజన విషయంలో కాంగ్రెస్ కుట్రలను వివరించారు. ఆయన కొబ్బరి బోండాంలు అమ్మి నిరసన తెలిపారు. సమైక్య రాష్ట్రాన్ని కాపాడు కునేందుకు తమ పార్టీ వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో తుదికంటా పోరాడుతుందన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మదనపల్లెలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి మల్లికార్జున సర్కిల్లో సోనియాగాంధీ దిష్టి బొమ్మను తగులబెట్టారు. ఎన్జీవో, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. పలమనేరులో టీడీపీ, కాంగ్రెస్ దీక్షలు కొనసాగాయి. శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రిలే దీక్షలు కొనసాగించారు. -
చైనా చొరబాట్లు లేవు పార్లమెంటులో ఆంటోనీ ప్రకటన
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని లడక్ ప్రాంతంలో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న వార్తలను రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కొట్టిపడేశారు. దేశంలోని ఏ ప్రాంతాన్నీ కూడా చైనాకు విడిచిపెట్టే ప్రసక్తి లేదని, దేశ భద్రతకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నామని స్పష్టంచేశారు. శుక్రవారం పార్లమెంటు ఉభయ సభల్లో ఈ మేరకు ప్రకటన చేశారు. సరిహద్దుల వెంట మౌలిక సదుపాయాల కల్పనలో చైనా ముందుం దని, ఈ విషయంలో భారత్ వెనుకబడిందని అంగీకరించారు. ఇది అందరి వైఫల్యమని పేర్కొన్నారు. గత పదేళ్ల నుంచి తమ ప్రభుత్వం వాస్తవాధీన రేఖ వెంబడి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని, ఇది చూసి చైనా భయపడుతోందని చెప్పారు. మంత్రి ప్రకటనకు ముందు... లడక్ సెక్టార్లో 640 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ స్వయంగా ప్రభుత్వ ఉన్నతస్థాయి కమిటీయే నివేదిక ఇచ్చిందంటూ ప్రతిపక్ష బీజేపీ, యూపీఏ భాగస్వామ్యపక్షమైన సమాజ్‌వాది పార్టీ సభ్యులు లోక్‌సభను కుదిపేశారు. బీజేపీ ఎంపీలు నినాదాలతో హోరెత్తించగా.. ఎస్పీ సభ్యులు సభామధ్యలోకి దూసుకెళ్లారు. తొలుత లోక్‌సభ ప్రారంభం కాగానే బీజేపీ సభ్యుడు యశ్వంత్ సిన్హా ఈ అంశాన్ని లేవనెత్తారు. చైనా చొరబాట్లపై రక్షణమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు మద్దతుగా ఎస్పీ సభ్యులు గొంతుకలిపారు. ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ మాట్లాడుతూ ఈ పిరికి సర్కారుకు అధికారాంలో కొనసాగే హక్కు లేదని మండిపడ్డారు. అనంత రం ఆంటోనీ మాట్లాడుతూ, ‘జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్ శ్యామ్ శరణ్ లడక్‌ను సందర్శించి సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలపై నివేదిక ఇచ్చారు. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని ఆయన తన నివేదికలో ఎక్కడా చెప్పలేదు. మన భూభాగాన్ని చైనాకు వదిలే ప్రశ్నే లేదు’ అని చెప్పారు. -
రాజకీయ లబ్ధికోసమే రాష్ట్ర విభజన
పీలేరు, న్యూస్‌లైన్: రాజకీయ లబ్ధికోసమే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని సాప్స్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలసుబ్రమణ్యం, ఎన్. రాజారెడ్డి అన్నారు. గురువారం పీలేరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మందితో సమైక్య విద్యార్థి సింహగర్జన బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ ఓట్లు, సీట్ల ప్రాతిపదికన రాష్ట్రాన్ని ముక్కలు చేయాల్సివస్తే దేశంలో ఇంకా అనేక కొత్త రాష్ట్రాలను ఏర్పాటుచేయాల్సి ఉంటుందన్నారు. వేర్పాటువాదుల రాజకీయ లబ్ధికోసం సీడబ్ల్యూసీ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే ఒప్పుకునేది లేదన్నారు. హైదరాబాద్ మహానగరం కేసీఆర్ అబ్బసొత్తుకాదని, 23 జిల్లాల ప్రజలు ఉమ్మడి ఆస్తిఅని వారు పేర్కొన్నారు. సీమాంధ్ర ఉద్యమం 13 జిల్లాలు, 16 యూనివర్సిటీల నుంచి రాజకీయాలకు అతీతంగా ప్రజల మధ్యనుంచి పుట్టుకొచ్చిందన్నారు. విభజన జరిగితే మనబిడ్డల భవిష్యత్ అంధకారమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రం విడిపోతే నీటి కోసం తెలంగాణతో యుద్ధాలు చేయాల్సి వస్తుందని చెప్పారు. వ్యవసాయ రంగం పూర్తిగా ఛిన్నాభిన్నమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆంధ్రులు లేని అంటోనీ కమిటీని మనం సమర్థించాలా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ వార్‌రూంలో తలలూపి బయట ఏదో ఉద్ధరిస్తామని మన నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. గ్రామాలకు వచ్చే ప్రజాప్రతినిధులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అన్ని విభాగాలలో 80 శాతం సీట్లున్న హైదరాబాద్ విద్యార్థులకు ఆయువుపట్టని చెప్పారు. పీలేరు ప్రైవేట్ కళాశాలల ప్రతినిధి జ్ఞానశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ విభజనకు ప్రాతిపదిక ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నేతలు ఎస్. చక్రధర్, కేవీ. కిషోర్‌కుమార్, ఎన్. పురుషోత్తం, ఎంఈవో ఏటీ. రమణారెడ్డి, ప్రైవేట్ కళాశాలల అధినేతలు బాలసుబ్రమణ్యం, సురేంద్రరెడ్డి, డీవీ. రమణారెడ్డి, సంజీవరెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, అశోక్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, విశ్వనాథరెడ్డి, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆంటోనీతో కేసీఆర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు శనివారం రక్షణ మంత్రి ఆంటోనీతో భేటీ అయ్యారు. విభజన నిర్ణయానంతరం సీమాంధ్రలో ఆందోళనలపై కాంగ్రెస్ అధిష్టానం వేసిన త్రిసభ్య కమిటీకి ఆంటోనీ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ఆంటోనీతో ఏకాంతంగా చర్చలు జరిపారని సమాచారం. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు వారం కిందట ఢిల్లీ వచ్చిన కేసీఆర్ రెండురోజుల కిందట ఎంపీ మందా జగన్నాథం నివాసంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. తాజాగా ఆయన ఆంటోనీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. విభజన నిర్ణయం నేపథ్యంలో హైదరాబాద్ సహా ఇతర అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. హైదారాబాద్‌లో సీమాంధ్రులు రెచ్చగొడుతున్నారని, 7న వారు తలపెట్టిన సమైక్యాంధ్ర సభ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. -
సిఎం కిరణ్ డబల్ గేమ్ : సీమాంధ్ర నేతలు
-
'సమైక్యంగా ఉంచాలని ఆంటోనిని కోరతా'
హైదరాబాద్ నగర అభివృద్ధిలో అన్ని ప్రాంతాల ప్రజలకు భాగస్వామ్యం ఉందని రాష్ట మంత్రి కొండ్రుమురళి మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. విద్యా, వైద్య రంగాలకు సంబంధించి ముఖ్య కేంద్రాలన్ని హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎ.కే.ఆంటోనిని కోరతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు రెండో ఎస్సార్సీ వేయాలని ఆయన యూపీఏ సర్కార్‌ను ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనేది కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వ్యక్తిగత అభిప్రాయమని కొండ్రుమురళి పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు మంగళవారం ఆంటోని కలవనున్నారు. ఈ సందర్బంగా వారంతా న్యూఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం తమను కలవాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి సీఎం కిరణ్‌కు పిలుపు వచ్చింది. దాంతో ఆయన ఈ రోజు ఉదయం ఢిల్లీ పయనమైయ్యారు. అదికాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీఎం కిరణ్ ఈ రోజు న్యూఢిల్లీలో పేర్కొన్న విషయం కూడా విధితమే. -
ఢిల్లీలో సిఎం కిరణ్ బిజి బిజి
-
ఆంటోనీ కమిటీతో భేటీకి ఓకే
సాక్షి, హైదరాబాద్: ఆంటోనీ కమిటీని కలవడానికి సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. కమిటీని కలవడానికి ఆసక్తి ఉన్న సంఘాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి రాజనర్సింహ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సూచనకు అవి అంగీకరించాయి. బుధవారమిక్కడ జరిగిన ఉపసంఘం భేటీకి ఉప ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాత్రమే హాజరయ్యారు. ఏపీఎన్జీవో సంఘం, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి ఆనం మాట్లాడారు. రాజనర్సింహ దాదాపు మౌనంగానే ఉన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె చేస్తుండగా ఉపసంఘం మాత్రం దాని మీద కాకుండా ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన సమస్యలపైనే ఆసక్తి కనపరిచింది. సమ్మె విరమించాలని, స్వాతంత్య్రవేడుకల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో గురువారం పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొంటామని ఉద్యోగులు ప్రకటించారు. ఆంటోనీ కమిటీతో భేటీకి ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందాలను ప్రభుత్వమే ఢిల్లీకి తీసుకెళుతుందా లేక అపాయింట్మెంట్ ఇప్పించడానికే పరిమితమవుతుందా అనే విషయంలో మంత్రులు స్పష్టత ఇవ్వలేదు. ఢిల్లీ ఎవరు వెళ్లేది రేపు గుంటూరులోప్రకటన మంత్రివర్గ ఉప సంఘంతో భేటీ అనంతరం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆంటోనీ కమిటీ రాజకీయ కమిటీనే అయినా అధికార పార్టీకి సంబంధించినది కాబట్టి కలవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈనెల 16న గుంటూరులో జరిగే అన్ని సంఘాల సమావేశంలో ఢిల్లీ యాత్రకు ఏఏ సంఘాల ప్రతినిధులు వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి? అనే విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రివర్గ ఉపసంఘంతో భేటీలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఏం మాట్లాడారంటే.. ఏపీఎన్జీవోలు: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమ్మెకు వెళ్లలేదు. విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగాం. ఉద్యోగులంతా ఒక్కతాటి మీద నిలబడి సమ్మె చేసిన సందర్భం ఇప్పటివరకు చరిత్రలోనే లేదు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్: మంత్రుల భార్యలు గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తేనే ఖబడ్దార్ అంటున్న పరిస్థితి ఉంది. సమైక్య నిర్ణయం వచ్చే వరకు ఉద్యమం ఆగదు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం: ఉద్యోగుల ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లండి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం: కమిటీ ముందు హాజరు కావటంపై చర్చించి నిర్ణయిస్తాం. -
నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంటోనీ కమిటీ ఎందుకు?
-
సోనియా మాటే ఆంటోని బాట
-
ఒకటైనా.. రెండైనా.. మన రాష్ట్రమే: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గందరగోళపరిచే వ్యాఖ్య చేశారు. ‘‘రాష్ట్రం ఒక్కటిగా ఉన్నా.. రెండైనా మన రాష్ట్రమే’’ అని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ఇంకా చాలా ప్రక్రియ జరగాల్సి ఉందని, దీనిపై కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ చర్చిస్తుందని చెప్పారు. ఇంతకు మించి విభజనపై తానేమీ మాట్లాడబోనన్నారు. సీఎం సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఆదివారం నాటి బీజేపీ బహిరంగ సభలో ఆ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీసారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ.. రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, కాంగ్రెస్ పెద్దలపై చేసిన విమర్శలను కిరణ్ తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి గురించి మోడీ వ్యాఖ్యలు అసత్యాలని కొట్టిపారేశారు. ‘‘అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఎవరూ సాటిరారు. గుజరాత్ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు మనమే మార్గదర్శిగా నిలిచాం. ఈ విషయంలో గుజరాత్‌కు - ఏపీకి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. విపరీతమైన పదవీ కాంక్షతో ముందుకు వెళుతున్న నరేంద్ర మోడీ అబద్ధాలు, అసత్యాలు చెప్తున్నారు. ఇది సరికాదు’’ అని పేర్కొన్నారు. ‘‘గుజరాత్లో 4 లక్షల పెన్షన్లు ఇస్తే మన రాష్ట్రంలో దాదాపు 70 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. గుజరాత్లో 72 వేల మహిళా పొదుపు సంఘాలు ఉంటే మన రాష్ట్రంలో 10 లక్షల పొదుపు సంఘాల్లో కోటి మంది సభ్యులున్నారు. దేశంలో మహిళలకు ఇస్తున్న రుణాల మొత్తంలో 60 శాతం మన రాష్ట్రం వాళ్లకే చెల్లిస్తున్నాం. ప్రజాపంపిణీ వ్యవస్థలోనూ మనకు సాటి ఎవరూ లేరు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంతో దేశానికే ఆదర్శమయ్యాం. రైతు రుణాలు, ఇళ్ల నిర్మాణం, ఉచిత విద్యుత్.. ఇలా ఏ రంగంలో చూసుకున్నా గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్గఢ్లే కాదు.. దేశంలో మరే రాష్ట్రంతో పోల్చినా మనమే ముందున్నాం’’ అని పేర్కొన్నారు. ‘‘నీ మాటలు నమ్మి మోసపోవటానికి ఇదేమీ గుజరాత్ కాదు. ఇక్కడి ప్రజలు చాలా తెలివైన వాళ్లు. మత విద్వేషాలు రెచ్చగొడితే రెచ్చిపోయేవాళ్లు, మోసపోయేవాళ్లు ఎవరూ లేరిక్కడ’’ అని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పారిశ్రామిక ప్రగతిలోనూ గుజరాత్ పైనే ఉన్నాం... నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించడంలోనూ గుజరాత్, తమిళనాడు కంటే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని కిరణ్ చెప్పారు. గుజరాత్లో పారిశ్రామిక ప్రగతి గురించి పదేపదే గొప్పగా చెప్పుకునే మోడీ పారిశ్రామిక పెట్టుబడుల విషయంలోనూ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం దక్కించుకోగా, గుజరాత్ మూడో స్థానానికి పరిమితమైంద నే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలో అనేక సమస్యలు తలెత్తినప్పటికీ పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ఏపీ రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఇటీవల మన రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం గుజ రాత్ వెళితే ‘మీ రాష్ట్రం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని ప్రశంసలు కురిపించిన మోడీ హైదరాబాద్‌కు వచ్చి అందుకు భిన్నంగా మాట్లాడటం శోచనీయమన్నారు. యుద్ధం సృష్టించేలా మాట్లాడటం తగదు... అంతర్జాతీయ సంబంధాలు, సరిహద్దు సమస్యలపై జాగ్రత్తగా వ్యవహరించాలే తప్ప ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం సృష్టించేలా మాట్లాడటం మోడీకి తగదన్నారు. అన్ని దేశాల వద్ద అధునాతన ఆయుధాలున్న నేపథ్యంలో ఏదైనా జరిగితే ఇబ్బందికరమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్కింగ్ల స్ఫూర్తితోనే అమెరికా అధ్యక్షుడిని కాగలిగానంటూ ఒబామా గర్వంగా చెప్పుకుంటే.. గాంధీ పుట్టిన గుజరాత్ నుంచి వచ్చిన మోడీ మాత్రం ఒబామా వ్యాఖ్యలు ‘వి కెన్... వి డూ’ అనే మాటలు కాపీ కొట్టటం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. అన్నీ కలిసి వచ్చినా సరే.. విడివిడిగా వచ్చినా సరే... ‘తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను మోడీ పొగడటం ద్వారా.. చంద్రబాబుతో బీజేపీ పొత్తుకు సంకేతాలు పంపినట్లు భావిస్తున్నారా?’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ.. ‘‘అన్ని పార్టీలూ కలిసి వచ్చినా.. విడివిడిగా వచ్చినా ఎదుర్కోవటానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది’’ అని బదులిచ్చారు. రాష్ట్రం విడిపోతే ఎదురయ్యే సమస్యలపై మీరు చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా వాటిపై మాట్లాడాల్సిన అవసరమే లేదన్నారు. ‘పదే పదే మన రాష్ట్రం, మన రాష్ట్రం అంటూ మీరు 21 సార్లు ఉచ్ఛరించారు... రేపు రెండు రాష్ట్రాలు కాబోతున్నాయి కదా?’ అని ఒక విలేకరి అడిగితే.. ‘‘ఒకటి అయినా రెండు అయినా మన రాష్ట్రమే’’అని కిరణ్ నవ్వుతూ ప్రెస్‌మీట్‌ను ముగించారు. -
మంట పెట్టిన బులెటిన్
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ, బీజేపీలకు చెందిన పలువురు సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చి.. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారంటూ పార్లమెంటు సభ్యులకు సమాచారం అందించే బులెటిన్‌లో ప్రచురించడం రాజ్యసభలో మంట పెట్టింది. అందులో తమ పేర్లను వెల్లడించడంపై టీడీపీ, బీజేపీ సభా కార్యక్రమాలను బహిష్కరించాయి. ప్రధాన ప్రతిపక్షం లేకుండా సభా కార్యక్రమాలు జరగడం ఏమిటంటూ మిగతా పక్షాలు కూడా అడ్డుకోవడంతో.. దీనిపై చర్చిద్దామని, ఒక కొత్త విధానాన్ని రూపొందిద్దామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, మంత్రులు హామీ ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే.. బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు బులెటిన్ అంశాన్ని లేవనెత్తారు. ఇది సభ్యుల హక్కులను హరించే విధంగా, అవమానపరిచేలా ఉందని.. దానిని తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అయితే.. దీనిపై తర్వాత తన చాంబర్లో చర్చిద్దామని చైర్మన్ హమీద్ అన్సారీ సూచించినా.. బీజేపీ, అన్నాడీఎంకే, శివసేన సభ్యులు వాకౌట్ చేశారు. ఆ తర్వాత సభ వాయిదాపడింది. తిరిగి సభ సమావేశమయ్యాక.. సైనికుల కాల్చివేత ఘటనపై ప్రకటన చేస్తున్న రక్షణ మంత్రి ఆంటోనీని అన్నాడీఎంకే, ఏజీపీ, ఎస్పీ, జేడీయూ, బీఎస్పీ సభ్యులు అడ్డుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా సభ నిర్వహణకు సహకరించబోమని స్పష్టం చేశారు. దీంతో చైర్మన్ చాంబర్లో రాజకీయ పక్షాల నేతల సమావేశాన్ని నిర్వహించి ఒక అవగాహనను కుదుర్చుకున్నారు. బులెటిన్ నుంచి సభ్యుల పేర్లను తొలగించే విషయాన్ని చైర్మన్ పరిశీలిస్తారని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ హామీ ఇచ్చారు. కాగా.. నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్లు తమ పేర్లను బులిటెన్‌లో పెట్టడం అన్యాయమని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు.