సంధ్య థియేటర్ ఘటన.. ప్రధాన నిందితుడు అరెస్ట్ | Main Accused Arrested In Sandhya Theatre Incident at Pushpa 2 Release | Sakshi
Sakshi News home page

Sandhya Theatre Incident: సంధ్య థియేటర్ ఘటన.. ప్రధాన నిందితుడు అరెస్ట్

Published Tue, Dec 24 2024 2:37 PM | Last Updated on Tue, Dec 24 2024 2:53 PM

Main Accused Arrested In Sandhya Theatre Incident at Pushpa 2 Release

సంధ్య థియేటర్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు కారణమైన బౌన్సర్‌ ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా బౌన్సర్‌ ఆంటోనీని పోలీసులు గుర్తించారు. పలు ఈవెంట్స్‌కు బౌన్సర్ల ఆర్గనైజర్‌గా ఆంటోనీ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే ఈ ఘటనలో థియేటర్‌ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు చేశారు.

అసలేం జరిగిందంటే..

ఈనెల 5న అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 చిత్రం విడుదలైంది. అయితే అంతకుముందు రోజే ఈ మూవీకి సంబంధించిన బెనిఫిట్ షోను ప్రదర్శించారు. ఈ షోను వీక్షించేందుకు అల్లు అర్జున్‌ తన భార్యతో కలిసి ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారు. అదే సమయంలో అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement